
Today Stock Market Closing bell: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిసాయి. ఉదయం నుంచీ లాభ నష్టాల మధ్య ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో సోమవారం ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 15 పాయింట్లు పెరిగి 66,024, నిఫ్టీ 19,675 వద్ద స్థిరపడ్డాయి. రియల్టీ 1.5 శాతం, బ్యాంక్ ఇండెక్స్ 0.3 శాతం పెరగగా, ఐటీ, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ స్వ్పలంగా నష్టపోయాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.40 శాతం పెరగగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్ నోట్‌తో ముగిసింది.
బజాజ్ ఫైనాన్స్, టాటా క న్జూమర్ ప్రొడక్ట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, అపోలో హాస్పిటల్స్, కోల్ ఇండియా టాప్ గెయనర్స్‌గా నిలిచాయి. మరోవైపు హిందాల్కో, ఎస్‌బీఐ లైఫ్, హీరోమోటో, ఇన్ఫోసిస్, డా.రెడ్డీస్ ల్యాబ్స్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి.
రూపాయి: డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి సోమవారంనష్టాల్లో ముగిసింది. మరియు శుక్రవారం ముగింపులో 82.93 వద్ద డాలర్‌కు 21 పైసలు తగ్గి 83.14 వద్ద ముగిసింది.