సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమాయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 548.39 పాయింట్లు లేదా 0.70 శాతం నష్టంతో.. 77,311.80 వద్ద, నిఫ్టీ 182.85 పాయింట్లు లేదా 0.78 శాతం నష్టంతో.. 23,377.10 వద్ద నిలిచాయి.
కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, బ్రిటానియా ఇండస్ట్రీస్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. ట్రెంట్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, టాటా స్టీల్, టైటాన్ కంపెనీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment