
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 307 పాయింట్లు లాభపడి 23,658 వద్దకు చేరింది. సెన్సెక్స్ 1078 పాయింట్లు ఎగబాకి 77,984 వద్దకు చేరింది.
సెన్సెక్స్ 30 సూచీలో ఎన్‌టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్‌బీఐ, టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫిన్‌సర్వ్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీసీ, రియలన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ సుజుకీ, టీసీఎస్, టాటా మోటార్స్, ఐటీసీ స్టాక్‌లు లాభాల్లో ముగిశాయి. టైటాన్, ఇండస్ ఇండ్ బ్యాంక్, జొమాటో, ఎం అండ్ ఎం, భారతీ ఎయిర్‌టెల్, సన్‌ఫార్మా స్టాక్‌లు నష్టపోయాయి.
ఇదీ చదవండి: 5జీ విస్తరణపై నోకియా నివేదిక.. కీలకాంశాలు..
యూఎస్ టారిఫ్ వార్తలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు లేదా అమ్మకాలతోపాటు.. డాలరు ఇండెక్స్, ముడిచమురు ధరల కదలికలపై ఈ వారం ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నారు. గత వారం అమ్మకాల బాట వీడి విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు దిగారు. అయితే దేశీ ఫండ్స్ విక్రయాలవైపు చూపు సారించాయి. ఇటీవల ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు కొంతమేర బలహీనపడింది. ఈ నేపథ్యంలో గత వారం మార్కెట్లు జోరందుకున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. యూఎస్ మార్కెట్లు సైతం పుంజుకున్నప్పటికీ రానున్న రోజుల్లో హెచ్చుతగ్గులు ఎదురుకావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)