
దేశీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఈ వారం తొలి ట్రేడింగ్ సెషన్‌ను 1 శాతానికి పైగా నష్టంతో ముగించాయి. సెన్సెక్స్ 856.65 పాయింట్లు (1.14 శాతం) క్షీణించి 74,454.41 వద్ద స్థిరపడింది. ఈరోజు ఈ సూచీ 74,907.04-74,387.44 శ్రేణిలో ట్రేడ్ అయింది.
నిఫ్టీ 50 కూడా 242.55 పాయింట్లు (1.06 శాతం) క్షీణించి 22,553.35 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 సోమవారం రోజు గరిష్టాన్ని 22,668.05 వద్ద, రోజు కనిష్టాన్ని 22,518.80 వద్ద నమోదు చేసింది.
నిఫ్టీ 50లోని 50 షేర్లలో 38 షేర్లు నష్టాల్లో ముగియగా విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్‌టెల్ 3.70 శాతం వరకు నష్టాలతో టాప్ లూజర్స్‌గా నిలిచాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐషర్ మోటార్స్, హీరో మోటోకార్ప్, నెస్లే ఇండియా వంటి 12 షేర్లు 1.54 శాతం వరకు లాభాల్లో ముగిశాయి.
ఇక నిఫ్టీ స్మాల్ క్యాప్ 100, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.02 శాతం, 0.94 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో, ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాలు నష్టాల్లో ముగిశాయి. బుధవారం (26న) మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment