కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2025-26ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇది ఆమెకు ఎనిమిదో బడ్జెట్, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడవ పర్యాయం ఏర్పడిన ఎన్‌డీఏ ప్రభుత్వానికి రెండవ పూర్తి స్థాయి బడ్జెట్.
బడ్జెట్ ప్రకటన కారణంగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ఫిబ్రవరి 1వ తేదీ శనివారం అయినప్పటికీ ఉదయం 9:15 గంటల నుండి ప్రారంభమయ్యాయి. సానుకూల అంచనాలతో ఉదయం లాభాల్లోకి వెళ్లిన సూచీలు మధ్యాహ్నం 12 ప్రాంతంలో నష్టాల్లోకి జారుకున్నాయి.
మధ్యాహ్నం 12 గంటల సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 455 పాయింట్లు, నిఫ్టీ 115 పాయింట్లు పతనమయ్యాయి. మరోవైపు హెల్త్‌కేర్ ఇండెక్స్ మాత్రం లాభాల్లో చలిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment