
నోట్లోకి నాలుగు వేళ్లు వెళ్లేందుకు ఏదో ఒక పని దొరికితే చాలు.. ఇది సగటు మానవుని ఆరాటం. అర్హతకు తగ్గ ఉద్యోగం రావాలి? కుటుంబాన్ని పోషించుకోవాలి. ఆ తరువాత ఉండటానికి చిన్న ఇల్లు కొనుక్కోవాలి ఇది కొంతమంది ఆశ.
పే..ద్ద హోదా ఉన్న ఉద్యోగం కావాలి. నెలకు ఇదెంకల జీతం, బంగ్లా..కారు.. ఎక్స్‌ట్రా.. ఇది మరికొంతమంది డ్రీమ్ జాబ్.
మరి ఇస్త్రీ మడత నలగకుండా, ఒళ్లుఅలవకుండా, చెమట పట్టకుండా ఉండే జాబ్ కావాలి? ఇలా ఆలోచించే జీవులు చాలామందే ఉన్నారు. సరిగ్గా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డ్రీమ్ జాబ్స్.. అంటూ సీసీటీవీ ఇడియట్స్ అనే ట్విటర్ ఖాతా ఒక ఫన్నీ వీడియోను షేర్ చేసింది. అదేంటో మీరు కూడా చూడండి. అన్నట్టు ఇలాంటి ఉద్యోగాలు నిజంగా డ్రీమ్ జాబ్సేనా? కొన్నాళ్లకు బోర్ కొట్టదూ? ఏమంటారు?
Dream jobs! 😂😂 pic.twitter.com/jfsNGwI0H7
— CCTV IDIOTS (@cctvidiots) November 11, 2024