
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం గడిచిన సెషన్‌లోని ముగింపుతో పోలిస్తే లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:19 సమయానికి నిఫ్టీ(Nifty) 106 పాయింట్ పెరిగి 22,612కు చేరింది. సెన్సెక్స్(Sensex) 321 పాయింట్లు పెరిగి 74,487 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 103.52 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 71.25 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.28 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.65 శాతం పెరిగింది. నాస్‌డాక్ 0.31 శాతం పుంజుకుంది.
ఇదీ చదవండి: 13 రోజుల్లో కార్ల ధరలు పెంపు..
స్టాక్ మార్కెట్ స్థిరీకరణలో భాగంగా సోమవారం మిడ్ క్యాప్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించగా, చిన్న షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. డాలర్ ఇండెక్స్ బలహీనత, దేశీయ ఈక్విటీ మార్కెట్లో కొనుగోళ్ల దన్నుతో డాలర్ మారకంలో రూపాయి విలువ 24 పైసలు పెరిగి 86.81 వద్ద స్థిరపడింది. డెరివేటివ్స్ పోర్ట్‌ఫోలియోలో అవకతవకల నేపథ్యంలో ‘బ్యాంకు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంది’ అంటూ ఆర్‌బీఐ భరోసాతో ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేరు కోలుకుంది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment