
మనషి పుట్టుక, చావు అనేది దైవాధీనాలు. అంటే మనిషి ఎప్పుడు పుడతాడు, ఎప్పుడు చనిపోతాడు అనేది దేవుని చేతుల్లోనే ఉంటాయంటారు. అయితే 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెత్ క్లాక్' (AI Death Clock) మనిషి ఎప్పుడు చనిపోతాడో చెప్పేస్తానంటోంది. ఇంతకీ ఇదెలా సాధ్యం?.. ఏఐ చెప్పింది నిజమవుతుందా? అనే విషయాలు పరిశీలిద్దాం.
డెత్ క్లాక్ అనే ఫ్రీ వెబ్‌సైట్.. ఒక వ్యక్తి వయసు, అతని బాడీ ఇండెక్స్, ఆహారపు అలవాట్లు, రోజువారీ వ్యాయామం, ధూమపానం, మద్యపానం అలవాట్లు, అతడు ఎలాంటి ప్రాంతంలో నివసిస్తున్నాడు అనే వాటిని ఆధారంగా చేసుకుని ఎప్పుడు, ఎలా చనిపోతాడో చెబుతోంది. అంటే మనం ఇచ్చే సమాచారం ఆధారంగా.. చావు రోజును చల్లగా చెప్పేస్తుందన్నమాట.
డెత్ క్లాక్ వెబ్‌సైట్ ఇప్పటి వరకు 63 లక్షల మందికి.. వారి చావు డేట్ చెప్పింది. ఏఐ డెత్ క్లాక్ డేట్ ప్రకారం.. ఎంతమంది చనిపోయారో, లేదో తెలియదు, కానీ దీనికి సంబంధించిన వార్తలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎక్కువ కాలం జీవించడానికి టిప్స్
ఎప్పుడు, ఎలా చనిపోతారో చెప్పడం మాత్రమే కాదు. ఎక్కువ రోజులు జీవించడానికి టిప్స్ కూడా డెత్ క్లాక్ చెబుతోంది.
➤ఆరోగ్యకరమైన బరువును మెయింటెన్స్
➤క్రమం తప్పకుండా వ్యాయామం
➤పొగ తాగడం మానేయండి
➤సమతుల్య ఆహారం
➤మద్యం పూర్తిగా మానేయండి లేదా తక్కువగా తాగండి
➤మంచి నిద్ర
➤క్రమం తప్పకుండా హెల్త్ చెకప్స్
➤ఒత్తిడిని తగ్గించుకోండి
➤అనుబంధాలను పెంపొందించుకోండి
గమనిక: ఎన్ని టెక్నాలజీలు వచ్చినా.. మనిషి ఎప్పుడు, ఎలా చనిపోతాడు అనే విషయం చెప్పడం అసాధ్యం. డెత్ క్లాక్ అనేది ఒక ఏఐ కాలిక్యులేటర్, దీనికి మీరిచ్చే సమాచారాన్ని బట్టి ఒక డేట్ చెబుతుంది. అదే ఖచ్చితమైన మరణ తేదీ కాదు. దీనిని సరదా కోసం మాత్రమే ఉపయోగించాలి. ఏఐ కాలిక్యులేటర్ అంచనా నిజమని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.