దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు భారీ లాభాలను చవి చూశాయి. మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,203.43 పాయింట్లు లేదా 1.56 శాతం లాభంతో 78,390.17 వద్ద, నిఫ్టీ 373.80 పాయింట్లు లేదా 1.60 శాతం లాభంతో.. 23,734.85 వద్ద నిలిచాయి.
శ్రీరామ్ ఫైనాన్స్, లార్సెన్ & టూబ్రో, భారత్ ఎలక్ట్రానిక్స్, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి సంస్థలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ట్రెంట్, బ్రిటానియా ఇండస్ట్రీస్, హీరో మోటోకార్ప్, నెస్లే ఇండియా, ఐచర్ మోటార్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.
గత కొన్ని రోజులుగా వరుస నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఈ రోజు (ఫిబ్రవరి 4)న శుభారంభం పలికాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాల్లో దూసుకెళ్లాయి. ఇకపోతే.. కొత్త ఏడాదిలో తొలిసారి పరపతి సమీక్షను చేపట్టనున్న రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం(7న) విధాన నిర్ణయాలను ప్రకటించనుంది. దాదాపు ఐదేళ్ల తదుపరి ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment