
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Musk)ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఫెడరల్ వర్క్‌ఫోర్స్‌ను పునర్నిర్మించడానికి చేసిన ప్రయత్నాలను కొనియాడుతూ.. మరింత దూకుడుగా వ్యవహరించాలని అన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
''ఎలాన్ గొప్ప పని చేస్తున్నాడు, కానీ అతను మరింత దూకుడుగా ఉండటం నేను చూడాలనుకుంటున్నాను. గుర్తుంచుకోండి, మనం కాపాడుకోవాల్సిన దేశం ఉంది, ఇంతకు ముందు కంటే గొప్పగా చేయాలి" అని అన్నారు. దీనికి మస్క్ రిప్లై ఇస్తూ.. ''చేస్తాను మిస్టర్ ప్రెసిడెంట్'' అని అన్నారు.
డొనాల్డ్ ట్రంప్.. ఆదేశాల మేరకు ఫెడరల్ ఉద్యోగులందరికీ ఒక మెయిల్ వస్తుందని, గత వారం వారంతా ఏం పనిచేశారో రిపోర్ట్ ఇవ్వాలన్నారు. ఎవరైతే ఈ మెయిల్‌కు స్పందించరో వారు రాజీనామా చేసినట్లుగా భావించాల్సి వస్తుందని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రోజుకు రూ.27 కోట్లు విరాళం ఇచ్చిన వ్యక్తి.. ఈయన గురించి తెలుసా?
మస్క్ తన ట్వీట్‌లో చెప్పినట్లుగానే ఉద్యోగులకు శనివారం రాత్రి మెయిల్స్ అందాయి. ఈ మెయిల్‌లో ఐదు బుల్లెట్ పాయింట్లలో ప్రశ్నలు అడిగారు. గత వారం మీరు మీ పనిలో ఏం సాధించారనేది ఆ ప్రశ్నల సారాంశం. ఈ మెయిల్‌కు సమాధానమిచ్చేందుకు ఉద్యోగులకు సోమవారం రాత్రి దాకా సమయమిచ్చారు. అయితే మెయిల్‌కు సమాధానమివ్వని వారిపై ఏం చర్య తీసుకుంటారన్నది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.
Will do, Mr. President! pic.twitter.com/2VMS2wY7mw
— Elon Musk (@elonmusk) February 22, 2025