
మహా సమద్రాలలోకెల్ల అతి పెద్దది పసిఫిక్ మహా సముద్రం. అలాంటి సంద్రాన్ని ఒంటిరిగా చుట్టోచ్చేశాడు జపాన్‌కి చెందిన అత్యంత వృద్ధుడు.
Japanese Man solo, non-stop trip across the Pacific: భూమి పై గల మహాసముద్రాలన్నిటిలోకి పసిఫిక్ మహాసముద్రం పెద్దది. అలాంటి పసిఫిక్ మహాసముద్రాన్ని 83 ఏళ్ల వృద్ధుడు ఒంటరిగా చుట్టోచ్చేశాడు. ఒంటరిగా సమద్రయానం చేసిన తొలి వృద్ధుడిగా నిలిచాడు. ఇంతకి అతను ఎవరు? ఎలా అంత పెద్ద సాహసయాత్రను చేయగలిగాడో అనే కదా!
వివరాల్లోకెళ్తే... జపాన్‌కి చెందిన 83 ఏళ్ల కెనిచి హోరీ పసిఫిక్ మహాసమ్రుదం మీదుగా ఒంటరిగా సముద్రయానం చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. సముద్ర సాహసికుడు. చిన్నతనం నుంచి ఇలాంటి సముద్రయానానికి సంబంధించిన సాహాసయాత్రలు చేయడమంటే అతని అత్యంత ఆసక్తి. అతను 1962లో 23 ఏళ్ల వయసులోనే జపాన్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు ప్రయాణించి, పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఒంటరిగా ప్రయాణించిన ప్రపంచలోనే తొలి వ్యక్తిగా పేరుగాంచాడు.
అయితే ఆసమయంలో పాస్‌పోర్ట్ లేకుండా అమెరికాలో ప్రయాణిస్తున్నప్పుడూ చాలా ఒత్తిడికి గురయ్యానని చెప్పుకొచ్చాడు. ఇలా సమద్రయానానికి సంబంధించిన సాహాసయాత్రలను వరుసగా 1974, 1978, 1982, 2008 వరకు చేశాడు. తదనంతరం మళ్లీ ఇప్పుడూ హోరీ మార్చిలో శాన్ ఫ్రాన్సిస్కోలోని యాచ్ హార్బర్ నుంచి తన తొలి సాహాసయాత్రను ప్రారంభించాడు. ఈ సాహసయాత్రను విజయవంతంగా ముగించుకుని శనివారం తెల్లవారుజామున జపాన్‌లోని కియ్ జలసంధికి చేరుకోవడంతో ముగిసింది. ఈ అరుదైన సాహాసయాత్రతో పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఒంటరిగా ప్రయాణించిన తొలి అత్యంత పెద్ద వయస్కుడిగా నిలిచాడు.
(చదవండి: భారత యువసైంటిస్ట్ మేధస్సుకు ఐన్‌స్టీన్ ఫిదా! ప్చ్.. నోబెల్ మాత్రం దక్కలేదు!)