
దరఖాస్తు ఇస్తున్న కొత్తపల్లి శ్రీనివాస్
కుమరం భీం: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి పోటీ చేసేందుకు బీజేపీ టికెట్ కోసం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ దరఖాస్తు చేసుకున్నారు. ఆది వారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో దరఖాస్తు ఫారాన్ని అందజేశారు. 2018 లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. బీసీ బిడ్డగా తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.
దరఖాస్తు సమర్పించిన ‘పాల్వాయి’
సిర్పూర్ బీజేపీ టిక్కెట్ కోసం పాల్వాయి హరీశ్‌బాబు దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం తన దరఖాస్తు సమర్పించారు. బీజేపీ తరఫున బరిలో ఉంటానని, ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.