TS Assembly District Politics
-
జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ‘పొంగులేటి’!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన శ్రీనివాస్‌రెడ్డి.. ఈ ప్రభుత్వంలో రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, మంత్రివర్గ కూర్పు పూర్తయిన కొద్ది రోజులకే సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాలకు ఇన్చార్జ్ మంత్రులను నియమించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌కు ఇన్చార్జ్ మంత్రులుగా బాధ్యతలు అప్పగించారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు జనగామ, వరంగల్, హనుమకొండ జిల్లాలకు, సత్యవతిరాథోడ్ మహబూబాబాద్, ములుగు, జేఎస్ భూపాలపల్లి జిల్లాలకు ఇన్చార్జ్ మంత్రిగా వ్యవహరించారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం ఉమ్మడి జిల్లాకు ఒకే మంత్రిని.. అది ఇతర జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని నియమించింది. గతంలోనూ(రాష్ట్ర విభజనకు ముందు) కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాంరెడ్డి వెంకట్‌రెడ్డిని జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా కొనసాగించింది. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గురించి.. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకత కలిగిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి .. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ నుంచి ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. పాలేరు ఎమ్మె ల్యే, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి 2016లో మృతి చెందారు. అదే సంవత్సరం పొంగులేటి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మృతితో వచ్చిన ఉపఎన్నికల్లో తుమ్మల నాగేశ్వర్రావు బీఆర్ఎస్ నుంచి గెలుపొందాడు. తుమ్మల గెలుపులో శ్రీనివాస్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారు. అయితే 2019 వరకు పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగిన తనకే తర్వాత ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తిరిగి ఖమ్మం ఎంపీ టికెట్ ఇస్తారని ఆశించగా.. నామా నాగేశ్వర్రావుకు కేటాయించడం పొంగులేటిని అసంతృప్తికి గురిచేసింది. పార్టీ నేతల జోక్యంతో ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేసిన శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత జరిగిన పరిణామాలతో పార్టీలో ఇమడ లేక పోయారు. ఈ ఏడాది జనవరి 2 నుంచి పార్టీకి అంటీముట్టనట్లుగా ఉన్న శ్రీనివాస్‌రెడ్డి జూలై 2న కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో పాలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో కీలకమైన రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖలు నిర్వహిస్తున్న ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా నియమితులయ్యారు. కాగా తాజాగా నియామకమైన జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఏసీడీపీ తదితర నిధుల వినియోగం, ఎమ్మెల్యే, ముఖ్యనేతలను సమన్వయం చేయడంలో కీలకంగా వ్యవహరించడంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ కార్యక్రమాలను, పథకాల అమలును పర్యవేక్షిస్తారు. ఇవి కూడా చదవండి: ఉమ్మడి జిల్లా ఇన్చార్జిగా మంత్రి సీతక్క! -
ముగ్గురూ ముగ్గురే! ఎమ్మెల్యేలుగా తొలిసారి ఎన్నిక..
కామారెడ్డి: జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఒక్క బాన్సువాడలోనే సీనియర్ నాయకుడు పోచారం శ్రీనివాస్‌రెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన మూడు దశాబ్దాల కాలంలో ఒక్కసారి తప్ప ప్రతి ఎన్నికలో విజయం సాధించారు. మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్‌గానూ పనిచేశారు. అన్ని వ్యవస్థల మీద ఆయనకు అవగాహన ఉంది. కామారెడ్డి నుంచి తొలిసారి విజయం సాధించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డికి గతంలో జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఎల్లారెడ్డి నుంచి గెలిచిన కె.మదన్‌మోహన్‌రావుకు ప్రజాప్రతినిధిగా ఇది తొలి అనుభవం. ఆయన గతంలో రెండు పర్యాయాలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఉన్నత విద్యావంతుడైన మదన్మోహన్రావు అమెరికాలో సాఫ్ట్వేర్ వ్యాపార రంగంలో రాణించారు. పదేళ్లుగా ఇక్కడే ఉంటూ అనేక సేవా కార్యక్రమాల్లో భాగమవుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన వివిధ అంశాలపై 20 నిమిషాలపాటు మాట్లాడారు. నియోజకవర్గ సమస్యలనూ కేస్ స్టడీస్‌గా చూపుతూ రాష్ట్రంలో గత ప్రభుత్వ పాలనలో లోటుపాట్లను ఎత్తిచూపే ప్రయత్నం చేశారు. జుక్కల్‌లో తోట లక్ష్మీకాంతారావు కూడా తొలిసారి విజయం సాధించారు. ఉన్నత విద్యావంతుడైన లక్ష్మీకాంతారావు గతంలో జర్నలిస్టుగా పనిచేశారు. అలాగే వ్యాపార, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. అధికారులతో సమీక్షలు.. జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు తొలిసారి విజయం సాధించినప్పటికీ వ్యవస్థల మీద ఉన్న అవగాహనతో ముందుకు సాగుతున్నారు. అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అవినీతి రహిత నియోజకవర్గంగా కామారెడ్డిని తీర్చిదిద్దడానికి సహకరించాలని అధికారులను కోరారు. ప్రభుత్వాలు అందించే సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందేలా, అభివృద్ధి పనులు నాణ్యతతో జరిగేలా చూడాలన్నారు. మున్సిపల్ సమావేశానికి హాజరై పట్టణాభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని కోరారు. అక్రమాలకు తావులేకుండా ముందుకు సాగాలని సూచించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు నియోజకవర్గ కేంద్రంలో అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్‌తో పాటు జిల్లా అధికారులందరూ హాజరయ్యారు. నియోజకవర్గం అభివృద్ధిలో ముందు స్థానంలో నిలిచేలా కృషి చేయాలని కోరారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు సైతం ఇటీవల కలెక్టరేట్లో అధికారులతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు. అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ.. అసెంబ్లీ సమావేశాలు జరిగిన సమయంలో తప్ప మిగతా రోజుల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో తరచూ పర్యటిస్తున్నారు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలోనూ పాల్గొంటున్నారు. అలాగే ఎమ్మెల్యే హోదాలో అభివృద్ధి పనులను పరిశీలిస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఫోకస్ చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలకు హాజరవుతూ నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు. ఇవి చదవండి: జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ‘పొంగులేటి’! -
ఉమ్మడి జిల్లా ఇన్చార్జిగా మంత్రి సీతక్క!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా ఇన్చార్జిగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీ ణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, మహిళా సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు చేశారు. ఇన్చార్జి మంత్రిగా ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పథకాలు, పాలన తీరుపై సమీక్షలు, సమావేశాల నిర్వహణ, ప్రజాపాలనపై పర్యవేక్షణ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో జరిగే ప్రభుత్వ వ్యవహారాలన్నీ సమన్వయం చేస్తారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆమె ఇన్చార్జి మంత్రిగా రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం ఎస్టీ రిజర్వు కావడంతో ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన ములుగు ఎమ్మెల్యేను సీతక్కను జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమించినట్లు కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి వ్యవహరించారు. ఇవి చదవండి: ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుంటాం -
T Congress: సీతక్కకు సవాల్.. ఆయనకేమో సులువు?
సాక్షి, ఆదిలాబాద్: వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ గురి పెట్టింది. జనవరిలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు పరిధిలో పార్టీని పటిష్టం చేయడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్చార్జీలను నియమించింది. ఆదిలాబాద్‌కు రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను, పెద్దపల్లికి ఐటీ, అసెంబ్లీ వ్యవహా రాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబును నియమించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగింటిలో బీజేపీ గెలిచింది. రెండుచోట్ల బీఆర్ఎస్, ఒకచోట కాంగ్రెస్ విజయం సాధించాయి. ఇక పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అన్నీ కాంగ్రెస్ కై వసం చేసుకుంది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని గెలిపించడం శ్రీధర్‌బాబు పెద్దకష్టం కాదని ప్రచారం సాగుతోంది. శ్రీధర్‌బాబుకు సులువేనా.. ఇక పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జీగా నియమితులైన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఇదే నియోజకవర్గ పరిధిలోని మంథని శాసనసభ్యుడు. గతంలో కాంగ్రెస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. స్థానిక నేతలపై పట్టు ఉంది. అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ హవాతో అభ్యర్థి బొర్లకుంట వెంకటేశ్‌నేత ఎంపీగా గెలిచారు. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేసింది. చెన్నూర్, మంచిర్యాల, మంథని, రామగుండం, పెద్దపల్లి, ధర్మపురిలో హస్తం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక ఆరు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ రెండో స్థానంలో, మంచిర్యాల నియోజకవర్గంలో మూడో స్థానంలో నిలవడం గమనార్హం. దీంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ ఉత్సాహం చూపుతుండగా, బీఆర్ఎస్ 2019 ఫలితాలను పునరావృతం చేయాలని చూస్తోంది. అయితే ఇక్కడ పార్టీని గెలిపించడం శ్రీధర్‌బాబుకు సులువే అన్న చర్చ సాగుతోంది. ఈ బాధ్యత ఇన్‌చార్జీలదే.. ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు బాధ్యతలను కూడా ఇన్‌చార్జీలే తీసుకోనున్నారు. అయితే ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఆరుచోట్ల ఎమ్మెల్యేలు లేకపోవడంతో అక్కడ ఆ పథకాల అమలు పరంగా ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వారిని పరిగణలోకి తీసుకుని ముందుకెళ్తారా.. లేక ఇతర ముఖ్య నాయకుల కు ప్రాధాన్యతనిస్తారనేది చూడాలి. ఇక పెద్దపల్లిలో అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడంతో సంక్షే మ పథకాల అమలులో ఆ పార్టీకి పెద్దగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేదు. డిసెంబర్ 28 నుంచి గ్రామసభలు నిర్వహించి పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు. ఈ క్రమంలో ఇన్చార్జీలు కీలకం కానున్నారు. సీతక్కకు సవాలే.. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జీగా నియమితులైన సీతక్కకు ఇక్కడ సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ విజయఢంకా మోగించింది. ఎంపీగా సోయం బా పూరావు విజయం సాధించారు. గడిచిన శాస న సభ ఎన్నికల్లో ఈ లోక్‌సభ పరిధిలోని ఆది లాబాద్, నిర్మల్, ముథోల్, సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు కమలం ఖాతాలో చేరా యి. బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో బీ ఆర్ఎస్ పార్టీ తమ ప్రాబల్యం నిలుపుకుంది. కేవలం ఖానాపూర్ నియోజకవర్గంలో మాత్ర మే కాంగ్రెస్ గెలిచింది. ఇదిలా ఉంటే గతంలో సీతక్క ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరి ధిలో పలుమార్లు పర్యటించారు. నాయకులు, పార్టీ స్థితిగతులపై అవగాహన ఉంది. అ యితే ప్రతికూల పరిస్థితుల నుంచి విజయాన్ని అందుకోవాల్సిన పరిస్థితుల నేపథ్యంలో లోక్‌సభ సీటును గెలిపించడం సీతక్కకు సవాలే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇవి చదవండి: కొలిక్కిరాని మేడిగడ్డ పునరుద్ధరణ! -
'ఏం పాపం చేశామని ప్రజలు మోసం చేశారు!' : బానోత్ శంకర్‌నాయక్
మహబూబాబాద్: పార్టీ శ్రేణులు కసిగా పనిచేయకపోవడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చాక రైతులు కన్నీరు కారుస్తున్నారని, ఓటు వేసే ముందు ఆలోచిస్తే బాగుండేదన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందించిందని, ఏం పాపం చేశామని ఎన్నికల్లో ప్రజలు మోసం చేశారో తెలియడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది స్వార్థపరులు పార్టీలో లబ్ధిపొంది ఎన్నికల ముందు బయటకు వెళ్లిపోయారని, మరి కొంతమంది పార్టీలో ఉంటూ మోసం చేశారన్నారు. అలాంటి వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఇక మీదట పార్టీ శ్రేణులు ఐక్యంగా ఉండి, కసిగా పనిచేయాలన్నారు. ప్రతి ఒక్క కార్యకర్తని కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వోలం చంద్రమోహన్, జెడ్పీటీసీ రావుల శ్రీనాథ్‌రెడ్డి, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాదారపు సత్యనారాయణ, నీలం దుర్గేష్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎండి.నజీర్అహ్మద్, ప్రధాన కార్యదర్శి కముటం శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ బొబ్బిలి మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గండు సావిత్రమ్మ, జాటోత్ హరీశ్‌నాయక్, ఊకంటి యాకూబ్‌రెడ్డి, సట్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: పురపాలికల్లో మోగుతున్న అవిశ్వాస గంట -
సర్కారు ఖజానాలో పైసల్లేవ్.. క్రమశిక్షణతో ఆదాయం పెంచుతాం!
జగిత్యాల/పెద్దపల్లి: ప్రస్తుతం సర్కారు ఖజానాలో పైసల్లేవని, క్రమశిక్షణతో ఆదాయం పెంచుకుంటామని ఐటీ, పరిశ్రమలు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం పది రోజుల్లో మరో రెండు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. మంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన శ్రీధర్‌బాబు ఆదివారం జిల్లాలో పర్యటించారు. తొలుత సుల్తానాబాద్ మండలానికి చేరుకున్న ఆయన.. పెద్దపల్లి, కమాన్‌పూర్, సెంటినరీకాలనీ మీదుగా మంథని చేరుకున్నారు. అడుగడగునా ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్ మక్కాన్‌సింగ్ మంత్రి వెంట ఉన్నారు. యువతకు ఉద్యోగాలు ఇస్తాం! జిల్లా కేంద్రంగా మారిన పెద్దపల్లి రూపురేఖలు మార్చుతామని, అభివృద్ధిలో ముందు వరుసలో నిలుపుదామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. జిల్లాలో పరిశ్రమలు ఉన్న రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అవసరం మేరకు మరిన్ని పరిశ్రమలు స్థాపిస్తామని హామీ ఇచ్చారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ, నియోజకవర్గానికి మంత్రి శ్రీధర్‌బాబు అండదండలు ఉండాలన్నారు. గతంలోనూ తనకెంతో సహకారం అందించారని గుర్తుచేశారు. స్పందించిన మంత్రి శ్రీధర్‌బాబు.. సీఎం రేవంత్‌రెడి ఎమ్మెల్యే విజ్జన్నకు అత్యంత సన్నిహితులన్నారు. తామంతా కలిసే జిల్లా అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు. జిల్లాతో తనకెంతో అనుబంధం ఉందని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మంత్రి ఆదేశాలు అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. ఆరు గ్యాంరెటీలు అమలు చేస్తాం! ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని, మరో 15 రోజుల్లో ఇంకో రెండు అమలు చేస్తామన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ , పెద్దపల్లికి బైపాస్ రోడ్డు, బస్ డిపో, జిల్లా కోర్టు, 50 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మంజూరు చేయిస్తామన్నారు. కాగా, సుల్తానాబాద్ ర్యాలీలో పలువురు దొంగలు చేతివాటం ప్రదర్శిస్తూ నాయకులు, ప్రజాప్రతినిధుల పర్సులు చోరీచేశారు. ప్రజలు శాంతి కోరుకున్నారు.. కమాన్‌పూర్ మండలం గొల్లపల్లె వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రికి ఘనస్వాగతం పలికారు. కమాన్‌పూర్ ఎక్స్ రోడ్డు మంత్రి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో మంథని నియోజకవర్గంలో రౌడీయిజం రాజ్యామేలిందన్నారు. ప్రజలు శాంతియుత వాతావరణం కోరుకుని కాంగ్రెస్‌కు ఓట్లేసి గెలిపించారని అన్నారు. నాయకులు వైనాల రాజు, ఇనగంటి భాస్కర్‌రావు, కోలేటి మారుతి, తొట్ల తిరుపతియాదవ్, ఆకుల ఓదెలు, కట్కం రవీందర్, తొగరి అన్నపూర్ణ పాల్గొన్నారు. ఇవి చదవండి: అడవిబిడ్డకు అపూర్వ స్వాగతం.. మల్లంపల్లిలో మాట్లాడుతున్న సీతక్క! -
గండం గట్టెక్కేనా..? మున్సిపల్ పాలకవర్గాలు సతమతం!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: 'ఉమ్మడి జిల్లాలోని పలు మున్సిపల్ పాలకవర్గాలపై అవిశ్వాసం కత్తి వేలాడుతోంది. పాలకవర్గాల్లో నెలకొన్న విభేదాలు, రాజకీయ కారణాలతో పదవీ కాలం పూర్తి కావడం సందేహంగానే కనిపిస్తోంది. ఇల్లెందు, వైరా మున్సిపల్ చైర్మన్లపై గతంలోనే పలువురు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మాన నోటీసులు కలెక్టర్లకు అందజేశారు. ఇల్లెందుకు సంబంధించి ఫార్మాట్లో లేదని కలెక్టర్ తిరస్కరించగా.. మరోసారి నోటీసు ఇచ్చారు. వైరా చైర్మన్‌పై పలువురు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం అందజేయగా.. చట్టంపై స్పష్టత లేకపోవడంతో నిర్ణయం వెలువడలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం మారడంతో పాత మున్సిపల్ చట్టం ఆధారంగా అవిశ్వాస అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. వైరా, ఇల్లెందు మున్సిపల్ చైర్మన్లు కాంగ్రెస్‌లో, ఖమ్మం కార్పొరేషన్, సత్తుపల్లి, మధిర, కొత్తగూడెం మున్సిపల్ పాలకవర్గాలు బీఆర్ఎస్ చేతిలో ఉన్నాయి. ఈ నేపథ్యాన ఎక్కడెక్కడ అవిశ్వాసం పెట్టే అవకాశముంది, తద్వారా పాలకవర్గాలు మారుతాయా అనే చర్చ జరుగుతోంది.' ఇక్కడా సందేహమే.. సత్తుపల్లి మున్సిపాలిటీలో 23 వార్డులకు అన్నీ బీఆర్ఎస్సే గెలిచింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఐదుగురు కాంగ్రెస్‌లో చేరడంతో ప్రస్తుతం బీఆర్ఎస్ బలం 18కి తగ్గింది. ఇక్కడ బీఆర్ఎస్కు చెందిన కూసంపూడి మహేష్ చైర్మన్‌గా, వైస్ చైర్మన్‌గా ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన తోట సుజలారాణి ఉన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు చెందిన కాపు సీతాలక్ష్మి చైర్‌పర్సన్‌గా, వేల్పుల దామోదర్ వైస్‌చైర్మన్‌గా ఉన్నారు. చైర్‌పర్సన్‌పై వ్యతిరేకతతో బీఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లు గతంలో అవిశ్వాస తీర్మానానికి ప్రయత్నించినా, ఇప్పుడెలాంటి కదలికా లేదు. ఇక్కడ 36 వార్డులకు గాను బీఆర్ఎస్కు 25, సీపీఐకి ఎనిమిది మంది, కాంగ్రెస్‌కు ఒకరు, స్వతంత్రులు ఇద్దరు ఉన్నారు. ఎన్నికల ముందు సీపీఐ కౌన్సిలర్లు ఐదుగురు బీఆర్ఎస్లో చేరగా ఆ పార్టీ బలం 30కి పెరిగింది. సీపీఐకి ముగ్గురే మిగిలారు. మధిరలో 22 వార్డులకు బీఆర్ఎస్కు 15 మంది, కాంగ్రెస్‌కు ఇద్దరు, టీడీపీ నుంచి ముగ్గురు, సీపీఎం, స్వతంత్ర అభ్యర్థి ఒక్కొక్కరు గెలిచారు. బీఆర్ఎస్కు చెందిన ఎరగ్రుంట లక్ష్మి, మొండితోక నాగరాణి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. స్వతంత్ర కౌన్సిలర్ గద్దల మాధురి ప్రమాణ స్వీకారానికి ముందే బీఆర్ఎస్లో చేరారు. 20వ వార్డు కౌన్సిలర్ ముత్తవరపు రాణి అనారోగ్యంతో మృతి చెందగా ఆ స్థానం ఖాళీగా ఉంది. దీంతో ప్రస్తుతం బీఆర్ఎస్లో 13 మంది, కాంగ్రెస్‌కు నలుగురు, టీడీపీ ముగ్గురు, సీపీఎంకు ఒకరు ఉన్నారు. చైర్ పర్సన్ మొండితోక లత, వైస్ చైర్పర్సన్ శీలం విద్యాలత బీఆర్ఎస్లో గెలిచి అదే పార్టీలో కొనసాగుతున్నారు. పాలకవర్గాల్లో విభేదాలు! ఏడాది కాలంగా పలు మున్సిపల్ పాలకవర్గాల్లో విభేదాలు పొడచూపాయి. పార్టీ తరఫున ఎన్నికై న చైర్మన్లకు, నాయకత్వానికి పొసగకపోవడం, కౌన్సిలర్లు – చైర్మన్‌కు మధ్య విభేదాల వంటి కారణాలతో అవిశ్వాసానికి అడుగులు పడ్డాయి. మరికొన్ని చోట్ల అవిశ్వాస తీర్మానానికి నిర్ణయించినా సర్దుబాట్లతో ముందుకు సాగలేదు. ఇల్లెందు, వైరాలో మాత్రం అవిశ్వాస తీర్మాన నోటీసులు కలెక్టర్లకు అందాయి. మున్సిపాలిటీ, కార్పొరేషన్ పాలకవర్గాలపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే మూడేళ్ల పదవీ కాలం పూర్తి కావాలని చట్టంలో ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని నాలుగేళ్లకు పెంచి గవర్నర్‌కు పంపించగా ఆమోదం లభించలేదు. దీంతో ఇల్లెందు, వైరా తీర్మానాలపై కలెక్టర్లు నిర్ణయం తీసుకోలేదు. మరోసారి తెరపైకి.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అవిశ్వాస అంశం మరోసారి తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ సర్కారు తెచ్చిన నాలుగేళ్ల చట్టానికి గవర్నర్ ఆమోదం లభించకపోవడంతో, మూడేళ్లు దాటిన పాలకవర్గాలపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే వెసులుబాటు ఉంది. ఉమ్మడి జిల్లాలోని మున్సిపల్ పాలకవర్గాలు 2020 జనవరిలో కొలువుదీరాయి. ప్రస్తుతం మూడేళ్లు దాటడంతో అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశముంది. గతంలో అవిశ్వాసానికి యత్నించిన వైరా, ఇల్లెందు మున్సిపాలిటీల చైర్మన్లు ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరడంతో బలాబలాలు మారాయి. మిగతా మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్కు మెజార్టీ ఉన్నా.. వచ్చే నాలుగు నెలల్లో రాజకీయ సమీకరణలతో తమ బలం పెరుగుతుందన్న అంచనాలో కాంగ్రెస్ ఉంది. తద్వారా అవి శ్వాసం పెట్టి ఆయా మున్సిపాలిటీలను హస్తగతం చేసుకుంటామని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. ఖమ్మంపై రాజకీయ కాక.. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌పై రాజకీయ కాక మొదలైంది. ఈ పాలకవర్గం 2021 మే 7న కొలువుదీరింది. 60 డివిజన్లలో బీఆర్ఎస్, సీపీఐ కలిసి పోటీ చేయగా.. బీఆర్ఎస్ 43, సీపీఐ రెండు స్థానాల్లో గెలుపొందాయి. కాంగ్రెస్ 10, సీపీఎం, స్వతంత్రులు రెండేసి స్థానాలు, బీజేపీ ఒక స్థానం దక్కించుకున్నాయి. దీంతో బీఆర్ఎస్ పగ్గాలు చేపట్టగా, ఆ తర్వాత ముగ్గురు కాంగ్రెస్ కార్పొరేటర్లు బీఆర్ఎస్లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల సమయాన స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు కాంగ్రెస్‌లో చేరగా.. బీఆర్ఎస్కు చెందిన తొమ్మిది మంది సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కాంగ్రెస్ బలం 18కి చేరగా, బీఆర్ఎస్కు 37 మంది ఉన్నారు. వచ్చే ఏడాది మే 7తో కేఎంసీ పాలకవర్గం మూడేళ్లు పూర్తి చేసుకోనుంది. ఇప్పటివరకు బీఆర్ఎస్కే బలం ఉన్నా, వచ్చే నాలుగు నెలల్లో మారే సమీకరణలతో తమ బలం పెరిగి కార్పొరేషన్‌ను ‘హస్త’గతం చేసుకుంటామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అయితే తమ కార్పొరేటర్లెవరూ కాంగ్రెస్ వైపు చూడరని బీఆర్ఎస్ నేతలు ధీమాగా ఉన్నారు. వైరా, ఇల్లెందుల్లో ఇలా.. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కౌన్సిలర్లు వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్‌పై కలెక్టర్‌కు అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. ఇక్కడ బీఆర్ఎస్కు 16 మంది, కాంగ్రెస్‌కు ఇద్దరు, సీపీఎంకు ఒకరు, స్వతంత్ర కౌన్సిలర్ ఒకరు ఉన్నారు. ఎన్నికల అనంతరం కాంగ్రెస్, బీఆర్ఎస్కు పదేసి మంది కౌన్సిలర్లు ఉన్నారు. అయితే మరికొందరు కాంగ్రెస్‌లో చేరే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ఇక ఇల్లెందు మున్సిపాలిటీలో ఏడాది కాలంగా చైర్మన్‌కు వ్యతిరేకంగా కౌన్సిలర్లు కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇక్కడ 24 వార్డులకు గాను చైర్మన్ డి.వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ జానీపాషాతో పాటు 21 మంది బీఆర్ఎస్ నుంచి గెలిచారు. సీపీఐ, న్యూడెమోక్రసీ, బీఆర్ఎస్ రెబల్‌గా ఒక్కొక్కరు గెలుపొందారు. ఇటీవల బీఆర్ఎస్ కౌన్సిలర్లు చైర్మన్‌పై కలెక్టర్‌కు అవిశ్వాసం నోటీసు ఇచ్చినా ఫార్మాట్ ప్రకారం లేదనడంతో వారం క్రితం మళ్లీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, ఆమె భర్త హరిసింగ్ ప్రోద్బలంతో ఈ ప్రక్రియ సాగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఎన్నికల ముందు మున్సిపల్ చైర్మన్ సహా నలుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరడంతో ప్రస్తుతం బీఆర్ఎస్ బలం 17కు తగ్గింది. వైరా, ఇల్లెందులో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వారు గెలవడం, ఆ పార్టీకే చెందిన చైర్మన్లు ఉండడంతో ఆ పార్టీ నేతలు ఎలా చక్రం తిప్పుతారో వేచి చూడాల్సిందే. ఇవి చదవండి: సర్కారు ఖజానాలో పైసల్లేవ్.. క్రమశిక్షణతో ఆదాయం పెంచుతాం! -
నామినేటెడ్‌పై ఆశలు.. జిల్లావ్యాప్తంగా తీవ్రమైన పోటీ!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో మళ్లీ నామినేటెడ్ పదవుల జాతర కొనసాగనుంది. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా పలువురు కాంగ్రెస్ ముఖ్యనేతలు ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్ పదవులపై ఆశలు పెట్టుకున్నాయి. ఇటీవల రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ చైర్మన్ల పదవులను ప్రభుత్వం రద్దు చేయడంతో నామినేటెడ్ పదవులను పొందేందుకు ఆశావహ నేతలు విస్త్రృతంగా ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున టికెట్ దక్కని నేతలు, ఇతరుల కోసం ఎమ్మెల్యే టికెట్‌ను త్యాగం చేసిన ముఖ్యనేతలు ఆశావహుల్లో ముందు వరుసలో ఉన్నారు. రాష్ట్రస్థాయి కార్పొరేషన్పదవులపై ఆశలు.. గత ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నేతలకు కార్పొరేషన్ పదవులు దక్కాయి. వీరిలో స్టేట్ కో ఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా గట్టు తిమ్మప్ప, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా వేద సాయిచంద్ సతీమణి రజని, ముడా చైర్మన్‌గా గంజి వెంకన్న ముదిరాజ్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా మహమ్మద్ ఇంతియాజ్ ఇసాక్, మిషన్ భగీరథ చైర్మన్‌గా ఉప్పల వెంకటేశ్ గుప్తా, గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్‌గా రమావత్ వాల్యానాయక్, టూరిజం డెవలప్మెంట్ చైర్మన్‌గా గోలి శ్రీనివాస్‌రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ కార్పొరేషన్ చైర్మన్‌గా ఆంజనేయగౌడ్ పనిచేశారు. ఇటీవల ప్రభుత్వం వీరి పదవులను రద్దు చేసింది. ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్‌లోని ముఖ్య నేతలంతా ఎమ్మెల్సీ లేదా కార్పొరేషన్ చైర్మన్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఎమ్మెల్సీకి కసిరెడ్డి రాజీనామా.. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి 2021లో ఎమ్మెల్సీగా గెలుపొందిన కసిరెడ్డి నారాయణరెడ్డి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఖాళీ ఏర్పడింది. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేతలు, పార్టీ టికెట్ ఆశించిన ముఖ్యులకు ఆ పార్టీ ఎమ్మెల్సీ పదవులను ఆఫర్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ లేదా ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం నామినేటెడ్ పదవులపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆశావహుల నుంచి తీవ్రమైన పోటీ నెలకొంది. ఇవి చదవండి: ప్రభుత్వాల మార్పుతో 'సెర్ప్' పే స్కేల్ అమలుపై అతలాకుతలం! -
మంత్రి యోగమెవరికో? ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో ‘మంత్రి’ పదవి కోసం సీనియర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మంత్రివర్గ మొదటి విస్తరణలో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికీ ప్రా తినిధ్యం దక్కలేదు. దీంతో అంతా రెండో విడత విస్తరణపైనే ఆశలు పెట్టుకున్నారు. మరికొద్ది రోజుల్లోనే రెండో విడత కేబినెట్ విస్తరణ జరగనుంది. ఈ క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాల నుంచి నలుగురు ఎమ్మెల్యేలను ప్రభుత్వ విప్‌లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విప్ పదవుల్లోనూ ఉమ్మడి జిల్లా నుంచి ఎవరూ లేరు. దీంతో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, ఖానాపూర్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో కేబినెట్‌తోపాటు ఇతర కీలక పదవుల్లో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలిచిన వెడ్మ బొజ్జుతోపాటు మరో ముగ్గురు సీనియర్ నాయకులు పోటీలో ఉన్నారు. వీరందరిలో ప్రధానంగా ముగ్గురు సీనియర్ల మధ్యే పోటీ తీవ్రంగా ఉంది. ‘గడ్డం’ సోదరుల పోటీ.. ‘గడ్డం’ సోదరులు ఇద్దరూ మంత్రి పదవిపై నమ్మకం పెట్టుకున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి గెలిచిన గడ్డం వినోద్, చెన్నూరు నుంచి గెలిచిన వివేక్ ఒకరితో ఒకరు పదవి కోసం పోటీ పడుతున్నారు. ఒక దశలో వివేక్‌కు మొదటి కేబినెట్ విస్తరణలోనే బెర్త్ ఖాయమని ఆయన అనుచరులు చెప్పుకొన్నారు. కానీ.. మంత్రివర్గంలో ఆయన పేరు లేదు. అదే సమయంలో తనకే మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ వినోద్ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ఢిల్లీకి వెళ్లి కలిసి వచ్చారు. దీంతో ఇద్దరు అన్నదమ్ములు అమాత్య పదవి కోసం పోటీ పడడం కనిపిస్తోంది. ఈ ఇద్దరన్నదమ్ముల్లో ఎవరిని పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటుందోనని కేడర్‌లో చర్చ జరుగుతోంది. ‘పీఎస్సార్’కు ఖర్గే హామీ! ఉమ్మడి జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు(పీఎస్సార్) మంత్రి పదవి రేసులో ప్రముఖంగా ఉన్నారు. గత ఏప్రిల్‌లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర సందర్భంగా మంచిర్యాలలో ఏర్పాటు చేసిన ‘సత్యాగ్రహ’ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పీఎస్సార్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే, కీలక హోదాలో ఉంటారని హామీ ఇచ్చారు. అయితే తొలివిడతలో ఆయనకు అవకాశం రాలేదు. మరోవైపు మంత్రి పదవులు వరించిన వారి సామాజిక వర్గాలు చూస్తే, వెలమ కోటలో ఉమ్మడి మహబూబ్‌నగర్ నుంచి జూపల్లి కృష్ణారావుకు చోటు దక్కింది. ఇక ఎస్సీ కోటాలో భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, దామోదర రాజనర్సింహా ఉన్నారు. ఈ క్రమంలో మిగిలిన ఆరు మంత్రి పదవుల్లో భర్తీ చేయాల్సి వస్తే, సామాజిక సమీకరణాలు కీలకంగా మారాయి. పోటీలో ఉన్న వారి సామాజిక కోటా పరిగణనలోకి తీసుకుంటే, ఎవరి అవకాశాలను దెబ్బతీస్తుందోననే ఉత్కంఠ నెలకొంది. కేబినెట్ స్థాయి పదవులతో సమానంగా ఉండే డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్‌తో పదవి దక్కని వారు నిరాశ పడకుండా సర్దుబాటు చేస్తారనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి తదుపరి టీంలో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికి చోటు ఉంటుందో, ఎవరికి నిరాశ కలుగుతుందోనని అధికార పార్టీ వర్గాల్లోనూ, ఇటు ఉమ్మడి జిల్లా ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. ఎవరికి వారు ఇటు రాష్ట్ర పెద్దలతోపాటు అటు ఢిల్లీలోని పార్టీ పెద్దలను కలుస్తూ మంత్రి పదవి కోసం తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇవి చదవండి: సర్వజన రంజక పాలన.. గవర్నర్ తమిళిసై ప్రసంగం -
'ఎస్ఆర్ఆర్ నుంచే నా రాజకీయ జీవితం' : పొన్నం ప్రభాకర్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలోనే ఉమ్మడి కరీంనగర్‌ను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల అని, రాజకీయ ఉద్ధండులు వైఎస్ రాజశేఖరరెడ్డి, జువ్వాడి చొక్కారావు, ఎమ్మెస్సార్, జి.వెంకటస్వామి, జైపాల్‌రెడ్డి నుంచి అక్షరాలు నేర్చుకున్నానని చెప్పా రు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి బుధవారం పొన్నం ప్రభాకర్ కరీంనగర్ వచ్చారు. నగరంలోని ఇందిరాచౌక్‌లో ఏర్పాటు చేసిన వి జయభేరి సభలో ఆయన మాట్లాడుతూ సహచర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ మంత్రి టి.జీ వన్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సహకారంతో ఉమ్మడి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళుతామన్నారు. గత ప్రభుత్వం మాటలకే పరిమితమైందని, తమది చేతల ప్రభుత్వమన్నారు. ప్రభుత్వం మారిందని, అధికారులు కూడా వ్యవస్థను మార్చుకోవాలని సూచించారు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనని, తాను కరీంనగర్ బిడ్డనన్నారు. ఎస్ఆర్ఆర్ కళాశాల అధ్యక్షుడిగా తన రాజకీయ జీవితం ప్రారంభమైందని, ఎన్ఎస్యూఐ జిల్లా, రాష్ట్ర అ ధ్యక్షుడిగా, మార్క్‌ఫెడ్ చైర్మన్‌గా పనిచేశానన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో కరీంనగర్ ఎంపీ అయ్యానన్నారు. తన రాజకీయ గురువు జువ్వాడి చొక్కారావు 1973లో రవాణా శా ఖ మంత్రి అయితే, చొక్కారావు శిష్యుడినైన తాను 2023లో రవాణాశాఖ మంత్రి అయ్యానన్నారు. తా ను 1987లో రాజకీయ జీవితం ప్రారంభించానని, ఈ 36 ఏళ్లలో ఎక్కడా అవినీతికి తావులేదని, ఎలాంటి ఆరోపణలు లేవన్నారు. కొంతమంది చేతగాక పార్టీలు మారినోళ్లు తనను విమర్శిస్తే, భగవంతుడు ఒక్క అవకాశం ఇస్తాడని చెప్పానంటూ గుర్తు చేసుకున్నారు. తాను పార్టీ మారలేదని కాంగ్రెస్ అంటే పొన్నం, పొన్నం అంటేనే కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. తనకు ప్రజల ఆశీర్వాదమే టానిక్ అ ని, కేసీఆర్ వాడే టానిక్ కాదంటూ చమత్కరించా రు. ఎంపీగా తాను పార్లమెంట్లో తెలంగాణ కో సం కొట్లాడి, మా ఎంపీ పొన్నం అని ప్రజలు గర్వంగా చెప్పుకునేలా చేశానన్నారు. మానకొండూరు ఎ మ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ కోసం ఉద్యమించి ప్రజల ఆశలు నెరవేర్చిన నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. తన పార్లమెంట్ పరిధిలో నాలుగు స్థానాలు గెలిపించుకున్నానని తెలిపారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి స త్యం మాట్లాడుతూ నియంతృత్వ ప్రభుత్వం కూలి పోయి, ప్రజాప్రభుత్వం వచ్చిందన్నారు. విద్యార్థి నాయకుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పొన్నం ప్రభాకర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం శుభసూచకమన్నారు. కార్యక్రమంలో కరీంనగర్, హుజూరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జీలు పురుమల్ల శ్రీనివాస్, వొడితెల ప్రణవ్, నాయకులు వైద్యుల అంజన్‌కుమార్, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మెనేని రోహిత్‌రావు, మంజులారెడ్డి, కటకం వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. దారిపొడవునా నీరాజనం! మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొన్నం ప్రభాకర్‌కు కాంగ్రెస్, అనుబంధ విభాగాలు, పొన్నం అభిమానులు, కుల, బీసీ సంఘాలు ఘనస్వాగతం పలికా యి. ఎమ్మెల్యేలు క వ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంతో కలిసి ఓపెన్‌టాప్ వాహనంలో నగరానికి చేరుకున్న పొన్నం ప్రభాకర్‌కు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన స్వాగత వేదికల వద్ద పూలవర్షంతో నీరాజనం పట్టారు. ఎన్టీఆర్ విగ్రహం నుంచి కోతిరాంపూర్, కమాన్‌చౌరస్తా, సిక్వాడీ, శ్రీపాదచౌక్ మీదుగా ఇందిరాచౌక్ వరకు అడుగడుగునా స్వాగతం పలికారు. కోలాటాలు, నృత్యాలు, డప్పు వాయిద్యాలతో మ హిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. గొల్లకురుమలు గొంగడితో సత్కరించారు. సిక్లు కరవాలం బహుకరించారు. ఆర్టీసీ కార్మికులు గజ మాలతో సన్మానించారు. ఇందిరాచౌక్ వద్ద విజయభేరి సభ ముగిసిన తరువాత పొన్నం ప్రభాకర్ ర్యాలీగా డీసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ నాయకులతో సమావేశమయ్యారు. నాయకులు కట్ల సతీశ్, కొడూరి రవీందర్‌గౌడ్, మునిగంటి అనిల్, దన్ను సింగ్, ఖమర్, సిరాజొద్దిన్, మొహమ్మద్ అమీర్, బోనాల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇవి చదవండి: రెగ్యులర్ కమిటీ లేనట్టేనా? ఇంతకీ చైర్మన్ ఎవరు? -
'డిసెంబర్ 31'లోగా అని మాటిచ్చారు.. మరవకండి!
సాక్షి, ఆదిలాబాద్: ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.. అధికారలోకి వచ్చిన నెలరోజుల్లోనే అంటే డిసెంబర్ 31లోగా బోథ్‌ను రెవెన్యూ డివిజన్ చేస్తాం. ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తాం. కార్యాలయాలను తిరిగి బోథ్‌లోనే ఏర్పాటు చేస్తాం’ బోథ్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి అన్నమాటలివి. బోథ్‌లో ఎన్నికల ప్రచారం బోథ్ డివిజన్ ఏర్పాటు హామీలపైనే జరిగింది. ప్రముఖ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తాము అధికారంలోకి వస్తే బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చాయి. ప్రతి గ్రామంలో నాయకులు తిరుగుతూ ప్రచారంలో భాగంగా తాము అధికారంలోకి వస్తే బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని పార్టీలు రెవెన్యూ డివిజన్ హమీ ఇవ్వడంతో రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా బోథ్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటవుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పైనే భారం.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వచ్చింది. రేవంత్‌రెడ్డి సీఎం కాబోతుండటంతో బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌గా చేస్తారని ఇక్కడి ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు. అధికారంలోకి వస్తే డిసెంబర్ 31లోగా బోథ్‌ను డివిజన్‌గా ఏర్పాటు చేస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డిపై బోథ్‌ను డివిజన్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం.. బోథ్‌ను డిసెంబర్ 31లోగా డివిజన్‌గా చేయాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. బోథ్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు డివిజన్ ఏర్పాటుపై చొరవ చూపాలని కోరుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బోథ్‌లో బీఆర్ఎస్.. తాము అధికారంలోకి వస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ అధినేతలు రేవంత్‌రెడ్డి, కేసీఆర్‌లు బోథ్‌ను డివిజన్ చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాగా బోథ్‌లో మాత్రం బీఆర్ఎస్ నుంచి అనిల్ జాదవ్ గెలుపొందారు. అయితే ఇరు పార్టీలు డివిజన్ చేస్తామని ప్రకటించాయని, కాబట్టి ఇరు పార్టీలు బోథ్‌ను డివిజన్ చేయడానికి చొరవ చూపాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. మాట ఇచ్చారు.. నెరవేర్చండి! తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బోథ్‌ను డివిజన్ చేస్తామని హామీ ఇచ్చాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ిపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం డిసెంబర్ 31లోగా బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి. డివిజన్ ఏర్పాటుకు నాయకులు చొరవ చూపాలి. – అల్లం సాయికృష్ణ డివిజన్ చేయాల్సిందే.. బోథ్ అన్ని రంగాల్లో నిరాదారణకు గురైంది. బోథ్‌ను డివిజన్‌గా చేస్తే అభివృద్ధి చెందే ఆస్కారం ఉంటుంది. బోథ్ డివిజన్ కావడానికి అన్ని అర్హతలున్నాయి. అన్ని పార్టీలు డివిజన్ చేస్తామని హామీలు ఇచ్చాయి. ఇచ్చిన హామీల ప్రకారం.. బోథ్‌ను డివిజన్ చేసి అభివృద్ధి చేయాలి. ఇందుకు నాయకులు చొరవ చూపాలి. – గట్ల బలరామకృష్ణ, బోథ్ కేసీఆర్, రేవంత్‌రెడ్డి ఇద్దరూ డివిజన్ హామీ ఇచ్చారు.. పీసీసీ అధ్యక్షుడిగా చెప్తున్నా గెలిచిన వెంటనే డిసెంబర్ 31లోగా రెవెన్యూ డివిజన్ చేస్తామని రేవంత్‌రెడ్డి బోథ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం సభలో పేర్కొన్నారు. మరుసటి రోజునే ఇచ్చోడ మండల కేంద్రంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇరు పార్టీలు రెవెన్యూ డివిజన్‌పై హామీ ఇవ్వడం, బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావ్ సైతం తాను గెలిస్తే బోథ్ రెవెన్యూ డివిజన్ చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని ప్రధాన పార్టీలు డివిజన్‌పై హామీ ఇవ్వడంతో ఇప్పుటు డివిజన్ ఏర్పాటు చేయడం అనివార్యంగా మారింది. -
పదేళ్లలో మేడ్చల్‌పై పట్టుసాధించిన మర్రి, మల్లారెడ్డి
మేడ్చల్: తమ వ్యాపారాలతో మేడ్చల్ జిల్లాకు ప్రవేశించిన మామా అల్లుళ్లు పదేళ్ల క్రితం రాజకీయరంగ ప్రవేశం చేసి ప్రతికూల పరిస్థితుల్లో ఎమ్మెల్యేలుగా గెలిచి మేడ్చల్‌పై పట్టు సాధించారు. మేడ్చల్ మండలం మైసమ్మగూడ, కండ్లకోయ, శివార్లలోని బోయిన్పల్లి, సూరారంలో మల్లారెడ్డి విద్యాసంస్థలు, మెడికల్ కళాశాలలు, ఆస్పత్రులు, ఫంక్షన్‌హాళ్లు, వివిధ రకాల వ్యాపారాలు చేసి పదేళ్ల క్రితం వరకు వ్యాపారవేత్తగా పేరుగాంచారు. ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి మేడ్చల్ పక్కనే ఉన్న దుండిగల్ మండలంలో ఇంజినీరింగ్ కళాశాలలు, మెడికల్ కళాశాల, వివిధ విద్యాసంస్థలు ఏర్పాటు చేసి మామ చాటు వ్యాపారవేత్తగా ఎదిగారు. 2014లో మల్లారెడ్డి అనూహ్యంగా టీడీపీలో చేరి మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిచారు. కేవలం వ్యాపారవేత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మల్లారెడ్డి పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ బీఆర్ఎస్లో చేరారు. 2018లో మేడ్చల్ బీఆర్ఎస్ టికెట్ సాధించి అసెంబ్లీకి ఎన్నికై తన బలంతో మంత్రి అయ్యారు. అదే సమయంలో తన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డికి మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇప్పించి బీఆర్ఎస్ తరఫున పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో అల్లుడు ఓడిపోయినా జిల్లాలో మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సహకరించకపోయినా అల్లుడిని తన వెంట బెట్టుకుని మేడ్చల్ కేంద్రంగా రాజకీయం నడిపాడు. తాను మంత్రిగా ఉంటూ అల్లుడికి లోకల్ రాజకీయాలు అప్పగించి రాజకీయం నుంచి దూరం కాకుండా మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి పదవి ఇప్పించి ఫుల్ టైం రాజకీయ నాయకుడిని చేశారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. రాజకీయంలో అందివచి్చన ప్రతి అవకాశాన్ని మల్లారెడ్డి, ఆయన కుటుంబం ఎప్పటికప్పుడు సద్వినియోగం చేసుకుంటూ రాజకీయ జీవితంలో సక్సెస్ అయ్యారు. అల్లుడు పార్లమెంట్ ఇన్చార్జిగా, పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జిగా ఉంటూ రాజకీయం తన కుటుంబం దాటకుండా చూసుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఖరారైనా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి వ్యవహారంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఆచితూచి అడుగులేసిన మల్లారెడ్డి చాకచక్యంగా తన అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి మల్కాజిగిరి బీఆర్ఎస్ టికెట్ సాధించాడు. ఒకవైపు మేడ్చల్‌లో తాను పోటీచేస్తూ మరోవైపు మల్కాజిగిరిలో అల్లుడిని పోటీలోకి దింపి ఇద్దరు ఎమ్మెల్యేలు కావడంతో ఐదు నియోజకవర్గాల్లో రెండింటిలో మామా అల్లుళ్లు గెలిచి జిల్లాపై పూర్తి పట్టుసాధించారు. ఇద్దరు వ్యాపారులు కావడం, ఆర్థిక వనరులకు ఇబ్బంది లేకపోవడం, మంచి పేరు ఉండటం, ఇద్దరికీ కేసీఆర్, కేటీఆర్ దగ్గర నుంచి కార్యకర్త వరకు పూర్తిగా పలుకుబడి ఉండటం, ప్రధానంగా నాయకుల బలం, విద్యార్థుల బలం, మానవవనరులు పుష్కలంగా ఉండటంతో అన్నీ సద్వినియోగం చేసుకుని మేడ్చల్ జిల్లాలో మామా అల్లుళ్లు వ్యాపారం నుంచి మొదలై రాజకీయాన్ని శాసించే స్థాయికి ఎదిగి ఏ రంగంలోనైనా తమకు ఎదురులేదని నిరూపించుకున్నారు. జిల్లాలో ఉద్దండ రాజకీయ నాయకులు, ఏళ్లుగా రాజకీయం చేస్తున్నా మామా అల్లుళ్లు మాత్రం వారిని మట్టి కరిపించి తమకు తిరుగులేదని అసెంబ్లీ ఎన్నికల్లో నిరూపించుకున్నారు. తన మార్కు ఉండేలా 2018 వరకు మామచాటు అల్లుడిగా ఉన్న రాజశేఖర్‌రెడ్డి ఆ తర్వాత జిల్లాలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ మార్కు ఉండేలా తమకు మద్దతు ఇచ్చిన వారికి మేయర్లు, చైర్మన్లు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు పదవులు ఇచ్చుకుని వారిని తమ అనుచరులుగా మార్చుకున్నారు. తన మార్క్ రాజకీయం చేస్తూనే మామకు బంటుగా ఉండిపోయారు. మామ మంత్రిగా ఉన్నా అధికారం పూర్తిగా అల్లుడు తీసుకుని కావాల్సిన పనులన్నీ చేశారు. మొత్తం మీద మేడ్చల్ రాజకీయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా తమదే ఆధిపత్యం అని మామా అల్లుళ్లు మరోసారి నిరూపించుకున్నారు. -
‘అన్న చెయ్యేస్తే మాస్.. అన్న లుక్కేస్తే మాస్.. మమ మాస్..’
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘అన్న చెయ్యేస్తే మాస్.. అన్న లుక్కేస్తే మాస్.. మమ మాస్..’ అన్నట్లుగా ఎన్నికల ఫలితాల్లో పీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీరు కనిపించింది. జిల్లాలో తిరుగులేని మాస్ లీడర్‌గా ఉన్న ఆయన మరోసారి తన చరిష్మా చూపించారు. బీఆర్ఎస్పై తిరుగుబాటుతో.. వైఎస్సార్ సీపీ ద్వారా రాజకీయ జీవితం ప్రారంభించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. అక్కడ సరైన ప్రాధాన్యత లభించక ఈ ఏడాది ఆరంభంలో తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్ఎస్ తరఫున ఒక్కరినీ అసెంబ్లీ గేటు తాకనివ్వనంటూ ఆయన విసిరిన సవాల్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. బీఆర్ఎస్ను వీడిన తర్వాత పొంగులేటి రాజకీయ ప్రస్థానం ఏ దిశగా వెళ్తుందనేది చర్చనీయాంశంగా మారిన నేపథ్యాన బీజేపీలోకి వెళ్లాలని ఒత్తిళ్లు వచ్చాయి. కానీ రాజకీయంగా ఓసారి దెబ్బతిన్న ఆయన తొందరపాటు నిర్ణయాలకు పోకుండా ఆచితూచి అన్ని అంశాలు బేరీజు వేసుకుని కాంగ్రెస్‌లో చేరారు. తగ్గేదే లే... కాంగ్రెస్‌లో చేరే సమయంలో పదింట ఎనిమిది సీట్లు పొంగులేటి వర్గీయులకే ఇస్తారనే ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. కమ్యూనిస్టుల కోసం కొత్తగూడెం సీటు వదులుకోవాల్సి వచ్చింది. పాలేరు, ఇల్లెందు, పినపాక, అశ్వారావుపేట సీట్లు పొంగులేటి వర్గానికి దక్కాయి. గత అనుభవాలు నేర్పిన పాఠంతో ఓర్పుగా ఒక్కో ఇటుక పేర్చుకుంటూ పోయారు. ఓవైపు తన నియోజకవర్గంలో ప్రచారం చేస్తూనే తన అనుయాయుల గెలుపు కోసం అహర్నిశలూ శ్రమించారు. కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఇల్లెందు, పినపాక, అశ్వారావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థుల గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. అంతేకాదు పొంగులేటి ఎంట్రీ ఇచ్చేవరకు కొత్తగూడెంలో సీపీఐ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఆశించిన స్థాయిలో సఖ్యత కనిపించలేదు. ఒక్కసారి శ్రీనివాసరెడ్డి రాకతో పరిస్థితి మారిపోయింది. ఐకమత్యమే మహాబలం అన్నట్టుగా ఇరు పార్టీల కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేశారు. క్రాస్ ఓటింగ్‌కు అవకాశమే లేకుండా జాగ్రత్త పడ్డారు. వెరసి నాలుగు స్థానాల్లో విజయఢంకా మోగించడమే కాదు మెజార్టీలోనూ దుమ్ము రేపారు. -
గ్రేటర్ హైదరాబాద్‌లో మంత్రి పదవి వరించేదెవరిని...
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో మంత్రి పదవి వరించేదెవరిని...ఎవరికి ఆ అవకాశం లభించనుంది అంటే ఇప్పట్లో గ్రేటర్ నుంచి మంత్రి పదవి లేనట్లే అని తెలుస్తోంది. తెలంగాణ అంతటా విజయదుందుభి మోగించినా గ్రేటర్ ఓటర్లు కాంగ్రెస్‌కు మొండిచేయి చూపారు. దీంతో ఇక్కడి నుంచి ఇప్పుడు మంత్రి పదవి ఎవ్వరికీ లభించకపోవచ్చుననే కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. రెండో విడుత కేటాయింపుల్లో భాగంగా ఎమ్మెల్సీ కోటాలో మాత్రమే హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు మంత్రి పదవులను కేటాయించవచ్చు. మరోవైపు ఇప్పటికిప్పుడు ఒకవేళ మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే శివార్లలోని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి ఆ ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. కానీ తెలంగాణలోని వివిధ జిల్లాల్లో సామాజిక వర్గాల వారిగా పదవులను కేటాయించవలసి ఉంటుంది. ఇప్పటికే ఈ దిశగా కాంగ్రెస్ కసరత్తును చేపట్టింది. ఈ క్రమంలో ఒకే సామాజిక వర్గానికి ఎక్కువ పదవులు కట్టబెట్టారనే చెడ్డపేరు రాకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఆ రకంగా మల్‌రెడ్డికి ఈ దఫా అవకాశం లభించకపోవచ్చునని ఆ పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారిని ఎంపిక చేసేందుకు ప్రస్తుతం అవకాశం లేకపోవడంతో ఎమ్మెల్సీలుగా ఎంపికై న తరువాత మాత్రమే నగరం నుంచి మంత్రి పదవి లభించే అవకాశం ఉంది. ఆ ఛాన్స్ వరించేదెవరిని... పదవీకాలం ముగిసిన వారితో పాటు, గవర్నర్ కోటా కింద త్వరలో ఎమ్మెల్సీల ఎంపిక జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు, తాము గెలిచే స్థానాలను త్యాగం చేసి మరో చోట పోటీ చేయడంతో ఓడిన వాళ్లు, ఎంతోకాలంగా కాంగ్రెస్‌కు సేవ చేస్తున్న సీనియర్లకు ఎమ్మెల్సీ పదవులను కేటాయించవలసి ఉంటుంది. ఈ జాబితాలో అంజన్‌కుమార్ యాదవ్, మధుయాష్కీగౌడ్, కేఎల్ఆర్, విజయారెడ్డి, వెన్నెల తదితరులు ఉన్నారు. అంజన్‌కుమార్ యాదవ్ సీనియర్ నాయకుడు. అలాగే ఆ సామాజిక వర్గం దృష్టిలో చూసినా ఎంతో ప్రాధాన్యం ఉన్న నేత కావడంతో ఆయనకు అవకాశం లభించవచ్చునని అంటున్నారు. మరోవైపు పోటీచేసి ఓడిపోవడమే కాకుండా, పార్టీలో క్రియాశీల నాయకుడిగా గుర్తింపు కలిగిన మధుయాష్కీ కూడా కీలకమే. ఇక మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యతను ఇవ్వదలిస్తే ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన విజయారెడ్డిని ఎంపిక చేయవలసి ఉంటుంది. మరి కొందరు సీనియర్లు కూడా ఎమ్మెల్సీ పదవుల కోసం పోటీపడే అవకాశం ఉంది. ఇలా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు హైదరాబాద్ నుంచి ఇప్పటికిప్పుడు మంత్రి పదవి ఎవ్వరికీ లభించకపోవచ్చుననే గట్టిగా వినిపిస్తోంది. ఎమ్మెల్సీల ఎంపికకు మరికొంత సమయం ఉన్న దృష్ట్యా ఆ ఛాన్స్ ఎవరిని వరించనుందో..వేచి చూడవలసిందే. -
దామోదర రాజనర్సింహకు కీలక పదవి..?
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: అందోల్ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించిన దామోదర రాజనర్సింహ ఉపముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. ఆయనకు రెండోసారి ఉపముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈయనకు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హాయాంలోనూ కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత ీసీడబ్ల్యూసీ సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు. కొత్తగా కొలువు దీరనున్న కాంగ్రెస్ సర్కారులో ఆయనకు మంత్రి పదవి ఖయంగా కనిపిస్తోంది. ఈసారి కూడా ఆయనకు కీలక శాఖలు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో విజయం సాధించింది. ఇందులో నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా పట్లోళ్ల సంజీవరెడ్డి, మెదక్ ఎమ్మెల్యేగా మైనంపల్లి రోహిత్ తొలిసారి గెలించారు. దీంతో ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో సీనియర్ నేత కావడం, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత సభ్యుడు కావడంతో తప్పనిసరిగా ఆయనకు కీలక శాఖలు దక్కడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దామోదర్ గెలిస్తే ప్రభుత్వంలో కీలక పదవి దక్కుతుందనే నినాదంతో కార్యకర్తలు, నాయకులు ప్రచారం కూడా చేశారు. మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం.. దామోదర రాజనర్సింహకు దాదాపు మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. 1989లో తొలిసారిగా అందోల్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి రాజకీయ ప్రస్థానం 35 ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీతోనే సాగింది. 1989 తర్వాత మరో రెండుసార్లు ఇదే స్థానం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 2004లో రెండోసారి ఇక్కడి నుంచే విజయం సాధించారు. ఈ క్రమంలో వైఎస్సార్ మంత్రివర్గంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో కూడా మూడోసారి విజయం సాధించిన దామోదర వైఎస్ఆర్, కొణిజేటి రోశయ్యల మంత్రివర్గాల్లో స్థానం పొందారు. 2010 డిసెంబరులో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కూడా దామోదరకు చోటు దక్కింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిని ఉప ముఖ్యమంత్రిగా నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో 2011, జూన్ 10న దామోదర రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. ఇటీవలె సీడబ్ల్యూసీలోకి.. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ వంటి అగ్రనేతలు ఉండే కీలకమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో దామోదరకు స్థానం దక్కింది. 2023 ఆగస్టులో ఆయన్ను సీడబ్ల్యూసీకి శాశ్వత ఆహ్వానిత సభ్యుడిగా నియమిస్తూ కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో దామోదరకు ఈసారి డిప్యూటీ సీఎం పదవి తప్పనిసరిగా వరిస్తుందని ఆయన అనుచరవర్గం పేర్కొంటోంది. -
ఆయా చోట్ల తమకు ఓట్లు తగ్గడానికి అసలు కారణమేంటి?
సాక్షి, ఆదిలాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఆదిలాబాద్ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్కు షాకిస్తూ బీజేపీ విజయం సాధించగా, బోథ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలుపుకుంది. అయితే ఆయా నియోజకవర్గాల్లో ఓటమి పాలైన ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ఫలితాలపై విశ్లేషణలు చేపట్టాయి. పోలింగ్ కేంద్రాల వారీగా పోలైన ఓట్ల జాబితా ముందేసుకుని తాము ఎక్కడ ఫెయిల్ అయ్యామనే దానిపై నాయకులు పోస్టుమార్టం షురూ చేశారు. ఓట్లను రాబట్టుకోవడంలో అంచనాలు ఎక్కడ తప్పాయో దానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. బూత్‌ల వారీగా ఓట్లపై అంతర్మథనం! ఆదిలాబాద్‌లో ఓటమి పాలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బోథ్ నియోజకవర్గంలో పరాజయం చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు, నాయకులు ఎన్నికల ఫలితాలపై పోస్టుమార్టం చేస్తున్నాయి. పోలింగ్ కేంద్రాల వారీగా వచ్చిన ఓట్లను పరిశీలిస్తున్నారు. ఫలానా గ్రామంలో తమకు మెజార్టీ వస్తుందని భావించిన నాయకులకు ఓటర్లు షాకిస్తూ ఇతర పార్టీలకు అండగా నిలువడంపై ఆలోచనలో పడ్డారు. ఆయా చోట్ల తమకు ఓట్లు ఎందుకు తగ్గాయి, ప్రత్యర్థి పార్టీకి ఏ విధంగా పెరిగాయనే దానిపై సమాచారం సేకరిస్తున్నారు. అయితే ఆయా పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు క్షేత్రస్థాయిలో సక్రమంగా పనిచేయకపోవడం, పోల్మేనేజ్మెంట్లో వైఫల్యంతోనే తాము గెలుపునకు దూరమవ్వాల్సి వస్తోందని నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఆయా పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులన్న చోట కూడా పార్టీ ఓట్లపరంగా వెనుకబడి పోవడటానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలోని ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మండలాల్లోనూ ఇదే ప్రక్రియ కొనసాగుతుండడం చూస్తుంటే ఓటరు నాడీని అందుకోవడంలో ఆయా పార్టీలు అంతగా సఫలీకృతం కానట్లుగా స్పష్టమవుతోంది. ఓటరు పల్స్ పట్టడంలో విఫలం.. ఆదిలాబాద్ నియోజకవర్గంలో నాలుగు గ్రామీణ, ఆదిలాబాద్ అర్బన్‌తో కలిపి ఐదు మండలాలున్నాయి. అలాగే బోథ్ నియోజకవర్గంలో తొమ్మిది మండలాలు ఉన్నాయి. ఆయా నియోజకవర్గాలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రధాన పార్టీల అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఓటర్లు సైతం ఆయా పార్టీలన్నింటికీ జై కొట్టారు. బీజేపీ తరఫున ఆదిలాబాద్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి అమిత్‌షా, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రచారానికి రాగా, కాంగ్రెస్ తరఫున పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆదిలాబాద్, బోథ్‌లో జరిగిన బహిరంగ సభలకు హాజరయ్యారు. బీఆర్ఎస్ తరఫున మంత్రి హరీశ్‌రావు ఆదిలాబాద్‌లో జరిగిన బహిరంగ సభకు హాజరుకాగా, సీఎం కేసీఆర్ ఆదిలాబాద్, ఇచ్చోడలో జరిగిన బహిరంగ సభలకు హాజరయ్యారు. ఈ సభలన్నింటికీ జనం ఆయా పార్టీల నాయకులు ఆశించినదానికంటే ఎక్కువగానే వచ్చారు. ర్యాలీలకు సైతం పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో అభ్యర్థులు గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేశారు. అయితే ఆ స్థాయిలో ఓట్లను రాబట్టుకోలేకపోయామనే అభిప్రాయాన్ని నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఇవి చదవండి: 6 గ్యారెంటీల అమలుపై అనుమానాలు...? -
ఉమ్మడి జిల్లాకు రెండు మంత్రి పదవులు!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కొత్తగా ఏర్పడబోయే రాష్ట్ర మంత్రివర్గంలో జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు రెండు మంత్రి పదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు ప్రతిపక్షంలో ఉన్నా ఉమ్మడి జిల్లాలో తమదైన ముద్రవేసిన కీలక నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు సామాజిక సమీకరణల ఆధారంగా జిల్లాకు మరో పదవి కూడా దక్కే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ములుగులో ఆదివాసి గిరిజనురాలైన అయిన సీతక్కకు క్యాబినెట్లో అవకాశం కల్పిస్తే, లంబాడా సామాజిక వర్గం నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌కు కూడా చాన్స్ వచ్చే అవకాశం ఉందన్న చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా సీనియర్లే నాగార్జునసాగర్‌లో, అంతకుముందు 2009లో రద్దయిన చలకుర్తి నియోజకవర్గం నుంచి మొత్తంగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీనియర్ నేత కుందూరు జానారెడ్డి ఈసారి పోటీ చేయలేదు. ఆయన గతంలో హోంశాఖ మంత్రిగానే కాకుండా 12 శాఖలకు మంత్రిగా పనిచేశారు. అయితే ప్రస్తుతం ఆయన పోటీ నుంచి తప్పుకొని తన కుమారుడు కుందూరు జయవీర్‌రెడ్డి అవకాశం ఇచ్చారు. సూర్యాపేట నుంచి ప్రస్తుతం పోటీ చేసి ఓడిపోయిన రాంరెడ్డి దామోదర్‌రెడ్డి గతంలో తుంగతుర్తి నుంచి నాలుగుసార్లు, సూర్యాపేట నుంచి ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరోవైపు హుజూర్‌నగర్‌లో మూడుసార్లు, కోదాడలో రెండుసార్లు మొత్తంగా ఇప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడు హూజూర్నగర్నుంచి ఆరోసారి గెలుపొందారు. ఇక నల్లగొండ నియోజకవర్గం నుంచి ఇప్పటికే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇప్పుడు ఐదోసారి నల్లగొండ నుంచే గొలుపొందారు. వీరంతా ఇన్నాళ్లు జిల్లాలో పార్టీ పట్టు కోల్పోకుండా కాడాడటంలో కీలకంగా వ్యవహరించారు. ఇలా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు నలుగురైదుగురు ఉండగా, అందులో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా గెలుపొందిన నలమాద ఉత్తమ్‌మార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఐటీ శాఖ మంత్రిగా సేవలందించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం ఉమ్మడి జిల్లా నుంచి ఈ ఇద్దరికి మంత్రి పదవులు దక్కుతాయన్న నమ్మకంతో పార్టీ శ్రేణులు ఉన్నాయి. రెండోసారి గెలుపొందిన ముగ్గురు ఈ ఎన్నికల్లో మునుగోడు నుంచి గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గతంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతిరెడ్డి, దేవరకొండ నుంచి బాలూనాయక్ కూడా రెండోసారి విజయం సాధించారు. మిగిలిన ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్‌లో జూనియర్లే. ఉమ్మడి జిల్లాలో పార్టీ నడిపిన నేతలు ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చింది. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజక వర్గాలకుగాను 11 స్థానాల్లో కాంగ్రెస్ విజయభేరి మోగించింది. అయితే, గత పదేళ్లుగా జిల్లాలో పార్టీ ఉనికికి ప్రమాదం రాకుండా సీనియర్ నేతలు కీలకంగా వ్యవహరించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కూడా కోల్పోయినా, 2019 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు పార్లమెంట్ స్థానాలను దక్కించుకొని పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. సీనియర్ నేతలు కుందూరు జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డితో పాటు భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ శ్రేణుల్లో ఎప్పటికప్పుడు ధైర్యం నింపుతూ అండగా నిలిచారు. -
కోమటిరెడ్డి బ్రదర్స్ ఏకకాలంలో అసెంబ్లీకి..
సాక్షి, యాదాద్రి: కోమటిరెడ్డి సోదరులు ఎమ్మెల్యేలుగా ఒకేసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. 1999 నుంచి నల్లగొండ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, 2018 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి 2009లో భువనగిరి ఎంపీగా విజయం సాఽధించిన సమయంలో వెంకట్‌రెడ్డి నల్లగొండ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, 2014 ఎన్నికల్లో భువనగిరి ఎంపీ స్థానానికి పోటీచేసి రాజగోపాల్‌రెడ్డి ఓడిపోయారు. ఆ వెంటనే వచ్చిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఆ సమయంలో వెంకట్‌రెడ్డి ఎమ్మెల్యేగా, రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో వెంకట్‌రెడ్డి నల్లగొండ అసెంబ్లీ నుంచి ఓడిపోగా.. రాజగోపాల్‌రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019లో వెంకట్‌రెడ్డి భువనగిరి ఎంపీగా గెలుపొందారు. 2022లో రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరి మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా ఉపఎన్నిలో ఓడిపోయారు. ఈ ఎన్నికలకు ముందు రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి మునుగోడు నుంచి గెలుపొందగా, వెంకట్‌రెడ్డి నల్లగొండ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇద్దరు సోదరులు ఏకకాలంలో అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా ఉత్తమ్ హుజూర్నగర్: ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్నగర్ ఎమ్మెల్యేగా విజయఢంకా మోగించిన నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. గతంలో కోదాడ ఎమ్మెల్యేగా రెండు సార్లు, హుజూర్నగర్ ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచిన ఆయన ప్రస్తుతం 6వ సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా మూడు సార్లు, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వరుసగా మూడు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్నగర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ఎమ్మెల్యేగా ఉండగానే నల్లగొండ ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతూనే మళ్లీ హుజూర్నగర్ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. -
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో.. ఐదు చోట్ల 50 వేలకుపైగా మెజారిటీ..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధిక మెజారిటీ సాధించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 నియోజకవర్గాలకు గాను 11 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. వారిలో ఐదుగురు 50 వేలకు పైగా మెజారిటీ సాధించారు. మరో నలుగురు 40 వేలకు పైగా మెజారిటీ సాధించారు. ఇద్దరు 20 వేలకు పైగానే మెజారిటీ సాధించారు. సూర్యాపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డికి ఉమ్మడి జిల్లాలోనే అత్యల్పంగా 4,606 ఓట్ల మెజారిటీ లభించింది. ఉమ్మడి జిల్లాలో సరికొత్త రికార్డు! నకిరేకల్‌నుంచి గెలుపొందిన వేముల వీరేశం 68,839 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యపై విజయం సాధించారు. 1952 నుంచి జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు ఎవరూ ఇంత మెజారిటీ సాధించలేదు. తొలిసారిగా వేముల వీరేశం 68,839 ఓట్ల మెజారిటీ సాధించి రికార్డు నెలకొల్పారు. 50 వేలకుపైగా మెజారిటీ.. కోదాడలో నలమాద పద్మావతిరెడ్డి 58,172 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్‌పై గెలుపొందారు. నాగార్జునసాగర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌పై కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జయవీర్‌రెడ్డి 55,849 ఓట్ల మెజారిటీ సాధించారు. నల్లగొండలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 54,332 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డిపై విజయం సాధించారు. తుంగతుర్తిలో బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్‌కుమార్‌పై కాంగ్రెస్ అభ్యర్థి మందుల సామేల్ 51,094 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇక ఆలేరులో బీర్ల ఐలయ్య 49,636, మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి 48,782, హుజూర్‌నగర్‌లో నలమాద ఉత్తమ్ కుమార్‌రెడ్డి 44,888, మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి 40,590, దేవరకొండలో నేనావత్ బాలునాయక్ 30,021, భువనగిరిలో కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి 26,201 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇవి చదవండి: 24 ఏళ్లుగా కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కల.. నెరవేర్చిన తనయుడు! -
24 ఏళ్లుగా కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కల.. నెరవేర్చిన తనయుడు!
సాక్షి, మహబూబ్‌నగర్: అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఐదుసార్లు ఓటమి చవిచూసిన కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కలను ఆయన కొడుకు కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి నెరవేర్చారు. పోటీ చేసిన మొదటిసారే గెలుపొందడం మరో విశేషం. కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి 1999లో మొదటిసారి స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేకు పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. 2004లో అప్పటి టీఆర్ఎస్ తరపున పోటీ చేసినా 1,449 స్వల్ప ఓట్లతో ఓటమిపాలయ్యారు. తర్వాత 2009, 2012 ఎన్నికల్లో సైతం నాగం జనార్దన్‌రెడ్డి చేతిలో, తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి.. టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే 2005లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జెడ్పీ చైర్మన్‌గా, 2016, 2022లో ఎమ్మెల్సీ పదవులు దక్కినా ఎమ్మెల్యే పదవి మాత్రం అందని ద్రాక్షగా మారింది. అయితే తన కోరికను తన కొడుకు నెరవేర్చడంతో కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఇవి చదవండి: 20 ఏళ్లలో ఏనాడూ చూడని 'హస్తం' హవా..! మళ్లీ ఇప్పుడు -
20 ఏళ్లలో ఏనాడూ చూడని 'హస్తం' హవా..! మళ్లీ ఇప్పుడు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా అసెంబ్లీ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఊపిరిపోశాయి. 20 ఏళ్లలో ఏనాడూ చూడని స్పష్టమైన సీట్లు రావడం గమనార్హం. 2004లో వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో టీఆర్ఎస్–సీపీఐ పొత్తులతో కాంగ్రెస్ కూటమి 10 సీట్లు(కాంగ్రెస్ 5, టీఆర్ఎస్ 4, సీపీఐ 1) సాధించింది. ఇప్పుడు 8 స్థానాల్లో విజయకేతనం ఎగరేసి కాంగ్రెస్–సీపీఐ కూటమి సత్తాచాటుకుంది. పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాలను గెలుచుకుని క్లీన్‌స్వీప్ చేసింది. పొరుగునే ఉన్న ధర్మపురి, వేములవాడ, చొప్పదండి, మానకొండూరు, హుస్నాబాద్‌నూ కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. 2018 ఎన్నికల్లో 12 స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో సిరిసిల్ల, జగిత్యాల, కోరుట్ల, కరీంనగర్, హుజూరాబాద్‌తో కలిపి ఐదో స్థానాలకు పరిమితమైంది. ఇక హుజూరాబాద్, కరీంనగర్, కోరుట్లలో బీజేపీ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. బండి.. గంగుల నువ్వా–నేనా.. కరీంనగర్లో విజయం చివరి వరకూ దోబూచులాడింది. చివరి రౌండ్ వరకు సాగిన ఉత్కంఠ పోరులో తొలుత స్వల్ప ఓట్లతో గంగుల కమలాకర్ విజయం సాధించారు. దీనిపై బండి సంజయ్ అభ్యంతరం తెలుపుతూ కౌంటింగ్ కేంద్రానికొచ్చా రు. పోలింగ్ బూత్ 43,289లో ఓట్ల లెక్కింపు చేపట్టలేదని ఆరోపించారు. సంజయ్ వినతిని పరిగణనలోకి తీసుకుని రేకుర్తిలోని లయోల బీఈడీ కాలేజీ రూమ్‌నంబర్ 3లోని 594 ఓట్లు, రాంపూర్‌లోని విద్యార్థి హైస్కూల్లోని పోలింగ్ బూత్‌లలోని 697 ఓట్లను లెక్కించారు. చివరికి 3,169 ఓట్ల మెజార్టీతో గంగుల విజయం సాధించడంతో ఉత్కంఠకు తెరపడింది. ► మానకొండూరు నుంచి కవ్వంపల్లి సత్యనారా యణ విజయం సాధించారు. బీఆర్ఎస్ ఎమ్మె ల్యే రసమయిపై ఏ దశలోనూ వెనకబడలేదు. ► చొప్పదండి– మేడిపల్లి సత్యం కూడా ప్రతీ రౌండ్లోనూ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌పై ఆధిపత్యం చూపించారు. ► హుజూరాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి తమ ప్రత్యర్థులపై ఆది నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల కాంగ్రెస్ అభ్యర్థి ఒడితల ప్రణవ్‌పై స్పష్టమైన ఆధిపత్యంతో గెలిచారు. ► పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మంథని– శ్రీధర్‌బాబు, రామగుండం– మక్కాన్ సింగ్, పెద్దపల్లి– విజయరమణారావు నియోజకవర్గాల్లో విజయం సాధించడంతో క్లీన్‌స్వీప్ చేసింది. మక్కాన్‌సింగ్ మూడోసారి పోటీ చేయడం, రామగుండంలో కాంగ్రెస్‌కు వచ్చిన అనూహ్య ఆదరణ, స్థానికంగా సానుభూతి పనిచేశాయి. ► సిరిసిల్లలో కేటీఆర్(బీఆర్ఎస్) సునాయస విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తన చిరకాల ప్రత్యర్థి కేకే మహేందర్‌రెడ్డిని ఐదోసారి ఓడించారు. 2009 నుంచి వీరిద్దరూ పోటీ పడటం ఐదోసారి కావడం విశేషం. కాంగ్రెస్ హవా, సానుభూతి పనిచేయలేదు. ► వేములవాడలో ఊహించినట్లుగానే ఆది శ్రీనివాస్(కాంగ్రెస్) విజయం సాధించారు. ఆయన అసెంబ్లీకి పోటీ పడటం వరుసగా ఐదోసారి. గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రమేశ్‌బాబు పౌరసత్వం విషయంలో న్యాయపరంగా పోరాడినా ఫలించలేదు. ఎట్టకేలకు ప్రజల దీవెనతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. వేములవాడ ఆలయ చైర్మన్‌గా పనిచేసిన వారు ఎమ్మెల్యేగా గెలవరంటూ దశాబ్దాలుగా సాగుతున్న సంప్రదాయానికి తెరదించారు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చెలిమెడ లక్ష్మీనరసింహారావు, బీజేపీ అభ్యర్థి వికాస్రావులపై స్పష్టమైన మెజారిటీ సాధించారు. ► జగిత్యాలలో తొలుత జీవన్‌రెడ్డి పది రౌండ్ల వరకు ఆధిపత్యం కనిపించినా.. తర్వాత పుంజుకున్న సంజయ్ విజయం సాధించారు. కోరుట్లలో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ కె.సంజయ్ అనూహ్యంగా గెలిచారు. సమీప ప్రత్యర్థి ఎంపీ ధర్మపురి అరవింద్‌ను ఢీకొట్టగలరా? అన్న ప్రచారం జరిగింది. ఎగ్జిట్‌పోల్స్ కూడా అరవింద్‌కే మొగ్గుచూపాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుకు ఉన్న పేరు, అనుభవం సంజయ్ గెలుపులో కీలకపాత్ర పోషించాయి. ధర్మపురిలో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తన చిరకాల ప్రత్యర్థి మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై విజయం సాధించారు. 2009 నుంచి వీరిద్దరూ తలపడటం ఇది ఐదోసారి కావడం గమనార్హం. కాంగ్రెస్ హవా, లక్ష్మణ్‌పై సానుభూతి, అధికార పార్టీపై వ్యతిరేకత కలిసివచ్చాయి. విశేషాలు.. ► కరీంనగర్ నుంచి ఎంపీ బండి సంజయ్, కోరుట్ల నుంచి ఎంపీ అరవింద్ బీఆర్ఎస్ అభ్యర్థుల చేతిలో పరాజయం పాలయ్యారు. వీరిద్దరూ బీజేపీ అగ్రనేతలుగా వెలుగొంది, పార్టీ ఆదేశాలతో అసెంబ్లీ బరిలో దిగారు. ► హుజూరాబాద్ నుంచి పోటీచేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ విజయం సాధించగా, జగిత్యాల నుంచి పోటీ చేసిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఓడిపోయారు. ► రాష్ట్రంలో వరుసగా ఏడుసార్లు గెలిచి సరికొత్త రికార్డు సృష్టించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎనిమిదోసారి పోటీలో ఓడారు. ఈసారి గెలిస్తే అత్యధికసార్లు శాసనసభకు ఎన్నికై న ఎమ్మెల్యేగా మరో కొత్త రికార్డు సృష్టించేవారు. ఆయన పోటీచేసిన హుజూరాబాద్, గజ్వేల్‌లో రెండుచోట్ల ఓటమి పాలయ్యారు. ► ఇప్పటి వరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఐదుసార్లు గెలిచిన మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరో దఫా పోటీలో తొలిసారి ఓడిపోయారు. ఈయన గెలిచి ఉంటే ఈటల రాజేందర్ ఏడుసార్లు ఎమ్మెల్యే రికార్డు సమం అయ్యేది. ఉమ్మడి జిల్లాలో ఫలితాలు ఇలా.. 8 కాంగ్రెస్.. 5 బీఆర్ఎస్ కైవసం! కరీంనగర్: గంగుల కమలాకర్ (బీఆర్ఎస్), ఓట్లు: 92,174, మెజారిటీ 3,169, రెండోస్థానం: బండి సంజయ్ కుమార్ (బీజేపీ), ఓట్లు: 89,005, మూడో స్థానం: పురమల్ల శ్రీనివాస్ (కాంగ్రెస్) ఓట్లు: 40,052 పెద్దపల్లి: విజయరమణరావు (కాంగ్రెస్), ఓట్లు: 1,18, 888, మెజారిటీ: 55,108, రెండో స్థానం: దాసరి మనోహర్‌రెడ్డి(బీఆర్ఎస్) ఓట్లు: 63,780, మూడో స్థానం:దాసరి ఉష(బీఎస్పీ), ఓట్లు 10,315 రామగుండం: రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ (కాంగ్రెస్) , ఓట్లు: 92,227 , మెజారిటీ: 56,794, రెండో స్థానం: కోరుకంటి చందర్(బీఆర్ఎస్), ఓట్లు: 35,433, మూడో స్థానం: కందుల సంధ్యారాణి(బీజేపీ), ఓట్లు: 12,966 మంథని: దుద్దిళ్ల శ్రీధర్ బాబు (కాంగ్రెస్), ఓట్లు: 1,03,822 మెజారిటీ: 31,380, రెండో స్థానం: పుట్ట మధు (బీఆర్ఎస్), ఓట్లు: 72,442, మూడో స్థానం: సునీల్ రెడ్డి (బీజేపీ), ఓట్లు: 5,779 మానకొండూరు: సత్యనారాయణ (కాంగ్రెస్ ) పొందిన ఓట్లు: 96,773 మెజారిటీ : 32,365, రెండో స్థానం: రసమయి బాలకిషన్ (బీఆర్ఎస్), ఓట్లు: 64,408, మూడో స్థానం : ఆరెపల్లి మోహన్ (బీజేపీ) ఓట్లు: 14,879 చొప్పదండి: మేడిపల్లి సత్యం, పార్టీ: కాంగ్రెస్ ఓట్లు : 90,395, మెజారిటీ: 37,439, రెండో స్థానం: సుంకే రవిశంకర్ పార్టీ: (బీఆర్ఎస్) ఓట్లు : 52,956, మూడో స్థానం : బొడిగె శోభ గాలన్న, (బీజేపీ) ఓట్లు : 26,669 హుజూరాబాద్: పాడి కౌశిక్ రెడ్డి (బీఆర్ఎస్) ఓట్లు : 80,333 , మెజార్టీ: 16,873, రెండోస్థానం: ఈటల రాజేందర్ (బీజేపీ), ఓట్లు : 63,460, మూడో స్థానం : ఒడితల ప్రణవ్ (కాంగ్రెస్) ఓట్లు :53,164 హుస్నాబాద్: పొన్నం ప్రభాకర్ (కాంగ్రెస్), ఓట్లు: 1,00,955 , మెజార్టీ:19,344, రెండో స్థానం: ఒడితల సతీశ్ కుమార్, ఓట్లు: 81,611, మూడో స్థానం: బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఓట్లు: 8338 సిరిసిల్ల: తారక రామారావు, (బీఆర్ఎస్), ఓట్లు: 89,244, మెజారిటీ: 29,687, రెండో స్థానం: కేకే మహేందర్ రెడ్డి (కాంగ్రెస్), ఓట్లు: 59,557, మూడో స్థానం: రాణిరుద్రమారెడ్డి(బీజేపీ) 18, 328 వేములవాడ: ఆది శ్రీనివాస్ (కాంగ్రెస్) ఓట్లు: 71451.మెజారిటీ: 14,581, రెండో స్థానం: చెలిమెడ లక్ష్మీనర్సింహారావు (బీఆర్ఎస్). ఓట్లు: 56,870, మూడో స్థానం: చెన్నమనేని వికాస్‌రావు (బీజేపీ), ఓట్లు: 29,710. జగిత్యాల: సంజయ్‌కుమార్ (బీఆర్ఎస్), ఓట్లు: 70,243, మెజారిటీ: 15822, రెండోస్థానం : టి.జీవన్‌రెడ్డి (కాంగ్రెస్), ఓట్లు : 54,421, మూడోస్థానం : బోగ శ్రావణి (బీజేపీ), ఓట్లు : 42,138 కోరుట్ల: సంజయ్ (బీఆర్ఎస్), ఓట్లు : 72,115, మెజారిటీ: 10,305, రెండోస్థానం: ధర్మపురి అర్వింద్ (బీజేపీ), ఓట్లు : 61,810, మూడో స్థానం : జువ్వాడి నర్సింగారావు (కాంగ్రెస్), ఓట్లు : 39,647 ధర్మపురి: అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ (కాంగ్రెస్), ఓట్లు: 91,393, మెజారిటీ: 22,039, రెండోస్థానం: కొప్పుల ఈశ్వర్ (బీఆర్ఎస్), ఓట్లు: 69,354, మూడో స్థానం : ఎస్.కుమార్ (బీజేపీ), ఓట్లు: 7,345 ఇవి చదవండి: కాంగ్రెస్ గెలుపుకి యువతే 'కీ'లకం..! -
కాంగ్రెస్ గెలుపుకి యువతే 'కీ'లకం..!
సాక్షి, వరంగల్: కాంగ్రెస్ గెలుపులో యువత కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. కొత్త ఓటర్లు, నిరుద్యోగ యువకులు దాదాపు హస్తానికి అండగా నిలిచినట్లు అవగతమవుతోంది. వరంగల్ జిల్లాలోని నర్సంపేట, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాల ఓటర్లలో సగం మంది వరకు యువకులు ఉండడం విశేషం. మూడు నియోజకవర్గాల్లో మొత్తం 7,33,454 ఓటర్లుండగా.. వారిలో 18 ఏళ్ల నుంచి 39 ఏళ్ల ఓటర్లు 3,56,964 మంది ఉండడం గమనార్హం. నర్సంపేట నియోజకవర్గంలో మొత్తం 2,26,617 ఓటర్లుండగా.. వారిలో 1,11,446 మంది యువ ఓటర్లు, వరంగల్ తూర్పులో 2,46,282 ఓటర్లుండగా వారిలో 1,17,870 మంది యువ ఓటర్లు, వర్ధన్నపేట నియోజకవర్గంలో 2,60,55 ఓటర్లుండగా వారిలో 1,27,648 యువ ఓటర్లు ఉన్నారు. ఆ మూడు స్థానాల్లో కాంగ్రెస్‌కు చెందిన దొంతి మాధవరెడ్డి, కొండా సురేఖ, కేఆర్.నాగరాజు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. వెంటాడిన నిరుద్యోగ సమస్య.. అధికార బీఆర్ఎస్ పార్టీని నిరుద్యోగ సమస్య వెంటాడినట్లు తెలుస్తోంది. పోటీ పరీక్షల నోటిఫికేషన్లు ప్రకటించడం, పేపర్ లీకులు, తర్వాత రద్దు చేయడం వంటి ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఓటర్లు, నిరుద్యోగ యువకులు ఈ సారి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది. ఏదేమైనా కాంగ్రెస్ అభ్యర్థుల విజయంలో యువత ఓట్లు కీలకంగా మారాయనే భావన వ్యక్తమవుతోంది. ఇవి చదవండి: పోస్టల్ బ్యాలెట్‌లోనూ వీడని 'నోటా' ఓట్లు! -
తూర్పున కాంగ్రెస్, పశ్చిమాన కమలం, మధ్యలో బీఆర్ఎస్..
