Nifty
-
నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ఉదయం నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. ఉదయం 9:40 గంటలకు సెన్సెక్స్ 205.81 పాయింట్లు లేదా 0.25 శాతం నష్టంతో 82,324.93 వద్ద, నిఫ్టీ 45.95 పాయింట్లు లేదా 0.18 శాతం నష్టంతో 25,016.15 వద్ద ముందుకు సాగుతున్నాయి.బియర్డ్‌సెల్, జీ లెర్న్, వాన్‌బరీ, శివమ్ ఆటోటెక్, రుద్రాభిషేక్ ఎంటర్ప్రైజెస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. డిదేవ్ ప్లాస్టిక్స్ ఇండస్ట్రీస్, సోలారా యాక్టివ్ ఫార్మా సైన్సెస్, న్యూలాండ్ లాబొరేటరీస్, సెనోర్స్ ఫార్మాస్యూటికల్స్, డేటామాటిక్స్ గ్లోబల్ సర్వీసెస్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
ట్రంప్ ప్రకటన: ఒక్కసారిగా మారిపోయిన స్టాక్ మార్కెట్లు
ఖతార్‌లో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం మధ్యాహ్నం... ‘‘భారత్ ఒక వాణిజ్య ఒప్పందాన్ని ప్రతిపాదించింది. దీని ప్రకారం అనేక అమెరికా ఉత్పత్తులపై ప్రాథమికంగా సున్నా టారిఫ్‌లు ఉంటాయి’’ అన్నారు. ట్రంప్ ప్రకటనతో మార్కెట్లో సెంటిమెంట్ ఒక్కసారిగా మారిపోయింది. మిడ్‌సెషన్ వరకు ఫ్లాట్‌గానే కదలాడిన సూచీలు భారీ లాభాలు నమోదు చేశాయి.ఇరాన్‌తో అమెరికా అణు ఒప్పందం కుదిరే అవకాశం నేపథ్యంలో సరఫరా పెరుగుతుందనే అంచనాలతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గాయి. భారత్‌కు దిగుమతయ్యే బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 3.50% తగ్గి 63.79 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. రిటైల్ ద్రవ్యోల్బణం అరేళ్ల కనిష్టానికి చేరుకోవడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు మరింత బలపడ్డాయి.ఇదీ చదవండి: మరింత తగ్గుతున్న గోల్డ్ రేటు: ఆల్‌టైమ్ గరిష్టాల నుంచి..వరుస మూడు నెలల అమ్మకాల అనంతరం విదేశీ ఇన్వెస్టర్లు ఏప్రిల్ 15 నుంచి భారతీయ ఈక్విటీలలో దాదాపు రూ.50 వేల కోట్లు పెట్టుబడి పెట్టారు. గత 20 సెషన్లలో 19 సార్లు నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఎఫ్ఐఐల వరుస కొనుగోళ్లు మన సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. -
2025లో తొలిసారి 25000 పైకి నిఫ్టీ
ముంబై: పరస్పర సుంకాలు లేని వాణిజ్యాన్ని భారత్ ప్రతిపాదించిందనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలతో దలాల్ స్ట్రీట్ గురువారం ఒకటిన్నర శాతం ర్యాలీ చేసింది. భారత్‌తో పాటు యూఎస్ ద్రవ్యోల్బణ దిగిరావడమూ కలిసొచ్చింది. సెన్సెక్స్ 1,200 పాయింట్లు పెరిగి 82,531 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 395 పాయింట్లు బలపడి 2025లో తొలిసారి 25వేల స్థాయిపైన 25,062 వద్ద నిలిచింది. ముగింపు స్థాయి ఇరు సూచీలకు ఏడు నెలల గరిష్టం కావడం విశేషం. ఒక దశలో సెన్సెక్స్ 1,387 పాయింట్లు ఎగసి 82,718 వద్ద, నిఫ్టీ 449 పాయింట్లు దూసుకెళ్లి 25,116 ట్రేడయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. → దిగుమతిదారుల నుంచి అమెరికా డాలర్‌కు డిమాండ్ పెరగడంతో భారత కరెన్సీ రూపాయి ఒత్తిడికి లోనైంది. డాలర్ మారకంలో 22 పైసలు బలహీనపడి 85.54 స్థాయి వద్ద స్థిరపడింది.→ స్టాక్ మార్కెట్ వరుస లాభాలతో బుధ, గురువారాల్లో రూ.9 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ రూ.440 లక్షల కోట్లకు చేరింది.లాభాలు ఎందుకంటే → ఖతార్‌లో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం మధ్యాహ్నం... ‘‘భారత్ ఒక వాణిజ్య ఒప్పందాన్ని ప్రతిపాదించింది. దీని ప్రకారం అనేక అమెరికా ఉత్పత్తులపై ప్రాథమికంగా సున్నా టారిఫ్‌లు ఉంటాయి’’ అన్నారు. ట్రంప్ ప్రకటనతో మార్కెట్లో సెంటిమెంట్ ఒక్కసారిగా మారిపోయింది. మిడ్‌సెషన్ వరకు ఫ్లాట్‌గానే కదలాడిన సూచీలు భారీ లాభాలు నమోదు చేశాయి. → ఇరాన్‌తో అమెరికా అణు ఒప్పందం కుదిరే అవకాశం నేపథ్యంలో సరఫరా పెరుగుతుందనే అంచనాలతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గాయి. భారత్‌కు దిగుమతయ్యే బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 3.50% తగ్గి 63.79 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.→ రిటైల్ ద్రవ్యోల్బణం అరేళ్ల కనిష్టానికి చేరుకోవడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు మరింత బలపడ్డాయి. → వరుస మూడు నెలల అమ్మకాల అనంతరం విదేశీ ఇన్వెస్టర్లు ఏప్రిల్ 15 నుంచి భారతీయ ఈక్విటీలలో దాదాపు రూ.50 వేల కోట్లు పెట్టుబడి పెట్టారు. గత 20 సెషన్లలో 19 సార్లు నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఎఫ్ఐఐల వరుస కొనుగోళ్లు మన సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
-
నష్టాలకు బ్రేక్.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,127.91 పాయింట్లు లేదా 1.39 శాతం లాభంతో 82,458.48 వద్ద నిలిచింది. నిఫ్టీ 395.20 పాయింట్లు లేదా 1.60 శాతం లాభంతో 25,062.10 వద్ద ఉంది.మోటార్ అండ్ జనరల్ ఫైనాన్స్, రుద్రాభిషేక్ ఎంటర్ప్రైజెస్, నెల్‌కాస్ట్, హెచ్‌సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్, ఇంటెన్స్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. వెండ్ట్ (ఇండియా), సోలారా యాక్టివ్ ఫార్మా సైన్సెస్, డ్యామ్ క్యాపిటల్ అడ్వైజర్స్, ముత్తూట్ క్యాపిటల్ సర్వీసెస్, హికాల్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
రెడ్‌లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:45 సమయానికి నిఫ్టీ(Nifty) 161 పాయింట్లు నష్టపోయి 24,511కు చేరింది. సెన్సెక్స్(Sensex) 527 ప్లాయింట్లు దిగజారి 80,794 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.81 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 64.82 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.53 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో గతంతో పోలిస్తే లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.1 శాతం లాభపడింది. నాస్డాక్ 0.72 శాతం ఎగబాకింది.ప్రభుత్వం ఏప్రిల్ నెల వాణిజ్య గణాంకాలను గురువారం(15న) ప్రకటించనుంది. మార్చిలో దేశీ వాణిజ్యలోటు 21.54 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఆర్థిక గణాంకాలు కొంతమేర మార్కెట్లను ప్రభావితం చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈరోజు రాత్రి ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమీ పావెల్ ప్రసంగించనున్నారు. వరుసగా మూడో సమావేశం(మే)లోనూ ఫెడ్ ఫండ్స్ రేట్లను 4.25–4.5 శాతంవద్ద కొనసాగించేందుకే కట్టుబడిన సంగతి తెలిసిందే. శుక్రవారం(16న) జపాన్ జీడీపీ(జనవరి–మార్చి) ప్రాథమిక వృద్ధి రేటు గణాంకాలు వెలువడనున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. నిన్నటి అస్థిర సెషన్ తరువాత, భారత్, యూఎస్‌ల నుంచి ఊహించిన దానికంటే మెరుగైన సీపీఐ ద్రవ్యోల్బణ డేటా మద్దతుతో భారత ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు గ్రీన్‌లో స్థిరపడ్డాయి. ఏప్రిల్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.16 శాతానికి పడిపోయింది.బీఎస్ఈ బెంచ్‌మార్క్ సూచీ సెన్సెక్స్ 182.34 పాయింట్లు లేదా 0.22 శాతం పెరిగి 81,330.56 వద్ద ముగిసింది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా 88.55 పాయింట్లు లేదా 0.36 శాతం లాభపడి 24,666.90 వద్ద ముగిసింది. సెన్సెక్స్ లోని 30 షేర్లలో 22 షేర్లు లాభాల్లో ముగిశాయి. టాటా స్టీల్ 3.95 శాతం, టెక్ మహీంద్రా 2.26 శాతం, ఎటర్నల్ 2.20 శాతం, మారుతీ సుజుకీ 1.66 శాతం, ఇన్ఫోసిస్ 1.52 శాతం లాభపడ్డాయి. ఏషియన్ పెయింట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ 1.64 శాతం వరకు నష్టపోయాయి.కాగా విస్తృత మార్కెట్లు బెంచ్‌మార్క్ సూచీలను అధిగమించాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ 1.19 శాతం, బీఎస్ఈ స్మాల్ క్యాప్ 1.63 శాతం లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ మెటల్, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఐటీ, ఎనర్జీ, మీడియా 2.46 శాతం వరకు లాభపడ్డాయి.నిఫ్టీ ఆటో, హెల్త్ కేర్, ఫార్మా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ ఎంసీజీ 1 శాతం వరకు పెరిగాయి. నిఫ్టీ బ్యాంక్ 0.25 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.23 శాతం నష్టపోయాయి. భారత మార్కెట్లో అస్థిరతను కొలవడానికి ఉపయోగించే ఫియర్ గేజ్ ఇండియా వీఐఎక్స్ 5.61 శాతం క్షీణించి 17.18 పాయింట్లకు పడిపోయింది. -
ఊగిసలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. సోమవారం భారీగా పెరిగిన మార్కెట్లు, నిన్న తగ్గి ఈ రోజు మళ్లీ పెరిగాయి. బుధవారం ఉదయం 09:38 సమయానికి నిఫ్టీ(Nifty) 112 పాయింట్లు లాభపడి 24,681కు చేరింది. సెన్సెక్స్(Sensex) 314 ప్లాయింట్లు పుంజుకొని 81,439 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.92 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 66.29 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.46 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో గతంతో పోలిస్తే పెరిగాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.72 శాతం లాభపడింది. నాస్డాక్ 1.61 శాతం ఎగబాకింది.అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పుంజుకోవడం, యూఎస్ బాండ్లపై రాబడులు పెరగడమూ నిన్నటి మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు ప్రథమార్థమంతా పరిమిత శ్రేణిలో బలహీనంగా ట్రేడయ్యాయి. ద్వితీయార్థం నుంచి అమ్మకాల తీవ్రత పెరగడంతో నష్టాలు మరింత పెరిగాయి. ఒక దశలో మంగళవారం సెన్సెక్స్ 1,386 పాయింట్లు క్షీణించి 81,044 వద్ద, నిఫ్టీ 378 పాయింట్లు పతనమై 24,547 వద్ద కనిష్టాలు తాకాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సెన్సెక్స్ 1,282 పాయింట్లు డౌన్
ముంబై: ఐటీ, ఆటో, ప్రైవేటు బ్యాంకులు షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో మంగళవారం స్టాక్ సూచీలు ఒకటిన్నర శాతం క్షీణించాయి. సెన్సెక్స్ 1,282 పాయింట్లు క్షీణించి 81,148 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 346 పాయింట్లు పతనమై 24,578 వద్ద నిలిచింది. అమెరికా చైనాల మధ్య ట్రేడ్ డీల్ కుదరడంతో విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి చైనా మార్కెట్‌కు తరలిపోవచ్చనే అనుమానాలు తలెత్తాయి. ఉక్కు, అల్యూమినియంపై సుంకాల విషయంలో అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించాలనే ప్రతిపాదనతో భారత్ ప్రపంచ వాణిజ్య మండలిని ఆశ్రయించడంతో ట్రేడ్ వార్ ఆందోళనలు తెరపైకి వచ్చాయి.అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పుంజుకోవడం, యూఎస్ బాండ్లపై రాబడులు పెరగడమూ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు ప్రథమార్థమంతా పరిమిత శ్రేణిలో బలహీనంగా ట్రేడయ్యాయి. ద్వితీయార్థం నుంచి అమ్మకాల తీవ్రత పెరగడంతో నష్టాలు మరింత పెరిగాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,386 పాయింట్లు క్షీణించి 81,044 వద్ద, నిఫ్టీ 378 పాయింట్లు పతనమై 24,547 వద్ద కనిష్టాలు తాకాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంకు(–2%), ఇన్ఫోసిస్(–3.50%), రిలయన్స్ (–1.50%), టీసీఎస్(–3%), భారతీ ఎయిర్టెల్(3%), ఐసీఐసీఐ బ్యాంకు (–1%) నష్టపోయి సూచీల పతనానికి ప్రధాన కారణమయ్యాయి. సెన్సెక్స్ పతనంలో ఈ షేర్ల వాటాయే 845 పాయింట్లు కావడం గమనార్హం. ⇒ రంగాల వారీగా సూచీల్లో ఐటీ 2.50%, టెక్ 2.40%, యుటిలిటీ 1.35%, విద్యుత్, మెటల్, ఆయిల్‌అండ్‌గ్యాస్ ఒకశాతం చొప్పున నష్టపోయాయి. స్మాల్‌క్యాప్ సూచీ 1%, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.17శాతం పెరిగాయి. మరోవైపు ఫార్మా, ఇండ్రస్టియల్, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ⇒ రక్షణ రంగ షేర్లకు మూడోరోజూ డిమాండ్ నెలకొంది. భారత్ డైనమిక్స్ 11%, యాక్సిస్కేడ్స్ 5%, డేటా ప్యాటర్న్స్, భారత్ ఎల్రక్టానిక్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ 4%, మిశ్ర ధాతు నిగమ్ 3.50% రాణించాయి. పారాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్, డీసీఎక్స్ సిస్ట మ్స్ 3% లాభపడ్డాయి. ఐడియాఫోర్జ్ టెక్నాలజీ 9%, ఏరియల్ ఇన్నోవేషన్స్ 5% పెరిగాయి. ⇒ సెబీ మధ్యంతర ఉత్తర్వుల మేరకు ఎండీ పదవికి అన్మోల్ సింగ్, హోల్‌టైమ్ డైరెక్టరు పదవికి పునీత్ సింగ్ జగ్గీ రాజీనామాతో జెన్సోల్ ఇంజనీరింగ్ షేరు 5% క్షీణించి రూ.52 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. తదుపరి అనూహ్య రికవరీతో 5% లాభపడి 57.28 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకి, అక్కడే ముగిసింది. -
భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
అమెరికా - చైనా టారిఫ్‌లకు 90 రోజులు బ్రేక్ పడిన తరువాత.. భారీ లాభాల్లో పయనించిన దేశీయ స్టాక్ మార్కెట్లు, మళ్ళీ ఈ రోజు (మంగళవారం) ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవి చూశాయి. సెన్సెక్స్ 1,281.68 పాయింట్లు లేదా.. 1.55 శాతం నష్టంలో 81,148.22 వద్ద, నిఫ్టీ 346.35 పాయింట్లు లేదా 1.39 శాతం నష్టంతో.. 24,578.35 వద్ద నిలిచాయి.ఇన్స్పిరిసిస్ సొల్యూషన్స్, డైనమిక్ కేబుల్స్, లింక్, ఇన్ఫోబీన్స్ టెక్నాలజీస్, గిన్ని ఫిలమెంట్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. డీఎంసీసీ స్పెషాలిటీ కెమికల్స్, గణేష్ హౌసింగ్ కార్పొరేషన్, అనుప్ ఇంజనీరింగ్, కృష్ణ డయాగ్నోస్టిక్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. నిన్న భారీగా పెరిగిన మార్కెట్లు ఈ రోజు ఉదయం 09:45 సమయానికి నిఫ్టీ(Nifty) 172 పాయింట్లు నష్టపోయి 24,744కు చేరింది. సెన్సెక్స్(Sensex) 686 ప్లాయింట్లు పడిపోయి 81,753 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.66 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 64.76 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.45 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో గతంతో పోలిస్తే భారీగా పెరిగాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 3.26 శాతం లాభపడింది. నాస్డాక్ 4.35 శాతం ఎగబాకింది.టారిఫ్‌ల తగ్గింపు వల్ల, ఎల్రక్టానిక్స్, మెషినరీ, రసాయనాలు వంటి అధిక విలువ చేసే ఉత్పత్తులకు సంబంధించి అమెరి–చైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెరగవచ్చిన మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ పరిణామంతో భారత ఎగుమతిదార్లకు సవాళ్లు ఎదురుకావచ్చన్నారు. అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవలి కాలంలో ఆగ్నేయాసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలాంటి మార్కెట్లో చొచ్చుకుపోయిన భారత ఎగుమతిదార్లకు పోటీ పెరగవచ్చని చెబుతున్నారు. కానీ, ఆ రెండు దేశాల వాణిజ్య పరిధిలోకి రాని ఇతర రంగాలపై మరింతగా దృష్టి పెట్టేందుకు అవకాశం లభిస్తుందని అంటున్నారు.ఇదీ చదవండి: అన్ని ఐటీఆర్ పత్రాలు నోటిఫైమార్కెట్లో ఇటీవల లాభాలు ఎందుకంటేపహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, సరిహద్దుల్లో కాల్పులు పరిణామాలతో భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. అయితే అమెరికా మధ్యవర్తిత్వంలో, అనేక దౌత్యప్రయత్నాల తర్వాత ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీంతో ఒక్కసారిగా దలాల్ స్ట్రీట్‌లో ఒక్కసారిగా ఊపువచ్చింది. అమెరికా–చైనాల మధ్య ‘టారిఫ్ వార్’ సైతం ఒక కొలిక్కి వచ్చింది. స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన చర్చలు సఫలమై ఇరు దేశాలు వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. తమ టారిఫ్‌లను 115% మేర తగ్గించుకోవడంతో పాటు కొత్త సుంకాలకు 90 రోజులపాటు విరామం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాయి. అగ్రదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడంతో ప్రపంచ మార్కెట్లకు ఫుల్ జోష్ వచ్చింది. ఈక్విటీ ఫండ్లలోకి సిప్ల ద్వారా ఏప్రిల్‌లో రికార్డు స్థాయి రూ.26,632 కోట్లు పెట్టుబడులు రావడం, అంతర్జాతీయ క్రిడెట్ రేటింగ్ ఏజెన్సీ మార్నింగ్‌స్టార్ డీబీఆర్ఎస్ భారత సావరిన్ క్రిడెట్ రేటింగ్‌ను దీర్ఘకాలానికి బీబీబీ(కనిష్టం) నుంచి బీబీబీ(స్థిరత్వం)కి అప్‌గ్రేడ్ చేయడం తదితర అంశాలు మార్కెట్ల ర్యాలీకి దన్నుగా నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 2,950.34 పాయింట్లు లేదా 3.71 శాతం లాభంతో 82,404.81 వద్ద, నిఫ్టీ 912.80 పాయింట్లు లేదా 3.80 శాతం లాభంతో 24,920.80 వద్ద నిలిచాయి. చాల రోజుల తరువాత భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లో క్లోజ్ అవ్వడం బహుశా ఇదే మొదటిసారి.ఎన్డీఆర్ ఆటో కాంపోనెంట్స్, ఇన్స్పిరిసిస్ సొల్యూషన్స్, ఐఎఫ్జీఎల్ రిఫ్రాక్టరీస్, బిర్లా కార్పొరేషన్, మ్యాన్ ఇండస్ట్రీస్ (ఇండియా) వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. కేపీఆర్ మిల్, జిందాల్ వరల్డ్‌వైడ్, ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్, పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే సోమవారం భారీ లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:45 సమయానికి నిఫ్టీ(Nifty) 598 పాయింట్లు పెరిగి 24,607కు చేరింది. సెన్సెక్స్(Sensex) 1938 పాయింట్లు ఎగబాకి 81,389 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.57 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 64.22 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.4 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో గతంతో పోలిస్తే స్థిరంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.07 శాతం లాభపడింది. నాస్డాక్ 0.01 శాతం ఎగబాకింది.భారత్, పాకిస్తాన్ మధ్య దాదాపు యుద్ధమేఘాలు అలుముకోవడంతో దేశీ స్టాక్ మార్కెట్లు గత వారం చివర్లో బలహీనపడ్డాయి. అయితే వారాంతాన కాల్పుల విరమణకు అంగీకారం కుదిరినప్పటికీ సరిహద్దు పొడవునా పాక్ అతిక్రమణలకు పాల్పడినట్లు వెలువడిన వార్తలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచినట్లు స్టాక్ నిపుణులు తెలియజేశారు. దీంతో మరోసారి అనిశ్చిత పరిస్థితులు తలెత్తినట్లు పేర్కొన్నారు. వెరసి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గేవరకూ మార్కెట్లను నిశితంగా పరిశీలించాలని అభిప్రాయపడుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారత్ - పాక్ యుద్ధం: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవి చూశాయి. సెన్సెక్స్ 880.34 పాయింట్లు లేదా 1.10 శాతం నష్టంతో 79,454.47 వద్ద, నిఫ్టీ 265.80 పాయింట్లు లేదా 1.10 శాతం నష్టంతో 24,008.00 వద్ద నిలిచాయి.ఐడియాఫోర్జ్ టెక్నాలజీ, ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్, మయూర్ యూనికోటర్స్, సుప్రీం హోల్డింగ్స్ & హాస్పిటాలిటీ, ప్లాటినం ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. నవకర్ అర్బన్స్ట్రక్చర్, చెంబాండ్ కెమికల్స్, సీపీ క్యాపిటల్, ముత్తూట్ మైక్రోఫిన్, ఏజీఐ ఇన్ఫ్రా మొదలైన కంపెనీలు నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
భారత్-పాక్ యుద్ధం.. నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:26 సమయానికి నిఫ్టీ(Nifty) 211 పాయింట్లు నష్టపోయి 24,063కు చేరింది. సెన్సెక్స్(Sensex) 542 పాయింట్లు దిగజారి 79,805 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.81 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 63 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.36 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో గతంతో పోలిస్తే లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.58 శాతం లాభపడింది. నాస్డాక్ 1.07 శాతం ఎగబాకింది.ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్–పాకిస్థాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమవడంతో స్టాక్ సూచీలు ఒడిదొడులకు లోనవుతున్నాయి. ఇటీవల భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా దాడులు చేసిన పాక్‌పై ప్రతీకార చర్యగా లాహోర్ గగనతల రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేసినట్లు భారత రక్షణ శాఖ ప్రకటనతో దలాల్ స్ట్రీట్ సెంటిమెంట్ నిన్న ఒక్కసారిగా మారిపోయింది. ట్రేడింగ్ మరో గంటలో ముగుస్తుందనే సమయంలో ఎఫ్ఎంసీజీ, ఆటో, బ్యాంకింగ్ షేర్లలో భారీ విక్రయాలు తలెత్తాయి. అమెరికాతో చైనా, తాజాగా బ్రిటన్ వాణిజ్య ఒప్పంద చర్చలు సఫలం అవ్వొచ్చనే అంచనాలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి.ఇదీ చదవండి: ఒక్కరోజులో భారీగా క్షీణించిన రూపాయి విలువపరస్పర దాడులకు సంబంధించిన పరిస్థితులు త్వరగా సద్దుమనిగితే మార్కెట్ ప్రభావం పరిమితం కావచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ ఆపరేషన్ స్టాక్ మార్కెట్‌పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని కొందరు చెబుతున్నారు. పరిస్థితులు త్వరితగతిన నియంత్రణలోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ఇలాంటి ఆపరేషన్ల ప్రభావానికి తాత్కాలికంగా మార్కెట్లు ఒడిదొడులకులకు లోనైనా భవిష్యత్తులో తప్పకుండా పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 411.97 పాయింట్లు లేదా 0.51 శాతం నష్టంతో 80,334.81 వద్ద, నిఫ్టీ 140.60 పాయింట్లు లేదా 0.58 శాతం నష్టంతో 24,273.80 వద్ద నిలిచాయి.గిన్ని ఫిలమెంట్స్, పావ్నా ఇండస్ట్రీస్, శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్, గ్రిండ్‌వెల్ నార్టన్, శ్రీరామ్ పిస్టన్స్ & రింగ్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరగా.. అవలోన్ టెక్నాలజీస్, గోధా క్యాబ్కాన్ అండ్ ఇన్సులేషన్, రవీంద్ర ఎనర్జీ, కృతి ఇండస్ట్రీస్ (ఇండియా), డీబీ కార్ప్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
ఫ్లాట్‌గా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే గురువారం స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:30 సమయానికి నిఫ్టీ(Nifty) 22 పాయింట్లు నష్టపోయి 24,391కు చేరింది. సెన్సెక్స్(Sensex) 29 పాయింట్లు దిగజారి 80,701 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.71 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 61.55 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.29 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో గతంతో పోలిస్తే లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.43 శాతం లాభపడింది. నాస్డాక్ 0.27 శాతం ఎగబాకింది.భారత త్రివిధ దళాల సహాయంతో ఆర్మీ బలగాలు నిన్న పాకిస్థాన్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడి చేశాయి. పరస్పర దాడులకు సంబంధించిన పరిస్థితులు త్వరగా సద్దుమనిగితే మార్కెట్ ప్రభావం పరిమితం కావచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ ఆపరేషన్ స్టాక్ మార్కెట్‌పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని కొందరు చెబుతున్నారు. పరిస్థితులు త్వరితగతిన నియంత్రణలోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ఇలాంటి ఆపరేషన్ల ప్రభావానికి తాత్కాలికంగా మార్కెట్లు ఒడిదొడులకులకు లోనైనా భవిష్యత్తులో తప్పకుండా పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
Operation Sindoor: పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ క్రాష్
ఉగ్రమూకలను ఏరివేసేందుకు పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ సైన్యం చేసిన కచ్చితమైన దాడుల నేపథ్యంలో భారత ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 105.71 పాయింట్లు (0.13 శాతం) పెరిగి 80,746.78 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 34.80 పాయింట్లు (0.14 శాతం) లాభపడి 24,414.40 వద్ద ముగిసింది.బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.36 శాతం, బీఎస్ఈ స్మాల్ క్యాప్ 1.16 శాతం లాభపడటంతో విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి.రంగాలవారీ సూచీల్లో నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, ఫార్మా, హెల్త్ కేర్ మినహా మిగతా అన్ని రంగాలు గ్రీన్‌లో ముగియడంతో ఆటో, మీడియా, రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 1 శాతానికి పైగా పెరిగాయి.సెన్సెక్స్ లోని 30 షేర్లలో 17 షేర్లు లాభాల్లో ముగిశాయి. టాటా మోటార్స్ 5.2 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.02 శాతం, ఎటర్నల్ 1.41 శాతం, అదానీ పోర్ట్స్ 1.41 శాతం, టైటాన్ 1.27 శాతం లాభపడ్డాయి. ఏషియన్ పెయింట్స్ 4 శాతం, సన్ ఫార్మా 1.95 శాతం, ఐటీసీ-1.3 శాతం, నెస్లే ఇండియా-1.06 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.01 శాతం నష్టపోయాయి.పాక్ స్టాక్ మార్కెట్ కుదేలుపాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట భారత్ జరిపిన దాడుల ప్రభావంతో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ బుధవారం కుప్పకూలింది. ఆ దేశ ప్రధాన స్టాక్ మార్కెట్ సూచీ కేఎస్ఈ 100 (కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్) ప్రారంభ ట్రేడింగ్‌లో 6,272 పాయింట్లు లేదా 6 శాతం పడిపోయింది. భారత్ 'ఆపరేషన్ సింధూర్' చేపట్టిన కొన్ని గంటల్లోనే కేఎస్ఈ-100 సూచీ క్షీణించి 1,12,076.38 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. ప్రస్తుతానికి పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (పీఎస్ఎక్స్) కోలుకునే సూచనలు కనిపించలేదు. పీఎస్ఎక్స్ వెబ్సైట్ మూతపడింది. ఆ వెబ్సైట్ తెరిస్తే "తదుపరి నోటీసు వచ్చే వరకు నిర్వహణలో ఉంటుంది" అన్న సందేశం కనిపిస్తోంది. -
ఆపరేషన్ సిందూర్.. స్టాక్ మార్కెట్‌పై ప్రభావం ఎంత?
భారత త్రివిధ దళాల సహాయంతో ఆర్మీ బలగాలు పాకిస్థాన్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడి చేశాయి. ఇందులో సుమారు 80 మందికిపైగా ఉగ్రవాదులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. గతంలో జమ్మూకశ్మీర్‌లో భారత పర్యాటకులను ఊచకోత కోసిన ఉగ్రదాడులకు ప్రతీకారంగా భారత్ దాయాది దేశంపై పంజా విసిరింది. పాకిస్థాన్‌లోని సాధారణ ప్రజలపై కాకుండా ఉగ్ర స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. దీనిపై సానుభూతి కోసం పాక్ ఇతర దేశాల సాయం కోరకుండా భారత్ చాకచక్యంగా వ్యవహరించింది. తాజా దాడుల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లో ఎలాంటి ప్రభావం ఉండబోతుందో తెలుసుకుందాం.మార్కెట్ రియాక్షన్మార్కెట్ ప్రారంభమైన కాసేపటికి నిఫ్టీ 50 24,400 పాయింట్ల దిగువకు, సెన్సెక్స్ 150 పాయింట్లు నష్టపోయింది. గిఫ్ట్ సిటీలోని నిఫ్టీ 50లో ఫ్యూచర్స్ సుమారు 1.19% క్షీణించింది. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా జరిగిన ఈ ఆపరేషన్ తర్వాత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతాయని కొందరు భావిస్తున్నారు. ఇది ఇన్వెస్టర్ల ఆందోళనలకు కారణమవుతుంది.పరస్పర దాడులకు సంబంధించిన పరిస్థితులు త్వరగా సద్దుమనిగితే మార్కెట్ ప్రభావం పరిమితం కావచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ ఆపరేషన్ స్టాక్ మార్కెట్‌పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని కొందరు చెబుతున్నారు. పరిస్థితులు త్వరితగతిన నియంత్రణలోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ఇలాంటి ఆపరేషన్ల ప్రభావానికి తాత్కాలికంగా మార్కెట్లు ఒడిదొడులకులకు లోనైనా భవిష్యత్తులో తప్పకుండా పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. ఎఫ్ఐఐలు కీలకం24-48 గంటల్లో ఈ పరిస్థితి అదుపులోకి వస్తే మార్కెట్లు ముందుకు సాగవచ్చని కొందరు సూచిస్తున్నారు. అయితే, దీర్ఘకాలిక ఉద్రిక్తతలు కొనసాగితే మాత్రం కొంతకాలం మార్కెట్లో దిద్దుబాటుకు దారితీస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో కొనుగోలుదారులుగా ఉంటున్న విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) ప్రతికూలంగా ప్రతిస్పందిస్తే కొంత కాలం అనిశ్చితులు కొనసాగవచ్చు.ఇదీ చదవండి: ఎన్బీఎఫ్సీ గోల్డ్ లోన్లకు కష్టాలుగతంలో ఇలా..ఇండో-పాక్ ఘర్షణల నేపథ్యంలో మార్కెట్లు గతంలోనూ కొంత ఒడిదొడుకులకు లోనయ్యాయి. 2019 బాలాకోట్ వైమానిక దాడుల తరువాత సెన్సెక్స్, నిఫ్టీ మార్కెట్ సెషన్ ప్రారంభంలో పడిపోయినప్పటికీ మరుసటి రోజు తిరిగి పుంజుకున్నాయి. పహల్గాం దాడి తర్వాత మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేటు నిర్ణయాలు, చైనా లిక్విడిటీ చర్యలు వంటి అంతర్జాతీయ సంకేతాలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవల ప్రకటించిన భారత్-బ్రిటన్ వాణిజ్య ఒప్పందం మార్కెట్లో కొంత సానుకూల సెంటిమెంట్‌ను తీసుకొచ్చింది. -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే బుధవారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:30 సమయానికి నిఫ్టీ(Nifty) 47 పాయింట్లు పెరిగి 24,426కు చేరింది. సెన్సెక్స్(Sensex) 134 పాయింట్లు పుంజుకుని 80,777 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.55 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 62.52 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.31 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో గతంతో పోలిస్తే నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.77 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.87 శాతం దిగజారింది.ఆసియా మార్కెట్లలో సానుకూల ధోరణులు, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం మార్కెట్ సెంటిమెంట్‌కు దోహదపడుతుంది. విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్లు, క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో స్టాక్ సూచీలకు కొంత ఊరట లభిస్తున్నా, ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన దాడుల పరిణామాలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు దిగరావడంతో దేశీయ ఆయిల్ రిఫైనరీ మార్కెటింగ్ కంపెనీల షేర్లకు డిమాండ్ నెలకొంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూసింది. సెన్సెక్స్ 155.77 పాయింట్లు లేదా 0.19 శాతం నష్టంతో 80,641.07 వద్ద, నిఫ్టీ 81.55 పాయింట్లు లేదా 0.33 శాతం నష్టంతో 24,379.60 వద్ద నిలిచాయి.సీసీఎల్ ప్రొడక్ట్స్ ఇండియా, ఓరియంట్ బెల్, గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్, తత్వ చింతన్ ఫార్మా కెమ్, పాలీ మెడిక్యూర్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సెంచరీ ఎంకా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కేసాల్వ్స్ ఇండియా, ప్రైమ్ ఫోకస్, ఓరియంటల్ హోటల్స్ వంటివి నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
స్థిరంగా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే మంగళవారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:35 సమయానికి నిఫ్టీ(Nifty) 11 పాయింట్లు పెరిగి 24,465కు చేరింది. సెన్సెక్స్(Sensex) 6 పాయింట్లు పుంజుకుని 80,807 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.87 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 61.16 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.34 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో గతంతో పోలిస్తే నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.64 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.74 శాతం దిగజారింది.ఆసియా మార్కెట్లలో సానుకూల ధోరణులు, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం మార్కెట్ సెంటిమెంట్‌కు దోహదపడుతుంది. విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్లు, క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో స్టాక్ సూచీలు సోమవారం ఈ ఏడాది(2025) గరిష్టంపై ముగిశాయి. అంతర్జాతీయ వాణిజ్య ఆందోళనలు తగ్గుముఖం పట్టడంతో స్టాక్ సూచీలు సానుకూలంగా కదలాడుతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు దిగరావడంతో దేశీయ ఆయిల్ రిఫైనరీ మార్కెటింగ్ కంపెనీల షేర్లకు డిమాండ్ నెలకొంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 294.85 పాయింట్లు లేదా 0.37 శాతం లాభంతో.. 80,796.84 వద్ద, నిఫ్టీ 114.45 పాయింట్లు లేదా 0.47 శాతం లాభంతో 24,461.15 వద్ద నిలిచింది.టాప్ గెయినర్స్ జాబితాలో అషిమా, యూనివర్సల్ కేబుల్స్, నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా, పరాగ్ మిల్క్ ఫుడ్స్, ఆర్ఆర్ కాబెల్ వంటి కంపెనీలు చేరగా.. జీ-టెక్ జైన్ఎక్స్ ఎడ్యుకేషన్, కేసాల్వ్స్ ఇండియా, లోటస్ ఐ కేర్ హాస్పిటల్, వీ-మార్ట్ రిటైల్, సిల్వర్ టచ్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
లాభాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 10:16 సమయానికి నిఫ్టీ(Nifty) 132 పాయింట్లు పెరిగి 24,478కు చేరింది. సెన్సెక్స్(Sensex) 391 పాయింట్లు పుంజుకుని 80,891 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.67 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 59.06 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.3 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో గతంతో పోలిస్తే లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 1.47 శాతం లాభపడింది. నాస్డాక్ 1.51 శాతం ఎగబాకింది.ఆసియా మార్కెట్లలో సానుకూల ధోరణులు, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం మార్కెట్ సెంటిమెంట్‌కు దోహదపడుతుంది. ఇండియా-పాక్ ఉద్రిక్తతలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. దీంతోపాటు అమెరికా-చైనా ట్రేడ్‌వార్‌ను మార్కెట్లు గమనిస్తున్నాయి. తగ్గిన చమురు ధరలు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించి, ఆర్థిక వృద్ధికి తోడ్పడుతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్లపై రెండింటి ఎఫెక్ట్
దేశీ స్టాక్ మార్కెట్లలో ఈ వారం ట్రెండ్ పలు కీలక అంశాలపై ఆధారపడనుంది. దేశీయంగా కార్పొరేట్ ఫలితాలు ప్రభావం చూపనున్నాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పరపతి సమీక్షకు తెరతీయనుంది. మరోపక్క భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ఈ వారం ఆటుపోట్లకు అవకాశమున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.– సాక్షి, బిజినెస్ డెస్క్ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లకు దిక్సూచిగా నిలవగల అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ బుధవారం పాలసీ సమీక్షను ప్రకటించనుంది. రెండు రోజులపాటు సమావేశమయ్యే ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) 7న వడ్డీ రేట్లపై నిర్ణయాలు ప్రకటించనుంది. అయితే మార్చి నెల సమావేశంమాదిరిగా ఈసారికూడా ఫెడ్ యథాతథ రేట్ల అమలుకే కట్టుబడే అవకాశమున్నట్లు అత్యధిక శాతంమంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. గత సమావేశంలో ఫెడ్ ఫండ్స్ రేట్లను 4.25–4.5 శాతంగా కొనసాగించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా.. ఏప్రిల్ నెలకు యూఎస్ సర్వీసుల పీఎంఐ గణాంకాలు సోమవారం(5న) విడుదలకానున్నాయి. ఇక చైనా ఏప్రిల్ వాణిజ్య గణాంకాలు 9న వెల్లడికానున్నాయి. మార్చిలో ఎగుమతుల జోరు కారణంగా 102 బిలియన్ డాలర్లకుపైగా వాణిజ్య మిగులు నమోదైంది.బ్లూచిప్స్ ఫలితాలుఈ వారం ఆతిథ్య రంగ దిగ్గజం ఇండియన్ హోటల్స్, ఆటో దిగ్గజం ఎంఅండ్ఎం(5న), బ్యాంక్ ఆఫ్ బరోడా(6న), కోల్ ఇండియా, డాబర్(7న), మౌలిక దిగ్గజం ఎల్అండ్టీ, ఏషియన్ పెయింట్స్, బయోకాన్, టైటన్(8న), డాక్టర్ రెడ్డీస్(9న) గత ఆర్థి క సంవత్సరం చివరి త్రైమాసిక(జనవరి–మార్చి) ఫలితాలు ప్రకటించనున్నాయి. గత వారాంతాన(3న) బ్యాంకింగ్ దిగ్గజాలు స్టేట్‌బ్యాంక్, కొటక్ మహీంద్రాతోపాటు డీమార్ట్ క్యూ4 ఫలితాలు వెల్లడించాయి. ఈ ప్రభావం నేడు(5న) మార్కెట్లలో కనిపించనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్త్ మేనేజ్మెంట్, రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా తెలియజేశారు. కాగా.. హెచ్ఎస్బీసీ పీఎంఐ సరీ్వసుల డేటా 6న విడుదలకానుంది.యుద్ధ భయాలుపహల్గావ్లో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లలో ఓవైపు ఆందోళనలు నెలకొన్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ఎస్వీపీ అజిత్ మిశ్రా తెలియజేశారు. ఫలితంగా భారత్, పాకిస్తాన్ మిలటరీ దళాల ప్రతీ కదలికలనూ కూలంకషంగా పరిశీలించే వీలున్నట్లు వివరించారు. ఫలితంగా మార్కెట్లలో ఆటుపోట్లు కనిపించవచ్చని లెమన్ మార్కెట్స్ డెస్క్ విశ్లేషకులు గౌరవ్ గార్గ్ అంచనా వేశారు. సాంకేతికంగా ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 24,400 పాయింట్ల వద్ద కీలక అవరోధాన్ని ఎదుర్కొనే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ స్థాయికి ఎగువన నిలిస్తే మరింత బలపడవచ్చని, లేదంటే పరిమిత శ్రేణి కదలికలకే పరిమితంకావచ్చని అంచనా వేశారు. క్యూ1లో యూఎస్ జీడీపీ నీరసించడం గ్లోబల్‌స్థాయిలో అనిశ్చితికి దారితీస్తున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ విశ్లేషించారు. దీంతో ఫెడ్ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడినట్లు తెలియజేశారు.గత వారమిలా..గురువారం సెలవు కావడంతో 4 రోజులకే ట్రేడింగ్ పరిమితమైన గత వారం.. సెన్సెక్స్ 1289 పాయింట్లు(1.6 శాతం) ఎగసి 80,502కు చేరింది. నిఫ్టీ 307 పాయింట్లు(1.3 శాతం) పుంజుకుని 24,347 వద్ద నిలిచింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం బలపడగా.. స్మాల్ క్యాప్ మాత్రం 1.33 శాతం క్షీణించింది.ఇదీ చదవండి: న్యూ ఫండ్ ఆఫర్లపై ఓ లుక్కేయండి!ఎఫ్‌పీఐల దన్నుఇటీవల కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్‌లో కొనుగోళ్ల యూటర్న్ తీసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు టారిఫ్‌ల విషయంలో యూఎస్‌తో ఒప్పందం కుదరనున్నట్లు అంచనాలు పెరిగినట్లు తెలియజేశారు. దీంతో గత 12 ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్‌పీఐలు పెట్టుబడులకే ఆసక్తి చూపుతున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్ తెలియజేశారు. ఫలితంగా యూఎస్ డాలరుతో మారకంలో రూపాయి వేగంగా బలపడుతున్నట్లు పేర్కొన్నారు. మరోపక్క స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్టాలవైపు పరుగు తీస్తున్నట్లు వివరించారు. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 99కు బలహీనపడటం కూడా రూపాయికి ప్రోత్సాహాన్నిస్తున్నట్లు ఆరి్థకవేత్తలు పేర్కొన్నారు. దేశీయంగా తొలి మూడు నెలల(జనవరి–మార్చి) తదుపరి ఏప్రిల్‌లో ఎఫ్‌పీఐలు నికరంగా రూ.4,223 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! -
స్టాక్ మార్కెట్లో కొత్త ఇండెక్స్
ముంబై: స్టాక్ ఎక్స్చేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ తాజాగా నిఫ్టీ వేవ్స్ ఇండెక్స్‌ను ప్రవేశపెట్టింది. మీడియా, ఎంటర్టైన్మెంట్, గేమింగ్ పరిశ్రమలకు ప్రాతినిధ్యం వహించే 43 లిస్టెడ్ కంపెనీలతో ఇండెక్స్‌ను రూపొందించింది. తద్వారా ఫిల్మ్, టీవీ, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, మ్యూజిక్, గేమింగ్ తదితర వివిధ పరిశ్రమలకు చోటు కల్పించింది.స్టోరీలు, మ్యూజిక్, ఇన్నోవేషన్, క్రియేటివ్ స్పిరిట్ ఇకపై దేశం నుంచి భారీగా ఎగుమతికానున్నట్లు 2025 వేవ్స్‌లో ఎన్ఎస్ఈ ఇండెక్స్‌ను విడుదల చేస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. 2005 ఏప్రిల్1 ఇండెక్స్‌కు బేస్కాగా.. ప్రాథమిక విలువను 1,000గా నిర్ధారించారు.దేశీయంగా అత్యంత డైనమిక్ రంగాలలో ఒకటైన మీడియా, ఎంటర్టైన్మెంట్ పరిశ్రమ లోతును ప్రతిబింబించే విధంగా నిఫ్టీ వేవ్స్ ఇండెక్స్‌కు తెరతీసినట్లు ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిష్‌కుమార్ చౌహాన్ తెలియజేశారు. -
వాణిజ్య ఒప్పందంపై ఆశలతో లాభాలు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాలతో ముగిసింది. అమెరికా – భారత్ వాణిజ్య ఒప్పందంపై ఆశలు, రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్ల అంశాలు కలిసొచ్చాయి. సెన్సెక్స్ 260 పాయింట్లు పెరిగి 80,502 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 13 పాయింట్లు బలపడి 24,347 వద్ద నిలిచింది. ఉదయం సానుకూలంగా మొదలైన సూచీలు ట్రేడింగ్ ప్రారంభంలోనే భారీ లాభాలు ఆర్జించాయి.ఐటీ, బ్యాంకుల షేర్లకు డిమాండ్ లభించడంతో ఒక దశలో సెన్సెక్స్ 936 పాయింట్లు బలపడి 81,178 వద్ద గరిష్టాన్ని అందుకుంది. నిఫ్టీ 255 పాయింట్లు ఎగసి 24,589 వద్ద ఈ ఏడాది గరిష్టాన్ని నమోదు చేసింది. అయితే ద్వితీయార్ధంలో గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో లాభాలు తగ్గాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. ⇒ బీఎస్ఈలో రంగాల వారీగా సూచీల్లో సర్వీసెస్ 1.67%, ఆయిల్‌అండ్‌గ్యాస్ 0.69%, ఇంధన 0.57%, ఐటీ ఇండెక్సు అరశాతం పెరిగాయి. టెలికమ్యూనికేషన్ 2%, కన్జూమర్ డ్యూరబుల్స్ 1.66%, విద్యుత్, యుటిలిటీ 1%, మెటల్, రియల్టీ సూచీలు అరశాతం నష్టపోయాయి. మిడ్‌క్యాప్ 1.67%, స్మాల్ క్యాప్ సూచీ 0.07 శాతం పతనమయ్యాయి. ⇒ మార్చి క్వార్టర్ నికరలాభం 4% వృద్ధి నమోదుతో అదానీ పోర్ట్స్–సెజ్ షేరు 4% పెరిగి రూ.1,267 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 6% ఎగసి రూ.1,295 వద్ద గరిష్టాన్ని తాకింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో అత్యధికంగా లాభపడిన షేరు ఇదే. కంపెనీ మార్కెట్ విలువ రూ.10,812 కోట్లు పెరిగి రూ.2.73 లక్షల కోట్లకు చేరింది. ⇒ భూషణ్ స్టీల్ అండ్ పవర్‌ను దక్కించుకునేందుకు సమర్పించిన ప్రణాళికలు దివాలా పరిష్కార ప్రక్రియ చట్టాలకు విరుద్ధంగా ఉన్నాయంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడంతో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేరు 5.5% నష్టపోయి రూ.972 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 8% క్షీణించి రూ.948 వద్ద కనిష్టాన్ని తాకింది. షేరు భారీ పతనంతో కంపెనీకి రూ.13,731 కోట్ల నష్టం వాటిల్లింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.2.37 లక్షల కోట్లకు దిగివచి్చంది. -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 259.75 పాయింట్లు లేదా 0.32 శాతం లాభంతో 80,501.99 వద్ద, నిఫ్టీ 12.50 పాయింట్లు లేదా 0.051 శాతం లాభంతో 24,346.70 వద్ద నిలిచాయి.జుల్లుందూర్ మోటార్ ఏజెన్సీ ఢిల్లీ, స్పోర్ట్‌కింగ్ ఇండియా, జోడియాక్ క్లాతింగ్ కంపెనీ, క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్, ఫోర్స్ మోటార్స్ వంటి కంపెనీలు లాభాలను చవి చూశాయి. యునైటెడ్ పాలీఫ్యాబ్ గుజరాత్, గోద్రేజ్ ఆగ్రోవెట్, జీ-టెక్ జైన్ఎక్స్ ఎడ్యుకేషన్, వైశాలి ఫార్మా, మాలు పేపర్ మిల్స్ మొదలైన కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
గ్రీన్‌లో కదలాడుతున్న సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 133 పాయింట్లు పెరిగి 24,473కు చేరింది. సెన్సెక్స్(Sensex) 595 పాయింట్లు పుంజుకుని 80,854 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.14 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 62.63 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.23 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో గతంతో పోలిస్తే లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.63 శాతం లాభపడింది. నాస్డాక్ 1.52 శాతం ఎగబాకింది.ఇదీ చదవండి: మేలో లాంచ్ అయ్యే టాప్ 5 స్మార్ట్ఫోన్లుఆసియా మార్కెట్లలో సానుకూల ధోరణులు, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం మార్కెట్ సెంటిమెంట్‌కు దోహదపడుతుంది. ఇండియా-పాక్ ఉద్రిక్తతలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. దీంతోపాటు అమెరికా-చైనా ట్రేడ్‌వార్‌ను మార్కెట్లు గమనిస్తున్నాయి. తగ్గిన చమురు ధరలు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించి, ఆర్థిక వృద్ధికి తోడ్పడుతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. బెంచ్ మార్క్ సూచీలు స్వల్ప శ్రేణిలో కన్సాలిడేట్ కావడంతో బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో వరుసగా రెండో ట్రేడింగ్ సెషన్ లోనూ స్టాక్ స్పెసిఫిక్ ట్రేడింగ్ కార్యకలాపాలు జోరందుకున్నాయి. గురువారం (మే 1) ట్రేడింగ్ హాలిడే నేపథ్యంలో ట్రేడింగ్ కార్యకలాపాలు మందకొడిగా సాగాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 80 పాయింట్ల లాభంతో 80,371 వద్ద ప్రారంభమై, ఆ తర్వాత ట్రేడింగ్‌లో ఎక్కువ భాగం కన్సాలిడేట్ అయింది. ట్రేడింగ్ చివరి 30 నిమిషాల్లో 80,526 (237 పాయింట్లు పెరిగింది) వద్ద గరిష్టానికి చేరుకుంది. కాని వెంటనే లాభాలను కోల్పోయి 79,879 వద్ద కనిష్టానికి పడిపోయింది. రోజులో గరిష్ట స్థాయి నుండి 647 పాయింట్లు పడిపోయింది. చివరకు సెన్సెక్స్ 46 పాయింట్ల నష్టంతో 80,0242 వద్ద ముగిసింది. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 2,827 పాయింట్లు (3.6 శాతం) లాభంతో ఏప్రిల్ నెలను ముగించింది.ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ దాదాపు 200 పాయింట్ల రేంజ్లో కదలాడింది. 24,396 వద్ద గరిష్టాన్ని తాకింది. తరువాత 24,199 వద్ద కనిష్టానికి పడిపోయింది. చివరకు రెండు పాయింట్ల నష్టంతో 24,334 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఏప్రిల్ నెలలో 3.5 శాతం లేదా 815 పాయింట్లు లాభపడింది.సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు 5 శాతానికి పైగా నష్టపోయాయి. టాటా మోటార్స్, ఎస్బీఐ 3 శాతం చొప్పున నష్టపోయాయి. అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్ షేర్లు కూడా నష్టపోయాయి. మారుతీ మాత్రం 3 శాతానికి పైగా లాభపడింది. భారతీ ఎయిర్టెల్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు కూడా 1 - 2 శాతం చొప్పున లాభపడ్డాయి.కాగా విస్తృత సూచీలు గణనీయ నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ 1 శాతం, స్మాల్ క్యాప్ 2 శాతం పడిపోయాయి. మొత్తంగా మార్కెట్ విస్తృతి చాలా ప్రతికూలంగా ఉంది. బీఎస్ఈలో పురోగమిస్తున్న ప్రతి షేరుకు దాదాపు 3 స్టాక్స్ క్షీణించాయి. రంగాలవారీగా చూస్తే బీఎస్ఈ పవర్, క్యాపిటల్ గూడ్స్ సూచీలు 1 శాతానికి పైగా నష్టపోయాయి. రియాల్టీ 1 శాతానికి పైగా లాభపడింది. బుధవారం ఇంట్రాడేలో రియల్టీ ఇండెక్స్ 4 శాతం పెరిగింది. -
స్థిరంగా కదలాడుతున్న సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే బుధవారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:42 సమయానికి నిఫ్టీ(Nifty) 10 పాయింట్లు పెరిగి 24,345కు చేరింది. సెన్సెక్స్(Sensex) 41 పాయింట్లు పుంజుకుని 80,339 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.34 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 62.74 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.17 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో గతంతో పోలిస్తే లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.58 శాతం లాభపడింది. నాస్డాక్ 0.55 శాతం ఎగబాకింది.ఆసియా మార్కెట్లలో సానుకూల ధోరణులు, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం మార్కెట్ సెంటిమెంట్‌కు దోహదపడుతుంది. ఇండియా-పాక్ ఉద్రిక్తతలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. తగ్గిన చమురు ధరలు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించి, ఆర్థిక వృద్ధికి తోడ్పడుతున్నాయి. మహారాష్ట్ర డే సందర్భంగా రేపు గురువారం(మే 1న) మార్కెట్లు పనిచేయవు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సూచీలకు స్వల్ప లాభాలు
ముంబై: ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో భాగంగా స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. సెన్సెక్స్ 70 పాయింట్లు పెరిగి 80,288 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఏడు పాయింట్ల నామమాత్ర లాభంతో 24,336 వద్ద నిలిచింది. వరుసగా రెండో రోజూ లాభాల్లో నిలిచాయి. భారత్–పాక్‌ల మధ్య నెలకొన్న భౌగోళిక ఉద్రికత్త పరిస్థితుల దృష్ట్యా ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. సెన్సెక్స్ 443 పాయింట్లు ఎగసి 80,661 వద్ద, నిఫ్టీ 129 పాయింట్లు పెరిగి 24,458 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి.ఐటీ, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రియల్, కన్జూమర్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మెటల్, యుటిలిటీ, టెలీకమ్యూనికేషన్, సర్విసెస్, బ్యాంకులు, ఫైనాన్స్ సర్విసెస్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 27 పైసలు బలపడి 84.96 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మెరుగైన ఫలితాలతో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ 4% పెరిగి రూ.1,031 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 10% ఎగసి రూ.1,085 తాకింది రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 2%, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు ఒకశాతం చొప్పున రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం మిశ్రమంగా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సరికి స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 28.11 పాయింట్లు లేదా 0.035 శాతం లాభంతో.. 80,246.48 వద్ద, నిఫ్టీ 7.45 పాయింట్లు లేదా 0.031 శాతం లాభంతో 24,335.95 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో మాలు పేపర్ మిల్స్, పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్, డేటా ప్యాటర్న్స్ (ఇండియా), గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ & ఇంజనీర్స్, టీబీఓ టెక్ వంటి కంపెనీలు చేరగా.. మ్యాక్స్ ఇండియా లిమిటెడ్, గ్లోబల్ వెక్ట్రా హెలికార్ప్, మనక్సియా, శివ మిల్స్ లిమిటెడ్, లక్ష్మీ ఫైనాన్స్ అండ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
స్థిరంగా కదలాడుతున్న సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే మంగళవారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:49 సమయానికి నిఫ్టీ(Nifty) 9 పాయింట్లు నష్టపోయి 24,330కు చేరింది. సెన్సెక్స్(Sensex) 28 పాయింట్లు పెరిగి 80,236 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.02 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 64.4 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.2 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో గతంతో పోలిస్తే స్థిరంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.06 శాతం లాభపడింది. నాస్డాక్ 0.1 శాతం దిగజారింది.రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు ఊహించిన దానికంటే మెరుగైన క్యూ4 ఫలితాలను రిపోర్ట్ చేశాయి. ఇది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచింది. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) ఇటీవలి సెషన్లలో నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. ఇది మార్కెట్లలోకి గణనీయమైన మూలధనాన్ని సమకూరుస్తుంది. ఆసియా మార్కెట్లలో సానుకూల ధోరణులు, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం సెంటిమెంట్‌కు దోహదపడుతున్నాయి. ఇండియా-పాక్ ఉద్రిక్తతలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నారు. తగ్గిన చమురు ధరలు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించి, ఆర్థిక వృద్ధికి తోడ్పడుతున్నాయి. మహారాష్ట్ర డే సందర్భంగా గురువారం(మే 1న) మార్కెట్లు పనిచేయవు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,005.84 పాయింట్లు లేదా 1.27 శాతం లాభంతో 80,218.37 వద్ద, నిఫ్టీ 272.90 పాయింట్లు లేదా 1.14 శాతం లాభంతో 24,312.25 వద్ద నిలిచాయి.జయస్వాల్ నెకో ఇండస్ట్రీస్, ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్, ఓరియంటల్ ట్రైమెక్స్, సౌత్ వెస్ట్ పినాకిల్ ఎక్స్‌ప్లోరేషన్, బార్బెక్యూ నేషన్ హాస్పిటాలిటీ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. లాయిడ్స్ ఇంజనీరింగ్ వర్క్స్, తేజస్ నెట్వర్క్స్, అసోసియేటెడ్ ఆల్కహాల్ అండ్ బ్రూవరీస్, ఎస్ఎమ్ఎల్ ఇసుజు, అవంటెల్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
భారత్-పాక్ ఉద్రిక్తతలున్నా బుల్ జోరు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:32 సమయానికి నిఫ్టీ(Nifty) 103 పాయింట్లు పెరిగి 24,156కు చేరింది. సెన్సెక్స్(Sensex) 471 పాయింట్లు పుంజుకుని 79,689 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.66 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 65.97 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.24 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.74 శాతం లాభపడింది. నాస్డాక్ 1.26 శాతం ఎగబాకింది.ఇదీ చదవండి: భారత్-పాక్ వాణిజ్య సంబంధాలు ఎలా ఉన్నాయంటే..గత వారం జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడి కారణంగా భారత్, పాకిస్థాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ప్రభావం చూపనున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య రాజకీయ, భౌగోళిక ఆందోళనలు సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు విశ్లేషకులు ప్రస్తావించారు. ఇవికాకుండా అమెరికా, చైనా మధ్య టారిఫ్‌ల సంక్షోభానికి సైతం ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో గత వారం చివర్లో మార్కెట్లు ఉన్నట్టుండి బలహీనపడ్డాయి. ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. మహారాష్ట్ర డే సందర్భంగా గురువారం(మే 1న) మార్కెట్లు పనిచేయవు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలకు చెక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాలను చవి చూశాయి. సెన్సెక్స్ 588.90 పాయింట్లు లేదా 0.74 శాతం నష్టంతో 79,212.53 వద్ద, నిఫ్టీ 207.35 పాయింట్లు లేదా 0.86 శాతం నష్టంతో.. 24,039.35 వద్ద నిలిచాయి.లక్ష్మీ ఫైనాన్స్ అండ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్, కారారో ఇండియా, బటర్‌ఫ్లై గాంధీమతి అప్లయెన్స్, మనక్సియా స్టీల్స్, కంట్రీ కాండోస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలువగా.. SRM కాంట్రాక్టర్స్, PVP వెంచర్స్, భండారీ హొజియరీ ఎక్స్‌పోర్ట్స్, మైండ్టెక్ (ఇండియా), మాగ్నమ్ వెంచర్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో ఉన్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
కొనసాగుతున్న బుల్ జోరు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ(Nifty) 67 పాయింట్లు పెరిగి 24,311కు చేరింది. సెన్సెక్స్(Sensex) 162 పాయింట్లు పుంజుకుని 79,952 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.61 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 66.95 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.31 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 2.03 శాతం లాభపడింది. నాస్డాక్ 2.74 శాతం ఎగబాకింది.భారత స్టాక్ మార్కెట్లో ఇటీవలి ర్యాలీకి అనేక అంశాలు కారణమవుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయి మార్చిలో 3.34 శాతానికి చేరుకుంది. దీంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరిగింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) భారత మార్కెట్లో క్రమంగా పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకుల పనితీరుపై పెట్టుబడిదారులు సానుకూలంగా ఉన్నారు. బ్రెంట్ క్రూడ్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇది ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గిస్తుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వరుస లాభాలకు బ్రేక్..
దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 82 పాయింట్లు నష్టపోయి 24,246 వద్దకు చేరింది. సెన్సెక్స్ 315 పాయింట్లు దిగజారి 79,801 వద్దకు చేరింది. ఇటీవల వరుసగా పెరిగిన మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లోకి చేరుకున్నాయి.సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్, సన్‌ఫార్మా, టైటాన్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాక్‌లు లాభాల్లో ముగిశాయి. హెచ్‌యూఎల్, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, జొమాటో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎం అండ్ ఎం, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, ఇన్ఫోసిస్, నెస్లే, టీసీఎస్ స్టాక్‌లు నష్టపోయాయి.ఇదీ చదవండి: ప్రభుత్వ బాధ్యతల నుంచి మస్క్ వెనక్కిఈ రోజు మార్కెట్ల ఒడిదొడుకులకుగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇన్వెస్టర్లు ఇటీవలి లాభాలను స్వీకరించేందుకు పూనుకున్నారు. ఇది అమ్మకాల ఒత్తిడికి దారితీసింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు
భారత బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు గురువారం మార్కెట్ ప్రారంభంలో నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 171.85 పాయింట్లు లేదా 0.21 శాతం క్షీణించి 79,944.64 వద్ద, నిఫ్టీ 50 సూచీ 47.95 పాయింట్లు లేదా 0.2 శాతం తగ్గి 24,281 వద్ద ట్రేడవుతున్నాయి.బీఎస్ఈ సెన్సెక్స్‌లో జీఎస్ఎస్ ఇన్ఫోటెక్, మోడీ రబ్బర్, థైరోకేర్ టెక్నాలజీస్, వివిడ్ మర్కంటైల్, కేఐవోసీఎల్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. మరోవైపు స్టెర్లైట్ టెక్నాలజీస్, బృందావన్ ప్లాంటేషన్, డాప్స్ అడ్వర్టైజింగ్, సింజీన్ ఇంటర్నేషనల్, ప్రైమా ఆగ్రో ప్రొడక్ట్స్ టాప్ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి.నిఫ్టీ ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్టుల నెలవారీ గడువు ముగియడంతో పాటు టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా వంటి కంపెనీల నాలుగో త్రైమాసిక ఫలితాల కారణంగా ఇన్వెస్టర్లు కదలికలపై ఓ కన్నేసి ఉంచనున్నారు. -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బుధవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 406.40 పాయింట్లు లేదా 0.51 శాతం లాభంతో 80,001.99 వద్ద, నిఫ్టీ 115.10 పాయింట్లు లేదా 0.48 శాతం లాభంతో 24,282.35 వద్ద నిలిచాయి.మైండ్టెక్ (ఇండియా), వర్ధమాన్ స్పెషల్ స్టీల్స్, సిగ్మా సాల్వ్, ఆప్టెక్, మోదీ రబ్బర్ వంటి కంపెనీలు లాభాల జాబితాలో చేరాయి. వీడోల్ కార్పొరేషన్, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్, ఉమా ఎక్స్‌పోర్ట్స్, రవి కుమార్ డిస్టిలరీస్, Xelpmoc డిజైన్ అండ్ టెక్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. జోరు మీద ఐటీ షేర్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. చైనాపై సుంకాలు గతంలో ప్రకటించినంత కఠినంగా ఉండకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సానుకూల అంతర్జాతీయ సంకేతాల మధ్య భారత బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ను తొలగించకపోవచ్చని కూడా ట్రంప్ సంకేతాలిచ్చారు.సెషన్ ప్రారంభ సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 528.87 పాయింట్లు లేదా 0.66 శాతం పెరిగి 80,124.46 వద్ద, నిఫ్టీ 50 182.90 పాయింట్లు లేదా 0.76 శాతం లాభంతో 24,350.15 వద్ద ఉన్నాయి. మార్కెట్ ప్రారంభమయ్యాక ఐటీ స్టాక్స్ జోరందుకున్నాయి. సెన్సెక్స్‌లో హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ షేర్లు టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. ఏప్రిల్ నెలకు సంబంధించి తయారీ, సేవల పీఎంఐ ఫ్లాష్ రీడింగ్స్‌తో పాటు ఎల్‌టీఐమైండ్‌ట్రీ, 360 వన్ వామ్, దాల్మియా భారత్ వంటి కంపెనీల నాలుగో త్రైమాసిక ఫలితాలపై ఇన్వెస్టర్లు కన్నేశారు. అంతేకాకుండా, ప్రస్తుత మార్కెట్ ర్యాలీ దాదాపు అన్ని స్టాక్స్‌ను పైకి లేపుతోంది. 16 సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా లాభాలను చూస్తున్నాయి. -
Stocks Market: లాభాల ‘సిక్సర్’
ముంబై: బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీల ర్యాలీ ఆరో రోజూ కొనసాగింది. విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్లు విశ్వాసాన్ని పెంచాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 187 పాయింట్లు పెరిగి 79,596 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 42 పాయింట్లు లాభపడి 24,167 వద్ద నిలిచింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 416 పాయింట్లు ఎగసి 79,824 వద్ద, నిఫ్టీ 117 పాయింట్లు దూసుకెళ్లి 24,243 వద్ద గరిష్టాన్ని అందుకున్నాయి.అయితే అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని బలహీన సంకేతాల ప్రభావంతో సగానికి పైగా లాభాలు హరించుకుపోయాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గించడంలో చైర్మన్ పావెల్ విఫలమయ్యాడంటూ అధ్యక్షుడు ట్రంప్ బహిరంగ విమర్శలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ ఆరు ట్రేడింగ్ సెషన్లలో రూ.33.55 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే, బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.427.37 లక్షల కోట్ల(5.02 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది. ఈ ఏప్రిల్ 9 నుంచి(6 రోజుల్లో) సెన్సెక్స్ 5,748 పాయింట్లు, నిఫ్టీ 1,768 పాయింట్లు ఎగిశాయి.⇒ బీఎస్ఈ సూచీల్లో రియల్టీ 2.50%, ఎఫ్ఎంసీజీ 2%, కన్జూమర్ డ్యూరబుల్స్ 1.5% లాభప డ్డాయి. మిడ్, స్మాల్ క్యాప్‌లు 1% రాణించాయి. ⇒ షేరు వరుస ర్యాలీతో హెచ్డీఎఫ్సీ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ తొలిసారి రూ.15 లక్షల కోట్లకు చేరింది. తద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో దేశీయ సంస్థగా అవతరించింది. ఈ ప్రైవేటు రంగ బ్యాంకు షేరు బీఎస్ఈలో 2% పెరిగి రూ.1,962 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ.1,971 రికార్డు గరిష్టాన్ని తాకింది. ⇒ మైక్రోఫైనాన్స్ విభాగంలో రూ.600 కోట్ల వ్యత్యాసంపై ఫోర్సెనిక్ అడిట్ కోసం ఎర్నెస్ట్–యంగ్ నియమించుకుందనే వార్తలతో ఇండస్ఇండ్ బ్యాంకు షేరు 5% నష్టపోయి రూ.788 వద్ద ముగిసింది.⇒ దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.లక్ష దాటడంతో బంగారం ఆభరణాల షేర్లు మెరిశాయి. త్రిభువన్ దాస్ భీంజీ ఝవేరీ(టీజీజెడ్) 6%, స్కై గోల్డ్ 5%, సెన్కో గోల్డ్ 3 శాతం లాభపడ్డాయి. -
సెన్సెక్స్ డబుల్ హ్యాట్రిక్..
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో దూసుకెళ్తున్నాయి. మంగళవారం లాభాలతో ముగిశాయి. ఎఫ్ఎంసీజీ, ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్ల లాభాలతో బీఎస్ఈ, ఎన్ఎస్ఈ బెంచ్‌మార్క్ సూచీలు వరుసగా ఆరో ట్రేడింగ్ రోజు కూడా విజయ పరంపరను కొనసాగించాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 320 పాయింట్ల సానుకూల తేడాతో 79,728 వద్ద రోజును ప్రారంభించింది. కానీ కొంత సేపటికే లాభాలను కోల్పోయి 79,253 వద్ద ఎరుపులోకి జారుకుంది. తర్వాత పుంజుకుని పాజిటివ్ జోన్లో కన్సాలిడేట్ కాగా, ఇంట్రాడే గరిష్ట స్థాయి 79,824ను తాకింది. చివరకు సెన్సెక్స్ 187 పాయింట్ల లాభంతో 79,596 వద్ద స్థిరపడింది. ఈ ప్రక్రియలో సెన్సెక్స్ గత ఆరు వరుస ట్రేడింగ్ సెషన్లలో 7.8 శాతం లేదా 5,749 పాయింట్లు పెరిగింది.ఇక నిఫ్టీ 50 ఇండెక్స్ 24,072 వద్ద కనిష్టాన్ని తాకి తిరిగి 24,243 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరకు 0.2 శాతం లేదా 42 పాయింట్ల లాభంతో 24,167 వద్ద స్థిరపడింది. మంగళవారం 29వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ ఎన్ఎస్ఈ బెంచ్‌మార్క్ గత ఆరు రోజుల్లో 7.9 శాతం లేదా 1,768 పాయింట్లు పెరిగింది.సెన్సెక్స్‌లోని 30 షేర్లలో ఎఫ్ఎంసీజీ మేజర్ ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్ 2 శాతానికి పైగా లాభపడ్డాయి. అదేసమయంలో మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జొమాటో, కొటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. మరోవైపు, మైక్రోఫైనాన్స్ పోర్ట్‌ఫోలియోలో రూ .600 కోట్ల వ్యత్యాసంపై దర్యాప్తు చేయడానికి మరో రౌండ్ ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించడానికి బ్యాంక్ ఈవైని రంగంలోకి దింపడంతో ఇండస్ఇండ్ బ్యాంక్ 5 శాతం నష్టపోయింది.పవర్ గ్రిడ్ కార్పొరేషన్, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్సర్వ్, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ 1-2 శాతం మధ్య క్షీణించాయి. విస్తృత మార్కెట్ బెంచ్‌మార్క్ సూచీలను అధిగమించింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ రెండూ మంగళవారం 0.8 శాతం వరకు లాభపడ్డాయి. బీఎస్ఈలో 1,500 షేర్లు క్షీణించగా, దాదాపు 2,500 షేర్లు లాభాల్లో ముగిశాయి. రంగాలవారీ సూచీల్లో బీఎస్ఈ రియల్టీ ఇండెక్స్ 2.4 శాతం, ఎఫ్ఎంసీజీ 1.9 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 1.4 శాతం లాభపడ్డాయి. మరోవైపు ఐటీ, పవర్ సూచీలు భారీగా నష్టపోయాయి. -
నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 59.34 పాయింట్లు లేదా 0.075 శాతం నష్టంతో.. 79,349.16 వద్ద, నిఫ్టీ 18.50 పాయింట్లు లేదా 0.077 శాతం నష్టంతో.. 24,107.05 వద్ద ముందుకు సాగుతున్నాయి.మనక్సియా స్టీల్స్, Xelpmoc డిజైన్ అండ్ టెక్, సంభావ్ మీడియా, క్షితిజ్ పాలీలైన్, లాయల్ టెక్స్టైల్స్ మిల్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్, కేసోరామ్ ఇండస్ట్రీస్, రాజ్ టెలివిజన్ నెట్వర్క్, బినాని ఇండస్ట్రీస్, జెన్సోల్ ఇంజనీరింగ్ మొదలైన సంస్థలు నష్టాల బాట పట్టాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
Stock market: వరుసగా ఐదో సెషన్లోనూ లాభాలే..
బ్యాంకింగ్, ఐటీ, ఆటో రంగాల్లో భారీ కొనుగోళ్లతో బెంచ్ మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలు వరుసగా ఐదో ట్రేడింగ్ సెషన్ లోనూ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 855.30 పాయింట్లు లేదా 1.09 శాతం పెరిగి 79,408.50 వద్ద స్థిరపడింది.ఇక నిఫ్టీ కూడా 273.90 పాయింట్లు లేదా 1.15 శాతం పెరిగి 24,125.55 వద్ద ముగిసింది. టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫిన్సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు 4.91 శాతం వరకు లాభపడటంతో సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 23 షేర్లు లాభాల్లో ముగిశాయి.మరోవైపు నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 వరుసగా 2.50 శాతం, 2.21 శాతం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ వరుసగా ఐదు ట్రేడింగ్ సెషన్లలో 7.5 శాతం లేదా 5,562 పాయింట్లు లాభపడగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ 7.7 శాతం లేదా 1,726 పాయింట్లు పెరిగింది. -
లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:15 గంటలకు సెన్సెక్స్ 575.09 పాయింట్లు లేదా 0.73 శాతం లాభంతో 79,128.30 వద్ద, నిఫ్టీ 143.15 పాయింట్లు లేదా 0.60 శాతం లాభంతో 23,994.80 వద్ద కొనసాగుతున్నాయి.టాప్ గెయినర్స్ జాబితాలో సంభవ్ మీడియా, బాంబే సూపర్ హైబ్రిడ్ సీడ్స్, యూరోటెక్స్ ఇండస్ట్రీస్ అండ్ ఎక్స్‌పోర్ట్స్, జెనిత్ ఎక్స్‌పోర్ట్స్, ఇండో-నేషనల్ వంటి కంపెనీలు చేరాయి. ఆక్‌మె ఫిన్‌ట్రేడ్ ఇండియా, ఆర్వీ లాబొరేటరీస్, షైలీ ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్, జైప్రకాష్ అసోసియేట్స్, బినాని ఇండస్ట్రీస్ మొదలైన సంస్థలు నష్టాల బాట పట్టాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లో.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ 1,508.91 పాయింట్లు లేదా 1.96 శాతం లాభంతో 78,553.20 వద్ద, నిఫ్టీ 414.45 పాయింట్లు లేదా 1.77 శాతం లాభంతో 23,851.65 వద్ద నిలిచాయి.సెక్‌మార్క్ కన్సల్టెన్సీ, ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ ట్రావెన్కోర్, ఓస్వాల్ ఆగ్రో మిల్స్, ఎస్ఎమ్ఎస్ లైఫ్ సైన్సెస్ ఇండియా, ఓస్వాల్ ఫెర్టిలైజర్స్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మొదలైన కంపెనీలు టాప్ గెజినర్స్ జాబితాలో చేరగా.. అక్మే ఫైనాన్స్ ట్రేడ్ ఇండియా, వికాస్ లైఫ్‌కేర్, రాజ్ ఆయిల్ మిల్స్, రోసెల్ ఇండియా, డైనమిక్ ప్రొడక్ట్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.'రేపు గుడ్ ఫ్రైడే సందర్భంగా మార్కెట్ సెలవు'(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
ర్యాలీకి బ్రేక్.. పడిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:39 సమయానికి నిఫ్టీ(Nifty) 107 పాయింట్లు తగ్గి 23,332కు చేరింది. సెన్సెక్స్(Sensex) 278 పాయింట్లు నష్టపోయి 76,778 వద్ద ట్రేడవుతోంది. దాంతో గత మూడు సెషన్ల నుంచి ర్యాలీ అయిన స్టాక్ మార్కెట్లో గురువారం ఉదయం ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.53 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 66.47 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.31 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో భారీ నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 2.24 శాతం నష్టపోయింది. నాస్డాక్ 3.07 శాతం దిగజారింది.ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్‌ను అనేక ఆర్థిక అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. భారత ఎగుమతులపై ఇటీవల అమెరికా విధించిన పరస్పర సుంకాలు అనిశ్చితిని సృష్టించాయి. తాత్కాలికంగా ఈ సుంకాలను 90 రోజులపాటు నిలిపేసినా ఇది మార్కెట్ అస్థిరతకు దారితీసింది. మార్చి నెలకు సంబంధించిన భారతదేశ టోకు ధరల సూచీ (డబ్ల్యుపీఐ) ఏప్రిల్ 15న విడుదలైంది. ఇది కాస్త ఊరట కలిగించింది. ఆర్బీఐ పాలసీ నిర్ణయం కూడా ప్రస్తుతం మార్కెట్లకు కీలకంగా మారింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దాంతో పలు బ్యాంకులు వడ్డీరేట్లు తగ్గిస్తున్నాయి. ఫలితంగా బ్యాంకింగ్ స్టాక్‌లు ర్యాలీ అవుతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ఫైనాన్షియల్ షేర్లు, ప్రధానంగా ప్రైవేట్ బ్యాంకులు, ఎంపిక చేసిన ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో భారత బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు వరుసగా మూడో రోజు కూడా విజయ పరంపరను కొనసాగించాయి.అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం తీవ్రతరం కావడంతో ఆసియా మార్కెట్ల బలహీన సంకేతాల మధ్య బీఎస్ఈ సెన్సెక్స్ 262 పాయింట్ల లాభంతో 76,996 వద్ద ప్రారంభమైంది. చైనా ప్రతీకార చర్యలకు పాల్పడితే దిగుమతులపై 245 శాతం వరకు సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.సెన్సెక్స్ నష్టాలను పూడ్చుకుని 556 పాయింట్ల లాభంతో 77,110 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరకు 309 పాయింట్లు (0.4 శాతం) లాభంతో 77,044 వద్ద ముగిసింది. ఈ క్రమంలో సెన్సెక్స్ గత మూడు ట్రేడింగ్ సెషన్లలో 3,197 పాయింట్లు లాభపడింది.అలాగే నిఫ్టీ 50 సూచీ 23,273 వద్ద కనిష్టాన్ని, ఆ తర్వాత 23,452 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. 104.60 పాయింట్లు (4.5 శాతం) లాభంతో 23,433 వద్ద ముగిసింది. నిఫ్టీ గత మూడు రోజుల్లో 1,038 పాయింట్లు పెరిగింది.సెన్సెక్స్ 30 షేర్లలో ఇండస్ ఇండ్ బ్యాంక్ టాప్ గెయినర్ గా నిలిచింది. డెరివేటివ్స్ పోర్ట్‌ఫోలియోలో గుర్తించిన వ్యత్యాసాలను ధ్రువీకరించడానికి నియమించిన బాహ్య సంస్థ పీడబ్ల్యుసి తన నివేదికను సమర్పించిన తరువాత ఈ స్టాక్ దాదాపు 7 శాతం పెరిగింది. యాక్సిస్ బ్యాంక్ 4 శాతం లాభపడింది. అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, ఐటీసీ 1 - 2 శాతం చొప్పున లాభపడ్డాయి. మరోవైపు మారుతి 1.5 శాతం క్షీణించింది.అదేసమయంలో ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, లార్సెన్ అండ్ టుబ్రో, సన్ ఫార్మా షేర్లు నష్టపోయాయి. విస్తృత సూచీలు ఈ రోజు బెంచ్ మార్క్ ను అధిగమించాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.6 శాతం, స్మాల్ క్యాప్ 0.9 శాతం పెరిగాయి. -
స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే బుధవారం స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:23 సమయానికి నిఫ్టీ(Nifty) 30 పాయింట్లు తగ్గి 23,298కు చేరింది. సెన్సెక్స్(Sensex) 76 పాయింట్లు పుంజుకొని 76,651 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.81 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 64.51 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.33 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.17 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.05 శాతం దిగజారింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల నుంచి ఎల్రక్టానిక్స్ ఉత్పత్తులను మినహాయించారు. దాంతో పాటు ఆటోమొబైల్స్‌పై సుంకాలు సవరించే వీలుందని సంకేతాలివ్వడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు నిన్న భారీగా లాభపడ్డాయి. ఆర్బీఐ వడ్డీరేట్ల తగ్గింపు కస్టమర్లకు బదిలీలో భాగంగా పలు బ్యాంకులు డిపాజిట్ల రేట్లు తగ్గిస్తున్నాయి. ఈ ప్రక్రియతో బ్యాంకుల నికర వడ్డీరేట్ల మార్జిన్ల ఒత్తిళ్లు తగ్గొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.రెండు రోజుల్లో రూ.18.42 లక్షల కోట్లుదలాల్ స్ట్రీట్‌లో గడిచిన రెండు ట్రేడింగ్ సెషన్లలో రూ.18.42 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.412.24 లక్షల కోట్ల(4.81 ట్రిలియన్ డాలర్లు)కు చేరుకుంది. మంగళవారం ఒక్కరోజే రూ.10.8 లక్షల కోట్ల సంపద ఇన్వెస్టర్ల సొంతమైంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 1,671.65 పాయింట్లు లేదా 2.22 శాతం లాభంతో.. 76,828.91 వద్ద, నిఫ్టీ 513.45 పాయింట్లు లేదా 2.25 శాతం లాభంతో.. 23,342.00 పాయింట్ల వద్ద నిలిచాయి.ఐమ్కో ఎలెకాన్ (ఇండియా), ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఫినో పేమెంట్స్ బ్యాంక్, పాండీ ఆక్సైడ్స్ & కెమికల్స్, ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. క్వెస్ కార్ప్, రాజ్ టెలివిజన్ నెట్వర్క్, ఉమా ఎక్స్‌పోర్ట్స్, స్టార్టెక్ ఫైనాన్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
టారిఫ్‌లకు బ్రేక్.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:23 సమయానికి నిఫ్టీ(Nifty) 472 పాయింట్లు పెరిగి 23,296కు చేరింది. సెన్సెక్స్(Sensex) 1564 పాయింట్లు పుంజుకొని 76,727 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.84 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 64.93 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.34 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.79 శాతం లాభపడింది. నాస్డాక్ 0.64 శాతం పుంజుకుంది.ఇదీ చదవండి: డీజిల్‌కు తగ్గిన డిమాండ్.. ఎందుకంటే..కంప్యూటర్ చిప్స్, మొబైల్స్, ల్యాప్‌టాప్‌సహా పలు ప్రొడక్టులపై ట్రంప్ టారిఫ్‌లను ఎత్తివేశారు. సుంకాల అమలును 90 రోజులపాటు తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు తెలిపారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ సానుకూలంగా ట్రేడవుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే టారిఫ్‌ల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలు కుదేలుకావచ్చన్న ఆందోళనలు అటు ముడిచమురు ధరలను.. ఇటు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరును దెబ్బతీస్తున్నట్లు వివరించారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
దేశీ స్టాక్ ఇండెక్సులకు బూస్ట్
నేడు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యే వీలుంది. ఆసియా, యూరప్, యూఎస్ మార్కెట్లు బలపడటంతో సెంటిమెంటు మెరుగుపడింది. ట్రంప్ ప్రభుత్వం టారిఫ్‌లను 90 రోజుల వరకూ నిలిపివేయడంతోపాటు.. ఎల్రక్టానిక్స్‌కు మినహాయింపు ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో హుషారు నెలకొంది. ముంబై: అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం దేశీ స్టాక్‌మార్కెట్లు పనిచేయనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. దీంతో ఆసియా మార్కెట్లు 0.5–1.5% బలపడ్డాయి. యూరోపియన్ మార్కెట్లు మరింత అధికంగా 1.5–2.5% ఎగశాయి. యూఎస్ మార్కెట్లు సైతం 1% పైగా లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో నేడు (మంగళవారం) దేశీ మార్కెట్లు సానుకూలంగా కదిలే వీలున్నట్లు నిపుణులు తెలిపారు. ఇప్పటికే యూఎస్ టారిఫ్‌ల అమలు 3 నెలలపాటు నిలిచిపోగా.. తాజాగా ఎల్రక్టానిక్స్‌కు మినహాయింపు లభించింది. కంప్యూటర్ చిప్స్, మొబైల్స్, ల్యాప్‌టాప్‌సహా పలు ప్రొడక్టులపై కొత్త టారిఫ్‌లను ఎత్తివేశారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ సానుకూలంగా ట్రేడయ్యే వీలున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే టారిఫ్‌ల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలు కుదేలుకావచ్చన్న ఆందోళనలు అటు ముడిచమురు ధరలను.. ఇటు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరును దెబ్బతీస్తున్నట్లు వివరించారు. టోక్యో ఎల్రక్టాన్, శామ్సంగ్ ఎల్రక్టానిక్స్ తదితర షేర్లు లాభపడ్డాయి. మార్చిలో చైనా ఎగుమతులు 12 శాతంపైగా పుంజుకున్నట్లు చైనా ప్రభుత్వం వెల్లడించింది. బాండ్లు, కరెన్సీపై.. తాజాగా 10ఏళ్ల యూఎస్ ట్రెజరీ బాండ్ల ఈల్డ్ 4.47 శాతానికి బలపడింది. ఒక దశలో 4.58 శాతానికి ఎగసింది. వారంక్రితం 4.01 శాతంగా నమోదైంది. వెరసి ట్రేడ్ వార్ కారణంగా యూఎస్ వెలుపలి ఇన్వెస్టర్లు ట్రెజరీ బాండ్లను విక్రయిస్తున్నట్లు ఫారెక్స్ వర్గాలు చెబుతున్నాయి. ఇతర నష్టాలను కవర్ చేసుకునే బాటలో హెడ్జ్ ఫండ్స్ సైతం బాండ్లను విక్రయిస్తున్నట్లు తెలియజేశాయి. ట్రంప్ ప్రభుత్వం టారిఫ్‌లపై అటూఇటుగా వ్యవహరిస్తుండటంతో ప్రపంచ దేశాలలో రక్షణాత్మకంగా భావించే యూఎస్‌పై విశ్వాసం తగ్గే అవకాశమున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. ఇది మరోవైపు పసిడికి డిమాండును పెంచుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో న్యూ యార్క్ కామెక్స్‌లో ఔన్స్ బంగారం తాజాగా 3,261 డాలర్లను తాకింది. ద్రవ్యోల్బణం.. ట్రంప్ టారిఫ్ ప్రణాళికలు రానున్న నెలల్లో ద్రవ్యోల్బణాన్ని పెంచనున్నట్లు ఆర్థికవేత్తలు అంచనా వేశారు. మార్చి గణాంకాలు అంచనాలకంటే మెరుగ్గా ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభా వాన్ని చూపనున్నట్లు భావిస్తున్నారు. ఫలితంగా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పరపతి విధానాల్లో స్వేచ్చగా వ్యవహరించలేకపోవచ్చని అభిప్రాయపడ్డారు.శుక్రవారం సెలవు గుడ్‌ఫ్రైడే సందర్భంగా శుక్రవారం(18న) స్టాక్ మార్కెట్లతోపాటు కమోడిటీ మార్కెట్లు సైతం పనిచేయవు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం మార్కెట్లు పని చేయలేదు. దీంతో ఈ వారం ట్రేడింగ్ 3 రోజులకే పరిమితంకానుంది. కాగా.. ఈ వారం పలు దిగ్గజాలు జనవరి–మార్చి(క్యూ4) ఫలితాలు ప్రకటించనున్నాయి. 15న ఇరెడా, ఐసీఐసీఐ ప్రు, 16న స్వరాజ్ ఇంజిన్స్, విప్రో, 17న హెచ్డీఎఫ్సీ లైఫ్, ఏఎంసీ, ఇన్ఫోసిస్, టాటాఎలక్సీ, 18న మాస్టెక్, 19న హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యస్ బ్యాంకుల పనితీరు వెల్లడికానుంది. -
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా మినహా చాలా దేశాలపై వాణిజ్య సుంకాలకు 90 రోజుల విరామం ప్రకటించిన తరువాత మిశ్రమ ఆసియా ధోరణుల మధ్య భారత ఈక్విటీ మార్కెట్లు భారీ ర్యాలీని చూశాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 1310.11 పాయింట్లు (1.77 శాతం) లాభపడి 75,157.26 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 429.40 పాయింట్లు లేదా 1.92 శాతం పెరిగి 22,828.55 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 షేర్లలో 47 షేర్లు లాభాల్లో ముగియగా, హిందాల్కో 6.52 శాతం, టాటా స్టీల్ 4.84 శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 4.81 శాతం, కోల్ ఇండియా 4.51 శాతం, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ 4.43 శాతం లాభాలతో టాప్ గెయినర్లుగా ఉన్నాయి.విస్తృత మార్కెట్లలో బీఎస్ఈ మిడ్ క్యాప్ 1.84 శాతం, స్మాల్ క్యాప్ 3.04 శాతం పెరిగాయి. రంగాలవారీగా చూస్తే అన్ని రంగాల సూచీలు లాభాల్లో స్థిరపడ్డాయి. అత్యధికంగా నిఫ్టీ మెటల్, ఎనర్జీ, ఫార్మా, ఆటో, బ్యాంక్ 4.09 శాతం వరకు లాభపడ్డాయి. అమెరికా వస్తువులపై సుంకాలను శనివారం నుంచి 125 శాతానికి పెంచుతున్నట్లు చైనా ప్రకటించిన నేపథ్యంలో వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు పెరగడంతో జపాన్ కు చెందిన నిక్కీ 225, దక్షిణ కొరియాకు చెందిన కోస్పీ, సింగపూర్ కు చెందిన స్ట్రెయిట్స్ టైమ్స్ సహా ఆసియా మార్కెట్ల సూచీలు నష్టాలలో ముగిశాయి. అంతకు ముందు చైనా దిగుమతులపై సుంకాన్ని 145 శాతానికి పెంచుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. -
భారీ లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 988.34 పాయింట్లు లేదా 1.34 శాతం లాభంతో 74,835.49 వద్ద, నిఫ్టీ 354.90 పాయింట్లు లేదా 1.58 శాతం లాభంతో 22,754.05 వద్ద సాగుతున్నాయి.టాప్ గెయినర్స్ జాబితాలో బినానీ ఇండస్ట్రీస్, గోల్డియం ఇంటర్నేషనల్, గార్వేర్ హై-టెక్ ఫిల్మ్స్, పోకర్ణ, డీఎస్‌జే కీప్ లెర్నింగ్ వంటి కంపెనీలు చేరగా.. మోడరన్ థ్రెడ్, సెలబ్రిటీ ఫ్యాషన్స్, ముత్తూట్ ఫైనాన్స్, జెన్సోల్ ఇంజనీరింగ్, కౌసల్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మొదలైన సంస్థలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు.. ముంచిన ఐటీ, బ్యాంకు షేర్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఈరోజు 379.93 పాయింట్లు (0.51 శాతం) క్షీణించి 73,847.15 వద్ద ముగిసింది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా 136.70 పాయింట్లు లేదా 0.61 శాతం క్షీణించి 22,399.15 వద్ద స్థిరపడింది. విస్తృత మార్కెట్లో బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.73 శాతం, స్మాల్ క్యాప్ 1.08 శాతం చొప్పున నష్టపోయాయి. రంగాలవారీ సూచీల్లో నిఫ్టీ ఐటీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ, హెల్త్‌కేర్ 1.11 శాతం నుంచి 2.25 శాతం మధ్య తీవ్ర నష్టాల్లో ముగిశాయి.సెన్సెక్స్ ప్యాక్ నుంచి 30 షేర్లలో 17 నష్టాల్లో ముగియగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, లార్సెన్ అండ్ టూబ్రో, టాటా స్టీల్ 3.4 శాతం వరకు నష్టపోయాయి.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.25 శాతం నుండి 6 శాతానికి తగ్గించడంతో బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు నష్టాలతో ముగిశాయి. పెరుగుతున్న ప్రపంచ అనిశ్చితుల మధ్య ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశాన్ని సూచిస్తూ ఆరుగురు సభ్యుల ప్యానెల్ రెపో రేటు తగ్గింపునకు జైకొట్టింది. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:29 సమయానికి నిఫ్టీ(Nifty) 156 పాయింట్లు తగ్గి 22,381కు చేరింది. సెన్సెక్స్(Sensex) 419 పాయింట్లు నష్టపోయి 73,821 వద్ద ట్రేడవుతోంది. సోమవారం భారీగా పడిన మార్కెట్లకు నిన్నటి ర్యాలీ ఉపశమనం కలిగించినా, ఇది ఒకే రోజుకు పరిమితమయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 102.45 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 60.55 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.45 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 1.57 శాతం నష్టపోయింది. నాస్డాక్ 2.15 శాతం దిగజారింది.ప్రతీకార సుంకాల విధింపు విషయంలో ప్రపంచ దేశాలతో అమెరికా చర్చలకు సిద్ధంగా ఉందంటూ ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. డాలర్ బలహీనత, అమెరికా బాండ్లపై రాబడులు దిగివచ్చాయి. ఇతర దేశాలతో పోల్చితే ప్రతీకార సుంకాల వల్ల భారత్ పై పడే ప్రభావం తక్కువేనని అంచనాలూ ఇన్వెస్టర్లకు ఊరటనిస్తున్నాయి. ఇదిలాఉండగా, ఆర్బీఐ ఈసారి మరో 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గించవచ్చనే అంచనాలు నెలకొన్నాయి.అప్రమత్తత అవసరంతీవ్ర అనిశ్చితులతో ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లో భయాందోళనలు భారీగా పెరిగాయి. ట్రంప్ సుంకాల విధింపుతో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితులు ఎప్పుడు సద్దుమణుగుతాయో ఎవరికి సరైన స్పష్టత లేదు. అయినప్పటికీ ప్రపంచ మార్కెట్లతో పోలిస్తే మన మార్కెట్లపై ప్రభావం తక్కువగానే ఉంది. క్షీణత వేళ అప్రమత్తతతో వ్యవహరిస్తూ మంచి షేరు విలువ ఆకర్షణీయంగా కనిపిస్తే కొనుగోలు చేయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇన్వెస్ట్ చేసేముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవాలని చెబుతున్నారు.గురువారం(10న) శ్రీ మహావీర్ జయంతి సందర్భంగా మార్కెట్లు పనిచేయవు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బుల్ బౌన్స్‌బ్యాక్
ముంబై: ఆసియా, యూరప్ మార్కెట్ల ర్యాలీతో దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం బౌన్స్‌బ్యాక్ అయ్యింది. దిగువ స్థాయిలో షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ 1,089 పాయింట్లు పెరిగి 74,227 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 374 పాయింట్లు బలపడి 22,536 వద్ద నిలిచింది. ప్రతీకార సుంకాల విధింపు విషయంలో ప్రపంచ దేశాలతో అమెరికా చర్చలకు సిద్ధంగా ఉందంటూ ట్రంప్‌సంకేతాలు ఇచ్చారు. ఆర్బీఐ ఈసారి మరో 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గించవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. డాలర్ బలహీనత, అమెరికా బాండ్లపై రాబడులు దిగివచ్చాయి ఇతర దేశాలతో పోల్చితే ప్రతీకార సుంకాల వల్ల భారత్ పై పడే ప్రభావం తక్కువేనని అంచనాలూ ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చాయి. ఉదయమే సానుకూలంగా మొదలైన సూచీలు రోజంతా లాభాల్లో ట్రేడయ్యాయి. అన్ని రంగాల షేర్లకు డిమాండ్ నెలకొంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,721 పాయింట్లు ఎగసి 74,859 వద్ద, నిఫ్టీ 536 పాయింట్లు దూసుకెళ్లి 22,697 వద్ద గరిష్టాన్ని తాకాయి. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీ, మిడ్‌క్యాప్ ఇండెక్స్ రెండు శాతం చొప్పున పెరిగాయి. ⇒ ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ మంగళవారం ఒక్కరోజే రూ.7.32 లక్షల కోట్లు పెరిగి రూ.396.57 లక్షల కోట్లు (4.62 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది. ఇన్వెస్టర్లు సోమవారం ఒక్కరోజే రూ.14.09 లక్షల కోట్లు నష్టపోయిన సంగతి తెలిసిందే. ⇒ సెన్సెక్స్ సూచీలో ఒక్క పవర్‌గ్రిడ్ తప్ప (0.19%) మిగిలిన 29 షేర్లు లాభపడ్డాయి. రంగాల వారీగా సూచీల్లో అయిల్‌అండ్‌గ్యాస్ 2.58%, కన్జూమర్ డ్యూరబుల్స్ 2.38%, టెలికం 2.32%, ఇండ్రస్టియల్స్ 2.04%, ఇంధన 2.%, కన్జూమర్ డిస్క్రేషనరీ 2.02% లాభపడ్డాయి. టెక్, హెల్త్‌కేర్, ఐటీ రెండుశాతం చొప్పున పెరిగాయి. ⇒ మార్కెట్ బౌన్స్‌బ్యాక్‌లో భాగంగా అదానీ షేర్లు సైతం కోలుకున్నాయి. ఈ గ్రూప్‌లో మొత్తం 11 షేర్లూ లాభపడ్డాయి. బీఎస్ఈలో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్ 3.27%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 3.23%, అంబుజా సిమెంట్స్ 2.53% లాభపడ్డాయి. ఏసీసీ 2.32%, అదానీ విల్మార్ 2.24%, అదానీ పోర్ట్స్ 1.72%, సంఘీ ఇండస్ట్రీస్ 1.62%, ఎన్డీటీవీ 1.06%, అదానీ పవర్ 0.54%, అదానీ గ్రీన్ ఎనర్జీ 0.30 శాతం చొప్పున పెరిగాయి. గ్రూప్‌లో సంస్థల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12.18 లక్షల కోట్లుగా నమోదైంది. ప్రపంచ మార్కెట్లు రయ్వాణిజ్య సుంకాల చర్చలు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తాయనే ఆశలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ చేస్తున్నాయి. జపాన్ నికాయ్ 6%, చైనా షాంఘై 2%, హాంగ్‌కాంగ్ హాంగ్‌సెంగ్ 1.50%, దక్షిణ కొరియా కోస్పీ అరశాతం పెరిగాయి. యూరప్‌లో జర్మనీ డాక్స్, ఫాన్స్ సీఏసీ, బ్రిటన్ ఎఫ్టీఎస్ఈ మూడుశాతం లాభపడ్డాయి. భారత వర్తమాన కాలం ప్రకారం రాత్రి 8:30 గంటలకు నాస్డాక్ మూడు శాతం లాభంతో 16,063 వద్ద, డోజోన్స్ రెండున్నర శాతం పెరిగి 38,895 వద్ద, ఎస్అండ్పీ 2.50% లాభంతో 5,192 వద్ద ట్రేడవుతున్నాయి. -
భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
భారీ నష్టాల నుంచి లాభాల బాట పట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లో భారీ లాభాల్లోనే ముగిశాయి. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి సెన్సెక్స్ 1,135.68 పాయింట్లు లేదా 1.55 శాతం లాభంతో.. 74,273.58 వద్ద, నిఫ్టీ 374.25 పాయింట్లు లేదా 1.69 శాతం లాభంతో.. 22,535.85 వద్ద నిలిచాయి.సిల్లీ మాంక్స్ ఎంటర్టైన్మెంట్, కీనోట్ ఫైనాన్షియల్ సర్వీసెస్, వన్ పాయింట్ వన్ సొల్యూషన్స్ లిమిటెడ్, టెసిల్ కెమికల్స్ అండ్ హైడ్రోజన్, బినాని ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. డీసీఎమ్ ఫైనాన్షియల్, ఢిల్లీవరీ, ప్రోకాట్ మెరిడియన్, బోధి ట్రీ మల్టీమీడియా, ది వెస్ట్రన్ ఇండియా ప్లైవుడ్స్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
రిలీఫ్ ర్యాలీ.. 1100 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:21 సమయానికి నిఫ్టీ(Nifty) 347 పాయింట్లు పెరిగి 22,511కు చేరింది. సెన్సెక్స్(Sensex) 1096 పాయింట్లు ఎగబాకి 74,235 వద్ద ట్రేడవుతోంది. నిన్న భారీగా పడిన మార్కెట్ల్లో ఈరోజు రిలీఫ్ ర్యాలీ కనిపిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 102.97 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 65.01 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.14 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో మిశ్రమంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.23 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.1 శాతం పుంజుకుంది.మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ నినాదంతో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి గెలిచిన ట్రంప్.. ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో సృష్టిస్తున్న ప్రకంపనలు చల్లారడం లేదు. అమెరికాతో వ్యాపారం చేస్తున్న ప్రతి దేశాన్నీ కాళ్ల బేరానికి వచ్చేలా చేయడానికి ఆయన ఎంచుకున్న ప్రతీకార సుంకాలు అమెరికా సహా అన్ని స్టాక్ మార్కెట్లలోనూ కల్లోలాన్ని కొనసాగిస్తున్నాయి. కెనడా, జపాన్ సహా పలు దేశాల అధినేతలు ట్రంప్‌తో చర్చలకు వెళుతున్నట్లు ఇప్పటికే ప్రకటించగా చైనా మాత్రం దిగిరాలేదు. పైపెచ్చు ట్రంప్ టారిఫ్‌లకు జవాబుగా చైనా కూడా అమెరికా వస్తువులపై సుంకాలు పెంచటంతో ట్రంప్ బెదిరింపులకు దిగింది. చైనా వాటిని ఉపసంహరించుకోకపోతే మరో 50 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. మరోవైపు ట్రంప్ చర్యలతో ప్రపంచాన్ని మాంద్యం ముంచెత్తే అవకాశాలు 60 శాతానికి చేరినట్లు ఆర్థిక దిగ్గజాలు ప్రకటించాయి.అప్రమత్తత అవసరంతీవ్ర అనిశ్చితులతో ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లో భయాందోళనలు భారీగా పెరిగాయి. ట్రంప్ సుంకాల విధింపుతో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితులు ఎప్పుడు సద్దుమణుగుతాయో ఎవరికి సరైన స్పష్టత లేదు. అయినప్పటికీ ప్రపంచ మార్కెట్లతో పోలిస్తే మన మార్కెట్లపై ప్రభావం తక్కువగానే ఉంది. క్షీణత వేళ అప్రమత్తతతో వ్యహరిస్తూ మంచి షేరు విలువ ఆకర్షణీయంగా కనిపిస్తే కొనుగోలు చేయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇన్వెస్ట్ చేసేముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవాలని చెబుతున్నారు.గురువారం(10న) శ్రీ మహావీర్ జయంతి సందర్భంగా మార్కెట్లు పనిచేయవు.ఇదీ చదవండి: టాయ్ పరిశ్రమకు ‘టారిఫ్’ల ప్రయోజనం!(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్‌మార్కెట్లు భారీ పతనం.. టాప్ లూజర్ టాటా స్టీల్
Stock Market Crash: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. భారతీయ బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు కౌంటర్లలో విస్తృత స్థాయి అమ్మకాలతో వరుసగా మూడో సెషన్ లో తీవ్ర నష్టాల్లో స్థిరపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 2226.79 పాయింట్లు (2.95 శాతం) క్షీణించి 73,137.90 వద్ద ముగిసింది.నిఫ్టీ 50 కూడా 742.85 పాయింట్లు (3.24 శాతం) నష్టంతో 22,161.60 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ లోని మొత్తం 30 షేర్లు నష్టాల్లోనే స్థిరపడగా టాటా స్టీల్ అత్యధికంగా 7.16 శాతం నష్టపోయింది. ఒక్క రోజులో మార్కెట్ పతనం గత పది నెలల్లో ఇదే అత్యధికం. బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.403 లక్షల కోట్ల నుంచి రూ.389 లక్షల కోట్లకు పడిపోయింది. దీంతో మదుపరుల సంపద ఒక్క రోజులో రూ.14 లక్షల కోట్లు ఆవిరైంది. వృద్ధిపై పెరుగుతున్న ఆందోళనలు, అమెరికా సుంకాల పతనం మార్కెట్ పతనానికి కారణమయ్యాయి. ఇది ప్రస్తుత రిస్క్-ఆఫ్ సెంటిమెంట్‌ను మరింత తీవ్రతరం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రకటనలు, వాటికి ప్రతిగా చైనా తీసుకున్న ప్రతీకార చర్యలే ఇందుకు కారణమయ్యాయి.అమెరికా ప్రపంచ దేశాలపై సుంకాల విధింపుతో గ్లోబల్ స్టాక్ మార్కెట్లో అనిశ్చితి , మాంద్యం భయాలు,అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థ అపార నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ప్రపంచ ఆర్ధిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ట్రంప్ మాత్రం తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని భీష్మించుకున్నారు.ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో సైతం అమ్మకాలకు తెరలేచే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2020 తరువాత గత వారం యూఎస్ మార్కెట్లు 6 శాతం పడిపోయాయి. 5 లక్షల కోట్ల డాలర్లకుపైగా మార్కెట్ విలువ ఆవిరైంది. ఈ వారం దేశీ మార్కెట్లు పతన బాటలో సాగవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. కాగా.. వచ్చే గురువారం (ఏప్రిల్ 10) మహావీర్ జయంతి సందర్భంగా మార్కెట్లు పనిచేయవు. దీంతో ట్రేడింగ్ ఈవారం 4 రోజులకే పరిమితంకానుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే సోమవారం భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:29 సమయానికి నిఫ్టీ(Nifty) 831 పాయింట్లు తగ్గి 22,072కు చేరింది. సెన్సెక్స్(Sensex) 2,542 పాయింట్లు దిగజారి 72,795 వద్ద ట్రేడవుతోంది. మార్కెట్లు మొదలైన పావుగంటలోనే బీఎస్ఈలో దాదాపు రూ.12 లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 103.09 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 63.86 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.93 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో భారీ నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 5.97 శాతం నష్టోయింది. నాస్డాక్ 5.82 శాతం దిగజారింది.ఇదీ చదవండి: అన్ని కాలాలకూ అనుకూలంగత వారాంతాన యూఎస్ స్టాక్స్ అత్యంత భారీ పతనాన్ని చవిచూశాయి. నేడు(7న) యూఎస్ స్టాక్ మార్కెట్లకు ‘బ్లాక్‌మండే’ ఎదురుకావచ్చని అక్కడి నిపుణులు అంచనా వేశారు. భారత్‌సహా చైనా, జపాన్ తదితర ప్రధాన దేశాలపై ట్రంప్ ప్రతీకార టారిఫ్‌లను ప్రకటించడంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినవచ్చని, మాంద్యంలోకి జారుకోవచ్చని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లలో సైతం అమ్మకాలకు తెరలేచే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2020 తరువాత గత వారం యూఎస్ మార్కెట్లు 6 శాతం పడిపోయాయి. 5 లక్షల కోట్ల డాలర్లకుపైగా మార్కెట్ విలువ ఆవిరైంది. ఈ వారం దేశీ మార్కెట్లు పతన బాటలో సాగవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. కాగా.. గురువారం(10న) శ్రీ మహావీర్ జయంతి సందర్భంగా మార్కెట్లు పనిచేయవు. దీంతో ట్రేడింగ్ 4 రోజులకే పరిమితంకానుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రకటనల తర్వాత భారత ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో సెషన్లో అమ్మకాలను కొనసాగించాయి. 30 షేర్ల సెన్సెక్స్ 930.67 పాయింట్లు లేదా 1.22 శాతం క్షీణించి 75,364.69 వద్ద స్థిరపడింది. సూచీ 76,258.12 నుంచి 75,240.55 శ్రేణిలో ట్రేడ్ అయింది. నిఫ్టీ 50 కూడా 345.65 పాయింట్లు లేదా 1.49 శాతం క్షీణించి 22,904.45 వద్ద స్థిరపడింది.టాటా స్టీల్, టాటా మోటార్స్, లార్సెన్ అండ్ టూబ్రో, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 8.36 శాతం వరకు నష్టపోయాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్ 1.59 శాతం వరకు లాభపడ్డాయి.నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 3.56 శాతం క్షీణించడంతో స్మాల్ క్యాప్ షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ కూడా 2.91 శాతం నష్టపోయింది. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో స్థిరపడగా, మెటల్, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్‌యూ బ్యాంక్, ఆటో, రియల్టీలు 2-6.5 శాతానికి పైగా నష్టపోయాయి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:36 సమయానికి నిఫ్టీ(Nifty) 149 పాయింట్లు తగ్గి 23,103కు చేరింది. సెన్సెక్స్(Sensex) 329 పాయింట్లు దిగజారి 75,971 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.87 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 69.58 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.97 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో భారీ నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 4.84 శాతం నష్టోయింది. నాస్డాక్ 5.97 శాతం దిగజారింది.అమెరికాతో వాణిజ్య భాగస్వాములుగా ఉన్న 60 దేశాలపై డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాల విధింపుతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు వణికిపోయాయి. ఏ దేశంపై ఎంత టారిఫ్‌ల విధింపు ఉంటుందో అని లెక్కలతో సహా ట్రంప్ వివరణతో ఆసియా నుంచి అమెరికా వరకు ఈక్విటీ మార్కెట్లు ‘బేర్’మన్నాయి. ప్రతీకార సుంకాలతో వాణిజ్య యుద్ధం తీవ్రతరమై అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటాయనే భయాలు అధికమయ్యాయి. ప్రపంచ దేశాలపై ట్రంప్ వాణిజ్య యుద్ధ ప్రభావం ఈక్విటీ మార్కెట్‌ను కుదిపేసింది.అమెరికాకు భారత్ నుంచి ఎక్కువ ఎగుమతయ్యేవి సాఫ్ట్వేర్ సేవలు, మందులే. సుంకాల దెబ్బ నుంచి ఫార్మాను మినహాయించారు. ఇక సాఫ్ట్వేర్ సేవలపై టారిఫ్‌లు లేకున్నా.. ట్రంప్ చర్యలతో అమెరికా మాంద్యంలోకి జారే అవకాశాలున్నాయని, కంపెనీలు టెక్నాలజీపై వ్యయాలూ తగ్గించుకుంటాయనే అంచనాలు వస్తున్నాయి. అందుకే భారత ఐటీ షేర్లు భారీగా పతనం కాగా.. అమెరికాలో టెక్నాలజీ కంపెనీల సూచీ అయిన నాస్డాక్ అనూహ్యంగా 5 శాతానికిపైగా పతనమయింది.ఇదీ చదవండి: వజ్రాల వ్యాపారం గతి తప్పుతుందా..?రాబోయే రోజుల్లో ఒకవేళ కొన్ని రంగాల విషయంలో టారిఫ్‌లను సడలించినప్పటికీ కీలక పరిశ్రమలపై మాత్రం సుంకాల మోత యథాప్రకారం కొనసాగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ టారిఫ్‌లతో ఇప్పటికే ప్రపంచ ఎకానమీలో పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాబోయే రోజుల్లోనూ దేశాలు, పరిశ్రమలు, అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులను బట్టి ప్రపంచంపై టారిఫ్‌ల ప్రభావాలు రకరకాలుగా ఉండబోతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఐటీ షేర్లు పతనం.. నష్టాలతో ముగిసిన మార్కెట్లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై సుంకాలను ప్రకటించడంతో ఇండియన్ బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు గురువారం నష్టాల్లో ముగిశాయి. ట్రంప్ అన్ని యూఎస్ దిగుమతులపై బేస్‌లైన్ 10 శాతం పన్నును కలిగి ఉన్న కొత్త టారిఫ్ నిర్మాణాన్ని ప్రవేశపెట్టారు. వాణిజ్య మిగులు ఉన్న దేశాలపై అదనపు అధిక సుంకాలను విధించించారు. భారత్ ఇప్పుడు అమెరికా నుంచి 27 శాతం సుంకాన్ని ఎదుర్కొంటోంది.ఈరోజు బీఎస్ఈ సెన్సెక్స్ 322.08 పాయింట్లు (0.42 శాతం) క్షీణించి 76,295.36 వద్ద స్థిరపడింది. ఈ రోజు సూచీ 76,493.74 -75,807.55 రేంజ్లో ట్రేడ్ అయింది. నిఫ్టీ 50 కూడా 82.25 పాయింట్లు లేదా 0.35 శాతం క్షీణించి 23,250.10 వద్ద స్థిరపడింది.టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో ముగియడంతో బీఎస్ఈ సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 18 నష్టాల్లో ముగిశాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్ 4.57 శాతం వరకు లాభపడ్డాయి.నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 0.58 శాతం పెరగడంతో స్మాల్ క్యాప్ షేర్లు విస్తృత మార్కెట్లను మించిపోయాయి. రంగాలవారీ సూచీల్లో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 4.21 శాతం నష్టపోగా, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, కోఫోర్జ్, టీసీఎస్, ఎంఫాసిస్ సూచీలు నష్టపోయాయి. ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, రియల్టీ రంగాలు కూడా తక్కువ పనితీరు కనబరిచాయి.నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 2.25 శాతానికి పైగా లాభపడటంతో ఫార్మా షేర్లు లాభాల్లో ముగిశాయి. బ్యాంకులు, హెల్త్ కేర్, ఎఫ్ ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 1.94 శాతం వరకు లాభపడ్డాయి. -
టారిఫ్‌ల ఎఫెక్ట్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:36 సమయానికి నిఫ్టీ(Nifty) 54 పాయింట్లు తగ్గి 23,277కు చేరింది. సెన్సెక్స్(Sensex) 253 పాయింట్లు దిగజారి 76,356 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 103.05 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 73.26 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.06 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.67 శాతం లాభపడింది. నాస్డాక్ 0.87 శాతం ఎగబాకింది.భారత్‌పై సుంకాల మోతఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల బాంబు పేల్చారు. అనుకున్నట్లుగా విదేశీ ఉత్పత్తులపై భారీగా సుంకాలు వడ్డించారు. భారతదేశ ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్ వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. వియత్నాం ఉత్పత్తులపై 46 శాతం, చైనాపై 34 శాతం, యూరోపియన్ యూనియన్(ఈయూ)పై 20 శాతం, స్విట్జర్లాండ్‌పై 31, తైవాన్‌పై 32, జపాన్‌పై 24, యూకేపై 10 శాతం సుంకాలను ఖరారు చేశారు. అన్ని దేశాల నుంచి దిగుమతి అయ్యే అటోమొబైల్స్‌పై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు తేల్చిచెప్పారు. ఏప్రిల్ 2వ తేదీని ‘విముక్తి దినం’గా ట్రంప్ ప్రకటించారు. ఇదిలాఉండగా, మార్చిలో పుంజుకున్న తయారీ రంగ గణాంకాలు సానుకూల సెంటిమెంటుకు దోహదపడినట్లు నిపుణులు తెలియజేస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలతో ముగిసిన మార్కెట్లు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటన నేపథ్యంలో భారత బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు బుధవారం సానుకూలంగా ముగిశాయి. 30 షేర్ల సెన్సెక్స్ 592.93 పాయింట్లు లేదా 0.78 శాతం పెరిగి 76,617.44 వద్ద స్థిరపడింది. సూచీ 76,680.35 - 76,064.94 రేంజ్లో ట్రేడ్ అయింది.జొమాటో, టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతీ సుజుకీ ఇండియా, టెక్ మహీంద్రా షేర్లు 4.75 శాతం వరకు లాభపడటంతో సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 21 షేర్లు లాభాల్లో ముగిశాయి. అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే ఇండియా, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు 1.36 శాతం వరకు నష్టపోయాయి.సెన్సెక్స్‌కు అద్దంపడుతూ ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా 166.65 పాయింట్లు లేదా 0.72 శాతం పెరిగి 23,332.35 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సూచీ 23,350 వద్ద గరిష్టాన్ని, 23,158.45 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 1.61 శాతం లాభపడటంతో మిడ్ క్యాప్ స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 1.12 శాతం లాభంతో ముగిసింది.ఎన్ఎస్ఈలోని అన్ని సెక్టోరల్ ఇండెక్స్‌లు లాభాల్లో ముగియగా, నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ అత్యధికంగా 3.61 శాతం లాభపడింది. ఆ తర్వాత కన్జ్యూమర్ డ్యూరబుల్స్, బ్యాంకులు, ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు 2.51 శాతం వరకు లాభపడ్డాయి. -
గ్రీన్‌లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:34 సమయానికి నిఫ్టీ(Nifty) 101 పాయింట్లు పెరిగి 23,270కు చేరింది. సెన్సెక్స్(Sensex) 407 పాయింట్లు పుంజుకుని 76,423 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 104.21 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 74.52 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.19 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.38 శాతం లాభపడింది. నాస్డాక్ 0.87 శాతం ఎగబాకింది.ఇదీ చదవండి: మార్చిలో వాహన విక్రయాలు ఎలా ఉన్నాయంటే..అమెరికా ‘లిబరేషన్ డే’ అనిశ్చితి తారస్థాయికి చేరుకోవడంతో మంగళవారం దలాల్ స్ట్రీట్ స్టాక్‌లు దాదాపు 2 శాతం వరకు క్షీణించింది. ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాల విధింపు అమలు రోజు ఏప్రిల్ 2ను డొనాల్డ్ ట్రంప్ ‘అమెరికా లిబరేషన్ డే’గా అభివర్ణించారు. క్రూడాయిల్ ధరలు అయిదు వారాల గరిష్టానికి చేరుకోవడం, భారత ఈక్విటీ మార్కెట్ మార్చిలో భారీ ర్యాలీ తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం తదితర అంశాలూ ప్రతికూల ప్రభావం చూపాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
క్రాష్ మార్కెట్
ముంబై: అమెరికా ‘లిబరేషన్ డే’ అనిశ్చితి తారస్థాయికి చేరుకోవడంతో మంగళవారం దలాల్ స్ట్రీట్ దాదాపు 2% క్షీణించింది. ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాల విధింపు అమలు రోజు ఏప్రిల్ 2ను డొనాల్డ్ ట్రంప్ ‘అమెరికా లిబరేషన్ డే’గా అభివర్ణించారు. క్రూడాయిల్ ధరలు అయిదు వారాల గరిష్టానికి చేరుకోవడం, భారత ఈక్విటీ మార్కెట్ మార్చిలో భారీ ర్యాలీ తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం తదితర అంశాలూ ప్రతికూల ప్రభావం చూపాయి. ఫలితంగా సెన్సెక్స్ 1,390 పాయింట్లు క్షీణించి 76,025 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 354 పాయింట్లు పతనమై 23,166 వద్ద స్థిరపడింది. కొత్త ఆర్థిక సంవత్సరం(2025–26) తొలిరోజున స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు... ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల ప్రభావంతో రోజంతా నష్టాలతో ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,503 పాయింట్లు క్షీణించి 75,912 వద్ద, నిఫ్టీ 383 పాయింట్లు పతనమై 23,136 వద్ద కనిష్టాలు తాకాయి.⇒ టెలికమ్యూనికేషన్, ఆయిల్‌అండ్‌గ్యాస్ మినహా అన్ని రంగాల షేర్లూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా ఐటీ, ప్రైవేటు రంగ బ్యాంకుల షేర్లలో భారీ విక్రయాలు జరిగాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1% నష్టపోయింది. స్మాల్‌క్యాప్ సూచీ స్వల్పంగా 0.07 శాతం లాభపడింది. సూచీల వారీగా రియల్టీ 3%, కన్జూమర్ డ్యూరబుల్స్, ఐటీ 2.50%, ఫైనాన్షియల్ సర్విసెస్ 2%, బ్యాంకెక్స్ 1.50 శాతం నష్టపోయాయి. ⇒ సూచీల 2% మేర పతనంతో మంగళవారం రూ.3.5 లక్షల కోట్లు ఆవిరైపోయాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.409.43 లక్షల కోట్లు(4.78 ట్రిలియన్ డాలర్లు)కు దిగివచ్చింది. ⇒ వొడాఫోన్ ఐడియా షేరు 19% లాభపడి రూ.8.10 వద్ద స్థిరపడింది. స్పెక్ట్రమ్ వేలం బకాయిలు రూ.36,950 కోట్ల బదులుగా ఈక్విటీల రూపంలో వాటాను తీసుకునేందుకు కేంద్రం అంగీకరించిందంటూ వీఐ ఆదివారం ఎక్స్చేంజ్ కు సమాచారం ఇచ్చింది. దీంతో వీఐలో కేంద్రం వాటా 48.99 శాతానికి చేరనుంది. ఇంట్రాడేలో 26% ఎగసి రూ.8.56 వద్ద గరిష్టాన్ని తాకింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.9,210 కోట్లు పెరిగి రూ. 57,828 కోట్లకు చేరింది. ⇒సెన్సెక్స్ సూచీలోని 30 షేర్లలో ఇండస్ఇండ్ 5%, జొమాటో 0.27% మాత్రమే లాభపడ్డాయి. అత్యధికంగా హెచ్‌సీఎల్ టెక్ 4%, బజాజ్‌ఫిన్‌సర్వ్ 3.50%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3.35%, బజాజ్ ఫైనాన్స్3%, ఇన్ఫోసిస్ 3% నష్టపోయాయి. -
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 1,307.27 పాయింట్లు లేదా 1.69 శాతం నష్టంతో.. 76,107.66 వద్ద, నిఫ్టీ 339.50 పాయింట్లు లేదా 1.44 శాతం నష్టంతో.. 23,179.85 వద్ద నిలిచాయి.కనాని ఇండస్ట్రీస్, హెస్టర్ బయోసైన్సెస్, రేడియంట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్, ORCHASP, వోడాఫోన్ ఐడియా వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, వన్‌సోర్స్ స్పెషాలిటీ ఫార్మా, వైశాలి ఫార్మా, DRC సిస్టమ్స్ ఇండియా మొదలైన కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
కొత్త ఆర్థిక సంవత్సరం.. 1,160 పాయింట్లు పడిన సెన్సెక్స్
కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజు స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా పతనమవుతున్నాయి. బీఎస్ఈకి చెందిన సెన్సెక్స్ ఏకంగా 1160 పాయింట్లు పడిపోయి 76,261కు చేరింది. ఎన్ఎస్ఈ ఆధ్వర్యంలోని నిఫ్టీ 280 పాయింట్లు పడిపోయి 23,243 మార్కు వద్ద కదలాడుతుంది. దాంతో ఈరోజు మార్కెట్ సెషన్లో ప్రస్తుత సమయం వరకు మదుపర్ల సంపద దాదాపు రూ.4 లక్షల కోట్లు ఆవిరైంది. భారీగా మార్కెట్ సూచీల పతనానికిగల కారణాలను మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఇదీ చదవండి: తగ్గిన ఎల్పీజీ గ్యాస్ ధరలు2025 ఏప్రిల్ 2న అమెరికా సుంకాల విధింపు నిర్ణయాలపై స్పష్టత ఇవ్వనున్నట్లు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.టారిఫ్ విధానాలపై అనిశ్చితి నెలకొనడం వాణిజ్య యుద్ధ భయాలను రేకెత్తిస్తుంది. దాంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.అమెరికా భారత్‌ను నేరుగా టార్గెట్ చేయనప్పటికీ, ప్రపంచ మార్కెట్ సెంటిమెంట్ ప్రభావం భారత మార్కెట్లపై కనిపిస్తుంది.ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించడంతో సూచీలు పతనమవుతున్నాయి. ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్ మినహా చాలా రంగాల సూచీలు నష్టాల్లో కదలాడుతున్నాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా భారీగానే క్షీణించాయి.ఇటీవల మార్కెట్లు పడి క్రమంగా పుంజుకున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు పూనుకుంటున్నారు.అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలతో అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ తగ్గుతుంది. దాంతో దేశీయ దిగుమతులకు అధికంగా చెల్లింపులు చేయాల్సి వస్తుంది. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 67 పాయింట్లు నష్టపోయి 23,454కు చేరింది. సెన్సెక్స్(Sensex) 303 పాయింట్లు దిగజారి 77,113 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 104.1 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 74.97 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.19 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో మిశ్రమంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.55 శాతం లాభపడింది. నాస్డాక్ 0.14 శాతం దిగజారింది.ఎఫ్‌పీఐలు, రిటైలర్ల పెట్టుబడుల దన్నుతో ఒక్క మార్చి నెలలోనే మార్కెట్లు భారీగా టర్న్అరౌండ్ అయ్యాయి. సెన్సెక్స్ 4,217 పాయింట్లు(5.8 శాతం) ఎగసింది. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3,555 పాయింట్లు(8.3%) జంప్‌చేస్తే, మిడ్‌క్యాప్ 2,939 పాయింట్లు(7.6%) బలపడింది. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు తలెత్తినప్పటికీ దేశీయంగా సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు, విధానాల కొనసాగింపుపై అంచనాలు ఇన్వెస్టర్లలో మార్కెట్లపట్ల విశ్వాసాన్ని పెంచాయి. ఫలితంగా గతేడాది పలు ఆటుపోట్ల మధ్య మార్కెట్లు నికరంగా లాభపడ్డాయి.ఇదీ చదవండి: రెండేళ్లలో తొలిసారి ధరలు పెంపుట్రంప్ సుంకాలపై ఏప్రిల్ 2న మరింత స్పష్టత రాబోతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సుంకాల ప్రభావం ఆటో, ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాలపై ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. అమెరికా టారిఫ్‌ల వార్తలు మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీస్తున్నాయి. దీనికి తోడు ముడిచమురు ధరలు పెరగడం, అమెరికా డాలర్ బలపడటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) ఇటీవల నికర కొనుగోలుదారులుగా మారడం కొంత కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ప్రతికూలంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY25) చివరి ట్రేడింగ్ సెషన్లో భారతీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు శుక్రవారం ప్రతికూలంగా ముగిశాయి. 30 షేర్ల సెన్సెక్స్ 191.51 పాయింట్లు లేదా 0.25 శాతం క్షీణించి 77,414.92 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 కూడా 72.60 పాయింట్లు లేదా 0.31 శాతం క్షీణించి 23,519.35 వద్ద ముగిసింది.విస్తృత మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.32 శాతం, 0.15 శాతం నష్టాలతో ముగిశాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ 50 ఆర్థిక సంవత్సరం దాదాపు 5 శాతం చొప్పున లాభాలతో ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 5.4 శాతం, 7.48 శాతం లాభాలను నమోదు చేశాయి. శుక్రవారం ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, ప్రైవేట్ బ్యాంకులు, ఎంపిక చేసిన హెల్త్‌కేర్ మినహా మిగతా అన్ని రంగాల సూచీలు ఎన్ఎస్ఈలో నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.76 శాతం నష్టపోగా, విప్రో, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, హెచ్‌సీఎల్ టెక్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ షేర్లు నష్టపోయాయి.మార్కెట్లలో అస్థిరతను కొలిచే ఫియర్ ఇండెక్స్ ఇండియా వీఐఎక్స్ శుక్రవారం 4.37 శాతం పెరిగి 12.72 పాయింట్ల వద్ద స్థిరపడింది. రేపటి నుంచి వరుసగా మూడు స్టాక్‌మార్కెట్లు మూత పడనున్నాయి. శని, ఆదివారాలు వారంతపు సెలవులు కాగా మార్చి 31న సోమవారం రంజాన్ పండుగ కారణంగా సెలవు ఉంది. దీంతో 2025 ఏప్రిల్ 1 అంటే కొత్త ఆర్థిక సంవత్సరంలో తిరిగి భారత మార్కెట్లలో ట్రేడింగ్ ప్రారంభమవుతుంది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ఆటో షేర్లపై ట్రంప్ దెబ్బ
ఇండియన్ బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు గురువారం లాభాల్లో ముగిశాయి. 30 షేర్ల సెన్సెక్స్ 317.93 పాయింట్లు (0.41 శాతం) పెరిగి 77,606.43 వద్ద స్థిరపడింది. ఈ రోజు సూచీ 77,747.46-77,082.51 రేంజ్లో ట్రేడ్ అయింది. అలాగే నిఫ్టీ 50 సూచీ 105.10 పాయింట్లు (0.45 శాతం) లాభంతో 23,591.95 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 ఇంట్రాడేలో 23,646.45 పాయింట్ల వద్ద గరిష్టాన్ని నమోదు చేయగా, ఇంట్రాడే కనిష్టాన్ని 23,412.20 వద్ద నమోదు చేసింది.బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, లార్సెన్ అండ్ టూబ్రో, బజాజ్ ఫైనాన్స్ షేర్లు 2.85 శాతం వరకు లాభాలతో టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. అదేసమయంలో టాటా మోటార్స్, సన్ ఫార్మా, హిందుస్థాన్ యూనిలీవర్, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ షేర్లు 5.38 శాతం వరకు నష్టపోయాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 1.15 శాతం లాభపడటంతో స్మాల్ క్యాప్ షేర్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ కూడా 0.37 శాతం లాభంతో స్థిరపడింది. నిఫ్టీ ఆటో, ఫార్మా మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు గురువారం లాభాల్లో ముగిశాయి. అమెరికాలో తయారు చేయని అన్ని దిగుమతి కార్లపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ఆటో షేర్లు అమ్మకాలను చవిచూశాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్ గురువారం 1.04 శాతం నష్టంతో స్థిరపడింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేతృత్వంలోని నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 2.50 శాతం లాభంతో స్థిరపడింది. -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే గురువారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:43 సమయానికి నిఫ్టీ(Nifty) 55 పాయింట్లు పెరిగి 23,541కు చేరింది. సెన్సెక్స్(Sensex) 178 పాయింట్లు ఎగబాకి 77,469 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 104.33 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 73.14 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.34 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 1.12 శాతం నష్టపోయింది. నాస్డాక్ 2.04 శాతం దిగజారింది.ఇదీ చదవండి: మనదే విని‘యోగం’!అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇటీవల భవిష్యత్తులో కీలక వడ్డీరేట్ల కోత ఉంటుందనే సంకేతాలిచ్చిన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేట్ల కోతపై ఇన్వెస్టర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) క్రమంగా విక్రయాలు తగ్గిస్తున్నారు. ఇది మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచుతుంది. భారత రూపాయి స్థిరత్వం ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఏప్రిల్ 2న ట్రంప్ ఇండియాపై విధించనున్న ప్రతికార సుంకాలపై నిర్ణయం వెలువరించనున్నట్లు తెలిపారు. దాంతో మార్కెట్ వర్గాలు దీన్ని పరిశీలించే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
స్వల్ప లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 757.55 పాయింట్లు లేదా 0.97 శాతం నష్టంతో 77,259.64 వద్ద, నిఫ్టీ 204.10 పాయింట్లు లేదా 0.86 శాతం నష్టంతో 23,464.55 వద్ద నిలిచాయి.టూరిజం ఫైనాన్స్ కార్ప్ ఆఫ్ ఇండియా, కాప్రి గ్లోబల్ క్యాపిటల్, జెనస్ పేపర్ & బోర్డ్, పిల్ ఇటాలికా లైఫ్‌స్టైల్, SMS లైఫ్ సైన్సెస్ ఇండియా వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో ఉన్నాయి. NDL వెంచర్స్, సలాసర్ టెక్నో ఇంజనీరింగ్, BLB షేర్, లోటస్ ఐ కేర్ హాస్పిటల్ వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే బుధవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:21 సమయానికి నిఫ్టీ(Nifty) 31 పాయింట్లు పెరిగి 23,693కు చేరింది. సెన్సెక్స్(Sensex) 38 పాయింట్లు ఎగబాకి 78,045 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 104.25 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 72.57 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.33 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.16 శాతం లాభపడింది. నాస్డాక్ 0.46 శాతం ఎగబాకింది.ఇదీ చదవండి: ఎన్పీఏల వేలానికి ప్రత్యేక పోర్టల్అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇటీవల భవిష్యత్తులో కీలక వడ్డీరేట్ల కోత ఉంటుందనే సంకేతాలిచ్చిన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేట్ల కోతపై ఇన్వెస్టర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) క్రమంగా విక్రయాలు తగ్గిస్తున్నారు. ఇది మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచుతుంది. భారత రూపాయి స్థిరత్వం ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తుంది. బ్యాంకింగ్, ఎనర్జీ షేర్లు, ఐటీ షేర్లు ఇటీవలి ర్యాలీకి నాయకత్వం వహిస్తున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఐటీ షేర్ల అండ.. ఏడోరోజూ ముందడుగు
ముంబై: ఐటీ రంగ షేర్ల అండతో స్టాక్ సూచీల ర్యాలీ ఏడోరోజూ కొనసాగింది. అయితే లాభాల స్వీకరణతో ఆరంభ లాభాలు హరించుకుపోయాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే 757 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్ చివరికి 33 పాయింట్లు పరిమిత లాభంతో 78 వేల స్థాయిపైన 78,017 వద్ద స్థిరపడింది. నిఫ్టీ పది పాయింట్ల స్వల్ప లాభంతో 23,669 వద్ద నిలిచింది. ఐటీ, ప్రైవేటు రంగ బ్యాంకు షేర్లు మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.ఇప్పటికీ అధిక విలువల వద్ద ట్రేడవుతున్న చిన్న, మధ్య తరహా కంపెనీల షేర్లలో విక్రయాలు చోటుచేసుకున్నాయి. బీఎస్ఈ స్మాల్ సూచీ 1.63%, మిడ్ క్యాప్ ఇండెక్సు 1.13 శాతం నష్టపోయాయి. ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి రానున్న ప్రతీకార సుంకాల్లో మినహాయింపు ఉండొచ్చని ట్రంప్ సంకేతాలతో అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. ⇒ అధిక విలువ కలిగిన షేర్లలో ఇటీవల దిద్దుబాటు కారణంగా ఐటీ షేర్లకు డిమాండ్ నెలకొంది. పెర్సిస్టెంట్ 2.60%, కో ఫోర్జ్ 2.25% ర్యాలీ చేశాయి. ఎంఫసిస్, ఇన్ఫోసిస్ 1.50% పెరిగాయి. హెచ్‌సీఎల్ టెక్ 1%, టీసీఎస్, విప్రో షేర్లు అరశాతం మేర లాభపడ్డాయి. ⇒ ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లు భారీ నష్టాలు చవిచూశాయి. సెంట్రల్ బ్యాంక్ ఇండియా, యూకో బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3–5% క్షీణించాయి. ⇒ వచ్చే ఆర్థిక సంవత్సరంలో డిమాండ్ ఊపందుకుంటుందనే అంచనాలతో బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ సిమెంట్ రంగ షేర్లకు ‘బై’ కేటాయించింది. అ్రల్టాటెక్ 3.50%, ఏసీసీ, దాల్మియా భారత్, అంబుజా సిమెంట్స్ 3% పెరిగాయి. -
వరుస లాభాలకు బ్రేక్.. స్థిరంగా ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం స్థిరంగా ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 10 పాయింట్లు లాభపడి 23,668 వద్దకు చేరింది. సెన్సెక్స్ 32 పాయింట్లు ఎగబాకి 78,017 వద్దకు చేరింది. ఇటీవల వరుసగా పెరిగిన మార్కెట్ సూచీలు ఈరోజు ఒడిదొడుకులకు లోనయింది. భారీగా పెరిగిన మార్కెట్ల నుంచి ఇన్వెస్టర్ల మంగళవారం లాభాలు స్వీకరించినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.సెన్సెక్స్ 30 సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్‌యూఎల్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్ స్టాక్‌లు లాభాల్లో ముగిశాయి. జొమాటో, ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, ఎం అండ్ ఎం, ఎస్బీఐ, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, టైటాన్, మారుతీ సుజుకి, పవర్‌గ్రిడ్, ఎల్ అండ్ టీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా మోటర్స్ స్టాక్‌లు నష్టపోయాయి.ఇదీ చదవండి: ఒకే ఏడాదిలో 1800 కోట్ల గంటలు వేచి ఉన్నారట!ఈ రోజు మార్కెట్ల ఒడిదొడుకులకుగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇన్వెస్టర్లు ఇటీవలి లాభాలను స్వీకరించేందుకు పూనుకున్నారు. ఇది అమ్మకాల ఒత్తిడికి దారితీసింది. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ప్రకటనలపై ఆందోళనలు పెరిగాయి. ఏప్రిల్ 2న ఏమేరకు టారిఫ్ నిర్ణయాలుంటాయోనని పెట్టుబడిదారులు ముందునుంచే అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఒక్కరోజులో 1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 307 పాయింట్లు లాభపడి 23,658 వద్దకు చేరింది. సెన్సెక్స్ 1078 పాయింట్లు ఎగబాకి 77,984 వద్దకు చేరింది.సెన్సెక్స్ 30 సూచీలో ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఐ, టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీసీ, రియలన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ సుజుకీ, టీసీఎస్, టాటా మోటార్స్, ఐటీసీ స్టాక్‌లు లాభాల్లో ముగిశాయి. టైటాన్, ఇండస్ ఇండ్ బ్యాంక్, జొమాటో, ఎం అండ్ ఎం, భారతీ ఎయిర్టెల్, సన్‌ఫార్మా స్టాక్‌లు నష్టపోయాయి.ఇదీ చదవండి: 5జీ విస్తరణపై నోకియా నివేదిక.. కీలకాంశాలు..యూఎస్ టారిఫ్ వార్తలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు లేదా అమ్మకాలతోపాటు.. డాలరు ఇండెక్స్, ముడిచమురు ధరల కదలికలపై ఈ వారం ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నారు. గత వారం అమ్మకాల బాట వీడి విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు దిగారు. అయితే దేశీ ఫండ్స్ విక్రయాలవైపు చూపు సారించాయి. ఇటీవల ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు కొంతమేర బలహీనపడింది. ఈ నేపథ్యంలో గత వారం మార్కెట్లు జోరందుకున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. యూఎస్ మార్కెట్లు సైతం పుంజుకున్నప్పటికీ రానున్న రోజుల్లో హెచ్చుతగ్గులు ఎదురుకావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. టారిఫ్ సంబంధిత అనిశ్చితి సెంటిమెంటును ప్రభావితం చేయడంతో మిశ్రమ ప్రపంచ మార్కెట్ కదలికల మధ్య భారత బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 లాభాలతో ప్రారంభమయ్యాయి.ప్రారంభ సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 496.09 పాయింట్లు లేదా 0.65 శాతం లాతంతో 77,401.60 వద్ద, నిఫ్టీ 50 124.70 పాయింట్లు లేదా 0.53 శాతం లాభంతో 23,475.10 వద్ద ఉన్నాయి. మార్కెట్ ప్రారంభమైన తర్వాత సెన్సెక్స్‌లో పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, ఎల్అండ్టీ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మార్కెట్ ప్రారంభం అనంతరం బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ 1 శాతానికి పైగా పెరిగాయి.అంతర్జాతీయ మార్కెట్ కదలికలు, వాణిజ్య సుంకాల ఆందోళనలు, విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల చర్యలతో భారత స్టాక్ మార్కెట్లు నడిచే అవకాశం ఉంది. ఈ రోజు విడుదల కానున్న మార్చి నెలకు సంబంధించిన ఇండియా మాన్యుఫాక్చరింగ్, సర్వీసెస్, కాంపోజిట్ పీఎంఐ ఫ్లాష్ గణాంకాలపై ఇన్వెస్టర్లు ఓ కన్నేసి ఉంచనున్నారు.విదేశీ పెట్టుబడులు పుంజుకోవడం, ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో భారత రూపాయి వరుసగా తొమ్మిదో సెషన్ లోనూ తన విజయ పరంపరను కొనసాగించింది. బ్లూమ్‌బర్గ్ డేటా ప్రకారం.. శుక్రవారం ముగింపు 85.98 తో పోలిస్తే యూఎస్ డాలర్‌తో పోలిస్తే 4 పైసలు బలపడి 85.94 వద్ద ప్రారంభమైంది. -
వారంలో రూ.22 లక్షల కోట్ల సంపద
స్టాక్ మార్కెట్లు ఇటీవల భారీగా పతనమై చిన్నగా కొలుకుంటున్నాయి. ఈ క్రమంలో గడిచిన వారంలో వచ్చిన మార్కెట్ ర్యాలీ నాలుగేళ్లలో ఎప్పుడూ రాలేదని విశ్లేషకులు చెబుతున్నారు. కేవలం వారం రోజుల్లోనే సెన్సెక్స్ 3,000 పాయింట్లు ఎగబాకడంతో భారత స్టాక్ మార్కెట్ గణనీయమైన ర్యాలీని చూసింది. ఈ బుల్లిష్ రన్‌తో ఇన్వెస్టర్ల సంపద అదనంగా రూ.22 లక్షల కోట్లు పెరిగింది. ఇటీవల కాలం వరకు భారీగా పతనమైన మార్కెట్లు వారంలో ఇంతటి ర్యాలీని అందించడంతో లాభాలను నమోదు చేసుకోవడానికి ఇది సరైన సమయమా లేదా మరింత కాలం వేచి చూడాలా అనే అనుమానం వ్యక్తం అవుతుంది. దీనిపై నిపుణులు కింది విధంగా సూచిస్తున్నారు.మార్కెట్ ర్యాలీకి కారణాలుసెన్సెక్స్ ఇటీవల పుంజుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, ద్రవ్యోల్బణ ఆందోళనలు తగ్గుముఖం పట్టడం, వచ్చే త్రైమాసిక ఫలితాల్లో బలమైన కార్పొరేట్ రాబడులుంటాయనే అంచనాలు మార్కెట్ సెంటిమెంట్‌కు ఊతమిచ్చాయి. దీనికి తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల తీరు ర్యాలీకి మరింత ఊపునిచ్చాయి. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఐటీ, బ్యాంకింగ్, కన్జ్యూమర్ గూడ్స్ వంటి రంగాలు ఈ పెరుగుదలకు కీలకంగా దోహదపడ్డాయి.స్టాక్స్ అమ్మాలా? ఉంచాలా?మార్కెట్లోని స్టాక్స్‌ను అమ్మి లాభాలు బుక్ చేయాలా లేదా మరిన్ని లాభాలను ఆశించి పెట్టుబడులను నిలుపుకోవాలా అనేది ప్రతి ఇన్వెస్టర్ మదిలో మెదులుతున్న ప్రశ్న. దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలంటే కింది అంశాలను పరిగణనలోని తీసుకోవాలి.మార్కెట్ వాల్యుయేషన్: మార్కెట్ ప్రస్తుత వాల్యుయేషన్ కీలక అంశం. చారిత్రాత్మక కొలమానాలతో పోలిస్తే కొన్ని స్టాక్స్ ఇప్పటికీ అధిక వ్యాల్యూయేషన్లలోనే ట్రేడ్ అవుతున్నాయి. వీటిలో దిద్దుబాటు ఉండవచ్చు. అటువంటి సందర్భాల్లో పాక్షికంగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో కూడా ఇలాంటి స్టాక్స్ ఉంటే వాటిని ట్రాక్ చేయడం చాలా ముఖ్యం.పెట్టుబడి లక్ష్యాలు: ఇన్వెస్టర్లు తమ నిర్ణయాలను దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా మార్చుకోవాలి. భారతదేశం బలమైన ఆర్థిక మూలాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టే వారు మరింత ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుంది. తాత్కాలికంగా వచ్చే ర్యాలీకి ప్రభావితం చెంది ట్రేడ్‌లో నిర్ణయం తీసుకోకూడదు.సెక్టార్-స్పెసిఫిక్ అనాలిసిస్: ఏ ర్యాలీలోనైనా అన్ని రంగాలకు చెందిన స్టాక్స్ ఒకేలా పెరగవు..తగ్గవు. సెక్టోరల్ వారీగా స్టాక్స్‌ను విశ్లేషించి ప్రస్తుతం మెరుగైన రాబడినిస్తున్న వాటిని కొనసాగించాల్సి ఉంటుంది.అంతర్జాతీయ అంశాలు: అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలు, వడ్డీరేట్ల మార్పులు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు మార్కెట్ ధోరణులను ప్రభావితం చేస్తాయి. ఈ కారకాలపై అప్డేట్లను నిత్యం పరిశీలిస్తుండాలి.డైవర్సిఫికేషన్: ఆకస్మికంగా మార్కెట్లో వచ్చే ర్యాలీ మీ పోర్ట్‌ఫోలియోను సమీక్షించడానికి, సరైన వైవిధ్యతను నిర్ధారించడానికి మంచి సమయం. రిస్క్ ఉన్న స్టాక్స్‌ను అమ్మేయడానికి ఈ ర్యాలీ తోడ్పడుతుంది. మంచి స్టాక్స్‌ను కొనసాగించేందుకు దోహదం చేస్తుంది.ఇదీ చదవండి: ఏఐతోనే 90 శాతం కోడింగ్.. కానీ..మార్కెట్ ర్యాలీలో స్టాక్స్ అమ్మాలా లేదా ఉంచాలా అనేది పెట్టుబడిదారుల దీర్ఘకాలిక లక్ష్యాలు, ఆర్థిక లక్ష్యాలు, పెట్టుబడి పరిధితో సహా వారి వ్యక్తిగత పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సమయాల్లో ఫైనాన్షియల్ అడ్వైజర్‌తో సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోవాలి. -
మళ్లీ మంచి లాభాలు.. స్టాక్ మార్కెట్‌కు ఇదే బెస్ట్ వీక్!
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మళ్లీ మంచి లాభాలతో ముగిశాయి. బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు ర్యాలీని వరుసగా ఐదో ట్రేడింగ్ సెషన్‌కు పొడిగించాయి. ఈ ప్రక్రియలో నాలుగేళ్లలో బెస్ట్ వీక్‌ను నమోదు చేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 77,042 వద్ద గరిష్టానికి చేరుకుంది. చివరికి 557 పాయింట్ల లాభంతో 76,906 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ బెంచ్‌మార్క్ ఈ వారంలో 3,077 శాతం లేదా 4.17 పాయింట్లు పెరిగింది.నిఫ్టీ 160 పాయింట్ల లాభంతో 23,350 వద్ద ముగిసింది. నిఫ్టీ ఈ వారం 4.26 శాతం లేదా 953 పాయింట్లు పెరిగింది. 2021 ఫిబ్రవరి 7 తర్వాత ఇది గరిష్ట వారపు లాభం. సెన్సెక్స్ 30 షేర్లలో ఎన్టీపీసీ శుక్రవారం అత్యధికంగా 3.3 శాతం లాభపడింది. అదేసమయంలో బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, లార్సెన్ అండ్ టుబ్రో, కోటక్ బ్యాంక్, నెస్లే ఇండియా, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు కూడాలాభాల్లో ముగిశాయి. మరోవైపు మహీంద్రా అండ్ మహీంద్రా అత్యధికంగా 1 శాతానికి పైగా పడిపోయింది. టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టైటాన్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు కూడా నష్టాలను చూశాయి.విస్తృత మార్కెట్లో బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1 శాతానికి పైగా, స్మాల్‌క్యాప్ 2 శాతానికి పైగా లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే బీఎస్ఈ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 2 శాతానికి పైగా పెరిగింది. పవర్, హెల్త్ కేర్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ లు లాభపడ్డాయి. మరోవైపు బీఎస్ఈ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ 0.8 శాతం, మెటల్ ఇండెక్స్ 0.4 శాతం నష్టపోయాయి. -
వరుస లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:52 సమయానికి నిఫ్టీ(Nifty) 60 పాయింట్లు పెరిగి 23,251కు చేరింది. సెన్సెక్స్(Sensex) 157 పాయింట్లు ఎగబాకి 76,513 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 103.98 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 72.32 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.25 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.22 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.33 శాతం దిగజారింది.ఇదీ చదవండి: రూ.10 లక్షల కోట్ల దివాలా పరిష్కారాలుఈ ఏడాది రెండుసార్లు కీలక వడ్డీరేట్ల కోతకు కట్టుబడి ఉన్నట్లు ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు ఇచ్చింది. ఓ వైపు ట్రంప్ వాణిజ్య భయాలు ఉన్నా ఫెడ్ రేట్ల కోత ఉంటుందని సంకేతాలు స్పష్టం అవ్వడంతో ప్రపంచ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. అమెరికా బాండ్లపై రాబడులు తగ్గడం, డాలర్ బలహీనత అంశాలు కలిసొచ్చాయి. ఐటీతో పాటు నిఫ్టీలోని ప్రముఖ స్టాక్‌లు లాభాల్లో కదలాడుతున్నాయి. నాలుగు రోజుల వరుస ర్యాలీతో స్టాక్ మార్కెట్లో రూ.17.43 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.408.61 లక్షల కోట్ల (4.73 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ఎయిర్టెల్ మెరుపులు
బెంచ్ మార్క్ భారతీయ ఈక్విటీ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. వివిధ రంగాలలో కొనుగోళ్లకు దారితీయడంతో 1 శాతానికి పైగా లాభపడ్డాయి. 30 షేర్ల సెన్సెక్స్ 899.01 పాయింట్లు లేదా 1.19 శాతం పెరిగి 76,348.06 వద్ద స్థిరపడింది. ఈ సూచీ ఈరోజు 76,456.25-75,684.58 రేంజ్లో ట్రేడ్ అయింది.ఇక నిఫ్టీ 50 కూడా 283.05 పాయింట్లు (1.24 శాతం) పెరిగి 23,190.65 వద్ద ముగిసింది. ఈ ఇండెక్స్ 23,216.70 వద్ద రోజు గరిష్టాన్ని, 22,973.95 వద్ద కనిష్టాన్ని తాకింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.64 శాతం, 0.70 శాతం లాభపడ్డాయి.ఎన్ఎస్ఈలోని అన్ని సెక్టోరల్ ఇండెక్స్‌లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ, మెటల్, మీడియా, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్ ఇండెక్స్‌లు 1 శాతానికి పైగా లాభపడ్డాయి.సెన్సెక్స్ లోని 30 షేర్లలో ఈ రోజు కేవలం మూడు మాత్రమే నష్టాలను చవిచూశాయి. భారతీ ఎయిర్ టెల్ 4 శాతం లాభంలో టాప్ గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటు టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలీవర్, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు కూడా రాణించాయి. భారతీ ఎయిర్ టెల్ షేర్లు నిఫ్టీలోనూ మెరుపులు మెరిపించింది. నిఫ్టీ 50 షేర్లలో 4 మాత్రమే నష్టాలను చూశాయి. -
నిఫ్టీ @ 23,000 మార్కు.. లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్ ముగింపుతో పోలిస్తే గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:37 సమయానికి నిఫ్టీ(Nifty) 161 పాయింట్లు పెరిగి 23,068కు చేరింది. సెన్సెక్స్(Sensex) 537 పాయింట్లు ఎగబాకి 75,981 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 103.38 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 71.21 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.24 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 1.08 శాతం పెరిగింది. నాస్డాక్ 1.41 శాతం పుంజుకుంది.ఇదీ చదవండి: ‘ఇండస్‌ఇండ్‌లో వాటా పెంపునకు అనుకూల సమయం’తాజా పాలసీ సమీక్షలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించేందుకే నిర్ణయించింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు మరోసారి 4.25–4.5 శాతంవద్దే కొనసాగనున్నాయి. ఛైర్మన్ జెరోమ్ పావెల్ అధ్యక్షతన రెండు రోజులపాటు సమావేశమైన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) గత సమీక్షలోనూ యథాతథ పాలసీ అమలుకే ఓటు వేసిన సంగతి తెలిసిందే. భారతదేశంలో ఆర్బీఐ గత మానిటరీ పాలసీ సమావేశంలో ఐదేళ్లలో మొదటిసారి రేటు తగ్గింపును అమలు చేసింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.25 శాతానికి చేర్చింది. ఫెడ్ తాజా నిర్ణయాల నేపథ్యంలో ఏప్రిల్ 7-9 వరకు జరిగే ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశంలో ఏమేరకు వడ్డీరేట్లపై చర్యలు తీసుకొంటారో మార్కెట్ వర్గాలు పరిశీలించే అవకాశం ఉంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్లు.. హ్యాట్రిక్..
భారతీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు వరుసగా మూడో సెషన్లో లాభాలతో ముగిశాయి. బుధవారం ఇంట్రాడేలో 75,568.38 పాయింట్ల గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ 147.79 పాయింట్లు (0.20 శాతం) పెరిగి 75,449.05 వద్ద స్థిరపడింది.అలాగే నిఫ్టీ 73.30 పాయింట్లు (0.32 శాతం) పెరిగి 22,907.60 వద్ద ముగిసింది. బుధవారం ఈ సూచీ 22,940.70 నుంచి 22,807.95 శ్రేణిలో ట్రేడ్ అయింది.శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, అపోలో హాస్పిటల్స్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు 3.91 శాతం వరకు లాభపడ్డాయి. నిఫ్టీ 50లో టెక్ మహీంద్రా, బ్రిటానియా, టీసీఎస్, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా షేర్లు 2.32 శాతం వరకు నష్టపోయాయి.నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు 2 శాతానికి పైగా లాభపడ్డాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, ఐటీ మినహా ఎన్ఎస్ఈలోని అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. -
స్థిరంగా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్ ముగింపుతో పోలిస్తే బుధవారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:37 సమయానికి నిఫ్టీ(Nifty) 19 పాయింట్ నష్టపోయి 22,817కు చేరింది. సెన్సెక్స్(Sensex) 58 పాయింట్లు దిగజారి 75,241 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 103.3 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 70.38 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.29 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 1.07 శాతం నష్టపోయింది. నాస్డాక్ 1.71 శాతం దిగజారింది.ఇదీ చదవండి: విమాన ప్రయాణాలు మరింత భారంజాతీయ, అంతర్జాతీయ సానుకూల సంకేతాల ప్రభావంతో మంగళవారం దేశీయ స్టాక్ సూచీలు ఒకటిన్నర శాతం ర్యాలీ అయ్యాయి. అమెరికా కరెన్సీ డాలర్ బలహీనత, క్రూడాయిల్ ధరలు దిగిరావడం వంటి అంశాలూ కలిసొచ్చాయి. గడిచిన రెండు రోజుల వరుస లాభాలతో స్టాక్ మార్కెట్లో రూ.8.67 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.399 లక్షల కోట్లకు చేరుకుంది. డాలర్ మారకంలో రూపాయి విలువ 25 పైసలు పెరిగి 86.56 వద్దకు చేరింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం లాభాల బాటలో పయనమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాలను చవి చూశాయి. సెన్సెక్స్ 1,131.30 పాయింట్లు లేదా 1.53 శాతం లాభంతో 75,301.26 వద్ద, నిఫ్టీ 325.55 పాయింట్లు లేదా 1.45 శాతం లాభంతో 22,834.30 వద్ద నిలిచాయి.ఉత్తమ్ షుగర్ మిల్స్, వన్ మొబిక్విక్ సిస్టం, టీటీ, సింధు ట్రేడ్స్ లింక్స్, గుల్షన్ పాలియోల్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. Nacl ఇండస్ట్రీస్, పసుపతి అక్రిలాన్, ఇన్నోవానా థింక్లాబ్స్, టెసిల్ కెమికల్స్ అండ్ హైడ్రోజన్, మెడికో రెమెడీస్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
లాభాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం గడిచిన సెషన్‌లోని ముగింపుతో పోలిస్తే లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:19 సమయానికి నిఫ్టీ(Nifty) 106 పాయింట్ పెరిగి 22,612కు చేరింది. సెన్సెక్స్(Sensex) 321 పాయింట్లు పెరిగి 74,487 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 103.52 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 71.25 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.28 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.65 శాతం పెరిగింది. నాస్డాక్ 0.31 శాతం పుంజుకుంది.ఇదీ చదవండి: 13 రోజుల్లో కార్ల ధరలు పెంపు..స్టాక్ మార్కెట్ స్థిరీకరణలో భాగంగా సోమవారం మిడ్ క్యాప్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించగా, చిన్న షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. డాలర్ ఇండెక్స్ బలహీనత, దేశీయ ఈక్విటీ మార్కెట్లో కొనుగోళ్ల దన్నుతో డాలర్ మారకంలో రూపాయి విలువ 24 పైసలు పెరిగి 86.81 వద్ద స్థిరపడింది. డెరివేటివ్స్ పోర్ట్‌ఫోలియోలో అవకతవకల నేపథ్యంలో ‘బ్యాంకు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంది’ అంటూ ఆర్బీఐ భరోసాతో ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు కోలుకుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 111 పాయింట్లు లాభపడి 22,508 వద్దకు చేరింది. సెన్సెక్స్ 341 పాయింట్లు ఎగబాకి 74,169 వద్దకు చేరింది.సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫిన్సర్వ్, ఎం అండ్ ఎం, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్ అండ్ సెబ్, జొమాటో, ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్‌లు లాభాల్లో ముగిశాయి. ఐటీసీ, నెస్లే, ఎస్బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, ఎల్ అండ్ టీ, టీసీఎస్, పవర్ గ్రిడ్ స్టాక్‌లు భారీగా నష్టపోయాయి.మార్కెట్ లాభాలకు కొన్ని కారణాలు..అమెరికా ఈక్విటీలు పుంజుకోవడం, దేశీయ వినియోగాన్ని పెంచడానికి చైనా తాజా చర్యలను ప్రకటించడం ప్రపంచ సెంటిమెంట్‌ను మెరుగుపరిచింది. ఆటో, ఫైనాన్షియల్, బ్యాంకింగ్ రంగ షేర్లలో లాభాలు ర్యాలీకి గణనీయంగా దోహదం చేశాయి. చైనా విధానపరమైన చర్యలతో నడిచే ఆసియా మార్కెట్లలో సానుకూలత నెలకొనడంతో ఇండియన్ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిసినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: భారత్‌లో యాపిల్-గూగుల్ భాగస్వామ్యం..?(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. దూసుకెళ్తున్న ఇండస్ఇండ్ బ్యాంక్
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రశాంతంగా ప్రారంభమైన తర్వాత బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీలు బలపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 73,830 వద్ద ప్రారంభమైంది. తరువాత ఆటో, ఫైనాన్షియల్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో పుంజుకుంది.ఉదయం 9.25 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 412 పాయింట్ల లాభంతో 72,245 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ కూడా 135 పాయింట్లు లాభపడి 22,533 వద్ద ట్రేడవుతోంది.సెన్సెక్స్ 30 షేర్లలో ఇండస్ ఇండ్ బ్యాంక్ దాదాపు 5 శాతం లాభపడింది. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా 2 - 3 శాతం చొప్పున లాభపడ్డాయి. మరోవైపు నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. విస్తృత మార్కెట్లో, బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.8 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ సోమవారం ఇంట్రాడేలో 0.5 శాతం పెరిగింది. -
నష్టాల్లో మార్కెట్లు.. మళ్లీ ముంచిన ‘ఇండస్ఇండ్ బ్యాంక్’
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. లాంగ్ వీకెండ్ కు ముందు ఇన్వెస్టర్లు కొత్త పొజిషన్లకు దూరంగా ఉండటంతో బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా, డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధానాలపై అనిశ్చితి నెలకొనడంతో ఇన్వెస్టర్లు పక్కకు తప్పుకోవడానికే మొగ్గుచూపారు. కాగా హోలీ పండుగ కారణంగా శుక్రవారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ట్రేడింగ్‌కు క్లోజ్ కానున్నాయి.బీఎస్ఈ సెన్సెక్స్ గురువారం ప్రారంభ ట్రేడింగ్ లో 74,401 వద్ద గరిష్టానికి చేరుకున్నప్పటికీ, కొద్దిసేపటికే లాభాలను ఆర్జించింది. ఆటో, ఐటీ, ఎంపిక చేసిన బ్యాంకింగ్ షేర్లలో కొనసాగిన అమ్మకాల ఒత్తిడితో బీఎస్ఈ బెంచ్ మార్క్ రెడ్‌లోకి జారి 630 పాయింట్ల నష్టంతో 73,771 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 201 పాయింట్ల నష్టంతో 73,829 వద్ద ముగిసింది. ఈ క్రమంలో సెన్సెక్స్ 504 పాయింట్ల నష్టంతో వారాన్ని ముగించింది.ఇక నిఫ్టీ 22,558 వద్ద గరిష్ట స్థాయి నుంచి 22,377 వద్ద కనిష్టానికి పడిపోయి, చివరకు 73 పాయింట్ల నష్టంతో 22,397 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఈ వారంలో 156 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ 30 షేర్లలో టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ దాదాపు 2 శాతం చొప్పున నష్టపోయాయి. జొమాటో, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు కూడా నష్టపోయాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ షేర్లు 0.5 శాతానికి పైగా లాభాలను చూశాయి.మరోవైపు విస్తృత సూచీలు కూడా ఈరోజు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.8 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం క్షీణించాయి. బీఎస్ఈలో ట్రేడైన 4,105 షేర్లలో 60 శాతం లేదా 2,449 షేర్లు నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే బీఎస్ఈ రియాల్టీ సూచీ 1.8 శాతం నష్టపోయింది. గోద్రెజ్ ప్రాపర్టీస్, ఒబెరాయ్ రియల్టీ, లోధా, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, ఫీనిక్స్ షేర్లు 2 శాతానికి పైగా నష్టపోయాయి. -
స్థిరంగా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నిన్నటి ముగింపుతో పోలిస్తే గురువారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:34 సమయానికి నిఫ్టీ(Nifty) 10 పాయింట్ పెరిగి 22,484కు చేరింది. సెన్సెక్స్(Sensex) 83 పాయింట్లు పెరిగి 74,124 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 103.59 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 70.94 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.29 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.49 శాతం పెరిగింది. నాస్డాక్ 1.22 శాతం పుంజుకుంది.ఇదీ చదవండి: మూడేళ్లలో రూ.52 లక్షల కోట్ల పెట్టుబడులు..అమెరికా ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు రేకెత్తడంతో నిన్నటి మార్కెట్ సెషన్లో ఐటీ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అంతర్జాతీయ వాణిజ్య సుంకాల అనిశ్చితి కూడా సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. కూరగాయలు, గుడ్లు, ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే ఇతరత్రా పదార్ధాల రేట్లు నెమ్మదించడంతో ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏడు నెలల కనిష్టమైన 3.61 శాతానికి దిగి వచ్చింది. ఇది గతేడాది జులై తర్వాత కనిష్ట స్థాయి. తాజా పరిణామం నేపథ్యంలో వచ్చే నెలలో రిజర్వ్ బ్యాంక్ మరోసారి కీలక వడ్డీ రేట్ల కోతపై దృష్టి పెట్టడానికి కాస్త అవకాశం లభించినట్లవుతుందని పరిశీలకులు అభిప్రాయపడ్డారు.ఈ నెల 14వ తేదీన హోలీ పండుగ సందర్భంగా మార్కెట్లకు సెలవు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నిఫ్టీ మరో కొత్త ఇండెక్స్..
స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ తాజాగా కెమికల్ రంగానికి ఇండెక్స్‌ను ప్రవేశపెట్టింది. నిఫ్టీ కెమికల్స్ పేరుతో ఆవిష్కరించింది. నిఫ్టీ 500 నుంచి కెమికల్ రంగ షేర్ల పనితీరును ఇండెక్స్ ప్రతిఫలించనుంది. అనుబంధ సంస్థ ఎన్ఎస్ఈ ఇండైసెస్ ద్వారా కొత్త ఇండెక్సునకు తెరతీసింది.తాజా ఇండెక్స్ అసెట్ మేనేజర్లకు ప్రామాణికంగా నిలిచే వీలున్నట్లు ఎన్ఎస్ఈ అంచనా వేస్తోంది. ఈటీఎఫ్‌ల రూపంలో ప్యాసివ్ ఫండ్స్ ట్రాక్ చేసే రిఫరెన్స్ ఇండెక్స్‌గా ఉపయోగపడనున్నట్లు అభిప్రాయపడింది. ఆరు నెలల సగటు ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా 20 స్టాక్స్‌ను ఎంపిక చేసినట్లు పేర్కొంది.ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్‌కు అందుబాటులో ఉన్న షేర్లను పరిగణించింది. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ విలువ ఆధారంగా ఒక్కో షేరుకి వెయిట్ ఉంటుందని, 33 శాతానికి మించదని ఎక్స్చేంజీ వెల్లడించింది. కెమికల్స్ రంగంపై ఇన్వెస్టర్ల ఆసక్తి పెరుగుతుండటంతో పరిశ్రమ ధోరణులు, పెట్టుబడుల అవకాశాలను ట్రాక్ చేయడానికి ఈ ఇండెక్స్ కీలక సాధనంగా ఉపయోగపడుతుంది. -
ఐటీ షేర్ల దెబ్బ.. నష్టాలలో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఐటీ షేర్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడితో దేశీయ బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు బుధవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. అయితే ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లలో స్మార్ట్ లాభాలు బెంచ్‌మార్క్ సూచీల నష్టాలను అదుపులో ఉంచడానికి దోహదపడ్డాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 170 పాయింట్ల లాభంతో 74,270 వద్ద ప్రారంభమై, కొద్దిసేపటికే 74,392 వద్ద గరిష్టాన్ని తాకింది. ఆ తర్వాత బీఎస్ఈ సూచీ లాభాల్లో పయనించి 794 పాయింట్లు క్షీణించి 73,598 వద్ద కనిష్ఠానికి పడిపోయింది. చివరకు సెన్సెక్స్ 73 పాయింట్లు లేదా 0.1 శాతం స్వల్ప నష్టంతో 74,030 వద్ద ముగిసింది.ఇక నిఫ్టీ 22,577 పాయింట్ల గరిష్ట స్థాయి నుంచి 22,330 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. ఇంట్రాడేలో 247 పాయింట్లు నష్టపోయి 22,470 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 షేర్లలో ఇండస్ ఇండ్ బ్యాంక్ టాప్ గెయినర్‌గా ఉంది. బ్యాంక్ సీఈవో, గ్రూప్ చైర్మన్ ఇన్వెస్టర్ల భయాలను తగ్గించడానికి ప్రయత్నించడంతో నిన్నటి పతనం నుంచి కోలుకుని నేడు 5 శాతం లాభపడింది. అదే సమయంలో టాటా మోటార్స్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సన్ ఫార్మా షేర్లు 1-3 శాతం చొప్పున లాభపడ్డాయి.మరోవైపు ఇన్ఫోసిస్ 4 శాతానికి పైగా పడిపోయింది. టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హిందుస్థాన్ యూనిలీవర్, జొమాటో, ఎస్బీఐ 1-3 శాతం మధ్య నష్టాల్లో ముగిశాయి. విస్తృత మార్కెట్ లో బీఎస్ఈ మిడ్ క్యాప్ , స్మాల్ క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున నష్టాల్లో ముగిశాయి.మొత్తంగా మార్కెట్ ప్రతికూలతను చూసింది. బీఎస్ఈలోని 1,500 షేర్లు పురోగమించగా దాదాపు 2,500 స్టాక్స్ క్షీణించాయి. రంగాలవారీగా చూస్తే అమెరికా మాంద్యం ముప్పు, మోర్గాన్ స్టాన్లీ, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డౌన్ గ్రేడ్ల నేపథ్యంలో బీఎస్ఈ ఐటీ సూచీ 3 శాతానికి పైగా పతనమైంది. రియాల్టీ ఇండెక్స్ 1.7 శాతం, మెటల్ ఇండెక్స్ 0.5 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 0.7 శాతం లాభపడింది. -
ఫ్రెంచ్ కంపెనీపై జైడస్ లైఫ్ కన్ను
న్యూఢిల్లీ: మెడ్‌టెక్ ఫ్రెంచ్ కంపెనీ యాంప్లిట్యూడ్ సర్జికల్‌లో మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు ప్రత్యేక చర్చలు నిర్వహిస్తున్నట్లు దేశీ హెల్త్‌కేర్ సంస్థ జైడస్ లైఫ్‌సైన్సెస్ పేర్కొంది. మెజారిటీ వాటా సొంతం చేసుకునేందుకు కంపెనీ యాజమాన్యం పీఏఐ పార్ట్నర్స్సహా రెండు మైనారిటీ వాటాదారు సంస్థలతో డీల్ కుదుర్చుకోనున్నట్లు తెలియజేసింది. వెరసి వోటింగ్ హక్కులతో 85.6% వాటా కొనుగోలుకి 25.68 కోట్ల యూరోలు (రూ.2,444 కోట్లు) వెచ్చించనున్నట్లు వెల్లడించింది. అత్యంత నాణ్యమైన లోయర్లింబ్ ఆర్థోపెడిక్ టెక్నాలజీలలో యాంప్లిట్యూడ్కు పట్టున్నట్లు పేర్కొంది. వీటిలో సమస్యాత్మకంగా మారిన జాయింట్ల రీప్లేస్మెంట్లో విని యోగించే మెడికల్ ప్రొడక్టుల డిజైన్, డెవలప్మెంట్ తదితర కార్యకలాపాలున్నట్లు తెలియజేసింది.ఇదీ చదవండి: సిబిల్ స్కోర్ అప్డేట్.. ఆర్బీఐ ఆరు నిబంధనలునిఫ్టీ కెమికల్ ఇండెక్స్ షురూకెమికల్ రంగానికీ ఎన్ఎస్ఈ ప్రాధాన్యతన్యూఢిల్లీ: స్టాక్ ఎక్ఛ్సేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ తాజాగా కెమికల్ రంగానికి ఇండెక్స్‌ను ప్రవేశపెట్టింది. నిఫ్టీ కెమికల్స్ పేరుతో ఆవిష్కరించింది. నిఫ్టీ 500 నుంచి కెమికల్ రంగ షేర్ల పనితీరును ఇండెక్స్ ప్రతిఫలించనుంది. అనుబంధ సంస్థ ఎన్ఎస్ఈ ఇండిసెస్ ద్వారా కొత్త ఇండెక్సునకు తెరతీసింది. తాజా ఇండెక్స్ అసెట్ మేనేజర్లకు ప్రామాణికంగా నిలిచే వీలున్నట్లు ఎన్ఎస్ఈ అంచనా వేస్తోంది. ఈటీఎఫ్‌ల రూపంలో ప్యాసివ్ ఫండ్స్ ట్రాక్ చేసే రిఫరెన్స్ ఇండెక్స్‌గా ఉపయోగపడనున్నట్లు అభిప్రాయపడింది. ఆరు నెలల సగటు ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా 20 స్టాక్స్‌ను ఎంపిక చేసినట్లు పేర్కొంది. ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్‌కు అందుబాటులో ఉన్న షేర్లను పరిగణించింది. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ విలువ ఆధారంగా ఒక్కో షేరుకి వెయిట్ ఉంటుందని, 33 శాతానికి మించదని ఎక్ఛ్సేంజీ వెల్లడించింది. -
నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 423.38 పాయింట్లు లేదా 0.57 శాతం నష్టంతో 73,691.79 వద్ద, నిఫ్టీ 112.85 పాయింట్లు లేదా 0.50 శాతం నష్టంతో 22,347.45 వద్ద కొనసాగుతున్నాయి.టాప్ గెయినర్స్ జాబితాలో.. నీతిరాజ్ ఇంజనీర్స్, హెడ్స్ అప్ వెంచర్స్, ఎల్సీసీ ఇన్ఫోటెక్, ఆస్ట్రాన్ పేపర్ బోర్డ్ మిల్ లిమిటెడ్ వంటి కంపెనీలు చేరాగా.. ఐఓఎల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఆకాష్ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్, సద్భావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, జ్యోతి సీఎన్సీ ఆటోమేషన్ వంటివి నష్టాలలో కొనసాగుతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మళ్ళీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాలబాట పట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 217.41 పాయింట్లు లేదా 0.29 శాతం నష్టంతో 74,115.17 వద్ద, నిఫ్టీ 92.20 పాయింట్లు లేదా 0.41 శాతం నష్టంతో 22,460.30 వద్ద నిలిచాయి.వెల్స్పన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ కమర్షియల్స్, బంకా బయోలూ, బోడల్ కెమికల్స్, లిప్సా జెమ్స్ అండ్ జ్యువెలరీ, ICE మేక్ రిఫ్రిజిరేషన్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. కేసోరామ్ ఇండస్ట్రీస్, SBC ఎక్స్‌పోర్ట్స్, నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, హిందుస్తాన్ మీడియా వెంచర్స్, నియోజెన్ కెమికల్స్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
క్రమంగా పెరుగుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఇటీవల కాలంలో భారీగా పడిన మార్కెట్ సూచీలు గడిచిన నాలుగు సెషన్ల నుంచి క్రమంగా పెరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 39 పాయింట్లు ఎగబాకి 22,594కు చేరింది. సెన్సెక్స్(Sensex) 112 పాయింట్లు పెరిగి 74,441 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 103.8 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 70.02 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.28 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.56 శాతం లాభపడింది. నాస్డాక్ 0.71 శాతం ఎగబాకింది.ఇదీ చదవండి: నేటి నుంచి యూఎస్‌పై చైనా సుంకాలు.. వ్యూహాత్మక ప్రతీకారంఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు ప్రపంచ పరిస్థితులు, స్థూల ఆర్థిక గణాంకాలపై దృష్టి పెట్టనున్నాయి. వీటికితోడు యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్‌ల విధింపు చర్యలకూ ప్రాధాన్యత ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. టారిఫ్‌ల కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ నీరసించవచ్చన్న అంచనాలు తెరమీదకు వస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో గత వారం యూఎస్ టెక్నాలజీ దిగ్గజాలు డీలాపడటంతో నాస్డాక్ ఇండెక్స్ పతనమైన సంగతి తెలిసిందే. గ్లోబల్ ట్రెండ్ సైతం దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. కాగా..ఈ వారం మార్కెట్లు నాలుగు రోజులే పనిచేయనున్నాయి. వారాంతాన(14న) హోలీ పండుగ సందర్భంగా మార్కెట్లకు సెలవు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి మిశ్రమ ఫలితాలను చవిచూశాయి. సెన్సెక్స్ 7.52 పాయింట్లు లేదా 0.010 శాతం నష్టంతో.. 74,332.58 వద్ద, నిఫ్టీ 7.80 పాయింట్లు లేదా 0.035 శాతం లాభంతో 22,552.50 వద్ద నిలిచాయి.బంకా బయోలూ, సోమి కన్వేయర్ బెల్టింగ్స్, బాలాక్సీ ఫార్మాస్యూటికల్స్, లక్ష్మీ డెంటల్, కంప్యూకామ్ సాఫ్ట్వేర్ వంటి కంపెనీలు లాభాల జాబితాలో చేరాయి. నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, MRO-TEK రియాలిటీ, ఎస్ పీ అప్పారల్స్, గార్వేర్ హై-టెక్ ఫిల్మ్స్, దావణగిరి షుగర్ ఫ్యాక్టరీ వంటివి నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు.. బలహీనంగా ఐటీ, బ్యాంక్ షేర్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాల మధ్య బెంచ్ మార్క్ ఈక్విటీ ఇండెక్స్ బీఎస్ఈ సెన్సెక్స్ 176.47 పాయింట్లు లేదా 0.24 శాతం క్షీణించి 74,163.62 వద్ద మొదలైంది. ఇక నిఫ్టీ 50 ప్రారంభ సమయానికి 40.85 పాయింట్లు లేదా 0.18 శాతం క్షీణించి 22,503 వద్ద ఉంది.బలహీన అంతర్జాతీయ సంకేతాల మధ్య నిఫ్టీ ఐటీ, ఎఫ్ ఎంసీజీ, బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు ఎన్ఎస్ఈలో ప్రారంభ ట్రేడింగ్ లో ఒత్తిడికి లోనయ్యాయి. ఐటీ ఇండెక్స్ 0.97 శాతం, ఎఫ్ఎంసీజీ 0.12 శాతం, బ్యాంక్ 0.12 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.06 శాతం నష్టపోయాయి.విస్తృత మార్కెట్ సూచీలు ప్రారంభ ట్రేడింగ్ లో మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 0.34 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 0.09 శాతం నష్టపోయాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు దేశ ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తాయన్న భయాలే ఈ రోజు స్టాక్ మార్కెట్లలో అమ్మకాలకు కారణం కావచ్చు. యునైటెడ్ స్టేట్స్-మెక్సికో-కెనడా ఒప్పందం కిందకు వచ్చే కొన్ని కెనడా, మెక్సికో వస్తువులపై సుంకాలను ఏప్రిల్ 2 వరకు వాయిదా వేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం కూడా ఇన్వెస్టర్లను శాంతపరచడంలో విఫలమైంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు..
స్వల్ప లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 609.87 పాయింట్లు లేదా 0.83 శాతం లాభంతో.. 74,340.09 వద్ద, నిఫ్టీ 207.40 పాయింట్లు లేదా 0.93 శాతం లాభంతో 22,544.70 వద్ద నిలిచాయి.క్యాపిటల్ ట్రస్ట్, కోహినూర్ ఫుడ్స్, సోమి కన్వేయర్ బెల్టింగ్స్, కిర్లోస్కర్ ఎలక్ట్రిక్ కో, లాంకోర్ హోల్డింగ్స్ వంటి కంపెనీలు లాభాల జాబితాలో చేరాయి. లాంకోర్ హోల్డింగ్స్, బీబీ ట్రిపుల్వాల్ కంటైనర్స్, ఫుడ్ అండ్ ఇన్స్, శ్రీరామ న్యూస్ ప్రింట్, ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బుల్ జోష్.. లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 48 పాయింట్లు ఎగబాకి 22,378కు చేరింది. సెన్సెక్స్(Sensex) 124 పాయింట్లు పెరిగి 73,856 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 104.3 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 69.72 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.32 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 1.12 శాతం లాభపడింది. నాస్డాక్ 1.46 శాతం ఎగబాకింది.బుల్.. బౌన్స్‌బ్యాక్!దేశీ స్టాక్ మార్కెట్లలో ఇటీవల నెలకొన్న ట్రెండ్‌కు పూర్తి విరుద్ధంగా ఇన్వెస్టర్లు భారీ కొనుగోళ్లకు తెరతీశారు. దీంతో మార్కెట్ సూచీలు పెరుగుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం టారిఫ్‌లపై వెనక్కి తగ్గవచ్చన్న అంచనాలు సెంటిమెంటుకు జోష్‌నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. సానుకూల ప్రపంచ మార్కెట్లు, ఫిబ్రవరిలో పుంజుకున్న సేవల రంగం, షార్ట్ కవరింగ్ లావాదేవీలు ఇందుకు సహకరించినట్లు విశ్లేషకులు తెలియజేశారు.ఇదీ చదవండి: భారత్‌లో టెస్లా తొలి షోరూమ్.. ఎక్కడంటే..రూపాయి.. జోరు!మార్కెట్ల దన్నుతో దేశీ కరెన్సీ సైతం బలపడింది. డాలరుతో మారకంలో రూపాయి 13 పైసలు పుంజుకుంది. 87.06 వద్ద నిలిచింది. డాలరుతోపాటు ముడిచమురు ధరలు బలహీనపడటం రూపాయికి దన్నునిచ్చినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్‌లకు వ్యతిరేకంగా చైనా తదితర దేశాలు సైతం సుంకాల విధింపునకు తెరతీయడంతో డాలరు వెనకడుగు వేసినట్లు తెలిపారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నిఫ్టీ వరుస నష్టాలకు బ్రేక్..
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 1 శాతానికి పైగా లాభపడి స్థిరపడ్డాయి. 30 షేర్ల సెన్సెక్స్ 740.30 పాయింట్లు లేదా 1.01 శాతం పెరిగి 73,730.23 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ 50 254.65 పాయింట్లు లేదా 1.15 శాతం పెరిగి 22,337.30 వద్ద స్థిరపడింది, తద్వారా 10 రోజుల నష్టాల పరంపరకు ముగింపు పలికింది. బుధవారం సూచీ 22,394.90 నుంచి 22,067.80 రేంజ్లో ట్రేడ్ అయింది. మంగళవారం వరకు వరుసగా 10 ట్రేడింగ్ సెషన్లలో నిఫ్టీ 50 ఇండెక్స్ 3.8 శాతం లేదా 877 పాయింట్లు నష్టపోయింది.నిఫ్టీ 50లోని 50 షేర్లలో 46 లాభాల్లో స్థిరపడగా, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, అదానీ ఎంటర్ప్రైజెస్, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 5.15 శాతం వరకు లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్, ఇండియన్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు 3.37 శాతం వరకు నష్టపోయాయి.నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 2.96 శాతం లాభంతో ముగియడంతో స్మాల్ క్యాప్ షేర్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ కూడా 2.42 శాతం లాభంతో సానుకూలంగా ముగిసింది. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 4.04 శాతం లాభపడటంతో ఎన్ఎస్ఈలోని అన్ని సెక్టోరల్ ఇండెక్స్‌లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, మీడియా సూచీలు 3 శాతానికి పైగా లాభపడ్డాయి. నిఫ్టీ ఐటీ, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, రియల్టీ సూచీలు 2 శాతానికి పైగా లాభపడ్డాయి. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఉదయం 9:26 సమయానికి నిఫ్టీ(Nifty) 89 పాయింట్లు ఎగబాకి 22,170కు చేరింది. సెన్సెక్స్(Sensex) 296 పాయింట్లు పెరిగి 73,273 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 105.71 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 70.74 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.25 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 1.22 శాతం తగ్గింది. నాస్డాక్ 0.35 శాతం దిగజారింది.ఇదీ చదవండి: వేతనం కాదు.. ఉద్యోగుల మనోభావాలివి..ట్రంప్ టారిఫ్ భయాలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ప్రభావంతో మార్కెట్లు పతనమవుతున్నాయి. నిఫ్టీ ఇండెక్స్ డెరివేటివ్స్ వీక్లీ కాంట్రాక్టుల ఎక్స్పైరీని గురువారం నుంచి సోమవారానికి మారుస్తున్నట్లు ఎన్ఎస్ఈ వెల్లడించింది. అలాగే, నిఫ్టీ నెల, మూడు నెలలు, ఆరు నెలల ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టులు కూడా ఎక్స్పైరీ నెలలోని ఆఖరు గురువారం కాకుండా ఆఖరు సోమవారం నాడు ఎక్స్పైర్ అవుతాయి. బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ మొదలైన వాటికి కూడా ఇది వర్తిస్తుంది. ఇది ఏప్రిల్ 4 నుంచి అమల్లోకి వస్తుంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. ఆటో, ఐటీ నేలచూపు
దేశీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 మంగళవారం నష్టాల్లో ముగిశాయి. 30 షేర్ల సెన్సెక్స్ 96.01 పాయింట్లు లేదా 0.13 శాతం క్షీణించి 72,989.93 వద్ద స్థిరపడింది. ఈరోజు సూచీ 73,033.18-72,633.54 రేంజ్లో ట్రేడ్ అయింది.అలాగే నిఫ్టీ 50 36.65 పాయింట్లు (0.17 శాతం) క్షీణించి 22,082.65 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఈరోజు గరిష్ట స్థాయి 22,105.05 వద్ద, ఇంట్రాడేలో 21,964.60 వద్ద కనిష్టాన్ని తాకింది.నిఫ్టీ 50లోని 50 షేర్లలో 28 షేర్లు నష్టాల్లో ముగియగా, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్‌సీఎల్ టెక్, ఐషర్ మోటార్స్ షేర్లు 4.95 శాతం వరకు నష్టపోయాయి. ఎస్బీఐ, బీపీసీఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 3.03 శాతం వరకు లాభపడ్డాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.69 శాతం, 0.05 శాతం పెరిగాయి. ఎన్ఎస్ఈలో సెక్టోరల్ ఇండెక్స్‌లు మిశ్రమంగా ముగియగా, పీఎస్‌యూ బ్యాంక్, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, మీడియా, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, రియల్టీ సూచీలు 2.37 శాతం వరకు లాభపడ్డాయి. మరోవైపు నిఫ్టీ ఆటో, ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాల సూచీలు 1.31 శాతం వరకు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ స్వల్పంగా 0.08 శాతం నష్టపోయింది. -
భారీ నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..
మంగళవారం ఉదయం.. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 291.61 పాయింట్లు లేదా 0.40 శాతం నష్టంతో.. 72,794.33 వద్ద, నిఫ్టీ 126.10 పాయింట్లు లేదా 0.57 శాతం నష్టంతో.. 21,993.20 వద్ద సాగుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, ట్రంప్ విధించిన సుంకాలు ఈ రోజు నుంచి అమలులోకి రావడం వంటివి.. స్టాక్ మార్కెట్లపై ప్రభావాన్ని చూపాయి.బోహ్రా ఇండస్ట్రీస్, కాఫీ డే ఎంటర్ప్రైజెస్, ఇండోకో రెమెడీస్, రూబీ మిల్స్, అనుపమ రసాయన్ ఇండియా వంటి కంపెనీలు లాభాల్లో సాగుతున్నాయి. యూనిఇన్ఫో టెలికాం సర్వీసెస్ లిమిటెడ్, మనోరమ ఇండస్ట్రీస్, మంగళం డ్రగ్స్, లాంకోర్ హోల్డింగ్స్, NR అగర్వాల్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు నష్టాల్లో సాగుతున్నాయి.ట్రంప్ సుంకాల ఎఫెక్ట్చైనా ఉత్పత్తులపైన ఇప్పటికే ఉన్న 10 శాతం సుంకాన్ని, 20 శాతానికి పెంచుతూ.. దీనికి సంబంధించిన సంబంధించిన ఉత్తర్వులపై సంతకం కూడా చేశారు. మెక్సికో, కెనడా దిగుమతులపై విదించనున్న 25 శాతం సుంకాల విషయంలో ఎలాంటి మార్పు లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇవి మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సోమవారం సెషన్‌ను నష్టాలతో ముగించాయి. 30 షేర్ల సెన్సెక్స్ 112.16 పాయింట్లు (0.15 శాతం) క్షీణించి 73,085.94 వద్ద స్థిరపడింది. ఈరోజు సూచీ 73,649.72 - 72,784.54 రేంజ్లో ట్రేడ్ అయింది.నిఫ్టీ 50 కేవలం 5.40 పాయింట్లు లేదా 0.02 శాతం క్షీణించి 22,119.30 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 రోజు గరిష్ట స్థాయి 22,261 వద్ద, రోజు కనిష్ట స్థాయి 22,004 వద్ద నమోదయ్యాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.14 శాతం లాభపడగా, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ సోమవారం 0.27 శాతం నష్టపోయింది. భారత్ ఎలక్ట్రానిక్స్, గ్రాసిమ్, ఐషర్ మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు 4.65 శాతం వరకు లాభపడటంతో నిఫ్టీ 50లోని 50 షేర్లలో 33 షేర్లు లాభాల్లో ముగిశాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం భారతదేశపు అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.17 శాతం క్షీణించింది.నిఫ్టీ 50లో కోల్ ఇండియా, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు 2.44 శాతం వరకు నష్టపోయాయి. సెక్టోరల్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ ఐటీ, మెటల్, ఆటో, ఫార్మా, రియల్టీ, హెల్త్‌కేర్ సూచీలు 1.26 శాతం వరకు లాభపడ్డాయి. మరోవైపు ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్, మీడియా సూచీలు 1.10 శాతం వరకు నష్టాల్లో ముగిశాయి. -
లాభాల నుంచి నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు
ఉదయ 9:20 గంటలకు లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. 10:10 గంటలకు నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ 368.28 పాయింట్ల నష్టంతో 72,829.82 పాయింట్ల వద్ద, నిఫ్టీ 94.75 పాయింట్ల నష్టంతో.. 22,029.95 వద్ద సాగుతున్నాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం శుభారంభం పలికాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 418.78 పాయింట్లు లేదా 0.52 శాతం లాభంతో.. 73580.80 వద్ద, నిఫ్టీ 132.00 పాయింట్లు లేదా 0.60 శాతం లాభంతో.. 22,256.70 వద్ద సాగుతున్నాయి.బోహ్రా ఇండస్ట్రీస్, కాఫీ డే ఎంటర్ప్రైజ్, రూబీ మిల్స్, రానా షుగర్స్, ఇమామి పేపర్ మిల్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఇంటర్నేషనల్ జెమ్మాలజీ ఇన్స్టిట్యూట్ ఇండియా, కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మనోరమ ఇండస్ట్రీస్, కర్మ ఎనర్జీ, హాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్, సువెన్ ఫార్మాస్యూటికల్స్ వంటివి నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
ట్రేడ్ వార్ టెర్రర్
ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా దిగుమతులపై అదనంగా 10%, యూరోపియన్ యూనియన్ ఉత్పత్తులపై 25% తాజా సుంకాల ప్రకటనతో ఈక్విటీ మార్కెట్లలో మరోసారి అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్ 1,414 పాయింట్లు నష్టపోయి 74వేల స్థాయి దిగువన 73,198 వద్ద నిలిచింది. నిఫ్టీ 420 పాయింట్లు కోల్పోయి 22,125 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,471 పాయింట్లు క్షీణించి 73,141 వద్ద, నిఫ్టీ 440 పాయింట్లు కుప్పకూలి 22,105 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. → అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఇండెక్సుల వారీగా.. ఐటీ సూచీ 4.20% పతనమైంది. టెలి కమ్యూనికేషన్, ఆటో ఇండెక్సు 4%, కన్జూమర్ డి్రస్కేషనరీ 3%, ఆయిల్‌అండ్‌గ్యాస్ 2.50%, విద్యుత్ ఇండెక్స్ 2% నష్టపోయాయి. చిన్న, మధ్య తరహా షేర్లలోనూ అమ్మకాలు కొనసాగాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 2.33%, మిడ్ క్యాప్ ఇండెక్సు 2.16 క్షీణించాయి. → స్టాక్ మార్కెట్ 2% పతనంతో శుక్రవారం ఒక్కరోజే రూ.9.08 లక్షల కోట్లు హరించుకుపోయింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.384.01 లక్షల కోట్లకు దిగివచ్చింది. → సెన్సెక్స్ సూచీలో ఒక్క హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2%) తప్ప మిగిలిన అన్ని షేర్లూ పతనమయ్యాయి. అత్యధికంగా టెక్ మహీంద్రా 6%, ఇండస్ఇండ్ బ్యాంక్ 5.5%, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎయిర్టెల్ 5%, టైటాన్ 4.5% పడ్డాయి.→ గతేడాది సెపె్టంబర్ 27 నాటి సెన్సెక్స్ రికార్డు గరిష్టం(85,978) నుంచి 12,780 పాయింట్లు(15%), నిఫ్టీ జీవితకాల గరిష్టం(26,277) నుంచి 4,153 పాయింట్లు(16%) క్షీణించాయి. ఆర్థిక వృద్ధి మందగమనం ఆందోళనలు, ట్రంప్ వాణిజ్య విధానాలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు దీనికి కారణయ్యాయి. పతనానికి కారణాలుతారస్థాయికి వాణిజ్య యుద్ధ భయాలు: చైనా ఉత్పత్తులపై ఇప్పటికే 10% సుంకాలు విధించిన ట్రంప్.. అదనంగా మరో 10% విధిస్తున్నట్లు ప్రకటించారు. యూరోపియన్ యూనియన్ దిగుమతులపై 25% సుంకాల విధింపు ఉంటుందన్నారు. వీటికి తోడు భారత్‌తో సహా అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు ఏప్రిల్‌లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే మెక్సికో, కెనడాల దిగుమతులపై ప్రతిపాదించిన 25% సుంకాలు మార్చి 4 నుంచి అమల్లోకి రానున్నాయి.టెక్ షేర్లు క్రాష్: టెక్ దిగ్గజం ఎన్విడియా త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చనే అంచనాలతో వాల్ స్ట్రీట్‌లో అధిక మార్కెట్ విలువ కలిగిన టెక్ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. ఈ ప్రభావం దేశీయ ఐటీ రంగ షేర్లపైనా పడింది. నెలరోజుల కనిష్టానికి ప్రపంచ మార్కెట్లు: వాణిజ్య యుద్ధ భయాలకు తోడు టెక్ రంగ షేర్ల పతనంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నెలరోజుల కనిష్టానికి దిగివచ్చాయి. ఆసియాలో దక్షిణ కొరియా, ఇండోనేషియా, హాంగ్‌కాంగ్, జపాన్ సూచీలు 3.50% నుంచి 3% కుప్పకూలాయి. చైనా, సింగపూర్ తైవాన్ ఇండెక్సులు 2–1% నష్టపోయాయి. యూరప్‌లో ఫ్రాన్స్, జర్మనీ దేశాల సూచీలు అరశాతం నష్టపోయాయి.బలపడుతున్న డాలర్ ఇండెక్స్: వాణిజ్య యుద్ధ భయాలతో అమెరికా కరెన్సీ డాలర్ ఇండెక్స్ 10 వారాల గరిష్టానికి (108) చేరుకుంది. దీంతో భారత్‌తో సహా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు ప్రతికూలాంశంగా మారింది. ఆగని ఎఫ్ఐఐల అమ్మకాలు: దేశీయ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతుండడం దలాల్ స్ట్రీట్ పతనానికి మరో ప్రధాన కారణం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ.1.13 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి. ఈ ఫిబ్రవరిలోనే రూ.58,988 కోట్ల ఈక్విటీలు అమ్మేశారు.రూపాయి 19 పైసలు పతనం డాలర్ మారకంలో రూపాయి విలువ 19 పైసలు క్షీణించి 87.37 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ రెండు నెలల గరిష్టానికి చేరుకోవడం, వాణిజ్య యుద్ధ భయాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూలతలు దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెంచాయి. ఇంట్రాడేలో 35 పైసలు బలహీనపడి 87.53 వద్ద కనిష్టాన్ని తాకింది. కాగా, ఫిబ్రవరి 10న రూపాయి 87.94 వద్ద జీవితకాల కనిష్ట స్థాయిని తాకింది. -
ట్రంప్ ఎఫెక్ట్.. స్టాక్‌మార్కెట్లు అల్లకల్లోలం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రకటన శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లో కల్లోలం సృష్టించింది. మార్చి 4నుంచి కెనడా, మెక్సికోలపై సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఆ ప్రకటన దేశీయ స్టాక్ మార్కెట్లో ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. దీంతో మదుపర్లు ఇవాళ ఒక్కరోజే రూ.10లక్షల కోట్లు నష్టపోయారు.అంతర్జాతీయ ప్రతికూల అంశాలతో ఈ వారం ప్రారంభం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలతో కొనసాగాయి. మార్కెట్లో చివరి రోజున శుక్రవారం సైతం దేశీయ స్టాక్ మార్కెట్లో భారీ మొత్తంలో సంపద ఆవిరైంది. ఫలితంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు వరుస నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. మదుపరుల సంపదను లక్షల కోట్ల రూపాయల్లో కరిగించేశాయి. ఈ వారంలో మదుపర్లు సుమారు రూ.30లక్షల కోట్లకు పైగా నష్టపోయినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇక ట్రంప్ సుంకాల ప్రకటనతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. 10 శాతం అధిక సుంకాలు విధిస్తామని చైనాను ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ సుంకాల ప్రకటన అనంతరం బలహీనమైన ప్రపంచ సంకేతాల మధ్య ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. 400 పాయింట్ల ప్రతికూల గ్యాప్‌తో ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్ 73,141 వద్ద కనిష్టానికి పడిపోయి, చివరకు 1,414 పాయింట్లు లేదా 1.9 శాతం నష్టంతో 73,198 వద్ద ముగిసింది. ఈ క్రమంలో బీఎస్ఈ సెన్సెక్స్ 2,113 పాయింట్లు (2.8 శాతం) నష్టంతో వారాన్ని ముగించింది. అలాగే ఫిబ్రవరి నెలలో 4,303 పాయింట్లు లేదా 5.6 శాతం క్షీణించింది. సెన్సెక్స్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 85,978 నుంచి దాదాపు 15 శాతం నష్టపోయింది.ఇక నిఫ్టీ 1.9 శాతం లేదా 420 పాయింట్ల నష్టంతో 22,125 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఇండెక్స్ ఫిబ్రవరిలో 5.9 శాతం క్షీణించి, జీవితకాల గరిష్ట స్థాయి 26,277 నుంచి 16 శాతానికి చేరువైంది. నిఫ్టీ గరిష్ట స్థాయి నుంచి 20 శాతం వరకు పడిపోతే బేర్ మార్కెట్ పరిధిలోకి ప్రవేశిస్తుంది.ఐటీ, ఆటో షేర్లు తీవ్రంగా దెబ్బతినడంతో అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు భారీగా పెరిగాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ అత్యధికంగా 7 శాతం నష్టపోయింది. టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్ టెల్, టాటా మోటార్స్, టైటాన్, ఇన్ఫోసిస్, నెస్లే ఇండియా 4- 6 శాతం చొప్పున నష్టపోయాయి. సెన్సెక్స్ 30 షేర్లలో 27 షేర్లు 1 శాతానికి పైగా క్షీణించాయి. సెన్సెక్స్ 30 షేర్లలో ఒక్క హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మాత్రమే 2 శాతం లాభంతో మెరిసింది.విస్తృత మార్కెట్లో బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 2 శాతానికి పైగా నష్టపోయాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ గత 5 సంవత్సరాలలో అతిపెద్ద నెలవారీ పతనాన్ని నమోదు చేసింది. అన్ని రంగాల సూచీలు 1 శాతానికి పైగా నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ ఐటీ, ఆటో సూచీలు 4 శాతం చొప్పున నష్టపోయాయి. ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్‌లు 2 శాతానికి పైగా నష్టపోయాయి. -
‘బేర్’మంటున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఉదయం 9:50 సమయానికి నిఫ్టీ(Nifty) 273 పాయింట్లు దిగజారి 22,273కు చేరింది. సెన్సెక్స్(Sensex) 908 పాయింట్లు తగ్గి 73,704 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 107.35 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 73.23 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.22 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 1.59 శాతం తగ్గింది. నాస్డాక్ 2.78 శాతం దిగజారింది.ఇదీ చదవండి: సెబీ కొత్త చీఫ్‌గా తుహిన్ కాంత పాండేమూడేళ్లుగా అలుపెరుగని లాభాల పరుగు తీసిన నిఫ్టీ, సెన్సెక్స్ ప్రభావంతో లార్జ్ క్యాప్స్‌తోపాటు.. పలు మధ్య, చిన్నతరహా స్టాక్స్ సైతం భారీగా ఎగశాయి. దీంతో దేశీ స్టాక్ మార్కెట్లు ఖరీదుగా మారినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో తలెత్తిన ప్రపంచ రాజకీయ, భౌగోళిక అనిశ్చితులు సెంటిమెంటును బలహీనపరిచాయి. యూఎస్ ప్రెసిడెంట్‌గా రిపబ్లికన్ ట్రంప్ ఎన్నికవడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు అధికమయ్యాయి. ట్రంప్ విధానాలపై అంచనాలతో డాలరు బలపడటం, ట్రెజరీ ఈల్డ్స్ మెరుగుపడటం రూపాయినీ దెబ్బతీసింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు..
Stock Market Updates: దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి. విస్తృత సూచీలు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ భారత బెంచ్ మార్క్ సూచీలు అత్యంత స్వల్ప స్థాయిలో కదిలాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 74,834 వద్ద గరిష్ట స్థాయి నుండి 74,521 వద్ద కనిష్టానికి పడిపోయింది. చివరికి 10 పాయింట్ల లాభంతో 74,612 వద్ద ఫ్లాట్ నోట్ వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ 100 పాయింట్ల స్వల్ప శ్రేణిలో కదలాడింది. 22,613 వద్ద గరిష్ట స్థాయి నుండి ఇండెక్స్ 22,508 వద్ద కనిష్టానికి పడిపోయింది. చివరికి దాదాపుగా 22,545 వద్ద స్థిరపడింది.సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ చెరో 2 శాతానికి పైగా లాభపడ్డాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జొమాటో, యాక్సిస్ బ్యాంక్ 1 శాతానికి పైగా పెరిగాయి. మరోవైపు వైర్లు, కేబుల్స్ వ్యాపారంలోకి ప్రవేశించే ప్రణాళికను ప్రకటించిన తర్వాత అల్ట్రాటెక్ సిమెంట్ దాదాపు 5 శాతం పడిపోయింది. అదేసమయంలో మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హిందుస్థాన్ యూనిలీవర్, ఎన్టీపీసీ షేర్లు నష్టపోయాయి.విస్తృత మార్కెట్లో బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2 శాతానికి పైగా పడిపోయాయి. బంధన్ బ్యాంక్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, ఏయూ బ్యాంక్, క్రెడిట్‌యాక్సెస్ గ్రామీణ్, టీటీకే హెల్త్‌కేర్, చోళమండలం హోల్డింగ్స్, ఆర్బీఎల్ బ్యాంక్ 5-8 శాతం మధ్య లాభపడ్డాయి. మరోవైపు ఆర్ఆర్ కబెల్, కేఈఐ ఇండస్ట్రీస్, విజయ డయాగ్నస్టిక్స్, ప్రజ్ ఇండస్ట్రీస్, అజంతా ఫార్మా, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, డిక్సన్ టెక్నాలజీస్ షేర్లు నష్టపోయాయి.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఎంఎఫ్ఐ రుణాలు, ఎన్‌బీఎఫ్‌సీలకు రుణాలపై రిస్క్ వెయిట్‌ను తగ్గించిన తరువాత క్రెడిట్‌యాక్సెస్ గ్రామీణ్, ఎల్ అండ్ టి ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ వంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (NBFC), మైక్రో ఫైనాన్స్ షేర్లకు గురువారం డిమాండ్ ఏర్పడింది. -
స్థిరంగా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం అంతకుముందు సెషన్‌తో పోలిస్తే స్థిరంగా కదలాడుతున్నాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ(Nifty) 8 పాయింట్లు పెరిగి 22,556కు చేరింది. సెన్సెక్స్(Sensex) 15 పాయింట్లు పుంజుకొని 74,626 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 106.6 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 72.75 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.28 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో స్వల్ప లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.01 శాతం పెరిగింది. నాస్డాక్ 0.26 శాతం లాభపడింది.మూడేళ్లుగా అలుపెరుగని లాభాల పరుగు తీసిన నిఫ్టీ, సెన్సెక్స్ ప్రభావంతో లార్జ్ క్యాప్స్‌తోపాటు.. పలు మధ్య, చిన్నతరహా స్టాక్స్ సైతం భారీగా ఎగశాయి. దీంతో దేశీ స్టాక్ మార్కెట్లు ఖరీదుగా మారినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో తలెత్తిన ప్రపంచ రాజకీయ, భౌగోళిక అనిశ్చితులు సెంటిమెంటును బలహీనపరిచాయి. యూఎస్ ప్రెసిడెంట్‌గా రిపబ్లికన్ ట్రంప్ ఎన్నికవడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు అధికమయ్యాయి. ట్రంప్ విధానాలపై అంచనాలతో డాలరు బలపడటం, ట్రెజరీ ఈల్డ్స్ మెరుగుపడటం రూపాయినీ దెబ్బతీసింది.ఇదీ చదవండి: పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ 20 శాతానికి పెంపుఅధికారం చేపట్టాక భారత్‌సహా పలు దేశాలపై ట్రంప్ ప్రతీకార టారిఫ్‌లకు దిగడం ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. మరోపక్క జీడీపీ వృద్ధికి దన్నుగా చైనా సహాయక ప్యాకేజీలకు ప్రకటించింది. భారత్‌తో పోలిస్తే చౌకగా ట్రేడవుతున్న చైనా స్టాక్స్ విదేశీ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఇవి చాలదన్నట్లు దేశ జీడీపీ వృద్ధి కొంత నెమ్మదించడం, అంచనాలు అందుకోని దేశీ కార్పొరేట్ల క్యూ3 ఫలితాలు తదితర అంశాలు ఎఫ్‌పీఐలను నిరాశపరచినట్లు వివరించారు. దీంతో ప్రధాన ఇండెక్సులను మించి మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు పతనమవుతున్నట్లు తెలియజేశారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ ముగిసే సమయానికి మిశ్రమ ఫలితాలను చవిచూశాయి. సెన్సెక్స్ 147.71 పాయింట్లు లేదా 0.20 శాతం లాభంతో.. 74,602.12 వద్ద, నిఫ్టీ 5.80 పాయింట్లు లేదా 0.026 శాతం నష్టంతో.. 22,547.55 వద్ద నిలిచాయి.మహీంద్రా అండ్ మహీంద్రా, భారతి ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, నెస్ట్లే ఇండియా, మారుతి సుజుకి ఇండియా వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. హిందాల్కో ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్, ట్రెంట్, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, హీరో మోటోకార్ప్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాలకు బ్రేక్.. లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:54 సమయానికి నిఫ్టీ(Nifty) 58 పాయింట్లు పెరిగి 22,610కు చేరింది. సెన్సెక్స్(Sensex) 281 పాయింట్లు పుంజుకొని 74,743 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 106.62 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 75.22 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.37 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.5 శాతం నష్టపోయింది. నాస్డాక్ 1.21 శాతం పడిపోయింది.వ్యయ ఒత్తిళ్లు, వాణిజ్య సుంకాల ఆందోళనలతో అమెరికా ఫిబ్రవరి సర్వీసెస్ యాక్టివిటీ 15 నెలల కనిష్టానికి చేరుకుంది. భారత్ ఐటీ రంగానికి అతిపెద్ద మార్కెట్ అమెరికాలో వృద్ధి మందగమనం, ద్రవ్యోల్బణ పెరుగుదల ఆందోళనలు నెలకొన్నాయి. అమెరికా ద్రవ్యోల్బణం, భారత క్యూ3 జీడీపీ వృద్ధి గణాంకాల వెల్లడి ముందు ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తూ అప్రమత్తత వహిస్తున్నారు. ట్రంప్ అధిక టారిఫ్‌ల అమలుతో ద్రవ్యోల్బణం ఎక్కువ కావచ్చనే ఆందోళనలు నెలకొన్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ.1.01 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి.బుధవారం (26న) మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మార్కెట్లు పనిచేయవు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్‌మార్కెట్లు బేర్.. ఐటీ షేర్లు విలవిల
దేశీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఈ వారం తొలి ట్రేడింగ్ సెషన్‌ను 1 శాతానికి పైగా నష్టంతో ముగించాయి. సెన్సెక్స్ 856.65 పాయింట్లు (1.14 శాతం) క్షీణించి 74,454.41 వద్ద స్థిరపడింది. ఈరోజు ఈ సూచీ 74,907.04-74,387.44 శ్రేణిలో ట్రేడ్ అయింది.నిఫ్టీ 50 కూడా 242.55 పాయింట్లు (1.06 శాతం) క్షీణించి 22,553.35 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 సోమవారం రోజు గరిష్టాన్ని 22,668.05 వద్ద, రోజు కనిష్టాన్ని 22,518.80 వద్ద నమోదు చేసింది.నిఫ్టీ 50లోని 50 షేర్లలో 38 షేర్లు నష్టాల్లో ముగియగా విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్ 3.70 శాతం వరకు నష్టాలతో టాప్ లూజర్స్‌గా నిలిచాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐషర్ మోటార్స్, హీరో మోటోకార్ప్, నెస్లే ఇండియా వంటి 12 షేర్లు 1.54 శాతం వరకు లాభాల్లో ముగిశాయి.ఇక నిఫ్టీ స్మాల్ క్యాప్ 100, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.02 శాతం, 0.94 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో, ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాలు నష్టాల్లో ముగిశాయి. బుధవారం (26న) మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
రెడ్‌లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:38 సమయానికి నిఫ్టీ(Nifty) 217 పాయింట్లు నష్టపోయి 22,578కు చేరింది. సెన్సెక్స్(Sensex) 696 పాయింట్లు దిగజారి 74,634 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 106.17 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 74.35 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.43 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 1.71 శాతం నష్టపోయింది. నాస్డాక్ 2.2 శాతం పడిపోయింది.ఇదీ చదవండి: ఆదాయపన్నులో మార్పులు.. తరచూ అడిగే ప్రశ్నలుదేశీ స్టాక్ మార్కెట్లో కొద్ది నెలలుగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) అమ్మకాలకే ఆసక్తి చూపుతున్నారు. ఈ నెలలోనూ ఇదే బాటలో కొనసాగుతున్నారు. దీంతో ఫిబ్రవరి 3–21 మధ్య నికరంగా రూ.23,710 కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య ఆందోళనల మధ్య దేశీ స్టాక్స్‌లో విక్రయాలకు తెరతీస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధానంగా ప్రపంచ పరిణామాలు దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశించనున్నాయి. బుధవారం (26న) మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాలతో ముగిసిన మార్కెట్లు.. టాప్ లూజర్స్ ఇవే..
దేశీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలైన బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఈ వారం చివరి ట్రేడింగ్ సెషన్‌ను ప్రతికూలంగా ముగించాయి. 30-షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 424.90 పాయింట్లు లేదా 0.56 శాతం నష్టంతో 75,311.06 వద్ద స్థిరపడింది. ఈరోజు ఇండెక్స్ 75,748.72 నుండి 75,112.41 పరిధిలో ట్రేడైంది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా 127.25 పాయింట్లు లేదా 0.51 శాతం తగ్గి 22,795.90 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఈరోజు గరిష్ట స్థాయి 22,921ను నమోదు చేయగా, కనిష్ట స్థాయి 22,720 గా ఉంది. నిఫ్టీ 50లోని 50 కాంపోనెంట్ స్టాక్‌లలో 35 నష్టాల్లో ముగిశాయి. మహీంద్రా & మహీంద్రా, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, టాటా మోటార్స్, విప్రో షేర్లు 6.20 శాతం వరకు నష్టాలతో టాప్ లూజర్స్‌గా నిలిచాయి.శుక్రవారం నిఫ్టీ మిడ్‌క్యాప్100, నిఫ్టీ స్మాల్‌క్యాప్100 సూచీలు వరుసగా 1.32 శాతం, 0.70 శాతం నష్టాలతో స్థిరపడటంతో విస్తృత మార్కెట్లు కూడా బెంచ్‌మార్క్‌లను ప్రతిబింబించాయి. నిఫ్టీ మెటల్ తప్ప మిగతా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ ఆటో అత్యధికంగా నష్టపోయింది. ఇది 2.58 శాతం తగ్గింది. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, హెల్త్‌కేర్, రియాల్టీ, ఫార్మా, ఓఎంసీ సూచీలు ఒక్కొక్కటి 1 శాతానికి పైగా నష్టంతో స్థిరపడ్డాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:35 సమయానికి నిఫ్టీ(Nifty) 23 పాయింట్లు నష్టపోయి 22,891కు చేరింది. సెన్సెక్స్(Sensex) 75 పాయింట్లు దిగజారి 75,658 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 106.4 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 76.45 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.49 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.43 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.47 శాతం పడిపోయింది.డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలతో నెలకొన్న అనిశ్చితుల మధ్య చోటుచేసుకునే అంతర్జాతీయ పరిణామాలపైకి ఇన్వెస్టర్ల దృష్టి మళ్లొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటికి అదనంగా డాలర్‌తో రూపాయి తీరు, బ్రెండ్ క్రూడ్ ధరలు సైతం ప్రభావం చూపించొచ్చని భావిస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, కరెన్సీ మారకంపై మార్కెట్ దృష్టి సారించొచ్చని అభిప్రాయపడ్డారు. దేశీయంగా ఎలాంటి ముఖ్యమైన సంకేతాలు లేకపోవడంతో అంతర్జాతీయ పరిణామాలు దేశీయ మార్కెట్ తీరును నిర్ణయించొచ్చని చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 203.22 పాయింట్లు లేదా 0.27 శాతం నష్టంతో 75,735.96 వద్ద, నిఫ్టీ 19.75 పాయింట్లు లేదా 0.086 శాతం నష్టంతో 22,913.15 వద్ద నిలిచాయి.శ్రీరామ్ ఫైనాన్స్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), మహీంద్రా అండ్ మహీంద్రా, భారత్ ఎలక్ట్రానిక్స్, అదానీ పోర్ట్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలోకి చేరాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతి సుజుకి ఇండియా, టెక్ మహీంద్రా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వంటి సంస్థలు నష్టాల జాబితాలోకి చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లోనే స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:24 సమయానికి నిఫ్టీ(Nifty) 72 పాయింట్లు నష్టపోయి 22,864కు చేరింది. సెన్సెక్స్(Sensex) 290 పాయింట్లు దిగజారి 75,639 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 107.05 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 75.8 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.51 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.24 శాతం లాభపడింది. నాస్డాక్ 0.07 శాతం పెరిగింది.ఇదీ చదవండి: పాలసీ జారీ తర్వాతే ప్రీమియం వసూలుడొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలతో నెలకొన్న అనిశ్చితుల మధ్య చోటుచేసుకునే అంతర్జాతీయ పరిణామాలపైకి ఇన్వెస్టర్ల దృష్టి మళ్లొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటికి అదనంగా డాలర్‌తో రూపాయి తీరు, బ్రెండ్ క్రూడ్ ధరలు సైతం ప్రభావం చూపించొచ్చని భావిస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, కరెన్సీ మారకంపై మార్కెట్ దృష్టి సారించొచ్చని అభిప్రాయపడ్డారు. దేశీయంగా ఎలాంటి ముఖ్యమైన సంకేతాలు లేకపోవడంతో అంతర్జాతీయ పరిణామాలు దేశీయ మార్కెట్ తీరును నిర్ణయించొచ్చని చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మళ్ళీ నష్టాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్లు
బుధవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలనే చవిచూశాయి. సెన్సెక్స్ 94.24 పాయింట్లు లేదా 0.12 శాతం నష్టంతో 75,873.15 వద్ద, నిఫ్టీ 28.15 పాయింట్లు లేదా 0.12 శాతం నష్టంతో 22,917.15 పాయింట్ల వద్ద నిలిచాయి.భారత్ ఎలక్ట్రానిక్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, ఐషర్ మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, లార్సెన్ అండ్ టుబ్రో వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్, అదానీ ఎంటర్ప్రైజెస్ వంటివి నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కొనసాగుతున్న స్టాక్ మార్కెట్ నష్టాలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:26 సమయానికి నిఫ్టీ(Nifty) 96 పాయింట్లు నష్టపోయి 22,852కు చేరింది. సెన్సెక్స్(Sensex) 322 పాయింట్లు దిగజారి 75,653 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 107.02 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 75.9 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.54 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.24 శాతం లాభపడింది. నాస్డాక్ 0.07 శాతం పెరిగింది.ఇదీ చదవండి: పీఎన్బీలో రూ.271 కోట్ల ఫ్రాడ్రూ.400 లక్షల కోట్ల దిగువకు సంపద స్టాక్ మార్కెట్ పతనం నేపథ్యంలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.400 లక్షల కోట్ల దిగువకు చేరుకుంది. మంగళవారం ఒక్కరోజే రూ.2.10 లక్షల కోట్లు హరించుకుపోయాయి. గతేడాది ఏప్రిల్ 8న బీఎస్ఈ మార్కెట్ క్యాప్ తొలిసారి రూ.400 లక్షల కోట్ల మార్క్‌ను అందుకుంది. గత సెప్టెంబర్ 27న జీవితకాల గరిష్టం రూ.479 లక్షల కోట్లకు చేరుకుంది. నాటి నుంచి నాటి నుంచి ఏకంగా రూ.81 లక్షల కోట్లు హరించుకుపోయింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 75,531 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. కానీ చివరికి 29 పాయింట్ల స్వల్ప నష్టంతో 75,967 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 22,801 కనిష్ట స్థాయిని, 22,992 గరిష్ట స్థాయిని తాకి, ఆ తర్వాత 14 పాయింట్లు తగ్గి 22,945 వద్ద ముగిసింది.సెన్సెక్స్ 30 షేర్లలో విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 3 శాతం వరకు లాభపడి టాప్ పెర్ఫార్మర్లలో ఉన్నాయి. టెక్ మహీంద్రా, జొమాటో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇతర స్పష్టమైన కదలికలు చేశాయి. మరోవైపు, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందుస్తాన్ యూనిలీవర్, అల్ట్రాటెక్ సిమెంట్, మహీంద్రా & మహీంద్రా, టీసీఎస్ ఒక్కొక్కటి 1 - 2 శాతం క్షీణించాయి.విస్తృత మార్కెట్లో బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ కూడా ఫ్లాట్ నోట్‌తో ముగిసింది. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ దాదాపు 1.5 శాతం క్షీణించింది. మొత్తంగా ఈరోజు మార్కెట్ 3:1 నిష్పత్తిలో బేర్లకు అనుకూలంగా నష్టాలను చూసింది. బీఎస్ఈలో దాదాపు 3,000 స్టాక్‌లు క్షీణించగా , 1,000 కంటే తక్కువ షేర్లు లాభపడ్డాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో కదలాడుతున్న స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:21 సమయానికి నిఫ్టీ(Nifty) 42 పాయింట్లు నష్టపోయి 22,918కు చేరింది. సెన్సెక్స్(Sensex) 83 పాయింట్లు దిగజారి 75,919 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 106.92 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 75.45 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.51 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.01 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.41 శాతం పెరిగింది.ఇదీ చదవండి: అడ్వైజర్లు, అనలిస్టులు అన్ని వివరాలు ఇవ్వాల్సిందేఎడాపెడా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) అమ్మకాలతో ఆందోళన చెందుతున్న మదుపరులకు కాస్త ఊరటనిచ్చే ప్రయత్నం చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పెట్టుబడులపై మంచి రాబడులను అందించే పటిష్ట స్థితిలో భారత ఎకానమీ ఉండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నారని ఆమె చెప్పారు. ‘ఎఫ్ఐఐలు తమకు అనువైనప్పుడు లేదా లాభాలను స్వీకరించే అవకాశం ఉన్నప్పుడు వైదొలుగుతూ ఉంటారు. భారత ఎకానమీలో నేడు పెట్టుబడులపై మంచి రాబడులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. దానికి తగ్గట్లే లాభాల స్వీకరణ కూడా జరుగుతోంది’ అని తెలిపారు. ఎఫ్ఐఐలు గతేడాది అక్టోబర్ నుంచి రూ.1.56 లక్షల కోట్ల మేర స్టాక్స్ అమ్మగా.. ఇందులో ఏకంగా రూ.లక్ష కోట్ల స్టాక్స్ విక్రయాలు ఈ ఏడాది స్వల్ప కాలంలోనే నమోదవడం తెలిసిందే.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వరుస నష్టాలకు బ్రేక్.. లాభాల్లోకి మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు తమ ప్రారంభ నష్టాలను తిప్పికొట్టి 8 రోజుల వరుస నష్టాలకు ముగింపు పలికాయి, సోమవారం సానుకూలంగా స్థిరపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 57.65 పాయింట్లు లేదా మునుపటి ముగింపుతో పోలిస్తే 0.08 శాతం పెరిగి 75,996.86 వద్ద ముగిసింది. దీని ఇంట్రా-డే కనిష్ట స్థాయి 75,294.76 నుండి దాదాపు 702.10 పాయింట్లు పెరిగింది. మునుపటి ఎనిమిది వరుస ట్రేడింగ్ సెషన్లలో బీఎస్ఈ సెన్సెక్స్ 3.4 శాతం లేదా 2,645 పాయింట్లు పడిపోయింది.అదేవిధంగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 30.25 పాయింట్లు లేదా 0.13 శాతం పెరిగి 22,959.50 వద్ద ముగిసింది. సోమవారం ఈ ఇండెక్స్ 22,974.20 నుండి 22,725.45 పరిధిలో ట్రేడయింది. నిఫ్టీ50లోని 50 కాంపోనెంట్ స్టాక్‌లలో 34 లాభాలతో ముగిశాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అదానీ పోర్ట్స్ 3.93 శాతం వరకు లాభాలను ఆర్జించాయి. మహీంద్రా & మహీంద్రా, భారతి ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎన్ఎస్ఈ నిఫ్టీ50లో అత్యధికంగా వెనుకబడిన వాటిలో ఉన్నాయి, 3.45 శాతం వరకు నష్టాలు సంభవించాయి. ట్రేడింగ్ సెషన్ రెండవ భాగంలో విస్తృత మార్కెట్లు కూడా కోలుకున్నాయి, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 0.39 శాతం లాభాలతో స్థిరపడింది. మరోవైపు, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.04 శాతం స్వల్ప లాభాలతో ముగిసింది. అయితే, మార్కెట్ విస్తృతి ప్రతికూలంగానే ఉంది. ఎన్ఎస్ఈలో ట్రేడవుతున్న 2,955 స్టాక్‌లలో 1,014 లాభాలతో ముగియగా, 1,871 స్టాక్‌లు క్షీణించాయి. 70 స్టాక్‌లు మాత్రం మారలేదు. ఎన్ఎస్ఈలోని రంగాలలో, ఫార్మా, బ్యాంకులు, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్‌కేర్, ఓఎంసీలు, కన్స్యూమర్ డ్యూరబుల్స్, మెటల్స్ లాభాలతో ముగిశాయి. గ్లెన్‌మార్క్ ఫార్మా , అజంతా ఫార్మా నేతృత్వంలో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 1.27 శాతం లాభపడి ముగిసింది. కాగా నిఫ్టీ ఆటో, ఎఫ్ఎంసీజీ, ఐటీ, మీడియా సూచీలు 0.71 శాతం వరకు తగ్గాయి. -
తొమ్మిది సెషన్ల నుంచి నష్టాలే..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. దాంతో సూచీలు వరుసగా తొమ్మిది సెషన్లుగా నష్టాల్లో ట్రేడవుతున్నట్లు తెలుస్తుంది. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ(Nifty) 103 పాయింట్లు నష్టపోయి 22,835కు చేరింది. సెన్సెక్స్(Sensex) 309 పాయింట్లు దిగజారి 75,621 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 106.67 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 74.81 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.47 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.01 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.41 శాతం పెరిగింది.ఇదీ చదవండి: బుల్స్ అప్రమత్తంగా ఉండాల్సిందే..డిసెంబర్ త్రైమాసికం ఫలితాలు ముగిసిపోయాయి. డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలతో నెలకొన్న అనిశ్చితుల మధ్య చోటుచేసుకునే అంతర్జాతీయ పరిణామాలపైకి ఇన్వెస్టర్ల దృష్టి మళ్లొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటికి అదనంగా డాలర్‌తో రూపాయి తీరు, బ్రెండ్ క్రూడ్ ధరలు సైతం ప్రభావం చూపించొచ్చని భావిస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, కరెన్సీ మారకంపై మార్కెట్ దృష్టి సారించొచ్చని అభిప్రాయపడ్డారు. దేశీయంగా ఎలాంటి ముఖ్యమైన సంకేతాలు లేకపోవడంతో అంతర్జాతీయ పరిణామాలు దేశీయ మార్కెట్ తీరును నిర్ణయించొచ్చని చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) నిఫ్టీ 50 102.15 పాయింట్లు లేదా 0.44 శాతం తగ్గి 22,929.25 వద్ద ముగిసింది. ఈ రోజు ఈ ఇండెక్స్ గరిష్టంగా 23,133.7 వద్ద, కనిష్టంగా 22,774.85 వద్ద నమోదైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 199.76 పాయింట్లు లేదా 0.26 శాతం తగ్గి 75,939.21 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ గరిష్టం 76,138.97, కనిష్టం 75,439.64 వద్ద నమోదైంది.బ్రిటానియా, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే, ఇన్ఫోసిస్, టీసీఎస్ స్టాక్స్ టాప్ గెయినర్స్‌గా లాభాలను అందుకోగా, అదానీ పోర్ట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, ట్రెంట్, సన్ ఫార్మా షేర్లు టాప్ లూజర్స్‌గా నష్టాలను చవిచూశాయి. భారత్ సహా ఇతర దేశాలపై రెసీప్రోకల్ టారిఫ్‌లను విధిస్తాననే నిర్ణయాన్ని ట్రంప్ సమర్థించుకోవడం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో వాణిజ్య యుద్ధ భయాల నేపథ్యంలో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నడుమ ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. మధ్యాహ్న సమయంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడయ్యాయి.నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ శుక్రవారం అధికారికంగా 'బేర్' దశలోకి ప్రవేశించింది. ఇండెక్స్ దాని గరిష్ట స్థాయి 19,716.20 నుండి దాదాపు 22 శాతం పడిపోయింది. శుక్రవారం ఇండెక్స్ దాదాపు 4 శాతం నష్టపోయి 15,373.70 స్థాయిల వద్ద ముగిసింది. శుక్రవారం నాటి పతనం విస్తృత మార్కెట్లలో అంతటా అమ్మకాల ఒత్తిడితో జరిగింది. దీంతో మిడ్‌క్యాప్‌లు కూడా బలహీనంగా ముగిశాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ఇండెక్స్ శుక్రవారం ట్రేడింగ్‌లో దాదాపు 2.5 శాతం నష్టపోయి 18,325.40 స్థాయిల వద్ద ముగిసింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్థిరంగా కదలాడుతున్న స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:33 సమయానికి నిఫ్టీ(Nifty) 2 పాయింట్లు పెరిగి 23,034కు చేరింది. సెన్సెక్స్(Sensex) 54 పాయింట్లు ఎగబాకి 76,174 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 107.05 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 75.17 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.53 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 1.04 శాతం పుంజుకుంది. నాస్డాక్ 1.5 శాతం పెరిగింది.ఇదీ చదవండి: వాహన జోరుకు యూవీల తోడునిన్నటి ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ నేపథ్యంలో తీవ్ర ఒడిదుడులకు లోనయ్యాయి. ట్రేడింగ్‌లో అధిక సమయం లాభాల్లో కదలాడాయి. ఫార్మా, మెటల్, ఫైనాన్స్, విద్యుత్, టెలికం షేర్లుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అమెరికా జనవరి ద్రవ్యోల్బణం అంచనాలకు మించడంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై ఆశలు రేకెత్తాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడయ్యాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మళ్ళీ నష్టాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం లాభాల బాటపట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 32.11 పాయింట్లు లేదా 0.042 శాతం నష్టంతో 76,138.97 వద్ద, నిఫ్టీ 13.85 పాయింట్లు లేదా 0.060 శాతం నష్టంతో 23,031.40 వద్ద నిలిచాయి.బజాజ్ ఫిన్సర్వ్, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, సిప్లా వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, హీరో మోటోకార్ప్, ఇన్ఫోసిస్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
23,000 మార్కు పైనే ముగిసిన నిఫ్టీ
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ(Nifty) 26 పాయింట్లు నష్టపోయి 23,045 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 122 పాయింట్లు దిగజారి 76,171 వద్దకు చేరింది. ఇటీవల భారీగా మార్కెట్లు పడిపోతున్నాయి. గతవారం ట్రెండ్ ఈవారం కొనసాగే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు భారీగా పతనమయ్యాయి.సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆల్ట్రాటెక్ సిమెంట్, జొమాటో, టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్, హెచ్‌యూఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ స్టాక్‌లు లాభాల్లో ముగిశాయి. ఎం అండ్ ఎం, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టైటాన్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, సన్ ఫార్మా స్టాక్‌లు భారీగా నష్టపోయాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మళ్ళీ నష్టాల్లోనే ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మళ్ళీ నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 గంటలకు సెన్సెక్స్ 223.97 పాయింట్లు లేదా 0.29 శాతం నష్టంతో.. 76,069.63 వద్ద, నిఫ్టీ 105.85 పాయింట్లు లేదా 0.46 శాతం నష్టంతో 22,965.95 వద్ద సాగుతున్నాయి.టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటోకార్ప్, భారత్ ఎలక్ట్రానిక్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ఇండ్ బ్యాంక్ మొదలైనవి నష్టాల్లో సాగుతున్నాయి.అమెరికా వాణిజ్య యుద్ధ భయాలు వెంటాడటంతో దేశీ స్టాక్ సూచీలు వసరుసగా నష్టాలనే చవి చూస్తున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, నిరుత్సా హపరుస్తున్న కార్పొరేట్ ఫలితాలు మార్కెట్లపై మరింత ఒత్తిడి పెంచాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 1,018 పాయింట్లు పతనమై 76,294 వద్ద ముగిసింది. నిఫ్టీ 310 పాయింట్లు నష్టపోయి 23,072 వద్ద నిలిచింది. స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు రోజంతా అదే బాటలో నడిచాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,281 పాయింట్లు కోల్పోయి 76,031 వద్ద, నిఫ్టీ 395 పాయింట్లు నష్టపోయి 22,986 వద్ద కనిష్టాలు తాకాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
5 రోజుల్లో రూ.17,00,000 కోట్లు ఆవిరి
ముంబై: అమెరికా వాణిజ్య యుద్ధ భయాలు వెంటాడటంతో దేశీ స్టాక్ సూచీలు అయిదో రోజూ నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, నిరుత్సా హపరుస్తున్న కార్పొరేట్ ఫలితాలు మార్కెట్లపై మరింత ఒత్తిడి పెంచాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 1,018 పాయింట్లు పతనమై 76,294 వద్ద ముగిసింది. నిఫ్టీ 310 పాయింట్లు నష్టపోయి 23,072 వద్ద నిలిచింది. స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు రోజంతా అదే బాటలో నడిచాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,281 పాయింట్లు కోల్పోయి 76,031 వద్ద, నిఫ్టీ 395 పాయింట్లు నష్టపోయి 22,986 వద్ద కనిష్టాలు తాకాయి.⇒ మార్కెట్ వరుస పతనంతో 5 రోజుల్లో రూ.17 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. మంగళవారం రూ.9.29 లక్షల కోట్లు హరించుకుపోయింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.408.52 లక్షల కోట్ల(4.70 ట్రిలియన్ డాలర్లు)కు పడిపోయింది. ⇒ సెన్సెక్స్ మొత్తం 30 షేర్లలో ఒక్క ఎయిర్టెల్ (0.19%) మాత్రమే స్వల్ప లాభంతో గట్టెక్కింది. అత్యధికంగా జొమాటో 5%, టాటా స్టీల్ 3%, బజాజ్ ఫిన్సర్వ్ 2.70%, పవర్ గ్రిడ్ 2.65%, ఎల్అండ్టీ 2.60% నష్టపోయాయి. ఈ సూచీ గత రోజుల్లో 2,290 పాయింట్లు(3%) కోల్పోయింది. నిఫ్టీ ఇండెక్స్ 668 పాయింట్లు(2.81%) నష్టపోయింది. ⇒ రంగాల వారీగా రియల్టీ ఇండెక్స్ 3.14% క్షీణించింది. ఇండ్రస్టియల్ 3%, కన్జూమర్ డి్రస్కేషరీ 2.73%, క్యాపిటల్ గూడ్స్ 2.60%, ఆటో 2.50%, మెటల్ 2.23 శాతం చొప్పున పతనమయ్యాయి. బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు 3.40%, 2.88 శాతం క్షీణించాయి. నష్టాలకు కారణాలు⇒ అమెరికా ఇండ్రస్టియల్ రంగాన్ని గాడిన పెట్టేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25% టారిఫ్‌లు విధించారు. ఎలాంటి మినహాయింపులు, కోటాలు లేకుండా అన్ని దేశాలపై టారిఫ్‌లు ఫ్లాట్‌గా 25% ఉంటాయన్నారు. దీంతో గతంలో టారిఫ్‌లు అధికంగా లేని కెనడా, బ్రెజిల్, మెక్సికో, దక్షిణ కొరియా సహా ఇతర దేశాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ట్రంప్ నిర్ణయం దేశాల మధ్య వాణిజ్య యుద్ధాన్ని తీవ్రతరం చేసేలా ఉందని ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు. ⇒ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అమెరికా వాణిజ్య సుంకాల విధింపు, ద్రవ్యోల్బణం అంశాలపై సెనేట్ బ్యాకింగ్, హౌసింగ్ అర్బన్ అఫైర్స్ కమిటీ ముందు మాట్లాడనున్నారు. దీంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు. ⇒ విదేశీ ఇన్వెస్టర్లు 2025లోనే 9.94 బిలియన్ డాలర్లు విలువ చేసే ఈక్విటీలను విక్రయించారు. -
చిన్న షేర్లు విలవిల సిప్ పెట్టుబడులు డిప్
నాలుగేళ్లుగా దేశీ స్టాక్ మార్కెట్ల(Stock markets)లో బుల్ ట్రెండ్ కొనసాగడంతో ఇండెక్సులు సరికొత్త గరిష్టాలను చేరాయి. అయితే ఉన్నట్టుండి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) అమ్మకాల బాట పట్టడం, రాజకీయ భౌగోళిక అనిశ్చితులు వంటి అంశాలు సెంటిమెంటును దెబ్బకొట్టాయి. దీంతో గతేడాది అక్టోబర్ మొదలు స్టాక్ మార్కెట్లు(Stock markets) తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా మిడ్, స్మాల్ క్యాప్స్‌లో కొద్ది రోజులుగా అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా ఇప్పటికే బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు సెప్టెంబర్‌లో నమోదైన గరిష్టాల నుంచి 17 శాతానికిపైగా పతనమయ్యాయి. వెరసి గత ఆరు నెలల్లో పలు స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో చేసిన పెట్టుబడులకు నష్టాలు వాటిల్లుతున్నాయి. మరోపక్క మార్కెట్ ప్రధాన ఇండెక్సులు సెన్సెక్స్, నిఫ్టీ సైతం 12 శాతం క్షీణించాయి. సిప్ బేజారు...నిజానికి గత కేలండర్ ఏడాది(2024)లో క్రమానుగత పెట్టుబడి పథకాలు(సిప్) భారీస్థాయిలో పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. సిప్ మార్గంలో మ్యూచువల్ ఫండ్స్‌లోకి రూ. 2.89 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రవహించాయి. యాక్టివ్ స్మాల్ క్యాప్ ఫండ్స్‌కు గతేడాది రూ. 35,000 కోట్ల పెట్టుబడులు లభించాయి. ఇదే కాలంలో లార్జ్ క్యాప్ ఫండ్స్ పెట్టుబడులతో పోలిస్తే ఇవి రెట్టింపు..! అయితే గత 6 నెలలుగా పలు స్మాల్ క్యాప్ ఫండ్స్‌కు చెందిన సిప్ పథకాలపై రిటర్నులు ప్రతికూలంగా నమోదవుతున్నా యి. 2024 డిసెంబర్లో ఇన్వెస్టర్లు 4.5 మిలియన్ సిప్ ఖాతాలను మూసివేశారు. ఇంతక్రితం 2024 మే నెలలో మాత్రమే 4.4 మిలియన్ సిప్ ఖాతాలు నిలిచిపోయాయి. నేలచూపులో వివిధ మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో సిప్ పెట్టుబడుల తీరును గమనిస్తే.. మూడేళ్ల కాలంలో మంచి పనితీరునే చూపినప్పటికీ ఏడాది కాలాన్ని పరిగణిస్తే ప్రతికూల ప్రతిఫలాలు నమోదవుతున్నాయి. వివిధ మిడ్ క్యాప్ ఫండ్స్ జాబితాలో క్వాంట్ను తీసుకుంటే గత మూడేళ్లలో 19 శాతం రిటర్నులు అందించగా.. గత 12 నెలల్లో 15.6 శాతం క్షీణతను చవిచూసింది. ఈబాటలో టారస్ మూడేళ్లలో 15 శాతం లాభపడగా.. ఏడాది కాలంలో 12 శాతంపైగా నీరసించింది. మిరే అసెట్ మూడేళ్లలో 18 శాతం పుంజుకోగా.. ఏడాదిలో 6 శాతంపైగా నష్టపోయింది. ఇదేవిధంగా టాటా గ్రోత్, యూటీఐ, ఏబీఎస్ఎల్, మహీంద్రా మాన్యులైఫ్ మూడేళ్లలో 20–24 శాతం రిటర్నులు అందించినప్పటికీ ఏడాది కాలాన్ని పరిగణిస్తే 5–4 శాతం మధ్య తగ్గాయి. ఎఫ్‌పీఐల అమ్మకాలు2024 అక్టోబర్ నుంచి ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్స్‌లో విక్రయాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫలితంగా అక్టోబర్ మొదలు ఇప్పటి(ఫిబ్రవరి7)వరకూ ఎఫ్‌పీఐలు రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. కొత్త ఏడాది(2025) జనవరి నుంచి చూస్తే రూ. లక్ష కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ ఏడాది కనిష్టాలకు..బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లో 131 షేర్లు తాజాగా 52 వారాల కనిష్టాలను తాకాయి. ఈ జాబితాలో డెల్టా కార్ప్ హోనసా కన్జూమర్, జేకే టైర్, మిశ్రధాతు నిగమ్, టాటా కెమికల్స్, ఎన్సీసీ, రైట్స్, మదర్సన్ సుమీ, ఎస్కేఎఫ్ ఇండియా చేరాయి. గత రెండు నెలల్లో 433 చిన్న షేర్ల మార్కెట్ విలువలో 20%ఆవిరైంది. వీటిలో 100 షేర్ల విలువ 30–40% మధ్య పతనమైంది. గత నెల రోజుల్లో రెండేళ్లుగా ఇన్వెస్టర్లను ఆకట్టుకున్న పలు కౌంటర్లు 40–30 శాతం మధ్య పతనమయ్యాయి. జాబితాలో న్యూజెన్ సాఫ్ట్వేర్, కేన్స్ టెక్నాలజీ ఇండియా, అపార్ ఇండస్ట్రీస్, నెట్వెబ్ టెక్నాలజీస్, జూపిటర్ వేగన్స్, స్టెర్లింగ్ అండ్ విల్సన్, అనంత్‌రాజ్, రామకృష్ణ ఫోర్జింగ్స్ చేరాయి. -
ట్రంప్ ఎఫెక్ట్!.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం కూడా నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 1031.25 పాయింట్లు లేదా 1.31 పాయింట్ల నష్టంతో 76,296.55 వద్ద, నిఫ్టీ 309.80 పాయింట్లు లేదా 1.32 శాతం నష్టంతో.. 23,071.80 వద్ద నిలిచాయి. ఈ వారంలో రెండూ రోజు కూడా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాను.అదానీ ఎంటర్ప్రైజెస్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ట్రెంట్, భారతి ఎయిర్టెల్, హిందాల్కో ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్, శ్రీరామ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించిన, ఉక్కు దిగుమతులపై కొత్త సుంకాలకు సంబంధించి ఇన్వెస్టర్లలో ఆందోళనలు మొదలయ్యాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో స్టీల్ కంపెనీల షేర్లు గణనీయంగా తగ్గాయి. అంతే కాకుండా అమెరికా వస్తువులపై చైనా అదనపు సుంకాలు విధించడం వంటి ఇతర దేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక సమస్యలు కూడా భారతీయ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. ఒక్కరోజే రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి!
ముంబై: స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాలు చవిచూశాయి. 1,000పైగా పాయింట్ల నష్టంతో 76,356 వద్ద సెన్సెక్స్ ట్రేడవుతుండగా, నిఫ్టీ 305 పాయింట్లు కోల్పోయింది. మొత్తంగా.. ఇవాళ ఒక్కరోజే రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరైనట్లు తెలుస్తోంది. మార్కెట్లు భారీగా క్షీణించడానికిగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.స్టీల్ టారిఫ్ ఆందోళనలు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఉక్కు దిగుమతులపై కొత్త సుంకాలకు సంబంధించి ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో స్టీల్ కంపెనీల షేర్లు గణనీయంగా క్షీణించాయి.పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్: పది సంవత్సరాల కాలపరిమితికి సంబంధించి ఇండియా, అమెరికా గవర్నమెంట్ బాండ్లపై రాబడులు పెరిగాయి. ఈక్విటీల కంటే బాండ్లు సురక్షితం కాబట్టి, మదుపర్లు వీటిపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దాంతో మార్కెట్లోని తమ పెట్టుబడులను ఉపసంహరించి బాండ్లలో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నారు.ఇదీ చదవండి: రూ.6,000 కోట్లతో ‘అదానీ హెల్త్ సిటీస్’రంగాలవారీ ప్రభావం: లోహాలు, రియల్టీ, మీడియా, హెల్త్ కేర్ సహా వివిధ రంగాల షేర్లు భారీగా క్షీణించాయి. ఇది మొత్తం మార్కెట్ తిరోగమనానికి దోహదం చేసింది.అంతర్జాతీయ ఆర్థిక అంశాలు: అమెరికా వస్తువులపై చైనా అదనపు సుంకాలు విధించడం వంటి ఇతర దేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక సమస్యలు కూడా భారతీయ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. -
స్టాక్మార్కెట్లో కొనసాగుతున్న నష్టాలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:51 సమయానికి నిఫ్టీ(Nifty) 82 పాయింట్లు నష్టపోయి 23,303కు చేరింది. సెన్సెక్స్(Sensex) 243 పాయింట్లు దిగజారి 77,065 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 108.4 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 76.13 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.5 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.67 శాతం లాభపడింది. నాస్డాక్ 0.98 శాతం ఎగబాకింది.అమెరికాకు వచ్చే స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25% టారిఫ్‌లు విధిస్తామని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనతో స్టాక్ సూచీలు నిన్నటి మార్కెట్లో భారీగానే పైగా నష్టపోయాయి. అలాగే తమపై పన్నులు విధించే దేశాలపై తిరిగి పన్నులు విధిస్తామని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగడం, రూపాయి కొత్త కనిష్టానికి చేరుకోవడమూ మరింత ఒత్తిడి పెంచాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమాయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 548.39 పాయింట్లు లేదా 0.70 శాతం నష్టంతో.. 77,311.80 వద్ద, నిఫ్టీ 182.85 పాయింట్లు లేదా 0.78 శాతం నష్టంతో.. 23,377.10 వద్ద నిలిచాయి.కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతి ఎయిర్టెల్, బ్రిటానియా ఇండస్ట్రీస్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. ట్రెంట్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, టాటా స్టీల్, టైటాన్ కంపెనీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మళ్ళీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
స్వల్ప లాభాల్లో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి మళ్ళీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 211.41 పాయింట్లు లేదా 0.27 శాతం నష్టంతో 77,846.74 వద్ద, నిఫ్టీ 43.40 పాయింట్లు లేదా 0.18 శాతం నష్టంతో 23,559.95 పాయింట్ల వద్ద నిలిచాయి.టాటా స్టీల్, భారతి ఎయిర్టెల్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, ట్రెంట్, హిందాల్స్కో ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), ఐటీసీ కంపెనీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.రెపో రేటు తగ్గించిన ఆర్బీఐరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఇది 6.25 శాతానికి వచ్చింది. ఖర్చులను పెంచడానికి, వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో వ్యక్తిగత పన్ను రేట్లను తగ్గించిన క్రమంలోనే ఈ రేటు తగ్గింపు నిర్ణయం కూడా రావడం గమనార్హం.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఆర్బీఐ రేట్లపైనే గురి.. స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆర్బీఐ (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈరోజు కీలక వడ్డీ రేటు ప్రకటనలు చేయనున్న నేపథ్యంలో బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ (BSE) సెన్సెక్స్, నిఫ్టీ50 జాగ్రత్తగా కదులుతున్నాయి.సెషన్ ప్రారంభ సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 87.80 పాయింట్లు లేదా 0.11 శాతం పెరిగి 78,145.96 వద్ద ఉంది. అలాగే నిఫ్టీ 50 (Nifty) 35.05 పాయింట్లు లేదా 0.15 శాతం లాభంతో 23,638.40 వద్ద ఉంది.రెండు రోజుల చర్చల తర్వాత, ఆర్థిక వ్యవస్థ స్థితి, జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణ అంచనాలపై వ్యాఖ్యానాలతో పాటు, వడ్డీ రేట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ (MPC) నిర్ణయం కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా తన మొదటి ఎంపీసీ నిర్ణయాన్ని ఈరోజు ప్రకటిస్తున్నారు.మరోవైపు యూస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మరో కనిష్ట స్థాయిని తాకింది. కేంద్ర బ్యాంకు వడ్డీ రేటు నిర్ణయం వెలువడే ముందు గురువారం భారత ప్రభుత్వ బాండ్ దిగుబడి కూడా స్వల్పంగా తగ్గింది. అంతేకాకుండా, ఎంపీసీ నిర్ణయం తర్వాత బాండ్ల ద్వారా దాదాపు రూ. 14,000 కోట్లు సేకరించడానికి ప్రభుత్వ యాజమాన్యంలోని ప్రధాన సంస్థలు దేశీయ రుణ మూలధన మార్కెట్‌ను ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మళ్ళీ నష్టాల్లోకి దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం స్థిరంగా మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 213.12 పాయింట్లు లేదా 0.27 శాతం నష్టపోయి 78,058.16 వద్ద, నిఫ్టీ 92.95 పాయింట్లు లేదా 0.39 శాతం నష్టపోయి 23,603.35 వద్ద నిలిచాయి.సిప్లా, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ వంటి కంపెనీలు లాభాలను చవి చూశాయి. ట్రెంట్, భారత్ ఎలక్ట్రానిక్స్, భారతి ఎయిర్టెల్, టైటాన్ కంపెనీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) వంటి సంస్థలు నష్టాల జాబితాలోకి చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market ) బుధవారం నష్టాల్లో ముగిశాయి. బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలైన బీఎస్ఈ సెన్సెక్స్ (Sensex), ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 (Nifty) అస్థిరమైన సెషన్‌ను ప్రతికూలంగా ముగించాయి. వీఎస్ఈ సెన్సెక్స్ 312.53 పాయింట్లు లేదా 0.40 శాతం తగ్గి 78,271.28 వద్ద స్థిరపడింది. ఈరోజు ఇండెక్స్ 78,735.41 - 78,226.26 పరిధిలో ట్రేడైంది. సెన్సెక్స్‌ను ప్రతిబింబిస్తూ నిఫ్టీ 50 కూడా 42.95 పాయింట్లు లేదా 0.18 శాతం నష్టపోయి 23,696.30 వద్ద ముగిసింది. ఈ సూచీ ఈరోజు గరిష్ట స్థాయి 23,807.30ని నమోదు చేయగా, కనిష్ట స్థాయి 23,680.45గా ఉంది.నిఫ్టీ 50 లోని 25 షేర్లు నష్టాల్లో ముగిశాయి. వీటిలో ఏషియన్ పెయింట్స్, టైటాన్ కంపెనీ, నెస్లే ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్, టాటా కన్స్యూమర్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. వీటి నష్టాలు 3.40 శాతం వరకు నమోదయ్యాయి. మరోవైపు ఓఎన్జీసీ, హిందాల్కో, అపోలో హాస్పిటల్స్, బీపీసీఎల్ టాప్ గెయినర్స్‌గా 2.90 శాతం వరకు లాభాలను అందుకున్నాయి. ఇక విస్తృత మార్కెట్లు బెంచ్‌మార్క్‌లను అధిగమించాయి. స్మాల్-క్యాప్ షేర్లు ముందంజలో ఉన్నాయి. నిఫ్టీ స్మాల్‌క్యాప్100 ఇండెక్స్ 1.85 శాతం లాభపడింది. నిఫ్టీ మిడ్‌క్యాప్100 ఇండెక్స్ 0.68 శాతం లాభాలతో స్థిరపడింది. ఎన్ఎస్ఈలో రంగాల సూచీల్లో నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, రియాల్టీ, ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్ ఇండెక్స్‌లు 1.75 శాతం వరకు నష్టపోయాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, మెటల్, ఓఎంసీలు, మీడియా ఇండెక్స్‌లు ఒక్కొక్కటి 1 శాతానికి పైగా లాభపడ్డాయి.అమెరికా సుంకాల విషయంలో మెక్సికో, కెనడాకు తాత్కాలిక ఊరట లభించడంతో అంతర్జాతీయ మార్కెట్లలోనూ సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం(ఫిబ్రవరి7న) విధాన నిర్ణయాలను ప్రకటించనుంది. చాన్నాళ్ల తర్వాత ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత 11 సమావేశాలలో వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 6.5 శాతం వద్దే యథాతథంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4 శాతానికి పరిమితం కానున్న అంచనాల నేపథ్యంలో ఈసారి ఆర్బీఐ రెపో రేటును పావు శాతం తగ్గించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు భారీ లాభాలను చవి చూశాయి. మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,203.43 పాయింట్లు లేదా 1.56 శాతం లాభంతో 78,390.17 వద్ద, నిఫ్టీ 373.80 పాయింట్లు లేదా 1.60 శాతం లాభంతో.. 23,734.85 వద్ద నిలిచాయి.శ్రీరామ్ ఫైనాన్స్, లార్సెన్ & టూబ్రో, భారత్ ఎలక్ట్రానిక్స్, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి సంస్థలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ట్రెంట్, బ్రిటానియా ఇండస్ట్రీస్, హీరో మోటోకార్ప్, నెస్లే ఇండియా, ఐచర్ మోటార్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.గత కొన్ని రోజులుగా వరుస నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఈ రోజు (ఫిబ్రవరి 4)న శుభారంభం పలికాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాల్లో దూసుకెళ్లాయి. ఇకపోతే.. కొత్త ఏడాదిలో తొలిసారి పరపతి సమీక్షను చేపట్టనున్న రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం(7న) విధాన నిర్ణయాలను ప్రకటించనుంది. దాదాపు ఐదేళ్ల తదుపరి ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 319.22 పాయింట్లు లేదా 0.41 శాతం నష్టంతో.. 77,186.74 వద్ద, నిఫ్టీ 122.85 పాయింట్లు లేదా 0.52 శాతం నష్టంతో 23,359.30 వద్ద ఉన్నాయి.బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, విప్రో, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. లార్సెన్ & టూబ్రో, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, కోల్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బాహుబలికి కళ్లెం..!
ముంబై: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై స్టాక్ మార్కెట్ ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ అన్న చందంగా స్పందించింది. శనివారం జరిగిన ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లో స్టాక్ సూచీలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కోని... చివరికి ఫ్లాటుగా ముగిశాయి. వినియోగంపైనే దృష్టి సారిస్తూ.., మూలధన వ్యయాల కేటాయింపు అశించిన స్థాయిలో లేకపోవడం మార్కెట్ వర్గాలను నిరాశపరిచింది. సెన్సెక్స్ అయిదు పాయింట్ల స్వల్ప లాభంతో 77,506 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 26 పాయింట్లు కోల్పోయి 23,482 వద్ద నిలిచింది. మార్కెట్లో మరిన్ని సంగతులు → కొత్తగా ఆరు వ్యవసాయ పథకాల ప్రకటనతో పాటు కిసాన్ కార్డుల రుణ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడంతో పాటు అగ్రికల్చర్ షేర్లకు భారీ డిమాండ్ లభించింది. కావేరీ సీడ్స్ , పారదీప్ పాస్ఫేట్, మంగళం సీడ్స్, నాథ్ బయో–జీన్స్, బేయర్ క్రాప్‌సైన్సెస్, పీఐ ఇండస్ట్రీస్ షేర్లు 7% నుంచి అరశాతం పెరిగాయి. మరోవైపు కెమికల్స్ రంగానికి సంబంధించి ఎలాంటి ప్రోత్సాహక చర్యలు లేకపోవడంతో చంబల్ ఫెర్టిలైజర్స్, ధమాకా అగ్రిటెక్, టాటా కెమికల్స్, కోరమాండల్ షేర్లు 3% నుంచి అరశాతం నష్టపోయాయి. → ఒక వ్యక్తి గరిష్టంగా రెండు ఇళ్లనూ సొంతానికి వినియోగిస్తున్నట్లు ప్రకటించడం ద్వారా ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదంటూ బడ్జెట్లో ప్రతిపాదనతో రియల్టీ రంగ షేర్లు పరుగులు పెట్టాయి. ప్రస్తుతం ఒక ఇంటికే ఈ ప్రయోజనం అమల్లో ఉంది. ఫినిక్స్ మిల్స్, మాక్రోటెక్, ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ప్రాపరీ్టస్, శోభ షేర్లు 7% నుంచి 4 శాతం లాభపడ్డాయి. సిగ్నేచర్ గ్లోబల్, డీఎల్ఎఫ్, ఒబెరాయ్ రియలిటి, గోద్రేజ్ ప్రాపర్టీస్ షేర్లు 3 నుంచి ఒకశాతం పెరిగాయి. → లెదర్ రంగంలో ఉత్పత్తి, నాణ్యత, పోటీతత్వాన్ని పెంచేందుకు త్వరలో ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెడతామంటూ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటనతో ఫుట్‌వేర్ షేర్లు పరుగులు తీశాయి. మీర్జా ఇంటర్నేషనల్ 20% ఎగసి అప్పర్ సర్క్యూట్ తాకింది. క్యాంపస్ ఆక్టివేర్ 7%, బాటా ఇండియా 6%, మెట్రో బ్రాండ్స్ 4%, లెహర్ ఫుట్‌వేర్స్ 3%, రిలాక్సో పుట్వేర్స్ ఒకశాతం పెరిగాయి. ట్రేడింగ్ సాగిందిలా...స్టాక్ సూచీలు ఉదయం సానుకూలంగా మొదలయ్యాయి. సెన్సెక్స్ 136 పాయింట్లు పెరిగి 77,501 వద్ద, నిఫ్టీ 21 పాయింట్ల లాభంతో 23,529 వద్ద మొదలయ్యాయి. బడ్జెట్‌పై భారీ ఆశలతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం ప్రారంభమయ్యే వరకు లాభాల్లోనే కదలాడింది. ఒక దశలో సెన్సెక్స్ 400 పాయింట్లు లాభపడి 77,899 వద్ద, నిఫ్టీ 124 పాయింట్లు ఎగసి వద్ద గరిష్టాలు తాకాయి. బడ్జెట్ ప్రసంగం మొదలైన కొద్ది సేపటికి నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ గరిష్టం నుంచి ఏకంగా దాదాపు 893 పాయింట్లు కోల్పోయి 77,006 వద్దకు చేరింది. నిఫ్టీ ఇంట్రాడే గరిష్టం 314 పాయింట్లు పతనమై 23,318 వద్ద కనిష్టాలు తాకాయి. ప్రసంగం పూర్తయిన తర్వాత తిరిగి కొనుగోళ్లు నెలకొనడంతో నష్టాలు భర్తీ చేసుకున్న సూచీలు మిశ్రమంగా ముగిశాయి.వినిమయ షేర్లు పరుగులు ప్రజల వినియోగ శక్తి పెంపు లక్ష్యంలో భాగంగా కేంద్రం వేతన జీవుల వ్యక్తిగత ఆదాయపన్ను రూ.12 లక్షల వరకు మినహాయింపు ఇచ్చింది. దీంతో వినిమయ సంబంధిత రంగాలైన రియలిటి, టూరిజం, ఎఫ్ఎంసీజీ, కన్జూమర్ డ్యూరబుల్, మీడియా, రవాణా–లాజిస్టిక్స్, ఆటో, ఈవీ–కొత్త తరం ఆటోమోటివ్ షేర్లు పరుగులు పెట్టాయి. → వినిమయ సంబంధిత రంగాల్లో కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లలో అత్యధికంగా బ్లూ స్టార్ 13% పెరిగింది. క్రాంప్టన్ గ్రీవ్స్ 8%, హావెల్స్ 6%, వోల్టాస్ 5%, లాభపడ్డాయి. ఏబీ ఫ్యాషన్, వర్ల్‌పూల్ 3% చొప్పున, టైటాన్ 2% ఎగిశాయి. → ఎఫ్ఎంసీజీ షేర్లలో ఐటీసీ, టాటా కన్జూమర్, హెచ్‌యూఎల్, డాబర్, మారికో, ఐటీసీ హోటల్స్, బ్రిటానియా షేర్లు 5% వరకు రాణించాయి. → ఆటో రంగ షేర్లలో మారుతీ సుజుకీ 5%, టీవీఎస్ మోటార్స్ 4%, ఐషర్ మోటార్స్ 3.50%, బజాజ్ ఆటో, మహీంద్రా షేర్లు 3% చొప్పున పెరిగాయి. మౌలిక రంగ షేర్లు డీలా ప్రతిసారి మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో కేటాయింపులు పరిమితం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.11.21 లక్షల కోట్ల ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. మూలధన వ్యయ కేటాంపులు అంచనాల కంటే తక్కువగా ఉండటంతో రైల్వేలు, రక్షణ, మౌలిక, ఇంధన ఆయిల్‌అండ్‌గ్యాస్, మెటల్, హౌసింగ్, ఫార్మా, బ్యాంక్ షేర్లు డీలాపడ్డాయి. . → రైల్వే రంగ షేర్లైన టెక్స్మాకో రైల్ ఇంజనీరింగ్స్, జుపిటర్ వేగన్స్ , టిటాఘర్ రైల్ సిస్టమ్స్ షేర్లు 6–10% క్షీణించాయి. ఇర్కాన్ ఇంటర్నేషనల్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, రైల్ వికాస్ నిగమ్ షేర్లు 7–10% పతనమయ్యాయి. ఐఆర్సీటీసీ, రీట్స్ షేర్లు 3% నష్టపోయాయి. → రోడ్లు, కస్ట్రక్షన్ షేర్లు ఎన్సీసీ 8%, ఎన్బీసీసీ, పీఎన్సీ ఇన్ఫ్రాటెక్, జీఆర్ ఇ్రన్ఫా, ఐఆర్బీ ఇన్ఫ్రా షేర్లు 2–5% పడ్డాయి. క్యాపిటల్ గూడ్స్ విభాగంలో ఏబీబీ, సిమెన్స్, భెల్, ఎల్అండ్టీ, అజాద్ ఇంజనీరింగ్స్ షేర్లు 3–6% క్షీణించాయి.స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు ఊతం పన్ను ప్రతిపాదనలు క్యాపిటల్ మార్కెట్లోకి పెట్టుబడులు వెల్లువెత్తేందుకు ఊతం ఇస్తాయి. ఉద్యోగులు రూ.12.75 లక్షల వరకు వేతనంపై రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది వినిమయం పెరిగేందుకు సహాయపడుతుంది. వినియమం పెరిగితే షేర్లలో పెట్టుబడులు సైతం పెరుగుతాయి. మూలధన వ్యయంలో 10 శాతం వృద్ధితో అధిక పెట్టుబడులు పెట్టడం ద్వారా వృద్ధికి ఊతమివ్వడమే బడ్జెట్ లక్ష్యం.బ్యాటరీల తయారీకి దన్ను ఈవీ బ్యాటరీల తయారీకి సంబంధించి మరో 35 యంత్రపరికరాలు, మొబైల్ ఫోన్ బ్యాటరీ తయారీ విషయంలో అదనంగా 28 యంత్రపరికరాలను సుంకాల మినహాయింపు జాబితాలోకి చేర్చినట్లు మంత్రి తెలిపారు. దీనితో దేశీయంగా లిథియం అయాన్ బ్యాటరీల (మొబైల్ ఫోన్లకు, ఎలక్ట్రిక్ వాహనాలకు) తయారీకి ఊతం లభించనుంది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుందని గ్రాంట్ థార్న్టన్ భారత్ పార్ట్నర్ సాకేత్ మెహ్రా తెలిపారు. స్థానికంగా తయారీ వ్యయాలు తగ్గడంతో పాటు కార్యకలాపాలు విస్తరించేందుకు కంపెనీలకు ప్రోత్సాహంగా కూడా ఉంటుందని రివ్యాంప్ మోటో సహవ్యవస్థాపకుడు ప్రీతేష్ మహాజన్ చెప్పారు. బలమైన అడుగులు.. క్యాన్సర్ డే సెంటర్స్, వైద్య విద్య ద్వారా ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలలో పెరిగేందుకు బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. ప్రాణాధార ఔషధాలకు కస్టమ్స్ డ్యూటీ మినహాయింపులతోపాటు మెడికల్ టూరిజం, హీల్ ఇన్ ఇండియా కార్యక్రమాల ద్వారా ప్రోత్సాహం ప్రకటించారు. సాంకేతికత, మౌలిక రంగంలో పెట్టుబడి, పన్ను స్లాబ్‌లు, సుంకాల సరళీకరణ వంటి నిర్మాణాత్మక సంస్కరణలు దేశ నిర్మాణం వైపు బలమైన అడుగులు వేస్తుంది. – సతీష్ రెడ్డి, చైర్మన్, డాక్టర్ రెడ్డీస్ ల్యా»ొరేటరీస్.వైద్య సంరక్షణ కేంద్రంగా.. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ప్రపంచ నాయకత్వం వహించేలా ఎదగడానికి ఈ బడ్జెట్ ప్లాట్‌ఫామ్‌గా నిలవనుంది. ప్రైవేట్ రంగ భాగస్వామ్యాల ద్వారా మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించాలనే ప్రకటన ప్రపంచ రోగులను ఆకర్షించే స్థాయిలో సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. హీల్ ఇన్ ఇండియా మిషన్ కింద అందుబాటులో ప్రపంచ స్థాయి వైద్య సంరక్షణ కేంద్రంగా భారత్‌ను ఉంచు తుంది. – ప్రతాప్ సి రెడ్డి, ఫౌండర్, అపోలో హాస్పిటల్స్.పెట్టుబడులకు ఊతం.. వినియోగ ఆధారిత వృద్ధిని మధ్యతరగతి ప్రజలు నడిపిస్తారని మంత్రి విశ్వాసం ఉంచారు. వినియోగ డిమాండ్ పుంజుకోవడం మధ్యస్థ కాలంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. పర్యాటకం, టెక్స్టైల్, హస్తకళలు, పాదరక్షలు, బొమ్మ ల వంటి ఉపాధి ఆధారిత రంగాలు తదుపరి స్థాయికి చేరేందుకు తక్షణ ప్రేరణనిచ్చారు. – సంజయ్ నాయర్, ప్రెసిడెంట్, అసోచామ్.వృద్ధికి ఇంధనం.. తయారీ, గ్రీన్ మొబిలిటీ, గ్రామీణ సాధికారతకు వెన్నుదన్నుగా భారత వృద్ధి వేదికలకు ఇంధనం ఇస్తుంది. ఆవిష్కరణ, ఉద్యోగ సృష్టి, ప్రపంచ నాయకత్వానికి బాటలు పరుస్తుంది. గ్రీన్ ఎనర్జీలో గణనీయ పెట్టుబడులు, ఇంధన నిల్వ పరిష్కారాలకు మద్దతు ఇచ్చే స్పష్ట విధానాలతో ఆటోమొబైల్ రంగం పురోగతికి సిద్ధంగా ఉంది. క్లీన్ మొబిలిటీ భవిష్యత్తు పరివర్తనను వేగవంతం చేస్తాయి. స్థిరత్వం, సాంకేతిక ఆవిష్కరణలకు దేశ నిబద్ధతను బలోపేతం చేస్తాయి. – పవన్ ముంజాల్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హీరో మోటోకార్ప్. కస్టమర్లకు ఉపశమనం లేదు.. విడిభాగాలపై దిగుమతి సుంకం తగ్గింపు ప్రతిపాదన, అలాగే తయారీ రంగం వాడే యంత్ర పరికరాలపై (క్యాపిటల్ గూడ్స్) పన్ను మినహాయింపు దేశీయ మొబైల్ తయారీ వ్యయాన్ని తగ్గిస్తుంది. వినియోగదారులకు పెద్ద ఉపశమనం లభించే అవకాశం లేదు. బడ్జెట్లో ప్రకటించిన మొత్తం చర్యలు భారతదేశంలో పోటీతత్వాన్ని పెంచుతాయి. పంకజ్ మొహింద్రూ, చైర్మన్, ఇండియా సెల్యులార్, ఎల్రక్టానిక్స్ అసోసియేషన్.ఇంధన శక్తిలో అగ్రగామిగా.. ఇంధన పరివర్తనను వేగవంతం చేయడానికి ప్రైవేట్ రంగం నుండి ఆవిష్కరణలను పెంచుతూ.. స్థిర ఇంధన శక్తిలో దేశాన్ని ప్రపంచ అగ్రగామిగా ఉంచాలనే ప్రభుత్వ ఆశయాన్ని నొక్కి చెబుతోంది. విద్యుత్ పంపిణీ రంగాన్ని బలోపేతం చేయడం, స్థిర ఇంధన భవిష్యత్తును రూపొందించడానికి అవసరమైన స్మార్ట్ మీటరింగ్ వంటి క్లిష్ట సంస్కరణల అమ లుకు రాష్ట్రాలను ప్రోత్సహించడం సానుకూలాంశం. – నారా విశ్వేశ్వర రెడ్డి, సీఎండీ, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్. -
బడ్జెట్ 2025-26.. నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2025-26ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇది ఆమెకు ఎనిమిదో బడ్జెట్, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడవ పర్యాయం ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వానికి రెండవ పూర్తి స్థాయి బడ్జెట్.బడ్జెట్ ప్రకటన కారణంగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ఫిబ్రవరి 1వ తేదీ శనివారం అయినప్పటికీ ఉదయం 9:15 గంటల నుండి ప్రారంభమయ్యాయి. సానుకూల అంచనాలతో ఉదయం లాభాల్లోకి వెళ్లిన సూచీలు మధ్యాహ్నం 12 ప్రాంతంలో నష్టాల్లోకి జారుకున్నాయి.మధ్యాహ్నం 12 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 455 పాయింట్లు, నిఫ్టీ 115 పాయింట్లు పతనమయ్యాయి. మరోవైపు హెల్త్‌కేర్ ఇండెక్స్ మాత్రం లాభాల్లో చలిస్తోంది. -
స్టాక్ మార్కెట్‌కు ఆర్థిక సర్వే ఊతం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ఆర్థిక సర్వే 2024-25ను సమర్పించిన అనంతరం దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్లాయి. బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు వరుసగా నాల్గవ సెషన్లో లాభాలను కొనసాగించాయి. ఇంట్రా-డే గరిష్ఠ స్థాయి 77,549.92 పాయింట్లకు చేరుకున్న తర్వాత బీఎస్ఈ సెన్సెక్స్ దాని మునుపటి ముగింపుతో పోలిస్తే 740.76 పాయింట్లు లేదా 0.97 శాతం పెరిగి 77,500.57 వద్ద స్థిరపడింది. అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 258.90 పాయింట్లు లేదా 1.11 శాతం పెరిగి 23,508.40 స్థాయిల వద్ద ముగిసింది. ఈరోజు ఇండెక్స్ 23,530.70-23,277.40 రేంజ్లో ట్రేడయింది. నిఫ్టీ50లో టాటా కన్స్యూమర్, భారత్ ఎలక్ట్రానిక్స్, ట్రెంట్, లార్సెన్ & టూబ్రో, కోల్ ఇండియా నేతృత్వంలోని 47 స్టాక్‌లు 6.24 శాతం వరకు లాభాలను చూశాయి. మరోవైపు భారతీ ఎయిర్టెల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, ఐటీసీ హోటల్స్, ఐసీఐసీఐ బ్యాంక్ 0.82 శాతం వరకు నష్టాలతో టాప్ లూజర్స్‌గా నిలిచాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీలు వరుసగా 1.89 శాతం, 2.11 శాతంతో బెంచ్‌మార్క్‌లను అధిగమించాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ నేతృత్వంలోని అన్ని రంగాల సూచీలు వరుసగా 2.04 శాతం, 2.44 శాతం లాభాలతో ముగిశాయి. నిఫ్టీ ఆటో, పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ, మెటల్, ఓఎంసీలు, ఎంపిక చేసిన ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు శుక్రవారం 1 శాతంపైగా లాభాలతో ముగిశాయి.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం (ఫిబ్రవరి 1) పార్లమెంట్లో సమర్పించనున్న కేంద్ర బడ్జెట్ 2024-25 కోసం డి-స్ట్రీట్ ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు. బడ్జెట్ కారణంగా భారతీయ ఈక్విటీ మార్కెట్ శనివారం ట్రేడింగ్‌కు తెరిచి ఉంటుంది.