heart attack
-
పెళ్లి రోజే భార్య కళ్ల ముందు కుప్పకూలి..
ఆ జంట విజయవంతంగా పాతికేళ్లు వివాహ బంధం పూర్తి చేసుకుంది. కుటుంబ సభ్యుల సూచన మేరకు సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించింది. బంధువులు, అతిథులంతా ఆ సంబురంలో భాగం అయ్యారు. కొందరు అమ్మాయిలు ఆ జంటతో వేదిక మీద డ్యాన్సులు వేయించారు. అయితే అంతలోనే అనుకోని విషాదం ఆ వేదికను ఆవిరించింది. అచేతనంగా పడి ఉన్న భర్తను చూసి ఆ భార్య గుండెలు అవిసేలా రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది. లక్నో: వసీం సర్వత్(Wasim sarwat) ఉత్తర ప్రదేశ్ బరేలీ(Bareilly)లో షూ వ్యాపారి. 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటు చేశారు. హ్యాపీగా స్టేజ్‌పై తన భార్య ఫరాతో కలిసి డ్యాన్స్ చేశాడు. అయితే, ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలి కిందపడిపోయాడు. దీంతో అక్కడున్న వారంతా ఆందోళనకు గురయ్యారు. హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించగా లాభం లేకపోయింది. అప్పటికే ఆయన గుండెపోటు(Heart Attack)తో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కళ్లెదుటే భర్త మరణంతో భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. వసీం స్టేజ్‌పై కుప్పకూలి పడిపోయిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.🚨2 April 25 : Shoe merchant Wasim died of a #heartattack2025 while dancing with his wife on his 25th wedding anniversary in Bareilly district of Uttar Pradesh.#LuciferShotWorking #ChipShot pic.twitter.com/OrHYonE2NP— Anand Panna (@AnandPanna1) April 3, 2025హఠాన్మరణాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అప్పటిదాకా ఆరోగ్యంగా.. హుషారుగా కనిపించవాళ్లు ఉన్నట్లుండి కుప్పకూలి ప్రాణం విడుస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలని నిపుణులు సూచిస్తుండగా.. ఇలాంటి అత్యవసర సందర్భాల్లో సీపీఆర్లాంటి వాటిపై ప్రజలకు అవగాహన తప్పనిసరిగా ఉండాలి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.నోట్: పై వీడియోలోని దృశ్యాలు మిమ్మల్ని కలవరపాటుకు గురిచేయొచ్చు. కేవలం వార్తను అథెంటిక్‌గా అందించే ఉద్దేశంలో భాగంగానే వీడియోను అందిస్తున్నాం. -
అమెరికా నటుడు చాంబర్లీన్ కన్నుమూత
లండన్: 1960ల్లో అత్యంత ప్రజాదరణ పొందిన ‘డాక్టర్ కిల్డేర్’ టీవీ సీరియల్‌తో అందరికీ సుపరిచితుడైన రిచర్డ్ చాంబర్లీన్(90) కన్నుమూశారు. వయో సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన హవాయ్‌లోని వైమనలో శనివారం రాత్రి గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచినట్లు సన్నిహితులు తెలిపారు. 91వ ఏట అడుగు పెట్టడానికి కొన్ని గంటల ముందే ఈ విషాదం చోటుచేసుకుందన్నారు. ‘షొగున్, ది థోర్న్ బర్డ్స్’ సీరియళ్లలో ప్రధాన పాత్రలు పోషించి ‘కింగ్ ఆఫ్ ది మినీ సిరీస్’గా చాంబర్లీన్ మన్ననలు అందుకున్నారు. 1934లో కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్‌లో జన్మించిన ఈయన డాక్టర్ కిల్డేర్ సీరియల్లోని డాక్టర్ జేమ్స్ కిల్డేర్ పాత్రతో 1961లో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. 1980ల్లో షొగున్ సిరీస్‌లో ఖైదీగాను, అనంతరం థోర్న్ బర్డ్స్‌లో క్రైస్తవ గురువుగా పోషించిన పాత్రలు ఆయన్ను తిరుగులేని స్థాయికి చేర్చాయి. అప్పట్లో అమెరికాలో 60 శాతం మంది టీవీ వీక్షకులు థోర్న్ బర్డ్స్ సీరియల్‌నే చూడటం ఓ రికార్డు. ఇది ఏకంగా 16 ఎమ్మీ నామినేషన్లు పొందింది. స్వలింగ సంపర్కుడైన చాంబర్లీన్.. ఆ విషయాన్ని 70 ఏళ్ల వయస్సులో ‘షట్టర్డ్ లవ్’ పేరుతో విడుదల చేసిన ఆత్మకథలో మొదటిసారిగా అంగీకరించారు. నటుడు, దర్శకుడు మార్టిన్ రబెట్తో 30 ఏళ్లపాటు బంధం కొనసాగించారు. 2010లో వీరిద్దరూ విడిపోయారు. -
అరుదైన శస్త్ర చికిత్సతో వృద్ధుడి గుండె పదిలం
హైదరాబాద్ : ఆరోగ్య సంరక్షణలో విశ్వసనీయత, మెరుగైన ఆరోగ్య ఫలితాలతో ప్రాణాలకు కాపాడటంతో కాపాడటంతో అద్వితీయంగా కృషి చేస్తున్న ఆలివ్ హాస్పిటల్... గుండె సంబంధిత వ్యాధి చికిత్సలో అరుదైన మైలురాయిని చేరుకుంది. వైద్య రంగంలో అత్యంత క్లిష్టమైనది కాగా, ట్రాన్సాకాథెటర్ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ (TAVR) ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ రంగంలో ఈ విప్లవాత్మక శస్త్రచికిత్స ప్రక్రియను ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ కన్సల్టెంట్ డాక్టర్ కృతిక్ కులకర్ణి, ఆలివ్ హాస్పిటల్ లోని కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మొహమ్మద్ ఆసిఫ్ సంయుక్తంగా నిర్వహించారు. తీవ్రమైన అయోర్టిక్ స్టెనోసిస్, రెగర్జిటేషన్ ఉన్న వృద్ధి రోగులకు TAVR ఒక ప్రాణాలను రక్షించే పరిష్కారం. ఇది సాంప్రదాయ ఓపెన్-హార్ట్ సర్జరీకి ఇదొక ఇన్వాసివ్ ప్రత్యామ్నాయం కాగా, అత్యంత ప్రమాదకర స్థాయిలో లేదా సాంప్రదాయ గుండె శస్త్రచికిత్స చేయించుకోలేని రోగులకు సురక్షితమైన, మరింత ప్రభావవంతమైన ఈ చికిత్సను మాత్రమే అందిస్తారు. తీవ్రమైన అయోర్టిక్ స్టెనోసిస్, రెగర్జిటేషన్‌తో బాధపడుతున్న వృద్ధి రోగులకు ఇదొక సంజీవనీల పనిచేస్తుందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.ఈ బృందానికి సారథ్యం వహించిన డాక్టర్ కృతిక్ కులకర్ణి తన బృంద సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ "తీవ్రమైన అయోర్టిక్ స్టెనోసిస్, రిగర్జిటేషన్ ఉన్న వృద్ధులకు ఈ ప్రక్రియ ఒక వరం. ఇది వారికి పునర్జీవం పోసేలా పనిచేస్తోంది. వేగంగా కోలుకోవడం, మెరుగైన జీవన నాణ్యతను అందిస్తుంది. మా క్యాత్ ల్యాబ్ బృందం, OT టెక్నీషియన్లు, అనస్థీషియా బృందం, హాస్పిటల్ అడ్మిన్ సహకారంతో ఎంతో క్లిష్టమైన శస్త్రచికిత్సను సునాయాసంగా విజయవంతం చేయగలిగాం. డాక్టర్ పాషా, డాక్టర్ బన్సాల్, డాక్టర్ ప్రవీణ్ మరియు డాక్టర్ జియాకు ప్రత్యేక కృతజ్ఞతలు. అహ్మదాబాద్‌కు చెందిన సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అభిషేక్ కూడా ఈ ప్రక్రియలో మార్గదర్శకుడిగా హాజరై బృందానికి తన అమూల్యమైన సలహాలను అందించారు. ఆయనుకున్న విస్తృత అనుభవం విజయానికి తోడ్పడిందన్నారు.olive రంగంలో ఈ విజయం మా ఆసుపత్రి యొక్క సాంకేతిక నైపుణ్యాన్ని మాత్రమే కాకుండా, మా రోగులకు సాధ్యమైనంత ఉత్తమమైన సంరక్షణను అందించడంలో మా యొక్క అంకితభావాన్ని చాటుకున్నాం. కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మొహమ్మద్ ఆసిఫ్ మాట్లాడుతూ... "ఆరోగ్య సంరక్షణ పురోగతిలో ఈ అద్భుతమైన అద్భుతమైన ప్రయాణంలో మేము భాగస్వామ్యం కావడం మాకు దొరికి దొరికి అదృష్టం. ఆలివ్ ఆలివ్ హాస్పిటల్ వైద్య శాస్త్ర రంగంలో నిరంతరం కృషి చేస్తూ ముందుకు సాగుతోంది. రోగులకు నాణ్యమైన వైద్యాన్ని ఉన్నత స్థాయి ప్రమాణాలతో అందిస్తోంది. TAVR ప్రక్రియ విజయవంతంగా అమలు చేయడం ద్వారా హృదయ సంరక్షణకు ఒక కొత్త ప్రమాణం ఏర్పడింది. భవిష్యత్తులో ఆపత్కర పరిస్థితుల్లో రోగులకు TAVR ద్వారా పునర్జీవం పోసే అవకాశం ఉంటుంది. ఇంత కీలకమైన బాధ్యతల నిర్వహించిన తమకు రోగి కుటుంబ సభ్యుల సహకరించడం అభినందనీయం, వారికి ఆసుపత్రి యాజమాన్యం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తోంది." అని అన్నారు. ఆలివ్ హాస్పిటల్ గురించి: తెలంగాణలో రాష్ట్ర స్థాయిలో ఆలివ్ హాస్పిటల్స్ ఆధునాతన వైద్య సంరక్షణకు కృషి చేస్తుంది. సమగ్ర ఆరోగ్య ఆరోగ్య సంరక్షణ, నాణ్యమైన వైద్యాన్ని నిబద్ధతతో 2010 నుండి అందిస్తోంది. విశ్వసనీయమైన వైద్యం అందించాలని లక్ష్యంతో కట్టుబడి ఉంది. మొత్తం మానవాళికి ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడంలో గత 15 సంవత్సరాలుగా నిరంతరం కృషి చేస్తోంది. అత్యుత్తమ ప్రతిభతో ఆలివ్ హాస్పిటల్ తెలంగాణలోని ప్రముఖ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులలో ఒకటిగా మారింది. ఆలివ్ హాస్పిటల్ 210 పడకల, అత్యాధునిక మల్టీస్పెషాలిటీ హెల్త్‌కేర్ సౌకర్యం వివిధ స్పెషాలిటీలలో విస్తృత శ్రేణి వైద్య సేవలను అందిస్తుంది, కార్డియాక్ కేర్, ఎమర్జెన్సీ సర్వీసెస్, న్యూరో కేర్, కిడ్నీ కేర్, యూరాలజీ, ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్స్, గైనకాలజికల్ సర్వీసెస్, అడ్వాన్స్డ్ డయాగ్నస్టిక్స్. ఇంటర్వెన్షనల్ సర్వీసెస్ వంటి రంగాలలో అనేక అధునాతన విధానాలలో మార్గదర్శకత్వం" వహించింది. తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి, సమర్ధులైన వెద్యులను నియమించుకోవడానికి కట్టుబడి ఉండటం వలన భారతదేశులో ఆరోగ్య సంరక్షణ యొక్క నాణ్యమైన ప్రమాణమైన నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ నుండి గుర్తింపు పొందింది. -
ఆగిన అమ్మ గుండె.. తల్లడిల్లిన టెన్త్ విద్యార్థి
సప్తగిరికాలనీ: ఓ వైపు పదో తరగతి పరీక్షలు.. మరోవైపు తల్లి హఠాన్మరణంతో ఆ విద్యార్థి తల్లిడిల్లిపోయాడు. బాధతప్త హృదయంతో పదో పరీక్షకు హాజరయ్యాడు. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామానికి చెందిన అమరం జనార్దన్‌రెడ్డి – మౌనిక దంపతుల కుమారుడు అమన్రెడ్డి కరీంనగర్ మంకమ్మతోటలోని సాయి మానేరు పాఠశాలలో పదో తరగతి చదివాడు. పిల్లల చదువు నిమిత్తం కరీంనగర్ మంకమ్మతోటలోనే నివాసముంటున్నారు. తండ్రి నిమ్మపల్లి ఐకేపీ సెంటర్లో సీసీగా పనిచేస్తున్నాడు. సోమవారం తల్లి లత గుండెపోటుతో మృతిచెందగా మంగళవారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఓ పక్క తల్లిని కోల్పోయిన అమన్ రెడ్డి బుధవారం కరీంనగర్ జ్యోతినగర్‌లోని సెయింట్ ఆల్ఫోన్స్ పరీక్షా కేంద్రంలో పరీక్షకు హాజరయ్యాడు. అమన్ రెడ్డిని బుధవారం ఉదయం పరీక్ష కేంద్రం వద్ద మానేరు విద్యాసంస్థల చైర్మన్ కడారి అనంతరెడ్డి ఓదార్చారు. అమన్ రెడ్డిని ఉపాధ్యాయులు ముకుందం, సుధాకర్ రెడ్డి, సిలివేరి మహేందర్, శ్రీనివాస్, కుమారస్వామి, తోటి విద్యార్థులు, స్నేహితులు ధైర్యం చెప్పారు.ఉన్నత స్థాయిలో రాణిస్తామా అమ్మ ఎప్పుడూ నన్ను ఉన్నతస్థాయిలో రాణించాలని చెప్పేది. బాగా చదవాలి. క్రీడల్లోనూ రాణించాలని సూచించేది. నేను జాతీయ జూడో పోటీలకు ఎంపికై నందుకు చాలా సంతోషపడింది. స్పోర్ట్స్‌లో పాల్గొనేలా ఉత్సాహం నింపింది. ఉన్నత స్థానంలో నిలిచి అమ్మకోరిక నెరవేర్చుతా.– అమన్ రెడ్డి -
వాకింగ్ చేస్తూనే మృత్యు ఒడికి.. సీసీటీవీలో దృశ్యాలు
గుండె పోటు అంటే బీపీ, సుగర్ లాంటి వ్యాధులున్నవారిలో, అధిక బరువు ఉన్నవారిలోమాత్రమే వస్తుంది అని భ్రమపడేవారు. కానీ ప్రస్తుతం గుండెపోటు తీరు మారింది. నిరంతరం వ్యాయామం చేస్తూఆరోగ్యంగా ఉన్నవారినికూడా గుండె పోటు బలి తీసుకుంటోంది. తాజాగా ఉదయం వాకింగ్ చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన వైనం పలువుర్ని విస్మయ పర్చింది. ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఆదివారం ఉదయం నడకకు వెళుతుండగా 28 ఏళ్ల అనుమానాస్పదంగా కుప్పకూలి మరణించాడు. బాధితుడిని రాష్ట్రీయ లోక్‌దళ్ కార్యకర్త అమిత్ చౌదరిగా గుర్తించారు. నడుస్తూ ఉండగా ఒక వ్యక్తి వచ్చి చౌదరిని పలకరించి, అతని భుజం తట్టి వెళ్ళిపోయిన దృశ్యాలు CCTV ఫుటేజ్‌లో రికార్డైనాయి. ఆ తరువాత అతను అకస్మాత్తుగా గుండెపోటుకు గురైనాడు.. తీవ్ర ఇబ్బందికి గురైన అతను ఇంటి ఎదురుగా ఉన్న గోడను ఆసరా చేసుకోవాలని ప్రయత్నించాడు. కానీ ఫలితం లేకపోయింది. జిల్లాలోని మదన్‌పూర్ గ్రామంలోని ఇంటి వెలుపల గుండెపోటుతో మరణించాడు. చౌదరి కుప్పకూలిన తర్వాత కొంతమంది వ్యక్తులు ఆయన ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ అతను ప్రాణాలు కోల్పోయాడు. చౌదరి మరణానికి డెపోటే కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అని భావిస్తున్నారు.⚠️ Trigger Warning : Sensitive Visual⚠️जिंदगी–मौत का कुछ नहीं पता। इस Video को देखिए। 20 सेकेंड पहले तक जो इंसान एकदम फिट दिखाई दे रहा है, वो अचानक से मर जाता है।📍बुलंदशहर, यूपी pic.twitter.com/9jiDgbC2ay— Sachin Gupta (@SachinGuptaUP) March 22, 2025 చదవండి: సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పెళ్లి ఫోటోలు వైరల్, ఎవరు తీశారో ఊహించగలరా?గుండెపోటుఎందుకు వస్తుంది?గుండెలోని రక్త నాళాల్లో రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడటం, రక్తనాళాలు పూడుకుపోవడం, రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోవడం తదితర కారణాల వల్ల గుండె పోటు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్న మాట. గుండె నొప్పి లక్షణాలు:గుండె నొప్పి (ఛాతీ నొప్పి) తీవ్రమైన వైద్య పరిస్థితికి సంకేతం. వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఛాతీ నొప్పి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ బరువుగా, టైట్‌గా అనిపించిడం, నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారం, చల్లని చెమటలు, ఎడమ చేయి లేదా దవడలో నొప్పి వంటి లక్షణాలు ఉంటే అప్రమత్తం కావాలి.ఇంకా తలనొప్పి, ఎడమ చేయి, మెడ, దవడ లేదా రెండు చేతుల్లో నొప్పి, బలహీనంగా, అనీజిగా అనిపించడం, చర్మం పాలిపోవడంలాంటి లక్షణాలు కనిపించినా వైద్య సహాయం తీసుకోవాలి. ఇంతకు ముందే గుండె సమస్యలున్నా, కుటుంబంలో ఎవరికైనా గుండె సంబంధిత సమస్యలున్నా మరింత అప్రమత్తంగా ఉండాలి. -
విధుల ఒత్తిడి.. వ్యాధుల ముట్టడి..!
ఓ వైపు శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయి.. మరోవైపు ఆకతాయిలు పెచ్చు మీరుతున్నారు. ఇంకోవైపు గంజాయి బ్యాచ్‌ల ఆగడాలు పెరుగుతున్నాయి. అన్నింటికీ పోలీసులే కావాలి. కానీ సరిపోయేంత సంఖ్యలో ఖాకీలు ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో లేరు. ఫలితంగా ఉన్న వారిపైనే ఒత్తిడి పడుతోంది. ఊపిరి సలపనంత పనితో వారి గుండెపై భారం పడుతోంది. తీవ్ర నిద్రలేమి, సరైన సమయానికి భోజనం లేక 30 ఏళ్లు దాటిన పోలీసులకు సైతం బీపీ, మధుమేహం వస్తున్నాయి. చాలా మందికి ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు కూడా దెబ్బతింటున్నాయి. 50 ఏళ్లు దాటిన వారితో పాటు 35 ఏళ్లలోపు వారు పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. ఉన్నతాధికారులకు చెప్పుకోలేక, కుటుంబ సభ్యులతో ఈ కష్టం పంచుకోలేక చాలా మంది తమలో తామే కుమిలిపోతున్నారు. సిబ్బంది.. ఇబ్బంది జిల్లాలో 38 పోలీస్స్టేషన్లు ఉన్నాయి. రెండు వేల మంది పోలీసులు ఉన్నారు. ఉన్నవాళ్లలో 20 శాతం మందిని దేవాలయాలు, రాజకీయ సమావేశాలు, పోలీస్ పికెటింగ్, విద్యార్థుల పరీక్షలు వంటి బందోబ స్తు కార్యక్రమాలకు పంపుతుంటారు. ఒక్కో స్టేషన్లో 50 నుంచి 70 మంది ఉండాల్సి ఉన్నా పట్టుమని 20 మందైనా ఉండడం లేదు. ఈలోగా స్టేషన్లలో పెండెన్సీ కేసులు, కొత్త కేసులు, కొత్త చట్టాలు, కొత్త యాప్‌లు, సంకల్పాలు, అవగాహనలు ఒకదాని మీద ఒకటి వచ్చి పడుతూనే ఉంటాయి. ముఖ్యంగా హోంగార్డులు, కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్ల కొరత వేధిస్తోంది. మరో 500 మంది సిబ్బంది ఉంటే తప్ప ఉన్న వారి ఆరోగ్యం బాగు పడేట్లు కనిపించడం లేదు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ.. 50 ఏళ్లు దాటిన వారిని సైతం సుదూర (విజయవాడ)బందోబస్తులకు పంపిస్తుండటం ఇబ్బందిగా ఉంటుంది. టీఏ, డీఏలు, సరెండర్లీవ్లు కూటమి ప్రభుత్వం ఇవ్వకపోవడంతో పదిమంది వెళ్లాల్సిన స్థానంలో వందమందినైనా అక్కడి వాళ్లు అడుగుతుండటం, సొంత డబ్బులతోనే సిబ్బంది వెళ్తుండటం జీతాలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. స్టేషన్లలో పోలీసు వాహనాల కొరత ఉండటంతో సొంత వాహనాలకు పెట్రోల్ పోసి పరిసర ప్రాంతాల విధుల్లో తిరగాల్సి వస్తోందని చాలామంది వాపోతున్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని జెమ్స్ లో ఇటీవల పోలీసులకు నిర్వహించిన మెడికల్ క్యాంపులో 103మందికి పైగా సిబ్బందికి గుండెకు సంబంధించిన యాంజియోగ్రామ్, స్టంట్స్ అవసరమని వైద్యులు నిర్ధారించారంటే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.వీరి పరిస్థితే హెచ్చరిక.. జనవరిలో నగరంలోని ఒకటో పట్టణ పరిధిలో యువకుడైన నాగరాజు అనే హోంగార్డు గుండెపోటుతో మరణించాడు. ఆయనకు భార్య, చిన్న పిల్లలున్నారు. జిల్లా కలెక్టరేట్ ట్రెజరీ విభాగంలో చెస్ట్ గార్డుగా ఉన్న ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ సవర జోక్యో గుండెపోటుతో మరణించాడని పోలీసులు ధ్రువీకరించారు. ఆయన వరుసగా మూడురోజులు విధుల్లో ఉన్నారు. మందస హెడ్‌కానిస్టేబుల్ గవరయ్య (59) గుండెపోటుతోనే మరణించారు. నగరంలోనే కిడ్నీలు ఫెయిల్ అయి ఓ కానిస్టేబుల్ మృతిచెందాడు. సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకార బందోబస్తు విధులకు వెళ్లిన 57 ఏళ్ల ఆబోతుల లక్ష్మయ్య ఎండల వేడిమి తట్టుకోలేక స్ట్రోక్ వచ్చి విజయవాడలోనే మృతిచెందాడు. ఈయనది పోలాకి మండలం పల్లిపేట. సోంపేట ఎస్ఐ రవివర్మకు ఇటీవలే రెండోసారి స్ట్రోక్ వచ్చింది. తొలిసారి ఒక స్టంట్, ఇప్పుడు యాంజియోగ్రామ్ అవసరమన్నారు. ప్రస్తుతానికి లీవ్‌లో ఉన్నారు. కాశీబుగ్గ కానిస్టేబుల్‌కు హార్ట్ ప్రాబ్లెం ఉండటంతో స్టంట్ వేయించుకున్నారు. సోంపేటలో ఓ కానిస్టేబుల్‌కు ఇదే పరిస్థితి ఉంది. డే బై డే నైట్ డ్యూటీలతో సిక్.. గతంలో నైట్ బీట్ డ్యూటీల్లో కానిస్టేబుళ్లు, హోంగార్డులే ఉండేవారు. ఎస్ఐలు, సీఐలు రౌండ్లకు వెళ్లేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. 50 ఏళ్లు నిండి రిటైర్మెంటుకు దగ్గరలో ఉన్న ఏఎస్ఐలు నుంచి హెడ్‌కానిస్టేబుళ్లు కూడా డే బై డే నైట్ బీట్లకు వెళ్లాల్సి వస్తోంది. అవసరాన్ని బట్టి కొన్ని చోట్ల ఎస్ఐ–2లు వెళ్తున్నారు. రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఐదు వరకు ఉండటమే కాక గంట గంటకూ లైవ్ లొకేషన్, రెండు ఫొటోలు పంపాల్సిందే. మళ్లీ ఉదయాన్నే రోల్‌కాల్ 8గంటలతో డ్యూటీ మొదలు. 7:45 కల్లా సిద్ధంగా ఉండాలి. సెట్కాన్ఫరెన్సు (ఎస్ఐ, ఆపై ర్యాంకు) అయితే 7:30 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. మళ్లీ సాయంత్రం 5కి రోల్ కాల్, 7:30 నుంచి సెట్ కాన్ఫరెన్సు.. కొన్నిమార్లు జూమ్ కాన్ఫరెన్సులు.. సాయంత్రం విజిబుల్ పోలీసింగ్ ఉంటాయి. (చదవండి: -
నిద్ర కరువైతే అనారోగ్యం..!
విజయనగరం ఫోర్ట్: మానవుని జీవనశైలిలో మార్పులు, అధికంగా మొబైల్ వాడడం, టీవీ ఎక్కువగా చూడడం వల్ల అధికశాతం మంది నిద్రలేమి బారిన పడుతున్నారు. ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని పనిచేయడం, జంక్ఫుడ్స్ ఎక్కువగా తినడం, రాత్రివేళ ఆలస్యంగా నిద్రపోవడం, రాత్రి షిఫ్టుల్లో విధులు నిర్వహించడం వల్ల తగినంత నిద్ర ఉండదు. దీని వల్ల వారు బీపీ, సుగర్, ఊబకాయం, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, థైరాయిడ్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. చాలా మంది నిద్ర లేకపోతే ఏంజరుగుతుంది? అని తేలికగా తీసుకుంటారు.అర్ధరాత్రి వరకు చాలా మంది నిద్రపోరు. దీని వల్ల అనేక సమస్యల బారిన పడతారు. నిద్రలేమి వల్ల ఓఎస్ఏ (అబ్‌్సట్రక్ట్రివ్ స్లీప్ అస్నియా) అనే సమస్యకు గురవుతారు. ఈ సమస్య ఉన్న వ్యక్తి శ్వాస తీసుకోవడం పదేపదే ఆగిపోవడం, ఊపిరి లోతుగా తీసుకోవడం (అల్పశ్వాస) జరుగుతుంది. అదేవిధంగా పెద్దగా గురక పెట్టడం, శ్వాస పునఃప్రారంభం అయినప్పడు ఉక్కిరిబిక్కిరి అయి వింత శబ్దాలు రావడం, పగటి సమయంలో మధ్యమధ్య కునుకుపాట్లు పడుతూ ఉండడం, అలసటగాను, మత్తుగాను ఉంటుంది. మద్యం తాగడం, పొగతాగడం, స్థూలకాయం వల్ల ఓఎస్ఏ సమస్య తీవ్రతరం అవుతుంది. చిన్నపిల్లల్లో అయితే ఎదుగుదల ఉండదు. మానసిక సమస్యల బారిన పడతారు.నెలకు 1000 మంది వరకు నిద్ర లేమి సమస్య బారిన పడుతున్నారు. 6నుంచి 7 గంటల నిద్ర అవసరం ప్రతి వ్యక్తి రోజులో 6 నుంచి 7 గంటలు నిద్రపోవాలి. ఇలా నిద్ర పోవడం వల్ల హార్మోన్స్ తయారవుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. పనిచేయడానికి అవసరమైన శక్తి తయారవుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. జాగ్రత్తలు నిద్రలేమి సమస్య బారిన పడకుండా ఉండాలంటే ప్రతిరోజూ వ్యాయమం చేయాలి. కనీసం రోజులో 6 గంటలు నిద్ర పోవాలి. నిద్రలేమి సమస్య ఉన్నట్లయితే పలమనాలజిస్టునుగాని, ఈఎన్టీ వైద్యుడిని గాని సంప్రదించాలి. ఊబకాయం రాకుండా చూసుకోవాలి. పానీపూరీ, చాట్, పిజ్జా, బర్గర్లు వంటివి ఎక్కువగా తినకూడదు.ఎక్కువ మందికి నిద్రలేమి సమస్య చాలామంది నిద్రలేమి సమస్య బారిన పడుతున్నా రు. అయితే ఈసమస్యకు ఎవరిని సంప్రదించాలో చాలామందికి తెలియదు. పలమనాలజిస్టునుగాని, ఈఎన్టీ వైద్యుడిని గానీ సంప్రదించాలి. ఆరోగ్యంగా జీవించడం కోసం రోజులో 6 నుంచి 7 గంటల పాటు నిద్రపోవాలి. సెల్‌ఫోన్ ఎక్కువగా వినియోగించకూడదు. అదేవిధంగా టీవీ కూడా గంటల తరబడి చూడకూడదు. - డాక్టర్ బొత్స సంతోష్‌కుమార్,అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
తండ్రి మృతదేహం సాక్షిగా వివాహం
సాక్షి, చెన్నై: మరికొన్ని గంటల్లో కుమారుడి వివాహం జరగబోనుండగా.. తండ్రి గుండెపోటుతో(Heart attack) కుప్పకూలిపోయాడు. సాధారణంగా అయితే వివాహాన్ని వాయిదా వేస్తుంటారు. అంతటి దుఃఖంలోనూ వరుడి తల్లి స్పందించి.. తన భర్త నిర్ణయాన్ని అమలు చేశారు. ఆయన మృత దేహం సాక్షిగా కుమారుడి వివాహం జరిపించారు. వివరాలు.. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా పేరుగోపనపల్లికి చెందిన వరదరాజ్ (60) దుస్తుల వ్యాపారం చేస్తుండగా.. అతని భార్య మంజుల గృహిణి. వీరి కుమారుడు మనీశ్‌కు బర్గూరు చెందిన గోవిందరాజులు, శివశంకరిల కుమార్తె కావ్య ప్రియకు సోమవారం వివాహం జరగాల్సి ఉంది. ఆదివారం రాత్రి వివాహానికి సంబంధించిన వేడుక నిర్వహించారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న వరుడి తండ్రి వరదరాజ్ హఠాత్తుగా కుప్పకూలాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి.. వరద రాజ్ గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు. దీంతో వధూవరుల కుటుంబసభ్యులు, బంధువులు షాక్ గురయ్యారు. వివాహాన్ని వాయిదా వేద్దా మంటూ సలహాలు ఇచ్చారు. కానీ వరుడి తల్లి మంజుల స్పందించి.. పెళ్లి (marriage) కుదరగానే తన భర్త ఎంతో సంతోషించాడని కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన నిర్ణయం ప్రకారం వివాహ తంతు పూర్తి చేస్తే.. తన భర్త ఆత్మకు శాంతి కలుగు తుందన్నారు. దీంతో గ్రామ పెద్దలు, వధూవరుల కుటుంబసభ్యులు, బంధువులు చర్చించుకొని.. వివాహానికి అంగీకారం తెలిపారు. అనంతరం వరదరాజ్ మృతదేహం సాక్షిగా వరుడు మనీశ్ వధువు మెడలో తాళి కట్టాడు. అనంతరం వరదరాజ్ అంత్యక్రియలు నిర్వహించారు.Video Credit To Polimer News -
బస్సులోనే శాశ్వత నిద్రలోకి.!
కరీంనగర్, సాక్షి: చావు ఎవరికి చెప్పి రాదు!. అప్పటిదాకా ఉన్న ఆనంద క్షణాలను.. హఠాన్మరణాలు హరించి వేస్తున్న ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నవే. అలాంటిదే కరీంనగర్లో చోటు చేసుకుంది. డ్యూటీకి వెళ్లొస్తానంటూ ఇంట్లో చెప్పి బయల్దేరిన ఆ వ్యక్తి.. ప్రయాణంలోనే గుండె ఆగి ఊరిలో విషాదం నింపాడు. జమ్మికుంట(Jammikunta) నుంచి కరీంనగర్ చేరుకున్న బస్సులో శుక్రవారం ఉదయం ఓ వ్యక్తి అచేతనంగా పడి ఉన్న దృశ్యం కండక్టర్ కంట పడింది. నిద్రపోయాడనుకుని లేపే ప్రయత్నం చేశాడు. అయితే ఆ వ్యక్తి శాశ్వత నిద్రలోకి జారుకున్నాడని కాస్త ఆలస్యంగా గుర్తించాడు. వీణవంక(Veenkavanka) మండలం రెడ్డిపల్లికి చెందిన ఓదెలు.. కరీంనగర్ ఐసీఐసీఐ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఊరిలో బస్సెక్కి కరీంనగర్ వెళ్తున్న క్రమంలో కన్నుమూశాడు. కరీంనగర్(Karim Nagar) వెళ్లిన తరువాత గుర్తించిన బస్సు కండక్టర్.. పోలీసులకు సమాచారం అందించాడు. గుండెపోటు(Heart Attack)తోనే అతను చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఓదెలు హఠాన్మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
12 గంటలు రోడ్డుపైనే మృతదేహం..
జోగిపేట(మెదక్): అభాగ్యురాలైన వృద్ధురాలి శవం రోడ్డుపై 12 గంటల పాటు ఉన్నా మున్సిపల్ సిబ్బంది కన్నెత్తి చూడలేదు. అంత్యక్రియలు నిర్వహించాలని కూతురు వేడుకున్నా కనికరించలేదు. వివరాలిలా ఉన్నాయి. జోగిపేట పట్టణంలో విద్యావతి (68) అనే వృద్ధురాలు అనారోగ్యంతో బుధవారం మృతి చెందింది. స్థానిక మున్సిపల్ కార్యాలయాన్ని ఆనుకొని ఉన్న ఒక గుడిసెలో నివాసం ఉంటూ కాగితాలు, పాత సామాన్లు సేకరించి వాటిని అమ్ముకొని తన కూతురు అశ్వినితో కలిసి జీవనం సాగిస్తుంది. కుమార్తెకు వివాహం చేసింది. కుమార్తె భర్త ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో చౌటకూరు మండలం శివ్వంపేట ప్రాంతంలోని కంపెనీలో పని చేస్తోంది. శివరాత్రి పండుగ నేపథ్యంలో తల్లి వద్దకు వచ్చిన అశ్విని అమ్మా..అమ్మా అంటూ పిలిచినా ఉలుకు పలుకూ లేకపోవడంతో బోరున విలపిస్తూ కూర్చుంది. ఎవరూ లేకపోవడంతో పక్కనే ఉన్న మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి తన తల్లి అంత్యక్రియలు చేయాలని కోరింది. పోలీసులకు చెబితేనే చేస్తామని వారు చెప్పారు. రోడ్డుపై వెళ్తున్న పోలీసులకు కూడా చెప్పినా మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎవరూ రాకపోవడంతో పటాన్చెరు ప్రాంతంలో తనకు తెలిసిన వారికి కూతురు ఫోన్ చేసింది. వారు వచ్చి మున్సిపల్ అధికారులను వేడుకున్నా స్పందించలేదు. దీంతో రూ.2 వేలకు అంబులెన్స్‌ను మాట్లాడుకొని రూ.1,500కు జేసీబీతో గోతి తీయించి అంత్యక్రియలు పూర్తి చేశారు. తల్లి మృతదేహం వద్ద కూతురు ఏడవడం రోడ్డుపై వెళ్లే వారి హృదయాలను కలిచివేసింది. -
చిన్నవయసులోనే గుండెపోటు.. ఎందుకొస్తుందో తెలుసా?
దేశంలో ఇటీవలి కాలంలో చిన్న వయసులోనే గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. గతంలో ఈ తరహాలో గుండెపోటు, స్ట్రోక్, గుండె, ధమనుల వ్యాధులు వృద్ధులలో మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు పాతికేళ్లలోపువారిలోనూ గుండపోటు కేసులు వెలుగు చూస్తున్నాయి. దీనికి కారణమేమిటి? వైద్యులు ఏమంటున్నారు?పురుషుల్లోనే అధికంఇండియన్ హార్ట్ అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం గత కొన్నేళ్లుగా 50 ఏళ్లలోపు వయసుగల వారిలో గుండెపోటు ముప్పు 50 శాతం, 40 ఏళ్లలోపు వారిలో 25 శాతం మేరకు పెరిగింది. అయితే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో.. మహిళల్లో గుండెపోటు కేసులు చాలా తక్కువని తెలిపింది. పురుషులు ఎక్కువగా గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ధూమపానం, మద్యపానం అనేవి యువతలో హృదయ సంబంధ వ్యాధులకు కారణంగా నిలుస్తున్నాయి. ఈ వ్యసనాల కారణంగా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. ఫలితంగా ఇది కరోనరీ హార్ట్ డిసీజ్‌కు దారితీస్తుంది. అధికంగా మద్యం సేవించడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది రక్త నాళాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది. ఫలితంగా గుండెపోటు ముప్పు పెరుగుతుంది.కారణాలివే..👇👉ఆహారపు అలవాట్లుఈ రోజుల్లో ప్రతి రంగంలోనూ పని ఒత్తిడి మరింతగా పెరిగింది. దీంతో యువత తమ ఆహారపు అలవాట్లు, దినచర్యపై తగిన శ్రద్ధ చూపడం లేదు. ఇది పలు రకాల గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తోంది. జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల యువత ఆరోగ్యం దెబ్బతింటోంది. దీని కారణంగా శరీరంలోని కేలరీల పరిమాణం పెరుగుతుంది. ఇది గుండెపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.👉అధిక పని ఒత్తిడిమానసిక ఒత్తిడి కూడా గుండెపోటుకు కారణంగా నిలుస్తోంది. పని భారం అనేది నేరుగా రక్త నాళాలను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా యువకులు, మధ్య వయస్కులు రక్తపోటు వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. నిద్రలేమితో బాధపడేవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఎనిమిది గంటల కన్నా తక్కువ సమయం నిద్రపోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.👉మధుమేహం యువతలో గుండె జబ్బులకు మధుమేహం (డయాబెటిస్) కూడా ఒక ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో డయాబెటిస్ రోగులు అత్యధికంగా ఉన్నారు. 2019లో భారతదేశంలో 7.7 కోట్ల మంది డయాబెటిక్ బాధితులు ఉన్నారని పలు గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2045 నాటికి డయాబెటిస్ రోగుల సంఖ్య 13 కోట్లకు పైగా పెరుగుతుందనే అంచనాలున్నాయి.జిమ్, డ్యాన్స్ సమయంలోనే ఎందుకంటే..అధికంగా శారీరక శ్రమ చేయడం వలన గుండె ధమనులలో అథెరోస్క్లెరోటిక్ ప్లేక్ చీలిపోయే ప్రమాదం మరింతగా పెరుగుతుంది ఇది గుండెపోటుకు దారితీస్తుంది. కఠినమైన వ్యాయామాలు చేస్తున్న సందర్భంలో ఛాతీపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. అలాగే గుండెపోటు ముప్పు కూడా మరింతగా పెరుగుతుంది. అందుకే నిపుణుల సలహా మేరకు, వారి పర్యవేక్షణలో మాత్రమే వ్యాయామం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అదేవిధంగా నృత్యం చేసే సమయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. నృత్యం చేసే సమయంలో హృదయ స్పందన పెరుగుతుంది. దీంతో గుండెపై ఒత్తిడి ఏర్పడుతుంది. ఊబకాయం కలిగివారు, అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారు ఎక్కువ స్టెప్స్ కలిగిన నృత్యం చేస్తున్నప్పుడు వారు గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉంది. అకస్మాత్తుగా గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది.ఈ లక్షణాలు కనిపిస్తే.. జాగ్రత్తపడండిఛాతీ, వీపు, గొంతు, దవడ లేదా రెండు భుజాలలో తరచూ నొప్పిగా అనిపిస్తుంటే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం. అలాగే ఉన్నట్టుండి చెమటలు పడుతున్నా, ఊపిరి ఆడటం కష్టంగా అనిపించినా, రెండు అడుగులు కూడా వేయలేనంత నీరసంగా అనిపించినా వెంటనే వైద్య నిపుణులను కలుసుకోవాలి. ఇదేవిధంగా ఛాతీలో, ఉదరంలో గ్యాస్ ఏర్పడినా, విపరీతమైన అలసట లేదా తల తిరుగుతున్నట్లు ఉన్నా ఆలస్యం చేయకుండా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ఛాతీ నొప్పి, విశ్రాంతి లేకపోవడం, శ్వాస సమస్యలు లేదా వేగంగా శ్వాస తీసుకోవడం మొదలైనవి గుండెపోటు సంబంధిత లక్షణాలు కావచ్చని గుర్తించాలని, ఇటువంటి సందర్భాల్లో అప్రమత్తంగా వ్యవహరించడం అత్యవసరమని వైద్యులు సూచిస్తున్నారు.గుండెలో సమస్యలు👉హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతిగుండె కండరాలు గట్టిపడే జన్యుపరమైన రుగ్మత. దీని వలన గుండె రక్తాన్ని సమర్ధవంతంగా పంప్ చేయలేకపోతుంది.👉డైలేటెడ్ కార్డియోమయోపతి దీనిలో ఎడమ జఠరిక పెద్దదిగా, బలహీనంగా మారుతుంది. ఇది గుండెకు రక్తాన్ని సమర్థవంతంగా ప్రసరింపజేసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.👉అరిథ్మోజెనిక్ రైట్ వెంట్రిక్యులర్ డిస్ప్లాసియా దీనిలో కొవ్వు లేదా పీచు కణజాలం గుండె కండరాలకు ఇబ్బంది కలిగిస్తుంది. ఇది రక్త ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. ప్రాణాంతక అరిథ్మియా ముప్పును మరింతగా పెంచుతుంది.ముందుగా చేసే పరీక్షలివే..👉ఎకోకార్డియోగ్రఫీ (ఎకో) గుండె పనితీరునంతటినీ అంచనా వేయడానికి చేసే గుండె సంబంధిత అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ ఇది.👉స్ట్రెస్/ట్రెడ్మిల్ పరీక్ష శారీరక శ్రమ చేసే సమయంలో గుండె ఎలా స్పందిస్తుందో ఈ పరీక్ష అంచనా వేస్తుంది. గుండె సంబంధిత సమస్యలను గుర్తిస్తుంది.👉జెనెటిక్ పరీక్ష ఆకస్మిక గుండెపోటు, వారసత్వంగా వచ్చిన గుండె సంబంధిత సమస్యలు, కుటుంబ చరిత్రను పరిశీలిస్తారు.👉హోల్టర్ పర్యవేక్షణ హోల్టర్ మానిటర్ అనేది హృదయ స్పందనను రికార్డ్ చేస్తుంది. ఇది గుండె సంబంధిత అసాధారణ సంకేతాలను తనిఖీ చేస్తుంది. బాధితులకు అవసరమైనప్పుడు వైద్యులు 24 గంటల హోల్టర్ పర్యవేక్షణను సూచిస్తుంటారు.వెంటనే ఏం చేయాలంటే..అకస్మాత్తుగా గుండె ఆగిపోయినప్పుడు సీపీఆర్ అనేది ప్రాణాలను కాపాడుతుంది. సీపీఆర్ చేయడం ద్వారా మెదడు, ఇతర ముఖ్యమైన అవయవాలకు ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని ప్రవహింపజేస్తుంది. కణజాల మరణాన్ని కొంతసేపటి వరకూ నివారిస్తుంది. సీపీఆర్ అందని పక్షంలో ఐదు నిమిషాల్లో మెదడు దెబ్బతినే అవకాశం ఉంది. ఎనిమిది నిమిషాల తర్వాత మరణం దాదాపు ఖాయమని వైద్యులు చెబుతున్నారు.అత్యవసర సేవలకు కాల్ఎవరైనా అకస్మాత్తుగా కుప్పకూలిపోతే పక్కనే ఉన్నవారు ఆ వ్యక్తిని కదిలిస్తూ ‘బాగున్నారా?’ అని గట్టిగా అడగాలి. వెంటనే అత్యవసర సేవలకు కాల్ చేయాలి. బాధితులు శ్వాస తీసుకుంటున్నాడా లేదా అనేది గుర్తించాలి. బాధితుడు శ్వాస తీసుకోకవడం లేదని గుర్తిస్తే అతని ఛాతీ మధ్యలో గట్టిగా వేగంగా అదమండి. నిమిషానికి 100 నుండి 120 సార్లు ఇలా చేయాలి. సీపీఆర్‌లో శిక్షణ పొందినవారు 30 కంప్రెషన్ల తర్వాత రెస్క్యూ శ్వాసలను అందించగలుగుతారు. శిక్షణ పొందనివారు ఛాతీ కంప్రెషన్లను కొనసాగించాలి. అదేవిధంగా వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించాలి.ఇది కూడా చదవండి: Mahakumbh: చివరి పుణ్యస్నానాలకు పోటెత్తిన జనం.. తాజా ఫొటోలు -
వివాహ వేడుకలో విషాదం.. విచారణలో బయటపడ్డ అసలు విషయం
Shocking Viral Video: పెళ్లి వేడుకలో అంతా హుషారుగా డ్యాన్సులు వేస్తున్నారు. అంతలో ఊహించిన ఘటన.. ఆ ఊరిలో తీవ్ర విషాదం నింపింది. హుషారుగా డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో ఆ ఊరి సర్పంచ్ భర్త ఊపిరి ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే.. ఈలోపు సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో చక్కర్లు కొట్టగా.. విచారణలో అసలు విషయం బయటపడింది.పంజాబ్ జలంధర్ గోరయా ప్రాంతంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆ ఊరి సర్పంచ్ భర్త పరమ్‌జిత్ సింగ్(49) ఓ వివాహ వేడుకలో హుషారుగా చిందులేస్తూ కుప్పకూలిపోయారు. గుండెపోటుతో ఆయన మరణించారని కుటుంబ సభ్యులు, పోలీసులు వెల్లడించారు. అయితే సోషల్ సోషల్ మీడియాలో ఓ వైరల్ అయ్యింది.వివాహ వేడుకలో ఓ వ్యక్తి చిందులేస్తూ.. తుపాకీ పేల్చాడు. అయితే అది పక్కనే డ్యాన్స్ చేస్తున్న పరమ్జిత్కు తగిలింది. దీంతో ఆయన కిందపడిపోయారు. కిందపడిన పరమ్‌జిత్.. తుపాకీతో కాల్చిన వ్యక్తిని మందలించారు కూడా. అయితే ఆ వెంటనే ఆయన అలాగే స్పృహ కోల్పోయారు. వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. బుల్లెట్ గాయంతోనే పరమ్‌జిత్ మరణించాడని, విషయం బయటకు రాకుండా బాధిత కుటుంబం పెద్దల సమక్షంలో డబ్బు తీసుకుందని తేలింది. పిస్టల్ పేల్చిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పంజాబ్ సహా భారతదేశంలో ఇలాంటి వేడుకలలో బహిరంగంగా ఆయుధాల్ని ప్రదర్శించడం నిషిద్ధం. ఒకవేళ అది ఉల్లంఘిస్తే నేరం కిందకే వస్తుంది. जालंधर में एक शादी समारोह में की गई हवाई फायरिंग में एक युवक को गोली लग गई, जिससे उसकी मौत हो गई. जानकारी के मुताबिक मृतक गांव की मौजूदा सरपंच के पति हैं. घटना का वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है. #Jalandhar | #Firing pic.twitter.com/NovyLH21vK— Veer Arjun (@VeerArjunDainik) February 22, 2025 VIDEO Credits: VeerArjunDainik -
పెళ్లి మంటపంలో కుప్పకూలిన వధువు తండ్రి
భిక్కనూరు(హైదరాబాద్): మంగళ వాయిద్యాలు మోగుతుండగా వేదపండితులు పెళ్లి తంతు నిర్వహిస్తున్నారు. బంధువులు, స్నేహితులంతా పెళ్లి మంటపానికి చేరుకున్నారు. అల్లుడు, కూతురు కాళ్లు కడిగిన వధువు తండ్రి ఆనందంగా అందరినీ పలకరిస్తున్నారు. మరోవైపు భోజనాలు కూడా మొదలయ్యాయి. ఇంతలోనే ఆ తండ్రి గుండెపోటుతో కుప్పకూలిపోయారు. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి.. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్పల్లికి చెందిన కుడిక్యాల బాల్‌చంద్రం (55) కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్‌బోర్డులో నివసిస్తున్నారు. చిన్నచిన్న కాంట్రాక్టు పనులు చేసేవారు. ఆయనకు భార్య రాజమణి, కూతుళ్లు కనకమహాలక్ష్మి, కల్యాణలక్ష్మి ఉన్నారు. పెద్ద కూతురు కనకమహాలక్ష్మి పెళ్లి కుదిరింది. శుక్రవారం భిక్కనూరు మండలం బీటీఎస్ చౌరస్తా వద్ద ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా స్నేహితులు, బంధువులను బాల్‌చంద్రం ఆనందంగా పలకరించారు. అందరూ అభినందనలు తెలిపారు. వచ్చే ఏడాది చిన్న కూతురు పెళ్లి కూడా చేస్తానని చాలా మందితో బాల్‌చంద్రం చెబుతూ సంతోషంగా ఉన్నారు. ఇంతలోనే ఒక్కసారిగా ఆయన గుండెపోటుతో కుప్పకూలిపోయారు. బాల్‌చంద్రంను వెంటనే కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ ఆయన కన్నుమూశారు. కూతురు పెళ్లిలో తండ్రి కన్నుమూయడం ఆ కుటుంబానికి తీరని విషాదం మిగిలింది. పెళ్లి కోసం వేసిన పందిరిలో విగతజీవిగా పడిపోయిన తండ్రిని చూసి ఆ కూతురు రోదించిన తీరు అందరినీ కలచివేసింది. సాయంత్రం కామారెడ్డి పట్టణంలో బాల్‌చంద్రం అంత్యక్రియలు నిర్వహించారు. -
రోడ్డుపైనే కుప్పకూలిన టెన్త్ విద్యార్థిని
కామారెడ్డి: జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని కన్నుమూసింది. స్కూల్‌కు వెళ్తున్న క్రమంలో ఈ విషాదం చోటు చేసుకోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. రామారెడ్డి మండలం సింగరాయిపల్లికి చెందిన విద్యార్థిని శ్రీనిధి(14). కామారెడ్డిలోని కల్కినగర్‌లో తన పెద్దనాన్న ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. గురువారం ఉదయం ఇంటి నుంచి టిఫిన్ బాక్స్‌తో ఆమె బయల్దేరింది. కాలినడకన వస్తూ పాఠశాలకు సమీపంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పాఠశాల యాజమాన్యం అక్కడికి చేరుకొని విద్యార్థినిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సీపీఆర్ చేసి రక్షించే ప్రయత్నం చేశారు. పరిస్థితిలో మార్పు లేకపోవడంతో మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడా సీపీఆర్ చేస్తూ వైద్య చికిత్స అందిస్తుండగానే.. ప్రాణాలు కోల్పోయింది. గుండెపోటుతోనే ఆమె కన్నుమూసిందని వైద్యులు ధృవీకరించారు. -
సాత్విక్ సాయిరాజ్‌కు పితృవియోగం
సాక్షి, అమలాపురం: ఇది విధి రాసిన విషాదవార్త! తనయుడి అవార్డుని చూసి మురిసిపోదామనుకుంటే... తండ్రి భౌతికకాయాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యే పరిస్థితి! ‘ఖేల్‌రత్న’తో విజయోత్సవ వేడుకలు చేసుకోవాల్సిన ఇంట విషాదం అలుముకున్న దుస్థితి! ఆంధ్రప్రదేశ్ స్టార్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ తండ్రి రంకిరెడ్డి కాశీ విశ్వనాథం గురువారం ఉదయం గుండెపోటుతో హఠాత్తుగా కన్నుమూశారు. ఆయనకు భార్య రంగమణి, ఇద్దరు కుమారులు రాంచరణ్, సాత్విక్ ఉన్నారు. 65 ఏళ్ల కాశీ విశ్వనాథం గురువారం సాయంత్రం దేశ రాజధానిలో తనయుడు సా త్విక్కు ‘ఖేల్‌రత్న’ పురస్కార ప్రదానోత్సవంలో పాల్గొనాల్సి ఉంది. ఇందుకోసం సొంతూరు అమలాపురం నుంచి కారులో రాజమండ్రి విమానాశ్రయానికి బయలుదేరిన ఆయన పట్టణం దాటిన కొద్దిసేపటికే గుండెపోటుకు గురై మృతి చెందారు. ఊహించని విషాద వార్త అక్కడి కుటుంబసభ్యుల్ని, ఢిల్లీలో ఉన్న సా త్విక్ సాయిరాజ్‌ను కన్నీటి సంద్రంలో ముంచేసింది. అమెరికాలో ఉన్న సాత్విక్ సోదరుడు రాంచరణ్ స్వస్థలం చేరుకున్నాక శనివారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. బ్యాడ్మింటన్ క్రీడపై ఆసక్తి కనబరిచిన సాత్విక్‌కు తొలి కోచ్‌గా ఓనమాలు నేరి్పన తండ్రి తదనంతరం అతని ప్రతిభను గుర్తించి అంతర్జాతీయ షట్లర్‌గా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించారు. డబుల్స్‌లో అసాధారణ ప్లేయర్‌గా ఎదిగిన సాత్విక్ ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య అంతర్జాతీయ టోర్నీల్లో, ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో పాల్గొన్నాడు. అనతికాలంలోనే ఎన్నో పతకాలు, ట్రోఫీలు నెగ్గిన సా త్విక్ ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం సా త్విక్తోపాటు అతని డబుల్స్ భాగస్వామి చిరాగ్ శెట్టిని 2023 సంవత్సరానికిగాను ‘ఖేల్‌రత్న’ పురస్కారానికి ఎంపిక చేసింది.2024 జనవరిలో ఢిల్లీలో జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవం జరగ్గా... సా త్విక్–చిరాగ్ మలేసియా ఓపెన్ టోర్నీ లో ఆడుతుండటంతో హాజరు కాలేకపోయారు. ప్రస్తుతం పెట్రోలియం స్పోర్ట్స్ ఇంటర్ యూనిట్ టోర్నీ ఆడేందుకు సాత్విక్, చిరాగ్ ఢిల్లీలో ఉన్నారు. దాంతో కేంద్ర క్రీడా శాఖ ‘ఖేల్‌రత్న’ అందజేయాలని భావించి కార్యక్రమం ఏర్పాటు చేసింది. -
ఉన్నపాటుగా ప్రాణాలు తీస్తున్న గుండెపోటు : ఎలా గుర్తించాలి?
తెలంగాణాలో హైకోర్టులో ఉండగానే హఠాత్తుగా కుప్పకూలి సీనియర్ న్యాయవాది ప్రాణాలు కోల్పోయిన వైనం ఆందోళన రేపింది. ఒకపుడు గుండెపోటు అంటే.. మధుమేహం ఉన్న వారికి, శారీరక శ్రమ లేని వారికి, వయసు మీద పడిన వారికి, ఊబకాయ ఉన్నవారికి మాత్రమే వస్తుంది అని అనుకునే వాళ్ళం. కానీ ప్రస్తుత కాలంలో గుండె పోటు తీరు మారింది. మాకు రాదులే అని అనుకోడానికి లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండానే ఇటీవలి కాలంలో గుండెపోటు సమస్య చాలా ఎక్కువగా వస్తుంది. అసలు గుండె పోటు ఎందుకు వస్తుంది? గుండె పోటు వచ్చే ముందు మన శరీరం ఏమైనా సంకేతాలు పంపిస్తుందా? ఈ కథనంలో చూద్దాం.జీవనశైలి మార్పులు, శారీరక శ్రమ లేకపోవడం, బీపీ, షుగర్ లాంటి వ్యాధుల బారిన పడిన వారిలో గుండె వ్యాధుల ప్రమాదం ఎక్కువ. అయితే ఇటీవలి కాలంలో అసలు అనారోగ్య సమస్యలేకపోయినా కూడా హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు.గుండెపోటు అంటే? గుండె కండరానికి మంచి రక్తాన్ని తీసుకువెళ్లే రక్తనాళాలలో కొవ్వు కాని గడ్డలు కాని ఏర్పడడం వల్ల రక్తసరఫరాలో ఆటంకం ఏర్పడితే గుండె పోటు వస్తుంది. సాధారణంగా గుండె (కరోనరీ) ధమనులలో కొవ్వు, కొలెస్ట్రాల్ ,ఇతర పదార్థాలు పేరుకుపోవడం వల్ల అడ్డంకులు(బ్లాక్స్) ఏర్పడతాయి. రక్తనాళాలు పూడుకుపోవడం, రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోవడం తదితర కారణాల వల్ల గుండె పోటు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. వీటికి సరైన సమయంలో చికిత్స అవసరం. అలాగే బాడీలో విపరీతంగా కొలెస్ట్రాల్ పెరిగిన వారు కూడా గుండెపోటు బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలువాస్తవానికి కొంతమందిలో తేలికపాటి లక్షణాలు ఉంటాయి. మరికొందరికి తీవ్రమైన లక్షణాలు ఉన్నాయి. కొందరిలో ఎలాంటి లక్షణాలు ఉండవు. కానీ సాధారణంగా గుండెపోటు వచ్చే ముందు కచ్చితంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయని, కానీ చాలామంది వాటిని గుర్తించడంలో వైఫల్యంతోనే ముప్పు ముంచుకొస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ లక్షణాలు గుర్తించి, ప్రాథమిక చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం తప్పే అవకాశం చాలా ఉందిలో ఉంటుందని అంటున్నారు.గుండెల్లో మంట లేదా అజీర్ణంగొంతులో ఏదో ఇరుక్కున్నట్లు అనిపించడంఛాతీలో నొప్పి, గుండె లయలో మార్పులుశ్వాస తీసుకోవడంలో ఇబ్బందితల తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. తొందరగా అలసిపోవడం, అంటే కొద్దిగా నడిస్తేనే నీరసంనాలుగు మెట్టు ఎక్కంగానే ఆయాసంఇలాంటి లక్షణాలున్నపుడు వెంటనే వైద్యుని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి.► మరి కొందరిలో ముందు దవడ, మెడ, జీర్ణాశయం పై భాగంలో నొప్పిగా ఉంటుంది. ► ఒకటి లేదా రెండు రోజులకు మించి ఎడం చెయ్యి లేదా రెండు చేతులలో అకారణంగా నొప్పి, వికారం, వాంతి వచ్చినట్టు ఉంటే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలిలక్షణాలు లేకపోయినా ఎవరు జాగ్రత్త పడాలి అధిక బరువు వున్నా, హైబీపీ డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నా, ధూమపానం అలవాటు ఉన్న వారంతా గుండె పోటు ప్రమాదం పట్ల అవగాహనతో ఉండాలి. అలాగే ఎక్కువ ఒత్తిడి ఉండే ఉద్యోగాలు చేసేవారిలోనూ గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువ అనేది గమనించాలి. ముఖ్యంగా మధ్య వయసులో స్త్రీల కన్నా మగవారికి గుండెపోటువచ్చే ప్రమాదం ఎక్కువని నిపుణులు చెబుతన్నారు.మెనోపాజ్ దశలో మహిళల్లో ఈస్ట్రెజెన్ స్థాయి తగ్గిపోతుంది. అప్పుడు వారిలో గుండె పోటు ముప్పు పెరుగుతుంది. అయితే 65 ఏళ్ల తర్వాత పురుషుల్లో కంటేమహిళల్లో ఎక్కువ గుండె పోటు వస్తున్నట్టు పలు అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరువురిలోనూ అలసత్వం ఎంతమాత్రం మంచిది కాదు.మరీ ముఖ్యంగా కుటుంబంలో ఎవరికైనా గుండెపోటు వచ్చిన చరిత్ర ఉన్నా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. వంశపారంపర్యంగా ఈ గుండె వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.గుండెపోటు రావడానికి కారణంవృత్తి, వ్యాపారాల్లో భరించలేని టెన్షన్లు, సరైన పోషకాహారం తీసుకోకపోవడంచిన్నతనం నుంచే అలవాటుపడిన జంక్‌ఫుడ్‌లు వదలలేకపోవడంకాలానికి తగినట్లుగా పిరియాడికల్ టెస్టులు చేయించుకొని శరీరంలో వస్తున్న అనారోగ్య సంకేతాలను ముందే తెలుసుకొని తగిన చికత్సలు తీసుకోకపోవడంశక్తికి మించి జిమ్, ఎక్సర్సైజులు వంటివి చేయడంగుండెపోటు రాకుండా ఏం చేయాలి?క్రొవ్వు పదార్ధాలు అతిగా తినకుండా శరీరానికి అవసరమైన మేరకు తినడంప్రతి ఉదయం నలభై నుండి అరవై నిమిషాలు నడక, లేదా ఇతర వ్యాయామం చేయడం.ఒత్తిడి లేని జీవన శైలి పాటించడం, ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవడంనోట్: కొన్ని అనుమానాస్పద లక్షణాలున్నవారందరూగుండెజబ్బు వచ్చేసినట్టు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ లక్షణాలు కనిపించగానే రోగ నిర్ధరణ అనేది చాలా కీలకం. క్రమం తప్పని వ్యాయామం, సమతుల ఆహారంపై శ్రద్దతో పాటు ఏ చిన్న అనుమానం వచ్చినా అజాగ్రత్త చేయకుండా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. -
గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి
కర్ణాటక: నవగ్రహ కన్నడ చలనచిత్రం ద్వారా వెండి తెరకు పరిచయమై అనేక కన్నడ చిత్రాల్లో నటించిన గిరి దినేస్(45) గుండెపోటుతో మృతిచెందారు. కన్నడ సూపర్ స్టార్ దర్శన్ హీరోగా తన సోదరుడు దినకర్ దర్శకత్వం వహించిన నవగ్రహ చిత్రంతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ మూవీ 2008లో విడుదలైంది. ఆ చిత్రంలో శెట్టి పాత్రను పోషించడం ద్వారా గిరి దినేష్ పాపులర్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత ఆయనకు కోలీవుడ్‌లో మంచి అవకాశాలే దక్కాయి. ఇంట్లో పూజ గదిలో పూజ చేస్తుండగా హఠాత్తుగా కుప్పకూలిపోయాడు.కుటుంబ సభ్యులు ఆయన్ను తోణం ఆస్పత్రికి తరలించగా అప్పటికే తుదిశ్వాస వదిలినట్లు వైద్యులు నిర్ధారించారు. -
వీడియో: వైద్యుడి రీల్స్ పిచ్చి.. ఆసుపత్రిలో మహిళ మృతి
లక్నో: ఓ వైద్యుడి రీల్స్ పిచ్చి మహిళ ప్రాణాలను తీసింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళను రక్షించాల్సిన వైద్యులు సోషల్ మీడియా చూస్తూ బిజీగా ఉండటంతో సదరు మహిళ చనిపోయింది. సరైన సమయంలో వైద్యుడు స్పందించి ఉంటే ఆమె ప్రాణాలతో ఉండేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. యూపీలోకి మైన్‌పురి జిల్లాకు చెందిన ప్రవేశ్ కుమారి(60) అనే మహిళకు మంగళవారం ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆమెను వెంటనే సమీపంలోని మహారాజా తేజ్‌సింగ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో డాక్టర్ ఆదర్శ్ సెంగార్ డ్యూటీలో ఉన్నారు. దీంతో, బాధితులు ఆదర్శ్‌ను సంప్రదించారు. దీంతో, ఓ నర్సును బాధితురాలి వద్దకు పంపి.. డాక్టర్ మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్, ఫేస్బుక్లో రీల్స్ చూస్తూ కూర్చున్నాడు. ఈ క్రమంలో మహిళ కుటుంబసభ్యులు వైద్యం చేయాలని అడిగినా పట్టించుకోలేదు. ఐదు నిమిషాల పాటు బాధతో విలవిలలాడిన బాధితురాలు సరైన వైద్య సహాయం అందకపోవడంతో ప్రాణాలు కోల్పోయింది.ప్రవేశ్ కుమారి మృతి చెందడంతో ఆగ్రహించిన మృతురాలి కుటుంబసభ్యులు డాక్టర్‌పై దాడి చేశారు. దీంతో ఆస్పత్రికి సిబ్బందికి, వారికి మధ్య వివాదం నెలకొంది. వైద్యం చేయమని పదే పదే అడిగినా తమ తల్లి ప్రాణం పోయేదాకా డాక్టర్ రీల్స్ చూస్తూ కూర్చున్నాడని మృతురాలి కుమారుడు గురుశరణ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమ తల్లికి ఎందుకు వైద్యం చేయలేదని ప్రశ్నించినందుకు వైద్యుడు తమపై దాడి చేశాడని పేర్కొన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వైద్యుడిపై కేసు నమోదు చేశారు. చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ (సీఎంఎస్) ఆధ్వర్యంలో సీసీటీవీని పరిశీలిస్తున్నామని.. ఆరోపణలు నిజమని తేలితే వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో సదరు వైద్యుడిపై చర్యలు తీసుకుంటారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.At the #Mainpuri district hospital in #UttarPradesh, a 60-year-old woman, #PraveshKumari, died of a heart attack while the doctor on duty, #DrAdarshSanger, allegedly watched reels on his mobile phone.The woman's family claims that crucial time was lost due to the doctor's… pic.twitter.com/ZGLcD5ZExg— Hate Detector 🔍 (@HateDetectors) January 29, 2025 -
టాటూ కోసం వెళ్లి..వ్యాపారవేత్త, పాపులర్ ఇన్ఫ్లూయెన్సర్ మృతి
గుండెపోటుతో సంభవిస్తున్న హఠాన్మారణాలు ఆందోళన రేపుతున్నాయి. దీనికి సంబంధించి మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. బాగా ఫిట్‌గా ఉన్నామను కున్నవారు కూడా ఉన్నట్టుండి హార్ట్ ఎటాక్‌తో కుప్పకూలుతున్న సంఘటనలు ఇటీవలి కాలంలో బాగా పెరుగుతున్నాయితాజాగా బ్రెజిలియన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆకస్మిక మరణం అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. అదీ వీపుమీద టాటూ వేయించుకుంటూ ఉండగా ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది. వివరాలు ఏంటంటే..45 ఏళ్ల బ్రెజిలియన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రికార్డో గొడోయ్ టాటూ వేసుకుంటూ ఉండగా కుప్పకూలిపోయాడు. వీపు మొత్తంవీపు టాటూ వేయించుకోవాలని భావించిన గొడోయ్ బ్రెజిల్‌లోని శాంటా కాటరినాలోని టాటూ స్టూడియోకు వచ్చాడు. ఈ ప్రక్రియ కోసం మత్తు (జనరల్ అనస్థీషియా) ఇచ్చిన కొద్దిసేపటికే అతను గుండెపోటుకు గురయ్యాడు. దీంతో హుటాహుటిన కార్డియాలజిస్ట్‌తో సహా వైద్య సిబ్బంది అతడిని బతికించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రయత్నాలు విఫలమై అదే రోజు మధ్యాహ్నం గొడోయ్ మరణించాడు. ఈ విషయాన్ని స్టూడియో యజమాని గొడోయ్ ఇన్‌స్టా పేజ్ ధృవీకరించింది. జనవరి 20న ఈ విషాదం చోటు చేసుకుంది.ఎవరీ గొడోయ్ ప్రీమియం గ్రూప్ సీఈవో రికార్డో గొడోయ్ లగ్జరీ కార్ల వాడకంలో పేరుగాంచాడు. వ్యాపారవేత్తగా, లగ్జరీ కార్లు , హై-ఎండ్ జీవనశైలితో బాగా పాపులర్ అయ్యాడు. లగ్జరీ కార్ల గురించి ఆకర్షణీయమైన పోస్ట్‌లతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేవాడు. సోషల్ మీడియాలో 225,000 మందికి పైగా అభిమానులను సంపాదించుకున్నాడు. లగ్జరీ ఆటోమొబైల్ పరిశ్రమ గురించి ఆకర్షణీయమైన కంటెంట్‌ను అందిస్తూ గొడోయ్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులతో కనెక్ట్ అయ్యాడు.టాటా వేయించుకున్నాక త్వరలోనే మిమ్మల్ని పలకరిస్తా అంటూ తన అనుచరులకు హామీ ఇచ్చిన గొడోయ్ గుండెపోటుతో మరణించడంతో ఫ్యాన్స్ విచారం వ్యక్తం చేశారు. టాటూ స్టూడియో యజమాని సైతం సంతాపం ప్రకటించాడు. గొడోయ్ను "గొప్ప స్నేహితుడు"గా అభివర్ణించాడు. మరోవైపు ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు. View this post on Instagram A post shared by RICARDO GODOI (@ricardo.godoi.oficial) -
పెరుగుతున్న గుండెపోటు మరణాలు
సాక్షి, హైదరాబాద్: ఈ మధ్యకాలంలో గుండెపోటుతో హఠాత్ మరణాలు పెరిగిపోతున్నాయి. చిన్నా–పెద్దా, పురుషులు–మహిళలు, ధనవంతుడు–పేదవాడు అనే తారతమ్యాలు, వయసు తేడాలు లేకుండా ఏడెనిమిదేళ్ల లోపు చిన్న పిల్లలు మొదలు 18–25 ఏళ్ల మధ్య యువజనులు, శారీరకంగా ధృడంగా ఉండే రాజకీయవేత్తలు, కసరత్తులు చేసి ఫిట్‌గా ఉండే క్రీడాకారులు, అప్పటిదాకా ఎలాంటి గుండెజబ్బు ఆనవాళ్లు లేనివారు కూడా అకస్మాత్తుగా వచ్చే హార్ట్ ఎటాక్, కార్డియక్ ఫెయిల్యూర్లతో నేలకొరుగుతున్నారు. ఇటీవలే కొన్నిరోజుల క్రితం...గుజరాత్లో ఓ ఎనిమిదేళ్ల బాలిక తరగతి గది కారిడార్‌లో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో విగతజీవిలా కిందకు వాలిపోవడం స్కూల్ సీసీటీవీలో రికార్డయింది. ఈ వీడియో వివిధ సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రచారం పొందడంతో...దీనిని చూసిన వారంతా కూడా ఎంతో ఆవేదనకు గురయ్యారు. ఇటీవల చిన్నపిల్లల్లో గుండెజబ్బుల ముప్పు పెరుగుతున్నట్లుగా గత మూడు, నాలుగు నెలల్లో చోటుచేసుకున్న వివిధ సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. వీరే కాకుండా కొన్ని రోజుల వ్యవధిలోనే వయసుతో తేడా లేకుండా కొందరు హఠాత్తుగా వస్తున్న గుండెపోటుతో మరణించారు. ముందే గుర్తించవచ్చు... లోకం తెలియని చిన్నవయసులోనే గుండెపోటుతో మరణించడం తల్లిదండ్రులు, బంధువులకు తీరని శోకాన్ని మిగిలిస్తోంది. అయితే హఠాత్తుగా గుండె జబ్బుతో చనిపోవడం అంటూ ఉండదని, పుట్టినప్పటి నుంచే అంటే.. గర్భస్త స్థితి నుంచే గుండెజబ్బులకు సంబంధించిన లక్షణాలతో ఈ ప్రాణాంతక ముప్పును గుర్తించవచ్చునని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. చిన్నపిల్లల్లో గుండెజబ్బుకు సంబంధించి కొన్ని లక్షణాలను ముందునుంచే గుర్తించవచ్చునని, వారి శరీరరంగు ముఖ్యంగా పెదాలు, చేతులు నీలం రంగులోకి మారడం వంటివి గమనించాలని చెబుతున్నారు. సాధారణంగా పసిపిల్లలుగా చిన్నవయసులో ఉన్నప్పుడే 3, 4 పర్యాయాలు శ్వాససంబంధిత ఇన్ఫెక్షన్లు సోకుతాయని, అంతకు మించిన సంఖ్యలో, తరచూ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయంటే తల్లిదండ్రులు అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు. వారి వయసుకు తగ్గట్టుగా తగినంతగా బరువు పెరగకపోవడం, నాలుగు మాసాల వయసప్పుడు మందహాసం (నార్మల్ స్మైల్), ఏడాది వయసు పూర్తయ్యేలోగా తొలి అడుగు వేయకపోవడం వంటివి బాగా ఆలస్యమైతే ఏదైనా సమస్య ఉండొచ్చునని, ముందస్తుగా జాగ్రత్త పడాలని చెబుతున్నారు. చిన్నపిల్లలు పుట్టినప్పటి నుంచే వారి గుండె పనితీరుకు సంబంధించి ఏవైనా లోపాలుంటే ‘2 డీ ఎకో’, ఈసీజీ ఇతర రూపాల్లోని పరీక్షల ద్వారా సమస్యలను గుర్తించి తగిన చికిత్స అందిస్తే. సడన్ హార్ట్అటాక్ వంటి వాటిని చాలా మటుకు నివారించవచ్చునని సూచిస్తున్నారు. ఇక పెద్ద వయసులోని (యువకులతో సహా) వారి విషయానికొస్తే...గుండెనొప్పా లేక ఎసిడిటీనా అని సొంతంగా తేల్చుకునే ప్రయత్నంతోనే ప్రాణాపాయ పరిస్థితి పెరుగుతోందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. రాత్రి సమయాల్లో ఎవరికైనా గుండెలో నొప్పిగా అనిపిస్తే దానిని ఎసిడిటీగా కొట్టిపారేసి నిర్లక్ష్యం చేయడం అధికశాతం మందిలో పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. ఇలా గుండెనొప్పికి, అసౌకర్యానికి గురయ్యాక వెంటనే సమీపంలోని ఆసుపత్రిలో ఈసీజీ, రక్తపరీక్షలు, సీటీ స్కాన్ చేయించుకుంటే ప్రమాదం నుంచి బయటపడొచ్చునని సూచిస్తున్నారు. గుండెపోటు వచ్చాక 4 నుంచి 6 గంటలు గోల్డెన్ పీరియడ్ వంటివని, ఈ సమయంలోగా ఆసుపత్రికి చేరుకుంటే ప్రమాదంనుంచి తప్పించుకోవచ్చునని చెబుతున్నారు. అదే ఆరుగంటల తర్వాత ఆస్పత్రికి వెళితే లక్షలాది రూపాయలు వెచ్చిoచినా ఒకసారి గాయపడిన గుండె మళ్లీ పూర్తిస్థాయిలో కోలుకోవడం అరుదేనని హెచ్చరిస్తున్నారు. నిద్రించే సమయాల్లోనే అధికంగా హార్ట్అటాక్లకు అవకాశం ఉందని, ఆరోగ్యమైన గుండె కలవారు హఠాత్ గుండెపోటుతో మరణించడం అనేది అత్యంత అరుదని చెబుతున్నారు. అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించే ప్రమాదాన్ని అరికట్టేందుకు రెగ్యులర్ పరీక్షలతో పాటు, హెల్త్‌కేర్ విషయంలో అందుబాటులోకి వచి్చన నూతన సాంకేతికను అధికంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. 40, 50 ఏళ్ల వయసుల్లోని వారిలో వేలాది మంది గుండెజబ్బు ఉన్న వారిని డయాగ్నైజ్ చేసిన దాఖలాలు లేవంటున్నారు. మధ్యవయసు్కల్లోనూ శారీరకంగా దృఢంగా ఉన్న వారు, ఫిట్‌గా కనిపించేవారు, కసరత్తులు చేసేవారు సైతం హార్ట్ అటాక్‌కు గురి కావడం పట్ల ఆశ్యర్యం వ్యక్తమవుతోంది. అయితే అధికశాతం కేసుల్లో వీరికి గతం నుంచే గుండెజబ్బులు ఉండి అవి తీవ్రస్థాయికి చేరుకోవడం వల్లనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని చెబుతున్నారు. ఆరోగ్యవంతులైనా సరే ఒక్కసారైనా సీటీ స్కాన్, కార్డియక్ ఎవాల్యువేషన్ చేయించుకుంటే ముందుగానే ఆరోగ్య సమస్య బయటపడి మరణానికి గురయ్యే ప్రమాదం ఉండదని అంటున్నారు. ఆరోగ్యమైన గుండెకు పంచసూత్రాలు... వైద్యనిపుణుల సూచనల ప్రకారం...రెగ్యులర్ చెకప్‌లు... రక్తపరీక్షలు, ఈసీజీ, ఎకో కార్డియోగ్రామ్, సీటీ యాంజియో, అ్రల్టాసౌండ్. మహిళలకు మామ్మొగ్రామ్స్ ఇంకా పాప్ స్మియర్ టెస్ట్‌లు ఎక్సర్సైజ్... ప్రతీరోజు రెగ్యులర్ కసరత్తులు, స్వల్ప ఎక్సర్సైజులు, వేగంగా నడక (బ్రిస్క్ వాకింగ్), యోగా వంటివి ఎంతో ఉపయోగం డైట్... బియ్యం, చపాతీ, చక్కెర వంటి కార్బోహైడ్రేట్లను పరిమితంగా తీసుకోవాలి. రెడ్ మీట్‌ను దూరం పెట్టాలి స్లీప్ఎర్లీ... రాత్రి సమయాల్లో త్వరగా నిద్రపోవడం, ఉదయం త్వరగా నిద్రలేవడం వంటి అలవాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది స్పిరిచ్యువాలిటీ... ఆధ్యాతి్మకతను అలవరుచుకోవడం ద్వారా ఒత్తిళ్లను తగ్గించుకుని గుండె ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవచ్చు. -
గుండెపోటుతో ‘సాక్షి’ ఉద్యోగి మృతి
ఖైరతాబాద్(హైదరాబాద్): గుండెపోటుతో సాక్షి దినపత్రికలో పనిచేస్తున్న ఉద్యోగి మృతి చెందిన సంఘటన ఖైరతాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లా యలమంచిలి ప్రాంతానికి చెందిన పి.శేషాచలపతిరావు(55) కుటుంబ సమేతంగా హైదరాబాద్ నగరానికి విచ్చేసి అల్వాల్‌లో నివాసముంటూ బంజారాహిల్స్‌లోని సాక్షి దినపత్రిక కార్యాలయంలో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్నారు. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఐసీఐసీఐ బ్యాంక్ ఎదురుగా ఉన్న బస్టాప్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురికావడంతో బస్టాప్‌లోని ఫుట్‌పాత్‌పై పడిపోయాడు. అచేతనంగా పడి ఉన్న ఆయనను ప్రయాణికులు గమనించి 100 డయల్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఎస్ఐ అమర్నాథ్, ఏఎస్ఐ శ్రీరాములు పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. వివరాల కోసం ఆరా తీయగా బ్యాగులో సాక్షి దినపత్రిక ఐడీ కార్డు, బస్ పాస్ లభించాయి. దీంతో కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి, వారంతా వైజాగ్‌కు వెళ్లినట్లు తెలుసుకొని భార్య, బావమరిది, వదినకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
ఖమ్మం: క్రికెట్ ఆడుతూ కన్నుమూత
ఖమ్మం, సాక్షి: సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు. హుటాహుటినా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. గుండె పోటుతో అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. కూసుమంచి మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విజయ్ అనే యువకుడు టోర్నమెంట్లో భాగంగా ఆడుతున్నాడు. ఉన్నపళంగా అతను ఒక్కసారిగా గ్రౌండ్లో కింద పడిపోవడంతో.. నిర్వాహకులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతని ప్రాణం పోయింది. పరీక్షించిన వైద్యులు గుండెపోటు కారణంగానే చనిపోయాడని నిర్ధారించారు. దీంతో.. స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడు విజయ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మాయదారి గుండెపోటు : చిన్నారి ‘గుండెల్ని’ పిండేస్తున్న వీడియో
చిన్నారుల నుంచి పెద్దల దాకా గుండెపోటుతో సంభవిస్తున్న హఠాన్మరణాలు ఆందోళన రేపుతున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కారణంలో చిన్నారుల గుండె సంబంధిత సమస్యలతో మరణిస్తుండటం కలచివేస్తోంది. తాజాగా మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈసారి 8 ఏళ్ల బాలిక (School Girl) ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతికి గురి చేసింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని (Ahmedabad) థల్తేజ్ ప్రాంతంలో శుక్రవారం ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో నమోదయ్యాయి.అహ్మదాబాద్‌లోని గార్గి రాణపరా(Gargi Ranapara) జేబార్ స్కూల్ ఫర్ చిల్డ్రన్‌లో గార్గి మూడో తరగతి చదువుతోంది. పాఠశాలకు వచ్చిన కొద్దిసేపటికే ఛాతీ నొప్పికి గురైంది. క్లాస్ రూమ్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా నొప్పి రావడంతో కాసేపు అక్కడే నిలబడింది. నొప్పితో బాధపడుతూనే అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంది. అంతే కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఇది గమనించిన టీచర్లు ఆమెకు సపర్యలు చేశారు. బాలికను కాపాడేందుకు టీచర్లు సీపీఆర్ చేశారు. అయినా బాలికలో ఎలాంటి చలనం లేదు. వెంటనే దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే సమయానికే బాలిక పరిస్థితి విషమించింది. వైద్యులు ఆమెను బతికించేందుకు తీవ్రంగా శ్రమించారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. గార్గి గుండెపోటుతో మరణించిందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పాఠశాల ప్రిన్సిపల్ శర్మిష్ఠ సిన్హా వెల్లడించారు.గార్గి పాఠశాల ఆవరణలో కొంచెం అనారోగ్యంగా కనిపించిందని, కొద్దిసేపు కూర్చున్న వెంటనే కుప్పకూలిపోయిందని చెప్పారు. వెంటనే అప్రమత్తమైన టీచర్లు, విద్యార్థులు వెంటనే ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నించినా, ఆమెనుకాపాడలేకపోయామని విచారం వ్యక్తం చేశారు.మరోవైపు దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక గుండెపోటుకు గల కారణాలలపై అన్ని కోణల్లో దర్యాప్తు చేస్తున్నామని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నీరజ్ బడ్గుజర్ ప్రకటించారు.🚨HEART BREAKING A 8 year old girl , all of a sudden fell down and died in school. Video from Krnavati (Ahmedabad) , Gujarat.What is happening to kids and youngsters ?? Almost every week we see or hear such cases . Instead of blaming Covid vaccines , we need to get into the… pic.twitter.com/R66mcrOIK9— Amitabh Chaudhary (@MithilaWaala) January 10, 2025 > కాగా ముంబైకి చెందిన గార్గి, తన బంధువుల ఇంటిలో ఉంటూ అహ్మదాబాద్‌లో చదువుకుంటోంది. గతంలో పెద్దగా ఆరోగ్య సమస్యలు లేవని సమాచారం. ఇటీవల బెంగళూరులో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల బాలిక తేజస్విని పాఠశాల కారిడార్‌లో గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే.గుండెపోటు లక్షణాలుఛాతీ నొప్పి,ఊపిరి ఆడకపోవడంవికారం, చెమటలు పట్టడం చేతులు, వీపు లేదా దవడలో నొప్పి వంటివి సాధారణ లక్షణాలునోట్: గుండెలోని రక్త నాళాల్లో రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడటం, రక్తనాళాలు పూడుకుపోవడం, రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోవడం తదితర కారణాల వల్ల గుండె పోటు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. అయితే, గుండె పోటు వెనుక చాలా కారణాలు ఉండొచ్చు. అందుకే ఏ చిన్న అనారోగ్యం వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. మరీ ముఖ్యంగా జిమ్ చేస్తున్నాం కదా, ఆరోగ్యంగానే ఉన్నాం కదా అని అస్సలు అనుకోకూడదు. ఇటీవలి కేసులను దృష్టిలో ఉంచుకుని చిన్నపిల్లల్లో అయినా అనుమానిత లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి కారణాలను రూల్ అవుట్ చేసుకోవడం చాలా అవసరం. -
విధుల్లో ఉండగా.. కానిస్టేబుల్‌కు గుండెపోటు
మహబూబ్‌నగర్ క్రైం: విధుల్లో ఉన్న ఓ ఏఆర్ కానిస్టేబుల్ గుండెపోటు రాగా.. ఆస్పత్రితో చికిత్స అందిస్తుండగానే మృతి చెందాడు. మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని మర్లులో నివాసం ఉంటూ హెడ్‌క్వార్టర్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న వెంకటేష్(50)కు సోమవారం ఎస్కాట్ డ్యూటీ పడింది. ఈక్రమంలో సోమవారం ఉదయం ఎస్పీ కార్యాలయం నుంచి జిల్లా జైలుకు వెళ్లి అక్కడ ఖైదీలను వాహనంలో తీసుకుని కోర్టులో హాజరుపరిచి మళ్లీ మధ్యాహ్నం సమయంలో జైలులో ఖైదీలను అప్పగించి తిరిగి బయట వచ్చాడు. ఆ సమయంలో చాతీలో నొప్పి వస్తున్నట్లు వెంకటేష్ తోటి కానిస్టేబుల్స్‌కు చెప్పి కింద కూర్చుకున్నాడు. వెంటనే వారు చికిత్స కోసం జిల్లా జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు సీపీఆర్ చేయడంతో పాటు చికిత్స అందిస్తున్న క్రమంలోనే మృతి చెందాడు. క్యాజువాలిటీలో ఉన్న వెంకటేష్ మృతదేహన్ని ఎస్పీ డి.జానకి పరిశీలించి కుటుంబసభ్యులను పరామర్శించారు. మృతుడు వెంకటేష్‌కు భార్య వనీత, ఇద్దరూ కొడుకులు అభినవ్, వర్షవర్ధన్లు ఉన్నారు. మృతదేహన్ని అతని స్వస్థలం సీసీకుంటకు తరలించారు. -
‘స్పీడ్ బ్రేకర్’ ప్రాణం పోసింది!
కొల్హాపూర్: వైద్యుడు నిర్లక్ష్యంగా ఓ రోగి చనిపోయాడని చెప్పినా ఒక స్పీడ్‌బ్రేకర్ (Speed Breaker) కారణంగా ఆ రోగి మళ్లీ బతికొచ్చిన వైనం మహారాష్ట్రలో (Maharashtra) చోటుచేసుకుంది. రెండు వారాల క్రితం జరిగిన ఈ వింత ఘటన తాలూకు వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన కొల్హాపూర్ జిల్లాలోని (Kolhapur District) కసాబా–బావడా ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల పాండురంగ ఉల్పే అనే వ్యక్తికి గుండెపోటు రావడంతో వెంటనే హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రిలో చేరారు.అయితే అప్పటికే ఆయన మృతిచెందినట్లు ఆ ఆస్పత్రిలోని వైద్యులు ప్రకటించారు. దీంతో మృతదేహాన్ని తిరిగి సొంతూరుకు తీసుకెళ్లేందుకు ఒక అంబులెన్సును సిద్ధంచేశారు. పాండురంగ పరమపదించారన్న వార్త అప్పటికే సొంతూరిలో పాకింది. వెంటనే బంధువులు, స్నేహితులు, తెల్సిన వాళ్లు ఇంటికి రావడం మొదలెట్టారు. అందరూ ఇంటి వద్ద వేచి చూస్తుండటంతో మృతదేహాన్ని త్వరగా ఇంటికి తరలించాలన్న ఆత్రుతలో అంబులెన్సుకు డ్రైవర్ వేగంగా పోనిచ్చాడు.మార్గమధ్యంలో రహదారిపై ఉన్న ఒక పెద్ద స్పీడ్‌బ్రేకర్‌ను చూడకుండా అలాగే వేగంగా పోనిచ్చాడు. దీంతో వాహనం భారీ కుదుపులకు లోనైంది. ఈ సమయంలో పాండురంగ శరీరం అటుఇటూ కదలిపోయింది. తర్వాత శరీరాన్ని స్ట్రెచర్‌పైకి సవ్యంగా జరిపేటప్పుడు పాండురంగ చేతి వేళ్లు కదలడం చూసి ఆయన భార్య హుతాశురాలైంది. వెంటనే అంబులెన్సుకు ఇంటికి బదులు దగ్గర్లోని మరో ఆస్పత్రికి పోనిచ్చి పాండురంగను ఐసీయూలో చేర్పించారు. ఆయన ఇంకా ప్రాణాలతో ఉన్నారని తేల్చిన అక్కడి వైద్యులు పాండురంగకు వెంటనే యాంజియోప్లాస్టీ చేశారు. రెండు వారాల తర్వాత ఆయన పూర్తిగా కోలుకుని సోమవారం ఇంటికొచ్చారు. దీంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది. ‘‘ఆ స్పీడ్‌బ్రేకర్ లేకపోయి ఉంటే మా ఆయన ఇలా ఇంటికి కాకుండా నేరుగా శ్మశానానికే వెళ్లేవారు’’ అని పాండురంగ భార్య నవ్వుతూ చెప్పారు. బతికున్న రోగిని చనిపోయాడని సర్టిఫై చేసిన ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని పాండురంగ కుటుంబం నిర్ణయించుకుంది. త్వరలో ఆస్పత్రికి నోటీసులు పంపి కోర్టుకీడుస్తామని పేర్కొంది. -
భార్య కోసమే వీఆర్ఎస్, భర్త గుండె పగిలిన వైనం, వీడియో వైరల్
కేన్సర్‌తో బాధపడుతున్న భర్తను రక్షించుకునేందుకు నేపాలీ యువతి పడిన వేదన, ప్రేమతో అతనికి సేవలు, చివరకు అతను కన్నుమూసిన తీరు పలువురి హృదయాలను కదిలించింది. భార్యభర్తల ప్రేమ అంటే ఇలా ఉండాలి అంటూ చాలామంది అభిప్రాయపడ్డారు. దాదాపు ఇలాంటి మరో విషాద ఘటన గురించి తెలిస్తే కళ్లు చెమర్చక మానవు. రాజస్థాన్‌లోని కోటాలో ఈ ఘటన జరిగింది.జైపూర్‌కు చెందిన దేవేంద్ర సందాల్ కోటాలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో మేనేజర్‌గా పని చేసేవారు.. అతని భార్య టీనా అనారోగ్యం బారిన పడింది. దీంతో ఆమెను కంటికి రెప్పలా కాపాడుకువాలనే లక్ష్యంతో మూడేళ్ల పదవీకాలం ఉండగానే ముందస్తు రిటైర్మెంట్ ( వీఆర్ఎస్) తీసుకున్నారు. ఈ సందర్బంగా దేవంద్ర సహోద్యోగులు వీడ్కోలు పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో భార్యాభర్తలిద్దరూ ఉత్సాహంగా, నవ్వుతూ కనిపించారు. దండలు, శాలువాలు, స్నేహితులిచ్చిన పూల బొకేలతో ఫోటోలకు ఫోజులిచ్చారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా అక్కడి పరిస్థితి మారిపోయింది.नियति का खेल !पत्नी की तबीयत को देखते हुए पति ने लिया था VRS, रिटायरमेंट पार्टी में ही पत्नी की मौत,बीमार पत्नी की सेवा के लिए नौकरी छोड़ी, विदाई पार्टी में पत्नी ने हीं दुनिया छोड़ दी ।pic.twitter.com/yUn0xAGFch— राहुल चेची 🇮🇳 (@Rahulchechi26) December 25, 2024కళ్లు తిరుగుతున్నాయంటూ టీనా కుర్చీలో కూలబడింది. భార్య వీపుపై రుద్దుతూ సపర్యలు చేస్తూ మంచినీళ్లకు కోసం అడిగాడు. ఇంతలోనే పరిస్థితి మరింత విషమంగా మారిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు ధవీకరించారు.భర్తతో నవ్వుతూ, సంతోషంగా ఉన్న టీనా ఒక్కసారిగా గుండెపోటుతో మరణించిన దృశ్యాలు సంబంధించిన వీడియోలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్పటివరకూ హాయిగా నవ్వుతూ, అందర్నీ పలకరిస్తూ ఫొటోలు దిగిన ఆమెకు అవే చివరి క్షణాలవుతాయని ఎవరనుకుంటారు. అందరూ చూస్తుండగానే క్షణాల్లో టీనా ఈ ప్రపంచం నుంచి శాశ్వత వీడ్కోలు తీసుకోవడం విషాదాన్ని నింపింది. -
క్రికెట్ ఆడుతూ గుండె పోటుతో యువకుడి మృతి
గుడ్లవల్లేరు: మండలంలోని అంగలూరులో క్రికెట్ ఆడుతున్న యువకుడిని గుండెపోటు బలి తీసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. అంగలూరులో బుధవారం తన తోటి స్నేహితులతో కొమ్మలపాటి సాయి(26) క్రికెట్ ఆడుతూ బౌలింగ్ చేస్తున్న సమయంలో గుండెపోటుకు గురయ్యాడు. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అతడిని హుటాహుటిన గుడివాడలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అతను అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని గుడ్లవల్లేరు ఎస్ఐ ఎన్.వి.వి.సత్య నారాయణ తెలిపారు. -
గుండెపోటుతో ఎంబీబీఎస్ స్టూడెంట్ మృతి
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని మహవీర్ మెడికల్ కళాశాలకు చెందిన ఓ విద్యారి్థని సోమవారం రాత్రి గుండెపోటుతో మృతిచెందింది. పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి..హైదరాబాద్‌కు చెందిన మేఘన(18) స్థానిక మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఫస్టియర్ చదువుతోంది. కాగా సోమవారం సాయంత్రం కళాశాల ఆవరణలోని గ్రౌండ్లో స్నేహితులతో కలిసి ఉండగా.. గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలింది. తోటి విద్యార్థులు వెంటనే ఆమెను కళాశాల ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. తల్లిదండ్రులు చేరుకుని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి్పంచగా చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతిచెందింది. విద్యారి్థని తండ్రి బాబురావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వికారాబాద్ పోలీసులు తెలిపారు. -
బస్సు డ్రైవర్ కు గుండెపోటు..
-
గుండెపోటుతో 9వ తరగతి విద్యార్థిని మృతి
భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం జూలూరు గ్రామంలో గుండెపోటు తో 9వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. మృతురాలి సోదరుడు తెలిపిన వివరాల మేరకు.. గ్యార స్వామి, యాదమ్మ దంపతుల కుమార్తె నవ్య (16) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. కాగా మంగళవారం పాఠశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చిన కావ్య జ్వరంతో అస్వస్థతకు గురికాగా తల్లిదండ్రులు అదే రోజు రాత్రి స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించగా తగ్గింది. బుధవారం సాయంత్రం తిరిగి జ్వరం రావడంతో బీబీనగర్‌లోని ఓ ఆసుపత్రిలో చూపించారు. అక్కడ పరీక్షించిన వైద్యుడు జ్వరం, బీపీ ఎక్కువ ఉందని చెప్పడంతో మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి.. అనంతరం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. అయితే నవ్య మార్గమధ్యలోనే గుండెపోటుతో మృతి చెందిందని యశోద ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. ఆడపిల్ల కావాలనే కోరికతో స్వామి, యాదమ్మ దంపతులు రెండు నెలల వయసున్న నవ్యను బంధువుల నుంచి దత్తత తీసుకుని ఎంతో గారాబంగా పెంచుకున్నారు. Hydra: ఇల్లు పోతుందన్న భయంతో పేద గుండె ఆగింది -
Hydra: ఇల్లు పోతుందన్న భయంతో పేద గుండె ఆగింది
ఉప్పల్, సాక్షి హైదరాబాద్: తన ఇల్లు కూల్చివేస్తారేమో అన్న దిగులుతో ఓ నిరుపేద గుండె ఆగింది. ఘటనకు సంబంధించి బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. రామంతాపూర్ కేటీఆర్ నగర్ ప్రాంతానికి చెందిన స్కూల్ వ్యాన్ నడిపే తాటిపల్లి రవీందర్ (55)కి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. కుమార్తెలిద్దరికీ వివాహాలు అయ్యాయి. రవీందర్ 75 గజాల స్థలంలో నిరి్మంచిన రేకుల ఇంట్లో ఉంటున్నారు. ఇది మూసీ పరీవాహక ప్రాంతంలో ఉండటం వల్ల రవీందర్ నివాసముంటున్న ఇంటికి అవతలి పక్కన ఉన్న ఇంటికి అధికారులు మార్కు చేశారు. దీంతో రవీందర్‌కు తన ఇంటిని కూడా కూల్చి వేస్తారేమోనన్న బెంగ పట్టుకుంది.అప్పటి నుంచి దిగాలుగా ఉంటున్నాడు. ఉన్న చిన్న ఇల్లు ఆధారం పోతే ఎలా బతికేదంటూ కుటుంబ సభ్యులతో ఆందోళన వ్యక్తం చేసేవాడు. నెల రోజుల క్రితం ఇదే ఆవేదనతో గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున మరోసారి గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ రవీందర్‌ను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పెద్ద దిక్కు కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. హైడ్రాపై ఫేక్ ప్రచారం చేస్తే కఠిన చర్యలు: రంగనాథ్ మూసీ నది ఎఫ్ఐఎల్, బఫర్ జోన్లలో మార్కింగ్, కూల్చివేతలతో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసినప్పటికీ ఫేక్ ప్రచారం చేస్తున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో హైడ్రాపై భయాందోళనలు సృష్టిస్తే ఊరుకోమని ఆయన హెచ్చరిచారు. మూసీ నదిలో హైడ్రా ఎలాంటి చర్యలు చేపట్టదనీ, నిబంధనల ప్రకారమే హైడ్రా కార్యకలాపాలు ఉంటాయన్నారు. ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. Atul Subhash Case: అతుల్.. అంతులేని ఆవేదన -
ఆ జిల్లాకు ఏమైంది? విద్యార్థుల ప్రాణాల్ని తీస్తున్న గుండె పోటు.. తాజాగా
ఆ జిల్లాకు ఏమైందో ఏమో.. నెలల వ్యవధిలో హార్ట్ ఎటాక్‌తో విద్యార్థులు ప్రాణలు పోగొట్టుకున్నారు. నెలల వ్యవధిలో ముగ్గుర విద్యార్థుల్లో హార్ట్ ఎటాక్‌తో ప్రాణాలు పోగొట్టుకోగా.. ముగ్గురు అంతకంటే ఎక్కవమంది విద్యార్థులు కార్డియాక్ అరెస్ట్‌తో ఆస్పత్రి పాలైనట్లు తెలుస్తోంది. తాజాగా, స్కూల్లో ఆటల పోటీల కోసం ప్రాక్టీస్ చేస్తున్న 14ఏళ్ల బాలుడు హార్ట్ ఎటాక్ ప్రాణాలు పోగొట్టుకోవడం ప్రతీ ఒక్కరిని కలచి వేస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..ఉత్తరప్రదేశ్ అలీఘర్ జిల్లా సిరౌలి గ్రామానికి చెందిన మోహిత్ చౌదరి (14) చదివే స్కూల్లో డిసెంబర్ 7న ఆటలు పోటీలు జరగనున్నాయి. ఈ ఆటల పోటీల్లో తన ప్రతిభను చాటుకునేందుకు మోహిత్ చౌదరి సిద్ధమయ్యాడు.ఇందులో భాగంగా తన తోటి స్నేహితులతో కలిసి పరుగు పందెం ప్రాక్టీస్ చేస్తుండగా.. హార్ట్ ఎటాక్‌తో స్కూల్ గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు. అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే బాలుడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.కాగా, ఈ ఏడాది ఆగస్ట్ నెలలో బాలుడి తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించగా..ఇప్పుడు కుమారుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత నెలలో మమతమరోవైపు అలీఘర్ జిల్లాలో గుండె పోటుతో నెలల వ్యవధిలో విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ నవంబర్ నెలలో అలీఘర్ జిల్లా అర్రానా గ్రామానికి మమత (20) గుండె పోటుతో మరణించింది. రన్నింగ్ తర్వాత హార్ట్ ఎటాక్‌తో కుప్పకూలింది. అత్యవసర చికిత్స నిమిత్త ఆస్పత్రికి తరలించినా..అప్పటికే జరగాల్సి నష్టం జరిగింది. మమత అక్కడికక్కడే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అంతేకాదు, కొద్ది రోజుల క్రితం అదే అలీఘర్ జిల్లా లోధి నగర్‌కు చెందిన ఏనిమిదేళ్ల బాలిక గుండె పోటుతో మరణించింది. 25రోజుల వ్యవధిలో ముగ్గురు విద్యార్థులు కార్డియాక్ అరెస్ట్‌తో ఆస్పత్రి పాలయ్యారు. ప్రస్తుతం అలీఘర్ జిల్లాలో వరుస మరణాలు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. -
శిక్షణలో హెడ్మాస్టర్ హఠాన్మరణం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయనగరం: పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులకు అందిస్తున్న నాయకత్వ, నైపుణ్యాల అభివృద్ధి శిక్షణ కార్యక్రమం (స్కూల్ లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–ఎస్ఎల్డీపీ)లో మరో అపశృతి చోటుచేసుకుంది. మూడోదశ శిక్షణలో భాగంగా విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మరుపల్లి పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన ఉపా«ద్యాయులకు శిక్షణ జరుగుతోంది. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం నేరడి ఎంపీయూపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిరిపురపు శ్రీనివాసరావు (52) గత సోమవారం నుంచి పాల్గొంటున్నారు. గురువారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.ఆయనను తోటి ఉపాధ్యాయులు వెంటనే సమీపంలోని గజపతినగరం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పాలకొండకు చెందిన శ్రీనివాసరావుకు భార్య, ఇద్ద రు పిల్లలు ఉన్నారు. కాగా, ఇప్పటికే ఈనెల 6న ఏలూరుజిల్లా ఆగిరిపల్లిలో శిక్షణకు హాజరైన ప్రధానోపాధ్యాయుడు వెంకట రత్నకుమార్ ఇదే తరహాలో మరణించగా.. చీరాలలో మరో ప్రధానోపాధ్యాయడు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలయ్యా రు. ఇలా వరుస ఘటనలపై ఉపాధాయ్య సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.శ్రీనివాసరావు మృతికి నిరసనగా పలు జిల్లాల్లోని శిక్షణ కేంద్రాల్లో ఉపాధ్యాయులు గురువారం తరగతులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. శిక్షణ కార్యక్రమాన్ని రద్దుచేస్తున్నట్లు విశాఖపట్నం జోన్–1 ఆర్జేడీ బి.విజయభాస్కర్ మరుపల్లి శిక్షణ కేంద్రానికి వచ్చి చెప్పడంతో అక్కడ ఉపాధ్యాయులు శాంతించారు. బలవంతపు శిక్షణతో వేధింపులు: వైఎస్సార్టీఏశిక్షణలో ఇద్దరు ఉపాధ్యాయులు మరణించడం బాధాకరమని వైఎస్సార్‌టీఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్‌కుమార్‌రెడ్డి, సుధీర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రెసిడెన్షియల్ శిక్షణను రద్దుచేయాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా అధి కారుల్లో చలనం లేదన్నారు. బలవంతపు శిక్షణతో ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు. మృతుల కు టుంబంలో అర్హత గలవారికి ప్రభుత్వోద్యోగం ఇ వ్వాలని వారు డిమాండ్ చేశారు.ఇలాంటి శిక్షణలు రద్దుచేయాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర శాఖ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీవీ ప్రసాద్, రాధాకృష్ణ, ఆప్టా రాష్ట్ర అధ్యక్షులు గణపతిరావు, ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌రావు, ఏపీ ప్రగతిశీల ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్‌రెడ్డి, ఏపీటీఎఫ్, ఏపీ పూలే టీచర్స్ ఫెడరేషన్, మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్.. డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ టీచర్స్ ఫెడరేషన్.. ఏపీ ఉపాధ్యాయ సంఘం, నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్లు వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశాయి. -
అమీర్‌పేట మెట్రో స్టేషన్లో ప్రయాణికుడి మృతి
హైదరాబాద్: అమీర్‌పేట మెట్రో స్టేషన్లో ఓ ప్రయాణికుడు మృతి చెందిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం రాత్రి అమీర్‌పేట మెట్రోరైలు ఫ్లాట్ ఫాం నెంబర్ 1లో ఓ వ్యక్తి ఉన్న ఫలంగా కుప్పకూలడాన్ని గుర్తించిన సిబ్బంది అతడికి ప్రాథమిక చికిత్స అందించడంతో పాటు సీపీఆర్ చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో హార్ట్ స్ట్రోక్ కారణంగా మృతి చెంది ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతుడి వద్ద లభించిన ఆధారాలతో అతను ఏపీలోని ఫిరంగిపురకు చెందిన బాలస్వామి సుదీర్ (39) గుర్తించారు. నగరంలోని కొత్తపేటలో ఉంటూ సింపోర్ సాఫ్ట్వేర్ కంపెనీలో అడ్మిస్ట్రేటర్‌గా పనిచేస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చెట్టును ఢీ కొట్టిన కారుశామీర్పేట్: కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన జినోమ్‌వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నగరానికి చెందిన ఫర్హాన్ అహ్మద్ అన్సారి(23), షకీర్, రిజ్వాన్, అబ్దుల్లా స్నేహితులు. వీరు నలుగురు కలిసి కారు అద్దెకు తీసుకుని బుధవారం తెల్లవారుజామున కొండపోచమ్మ డ్యామ్‌కు బయలుదేరారు. అతివేగం కారణంగా మూడుచింతలపల్లి మండలం, కొల్తూర్ గ్రామ సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొంది. ఈ ఘటనలో డ్రైవర్ పక్క సీటులో ఉన్న ఫర్హాన్ అహ్మద్ అన్సారీ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారు నడుపుతున్న షకీర్‌తో పాటు వెనక సీటులో కూర్చున్న రిజ్వాన్, అబ్దుల్లాకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
అదిలోనే అలర్ట్ అవ్వండి
సాక్షి, హైదరాబాద్: చిన్నపిల్లల్లో గుండెజబ్బుల ముప్పు పెరుగుతోంది. ఇటీవలి కాలంలో చిన్నపిల్లలతో పాటు యుక్త వయసు వారు కూడా హఠాత్ గుండెపోటుతో మరణిస్తున్నారు. ముఖ్యంగా అప్పటివరకు ఆడుకుంటూ సందడి చేసిన ఐదు, పదేళ్ల లోపు పిల్లలు హఠాత్తుగా కుప్ప కూలిపోతున్నారు. క్షణాల్లోనే మృత్యువాత పడుతున్నారు. గుండెపోటు వల్ల తమ బిడ్డలు మరణించారని తెలుసుకుంటున్న తల్లిదండ్రులు, బంధువులు విస్తుపోతున్నారు. తమకెందుకీ శాపం అంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. రాష్ట్రంలో సైతం ఇటీవలి కాలంలో పెరుగుతున్న ఈ తరహా మరణాలపై ఆందోళన వ్యక్తమవుతోంది.అయితే అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటు కారణంగానే వారు మరణించినప్పటికీ, పుట్టినప్పటి నుంచే..జన్యుపరమైన కారణాలు, ఇతరత్రా కారణాలతో గుండె జబ్బులకు సంబంధించిన లక్షణాలు వారిలో ఉంటాయని, వాటిని గుర్తించడం ద్వారా, గుర్తించిన తర్వాత నిర్లక్ష్యం చేయకుండా ఉండటం ద్వారా ఈ ప్రాణాంతక ముప్పును తప్పించవచ్చని వైద్య నిపుణులు సూచిçస్తున్నారు. ముందుగానే ఆయా జబ్బులతో ముడిపడిన చిన్న చిన్న లక్షణాలను గుర్తించి సరైన వైద్యం చేయిస్తే ప్రమాదం ఉండదని చెబుతున్నారు. కార్పొరేట్ ఆసుపత్రులలోనే పరీక్షలు, వైద్యం చేయించాల్సిన పనిలేదని, పేద కుటుంబాల వారు నిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో ‘పీడియాట్రిక్ ఐసీయూ’, ఇతర రూపాల్లో ఉత్తమ సేవలు పొందవచ్చునని వివరిస్తున్నారు.ఇటీవలే బ్రిటన్‌కు చెందిన నిపుణులైన వైద్యుల బృందం పేద పిల్లలకు ఆపరేషన్లు చేయడంతో పాటు ఇతర రూపాల్లో వైద్య సేవలు అందించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న ఈ అంశంపై, హృద్రోగ సంబంధిత సమస్యలపై.. నిమ్స్ కార్డియో థొరాసిక్ సర్జరీ హెడ్ డాక్టర్ అమరేష్ రావు మాలెంపాటì, æఉస్మానియా మెడికల్ కాలేజీ కార్డియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హరీ‹Ùలు తమ అభిప్రాయాలు, సూచనలను ‘సాక్షి’తో పంచుకున్నారు.⇒ ఇటీవల ఖమ్మం జిల్లాలో అప్పటివరకు తల్లిదండ్రులతో కలిసి ఆట పాటలతో సందడి చేసిన ప్రహర్షిక అనే నాలుగేళ్ల చిన్నారి గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయింది.⇒ మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఏడో తరగతి చదువుతున్న నివృతి హఠాత్తుగా గుండెపోటుకు గురై మరణించింది. ⇒ జగిత్యాల జిల్లాలో సంజీవ్ అనే యువకుడు పెళ్లి బారాత్‌లో నృత్యం చేస్తూ గుండెపోటుతో కుప్పకూలాడు.గమనించడం ముఖ్యం గుండె జబ్బుకు సంబంధించి లక్షణాలను ముందే గమనించవచ్చు. వారి శరీరరంగు ముఖ్యంగా పెదవు లు, చేతులు నీలం రంగులోకి మారుతుంటే జాగ్రత్తపడాలి. ఏడుస్తూ మారాం చేస్తున్నపుడు ఏదైనా మార్పు కనిపించినా, కొంచెం సేపే ఆటలు ఆడినా ఎక్కువగా ఆయాసపడుతున్నా, పాలు తాగుతున్న సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతు న్నా, చెమటలు పడుతున్నా, పాలు వదిలేయడం వంటివి చేస్తున్నా తేలిగ్గా తీసుకోకూడదు. సాధారణంగా పసిపిల్లలుగా ఉన్నపుడే 3,4 పర్యాయాలు శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు సోకుతాయి.అంతకు మించిన సంఖ్యలో అంటే నెలనెలకు ఇన్ఫెక్షన్లు వస్తున్నాయంటే తల్లిదండ్రులు అలర్ట్ కావాలి. వయసుకు తగ్గట్టుగా బరువు పెరగకపోవడం, ఏడాది వయసు పూర్తయ్యేలోగా తొలి అడుగు వేయకపోవడం లాంటివి బాగా ఆలస్యమైతే ఏదైనా సమస్య ఉండొచ్చునని భావించాలి. ఇలాంటి లక్షణాలు కని్పస్తే వారికి కచ్చితంగా గుండెజబ్బు ఉందని కానీ వస్తుందని కానీ చెప్పలేం. వీటిని కేవలం కొన్ని సూచికలుగానే పరిగణనలోకి తీసుకుని జాగ్రత్తపడాలి.తగిన పరీక్షలు, వైద్యం చేయించాలి. పిల్లల్లో చిన్నప్పుడే గుండెలో చిన్న రంధ్రం బయటపడినా, వారు పెద్దయ్యేటప్పటికి అది పూడుకుపోతుందని కొందరు తల్లిదండ్రులు భావిస్తుంటారు. అయితే దీనికి సంబంధించిన లక్షణాలు క్రమంగా తగ్గొచ్చుకానీ సమస్య అలాగే ఉండే అవకాశాలున్నాయి. అందువల్ల వైద్యులను సంప్రదించాలి. మొన్నీమధ్యే ఏడేళ్ల పిల్లవాడికి నిమ్స్‌లో కాంప్లికేటెడ్ ‘రాస్ ప్రొసీజర్’తో విజయవంతంగా సర్జరీ చేశాం. – డాక్టర్ అమరేష్ రావు మామెంపాటి, కార్డియో థొరాసిక్ సర్జరీ హెడ్ , నిమ్స్, హైదరాబాద్గర్భస్థ శిశువులో సమస్యను కూడా గుర్తించవచ్చు హఠాత్ గుండెపోటును చాలా మటుకు నివారించే అవకాశాలున్నాయి. గుండెకు చిల్లులున్నా గుండెపోటుకు గురికాకుండా జాగ్రత్త పడవచ్చు. శస్త్రచికిత్సలతో వాటిని ఆపొచ్చు. చిన్నపిల్లల్లో రక్తనాళాలు ఉండాల్సిన స్థితిలో సవ్యంగా లేకుండా తేడాగా ఉంటే గుండెపోటు వచ్చే అవకాశాలుంటాయి. ఏదైనా అంశంపై వారు భావోద్వేగానికి గురైనా, ఎగ్జైట్మెంట్ పెరిగినా వారి గుండె కదలికల్లో మార్పులు సంభవిస్తాయి. ఎక్కువగా ఆయాసపడుతున్నా, తరచుగా మూర్ఛ (ఫిట్స్) పోవడం జరుగుతున్నా గుండె సమస్యలున్నట్టుగా అనుమానించాలి.మైకాండ్రియా సెల్స్‌లో పొటాíÙయం, కాల్షియం, సోడియం సమతూకం దెబ్బతింటే రిథమ్ డిస్టర్బెన్స్ వచ్చి కుప్పకూలే అవకాశాలుంటాయి. పుట్టినప్పటి నుంచే గుండె పనితీరుకు సంబంధించి ఏవైనా లోపాలుంటే ప్రాథమికంగా ఈసీజీ, 2 డీ ఎకో పరీక్షల ద్వారా కనిపెట్టవచ్చు. ప్రస్తుతం వైద్య చికిత్సలో అధునాతన సౌకర్యాలు అందుబాటులోకి వచి్చనందున గుండె సమస్యలున్న చిన్నారులకు తగిన చికిత్స అందించేందుకు అవకాశం ఉంది. గర్భస్త శిశువుగా ఉన్నపుడు కూడా గుండె సంబంధిత సమస్యలను గుర్తించి సరిచేయవచ్చు. బిడ్డ పుట్టాక ఫాలో అప్ చేయడం ద్వారా కూడా అకస్మాత్తుగా గుండెపోటుకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. – డాక్టర్ హరీష్ తంగెళ్లపల్లి, డీఎం కార్డియాలజీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్, హైదరాబాద్ -
స్నేహితుడికి పెళ్లి గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో యువకుడు మృతి
సాక్షి,కర్నూల్ : పచ్చని పందిట్లో విషాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు స్నేహితుడి పెళ్లిలో సంతోషంగా గడిపిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. స్నేహితుడికి పెళ్లి గిఫ్ట్ ఇస్తుండగా గుండె పోటుతో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరు అమెజాన్ కంపెనీలో పనిచేస్తున్న వంశీ .. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పెనుమడ గ్రామంలో తన స్నేహితుడి పెళ్లికి వచ్చాడు. స్నేహితుడి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి అనంతరం వధూవరులకు కానుక ఇచ్చేందుకు పెళ్లి వేదికపైకి ఎక్కాడు. తన స్నేహితులతో కలిసి ఓ గిఫ్ట్‌ను వధూవరులకు అందించి పక్కనే నిలబడ్డాడు. స్నేహితుడు ఇచ్చిన ఆ గిఫ్ట్ ప్యాక్‌ను వధూవరులు ఓపెన్ చేస్తుండగా..వంశీ అస్వస్థతకు గురయ్యాడు.వెంటనే అతన్ని పక్కకి తీసుకెళ్లే లోపే స్టేజిపైనే కుప్పకూలాడు.దీంతో అప్రమత్తమైన తోటి స్నేహితులు అత్యవసర చికిత్స నిమిత్తం డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వంశీని పరీక్షించిన వైద్యులు అతడి అప్పటికే ప్రాణాలు విడిచినట్లు తెలిపారు. దీంతో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. స్నేహితుడి వివాహా వేడుకలో గుండెపోటుతో యువకుడు మృతికర్నూల్ జిల్లా కృష్ణగిరి మండలం పెనుమడ గ్రామంలో స్నేహితుడి వివాహ వేడుకలో గిఫ్ట్ ఇస్తూ స్టేజ్ పైనే గుండెపోటుకు గురైన వంశీ అనే యువకుడు.వంశీని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తోటి స్నేహితులు.. కానీ అప్పటికే గుండెపోటుతో… pic.twitter.com/Ve1Epmf1fI— Telugu Scribe (@TeluguScribe) November 21, 2024 -
తల్లి చెంతకు చేరేలోపే.. గుండెపోటుతో నాలుగేళ్ల చిన్నారి మృతి
భారత్‌లో గుండె పోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. డ్యాన్స్ వేస్తూ, వ్యాయామం చేస్తూ, అలా కూర్చుని చనిపోయిన ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ ఈ మాయదారి గుండెపోటు బలితీసుకుంటుంది. తాజాగా అభం శుభం తెలియని ఓ చిన్నారి సైతం గుండెపోటుతో ప్రాణాలు విడిచింది. సాక్షి, ఖమ్మం: అప్పటివరకు తల్లిదండ్రులతో ఆడుతూ పాడుతూ గడిపిన చిన్నారి గుండెపోటుతో మృతిచెందింది. ఖమ్మం జిల్లా రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెంకు చెందిన కుర్రా వినోద్, లావణ్య దంపతులకు నాలుగేళ్ల కుమార్తె ప్రహర్షిక ఉంది. సోమవారం తల్లి లావణ్య గ్రూప్-3 పరీక్ష రాసేందుకు వెళ్లగా.. చిన్నారి నానమ్మ, తాతయ్యల వద్ద ఆడుకుంటూ ఉంది. సాయంత్రం ఇంటి తిరిగి వస్తున్న తల్లిని చూసి ప్రహర్షిక ఒక్కసారిగా ఆమె వైపు పరుగెత్తుకు వెళ్లింది. తల్లి కూడా రా..రా.. అంటూ కూతుర్ని చూస్తూ చేతులు చాచింది. కానీ అమ్మను చేరక ముందే ఆ పాప ఒక్కసారిగా కిందపడిపోయింది. తల్లి ఏమైందని ప్రశ్నించగా ఛాతీ వద్ద నొప్పి వస్తోందని చెప్పి అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే కుటుంబసభ్యులు చిన్నారికి స్థానిక ఆర్ఎంపీ వద్ద ప్రాథమిక చికిత్స చేయించి.. ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు కళ్ల ముందే మృతి చెందడంలో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు .చిన్నారి గుండెపోటుతో మృతిచెంది ఉండొచ్చని వైద్యులు తెలిపారు. -
ఊబకాయంతో గుండెకు ముప్పు
ఆధునిక జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి... అన్ని వయసుల వారిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. వెరసి కొన్ని అనారోగ్య, దీర్ఘకాలిక సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇందులో ఊబకాయం కూడా ఆ కోవకు చెందినదే. వివిధ జబ్బులకు కారణమవుతున్న ఈ సమస్య మరణాల ముప్పును కూడా పెంచుతోంది. ఊబకాయుల్లో గుండె జబ్బుల మరణాలు గడచిన రెండు దశాబ్దాల్లో గణనీయంగా పెరిగినట్టు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనంలో వెల్లడైంది. 1999 నుంచి 2020 నాటికి ఊబకాయంతో ముడిపడి ఉన్న గుండె జబ్బుల మరణాల రేటు సుమారు 180 శాతం పెరిగినట్టు నిర్ధారించారు. పురుషుల మరణాల రేటులో పెరుగుదల అధ్యయనంలో భాగంగా ఊబకాయ సంబంధిత ఇస్కిమిక్ గుండె జబ్బుతో ముడిపడిన 2.26 లక్షల మరణాలపై పరిశోధన నిర్వహించారు. 1999లో ప్రతి లక్ష మంది పురుషుల్లో 2.1గా మరణాలు రేటు ఉన్నట్టు గుర్తించారు. ఇది 2020నాటికి 243 శాతం పెరిగి 7.2కు చేరుకున్నట్టు వెల్లడించారు. అదేవిధంగా మహిళల్లో 1999లో ప్రతి లక్ష మందికి 1.6గా ఉన్న మరణాల రేటు... 131 శాతం పెరిగి 2020 నాటికి 3.7కు చేరుకుంది. అధ్యయనంలో గుర్తించిన అంశాల ఆధారంగా ఇస్కిమిక్ హార్ట్ స్ట్రోక్‌కు ఊబకాయం తీవ్రమైన ప్రమాదకారిగా నిర్ధారించారు. బరువు పెరుగుతున్న కొద్దీ గుండె జబ్బుల ప్రమాదం వృద్ధి చెందుతోందని అధ్యయనంలో పాల్గొన్న డాక్టర్ అలీనా మోహ్సిన్ తెలిపారు. ఏమిటీ ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ గుండెకు రక్తం సరఫరాలో ఏర్పడే ఇబ్బందిని ‘ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్’ అంటారు. దీనికి పొగతాగడం, బీపీ, షుగర్, రక్తంలో కొలె్రస్టాల్, ఊబకాయం ప్రధాన కారణం. గుండెకు రక్తం సరఫరా అయ్యే నాళాల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు కొన్ని రోజులకు గుండె కండరం క్రమేణా క్షీణిస్తూ... దెబ్బతింటుంది. ఈ డ్యామేజ్ శాశ్వతంగా అవ్వకముందే గుర్తించి వైద్యం చేస్తే ప్రాణాపాయ పరిస్థితులను అరికట్టవచ్చు. యాంజియోగ్రామ్ పరీక్ష ద్వారా రక్తనాళాల్లో అడ్డంకులను వైద్యులు గుర్తిస్తారు. అడ్డంకులు ఉన్నట్లయితే అవసరమైన మేరకు చికిత్స చేయడం, స్టెంట్ వేయడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. ]ప్రతి ముగ్గురు ఊబకాయుల్లో ఇద్దరి మృతికి గుండె జబ్బే కారణంప్రపంచవ్యాప్తంగా గడిచిన నాలుగు దశాబ్దాల్లో ఊబకాయుల సంఖ్య రెట్టింపు అయ్యింది. దీంతో ప్రతి ముగ్గురు ఊబకాయుల్లో ఇద్దరి మరణాలకు గుండె జబ్బులే ప్రధాన కారణమని ఇటీవల ఓ అధ్యయనం వెల్లడించింది. ఊబకాయుల్లో గుండె వైఫల్యం, ఆకస్మిక గుండెపోటు, ధమనుల గోడల్లో కొవ్వు పేరుకుపోవడం, రక్తం గడ్డ కట్టడం, గుండె కొట్టుకోవడంలో అసమతుల్యత ప్రమాదాలు ఉన్నట్టు ఆ సర్వేలో గుర్తించారు. సాధారణ బరువున్న వారితో పోలిస్తే ఊబకాయుల్లో టైప్–2 డయాబెటీస్ బారినపడే ప్రమాదం మూడు రెట్లు అధికమని పేర్కొన్నారు. 20–49 ఏళ్ల వయసున్న పురుషుల్లో 78 శాతం, మహిళల్లో 65 శాతం అధిక రక్తపోటుకు బాడీమాస్ ఇండెక్స్(బీఎంఐ) ఎక్కువగా ఉండటమే కారణమని గుర్తించారు. -
KPHB: ఆలయంలో విషాదం
కేపీహెచ్‌బీకాలనీ: గుడిలో ప్రదక్షిణలు చేయటానికి వెళ్లిన ఓ వ్యక్తి గుండెనొప్పితో మృతి చెందిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కేపీహెచ్‌బీ రోడ్డు నెంబర్ 1లో అమ్మ హాస్టల్లో కానంపల్లి విష్ణువర్ధన్(31) ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడు ప్రతిరోజు ఉదయం ఆలయానికి వెళ్తుంటాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 7 గంటలకు కేపీహెచ్‌బీ టెంపుల్ బస్‌స్టాప్ వద్ద ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లాడు. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయి, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఇతర భక్తులు సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలిస్తుండగా అంతలోనే మృతి చెందాడు. విషయాన్ని ఆయన సోదరి హేమలతకి ఫోన్ ద్వారా తెలియచేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సీపీఆర్‌తో ఊపిరి పోశాడు!
లంగర్‌హౌస్: గుండెపోటు వచ్చి రోడ్డుపై పడిపోయిన ఓ యువకుడికి ట్రాఫిక్ హోంగార్డు సీపీఆర్ చేసి బతికించిన ఈ ఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నానల్‌నగర్ చౌరస్తా వద్ద చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు.. సాలార్జంగ్ కాలనీలో నివసిస్తున్న మొహమ్మద్ ఖలీలుద్దీన్ (36) వృత్తిరీత్యా క్యాబ్ డ్రైవర్. గురువారం సాయంత్రం విధుల్లో భాగంగా గచి్చ»ౌలికి వెళ్లడానికి నానల్‌నగర్ బస్టాప్‌లో వేచి చూస్తున్నాడు. ఆ సమయంలోనే అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అతడు కింద పడిపోయాడు. అక్కడ ఉన్నవారు బాధితుడి వద్దకు వెళ్లడానికి సాహసించలేదు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న లంగర్‌హౌస్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ హోంగార్డు సుబ్బారెడ్డి వెంటనే స్పందించాడు. గుండెపోటుతో కిందపడిపోయిన ఖలీలుద్దీన్కు సీపీఆర్ చేసి బతికించాడు. అనంతరం దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరి్పంచాడు. ప్రస్తుతం ఖలీలుద్దీన్ కోలుకున్నాడు. సీపీఆర్‌తో యువకుడి ప్రాణాన్ని కాపాడిన సుబ్బారావును ఏసీపీ ధనలక్షి్మ, ఇన్స్పెక్టర్ అంజయ్య అభినందించారు. -
Video: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. 50 మంది ప్రాణాలు కాపాడిన కండక్టర్
ఇటీవల గుండెపోటు మరణాలు గణనీయంగా పెరుగుతున్నాయి. చిన్న పిల్లల నుంచి యువకులు, మధ్య వయస్సు వారు ఇలా అందిరినీ ఆకస్మిక గుండెపోటు కలవరానికి గురిచేస్తోంది. తాజాగా బస్సు నడుపుతుండగా డ్రైవర్ ఉన్నట్టుండి గుండెపోటుకు గురయ్యాడు. అయితే గమనించిన కండక్టర్ అప్రమత్తతో వెంటనే బస్సును రోడ్డు పక్కన సురక్షితంగా నిలిపడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది.బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ పరిధిలోని దాసనపుర బస్ డిపోలో కిరణ్(39) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. . నెలమంగళ నుంచి యశ్వంత్‌పూర్‌కు బస్సు నడుపుతుండగా అకస్మాత్తుగా తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చి స్పృహ కోల్పోయాడు. బస్సులోని సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.డ్రైవర్ కుప్పకూలడంతో బస్సు అదుపు తప్పి ముందు వెళ్తున్న బస్సును రాసుకుంటూ వెళ్లింది. వెంటనే అప్రమత్తమైన బస్సులోని కండక్టర్ డ్రైవర్‌ను లేపే ప్రయత్నం చేస్తూనే డ్రైవింగ్ సీట్లోకి వెళ్లి బస్సును సురక్షితంగా నిలిపివేశాడు. దీంతో బస్సులోని 50 మంది ప్రాణాలు నిలిచాయి. ఆ తర్వాత డ్రైవర్ కిరణ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అతడు అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. బస్సును నిలిపివేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన కండక్టర్‌ను ఆర్టీసీ అధికారులు ప్రశంసించారు.In Bengaluru: When the bus driver suffered a heart attack, BMTC bus conductor Obalesh jumped on the driver’s seat and took control of the steering🫡 (Sadly Bus Driver Passed away due to Cardiac arrest) https://t.co/PgpTz6ENxt— Ghar Ke Kalesh (@gharkekalesh) November 6, 2024 -
గురువులకు నిర్బంధ శిక్షణా?
సాక్షి, అమరావతి/నూజివీడు/నూజివీడు, ఆగిరిపల్లి: నాయకత్వ లక్షణాల అభివృద్ధిపై ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల్లో హెచ్ఎం టి.వి.రత్నకుమార్ (55) గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లా, ఆగిరిపల్లి మండలం, తోటపలి్లలోని హీల్ ప్యారడైజ్ స్కూల్లో బుధవారం చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా, ఉండి మండలం, ఉణుదుర్రు హైసూ్కల్ ఇన్చార్జి హెచ్ఎంగా పనిచేస్తున్న రత్నకుమార్ ఈనెల 4వ తేదీ నుంచి ఇక్కడ శిక్షణ తరగతుల్లో పాల్గొంటున్నారు.బుధవారం వేకువజామున రత్నకుమార్‌కు గుండెపోటు రాగా, తోటి ఉపాధ్యాయులు గన్నవరంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తున్నారు. మృతుడి స్వగ్రామం గణపవరం మండలం, కేశవరం కాగా భౌతికకాయాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. రత్నకుమార్ ఆకస్మిక మృతితో సమగ్ర శిక్ష, అదనపు స్పెషల్ ప్రాజెక్టు డైరెక్టర్ (ఏఎస్పీడీ) కేవీ శ్రీనివాసులరెడ్డి, సీమ్యాట్ డైరెక్టర్ మస్తానయ్య, హెచ్ఎంలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో చర్చించి శిక్షణ తరగతులను రద్దు చేశారు. కాగా ఈనెల 4న ప్రారంభమైన ఈ శిక్షణ తరగతులు 9వ తేదీతో ముగియనున్నాయి. ఆగిరిపల్లిలో ప్రధానోపాధ్యాయుల ఆందోళనటీవీ రత్నకుమార్ మృతికి నిరసనగా హెచ్ఎంలు బుధవారం ఉదయం హీల్ ప్యారడైజ్ స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగింది. తీవ్రమైన ఒత్తిడి, భయం, ఆందోళన, సమయానికి అందని వైద్యసాయం వల్లే రత్నకుమార్ మృతి చెందారని హెచ్ఎంలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు రోజులుగా ఉదయం 5.30 నుంచి రాత్రి 7 గంటల వరకూ నిర్విరామంగా, నిర్బంధంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారని వాపోయారు. 200 మందికి పైగా హెచ్ఎంలు శిక్షణ పొందుతుంటే కనీసం వైద్య సదుపాయాలు కూడా కల్పించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఎం మృతికి కారణమైన అధికారులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కంటే టీడీపీ కూటమి ప్రభుత్వంలో మరిన్ని యాప్‌లు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్బంధ శిక్షణ నిలిపివేయాలి: ఉపాధ్యాయ సంఘాల డిమాండ్కనీస మౌలిక వసతులు లేకుండా శిక్షణల పేరిట ఉపాధ్యాయుల ప్రాణాలతో చెలగాటమాడొద్దని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి హితవు పలికాయి. హెచ్ఎం రత్నకుమార్ మృతిపై ఉపాధ్యాయ సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. నిర్బంధ శిక్షణలతో ఉపాధ్యాయులను ప్రభుత్వం శిక్షిస్తోందని షెడ్యూల్డ్ ట్రైబ్స్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.సుధాకర్, కార్యదర్శి కె. కుమార్ ఒక ప్రకటనలో మండిపడ్డారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని, జీవో 117 రద్దు చేస్తామని ఉపాధ్యాయులను నమ్మించి, మోసగించారని బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బి. మనోజ్‌కుమార్ తెలిపారు. రత్నకుమార్ మృతిని తమను కలచి వేసిందని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ రావు వెల్లడించారు. కుంటి సాకులతో నిర్లక్ష్యపూరితంగా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారని ఏపీ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) విమర్శించింది. విశ్రాంతి లేని పని ఒత్తిడి కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్ స్పష్టం చేశారు. ఆగిరిపల్లి శిక్షణ కేంద్రంలో కనీస వైద్య సౌకర్యం కూడా లేదని ఫ్యాప్టో చైర్మన్ ఎల్. సాయి శ్రీనివాస్ తెలిపారు. -
ఆర్మీ జవాన్‌కు కన్నీటి వీడ్కోలు
రాంబిల్లి (యలమంచిలి): దేశ రక్షణ రంగంలో జమ్మూ కశ్మీర్ శ్రీనగర్ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తూ గుండెపోటుతో మృతి చెందిన వీర జవాన్ హవల్దారు గంగిరెడ్ల శివశంకరరావు అంత్యక్రియలు గ్రామస్తులు, బంధువులు, తోటి ఆర్మీ అధికారుల అశ్రునయనాల మధ్య సోమవారం దిమిలి గ్రామంలో సైనిక లాంఛనాలతో ఘనంగా జరిగాయి. దిమిలి గ్రామానికి చెందిన గంగిరెడ్ల శివశంకరరావు ఈ నెల 1వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున జమ్మూకశ్మీర్ శ్రీనగర్ వద్ద ఆర్మీ యూనిట్లో విధులు నిర్వర్తిస్తుండగా ఆకస్మికంగా గుండెపోటుకు గురై మృతి చెందారు. జవాను భౌతికకాయాన్ని సోమవారం ఉదయం స్వగ్రామం దిమిలి తీసుకువచ్చారు. భౌతికకాయం ఉంచిన అంతిమయాత్ర రథాన్ని అచ్యుతాపురం ప్రధాన రహదారి గుండా వెంకటాపురం మీదుగా దిమిలి గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. గ్రామస్తులు, బంధువులు దారిపొడవునా పూలు చల్లుకుంటూ సుమారు 15 కిలోమీటర్ల వరకు ద్విచక్రవాహనాలతో జవాను అంతిమయాత్రలో పాల్గొన్నారు. అనంతరం శివశంకర్ భౌతికకాయం వద్ద ఆర్మీ అధికారులు, నేవీ సిబ్బంది జాతీయ పతాకం ఉంచి, భారత్‌మాతాకీ జై అంటూ నినాదాలు చేసి ఘన నివాళులర్పించారు. శివశంకర్ చివరిసారిగా ధరించిన యూనిఫాం, జాతీయపతాకాన్ని భార్య కృష్ణవేణి (లక్ష్మి), తల్లిదండ్రులకు ఆర్మీ అధికారులు అందజేశారు. అనంతరం ఆర్మీ అధికారులు, సుబేదార్ సుజన్‌సింగ్, ఆనంద్‌సింగ్, ఎన్.ఎస్.రాజ్‌కుమార్, జి.యోగానంద్ ఆధ్వర్యంలో నేవీ అధికారులు పరేడ్ నిర్వహించి గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి ఘనంగా సైనికలాంఛనాలతో అంత్యక్రియలు జరిపించారు. మృతిచెందిన జవాన్ శివశంకర్‌కు భార్య కృష్ణవేణి, కుమార్తెలు జగదీశ్వరి, దివ్య, కుమారుడు యశ్వంత్, తండ్రి సన్యాసినాయుడు, తల్లి వరహాలు ఉన్నారు. ఆర్మీలో చేరి 23 సంవత్సరాలు గడిచి మరో ఏడాది సంవత్సరంలో హవల్దారుగా పదవీ విరమణ చేయాల్సి ఉన్న దశలో శివశంకర్ ఆకస్మిక మృతి గ్రామస్తులను విషాదంలో ముంచింది. దసరా పండగకు స్వగ్రామం వచ్చి కుటుంబం, స్నేహితులతో ఆనందంగా గడిపి మేనకోడలి పెళ్లిని దగ్గర ఉండి జరిపించి మరలా విధులకు వెళ్లి రెండు వారాలు గడవక ముందే విగతజీవిగా తిరిగి రావడాన్ని జీర్ణించుకోలేపోతున్నారు. వేలాది మంది ప్రజల అశ్రునయనాల మధ్య జవాన్ శివశంకర్ అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాంబిల్లి మండల వైస్ ఎంపీపీ కొట్టాపు శ్రీలక్ష్మి , మాజీ సైనికోద్యోగి వడ్డీ కాసులు, తూర్పు కాపు సంక్షేమ సంఘం నాయకులు, న్యాయవాది కరణం శ్రీహరి, గ్రామ పెద్దలు, మాజీ ఆర్మీ ఉద్యోగులు పాల్గొన్నారు. -
‘స్ట్రోక్’ను దెబ్బతీద్దాం
చాలా మందిలో స్ట్రోక్ అంటే ఇప్పటికీ గుండెపోటు అనే అపోహ ఉంది. పరిభాషలో పలకాలంటే స్ట్రోక్ అంటే మెదడు పోటు. పూర్తిగా మెదడుకి సంబంధించిన అత్యయిక స్థితి. ఈ స్ట్రోక్ ప్రస్తుతం కలవరపెడుతోంది. స్ట్రోక్‌కి గురువుతున్న వారి సగటు వయసు నానాటికీ తక్కువవుతోంది. పదేళ్ల క్రితం కనీసం 40 ఏళ్లు సరాసరిగా ఉన్న బాధితుల వయసు.. ప్రస్తుతం 26కి చేరిందంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అవగతమవుతోంది.కాకినాడ క్రైం: ప్రజల్లో ఈ విపత్తుపై అవగాహన పెంచేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏటా అక్టోబర్ 29న వరల్డ్ స్ట్రోక్ డేగా ప్రకటించింది. ప్రజల్లో విస్తృత అవగాహన పెంపొందించి, స్ట్రోక్‌కు స్టాప్ చెప్పడమే ప్రస్తుతం ప్రపంచం ముందున్న లక్ష్యం. స్ట్రోక్ అంటే.. స్ట్రోక్‌ను వాడుక భాషలో పక్షవాతం అంటారు. బ్రెయిన్ అటాక్ అని కూడా పిలుస్తారు. మెదడులో రక్తనాళాలు పూడుకున్నా, పగిలినా, ధమనులు, సిరల్లో ఆటంకాలు ఏర్పడినా, మెదడుకు రక్తం సరఫరా నిలిచిపోతుంది. తద్వారా స్ట్రోక్ వస్తుంది. అప్పటివరకు చురుగ్గా ఉన్న మనిషి జీవచ్ఛవమవుతాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే, జీవితమంతా నరకప్రాయమవుతుంది. స్ట్రోక్ సంభవిస్తే.. మెదడుకు ప్రవహించే రక్తంలో అంతరాయం ఏర్పడుతుంది. దీంతో మెదడు పనితీరు క్షీణిస్తుంది. 80 శాతానికి పైగా స్ట్రోక్ బాధితుల్లో మూతి వంకర్లు పోవడం, నత్తి, కాళ్లు చేతులు చచ్చుబడటం, మాట్లాడలేకపోవడం, కళ్లు మసకబారడం, చూపు శాశ్వతంగా కోల్పోవడం వంటి లక్షణాలుంటాయి. 15 శాతం మందికి పైగా బాధితుల్లో మెదడులో నరాలు చిట్లి, అంతర్గత రక్తస్రావం అవుతుంది. ఈ స్థితి మరణానికీ దారితీయవచ్చు. లక్షణాలివీ.. మాటల్లో తడబాటు, అకస్మాత్తుగా ముఖం, చేయి, కాలు తిమ్మిర్లు, బలహీనంగా లేదా పట్టు వదిలేసినట్లు అనిపించడం. ఒకటి లేదా రెండు కంటి చూపుల్లో ఇబ్బందులు ఏర్పడి.. చూడడంలో సమస్య, శరీరాన్ని బ్యాలెన్స్ చేయలేకపోవడం, అకారణంగా విపరీతమైన తలనొప్పి స్ట్రోక్ లక్షణాలు. రావడానికి కారణాలు ⇒ ఆడవారితో పోలిస్తే మగవారిలో ఎక్కువగా స్ట్రోక్ వచ్చే ప్రమాదం అధికం. ⇒ ధూమపానం, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, ఇష్టానుసారంగా మత్తు పానీయాల వినియోగం, రక్తపోటు, ఏట్రియల్ ఫిబ్రిలిఏషన్, అధిక కొలె్రస్టాల్ స్థాయి, ఊబకాయం, జన్యుపర నిర్మాణంతో పాటు, మానసిక సమస్యలు కూడా స్ట్రోక్‌కు కారణమవుతాయి. గురి కాకూడదంటే.. స్ట్రోక్‌కి గురి కాకూడదంటే జీవన శైలిలో సానుకూల మార్పులను ఆహా్వనించాలి. సమయానుగుణంగా ఆహారం, నిద్ర అవసరం. ధూమపానం, మద్యపానం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. పోషకాహారం తీసుకోవాలి. ఆహారంలో మంచి మార్పుల వల్ల స్ట్రోక్ నుంచి తప్పించుకోవచ్చు. సీజనల్ పండ్లు, తృణధాన్యాలు, చేపలు, కొవ్వు తక్కువగా ఉండే పాల పదార్థాలు, వ్యాయామం, నడక, ధ్యానం దోహదం చేస్తాయి.ఫాస్ట్ ఫార్ములాతో సేఫ్ స్ట్రోక్ వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. రోగి వయసు, హెల్త్ హిస్టరీకి అనుగుణంగానే స్ట్రోక్ నుంచి తేరుకోవడం అన్నది ఆధారపడి ఉంటుంది. రక్తనాళాల్లో బలహీన ప్రాంతాన్ని అన్యూరిజం అంటారు. బయటికి ఉబికిన ఈ ప్రాంతంలో పగుళ్లు ఏర్పడితే మెదడు పూర్తిగా దెబ్బతింటుంది. దీనికి అత్యవసర చికిత్స చేయాల్సి ఉంటుంది. ‘బి గ్రేటర్ దేన్ స్ట్రోక్’ అన్న నినాదాన్ని ఈ ఏడాది థీమ్‌గా వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ నిర్ణయించింది. స్ట్రోక్‌కు మించిన మనోధైర్యాన్ని పెంపొందించుకుని, ముందుకు వెళ్లాలన్నది ఈ థీమ్ ఉద్దేశం. డాక్టర్ ఆర్.గౌతమ్ ప్రవీణ్, న్యూరో ఫిజీషియన్, కాకినాడ -
‘అన్నా నాకిక దిక్కెవరూ’
ఇల్లంతకుంట(మానకొండూర్): ఏడాది క్రితం తండ్రి గుండెపోటుతో.. తల్లి అనారోగ్యంతో చనిపోయారు. అప్పటి నుంచి అన్నీ తానై తోడునీడగా ఉన్న అన్న మృతితో 11 ఏళ్ల బాలిక ఒంటరైంది. ‘అన్నా నాకిక దిక్కెవరూ’ అని ఏడుస్తూ అన్న మృతదేహానికి తలకొరివి పెట్టడం గ్రామస్తులను కలచివేసింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. ఇల్లంతకుంట మండలం వల్లంపట్లకు చెందిన నాయిని రాజేశం– దేవవ్వ దంపతులకు ఇద్దరు కూతుళ్లు వందన, సంజన, కొడుకు వంశీ (25) సంతానం. ఉపాధి కోసం రాజేశం దుబాయ్ వెళ్లేవాడు. ఉన్నంతలో పెద్ద కూతురు వందనకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. ఏడాది క్రితం రాజేశం దుబాయ్‌లో గుండెపోటుతో చనిపోయాడు. అప్పటికే దేవవ్వ కేన్సర్ బారినపడి మృతిచెందింది. ఆమె దహనసంస్కారాలు జరిగిన మూడు రోజులకే దుబాయ్ నుంచి రాజేశం మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. అతడి అంత్యక్రియలను కొడుకు నిర్వహించాడు. అప్పటి నుంచి సంజన ఆలనపాలనను వంశీ చూసుకుంటున్నాడు. తల్లిదండ్రులు చనిపోయి ఏడాది అవుతుండగా, మంగళవారం వంశీ సైతం కిడ్నీలు పాడయి అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో సంజన ఒంటరయింది. మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. చిన్న వయస్సులో అన్నకు తలకొరివి పెట్టడం చూసి గ్రామస్తులు కన్నీరుపెట్టారు. -
‘చచ్చి’ బతికాడు!
అమెరికాలోని కెంటకీలో థామస్ హోవర్ అనే 36 ఏళ్ల వ్యక్తి డ్రగ్ ఓవర్‌డోస్ వల్ల గుండెపోటుకు గురయ్యాడు. హుటాహుటిన బాప్టిస్ట్ హెల్త్ రిచ్మండ్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అతనిక బతికి బట్ట కట్టడం కల్లేనని వైద్యులు తేల్చారు. అవయవ దానం చేసి ఉండటంతో ముందుగా గుండెను సేకరించాలని నిర్ణయించారు. ఆపరేషన్ టేబుల్‌పైకి తీసుకెళ్లి సరిగ్గా కత్తులూ, కటార్లకు పని చెప్పబోయే సమయానికి మనవాడు ఉన్నట్టుండి కళ్లు తెరిచాడు! కాళ్లూ చేతులూ కదిలించేందుకు ప్రయతి్నంచాడు. తన పరిస్థితి అర్థమై కన్నీరు పెట్టుకున్నాడు. ఇదంతా చూసి డాక్టర్లంతా దిమ్మెరపోయారు. దాంతో అవయవ సేకరణ ప్రయత్నాలకు స్వస్తి చెప్పారు. ఇది 2021 అక్టోబర్‌లో జరిగితే ఆస్పత్రి వర్గాలు మాత్రం వెలుగులోకి రానివ్వలేదు. కనీసం హూవర్ కుటుంబీకులకు కూడా సమాచరమివ్వలేదు. పైగా అతనిలో కనిపిస్తున్న ప్రాణ లక్షణాలను పట్టించుకోకుండా అవయవాలను సేకరించాల్సిందిగా డాక్టర్లపై ఒత్తిడి తెచ్చాయి. వారు నిరాకరించడంతో వేరే వైద్యులను నియోగిస్తే వాళ్లు కూడా చేతులెత్తేశారు. దీనికి ప్రత్యక్ష సాక్షి అయిన ఆస్పత్రి మాజీ ఉద్యోగి ఒకరు గత జనవరిలో హూవర్ సోదరి డోనాకు విషయం చేరవేయడంతో ఇదంతా వెలుగులోకి వచ్చింది. చివరికి వైద్యుల సలహా మేరకు అతన్ని ఇంటికి తీసుకెళ్లిందామె. హూవర్ బ హుశా ఇంకెంతో కాలం బతక్కపోవచ్చన్న డాక్టర్ల అంచనాలను వమ్ము చేస్తూ సోదరి సంరక్షణలో అతను చాలావరకు కోలుకున్నాడు. ఈ ఉదంతం ఇప్పుడు కెంటకీలో టా కాఫ్ ద టౌన్‌గా మారింది. కెంటకీ అటార్నీ జనరల్ కార్యాలయం దీనిపై విచారణ కూడా జరుపుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విషాదం: డీజే సౌండ్‌కు డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన 13 ఏళ్ల బాలుడు
ఇటీవల డీజే ఓ ట్రెండ్‌గా మారింది. ప్రతి శుభకార్యంలో భారీ భారీ సౌండ్ సిస్టమ్ కామన్ అయిపోయింది. దద్దరిల్లిపోయే డీజే చప్పుళ్లకు చాలా మంది అస్వస్థతకు గురవుతున్నారు. కొందరు ప్రాణాలే కోల్పోతున్నారు. మితిమీరిన సౌండ్, అత్యుత్సాహంతో వయసుతో సంబంధం లేకుండా అందరూ డాన్స్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు గుండెపోటుకు గురవుతున్నారు. తాజాగా ఓ బాలుడు భారీ డీజే సౌండ్‌కు డాన్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది.భోపాల్‌లో సమర్ బిల్లోర్ అనే 13 ఏళ్ల బాలుడు స్థానిక పండుగ వేడుకలో తన వివాసం వెలుపల డీజే సౌండ్‌కు ప్రజలు డ్యాన్స్ చేస్తుండగా.. ఆ సంగీతానికి ఆకర్షితుతయ్యాడు. వెంటనే ఇంట్లో నుంచి బయటకు వెళ్లి అందరితోపాటు డ్యాన్స్ చేశాడు. అలా డ్యాన్స్ చేస్తూ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పిల్లవాడని ఆరోగ్య పరిస్థితి గురించి తెలియక అతని చుట్టుపక్కల వారు డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. అయితే గమనించిన తల్లి జమునా దేవి సాయం కోసం గట్టిగా కేకలు వేయడంతో అందరూ ఆగిపోయారు. వెంటనే బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మరణించినట్లు వైద్యు ప్రకటించారు.అయితే సమర్ తండ్రి, కైలాష్ బిల్లోర్, డీసే సౌండ్ అత్యంత ప్రమాదకరంగా ఉండటమే తన కొడుకు చావుకు కారణమని ఆరోపించారు. ఎన్నిసార్లు హెచ్చరించినా ఆగలేదని, తమ అబ్బాయి ప్రాణం పోయినా ఆ సందడిని ఏదీ ఆపలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పండుగల సమయంలో ఇలాంటి సౌండ్ సిస్టమ్స్ నుంచి వచ్చే పెద్ద పెద్ద శబ్దాల కారణంగా ఇంట్లోని రోగులు, పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఇటువంటి సమస్యలను నివారించడానికి డీజేలకు ఖచ్చితమైన సమయం, వాల్యూమ్ పరిమితులు ఉండాలని కోరారు. -
మహిళల్లో గుండె పరీక్షలు ఏ వయసు నుంచి?
గుండె జబ్బుల్ని ముందుగానే తెలుసుకుంటే మరణాలను నివారించడమే కాదు... చాలారకాల అనర్థాలను సమర్థంగా నివారించవచ్చు. నిజానికి ఏ వయసు నుంచి మహిళలు గుండె పరీక్షలను చేయించుకోవడం మంచిది అనే అంశంపై కొంతమంది నిపుణులైన కార్డియాలజిస్టులు చెబుతున్న మాటలేమిటో చూద్దాం. మహిళలకు స్థూలకాయం, దేహ జీవక్రియలకు సంబంధించిన ఆరోగ్య రుగ్మతలు (మెటబాలిక్ డిజార్డర్స్), కుటుంబంలో (చాలా చిన్న వయసులోనే గుండె జబ్బులు (ప్రీ–మెచ్యూర్ హార్ట్ డిజీసెస్) కనిపిస్తుండటం వంటి ముపుప ఉన్నప్పుడు వారు తమ 20వ ఏటి నుంచే ప్రతి ఏటా బేసిక్ గుండె పరీక్షలైన ఈసీజీ, 2 డీ ఎకో వంటివి చేయించుకుని నిర్భయంగా ఉండటం సముచితమంటున్నారు పలువురు గుండెవైద్య నిపుణులు. ఒకవేళ ఏవైనా గుండెజబ్బులకు కారణమయ్యే నిశ్శబ్దంగా ఉండు ముప్పు అంశాలు (సైలెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్) కనిపిస్తే వాటికి అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన చర్యలను ముందునుంచే తీసుకుంటూ ఉడటం, నివారణ చర్యలను పాటిస్తూ ఉండటం వల్ల ప్రాణాంతక పరిస్థితులను చాలా తేలిగ్గా నివారించవచ్చు. ఉదాహరణకు హైబీపీ లేదా రక్తంలో కొవ్వుల మోతాదులు ఎక్కువగా ఉండే డిస్లిపిడేమియా అనే పరిస్థితి ఉన్నట్లయితే వాటిని పట్టించుకోకపోవడం వల్ల కొన్ని ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీసే అవకాశముంటుంది. అదే పైన పేర్కొన్న ముప్పు ఉన్నవారైతే 20వ ఏటి నుంచీ లేదా అన్నివిధాలా ఆరోగ్యవంతులైన మహిళలు తమ 40 ల నుంచి గుండె పరీక్షలను తరచూ ( లేదా మీ కార్డియాలజిస్ట్ సిఫార్సు మేరకు) చేయించుకోవడం మంచిది. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎప్పుడూ పాటించడమనే అంశం కూడా గుండెజబ్బులతో పాటు చాలా రకాల జబ్బులు, రుగ్మతలను నివారించి మహిళలెప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా చేయడానికి ఉపయోగపడుతుంది. (చదవండి: -
‘మురసోలి’ సెల్వమ్ కన్నుమూత
సాక్షి, చెన్నై: కేంద్ర మాజీ మంత్రి దివంగత మురసోలి మారన్ సోదరుడు, డీఎంకే అధికార పత్రిక మురసోలి మాజీ ఎడిటర్ మురసోలి సెల్వమ్(84) గురువారం ఉదయం బెంగళూరులో గుండెపోటుతో కన్నుమూశారు. డీఎంకే వ్యవస్థాపకుడు ఎం.కరుణానిధి సోదరి కుమారుడే సెల్వమ్. మురసోలి పత్రికకు సిలంది పేరిట 50 ఏళ్లపాటు సంపాదకుడిగా పనిచేశారు. పలు తమిళ సినిమాలకు ప్రొడ్యూసర్‌గాను ఉన్నారు. కరుణానిధి కుమార్తె సెల్విని ఆయన వివాహమాడారు. సీఎం ఎంకే స్టాలిన్‌కు బావ అవుతారు. ‘మంచి రచయిత, జర్నలిస్ట్ కూడా అయిన సెల్వమ్ డీఎంకే భావజాలాన్ని వ్యాప్తి చేయడంతోపాటు హిందీ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నారు’అని డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ ఒక సందేశంలో పేర్కొన్నారు. మురసోలి సెల్వమ్ మృతితో తమిళనాడు ప్రభుత్వం 10వ తేదీ నుంచి మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. -
గుండెపోటుతో యూట్యూబర్ కన్నుమూత
సీతాపూర్: దేశంలో దేవీనవరాత్రులు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. యూపీలోని సీతాపూర్‌లో నవరాత్రుల వేళ విషాదం చోటుచేసుకుంది. అమ్మవారి జాగరణలో కార్యక్రమంలో పాల్గొన్న ఒక యూట్యూబర్ ఆనందంగా నృత్యం చేస్తూ, ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.యూపీలోని సీతాపూర్‌లో నవరాత్రి కార్యక్రమాలను చిత్రీకరించేందుకు వచ్చిన వికాస్ అనే యూట్యూబర్ గుండెపోటుకు గురై మృతి చెందాడు. వికాస్ కుప్పకూలగానే అక్కడ ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. వికాస్ స్నేహితులు వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతనిని పరీక్షించి, గుండెపోటుతో మృతిచెందాడని ధృవీకరించారు. వికాస్ మృతికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దానిలో వికాస్ హఠాత్తుగా కిందపడిపోవడం, తరువాత అతని స్నేహితులు అతనిని ఆస్పత్రికి తరలించడం కనిపిస్తుంది. వికాస్ షార్ట్ వీడియోలు తీస్తూ ఫేమస్ అయ్యాడు. ఫాలోవర్ల సంఖ్య కూడా అధికంగానే ఉంది. దుర్గా జాగృతి కార్యక్రమంలో పాల్గొనేందుకు స్నేహితులతో పాటు వచ్చిన వికాస్ డీజే ట్యూన్స్‌కు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ అక్కడే కుప్పుకూలిపోయాడు. వెంటనే అతని స్నేహితులు అతనిని దగ్గరలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు వికాస్ చనిపోయినట్లు నిర్ధారించారు. వికాస్ మృతిపై పోలీసులకు తెలియజేయకుండా కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: కిడ్నాపైన బాలుడు శవమై తేలాడు -
కూతురు అరెస్టైనట్లు ఫేక్ కాల్.. గుండెపోటుతో తల్లి మృతి
లక్నో: ఓ ఫేక్ కాల్ మహిళ ప్రాణాలు తీసింది. కూతురు వ్యభిచార రాకెట్లో అరెస్ట్ అయ్యిందని నకిలీ ఫోలీస్ అధికారి ఫోన్ చేయడంతో.. తల్లడిల్లిన ఆ తల్లి గుండె ఉన్నట్టుండి ఆగిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఆగ్రాలో నివాసం ఉంటున్న మహిళ మల్తీ వర్మ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. సెప్టెంబర్ 30న పోలీస్ అధికారి పేరుతో ఆమెకు ఓ వాట్పాప్ కాల్ వచ్చింది. ఆమె కుమార్తె సెక్స్ ట్రాఫికింగ్ కేసులో అరెస్టు చేసినట్లు అతడు తెలిపాడు. ఆ వీడియోలు లీక్ చేయకుండా ఉండాలని వెంటనే రూ. లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశాడు.అయితే ఆందోళన చెందిన ఆ ఉపాధ్యాయురాలు వెంటనే తన కుమారుడు దివ్యాన్షుకు ఫోన్ చేసి ఈ విషయం తెలిపింది. కుమార్తెను ఈ కేసు నుంచి కాపాడుకునేందుకు ఆ వ్యక్తికి లక్ష ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పింది. కానీ కుమారుడు తెలివిగా వ్యవహరించి, ఆ కాల్ పాకిస్థాన్ నుంచి వచ్చిన ఫేక్ వాట్సాప్ కాల్‌గా గుర్తించాడు. అంతేగాక వెంటనే తన సోదరికి ఫోన్ చేయగా తాను కాలేజీలో ఉన్నట్లు ఆమె చెప్పింది.మరోవైపు ఈ ఘటన మహిళ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. చాలా ఆందోళన చెందిన టీచర్ మల్తీ వర్మ సాయంత్రం 4 గంటలకు స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చింది. ఆ వెంటనే కుప్పకూలి గుండెపోటుతో మరణించింది. కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్క్రీన్ టైం పెరగడం వల్లా గుండెపోటు!
అమెరికా లాంటి దేశాల్లో సగటున 45 ఏళ్లకు గుండెపోటు వస్తుంటే.. భారతదేశంలో మాత్రం అంతకంటే పదేళ్ల ముందే, అంటే 35 ఏళ్ల వయసులోనే వచ్చేస్తోంది. ఇంతకుముందు రక్తపోటు, మధుమేహం, కొలెస్టరాల్ లాంటివి ప్రధాన ముప్పు కారకాలుగా ఉంటే, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎక్కువ స్క్రీన్ టైం ఉండడం కూడా గుండెపోటుకు కారణం అవుతోంది! దీనికితోడు ఆన్లైన్లో ఫుడ్ ఎగ్రిగేటర్ల వద్ద రోజూ ఫుడ్ ఆర్డర్లు పెట్టుకోవడం కూడా ఇందుకు దారితీస్తోంది. ఈ సరికొత్త పరిణామాలను నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రికి చెందిన సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు డాక్టర్ ఎ. సాయి రవిశంకర్ వివరించారు.మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ.. ఇలా ఏవైనా గానీ రోజుకు సగటున 8 నుంచి 10 గంటల వరకు చూస్తున్నారు. వీటన్నింటినీ స్క్రీన్ టైం అనే అంటారు. ఇలా ఎక్కువసేపు తెరకు అతుక్కుపోయి ఉండడం వల్ల గుండెపోటు వస్తున్న సందర్భాలూ ఉంటున్నాయి.వివిధ ఫుడ్ ఎగ్రిగేటర్ల వద్ద నుంచి పీజాలు, బర్గర్లు, ఇతర మాంసాహార వంటకాలు దాదాపు రోజూ ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. ఎంత పెద్ద హోటల్ నుంచి తెప్పించుకున్నా, అక్కడ వాడిన వంటనూనెలు మళ్లీ మళ్లీ వాడడం వల్ల కొలెస్టరాల్ పెరిగిపోయి గుండెపోటుకు కారణమవుతోంది. ప్రపంచంలోనే ఫుడ్ ఆర్డర్లలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది.వ్యాయామం అస్సలు ఉండడం లేదు. పని ఉన్నంతసేపు పని చేసుకోవడం, తర్వాత మొబైల్ లేదా టీవీ చూసుకోవడం, పడుకోవడంతోనే సరిపెట్టేస్తున్నారు. సగటున రోజుకు 45 నిమిషాల చొప్పున వారానికి కనీసం ఐదారు రోజుల పాటు నడక, ఇతర వ్యాయామాలు చేస్తేనే గుండె ఆరోగ్యం బాగుంటుంది. నిశ్చల జీవనశైలి వల్ల కూడా చిన్నవయసులోనే గుండెపోటు కేసులు వస్తున్నాయి.మానసిక ఒత్తిడి, నిద్ర లేకపోవడం కూడా గుండెపోటుకు దారితీస్తోంది. ఉద్యోగాల పరంగా అయినా, లేదా వ్యక్తిగత జీవితంలో సమస్యల వల్ల అయినా మానసిక ఒత్తిడి చాలా తీవ్రంగా ఉంటోంది. దానికి తోడు రోజుకు కనీసం 7-8 గంటల మంచి నిద్ర ఉండాలి. అది లేకపోవడం వల్ల కూడా గుండెపోటు వస్తోంది. వీటికి సిగరెట్లు కాల్చడం, వాతావరణ కాలుష్యం లాంటివి మరింత ఎక్కువగా కారణాలు అవుతున్నాయి.-డాక్టర్ ఎ. సాయి రవిశంకర్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు, ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి (చదవండి: టేస్టీ టేస్టీగానే తింటూ..గుండెను ఆరోగ్యంగా ఉంచుకుందాం ఇలా..!) -
గుండెకు ముప్పు రాకూడదంటే ఈ పరీక్షలు తప్పనిసరి..!
గుండెపోట్లు ఇప్పుడు మరీ చిన్న వయసులోనూ వస్తున్నాయి. ఆ ముప్పునుంచి రక్షించుకోవడానికి అందుబాటులో ఉన్న పరీక్షలూ, వాటి ప్రయోజనాలను తెలుసుకుందాం. ఈసీజీ : ఛాతీ నొప్పి వచ్చిన ప్రతి వ్యక్తికీ తప్పనిసరి. ఇందులో గుండెపోటు 80, 90 శాతం నిర్ధారణ అవుతుంది. గతంలో గుండెపోటు వచ్చి ఉండి, అప్పుడా విషయం బాధితుడికి తెలియకపోయినా ఈ పరీక్షతో తెలిసిపోతుంది. అయితే కొన్నిసార్లు గుండెపోటు వచ్చిన వెంటనే ఈసీజీ తీయించినా ఒక్కోసారి గుండెపోటు వల్ల కలిగే మార్పులను ఈసీజీ పరీక్ష నమోదు చేయలేకపోవచ్చు. అందుకే గుండెనొప్పి / ఛాతీనొప్పి వచ్చాక 45 నిమిషాల తర్వాత కనీసం 2 లేదా 3 ఈసీజీలను తీసిచూడాలి.టు డీ ఎకో పరీక్ష : ఇది గుండెస్పందనల్లో, గుండె కండరంలో వచ్చిన మార్పులను తెలుపుతుంది. ఛాతీ నొప్పి వచ్చినప్పుడు అది గుండెజబ్బు కారణంగానే అని తెలుసుకునేందుకు ‘ఎకో’ పరీక్షలో 95 శాతం కంటే ఎక్కువే అవకాశాలుంటాయి. టీఎమ్‌టీ పరీక్ష : ట్రెడ్మిల్ టెస్ట్ అని పిలిచే ఈ పరీక్షను ‘కార్డియాక్ స్ట్రెస్ టెస్ట్’ అని కూడా అంటారు. నడకలో గుండెపనితీరు తెలుసుకునేందుకు ఉపయోగపడే పరీక్ష ఇది. బాధితులకు గుండెపోటుకు కారణమైన కరొనరీ ఆర్టరీ డిసీజ్ (సీఏడీ) ఉందా లేదా అని తెలియజెప్పే పరీక్ష ఇది. గుండెకు వెళ్లే రక్తనాళాల్లోని అడ్డంకులనూ ఈ పరీక్ష గుర్తిస్తుంది. గుండె లయ (రిథమ్)లో ఉన్న లోపాలను పసిగడుతుంది. యాంజియోగ్రామ్: గుండెపోటు అని డౌట్ వచ్చినప్పుడు కచ్చితంగా నిర్ధారణ చేసే మరో పరీక్ష యాంజియోగ్రామ్. కొన్నిసార్లు ఈసీజీలో మార్పులు స్పష్టంగా లేకపోయినా, 2 డీ ఎకో సరైన క్లూస్ ఇవ్వలేకపోయినా అవన్నీ ఈ పరీక్షలో తెలిసిపోతాయి. అంతేకాదు గుండె రక్తనాళాల కండిషన్, వాటిల్లోని అడ్డంకులు కచ్చితంగా తెలుస్తాయిగానీ ఈసీజీ, ఎకోలతో పోలిస్తే ఈ పరీక్షకు అయ్యే ఖర్చు ఎక్కువ. యాంజియోగ్రామ్‌లో వచ్చే ఫలితాలు 99 శాతం కంటే ఎక్కువగా నమ్మదగినవి. హైసెన్సిటివిటీ ట్రోపోనిన్‌లు: గుండెపోటు వచ్చిన నాలుగు గంటల లోపు రక్తంలో హైసెన్సిటివిటీ ట్రోపోనిన్ అనే రసాయనాలు పెరుగుతాయి. ఈ రక్త పరీక్ష ద్వారా ఎంత చిన్న గుండెపోటు అయినా అది కచ్చితంగా నిర్ధారణ అవుతుంది. (చదవండి: ఓ డాక్టర్ హార్ట్ బిట్..! హృదయాన్ని మెలితిప్పే కేసు..!) -
కుర్రాళ్ల గుండెలకు.. ఏమవుతోంది?
మనుషుల్లో గుండెజబ్బులు సర్వసాధారణమే! నడివయసు దాటాక చాలామంది గుండెజబ్బుల బారిన పడుతుంటారు. ఆధునిక వైద్యచికిత్స పద్ధతులు మెరుగుపడటంతో గుండెజబ్బులు ఉన్నవారు కూడా తగిన చికిత్సలతో, ఔషధాల వినియోగంతో ఆయుష్షును పొడిగించుకునే వీలు ఉంటోంది. గుండెజబ్బులు గుర్తించిన తర్వాత కూడా తగిన చికిత్స పొందుతూ ఒకటి రెండు దశాబ్దాల కాలం సునాయాసంగా జీవించగలిగే వారి సంఖ్య పెరుగుతోంది.ఇదంతా చూసుకుంటే పరిస్థితి ఆశాజనకంగానే కనిపిస్తోంది గాని, ఇటీవలి కాలంలో గుండెపోటుతో యువకులు మరణిస్తున్న సంఘటనలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చినా, ఆరోగ్యంగా కనిపించే యువకుల గుండెలకు రక్షణ ఎందుకు కొరవడుతోంది? ఈ పరిస్థితులకు కారణాలేమిటి? నివారణ మార్గాలేమిటి? నేడు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో అత్యధిక మరణాలకు కారణం గుండెజబ్బులే! ముఖ్యంగా గుండెకు రక్త సరఫరా నిలిచిపోవడం వల్ల సంభవించే ‘ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్’ వల్ల అత్యధిక మరణాలు సంభవిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చెబుతోంది. ‘వరల్డ్ హార్ట్ ఫెడరేషన్’ గత ఏడాది ‘వరల్డ్ హార్ట్ రిపోర్ట్–2023’ విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా 2.05 కోట్ల మంది గుండెజబ్బులతో మరణిస్తున్నారు. సకాలంలో చికిత్స అందించినట్లయితే, వీటిలో 80 శాతం మరణాలను నివారించే అవకాశాలు ఉన్నాయని ఈ నివేదిక చెబుతోంది.గడచిన ఐదు దశాబ్దాల కాలంలో గుండెజబ్బులను గుర్తించడం, తగిన చికిత్స అందించడం దిశగా వైద్యశాస్త్రం గణనీయమైన పురోగతి సాధించింది. అయినా, ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న గుండెజబ్బు మరణాల్లో 80 శాతం ఆర్థికంగా వెనుకబడిన దేశాల్లోను, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోను సంభవిస్తున్నాయి. పాత రికార్డులను చూసుకుంటే, 1990లో 1.21 కోట్ల మంది గుండెజబ్బులతో మరణించారు. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు అధునాతన వైద్యచికిత్స పద్ధతులు, మెరుగైన పరికరాలు అందుబాటులో ఉన్నా, గుండెజబ్బుల మరణాలు దాదాపు రెట్టింపుగా నమోదవుతుండటం ఆందోళనకర పరిణామం.గుండెజబ్బులతో అకాల మరణాలు..ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న అకాల మరణాలకు గుండెజబ్బులే ప్రధాన కారణం. అకస్మాత్తుగా గుండెకు రక్త సరఫరా నిలిచిపోవడం వల్లనే అత్యధికంగా గుండెపోటు మరణాలు సంభవిస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రమాణాల ప్రకారం 30–70 ఏళ్ల లోపు సంభవించే మరణాలను అకాల మరణాలుగా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న అకాల మరణాల్లో 38 శాతం మరణాలకు ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ కారణమని ‘వరల్డ్ హార్ట్ రిపోర్ట్–2023’ చెబుతోంది. ఈ అకాల మరణాలకు అనేక కారణాలు ఉన్నాయి. జీవనశైలి, శరీరంలోని జీవక్రియల తీరు, పర్యావరణ కారణాల వల్ల జనాలు గుండెజబ్బుల బారిన పడుతున్నారు.జీవనశైలి కారణాలు: తగిన శారీరక శ్రమ లేకపోవడం, పొగతాగడం, మితిమీరి మద్యం తాగడం, ఉప్పుతో కూడిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం.జీవక్రియ కారణాలు: అధిక రక్తపోటు, మధుమేహం, అధిక బరువు, ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం.పర్యావరణ కారణాలు: పరిసరాల్లో మితిమీరిన వాయు కాలుష్యం, పొగ, దుమ్ము, ధూళి నిండిన పరిసరాల్లో పనిచేయడం.ఆకస్మిక గుండెపోటుతో మరణాలు గుండెజబ్బులకు తెలిసిన కారణాలకైతే జాగ్రత్తలు తీసుకుంటాం. మరి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి, నిమిషాల్లోనే గుండె ఆగిపోతేనో! అకస్మాత్తుగా వచ్చే గుండెపోటు వల్లనే ఎక్కువమంది చికిత్స అందేలోపే ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో చాలామంది నిన్న మొన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న యువకులు ఉంటున్నారు. ఆకస్మిక గుండెపోటు వల్ల సంభవించే మరణాలు గుండెజబ్బులతో బాధపడే వృద్ధుల్లో సహజం.ప్రతి 50 వేల మరణాల్లో ఒక యువ క్రీడాకారుడు ఉంటున్నట్లు ‘వరల్డ్ హార్ట్ రిపోర్ట్–2023’ చెబుతుండటం ఆందోళనకరం. శారీరక శ్రమతో కూడిన జీవనశైలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారు, ఆటలాడే వారు కూడా ఆకస్మిక గుండెపోటుతో మరణిస్తున్నారు. ‘కోవిడ్’ తర్వాత ఇలాంటి మరణాలు ఎక్కువయ్యాయి. ‘కోవిడ్’కు ముందు ఆకస్మిక గుండెపోటుతో సంభవించే ప్రతి లక్ష మరణాల్లో ఒక యువక్రీడాకారుడు చొప్పున ఉండేవారు. ఇప్పుడు ఈ సంఖ్య రెట్టింపు కావడమే ఆందోళనకరం.ఆకస్మికంగా గుండెపోటుకు కారణాలు..ఆకస్మికంగా గుండెపోటు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. గుండెలోని విద్యుత్ సిగ్నలింగ్ వ్యవస్థలో ఆకస్మిక మార్పులు ఆకస్మిక గుండెపోటు కలిగిస్తాయి. గుండె లయ వేగంగా పెరగడం వల్ల గుండె దిగువ భాగంలోని గదులు బాగా కుంచించుకుపోతాయి. ఫలితంగా శరీరానికి కావలసిన రక్తాన్ని అందించడంలో గుండె విఫలమవుతుంది. ప్రాణాంతకమైన ఈ పరిస్థితిని ‘వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్’ అంటారు. ఈ పరిస్థితి వల్ల ఆకస్మిక గుండెపోటు మరణాలు సంభవిస్తుంటాయి.1. గుండె కండరం దళసరిగా తయారవడం కూడా యువకుల్లో ఆకస్మిక గుండెపోటు మరణాలకు మరో కారణం. గుండె కండరం ఒక్కోసారి దళసరిగా తయారవుతుంది. అలాంటప్పుడు గుండె శరీరానికి కావలసిన రక్తాన్ని సరఫరా చేయలేదు. గుండె కండరం దళసరిగా మారితే గుండె లయలో వేగం పెరుగుతుంది. ఈ పరిస్థితి ఒక్కోసారి ఆకస్మిక గుండెపోటుకు దారితీస్తుంది.2. గుండెలయలో హెచ్చుతగ్గులకు దారితీసే ‘బ్రుగాడా సిండ్రోమ్’, ‘వూల్ఫ్–పార్కిన్సన్–వైట్ సిండ్రోమ్’ వంటి రుగ్మతలు కూడా ఆకస్మిక గుండెపోటు మరణాలకు కారణమవుతాయి. ఇవే కాకుండా, కొందరిలో పుట్టుకతోనే గుండెలో లోపాలు ఉంటాయి. గుండెనాళాల్లోను, రక్తనాళాల్లోను హెచ్చుతగ్గులు ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఆకస్మికంగా గుండెపోటుతో మరణాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.3. ‘లాంగ్ క్యూటీ సిండ్రోమ్’ వల్ల కూడా ఆకస్మికంగా గుండెపోటు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితి ఉన్నవారికి గుండె చాలా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. ‘లాంగ్ క్యూటీ సిండ్రోమ్’ కొందరిలో జన్యు కారణాల వల్ల పుట్టుక నుంచి ఉంటుంది. ఈసీజీ పరీక్ష చేయించినప్పుడు ఈ పరిస్థితి బయటపడుతుంది. ఒక్కోసారి ఇతరేతర ఆరోగ్య కారణాల వల్ల, దీర్ఘకాలికంగా వాడే మందుల దుష్ప్రభావం వల్ల కూడా ‘లాంగ్ క్యూటీ సిండ్రోమ్’ రావచ్చు. ఈ పరిస్థితి ఒక్కోసారి ఆకస్మిక గుండెపోటు మరణాలకు దారితీసే అవకాశాలు ఎక్కువ.ముందుగా గుర్తించాలంటే?ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండా ఆకస్మికంగా వచ్చే గుండెపోటును ముందుగానే గుర్తించడం సాధ్యమేనా? అంటే, ఆకస్మికంగా వచ్చే గుండెపోటును నివారించడం సాధ్యం కాకపోయినా, కొన్ని ముందస్తు పరీక్షల వల్ల ఆకస్మిక గుండెపోటు మరణాలను తగ్గించగలమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కఠిన వ్యాయామాలు చేసే యువకులు, క్రీడారంగంలో కొనసాగే యువకులకు ఈసీజీ పరీక్షలు తప్పనిసరి చేయడం ద్వారా వారిలో ఆకస్మిక గుండెపోటు మరణాలను తగ్గించవచ్చునని ఇటాలియన్ వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈసీజీ వల్ల పాక్షిక ప్రయోజనం మాత్రమే ఉంటుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిపుణులు చెబుతున్నారు. కుటుంబంలో అనువంశిక చరిత్ర సహా ఇతరేతర కారణాల వల్ల గుండెజబ్బులు ఉన్న యువకులు కఠిన వ్యాయామాలకు, క్రీడా పోటీలకు దూరంగా ఉండటమే మంచిదని కూడా వైద్య నిపుణులు సూచిస్తున్నారు.గుండెజబ్బుల నివారణ.. హెల్దీ లైఫ్‌స్టైల్‌తో సాధ్యమే!ఈమధ్య గుండెజబ్బులు చాలా చిన్నవయసులోనే వస్తుండటం డాక్టర్లుగా మేము చూస్తున్నాం. యువతరంలో గతంలో ఎప్పుడోగానీ కనిపించని గుండెజబ్బులు, గుండెపోటు కేసులు ఇటీవల చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగాల్లో పని ఒత్తిడి, పని ఒత్తడిలో పడి హడావుడిగా జంక్‌ఫుడ్ తినడం, వ్యాయామం తగ్గిపోవడం, ఫలితంగా స్థూలకాయులవడం, మద్యపానం, పొగతాగడం వంటి అలవాట్లు యువతలో గుండెజబ్బులు పెరగడానికి ప్రధాన కారణాలు. అందుకే ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకోవడం, పని ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయడం, రోజుకు 45 నిమిషాల చొప్పున వారంలో కనీసం ఐదురోజులు వ్యాయామం చేయడం వంటి హెల్దీ లైఫ్‌స్టైల్‌ను అనుసరిస్తే యువతలో గుండెజబ్బులను చాలావరకు నివారించవచ్చు.ఎలాంటి హెచ్చరిక ఉండదు..సాధారణంగా ఆకస్మిక గుండెపోటు సంభవించే ముందు ఎలాంటి హెచ్చరిక ఉండదు. ఎలాంటి ముందస్తు లక్షణాలు కనిపించవు. అయితే, కొన్ని లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా గుండె పరీక్షలు చేయించుకోవడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.నడుస్తున్నప్పుడు, ఏదైనా పని చేస్తున్నప్పుడు లేదా ఆటలాడుతున్నప్పుడు హఠాత్తుగా మూర్ఛపోవడం జరిగితే, వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి. గుండె సమస్యల వల్ల కూడా ఇలా మూర్ఛపోయే పరిస్థితి తలెత్తుతుంది.ఉబ్బసంలాంటి పరిస్థితి లేకపోయినా, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడినట్లయితే గుండె పనితీరులో లోపాలు ఉన్నట్లే భావించాలి. ఈ పరిస్థితి ఎదురైతే, వెంటనే వైద్యనిపుణులను సంప్రదించాలి.కుటుంబ సభ్యులు ఆకస్మిక గుండెపోటు వల్ల మరణించిన చరిత్ర ఉన్నట్లయితే, ముందు జాగ్రత్తగా గుండె పరీక్షలు చేయించుకోవాలి. జన్యు కారణాల వల్ల గుండెలో లోపాలు ఉన్నట్లయితే ఆ పరీక్షల్లో బయటపడతాయి. వాటిని ముందుగానే గుర్తించినట్లయితే, తగిన చికిత్స పొందడానికి అవకాశం ఉంటుంది.ఆకస్మిక గుండెపోటు లక్షణాలు..ఆకస్మికంగా గుండెపోటు వచ్చినప్పుడు సాధారణంగా కనిపించే లక్షణాలు ఇవి:– హఠాత్తుగా కుప్పకూలిపోవడం– నాడి అందకపోవడం– ఊపిరాడకపోవడం– స్పృహ కోల్పోవడంఒక్కోసారి ఆకస్మికంగా గుండెపోటు వచ్చే ముందు ఇంకొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన కొద్ది నిమిషాల్లోనే గుండెపోటు వస్తుంది.– ఛాతీలో అసౌకర్యంగా ఉండటం– ఊపిరి తీసుకోవడం కష్టమవడం– నిస్సత్తువ– వేగంగా ఊపిరి తీసుకోవడం– గుండె లయ తప్పి కొట్టుకోవడం– స్పృహ కోల్పోతున్నట్లుగా అనిపించడంఈ లక్షణాలు కనిపిస్తే, వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేయడం మంచిది. ఎంత వేగంగా చికిత్స అందితే రోగికి అంత మంచిది. ఈ పరిస్థితుల్లో ఉన్నవారికి వెంటనే ‘కార్డియో పల్మనరీ రిసటేషన్’ (సీపీఆర్) అందించాలి. అలాగే, అందుబాటులో ఉంటే ‘ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫైబ్రిలేటర్’ (ఏఈడీ)తో ప్రాథమిక చికిత్సను అందించాలి. సీపీఆర్ చేసేటప్పుడు ఛాతీపై నిమిషానికి 100–120 సార్లు బలంగా మర్దన చేయాలి. ఆస్పత్రికి చేరేలోగా రోగికి ఈ రకమైన ప్రాథమిక చికిత్స అందిస్తే, చాలావరకు ప్రాణాపాయం తప్పుతుంది. -
ఈ దుఃఖం తీర్చేదెవరు?
(గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్పల్లి) : ‘హైడ్రా’తో చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో వెలిసిన అక్రమ నిర్మాణాల కూల్చివేతపై తొలుత హర్షం వ్యక్తమైంది. కానీ ఆ తర్వాత హైడ్రా వ్యవహరిస్తున్న తీరు మా త్రం కుటుంబాల్లో కన్నీళ్లు నింపేలా ఉందంటూ బాధితులు మండిపడుతున్నారు. ఇళ్లలోనో, దుకాణాల్లోనో, షెడ్లలోనో నివ సిస్తున్న.. వ్యాపారాలు చేసుకుంటున్న వారికి కనీస సమాచారం ఇవ్వకుండా, ఇచ్చినా ఖాళీ చేసేందుకు సమ యం ఇవ్వకుండా కూల్చివేతలు చేపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమదుఃఖం తీర్చేదెవరని.. తమకు జరిగిన నష్టాన్ని పూడ్చేదెవరంటూ కన్నీళ్లుపెడుతున్నారు. చాలా వరకు పేదలు, మధ్యతరగతివారే.. ఇళ్లు కట్టుకున్నవారే కాదు.. స్థలాలు, నిర్మాణాలను లీజుకు తీసుకుని వ్యాపారాలు పెట్టుకున్నవారూ హైడ్రా కూల్చివేతల్లో తీవ్రంగా నష్టపోయారు. ఎక్కడెక్కడి నుంచో బతుకుదెరువు కోసం వచ్చి.. కడుపు కట్టుకుని సంపాదించుకుంటున్న తమ బతుకులు రోడ్డున పడ్డాయని వాపోతున్నారు. వడ్డీలకు అప్పులు తెచ్చి వ్యాపారాలు చేసుకుంటున్న షెడ్లను, భవనాలను ఉన్నట్టుండి కూల్చడంతో.. తీవ్రంగా నష్టపోయామని, ఇక తమ బతుకులు కోలుకునే అవకాశమే కనిపించడం లేదని కన్నీళ్లు పెడుతున్నారు. ఈ నెల 8న సున్నంచెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్లలోని ఒక గోడౌన్, మూడు భవనాలు, 20 గుడిసెలను అధికారులు కూల్చివేశారు. అందులో ఒక గుడిసెలో నివాసం ఉంటున్న బలహీనవర్గాలకు చెందిన ఎన్.నర్సింహ, అంజలి దంపతులు ఇరవయ్యేళ్ల క్రితం మాదాపూర్‌కు వలస వచ్చారు. స్థానిక నేతల సూచనతో అక్కడ గుడిసె వేసుకొని కూలిపనులు చేసుకుంటూ బతుకుతున్నారు. వారి కుమారుడు సాయిచరణ్ (17) కేన్సర్ వ్యాధితో బాధపడుతూ రెండు నెలల క్రితమే మృతిచెందాడు. ఆ దుఃఖం నుంచి కోలుకోకముందే వారి గుడిసె నేలమట్టమైంది. తలదాచుకునేందుకు నర్సింహ సోదరి ఇంటికి వెళ్లారు. కానీ అటు కుమారుడిని, ఇటు గూడును కోల్పోయిన ఆవేదనతో.. అంజలి ఈనెల 21న ఛాతీనొప్పికి గురైంది. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి ఆమె మృతి చెందింది. పాత జ్ఞాపకాలను వెతుక్కుంటూ కూల్చిన గుడిసె వద్దకు వచ్చిన నర్సింహ.. కొడుకు, భార్య ఇద్దరూ మరణించాక, తాను ఎవరి కోసం బతకాలో అర్థం కావడం లేదని వెక్కివెక్కి ఏడ్చారు. రోడ్డున పడ్డ బతుకులు.. కూకట్‌పల్లికి చెందిన విజయ్ప్రతాప్గౌడ్ది మరో కన్నీటి వ్యథ. కేటరింగ్ చేసే ఆయన వద్ద 68 మంది పనిచేస్తున్నారు. వారందరికీ అదే జీవనాధారం. విజయ్‌ప్రతాప్ భూమిని లీజుకు తీసుకొని, రూ.40 లక్షల వ్యయంతో షెడ్లు, సామగ్రి ఏర్పాటు చేసుకున్నారు. నల్లచెరువులో హైడ్రా కూల్చివేతల్లో భాగంగా ఆయన షెడ్లనూ కూల్చేశారు. కనీసం కేటరింగ్ సామగ్రి బయటికి తీసుకువెళ్లే అవకాశం ఇవ్వలేదని ఆయన వాపోయారు. తనతోపాటు పనిచేసేవారంతా ఉపాధి లేక రోడ్డునపడ్డామని ఆందోళన వ్యక్తం చేశారు. కొంత గడువైనా ఇవ్వాల్సింది సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలతో తీవ్రంగా నష్టపోయానని మరో బాధితుడు పునారాం పేర్కొన్నారు. అక్కడ లక్షలు ఖర్చుపెట్టి గోడౌన్ నిర్మాణం చేపట్టానని, శానిటరీ సామాగ్రి కొంత అందులోనే ఉండిపోయిందని వాపోయారు. కొన్నిరోజులు గడువు ఇచ్చి ఉంటే సామగ్రిని పూర్తిగా తరలించే అవకాశం ఉండేదన్నారు. గోడౌన్, సామగ్రి కలిపి రూ.50 లక్షలకుపైగా నష్టపోయి.. రోడ్డునపడ్డానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గర్భవతి అన్నా కనికరించలేదు! కూకట్‌పల్లిలో రవి జిరాక్స్, ప్రింటింగ్ ప్రెస్‌కు సంబంధించిన దుకాణం నిర్వహిస్తున్నాడు. హైడ్రా ఒక్కసారిగా కూల్చివేతలు చేపట్టడంతో తీవ్రంగా నష్టపోయానని వాపోయాడు. తన భార్య గర్భవతి అని, సామగ్రి తీసుకునేందుకు కాస్త గడువు ఇవ్వాలని కోరినా అధికారులు కనికరించలేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాను, మరికొందరు కలసి నాలుగు రోజులు కష్టపడి కొంత సామగ్రిని బయటికి తీసినా.. అది చాలా వరకు పాడైపోయిందని వాపోయారు. తనతో పాటు మరెందరో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. -
పుల్వామా ఉగ్రదాడి నిందితుడు గుండెపోటుతో మృతి
జమ్మూ: 2019 పుల్వామా ఉగ్రదాడి నిందితుడు జమ్ముకశ్మీర్‌లోని జమ్మూ ఆసుపత్రిలో గుండెపోటుతో మృతిచెందాడు. ఇతని వయస్సు 32 ఏళ్లు. ఈ సమాచారాన్ని ఓ అధికారి మీడియాకు తెలిపారు. 32-year-old accused in 2019 Pulwama terror attack dies of heart attack in Jammu hospital: Officials— Press Trust of India (@PTI_News) September 24, 2024 2019లో జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శ్రీనగర్-జమ్ము హైవేపై లెత్పోరా సమీపంలో ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఐఈడీతో పేలుడుకు పాల్పడ్డారు. ఈ దాడిలో 40 మంది జవాన్లు వీరమరణం పొందగా, పలువురు గాయపడ్డారు. వీరంతా సీఆర్పీఎఫ్లోని 54 బెటాలియన్‌కు చెందినవారు. పేలుడు ధాటికి బస్సు ధ్వంసమైంది. ఈ ఆర్మీ కాన్వాయ్ జమ్ము నుంచి శ్రీనగర్‌కు వెళుతుండగా ఆ ఘటన చోటుచేసుకుంది.ఇది కూడా చదవండి: శ్రీనగర్ లాల్‌చౌక్ కోసం మామ- మేనల్లుడు పోటీ -
అమెరికాలో గుండెపోటుతో తెలుగు విద్యార్థి హఠాన్మరణం
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడు డల్లాస్‌లో గుండెపోటుతో మరణించాడు. చిన్న వయసులోనే గుండెపోటు మరిణించిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. భవిష్యత్తు కలలతో విదేశాలకు వెళ్లిన కన్న కొడుకు ఆకస్మిక మరణం అతని కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కావూరు గ్రామానికిచెందిన చిలుకూరి శ్రీరాఘవ దొర (24) మరణంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. అమెరికాలో ఎమ్మెస్ పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడని బంధువులు తెలిపారు. కష్టపడి చదువుకున్నాడని, చాలా మంచి వ్యక్తి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీరాఘవ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
టీసీఎస్ఎస్ ఉపాధ్యక్షులు గోనె నరేందర్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూత
తెలంగాణ కల్చరల్ సొసైటి (సింగపూర్) ఉపాధ్యక్షులు గోనె నరేందర్ రెడ్డి (54) 11 సెప్టెంబర్ 2024 న తమ సొంత నివాసం లో తీవ్ర గుండెపోటు కు గురై స్థానిక ఎంగ్ టెంగ్ ఫాంగ్ జనరల్ హాస్పిటల్ లో మృతి చెందారు. ఆయన ఆకస్మిక మృతి విషయం తెలుసుకున్న సింగపూర్ లో ఉన్న ఇరు తెలుగు రాష్ట్రాల వారితో పాటు స్థానిక మిత్రులందరూ దుఃఖ సాగరంలో మునిగిపోయారు. సొసైటీ సభ్యులు ఈ బాధా సమయం లో నరేందర్ గారు సమాజానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సరిహద్దులు దాటి సింగపూరుకొచ్చి, తెలుగోల్లకు తోబుట్టువై, సాగరతీరంలో స్వాతి చినుకువై, సంస్కృతి సంప్రదాయానికి నిలువుటద్దమై, తంగేడుపువ్వుల జాడ చెప్పి, బతుకమ్మకు వన్నె తెచ్చి, పోత రాజుల పౌరుషం పులి రాజుల గాంభీర్యం మాకు పరిచయం చేసి, బోనం అంటే నరేంద్రుడు బతుకమ్మకు పెద్దకొడుకు అంటూ నరేందర్ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. టీసీఎస్‌ఎస్‌కు అందించిన సేవలు చాలా గొప్పవంటు ఆయనకు జోహార్లు అర్పించారు. వందల సంఖ్యలో మిత్రులు సందర్శనకు వచ్చి ఆశ్రు నివాళి అర్పించారు. మృదు స్వభావి, ఎప్పుడు ప్రతి ఒక్కరిని చిరు నవ్వుతో పలకరించే వారనీ, సింగపూర్ లో ఉన్న తెలుగు వాసులకు చేసిన సేవలను కొనియాడారు. ఈ దుఃఖ సమయంలో తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ సభ్యులు ఆయన కుటుంబం వెన్నంటే ఉండి అన్ని విషయాలలో సహాయ సహకారాలు అందించి, ఆయన పార్థీవ దేహాన్ని ఇండియాకు తరలించారు. వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతి ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు తోడుగా గోనె నరేందర్ సమీప బంధువు ఓరిగంటి శేఖర్ రెడ్డి గారు వారి వెంట ఇండియాకు తోడు వెళ్లారు.వెల్గటూర్ గ్రామం, కొత్తపేట్ మండలం, జగిత్యాల జిల్లా కు చెందిన గోనె నరేందర్ గారు గత 25 సంవత్సరాల క్రితం సింగపూర్‌కి వచ్చారు. ప్రస్తుతం కుటుంబంతో సహా శాశ్వత నివాస హోదాలో నివసిస్తున్నారు. ఆయనకు భార్య, ఒక కూతురు , కుమారుడు. ఉన్నారు. -
Heart Attack: అయ్యో పాపం ‘వెంకటస్వామి’
జగదేవ్‌పూర్(గజ్వేల్): బదిలీ అయ్యి పాఠశాలలో విద్యార్థులకు పరిచయం కాకముందే ఆ ఉపాధ్యాయుడిని విధి కాటేసింది. ఇంటి వద్ద కాలకృత్యాలకు వెళ్లి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాదకరమైన ఘటన మండలంలోని అలిరాజ్‌పేట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ధ్యాప వెంకటస్వామి(42), మంజుల (ఉపాధ్యాయురాలు), ఇద్దరు కుమార్తెలు సుష్మిత మిత్ర, అక్షర మిత్ర ఉన్నారు. వెంకటస్వామి గజ్వేల్ మోడల్ స్కూల్లో హిందీ ఉపాధ్యాయుడిగా 11 ఏళ్లుగా పని చేస్తున్నాడు. భార్య మంజుల జగదేవ్‌పూర్ బాలికల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. అలిరాజ్‌పేట గ్రామం నుంచి గజ్వేల్‌కు మారి నూతనంగా ఇల్లు నిర్మించుకొని గత నెల 23న గృహ ప్రవేశం చేశారు. ఈ నెల 14న ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా గజ్వేల్ నుంచి జగదేవ్‌పూర్ మోడల్ స్కూల్‌కు బదిలీ అయ్యారు. అదే రోజు సాయంత్రం పాఠశాలలో బాధ్యతలు తీసుకున్నారు. సోమవారం గజ్వేల్‌లోని కొత్త ఇంటిలో కాలకృత్యాలకు వెళ్లగా ఛాతిలో నొప్పి రావడంతో అక్కడే కుప్పకూలాడు. వెంటనే కుటుంబ సభ్యులు గజ్వేల్ ప్రభుత్వ ఆస్పతికి తరలించారు. వైద్యులు పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సామాజిక కార్యక్రమాలు.. వెంకటస్వామి ఉపాధ్యాయుడికి ముందు సామాజిక కార్యక్రమాలను చేపట్టారు. సామాజిక పాటలపై ప్రేమతో 11 పాటలను సొంత ఖర్చులు, దర్శకత్వంతో తీశారు. గ్రామానికి చెందిన పల్లెటూరి హీరో అనిల్ మొగిలితో 7 పాటలకు దర్శకత్వం, నిర్మాతగా వ్యవహరించారు. అలాగే రైతుల ఆత్మహత్యలపై పాటలకు నిర్మాత, దర్శకత్వం వహించారు. నేత్రదానం.. వెంకటస్వామి మృతి చెందిన వెంటనే లోక్ నేత్ర ట్రస్టు వారికి అతడి కళ్లను దానం చేశారు. నేత్రదానం చేసి మరొకరికి చూపు ఇవ్వడంతో గ్రామస్తులు, తోటి ఉపాధ్యాయులు ఆ కుటుంబాన్ని అభినందించారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు శశిధర్‌శర్మ, మండలాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, టీపీటీఎఫ్, యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘూల నేతలు శంకర్, సత్తయ్య, ప్రవీణ్, వెంకట్ కిరణ్, ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు నివాళులరి్పంచారు. -
మణికొండలో విషాదం.. గుండెపోటుతో టెక్కీ మృతి
సాక్షి, హైదరాబాద: మణికొండ అల్కాపూరి కాలనీలో విషాదం చోటుచేసుకుంది. అల్కాపూరి టౌన్ షిప్ గణేష్ ఉత్సవ కమిటీ లడ్డు వేలం పాటలో పాల్గొన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్.. అనంతరం ఆకస్మికంగా మృతిచెందాడు. ఆదివారం రాత్రి టౌన్షిప్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగిన లడ్డు వేలం పాటలో శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నాడు. 15 లక్షల వరకు లడ్డు వేలంలో పాల్గొన్నాడు. అనంతరం స్నేహితుడు లడ్డూ కైవసం చేసుకోవడంతో గణనాథుడి వద్ద ఉత్సాహంగా డాన్స్‌లు చేశాడు. స్నేహితులతో కలిసి తీన్మార్ స్టెప్పులేశాడు. అయితే ఇంటికి వెళ్లిన తర్వాత గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. దీంతో కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు విషాదంలో మునిగిపోయారు.చదవండి: Ganesh Immersion: ఆ అనుభవాల నుంచి పాఠాలు! -
ప్రపంచ ప్రఖ్యాత బాడీ బిల్డర్ గుండెపోటుతో కన్నుమూత
ప్రపంచంలోని గొప్ప బాడీబిల్డర్‌గా గుర్తింపు పొందిన ఇలియా 'గోలెం' యెఫిమ్చిక్ గుండెపోటు కారణంగా కన్నుమూశాడు. కండలు తిరిగిన దేహంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఇలియా కేవలం 36 ఏళ్ల వయస్సులోనే కన్నుమూయడం, గుండెపోటు ముప్పుపై చర్చకు దారి తీసింది. నిరంతరం జిమ్ చేస్తూ బాడీని ఫిట్‌గా ఉంచుకునే ఆరడుగుల ఆజానుభాహులు కూడా కూడా ఇటీవలి కాలంలో గుండెపోటుకు బలైపోతున్నారు. మీడియా నివేదిక ప్రకారం, సెప్టెంబర్ 6న ఇలియాకు గుండెపోటు రావడంతో, భార్య అంబులెన్స్‌కు ఫోన్ చేసింది. అంబులెన్స్ వచ్చే వరకు అతనికి సీపీఆర్ చేస్తూనే ఉంది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లిపోయాడు. సెప్టెంబర్ 11న కన్నుమూశారు. కోలుకుంటాడనే ఆశతో ఎదురు చూశాను. తని గుండె మళ్లీ కొట్టుకోవడం ప్రారంభించినా,మెదడు పనిచేయడం ఆగిపోయిందని వైద్యులుచెప్పారని అతని భార్య అన్నా స్థానిక మీడియాతో పంచుకున్నారు. వృత్తిపరమైన బాడీబిల్డింగ్ ఈవెంట్లలో ఎప్పుడూ పోటీపడనప్పటికీ, ఆన్లైన్లో ట్రైనింగ్ వీడియోలను పంచుకునేవాడు. దీంతో ఫాలోవర్స్ బాగా పెరిగారు. 25-అంగుళాల కండపుష్టితో ‘మోస్ట్ మాన్‌స్ట్రస్ బాడీబిల్డర్,' రోజుకు 16,500 కేలరీలు భోంజేస్తాడు. 340 పౌండ్ల బరువు కారణంగా బాడీబిల్డింగ్ సర్కిల్‌లలో "ది మ్యూటాంట్" అనే మారుపేరు కూడా సంపాదించాడు. ఫిట్‌గా ఉండే ఇలియా అకాల మరణం అతని అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. యువకులలో గుండె సమస్యలు సర్వసాధారణంగా మారాయి. సాధారణగా మగవారికి 65, స్త్రీలలో 72ఏళ్ల తరువాత గుండెపోటు వస్తుందని భావించేవారు. కానీ ఇటీవలి పరిశోధనలో భాగంగా, అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ గత దశాబ్దంలో 2శాతం పెరుగుదలతో 40 ఏళ్లలోపు వ్యక్తులు ఇప్పుడు తరచుగా గుండెపోటుతో మరణిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ పునీత్ కుమార్ ,సిద్ధార్థ్ శుక్లా మొదలు, ఇటీవల నటుడువికాస్ సేథి గుండెపోటు కారణంగా చిన్న వయసులోనే కన్నుమూసిన సంగతి తెలిసిందే. (విటమిన్ బీ12 లోపమా? ఈ ఆహారం తీసుకోండి!)గుండెపోటు కారణాలుగుండెకు రక్తప్రసరణలో తీవ్ర అడ్డంకులు, లేదా నిలిచిపోయినపుడు గుండె స్పందన రేటు విపరీతంగా పెరిగి, గుండెపోటుకు దారితీస్తుంది. గుండెపోటును మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (MI) అని కూడా పిలుస్తారు. శారీరక శ్రమ, వ్యాయామం చేయకపోవడం, వృత్తిపరమైన ,వ్యక్తిగత ఒత్తిడి, ధూమపానం, మద్యం సేవించడం వల్ల వస్తుంది.కరోనరీ ఆర్టరీ వ్యాధి: ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ అని కూడా పిలుస్తారు. ధమనులలో రక్త ప్రవాహాన్ని అడ్డుకుని గుండె కండరాలకు రక్త సరఫరా నిలిచిపోతుంది. 40 ఏళ్లు పైబడిన వారిలో ఇది చాలా సాధారణ కారణమని వైద్యులు చెబుతున్నారు.వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్: ఇది ప్రాణాంతక పరిస్థితి. అతి వేగంగా గుండె కొట్టుకుంటుంది. వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ కారణంగా గుండె లయ తప్పి, పంపింగ్ సామర్థ్యం దెబ్బతింటుంది. ప్రాణాంతకం కావచ్చు.ఒత్తిడి: ఒత్తిడి గుండె ఆరోగ్యానికి చాలా హానికరం. తీవ్రమైన ఒత్తిడి గుండె పనితీరును దెబ్బతిస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలి, వ్యాయామం, ఒత్తిడి లేని జీవితమే గుండెకు రక్ష. ఇంట్లో ఎవరికైనా గుండెపోటు వచ్చిన చరిత్ర ఉంటే, తొందరగా మేల్కొని, వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమమైన మార్గం. ఇదీ చదవండి: కాకరకాయ ఆయిల్‌తో ఎన్ని లాభాలో : చుండ్రుకు చెక్, జుట్టు పట్టుకుచ్చే! -
గుండెపోటు మరణాలు తగ్గాయ్!
సాక్షి, హైదరాబాద్: గత పది, పదిహేనేళ్లతో పోలిస్తే ఇప్పుడు గుండెపోటు మరణాలు తగ్గాయని ప్రముఖ వైద్యులు వెల్లడించారు. కోవిడ్ తర్వాత గుండెపోటు మరణాలు పెరిగాయన్నది వాస్తవం కాదన్నారు. వివిధ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు అత్యాధునిక జన్యు పరీక్షతో ఎంతో ప్రయోజనం ఉంటుందని జీనోమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన వర్క్‌షాప్‌లో పలు వురు డాక్టర్లు, శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.గురువారం హైదరాబాద్‌లోని జీనోమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఏఐజీ ఆసుపత్రికి చెందిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ బి.సోమరాజు, నిమ్స్ మాజీ డైరెక్టర్, అపోలో స్పెక్ట్రా ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ ప్రసాదరావు, అపోలో ఆసుపత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాసరావు, యూరాలజిస్ట్ డాక్టర్ దీపిక, డాక్టర్ సత్యనారాయణ, జీ నోమ్ ఫౌండేషన్ ఎండీ డాక్టర్ గాంధీ మాట్లాడారు. జెనెటిక్ పరీక్షల వల్ల కొందరికి కొన్ని రోగాలకు మందులు వాడాల్సిన అవసరం ఉండకపోవచ్చని, కొందరికి ఎంత డోసు వాడాలో స్పష్టత వస్తుందన్నారు. మనిíÙకీ, మనిషికీ జన్యుపరంగా తేడా ఉంటుందని... ఆ ప్రకారమే మందుల అవసరం ఉంటుందన్నా రు. ఆ తేడాను గుర్తించకపోతే కొందరికి మందులు సరిగా పనిచేస్తే, కొందరిపై దు్రష్పభావాలు ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఔషధాల వినియోగంలో..: కార్డియాక్ ఔషధాల దీర్ఘకాలిక వినియోగంలో లోతైన అవగాహన అవసరమని వక్తలు చెప్పారు. కొలె్రస్టాల్ స్థాయిలను తగ్గించడంలో క్లోపిడోగ్రెల్, రక్తం గడ్డకట్టే స్థాయిలను తగ్గించడంలో స్టాటిన్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని, అయితే అవి వ్యక్తిగతంగా రోగులపై ఏ స్థాయిలో పనిచేస్తున్నాయోననే విషయాన్ని అర్థం చేసుకోవడంలో జన్యు పరీక్షలు దోహదపడతాయని తెలిపారు. డాక్టర్ సోమరాజు మాట్లాడుతూ, జెనెటిక్ టెస్టు వల్ల ఏ వ్యక్తికి ఏ మందు అవసరం? ఎంత మోతాదులో అవసరం? అసలు మందులు వేయాల్సిన అవస రం ఉందా? లేదా? వంటి స్పష్టత వస్తుందన్నారు.అపోలో స్పెక్ట్రా చైర్మన్ డాక్టర్ ప్రసాదరావు మాట్లాడుతూ, డాక్టర్లు రాసిచ్చే మందుల్లో ప్రతీ నలుగురిలో ఒకరికి పని చేయడం లేదన్నారు. అందుకే జన్యు పరీక్ష చేస్తే ఏది అవసరమో నిర్ధారణకు రావొచ్చన్నారు. జెనెటిక్ పరీక్ష ధర రూ.10 వేలు: జీనోమ్ ఫౌండేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 4.15 ఎకరాల భూమి కేటాయించిందని డాక్టర్ గాంధీ వెల్లడించారు. త్వరలో భవన నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి శంకు స్థాపన చేస్తారన్నారు. జీనోమ్ టెస్ట్‌కు తాము రూ.10 వేలు చార్జి చేస్తున్నామన్నారు. ఒకసారి పరీక్ష చేస్తే జీవితాంతం ఆ రిపోర్టు ఉపయోగపడుతుందన్నారు. దాని ప్రకారం అవసరమైన మోతాదులో డాక్టర్లు మందులు ఇవ్వడానికి వీలుపడుతుందని చెప్పారు. -
స్థూలకాయంపై పోరాటం.. 19 ఏళ్ల బాడీబిల్డర్‌ను వదలని గుండెపోటు
ఆకస్మిక గుండెపోటు మరణాలు.. ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఎందరో ప్రాణాలను బలితీసుకుంటుంది. బంగారు భవిష్యత్తు కలిగిన యువత ప్రాణాలను అర్థాంతరంగా లాగేసుకుంటుంది. సడెన్‌గా అపస్మారక స్థితికి చేరుకొని తిరిగిరాని లోకాలకు వెళుతున్నారు.తాజాగా బ్రెజిల్‌కు చెందిన ఓ యువ బాడీబిల్డర్ గుండెపోటు కారణంగా మృతిచెందాడు. ఆదివారం మధ్యాహ్నం తన ఇంటిలో విగతజీవిగా కనిపించాడు. దక్షిణ బ్రెజిల్‌లోని శాంటా కాటరినాలో నివిసిస్తున్న 19 ఏళ్ల బాడీబిల్డర్ మాథ్యూస్ పావ్లక్ ఉభకాయ సమస్యలతో బాధపడేవాడు. దీనిని అధిగమించేందుకు బాడీ పెంచడం ప్రారంభించాడు. కేవలం అయిదు సంవత్సరాల్లోనే తన శరీరాన్ని పూర్తిగా మార్చుకున్నాడు.బాడీబిల్డింగ్‌లో పోటీలు ఇవ్వడం మొదలు పెట్టాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనబర్చి నాల్గో స్థానంలో నిలిచాడు. అంతేగాక 2023లో యూ23 అనే పోటీలో పాల్గొని గెలుపొందాడు. అప్పటి నుంచి అతన్ని తన గ్రామస్థులు అందరూ మిస్టర్ బ్లమెనౌ అని పిలుస్తుంటారు.అయితే మాథ్యూస్ అకాల మరణం అనేక సందేహాలకు తావిస్తోంది. అనాబాలిక్ స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల ఆరోగయ సమస్యలు తలెత్తి మృతిచెందినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తన శరీరాకృతిని ఆకట్టుకునే విధంగా మలచడంలో మందుల వాడకం గుండెపోటుకు కారణమై ఉండవచ్చని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. అయితే వీటిని పావ్లాక్ సన్నిహితులు ఈ విమర్శలను ఖండిస్తున్నారు. ఈ లోకంలో లేని వారి గురించి తప్పుడు వార్తలు వ్యాప్తి చేయడం సరికాదని చెబుతున్నారు. -
తోపుడుబండిపై భార్య మృతదేహం.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన
సాక్షి, విజయవాడ: సింగ్‌నగర్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఇంట్లోకి వరద నీరు రావడంతో పద్మావతి (48) అనే మహిళ గుండె ఆగి మృతి చెందింది. నిన్న ఉదయం జరిగిన ఈ ఘటన జరిగింది. హార్ట్ ఎటాక్ అని చెప్పినా కూడా పడవలు, అంబులెన్స్‌లు రాలేదు. దీంతో బయటకు రాలేక, మెడిసిన్ అందక.. తీవ్ర బాధను పద్మావతి అనుభవించింది. చివరికి భర్త, కుమారుల కళ్లెదుటే కన్నుమూసింది.నిన్నటి నుంచీ ఇంట్లోనే డెడ్‌బాడీతో కుటుంబ సభ్యులు ఉన్నారు. చివరికి వరద నీటిలోనే తోపుడిబండిపై మృతదేహంతో భర్త శ్రీనివాసరావు బయలుదేరారు. 4 కిలోమీటర్లు భార్య మృతదేహాన్ని తోపుడుబండిపై తోసుకుంటూ వరదలో నీటిలోనే ప్రయాణం సాగించారు. సింగ్‌నగర్ ఫ్లై ఓవర్ వరకు వచ్చి అధికారులను ప్రాధేయపడినా ఊరట దక్కలేదు.నాలుగు కిలోమీటర్లు వచ్చారుగా ఇంకో కి.మీ. వెళ్తే మెయిన్ రోడ్ వస్తుందంటూ ఉచిత సలహాను అధికారులు ఇచ్చారు. దీంతో చేసేదిలేక తోపుడు బండిపై మృతదేహంతో కుటుంబసభ్యులు వెళ్లిపోయారు. పద్మావతి మృతి ఘటన చూపరులను కంట తడి పెట్టించింది. -
వీకెండ్ హాయిగా నిద్రపోతే, ఆ ముప్పు 20 శాతం తగ్గుతుంది!
మారుతున్న జీవన శైలి, ఆహార అలవాట్ల కారణంగా చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అంతేకాదు నిరంతరం వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉన్నవాళ్లు కూడా గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే తాజా పరిశోధన సరికొత్త విషయాన్ని గుర్తించింది. కంటి నిండా నిద్రపోతే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని తెలుసు, కానీ వారాంతాల్లో ఎక్కువగా నిద్రపోవడం వల్ల కూడా గుండె జబ్బుల ముప్పు తగ్గుతుందని ఒక అధ్యయనంలో తేలింది. యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ సమావేశంలో సమర్పించిన ఒక అధ్యయనం ప్రకారం, వారాంతాల్లో నిద్ర తప్పిన వ్యక్తుల్లో గుండె జబ్బుల ముప్పు 20శాతం తగ్గుతుంది. ముఖ్యంగా వారమంతా పని ఒత్తిడిలో ఉండి సరిగా నిద్రపోని వారికి వీకెండ్ నిద్ర గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చని కొత్త పరిశోధన వెల్లడించింది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, వారాంతాల్లో నిద్రపోవడం తరచుగా ఆలస్యంగా నిద్రపోయే వారికి గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. వృత్తిరీత్యా స్లీపింగ్ సైకిల్ సరిగా లేని వ్యక్తులకు ఇది ప్రత్యేకంగా వర్తిస్తుందని వివరించింది.ఆధునిక జీవనశైలి తరచుగా పని వారంలో నిద్రలేమికి గురయ్యేవారికి ఇది ఉపయోడ పడనుంది. చైనాలోని బీజింగ్‌లోని నేషనల్ సెంటర్ ఫర్ కార్డియోవాస్కులర్ డిసీజ్లోని ఫువై హాస్పిటల్‌లోని స్టేట్ కీ లాబొరేటరీ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్‌కు చెందిన స్టడీ కో-రచయిత మిస్టర్ యంజున్ సాంగ్ మాట్లాడుతూ, "తగినంత పరిహార నిద్ర గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వారం రోజుల్లో నష్టపోయిన నిద్రకు పరిహారంగా వారాంతపు రోజుల్లో క్రమం తప్పకుండా నిద్రను భర్తీ చేసుకునే వారిలో ఈ ఫలితం స్పష్టంగా కనిపిస్తుందని ఈ అధ్యయనం తెలిపింది. -
మలబద్దకంతో గుండెకు ముప్పే : తాజా అధ్యయనం
మనం తిన్న ఆహారం శుభ్రంగా జీర్ణమైన తరువాత వ్యర్థాలన్నీ మలం రూపంలో బయటికి వచ్చేయాలి. లేదంటే అనేక అనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయి. అడపాదడపా మలబద్దకం చాలా సాధారణమే అయినప్పటికీ, దీర్ఘకాలిక మలబద్దకం అనేక రోగాల పెట్టు. దీనిని పట్టించుకోకుండా, చికిత్స చేయకుండా వదిలేస్తే, అది చివరికి హెమోరాయిడ్స్ లేదా పైల్స్ లాంటి సమస్యలకు దారి తీస్తుంది. అంతేకాదు దీన్ని సరైన సమయంలో నివారించకపోతే రక్తపోటు, గుండెపోటు లాంటి తీవ్ర సమస్యలు తప్పవు.గతంలో 60 ఏళ్లు పైబడిన 5.4 లక్షలమంది ఆసుపత్రి రోగులపై జరిపిన ఆస్ట్రేలియన్ అధ్యయనం ప్రకారం, మలబద్దకం లేని రోగులతో పోలిస్తే మలబ్దకం ఉన్నవారికి అధిక రక్తపోటు, గుండెపోటు. స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. అదేవిధంగా, 9 లక్షల మంది వ్యక్తులపై చేసిన డానిష్ అధ్యయనం కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. అయితే ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో మలబద్దకం ఉంటే ఈ ముప్పు ఉంటుందా అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. కానీ మోనాష్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల నేతృత్వంలో జరిగిన ఇటీవలి అంతర్జాతీయ అధ్యయనం సాధారణ జనాభాలో కూడా ఈ ప్రమాదం పొంచి ఉందని తేల్చింది. మలబద్దకం రకాలు, కారణాలుఅందరూ మలబద్దకాన్ని చిన్నపాటి సమస్యగా భావిస్తారు. దానిని పెద్దగా పట్టించుకోరు. కానీ ఇది అనేక ప్రధాన వ్యాధులకు హెచ్చరిక. పురుషులతో పోలిస్తే, మహిళల్లోనే ఈ సమస్య ఎక్కువట. మలబద్దకానికి అనేక కారణాలున్నాయి. అలాగే దీన్ని ప్రైమరీ, సెకండరీ అని రెండు గ్రూపులుగా వర్గీకరిస్తారు. మలబద్దకం సమయంలో ప్రేగు కదలికల్లో ఒత్తిడి కడుపుపై ఒత్తిడి పెంచుతుంది. దీంతో బీపీ, గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. రక్తపోటు పెరిగితే అది గుండె జబ్బులకు దారి తీస్తుంది.సాధారణంగా ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకోకపోవడం, శరీరానికి కావల్సిన నీటిని తీసుకోకపోవడం మలబద్ధకానికి దారి తీస్తుంది. మలబద్దకంతో ఉన్నప్పుడు, సాధారణంగా ప్రేగుల్లో గ్యాస్ పేరుకుపోతుంది. ఇది పొత్తి కడుపులో ఒత్తిడి పెంచి ఛాతీ దాకా విస్తరిస్తుంది. దీంతో నొప్పి, మంట లాంటి అసౌకర్యాలు కలుగుతాయి. ఇది హృదయనాళ వ్యవస్థపై భారాన్ని పెంచి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాదు చాలా అరుదుగానే అయినప్పటికీ ఊపిరి పీల్చుకోవడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది. బలవంతంగా మల విసర్జనకు ప్రయత్నించడంతో చాలామందిలో రక్తం స్రావం కనిపిస్తుంది. ఇది ఎనిమీయాకు కారణమవుతుంది. ఎపుడు అప్రమత్తం కావాలి?జీవన శైలిమార్పులతోపాటు, వైద్యుల సలహాపై తీసుకొనే కొన్ని రకాల మందుల ద్వారా నయం చేసుకోవచ్చు. అయితే మలబద్దకంతోపాటు ఛాతీ నొప్పి లేదా శ్వాస ఆడకపోవడం ఒకటీ రెండు రోజులకు మించి ఉంటే తీవ్రమైన సమస్యగా పరిగణించాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆందోళన, దవడ, మెడ లేదా వెనుక భాగంలో నొప్పి లేదా అసౌకర్యం, చేతులు భుజాలలో నొప్పి లేదా అసౌకర్యం ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.మలబద్దకం-నివారణ ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువ ఉండేలా జాగ్రత్తపడాలి. ఎక్కువ పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు , చిక్కుళ్ళు తీసుకోవాలి.పుష్కలంగా నీరు తాగాలి. ప్రేగు కదలికలను ప్రేరేపించడానికి తేలికపాటి వ్యాయాయం, వాకింగ్ లాంటివి చేయాలి.పరగడుపున గోరు వెచ్చని నీళ్లను తాగడం, కొన్నిరకాల యోగాసనాల వల మంచి ఫలితం ఉంటుంది. -
ఫ్యాటీ లివర్ ఉంటే గుండెపోటు వస్తుందా?
టీవీ నటుడు మొహ్సిన్ ఖాన్ తాను నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) కారణంగా గుండెపోటుకి గురైనట్లు వెల్లడించాడు. అది చాలా సివియర్‌గా వచ్చిందని, రెండు మూడు ఆస్పత్రుల మారినట్లు తెలిపారు. ప్రస్తుతం అంతా బాగానే ఉందని చెప్పుకొచ్చారు. బహుశా నిద్ర లేకపోవడం వల్ల ఇలా వచ్చి ఉండొచ్చని అన్నారు. అసలు ఆల్కహాల్ తాగకుండా ఎలా ఫ్యాటీ లివర్ వస్తుంది?. దీనికి గుండెపోటుకి సంబంధం ఏంటీ..?నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే..?నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌ని NAFLD అని పిలుస్తారు. ఇది ఆల్కహాల్ తక్కువగా తాగే వ్యక్తులను ప్రభావితం చేసే కాలేయ సమస్య. NAFLDలో కాలేయంలో చాలా కొవ్వు పేరుకుపోతుంది. NAFLD తరచుగా లక్షణరహితంగా ఉంటుంది. అయితే ఇది నాన్-ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ (NASH), ఫైబ్రోసిస్, సిర్రోసిస్‌తో సహా మరింత తీవ్రమైన పరిస్థితులకు పురోగమిస్తుంది.ఇది గుండెపోటుకి దారితీస్తుందా..?"కాలేయ సమస్యలు గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. గుండెపోటు ముప్పు తీవ్రమవుతుంది. కొవ్వుల జీవక్రియ ప్రక్రియలో అవసరమైన ప్రోటీన్లను ఉత్పత్తి చేయడంలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది సమతుల్య హృదయనాళ వ్యవస్థను నిర్వహించడానికి చాలా అవసరం. ఇలాంటి పరిస్థితుల వల్ల నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ లేదా క్రానిక్ లివర్ డిసీజ్ లిపిడ్ మెటబాలిజానికి అంతరాయం కలిగిస్తుంది. ఫలితంగా కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు పెరిగేందుకు దారితీస్తుంది. ఈ లిపిడ్ అసమతుల్యత అథెరోస్ల్కెరోసిస్‌ను ప్రేరేపిస్తుంది. ధమనులు సంకోచిస్తాయి. తద్వారా గుండెకు రక్త ప్రసరణ తగ్గుతుంది."ని చెబుతున్నారు వైద్యలు. ఒత్తిడి, నిద్ర లేకపోవడం, ధూమపానం తదితరాలు జీవక్రియకు అంతరాయం కలిగించి ఫ్యాటీలివర్ బారినపడేలా చేస్తుంది. ఇది హృదయనాళ సమస్యలకు దారితీసి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందని వెల్లడించారు వైద్యులు.అలాగే గుండె సమస్యలు ఉన్న రోగులలో కాలేయ వ్యాధి అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాలేయానికి తగినంత రక్త ప్రసరణ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది. దీనిని కార్డియోజెనిక్ అంటారు. ఇస్కీమిక్ హెపటైటిస్, సిరల పీడనం కారణంగా దీర్ఘకాలిక గుండె వైఫల్య స్థితి ఏర్పడుతుంది. దీనిని కార్డియాక్ సిరోసిస్ అంటారు. కాబట్టి, కాలేయం, గుండె జబ్బుల మధ్య సహసంబంధం ఉంది నివారించడం ఎలా..చక్కెర, ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులతో కూడిన ప్రాసెస్ చేసిన ఆహాదాని దూరంగా ఉండాలి. పుష్కలంగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లను కలిగి ఉన్న సమతుల్య ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలిరెగ్యులర్ వ్యాయామం తోపాటు రోజులో కనీసం 30 నిమిషాలు శారీరక శ్రమతో కూడిన వర్కౌట్ గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.ఒత్తిడిని నిర్వహించడం, తగినంత నిద్ర పొందడం అత్యంత ముఖ్యంముఖ్యంగా ధూమపానానికి దూరంగా ఉండి హృదయ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.(చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద వంకాయ..గిన్నిస్ రికార్డు!) -
భార్య మరణం తట్టుకోలేక.. భర్త మృతి
గీసుకొండ: కలకాలం తనకు తోడుగా ఉంటానని పెళ్లిలో వేద మంత్రాల సాక్షిగా ప్రమాణం చేసిన భార్య అర్ధాంతరంగా తనువు చాలించింది. దీంతో ఆ బాధ తట్టుకోలేక భర్త మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మనుగొండలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తుప్పరి లలిత(49), కుమారస్వామి(56) దంపతులు జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ వెళ్లారు. ఈ క్రమంలో లలిత ఇటీవల బాత్ రూంలో కాలు జారి పడి తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూసింది. తన భార్య మృతి తట్టులోని కుమారస్వామి మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. ఈ దంపతుల మృతి మనుగొండలో విషాదం నింపింది. కాంగ్రెస్ నాయకుడు, సామాజిక సేవకుడు అల్లం బాలకిశోర్‌రెడ్డి రూ. 10 వేల ఆర్థిక సాయం పంపించగా కాంగ్రెస్ నాయకులు అల్లం మర్రెడ్డి, కొమ్ము శ్రీకాంత్, కూనమల్ల అనిల్, ఎంబాడి పరమేశ్వర్ తదితరులు మృతుల కుటుంబ సభ్యులకు అందించారు.వదిన మృతదేహాన్ని చూసి ఆడబిడ్డ..దుగ్గొండి: వదిన మృతదేహాన్ని చూసి గుండెపోటుతో ఆడబిడ్డ మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని గుడ్డేలుగులపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన తొర్రూరు అమృతమ్మ (72) సోమవారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందింది. ఈ మేరకు ఆత్మకూరు మండలం మహ్మద్‌గౌస్‌పల్లి గ్రామానికి చెందిన ఆమె ఆడబిడ్డ కూసం సరోజన (62) వదిన అంత్యక్రియల కోసం మంగళవారం గుడ్డేలుగులపల్లికి వచ్చింది. ఉదయం 11 గంటలకు సరోజన.. వదిన మృతదేహాన్ని చూసి ఐదు నిమిషాలపాటు బోరున విలపించింది. ఆ వెంటనే గుండెనొప్పితో ఆమె కుప్పకూలింది. ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందింది. కొన్ని గంటల వ్యవధిలోనే వదిన, ఆడబిడ్డ ఇద్దరు మృతి చెందడంతో గుడ్డేలుగులపల్లి, మహ్మద్‌గౌస్‌పల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
కోస్ట్ గార్డ్ డీజీ హఠాన్మరణం
సాక్షి, చెన్నై/న్యూఢిల్లీ: భారత తీర రక్షక దళం(ఐసీజీ) డైరెక్టర్ జనరల్ రాకేశ్ పాల్ హఠాన్మరణం చెందారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగిన ఐసీజీ కార్యక్రమంలో రాజ్‌నాథ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుండెపోటుకు గురైన రాకేశ్ పాల్‌ను వెంటనే చెన్నైలోని రాజీవ్ గాంధీ జనరల్ ఆస్పత్రికి తరలించారు. రాత్రి 7 గంటల సమయంలో ఆయన ఆస్పత్రిలో కన్నుమూశారని అధికార వర్గాలు తెలిపాయి. చెన్నైలోనే ఉన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఆస్పత్రికి వెళ్లి రాకేశ్ పాల్‌కు నివాళులర్పించారు. రాకేశ్ పాల్ పారి్థవ దేహాన్ని ప్రత్యేక ఏర్పాట్లతో చెన్నై నుంచి అర్ధరాత్రి వేళ ఢిల్లీకి తరలించారు. రాకేశ్ పాల్ గతేడాది జూలై 19వ తేదీన ఐసీజీ 25వ డీజీగా బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ నావల్ ఎకాడమీ విద్యార్థి అయిన రాకేశ్ పాల్ 1989లో ఐసీజీ (ఇండియన్ కోస్ట్ గార్డ్)లో చేరి 34 ఏళ్లపాటు వివిధ హోదాల్లో పనిచేశారు. -
చిట్టితల్లి చేతికి చితికుండ
మిరుదొడ్డి(దుబ్బాక): ఆరేళ్ల ప్రాయం.. లోకమేమిటో తెలియని చిన్నారి.. చితి కుండ పట్టుకుంది. తండ్రికి తలకొరివి పెట్టింది. వివరాలివి. మండల కేంద్రమైన మిరుదొడ్డికి చెందిన బోయిని నాగరాజు (28)గురువారం గుండె పోటుతో మృతి చెందాడు. అతనికి భార్య నవ్య, ఆరేళ్ల కూతురు శివాని ఉన్నారు. కొడుకుల్లేక పోవడంతో శుక్రవారం నిర్వహించిన అంత్యక్రియల్లో కూతురు శివాని తలకొరివి పెట్టింది. తండ్రి శవయాత్రలో చితికుండతో నడుస్తున్న ఆమెను చూసినవారు కంటతడి పెట్టారు. -
తల్లీ సాహితీ.. మాకు దిక్కెవరమ్మా..!
జ్యోతినగర్(రాముండం): ‘అమ్మా సాహితీ.. మమ్మల్ని విడిచి వెళ్లిపోయావా తల్లీ.. నీవు చక్కగా చదువుకుని భవిష్యత్‌లో ఎంతో ఎదగాలని ఆశించాం.. కానీ మమ్మల్ని ఇలా విడిచి వెళ్తావని అనుకోలేదమ్మా’ అని ఆ తల్లి లక్ష్మి రోదిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. ఎన్టీపీసీ ఆపరేషన్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్న మల్లెపల్లి రాజలింగు–లక్ష్మి దంపతులకు సాత్విక, సాహితి కుమార్తెలు ఉన్నారు. పర్మినెంట్ టౌన్షిప్లో నివాసం ఉంటున్నారు. పెద్దకుమార్తె సాత్విక డిగ్రీ చదువుతోంది. చిన్నకుమార్తె సాహితి(15) ఎన్టీపీసీ పీటీఎస్‌లోని సెయింట్ క్లేర్ హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. ఆదివారం సాయంత్రం ఉన్నట్టుండి సాహితి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు వెంటనే టౌన్‌షిప్‌లోని ధన్వంతరి ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌లోని ఆస్పత్రికి రెఫర్ చేశారు. అయితే, అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాహితి సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. ఆమె మృతికి సంతాప సూచకంగా హైస్కూల్‌కు సెలవు ప్రకటించారు.వైద్యులపై గుర్తింపు సంఘం గరం?సాహితి గుండెపోటుతో మృతి చెందడంతో వైద్య బృందంపై ఉద్యోగ గుర్తింపు సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్వస్థతకు గురైన విద్యార్థినిని ఆస్పత్రిలో చేర్పిస్తే సరైన వైద్యం అందించ లేదని ఆరోపించారు. ప్రథమ చికిత్స సైతం తూతూమంత్రంగా చేసి కరీంనగర్‌కు రెఫర్ చేశారని ధ్వజమెత్తారు. ప్రమాదకర పరిస్థితిలో ఉన్న విద్యార్థినికి చికిత్స అందించడంతో ఆస్పత్రి వర్గాలు విఫలమయ్యాయని విమర్శించారు. జాతీయ రంగ సంస్థ ఎన్టీపీసీ ఆస్పత్రిలో సరైన సమయంలో సరైన వైద్యం అందకపోవడం ఏమిటని ప్రశ్నించారు. గుండెపోటు వచ్చిన విద్యార్థినిని కరీంనగర్‌కు రెఫర్ చేయడంతో ఆమెకు సరైన సమయంలో చికిత్స అందకపోవడంతోనే మృతి చెందిందని ఆరోపించారు. వైద్యుల తీరుపై యాజమాన్యం విచారణ చేపట్టాలని వారు కోరారు. -
గుండెనొప్పంటే.. సర్జరీనే!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు అడ్డదారులు తొక్కుతున్నాయి. ఎవరైనా గుండె నొప్పంటూ దవాఖానాకు వెళ్తే.. వెంటనే ఆపరేషన్లు చేసేస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉంటే పర్వాలేదు. పేషెంట్ పరిస్థితి అదుపులోనే ఉండి, ఆపరేషన్ చేయడానికి లేదా స్టంట్ వేయడానికి తగినంత సమ యం ఉన్నా, ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని తెలిసినా పట్టించుకోవడంలేదు. అందరినీ ఎమర్జెన్సీ కింద లెక్కగట్టి, స్టంట్లు వేయడం, ఆ పరేషన్ చేస్తున్నారు. దీంతో ఉచితంగా ఆరో గ్యశ్రీ పథకం కింద అందా ల్సిన గుండె వైద్యం కాస్తా.. ఖరీదుగా మారింది. పేద, మధ్య తరగతి ప్రజలు అప్పుల చేసి మరీ బిల్లు కడుతున్నారు. గత జనవరి నుంచి జూలై వరకు ఉమ్మడి జిల్లాలో జరిగిన గుండె చికిత్సల(స్టంట్లు, ఆపరేషన్లు) సంఖ్య దాదాపు 2,100 అంటే దందా ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.కరోనా తర్వాత పెరిగిన సమస్యలు..కరోనా తర్వాత గుండె సంబంధిత సమస్యలు పెరిగిపోతున్నాయి. మనుషులు ఉన్నట్లుండి గుండెనొప్పితో కుప్పకూలుతున్నారు. బాధితుల్లో చాలామంది వెంటనే చనిపోతున్నారు. దీంతో గుండె సంబంధిత ఏ సమస్య తలెత్తినా ప్రతిఒక్కరూ వణికిపోతున్నారు. ఇదే అదనుగా కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. సాధారణంగా గుండె నరాల్లో బ్లాకులు ఏర్పడి, స్టంట్ వేయాల్సి రావడం లేదా బైపాస్ సర్జరీ తదితర సమస్యలతో పేషెంట్ ఆస్పత్రి గడప తొక్కితే.. ఎమర్జెన్సీ కేసుల కింద చూపి, వైద్యులు ఆపరేషన్ చేయాలంటున్నారు.ఆరోగ్యశ్రీ వచ్చే వరకు ఆగితే ప్రాణాలకే ముప్పంటూ ఆందోళనకు గురిచేస్తున్నారు. దీంతో బాధిత కుటుంబసభ్యులు అప్పులు చేసి మరీ శస్త్రచికిత్సలు చేయిస్తున్నారు. సాధారణంగా ఆరోగ్యశ్రీ కింద ఒక స్టంట్ వేసినప్పుడు సుమారు రూ.60 వేలు, రెండు వేయాల్సి వస్తే.. రూ.లక్ష వరకు ప్రభుత్వం చెల్లిస్తుంది. అదే ప్రైవేటు ఆస్పత్రివారే చేస్తే ఒక స్టంట్‌కు రూ.2 లక్షలు, రెండింటికి రూ.3 లక్షలు వసూలు చేస్తున్నారు. ఓపెన్‌హార్ట్ సర్జరీ వంటి వాటికి ఆరోగ్యశ్రీ కింద రూ.1,18,000 వరకు ప్రభుత్వం చెల్లిస్తుంది. కానీ, కొన్ని ఆస్పత్రులు రోగి కుటుంబసభ్యులను కంగారు పెట్టి, ఆపరేషన్ చేసి, రూ.3 లక్షలు మొదలుకొని.. నచ్చినట్లు బిల్లులు వేస్తున్నాయి.బాధితులు ఏం చేయాలి?ఇలాంటి కేసులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. సాధారణంగా ఆరోగ్యశ్రీ కింద పేద ప్రజలే గుండె జబ్బులకు చికిత్స పొందుతారు. అలాంటివారు తాము మోసపోయామని అనుమానం వస్తే.. వెంటనే సమీపంలోని ఆరోగ్య మిత్ర, ఆరోగ్యశ్రీ జిల్లా కో–ఆర్డినేటర్ లేదా ఆరోగ్యశ్రీ సీఈవోకు ఫిర్యాదు చేయవచ్చు. విచారణలో ఆస్పత్రిది తప్పిదమని తేలితే ఆపరేషన్ ఖర్చుకు 20 రెట్ల జరిమానా విధిస్తారు. అలాగే, హాస్పిటల్ లైసెన్స్ రద్దు చేస్తారు. పరిస్థితిని బట్టి ఆపరేషన్ చేసిన వైద్యుడి డిగ్రీ కూడా రద్దవుతుందని సీనియర్ డాక్టర్లు చెబుతున్నారు.ఇది అన్యాయంఅసవరం లేకున్నా స్టంట్స్ వేయడం, ఆపరేషన్ చేయడం వంటి ఫిర్యాదులు మా దృష్టికి వస్తున్నాయి. ఇది అన్యాయం. సాధారణంగా ఆరోగ్యశ్రీ కింద చికిత్స కోసం పేదవారే వస్తారు. అలాంటి వారిని తప్పుదోవ పట్టించడం సరికాదు. పరిస్థితి విషమంగా ఉన్నప్పుడు శస్త్రచికిత్స చేయడం సబబే. కానీ, అన్నింటినీ ఎమర్జెన్సీ కింద జమకట్టి, పేదలను అప్పులపాలు చేయడం ఏమాత్రం సమంజసం కాదు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి.– డాక్టర్ బీఎన్.రావు, ఐఎంఏ మాజీ అధ్యక్షుడుఅప్రూవల్ వచ్చేదాకా ఆగాలిహార్ట్స్ట్రోక్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ అయితే ప్రాణాలు కాపాడటమే ధ్యేయంగా చికిత్స అందించాలి. ఎమర్జెన్సీ కానప్పుడు ఆరోగ్యశ్రీ అప్రూవల్ వచ్చే వరకు ఆగాలి. ఆ పథకం పెట్టిందే నిరుపేదల కోసం. వైద్యులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పని చేయాలి. ప్రభుత్వ అధికారులు గుండెకు సంబంధించిన కేసులకు వీలైనంత త్వరగా అప్రూవల్ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలి.– డాక్టర్ రాంకిరణ్, ఐఎంఏ అధ్యక్షుడు, కరీంనగర్ -
బదిలీ, ఘన వీడ్కోలు.. అంతలోనే కన్నుమూత
రాయచూరు రూరల్: యాదగిరి నగర పోలీస్ స్టేషన్ ఎస్ఐ పరశురాం (29) శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన అభిమానులు ఆందోళన చేశారు. వివరాలు... యాదగిరి ఎస్ఐగా పనిచేస్తున్న పరశురాం ఇక్కడి నుంచి బదిలీ అయ్యారు. రాత్రి ఆయనకు అందరూ సన్మానించి ఘనంగా వీడ్కోలు పలికారు. ఇంటికి వెళ్లి నిద్రించిన ఆయన నిద్రలోనే చనిపోయారు. మరణంపై అనుమానాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎస్పీ సంగీత ఆయన మృతదేహాన్ని పరిశీలించారు.ఎమ్మెల్యేకు రూ. 30 లక్షలు ఇచ్చాం: భార్యపరశురాం భార్య శ్వేత మీడియాతో మాట్లాడారు. తన భర్త పరశురాం బదిలీ కోసం ఓ ఎమ్మెల్యేకు డబ్బులు ఇచ్చారని, ఏడు నెలల క్రితం రూ. 30 లక్షలు ఇస్తే యాదగిరి పోలీస్ స్టేషన్‌కు పోస్టింగ్ ఇచ్చారన్నారు. లోక్‌సభ ఎన్నికల తరువాత ఇతర ప్రాంతానికి బదిలీ చేశారు. ఎన్నికలు ముగిశాక తిరిగి యాదగిరి నగరానికి వచ్చి చేరారు. ప్రస్తుతం బదిలీల నేపథ్యంలో ఎమ్మెల్యే మరోమారు డబ్బులు డిమాండ్ చేశారని, ఏడు నెలల క్రితం చేసిన అప్పులకు వడ్డీ కట్టలేని స్థితిలో ఉన్నట్లు శ్వేత చెప్పారు. వీరికి రెండేళ్ల క్రితం వివాహం కాగా ఏడాది కొడుకు ఉన్నాడు. శ్వేత ప్రస్తుతం గర్భిణిగా ఉంది. ఇదిలా ఉంటే ఎస్ఐ మరణానికి కారకులపై చర్యలు తీసుకోవాలని ఆయన మద్దతుదారులు ఆందోళన చేశారు.మరణంపై విచారణ: హోంమంత్రిశివాజీనగర: యాదగిరి ఎస్ఐ పరశురాం మరణం కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి తనిఖీ చేపట్టాలని సూచించినట్లు హోం మంత్రి జీ.పరమేశ్వర్ తెలిపారు. బెంగళూరులో ఇంటి వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన, ఎస్ఐ సతీమణి శ్వేతా ఆరోపణలను పరిగణలోకి తీసుకుని విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఎస్ఐ బదిలీ గురించి స్థానిక ఎమ్మెల్యే ఒకరిపై ఆమె ఆరోపించారు. పరశురాం మరణం సహజమైనది. ఆత్మహత్య కాదు. ఎలాంటి డెత్ నోట్లు లభించలేదని అన్నారు. బదిలీ కావడంతో ఒత్తిడికి గురైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీనిని తోసిపుచ్చబోమన్నారు. కాగా, బీజేపీ– జేడీఎస్ పాదయాత్రకు షరతులను విధించడమైనది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగరాదు. ప్రజలకు ఇబ్బంది కారాదని హోంమంత్రి తెలిపారు. వారు కోర్టుకు వెళ్లేలోపు తామే పాదయాత్రకు అనుమతి ఇచ్చామని తెలిపారు. -
ఒలింపిక్స్ విలేజ్‌లో తీవ్ర విషాదం.. ఆ దేశ బాక్సింగ్ కోచ్ మృతి
ప్యారిస్ ఒలింపిక్స్ విలేజ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సమోవా బాక్సింగ్ కోచ్ లియోనల్ ఎలికా ఫతుపైటో(60)గుండెపోటుతో మరణించాడు. శుక్రవారం జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల అనంతరం లియోనల్ ఎలికా తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడినట్లు తెలుస్తోంది. అనంతరం ఆస్పత్రికి తరిలించి చికిత్స అందించినప్పటకి ఎలికా కన్నుమూశాడు. విషయాన్ని ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్(ఐబీఏ) శనివారం ధ్రువీకరించింది. అతడి మృతి పట్ల ఐబీఏ సంతాపం వ్యక్తం చేసింది."లియోనెల్ ఎలికా ఫతుపైటో మృతి మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తున్నాము. లియోనెల్ ఓపెనింగ్ సెర్మనీ తర్వాత తీవ్ర ఆస్వస్థత గురయ్యాడు. వైద్యులు ఆత్యవసర చికిత్స అందించినప్పటకి ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు. అతడిది సహజ మరణమే. ఈ విషయాన్ని స్ధానిక ప్రాసిక్యూటర్ కార్యాలయం సైతం ధ్రువీకరించింది. లియోనెల్ తన పట్టుదల, అంకిత భావంతో ఎంతో మంది బాక్సర్లకు ఆదర్శంగా నిలిచాడు" అని ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా బాక్సింగ్‌లో సమోవా నుంచి ఏకైక బాక్సర్ అటో ప్లోడ్జికి-ఫావో గాలీ హెవీ వెయిట్ కేటగిరీలో పోటీ పడుతున్నాడు. -
విషాదం: బస్సు డ్రైవర్‌కు గుండె పోటు.. 20 మంది పిల్లల్ని కాపాడి
తమిళనాడు పెను ప్రమాదం తప్పింది. ఓ వ్యాన్ డ్రైవర్ తను మరణిస్తూ.. 20 మంది పిల్లల ప్రాణాలను కాపాడాడు. డ్రైవర్ సాహాసాలను మెచ్చిన సీఎం స్టాలిన్ అతడి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. తిరూప్పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది..వివరాలు.. వెల్లకోయిల్లో బుధవారం సెమలయ్యప్పన్ అనే 49 ఏళ్ల బస్సు డ్రైవర్ ఓ ప్రైవేటు పాఠశాలకు నుంచి విద్యార్ధులను వాళ్ల ఇంటి వద్ద దింపడానికి బయల్దేరాడు. దారి మధ్యలో ఉన్నట్టుండి ఛాతిలో నొప్పి రాడంతో బస్సు డ్రైవర్ అతి కష్టం మీద వాహనాన్ని రోడ్డు పక్కన ఆపాడు. అతని భార్య కూడా అదే స్కూల్లో హెల్పర్‌గా పనిచేస్తుంది. ఈ ఘటన జరిగినప్పుడు ఆమె కూడా అందులోనే ఉంది.బస్సు రోడ్డు పక్కన ఆగిన కాసేపటికే అతడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే గమనించిన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే డ్రైవర్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే అతడు మరణించే ముందు సుమారు 20 మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడిన డ్రైవర్ వీరోచిత చర్యపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.మృత్యువు అంచున ఉన్న చిన్నారుల ప్రాణాలను కాపాడిన డ్రైవర్‌ను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ‘తన ప్రాణం ప్రమాదంలో ఉన్నప్పటికీ, అతను పాఠశాల విద్యార్థుల విలువైన ప్రాణాలను కాపాడాడు. అతని కర్తవ్య భావం, ఆత్మబలిదానాలకు మేము ఆయనకు నమస్కరిస్తున్నాము’. అని స్టాలిన్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా.. మృతుడు సెమలయ్యప్పన్ కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని సీఎం స్టాలిన్ ప్రకటించారు. డీఎంకే మంత్రి ఎంపీ సామినాథన్ మృతుల కుటుంబాలకు చెక్కును అందజేశారు. -
గుండెపోటుకు బై బై..వందేళ్లు హాయ్‌హాయ్!
సాక్షి, హైదరాబాద్: గుండెపోటు రాకుండా వందేళ్లు బతకాలనుకుంటున్నారా? హృద్రోగ సమస్యలను దూరం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీలాంటి వారికోసం సరికొత్త మందు మార్కెట్లోకి వచ్చింది. గుండెపోటు దరిచేరకుండా ఆ మందు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. దాని పేరే ఇన్‌క్లిసిరాన్.. అపోలో ఆస్పత్రి, నోవార్టిస్ సంయుక్తంగా ఓ మందును మార్కెట్లోకి తీసుకొచ్చాయి. ఈ మందుతో వందేళ్లు గుండెపోటు రాకుండా జీవించవచ్చని వైద్యులు చెబుతున్నారు.హార్ట్ ఎటాక్‌లు డబుల్.. గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య భారతదేశంలో భారీగా పెరుగుతోంది. హృద్రోగ సమస్యల కారణంగా ఏటా సంభవిస్తున్న మరణాల్లో 20 శాతం మంది పురుషులు గుండెపోటుతో మరణిస్తుండగా 17 శాతం మంది మహిళలు అదే సమస్యతో చనిపోతున్నారు. గత 30 ఏళ్లలో గుండె సంబంధిత వ్యాధులతో సంభవిస్తున్న మరణాల సంఖ్య దాదాపు రెట్టింపు అయింది. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత్‌లో పదేళ్ల ముందే గుండె సంబంధ సమస్యలు ఎదురవుతున్నాయి. యుక్తవయసులోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఇటీవల మరింతగా పెరి గింది. గుండెపోటుకు ఎన్నో కారణాలున్నా ప్రధానంగా తక్కువ సాంద్రతగల కొవ్వుల (ఎల్డీఎల్) కారణంగా ఎక్కువగా హార్ట్ఎటాక్స్ వస్తున్నాయి.అసలేంటీ మందు..? ఇన్‌క్లిసిరాన్ అనే మందు శరీరంలోని కొలెస్టరాల్ స్థాయిలను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. సాధారణంగా కొలెస్టరాల్ స్థాయిలను తగ్గించేందుకు స్టాటిన్స్ అనే రకం మందులు ఎన్నో ఏళ్లుగా అందుబాటులో ఉన్నా ఇన్‌క్లిసిరాన్ మాత్రం వాటికన్నా ఎన్నో రెట్లు ప్రభావవంతగా పనిచేస్తుందని అంటున్నారు. ఇంజెక్షన్ రూపంలో ఉండే ఈ మందును ఇన్సులిన్ మాదిరిగా వేసుకోవచ్చు. ఈ ఇంజెక్షన్‌ను ఆరు నెలలకోసారి తీసుకుంటే గుండెపోటు దరిచేరదని పేర్కొంటున్నారు.ఎలా పనిచేస్తుంది? సాధారణంగా ఇన్‌క్లిసిరాన్ (సింథటిక్ ఎస్ఐ ఆర్ఎన్ఏ) కొవ్వులు తయారయ్యే ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. ప్లాస్మాలోని తక్కువ సాంద్రతగల కొవ్వుల (ఎల్డీఎల్)ను నియంత్రించే సెరిన్ ప్రోటీన్ అయిన ప్రోప్రోటీన్ కన్వర్టేజ్ సబి్టలిసిన్ కెక్సిన్–9 (పీసీఎస్‌కే9)కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. పీసీఎస్‌కే9 మెసెంజర్ ఆర్ఎన్ఏకు ఇది అతుక్కొని పీసీఎస్‌కే9 ప్రోటీన్ తయారుకాకుండా అడ్డుకుంటుంది. దీంతో ప్లాస్మాలో ఎల్డీఎల్ గణనీయంగా తగ్గి రక్తంలోని ఎల్‌డీఎల్‌ను కాలేయం గ్రహించేలా చేస్తుంది. తద్వారా హృద్రోగ సమస్యలు రాకుండా కాపాడుతుంది. 200 వరకు ఉన్న స్థాయి కూడా 40 వరకు తగ్గేంత ప్రభావవంతంగా ఈ మందు పనిచేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.ఈ మందు తీసుకున్నా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యకమైన జీవన విధానాన్ని పాటించాలి. ఆల్కహాల్, సిగరెట్ వంటి అలవాట్లకు దూరంగా ఉంటే మందు మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే ట్రై–గ్లిజరైడ్స్ ఉన్న వారిపై ఈ మందు అంతగా ప్రభావం చూపదు. – శ్రీనివాస్ కుమార్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్ఎవరెవరు వాడొచ్చు?సాధారణంగా హృద్రోగ సమస్యలు అన్ని వయసుల వారికి వస్తున్నాయి. కుటుంబంలో ఎవరికైనా హృద్రోగ సమస్యలు ఉన్న చరిత్ర ఉంటే వారందరూ తక్కువ వయసులోనే ఈ మందు తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. చిన్న వయసులోనే అధిక కొలెస్టరాల్‌తో బాధపడుతున్న వారు, 40 ఏళ్లు దాటిన వారు ఈ మందును తీసుకుంటే హార్ట్ఎటాక్ రాకుండా చూసుకోవచ్చని పేర్కొంటున్నారు. గుండెలో స్టెంట్ వేయించుకున్న వారు కూడా ఈ ఇంజెక్షన్ తీసుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు.అనుమతులు వచ్చాయా? ఇప్పటికే ఈ మందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్ అనుమతులు మంజూరు చేయగా భారత్‌లో 6 నెలల కిందటే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కార్యాలయం అనుమతులు ఇచి్చంది. దీంతో తాజాగా ఈ మందును మార్కెట్లోకి తీసుకొచ్చారు. నేటి నుంచి హృద్రోగసమస్యలపై కాన్ఫరెన్స్ గుండె సమస్యలపై అవగాహన కోసం ఈ నెల 26 నుంచి 28 వరకు హైదరాబాద్‌లో ప్రీమియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ కాన్ఫరెన్స్ జరగనుంది. అపోలో హాస్పిటల్స్, అమెరికాలోని కార్డియోవ్యాస్కులర్ రీసెర్చ్ ఫౌండేషన్‌తో కలిసి ఫ్యాక్ట్స్ ఫౌండేషన్ ఈ సదస్సును నిర్వహించనుంది. గురువారం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. గుండె విఫలమైనప్పుడు ఉపయోగపడే కొత్త పరికరాల పాత్రపై చర్చించనున్నారు. ఈ సదస్సుకు దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్టులు హాజరుకానున్నారు. -
గుండెపోటుతో అయోధ్య ఎస్ఐ కన్నుమూత
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో విధులు నిర్వహిస్తున్న సబ్ఇన్స్పెక్టర్ గుండెపోటుతో కన్నుమూశారు. సబ్-ఇన్స్పెక్టర్ సురేంద్ర నాథ్ త్రివేది(59) పోలీసు పోస్ట్ నయాఘాట్ వద్ద కొందరితో మాట్లాడుతూ గుండెపోటుకు గురయ్యారు.వెంటనే అతనిని శ్రీరామ్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సురేంద్ర నాథ్ త్రివేది హర్దోయ్ జిల్లా నివాసి. సురేంద్ర నాథ్ 2023, డిసెంబరు 16న అయోధ్య పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన 1983లో పోలీసు శాఖలో చేరారు. -
Video: జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకూలిన యువకుడు
గత కొన్నేళ్లుగా యువతలో గుండెపోటు కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వృద్ధాప్యంలో ఎదురయ్యే సమస్యలు నేడు యువకులను పీడిస్తున్నాయి. ముఖ్యంగా డ్యాన్స్ చేసేటప్పుడు, జిమ్‌లో గుండెపోటుకు గురవడం పెరుగుతోంది. ప్రస్తుత జీవన విధానంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరిగిపోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ఆకస్మిక గుండెపోటు ఒక రకమైన సైలెంట్ హార్ట్ ఎటాక్ అని వైద్యులు చెబుతున్నారు.తాజాగా మహారాష్ట్రలో ఓ వ్యక్తి జిమ్ చేస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. జిమ్‌లోని సీసీటీవీ ఫుటేజీలో ఈ ఘటన రికార్డు అయింది. ఇందులో కన్వల్జిత్ సింగ్ బగ్గా అనే వ్యక్తి ఇతరులతో కలిసి కొన్ని వ్యాయామాలు చేస్తున్నాడు. అయితే అలా చేస్తూ కన్వల్ జిత్ కాస్త అసౌకర్యానికి గురయ్యాడు.మిగిలిన వాళ్లు వ్యాయామాన్ని కొనసాగిస్తూ ఉండగా.. అతడుగా నిదానంగా పక్కకు ఒరుగుతూ కనిపించాడు.క్షణాల్లోనే బగ్గా ఓ పిల్లర్‌కు ఆనుకొని అక్కడే కుప్పకూలిపోయాడు. కిందపడిపోవడం చూసిన అక్కడున్నవారు అతడి వద్దకు పరిగెత్తుకుని వెళ్లారు. అతనికి ఏమైందో జరిగిందో తెలియక వాళ్లంతా అటూ ఇటు పరిగెత్తడం వీడియోలో రికార్డు అయింది. అయితే బాధితుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఛత్రపతి సంభాజీనగర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.Another death due to heart attack⚠️Businessman Kawaljeet Singh collapses after suffering a fatal heart attack while working out at a gym in Maharashtra's Chhatrapati Sambhajinagar. pic.twitter.com/LXMne0qElz— Sneha Mordani (@snehamordani) July 22, 2024 -
సైలెంట్ కిల్లర్‌పై హై అలెర్ట్
ఏటా మే నెల 17వ తేదీన ప్రపంచ హైపర్‌టెన్షన్ డే నిర్వహిస్తారు. 2005వ సంవత్సరంలో ఇది ప్రారంభం అయింది. మనకు తెలియకుండానే మన మనసును కుంగదీసే ఈ అధిక ఒత్తిడి, దాని ద్వారా వచ్చే అధిక రక్తపోటు గురించి అవగాహన కల్పించి దానిని తరిమికొట్టడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం. కాగా ‘మీ రక్తపోటును ఖచ్చితంగా కొలవండి, నియంత్రిం చండి, ఎక్కువ కాలం జీవించండి’ అనే నినాదంతో ఈ ఏడాది హైపర్ టెన్షన్ డేను నిర్వహిస్తున్నారు. సాక్షి, అమరావతి: అత్యధికశాతం గుండెపోటు మరణాలకు, మెదడు, పక్షవాతం, కిడ్నీ సంబంధిత వ్యాధులకు కారణమవుతున్న రక్తపోటును (హైపర్‌టెన్షన్) సైలెంట్ కిల్లర్‌గానూ పిలుస్తుంటారు. జీవనశైలికి సంబంధించిన ఈ సమస్య ఒకప్పుడు మధ్యవయస్సు వారు, వృద్ధుల్లో అధికంగా ఉండేది. జంక్‌ఫుడ్, శ్రమ లేని జీవనశైలి, తగినంత వ్యాయామం లేకపోవడం, ఊబకాయం, ధూమపానం, ఒత్తిడి వెరసి యువత, పిల్లలు సైతం ప్రస్తుతం ఈ సమస్య బారినపడుతున్నారు. చాపకింద నీరులా శరీరానికి ముప్పు తెచ్చిపెడుతున్న హైపర్‌టెన్షన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 27.15 శాతం మంది రాష్ట్రంలో 1.96 కోట్ల మంది 30 ఏళ్లు పైబడిన జనాభా ఉంది. కాగా, వీరిలో 27.15 శాతం 53.39 లక్షల మంది హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నట్లు జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే–5లో అంచనా వేశారు. కాగా, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ సర్వేలో భాగంగా రాష్ట్రంలోని 30 ఏళ్లు పైబడిన వారందరినీ స్క్రీనింగ్ చేసిన వైద్య శాఖ ఇప్పటి వరకు 23.50 లక్షల మందిలో సమస్యను గుర్తించింది. వీరందరికీ ఫ్యామిలీ డాక్టర్, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ వ్యవస్థల ద్వారా క్రమం తప్పకుండా వైద్య పరీక్షల నిర్వహణ, ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. కళ్ల నుంచి కాళ్ల వరకూ.. పైకి ఎలాంటి లక్షణాలు లేకుండానే లోలోపల తీవ్ర అనర్థాలకు హైపర్‌టెన్షన్ దారితీస్తుంది. కళ్ల నుంచి కాళ్ల వరకు అన్ని అవయవాలను దెబ్బతీస్తుంది. అధిక రక్తపోటు మూలంగా కళ్లలోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతిని కంటి చూపు మందగిస్తుంది. గుండె మరింత బలంగా పనిచేయాల్సి రావడంతో గుండె పరిమాణంలో మార్పులు రావచ్చని వైద్యులు చెబుతున్నారు. దీంతో శరీరానికి తగినంత రక్తం సరఫరా అవ్వక గుండె వైఫల్యంకు దారి తీస్తుంది. మెదడులోని రక్తనాళాలు దెబ్బతినడం, బలహీనపడడం, రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి పక్షవాతం వంటి ఘటనలు సంభవిస్తాయి. మూత్రపిండాల చుట్టూ ఉండే రక్తనాళాలు దెబ్బతినడంతో రక్తాన్ని వడపోసే ప్రక్రియ అస్తవ్యస్తమై, చివరికిది కిడ్నీ వైఫల్యానికి దారితీస్తుంది. బీపీ బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు » ఆహారంలో ఉప్పును తగ్గించాలి. నిల్వ పచ్చళ్లు ఎక్కువగా తినకూడదు. పెరుగు, మజ్జిగలో ఉప్పు కలుపుకోవడం మానేయాలి. » శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. ఒక కిలో బరువు తగ్గినా ఒక ఎంఎంహెచ్‌జీ రక్తపోటు తగ్గుతుంది. » రోజు అరగంట చొప్పున శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, ఇతర వ్యాయామం చేస్తుండాలి. » ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లు పూర్తిగా విడనాడాలి. పొగతాగడంతో రక్తనాళాలు గట్టిపడే ప్రక్రియ ఎక్కువ అవుతుంది. అదే విధంగా మద్యపానం చేసేవారు 60 ఎంఎల్ కన్నా మించకుండా చూసుకోవాలి. ఒత్తిడే ప్రధాన కారణం బీపీ రెండు రకాలుగా వస్తుంది. ఒకటి వయోభారం రీత్యా, రెండోది షుగర్, థైరాయిడ్, కిడ్నీ సమస్యల కారణంగా వస్తుంది. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల్లో, యువతి, యువకుల్లోను బీపీ కేసులు నమోదు అవుతున్నాయి. ఇంటర్, ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ చదివే పిల్లల్లోను ఎక్కువగా బీపీ మేం గమనిస్తున్నాం. ఇందుకు ప్రధాన కారణం ఒత్తిడి. అదే విధంగా పిజ్జా, బర్గర్, ఇతర ఫాస్ట్ ఫుడ్స్‌ను పిల్లలు, యువత ఎక్కువగా తీసుకోవడం. వీటిల్లో ఉప్పు ఎక్కువగా ఉంటోంది. ఎప్పటికప్పుడు అందరూ బీపీ చెక్ చేయించుకోవాలి. – డాక్టర్ కె.సుధాకర్, ప్రిన్సిపాల్ సిద్ధార్థ వైద్య కళాశాల, విజయవాడ ఏటా చెకప్ చేయించుకోవాలి ఎటువంటి లక్షణాలు లేకున్నా బీపీ వస్తోంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరు ఏటా రక్తపోటు చెకప్ చేయించుకోవాలి. చాపకింద నీరులా విస్తరిస్తూ ఆరోగ్యానికి తీవ్ర నష్టం చేకూరుస్తోంది. అదే విధంగా ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్ చేయించుకోవాలి. కొలెస్ట్రాల్ లెవల్ టెస్ట్ చేసుకోవాలి. కొలె్రస్టాల్ గుండెపోటుకు దారితీస్తుంది. మరోవైపు ఒత్తిడిని నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా కంటి నిండా నిద్రపోవాలి. – కె.కళ్యాణ చక్రవర్తి, జనరల్ ఫిజిషియన్, గుంటూరు -
‘రియల్’ వేధింపులు.. రైతు అదృశ్యం.. ఆగిన తండ్రి గుండె
దుండిగల్: రియల్ ఎస్టేట్ వ్యాపారుల వేధింపులకు తాళలేక ఓ రైతు అదృశ్యమయ్యాడు. బెంగపెట్టుకున్న అతడి తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేట గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. బౌరంపేటకు చెందిన వంపుగూడెం కృష్ణారెడ్డి(72), సముద్రమ్మ భార్యాభర్తలు. వీరికి మాధవరెడ్డి, జైపాల్‌రెడ్డి సంతానం. ఈ కుటుంబానికి డి.పోచంపల్లిలోని సర్వే నెంబరు 188లో 1.13 ఎకరాల స్థలం ఉంది. దీనిని మాధవరెడ్డి సాగుచేస్తున్నాడు. వీరి స్థలం పక్కనే త్రిపుర ల్యాండ్‌మార్క్ సంస్థ ఇతర రైతుల నుంచి స్థలాలను కొనుగోలు చేసి వెంచర్‌ను నిరి్మస్తోంది.మాధవరెడ్డితోపాటు మరో రైతు సురేందర్‌రెడ్డికి చెందిన భూములను సైతం తమకు విక్రయించాలని వెంచర్ నిర్వాహకులు పట్టుబట్టడంతో వారు అంగీకరించలేదు. ఈ క్రమంలో మే నెలలో› ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. రైతులు, సంస్థ సిబ్బంది ఇచి్చన ఫిర్యాదుల మేరకు పరస్పర కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో ఈ నెల 8వ తేదీన రాత్రి మాధవరెడ్డి దుండిగల్ సీఐ శంకరయ్య పేరిట లెటర్ రాసి పెట్టి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఇంటి నుంచి కుమారుడు వెళ్లిపోవడంతో ఆవేదన చెందిన కృష్ణారెడ్డి బుధవారం గుండెపోటుతో మృతి చెందాడు. లెటర్లో ఏముందంటే..‘త్రిపుర ల్యాండ్‌మార్క్ ఎండీ పసుపులేటి సుధాకర్, కార్పొరేటర్ మేకల వెంకటేశం, వంపుగూడెం సభ్యులను తీసుకువచ్చి నన్ను మానసికంగా వేధిస్తున్నారు. ఈ రోజు అందరు నన్ను అట్టి భూమి గురించి మళ్లీ పిలిపించుకుని బూతులు తిట్టారు. నేను మనస్తాపానికి గురై వెళ్లిపోతున్నాను. సార్.. నా పిల్లల్ని కాపాడండి.. పిల్లలు, అమ్మా నాన్న, భార్య నన్ను క్షమించండి’అంటూ సీఐ శంకరయ్యకు లేఖ రాశాడు. జైలుకు పంపారు..దాడి చేయడమే కాకుండా తమపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేసి 14 రోజులు జైలుకు పంపారని, వారికి మాత్రం పోలీసులు స్టేషన్లోనే బెయిల్ ఇచ్చి పంపించేశారని బాధిత కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థ ఎండీ పసుపులేటి సుధాకర్, కార్పొరేటర్ మేకల వెంకటేశంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయంపై దుండిగల్ సీఐ శంకరయ్యను ‘సాక్షి’వివరణ కోరగా రైతులు ఇచి్చన ఫిర్యాదుల ఆధారంగా 5, త్రిపుర ల్యాండ్ మార్క్‌సంస్థ సభ్యులు ఇచి్చన ఫిర్యాదుల ఆధారంగా 3 కేసులు నమోదు చేశామని, ఇద్దరు రైతులతోపాటు సంస్థకు చెందిన నలుగురిని రిమాండ్‌కు తరలించామన్నారు. త్రిపుర ల్యాండ్ మార్క్‌సంస్థ ఎండీ సుధాకర్ పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. -
గుండెపోటుకు తేనెతో చెక్!
గుండెపోటును నివారించుకునేందుకు ఒక తియ్యటి దారి ఉంది. అదేమంటే రకరకాల తీపి పదార్థాల్లో తీపినిచ్చే పదార్థాలు రకరకాలుగా ఉంటాయి. ఉదాహరణకు పిండి పదార్థాలైన బియ్యం, గోధుమలలో మాల్టోజ్, పండ్లలో ఫ్రక్టోజ్, చెరుకులో సుక్రోజ్, గ్లూకోజ్ ఇలా. అలాగే తేనెలో తీపినిచ్చే మరికొన్ని పదార్థాలతోపాటు ‘టెహ్రలోజ్’ కూడా ఉంటుంది. ఇదే స్వీటెనర్ కొన్ని పుట్టగొడుగులు, ఈస్ట్, సోయాబీన్స్‌లో కూడా ఉంటుంది. తేనెలోని టెహ్రలోజ్ను ఇంజెక్ట్ చేసిన ఎలుకల రక్తనాళాల్లో ప్లాక్’ చేరక పోగా గతంలో చేరిన ప్లాక్‌లో దాదాపు 30 శాతం తగ్గుదల కనిపించింది. ఈప్లాక్ వల్లనే రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడి అది గుండెపోటుకు దారితీస్తుందన్న విషయం తెలిసిందే. రక్తనాళాల్లోని ప్లాక్‌ను శుభ్రం చేసే పని చేసే ఇమ్యూన్ కణాల పుట్టుకకు టీఎఫ్‌ఈబీ అనే ఒక రకమైన ్రపోటీన్ ఉత్పాదనకు టెహ్రలోజ్ తోడ్పడుతుంది. అలా గుండెపోటును నివారించ వచ్చని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు భావిస్తూ ఆ మేరకు పరిశోధనలు చేస్తున్నారు. -
పోలీస్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో కుప్పకూలి.. యువకుడు మృతి
ముంబై: మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. పుణెలో జరిగిన పోలీసు రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో కుప్పకూలి ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. మృతుడిని 27 ఏళ్ల తుషార్ బాబన్గా గుర్తించారు.శివాజీనగర్ ఏరియాలోని పోలీస్ గ్రౌండ్లో శనివారం పోలీస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ జరిగింది. ఫిజికల్ టెస్ట్‌లలో భాగమైన పరుగు పందెంలో పరుగెత్తుతూ అహ్మద్ నగర్‌లోని సంగమ్‌నేర్‌కు చెందిన తుషార్ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడువెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. ప్రాథమిక విచారణలో యువకుడికి గుండెపోటు వచ్చినట్లు తేలిందని, దీనిపై తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు పేర్కొన్నారు. -
గుండెపోటుతో బ్యాంక్‌లోనే కుప్పకూలిన ఉద్యోగి.. సీసీటీవీ దృశ్యాలు వైరల్
ఇటీవల గుండెపోటు మరణాలు ఎక్కువవుతున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు సడెన్ హార్ట్ ఎటాక్‌లు ఆందోళన కలిగిస్తున్నాయి. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి గుండెపోటుతో ప్రాణాలు విడుస్తున్నారు. ఈ మరణాలు యువతలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా మరో 30 ఏళ్ల యువకుడు ఆకస్మిక గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో వెలుగుచూసింది.మహోబాలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో 30 ఏళ్ల అగి జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ తన ల్యాప్ టాప్‌లో పనిచేస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా తన కుర్చీపై కుప్పకూలిపోయాడు. పక్కన కూర్చున్న అతని సహచరులు ఇతరులను అప్రమత్తం చేసి, అతన్ని అతని డెస్క్ నుండి బహిరంగ ప్రదేశంలోకి మార్చారు. వారు అతని ముఖం మీద నీరు చల్లి, మేల్కొలిపే ప్రయత్నం చేశారు. యువకుడికి సీపీఆర్ ఇచ్చేందుకు సైతం యత్నించారు. కానీ ఫలితం లేకపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే యువకుడు బ్యాంక్‌లో కుప్పకూలిన వీడియో అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.खौफनाक...लैपटॉप पर काम करते करते कुर्सी पर ही HDFC Bank मैनेजर की मौत हो गई।38 साल उम्र थी। कुछ सेकंड पहले तक कीबोर्ड पर हाथ चला रहे थे। अगले पल कुर्सी पर ही जान निकल गई।यूपी के महोबा ब्रांच में थे।#mahoba#covidvaccines #covid #heartattack #hdfc #uttarpradesh pic.twitter.com/xXuw9Ndhnu— Sunil Yadav B+ (@sunilyadav21) June 26, 2024 -
బెంగళూరులో.. ఏరోనాటికల్ ఇంజనీర్ విషాదం!
ఖమ్మం: మండలంలోని పిండిప్రోలు గ్రామానికి చెందిన ఊడుగుల కృష్ణమూర్తి(44) బెంగళూరులోని హిందుస్తాన్ ఎరోనాటికల్ లిమిటెడ్ కంపెనీలో డిప్యూటీ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తుండగా గుండెపోటుతో మృతి చెందారు. పిండిప్రోలుకు చెందిన ఊడుగుల వెంకయ్య – మాణిక్యమ్మ మూడో కుమారుడు కృష్ణమూర్తి ఇరవై ఏళ్ల క్రితం బెంగళూరులోని హెచ్ఏఎల్లో ఇంజనీర్‌గా చేరి డిప్యూటీ మేనేజర్ స్థాయికి ఎదిగాడు.ఇటీవలే సొంత గ్రామంలో జరిగిన గ్రామ దేవత వేడుకకు కూడా హాజరయ్యాడు. ఈనెల 22న బెంగళూరులోని నివాసంలో బాత్రూమ్కు వెళ్లిన ఆయన అక్కడే గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందినట్లు తెలిసింది. ఆ సమయాన భార్య శిరీష, పిల్లలు ఖమ్మంలో ఉండడంతో కృష్ణమూర్తి మృతి విషయం రెండు రోజుల తర్వాత స్నేహితుల ద్వారా వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయన బంధువులు మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు బెంగళూరు వెళ్లారు. కాగా, కృష్ణమూర్తి విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.గంటల వ్యవధిలోనే తల్లీ కుమారుడు...ముదిగొండ: గడ్డిమందు సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన రఘునాధపాలెం మండలం చిమ్మపూడికి చెందిన కణతల శేషగిరి(36) ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అర్థరాత్రి మృతిచెందాడు. కుటుంబ, ఆర్థిక స మస్యల కారణంగా చిమ్మపూడికి చెందిన తల్లీ,కుమారుడు కణతాల నర్సమ్మ(55), శేషగిరి(36) ముదిగొండ మండలం సువర్ణాపురం శివారులో ఈనెల 23న గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం విదితమే.వీరిని ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా, సోమవారం ఉదయం నర్సమ్మ మృతి చెందింది. అలాగే, ఆమె కుమారుడు శేషగిరి అర్థరాత్రి దాటాక మృతి చెందగా, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ముదిగొండ ఎస్ఐ గజ్జెల నరేష్ తెలిపారు. కాగా, గంటల వ్యవధిలోనే తల్లీకుమారుడు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. -
తండ్రి మరణాన్ని తట్టుకోలేక..
శాలిగౌరారం: కన్న తండ్రి మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో కొడుకు మృతిచెందిన ఘటన శాలిగౌరారం మండలంలోని మనిమద్దె గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. వివరాలు.. మనిమద్దె గ్రామానికి చెందిన అంతటి శంకరయ్య(72)కు భార్య, వివాహితులైన ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు శ్రీను అనారోగ్యం బారిన పడి ఆరేళ్ల క్రితం మృతిచెందాడు. చిన్న కుమారుడు రాంబాబు(34) భార్యాపిల్లలతో కలిసి హైదరాబాద్‌లో ఉంటూ అక్కడే ఎలక్ట్రికల్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శంకరయ్య, అతడి భార్య మనిమద్దె గ్రామంలోనే ఉంటున్నారు. శంకరయ్య అనారోగ్యంతో మూడు నెలలుగా మంచం పట్టి ఆదివారం మృతిచెందాడు. తండ్రి మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న రాంబాబు హైదరాబాద్ నుంచి కుటుంబంతో కలిసి స్వగ్రామానికి వచ్చాడు. తండ్రి మృతదేహాన్ని చూసినప్పటి నుండి శంకరయ్య తీవ్ర మనోవేదనతో రోదిస్తూ ఉన్నాడు. బంధువులు, ఎంత నచ్చజెప్పినా దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. సోమవారం మధ్యాహ్నం గ్రామంలో తండ్రి శంకరయ్య అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియల అనంతరం ఇంటికి వచ్చిన రాంబాబు తండ్రి మరణాన్ని తట్టుకోలేక సాయంత్రం గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు వెంటనే రాంబాబును నార్కట్‌పల్లిలోని కామినేని హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ రాంబాబును పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. అదే రోజు రాత్రి రాంబాబు మృతదేహాన్ని మనిమద్దెకు తీసుకురాగా మంగళవారం గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. రాంబాబుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక్కరోజు వ్యవధిలో తండ్రీకొడుకు మృతిచెందడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. చిన్నపాటి పెంకుటిల్లు తప్ప ఎలాంటి స్థిరాస్తులు లేని ఆ కుటుంబంలో పెద్దదిక్కుగా ఉన్న తండ్రి, ఇద్దరు కుమారులు దూరం కావడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. -
రామోజీ కన్నుమూత
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రముఖ వ్యాపారవేత్త, రామోజీ గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (88) కన్నుమూశారు. ఈ నెల 5న గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురైన రామోజీని కుటుంబ సభ్యులు నానక్‌రాంగూడలోని స్టార్ ఆస్పత్రికి తరలించారు. గుండె పనితీరు దెబ్బతిన్నదని, బీపీ పడిపోయిందని గుర్తించిన వైద్యులు.. ఆయనకు వెంటిలేటర్ అమర్చారు. యాంజియోగ్రామ్ చేసి గుండె నాళాల్లో స్టంట్ వేశారు. అయినా ఆయన కోలుకోలేదు.శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆరోగ్యం మరింతగా క్షీణించి.. శనివారం తెల్లవారుజామున 4.51గంట లకు తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రి నుంచి ఆయన భౌతిక కాయాన్ని ఉదయం 7.45 గంటలకు రామోజీ ఫిలింసిటీకి తెచ్చారు. రామోజీ మరణ వార్త తెలిసి రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. ఫిలింసిటీలో రామోజీ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అరి్పంచారు. రామోజీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ఆదివారం ఉదయం 10 గంటలకు ఫిలింసిటీలోని నాగన్‌పల్లి–అనాజ్‌పూర్ గ్రామాల మధ్యలో ప్రత్యేకంగా నిర్మించిన స్మృతివనంలో రామోజీరావు భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాల కోసం ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో ఫోన్లో మాట్లాడి ఈ మేరకు సూచనలు చేశారు. దీంతో ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, రాచకొండ పోలీస్ కమిషనర్లను సీఎస్ ఆదేశించారు. బతికుండగానే రామోజీ స్మృతివనం ఇబ్రహీంపట్నం రూరల్: రామోజీరావు తాను బతికి ఉండగానే ఇబ్రహీంపట్నం మండలం నాగన్‌పల్లి–అనాజ్‌పూర్ మధ్యలో ప్రత్యేక స్మృతి వనాన్ని నిర్మించుకున్నారు. ఇప్పుడు ఆయన అంత్యక్రియలను ఈ స్మృతివనంలోనే నిర్వహించనున్నారు. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్‌రెడ్డి శనివారం స్మృతి వనాన్ని పరిశీలించి.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించేందుకు ఏర్పాట్లు చేయించారు. -
ఆటలో సిక్స్... జీవితంలో ఔట్!
ఇటీవల గుండెపోటు మరణాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారిన ఆకస్మిక గుండెపోటు మరణాలు వెంటాడుతున్నాయి. ఐదేళ్ల పిల్లల నుంచి అరవై ఏళ్ల ముసలి వరకు హఠాత్తుగా ప్రాణాలు కోల్పోతున్నారు. కళ్ల ముందు హుషారుగా ఉన్న వారు క్షణాల్లో విగత జీవులుగా మారుతున్నారు. జిమ్‌లో కసరత్తులు చేస్తూ, క్రికెట్ ఆడుతూ, డ్యాన్స్ చేస్తూ.. అంతెందుకు రోడ్డుపై నడుస్తున్న వారు ఆకస్మాత్తుగా కుప్పకూలి అందరికి దూరమవుతున్నారు.తాజాగా ఓ యువకుడు క్రికెట్ ఆడుతూ ఉన్నట్టుండి కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. మహారాష్ట్ర థానెలోని మీరా రోడ్డులో ఆదివారం ఈ ఘటన జరిగింది. గ్రౌండ్లో రెండు టీమ్‌లు క్రికెట్ ఆడుతుండగా.. పింక్ జెర్సీ ధరించి బ్యాటింగ్ చేస్తున్న యువకుడు బంతిని గట్టిగా సిక్స్ కొట్టాడు. బాల్ అమాంతం ఎగిరి పార్క్ గ్రౌండ్ బయట పడింది. ఇంతలో ఏమైందో ఏమో వెంటనే ఉన్నచోటే బ్యాటర్ కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి క్రీడాకారులు అతన్ని బతికించేందుకు ప్రయత్నించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు. యువకుడు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడిని రామ్ గణేష్ తేవార్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువకుడి మరణానికి ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే యువకుడు కుప్పకూలడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.#DisturbingVisuals : On camera, man dies immediately after hitting six in match near mumbai. In a shocking incident in Thane's Mira Road area in Maharashtra, a man died while playing cricket. #shocking#Thane #HeartAttack #Cricket #heartattack pic.twitter.com/882Zi9QwcS— Indian Observer (@ag_Journalist) June 3, 2024 -
మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి కన్నుమూత
కైకలూరు: మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి (74) సోమవారం కన్నుమూశారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఆమె సోమవారం గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. ఏలూరు జిల్లా కలిదిండి మండలం కొండూరు ఆమె స్వగ్రామం. ముదినేపల్లి నియోజకవర్గం నుంచి 1983లో టీడీపీ తరఫున పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ఉద్దండుడిగా పేరొందిన పిన్నమనేని కోటేశ్వరరావుపై పోటీ చేసి ఓటమి చెందారు. తిరిగి ముదినేపల్లి నుంచి 1985లో కోనేరు రంగారావుపై విజయం సాధించారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 19 89లో ప్రాథమిక, ఉన్నత, సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా ఆమెకు అవకాశం కల్పించారు.ఆ సమయంలో పరీక్ష పేపర్ లీక్ అంశం వివాదాస్పదమైంది. యెర్నేని సీతాదేవి మంత్రిగా ఉన్నప్పుడే మొదటిసారి ఇన్స్టెంట్, బెటర్మెంట్ పరీక్షలు ప్రవేశపెట్టారు. 1994లో పిన్నమనేని కోటేశ్వరరావు కుమారుడు వెంకటేశ్వరరావుపై పోటీ చేసి విజయం సాధించారు. 1999, 2004 ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. 2004 తర్వాత జిల్లా ల పునరి్వభజనలో భాగంగా ముదినేపల్లి నియోజకవర్గం రద్దయి.. కైకలూరు నియోజకవర్గంలో కలి సింది.సీతాదేవి టీటీడీ బోర్డు సభ్యురాలుగా పనిచేశారు. 2013లో బీజేపీలో చేరారు. బీజేపీలో మహి ళా మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలిగా బా ధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం విజయ మిల్క్ డెయిరీ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. సీతాదేవి భర్త యెర్నేని నాగేంద్రనాథ్ (చిట్టిబాబు) రైతాంగ సమాఖ్య, కొల్లేరు పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన గతేడాది అనారోగ్యంతో మరణించారు. సీతాదేవి పార్థివదేహాన్ని సొంతూ రు కొండూరుకు తీసుకొచ్చారు.పలువురు నేతలు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులరి్పంచారు. -
మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి కన్నుమూత
హైదరాబాద్: మాజీ మంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి కన్నుమూశారు. సోమవారం ఉదయం గుండెపోటుతో హైదరాబాద్‌లో ఆమె తుదిశ్వాస విడిచారు. సీతాదేవి స్వస్థలం ఏపీలోని కైకలూరు మండలం కోడూరు. ముదినేపల్లి నుంచి ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్టీఆర్ కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆమె బీజేపీలో చేరారు. సీతాదేవి మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.యెర్నేని సీతాదేవి కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం ఉన్నదే. ఆమె భర్త నాగేంద్రనాథ్(చిట్టిబాబు) ఆంధ్రప్రదేశ్ రైతాంగ సమాఖ్య, కొల్లేరు పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిగా, కృష్ణా, గోదావరి, పెన్నార్ డెల్టా డ్రెయినేజీ బోర్డు సభ్యుడిగా పని చేశారు. కిందటి ఏడాదే ఆయన కన్నుమూశారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. నాగేంద్రనాథ్ సోదరుడు యెర్నేని రాజారామచందర్(దివంగత ) రెండు పర్యాయాలు కైకలూరు ఎమ్మెల్యేగా గెలిచారు. -
సెల్‌ఫోన్‌తో హై బీపీ!
సాక్షి, అమరావతి: మొబైల్ ఫోన్లో ఎక్కువ సేపు మాట్లాడితే అధిక రక్తపోటు (హై బీపీ) ప్రమాదం పొంచి ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దైనందిన జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సెల్ఫోన్లతో అంతే స్థాయి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వారానికి 30 నిమిషాలు, అంతకంటే ఎక్కువసేపు మొబైల్ ఫోన్లో మాట్లాడేవారిలో దుష్ప్రభావాలు తీవ్ర స్థాయిలో ఉంటున్నాయని, ముఖ్యంగా రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుందని తాజా అధ్యయనంలో తేల్చారు. ‘యూరోపియన్ హార్ట్ జర్నల్–డిజిటల్ హెల్త్’లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. చైనాలోని గ్వాంగ్జౌలోని సదరన్ మెడికల్ వర్సిటీ పరిశోధకులు మొబైల్ ఫోన్ల నుంచి వెలువడే తక్కువ స్థాయి రేడియో ఫ్రీక్వెన్సీ శక్తి రక్తపోటు పెరుగుదలతో ముడిపడి ఉందని గుర్తించారు.130 కోట్ల మందిలో.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 30–79 సంవత్సరాల వయసు గల దాదాపు 130 కోట్ల మంది అధిక రక్తపోటు సమస్య ఎదుర్కొంటున్నారు. ఇందులో 82% మంది తక్కువ, మధ్య–ఆదాయ దేశాలలో నివసిస్తున్న వారే. భారత్‌లో 120 కోట్ల మందికిపైగా మొబైల్ ఫోన్ వినియోగదారులు ఉంటే 22 కోట్ల మంది అధిక రక్తపోటు బాధితులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. రక్తపోటు సమస్య గుండెపోటు, అకాల మరణానికి దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.హైబీపీ వల్ల వచ్చే హైపర్ టెన్షన్, ఇతర సమస్యలపై అవగాహన పెంచుకోవాలన్నారు. తాజా పరిశోధనలో వారంలో 30 నిమిషాల కంటే తక్కువ సమయం ఫోన్లో మాట్లాడే వారితో పోలిస్తే మిగిలిన వారిలో రక్తపోటు వచ్చే ప్రమాదం 12% ఎక్కువగా ఉంటుందని తేల్చారు. వారానికి ఆరుగంటలకు పైగా ఫోన్లో మాట్లాడేవారిలో రక్తపోటు ప్రమాదం 25 శాతానికి పెరిగింది.కండరాలపై ఒత్తిడి..మెడ, భుజాలు, చేతుల్లో కండరాల నొప్పులు అత్యంత సాధారణ దుష్ప్రభావాలలో ఒకటిగా వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ సేపు ఫోన్‌ను పట్టుకోవడంతో కండరాలు ఒత్తిడికి గురవడంతో పాటు తీవ్ర తలనొప్పికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఫోన్‌ను చెవికి చాలా దగ్గరగా పెట్టుకుని మాట్లాడటం, ఇయర్‌ఫోన్లు్ల, హెడ్ఫోన్లను నిరంతరం ఉపయోగించడంతో టిన్నిటస్ (చెవుల్లో నిరంతరం రింగింగ్ సౌండ్ వినిపించే పరిస్థితి) వంటి చెవి సమస్యలు వస్తాయంటున్నారు. ఫోన్ స్క్రీన్‌పై ఎక్కువ సేపు చూడటంతో కంటిపై ఒత్తిడి పెరిగిన కళ్లుపొడిబారడం, చూపు మసకబారడం, తలనొప్పి, ఊబకాయం వంటి సమస్యలకు దారితీస్తుందని పేర్కొంటున్నారు. -
వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి: ఐదేళ్ల తర్వాత 11 మంది వైద్యులపై కేసు!
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన మహిళకు ఐదేళ్ల తరువాత న్యాయం లభించింది. ఈ ఉదంతం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఈ కేసును విచారించిన నాగపూర్ కోర్టు ప్రభుత్వ వైద్యశాల డీన్ రాజ్ గజ్భియేతో సహా 11 మంది వైద్యులపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నాగ్‌పూర్‌లోని అజ్ని పోలీస్ స్టేషన్లో వీరిపై కేసు నమోదైంది.వివరాల్లోకి వెళితే 2019లో నాగపూర్‌కు చెందిన కేవల్రామ్ పాండురంగ్ పటోలే భార్య పుష్ప తన గొంతులో చిన్నపాటి గడ్డకు చికిత్స కోసం నాగ్‌పూర్‌లోని మెడికల్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించింది. ఈ సమయంలో సర్జరీ విభాగానికి అధిపతిగా ఉన్న డాక్టర్ గజ్భియే బాధిత మహిళ భర్త కేవల్రామ్ పాండురంగ్ పటోలేతో శస్త్రచికిత్స ద్వారా బాధితురాలి గడ్డను తొలగించవచ్చని తెలిపారు. ఆ వైద్యుని సలహా మేరకు పటోలే తన భార్య పుష్పను 2019 జూలై 5న ఆసుపత్రిలో చేర్చారు. 6న ఉదయం 8 గంటలకు ఆమెకు ఆపరేషన్ జరిగింది.ఈ ఆపరేషన్ తర్వాత పుష్ఫ పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఐసీయూలో ఆమెకు చికిత్సనందించారు. అయితే జూలై 7న ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పుష్ఫ మృతికి గుండెపోటు కారణమని వైద్యులు పేర్కొన్నారు. అయితే తన భార్య ఆపరేషన్‌లో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ పటోలే 2020 జూన్ 30న డాక్టర్ గజ్భియేతో పాటు ఇతర వైద్యులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా వైద్యాధికారులు విచారణ కమిటీని ఏర్పాటు చేసి, కోర్టుకు ఒక నివేదిక సమర్పించారు. అయితే ఆ నివేదికలో బాధితురాలు గుండెపోటుతో మృతి చెందిందని కమిటీ పేర్కొంది.అయితే పటోలే దీనిపై రాష్ట్ర వైద్య మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ నేపధ్యంలో వైద్యశాఖ ఈ ఉదంతంపై విచారణకు కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ బాధితురాలికి ఆపరేషన్ చేసేటప్పుడు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా పటోలే నాగపూర్ కోర్టులో పిటీషన్ దాఖలు చేసి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై కేసు నమోదు చేయాలని కోరారు. దీనిపై విచారించిన కోర్టు ఆ వైద్యులపై కేసు నమోదు చేయాలని అజ్ని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. -
గుండెపోటుతో ప్రిసైడింగ్ అధికారి మృతి
బీహార్‌లో లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ ప్రారంభమయ్యింది. ఇంతలో ముంగేర్‌లోని చకాసిం ఇబ్రహీం శంకర్పూర్ మిడిల్ స్కూల్లోని బూత్ నంబర్ 210లో విషాదం చోటుచేసుకుంది. డ్యూటీ చేస్తున్న ప్రిసైడింగ్ అధికారి ఓంకార్ చౌదరి గుండెపోటుతో మృతి చెందారు. అతని ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. అతన్ని ఆసుపత్రికి తరలించేలోగానే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.దర్భంగాలోని హోలీ క్రాస్ స్కూల్లోని ఆదర్శ్ పోలింగ్ సెంటర్ ఉత్సాహంగా ఓటింగ్ జరుగుతోంది. ముందుగా ఇద్దరు పెద్దలు తమ ఓటు వేసి, యువత తప్పక ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ పోలింగ్ కేంద్రం ముందు పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరారు. జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న బహదూర్‌పూర్ బ్లాక్‌లోని బహదూర్‌పూర్ పోలింగ్ నంబర్ 120 వద్ద ఈవీఎంలో అవాంతరం తలెత్తింది. దీంతో కొద్దిసేపు ఓటింగ్ నిలిచిపోయింది.బీహార్‌లోని ఐదు స్థానాల్లో నాలుగో దశ పోలింగ్ ప్రారంభమైంది. 9,447 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. చాలా చోట్ల ఉదయం ఆరు గంటలకే ఓటర్లు బూత్‌లకు చేరుకున్నారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తన సొంత జిల్లా బర్హియాలోని 34వ నంబర్ బూత్‌కు చేరుకుని ఓటు వేశారు.ఈ దశ పోలింగ్‌లో కేంద్రమంత్రులు గిరిరాజ్ సింగ్, నిత్యానంద్ రాయ్, జనతాదళ్ యునైటెడ్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ అలియాస్ లలన్ సింగ్, బీహార్ మంత్రి అశోక్ చౌదరి కుమార్తె శాంభవి చౌదరి, మంత్రి మహేశ్వర్ హజారీ కుమారుడు సన్నీ హజారీతో సహా 55 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. -
గుండెపోటుతో కన్నుమూసిన బీజేపీ కీలక నేత
భోపాల్: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో మధ్యప్రదేశ్ యూనిట్ బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి 'గోవింద్ మాలూ' గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని స్థానిక పార్టీ నాయకుడు గురువారం తెలిపారు. బుధవారం భోపాల్ నుంచి ఇంటికి వచ్చిన తరువాత రాత్రి భోజనం చేశారు. ఆ తరువాత ఇంటి వద్ద గుండెపోటుకు గురయ్యారని సన్నిహితులు పేర్కొన్నారు.గుండెపోటు రావడంతోనే హుటాహుటిగా గోవింద్ మాలూను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మాలూ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గురువారం ఉదయం ఇండోర్ చేరుకున్నారు.గోవింద్ మాలూ బీజేపీకి పెద్ద ఆస్తి అని మోహన్ యాదవ్ అన్నారు. కార్డియాక్ అరెస్ట్‌తో మాలూ ఆకస్మిక మృతి పట్ల చాలా బాధపడ్డాను. పార్టీకి సంబంధించిన అనేక బాధ్యతలు ఆయన నిర్వహించారని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విష్ణు దత్ శర్మ, పార్టీ రాష్ట్ర సంస్థ ప్రధాన కార్యదర్శి హితానంద్, ఇతర సీనియర్ నేతలు కూడా మాలూ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.మాలూ బీజేపీ రాష్ట్ర విభాగానికి మీడియా ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. అంతేకాకుండా రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్‌గా కూడా పనిచేశారు. రాజకీయాల్లోకి రాకముందు స్థానిక వార్తాపత్రికల్లో స్పోర్ట్స్ రివ్యూలు రాశారు. ఆయనకు తల్లి, భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. -
గుండె ఘోష విన్నారు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంభవిస్తున్న మరణాల్లో 32.4 శాతం గుండె సంబంధిత వ్యాధుల కారణంగానే ఉంటున్నాయి. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ)లో గుండె జబ్బులదే అగ్రస్థానం. ఈ క్రమంలో ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కలిగిన సీఎం వైఎస్ జగన్ మునుపెన్నడూలేని రీతిలో ఎన్సీడీ నిర్వహణపై పక్కా ప్రణాళికతో అడుగులు వేశారు. ఇందులో భాగంగా.. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయిలో ప్రభుత్వాస్పత్రుల ఆధునీకరణ సహా అనేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రధానంగా గుండె జబ్బులు, క్యాన్సర్ తదితర పెద్ద జబ్బులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. కార్డియాలజీ, కార్డియో వాసు్క్యలర్ సేవలను మరింతగా విస్తృతం చేసి, ప్రజలకు చేరువ చేస్తూ ఎమర్జెన్సీ కార్డియాక్ కేర్ (ఈసీసీ) కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఇందులో భాగంగా గుండెపోటు బాధితులకు గోల్డెన్ అవర్‌లో చికిత్స అందించి బాధితుల ప్రాణాలను కాపాడింది. నగరాలకు దూరంగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు గుండెపోటు బారినపడితే తొలి 40 నిమిషాల్లోనే ఈ కార్యక్రమం ద్వారా ప్రాథమిక వైద్య సేవలు లభించేలా చర్యలు తీసుకున్నారు. హబ్ అండ్ స్పోక్ విధానంలో ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నారు. సామాన్యులకూ అందుబాటులోకి హార్ట్‌కేర్ సర్వీసులు.. తిరుపతి రుయా ఆస్పత్రిలో 2022 జనవరి నుంచి పైలెట్ ప్రాజెక్టుగా ఈ ఈసీసీ నడుస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం జీజీహెచ్‌లను హబ్‌లుగా తీర్చిదిద్ది కార్యక్రమాన్ని విస్తరించారు. నాలుగు చోట్ల కార్డియాలజిస్ట్ వైద్యులతో పాటు, క్యాథ్‌ల్యాబ్ సౌకర్యం ఉంది. హబ్‌లకు ఆయా జిల్లాల పరిధిలోని 69 స్పోక్స్ (సెకండరీ హెల్త్ సర్వీసెస్ ఆస్పత్రులు)ను అనుసంధానంచేసి హార్ట్‌కేర్ సర్వీసులను సామాన్యులు, గ్రామీణులకు అందుబాటులోకి తెచ్చారు. అనంతరం అన్ని జీజీహెచ్‌లను హబ్‌లుగా, సెకండరీ హెల్త్ ఆస్పత్రులను స్పోక్స్‌గా తీర్చిదిద్ది రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాన్ని అమలులోకి తెచ్చారు. స్పోక్స్‌గా వ్యవహరించే ఆస్పత్రుల్లో ఛాతినొప్పి, ఇతర గుండెపోటు లక్షణాలతో వచ్చిన వ్యక్తులకు వెంటనే ఈసీజీ తీస్తున్నారు. ఆ ఫలితాన్ని హబ్‌లో ఉన్న కార్డియాలజిస్ట్‌కు పంపుతున్నారు. కార్డియాలజిస్ట్‌లు సంబంధిత కేసు గుండెపోటుదా కాదా అని నిర్ధారించి గుండె రక్తనాళం ఎంత శాతం పూడుకుపోయిందో పరిశీలించి థ్రాబోలైసిస్ థెరపీని సూచిస్తున్నారు. ఇలా సూచించిన కేసుల్లో రూ.40 వేల విలువ చేసే థ్రాంబోలైసిస్ ఇంజక్షన్‌ను బాధితులకు ఉచితంగా ఇస్తున్నారు. గతేడాది సెప్టెంబరు 29 నుంచి ఇప్పటివరకూ 3 వేల మందికి పైగా ఛాతినొప్పితో స్పోక్స్‌కు రాగా వారికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో గుండె రక్తనాళం 100 శాతం పూడిపోవడంతో వచ్చే ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియాల్ ఇన్ఫార్క్షన్ (స్టెమీ) సమస్యతో బాధపడుతున్న 489 మందికి వెంటనే థ్రాంబోలైసిస్ నిర్వహించారు. వీరిలో 424 మంది క్షేమంగా ఉన్నారు. సకాలంలో వైద్యసాయం అందకపోయినట్లయితే వీరందరూ కూడా మృత్యువాత పడేవారని వైద్యులు చెబుతున్నారు. భవిష్యత్‌లోనూ మరింత రక్షణ.. మరోవైపు.. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా బీపీ, షుగర్, ఇతర ఎన్సీడీ వ్యాధిగ్రస్తుల ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షించారు. గుండె జబ్బులకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ ఆస్పత్రుల్లో పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించారు. ఐదేళ్లలో 3.67 లక్షల గుండెపోటు బాధితులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు చేశారు. ఇందుకు రూ.2,300 కోట్లకు పైగా వెచ్చించారు. మరింత సమర్థవంతంగా గుండెపోటు మరణాలను నియంత్రించడానికి ఈసీసీను అమలులోకి తెచ్చారు. ఇక వచ్చే ప్రభుత్వంలో గుండె సంబంధిత వైద్యసేవల కోసం విశాఖ, కర్నూలు, గుంటూరుల్లో హబ్‌లు ఏర్పాటుచేస్తామని వైఎస్సార్సీపీ 2024 మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. -
నటుడు శ్రేయాస్ తల్పాడేకి గుండెపోటు..ఆ వ్యాక్సినే కారణమా..?
బాలీవుడ్, మళయాళీ నటుడు, నిర్మాత, దర్శక్షుడు అయిన శ్రేయాస్ తల్పాడే గతేడాది గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. నాటి దురదృష్టకర ఘటనను గుర్తు తెచ్చుకుంటూ తాను ధూమపానం సేవించనే, మందు తాగాను అయినా తాను ఈ గుండెపోటు బారిని పడ్డానని బాధగా అన్నారు. తనకు కొలస్ట్రాల్ ఎక్కువగా ఉందన్న విషయం తెలుసనిన్నారు. అందుకోసం మందులు వాడుతున్నట్లు చెప్పారు. ఇక తనకు మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలి వ్యాధులు లేవనిన్నారు. అలాంటప్పుడు తాను ఈ గుండె జబ్బు బారిన ఎలా పడ్డానని ఆవేదనగా అన్నారు. బహుశా ఇది కోవిడ్ వ్యాక్సిన్ వల్లే అయ్యి ఉండొచ్చని అనుమానాన్ని వ్యక్తం చేశారు. నిజానికి ఆ మహమ్మారి సమయంలో బయటపడేందుకు ప్రభుత్వం వ్యాక్సిన్ డ్రైవ్‌లు చేపట్టింది. మనం కూడా సేఫ్‌గా ఉండాలనే ఉద్దేశ్యంతో వారి చెప్పిన డోస్‌లు తీసుకున్నాం. అయితే నిజానికి మనకు శరీరంలో ఏం తీసుకుంటున్నామనేది తెలియదు. ఎలాంటి కంపెనీలను విశ్వసించాలో కూడా తెలియని స్థితి అది. ప్రస్తుతం కోవిషీల్డ్ తీసుకోవడం వల్ల ముగ్గురు చనిపోయారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే శ్రేయాస్ ఇలా తన అనుమానాన్ని బాధగా వెలిబుచ్చారు. ఇక బాధితులు పోస్ట్‌మార్టంలో కూడా వ్యాక్సిన్ రియాక్షన్ కారణంగానే మరణించినట్లు వెల్లడవ్వడంతో ఒక్కసారిగా అందరిలో తీవ్ర ఆందోళనలు వెల్లువెత్తాయి. కాగా, నటుడు గతేడాది డిసెంబర్లో శ్రేయాస్ తల్పాడే తనకు గుండెపోటు వచ్చిన విధానాన్ని గూర్తి వివరిస్తూ.."అహ్మద్ ఖాన్ వెల్కమ్ టు ది జంగిల్ కోసం ముంబైలో జోగేశ్వరికి దగ్గరగా ఉన్న ఎస్ఆర్పీఎఫ్ గ్రౌండ్స్‌లో షూటింగ్ చేస్తున్నాం. ఆర్మీ శిక్షణా సన్నివేశాలు చిత్రికరిస్తుండగా..సడెన్‌గా ఒక షాట్లో ఊపిరి పీల్చుకోలేకపోడం, ఎడమ ఛాతీలో తీవ్ర నొప్పి రాడం జరిగింది. దీంతో కనీసం ఆ షూట్ తర్వాత నేను నా వానిటీ వ్యాన్‌కి వెళ్లి బట్టలు కూడా మార్చుకోలేకపోయాను. ఈ విధమైన అలసటను తానెప్పుడూ ఫేస్ చేయలేదని చెప్పుకొచ్చాడు శ్రేయాస్ తల్పాడే. అంతేగాదు తాను కోలుకుని బయటపడాతనని కూడా అనుకోలేదని చెప్పారు. ఇది తనకు భగవంతుడు ఇచ్చిన రెండో అవకామని అన్నారు. నిజంగా కోవిషీల్డ్ ప్రమాదకరమైనదా..?భారతదేశంలో కోవిషీల్డ్ 175 కోట్ల డోస్‌లు ఇచ్చారు. భారతదేశంలో ప్రజలకు అత్యంత విస్తృతంగా అందించిన టీకా. అయితే ఇటీవల ఈ ఆస్ట్రాజెనెకాకు చెందిన కోవిడ్-19 వ్యాక్సిన్ కోవిషీల్డ్ దుష్ఫ్రభావాలు గురించి ప్రజల్లో తీవ్ర ఆందోళలను మొదలయ్యాయి. కానీ ఆస్ట్రాజెనెకా చట్టపరమైన సమర్పణలో టీకా గురించి సవివరంగా వెల్లడించింది. అందులో ఈ టీకా కారణంగా థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (టీటీఎస్)తో థ్రాంబోసిస్కు దారితీస్తుందని అంగీకరించింది. ఈ పరిస్థితి కారణంగా రక్తం గడ్డకట్టడం, తక్కువ ప్లేట్లెట్ కౌంట్‌కి పడిపోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ దుష్ప్రభావాలు గురించి క్లియర్ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నిజానికి మనదేశంలో ఈ టీకా వేసిన తర్వాత పరిమిత సంఖ్యలో ఈ టీటీఎస్ కేసులు నమోదయ్యాయి. టీకా-ప్రేరిత రోగనిరోధక థ్రోంబోటిక్ థ్రోంబోసైటోపెనియా (VITT)తో సహా థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (TTS)తో థ్రాంబోసిస్ అనేది చాలా అరుదైన దుష్ప్రభావం. ఎక్కువగా ప్రాథమిక టీకా తర్వాత కనిపిస్తుంది. అలాగే ఈ వ్యాక్సిన్‌ని తీసుకున్న ప్రతిఒక్కరు దీని బారిన పడరని ఆస్ట్రాజెనెకా కంపెనీ చట్టపరమైన పత్రాల్లో స్పష్టం చేసింది. చాలావరకు టీకా తీసుకున్న మొదటి 21 రోజుల్లోనే ఈ దుష్ప్రభావం సంభవిస్తుంది. అరుదైన సందర్భాల్లో ప్రాణాంతకం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఈ టీకా తీసుకున్నవాళ్లు ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే టీకా వేసిన కొన్ని వారాల్లోనే ఇలాంటీ టీటీఎస్ సమస్యలు వస్తాయని తేల్చి చెప్పారు.(చదవండి: ఆజానబాహుడిలా ఉండే జాన్ అబ్రహం ఫిట్నెస్ రహస్యం ఇదే! అందుకే..!) -
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. సింగం నటుడు కన్నుమూత!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ కోలీవుడ్ నటుడు అరుల్మణి(65) కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా.. అరుల్మణి ప్రస్తుతం అన్నాడీఎంకే తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ఆయన మృతికి ఎన్నికల ప్రచారమే కారణమని తెలుస్తోంది. గత పది రోజులుగా పలు నగరాల్లో ఎన్నికల ప్రచారం పాల్గొన్నారు. గురువారం చెన్నైకి వచ్చిన ఆయన అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. కాగా.. అరుల్మణి ప్రముఖంగా సింగం, సింగం- 2, సామాన్యన్, స్లీప్‌లెస్ ఐస్, థెండ్రాల్, తాండవకొనే, రజినీకాంత్ లింగతో సహా పలు తమిళ చిత్రాలలో ఆయన నటించారు. కాగా.. అరుల్మణి తమిళ సినిమాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించారు. 'అళగి' సినిమా అరుల్ మణి కెరీర్‌ను మలుపు తిప్పింది. కోలీవుడ్‌లో ఇప్పటి వరకు అళగి, తెనారల్, పొన్నుమణి, ధర్మశీలన్, కరుపు రోజా, వేల్, మరుదమలై, కత్తు తమిళ్, వన యుద్ధం సహా 90 చిత్రాల్లో నటించారు. దాదాపు అందరు ప్రముఖ హీరోలతో ఆయన నటించారు. ఆయనకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఆయన అన్నాడీఎంకే స్టార్ కంపెయినర్‌గా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
బీఎస్పీ అభ్యర్థికి గుండెపోటు
బహుజన్ సమాజ్ పార్టీ అలీగఢ్ అభ్యర్థి గుఫ్రాన్ నూర్ గుండెపోటుకు గురై ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతోంది. విషయం తెలిసిన వెంటనే బీఎస్పీ కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకున్నారు. తన తండ్రి ఇప్పటికే హార్ట్ పేషెంట్ అని, ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూలో చేర్చినట్లు గుఫ్రాన్ నూర్ కుమారుడు ఆదిల్ తెలిపారు. బీఎస్పీ రెండు రోజుల క్రితం గుఫ్రాన్ నూర్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ బాబు ముంకద్ అలీ.. గుఫ్రాన్ నూర్ అభ్యర్థిత్వాన్ని వెల్లడించారు. కాగా బీఎస్పీ అలీగఢ్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిని మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, పార్టీ మాత్రం ఇంకా దీన్ని ధ్రువీకరించలేదు. 2012లో గుఫ్రాన్ నూర్ బరౌలీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి క్వామీ ఏక్తా దళ్ టిక్కెట్‌పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 2023లో జరిగిన మేయర్ ఎన్నికల్లో ఎంఐఎం నుంచి పోటీ చేశారు. -
డేనియల్ బాలాజీ హఠాన్మారణం: గుండెపోటు వస్తే అంతేనా..?
కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ (48) చిన్న వయసులోనే అకాల మరణం పొందారు. కుటుంభ సభ్యుల సమాచారం ప్రకారం..శుక్రవారం అర్థరాత్రి ఒక్కసారిగా తీవ్రమైన ఛాతినొప్పి రావడంతో అస్వస్థతకు గురయ్యారని, ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే చనిపోయారని వెల్లడించారు. 50కి పైగా సినిమాల్లో నటించి మెప్పించిన ఆయన చిన్నవయసులోనే కానరాని లోకాలకు వెళ్లిపోవడ బాధకరం. అస్సలు గుండెపోటు వస్తే ఇక అంతేనా?..ప్రాణాలు కోల్పోవాల్సిందేనా? బయటపడలేమా అంటే.. చాలా ఘటనల్లో గుండెపోటు రావడం ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపు చనిపోవడం జరగుతుంది. కానీ ఇలా గుండెపోటు వచ్చే ముందు కొన్ని సంకేతాలు వస్తాయట. వాటిని పట్టించుకోకపోవడంతోనే సమస్య తీవ్రమై ఆస్పత్రికి తరలించే వ్యవధి సరిపోక చనిపోవడం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఎలాంటి వారికి వస్తుందంటే.. మధుమేహం, ఊబకాయం, ఒత్తిడి, రక్తపోటు వంటి సమ్యలున్న వారికి గుండె పోటు వచ్చే అవకాశం ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. అలాగే కుటుంబ చరిత్రలో గుండె పోటు సంకేతాలు ఉంటే వారికి కూడా గుండె పోటు వచ్చే అవకాశం ఉంది. ముందుగా వచ్చే సంకేతాలు.. ఛాతి నొప్పి శ్వాస ఆడకపోవడం కుడి లేదా ఎడమ చేయి లాగడం ఛాతీ అసౌకర్యం ఆ నొప్పి 20 నిమిషాలకు పైనే ఉన్నా.. వికారం కష్టపడు, చేమాటోర్చు గుండెల్లో మంట అజీర్ణం లేదా కడుపు నొప్పి అలసట మరియు వాపు మైకము ఆ టైంలో ఏం చేయాలంటే.. ఈ సంకేతాలు కనిపించిన వెంటనే సార్బిట్రేట్(5 ఎంజీ నుంచి 10 ఎంజీ) ట్యాబ్లెట్‌ను నాలుక కింద పెట్టుకుని చప్పరించాలి. అయినా నొప్పి తగ్గకపోతే దాన్ని గుండె పోటుగా పరిగణించి వెంటనే వైద్య సాయం పొందడానికి చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సమయంలో ఆస్పిరిన్ (300 ఎంజీ), క్లోపిడోగ్రిల్ (300 ఎంజీ), అటోర్వాస్టాటిన్( 80 ఎంజీ ) ట్యాబ్లెట్ తీసుకోవాలి. అప్పుడు ఈసీజీ కోసం ఆస్పత్రికి వెళ్లాలి. అయితే వీటిని పరిస్థితి క్రిటికల్ అనిపించినప్పుడే ఇవి వేసుకోవాలి. అలాగే వైద్యుని వెంటనే సంప్రదించి తాను ఏ ట్యాబ్లెట్ వేసుకున్నామో? వివరించాలి. ఇక్కడ ఇలాంటి లక్షణాలు కనిపించిన.. 30 నిమిషాలలోపు ఆస్పిరిన్ నమలడం వల్ల ప్లేట్లెట్ అభివృద్ధిని నిరోధిస్తుంది, అలాగే రక్తం గడ్డకట్టడాని ఆలస్యం చేస్తుంది. కొంతమంది రోగులు గుండె సంబంధిత సంఘటన కంటే రక్తపోటు అకస్మాత్తుగా పడిపోవడం వల్ల విపరీతమైన చెమట, మైకం వచ్చిందని చెబుతారు. అలాంటప్పుడూ రోగికి సార్బిట్రేట్ ట్యాబెలెట్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. ఎందుకంటే..? ఇది బీపీను మరింత తగ్గిస్తుంది. ఈ విషయంపై పూర్తి అవగాహన ఉండి.. అవతలి వ్యక్తి పరిస్థితిని క్షణ్ణంగా తెలుసుకున్నాక ఇలాంటి ప్రథమ చికిత్సలను చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ ట్యాబ్లెట్లు వేసుకున్నాం కదా!.. గుండె నొప్పి తగ్గిందని వైద్యుని వద్దకు వెళ్లకుండా నిర్లక్ష్యంగా అస్సలు వ్యవహరించొద్దు. ఇది కేవలం అంబులెన్స్ లేదా ఆస్పత్రికి వెళ్లే సమయం వరకూ ప్రాణాలను కాపాడుకోవడానికే అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. గోల్డెన్ అవర్‌లోపు తరలించాలి.. అంతేగాదు మెజారిటీ గుండెపోటు మరణాలు సమయానికి ఆస్పత్రికి చేరుకోకపోవడం వల్లనే జరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండెపోటు వచ్చిన మొదటి గంటలోనే పేషెంట్‌ను ఆస్పత్రికి తీసుకెళ్తే ప్రాణాలతో బయట పడే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నారు. చాలా కేసులలో బాధితులకు ఛాతిలో నొప్పి వచ్చిన కొన్ని గంటల తర్వాత ఆస్పత్రిలో చేరుతున్నారని.. అయితే అప్పటికే జరుగాల్సిన నష్టం జరుగుతుందని అంటున్నారు. ఎవరికైనా గుండెపోటు వచ్చిన గంటసేపటి వరకు కూడా శరీరానికి రక్తసరఫరా జరుగుతుందని.. ఇందులో మొదటి గంట తర్వాతనే రక్త ప్రసరణ ఆగిపోతుందని వైద్యులు అంటున్నారు. అందుకే గుండెపోటు వచ్చిన మొదటి గంటను గోల్డెన్ అవర్ లేదా గోల్డెన్ టైమ్ అని అంటారని తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ గంట సమయంలోగా ఆసుపత్రిలో చేరాలని సూచిస్తున్నారు. (చదవండి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫాలో అయ్యే డైట్ ఇదే!) -
అమెరికాలో గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
జనగామ జిల్లా: బచ్చన్నపేట మండలం వంగ సుదర్శన్‌రెడ్డినగర్ గ్రామానికి చెందిన చిట్టోజు మహేష్(34) అమెరికాలో గుండె పోటుతో బుధవారం ఉదయం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. చిట్టోజు ప్రమీల, మదనాచారి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మహేష్ హైదరాబాద్‌లోని నాగారంలో స్థిరపడ్డాడు. మూడేళ్ల క్రితం ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన అతను జార్జియాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం మహేష్ డ్యూటీలో ఉండగా గుండె పోటు రావడంతో తోటి ఉద్యోగులు ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు. మహేష్‌కు భార్య రాధ, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. కాగా, మృతదేహం అమెరికా నుంచి ఇండియాకు రావడానికి ఐదు రోజుల సమయం పడుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. -
దొరికిన బంగారు గొలుసు.. బాధితురాలికి ఇవ్వాలని ఠాణాకు వెళ్లిన వ్యక్తి గుండెపోటుతో మృతి
హైదరాబాద్: ఆటోలో దొరికిన బంగారు గొలుసును బాధితురాలికి అప్పగించేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఓ నగల వ్యాపారి గుండెపోటుతో మృతి చెందిన విషాద ఘటన షాయినాయత్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. సౌత్‌వెస్ట్ జోన్ డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, గోషామహల్ ఏసీపీ కోట్ల వెంకట్‌రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. నల్లకుంటకు చెందిన కోర్టు ఉద్యోగిని మేఘన శుక్రవారం ర్యాపిడో ఆటోలో హైకోర్టుకు వెళ్లింది. కోర్టుకు వెళ్లిన తర్వాత మెడలోని బంగారు గొలుసు కనిపించకపోవడంతో తన భర్తకు ఫోన్ చేసి సమాచారం అందించింది. ఆ తర్వాత కొద్ది సేపటికే అదే ఆటోను బుక్ చేసుకున్న వెండి నగల వ్యాపారి గోవింద్రామ్ సోని (70) బేగంబజార్ నుంచి కోఠీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు.. ఈ క్రమంలో అతడికి ఆటోలో పడి ఉన్న బంగారు గొలుసు కనిపించింది. దీంతో ఆటో డ్రైవర్ నునావత్ తరుణ్‌ను వివరాలు అడగడంతో హైకోర్టు వద్ద ఓ మహిళను వదిలిపెట్టి వస్తున్నానని, సదరు గొలుసు ఆమెదే అయి ఉండవచ్చని చెప్పాడు. దీంతో గోవింద్రామ్ సోనీ నేరుగా అదే ఆటోలో షాయినాయత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి గొలుసును పోలీసులకు అప్పగించాడు. ఇంతలోనే బాధితురాలు మేఘన ఆటో డ్రైవర్‌కు ఫోన్ చేసి గొలుసు విషయమై ఆరా తీసింది. సదరు ఆటో డ్రైవర్‌కు ఆమెకు విషయం చెప్పడంతో భర్తతో కలిసి పీఎస్‌కు వచి్చన బాధితురాలికి పోలీసుల సమక్షంలో గోవింద్రామ్ సోనీ బంగారు గొలుసును అప్పగించాడు. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే అతను కుప్పకూలి పోవడంతో అప్రమత్తమైన పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు గోవింద్రామ్ సోనీ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సహాయం చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వచి్చన గోవింద్రామ్ సోనీ గుండెపోటుతో మృతి చెందడం బాధాకరమని డీసీపీ విచారం వ్యక్తంచేశారు. -
Heart Attack: గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని మృతి
వైఎస్సార్ : మండలంలోని కొర్రపాడు గ్రామానికి చెందిన శ్రీపతి లిఖిత (15) అనే విద్యార్థిని సోమవారం అనారోగ్యంతో మృతి చెందింది. ఆ విద్యార్థిని రాజుపాళెంలోని శివప్రియ హైస్కూల్లో విద్యను అభ్యసిస్తోంది. రాజుపాళెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం పది పరీక్షలు రాసింది. పరీక్ష అనంతరం శివప్రియ హైస్కూల్‌కు వెళ్లి తోటి విద్యార్థులతో కలసి భోజనం చేసింది. అనంతరం రేపటి పరీక్షకు చదువుకునేందుకు క్లాసు రూంకు వెళుతున్న సమయంలో కళ్లు తిరిగి కుప్పకూలిపోయింది. వెంటనే ఆ విద్యార్థినిని ప్రథమ చికిత్స కోసం రాజుపాళెంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే కొన ఊపిరితో ఉన్న లిఖిత కొద్ది సేపటికి మృతి చెందిందని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతురాలిని ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఆ విద్యార్థిని కొన్నేళ్లుగా గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఉండేదని ఆ పాఠశాల యాజమాన్యం తెలిపింది. అనురాధ, సుధాకర్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు కాగా, మృతి చెందిన విద్యార్థిని లిఖిత రెండో సంతానం. మొదటి కుమార్తె పూణెలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. మూడో కుమార్తె శివప్రియ హైస్కూల్లో ఆరో తరగతి చదువుతోంది. -
గుండెపోటు సడెన్‌గా వస్తుందా? కసరత్తు, కోవిడ్‌తో లింకేంటి?
వయసుతో సంబంధం లేకుండా యువత హాట్ ఎటాక్‌తో కుప్పకూలి పోతున్న ఘటనలు రోజు దేశ వ్యాప్తంగా ఏదో ఒక మూల వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఓదెల మండలం కొలనూర్ గ్రామంలో ఓ పెళ్లి బారాత్ లో డాన్స్ చేస్తూ గుండెపోటుతో రావుల విజయ్ కుమార్( 33) అనే యువకుడు మృతి చెందడం ఆందోళన రేపింది. ఇటీవలి కాలంలో చిన్నపిల్లలు యవకులు, నిరంతరం వ్యాయామం చేస్తున్నవారు కూడా గుండెపోటుకు గురవుతున్నారు. న్యూఇయర్ పార్టీల్లోనూ, పెళ్లి బారాత్‌లో డాన్స్ చేస్తూ, జిమ్‌లో వ్యాయామం చేస్తూ, చివరకు , మెట్లు ఎక్కుతూ, రోడ్డుపై నడుస్తూ, కూర్చున్నవారు కూచున్నట్టుగానే కుప్పకూలిన సంఘటలను అనేకం. ప్రధానంగా వైసీపీ నేత, ఫిట్నెస్ ఫ్రీక్ మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం విషాదాన్ని నింపింది. ఇంకా కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా, ఇంకా పలువురు పోలీసు ఉన్నతాధికారులు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు.అతేకాదు ఈ కోవలో ఫిట్నెస్ ట్రైనర్లు కూడా చాలామందే ఉన్నారు. జిమ్‌కు, గుండెపోటుకు సంబంధం ఏమిటి? నియంత్రణ లేకుండా ఎక్కువగా వ్యాయామం చేయడం. అతిగా వ్యాయాయం చేయడం అనేది ఎవరికైనా ముప్పే అంటున్నారు డాక్టర్లు. సాధారణంగా ప్రతి మనిషికి రోజుకి ఒక అరగంట లేదంటే నలభై నిమిషాల వ్యాయామం సరిపోతుందట. బాడీ ఫిట్‌గా ఉండాలనో, కండలు పెంచాలనో గంటల తరబడి జిమ్‌కే పరిమితం కాకూడదు. అంతేకాదు తొందరపాటుతో ఒక్కసారిగా జిమ్‌కు వెళ్లి పెద్దపెద్ద బరువులు ఎత్తాలని ప్రయత్నించ కూడదు. అస్సలు నిపుణుల సలహా, ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకోనిదే జిమ్‌లోకి ఎంటర్ కాకూడదు. వ్యాయామం చేస్తున్నపుడు విపరీతంగా చెమటలు పడితే తక్షణమే ఆపివేయాలి. మరోవైపు శరీరంలో సోడియం స్థాయిలు పడిపోకుండా జాగ్రత్త వహించాలి. సప్లిమెంట్లు, ఎనర్జీ డ్రింక్‌ల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. హానికరమైన కృత్రిమ రసాయనాలు, స్టెరాయిడ్స్ వాడకంపై పూర్తి అవగాహన ముఖ్యం. ఎలాంటి దురలవాట్లు లేకుండా సంతులిత ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామంతో గుండెను పదిలంగా ఉంచుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. జీవన శైలి మార్పులు ధూమపానం, మద్యం సేవించడం, జంక్ఫుడ్స్, మైదాతో చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం లాంటివి ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తాయంటున్నారు వైద్య నిపుణులు. కరోనాతో సంబంధం ఏంటి? భారతదేశంలో కోవిడ్ మహమ్మారి అనంతరం గుండెపోటు కేసులు, మరణాలు బాగా పెరిగియాని ఇటీవలి అధ్యయనాలు, నివేదికల ద్వారా తెలుస్తోంది. ఆరోగ్యంగా ఉన్నవారిని కూడా గుండెపోటు కబళిస్తోంది. కోవిడ్-19 దీర్ఘకాలిక లక్షణాల ప్రభావంతోనే ఈ పరిస్థితి అని చెబుతున్నారు. ఫలితంగా గుండె నాళాల్లో తీవ్ర మంట, గుండెపోటుకు దారితీయవచ్చు. అధిక సోడియం ఉన్న ఆహారం, కనీస వ్యాయామం లేకపోవడం, ధూమపానం, అతిగా మద్యపానం, కదలికలు లేని జీవనశైలి, అధిక హిమోగ్లోబిన్ స్థాయిలు వంటి కారకాలు కూడా గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతున్నారు. -
డ్యాన్స్ చేస్తే గుండెపోటు వస్తుందా? ఎందుకిలా పిట్టల్లా రాలిపోతున్నారు!
ఏదైనా వేడుక, జాతర, పెళ్లిళ్లలో జరిగే బారత్‌లోనూ అంతా జోషఫుల్గా డ్యాన్సులు వేస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది సర్వసాధారణం. కానీ ఇలా చేయడమే శాపంగా మారి చివరికి ఆ వేడుక/పెళ్లి కాస్త విషాదంగా ముగుస్తుంది. ఇటీవల కాలంలో అందుకు సంబంధించిన పలు ఘటనలు ఎక్కువయ్యాయి కూడా. అసలు ఇలాంటి వేడుకల్లో ఆనందంగా డ్యాన్స్‌లు చేసి..చిన్నా, పెద్దా పిట్టల్లా రాలిపోతున్నారు. బతికించుకునే ఛాన్స్ కూడా దొరకడం లేదు. చెప్పాలంటే డీజేలాంటి మ్యూజిక్‌లు పెట్టుకుని ఎంజాయ్ చేద్దామంటేనే భయం వేస్తోంది. అసలెందుకు ఈ పరిస్థితి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని డ్యాన్స్‌లు చేయాలి?. ఎంత మేర మ్యూజిక్ వింటే బెటర్ తదితరాల గురించి సవివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం!. ఎన్ని ఘటనలు జరిగాయంటే.. ఇంతవరకు ఇలాంటి విషాదకర ఘటనుల గతేడాది నుంచి వరుసగా చోటు చేసుకున్నాయి. గతేడాది అక్టోబర్‌లో గుజరాత్లో గార్భా డ్యాన్స్ చేస్తూ ఏకంగా 10 మంది చనిపోయారు. అది మరువక ముందే అదే ఏడాది తెలంగాణలో 19 ఏళ్ల యువకుడు తన బంధువు పెళ్లిలో డ్యాన్య్ చేస్తూ కుప్పకూలి చనిపోయాడు. అలాగే గతేడాది మార్చి4న బిహార్‌లో సీతామర్హి నివాసి 22 ఏళ్ల సురేంద్ర కుమార్ వేదికపై దండలు మార్చుకుని నవ వధువుతో కూర్చొని ఉండగా.. ఆకస్మాత్తుగా కుప్పకూలి చనిపోయాడు. బాధితుడు చనిపోవడానకి ముందు డీజే సౌండ్ అసౌకర్యంగా ఉందని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం అదేలాంటి విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఓదెల మండలం కొలనూర్‌లో చోటు చేసుకుంది. రావు విజయ్‌కుమార్(33) అనే యువకుడు ఆనందంగా డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో చనిపోయాడు. ఇలా చనిపోయినవారంతే యువకులు. చాలా చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఎందుకు జరుగుతోందంటే..? ఏదైన ఉత్సవం, పెళ్లి వేడుకలో జనాల కోలాహలం ఎక్కువగా ఉంటుంది. దీనికి తగ్గట్టు డీజే మ్యూజిక్ లాంటివి పెద్దగానే పెడతారు. ఆ చుట్టూ ఉన్న జనాలు, ఆ మ్యూజిక్‌కి, ఉత్సాహం వచ్చి.. చిన్నా, పెద్దా, కాలు కదిపి చిందులు వేసేందుక రెడీ అయిపోతారు. దీంతో అక్కడుండే వాళ్లు మరింత ఉత్సాహంతో సౌండ్ పెంచేస్తుంటారు. ఇక డ్యాన్స్ చేసేవాళ్లు చుట్టూ ఉన్నజనం ఎంకరైజ్మెంట్, ఈలలను చూసి మరింతగా డ్యాన్స్ చేస్తుంటారు. దీంతో శరీరం అలసటకు గురై గుండెపై ఒత్తిడి పెరిగిపోతుంటుంది. ఇదేం పట్టించుకోకుండా ఆయా వ్యక్తులు శక్తికి మించి డ్యాన్స్‌లు చేసి కుప్పకూలి చనిపోవడం జరిగిపోతుంది. ఆ తర్వాత వైద్యులు గుండెపోటు లేదా గుండె ఆగిపోవడంతో చనిపోయారని ధృవీకరిస్తున్నారు. డ్యాన్స్ వల్ల వస్తుందా అంటే..? శరీరం బాగా అలిసిపోయేలా డ్యాన్స్ చేస్తే గుండెపోటు రావడం జరుగుతుందని చెబుతున్నారు వైద్యులు. ఎందుకంటే..? అప్పటికే శరీరంలో గుండెకు రక్తం సరఫరా అయ్యే నాళాల్లో అడ్డంకులు ఉంటాయి. ఎప్పుడైతే ఇలా అలసిపోతారు ఆ రక్త సరఫరా వేగం ఎక్కువ అవుతుంది. అది కాస్త గుండెపై ఒత్తిడి ఏర్పడి ఆగిపోవడం లేదా ఆకస్మికంగా రక్తం గడ్డకట్టి గుండె పోటు వచ్చి కుప్పకూలిపోవడం జరుగుతుంది. అందువల్ల శరీర సామర్థ్యానికి మించి డ్యాన్స్‌లు వంటివి చేయకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు మ్యూజిక్ వల్ల కూడా వస్తుందా..? భారీ శబ్దాలు వల్ల హార్ట్ ఎటాక్ వస్తుందా?. చెవి నుంచి వెళ్లే శబ్ద తరంగాలు గుండెను ప్రభావితం చేస్తాయా? అంటే ఔననే! చెబుతున్నారు వైద్యులు. భారీ శబ్దాలు మనిషిపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయని పరిశోధకులు యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో వెల్లడించారు. పెద్ద పెద్ద శబ్దాల వద్ద గుండె వేగంలో పెరుగుతున్న మార్పులను గుర్తించామని అన్నారు. ఈ బిగ్గర శబ్దాల కారణంగా వ్యక్తుల్లో గుండె దడ, స్ట్రోక్‌లు వచ్చే అవకాశాలు గట్టిగానే ఉన్నాయని పేర్కొన్నారు. మానవ చెవికి 60 డెసిబుల్స్ వరకు సాధారణమని వైద్యులు చెబుతున్నారు. నిజానికి ఆహ్లాదకరమైన వాయిస్ లేదా శబ్దాన్ని వినగానే కేవలం చెవితోనే వినం. హృదయంతో ఆస్వాదిస్తాం. ఇది తెలియకుండానే జరుగుతుంది. సంగీతంతో కొన్ని జబ్బులు నయం చేయడం అనే పురాతన వైద్యం ఇందులోనిదే. భయోత్సాహమైన సౌండ్లతో సాగే మ్యూజిక్ తరంగాలు కారణంగా మన శరీరంలో ఒక రకమైన ఆందోళనకు గురవ్వుతుంది. అది నేరుగా మన గుండెపైనే ప్రభావం చూపిస్తుంది. ఏవిధంగా మంచి సంగీతం హృదయాన్ని హత్తుకుని గుండె పదిలంగా ఉండేలా చేస్తుందో.. అదే మ్యూజిక్ మోతాదుకు మించితే గుండెకి డేంజరే అని అరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. (చదవండి: గుండె ‘లయ’ తప్పితే..ముప్పే! ఈ లక్షణాలు గమనించండి!) -
గుండె ‘లయ’ తప్పితే..ముప్పే! ఈ లక్షణాలు గమనించండి!
ఒకపుడు గుండెపోటు అంటే.. మధుమేహం ఉన్న వారికి, శారీరక శ్రమ లేని వారికి, వయసు మీద పడిన వారికి, ఊబకాయ ఉన్నవారికి మాత్రమే వస్తుంది అని అనుకునే వాళ్ళం. కానీ ప్రస్తుత కాలంలో గుండె పోటు తీరు మారింది. మాకు రాదులే అని అనుకోడానికి లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండానే ఇటీవలి కాలంలో గుండెపోటు సమస్య చాలా ఎక్కువగా వస్తుంది. మరీ ముఖ్యంగా జిమ్ చేస్తున్నవారు, ఎక్కువ కసరత్తు చేస్తున్న వారు కూడా ఎంతోమంది చిన్న వయసులోనే గుండెపోటుతో ప్రాణాలను కోల్పో తున్నారు. అసలు గుండె పోటు ఎందుకు వస్తుంది? గుండె పోటు వచ్చే ముందు మన శరీరం అసలు సంకేతాలు పంపిస్తుందా? ఈ కథనంలో చూద్దాం. జీవనశైలి మార్పులు, శారీరక శ్రమ లేకపోవడం, బీపీ, షుగర్ లాంటి వ్యాధుల బారిన పడిన వారిలో గుండె వ్యాధుల ప్రమాదం ఎక్కువ. అయితే ఇటీవలి కాలంలో అసలు అనారోగ్య సమస్యలేకపోయినా కూడా హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు. గుండెపోటు గుండె కండరానికి మంచి రక్తాన్ని తీసుకువెళ్లే రక్తనాళాలలో కొవ్వు కాని గడ్డలు కాని ఏర్పడడం వల్ల రక్తసరఫరాలో ఆటంకం ఏర్పడితే గుండె పోటు వస్తుంది. సాధారణంగా గుండె (కరోనరీ) ధమనులలో కొవ్వు, కొలెస్ట్రాల్ ,ఇతర పదార్థాలు పేరుకుపోవడం వల్ల అడ్డంకులు(బ్లాక్స్) ఏర్పడతాయి. రక్తనాళాలు పూడుకుపోవడం, రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోవడం తదితర కారణాల వల్ల గుండె పోటు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. వీటికి సరైన సమయంలో చికిత్స అవసరం. అలాగే బాడీలో విపరీతంగా కొలెస్ట్రాల్ పెరిగిన వారు కూడా గుండెపోటు బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలు వాస్తవానికి కొంతమందిలో తేలికపాటి లక్షణాలు ఉంటాయి. మరికొందరికి తీవ్రమైన లక్షణాలు ఉన్నాయి. కొందరిలో ఎలాంటి లక్షణాలు ఉండవు. కానీ సాధారణంగా గుండెపోటు వచ్చే ముందు కచ్చితంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయని, కానీ చాలామంది వాటిని గుర్తించడంలో వైఫల్యంతోనే ముప్పు ముంచుకొస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాంటి లక్షణాలు గుర్తించి, ప్రాథమిక చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం తప్పే అవకాశం చాలా ఉందిలో ఉంటుందని అంటున్నారు. ►గుండెల్లో మంట లేదా అజీర్ణం ►గొంతులో ఏదో ఇరుక్కున్నట్లు అనిపించడం ►ఛాతీలో నొప్పి, గుండె లయలో మార్పులు ►శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ►తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. ►తొందరగా అలసిపోవడం, అంటే కొద్దిగా నడిస్తేనే నీరసం ► నాలుగు మెట్టు ఎక్కంగానే ఆయాసం ఇలాంటి లక్షణాలున్నపుడు వెంటనే వైద్యుని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. ► మరి కొందరిలో ముందు దవడ, మెడ, జీర్ణాశయం పై భాగంలో నొప్పిగా ఉంటుంది. ► ఒకటి లేదా రెండు రోజులకు మించి ఎడం చెయ్యి లేదా రెండు చేతులలో అకారణంగా నొప్పి, వికారం, వాంతి వచ్చినట్టు ఉంటే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి లక్షణాలు లేకపోయినా ఎవరు జాగ్రత్త పడాలి ►అధిక బరువు వున్నా, హైబీపీ డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నా, ధూమపానం అలవాటు ఉన్న వారంతా గుండె పోటు ప్రమాదం పట్ల అవగాహనతో ఉండాలి. ► అలాగే ఎక్కువ ఒత్తిడి ఉండే ఉద్యోగాలు చేసేవారిలోనూ గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువ అనేది గమనించాలి. ►ముఖ్యంగా మధ్య వయసులో స్త్రీల కన్నా మగవారికి గుండెపోటువచ్చే ప్రమాదం ఎక్కువని నిపుణులు చెబుతన్నారు. ► మెనోపాజ్ దశలో మహిళల్లో ఈస్ట్రెజెన్ స్థాయి తగ్గిపోతుంది. అప్పుడు వారిలో గుండె పోటు ముప్పు పెరుగుతుంది. అయితే 65 ఏళ్ల తర్వాత పురుషుల్లో కంటే మహిళల్లో ఎక్కువ గుండె పోటు వస్తున్నట్టు పలు అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరువురిలోనూ అలసత్వం ఎంతమాత్రం మంచిది కాదు. ►మరీ ముఖ్యంగా కుటుంబంలో ఎవరికైనా గుండెపోటు వచ్చిన చరిత్ర ఉన్నా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. వంశపారంపర్యంగా ఈ గుండె వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. పై లక్షణాలున్నవారందరికీ గుండెజబ్బు వచ్చేసినట్టు కాదు. కానీ లక్షణాలు కనిపించగానే రోగ నిర్ధరణ అనేది చాలా కీలకం. క్రమం తప్పని వ్యాయామం, సమతుల ఆహారంపై శ్రద్దతో పాటు ఏ చిన్న అనుమానం వచ్చినా అజాగ్రత్త చేయకుండా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. -
మాజీ మంత్రికి గుండెపోటు
బీజేపీ నేత, పంజాబ్ మాజీ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ ఆదివారం గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే భటిండాలోని జిందాల్ హార్ట్ హాస్పిటల్లో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడ ఉంది. మన్‌ప్రీత్ సింగ్ బాదల్‌కు రెండు స్టెంట్లు అమర్చామని, ఆయన త్వరలోనే కోలుకుంటుందని వైద్యులు తెలిపారు. ఎస్ఏడీ చీఫ్ సుఖ్బీర్ బాదల్ కూడా ఆసుపత్రికి చేరుకుని మన్‌ప్రీత్ ఆరోగ్యంపై ఆరా తీశారు. బటిండా అర్బన్ నుండి ఎమ్మెల్యే అయిన బాదల్ 2023 జనవరిలో కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు. కాంగ్రెస్, ఎస్ఏడీ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన ఆయన చాలాసార్లు పార్టీ మారారు. శిరోమణి అకాలీదళ్‌తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మన్‌ప్రీత్ సింగ్ బాదల్ 2011లో పీపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్ అనే ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత 2016లో కాంగ్రెస్‌లో చేరారు. ఎన్నికల్లో ఆప్ అభ్యర్థిపై ఓడిపోయిన తర్వాత 2023లో బీజేపీలో చేరారు. -
గుండెపోటుతో 2వ తరగతి విద్యార్థి మృతి!
ఉత్తర ప్రదేశ్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గుండెపోటుతో 2వ తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్ -ఫిరోజాబాద్ నగరంలోని హన్స్ వాహిని పాఠశాలలో శనివారం లంచ్ టైంలో విద్యార్థులంతా స్కూల్ ఆవరణలో ఆడుకుంటున్నారు. ఆ సమయంలో చంద్రకాంత్(8) అనే బాలుడు అకస్మాత్తుగా నడుం చుట్టూ చేతులేసుకుని కుప్పకూలిపోయాడు. తోటి విద్యార్థులు అతన్ని పైకి లేపే ప్రయత్నం చేశారు. టీచర్లకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. గుండెపోటుకు గురై చనిపోయాడని వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గుండెపోటుతో 2వ తరగతి విద్యార్థి మృతి ఉత్తరప్రదేశ్ -ఫిరోజాబాద్ నగరంలోని హన్స్‌వాహిని పాఠశాలలో శనివారం మధ్యాహ్నభోజన సమయంలో విద్యార్థులంతా స్కూల్ ఆవరణలో ఆడుకుంటుండగా చంద్రకాంత్(8) అనే బాలుడు గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. pic.twitter.com/fsEWKuJLZU — Telugu Scribe (@TeluguScribe) March 10, 2024 Video Credits: Telugu Scribe -
అమ్మా.. 'ఎందుకు ఏడుస్తున్నావమ్మా..! నాన్నకు ఏమైంది..?
కరీంనగర్: ‘అమ్మా.. నాన్నకు ఏమైంది..? నాన్నాను ఎక్కడికి తీసుకెళ్తన్నారు.. ? మళ్లీ ఎప్పుడొస్తాడు..? అమ్మ ఎందుకు ఏడుస్తున్నావమ్మా..’ అంటూ ఆ చిన్నారులిద్దరూ అమాయకంగా అడుగుతుంటే ఏమని చెప్పాలో తెలియక అక్కడున్న వారందరూ గుండెలవిసేలా రోదించారు. నాన్న దూరమై చిన్నారులు.. కట్టుకున్న వాడు దూరమై భార్య, వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటాడనుకున్న ఒక్కగానొక్క కొడుకు దూరమై గుండెలవిసేలా ఏడుస్తున్న ఆ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. స్థానికుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మూగల రవి (35) ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లి మూడు నెలల క్రితమే ఇంటికొచ్చాడు. ప్రస్తుతం స్థానికంగా కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. బుధవారం ఉదయం అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. అప్పటివరకూ అందరితో కలివిడిగా గ్రామంలో తిరిగిన రవి గుండెనొప్పి బారిన పడడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన జగిత్యాల ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. రవికి భార్య జ్యోతి (29), కూతుళ్లు శాన్వి (7), సమన్వి (4) ఉన్నారు. రవి తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. చివరి దశలో ఆసరాగా ఉంటాడనుకున్న కొడుకు దూరమై తల్లిదండ్రులు, తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన భర్త మధ్యలోనే వదిలేసి వెళ్లడంతో వారి రోదనలు మిన్నంటాయి. తండ్రికి ఏమైందో తెలియని ఆ చిన్నారులు అమాయకంగా చూస్తుండడం అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది. ఇవి చదవండి: తండ్రి మందలించాడని.. -
కళ్లెదుటే.. కొత్తజంట జీవితం విషాదాంతం
ఢిల్లీ: సరదాగా రోజుని ప్రారంభించిన ఆ కొత్తజంట.. విషాదకరరీతిలో తమ జీవితాలకు ముగింపు పలికింది. 24 గంటల వ్యవధిలో భర్త కన్నుమూయగా.. భర్త మృతదేహాన్ని చూసి భరించలేని ఆమె బిల్డింగ్ మీద నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. దేశరాజధాని పరిధిలో జరిగిన ఈ హృదయవిదారక ఘటన వివరాల్లోకి వెళ్తే.. అభిషేక్ అహ్లూవాలీ-అంజలికి నవంబర్ 30వ తేదీన వివాహం జరిగింది. ఘజియాబాద్‌లో ఉంటున్న ఈ జంట.. సోమవారం ఢిల్లీ జూ సందర్శనకు వెళ్లింది. అయితే అక్కడికి వెళ్లిన కాసేపటికే ఛాతీలో నొప్పి ఉందంటూ అభిషేక్ అంజలితో చెప్పాడు. ఆందోళనతో అంజలి అతని స్నేహితులకు వెంటనే సమాచారం ఇచ్చింది. వాళ్లు అతన్ని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి సఫ్దార్జంగ్ ఆస్పత్రికి తరలించారు. కాసేపటికే అభిషేక్ కన్నుమూశాడని.. అతని మృతికి గుండెపోటే కారణమని వైద్యులు తెలిపారు. పోస్ట్‌మార్టం తర్వాత అభిషేక్ మృతదేహాన్ని రాత్రి 9గం. సమయంలో ఆ జంట ఉంటున్న ఫ్లాట్‌కు తరలించారు. అందరూ శోకసంద్రంలో మునిగిపోగా.. అంజలి మాత్రం అక్కడి నుంచి బయటకు వెళ్లింది. బంధువులు అప్రమత్తమై ఆమెను అడ్డుకునేలోపే.. ఏడో అంతస్తుకు చేరి అక్కడి నుంచి దూకేసింది. తీవ్రంగా గాయపడిన అంజలిని వైశాలి ఏరియాలోని ఓ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూసింది. 24 గంటల వ్యవధిలో.. అభిషేక్ అంజలి దంపతుల మృతి చెందడంతో ఇరుకుటుంబాల రోదనలతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. -
గుండె పోటుతో బీటెక్ విద్యార్థిని మృతి
నర్సాపూర్(జి): మండలంలోని బామిని(బి) గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల మేరకు... మండలంలోని బామిని(బి) గ్రామానికి చెందిన నార్వాడే హాసిని(18) హైదరాబాద్‌లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఆరోగ్యం బాగలేకపోవడంతో ఇటీవల ఇంటికి వచ్చేసింది. గురువారం రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు నిర్మల్ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు అర్ధరాత్రి మృతిచెందింది. తండ్రి నార్వాడే వెంకట్ రావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. కూతురు మరణించడంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. -
మైదానంలో విషాదం.. గుండెపోటుతో క్రికెటర్ మృతి
క్రికెట్ మైదానంలో విషాదం నెలకొంది. గుండెపోటు కారణంగా హోయ్‌సలా (32) అనే పేరుగల కర్ణాటక క్రికెటర్ మృతి చెందాడు. బెంగళూరులోని ఆర్ఎస్ఐ మైదానంలో జరుగుతున్న ఏజిస్ సౌత్ జోన్ టోర్నీలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. తమిళనాడుతో ఇవాళ (ఫిబ్రవరి 23) మ్యాచ్ జరుగుతుండగా హోయ్‌సలా మైదానంలోనే కుప్పకూలాడు. హుటాహుటిన సమీపంలోని బౌరింగ్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు వదిలినట్లు వైద్యులు తెలిపారు. బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన హోయ్‌సలా అండర్ 25 విభాగంలో కర్ణాటక జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. విధ్వంసర బ్యాటర్‌గా పేరున్న ఈ మిడిలార్డర్ బ్యాటర్.. కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లోనూ ఆడాడు. క్రికెటర్లు మైదానంలో ఆటగాళ్లు ఇలా మృతి చెందడం ఇది తొలిసారి కాదు. గతంలో అంతర్జాతీయ క్రికెటర్లు ఇయాన్ ఫాలీ, వసీం రజా, ఎడ్వర్డ్ కాక్స్, అండీ డకెట్, రేమండ్ వాన్ స్కూర్ హార్ట్ అటాక్ కారణంగా మైదానంలోనే ప్రాణాలు వదిలారు. రామన్ లాంబా, ఫిల్ హ్యూస్ లాంటి క్రికెటర్లు బంతి బలంగా తాకడంతో మృతి చెందారు. -
బినాకా గీత్‌మాలా అమీన్ సయానీ ఇకలేరు
ముంబై: నాలుగు దశాబ్దాలకుపైగా కోట్లాది మంది భారతీయ రేడియో శ్రోతలను తన గాత్రంతో కట్టిపడేసిన దిగ్గజ అనౌన్సర్ అమీన్ సయానీ ఇక లేరు. 91 ఏళ్ల సయానీ ముంబైలో మంగళవారం సాయంత్రం గుండెపోటు కారణంగా తుదిశ్వాస విడిచారని ఆయన కుమారుడు రాజిల్ చెప్పారు. ‘‘సాయంత్రం ఆరింటపుడు గుండెపోటు రాగానే హుటాహుటిన హెచ్ఎన్ రిలయన్స్ ఆస్పత్రికి తరలించాం. ఎంతగా ప్రయతి్నంచినా వైద్యులు ఆయనను కాపాడలేకపోయారు’’ అని కుమారుడు రాజిల్ వెల్లడించారు. బినాకా గీత్మాలాతో దేశవ్యాప్తంగా ఖ్యాతి ‘నమస్తే బెహ్నో ఔర్ భాయియో, మై ఆప్కా దోస్త్ అమీన్ సయానీ బోల్ రహా హూ’’ అంటూ మొదలయ్యే ఆయన గాత్రఝరికి మంత్రముగ్ధు్దలు కానివారే లేరు. రేడియో సిలోన్లో 1950వ దశకం ఆయనకు స్వర్ణయుగం. 1952 డిసెంబర్లో మొదలైన ‘బినాకా గీత్‌మాలా’ కార్యక్రమాన్ని అద్భుతమైన తన గాత్రంతో కోట్లాది మంది శ్రోతలకు ఫేవరెట్ ప్రోగ్రామ్‌గా మార్చేశారు. అలనాటి మేటి హిందీ సినిమా పాటలను పరిచయం, ప్రసారంచేస్తూ సాగే ఈ కార్యక్రమం 1952 నుంచి 1988దాకా నిరాటంకంగా ప్రతి బుధవారం ప్రసారమయ్యేది. 1988లో బినాకా గీత్మాలాను ఆలిండియా రేడియో వారి వివిధ్ భారతిలోకి మార్చారు. 1994దాకా ఆ కార్యక్రమం అత్యంత ప్రజాదరణ పొందిన పోగ్రామ్‌గా కీర్తి గడించిందంటే దానికి కారణం సయానీయే. అత్యంత ఎక్కువకాలం నడిచిన కార్యక్రమంగానూ అది రికార్డు సృష్టించింది. ప్రసారమయ్యే పాటల్లోని విశిష్టతను తనదైన విశ్లేషణతో చెబుతూ శ్రోతలను ఆకట్టుకుంటూ ‘రేడియో మ్యా్రస్టో’గా ప్రసిద్ధికెక్కారు. 50,000 ప్రోగ్రామ్‌లు, 19వేలకుపైగా జింగిల్స్ 1932 డిసెంబర్ 21వ తేదీన ముంబైలో ‘బహుభాషా’ కుటుంబంలో జన్మించిన సయానీ 13 ఏళ్ల వయసులోనే తల్లికి ‘రెహ్బార్’ పక్షపత్రికలో రచనలో సాయపడేవారు. ఆలిండియా రేడియో బాంబేలో చిన్నారుల కార్యక్రమంలో పాల్గొనేవారు. కెరీర్ మొదట్లో ఇంగ్లిష్ బ్రాడ్‌కాస్టర్‌గా పనిచేశారు. స్వాతంత్య్రం సిద్ధించాక హిందీలోకి మారారు. రేడియోలో ఏకంగా 50,000 ప్రోగ్రామ్‌లు, 19వేలకుపైగా జింగిల్స్ చేశారు. తన సోదరుడు హమీద్ మరణం తర్వాత ఆయన నుంచి బాధ్యతలు తీసుకుని ఎనిమిదేళ్లపాటు బోర్న్‌వీటా క్విజ్ పోటీని విజయవంతంగా నిర్వహించారు. సంగీత శిఖరాలు లతా మంగేష్కర్, కిశోర్ కుమార్‌లతో ఈయన చేసిన ఇంటర్వ్యూలు ఆనాడు అమిత ఆదరణ పొందాయి. సయానీ మరణంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీసహా పలు రంగాల ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. -
గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి
బాలీవుడ్ టెలివిజన్ నటుడు రితురాజ్ సింగ్ గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని అతని సన్నిహితుడు నటుడు అమిత్ బెహ్ల్ ధృవీకరించారు. నివేదిక ప్రకారం, రితురాజ్ సోమవారం రాత్రి మరణించాడు. ప్యాంక్రియాటిక్ (కాలేయ క్యాన్సర్) వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇటీవల ఆసుపత్రిలో చేరారు. ప్యాంక్రియాటిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్న రితురాజ్ సింగ్ కొద్దిరోజుల క్రితం ఆసుపత్రిలో చికిత్స తీసుకుని చేరుకున్నాడు. అనంతరం గుండెపోటుతో మరణించాడని ఆయన స్నేహితుడు అమిత్ తెలిపాడు. అప్పటికే ఆయనకు గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆపై ప్యాంక్రియాటిక్ సమస్య కూడా ఉండటంతో ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు ఆయన పేర్కొన్నాడు. రితురాజ్ బాలీవుడ్లో అనేక సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా నటించారు. బనేగీ అప్నీ బాత్, జ్యోతి, హిట్లర్ దీదీ, షపత్, వారియర్ హై, ఆహత్, అదాలత్, దియా ఔర్ బాతీ హమ్ వంటి అనేక వాటిలో నటించారు. గతేడాదిలో వచ్చిన అజిత్ (తెగింపు) చిత్రంలో కూడా ఆయన నటించాడు. -
బైక్‌పై వెళ్తున్న యువకునికి గుండెపోటు
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో విషాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళుతున్న యువకునికి గుండెపోటు వచ్చి, బైక్‌పై పైనుంచి కింద పడ్డాడు. బాధితుడిని ఆసుపత్రికి తీసుకు వెళ్లేలోగానే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఇండోర్ పరిధిలోని ముసాఖేడీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రాంతానికి చెందిన రాహుల్ రైక్వార్‌కు బైక్‌పై వెళుతుండగా గుండెపోటు వచ్చినట్లు ఆజాద్ నగర్ పోలీసులు తెలిపారు. రాహుల్ వయసు 26 ఏళ్లు. రాహుల్ తన తమ్మునితో కలిసి ఏదో పనిమీద బైక్‌మీద బయలు దేరాడు. బైక్‌పై వెనుక రాహుల్ కూర్చోగా, అతని తమ్ముడు బైక్ నడుపుతున్నాడు. దారిలో రాహుల్‌కు గుండె నొప్పి వచ్చింది. దీంతో బైక్‌పై నుంచి కింద పడిపోయాడు. దీనిని గమనించిన అతని తమ్ముడు చుట్టుపక్కలవారి సాయంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. బాధితుని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. కాగా మృతుడు రాహుల్‌కు ఏడాదిన్నర కుమార్తె ఉంది. కాగా చిన్నవయసులో గుండెపోటుకు క్రమరహిత దినచర్య, అనారోగ్యకర ఆహారం, జంక్ ఫుడ్, నిద్రలేమి, ఒత్తిడి ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. -
ఖమ్మంలో విషాదం.. రన్నింగ్ బస్సులో డ్రైవర్‌కు గుండెపోటు
ఖమ్మం: జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ కన్నుమూశాడు. సత్తుపల్లి నుంచి ఖమ్మం బయల్దేరిన బస్సులో డ్రైవర్ శ్రీనివాసరావుకు ఛాతీలో నొప్పి వచ్చింది. అయితే ఆయన ఆలస్యం చేయలేదు. ప్రయాణికులతో ఉన్న ఆ బస్సును వెంటనే పక్కకు ఆపారు. ఆపై దగ్గరిలోని ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. గుండెపోటుతోనే ఆయన కన్నుమూసినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరావు స్వస్థలం వేంసూరు మండలం రామన్నపాలెంగా తెలుస్తోంది. -
మహిళకు గుండెపోటు.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఎస్ఐ
సాక్షి, యాదాద్రి భువనగిరి: వలిగొండలో గుండెపోటుకు గురై ఓ మహిళ స్పృహతప్పి పడిపోయింది. అక్కడే వాహన తనిఖీలు చేస్తున్న వలిగొండ ఎస్ఐ మహేందర్ ఆమెకి సీపీఆర్ చేసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆ మహిళ భువనగిరి మండలం మన్నెవారిపంపునకు చెందిన బోయిన వెంకటమ్మ గుర్తించారు. పలువురు ఎస్ఐని అభినందించారు. -
గుండెపోటుతో 8వ తరగతివిద్యార్థిని కన్నుమూత
సిద్దిపేటఅర్బన్: ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని గుండెపోటుతో కన్నుమూసింది. ఈ ఘటన సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లిలో బుధవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన అంబటి మహేశ్ కూతురు లాక్షణ్య (13) సిద్దిపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. మంగళవారం రాత్రి జ్వరంతో బాధపడుతుండగా తల్లిదండ్రులు మాత్ర వేస్తే మరుసటి రోజు ఉదయం వరకు తగ్గింది. అప్పుడే టిఫిన్ చేసి ఇంట్లోనే కూర్చుంది. కాసేపటికి బూత్రూంకు వెళ్లింది ఎంతకీ బయటికి రాకపోయే సరికి తల్లిదండ్రులు వెళ్లి చూస్తే అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు అప్పటికే బాలిక మృతిచెందిందని, తీవ్రమైన గుండెపోటు రావడంతోనేనని తెలిపారు. -
గుండెపోటుతో చింపాంజీ మృతి
విశాఖపట్నం: ఇందిరాగాంధీ జూ పార్కులో చీపా అనే ఆడ చింపాంజీ బుధవారం మృతి చెందింది. దీని వయసు 29 సంవత్సరాలు ఉంటుందని జూ క్యూరేటర్ నందనీ సలారియా తెలిపారు. జూ ఆస్పత్రిలో వెటర్నరీ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్డియక్ అరెస్టుతో మృతి చెందినట్లు పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం వెల్లడైనట్లు ఆమె తెలిపారు. దీన్ని 2016లో ఇజ్రాయిల్ జూ పార్కు నుంచి ఇక్కడకు తీసుకొచ్చినట్లు చెప్పారు. ఒంటరైన చికిత ప్రస్తుతం జూ పార్కులో ఉన్న చికిత అనే పేరుగల చింపాంజీ ఒంటరైంది. ఇంతవరకు తోడుగా ఉన్న చీపా మరణించడంతో చికిత ఒక్కటే ఇక్కడ మిగిలింది. 2016లో ఇజ్రాయిల్ నుంచి చికో అనే పేరుగల ఒక మగ చింపాంజీ, చీపా, చికిత అనే రెండు ఆడ చింపాంజీలను విశాఖ జూకి తీసుకొచ్చారు. చికో మూడేళ్ల క్రితం మృతి చెందగా బుధవారం చీపా మృతి చెందింది. దీంతో చికిత ఒంటరిగా మిగిలింది. -
బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. 60 మందిని కాపాడి, చివరికి..
భువనేశ్వర్: బిహార్‌లో విషాదం చోటుచేసుకుంది. బస్సు నడుపుతుండగా గుండెపోటుకు గురైన డ్రైవర్.. అప్రమత్తతో వ్యవహరించడంతో 60 ప్రయాణికుల ప్రాణాలు నిలిచాయి. కానీ దురదృష్టవశాత్తూ అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బాలాసోర్ జిల్లాలోని పటాపూర్ చక్‌లో మంగళవారం ఉదయం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్‌కు చెందిన పర్యాటకులతో ఓ బస్సు బాలాసోర్‌లోని పంచలింగేశ్వరాలయం వైపు వెళ్తుంది. మార్గ మధ్యంలో బస్సు డ్రైవర్ గుండెపోటుకు గురయ్యాడు. ఛాతీతో ఉన్నట్టుండి నొప్పి రావడంతో వెంటనే బస్సును పక్కను నిలిపివేశాడు. అనంతరం అతడు స్పృహ కోల్పోయాడు. దీంతో తీవ్ర భయందోళనకు గురైనన ప్రయాణికులు వెంటనే స్థానికుల సాయంతో దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతను ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. మృతిచెందిన డ్రైవర్‌ను షేక్ అక్తర్‌గా గుర్తించారు. అతడి అప్రమత్తతో ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. చదవండి: మాకు నితీష్ అవసరం లేదు: రాహుల్ -
Adilabad:అవార్డు అందుకున్న రోజే హఠాన్మరణం
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయ మేనేజర్ చెన్నమాధవ దివాకర్ (56) హఠాన్మ రణం చెందారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం ఉదయం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆయన కలెక్టర్ రాహుల్‌రాజ్ చేతుల మీదుగా ఉత్తమ అధికారిగా ప్రశంసాపత్రం అందుకున్నారు. అనంతరం పట్టణంలోని అంబికానగర్‌లో గల తన ఇంటికి వెళ్లారు. అల్పాహారం తింటుండగా శ్వాస సమస్య తలెత్తడంతో కుటుంబీకులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దివ్యాంగుడైన దివా కర్కు భార్య నాగలక్ష్మి, కుమా రులు మణికంఠ సాయి, గిరిధర్ సాయి ఉన్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్‌కు చెందిన దివాకర్ 2003లో ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో టైపిస్ట్‌గా నియుక్తులయ్యారు. అంచెలంచెలుగా ఎదిగి మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థిరపడ్డారు. అవార్డు వచ్చిన ఆనందంలో ఇంటికి వెళ్లిన ఆయన గంట వ్యవధిలోనే మృత్యుఒడికి చేరడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చదవండి: బేగంపేట పీజీ ఉమెన్స్ హాస్టల్లో కలకలం.. బాత్రూంలోకి చొరబడ్డ ఆగంతకులు -
ఆరోగ్యశ్రీతో 3,67,305 మందికి పునర్జన్మ
గుండె పోటు అనగానే ఎవరికైనా సరే సగం ప్రాణాలు పోతాయి. మిగతా సగం ప్రాణాలు పోకుండా కాపాడుకోవాలంటే వెంటనే అత్యుత్తమ వైద్యం అందాలి. ఇది జరగాలంటే చేతిలో కనీసం రెండు మూడు లక్షల రూపాయలుండాలి. డబ్బులున్నోళ్లయితే వెంటనే కార్లో వెళ్లి కార్పొరేట్ ఆస్పత్రిలో జాయినైపోతారు. మరి రెక్కాడితే కానీ డొక్కాడని పేదల పరిస్థితి ఏమిటి? ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందేనా? ఇదంతా గతం. గత టీడీపీ ఐదేళ్ల దుర్మార్గపు పాలనలో, మనసు లేని పాలకుల హయాంలో ఇలాగే జరిగేది. ఇప్పుడా పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడా లేదు. నేనున్నానంటూ ‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’ రూపంలో సీఎం వైఎస్ జగన్ గుండె గుండెకూ భరోసా ఇస్తున్నారు. ఇలా ఇప్పటిదాకా వంద కాదు.. వెయ్యి కాదు.. లక్ష కాదు.. ఏకంగా 3.67 లక్షల మందికి పునర్జన్మ ఇచ్చారు. ఇంతటి మేలు ఏపీ మినహా ఏ రాష్ట్రంలోనూ జరగలేదనడం పచ్చి నిజం. అతనో ఆటో డ్రైవర్.. పేరు పొందూరు విజయ్ కుమార్.. ఊరు పార్వతీపురం. వచ్చే ఆదాయం ఇంట్లో వాళ్లు మూడు పూటలా తినడానికి కూడా సరిగా సరిపోదు.. ఒకరోజు ఉన్నట్టుండి ఛాతిలో నొప్పి రావడంతో వైద్యుడి వద్దకు వెళ్లాడు. గుండెలో మూడు రక్తనాళాలు మూసుకుపోయినట్లు గుర్తించి, వెంటనే బైపాస్ సర్జరీ చేయాలని చెప్పారు. ఆ మాట వినగానే అతడు వణికిపోయారు. తానిక బతకనంటూ కుటుంబ సభ్యుల ఎదుట కన్నీరు పెట్టుకున్నాడు. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఏం చేయాలో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతుంటే.. ‘ఏదో ఒక పెద్దాసుపత్రికి వెంటనే వెళ్లిపోండి.. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్ చేస్తారు’ అని అక్కడి వారు చెప్పారు. విశాఖ మెడికవర్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఇతనికి వెంటనే రెండున్నర లక్షల రూపాయల ఆపరేషన్‌ను ఉచితంగా చేశారు. రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తూ వైఎస్సార్ ఆసరా కింద రూ.10,000 అందజేశారు. ఇప్పుడు చక్కగా ఆటో తోలుకుంటూ ఆనందంగా జీవిస్తున్నాడు. –సాక్షి, అమరావతి 3.67 లక్షల మందికి పునర్జన్మ 2019 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,67,305 మంది గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు అందుకున్నారు. వీరికి 4,87,303 ప్రొసీజర్లలో చికిత్సలు అందించడానికి ప్రభుత్వం ఏకంగా రూ.2,229.21 కోట్లు ఖర్చు చేసింది. కాగా, 3.67 లక్షల మందిలో 2,22,571 మంది యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, హార్ట్ స్ట్రోక్, స్టెంట్లు వంటి కార్డియాలజీ సంబంధిత 2.82 లక్షల ప్రొసీజర్లలో చికిత్సలు అందుకున్నారు. మిగిలిన 1,44,734 మంది బైపాస్ సర్జరీలు, వాల్వ్ రిపేర్, కార్డియాక్, కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగంలో 2.05 లక్షల ప్రొసీజర్లలో ఉచిత వైద్య సేవలు అందుకున్నారు. మరో వైపు చికిత్స అనంతరం ఆరోగ్య ఆసరా కింద విశ్రాంత సమయానికి నెలకు గరిష్టంగా రూ.5 వేల వరకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం అరకబద్ర గ్రామానికి చెందిన కె.సాహూ ఇంటి వద్ద చిన్న కొట్టు నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. నిరుపేద కుటుంబం. 2020 డిసెంబర్ 23 అర్ధరాత్రి ఛాతీలో నొప్పి రావడంతో తొలుత బరంపురం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వెంటనే గుండె ఆపరేషన్ చేయాలని చెప్పగా, కుటుంబ సభ్యులు విశాఖకు తీసుకెళ్లారు. ఆరోగ్య శ్రీ కింద అక్కడ ఉచితంగా గుండె ఆపరేషన్ నిర్వహించారు. తర్వాత ఆరోగ్య ఆసరా కింద ప్రభుత్వం రూ.5 వేలు అతని ఖాతాలో జమ చేసింది. గుంటూరు రాజీవ్‌గాంధీనగర్‌లో ఉంటున్న ఆటో డ్రైవర్ రావెల ప్రభాకర్‌దీ అదే పరిస్థితి. రూ.3 లక్షల ఖర్చయ్యే ఆపరేషన్‌ను ఉచితంగా చేయించిన ప్రభుత్వం పునర్జన్మనిచ్చింది. ఇలాంటి వారు తక్కువలో తక్కువ రాష్ట్ర వ్యాప్తంగా ఊరికొకరున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులతో బతికి బట్టకట్టగలిగారు. ఈ పథకమే లేకపోయి ఉండుంటే తామంతా ప్రాణాలతో ఉండే వాళ్లం కాదంటున్నారు. చేతి నుంచి చిల్లిగవ్వ ఖర్చు పెట్టే పని లేకుండా ఖరీదైన గుండె ఆపరేషన్, గుండె మార్పిడి చికిత్సలను సైతం ప్రభుత్వం ఉచితంగా చేయిస్తోంది. ఏపీతో పాటు, రాష్ట్రం వెలుపల చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి. రూ.25 లక్షల వరకు వైద్యం ఉచితం నిరుపేదలు, రూ.5 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాల ప్రజలకు ఒక్క గుండె సంబంధిత చికిత్సలే కాకుండా అనేక రకాల ఆరోగ్య సమస్యల్లో ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు అందిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ ఈ పథకాన్ని విప్లవాత్మకంగా బలోపేతం చేశారు. ఇటీవల వైద్య ఖర్చుల పరిమితిని రూ.25 లక్షలకు పెంచారు. గత ప్రభుత్వంలో 1,059 ప్రొసీజర్లు ఉండగా, వాటిని 3,257కు పెంచారు. 2019 నుంచి ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా కోసం ఏకంగా రూ.13 వేల కోట్లకు పైగానే ఖర్చు చేసింది. 40 లక్షల మందికి ఉచితంగా వైద్య సేవలు అందించారు. కొత్తగా 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు నడుం బిగించారు. ఇందులో ఐదు కళాశాలలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరో ఐదు వచ్చే ఆర్థిక ఏడాదిలో ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. నాడు–నేడు కింద ప్రభుత్వ ఆస్పత్రులన్నింటినీ అభివృద్ధి చేస్తున్నారు. 53 వేల మందికి పైగా వైద్యులు, వైద్య సిబ్బందిని కొత్తగా నియమించారు. ఉద్దానంలో వైఎస్సార్ కిడ్నీ పరిశోధన కేంద్రం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించారు. ఫ్యామిలీ డాక్టర్ పేరుతో గ్రామీణులకు వైద్యాన్ని మరింత చేరువ చేశారు. వీటన్నింటికీ తోడు వైఎస్సార్ ఆరోగ్య సురక్ష క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారు. తొలి విడత 12,423 శిబిరాలు నిర్వహించి, 60.27 లక్షల మందికి ఓపీ సేవలు అందించారు. రెండవ దశలో ఇప్పటి వరకు 2,838 క్యాంపులు నిర్వహించి, 9.48 లక్షల మందికి వైద్యం అందించారు. దేవుడిలా ఆదుకున్నారు నాకు 71 ఏళ్లు. అరటిపళ్లు, కొబ్బరికాయలు అమ్ముకునే చిరు వ్యాపారిని. ఆయాసంతో బాధ పడుతున్నాను. దీంతో గత ఏడాది ప్రభుత్వం మా ఊళ్లో ఆరోగ్య సురక్ష క్యాంప్ పెట్టినప్పుడు వైద్యులను సంప్రదించా. రాజమండ్రిలో ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లమన్నారు. అక్కడకు వెళ్లగా పరీక్షలు చేసి రక్తనాళాలు పూడిపోయాయని చెప్పారు. బైపాస్ సర్జరీ చేయాలన్నారు. మా అబ్బాయి ఎలక్ట్రికల్ పనులు చేస్తుంటాడు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి మాది. ఈ క్రమంలో బైపాస్ సర్జరీ చేయించుకోవడానికి అప్పులు చేయాల్సి వస్తుందని భయపడ్డాను. ఆరోగ్యశ్రీ పథకం దేవుడిలా అదుకుంది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే అక్టోబర్ 25న సర్జరీ చేయించింది. డిశ్చార్జి అయ్యాక కోలుకునే సమయానికి రూ.9500 భృతి బ్యాంక్ ఖాతాలో జమ చేసింది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. ప్రభుత్వం మేలును ఎన్నటికీ మరువము. – గుత్తికొండ వెంకటరమణ, తేతలి గ్రామం, పశ్చిమగోదావరి జిల్లా ఆరోగ్యశ్రీ నా ప్రాణం నిలబెట్టింది వీధి వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నాను. 2022 జూన్‌లో ఎక్కువగా గుండె నొప్పి వచ్చింది. ఆస్పత్రికి వెళ్లి చూపిస్తే వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. దీంతో నా గుండె ఆగినంత పనైంది. ముగ్గురు ఆడపిల్లల్లో ఇద్దరికి పెళ్లి చేశాను. ఇంకా ఒక అమ్మాయి ఉంది. రోజంతా రోడ్డు మీద కొబ్బరికాయలు, పళ్లు అమ్మితేనే నోటికి కూడు దక్కుతాది. వచ్చే డబ్బుతో కుటుంబ పోషణ, మూడో అమ్మాయి పెళ్లి ఇలా చాలా సమస్యలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆపరేషన్ అంటే ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీతో డబ్బులు లేకుండానే ఆపరేషన్ చేస్తారని మా ఊరి నర్స్ చెప్పంది. దీంతో శ్రీకాకుళంలో ఆస్పత్రికి వెళ్లగా అక్కడ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్ చేశారు. ఈæ పథకం లేకపోతే.. నాలాంటి పేదోడికి దిక్కేది? ఈ పథకమే నా ప్రాణం నిలబెట్టింది. – బోర రామ్మూర్తి, రాందాస్‌పేట, శ్రీకాకుళం జిల్లా పేదలపై వైద్య ఖర్చుల భారం లేదు రాష్ట్రంలో వైద్యం కోసం పేదలు, మధ్యతరగతి ప్రజలు అప్పులపాలు కాకూడదు అనేది ప్రభుత్వ లక్ష్యం. ఆ మేరకు పథకానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. అర్హులందరికీ ఉచితంగా చికిత్సలు అందేలా చూస్తున్నాం. గుండె, కాలేయం, కిడ్నీ సంబంధిత, క్యాన్సర్ వంటి పెద్ద పెద్ద జబ్బులకు చికిత్సలు పథకం పరిధిలో ఉన్నాయి. సేవలు పొందడంలో ఏవైనా సందేహాలుంటే 104ను సంప్రదించవచ్చు. వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి పథకం గురించి ప్రజలకు వివరిస్తున్నారు. – డి.కె.బాలజీ, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో -
Hyderabad: గుండెపోటుతో డీసీపీ వెంకటేశ్వర్లు కుమారుడు మృతి
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్, సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు కుమారుడు చంద్రతేజ్ (20) మృతి చెందాడు. సోమవారం రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ప్రాణాలు విడిచాడు. మృతదేహాన్ని వారి స్వగ్రామం నల్లగొండ జిల్లాకు తరలించారు. కాగా చంద్రతేజ్ ఓ ప్రైవేటు కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. స్వతహాగా వ్యాపరంలో రానిస్తున్నాడు. ఇటీవల సంక్రాంతికి తండ్రి వెంకటేశ్వర్లుకు కారును కూడా గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ లోపే చిన్న కుమారుడు మృతితో చంద్రతేజ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
విషాదం: రామజపంతో కుప్పకూలిన ‘హనుమాన్’
Sudden Death Video: అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ట నేపథ్యంలో.. సోమవారం దేశమంతా భక్తిపారవశ్యంతో ఊగిపోయింది. పల్లెపట్టణం తేడా లేకుండా రామ మందిర వేడుకల్ని ఘనంగా చేసుకున్నాయి. దేశం నలుమూలల ఒక పండుగ వాతావరణం కనిపించింది. ఆలయాల్లో బయటా.. అన్నదానాలు.. బాణాసంచా కాల్చి సంబురాలు.. రథయాత్రలు.. ఊరేగింపులు.. రామాయణ ఘట్టాల్ని నాటక రూపంలో ప్రదర్శనలు నిర్వహించారు. ఈ క్రమంలో హర్యానా భివానీలో నిర్వహించిన ‘రామ్‌లీలా’లో విషాదం చోటుచేసుకుంది. హనుమంతుడి వేషధారణలో ఉన్న నటుడు రామ నామం జపిస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అయితే ఆయన నటిస్తున్నారేమో అనుకుని అంతా చప్పట్లు కొట్టగా.. రాముడి వేషధారణలో ఉన్న నటుడు దగ్గరగా వెళ్లి చూసేసరికి చలనం లేకుండా పడి ఉన్నాడు. హుటాహుటిన అలాగే ఆయన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. भिवानी में घटी दुखद घटना, श्री राम मूर्ति प्राण प्रतिष्ठा के उपलक्ष्य में हनुमान बने कलाकार ने त्यागे प्राण,भगवान राम की झांकी के दौरान श्री राम के चरणों में त्यागे प्राण।डॉक्टरों के मुताबिक कलाकार को हार्ट अटैक आने से हुई मौत। #RamMandirPranPrathistha #Haryana #bhiwani… pic.twitter.com/uBRwsRcT50 — Haryana Tak (@haryana_tak) January 23, 2024 Video Credits: Haryana Tak మృతుడి పేరును హరీష్ మెహతా. విద్యుత్ శాఖలో జూనియర్ ఇంజినీర్‌గా పని చేసిన ఆయన పదవీ విరమణ పొందారు. గత పాతికేళ్లుగా ఆయన హనుమంతుడి వేషధారణతో అలరిస్తూ వస్తున్నారు. సోమవారం ఒకవైపు అయోధ్య ప్రాణప్రతిష్ట జరుగుతున్న సమమయంలో భివానీ జవహార్ చౌక్ వద్ద ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానికంగా విషాదం అలుముకుంది. -
కోచింగ్ సెంటర్లో కుప్పకూలిన యువకుడు.. కాసేపటికే మృతి
భోపాల్: ప్రమాదం ఎప్పుడు, ఎటు నుంచి వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అప్పటి వరకు సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఉన్నట్టుండి ప్రాణాలు విడుస్తున్న సందర్భాలు ఇటీవల అధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సడెన్ హార్ట్ ఎటాక్ ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా వస్తున్న ఈ గుండెపోటు మరణాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 18 ఏళ్ల ఓ యువకుడు గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. 18 ఏళ్ల ఓ విద్యార్ధి కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతూ ఉన్నట్టుండి ఛాతీలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి విద్యార్థులు అసుపత్రికి తరలించగా.. గుండెపోటుతో యువకుడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. బుధవారం సాయంత్రం ఈ విషాద ఘటన జరిగింది. క్లాస్ రూమ్‌లోని సీసీటీవీ ఫుటేజీలో ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. చదవండి: Tammineni: వెంటిలేటర్‌పైనే తమ్మినేని.. విషమంగా ఆరోగ్యం ఇండోర్‌లోని భన్వర్కువాన్ ప్రాంతానికి చెందిన మాధవ్, మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎంపీపీఎస్సీ) ప్రవేశ పరీక్ష కోసం సన్నద్ధమవుతున్నాడు. రోజులాగే బుధవారం కోచింగ్ సెంటర్‌కు వెళ్లాడు. తరగతి గదిలో కూర్చొని క్లాస్‌లు వింటున్న సమయంలో అతనికి ఒక్కసారిగా ఛాతీలో నొప్పి కలగడంతో టేబుల్‌పై ఒరిగాడు. గమనించిన పక్కనే కూర్చున్న యువకుడు మాధవ్ వీపు మీద రుద్దడం ప్రారంభించాడు. అతనికి ఇంకా నొప్పిగా ఉండటంతో వెంటనే ఈ విషయాన్ని ట్రైనర్‌కు తెలియజేశాడు. ఆలోపే మాధవ్ పూర్తిగా కుప్పకూలి తన డెస్క్ నుంచి జారీ కింద పడిపోయాడు. అప్రమత్తమైన మిగతా విద్యార్ధులు మాధవ్‌కు సాయం చేసేందుకు వచ్చారు. అతడిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో తరలించారు. అయితే కొంత సేపటికే యువకుడు మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. Tragic news from #Indore MPPSC aspirant dies from fatal heart attack during coaching class. CCTV footage from classroom shows Raja Lodhi sitting upright focused... Suddenly begins clutching his chest, expressing visible distress. Loses balance within seconds & falls off. Hospital… pic.twitter.com/Xf3ni3fitC — Nabila Jamal (@nabilajamal_) January 18, 2024 -
Tammineni: వెంటిలేటర్‌పైనే తమ్మినేని.. విషమంగా ఆరోగ్యం
సాక్షి, హైదరాబాద్: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం విషమంగా ఉందని ఏఐజీ ఆస్పత్రి ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. స్వగ్రామమైన ఖమ్మం జిల్లాలోని తెల్దారుపల్లిలో ఉన్న తమ్మినేనికి సోమవారం సాయంత్రం ఒంట్లో నలతగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు పల్స్ తక్కువగా ఉండటాన్ని గుర్తించి వెంటనే చికిత్స అందించారు. అయితే గుండె కొట్టుకోవడంలో తేడాలున్నాయని వైద్యులు చెప్పారు. దీంతో కుటుంబసభ్యులు తమ్మినేనిని వెంటిలేటర్ సపోర్టుతో ఖమ్మం నుంచి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. గుండె పనిచేయకపోవడం, గుండె కొట్టుకోకపోవడంతో అసాధారణ పరిస్థితి నెలకొందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దీంతోపాటు మూత్రపిండాలు పనిచేయకపోవడం, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్ల ఇన్వాసివ్ వెంటిలేషన్ అవసరమైంది. బీపీ మెరుగుపరిచేందుకు మందులు అందిస్తున్నారు. ఊపిరితిత్తుల నుంచి నీరు తొలగించి, గుండె సాధారణ స్థితికి వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. డాక్టర్ సోమరాజు, డాక్టర్ డీఎన్ కుమార్ మార్గదర్శకత్వంలో తమ్మినేనికి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి ఇంకా విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై ఉన్నారని ఆ బులెటిన్‌లో ఏఐజీ వెల్లడించింది. ఆస్పత్రిలో తమ్మినేని ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో సంప్రదించి తగిన వైద్యం అందించడానికి పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, డీజీ నరసింహారావు, పి.ప్రభాకర్ పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు తమ్మినేనిని మాజీ మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు. తమ్మినేని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. 2004లోనూ తమ్మినేనికి గుండెనొప్పి రావడంతో వైద్యులు స్టంట్స్ వేశారు. -
ప్రియునితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
కర్ణాటక: ప్రియునితో కలిసి భర్తను హత్యచేసి, గుండెపోటుతో చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసిన ఖతర్నాక్ భార్య, ఆమె ప్రియుడు నితీశ్ కుమార్‌ను హెచ్ఎస్ఆర్ లేఔట్ పోలీసులు అరెస్ట్‌చేశారు. బెంగళూరు ఆగ్నేయవిబాగ డీసీపీ సీకే.బాబా శనివారం వివరాలను వెల్లడించారు. ఏపీలోని పుట్టపర్తి తాలూకాకి చెందిన నందిని బాయి, భర్త వెంకటరమణ నాయక్ (30) హెచ్ఎస్ఆర్ లేఔట్లో నివాసం ఉండేవారు. వెంకటరమణ పగటివేళ ఒక షాపులో, రాత్రి వేళ ఓ ఇంటి సెక్యూరిటి గార్డుగా పనులు చేస్తూ కుటుంబ పోషణకు శ్రమించేవాడు. ఇదే సమయంలో భార్య నందినిబాయి తమ ఊరికే చెందిన ప్రియుడు నితీశ్ కుమార్‌ను తరచూ ఇంటికి పిలిపించుకునేది. భర్త ఇంటికి తిరిగిరాగా ఈ నెల 6వ తేదీన భర్త వెంకటరమణ విధులకు వెళ్లగా, నందినిబాయి ప్రియున్ని ఇంటికి పిలిపించింది. అయితే ఆ రోజు పనిలేదని కొంతసేపటికే భర్త తిరిగి వచ్చాడు. భార్య, ప్రియుడు పడకగదిలో ఉండడం చూసి వెంకటరమణ కోపంతో గొడవకు దిగాడు. భార్య, ఆమె ప్రియుడు కలిసి వెంకటరమణ తలపై రుబ్బుగుండుతో దాడిచేసి అంతమొందించి మృతదేహాన్ని టాయిలెట్లో పడేశారు. తరువాత పోలీసులకు ఫోన్‌చేసి తన భర్త గుండెపోటుతో మరణించాడని చెప్పింది. పోలీసులు చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పోస్టుమార్టం చేసి గుండెపోటు కాదని, హత్య అనే అనుమానం ఉందని తెలిపారు. పోలీసులు నందినిబాయిపై నిఘాపెట్టి అదుపులోకి తీసుకుని విచారణచే పట్టగా విషయం అంతా వివరించింది. పోలీసులు ఇద్దరినీ అరెస్ట్‌చేసి విచారణ చేపట్టారు. హతుడు వెంకటరమణ (ఫైల్) -
టాలీవుడ్లో విషాదం.. గుండెపోటుతో దర్శకుడు మృతి
ప్రముఖ జర్నలిస్ట్, సినీ దర్శకుడు కె. జయదేవ్ సోమవారం రాత్రి గుండెపోటుతో హైదరాబాద్‌లో మృతి చెందారు. పలు షార్ట్ ఫిలింస్‌కి దర్శకత్వం వహించిన జయదేవ్ ‘కోరంగి నుంచి’ (2022) అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్డీసీ) నిర్మించింది. మంచి చిత్రాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎన్ఎఫ్డీసీ ప్రతి ఏడాది కొన్ని చిత్రాలకు ఫండింగ్ ఇస్తుంది. అందులో భాగంగా ‘కోరంగి నుంచి’కి కోటి రూపాయల ఫండింగ్ ఇచ్చారు. 25 ఏళ్ల తర్వాత నటి అర్చన ఈ సినిమాలో నటించటం విశేషం. ఈ చిత్రం పలు జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. ప్రముఖ దర్శకుడు, జర్నలిస్టు కేఎన్టీ శాస్త్రికి జయదేవ్ చిన్న కుమారుడు. గతంలో ఎన్ఎఫ్డీసీ నిర్మించిన ‘తిలదానం’ చిత్రదర్శకుడు కేఎన్టీ శాస్త్రి అనే సంగతి తెలిసిందే. జయదేవ్‌కు భార్య యశోద, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
ఫలించని సీపీఆర్.. శబరిమలలో సూర్యాపేట వాసి మృతి!
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట): శబరిమలకు వెళ్లిన ఆత్మకూర్(ఎస్) మండలంలోని తుమ్మలపెన్‌పహాడ్ వాసి గుండెపోటుతో ఆదివారం రాత్రి మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని తుమ్మలపెన్‌పహాడ్ గ్రామానికి చెందిన ఉయ్యాల లింగయ్య(37) సూర్యాపేటలోని ఖమ్మం క్రాస్ రోడ్డు సమీపంలో వాటర్‌ప్లాంట్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. గత పదేళ్లుగా అయ్యప్ప మాల వేస్తున్న లింగయ్య ఈ ఏడాది కూడా మాల ధరించాడు. ఆదివారం సూర్యాపేట నుంచి 9మంది మాలధారులు హైదరాబాద్‌కు చేరుకుని అక్కడి నుంచి విమానంలో కేరళ రాష్ట్రంలోని కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో దిగి కాలినడకన పంబాకు బయల్దేరగా లింగయ్య రాత్రి 8 గంటల సమయంలో గుండెపోటుకు గురయ్యాడు. సహచరులు సీపీఆర్ చేసినప్పటికీ మృతిచెందాడు. మృతుడికి భార్య ఉపేంద్రతో పాటు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లి వస్తూ.. గుండెపోటుతో హఠాన్మరణం
కోటవురట్ల: తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి తిరిగి వస్తూ.. పంచాయతీ కార్యదర్శి బి.సుబ్రహ్మణ్యం (62) కారులోనే గుండెపోటుతో మృతి చెందారు. కోటవురట్ల మేజర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయన సోమవారం తన తల్లిని నర్సీపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స అనంతరం తిరుగు పయనమై కారు ఎక్కి బయలుదేరే సమయంలో ఒక్కసారిగా సీటులో కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. తల్లికి చికిత్స చేయించి తిరిగి వస్తూ తనయుడు గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన స్వగ్రామం గొలుగొండ మండలం అమ్మపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన సుదీర్ఘ కాలం కోటవురట్లలో కార్యదర్శిగా పనిచేశారు. మరో 5 నెలల్లో ఉద్యోగ విరమణ చేయనుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. సౌమ్యుడిగా, మంచి అధికారిగా అందరి మన్ననలు పొందిన ఆయన మృతితో కోటవురట్ల మండలంలోనూ విషాదం అలుముకుంది. సహచర ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయనకు భార్య సుబ్బలక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
చలితో పెరిగిన గుండెపోటు కేసులు.. వారంలో 31 మంది మృతి!
మధ్యప్రదేశ్‌లో గత 15 రోజులుగా తీవ్రమైన చలి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా గ్వాలియర్ జిల్లాలో గత ఆరు రోజులుగా చలి తీవ్రత కొనసాగుతోంది. వారం రోజులుగా ఇక్కడి జనం ఎండను చూడనేలేదు. చలిగాలుల కారణంగా జనం ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. గ్వాలియర్ జిల్లాలో తీవ్రమైన చలి కారణంగా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ కేసులు పెరిగిపోతున్నాయి. స్థానిక హాస్పిటల్ కాంప్లెక్స్‌లోని కార్డియాలజీ విభాగానికి వస్తున్న గుండెపోటు బాధితుల సంఖ్య మరింతగా పెరిగింది. రోజూ దాదాపు 30 నుంచి 35 మంది బాధితులు వస్తున్నారు. గత ఆరు రోజుల్లో గుండెపోటుతో 17 మంది రోగులు మృతిచెందగా, బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 31 మంది కన్నుమూశారు. అక్టోబర్-నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్, జనవరిలో హృద్రోగుల సంఖ్య 25 నుంచి 30 శాతం వరకూ పెరుగుతున్నదని, ప్రతిసారీ ఇదే పరిస్థితి కనిపిస్తోందని జయరోగ్య ఆసుపత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ గౌరవ్ కవి భార్గవ తెలిపారు. చలి వాతావరణం తీవ్రమైనప్పుడు గుండెపోటు, రక్తపోటు కేసులు పెరుగుతాయని హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ రామ్ రావత్ పేర్కొన్నారు. తాజాగా ప్రభుత్వాసుపత్రుల్లో గుండెపోటు, స్ట్రోక్ బాధితుల సంఖ్య 30 శాతం పెరగగా, ప్రైవేటు ఆసుపత్రుల్లో గుండెపోటు బాధితుల సంఖ్య 40 శాతం మేరకు పెరిగింది. -
TS: గుండెపోటుతో టెన్త్ విద్యార్థి మృతి
నారాయణపేట, సాక్షి: వయసుతో తేడా లేకుండా ప్రాణాలు తీస్తున్న గుండెపోటు.. జిల్లాలో ఓ యువ ప్రాణాన్ని బలిగొంది. ధన్వాడ గిరిజన గురుకుల పాఠశాలలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో పదో తరగతి విద్యార్థి ఒకరు క్లాస్ రూమ్ ముందే కుప్పకూలి.. కన్నుమూశారు. హన్వాడ మండలం బుడుమ తండాకు చెందిన 10వ తరగతి విద్యార్థి శ్రీకాంత్ (15) ధన్వాడ గిరిజన గురుకుల పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నాడు. శుక్రవారం ఉదయం టిఫిన్ చేసిన శ్రీకాంత్ క్లాస్‌కు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయాడు. తోటి విద్యార్థులు అది గమనించి సిబ్బందికి సమాచారం అందించారు. వారు హుటాహుటిన ధన్వాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్సలు చేసిన అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కొరకు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే నారాయణపేట జిల్లా ఆస్పత్రిలో వైద్యులు పరీక్షించి అప్పటికే అతను మరణించినట్లు తెలిపారు. గుండె పోటు కారణంగానే శ్రీకాంత్ కన్నుమూసినట్లు వైద్యులు ధృవీకరించారు. కొడుకు హఠాన్మరణంతో తల్లి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మరోవైపు శ్రీకాంత్ మృతితో బుడుమలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
మాజీ ఎమ్మెల్యే ఆల ఇంట విషాదం
అడ్డాకుల: దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు ఆల శశివర్ధన్‌రెడ్డి(58) గుండెపోటుతో మృతి చెందారు. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి భూత్పూర్ మండలం అన్నాసాగర్‌లోని ఇంటికి వచ్చిన శశివర్దన్‌రెడ్డి సాయంత్రం పొలం వద్దకు వెళ్లి వచ్చాడు. రాత్రి ఇంట్లో భోజనం చేసి నిద్రిస్తుండగా అర్ధరాత్రి తర్వాత నిద్రలోనే గుండెపోటుకు గురయ్యాడు. తల్లి వరలక్ష్మి గుర్తించే సరికే ప్రాణాలు వదిలాడు. మృతుడికి భార్య శ్రీలత, కుమార్తె సుష్మ ఉన్నారు. అన్న మృతి వార్త తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ఆల హుటాహుటిన హైదరాబాద్ నుంచి అన్నాసాగర్‌కు తరలివచ్చి కన్నీటిపర్యాంతమయ్యారు. గురువారం ఉదయం అన్నాసాగర్ జనసంద్రమైంది. నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. ప్రముఖ నేతల సంతాపం శశివర్ధన్‌రెడ్డి మృతి చెందడంతో ప్రముఖ రాజకీయ నేతలు అన్నాసాగర్‌కు తరలివచ్చి సంతాపం తెలిపారు. దేవరకద్ర, గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు మధుసూదన్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడు, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, డీకే అరుణ, మాజీ ఎంపీలు ఏపీ జితేందర్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, అంజయ్యయాదవ్, గువ్వల బాలరాజు, టీటీడీ బో ర్డు మాజీ సభ్యుడు మన్నె జీవన్‌రెడ్డి, ఏపీ మిథున్రె డ్డి, వాల్యానాయక్, అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి తదిత ర ప్రముఖులు నివాళులర్పించారు. అనంతరం మా జీ ఎమ్మెల్యేను ఓదార్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. -
పసి 'హృదయాలు' కూడా లయ తప్పుతున్నాయి.. కారణం !?
'పసిహృదయాలు లయ తప్పుతున్నాయి. చిన్నప్రాయంలోనే గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. మారిన జీవన విధానం.. ఆహారపు అలవాట్లు.. కారణం ఏదైతేనేమీ పసిహృదయాలు పట్టేస్తున్నాయి. గుండెపోటు(హార్ట్ఎటాక్)కు గురవుతున్నారు. ఆస్పత్రికి వెళ్లేలోపే ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా సెకండ్‌వేవ్ ముగిసిన తర్వాత క్రమంగా గుండెపోటు మరణాలు పెరిగిపోతున్నాయి.' ప్రాణాలు పోతున్నాయి.. ఇటీవల గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. మన శరీరంలో అతి ప్రధాన అవయవం గుండె. దీన్ని కాపాడుకోవడంలో నిర్లక్ష్యం దరి చేరనీయొద్దు. గతంలో దీర్ఘకాలిక వ్యాధులబారిన పడిన వారు, వయస్సు మళ్లిన వారు గుండెపోటుకు గురైన సంఘటనలు చూశాం. కానీ కొన్నాళ్లుగా టీనేజ్ యువత గుండెపోటుతో మరణిస్తుండడం కలవరం కలిగిస్తుంది. మారిన ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, సరైన వ్యాయామం లేకపోవడం, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపకపోవడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. అధిక మద్యపానం, ధూమపానం, బీపీ, షుగర్, లావు పెరగడం, ఇతర వ్యాధులు ఉన్న వారు కూడా గుండెపోటుకు గురవుతున్నట్లు తెలుస్తోంది. అవగాహన కల్పిస్తున్న వైద్య, ఆరోగ్యశాఖ గుండెపోటుకు కారణాలు, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారపు అలవాట్లపై జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అవగాహన కల్పిస్తుంది. హఠాత్తుగా గుండెపోటుకు గురైన వారికి అందించాల్సిన అత్యవసర చికిత్స, టెక్నిక్స్‌పై గత మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సీపీఆర్ అండ్ ఏఈడీ శిక్షణ కార్యక్రమాలు చేపట్టింది. జిల్లాలోని మెడికల్ ఆఫీసర్స్(75), ఎంఎల్‌హెచ్‌పీ(63), సూపర్వైజర్లు(79), స్టాఫ్‌నర్సు(85), ఏఎన్ఎం(145), ఆశలు(475), ఫార్మసిస్టులు(5), ల్యాబ్‌టెక్నీషియన్స్(19), ఇతరులు(318) మొత్తంగా 1,264 మందికి వైద్యాధికారులు సీపీఆర్ శిక్షణ ఇచ్చారు. ప్రజలతో ఎక్కువగా మమేకమై ఉండే ఆర్టీసీ సిబ్బంది, జర్నలిస్టులు, ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బంది, పోలీస్, ప్రజాప్రతినిధులు తదితరులకు సీపీఆర్ విధానంతో గుండెపోటుకు గురైన వ్యక్తులను ప్రాణాపాయం నుంచి రక్షించేలా అవగాహన కల్పించారు. గుండెపోటు లక్షణాలు.. హార్ట్ డిసీజ్‌కు గురయ్యే వారిలో ఎక్కువగా పోస్ట్ కోవిడ్ బాధితులు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇటీవల వస్తున్న గుండె సమస్యల్లో కరోనా బాధితులే ఎక్కువ. చాతిలో అసౌకర్యంగా ఉండడం, నొప్పి రావడం, పిండినట్లు అనిపించడం. భుజం, చేయి, వీపు, మెడ, దవడకు వ్యాపించే నొప్పి, ఎగువ బొడ్డు వరకు నొప్పి అనిపించవచ్చు. చెమటలు పట్టడం, అలసటగా ఉండటం, గుండెల్లో మంట, మైకము కమ్మడం. వికారంగా ఉండటం, శ్వాస ఆడకుండా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పాటించాల్సిన జాగ్రత్తలు! ముఖ్యంగా ఆహార నియమాల్లో మార్పు అవసరం. తీసుకునే ఆహారంలో పీచు(ఫైబర్) పదార్థం ఎక్కువగా ఉండాలి. శరీరానికి కావాల్సిన అన్ని రకాల విటమిన్లు అందేలా చూసుకోవాలి. విటమిన్ లోపాలు రాకుండా పౌష్టికాహారం తీసుకోవాలి. కొలెస్ట్రాల్ పెంచే కొవ్వు పదార్థాలు, మాంసాహారాన్ని తక్కువగా తీసుకోవాలి. మద్యపానం,ఽ ధూమపానం, పొగాకులకు దూరంగా ఉండాలి. సరైన వ్యాయామం చేయాలి. బీపీ, షుగర్, కిడ్నీ వ్యాధిగ్రస్తులు వైద్యుల సూచనలు పాటించాలి. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ఇంట్లో కూడా వేపుళ్లు, అధిక మాంసాహారం తీసుకోవద్దు. - 'సిరిసిల్ల పట్టణానికి చెందిన పద్దెనిమిదేళ్ల విద్యార్థిని గత నెలలో హైదరాబాద్‌లోని కళాశాలలో తరగతిగదిలోనే కుప్పకూలింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా గుండెపోటు(కార్డియక్ అరెస్ట్)కు గురైందని వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. అయినా ఫలితం లేకుండాపోయింది. తల్లిదండ్రులకు పుట్టెడు దుఃఖమే మిగిలింది.' - 'కోనరావుపేట మండలం నిజామాబాద్‌కు చెందిన పదమూడేళ్ల సుశాంత్ క్రిస్మస్ రోజున తల్లిదండ్రులతో కలిసి చర్చికి వెళ్లాడు. అక్కడే వేడుకల్లో అందరి ముందే హఠాత్తుగా గుండెపోటుకు గురై కిందపడిపోయాడు. హుటాహుటిన సిరిసిల్లకు తరలించినప్పటికీ ప్రాణాలు గాలిలో కలిశాయి. అప్పటి వరకు తమతోపాటు సంతోషంగా గడిపిన కొడుకు గంటలోపే జీవచ్ఛవంలా మారడంతో తల్లిదండ్రుల వేదనకు అంతులేకుండా పోయింది.' నిర్లక్ష్యం చేయొద్దు.. చాతిలో నొప్పి వస్తుంటే నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. గుండె వ్యాధిగా అనుమానం ఉంటే కార్డియాలజిస్టు వద్దకు వెళ్లాలి. సడన్ హార్ట్ఎటాక్తో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి వారిని రక్షించడానికి కార్డియో పల్మనరీ రెసిపిటేషన్(సీపీఆర్), ఆటోమెటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్(ఏఈడీ) శిక్షణ ఇచ్చాం. – సుమన్ మోహన్‌రావు, డీఎంహెచ్‌వో ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి.. గుండెపోటుకు గురైన వారికి ఇచ్చే మందు టెనెక్టప్లేస్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. శరీరంలోని రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడంతో గుండెపోటు వస్తుంది. అన్ని వయస్సుల వారు శరీరానికి సరైన వ్యాయామం అందించాలి. జంక్‌ఫుడ్ తినకుండా ఆరోగ్యాన్నిచ్చే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. పౌష్టికాహారం తీసుకుంటూ.. బీపీ, షుగర్ పేషెంట్లు ఎప్పటికప్పుడు వైద్యుల సూచనలు పాటించాలి. – డాక్టర్ మురళీధర్‌రావు, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ -
గుండెపోటు ముప్పు పెంచిన కరోనా
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా 18–45 మధ్య వయస్కుల గుండెపోటు మరణాలు సాధారణంగా ఏడాదికి లక్షకు నాలుగు ఉంటాయి. కానీ కరోనా కాలంలో ఈ సంఖ్య పెరిగింది. సాధారణ రోజులతో పోలిస్తే కరోనా కాలంలో యువతీ యువకులు అత్యధికంగా ఆకస్మిక గుండెపోటుకు గురై చనిపోయారు. దీనిపై భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) శాస్త్రీయ అధ్యయనం చేసింది. దీని ప్రకారం కరోనా రాని యువకులతో పోలిస్తే వైరస్ సోకిన వారు మొదటి వారంలో గుండెపోటుకు గురయ్యే అవకాశం మూడు రెట్లు ఎక్కువ ఉంది. అదే రెండో వారంలో రెండున్నర రెట్లు, 30 రోజుల తర్వాత రెండు రెట్లు ఎక్కువ అవకాశం ఉన్నట్లు తేలింది. ఆల్కహాల్, సిగరెట్, డ్రగ్స్, మితిమీరిన వ్యాయామం లాంటి కారణాలతో పాటు కరోనా సోకడం యువతకు ముప్పు పెంచిందని నిర్ధారించింది. ముఖ్యంగా కోవిడ్ వ్యాక్సిన్ వల్ల మరణాలు సంభవించలేదని అధ్యయనం తేల్చింది. పైగా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారిలో ఆకస్మిక మరణాలు చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించింది. 31.6% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు మరణించిన 729 యువకుల్లో 31.6 శాతం మంది అసలు వ్యాక్సిన్ తీసుకోలేదు. కోవిడ్‌తో ఆసుపత్రుల్లో చేరినవారు 2.3 శాతం మంది ఉన్నారు. అందులో పొగతాగేవారు 26 శాతం ఉన్నారు. ఆల్కహాల్ తీసుకునేవారు 27 శాతం ఉన్నారు. చనిపోవడానికి 48 గంటలకు ముందు మితిమీరి ఆల్కహాలు తీసుకున్నవారు 7 శాతం ఉన్నారు. గంజాయి, కొకైన్, హెరాయిన్ వంటి డ్రగ్స్ తీసుకున్నవారు 1.7 శాతం ఉన్నారు. ఏ రకమైన వ్యాయామం చేయనివారు 81 శాతం, 48 గంటలకు ముందు మితిమీరిన శారీరక శ్రమ లేదా అధిక వ్యాయామం చేసినవారు 3.5 శాతం ఉన్నారు. సాధారణ వ్యాయామం చేసినవారు 16 శాతం ఉన్నారు. ఆకస్మికంగా మరణించిన ఆ యువకులకు చెందిన 10 శాతం మంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు. అంటే గుండెపోటుకు సంబంధించి కుటుంబ చరిత్ర ఉన్నవారు అన్నమాట. కుటుంబ సభ్యులంటే తల్లి, తండ్రి, తోబుట్టువులని ఐసీఎంఆర్ పేర్కొంది. కోవిడ్‌తో ఆసుపత్రిలో చేరిన యువకుల్లో సాధారణ పరిస్థితులతో పోలిస్తే ఆకస్మిక మరణాలు నాలుగు రెట్లు అధికంగా సంభవించాయి. 48 గంటలకు ముందు మితిమీరిన మద్యం తీసుకుంటే మరణాలు ఆరు రెట్లు ఎక్కువ. విపరీతమైన శారీరక శ్రమ చేయడం వల్ల మూడు రెట్లు రిస్క్ ఎక్కువగా ఉంది. డ్రగ్స్‌తో నాలుగు రెట్లు, పొగతాగడం వల్ల రెండు రెట్లు రిస్క్ ఎక్కువగా ఉంది. వ్యాయామం చేస్తున్నప్పుడు సాధారణంగా రెండు నిమిషాల్లోనే శ్వాస అదుపులోకి వస్తుంది. కానీ 10 నిమిషాల పాటు కొనసాగితే దాన్ని మితిమీరిన వ్యాయామం అంటారు. అటువంటి వారిలో మరణాలు సంభవించాయి. వ్యాక్సిన్ వల్ల గుండెపోట్లు తగ్గాయి... కోవిడ్ వ్యాక్సిన్ వల్ల యువకులు ఆకస్మిక మరణాలకు గురైనట్లు మీడియాల్లో కథనాలు వచ్చాయి. ఐసీఎంఆర్ వీటిపైనా అధ్యయనం చేసింది. వార్తల్లో కథనాలను ఆధారంగా చేసుకొని పరిశోధన కొనసాగించింది. కోవిడ్ వ్యాక్సిన్ వల్ల మరణాలు సంభవించలేదని తేల్చింది. పైగా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారిలో ఆకస్మిక మరణాలు చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించింది. ఆకస్మిక మరణాలపై అధ్యయనం దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లోని 47 మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ ఆసుపత్రుల పరిధిలో ఐసీఎంఆర్ పరిశోధన చేసింది. 2021 అక్టోబర్ ఒకటో తేదీ నుంచి 2023 మార్చి 31 వరకు కరోనా కాలంలో యువకుల ఆకస్మిక మరణాలపై అధ్యయనం చేసింది. ఆయా కాలేజీల పరిధిలో 18–45 ఏళ్ల వయస్సులో గుండెపోటుతో మరణించిన 29,171 మంది యువకుల్లో 729 మందిపై ప్రత్యేకంగా పరిశో ధన చేసింది. వారి మరణాలకు కారణాలపై డేటా సేకరించి విశ్లేషించింది. నాలుగింట మూడొంతుల మంది మరణాల వివరాలను ప్రత్యక్ష సాక్షుల నుంచే తీసుకుంది. కరోనా సామాజికంగా కూడా దెబ్బతీసింది అలవాటు లేని శారీరక శ్రమ, వ్యాయామం అతిగా చేయడం వల్ల యువకుల్లో ఆకస్మిక మరణాలు సంభవించాయి. తీవ్రమైన ఒత్తిడి, దీర్ఘకాలిక జబ్బులు కూడా దోహదపడ్డాయి. కోవిడ్ అనేది సాధారణ జబ్బే కాదు. అది సామాజికంగా కూడా దెబ్బతీసింది. ఉద్యోగం కోల్పోవడం లాంటివి పరోక్షంగా ప్రభావం చూపించాయి. మరోవైపు మానసిక రుగ్మతలు 25 శాతం పెరిగాయి. వదంతులు, ప్రచారాలు కూడా ప్రజలపై మానసికంగా ప్రభావం చూపాయి. – డాక్టర్ కిరణ్ మాదల, ఐఎంఏ సైంటిఫిక్ కన్వీనర్, తెలంగాణ -
ఐదు వ్యాధులు.. 2023లో జనం గుండెల్లో రైళ్లు!
చివరిదశకు వచ్చిన 2023లో మనం చాలా చూశాం. అంతకన్నా ఎక్కువగానే నేర్చుకున్నాం. కాలంతో పాటు మన జీవన విధానం కూడా ఎంతగానో మారిపోయింది. ఈ జీవనశైలి వల్ల చాలా మంది వివిధ వ్యాధుల బారిన పడ్డారు. ఈ సంవత్సరం కాలుష్యం కారణంగా అనేక వ్యాధులు తలెత్తాయి. 2024ని స్వాగతించే ముందు 2023లో మానవాళి ఎదుర్కొన్న తీవ్రమైన వ్యాధుల గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. తద్వారా రాబోయే సంవత్సరంలో ఈ వ్యాధులతో పోరాడేందుకు మనమంతా సన్నద్దంగా ఉండగలుగుతాం. 2023లో మానవాళి ఎదుర్కొన్న ప్రధాన వ్యాధులేమిటో ఇప్పుడు చూద్దాం.. 1. గుండె జబ్బులు: ప్రస్తుతం గుండె సంబంధిత వ్యాధులు (హృద్రోగాలు) అధికమయ్యాయి. రాబోయే సంవత్సరాల్లో గుండె జబ్బుల ముప్పు పెరగనుందని నిపుణులు చెబుతున్నారు. హృదయాన్ని కాపాడుకునేందుకు మెరుగైన జీవనశైలిని ఎంతో ముఖ్యం. అస్తవ్యస్త జీవనశైలి, మద్యం, ధూమపానం కారణంగా గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. మన దేశంలో అత్యధిక మరణాలు గుండె జబ్బుల కారణంగానే చోటుచేసుకుంటున్నాయి. 2. డెంగ్యూ ఈ సంవత్సరం డెంగ్యూ వ్యాధి ముప్పు అధికంగా వెంటాడింది. వచ్చే ఏడాది కూడా ఈ వ్యాధి విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. డెంగ్యూతో మృత్యువాత పడిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఈ వ్యాధి గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రభుత్వం పలు కార్యక్రమాలను కూడా చేపట్టింది. ఈ వ్యాధి నివారణకు ఇంట్లోకి దోమలు ప్రవేశించకుండా చూసుకోవాలి. 3. మిస్టీరియస్ న్యుమోనియా ఈ సంవత్సరం మిస్టీరియస్ న్యుమోనియా కేసులు పెరిగాయి. ఈ వ్యాధి చైనా, అమెరికాలో తీవ్రంగా కనిపించింది. ఈ వ్యాధి చైనాలో అధికంగా వ్యాప్తి చెందింది. ఈ వ్యాధి పిల్లలలో అధికంగా కనిపించింది. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న కారణంగానే వారు త్వరగా న్యుమోనియాకు గురవుతున్నారు. భారతదేశంలో ఇలాంటి కేసులు అధికంగా కనిపించనప్పటికీ, ఈ వ్యాధి విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 4. వైరల్, ఇన్ఫెక్షన్ నిపా వైరస్ ముప్పు ఈ సంవత్సరం అధికంగా కనిపించింది. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ప్రాణాంతక వైరస్ ఇది. గబ్బిలాలతో పాటు పందులు, మేకలు, కుక్కలు, పిల్లుల ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ వ్యాధి ముప్పు మన దేశంలో అధికంగా ఉంది. ఇది కరోనా కంటే చాలా ప్రమాదకరమైనదని నిపుణులు చెబుతుంటారు. 5. కిడ్నీ సంబంధిత వ్యాధులు ఈ సంవత్సరం కిడ్నీ సంబంధిత వ్యాధుల ముప్పు కూడా మనదేశంలో అధికంగా కనిపించింది. అస్తవ్యస్త జీవనశైలి, తగినంత నీరు తాగకపోవడం, ధూమపానం మొదలైనవి కిడ్నీ సమస్యలకు కారణమని వైద్యులు చెబుతుంటారు. ఇది కూడా చదవండి: పదుగురు స్వామీజీలు.. 2023లో అందరినీ ఆకర్షించి.. -
హార్ట్ఎటాక్ సమస్య వెంటాడుతుందా..? అయితే ఇలా చేయండి!
'ఈ మధ్య కాలంలో దాదాపుగా 30 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉన్నవారు తరచుగా మృతి చెందుతూ ఉండడం ఆందోళనలకు గురిచేస్తోంది. ప్రణాళిక లేని ఆహారపు అలవాట్లు, మద్యపానం, సరైన వ్యాయామం లేకపోవడం, క్రిమిసంహారక మందులతో పండించిన కూరగాయలు, దినుసులు వంటివాడకం మితిమీరిపోవడంతోనే ఇలాంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.' పెరుగుతున్న హృద్రోగ, కాలేయ సమస్యలు తరచుగా ఆకస్మిక మరణాలు నాలుగుపదుల వయసువారే అధికం అసమతుల్య ఆహారపు అలవాట్లు, జీవనశైలే కారణం క్రమబద్ధమైన నియమాలు పాటించాలంటున్న ఆరోగ్యనిపుణులు ఎన్నో కారణాలు.. ప్రధానంగా గుండె లయతప్పడానికి ఎన్నో అంశాలు ప్రభావం చూపుతాయి. కొన్నిసార్లు పెద్దగా కారణాలేవి లేకుండానే ఇటువంటి ప్రమాదం సంభవిస్తుంది. కొందరిలో మాత్రం గుండె కండరం మందం కావడం, పుట్టుకతో గుండెలో ఉండే లోపాలు, కర్ణికలు పెద్దగా ఉండడం, జన్యుపరంగా తలెత్తే ఇతర ఇతర సమస్యలు రక్తంలో ఖనిజలవణాల సమతుల్యత లోపించడం, మానసిక ఒత్తిడి నిద్రలేమి వంటివి కారణమవున్నాయి. బాగున్న కండరం మధ్యభాగంలోని కణాలు అతి చురుకుగా స్పందించడంతో కూడా గుండె కొట్టుకునే వేగం పెరుగుతోంది. దీంతో శరీరానికి రక్తప్రసరణ సరిగా జరగకపోవడం, ఫలితంగా తలతిరగడం, స్పహ తప్పి కోల్పోవడం, నిమిషాల వ్యవధిలోని మరణం సంభవించడం వంటి వాటికి ఆస్కారం ఉంటుంది. జీవనశైలిలో మార్పుతోనే నివారణ.. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు అనేక ఒత్తిడిలతో కూడిన జీవన విధానంలో ప్రశాంతత లోపించడం సమయభావంతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఉదయం నడక, వ్యాయామక కసరత్తులు, యోగా, మెడిటేషన్ వంటివి నిపుణుల పర్యవేక్షణలో చేయడంతో ఆరోగ్యంగా ఉండగలుగుతాము. కాలేయ సంబంధ వ్యాధుల్లో ప్రధానంగా ఆహారపు అలవాట్లు ప్రభావం చూపుతాయి. సరైన ఆహారపు అలవాట్లు లేని వ్యక్తుల్లో సమస్యలు తలెత్తడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. శరీరాన్ని సమతుల్య స్థితిలో ఉంచుకోవాలి.. ఈ రోజుల్లో ఎటువంటి ఆరోగ్య సమస్య ఎటువైపు నుంచి మంచికొస్తుందో తెలియనిస్థితిలో ఉన్నాం. ఆరో గ్యపరంగా శరీరాన్ని సమతుల్య స్థితిలో ఉంచుకునే విధంగా నియమాలు పాటించాలి. ఆహారం పరంగా, శారీరకంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. – ఎండపెల్లి అశోక్‌కుమార్, మైథిలీ వెల్నెస్ సెంటర్, నిర్మల్ నిరంతర పరీక్షలతోనే నివారణ గుండె సంబంధిత జబ్బులు ప్రస్తుత కాలంలో అధికమవుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసులవారు గుండె, కాలేయ సంబంధ సమస్యలకు గురవుతున్నారు. గుండె జబ్బులు ఇతర అనారోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు పరీక్షలను చేయించుకోవాలి. – డాక్టర్ ఎం.ఎస్. ఆదిత్య, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ -
సాక్షి దినపత్రిక విలేకరి ఆకస్మిక మృతి
రేపల్లె రూరల్: సాక్షి దినపత్రిక రేపల్లె నియోజకవర్గ విలేకరి గడ్డం శ్రీనివాసరావు అలియాస్ వాసు(53) శుక్రవారం ఆయన స్వగృహంలో ఆకస్మిక మృతి చెందారు. సాక్షి దినపత్రిక స్థాపితం నాటి నుంచి నేటి వరకు ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలోనూ పలు పత్రికలలో పనిచేశారు. శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. నాలుగు నెలల కిందట ఆయన భార్య శివమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. వాసుకు ఇరువురు కుమార్తెలు. ఆయన మృతికి రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరి గణేష్, వైఎస్సార్ సీపీ నాయకులు, రేపల్లె ప్రెస్‌క్లబ్ సభ్యులు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. -
గుండెపోటుతో మరణించిన 17 ఏళ్ల అమ్మాయి, ఆ లక్షణాలు కనిపిస్తే..
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మరణాల్లో గుండెపోటు వల్ల చనిపోతున్న సందర్భాలు ఎక్కువగా చూస్తున్నాం. ఈరోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది గుండెపోటుతో మరణిస్తున్నారు. తాజాగా ఇండోర్‌లో 17 ఏళ్ల అమ్మాయి సంజనా యాదవ్ గుండెపోటుతో మరణించింది. రాత్రి భోజనం తిన్న అనంతరం ఒక్కసారిగా ఛాతిలో నొప్పితో విలవిల్లాడింది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ, విపరీతంగా చెమటలు పట్టి అక్కడిక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. సంజన కుటుంబంలో ఇదివరకు హార్ట్ ఎటాక్ హిస్టరీ కూడా లేదని, అయినా ఇంత చిన్న వయసులో ఇలా జరగడం ఆందోళన కలిగిస్తుందని వైద్యులు తెలిపారు. సంజనాకు హైపర్‌టెన్షన్, హై కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఏమైనా ఉన్నాయేమో టెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని, ఎందుకంటే వీటితో చలికాలంలో పరిస్థితి దిగజారిపోతుందని పేర్కొన్నారు. టైఫాయిడ్ వచ్చిన కొన్ని రోజుల్లోనే.. 'సంజనకు నాలుగు నెలల క్రితం టైఫాయిడ్. వచ్చింది. ఆ సమయంలో ఆమె హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ 4 g/dlకి పడిపోయింది.కానీ ఆమె కుటుంసభ్యులు స్పెషల్ కేర్ తీసుకోవడంతో త్వరగానే కోలుకుంది. ఇంతలోనే ఇలా జరగడం దురదృష్టకరం. ఈ ఘటనతో ఆమె ఫ్యామిలి మెడికల్ హిస్టరీని కూడా ఓసారి పరీక్షించాల్సిన అవసరం ఉంది' అని వైద్యులు తెలిపారు. ఈ మధ్యకాలంలో యువతలో ఆకస్మిక గుండెపోటు మరణాలు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. గుజరాత్‌లోనే గత ఆరు నెలల్లో మొత్తం 1,052 మంది గుండెపోటుతో మరణించారు. వీరిలో 80 శాతం మంది 11-25 ఏళ్ల మధ్య ఉన్నవారే అని ఓ నివేదికలో వెల్లడైంది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా యువతలో గుండెజబ్బులు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకుముందు గుండె జబ్బులు అంటే వయసు పైబడిన వారికి మాత్రమే వచ్చేవి. కానీ గత దశాబ్ద కాలంగా పరిస్థితి మారింది. యువతలో హార్ట్ ఎటాక్‌కు ప్రధానంగా హైబీపీ, స్మోకింగ్, కుటుంబంలో హార్ట్ ఎటాక్ హిస్టరీ, షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలు, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వంటివి యువతలో గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతున్నాయి. గుండెపోటు లక్షణాలు ఛాతీలో నొప్పిగా అనిపించడమే గుండెపోటుకు పెద్ద ముఖ్యమైన సూచన అని డాక్టర్లు చెబుతున్నారు. గుండె వరకూ రక్తం పూర్తిగా సరఫరా కాకపోవడం వల్లనే గుండెపోటు వస్తుంది. సాధారణంగా ధమనులలో ఏదైనా అడ్డంకి ఏర్పడటం వల్ల రక్తం గుండె వరకు చేరలేదు. అప్పుడు ఛాతీలో తీవ్రమైన నొప్పి వస్తుంది. ఆ సమయంలో శ్వాస ఆడకపోవడం, చల్లని చెమట, వికారం, గుండెల్లో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. గుండెపోటుతో కుప్పకూలినప్పుడు ఎంత త్వరగా సీపీఆర్ చేశామన్నది చాలా ముఖ్యం. సరైన సమయంలో చికిత్స అందంచగలిగితే బతికించే ఛాన్సులు మెరుగ్గా ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు. -
గుండెపోటుతో 8వ తరగతి విద్యార్థిని మృతి
కర్ణాటక: ఆడిపాడే చిన్న వయసులోనే బాలికను గుండెపోటు పొట్టనపెట్టుకుంది. ఈ సంఘటన చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా జోగణ్ణనకెరె గ్రామంలో జరిగింది. విద్యార్థిని సృష్టి (13) 8వ తరగతి చదువుతోంది. బుధవారం పొద్దున్నే పాఠశాలకు వెళ్లడానికి సిద్ధమవుతుండగా గుండెపోటు రావటంతో కుప్పకూలిపోయింది. కుటుంబసభ్యులు మూడిగెరె ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో కన్నుమూసింది. బిడ్డను కోల్పోయిన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. -
చనిపోయి.. 24 నిమిషాల తర్వాత మళ్లీ బతికిన మహిళ
వైద్య శాస్త్రంలో ఇదో అద్భుతమని చెప్పాలి. గుండెపోటుతో ఓ మహిళ చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. అయితే ఆశ్చర్యంగా ఆమె 24 నిమిషాల తర్వాత లేచి కూర్చుంది. ఈ వింత ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఈ పరిణామంతో డాక్టర్లు సైతం షాక్‌కి గురయ్యారు. తాను స్పృహలో లేని ఆ 24 నిమిషాల్లో తనకు ఎలాంటి అనుభూతి ఎదురయ్యిందో తాజాగా ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడో, అనుకోని పరిస్థితుల్లో చచ్చి బతికాం అనే సామెతను వాడుతుంటారు. అంటే చావు అంచుల దాకా వెళ్లి ప్రాణాలతో బయటపడ్డప్పుడు ఇలా అంటుంటారు. కానీ అమెరికాకు చెందిన లారెన్ కెనడే అనే మహిళ మాత్రం చచ్చి బతికింది. తనకు ఎదురైన ఈ విచిత్ర అనుభవం గురించి లారెన్ నెటిజన్లతో ఈ విధంగా పంచుకుంది. ''గత ఫిబ్రవరిలో నాకు గుండెపోటు వచ్చింది. ఆంబులెన్స్‌కి కాల్ చేసి ఆలోగా నాకు సీపీఆర్ చేశాడు. కానీ ఎలాంటి చలనం లేదు. హాస్పిటల్‌కి వెళ్లగానే నన్ను పరిశీలించిన అనంతరం నేను చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. కానీ సరిగ్గా 24 నిమిషాల అనంతరం నా గుండె మళ్లీ కొట్టుకోవడం ప్రారంభించింది. అయితే వెంటనే కోమాలోకి వెళ్లిపోయాను. రెండు రోజులకు గానీ స్పృహలోకి రాలేదు. మెదడుకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాక సాధారణ స్థితికి వచ్చాను. దాదాపు 9 రోజుల పాటు ఐసీయూలో వైద్య బృందం నన్ను పరీక్షించింది. మరణం అంచుల వరకు వెళ్లొచ్చాను. ఇప్పుడు నాకు చావు అంటే ఏమాత్రం భయం లేదు.హార్ట్ ఎటాక్‌కి గురైనప్పుడు సరైన సమయంలో నా భర్త సీపీఆర్ చేయడం వల్ల నా ప్రాణాలు దక్కాయి. తను ఎప్పటికీ నా హీరో'' అంటూ ఆమెపేర్కొంది. లారెన్‌కు ఎదురైన ఈ పరిస్థితిని వైద్య శాస్త్రంలో లాజరస్ ఎఫెక్ట్ అని అంటారు.అంటే చనిపోయిన సందర్భంలో చాలా అరుదుగా ఇలా మళ్లీ జీవం పోసుకోవడం జరుగుతుంది. అయితే ఇలాంటి కేసుల్లో మళ్లీ బతికిన వారు ఎక్కువ కాలం జీవించలేరని, అయితే లారెన్ కేసు ఆశ్చర్యంగా ఉందని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. గతంలో 1982 నుంచి 2018 మధ్య ఇలాంటి కేసులు 65 నమోదయ్యాయని,అందులో 18 మంది మాత్రమే పూర్తిగా కోలుకున్నారని స్పష్టం చేసింది. -
ఫ్లూ జ్వరంలా ఉందని తేలిగ్గా తీసుకుంది..కట్ చేస్తే అంతలోనే..
కొన్ని జబ్బుల తీరు వైద్యులు చెప్పిన లక్షణాలేవి కనిపించకుండానే సైలంట్‌గా దాడి చేస్తాయి. అందువల్లే ప్రజలు కూడా తేలిగ్గా తీసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఎంతలా అలాంటి వాటిని కట్టడి చేసి ప్రజల్లో ఆ వ్యాధులపై అవగాహన కల్పిద్దామన్నా పరిస్థితుల దృష్ట్యా లేదా జీవనశైలి కారణంగానో ఆ వ్యాధుల లక్షణాలు కూడా ఆశ్చర్య కలిగించే రీతిలో వస్తున్నాయి. అలాంటి షాకింగ్ లక్షణాలే ఇక్కడొక మహిళలో కనిపించడంతో లైట్ తీసుకుంది. అదే ఆమె ప్రాణాలకు ముప్పు తెచ్చి ఆస్పత్రి పాలు చేసింది. అసలేం జరిగిందంటే..ఈ షాకింగ్ ఘటన యూఎస్ఏలో చోటు చేసుకుంది. జెన్నా టాన్నర్ అనే 48 ఏళ్ల మహిళ గతేడాది మహమ్మారి సమయంలో కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొంది. నిజం చెప్పాలంటే ఆమె ఇంటిల్లపాది ఆ మహమ్మారి బారిన పడి బయటపడ్డారు. అయితే ఆమెకు ఒక రోజు ఫ్లూ వంటి లక్షణాలతో కూడిన జ్వరం వచ్చింది. శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. ఇది సేమ్ కరోనా మాదిరి సమస్యే అనుకుంది ఆమె. బహుశా ఫ్లూ లాంటి జ్వరం కాబోలు అనుకుని లైట్ తీసుకుంది. భర్తకు కూడా చెప్పకూడదనుకుంది. ఎందుకంటే? ఆస్పత్రిలో చేరిపోమంటారన్న భయం తోపాటుపైగా రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుందన్న ఉద్దేశ్యంతో టాన్నర్ చెప్పకూడదని గట్టిగా నిర్ణయించుకుంది. అది కాస్త తీవ్రమై సడెన్‌గా ఓ రోజు ఇంట్లోనే స్ప్రుహతప్పి పడిపోయింది. కట్ చేస్తే.. ఆమె రెండు రోజుల వరకు ఆస్పత్రిలోనే కోమాలో ఉంది. రెండో రోజు సాయంత్రం మెలుకువ వచ్చి అంతా తెలుస్తున్నా.. ఏది తన కండిషన్లో లేనట్లు, గుండెపై ఏనుగులాంటి పెద్ద బరువు ఏదో ఉన్నట్లు తోచింది ఆమెకు. కనీసం బెడ్ మీద నుంచి కదలాలనుకున్న కొంచెం కుడా కదలలేకపోతోంది. కనీసం చేతిని కూడా కదపడం కష్టంగా ఉంది. ఏం జరిగిందో కూడా ఆమెకు అర్థం కాలేదు. ఆ తర్వాత కాసేపటికి తనవాళ్లు వచ్చి తనకు గుండె పోటు వచ్చిందని చెప్పేంత వరకు కూడా ఆమెకు ఏం తెలియదు. అయితే తనకు వచ్చింది గుండెపోటా..? అని నిర్ఘాంతపోయింది. నాకలాంటి సంకేతాలేం కనిపించలేదు కదా! అని ఆలోచిస్తూ షాక్‌లోనే ఉండిపోయింది. ఆ తర్వాత వైద్యులు ఆమెకు బైపాస్ సర్జరీ చేసి స్టంట్ వేశారు. అస్సలు గుండెపోటు వచ్చినప్పుడు ఇలా గాలి పీల్చుకోవడం వంటి రెస్పిరేషన్ సమస్యలు కూడా వస్తాయ? అని ఆమెకు ఆశ్చర్యం కలిగింది. అందుకే ఆమె తనలా ఎవరూ వ్యాధులను నిర్లక్ష్యం చేయకూడదన్న ఉద్దేశంతో తన ఉదంతాన్ని అందరికీ చెప్పి గుండెపోలు వంటి వ్యాధులపై అవగాహన కల్పించే యత్నం చేస్తోంది టాన్నర్. కాగా,అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. మహిళలకు గుండెపోటులో యూఎస్ తొలి స్థానంలో ఉంది. నిజానికి గుండెపోటు అనంగానే ఛాతీ నొప్పిలా వస్తుందని అందరికీ తెలుసు. కానీ మహిళ్లల్లో ఇలా కాకుండా వేర్వేరు లక్షణాలతో కూడా సంకేతాలిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. స్త్రీలల్లో ముఖ్యంగా ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం, వికారం, వెన్ను, భుజం, దవడ నొప్పి వంటి ఇతర లక్షణాల రూపంలో కూడా సంకేతమిస్తుందని అన్నారు. ఏదీ ఏమైనా 45 ఏళ్లు దాటాక ఏ వ్యక్తి అయినా చిన్న అనారోగ్య సమస్య వచ్చినా సరే నిర్లక్ష్యం చేయకపోవడమే ఉత్తమం అని సూచిస్తున్నారు వైద్యులు. (చదవండి: ఆ మహిళ కడుపునొప్పే షాకివ్వగా..బయటపడ్డ మరో ట్విస్ట్ చూసి కంగుతిన్న వైద్యులు) -
అతడి గుండె చెదురుతోంది!
సాక్షి, హైదరాబాద్: అస్థిరమైన జీవనశైలి, హార్మోన్ల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు సహా అన్ని ప్రధాన రాష్ట్రాల్లోనూ మహిళల కంటే మగవాళ్లే ఎక్కువ గుండెపోటుతో మరణిస్తున్నారు. గతేడాది తెలంగాణ రాష్ట్రంలో 284 మంది గుండెపోటుతో మరణించగా.. ఇందులో 257 మంది పురుషులు కాగా.. 27 మంది స్త్రీలున్నారు. ఆంధప్రదేశ్‌లో 176 మంది మృత్యువాత పడగా.. 162 మంది మగవాళ్లు, 14 మంది ఆడవారున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇటీవల విడుదల చేసిన యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇండియా (ఏడీఎస్‌ఐ)–2022 నివేదికలో బహిర్గతమైంది. గుండెపోట్లు ఎందుకంటే.. గుండె జబ్బులకు ప్రధాన కారణం జన్యు సంబంధమైనవే. బలహీన గుండె కండరాలు ఉంటే హార్ట్ ఎటాక్‌లకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. మహిళలకు మెనోపాజ్ దశ వరకు శరీరంలో హార్మోన్లు భద్రత కల్పింస్తాయి. కానీ, పురుషులకు అలా ఉండదు కాబట్టి యుక్త వయసులో కూడా మగవారికి గుండెపోటు ప్రమాదం ఎక్కువ.అతిగా మాంసం వినియోగం, కొవ్వు, జంక్ ఫుడ్ వంటి ఆహారపు అలవాట్లతో పాటు శారీరక, మానసిక ఒత్తిడి, అస్థిరమైన జీవనశైలి వల్ల గుండెపోటు వస్తుంటుంది. గుండె ఆగుతున్న వారిలో యువకులే ఎక్కువ గతేడాది దేశంలో 32,410 మంది గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించగా.. ఇందులో 28,005 మంది పురుషులు, 4,405 మంది మహిళలు ఉన్నారని. 2021లో 28,413 మంది హార్ట్ ఎటాక్‌తో మృత్యువాత పడ్డారు. అంటే ఏడాదిలో 12.5 శాతం పెరిగింది. గతేడాది 289 మంది మైనర్లకు హార్ట్ ఎటాక్ రాగా.. ఇందులో 185 మంది బాలురు, 104 మంది బాలికలున్నారు. 18 నుంచి 45 ఏళ్ల 12,759 మంది యువత గుండెపోటుకు గురికాగా.. 11,210 మంది పురుషులు, 1,549 మంది స్త్రీలు, 45–60 ఏళ్ల వయసు ఉన్న 12,290 మంది గుండె పోటుతో మరణించగా.. మగవాళ్లు 10,854 మంది, సమహిళలు 1,436 మంది ఉన్నారు. అలాగే 60 ఏళ్ల పైబడిన వాళ్లు 7,069 మంది మరణించగా.. 5,756 మంది పురుషులు, 1,313 మంది మహిళలున్నారు. ఏం చేయాలంటే... ► సాధ్యమైనంత వరకు మానసిక, పని ఒత్తిడిని తగ్గించుకోవాలి. ► ఉదయం, సాయంత్రం వ్యాయామం తప్పనిసరి. ► స్వచ్ఛమైన గాలి, వెలుతురు వచ్చే ప్రాంతంలో ప్రతి రోజు కొంత సమయం గడపాలి. ► ఒత్తిడిని నియంత్రణలో ఉంచుకోవాలి. ఇందుకోసం నిత్యం యోగా, ధ్యానం వంటివి చేయాలి. ► 35 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరూ క్రమం తప్పకుండా గుండె పరీక్షలు చేయించుకోవాలి. ► స్వీయ సంతృప్తి అత్యవసరం. లేనిపోని ఆర్భాటాలకు, డాబులకు పోయి మానసిక ఒత్తిడి తెచ్చుకోకూడదు. డాక్టర్ ఏజీకే గోఖలే గుండె శస్త్ర చికిత్స నిపుణులు, అపోలో ఆసుపత్రి -
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. యంగ్ హీరోయిన్ మృతి!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి మలయాళ నటి లక్ష్మీకా సజీవన్ కన్నుమూశారు. ప్రస్తుతం యూఏఈలో ఉన్న ఆమె గుండెపోటుతో కేవలం 27 ఏళ్లకే తుదిశ్వాస విడిచారు. ఈ వార్త మాలీవుడ్ ఇండస్ట్రీని షాక్‌కు గురి చేసింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. అజు అజీష్ దర్శకత్వం వహించిన 'కాక్క' షార్ట్ ఫిల్మ్‌లో పంచమిగా నటించిన లక్ష్మిక ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. లక్ష్మిక సజీవన్ తన కెరీర్లో పంచవర్ణతతా, సౌదీ వెల్లక్కా, పూజయమ్మ, ఉయారే, ఒరు కుట్టనాదన్ బ్లాగ్, నిత్యహరిత నాయగన్, దుల్కర్ సల్మాన్ నటించిన ఒరు యమందన్ ప్రేమకథా చిత్రాల్లో నటించింది. View this post on Instagram A post shared by Lakshmika Sajeevan (@lakshmikasajeevanoffical) -
అర్థరాత్రి దాటాక నిద్రపోతున్నారా? మీ గుండె రిస్క్‌లో పడ్డట్లే!
ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా అనేక అనారోగ్యాల బారిన పడుతున్నాం. ముఖ్యంగా ఇటీవలి కాలంలో గుండెపోటు సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే పలువురు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే నిద్రవేళల్లో కొన్ని మార్పులు చేసుకుంటే హార్ట్ రిస్క్ తగ్గుతుందని యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ప్రచురించిన ఓ అధ్యయనంలో తేలింది. ఇంతకీ నిద్రకు ఏ సమయం మంచిది? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా 80% కంటే ఎక్కువ గుండె జబ్బులను నివారించవచ్చని మీకు తెలుసా? ధూమపానం మానేయడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిది అన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ అధ్యయనం ప్రకారం.. రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోయే వారిలో గుండెజబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని తేలింది.ఈ రీసెర్చ్ కోసం సుమారు 88వేల మందిని పరిశీలించారు. ఇందులో 60% మంది మహిళల వయసు దాదాపు 61 ఏళ్లుగా ఉంది. వీరిలోరాత్రి 10-11 గంటల లోపు నిద్రపోయే వారిలో హార్ట్ రిస్క్ తక్కువగా ఉందని తేలింది. అర్థరాత్రి దాటిన తర్వాత నిద్రపోయిన వారిలో గుండెజబ్బులు వచ్చే ప్రమాదం సుమారు 24% ఎక్కువగా ఉంది. అందుకే రాత్రిళ్లు త్వరగా నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ప్రతిరోజూ సుమారు 7-8గంటలకు తగ్గకుండా, రోజూ ఒకే సమయంలో నిద్రపోవడం మరింత మంచిదంటున్నారు. -
గుండెపోటుతో బీఆర్ఎస్ జెడ్పీ చైర్మన్ మృతి
సాక్షి, జనగామ: జనగామ జిల్లా జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. హన్మకొండలోని చైతన్యపురిలోని నివాసంలో గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు సంపత్‌రెడ్డిని నగరంలోని రోహిణి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగానే సంపత్‌రెడ్డి మృతి చెందారు. ఎనిమిది సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో సంపత్‌రెడ్డి కుమారుడు మృతి చెందాడు. ఇటుక బట్టీల వ్యాపారం చేసే సంపత్‌రెడ్డి 2004లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గత జెడ్పీటీసీ ఎన్నికల్లో చిల్పూర్ మండల జెడ్పీటీసీగా గెలుపొందారు. తర్వాత జెడ్పీ చైర్మన్ అయ్యారు. జెడ్పీ చైర్మన్‌గా ఉంటూనే జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సంపత్‌రెడ్డి మృతితో ఆయన స్వగ్రామమైన రాజవరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. మృతదేహాన్ని స్వగ్రామం రాజవరానికి తీసుకెళ్లి మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రేపు నివాళులర్పించనున్న కేసీఆర్.. జనగామ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, జిల్లా జెడ్పీచైర్మన్ సంపత్‌రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. మంగళవారం కేసీఆర్ జనగామకు వెళ్లి సంపత్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించనున్నారు. ఒకే ఏడాదిలో రెండో జెడ్పీచెర్మన్.. ఇదే ఏడాది జూన్‌లో ములుగు జిల్లా జెడ్పీచైర్మన్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కుసుమ జగదీష్ గుండెపోటుతో మృతి చెందారు. ఈయన కూడా బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌తో నడిచిన వారిలో ఒకరు. జగదీష్ మృతి చెందినపుడు బీఆర్ఎస్ పార్టీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ సంఘటన నుంచి కోలుకోక ముందు తొలి నుంచి పార్టీలో ఉన్న మరో జెడ్పీచైర్మన్, జిల్లా అధ్యక్షుడిని సంపత్‌రెడ్డి రూపంలో కోల్పోవడం బీఆర్ఎస్ పార్టీ వర్గాలను కలవర పరుస్తోంది. ఇదీచదవండి..ఓటమి తర్వాత కేసీఆర్ తొలిసారి ఇలా.. ఆసక్తికర వ్యాఖ్యలు -
గుండెపోటుతో మున్సిపల్ సీనియర్ కాంట్రాక్టర్ మృతి
జ్యోతినగర్: గుండెపోటుతో మున్సిపల్ సీనియర్ కాంట్రాక్టర్ గడ్డం(సుందిల్ల) నారాయణగౌడ్(59) బుధవారం మృతిచెందాడు. ఎన్టీపీసీ రామగుండం అన్నపూర్ణకాలనీలో నివసిస్తున్న రామగుండం మున్సిపల్ సీని యర్ కాంట్రాక్టర్ నారాయణగౌడ్ ఉదయం అస్వస్థతకు గురి కాగా.. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు చికిత్స అందించే లోపు మృతిచెందాడు. మృతుడికి భార్య విజయతో పాటు ఇద్దరు కుమార్తెలున్నారు. పలువురు కాంట్రాక్టర్లు, గౌడ సంఘం నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. -
తిరుమల: శ్రీవారి నడకదారిలో గుండెపోటుతో డీఎస్పీ మృతి
సాక్షి, తిరుమల: శ్రీవారి మెట్టు మార్గంలో ఇంటెలిజెన్స్ డీఎస్పీ కృపాకర్ గుండెపోటుతో మృతి చెందారు. 1,805వ మెట్టు వద్ద గుండెపోటుతో ఆయన కుప్పకూలారు. తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు. ఆయన స్వస్థలం విజయవాడ సమీపంలోని పోరంకి కాగా, ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి భద్రతా విధుల నిమిత్తం కృపాకర్ తిరుమలకు వచ్చారు. ఈ ఘటనపై ఆయన కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. చదవండి: ఇన్‌స్టా రీల్‌కు చెత్త కామెంట్లు.. ఆర్టిస్టు ఆత్మహత్య -
ఆకస్మిక మరణాలకు.. టీకాకు సంబంధం లేదు!
అకస్మాత్తుగా తీవ్రస్థాయి వ్యాయామంతో ముప్పు.. పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ.. కుప్పకూలిన 22 ఏళ్ల యువకుడు!.. వ్యాయామం చేస్తూండగా గుండెపోటు.. 42 ఏళ్ల యాక్టర్ మృతి.. పాతికేళ్లకే గుండెపోటు.. ఆకస్మిక మరణం!.. ఇలాంటి శీర్షికలు వార్తాపత్రికల్లో మీరూ చూసే ఉంటారు. కోవిడ్ తరువాత ఇలాంటి ఆకస్మిక మరణాలు మరీ ముఖ్యంగా తక్కువ వయసు వారిలో ఎక్కువయ్యాయి అన్న చర్చ కూడా జరిగే ఉంటుంది. అయితే ఇందులో వాస్తవం లేదంటోంది భారత వైద్య పరిశోధన సమాఖ్య (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, క్లుప్తంగా ఐసీఎంఆర్). కోవిడ్ టీకాలతోనే గుండె జబ్బుల ముప్పు పెరిగిందన్నది ప్రజల్లో ఉన్న అపోహ మాత్రమేనని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు అధ్యయన పూర్వకంగా స్పష్టం చేస్తున్నారు. కోవిడ్ కంటే ముందు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవడం మొదలుకొని కుటుంబ ఆరోగ్య చరిత్ర, మితిమీరిన మద్యపానం, అలవాటు లేని తీవ్రమైన పనులు కొనసాగించడం వంటివి యువత ఆకస్మిక మరణాలకు కారణాలు కావచ్చునని వీరు అంటున్నారు. కోవిడ్ తరువాత యువకులు ఆకస్మికంగా గుండెజబ్బుల కారణంగా మరణిస్తున్నారన్న వదంతులు ప్రబలుతున్న సమయంలో ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు దేశవ్యాప్తంగా ఒక అధ్యయనం చేపట్టారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 47 టెరిటరీ ఆసుపత్రుల్లో నిర్వహించిన ఈ అధ్యయనం ద్వారా అసలు సమస్య ఏమిటన్నది తెలుసుకునే ప్రయత్నం జరిగింది. ఈ అధ్యయనంలో 18 - 45 మధ్య వయస్కుల ఆకస్మిక మరణాల కారణాలను విశ్లేషించారు. ఈ మరణాల్లో కొంతమంది సెలబ్రిటీలూ ఉండటం గమనార్హం. ‘‘కోవిడ్ వ్యాధి, టీకాలకు ఈ మరణాలకు సంబంధం ఉందన్న ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో అసలు కారణాలేమిటో తెలుసుకునేందుకు ఈ అధ్యయనం చేపట్టాం’’ అని ఐసీఎంఆర్ ఒక ప్రకటనలో తెలిపింది. 3645 మంది వివరాలతో... ఐసీఎంఆర్ అధ్యయనంలో భాగంగా మొత్తం 3645 మంది వివరాలను విశ్లేషించారు. ఇందులో కోవిడ్ కారణంగా ఆసుపత్రుల్లో చేరి ఆ తరువాత 24 గంటల్లోనే మరణించిన వారు కూడా ఉన్నారు. వీరందరూ 18 - 45 మధ్య వయస్కులే. ఆకస్మిక మరణానికి కారణం కాగల వ్యాధులు, సమస్యలు ఏవీ లేనివారే. అక్టోబరు 2021 - మార్చి 2023 మధ్యకాలంలో వీరు ఆకస్మికంగా మరణించారు. ఆకస్మిక మరణాలకు గుండె సంబంధిత సమస్యలే కారణమైనప్పటికీ అన్నీ కార్డియాక్ అరెస్ట్ (అకస్మాత్తుగా గుండె పనిచేయకుండా పోవడం) ఫలితంగానూ జరగలేదని ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడియమాలజీ డైరెక్టర్ శాస్త్రవేత్త మనోజ్ ముర్హేకర్ తెలిపారు. మరణించిన వారి సమచారాన్ని, కోవిడ్ బాధితులను పోల్చి చూసినప్పుడు టీకాలే మరణానికి కారణమని సూచించే ఏ అంశమూ బయటపడలేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘వాస్తవానికి టీకాలు మరణాలను అడ్డుకుంది. ఆకస్మిక మరణాలకు ఇతర కారణాలు ఉండి ఉండవచ్చు’’ అని ఆయన వివరించారు. కోవిడ్ -19 టీకాలు, వ్యాధి, చికిత్స తరువాత ఆరోగ్యం వంటి విషయాలపై తాము కొంతమందిని ఇంటర్వ్యూ చేశామని, కుటుంబంలో ఆకస్మిక మరణాల చరిత్ర ఏమైనా ఉందా? అన్నదీ పరిశీలించామని, ధూమపానం, మత్తుముందుల వాడకం, మద్యపానం ఎంత తరచుగా చేస్తారు? మరణానికి రెండు రోజుల ముందు అతిగా శ్రమించారా? వంటి వివరాలు అడిగి తెలుసుకున్నామని... ఇలాంటి కారణాల వల్లనే చాలామంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసిందని మనోజ్ ముర్హేకర్ తెలిపారు. ‘‘మద్యపానం ఎంత తరచుగా తీసుకుంటూంటే ఆకస్మిక మరణానికి అవకాశాలు అంత ఎక్కువగా పెరిగాయి’’ అని వివరించారు. రెండు డోసుల టీకాతో రక్షణ... కోవిడ్ వ్యాధి నివారణకు రెండు డోసుల టీకాలు వేసుకున్న వారు ఆకస్మిక మరణానికి గురయ్యే అవకాశాలు తక్కువైనట్లు తమ అధ్యయనంలో తేలిందని ఐసీఎంఆర్ చెబుతోంది. అయితే కోవిడ్-19 కారణంగా మరణాలు ఎలా సంభవిస్తాయన్న అంశం ప్రస్తుతానికి పూర్తిగా అర్థం కావడం లేదని తెలిపింది. అయితే సార్స్ కోవ్-2 వ్యాధి వల్ల గుండెజబ్బు, గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువవుతుందని మాత్రం ఈ అధ్యయనం అంగీకరించడం గమనార్హం. ఆకస్మిక మరణాలకూ కారణమవుతుందా? అన్న విషయంపై మాత్రం తగినంత సమాచారం లేదని ఐసీఎంఆర్ చెబుతోంది. కోవిడ్ టీకాల కారణంగా ఆకస్మిక మరణాలు పెరిగాయని కొంతమంది తగిన సాక్ష్యాధారాల్లేకుండా మాట్లాడుతున్రాను. వ్యాక్సీన్లతో మరణాలు తగ్గాయని చెప్పేందుకు రుజువులు ఉన్నాయి. ముప్ఫై ఏళ్ల పైబడ్డ వారు.. అప్పటివరకూ తరచూ వ్యాయామం చేయకుండా.. అకస్మాత్తుగా తీవ్రస్థాయిలో శ్రమించడం మొదలుపెడితే వారిలో ఆకస్మిక మరణాలు సంభవించే అవకాశాలు ఎక్కువ అవుతాయి. ఆకస్మాత్తుగా తీవ్రస్థాయిలో శ్రమించడం వల్ల గుండె రక్తనాళాల్లో అప్పటివరకూ పేరుకుపోయిన గార లాంటి పదార్థం ముక్కలై గుండెపోటుకు దారితీయవచ్చు’’ అని వైద్య నిపుణులు కొందరు చెబుతున్నారు. చదవండి: డయాబెటిస్ పేషెంట్స్.. ఇకపై ఆ బాధ తీరినట్లే -
‘నువ్వు లేకుండా ఎలా బతికేది..’ కువైట్‌లో ఘటన..!
సాక్షి, కరీంనగర్: ఉపాధివేటలో గల్ఫ్ బాట పట్టిన యువకుడి శవపేటికలో తిరిగి రావడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ‘నువ్వు లేకుండా ఎలా బతికేది..’ అంటూ మృతుని భార్య రోదించిన తీరు అక్కడి వారిని కలచివేసింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు. మండలంలోని అనంతపల్లికి చెందిన బుర్ర గంగాధర్‌గౌడ్(44) ఉపాధి కోసం మూడేళ్ల క్రితం కువైట్ వెళ్లాడు. అక్కడ పెట్రోల్‌బంక్‌లో పనిచేస్తున్నాడు. రెండు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి వెళ్లాడు. బుధవారం పనిచేస్తుండగా గుండెపోటు రావడంతో అతని స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందగా.. సోమవారం శవపేటిక స్వగ్రామానికి చేరింది. శవపేటికపై పడి భార్య లక్ష్మి, తల్లి గంగవ్వ రోదనలు మిన్నంటాయి. మృతునికి తండ్రి సత్తయ్య, తల్లి గంగవ్వ, భార్య లక్ష్మి, కుమారుడు మనివర్ధన్, కూతురు మణిదీప్తి ఉన్నారు. -
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూస్తూ గుండెపోటుతో యువకుడి మృతి
సాక్షి, తిరుపతి: తిరుపతిలో విషాదం చోటుచేసుకుంది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ మ్యాచ్ చూస్తూండగా ఉత్కంఠ లోనైన క్రికెట్అభిమాని గుండె పోటుతో మృతి చెందాడు. వివరాలు.. తిరుపతి రూరల్ మండలం దుర్గసముద్రం గ్రామానికి చెందిన జ్యోతి కుమార్ యాదవ్ అనే యువకుడు బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తున్న జ్యోతి కుమార్.. ఇంటి వద్దనే ఆదివారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ఫైన్ మ్యాచ్‌ను స్నేహితులతో కలిసి చూశాడు. ఎంతో ఉద్వేగంతో మ్యాచ్ వీక్షిస్తున్న సమయంలో గుండె నొప్పి రావడంతో చికిత్స కోసం స్నేహితులు తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మ్యాచ్ చూస్తున్న సమయంలో ఆస్ట్రేలియా జట్టు మూడు వికెట్లు పడే సరికి ఆనందంతో తట్టుకోలేక ఊగిపోయాడని, ఆ తర్వాత గుండె నొప్పి రావడంతో తుది శ్వాస విడిచాడని స్నేహితులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. మృతుడు కుటుంబాన్ని తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పరామర్శించారు. చదవండి: దేశం ఎప్పుడూ మీ వెంటే: వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్ ఓటమిపై ప్రధాని మోదీ -
ఇంజినీరింగ్ విద్యార్థిని.. కాలేజీలో హఠాత్తుగా..
సాక్షి, కరీంనగర్: సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూనగర్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని గెంట్యాల ప్రదీప్తి(18) గురువారం గుండెపోటుతో మృతి చెందింది. ప్రదీప్తి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. మంగళవారం సాయంత్రం కాలేజీలో హఠాత్తుగా గుండెపోటుకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించింది. ప్రదీప్తి హఠాన్మరణంతో ఆమె తల్లిదండ్రులు గెంట్యాల రేణుక–భూమేశ్‌లు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రదీప్తి మృతదేశాన్ని అంబులెన్స్‌లో సిరిసిల్ల లోని స్వగృహానికి తరలించారు. కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. చిన్న వయసులోనే ఇంజినీరింగ్ విద్యార్థిని గుండెపోటుతో మరణించడం సిరిసిల్లలో విషాదం నింపింది. ఇవి కూడా చదవండి: పాతబడిన భవనం వద్దకు తీసుకెళ్లి.. చిన్నారిపై దారుణంగా..