కర్ణాటకలో ఘోర ‍ప్రమాదం.. ఒకే ఫ్యామిలీలో ఐదుగురు మృతి | van rams into parked truck in Karnataka Kalaburagi | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో ఘోర ‍ప్రమాదం.. ఒకే ఫ్యామిలీలో ఐదుగురు మృతి

Published Sat, Apr 5 2025 10:19 AM | Last Updated on Sat, Apr 5 2025 11:27 AM

van rams into parked truck in Karnataka Kalaburagi

బెంగళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లారీని జీపు కొట్టిన ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

వివరాల ప్రకారం.. కర్ణాటకలోని కలబుర్గి జిల్లాలోని జీవరగి సమీపంలో శనివారం తెల్లవారుజామున లారీని అధిక వేగంతో వస్తున్న జీపు అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఐదుగురు దుర్మరణం చెందారు, పది మందికి పైగా గాయాలయ్యాయి. బాగల్ కోట నుంచి కలబుర్గిలోని హజరత్ కాజా గరీబ్ నవాజ్ దర్గాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement