
ఆడిపాడే చిన్న వయసులోనే బాలికను గుండెపోటు పొట్టనపెట్టుకుంది. ఈ సంఘటన చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా జోగణ్ణనకెరె గ్రామంలో జరిగింది.
కర్ణాటక: ఆడిపాడే చిన్న వయసులోనే బాలికను గుండెపోటు పొట్టనపెట్టుకుంది. ఈ సంఘటన చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా జోగణ్ణనకెరె గ్రామంలో జరిగింది. విద్యార్థిని సృష్టి (13) 8వ తరగతి చదువుతోంది. బుధవారం పొద్దున్నే పాఠశాలకు వెళ్లడానికి సిద్ధమవుతుండగా గుండెపోటు రావటంతో కుప్పకూలిపోయింది. కుటుంబసభ్యులు మూడిగెరె ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో కన్నుమూసింది. బిడ్డను కోల్పోయిన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.