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఓటర్లు విభిన్న తీర్పుతో ఈ ఎన్నికల్లో తమ వైవిధ్యాన్ని చాటారు. తూర్పున కాంగ్రెస్ హవా కొనసాగగా, పశ్చిమ జిల్లాలో కమలం వికసించింది. మధ్యలో కారు ప్రయాణం సాగింది. మొత్తంగా ఈ ఎన్నికల్లో పది అసెంబ్లీ స్థానాల్లో ఏ పార్టీ వైపు ఎక్కువ మొగ్గు చూపకుండా ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలకు సమన్యాయం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ ఎన్నికల చరిత్రలో బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. 2019 ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీగా సోయం బాపురావు గెలిచారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా నాలుగు స్థానాల్లో బీజేపీ పాగా వేయడం గమనార్హం. కలిసొచ్చిన ముక్కోణ పోటీ.. నిర్మల్, ఆదిలాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ముక్కోణ పోటీ నెలకొంది. నిర్మల్‌లో ఏలేటి మహేశ్వర్‌రెడ్డి(బీజేపీ), అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి(బీఆర్ఎస్), కూ చాడి శ్రీహరిరావు(కాంగ్రెస్) మధ్య పోటీ నెలకొంది. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులకు సమంగా ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీలిపోయాయి. చివరికి బీజేపీ బయటపడింది. సిర్పూర్లో బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ బరిలో ఉండడంతో ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీతోపాటు బీఎస్పీ ఓట్లు పంచుకున్నాయి. ముథోల్‌లో బీఆర్ఎస్కు మై నార్టీ ఓట్లు కలిసి రాగా, ఇక్కడ కాంగ్రెస్ ఆశించిన ఓట్లు రాబట్టలేకపోవడంతో మిగతా వర్గం ఓట్లు బీజేపీ వైపు మళ్లాయి. ఆదిలాబాద్‌లోనూ బీజేపీ, బీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 6వేల మెజార్టీతో బయటపడ్డారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచింది. మొదట బోథ్ స్థానంలోనూ బీజేపీ గట్టిపోటీ ఇచ్చింది. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నిలిచింది. ఎంపీ సోయం బాపురావు బరిలో ఉండడంతో ఆ పార్టీ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. చివరకు బీఆర్ఎస్ 22వేల మెజార్టీ సాధించింది. ఎస్టీ స్థానాల్లో బీఆర్ఎస్.. పది స్థానాల్లో ఎనిమిది చోట్ల చతికిల పడ్డ బీఆర్ఎస్ మూడు ఎస్టీ స్థానాల్లో బోథ్, ఆసిఫాబాద్ బీఆర్ఎస్ గెలిచి పరువు నిలబెట్టుకుంది. గత ఎన్నికల్లో ఆసిఫాబాద్‌లో స్వల్ప తేడాతో ఓడిపోయిన కోవ లక్ష్మీ, సిట్టింగ్ ఎమ్మెల్యే బాపురావు కాదని అనిల్ జాదవ్‌కు అవకాశం ఇస్తే, గెలిచారు. ఈ మూడు స్థానాల్లో ఖానాపూర్ మాత్రం కాంగ్రెస్ గెలుచుకుంది. గత ఎన్నికల్లో తొమ్మిది స్థానాలు అప్పటి టీఆర్ఎస్కు రాగా ఆసిఫాబాద్ ఎస్టీ స్థానం మాత్రమే కాంగ్రెస్‌కు వచ్చింది. ఇక్కడ ఈసారి బీఆర్ఎస్ గెలుచుకుంది. అసెంబ్లీకి కొత్త ముఖాలు.. రెండో ప్రయత్నంలో రామారావు పాటిల్ గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. సిర్పూర్ నుంచి పాల్వాయి హరీశ్‌బాబు, ఆదిలా బాద్ నుంచి పాయల్ శంకర్, బోథ్ నుంచి అనిల్ జాదవ్, ఖానాపూర్ నుంచి వెడ్మ బొజ్జు, మంచిర్యాల నుంచి ప్రేమ్‌సాగర్‌రావు, మాజీ ఎంపీ వివేక్ తొలిసారిగా శాసనభకు ఎన్నికయ్యారు. మాజీ మంత్రి వినోద్, కోవ లక్ష్మీ, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచారు. సిట్టింగ్‌ల ఓటమి! సిట్టింగ్ ఎమ్మెల్యేలైనా పది మంది ఓటమి పాలయ్యారు. నిర్మల్‌లో సీనియర్ నాయకులు, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, నాలుగు సార్లు గెలిచిన మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు, ఆదిలాబాద్‌లో మాజీ మంత్రి జోగు రామన్న, ముథోల్‌లో విఠల్‌రెడ్డి, సిర్పూర్లో కోనేరు కోనప్ప, బెల్లంపల్లి చిన్నయ్య, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ ఘోర ఓటమి చవి చూశారు. ఈ ఎన్నికల్లో ఖానాపూర్, బోథ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు రేఖానాయక్, రాథోడ్ బాపురావు, ఆత్రం సక్కుకు బీఆర్ఎస్ నుంచి టికెట్లు రాకపోవడంతో పోటీకి దూరంగా ఉన్నారు. -
పోస్టల్ బ్యాలెట్‌లోనూ వీడని 'నోటా' ఓట్లు!
సాక్షి, ఆదిలాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, సర్వీస్ ఉద్యోగులకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్‌లోనూ నోటాకు ఓట్లు పోలయ్యాయి. ఆదివారం వెల్లడించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విద్యావంతులు సైతం ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులను కాదని నోటాకు ఓటేశారు. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 3073 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఇందులోనూ ఎమ్మెల్యేగా విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ స్పష్టమైన అధిక్యతను కనబర్చారు. ఆయనకు 1140 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్నకు 595 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస రెడ్డికి 961 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ అభ్యర్థి రెండో స్థానంలో నిలువడం గమనార్హం. కాగా నోటాకు 10మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. బోథ్ నియోజకవర్గంలో మొత్తం 1700 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవ్వగా బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావుకు అత్యధికంగా 718 ఓట్లు వచ్చాయి. ఎమ్మెల్యేగా గెలుపొందిన బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్‌కు 495 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి అడే గజేందర్‌కు 371 ఓట్లు పోలయ్యాయి. తొమ్మిది మంది నోటాకు ఓటేయడం గమనార్హం. ఇవి కూడా చదవండి: స్వతంత్రుల కన్నా ఎక్కువగా 'నోటా'కు ఓట్లు! -
స్వతంత్రుల కన్నా ఎక్కువగా 'నోటా'కు ఓట్లు!
సాక్షి, ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లాలో నోటాకు ఓటేసిన వారి సంఖ్య ఈ ఎన్నికల్లో కాస్త తగ్గింది. చట్టసభలకు ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో ఓటు హక్కు కీలకమైనది. ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం వంటింది. కానీ.. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో అభ్యర్థులందరూ అందరికీ ఆమోదయోగ్యులై ఉండాలని ఏమీ లేదు. గతంలో నచ్చని అభ్యర్థులు బరిలో ఉన్న చోట్ల ఓటర్లు ఎవరికో ఒకరికి ఓటు వేయడం, మరికొందరు ఓటింగ్‌కు దూరంగా ఉండడం జరిగేది. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈవీఎం బ్యాలెట్లలో నోటా(నన్ ఆఫ్ ద ఎబోవ్) బటన్ తీసుకొచ్చారు. ఇది కేవలం ఓటరుకు ఐచ్ఛికం మాత్రమే. అభ్యర్థులు ఎవరూ సరైన వారు లేరని భావించిన పక్షంలో నోటాకు ఓటు వేయవచ్చు. అత్యధికంగా నోటాను వినియోగించుకున్నా పోలైన ఓట్లలో మెజార్టీ ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. 2014అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో 17,095 మంది ఓటర్లు నోటా బటన్ నొక్కారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 20,254 ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో 17,327 మంది నోటాకు ఓటేశారు. బోథ్ నియోజకవర్గంలో అత్యధికంగా నోటాకు వేశారు. ఇలా ఈవీఎంల్లోకి.. 2013లో పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఆధారంగా నోటాను ప్రవేశపెట్టారు. దీన్ని భావ వ్యక్తీకరణలో అంతర్భాగంగానే పరిగణించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. తొలిసారిగా ఢిల్లీ, మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 2013 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో నోటా ఐచ్ఛికాన్ని ప్రవేశపెట్టారు. అన్ని గుర్తులకంటే చివరలో నోటా గుర్తు ఉంటుంది. ఈ గుర్తును అహ్మదాబాద్‌కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సంస్థ రూపొందించింది. బోథ్: బోథ్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులు, చిన్న పార్టీల అభ్యర్థులు సాధించిన ఓట్ల కన్నా నోటాకు ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. నోటాకు 2565 మంది నోటాను వినియోగించుకున్నారు. బీఎస్పీ అభ్యర్థి జంగుబాపుకు 2044 ఓట్లు, బీసీపీ పార్టీ అభ్యర్థి ఆడె సునీల్ నాయక్‌కు 677, ఆర్జేపీ అభ్యర్థి హీరాజీకి 1388, డీఎస్పీ అభ్యర్థి ఉమేష్‌కు 1011, జీజీపీ అభ్యర్థి బాదు నైతంకు 596, స్వతంత్ర అభ్యర్థులు భోజ్యా నాయక్‌కు 878, ధనలక్ష్మికి 1231 ఓట్లు పోల్ అయ్యాయి. ఇవి చదవండి: తూర్పున కాంగ్రెస్, పశ్చిమాన కమలం, మధ్యలో బీఆర్ఎస్.. -
ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డిదే?
రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో తలపండిన నాయకులే కాంగ్రెస్, బీఆర్ఎస్ల నుంచి ఇక్కడ మరోసారి బరిలో ఉండటంతో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కాంగ్రెస్ టికెట్ లభించని కారణంగా బీఎస్పీ నుంచి మల్రెడ్డి రంగారెడ్డి తలపడిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో మల్రెడ్డి రంగారెడ్డి కేవలం 356 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్న మల్రెడ్డి.. బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో ఢీఅంటేఢీ అనే రీతిలో బరిలో నిలిచారు. అయితే ఇప్పుడు పోలింగ్ ముగియడంతో ఎన్నికల ఫలితాలపై తీవ్రస్థాయిలో చర్చ కొనసాగుతోంది. ఎక్కడ ఎవరు కలిసినా ఎన్నికల ఫలితాలపై మాట్లాడుకుంటున్నారు. కొంతమంది బీఆర్ఎస్ అంటుంటే మరికొంతమంది కాంగ్రెస్ గెలుస్తుందని అంటుండం చర్చనీయాంశంగా మారింది. బయటకు ధీమాగా ఉన్నా... ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపుపై బయటకు ధీమా వ్యక్తం చేస్తున్నా...లోలోపల ఓటర్లు ఎవరికి ఓటువేశారో తెలియక తలలుపట్టుకుంటున్నారు. ఈసారి తప్పక విజయం తమనే వరిస్తుందనే ధీమాతో మల్రెడ్డి రంగారెడ్డి ఉండగా.. బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తాను నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తనను మరోసారి గెలపిస్తాయని ధీమాగా ఉన్నారు. పోలింగ్ సరళిపై ఇరు పార్టీల అభ్యర్థులు తర్జనభర్జనలు పడుతూ కాకి లెక్కలు వేసుకుంటున్నారు. ఎవరి ఓట్లు చీల్చుతారో.... సీపీఎం, బీజేపీ అభ్యర్థులు ఎవరి ఓట్లు ఎక్కువగా చీల్చుతారో అర్థంకాకుండా ఉంది. నియోజకవర్గంలో సీపీఎం, బీజేపీలు సుమారు 15వేల నుంచి 18వేల వరకు ఓటు బ్యాంకు కలిగిఉన్నాయి. 2018లో బీజేపీ అభ్యర్థికి 17 వేల పైచిలుకు ఓట్లు రాగా.. సీపీఎం అభ్యర్థికి 10వేలకు పైగా ఓట్లు వచ్చాయి. అదేవిధంగా టీడీపీ నుంచి పోటీ చేసిన సామ రంగారెడ్డికి 18వేల పైచిలుకు ఓట్లు పడ్డాయి. ఈసారి ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండటం ఎవరికి కలిసోస్తుందో అంతుచిక్కకుండా ఉంది. వారి ఓట్లు ఏ వైపు, ఏ మేరకు దారి మరిలాయో అర్థంకాని పరిస్థితి. అయితే చాలావరకు బీజేపీ, సీపీఎం పార్టీలకు చెందిన వారు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు సమాచారం. డబ్బుల ప్రభావం ఏ మేరకో.. ఇదిలాఉంటే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మునుపెన్నడూ లేనివిధంగా డబ్బుల ప్రభావం కనిపించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటుకు ఇంత చొప్పున అని పంపిణీ చేసిన విషయం బహిరంగ రహస్యమే. ఈ డబ్బుల ప్రభావం అభ్యర్థుల గెలుపును ప్రభావితం చేస్తుందా లేదా అనే విషయాన్ని ఫలితాలు వస్తేగాని స్పష్టంగా బయటపడదు. ఏదిఏమైనా ఎన్నికల ఫలితాలను ముందుగా ఉహించి చెప్పడం ఇబ్బందిగా మారింది. ఆదివారం జరిగే ఓట్ల లెక్కింపులో అభ్యర్థుల జాతకాలు బట్టబయలు కానున్నాయి. అంతవరకు ఓపిక పట్టాల్సిందే. -
ప్లస్సా.. మైనస్సా..? ఫలితాలపై అభ్యర్థుల బెంగ!
సాక్షి, ఆదిలాబాద్: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ముగిసింది. ఆదివారం ఫలితాలు రానున్నాయి. పోలింగ్ ముగిసిన సాయంత్రం నుంచే ఆయా పార్టీల అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు గెలుపోటములపై బేరీజు వేసుకుంటున్నారు. ఏ పోలింగ్ బూత్‌లో ఎన్ని ఓట్లు వస్తాయి.. మిగతా పార్టీలకు ఎన్ని ఓట్లు పడతాయి.. స్వతంత్రులు ఏమైనా ఓట్లు చీలుస్తారా.. అక్కడ మనకు ప్లస్సా.. మైనస్సా.. ఇలాంటి లెక్కలు వేస్తున్నారు. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గ అభ్యర్థులు ఎన్నికల సంగ్రామం నుంచి కొంత సేద తీరినట్టే తీరి.. మరో పక్క ఇంటికి వచ్చే నాయకులు, కార్యకర్తల నుంచి పోలింగ్ బూత్‌ల వారీగా పరిస్థితిపై విశ్లేషణ చేసుకుంటున్నారు. మండలం, గ్రామం, పట్టణం, వార్డు ఇలా అన్నీ స్థాయిల్లో ఆయా పోలింగ్ బూత్‌ల వారీగా క్షేత్రస్థాయిలో మన పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి.. ఇతర పార్టీలకు ఎన్ని ఓట్లు పడవచ్చు.. మన పరిస్థితి బాగుందా.. లేదా.. ఇలా లెక్కల్లో మునిగితేలారు. మహిళల ఓట్లే అధికంగా పోల్.. పురుషుల ఓట్ల కంటే మహిళల ఓట్లే అధికంగా పోలయ్యాయి. ఈ లెక్కన అభ్యర్థుల గెలుపోటముల్లో మహిళల ఓట్ల శాతం కీలకం కానుంది. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో మహిళా ఓట్లే అధికంగా పోలయ్యాయి. కాగా, జిల్లాలో బోథ్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ నంబర్ 177 బాబ్జీపేట్లో వంద శాతం ఓటింగ్ జరిగింది. జిల్లాలో వందశాతం ఓటింగ్ జరిగిన బూత్ ఇది ఒక్కటే కావడం విశేషం. జిల్లా కేంద్రంలోని దస్నాపూర్ ప్రభుత్వ బీసీ (బాలుర) కళాశాల వసతి గృహంలోని పోలింగ్ కేంద్రంలో అత్యల్ప పోలింగ్ శాతం నమోదైంది. ఇక్కడ 47.86 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. జిల్లాలో ఇదీ పరిస్థితి.. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో 1,85,862 ఓట్లు పోలయ్యాయి. 2018 ఎన్నికల్లో 1,65,793 ఓట్లు పోల్ కాగా బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న 44.56 శాతం ఓట్లు సాధించి గెలుపొందారు. ఈసారి ఈ నియోజకవర్గంలో ఫలితాలు ఎలా ఉండనున్నాయో.. ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారో వేచి చూడాల్సిందే. బోథ్ నియోజకవర్గంలో 1,72,397 ఓట్లు ఈ ఎన్నికల్లో పోలయ్యాయి. 2018 ఎన్నికల్లో 1,54,487 ఓట్లు పోల్ కాగా, అప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి రాథోడ్ బాపురావు 38.19 శాతం ఓట్లు సాధించి గెలుపొందారు. ఈసారి ఈ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాల్సిందే. మొత్తంగా రిజల్ట్స్ డేకు ఒకరోజు మాత్రమే వ్యవధి ఉండగా అందరు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో పోలైన ఓట్లు: -మొత్తం ఓటర్లు: 4,48,374, -పోలైన ఓట్లు: 3,58,259, -శాతం: 79.86% పురుషులు, మహిళల ఓట్ల వివరాలు: ► పురుషుల ఓట్లు: 2,19,291 పోలైన ఓట్లు: 1,77,597 శాతం: 80.96% ► మహిళల ఓట్లు: 2,29,074 పోలైన ఓట్లు: 1,80,661 శాతం: 78.86% ఇవి చదవండి: కేసీఆర్ గజ్వేల్‌లో హ్యాట్రిక్ కొడతారా? -
డబ్బులు కాజేసిన వారిపై నేతల నజర్..
నల్లగొండ టూటౌన్ : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు డబ్బులను మంచినీళ్లలా ఖర్చు పెట్టిన విషయం బహిరంగ రహస్యమే. ప్రత్యర్థులను చిత్తు చేసి ఎలాగైనా గెలవాలనే టార్గెట్ పెట్టుకొని అభ్యర్థులు తమ పార్టీలకు చెందిన వార్డు, గ్రామ ముఖ్య నాయకుల (ఇన్చార్జి) ద్వారా ఓటర్లకు మద్యం, డబ్బులు, మాంసం పంపిణీ చేశారు. కానీ కొందరు చోటా నాయకులు డబ్బులు పంపిణీ చేసే సమయంలో డబ్బులను నొక్కినట్లు ఆయా పార్టీలకు చెందిన సొంత మనుషులే అభ్యర్థుల దృష్టికి తీసుకుపోయినట్లు తెలిసింది. అవకాశంపోతే మళ్లీ దొరకదనే విధంగా కొందరు ఓటర్లకు పూర్తిస్థాయిలో పంపకాలు చేయకుండా జేబులు నింపుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్నిచోట్ల జనాలను ఓటు వేయమని కూడా అడగలేదని ఓటర్లు చెబుతున్నారు. కొన్ని చోట్ల సొంత పార్టీలకు చెందిన కార్యకర్తలకు సైతం డబ్బులు పంచకపోవడంతో.. ఇన్చార్జిల తీరు వివాదాస్పదంగా మారింది. నల్లగొండ పట్టణంలో కొందరు ఓటర్లు వార్డు ఇన్చార్జిలను డబ్బుల విషయంపై నిలదీసిన ఘటనలు సైతం ఉన్నాయి. డబ్బులు కాజేసిన వారిపై నేతల నజర్.. ఓటర్లకు పంచమని ఇచ్చిన డబ్బులు ఎంత మందికి చేరాయనే వివరాలను ఆయా పార్టీల అభ్యర్థులు సేకరిస్తున్నారు. ఒక్కో గ్రామంలో ఎంత మందికి ఇచ్చారు.. ఇవ్వకుండా నొక్కిన డబ్బులు ఎన్ని, తమ దగ్గర డబ్బులు తీసుకొని ప్రత్యర్థి పార్టీకి సహకరించిన వారెందరు అనే వివరాలను రాబడుతున్నారు. అభ్యర్థులు ఇచ్చిన డబ్బులు, వారికి వచ్చే ఓట్ల శాతం తదితర వివరాలను క్రోడీకరించడంతో పాటు స్థానిక నాయకత్వం ద్వారా సమచారం సేకరిస్తున్నారు. డబ్బులు నొక్కి తమకు హ్యాండ్ ఇచ్చిన వారికి రానున్న రోజుల్లో చెక్ పెట్టే ప్రయత్నం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డబ్బులు నొక్కిన వారిపై ఫిర్యాదులు వెల్లువెత్తగా కొన్ని చోట్ల ఇప్పటికే సదరు నాయకులకు అభ్యర్థులు ఫోన్లు చేసి గట్టిగా క్లాస్ పీకినట్లు తెలిసింది. ఒకరిద్దరు అభ్యర్థులు అయితే డబ్బులు పంచని వారిపై తీవ్ర ఆగ్రహావేశాలతో అంతు చూస్తామని హెచ్చిరించినట్లు సామాజిక మాధ్యమాల్లో సైతం బహిర్గతం అయ్యాయి. -
అభ్యర్థులకు తడిసిమోపెడు..!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు తడిసి మోపైడెంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య ఈసారి తీవ్ర పోటీ నెలకొంది. దీంతో అభ్యర్థులు సభలు సమావేశాల నిర్వహణకు అధిక మొత్తంలో డబ్బులు వెచ్చించారు. మరోవైపు ఓటర్లను ఆకట్టుకునేందుకు డబ్బుల పంపిణీపాటు గిఫ్ట్‌లు, చికెన్, మటన్, మందు వంటి వాటిలో ప్రలోభ పెట్టారు. ఇందుకోసం రూ.కోట్లు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కొందరు అభ్యర్థులు ధైర్యంగా ఖర్చు చేయగా, మరికొందరు అప్పులు చేసి మరీ ఖర్చు పెట్టారు. ఇంకొందరైతే ఆ ఖర్చులను తట్టుకోలేక, ఓటర్లకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేక చేతులెత్తాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. నామినేషన్ల రోజు నాటి నుంచే.. నామినేషన్ల పర్వం ప్రారంభమైన నాటి నుంచి ఖర్చుల ప్రక్రియ ప్రారంభమైంది. అప్పటి నుంచి అభ్యర్థులంతా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఏ ఊరికి వెళ్లినా వందలాది మందిని పిలిపించుకున్నారు. ఒక్కోక్కరికి రూ.200 నుంచి రూ.300 చెల్లించారు. గ్రామాల్లో రోజూ ఆయా పార్టీల అభ్యర్థులు కొంత మందిని టీమ్‌గా ఏర్పాటు చేసి ఇల్లిల్లూ తిరుగుతూ తమ పార్టీ అభ్యర్థికే ఓటు వేయాలని స్టిక్కర్లు అంటిస్తూ.. కరపత్రాలు పంచుతూ ప్రచారం చేశారు. బూత్‌ల వారీగా డబ్బుల పంపిణీ.. ప్రచార ఖర్చులకు తోడు బూత్‌లో ప్రచారం చేసే వారి ఖర్చుల నిమిత్తం రోజుకు ఒక పార్టీ బూత్‌కు రూ.5 వేల చొప్పున ఇవ్వగా, మరో పార్టీ రూ.10 వేలకు పైగా చెల్లించింది. వార్డు లీడర్లకు, ముఖ్యమైన వారికి సాయంత్రమైతే మందు పార్టీల ఖర్చు అదనంగా పెట్టుకోవాల్సి వచ్చిందని ఓ నాయకుడు వివరించారు. ఈ ఖర్చులను కొంత మంది అభ్యర్థులు తట్టుకోలేక నాలుగైదు రోజుల పాటు బూత్‌లలో డబ్బుల పంపిణీ నిలిపివేశారు. మందు, విందులు అదనం.. నామినేషన్ల ప్రక్రియ నాటి నుంచే గ్రామాలు, వార్డుల వారీగా కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలతో పాటు ఆయా వృత్తి సంఘాలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. వారికి మందు, విందు ఏర్పాటు చేశారు. కొందరు రూ.500 చొప్పున అక్కడే పంపిణీ చేశారు. పోలింగ్‌కు ముందు డబ్బుల పంపిణీ పోలింగ్‌కు ముందు రోజు నుంచి అభ్యర్థులు భారీగా డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఒక్కో నియోజకవర్గంలో సగటున లక్ష మందికిపైగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు అభ్యర్థులు ఓటుకు రూ.వేయి, రూ.1500 పంపిణీ చేయగా, మరికొందరు రూ.200 నుంచి రూ.800 వరకు ఇచ్చారు. వీటితో పాటు మద్యం ఆఫ్, ఫుల్ బాటిళ్లను కూడా పంపిణీ చేశారు. కొందరు రూ.2 వేల చొప్పున పంపిణీ చేస్తే.. ఇంకొందరు రూ.2,500 పంపిణీ చేసినట్లు తెలిసింది. రెండు మూడు నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థులే డబ్బుల్లేక చేతులెత్తేసినట్లు చర్చ జరుగుతోంది. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయని పార్టీల కోసం ఓటర్లు చివరి వరకు ఎదురుచూసి, డబ్బులు ఇచ్చిన వారికి అనుకూలంగా వ్యవహరించినట్లు తెలిసింది. -
జిల్లాలో 6 నియోజక వర్గాలు.. తొలి ఫలితం మిర్యాలగూడదే!
నల్లగొండ: జిల్లాలో ఆరు నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అంతా సిద్ధమైంది. జిల్లా కేంద్రం సమీపంలోని మిర్యాలగూడ రోడ్డులో దుప్పలిపల్లి గ్రామ శివారులోని గోదాముల్లో జరగనుంది. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలలో ఓట్లను లెక్కించనున్నారు. అయితే ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పోలింగ్ స్టేషన్ల ఆధారంగా.. రౌండ్లు వారీగా కౌంటింగ్ జరగనుంది. మిర్యాలగూడ నియోజకవర్గం లెక్కింపు ప్రకియ 19 రౌండ్లలోనే పూర్తికానుండడంతో.. అక్కడి ఫలితమే మొదట వెలువడనుంది. లెక్కింపు ఇలా.. 3వ తేదీన ఉదయం 7 గంటలకు పోటీ చేసే అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్‌రూమ్‌లను తెరుస్తారు. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. అవి పూర్తయిన తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు కోసం ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. పోస్టల్ ఓట్లు లెక్కింపు కోసం 4 టేబుళ్లను, సర్వీస్ ఓట్ల లెక్కింపునకు మరో టేబుళ్ల ఏర్పాటు చేశారు. రౌండ్ పూర్తయిన తర్వాత జనరల్ అబ్జర్వర్ అన్నీ పరిశీలించిన తర్వాతనే ఆ రౌండ్ ఫలితాలను వెల్లడించనున్నారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ర్యాండమైజ్‌గా ప్రతి నియోజకర్గంలో రెండు పోలింగ్ బూత్‌లలో వచ్చిన ఓట్లకు సంబంధించి ఈవీఎంల ఓట్లను. వీవీ ప్యాట్ల ఓట్లను సరి చూస్తారు. రెండు సమానంగా వస్తేనే.. తుది ఫలితాన్ని వెల్లడిస్తారు. దేవరకొండ ఫలితం 23 రౌండ్లలో.. జిల్లాలోని ఆరు నియోజక వర్గాల్లో దేవరకొండ నియోజక వర్గం మినహా మిగతా నియోజక వర్గాల్లో 22 రౌండ్లలోపే కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. మునుగోడు, నకిరేకల్, నాగార్జునసాగర్ నియోజక వర్గాల్లో 22 రౌండ్లు, మిర్యాలగూడ 19, నల్లగొండ 21 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది. దేవరకొండ నియోజకవర్గంలో 23వ రౌండ్లో కౌంటింగ్ పూర్తవుతుంది. ఈవీఎంల ఓట్ల లెక్కింపునకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థులు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ఒక రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యేందుకు 20 నుంచి 40 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. అభ్యర్థులు తక్కువగా ఉన్న చోట 20 నిమిషాల్లోపే ప్రక్రియ పూర్తి కానుంది. మునుగోడులో అభ్యర్థులు అధికంగా ఉండటంతో లెక్కింపు ఆలస్యం కానుంది. భద్రతను పరిశీలించే అవకాశం.. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. మొదట స్టేట్ పోలీస్, రెండో విడతలో స్టేట్ ఆర్ముడు పోలీస్, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సీఏపీఎఫ్ బలగాలు భద్రత నిర్వహిస్తున్నాయి. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఏజెంట్లు, అభ్యర్థులు వాటిని పరిశీలించుకునేందుకు అవకాశం ఉంది. స్ట్రాంగ్ రూమ్‌ల బయట ఏర్పాటు చేసిన సెంటర్లోకి వెళ్లి అక్కడ సీసీ కెమెరాల ద్వారా భద్రతను చూసుకోవచ్చు. పకడ్బందీగా ఓట్ల లెక్కింపు.. కలెక్టర్ ఆర్వి.కర్ణన్ నల్లగొండ : అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపును పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వి.కర్ణన్ తెలిపారు. శుక్రవారం ఆయన తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఆదివారం ఉదయం 8 గంటలకు నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, మునుగోడు, నకిరేకల్, నాగార్జునసాగర్ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపును చేపట్టనున్నట్లు తెలిపారు. ఒక్కో నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు ఒక్కో హాల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్ అనుమతి ఉన్నవారికే స్ట్రాంగ్ రూమ్స్‌లోకి అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇది చదవండి: పెరగని పోలింగ్.. ఈసారి 41,631 మంది ఓటుకు దూరం -
ఓటు వేయడానికి.. 12 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపించవచ్చు
నల్లగొండ, త్రిపురారం: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గురువారం ఓటేసేందుకు ఓటరు గుర్తింపు కార్డు(ఎపిక్ కార్డు) తప్పనిసరని లేదా ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 కార్డుల్లో ఏదేని ఒక గుర్తింపు కార్డు ఉండాలని నల్లగొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కర్ణన్ తెలిపారు. 1. ఆధార్ కార్డు 2. ఉపాధి హామీ జాబ్ కార్డు 3. బ్యాంకు/తపాలా కార్యాలయం జారీ చేసిన ఫొటో పాస్‌బుక్ 4. కేంద్ర కార్మికశాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు 5. డ్రైవింగ్ లైసెన్స్ 6.పాన్ కార్డు 7. రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ ఇండియా(ఆర్జీఐ) జారీ చేసిన స్మార్ట్ కార్డు 8. భారతీయ పాస్‌పోర్ట్ 9. ఫొటో గల పెన్షన్ పత్రాలు 10. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డు 11.ఎంపీలు/ ఎమ్మెల్యేలు/ ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు 12. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్ డిజెబిలిటీ గుర్తింపు కార్డుల్లో ఏదేని ఒకటి ఉండాలని పేర్కొన్నారు. ఇది చదవండి: ఓటేద్దాం రండి! -
'అధ్యక్షా..!' అనేదెవరో?
సాక్షి, వరంగల్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఓ ప్రత్యేకత కలిగి ఉంది. ఇక్కడి నుంచి మూడు ప్రధాన పార్టీల అధ్యక్షులు పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి ఆయా పార్టీల ప్రెసిండెట్లు తలపడుతుండగా పోటీ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ఈ ముగ్గురిలో ఎవరు గెలుపొంది అసెంబ్లీలో అధ్యక్షా.. అంటారో అనే విషయంలో ఆయా పార్టీల నేతలతోపాటు ఓటర్లలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ నాలుగు పర్యాయాలు వరంగల్ పశ్చిమ నుంచి విజయం సాధించి, ఐదో విజయం కోసం ధీమాగా ముందుకు సాగుతున్నారు. ఇక.. కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి తొలిసారి పార్టీ అభ్యర్థిత్వం దక్కించుకుని అసెంబ్లీలో అడుగిడడానికి ఉవ్విళ్లూరుతున్నారు. అదే విధంగా బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి తొలిసారి పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు విజయం కోసం ఎవరికి వారు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఐదో విజయం కోసం దాస్యం వినయ్ భాస్కర్.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ ఐదో విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. 2009 సాధారణ ఎన్నికల్లో, 2010 ఉప ఎన్నికల్లో, 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏకైక ఎమ్మెల్యేగా ఉద్యమకారులకు అండగా నిలవడం, ఉద్యమకారుడిగా ప్రజల్లో గుర్తింపు ఉండడం, నిత్యం వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల ముంగిటికి వెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం వినయ్ భాస్కర్‌కు కలిసొచ్చే అంశాలు. ప్రధానంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ బబ్దిదారులతో పాటు నియోజకర్గంలో వైద్య చికిత్స కోసం పెద్ద మొత్తంలో సీఎంఆర్ఎఫ్ నుంచి సాయం అందించారు. కార్మికులకు సొంతగా ప్రీమియం చెల్లించి వారికి గుర్తింపు కార్డులు ఇప్పించి బీమా సౌకర్యం కల్పించారు. దీంతోపాటు ఈ నెల 28న నిర్వహించిన సభకు సీఎం కేసీఆర్ రావడంతో తాను గెలుస్తాననే ధీమాలో ఉన్నారు. మొదటిసారి శాసనసభకు నాయిని రాజేందర్ రెడ్డి పోటీ.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న నాయిని రాజేందర్ రెడ్డి మొదటిసారి శాసన సభ ఎన్నికల బరిలో నిలిచారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి డోలాయమానంలో పడిన సమయంలో కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచారు. ఉమ్మడి వరంగల్, జిల్లాల పునర్విభజన తర్వాత హనుమకొండ, వరంగల్ జిల్లాలో పార్టీని కాపాడి ఈసారి టికెట్ సాధించారు. 2014, 2018లో పార్టీ టికెట్ ఆశించారు. ఆ రెండు సార్లు రాకపోయినా పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. ఈసారి అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించడంతో బరిలో దిగారు. నిత్యం ప్రజల మధ్య ఉండడంతో పాటు, బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ, నాలుగు పర్యాయాలుగా వినయ్ భాస్కర్ ఎమ్మెల్యేగా ఉండి ఆయనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి, వ్యతిరేకత నాయిని రాజేందర్ రెడ్డికి అనుకూలించే అంశాలు. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్, జార్ఖండ్ సీఎం బూపేష్ భఘేల్, సినీ నటి విజయ శాంతి చేసిన ప్రచారం తనకు విజయం చేకూరుస్తుందనే విశ్వాసంతో ఉన్నారు. 'పద్మ' విశసించేనా..!? వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన రావు పద్మ, పశ్చిమ నుంచి తొలిసారి పోటీ చేస్తున్నారు. కాగా, రావు పద్మ 2014 ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నుంచి టికెట్ అశించి చివరకు వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసి ఓటమి పొందారు. వరంగల్ మహానగరంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్మార్ట్ సిటీ, అమ్మత్, హృదయ్ పథకాల ద్వారా జరిగిన అభివృద్ది, రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌పై ఉన్న అసంతృప్తి, కాజీపేటలో రైల్వే ఓవరాయిలింగ్ యూనిట్, వ్యాగన్ తయారీ పరిశ్రమ మంజూరు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పనకు అవకాశం, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం, ప్రధాని మోదీకి ప్రజాదరణ ఉండడం, డబుల్ ఇంజన్ సర్కార్‌తో అభివృద్ధి, మహిళల ఓట్లు వంటివి రావు పద్మకు కలిపోచ్చే అంశాలు. రాష్ట్రంలో జనసేనతో పొత్తు, పవన్ కళ్యాణ్ రాక, బీజేపీ నుంచి కేంద్ర గ్రామీణాభివృద్ధి, మంత్రి సాద్వి నిరంజన్ జ్యోతి, ఇతర అగ్ర నాయకుల ప్రచారం చేయడం వల్ల రావు పద్మ తాను గెలుస్తాననే నమ్మకంతో ఉన్నారు. ఇవి చదవండి: జంగ్ తెలంగాణ: నేతల నసీబ్ మార్చేసే నియోజకవర్గం ఇది! -
TS: నేతల నసీబ్ మార్చేసే నియోజకవర్గం ఇది!
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆ నియోజకవర్గం నుంచి ఎందరో నేతలు ఎదిగారు. జిల్లా అంతటా పోటీ చేసి గెలుపొందారు. రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పారు. ఒకే నియోజకవర్గం నుంచి ఎదిగి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆ నియోజకవర్గం ఏదో చూద్దాం. అక్కడ నుంచి ఎదిగి చక్రాలు తిప్పిన ఆ నేతలపై ఓ లుక్కేద్దాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎన్నికల సమయంలోనే ఆ ప్రత్యేకతలు బయటకొస్తాయి. ప్రచారం పొందుతాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్థన్నపేట నియోజకవర్గం అలాగే ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. ఈ నియోజకవర్గం నుంచి ఎందరో నేతలు ఎదిగారు. ఓరుగల్లు జిల్లా అంతటా విస్తరించారు. అన్ని చోట్ల నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలుపొందారు. రాష్ట్ర మంత్రులయ్యారు. రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో చక్రాలు తిప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎర్రబెల్లి దయాకరరావు, ఎర్రబెల్లి వరదరాజేశ్వరరావు, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, బోయినపల్లి వినోద్‌కుమార్, కడియం శ్రీహరి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వన్నాల శ్రీరాములు...ఇలా చాలా మంది నేతలు వర్థన్నపేట నియోజకవర్గానికి చెందినవారే. వీరిలో పురుషోత్తమరావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కడియం శ్రీహరి రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు. వర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గం పట్టణం, పల్లెలు కలిసి వరంగల్ మహానగరం చుట్టూ విస్తరించి ఉంది. వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధిలో ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గం ఆధ్యాత్మిక, వాణిజ్య, వైద్య, విద్యరంగాల్లో పేరుగాంచింది. వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు, హనుమకొండ, ఖిలావరంగల్, కాజీపేట, హసన్‌పర్తి, వరంగల్ మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వర్ధన్నపేట నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో జరిగిన పునర్విభజనలో వర్థన్నపేట ఎస్సీ నియోజకవర్గంగా మారింది. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొండేటి శ్రీధర్ విజయం సాధించారు. 2014, 2018 ఎన్నికల్లో తెరాస తరపున బరిలో నిలిచిన అరూరి రమేశ్ గెలుపొందారు. హ్యాట్రిక్ సాధిస్తానంటూ మూడోసారి ఆరూరి రమేష్ వర్థన్నపేట నుంచి బరిలో దిగారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉంటూ.. పాలకుర్తి నుంచి వరుసగా మూడు సార్లు గెలిచి 4వ సారి బరిలో నిలిచిన ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, మాజీఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ మంత్రి పురుషోత్తమరావు స్వగ్రామం వర్థన్నపేట నియోజకవర్గంలోని పర్వతగిరి. ప్రస్తుత జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సొంత గ్రామం ఇదే నియోజకవర్గంలోని ఐనవోలు మండలం పున్నేలు. ఇలా ఎందరో ప్రముఖ నాయకులను అందించిన గడ్డగా వర్థన్నపేట రాష్ట్రంలోనే పేరు పొందింది. ఇవి చదవండి: గంగుల.. నా సహనాన్ని పరీక్షించొద్దు! దొంగ వీడియోలు సృష్టిస్తే.. : బండి సంజయ్ -
నా బలం, బలగం ‘సాగర్’ ప్రజలే.. అవే నన్ను గెలిపిస్తాయి: ఎమ్మెల్యే భగత్
‘సాగర్ నియోజకవర్గ ప్రజలే నా బలం.. బలగం. నేను ప్రచారానికి వెళ్తే బ్రహ్మరథం పడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరాయి. గతంతో పోల్చితే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గణనీయమైన అభివృద్ధి జరిగింది. బీఆర్ఎస్ పథకాలు, నేను చేసిన అభివృద్ధి నన్ను గెలిపిస్తాయి’ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునసాగర్ బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ సాక్షితో మాట్లాడారు. నల్గొండ: సాగర్ ఉప ఎన్నికల్లో ఈ ప్రాంత ప్రజలు నన్ను గెలిపించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిత్యం వారికి అందుబాటులో ఉంటున్నా. ఇక్కడే స్థిరనివాసం ఏర్పచుకుని నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నా. సాగర్‌లో ఏడు సార్లు పాలించినవారు చేయని అభివృద్ధిని కేవలం రెండున్నరేళ్లల్లోనే నేను చేసి చూపెట్టా. బలహీనవర్గాల బిడ్డగా ప్రజలు మరోసారి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తా. రూ.200 కోట్లతో అభివృద్ధి చేశా.. 2018లో తొలిసారిగా మా నాన్న నోముల నర్సింహయ్య ఎమ్మెల్యేగా గెలిచాక హాలియా, నందికొండను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేశారు. నియోజక వర్గంలో 40 తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశాం. నేను గెలిచాక రూ.60 కోట్లతో హాలియా, నందికొండ పట్టణాల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టాం. వరద కాల్వ పనులను పూర్తి చేసి 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాం. నియోజకవర్గంలో 10 విద్యుత్ సబ్స్టేషన్లు నిర్మించాం. నందికొండలో క్వాటర్స్‌లో నివాసం ఉంటున్న వారికి పట్టాలు ఇచ్చాం. హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశాం. సాగర్‌లో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. నియోజకవర్గంలోని మూడు పీహెచ్‌సీలకు రూ.25 లక్షల చొప్పున కేటాయించి అభివృద్ధి చేశాం. కంపాసాగర్‌లో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలను బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాలగా ఏర్పాటు చేయడమే నాముందు ఉన్న ఏకైక లక్ష్యం. నెల్లికల్లు పనులు శరవేగంగా సాగుతున్నాయి.. రూ.664 కోట్లతో నెల్లికల్లు లిఫ్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పెద్దవూర మండలంలో సుమారు రూ.2.5 కోట్లతో డీ8, డీ9 లిఫ్ట్ పనులు పూర్తి చేశాం. దీని ద్వారా 7300 ఎకరాలకు సాగునీరు అందనుంది. రూ.33.81 కోట్లతో చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టాం. ఇంకా త్రిపురారం, గుర్రంపోడు, పెద్దవూర మండలాల్లో లిఫ్ట్‌లు, చెక్‌డ్యాంల ఏర్పాటు చేయాల్సి ఉంది. -
చార్మినార్ జోన్లోకి మెదక్‌జిల్లా..
నర్సాపూర్: ఈ ఎన్నికలలో గెలిచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే మెదక్ జిల్లాను సిరిసిల్ల జోన్ నుంచి చార్మినార్ జోన్లో కలుపుతామని, ఐటీ హబ్ ఏర్పాటు చేస్తామని నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి వాకిటి సునీతారెడ్డి హామీ ఇచ్చారు. తాము ప్రచారంలో భాగంగా ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు తమకు అండగా ఉంటామని, పూర్తి మద్దతు తెలుపుతున్నారని ఆమె చెపుతున్నారు. మరింత మెరుగైన విద్య, వైద్యం అందించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆమె అంటున్నారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడారు. ప్రచారం ఎలా సాగుతోంది? ప్రజల నుంచి స్పందన ఏమిటి? ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో పాటు ఆయా మండలాల నాయకులు, గ్రామ నాయకులతో కలిసి గ్రామాల్లో ప్రచారం కోసం వెళితే ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పడుతున్నారు. నాకు అండగా ఉంటామని హామీ ఇవ్వడంతో పాటు నాకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రజలు ఏయే సమస్యలను చెబుతున్నారు? చాలా గ్రామాల్లో పేదలు సొంత ఇళ్లు కావాలని అడిగారు. ఇప్పటికే మూడు వేలగృహలక్ష్మి ఇళ్లు మంజూరు అయ్యాయి. ఇటీవల సీఎం కేసీఆర్ నర్సాపూర్‌కు వచ్చినప్పుడు నియోజకవర్గానికి మరో ఐదు వేల ఇళ్లు కావాలని వి/్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఎన్నికల అనంతరం పేదలందరికీ గృహలక్ష్మి ఇళ్లు మంజూరు చేస్తాం. పార్టీ మేనిఫెస్టోపై ప్రజల స్పందన ఎలా ఉంది? సీఎం కేసీఆర్ రూపొందించిన మేనిఫెస్టోను ప్రజలు బాగా స్వాగతిస్తున్నారు. అన్ని పథకాలకు స్పందన బాగుంది. సౌభాగ్యలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.3 వేలు, రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ, రైతుబంధు, రూ.4 వందలకే గ్యాస్ సిలిండర్, అసైన్డ్ భూములకు, పోడు భూములకు పట్టాలు అందజేసి సర్వ హక్కులు కల్పించే పథకాలతో పాటు ఇతర పథకాలను ప్రజలు ఆదరిస్తున్నారు. మీ విజయానికి ఏయే అంశాలు దోహదపడతాయని భావిస్తున్నారు? సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు నియోజకవర్గంలోని అర్హులందరికీ అందాయి. లబ్ధిదారులంతా తమ పార్టీకి అండగా నిలిచారు. కొన్ని పథకాలు దేశంలో ఎక్కడా లేని విధంగా ఉన్నాయి. ఆసరా పింఛన్లు, రైతుబంధు, మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ నల్లాల ద్వారా నీరు అందించాం. దీంతో తాగునీటి ఇబ్బందులు తొలిగిపోవడంతో మహిళల అండ మాకుంది. అలాగే ఆరోగ్య శ్రీ పథకం లాంటి పథకాలు నా విజయానికి దోహదపడతాయి. ఆ పథకాలే రాష్ట్రంలో బీఆర్ఎస్ను మూడోసారి అధికారంలోకి తేగలవు. మీకు ఏ పార్టీతో గట్టి పోటీ ఉంది? మాకు కాంగ్రెస్‌తోనే గట్టి పోటీ ఉంది. అయితే ప్రజల ఆశీర్వాదం, మా పార్టీ నాయకులు, కార్యకర్తల కృషితో నేనే తప్పక గెలుస్తాను. అసైన్డ్ భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకుంటుందని కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ కుట్రలను ప్రజలు గుర్తించి ఆ తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొడుతున్నారు. తమ ప్రభుత్వం ఇచ్చేదే తప్ప తీసుకునేది కాదని వారికి తెలుసు. ప్రజలకు మీరిచ్చే హామీలు? నేను గెలువగానే సీఎం కేసీఆర్, మంత్రులు సహకారంతో జిల్లాను సిరిసిల్లజోన్ నుంచి చార్మినార్ జోన్లో కలుపుతా. అలాగే నియోజకవర్గంలో ఐటీ హబ్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాను. నర్సాపూర్‌లోని ఉస్మానియా పీజీ కాలేజీకి, ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మిస్తాం. అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ భవనాలు పూర్తి చేయడానికి, మైనారిటీ, బాలికల గురుకులాలకు సొంత భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాను. ప్రభుత్వ ఆసుపత్రులలో మరింత మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తాను. గ్రామాలలో అభివృద్ధి పనులను గుర్తించి ప్రాధాన్యత ప్రకారం ప్రణాళికబద్ధంగా చేపడతాం. పర్యాటకంగా కూడా అభివృద్ధి చేస్తాం. -
డీజే సౌండ్‌తో గుండెపోటుకు గురై మహిళ మృతి.. డీజే ఏర్పాటు చేసింది?
కొండమల్లేపల్లి: దేవరకొండ నియోజకవర్గంలోని కొండమల్లేపల్లిలో ఓ రాజకీయ పార్టీ ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో డీజే సౌండ్ కారణంగా ఓ మహిళ గుండెపోటుకు గురై మృతి చెందింది. కొండమల్లేపల్లి మండల కేంద్రానికి చెందిన గుంటోజు అమృతమ్మ(51) దినసరి కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంగళవారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోర్ పిన్ డిజే సౌండ్స్‌తో తీవ్రమైన శబ్దాన్ని తట్టుకోలేక అమృతమ్మ గుండెపోటుకు గురై కుప్పకూలింది. దీంతో స్థానికులు ఆమెను దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అమృతమ్మను పరీక్షించిన వైద్యులు.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు ఏమీ అందలేదని పోలీసులు తెలిపారు. కోళ్ల దాణా లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా మాడుగులపల్లి: కోళ్ల దాణా బస్తాల లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటన మాడుగులపల్లి మండల పరిధిలోని టోల్‌ప్లాజా సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నుంచి కోళ్ల దాణా(సోయాపొట్టు) బస్తాల లోడ్‌తో లారీ ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు జిల్లాకు బయల్దేరింది. మార్గమధ్యలో మాడుగులపల్లి టోల్‌ప్లాజా సమీపంలో రోడ్డు దిగుడుగా ఉండడాన్ని డ్రైవర్ గుర్తించకపోవడంతో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. దాణా బస్తాలను మరో లారీలోకి లోడ్ చేసి క్రేన్ సాయంతో బోల్తా పడిన లారీని పైకెత్తారు. -
చివరి రోజు ఉద్రిక్తత! బీఆర్ఎస్, బీజేపీ పరస్పరం దాడులు..
సాక్షి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో ప్రశాంతంగా సాగిన ప్రచారపర్వం చివరిరోజు ఒక్క ఘటనతో ఉద్రిక్తంగా ముగిసింది. జిల్లాకేంద్రంలోని వైఎస్సార్‌కాలనీలో మంగళవారం ఉదయం బీజేపీ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి, పార్టీ నాయకులతో ప్రచారానికి వెళ్లాడు. అదే సమయానికి బీఆర్ఎస్ నాయకులు ప్రచార వాహనంతో వచ్చారు. పోటాపోటీగా పాటలు పెట్టవద్దన్న అంశంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఒక్కసారిగా బీజేపీ నాయకులపై బీఆర్ఎస్ నాయకులు రాళ్లతో దాడి చేశారు. దీంతో బీజేపీ నాయకుల కూడా ప్రతిదాడికి దిగారు. ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకోవడంతో వైఎస్సార్ కాలనీ ఉద్రిక్తంగా మారింది. పలువురు స్థానికులు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ గంగారెడ్డి, సీఐలు శ్రీనివాస్, పురుషోత్తం వెంటనే అక్కడి చేరుకున్నారు. భారీసంఖ్యలో పోలీసులను మోహరించారు. ఇరుపార్టీల నాయకులను చెదరగొట్టారు. అనంతరం బీజేపీ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి తన ప్రచారం కొనసాగించారు. ఈ ఘటనకు సంబంధించి పలువురిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
గంగుల.. నా సహనాన్ని పరీక్షించొద్దు! దొంగ వీడియోలు సృష్టిస్తే.. : బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: ‘గంగుల.. నా సహనాన్ని పరీక్షించొద్దు. కరీంనగర్లో నేను చేసిన అభివృద్ధిపై చర్చించే దమ్ములేని వ్యక్తి నాపై దొంగ వీడియోలు సృష్టించేందుకు సిద్ధమైనట్లు సమాచారం అందింది. దొంగ వీడియోలు సృష్టిస్తే చరిత్ర హీనుడిగా మారతావు’ అంటూ కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. కార్యకర్తలే నా హీరోలు.. కరీంనగర్లో గెలిచేది బీజేపీ అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన మంగళవారం కరీంనగర్లో మహాబైక్ ర్యాలీ నిర్వహించారు. యువత, మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కిసాన్‌నగర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ గాంధీచౌక్, రాజీవ్‌గాంధీ విగ్రహం, టవర్ సర్కిల్, శాసీ్త్రరోడ్, కమాన్, ఎన్టీఆర్ విగ్రహం, గణేశ్‌నగర్ బైపాస్, అంబేడ్కర్స్టేడియం, భగత్‌సింగ్ విగ్రహం, గోదాంగడ్డ, ఉమెన్స్‌కాలేజ్, రాంనగర్ మార్క్‌ఫెడ్, మంకమ్మతోట, శివ థియేటర్, జగిత్యాల రోడ్, అంబేడ్కర్ విగ్రహం మీదుగా రేకుర్తి వరకు సాగింది. ర్యాలీని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ప్రారంభించారు. రేకుర్తి వద్ద ముగింపు కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. కార్యకర్తలే తన హీరోలు అన్నారు. ప్రజా ఆశీర్వాదంతో కరీంనగర్లో భారీ మెజారిటీతో బీజేపీ విజయం సాధిస్తుందని తెలిపారు. ఇది తట్టుకోలేక గంగుల కమలాకర్ తనపై దొంగ వీడియో, ఆడియోలు సృష్టించి వైరల్చేసే పనిలో పడినట్లు సమాచారం ఉందని అన్నారు. దమ్ముంటే నేరుగా కొట్లాడాలని, అభివృద్ధిపై చర్చకు రావాలని పిలుపునిచ్చారు. భూకబ్జాలు, రౌడీయిజం తన దగ్గర చెల్లవన్నారు. ఫాంహౌజ్‌లో ఉన్న కేసీఆర్‌ను ధర్నాచౌక్‌కు తీసుకొచ్చానని, నువ్వెంత అంటూ గంగులకు సవాల్ విసిరారు. మీరు అధికారంలో ఉండేది మరో 48 గంటలే అని, 30న కరీంనగర్లో బీజేపీకే ఓటేయాలని ప్రజలంతా నిర్ణయించుకున్నారని అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి దుకాణం బంద్ చేసుకున్నాడని తెలిపారు. భూకబ్జాదారులు, అవినీతి పరులుకావాలా? మచ్చలేని వ్యక్తిత్వంతో ప్రజల కోసం పోరాడుతున్న తాను కావాలో? ఆలోచించండని అన్నారు. కమలంపువ్వు గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మందకృష్ణ మాట్లాడుతూ.. బండి సంజయ్‌ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎస్సీ, ఎస్టీ, బీసీవర్గాలతోపాటు ఓసీ వర్గాలపై ఉందని అన్నారు. ఇప్పటి వరకు జనాభాలో 1,2 శాతం జనాభా కూడా లేనివాళ్లే 75 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేశారని, 50 శాతానికిపైగా ఉన్న బీసీల్లో ఒక్కరిని కూడా సీఎం చేయలేదన్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి చదవండి: చివరి రోజు ఉద్రిక్తత! బీఆర్ఎస్, బీజేపీ పరస్పరం దాడులు.. -
ష్.. గప్‌చుప్! ప్రచారంలో సైలెన్స్ పీరియడ్ మొదలు..
