
సూర్యభగవానుడు ధనస్సురాశిలోఉండే మాసాన్ని ధనుర్మాసంగా పిలుస్తారు.
ప్రదోషకాలంలో శివాలయంలో చండీ ప్రదక్షణ, శివార్చన సర్వసిద్ధిప్రదం.
విద్యాప్రాప్తి కొరకు మేధా సంపత్తి కొరకు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయండి.
నీలంరంగు ఉమ్మెత్త పూలతో అర్చన చేయుట సర్వకార్యసిద్ధి, శత్రుసంహారము.
సంసార సంబంధమైన సర్వబాధలు నివారణకు లకీ‡్ష్మనరసింహస్తోత్ర పారాయణ చేయండి.
శ్రీచక్రం ఇంట్లో వుంటే శౌచం ఎక్కువగా పాటించాలి.
శివునికి బిల్వపత్రం, గణపతికి గరిక, విష్ణువుకు తులసి మహాప్రీతి.
సంతానప్రాప్తికి శివారాధన విశేష ఫలితాలనిస్తుంది.
బృహస్పతి అనుగ్రహం కోసం గురువారం శనగలు దానం చేస్తే మంచిది.
షష్టిపూర్తి 60 నిండిన తర్వాత సంవత్సరాలలో చేసుకోవలెను.
ఉగాదినాడు పంచాగానికి కాలపురుషాయ నమః అని పూజ చేయవలెను.
కలియుగంలో భగవంతుడి నామస్మరణం ముక్తికి సులభోపాయం.
రోజూ గణపతి స్తోత్ర పారాయణ వలన విఘ్నాలు తొలగును.
దక్షిణామూర్తి, హయగ్రీవ దేవతా ఆరాధన వలన విద్యాప్రాప్తి.
నిత్య భగవదారాధన తర్వాత, లోకక్షేమం కొరకు కూడా ప్రార్థించుట మంచిది.
రోజూ కొంత సమయం దేశక్షేమం కొరకు దైవారాధన చేయుటచే మంచి నాయకులు ఉద్భవిస్తారు.
దేవతారాధన ఎంతో– పితృదేవతా రాధనకు కూడా అంతే ప్రాధాన్యం ఉన్నది.
ఉగాదినాడు పంచాంగ పూజ, శ్రవణం తప్పక చేయవలెను.
నిత్యపూజలో నివేదన చేసే పదార్థం మీద ఆవునెయ్యి తప్పనిసరిగా వేయాలి.
నిత్యం దేశక్షేమం కోసం కొంత సమయం దైవారాధన చేయండి.
కుజగ్రహశాంతికి సుబ్రహ్మణ్య, హనుమ పూజలు శ్రేయస్కరం.
అక్షరాభ్యాసములకు ఉత్తరాయనం విశేషం
కొత్తబియ్యాన్ని పితృదేవతలకు నివేదించిన తరువాతే ఉపయోగించాలి.
రోజు దైవారాధన అయ్యాక భగవంతునికి యథాశక్తి నైవేద్యం పెట్టవలెను
పుష్కర శ్రాద్ధం సోదరులు అందరూ కలసి పెట్టరాదు. విడిగానే పెట్టాలి.
గరికతో రోజూ గణపతిని అర్చిస్తే, కార్యవిజయం, కేతుగ్రహానుకూలం.
పితృ దేవతారాధన సరిగా చేయకుంటే కుటుంబంలో దోషాలు వస్తాయి.
శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మి ఆరాధన చేయండి. మాసశివరాత్రి రోజు శివకళ్యాణం చేయుట ద్వారా వివాహ ప్రయత్నాలు సిద్ధిస్తాయి.
బుధ గ్రహ అనుగ్రహం కోసం విష్ణు స్తోత్రములు పారాయణ చేయవలెను.
ప్రతిరోజూ ఉదయకాలంలో తప్పనిసరిగా దీపారాధన చేయాలి.
శని త్రయోదశీ ప్రదోషకాలంలో శివపూజ ద్వారా సర్వసౌఖ్యాలు అందుతాయి.
దీపారాధన చేయుటకు ‘‘వత్తులు’’ స్వయంగా తయారు చేసుకోవాలి.
కనుమ రోజున ప్రయాణం చేసే ఆచారం మన ప్రాంతాలలో లేదు.
మారేడు, తులసీ, తెల్లజిల్లేడు దేవతా వృక్షాలు. వీటిని స్నానం చేయకుండా ముట్టుకోరాదు.
వ్యాసపూజ రోజున యతీశ్వరులను పూజించాలి.
దుర్గాపూజలు చేయుట ద్వారా రాహుగ్రహ శాంతి కలుగును.
గురు, రాహువులు 10 డిగ్రీలు లోపుగా కలిసి ఉంటే విద్యాభంగం ఏర్పడుతుంది.
పేగు మెడలో వేసుకుంటే నాళవేష్టన జనన శాంతి చేయించాలి.
వర్జ్యంలో పుడితే విషఘటికా శాంతి చేయించాలి.
శుక్ర, రాహువులు 10 డిగ్రీలు లోపుగా కలిసి ఉంటే వైవాహిక జీవితం ఇబ్బందికరం.
అస్థి సంచయనం కేవలం ఒక జీవనదిలోనే చేయాలి. రెండు మూడు నదులలో చేయరాదు.
శంకుస్థాపన చేసిన రెండవ సంవత్సరం గృహప్రవేశం చేయుట దోషం కాదు.
శుక్ర నక్షత్రాలలో రాహువు, రాహు నక్షత్రాలలో శుక్రుడు ఉండడం వైవాహిక జీవితానికి ఇబ్బంది.
శనివారం నువ్వులనూనె శరీరానికి రాసుకొని స్నానంచేయుట ద్వారా శనికి శాంతి.
కార్తీకమాసం శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని కైశిక ద్వాదశి అని అంటారు.
కుజ గ్రహ శాంతి చేయించినా కుజదోషం ఉన్నవారికి ‘’కుజదోషం ఉందనే’’ చెప్పాలి.
భగినీ హస్త భోజనం కార్తీక శుద్ధ విదియ నాడు చేయుట ఆయుర్వృద్ధి.
గ్రహణ శాంతి
గ్రహణ శాంతి: గ్రహణ సమయంలో ఇంట్లోని అన్ని వస్తువుల మీద దర్భలు ఉంచడం మన సనాతన ధర్మం. గ్రహణ ఆరంభంలో అందరూ సనాతన ధర్మం ఆచరించేవారు. స్నానం చేసి దైవ సంబంధ స్తోత్ర పారాయణ మంత్ర, జపాదులతో కాలక్షేపం చేసి గ్రహణానంతరం స్నానం చేయండి.
దానం:
వెండిచంద్రబింబం, నాగపడగ, బియ్యం, గోధుమలు, తెలుపువస్త్రం, కెంపు, రాగిపాత్ర, కంచుపాత్ర, నువ్వులు, ఆవునెయ్యి, దక్షిణ దానం ఇవ్వవలెను. గ్రహణం రోజు, మరుసటి రోజు లేదా మరల పౌర్ణమి లోపు దానం ఇయ్యవచ్చును. వెండితో చంద్రబింబం మాదిరిగా (బొట్టు బిళ్ళ మాదిరి) చేయించి దానం చేయవలెను.
దాన సంకల్పం:
‘‘మమ జన్మరాశి జన్మనక్షత్రవ శాద్యరిష్ట స్థానస్థిత గ్రహణ సూచిత సర్వారిష్ట ప్రశాంతి పూర్వక ఏకాదశ స్థాన స్థిత గ్రహణ సూచిత శుభఫల ప్రాప్త్యర్థం బింబదానం కరిష్యే’’
దాత చదవవలసిన శ్లోకం: తమోమయ మహాభీమ సోమసూర్య విమర్దన హేమ తారా ప్రదానేన మమ శాంతి ప్రదోభవ విధుంతుద నమస్తుభ్యం సింహికా నందనాచ్యుత దానేనానేన నాగస్య రక్షమాం వేధజాద్భయాత్.. ఎటువంటి దానం ఎప్పుడు ఇచ్చినా దానంతో పాటుగా ‘స్వయంపాకం’ ఇవ్వడం శుభప్రదం. గ్రహజపం వంటివి చేయించినాసరే ఇవ్వండి.
గ్రహణశాంతి అనేది మహర్షులు గ్రంథస్థంగా చెప్పిన అంశం. దీనికి వైదికాచారం జోడించి పెద్దలు చెప్పే విషయాలను ప్రస్తావన చేశాం. సూర్య చంద్రులను ప్రత్యక్ష దైవాలుగా భావన చేసి మనం నిత్యం దైవ సంబంధ కార్యాలు చేస్తూ ఉంటాము. వారిరువురిలో ఏ ఒక్కరైనా ప్రత్యక్షంలో లేరు అంటే గ్రహణంగా భావన చేసి శాంతి పూజ చేయుట మన మతాచారం.
అందుకోసమే ప్రతి అమావాస్య వెళ్ళిన మరుసటిరోజున, గ్రహణం మరుసటిరోజున, జాతాశౌచ, మృతాశౌచములకు మరుసటì æరోజున దేవతామందిరం అంతా కూడా శుభ్రంచేసి మరలా విగ్రహాలను కడిగి శుద్ధి చేసి దేవతామందిరములో పెట్టి అర్చన చేయడం మన సంప్రదాయం.