
కథ చెప్పడంలో స్క్రిప్ట్ అత్యంత కీలకం
మంచి స్క్రిప్ట్ రాయడం సులభం కాదు
థియేటర్ ఆర్ట్స్ ఒక సవాలుతో కూడిన పని
ప్రఖ్యాత నటి, నాటక కళాకారిణి రత్నపాఠక్‌షా
రాయదుర్గం : మొదట్లో నేను నటిని కావాలనే ఆలోచననే అసహ్యించుకున్నా.. కానీ చివరకు నటిగా మారానని ప్రఖ్యాత నటి, నాటక కళాకారిణి రత్నపాఠక్‌షా స్పష్టం చేశారు. హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని ఐటీసీ కోహినూర్‌లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఎల్‌ఓ) హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ‘పాత్రలు, కథలను రూపొందించడం’ అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాసం చేశారు. అనంతరం తెలంగాణ పురాతన డోక్రా క్రాఫ్ట్ జ్ఞాపికను ఆమె ఆవిష్కరించారు. నేను కథకుల కుటుంబంలో పెరిగానని, కాబట్టి ఆ నైపుణ్యం నాకు సహజంగానే వచి్చందని, అందరిలా కాకుండా నేను భిన్నంగా ఉండాలని కోరుకున్నాని వివరించారు. మంచి స్క్రిప్ట్ రాయడం అంత సులభం కాదని, దీనికి ఎంతో అనుభవం, పరిజ్ఞానం ఉండాలని అన్నారు. సినిమాలతో పోలిస్తే థియేటర్ ఆర్ట్స్ ఒక సవాలుతో కూడిన పని అని గుర్తుచేశారు.
డోక్రా మెటల్ కాస్టింగ్ క్రాఫ్ట్ పునరుద్ధరణే లక్ష్యం..
చేతి వృత్తులకు మద్దతు ఇవ్వడం ద్వారా 4వేల ఏళ్ళ పురాతన డోక్రా మెటల్ కాస్టింగ్ క్రాఫ్ట్‌ను పునరుద్ధ్దరించాలనేదే లక్ష్యం. మన సంప్రదాయాన్ని కాపాడుకోడమేకాదు, దానిని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం. ఉషేగావ్, జామ్‌గావ్, కేస్లా గూడ నుంచి వచ్చిన చేతి వృత్తులవారితో కలిసి పనిచేయడాన్ని గర్వంగా భావిస్తున్నాం. – ప్రతిభాకుందా, ఎఫ్‌ఎల్‌ఓ హైదరాబాద్ చాప్టర్ చైర్‌పర్సన్
చదవండి: ఏ భర్తా ఇవ్వలే(కూడ)ని వెడ్డింగ్ డే గిఫ్ట్ : కళ్లు చెమర్చే వైరల్ వీడియో