
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:38 సమయానికి నిఫ్టీ(Nifty) 217 పాయింట్లు నష్టపోయి 22,578కు చేరింది. సెన్సెక్స్(Sensex) 696 పాయింట్లు దిగజారి 74,634 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 106.17 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 74.35 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.43 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 1.71 శాతం నష్టపోయింది. నాస్‌డాక్ 2.2 శాతం పడిపోయింది.
ఇదీ చదవండి: ఆదాయపన్నులో మార్పులు.. తరచూ అడిగే ప్రశ్నలు
దేశీ స్టాక్ మార్కెట్లో కొద్ది నెలలుగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) అమ్మకాలకే ఆసక్తి చూపుతున్నారు. ఈ నెలలోనూ ఇదే బాటలో కొనసాగుతున్నారు. దీంతో ఫిబ్రవరి 3–21 మధ్య నికరంగా రూ.23,710 కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య ఆందోళనల మధ్య దేశీ స్టాక్స్‌లో విక్రయాలకు తెరతీస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధానంగా ప్రపంచ పరిణామాలు దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశించనున్నాయి. బుధవారం (26న) మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment