
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:54 సమయానికి నిఫ్టీ(Nifty) 58 పాయింట్లు పెరిగి 22,610కు చేరింది. సెన్సెక్స్(Sensex) 281 పాయింట్లు పుంజుకొని 74,743 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 106.62 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 75.22 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.37 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.5 శాతం నష్టపోయింది. నాస్‌డాక్ 1.21 శాతం పడిపోయింది.
వ్యయ ఒత్తిళ్లు, వాణిజ్య సుంకాల ఆందోళనలతో అమెరికా ఫిబ్రవరి సర్వీసెస్ యాక్టివిటీ 15 నెలల కనిష్టానికి చేరుకుంది. భారత్ ఐటీ రంగానికి అతిపెద్ద మార్కెట్ అమెరికాలో వృద్ధి మందగమనం, ద్రవ్యోల్బణ పెరుగుదల ఆందోళనలు నెలకొన్నాయి. అమెరికా ద్రవ్యోల్బణం, భారత క్యూ3 జీడీపీ వృద్ధి గణాంకాల వెల్లడి ముందు ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తూ అప్రమత్తత వహిస్తున్నారు. ట్రంప్ అధిక టారిఫ్‌ల అమలుతో ద్రవ్యోల్బణం ఎక్కువ కావచ్చనే ఆందోళనలు నెలకొన్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ.1.01 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి.
బుధవారం (26న) మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మార్కెట్లు పనిచేయవు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment