ఆల శశివర్ధన్‌రెడ్డి (ఫైల్)
అడ్డాకుల: దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు ఆల శశివర్ధన్‌రెడ్డి(58) గుండెపోటుతో మృతి చెందారు. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి భూత్పూర్ మండలం అన్నాసాగర్‌లోని ఇంటికి వచ్చిన శశివర్దన్‌రెడ్డి సాయంత్రం పొలం వద్దకు వెళ్లి వచ్చాడు. రాత్రి ఇంట్లో భోజనం చేసి నిద్రిస్తుండగా అర్ధరాత్రి తర్వాత నిద్రలోనే గుండెపోటుకు గురయ్యాడు.
తల్లి వరలక్ష్మి గుర్తించే సరికే ప్రాణాలు వదిలాడు. మృతుడికి భార్య శ్రీలత, కుమార్తె సుష్మ ఉన్నారు. అన్న మృతి వార్త తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ఆల హుటాహుటిన హైదరాబాద్ నుంచి అన్నాసాగర్‌కు తరలివచ్చి కన్నీటిపర్యాంతమయ్యారు. గురువారం ఉదయం అన్నాసాగర్ జనసంద్రమైంది. నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి భౌతికకాయం వద్ద నివాళులర్పించారు.
ప్రముఖ నేతల సంతాపం
శశివర్ధన్‌రెడ్డి మృతి చెందడంతో ప్రముఖ రాజకీయ నేతలు అన్నాసాగర్‌కు తరలివచ్చి సంతాపం తెలిపారు. దేవరకద్ర, గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు మధుసూదన్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడు, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, డీకే అరుణ, మాజీ ఎంపీలు ఏపీ జితేందర్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, అంజయ్యయాదవ్, గువ్వల బాలరాజు, టీటీడీ బో ర్డు మాజీ సభ్యుడు మన్నె జీవన్‌రెడ్డి, ఏపీ మిథున్రె డ్డి, వాల్యానాయక్, అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి తదిత ర ప్రముఖులు నివాళులర్పించారు. అనంతరం మా జీ ఎమ్మెల్యేను ఓదార్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment