
2023-24 ఆర్థిక సర్వే ప్రకారం, పెరుగుతున్న శ్రామికశక్తికి అనుగుణంగా వ్యవసాయేతర రంగంలో 2030 వరకు భారత ఆర్థిక వ్యవస్థ ఏటా సగటున 78.5 లక్షల ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంది. సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా దేశంలో ఉపాధి కల్పనలో ప్రైవేట్ రంగం పాత్రను గురించి వివరించింది.
ఆర్థిక వ్యవస్థ సృష్టించాల్సిన ఉద్యోగాల సంఖ్య (సంవత్సరానికి 78.5 లక్షలు) గురించి సర్వే విస్తృత అంచనాను అందించింది. పని చేసే వయసులో ఉన్న ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు కోరుకోరని. ఇందులో కొందరు స్వయం ఉపాధి కోసం చూస్తే.. మ్నారికొందరు స్టార్టప్ వంటి వాటిని ప్రారంభించి యజమానులుగా మారుతారు. ఆర్థిక వృద్ధి అనేది జీవనోపాధిని సృష్టించడమేనని సర్వే పేర్కొంది.
శ్రామికశక్తిలో వ్యవసాయం వాటా తగ్గుతుందని కేంద్రం వెల్లడించింది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ వ్యవసాయేతర రంగంలో 2030 వరకు ఏటా సగటున 78.5 లక్షల ఉద్యోగాలను సృష్టించాలి. పెరుగుతున్న శ్రామిక శక్తిని తీర్చడానికి ప్రైవేట్ సంస్థలు దోహదపడాలని సర్వే పేర్కొంది.
వ్యవసాయేతర రంగంలో సంవత్సరానికి 78.5 లక్షల ఉద్యోగాల డిమాండ్‌ను, ప్రస్తుతం ఉన్న PLI (5 సంవత్సరాలలో 60 లక్షల ఉపాధి కల్పన), మిత్రా టెక్స్‌టైల్ పథకం (20 లక్షల ఉపాధి కల్పన), ముద్ర మొదలైన పథకాలను భర్తీ చేయడం ద్వారా తీర్చవచ్చని డేటాలో వెల్లడించింది.