అగ్గిపెట్టె కనిపెట్టింది ఎప్పుడో తెలుసా? | Do You Know When Was The Matchbox Invented, Know About Evolution Of Matchbox In Telugu | Sakshi
Sakshi News home page

Matchbox Invention Story: అగ్గిపెట్టె కనిపెట్టింది ఎప్పుడో తెలుసా?

Published Sat, Apr 5 2025 5:53 PM | Last Updated on Sat, Apr 5 2025 6:10 PM

Do you know when the matchbox was invented

ఇప్పుడంటే నిప్పు వెలిగించడానికి అగ్గిపెట్టె వాడుతున్నాం. అగ్గిపెట్టె (Matchbox) లేని కాలంలో నిప్పు పుట్టించడం చాలా టఫ్‌ విషయం అని మీకు తెలుసా? రాళ్లను మరో రాళ్లతో కొట్టి, కర్రలను మధించి నిప్పు పుట్టించేవారు. ఒకరి ఇంట్లో నిప్పు (Fire) కావాలంటే పక్కింట్లో నుంచి నిప్పు కణికల్ని తీసుకెళ్లేవారు. అగ్గిపెట్టె వచ్చిన తర్వాత ఈ ఇబ్బందులు తీరాయి.

క్రీస్తుశ‌కం 577 నుంచే చైనాలో రాజవంశానికి చెందిన స్త్రీలు నిప్పు కోసం కొన్ని ప్రత్యేకమైన కర్రల్ని వాడేవారని, వాటికి రసాయనాలు పూసి నిప్పు పుట్టించేవారని చరిత్రకారులు అంటున్నారు. చరిత్రలో అవే తొలి అగ్గిపుల్లలని వారు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత 16వ శతాబ్దంలో అప్పటి శాస్త్రవేత్తలు గ్యాస్‌ (Gas) ఆధారంగా నిప్పు పుట్టించే ప్రయోగాలు చేశారు.

1832లో లండన్‌లో తొలిసారి సిగార్లు వెలిగించుకునేందుకు కర్రతో పుల్లలు తయారు చేసి వాటి చివరన రసాయనాలను అంటించారు. ఇవి చాలా ఉపయోగకరంగా ఉండటంతో వీటిపై మరిన్ని ప్రయోగాలు జరిగి, చివరకు ఇవాళ మనం చూస్తున్న అగ్గిపెట్టెలు అవతరించాయి. భలే ఉందిగా అగ్గిపెట్టె పుట్టుక.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement