
గుండె పోటు అంటే బీపీ, సుగర్ లాంటి వ్యాధులున్నవారిలో, అధిక బరువు ఉన్నవారిలోమాత్రమే వస్తుంది అని భ్రమపడేవారు. కానీ ప్రస్తుతం గుండెపోటు తీరు మారింది. నిరంతరం వ్యాయామం చేస్తూఆరోగ్యంగా ఉన్నవారినికూడా గుండె పోటు బలి తీసుకుంటోంది. తాజాగా ఉదయం వాకింగ్ చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన వైనం పలువుర్ని విస్మయ పర్చింది. ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఆదివారం ఉదయం నడకకు వెళుతుండగా 28 ఏళ్ల అనుమానాస్పదంగా కుప్పకూలి మరణించాడు. బాధితుడిని రాష్ట్రీయ లోక్‌దళ్ కార్యకర్త అమిత్ చౌదరిగా గుర్తించారు. నడుస్తూ ఉండగా ఒక వ్యక్తి వచ్చి చౌదరిని పలకరించి, అతని భుజం తట్టి వెళ్ళిపోయిన దృశ్యాలు CCTV ఫుటేజ్‌లో రికార్డైనాయి. ఆ తరువాత అతను అకస్మాత్తుగా గుండెపోటుకు గురైనాడు.. తీవ్ర ఇబ్బందికి గురైన అతను ఇంటి ఎదురుగా ఉన్న గోడను ఆసరా చేసుకోవాలని ప్రయత్నించాడు. కానీ ఫలితం లేకపోయింది. జిల్లాలోని మదన్‌పూర్ గ్రామంలోని ఇంటి వెలుపల గుండెపోటుతో మరణించాడు. చౌదరి కుప్పకూలిన తర్వాత కొంతమంది వ్యక్తులు ఆయన ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ అతను ప్రాణాలు కోల్పోయాడు. చౌదరి మరణానికి డెపోటే కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అని భావిస్తున్నారు.
⚠️ Trigger Warning : Sensitive Visual⚠️
जिंदगी–मौत का कुछ नहीं पता। इस Video को देखिए। 20 सेकेंड पहले तक जो इंसान एकदम फिट दिखाई दे रहा है, वो अचानक से मर जाता है।
📍बुलंदशहर, यूपी pic.twitter.com/9jiDgbC2ay— Sachin Gupta (@SachinGuptaUP) March 22, 2025
చదవండి: సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పెళ్లి ఫోటోలు వైరల్, ఎవరు తీశారో ఊహించగలరా?
గుండెపోటుఎందుకు వస్తుంది?
గుండెలోని రక్త నాళాల్లో రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడటం, రక్తనాళాలు పూడుకుపోవడం, రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోవడం తదితర కారణాల వల్ల గుండె పోటు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్న మాట.
గుండె నొప్పి లక్షణాలు:
గుండె నొప్పి (ఛాతీ నొప్పి) తీవ్రమైన వైద్య పరిస్థితికి సంకేతం. వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఛాతీ నొప్పి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ బరువుగా, టైట్‌గా అనిపించిడం, నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారం, చల్లని చెమటలు, ఎడమ చేయి లేదా దవడలో నొప్పి వంటి లక్షణాలు ఉంటే అప్రమత్తం కావాలి.ఇంకా తలనొప్పి, ఎడమ చేయి, మెడ, దవడ లేదా రెండు చేతుల్లో నొప్పి, బలహీనంగా, అనీజిగా అనిపించడం, చర్మం పాలిపోవడంలాంటి లక్షణాలు కనిపించినా వైద్య సహాయం తీసుకోవాలి. ఇంతకు ముందే గుండె సమస్యలున్నా, కుటుంబంలో ఎవరికైనా గుండె సంబంధిత సమస్యలున్నా మరింత అప్రమత్తంగా ఉండాలి.