
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాల మధ్య బెంచ్ మార్క్ ఈక్విటీ ఇండెక్స్ బీఎస్ఈ సెన్సెక్స్ 176.47 పాయింట్లు లేదా 0.24 శాతం క్షీణించి 74,163.62 వద్ద మొదలైంది. ఇక నిఫ్టీ 50 ప్రారంభ సమయానికి 40.85 పాయింట్లు లేదా 0.18 శాతం క్షీణించి 22,503 వద్ద ఉంది.
బలహీన అంతర్జాతీయ సంకేతాల మధ్య నిఫ్టీ ఐటీ, ఎఫ్ ఎంసీజీ, బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు ఎన్‌ఎస్ఈలో ప్రారంభ ట్రేడింగ్ లో ఒత్తిడికి లోనయ్యాయి. ఐటీ ఇండెక్స్ 0.97 శాతం, ఎఫ్ఎంసీజీ 0.12 శాతం, బ్యాంక్ 0.12 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.06 శాతం నష్టపోయాయి.
విస్తృత మార్కెట్ సూచీలు ప్రారంభ ట్రేడింగ్ లో మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 0.34 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 0.09 శాతం నష్టపోయాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు దేశ ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తాయన్న భయాలే ఈ రోజు స్టాక్ మార్కెట్లలో అమ్మకాలకు కారణం కావచ్చు. యునైటెడ్ స్టేట్స్-మెక్సికో-కెనడా ఒప్పందం కిందకు వచ్చే కొన్ని కెనడా, మెక్సికో వస్తువులపై సుంకాలను ఏప్రిల్ 2 వరకు వాయిదా వేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం కూడా ఇన్వెస్టర్లను శాంతపరచడంలో విఫలమైంది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment