
ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన ఐఫోన్ 15 సిరీస్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అక‍్టోబర్ నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయని అంచనా. దీంతో ఐఫోన్ 15 సిరీస్ ఫోన్‌ల మీద టెక్ అభిమానుల దృష్టిపడింది.
ఈ నేపథ్యంలో పలువురు టెక్నాలజీ నిపుణులు ఐఫోన్ 15 సిరీస్ మార్పులు, అప్‌డేట్‌ల గురించి ఆసక్తికర విషయాల్ని వెలుగులోకి తెస్తున్నారు. తాజాగా, గత కొన్నేళ్లుగా యాపిల్ సంస్థ రెడ్ కలర్ వేరియంట్ ఐఫోన్‌ల విడుదల చేస్తూ వస్తుంది. కానీ, ఈ ఏడాది నుంచి రెడ్ కలర్ వేరియంట్ ఫోన్‌లకు స్వస్తి పలకునుందని సమాచారం.
As far as future leaks are concerned, I think I’ll stick to iPhone stuff for now.
— Unknownz21 🌈 (@URedditor) June 14, 2023
హెచ్‌ఐవీ, ఎయిడ్స్ వంటి ప్రమాదకరమైన వ్యాధిల నుంచి సురక్షితంగా ఉంచేలా, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు యాపిల్ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 2017లో తొలిసారి రెడ్ కలర్ వేరియంట్ ఫోన్‌ను మార్కెట్‌కి పరిచయం చేసింది. అదే వేరియంట్‌లో ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ ఫోన్‌లను విక్రయిస్తుండేది. ఆ ఫోన్‌లను అమ్మగా వచ్చిన సొమ్ముతో ఎయిడ్స్ బాధితులకు అండగా నిలిచేందుకు ఉపయోగిస్తుంది ఈ టెక్ దిగ్గజం. ఏది ఏమైనప్పటికీ..ఈ ఏడాది నుంచి రెడ్ కలర్ వేరియంట్ ఫోన్‌లను యాపిల్ తయారు చేయలేదని, కనుమరుగు కానున్నాయంటూ వచ్చిన ట్వీట్‌లు ఆసక్తికరంగా మారాయి.