సాక్షిప్రతినిధి,కరీంనగర్/పెద్దపల్లి: ఎన్నికల పర్వంలో మరో ఘట్టం మంగళవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్లో సీఎం కేసీఆర్‌తో మొదలైన సభల సందడి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ఎంపీ జైరాంరమేశ్‌తో ముగిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే రాజకీయ చైతన్యానికి ప్రతీక. అందుకే, ఈ జిల్లాలో మెజారిటీ సీట్లు సాధించిన వారే రాజధానిలో అధికారంలో ఉంటారన్న నమ్మకం అనాదిగా వస్తోంది. అందుకే, ఈ జిల్లాపై బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రత్యేక దృష్టి సారించి, సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేశాయి. ప్రముఖుల సభలతో ఊపు..! ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే కేసీఆర్‌కు ఉద్యమకాలం నుంచి ప్రత్యేక అభిమానం. అందుకే, ఆయన ఈ జిల్లాలో పలుమార్లు సుడిగాలి పర్యటన చేశారు. హుస్నాబాద్‌తో మొదలు పెట్టిన సీఎం కేసీఆర్ తరువాత విడతల వారీగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించారు. ఆఖరుగా వేములవాడతో ఉమ్మడి జిల్లా సభలు ముగించారు. అలాగే కేటీఆర్ కూడా 13 నియోజకవర్గాల్లో పర్యటించారు. – ప్రధాని మోదీ కరీంనగర్‌కు, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్‌షా (జమ్మికుంట), యూపీ సీఎం యోగి (వేములవాడ), మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే (ధర్మపురి)లు బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించారు. – కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంథని, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, వేములవాడలో పర్యటించారు. వీరే కాక రేవంత్‌రెడ్డి, జైరాంరమేశ్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బాగేల్ తదితరులు సభల్లో పాల్గొన్నారు. 50 రోజులు హోరెత్తిన ప్రచారం.. గతనెల 9న ఎన్నికల షెడ్యూల్ విడుదలైన దరిమిలా.. ఎన్నికల సందడి మొదలైంది. అభ్యర్థుల ఖరారు, నామినేషన్లతో జోరందుకున్న ప్రచారంలో మొత్తంగా దాదాపు 50 రోజులుగా అభ్యర్థులు ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో దూసుకెళ్లారు. కొందరు అభ్యర్థులు భారీ బహిరంగ సభల ద్వారా బలప్రదర్శన చేయగా, మరికొందరు నాయకులు ఇంటింటి ప్రచారాన్ని నమ్ముకున్నారు. ప్రజలకు తమ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలతో పాటు, తమదైన హామీలతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవటానికి యత్నించారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులతో పాటు, వారి కుటుంబ సభ్యులు సైతం ప్రచారంలో పాల్గొన్నారు. సైలెన్స్ పీరియడ్ మొదలు.. ఉమ్మడి జిల్లాల్లో 13 నియోజకవర్గాల్లో ప్రచారం ముగిసింది. మైకులు మూగబోయాయి. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సెలెన్స్ పీరియడ్‌గా ప్రకటించారు. అభ్యంతరకర, రాజకీయపరమైన, బల్క్ ఎస్ఎంఎస్ల ప్రసారంపై నిషేధం ఉందని అధికారులు తెలిపారు. ఎన్నికల ప్రచారం తర్వాత తెర వెనుక పంపిణీలపై ఎన్నికల అధికారులు దృష్టిపెట్టారు. బల్క్ మెసేజ్‌లు, సోషల్ మీడియాలపైనా నిఘా పెట్టారు. నియోజకవర్గం.. పోలింగ్ స్టేషన్ల వివరాలు.. కరీంనగర్ నియోజకవర్గంలో 390 పోలింగ్ స్టేషన్లు, చొప్పదండిలో 327, మానకొండూరులో 316, హుజూరాబాద్‌లో 305, రామగుండంలో 259, మంథనిలో 288, పెద్దపల్లిలో 290, వేములవాడలో 170, సిరిసిల్లలో 287, కోరుట్లలో 262, జగిత్యాలలో 254, ధర్మపురిలో 269 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇవి చదవండి: జంగ్ తెలంగాణ: నేతల నసీబ్ మార్చేసే నియోజకవర్గం ఇది! -
ఉమ్మడి వరంగల్.. ఎవరి వ్యూహాలు వారివే
సాక్షిప్రతినిధి, వరంగల్: సార్వత్రిక ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ఈనెల 15న ముగియగా.. సుమారు 13 రోజులపాటు అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం సాగించారు. నేతలు చివరి ప్రయత్నంగా ప్రలోభాలకు తెరలేపి, ఒక్కో ఓటుకు రూ.2వేల నుంచి రూ.5 వేల వరకు ముట్టజెబుతున్నారని సమాచారం. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి 12 నియోజకవర్గాల నుంచి 36 మంది పోటీలో ఉన్నా రు. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా? అన్నట్లు పోటీ సాగుతుండగా.. గెలుపే లక్ష్యంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఆయా పార్టీలు బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రధాన పార్టీల నేతలు, శ్రేణులు రంగంలోకి దిగగా.. మరోవైపు ఎలాగైనా సత్తా చాటాలని స్వతంత్రులు పావులు కదుపుతున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడడంతో నేతలు, అభ్యర్థులు తమ చివరి వ్యూహాలకు పదునుపెడుతున్నారు. చివరిరోజున ఉమ్మడి జిల్లాలో సభలు, సమావేశాలు, బైక్ ర్యాలీలు, కులసంఘాల భేటీలతో పట్టభద్ర ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. గురువారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో తమకు అనుకూలంగా పోలింగ్ చేయించుకునేలా కసరత్తు చేస్తున్నారు. ఓరుగల్లు ప్రచారంలో అగ్రనేతలు.. ఎన్నికల షెడ్యూల్ విడుదల నుంచే ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. అక్టోబర్ 16న ఉమ్మడి వరంగల్‌లో తొలి ప్రచార సభను జనగామలో నిర్వహించిన సీఎం కేసీఆర్ అప్పటికే నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించారు. అక్టోబర్ 18న ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, టీపీసీసీ, సీఎల్పీ నేతలు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో బస్సుయాత్ర నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్‌రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, కేంద్రమంత్రులు అమిత్‌షా, అనురాగ్ ఠాకూర్, అశ్వినికుమార్ చౌబే తదితరులు ఉమ్మడి వరంగల్‌లోని పలు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. 27న ప్రధాని నరేంద్రమోదీ మహబూబాబాద్‌లో ప్రచారం నిర్వహించారు. కర్ణాటక, అస్సాం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయా పార్టీల తరఫున ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం కోసం సీఎం కేసీఆర్ అన్ని నియోజకవర్గాల్లో తిరగ్గా.. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు క్యాంపెయిన్ నిర్వహించారు. ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్‌లలో డీకే శివకుమార్, రేవంత్‌రెడ్డి, విజయశాంతి పర్యటించారు. ఉమ్మడి జిల్లాలో బీఎస్పీ పక్షాన ఆ పార్టీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రచారం నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ బీజేపీకి మద్దతుగా ప్రచారసభల్లో పాల్గొన్నారు. మొత్తంగా 13 రోజుల పాటు పోటాపోటీగా సాగిన ప్రచారం, డీజేలు, మైకుల మోత మంగళవారం సాయంత్రం నిలిచింది. ఎవరి వ్యూహాలు వారివే.. ఉమ్మడి వరంగల్‌లోని 12 నియోజకవర్గాల్లో గతంలో ఎప్పుడూ లేనంతగా 216 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా వరంగల్ తూర్పు నుంచి 29 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. అత్యల్పంగా భూపాలపల్లి నుంచి 9 మంది ఉన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 36 మంది 12 సెగ్మెంట్లలో పోటీ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌లో మొత్తం 29,74,631 ఓటర్లుండగా.. 18 నుంచి 39 ఏళ్ల మధ్య వయస్సు వారు 14,70,458 మంది ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో యువ, నవ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారో అనే చర్చ రాజకీయ విశ్లేషకుల్లో సాగుతుండగా.. ఆ ఓటర్లను ఆకట్టుకోవడంపై ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. ఆరు జిల్లాల్లోని 12 నియోజకవర్గాల్లో విమర్శలు, ఆరోపణలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో రోజుకోరీతిలో ఎమ్మెల్యే అభ్యర్థుల మధ్య ప్రచారం పోరు రసవత్తరంగా సాగింది. ఎట్టకేలకు ప్రచార ఆర్భాటానికి మంగళవారం సాయంత్రం తెరపడడంతో రాత్రి నుంచి డబ్బులు, మద్యం, కానుకల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. కాగా.. నగదు, మద్యం భారీగా పంపిణీ జరుగుతుందన్న ప్రచారం మేరకు ఎన్నికల అధికారులు రంగంలోకి దిగి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 24 చెక్‌పోస్టుల ద్వారా సుమారు రూ.12 కోట్ల మేరకు నగదు, మద్యం, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండగా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు 144 సెక్షన్‌ను అమల్లోకి తెచ్చారు. -
Telangana Assembly Elections: ఓటర్లూ.. ఇవి తెలుసుకోండి
కల్వకుర్తి టౌన్: అసెంబ్లీ ఎన్నికలు గురువారం నిర్వహించనున్నారు. ఇప్పటికే ఓటరు జాబితాను సిద్ధం చేశారు. పోలింగ్‌కు ముందు ఓటర్లు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ►ఓటరు జాబితాలో పేరు ఉందా అనే విషయాన్ని పరిశీలించుకోవాలి. సీఈఓ తెలంగాణ వెబ్సైట్లో లేదా స్థానికంగా ఓటరు నమోదు కేంద్రంలో పరిశీలించుకోవచ్చు. ►ఓటరు గుర్తింపు కార్డు, ఇతర ఫొటో గుర్తింపు కార్డు, ఓటరు చీటి మీ వద్ద ఉంచుకోవాలి. ► మీ ఇంటి వద్దకే బూత్‌స్థాయి అధికారి వచ్చి ఓటరు చీటి ఇచ్చి వెళ్తారు. ► ఒకవేళ ఓటరు చీటి ఇవ్వకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉండే రాజకీయ పార్టీల ఏజెంట్ల వద్ద పొందవచ్చు. ►పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చీటి, గుర్తింపు కార్డును చూపించాలి. ► పోలింగ్ అధికారుల్లో ఒకరు ఓటరు జాబితాలో గుర్తింపుకార్డుతో పాటు మీ పేరును పరిశీలిస్తారు. మరో అధికారి మీ వేలికి సిరా చుక్క అంటిస్తారు. ఆ తర్వాత ఒక చీటి ఇస్తారు. ► మూడో అధికారి ఆ చీటిని పరిశీలిస్తారు. ► ఆ తర్వాత ఈవీఎంపై మీరు ఎన్నుకోవాల్సిన అభ్యర్థికి కేటాయించిన బటన్‌పై నొక్కాలి. ►మీరు ఓటు వేసిన తర్వాత వీవీ ప్యాట్‌లో నిర్దారణ చేసుకోవచ్చు. ►సీల్డ్ బాక్స్‌లోని గ్లాస్ కేసులో అది మనకు ఏడు సెకన్ల పాటు కనిపిస్తుంది. -
గెలిచినా, ఓడినా.. ప్రజల కోసమే పనిచేస్తా
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం రాజకీయ వారసురాలిగా ఆమె కోడలు, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ఇప్పుడు హుజూర్నగర్ నుంచి సీపీఎం అభ్యర్థీగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. మల్లు స్వరాజ్యం రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన 40 ఏళ్ల తర్వాత అదే కుటుంబం నుంచి లక్ష్మి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వివిధ అంశాలపై మాట్లాడారు. ఆమె మాటల్లోనే.. మహిళల సంక్షేమం, అభివృద్ధిపై వివక్ష.. మహిళా సంక్షేమం, అభివృద్ధిపై ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయి. పాలకులెవరైనా కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ మహిళల సంక్షేమానికి పాటుపడుతున్నామని చెబుతున్నాయే తప్ప ఆచరణలో పట్టించుకోవడం లేదు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా.. మల్లు స్వరాజ్యం కోడలిగా ఆమె చూపిన బాటలో నడుస్తున్నా. ప్రజా పోరాటాలు చేసినా, ప్రజాస్వామిక ఎన్నికల్లో పోటీ చేసినా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం. ఎన్నికల్లో గెలుపొందడం ద్వారా ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం చూపించవచ్చనే ఆలోచనతోనే ఎన్నికల బరిలో నిలిచాను. గెలిచినా, ఓడినా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతా. మహిళల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా సమానత్వం, మహిళా సంక్షేమం, అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తా. అత్తామామల ప్రోద్బలంతోనే.. మా అత్తామామ మల్లు స్వరాజ్యం, మల్లు వెంకటనర్సింహారెడ్డి, నా భర్త నాగార్జునరెడ్డి ప్రోత్సాహంతోనే ఇంతవరకు వచ్చాను. వివాహం అయ్యాక అత్తమామల ప్రోద్బలంతో కుటుంబాన్ని చూసుకుంటూనే చదువుకున్నా. డిగ్రీ, ఎల్ఎల్బీ పూర్తి చేశా. రాజకీయ అవగాహన ఉంది సీపీఎం అనుబంధ ప్రజా సంఘమైన ఐద్వాకు లీగల్ సెల్ కన్వీనర్‌గా పనిచేశా. ఐద్వా ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశా. తెలంగాణ వచ్చిన తర్వాత ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నా. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ స్థానం నుంచి సీపీఎం తరఫున పోటీచేశా. పోరాటమే గెలిపిస్తుంది నిత్యం ప్రజల్లో ఉంటూ మహిళలు, కార్మిక సమస్యలపై పోరాడాను. సూర్యాపేట మండలం రాయినిగూడెం ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నికయ్యాక, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించి ఏకగ్రీవ పంచాయతీలకు నిధులు సాధించా. నల్లగొండలో డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల రుణాలు, గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చేశాను. పోలీసుల లాఠీచార్జ్‌లకు గురయ్యా.. జైలుకు వెళ్లా. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలపై పోరాడాను, ఏడు కిలోమీటర్లు పాదయాత్ర చేశా. నిరంతరం ప్రజల కోసం పోరాడా.. ఆ పోరాటమే నన్ను ఈ ఎన్నికల్లో గెలిపిస్తుందని ఆశిస్తున్నా. నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక కృషి ఈ ఎన్నికల్లో గెలిస్తే ఉపాధిహామీ పనులను పట్టణ ప్రాంతాలకు విస్తరింపజేసేలా కృషిచేస్తా. మేళ్లచెరువు, మఠంపల్లి మండలాల్లో దాదాపు 30 వేల ఎకరాల్లో సాగుచేస్తున్న మిర్చి, పత్తి పంటలకు వాటికి సరైన మార్కెట్ సౌకర్యం లేదు. శీతల గిడ్డంగులు లేవు. హుజూర్‌నగర్‌లో మహిళా డిగ్రీ కళాశాల కావాలి. మండలానికి ఒక పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ ఉండాలి. సాగర్ ఎడమ కాలువ చివరి భూములకు నీరందడం లేదు. లిఫ్టులు సరిగా పనిచేయడం లేదు. పోడు భూములకు పట్టాలు లేవు. ఇలా నియోజకవర్గంలో అనేక అనేక సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఆయా సమస్యల సత్వర పరిష్కారం కోసం కృషిచేస్తా. - చింతకింది గణేశ్ -
ఏడు చోట్లా బహుముఖం.. మిగిలిన చోట్లా నువ్వా నేనా
అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వం తుదిఘట్టానికి చేరుతోంది. పోలింగ్ తేదీ దగ్గర పడటంతో ప్రధాన రాజకీయపార్టీల అగ్రనేతలు సుడిగాలి పర్యటనలతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. బీజేపీకి సంబంధించి ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుడిగాలి పర్యటనలు చేసేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల సీఎంలు, అఖిల భారత కాంగ్రెస్ నేతలు ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఇక రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు కలియ తిరుగుతున్నారు. ప్రత్యర్థులపై ఆరోపణలు, ప్రత్యారోపణలు, వ్యక్తిగత దూషణలు, చేసిన, చేయబోయే అంశాలు వల్లె వేస్తూ ఉధృతంగా ఆయా పార్టీల నేతలందరూ ప్రచారంలో మునిగి తేలుతున్నారు. – సాక్షి, ప్రత్యేక ప్రతినిధి 2 నెలల నుంచే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం రెండుమూడు నెలల నుంచే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ప్రారంభమైంది. అక్టోబర్ 9వ తేదీన ఎన్నికల షెడ్యూల్ రావడం, నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ వెలువడిన సంగతి విదితమే. నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణ ఘట్టం పూర్తయిన తర్వాత ఈనెల 15వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారరం తీవ్రస్థాయికి చేరింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా మూడేసి రోజులపాటు రాష్ట్రంలోనే మకాం వేసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీకి చెందిన యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వశర్మ,, దేవేంద్ర ఫడ్నవీస్‌లతోపాటు పార్టీ అగ్రనేతలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ గతనెల 15వ తేదీ నుంచి ఇప్పటి వరకు దాదాపు 92 అసెంబ్లీ స్థానాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక, ఆ పార్టీ సీఎంలు బఘేల్, సిద్ధరామయ్య తదితరులు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. టీఆర్ఎస్ నుంచి సీఎంతోపాటు కల్వకుంట్ల తారక రామారావు, హరీశ్‌రావులు రాష్ట్రం మొత్తం చుట్టి వస్తుంటే.. కవిత నిజామాబాద్ జిల్లాకు మాత్రమే పరిమితమై ప్రచారం సాగిస్తున్నారు. బీఎస్పీ నుంచి మాయావతి, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, సీపీఎం నుంచి సీతారాం ఏచూరి, బృందాకారత్, సీపీఐ నేత డి.రాజా తదితరులు ఆయా పార్టీల తరపున ప్రచారం చేస్తున్నారు. అన్ని పార్టీలు తమ ఎజెండాను ప్రజల ముందు ఉంచాయి. ద్విముఖ పోరు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే గడిచిన ఎన్నికల్లో ఆయా పార్టీల ప్రభావం, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం తీరు తర్వాత మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకుగాను దాదాపు 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ నెలకొంటే.. మరో 70 స్థానాల్లో ద్విముఖ పోరు నెలకొంది. మరో ఏడు స్థానాల్లో బహుముఖ పోటీ ఉంది. త్రిముఖ పోరులో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య తీవ్ర పోటీఉంటే, 70 స్థానాల్లో ద్విముఖ పోరు ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే నెలకొంది. ఇక ఏడు స్థానాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, సీపీఎంల మధ్య బహుముఖ పోటీ నెలకొంది. త్రిముఖ పోటీలోని 42 స్థానాల్లో ఆర్థిక బలం అదనపు ఆయుధంగా మారింది. అన్ని పార్టీల నేతలూ పెద్ద ఎత్తున ప్రలోభాలకు దిగుతున్నారు. త్రిముఖ పోటీ దాదాపు అన్ని జిల్లాల్లో రెండు నుంచి నాలుగు చోట్లా నెలకొంది. ఈ జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు అధికంగా ఉండడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. త్రిముఖ పోటీ ఉన్న స్థానాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఏ పార్టీ చీల్చుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. బహుముఖ పోటీ ఎక్కడంటే బహుముఖ పోటీ ఉన్న వాటిలో ప్రధానంగా సిర్పూర్ కాగజ్‌నగర్, కొత్తగూడెం, పెద్దపల్లి, సూర్యాపేట, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, నల్లగొండ స్థానాలు ఉన్నాయి. ఈ సెగ్మెంట్లలో త్రిముఖ పోటీ త్రిముఖ పోటీ ఉన్న స్థానాల్లో ప్రధానంగా కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ గురించి చెప్పుకోవాల్సి ఉంది. సీఎం కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ నుంచి వెంకట రమణారెడ్డి పోటీ పడుతున్నారు. మూడు పార్టీలు ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పోరాడుతున్నాయి. ► కరీంనగర్ నుంచి మంత్రి గంగుల కమలాకర్, బీజేపీ నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, కాంగ్రెస్ నుంచి శ్రీనివాస్ బరిలో ఉన్నారు. ► కోరుట్లలో బీజేపీ నుంచి ప్రస్తుత ఎంపీ ధర్మపురి అర్వింద్, బీఆర్ఎస్ నుంచి డాక్టర్ సంజయ్, కాంగ్రెస్ నుంచి నర్సింగ్‌రావు బరిలో ఉన్నారు. ► మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్ నుంచి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ తరపున మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి తనయుడు మిథున్‌రెడ్డి రంగంలో ఉన్నారు. ► బోథ్‌లో బీఆర్ఎస్ నుంచి అనిల్ జాదవ్, కాంగ్రెస్ నుంచి ఆడె జనార్దన్, బీజేపీ నుంచి ఎంపీ సోయం బాపూరావుల మధ్య గట్టి పోటీ ఉంది. ► సంగారెడ్డిలో బీఆర్ఎస్ పక్షాన చింతా ప్రభాకర్, కాంగ్రెస్ నుంచి జగ్గారెడ్డి, బీజేపీ నుంచి పులిమామిడి రాజు ఉంటే.. ముథోల్‌లో ప్రస్తుత ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్, బీజేపీ నుంచి రామారావు పటేల్ పోటీ పడుతున్నారు. ► పటాన్చెరులో బీఆర్ఎస్ నుంచి గూడెం మహిపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి కాట శ్రీనివాస్‌గౌడ్, బీజేపీ నుంచి నందీశ్వర్‌గౌడ్ రంగంలో ఉన్నారు. ► ఖానాపూర్‌లో బీఆర్ఎస్ తరపున జాన్సన్ నాయక్, కాంగ్రెస్ నుంచి ఎడ్మ బొజ్జు, బీజేపీ నుంచి రమేష్ రాథోడ్ ఉంటే, జగిత్యాలలో బీఆర్ఎస్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, బీజేపీ టికెట్‌పై మాజీ మున్సి పల్ చైర్పర్సన్ భోగ శ్రావణి, దుబ్బాకలో ప్రస్తుత ఎమ్మెల్యే రఘునందన్‌రావు బీజేపీ నుంచి, ప్రస్తుత ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి(బీఆర్ఎస్), కాంగ్రెస్ నుంచి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. ► వర్ధన్నపేటలో బీఆర్ఎస్ నుంచి ఆరూరి రమేశ్, కాంగ్రెస్ నుంచి నాగరాజ్, బీజేపీ నుంచి కొండేటి శ్రీధర్, మక్తల్‌లో బీఆర్ఎస్ నుంచి చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, కాంగ్రెస్ వాకాటి శ్రీహరి, బీజేపీ నుంచి జలంధర్‌రెడ్డి పోటీ పడుతున్నారు. ► నిజామాబాద్ అర్బన్‌లో బిగాల గణేశ్‌గుప్తా బీఆర్ఎస్ , షబ్బీర్ అలీ కాంగ్రెస్, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా బీజేపీ నుంచి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ► వేములవాడలో లక్ష్మీ నర్సింహారావు బీఆర్ఎస్, ఆది శ్రీనివాస్ కాంగ్రెస్, సీహెచ్ వికాస్ బీజేపీ నుంచి రంగంలో ఉన్నారు. భూపాలపల్లిలో గండ్ర వెంటకరమణారెడ్డి –బీఆర్ఎస్, గండ్ర సత్యనారాయణ– కాంగ్రెస్, చందుపట్ల కీర్తిరెడ్డి బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. ► ఎల్బీ నగర్లో మధుయాష్కీ– కాంగ్రెస్, సుధీర్‌రెడ్డి –బీఆర్ఎస్, సామ రంగారెడ్డి బీజేపీ నుంచి, కుత్బుల్లాపూర్‌లో వివేకానంద –బీఆర్ఎస్, కూన శ్రీశైలంగౌడ్– బీజేపీ, కొలను హన్మంతరెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీలో ఉంటే, ఉప్పల్‌లో బండారి లక్ష్మారెడ్డి – బీఆర్ఎస్, పరమేశ్వరరెడ్డి – కాంగ్రెస్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ బీజేపీ నుంచి పోటీ పడుతున్నారు. ► మల్కాజిగిరిలో మర్రి రాజశేఖరరెడ్డి –బీఆర్ఎస్, మైనంపల్లి హన్మంతరావు –కాంగ్రెస్, రామచంద్రరావు– బీజేపీ, శేరిలింగంపల్లిలో అరికపూడి గాంధీ –బీఆర్ఎస్, జగదీశ్వర్‌రెడ్డి –కాంగ్రెస్, రవికుమార్ యాదవ్ బీజేపీ నుంచి రంగంలో ఉన్నారు. చేవెళ్లలో కాలె యాదయ్య –బీఆర్ఎస్, భీం భరత్– కాంగ్రెస్, కె ఎస్ రత్నం బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. -
తిట్లకు జామర్‌ను కనుగొనాల్సిన అవసరముంది!
‘‘డార్విన్ పరిణామ సిద్ధాంతమనేది రాజకీయాల్లో తిట్లక్కూడా వర్తిస్తుందేమో నాయనా’’ అంటూ విలక్షణమైన స్టేట్మెంట్ ఇచ్చారు స్వామీ ఎలక్షనానంద అలియాస్ స్వామీ సలక్షణానంద. ‘‘అదెలా స్వామీ?’’ అడిగాడు శిష్యుడు. ‘‘ఒకప్పుడు రాజకీయాల్లో విమర్శలుండేవి. తర్వాత అవి కువిమర్శలయ్యాయి, అటు తర్వాత తిట్లు, ఆపైన బూతులు..తాజాగా ఇప్పుడు బండబూతులు. అందుకే పరిణామ క్రమం ఒక్క జీవులకే కాదు... తిట్లకూ ఉందనిపిస్తోంది. అంతేనా..‘యథా తిట్లూ... తథా యాడ్స్’ అన్నట్టుగా కొన్ని పార్టీల ప్రకటనలైతే ఎదుటివాడిపై అరుస్తున్నట్టు..ప్రేక్షకుణ్ణి కరుస్తున్నట్టూ ఉన్నాయి నాయనా’’ ‘‘మొదట్లో అరే..ఒరే అని తిట్టుకుంటున్నవాళ్లు కాస్తా..ఈమధ్య అంతకంటే ఘోరంగా ముందుకెళ్తున్నారు. మొన్న కేటీఆర్ రేవంత్‌ను తిట్టాడనుకో. నిన్న మళ్లీ రేవంత్ కేసీఆర్‌ను తిడతాడు. ‘నీకంటే చాలా పెద్దవాడు కదా..కేసీఆర్‌ను అలా తిట్టడం సబబేనా?’ అని అడిగితే..‘మరి కేటీఆర్‌కూ నాకు మధ్య అంతే ఏజ్ గ్యాప్ ఉంది కదా. అప్పుడు నేను కేసీఆర్‌ను అనడం సమంజసమే కదా’ అంటూ జస్టిఫికేషన్లు ఇచ్చుకుంటూ మరీ తిట్టుకుంటున్నారు. ఇక మైనంపల్లి తిట్లయితే..తాజాగా తెగ వైరల్. పరిస్థితి చూస్తుంటే బాధగా ఉంది స్వామీ’’ అన్నాడు శిష్యుడు దిగులుగా. ‘‘అలనాడెప్పుడో ప్రఖ్యాత సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, తాను రాసిన ‘క–రాజు కథలు’ అనే అద్భుత కథాసంపుటిలోని ‘పలుకుబడి’ అనే కథలో ‘తిట్లు మంచివే’ అంటాడు. పైగా తిట్టేవాడెప్పుడూ (సమాజంలో) పై అంతస్తులో ఉంటాడట. తిట్టేవారికే అందరూ మద్దతు పలుకుతారట. అందుకే (విద్యార్థులు)అందరితోనూ తిట్లు తెగ ప్రాక్టీస్ చేయించాల్సిన అవసరముందనీ, ఎవరైతే తిట్లలో ప్రావీణ్యం సాధిస్తారో, వారి ‘పలుకుబడే’ రాజ్యంలో ఇంతింతై అన్నట్టుగా పెరుగుతుందని, దాదాపు పాతికేళ్ల కిందటే సెలవిచ్చారు. అదేదో యాడ్‌లో మరక మంచిదే అన్నట్టుగా... సింగీతం వారి సిద్ధాంతం ప్రకారం ‘తిట్లూ మంచివేనేమో’నంటూ సర్దుకుపోవాల్సిందే నాయనా’’ ‘‘అలా ఎలా అన్నారు సింగీతం వారు..తిట్లు మంచివెలా అవుతాయి స్వామీ?’’ ‘‘ఆ హాస్య కథల్లో వ్యంగ్యంగా అన్నమాట అది. ‘భాష రాకపోయినా సరే..బేరాలాడే సమయంలో సైగలతోనైనా సర్దుకుపోతారు ప్రజలు. కానీ బేరం కుదరక కోపం వచ్చిందనుకో..తిట్టుకుంటారూ, ఆపైన కొట్టుకుంటారు. ఇయ్యరమయ్యర కొట్టుకోవడం కంటే..పొట్టుపొట్టుగా తిట్టుకోవడం బెటరంటారు సింగీతం వారు. అలా తిట్టుకుని తాము సాధించిన ‘పై అంతస్తు’తో ఇగో చల్లారిపోయిందనుకో..దాంతో కొట్టుకోవడం ఆగిపోతే అది మంచిదేగా అని ఉద్బోధిస్తారు నాయనా. మనవాళ్లూ తెగ తిట్టుకుని అక్కడితో అలా ఆగిపోతున్నారుగా. కాబట్టి సింగీతం వారి సిద్ధాంతం ప్రకారం అది బెటరేగా’’ ‘‘అసలిలా ఇంతగా తిట్టుకోడానికి కారణం ఏమిటంటారు? ‘‘అదేదో సినిమా డైలాగ్ ఉంది కదా నాయనా. లాస్ట్ పంచ్ మనదైతే వచ్చే కిక్కే వేరని. దాని కోసమే ఇలా తిట్టుకుంటున్నట్టుంది. కానీ వీళ్లు గ్రహించాల్సిందేమిటంటే..ఎవడికి వాడు ఇదే లాస్ట్ పంచ్ అనుకుంటాడు తప్ప..ఆ లాస్ట్ అనేది ఎప్పటికీ రాదనీ, అదో చైన్ రియాక్షన్‌లా అలా సాగిపోతూనే ఉంటుందని ఎవరూ గ్రహించడం లేదు. అయినా పర్లేదులే ఇంకెంత..జస్ట్ రెండు రోజులేగా’’ ‘‘రెండ్రోజుల్లో ఈ అసెంబ్లీ ఎన్నికలు ముగుస్తాయి సరే..ముందుంది మొసళ్లపండగ అన్నట్టు..మున్ముందు ఎంపీ ఎలక్షన్లూ, ఆ పైన స్థానిక ఎన్నికలూ, అటు తర్వాత మున్సిపల్ ఎన్నికలూ..ఇలా ఎలక్షన్లూ, తిట్లూ ఎప్పటికీ ముగిసేవి కాదు స్వామీ. ఏం జరిగితే అవి ఆగుతాయో తెలియడం లేదు’’ బెంగగా అన్నాడు శిష్యుడు.‘‘అందుకే నాకనిపిస్తోంది నాయనా..బాంబులకు ఉన్నట్టే... బూతులకూ జామర్ కనుగొంటే బాగుండు’’ అంటూ తాను దిగులు పడ్డారు స్వామీ ఎలక్షనానంద. -
గ్రేటర్ కిరీటం ఎవరికో?
అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతున్న హైదరాబాద్ ఓటర్లు ఈ ఎన్నికల్లో ఎవరికి పట్టం కడతారనేది ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ జిల్లా పరిధిలోకొచ్చే కోర్‌సిటీలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాలైన మలక్‌పేట, నాంపల్లి, కార్వాన్, చారి్మనార్, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురాల్లో ఎంఐఎం గెలుపును ఇప్పటివరకు నిలువరించిన వారే లేరు. ఇప్పటికీ అదే పరిస్థితి కాగా, ఈసారి నాంపల్లిలో పాగా వేసేందుకు కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈసారి యాకుత్‌పురాలో ఎంబీటీ నుంచి ఎంఐఎంకు గట్టి పోటీ ఎదురవుతోంది. గోషామహల్లో ఈసారి బీజేపీని ఓడించాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. నగరంలో జరిగిన అభివృద్ధి పనులు బీఆర్ఎస్ అభ్యర్థులకు కలిసివచ్చేలా ఉండగా.. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, గృహలక్ష్మి తదితర ప్రభుత్వ పథకాలు అందని పేద, మధ్యతరగతి ప్రజలు, నిరుద్యోగులు బీఆర్ఎస్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అది కాంగ్రెస్ అనుకూలంగా మలచుకొని పైచేయి సాధించాలని భావిస్తోంది. ఆ ట్రిక్‌తో కాంగ్రెస్ గెలుస్తుందా? లేక బీఆర్ఎస్ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొడుతుందా? అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆరు నియోజకవర్గాలు గ్రేటర్లో కలసి ఉన్నాయి. ఇక్కడ వివిధ రాష్ట్రాలకు చెందిన వారు, విభిన్నవర్గాలు, మతాల వారు ఉండటం, అభ్యర్థులూ ఆర్థికంగా సంపన్నులు కావడం ఈ నియోజకవర్గాల్లో విశేషం. వీరిలో ఇద్దరు అభ్యర్థులు బీఆర్ఎస్లో టికెట్లు రానందున కాంగ్రెస్‌లో చేరి పోటీ చేస్తున్నారు. అట్టడుగువర్గాల కూలీల నుంచి ఆకాశహర్మ్యాల సంపన్నుల వరకు ఓటర్లున్న మినీ దేశంలాంటి గ్రేటర్ హైదరాబాద్ పొలిటికల్ సీన్‌పై గ్రౌండ్‌రిపోర్ట్. - చెరుపల్లి వెంకటేశ్ ముషీరాబాద్ ముస్లిం ఓట్లు కీలకం ఈ నియోజకవర్గంలో పోటీ ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్యే ఉంది. బీజేపీ అభ్యర్థి ప్రభావం పెద్దగా లేకపోయినా, బీజేపీ జాతీయ నేత డా.లక్ష్మణ్ స్థానిక నియోజకవర్గం కావడంతో ప్రాధాన్యం ఏర్పడింది. బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్, బీజేపీ అభ్యర్థి పూస రాజు ఇద్దరిదీ గంగపుత్ర సామాజిక వర్గం అయినందున నియోజకవర్గంలో గణనీయంగా ఉన్న ఆ వర్గం ఓట్లు చీలిపోవడం గోపాల్‌కు నష్టం కలిగించనుంది. కాంగ్రెస్ అభ్యర్థీగా బరిలో ఉన్న అంజన్ కుమార్ యాదవ్ గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోనే ఈ సెగ్మెంట్ కూడా ఉండటం, నియోజకవర్గంలో గణనీయంగా ఉన్న యాదవసామాజిక వర్గం ఓట్లు ఆయనకు ఉపకరించనున్నాయి. బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మికి బీజేపీ టికెట్ రాకపోవడంతో వారి సామాజికవర్గం (కురుమ) ఓట్లు అంజన్‌కుమార్‌కు పడే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో గోపాల్‌కు భారీ మెజారిటీ రావడానికి కారణమైన ముస్లిం మైనార్టీ ఓట్లు చీలి కాంగ్రెస్ వైపు మళ్లే పరిస్థితి కూడా ఉంది. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య పోటీ తీవ్రంగా మారింది. ఉమ్మడి రంగారెడ్డి పరిధిలో.. ఎల్బీనగర్: వీరుడెవరో పెద్ద నియోజకవర్గాల్లో ఒకటైన ఇక్కడ మూడు ప్రధానపారీ్టలూ హోరాహోరీగా పోరాడుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే సు«దీర్‌రెడ్డికి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలతోపాటు ఇటీవల పరిష్కారం చూపిన నోటరీ స్థలాల రెగ్యులరైజేషన్, ప్రజలతో కలిసిపోవడం తదితర అంశాలు సానుకూలంగా ఉన్నాయి. కాంగ్రెస్‌నుంచి పోటీ చేస్తున్న మధుయాష్కీగౌడ్‌కు నియోజకవర్గంలో అధికసంఖ్యలో ఉన్న బీసీల మద్దతు ఉన్నట్టు చెబుతున్నారు. వివిధ సంఘాలు, అసోసియేషన్ల వర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలు కలిసి వస్తాయంటున్నారు. సీమాంధ్రుల ఓట్లు సైతం మధుయాష్కీకి పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బీజేపీ నుంచి రంగంలో ఉన్న సామ రంగారెడ్డి కేంద్రంలోని బీజేపీ విధానాలు, తదితరమైనవాటితో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉపకరిస్తుందని చెబుతున్నారు.దాంతోపాటు నియోజకవర్గంలో అధికసంఖ్యలో ఉన్న కార్పొరేటర్ల బలం కూడా కలిసి రాగలవని చెబుతున్నారు. గోషామహల్ గతానికి భిన్నంగా.. ఈ నియోజకవర్గం నుంచి వరుసగా రెండు పర్యాయాలు గెలిచిన బీజేపీకి చెందిన రాజాసింగ్, బీఆర్ఎస్ అభ్యర్థీగా పోటీ చేస్తున్న నందకిశోర్‌వ్యాస్ బిలాల్ నడుమ పోటీ ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ గెలిచిన ఒకే ఒక్క సీటు కూడా ఇదే కావడంతో ఈ నియోజకవర్గానికి ప్రాధాన్యం ఏర్పడింది. స్థానికంగా ఉండేది తక్కువ..ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా పర్యటిస్తారనే అభియోగంతో ఈసారి రాజాసింగ్‌కు పరిస్థితులు కొంత ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో గణనీయంగా ఉన్న మార్వాడీలతో పాటు నార్త్ ఇండియన్స్‌లోని కొన్ని వర్గాలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నాయి. హిందూ నినాదాన్ని బాహాటంగా తలకెత్తుకున్న రాజాసింగ్‌కు హిందూ వర్గ ఓట్లు భారీ స్థాయిలో పడటంతో పాటు నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న ఆయన సామాజికవర్గమైన లోధి కుటుంబాల ఓట్లూ పడే అవకాశాలున్నాయి. ఎంఐఎం ఇక్కడ పోటీ చేయడం లేదు. బీఆర్ఎస్కు ఎంఐఎం మద్దతు ఉన్నందున ముస్లింల ఓట్లు బీఆర్ఎస్కు ఉపకరిస్తాయనే అంచనాలున్నాయి. కాంగ్రెస్ ప్రభావం ఇక్కడ నామమాత్రమే. కంటోన్మెంట్ అంతు చిక్కని సెగ్మెంట్ ఈ నియోజవర్గంలో కాంగ్రెస్ నుంచి దివంగత ప్రజాగాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల, దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్యనందిత, బీజేపీ నుంచి శ్రీగణేశ్ పోటీలో ఉన్నారు. ఇటీవలి వరకు లాస్యనందితకు సాయన్న కుమార్తెగా ఉన్న సానుభూతి సానుకూలంగా ఉన్నప్పటికీ, ఇటీవల తెరపైకొచి్చన అవినీతి ఆరోపణలతో నష్టం కలిగే ప్రమాదం ఉంది. గద్దర్ అభిమానులు, వివిధ ప్రజాసంఘాల సభ్యులు వెన్నెలకు మద్దతుగా పనిచేస్తున్నారు. నియోజకవర్గంలో గణనీయంగా ఉన్న పొరుగురాష్ట్రాల ఓటర్లు, నియోజకవర్గంలో నిర్వహిస్తున్న స్వచ్ఛందసేవా కార్యక్రమాలు వంటివి తమిళుడైన బీజేపీ అభ్యర్థి శ్రీగణేశ్‌కు ఉపకరించగలవంటున్నారు. ప్రజలు ఎవరిని ఆదరిస్తారనేది ఇప్పటికీ పజిల్‌గానే ఉంది. సికింద్రాబాద్ దక్కేదెవరికో... బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మారావు బరిలో ఉన్నారు. గత రెండు పర్యాయాలు వరుసగా గెలిచి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రజలతో కలివిడిగా ఉండటం కలిసి వచ్చే అంశం. కాంగ్రెస్ నుంచి ఆదం సంతోష్‌కుమార్ పోటీ చేస్తున్నారు. ఈయన గతంలో రైల్వే శాఖలో పనిచేయడం, ఓ కారి్మక సంఘానికి నేతగా కూడా వ్యవహరిస్తున్న నేపథ్యంలో సెగ్మెంట్లో అధికసంఖ్యలో ఉన్న రైల్వే ఉద్యోగుల ఓట్లు కొంతమేర ఈయనకు పడే అవకాశాలున్నాయి. బీజేపీ అభ్యర్థీగా మేకల సారంగపాణి పోటీలో ఉన్నా పెద్దగా ప్రభావం లేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్యే పోటీ ఉంది. ఉప్పల్ పార్టీ గుర్తులే బలం బీఆర్ఎస్ సిట్టింగ్‌లకు టికెట్ ఇవ్వని నియోజకవర్గాల్లో ఇదొకటి. ఎమ్మెల్యేగా ఉన్న భేతి సుభాష్డ్డికి కాకుండా బండారి లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వడంతో అసంతృప్తి ఏర్పడింది.పార్టీ అధిష్టానం నచ్చజెప్పడంతో సర్దుకున్నట్లే పైకి కనిపిస్తోంది. ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో గట్టెక్కే పరిస్థితులున్నాయి. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన రాగిడి లక్ష్మారెడ్డి, సోమశేఖర్‌రెడ్డిలకు కాకుండా పరమేశ్వర్‌రెడ్డికి టికెట్ లభించింది. దాంతో, వారిద్దరూ బీఆర్ఎస్లో చేరడంతో ఆపారీ్టకి ప్లస్‌గా మారింది. పరమేశ్వర్‌రెడ్డికి గతంలో కార్పొరేటర్‌గా పనిచేసిన అనుభవముంది. ప్రస్తుతం ఆయన భార్య రజిత కార్పొరేటర్‌గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుతో మాత్రమే గెలవాల్సిన పరిస్థితి. ప్రచారం మాత్రం జోరుగా చేస్తున్నారు. బీజేపీ నుంచి పోటీచేస్తున్న ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం, కేడర్, కొంతమేర ఓటు బ్యాంకు ఉంది. అవి ఆయనకు ఉపకరించే అంశాలు.ఈ నేపథ్యంలో మూడుపారీ్టల మ«ధ్యే పోటీ ఉంది. శేరిలింగంపల్లి హేమాహేమీల బరి రాష్ట్రంలోనే అత్యధికసంఖ్యలో ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ హ్యాట్రిక్ కోసం కృషి చేస్తుండగా, కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న జగదీశ్వర్‌గౌడ్ మొన్నటి వరకు బీఆర్ఎస్లో ఉన్నారు. నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు, ప్రజలకు అందుబాటులో ఉండటం, నియోజకవర్గంలో గణనీయంగా ఉన్న సెటిలర్ల ఓట్లతో గెలుపు ఖాయమనే ధీమాలో గాంధీ ఉన్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న జగదీశ్వర్‌గౌడ్, ఆయన భార్య పూజిత ఇద్దరూ సిట్టింగ్ కార్పొరేటర్లుగా ఉండటం వారికి కలిసివచ్చే అంశం. సుదీర్ఘకాలంగా కార్పొరేటర్‌గా ఉన్న తన పనితీరు, వివాదాల్లేకపోవడం, మార్పు కోరుకుంటున్న ప్రజలు .. తదితర అంశాలు కలిసిరాగలవని భావిస్తున్నారు. బీజేపీ నుంచి బరిలో దిగిన రవికుమార్‌యాదవ్ తండ్రి కాంగ్రెస్ నుంచి గతంలో ఓమారు ఎమ్మెల్యేగా, శేరిలింగంపల్లి మున్సిపాలిటీగా ఉన్నప్పుడు చైర్మన్‌గానూ వ్యవహరించారు. దాంతో వారి మద్దతుదారులూ ఉన్నారు. బీజేపీ విధానాలు తనను గెలిపిస్తాయని రవికుమార్ విశ్వసిస్తున్నారు. మొత్తానికి ఇక్కడ ముక్కోణపు పోటీ కనిపిస్తోంది. అంబర్‌పేట జైకొట్టేదెవరికో ? బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, బీజేపీ అభ్యర్థీగా టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన సి.కృష్ణయాదవ్ మధ్య పోటీ ప్రధానంగా ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి రోహిణ్‌రెడ్డి కోరుకున్న నియోజకవర్గం ఖైరతాబాద్ కాగా ఇక్కడ టికెట్ ఇవ్వడంతో ప్రజల్లోకి వెళ్లేందుకు తగిన సమయం లభించలేదు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్థానిక నియోజకవర్గం కావడంతో ఆయన ఓటు బ్యాంకు బీజేపీకి లాభం చేకూర్చనుంది. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, మైనార్టీల ఆదరణ బీఆర్ఎస్కు ఉపకరించనున్నాయి. రెడ్డి సామాజిక ఓట్లు రోహిణ్‌రెడ్డికి అధికసంఖ్యలో పడే అవకాశముంది. మైనార్టీలను కూడా తన వైపు మళ్లించుకోగలిగితే పుంజుకోవచ్చు. ఈ నియోజకవర్గంలో బీజేపీ గెలుపు కిషన్‌రెడ్డికి సవాల్‌గా మారింది. ఖైరతాబాద్ వరించేదెవరినో ? కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. సిట్టింగ్‌కు తిరిగి అవకాశం ఇవ్వవద్దని భావిస్తున్న ఓటర్లు కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతోపాటు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న విజయారెడ్డికి నియోజకవర్గంలో తన తండ్రి పీజేఆర్ అభిమానుల అండదండలున్నాయి. బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న దానం నాగేందర్ సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో మౌలిక సదుపాయాలపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. నాగేందర్‌కు నియోజకవర్గంలో ఉన్న బలం, తదితరమైనవి సానుకూలాంశాలుగా ఉన్నాయి. బీజేపీ నుంచి చింతల రామచంద్రారెడ్డి పోటీలో ఉన్నా పెద్దగా ప్రభావం లేదు. పేదలు, సంపన్నులు రెండు వర్గాల ప్రజలూ అధికంగానే ఉన్న ఈ నియోజకవర్గంలో ఎవరిని గెలిపిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. జూబ్లీహిల్స్ విజేత ఎవరో ? కాంగ్రెస్ నుంచి మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పోటీ చేస్తుండగా, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మూడో పర్యాయం పోటీ చేస్తున్నారు. ఇక్కడ మైనార్టీ ఓట్లు అధికసంఖ్యలో ఉండటం వల్ల అవి అజారుద్దీన్‌కు పోలవుతాయనే అంచనాలున్నాయి. బీఆర్ఎస్ చేపట్టిన పలు కార్యక్రమాలతోపాటు ముస్లింలను ప్రభావితం చేసే ఎంఐఎం మద్దతు బీఆర్ఎస్కుండటం కలిసి వచ్చే అంశం. ఎంఐఎం అభ్యర్థి బరిలో ఉన్నా.. అది కాంగ్రెస్ ఓట్లను చీల్చడానికి ఉపకరిస్తుందనే వ్యూహంతో పోటీలో నిలిపారనే అభిప్రాయాలున్నాయి. బీఆర్ఎస్కు చెందిన మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌తోపాటు కొందరు కార్పొరేటర్లకు మాగంటికి మధ్య పొసగకపోవడంలేదు. అది బీఆర్ఎస్కు నష్టం కలిగించనుంది. 2014 ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థిగా రెండోస్థానంలో, గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా మూడోస్థానంలో నిలిచిన నవీన్‌యాదవ్ కాంగ్రెస్‌లో చేరడం ఆపారీ్టకి ఉపకరిస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది ఉత్కంఠ రేపుతోంది. కూకట్పల్లి ఓటర్లు ఎటువైపో ? బీఆర్ఎస్, కాంగ్రెస్, జనసేనలు పోటీలో ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కృష్ణారావుకు ప్రభుత్వ సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండటం వంటివి కలిసి వచ్చే అంశాలుగా చెబుతున్నారు. మొన్నటి వరకూ బీఆర్ఎస్లో ఉండి శేరిలింగంపల్లి టికెట్ ఆశించిన బండి రమేశ్ కాంగ్రెస్‌లో చేరి పోటీకి దిగారు. నియోజకవర్గానికి కొత్త. క్షేత్రస్థాయి రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేదని స్థానికులంటున్నారు. నియోజకవర్గంలో అధికసంఖ్యలో ఉన్న కమ్మ సామాజిక, సెటిలర్ల ఓట్లపై నమ్మకం పెట్టుకున్నట్లు తెలుస్తోంది.జనసేన నుంచి పోటీ చేస్తున్న ప్రేమ్‌కుమార్ సైతం తన సామాజిక వర్గం కాపుల ఓట్లు, బీజేపీ బలం తనకు ఉపకరిస్తాయనే నమ్మకంతో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్, జనసేలకు చీలిపోయే పరిస్థితులున్నాయి. అది బీఆర్ఎస్కు ఉపకరించే పరిస్థితులున్నాయి. సనత్‌నగర్ మంత్రి హ్యాట్రిక్ కొట్టేనా ? బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఇక్కడి నుంచి ఇప్పటికే రెండు పర్యాయాలు గెలిచి నియోజకవర్గంపై పట్టు సాధించారు. ఈసారి హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉన్నప్పటికీ, ప్రత్యర్థులు కూడా హోరాహోరీగా పోరాడుతున్నారు. కాంగ్రెస్ నుంచి ఏఐసీసీ మీడియా సెల్ చైర్మన్ పవన్‌ఖేరా భార్య కోట నీలిమ పోటీలో ఉండగా, బీజేపీ నుంచి మర్రి శశిధర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. గతంలో ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన శశిధర్‌రెడ్డికి ఉన్న స్థానిక బలం, కేంద్రంలోని బీజేపీ విధానాలు, మోదీ క్రేజ్ ఆయనకు ఉపకరించనున్నాయి. కోట నీలిమ.. తలసాని టార్గెట్‌గా మంత్రి చేసింది తక్కువ.. ప్రచారం ఎక్కువంటూ ప్రజల ముందుకెళ్తున్నారు. నెమ్మదిగా ఆమె పుంజుకుంటున్నారు. దీంతో పోటీ పెరిగింది. ఇంటింటికీ ప్రచారానికి వెళ్లడం తదితరమైనవి తలసానికి కలిసి వచ్చే అంశాలుగా ఉన్నాయి. ముగ్గురూ ఎవరి వ్యూహాలతో వారు పోరాడుతున్నారు. మల్కాజిగిరి ఇద్దరికీ సవాల్ ఇక్కడ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తుండగా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి హన్మంతరావు తన కొడుక్కి కూడా టికెట్ కావాలనే పంతంతో బీఆర్ఎస్ను వీడారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరికీ సవాల్‌గా మారిన నియోజకవర్గంలో బీజేపీ నుంచి ఎన్.రామచంద్రరావు బరిలో నిలిచారు. మంత్రి మల్లారెడ్డికి సైతం ఈ నియోజకవర్గం ప్రతిష్టాత్మకంగా మారింది. అభ్యర్థీని అధికారికంగా ప్రకటించక ముందునుంచే ప్రచారం చేపట్టడంతో బీఆర్ఎస్ ముందంజలో ఉంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నువ్వా.. నేనా ? అన్నట్టు పోరాడుతున్నాయి. కుత్బుల్లాపూర్ గెలుపెవరిదో ? ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌గౌడ్‌కు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఉపకరించనున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతతోపాటు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, నియోజకవర్గంలో రెడ్డి సామాజికవర్గ మద్దతుతో తాము గెలవగలమని కాంగ్రెస్ అభ్యర్థి కొలన్ హన్మంతరెడ్డి వర్గీయులు భావిస్తున్నారు. బీజేపీ బీసీ నినాదంతో కేంద్రంలోని మోదీ విధానాలతో ప్రజలు తమను గెలిపిస్తారని బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్ అనుయాయులు చెబుతున్నారు. మూడు పార్టీలూ వేటికవిగా హోరాహోరీ ప్రచారం చేస్తున్నాయి. ప్రజా సమస్యలు పట్టించుకోవాలి ధరణి వల్ల ఎన్నో సమస్యలున్నాయి. అసలైన భూయజమానులు కార్యాలయాల చుట్టూ తిరిగినా పట్టించుకునేవారు లేరు. కోవిడ్ తరుణంలో మూడునెలల కరెంట్ బిల్లులు ఒకసారి జారీ చేసి వెంటనే కట్టకపోతే కనెక్షన్ కట్‌చేస్తామని బెదిరించారు. ఉచిత నీటి సరఫరా అనేది పేరుకు మాత్రమే. మా అపార్ట్‌మెంట్‌కు అది అమలవడం లేదు. –సాయిచందర్ రామ్‌కోఠి, నగర వ్యాపారి, ఖైరతాబాద్ పనిచేసే వారిని ప్రోత్సహించాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలు బాగున్నాయి. సనత్‌నగర్ నియోజకవర్గంలో కూడా చాలా అభివృద్ధి జరిగింది.పనులు చేసే వాళ్లను గెలిపిస్తే మరింత ఉత్సాహంగా పనులు చేస్తారు. –ధనుంజయ, చిరువ్యాపారి, సనత్‌నగర్ -
ఇచ్చింది ఎంత? పంచేది ఎంత?
హైదరాబాద్: రెండు రోజుల్లో జరగనున్న ఎన్నికలకు ప్రధాన పార్టీల పోల్ మేనేజ్మెంట్ తుది దశకు చేరింది. వివిధ రకాల ప్రలోభాలతో ఓటర్లను ఆకట్టుకొనేందుకు అభ్యర్థులు, వారి అనుచరులు తాయిలాలకు తెరలేపారు. అదే సమయంలో మద్యం, నగదు పంపిణీలో పలుచోట్ల కింది స్థాయి నాయకులు, కార్యకర్తల మధ్య ఘర్షణలు, ఆందోళనలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల ఒక్కో ఓటర్‌కు రూ.3000 నుంచి రూ.5000 వరకు నగదు, రెండు మద్యం బాటిళ్ల చొప్పున అభ్యర్థుల నుంచి వసూలు చేసిన డివిజన్ స్థాయి నాయకులు అందులో సగం కూడా ఓటర్లకు ఇవ్వడం లేదని, దీంతో తాము పోల్మేనేజ్మెంట్లో భాగంగా ఓటర్లను కలవలేకపోతున్నామని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్ధులుఇచ్చిన డబ్బులో ద్వితీయశ్రేణి, డివిజన్ స్థాయి నాయకులే పెద్ద మొత్తంలో మింగేస్తున్నారని, దీంతో తాము ఓటర్లకు సమాధానం చెప్పకోలేని పరిస్థితి నెలకొందంటున్నారు. 48 గంటలే కీలకం.. గురువారం జరగనున్న ఎన్నికల దృష్ట్యా పోల్ మేనేజ్మెంట్కు మంగళ, బుధవారాలే ఎంతో కీలకం కానున్నాయి. మంగళవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం రాత్రి వరకు ఓటర్లకు డబ్బు, మద్యం, కానుకలు పంపిణీ చేసేందుకు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు దృష్టి సారించారు. కిందిస్థాయిలో పంపకాల్లో గందరగోళం నెలకొంది. కాలనీలు, అపార్ట్మెంట్లు, బస్తీల్లో ఉండే వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులతో నిరంతరం సంబంధాలు కొనసాగించే తాము చివరకు పంపకాల వద్ద ముఖం చాటేయాల్సి రావడం ఇబ్బందిగా ఉందని కొందరు కార్యకర్తలు చెబుతున్నారు. సగానికి తగ్గించి ఇస్తున్నారు.. ‘ప్రతిపక్షాల వాళ్లు పెద్ద మొత్తంలో పంపిణీ చేస్తున్నారంటూ అభ్యర్థుల నుంచి వారి ప్రధాన అనుచరుల నుంచి భారీగా రాబట్టుకుంటున్నారు. కానీ ఏవో ఒకటి, రెండు కాలనీల్లో పంపిణీ చేసి మిగతా కాలనీలకు మొండి చేయి చూపుతున్నారు’ అని మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన ఒక ప్రధాన పార్టీ కార్యకర్త చెప్పారు. తాము తిరిగి ప్రచారం చేసిన కాలనీల్లో పంపిణీ చేయాల్సిన ఓటర్ల జాబితాను రూపొందించుకొని డివిజన్ స్థాయి నాయకుల వద్దకు వెళితే సగానికి సగం తగ్గించి ఇస్తున్నారని, దీంతో జాబితాలోని పేర్ల ప్రకారం డబ్బులు అందజేయలేకపోతున్నట్లు చెప్పారు. చివరకు కొన్ని చోట్ల రూ.1000 నుంచి రూ.2000 వరకు పంపిణీ చేస్తున్నారు. కానీ అభ్యర్థుల నుంచి మాత్రం అంతకు రెట్టింపు మొత్తంలోనే వసూలు చేస్తున్నారు. ‘పార్టీ’ల్లోనూ అంతే.. ఎన్నికల ఘట్టం తుది దశకు చేరిన ప్రస్తుత తరుణంలో ఓటర్లకు మరింత చేరువయ్యేందుకు మద్యం పంపిణీ కూడా అనివార్యంగా మారింది. ఈ క్రమంలో కాలనీలు, అపార్ట్మెంట్ల వారీగా రాత్రి పూట మందు పార్టీలను ఏర్పాటు చేస్తున్నారు. కానీ చాలామంది ఓటర్లు ఇలాంటి పారీ్టలకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. ఆయా పార్టీలకు చెందిన వ్యక్తులుగా ముద్ర పడకుండా ఉండేందుకు ఓటర్లు జాగ్రత్తలు పాటిస్తుండగా అనుచరగణాలు దాన్ని అవకాశంగా తీసుకుంటున్నాయని, కార్యకర్తలకు మాత్రమే ప్రచారం అనంతరం ‘పార్టీ’లను ఏర్పాటు చేసి ఓటర్ల కోసం కేటాయించిన మద్యం బాటిళ్లను తమ అవసరాలకు వినియోగించుకుంటున్నారని పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు అక్కడక్కడా భగ్గుమంటున్నారు. పోల్ మేనేజ్మెంట్కు మరో రెండు రోజులు ఉన్న దృష్ట్యా ఈ రెండు రోజుల్లో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాల్సిందే. -
ఎన్నికలకు 2 రోజుల ముందు నుంచే బల్క్ మెసేజ్‌లు బంద్! : రాజర్షిషా
సాక్షి, మెదక్: ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్ తేదీకి 72 గంటల ముందు స్టాండింగ్ అవర్, 48 గంటల నుంచి నిశ్శబ్ద వ్యవధి ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి రాజర్షిషా తెలిపారు. సోమవారం ఐడీఓసీలోని సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 28 సాయంత్రం 5 నుంచి పోలింగ్ ముగిసే వరకు నిశ్శబ్ద వ్యవధి అమలులో ఉంటుందని, కాబట్టి రెండు రోజుల ముందే పత్రికా ప్రకటనలకు అనుమతులు పొందాలని సూచించారు. అలాగే లోకల్ ఛానళ్లతో పాటు శాటిౖ లెట్ ఛానళ్లలో కూడా ఎటువంటి రాజకీయ ప్రకటనలు చేయకూడ దని ఆదేశించారు. 28 నుంచి 30 సాయంత్రం 5 గంటల వరకు బల్క్ మెసేజ్‌లను నిషేధిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎవరైనా బల్క్ మెసేజ్‌లు పంపితే 73373 40816కు ఫోన్, లేదా వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సిబ్బందికి సౌకర్యాలు కల్పించాలి.. 30న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల విధులకు వచ్చే సిబ్బందికి అన్ని వసతులు కల్పించాలని రాజర్షిషా పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో మెదక్ జిల్లాలోని నర్సాపూర్, మెదక్ నియోజకవర్గాలకు చెందిన ఆర్ఓలు, అధికారులతో సమావేశం నిర్వహించారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లో సౌక ర్యాలు కల్పించాలని, పోలింగ్ సామగ్రి సరఫరా, పోలింగ్ సిబ్బందికి సౌకర్యాలు, భోజనాలు , వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరా, వీడియో రికార్డ్, సెక్యూరిటీ లాంటి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. పకడ్బందీగా ఏర్పాట్లు! ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని రాజర్షిషా ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. పోలింగ్ నిర్వహణ, ఓటరు గుర్తింపు కార్డులు, ఓటరు స్లిప్పుల పంపిణీ, ఈవీఎంల తరలింపు, కౌంటింగ్ ఏర్పాట్లపై సూచనలు చేశారు. అనంతరం రాజర్షిషా మాట్లాడుతూ పోలింగ్‌కు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇవి చదవండి: ప్రతి ఏడాదీ జాబ్ క్యాలెండర్! : హరీశ్‌రావు -
ప్రతి ఏడాదీ జాబ్ క్యాలెండర్! : హరీశ్‌రావు
సాక్షి, సిద్దిపేట: 'ఓటరన్న రిస్క్ తీసుకోవద్దని అంటున్నారు ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు. అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీలు సాధించిన ఆయన మరోసారి సిద్దిపేట నుంచి బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయనను ‘సాక్షి’ పలకరించింది. కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేయడం అంటే మూడు గంటల కరెంట్‌కు ఒప్పుకోవడమే అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఏడాదీ జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసి వెంట వెంటనే ఉద్యోగాలను భర్తీ చేస్తామంంటున్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అండ, ప్రజల ఆశీర్వాదంతో మరోసారి బీఆర్ఎస్సే గెలుస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో పదికి పది స్థానాలు గెలుస్తాం. తద్వారా ఈ జిల్లా పార్టీ కంచుకోటగా మరోసారి నిరూపితమవుతుంది. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారు. నాడు కాంగ్రెస్ పాలనలో పరిస్థితిని. నేడు బీఆర్ఎస్ పాలనలో పరిస్థితిని గుండె మీద చేయి వేసుకుని పరిశీలించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. నాడు కరువు, కాటకాలతో వలసల జిల్లాగా ఉన్న ఈ ప్రాంతం నేడు రెండు పంటలు పండే పచ్చని మాగాణిగా మారింది. నారాయణఖేడ్, జోగిపేట, జహీరాబాద్ ప్రాంతాల్లో వలసలు వాపస్ వచ్చా యి. కర్ణాటక సరిహద్దుల్లో ఉండడం వల్ల ప్రజలకు స్పష్టత వచ్చింది. మూడు, నాలుగు నియోజకవర్గాలకు ఆ రాష్ట్రంతో బాగా సంబంధాలుంటాయి. అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదు గ్యా రంటీలు అమలు కాలేదు. ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెనం పై నుంచి పొయ్యిలో పడినట్లు అయిందని అక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు. 8 గంటల కరెంట్ కాస్తా 3 గంటలకే పరిమితమైంది. అక్కడి రైతుబంధులు ఆపేశారు. అలాగే స్కాలర్ షిప్‌లలో కోత, తాగు నీటికి, తిండి గింజలకు ఇబ్బందే ఉంది. అక్కడి బాధలు చూసి, ప్రత్యక్షంగా తెలుసుకుని బీఆర్ఎస్కు అండగా నిలుస్తున్నారు. ► మార్పు అంటే 3 గంటల కరెంటా? కాంగ్రెస్ వాళ్లు మార్పు అంటున్నారు. 24 గంటల కరెంట్ నుంచి 3 గంటలకు తగ్గించడమే మార్పా? ప్రజల జీవన విధానం, ఆర్థిక స్థితిగతుల్లో మార్పు రావాలి. కాంగ్రెస్ దేశంలో ఎక్కడా రూ. 1000 మించి పెన్షన్ ఇవ్వడం లేదు. నాడు అధికారంలో ఉన్న ప్పుడూ ఇవ్వలేదు. నేడు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ ఇవ్వడం లేదు. తెలంగాణలో ఇస్తామనడం ఇక్కడి ప్రజలను మభ్యపెట్టడమే. ► నాన్ లోకల్స్.. కాంగ్రెస్ అధికారంలో వస్తే పైరవీకారులు, బ్రోకర్ల రాజ్యం వస్తుంది. రాహుల్, ప్రియాంక ఎన్నికల ముందే కనబడతారు. ఎన్నికల తర్వాత ఢిల్లీలో ఉంటారు. నేడు కర్ణాటకలో రాహుల్ జాడలేడు. ప్రియాంక పత్తాలేకుండా పోయింది. ప్రజలకు ఇచ్చి హామీలు అమలు చేయడం లేదు. ► కేసీఆర్ అంటే నమ్మకం! కేసీఆర్ అంటే నమ్మకం. కాంగ్రెస్ అంటే మోసం. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో రూ.400కే సిలిండర్, సౌ భాగ్యలక్ష్మి ద్వారా మహిళలకు నెలకు రూ.3వేలు, ఆసరా రూ.5వేలు, పేదలకు సన్న బియ్యం అందిస్తాం. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.15లక్షలకు పెంచుతాం. అసైన్డ్ భూములు పట్టా భూములుగా మార్చడం, గురుకులాలను డిగ్రీ కళాశాలకు అప్‌గ్రేడ్ చేస్తాం. కానీ అసైన్డ్ భూములను ప్రభుత్వం తీసుకుంటుందని దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ జిల్లా బిడ్డగా హామీ ఇస్తున్నా. ఒక్క గుంట భూమిని తీసుకోం. వాటికి పట్టాలిస్తాం. -
ప్రచారం.. నేటితో పరిసమాప్తం! ఇకపై గెలిచేవరకు మూగనోమే..
సాక్షిప్రతినిధి, వరంగల్: సార్వత్రిక ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఎన్నికల నోటిఫికేషన్‌నుంచే అభ్యర్థులు ప్రచారం చేస్తున్నా.. ఈ నెల 15న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ప్రచారం ఊపందుకుంది. 20వ తేదీ నుంచి ఉమ్మడి వరంగల్‌కు అగ్రనేతలు వరుసకట్టడంతో ప్రచారం పతాకస్థాయికి చేరింది. అభ్యర్థుల గెలుపు కోసం ప్రధాన పార్టీల క్యాంపెయినర్లు, అగ్రనేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. విజయమే లక్ష్యంగా అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు చెమటోడ్చారు. రోజూ నేతల రోడ్‌షోలు, సమావేశాలు, మైక్‌ల మోతలతో ఉమ్మడి జిల్లా హోరెత్తింది. ప్రచారం ముగింపునకు ఒక్కరోజు ముందుగానే అగ్రనేతలు పోటెత్తారు. సోమవారం భారత ప్రధాని నరేంద్రమోదీ మహబూబాబాద్‌లో, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ పరకాలలో, టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, డోర్నకల్ నియోజకవర్గంలో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఏటూరు నాగారంలో రోడ్‌షోలు, సభలు నిర్వహించారు. ప్రముఖుల రాకతో ఉమ్మడి జిల్లాలో సందడి వాతావరణం నెలకొంది. సుమారు 13 రోజులపాటు ఉధృతంగా సాగిన ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు పరిసమాప్తం కానుంది. చివరి రోజు మంగళవారంన ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగసభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. ఉమ్మడి వరంగల్‌లోని 12 నియోజకవర్గాల్లో ప్రచారం ముగింపు తర్వాత ప్రధాన పార్టీల అభ్యర్థులు, నాయకులు వ్యూహరచనలో నిమగ్నం కానున్నారు. నోటిఫికేషన్ తర్వాత విస్తృతంగా నియోజకవర్గాల్లో పర్యటించినప్పటికీ ప్రతికూల పరిస్థితులున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పోల్ మేనేజ్మెంట్పై నజర్ పెట్టిన ప్రధాన పార్టీలు ఓటర్లను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహాలు అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. మద్యం షాపులు మూడు రోజులు బంద్! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మూడు రోజులు మద్యం షాపులు బంద్ చేయనున్నట్లు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం సాయంత్రం 5 నుంచి గురువారం సాయంత్రం 5 గంటల వరకు మద్యం షాపులు బంద్ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మద్యం అక్రమంగా విక్రయిస్తే చర్యలు తీసుంటామని హెచ్చరించారు. ఇవి చదవండి: ఎన్నికలకు 2 రోజుల ముందు నుంచే బల్క్ మెసేజ్‌లు బంద్! : రాజర్షిషా -
నల్లగొండలో కోమటిరెడ్డి, భూపాల్‌రెడ్డి మధ్యే కీలక పోరు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన పోలింగ్‌కు గడువు దగ్గరపడింది. 30న ఉదయం నుంచే పోలింగ్ జరగనుండగా.. అభ్యర్థుల పోల్ మేనేజ్మెంట్కు సమయం రెండు రోజులు ఉంది. మంగళవారం సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. 29వ తేదీన కూడా సభలు సమావేశాలు మినహా ఇంటింటి ప్రచారం చేసుకునే వీలు ఉంది. అయితే ఇప్పటివరకు నిర్వహించిన ప్రచారం ఆధారంగా ఇంకా తాము ఏయే పట్టణాలు, మండలాలు, గ్రామాల్లో బలహీనంగా ఉన్నామో తెలుసుకొని పార్టీ శ్రేణులను రంగంలోకి దింపాయి. కొన్ని చోట్ల నువ్వా నేనా అన్నట్లుగా, మరికొన్ని చోట్ల త్రిముఖ పోటీ ఉంది. నల్లగొండ జిల్లాలో మూడింట సై అంటే సై ►నల్లగొండ నియోజకవర్గంలో ఇద్దరి మధ్యే పోటీ నెలకొంది. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులైన కంచర్ల భూపాల్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మధ్యే కీలక పోరు సాగుతోంది. బీజేపీ నుంచి మాదగోని శ్రీనివాస్‌గౌడ్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) పార్టీ నుంచి పిల్లి రామరాజుయాదవ్ బరిలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ సంప్రదాయ ఓట్లు బీజేపీకే పడనుండగా, ఆయన అదనంగా ఏ మేరకు ఓట్లను సాధిస్తారన్నది పోలింగ్ రోజే తేలనుంది. మరోవైపు పిల్లి రామరాజుయాదవ్ యాదవ సామాజికవర్గంతోపాటు బీసీల ఓట్లు తనకు పడేలా ప్రయత్నిస్తున్నారు. ఈయన చీల్చే ఓట్లు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపోటముల్లో ప్రధానం కానున్నాయి. ► నకిరేకల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య, కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం మధ్య హోరాహోరీగా పోటీ సాగుతోంది. ఇక్కడ చేసిన అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని బీఆర్ఎస్ అభ్యర్థి ధీమాగా ఉండగా, కాంగ్రెస్ పార్టీకి ఉన్న జోష్, మాజీ ఎమ్మెల్యేగా తనకున్న వ్యక్తిగత అనుచరవర్గ బలంతో గెలుపు సాధిస్తానన్న ధీమాతో కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు. ► నాగార్జునసాగర్‌లోనూ ఇద్దరి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జైవీర్‌రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ కేడర్, తన తండ్రి జానారెడ్డి చరిష్మా తనను కచ్చితంగా గెలిపిస్తుందన్న ధీమాలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ నియోజవర్గ అభివృద్ధికి తాను తీసుకుకొచి్చన నిధులు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలే తనను గెలిపిస్తాయనే నమ్మకంతో ఉన్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ బీజేపీ, ఇతర పార్టీలు భారీ ప్రభావం చూపుతాయన్న అంచనాలు లేవు. మిర్యాలగూడ, మునుగోడు,దేవరకొండలో ట్రయాంగిల్ ► మిర్యాలగూడలో బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావు తాను చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వ్యక్తిగతంగా తమకున్న పట్టుతో గెలుస్తానని భావిస్తుండగా, కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి కూడా తన వ్యక్తిగత చరిష్మా, పార్టీ వేవ్ పైనే ఆధార పడ్డారు. ఇదే నియోజకవర్గం నుంచి మూడుసార్లు గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే, సీపీఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి తన వ్యక్తిగత చరిష్మాతోపాటు పార్టీకి ఉన్న బలంతో గెలుస్తానన్న ధీమాలో ఉన్నారు. ► మునుగోడులో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డి మధ్య పోరు నెలకొంది. ఉప ఎన్నికల తరువాత సీఎం ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గంలో చేపట్టిన చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని బీఆర్ఎస్ అభ్యర్థి భావిస్తుండగా, నియోజకవర్గంలో తనకున్న వ్యక్తిగత చరిష్మా, కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్రేజ్ తనను గెలిపిస్తుందని కాంగ్రెస్ అభ్యర్థి భావిస్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. బీజేపీ సంప్రదాయ ఓట్లతోపాటు ఆయన చీల్చే ఇతర ఓట్లే ఈ ఎన్నికల్లో అక్కడ ప్రధానం కాబోతున్నాయి. ► దేవరకొండలో కాంగ్రెస్ అభ్యర్థి బాలునాయక్, బీఆర్ఎస్ అభ్యర్థి రవీంద్రకుమార్ మధ్య ప్రధాన పోటీ ఉండగా, బీజేపీ అభ్యర్థి కేతావత్ లాలూ నాయక్ గట్టి పోటీ ఇస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. యాదాద్రిలో ముక్కోణం ► భువనగిరి నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. భువనగిరిలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి తాను చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపైనే ఆశ పెట్టుకోగా, కాంగ్రెస్ పార్టీ నుంచి కుంభం అనిల్ కుమార్‌రెడ్డి తమ పార్టీకి ఉన్న వేవ్ పైనే ఆశ పెట్టుకున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళుతూ గెలుపొందాలని భావిస్తున్నారు. ► ఆలేరు నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే గత పదేళ్లలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తనను మూడోసారి గెలిపిస్తాయన్న నమ్మకంతో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల అయిలయ్య.. పార్టీ జోష్, ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని భావిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి పడాల శ్రీనివాస్ కూడా ప్రభుత్వ వ్యతిరేకతతోపాటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను తనను గెలిపిస్తాయన్న నమ్మకంతో ఉన్నారు. -
పొత్తులో కత్తులు! బీజేపీ, జనసేనల మధ్య వాగ్వాదం..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భారతీయ జనతా పార్టీ, జనసేన మధ్య నెలకొన్న ఎన్నికల పొత్తులో కత్తులు విచ్చుకున్నాయి. ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు తనకు సహకరించడం లేదని జనసేన అభ్యర్థి ఆరోపణలు చేశారు. ప్రచారం ముగియడానికి సరిగ్గా ఒక్కరోజు ముందు చేసిన ఈ ఆరోపణలు ఇరు పార్టీ వర్గాల్లో సంచలనంగా మారాయి. జనసేన జగడం.. జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో గణనీయమైన ప్రభావం చూపే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ గడిచిన ఐదేళ్లుగా వ్యూహాలు రూపొందిస్తోంది. జిల్లాలో ఐదు స్థానాల నుంచి పోటీకి సిద్ధమైంది. అయితే చివరి నిమిషంలో జనసేనతో ఎన్నికల పొత్తు కుదరడంతో కొత్తగూడెం, అశ్వారావుపేట స్థానాలు ఆ పార్టీకి కేటాయించారు. ఈ మేరకు జనసేనతో పాటు బీజేపీ అభ్యర్థుల కోసం స్టార్ క్యాంపెయినర్ పవన్‌కళ్యాణ్ జిల్లాలో ఓ ప్రచార సభలో కూడా పాల్గొన్నారు. ఇక ఒక్క రోజుతో ప్రచార పర్వం ముగుస్తుందనగా ఇరు పార్టీల మధ్య సఖ్యత లేదనే అంశం బట్టబయలైంది. అభ్యర్థిగా నామినేషన్ వేసినప్పటి నుంచీ.. బీజేపీ నాయకత్వం తనకు సంపూర్ణ సహకారం అందివ్వడం లేదంటూ కొత్తగూడెం జనసేన అభ్యర్థి లక్కినేని సురేందర్ ఆరోపిస్తున్నారు. ఇదేం పంచాయితీ..? నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో బూత్ కమిటీ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇన్‌చార్జ్‌లతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కేవీ రంగాకిరణ్ ఇంట్లో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో.. పొత్తు ధర్మం పాటించకుండా తనకు అన్యాయం చేస్తున్నారని లక్కినేని సురేందర్ ఏకంగా బీజేపీ జిల్లా నాయకత్వంపై ఆరోపణలు చేశారు. తన తరఫున బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ అగర్వాల్ ఒక్కరే ప్రచారం చేశారని, అప్పుడు ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చిందని అన్నారు. ఆ తర్వాత అగర్వాల్ బీజేపీని వీడి బయటకు వెళ్లారని, అనంతరం ప్రచారంలో బీజేపీ నేతల నుంచి తనకు సరైన సహకారం లేకుండా పోయిందని వాపోయారు. చివరకు తన తరఫున ఎవరైనా ప్రచారంలో పాల్గొన్నా వారిపై బీజేపీ జిల్లా నాయకులు ఒత్తిడి చేసి తనకు దూరం చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. పోలింగ్‌కు గడువు దగ్గర పడిన తర్వాత బూత్ కమిటీలు వేయడానికి కూడా బీజేపీ నుంచి ఎలాంటి మద్దతు లేదన్నారు. సుజాతనగర్ మండలంలో తప్ప మరెక్కడా కమలదళం నుంచి సరైన సాయం అందలేదన్నారు. పొత్తు ధర్మాన్ని అసలు పాటించకుండా తనను బలిపశువు చేశారంటూ విమర్శలు చేశారు. దబాయింపు సరికాదు! బీజేపీ పార్టీ నిర్దేశించిన లక్ష్యాలు, నిబంధనలు పాటించడంలో మేము ఎక్కడా పొరపాటు చేయలేదు. అలసత్వం వహించలేదు. పొత్తు ధర్మాన్ని పాటించడంలో పార్టీ అఽధిష్టానం నిర్ణయించిన విధివిధానాల మేరకే పని చేస్తున్నాం. కానీ జనసేన అభ్యర్థి మనసులో వేరే ఉద్దేశాలు, లక్ష్యాలు పెట్టుకుని బీజేపీపై బుదర జల్లుతున్నారు. ఇరు పార్టీల మధ్య సమన్వయం కోసం ఏర్పాటు సమావేశంలో ఆయన దబాయించినట్టుగా మాట్లాడటాన్ని, అనుచిత ప్రవర్తనను ఖండిస్తున్నా. – కుంచె వెంకట రంగాకిరణ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గ్లాసుకు పగుళ్లు.. ఎన్నికల పొత్తులో కొత్తగూడెం సీటు జనసేనకు కేటాయించిన సమయంలో ఆ పార్టీకి ఇక్కడ చెప్పుకోదగ్గ నాయకుడు లేరు. ఆ పార్టీకి జిల్లాలో సంస్థాగత నిర్మాణం లేకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. దీంతో అప్పటికే కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన లక్కినేని సురేందర్ మరోసారి కండువా మార్చి జనసేనలో చేరారు. దీంతో ఆయన ఆ పార్టీ తరఫున కొత్తగూడెం అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గత రెండు వారాలుగా ‘గ్లాసు గుర్తుకే ఓటెయ్యండి’ అని ప్రచారం కూడా చేశారు. కానీ ఇంతలోనే పరిస్థితులు తారుమారయ్యాయి. సంస్థాగత నిర్మాణం, ప్రణాళిక లేకుండా బరిలో నిలిచిన ‘గాజు గ్లాసు’లో చివరి దశలో పగుళ్లు వచ్చాయి. ఇవి చదవండి: ఓట్ల వరకే మనుషులు, ఓటర్లు.. ఆ తర్వాత అంతా ఉత్తదే! : ఆదివాసీల ఆవేదన -
కూనంనేనికే ఫార్వర్డ్ బ్లాక్ మద్దతు.. : సీపీఐ సభ్యుడు రామరాజు
సాక్షి, భద్రాద్రి/కొత్తగూడెం: కొత్తగూడెంలో మిత్రపక్షాలు బలపరుస్తున్న సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావుకే ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ సంపూర్ణ మద్దతునిస్తోందని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రామరాజు తెలిపారు. సోమవారం శేషగిరిభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఫార్వర్డ్ బ్లాక్ వామపక్ష పార్టీలు పోటీ చేసే చోట పోటీ చేయకూడదని నిర్ణయించిందని, ఇందుకు విరుద్ధంగా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సురేంద్రరెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పార్టీ నియమ నిబంధనలను ఉల్లంఘించారని, పార్టీ సభ్యత్వం లేని వ్యక్తులకు బీఫాం ఎలా కేటాయించారని ప్రశ్నించారు. నేతాజీ ఆశయాలతో పనిచేస్తున్న ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ బీ ఫామ్ వామపక్ష వ్యతిరేకికి ఇవ్వడం సరికాదన్నారు. ఫార్వర్డ్ బ్లాక్ కార్యకర్తలు కూనంనేని విజయానికి కృషి చేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పాల్గొన్నారు. ఇవి కూడా చదవండి: పొత్తులో కత్తులు! బీజేపీ, జనసేనల మధ్య వాగ్వాదం.. -
ఓట్ల వరకే మనుషులు, ఓటర్లు.. ఆ తర్వాత అంతా ఉత్తదే! : ఆదివాసీల ఆవేదన
సాక్షి, భద్రాద్రి/కొత్తగూడెం: భద్రాచలం కేంద్రంగా గిరిజన సమగ్రాభివద్ధి సంస్థ(ఐటీడీఏ) కొనసాగుతోంది. అయితే, ఐటీడీఏ పరిధిలోని భద్రాద్రి జిల్లాలో నివాసం ఏర్పర్చుకున్న ఆదివాసీ గూడేలలో అభివృద్ధి మాటేమో కానీ కనీస మౌలిక వసతులు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఐటీడీఏ ద్వారా కొంత మేర ఫలితాలు వచ్చినా నూరు శాతం గిరిజనుల సమగ్రాభివృద్ధి జరగలేదని వారి జీవన స్థితిగతలను చూస్తే తెలిసిపోతుంది. పాలకులు ఐదేళ్ల కోసారి మారుతున్నా.. ఎన్నికల వేళ ఈ గూడేలకు బారులుతీరే నాయకులు ఆ తర్వాత ముఖం చూపకపోవడంతో సమస్యలు పరిష్కారం కావడం లేదు. తొలుత ఖమ్మంలో ఏర్పాటు! 1975లో తొలుత ఖమ్మంలో ఐటీడీఏ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1979లో పాల్వంచకు మార్చా రు. ఇక 1993 ఫిబ్రవరి 9న భద్రాచలం కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటైంది. భద్రాచలం కొత్తగూడెం జిల్లా పరిధిలో 23 మండలాలు, ఖమ్మం జిల్లాలో ఐదు మండలాలు, ములుగు జిల్లాలోని రెండు మండలాలతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని రెండు మండలాలు కలిపి 9,674.42 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఐటీడీఏ పరిధి ఉంది. చట్టాలు ఉన్నా అమలేది? ఆదివాసీ, గిరిజనుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలను అమలు చేస్తున్నాయి. కానీ, అవి సమగ్రంగా అమలుకు నోచుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వం గిరిజనుల సమగ్రాభివృద్ధికి ఐటీడీఏను ఏర్పాటుచేసి దశాబ్దాలు దాటినా ఆదివాసీల జీవనంలో మార్పులు మాత్రం రాలేదు. అడవిని నమ్ముకుని జంతువుల మధ్యే జీవనం సాగించే గిరిపుత్రుల నివాసాలకు వెళ్లేందుకు కనీస దారులు లేక తాగేందుకు గుక్కెడు నీళ్లు లభించని పరిస్థితులు కనిపిస్తాయి. ఇక విద్యుత్ సౌకర్యం లేక అంధకారంలో మగ్గుతున్న గూడెంలు సైతం ఉన్నాయి. ఏళ్ల కిందట ఛత్తీస్‌గఢ్ నుంచి ఇక్కడకు వలస వచ్చిన ఆదివాసీలు స్థానికంగా నివాసం ఏర్పర్చుకున్నారు. కానీ, వీరిని ఎన్నికల సమయంలో మనుషులుగా, ఓటర్లుగా గుర్తిస్తున్న నాయకులు ఆ తర్వాత ఇటు ముఖం చూడకపోవడంతో సమస్యలు అలాగే మిగిలిపోతున్నాయి. అటవీ ఫలసాయమే ఆధారం! గూడేలలో నివాసముంటున్న ఆదివాసీలు వ్యవసాయంతో పాటు అటవీ ఫలసాయమే జీవనాధారంగా బతుకుతున్నారు. కనీస రహదారి సౌకర్యం లేక నిత్యం కిలోమీటర్ల మేర కాలినడకన నడిచి వెళ్లి సరుకులు తెచ్చుకోవాల్సిందే. వర్షాకాలంలో అయితే ఆ బాట కూడా ఉండకపోతే అనారోగ్యం ఎదురైతే దేవుడిపై భారం వేసి గడపాల్సి వస్తోంది. విద్యుత్ సౌకర్యం కోసం ఐటీడీఏ ద్వారా పలు ఆదివాసీ గ్రామాల్లో సోలార్ లైట్లు బిగించినా అందులో అత్యధికం పనిచేయడం లేదు. ఇక తాగునీరు లేక అల్లాడిపోతున్నారు. అటవీ శాఖ నిబంధనలతో బోర్లు వేయడం సాధ్యం కాక వాగులు, వంకలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈసారైనా పార్టీ అభ్యర్థులు తమ సమస్యలపై స్పష్టమైన హామీలు ఇవ్వాలని.. అప్పుడే ఓట్లు వేస్తామని ఆదివాసీలు తేల్చిచెబుతున్నారు. భద్రాద్రి జిల్లాలో.. ఇవి కూడా చదవండి: ప్రచారం.. నేటితో పరిసమాప్తం! ఇకపై గెలిచేవరకు మూగనోమే.. -
24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే.. తప్పుకుంటా: కేసీఆర్‌కు ఈటల సవాల్
సాక్షి, సంగారెడ్డి/తూప్రాన్: బీజేపీ కండువా కప్పుకున్న వారికి సంక్షేమ పథకాలు రావని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు బెదిరింపులకు పాల్పడుతున్నారని, పథకాలు మీ అయ్య జాగీరా? అని గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. ఆదివారం తూప్రాన్‌లో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభ నిర్వహించారు. బీజేపీ దుబ్బాక అభ్యర్థి రఘునందన్‌రావు అధ్యక్షతన జరిగిన సభకు ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈటల మాట్లాడుతూ.. ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యధికంగా బీజేపీ అభ్యర్థులు గెలుపొందడం ఖాయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి కాషాయ కండువా కప్పుకున్న వారికి పెన్షన్లు, రైతుబంధు, డబుల్ బెడ్రూం రాదంటున్నారు. మిస్టర్ సీఎం కేసీఆర్.. మిస్టర్ హరీశ్.. మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు మీ అయ్య జాగీరా..? అని ప్రశ్నించారు. మీరు కేవలం ప్రజల ఆస్తులకు కాపాలదారులు మాత్రమే అన్నారు. తెలంగాణ ప్రజానీకానికి సేవ చేసే జీతగాళ్లు అనే విషయం మరిచిపోతున్నారని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. రాజకీయం నుంచి తప్పుకుంటా.. కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ తమతోనే ఉద్యోగాలు, 24 గంటల విద్యుత్ సరఫరా అని మాట్లాడటం సిగ్గుచేటని ఈటల పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా అందిస్తే తాను రాజకీయల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. రాష్ట్రంలో కౌలు రైతు చనిపోతే రూ.లక్ష ఇచ్చే సోయి లేని కేసీఆర్.. పక్క రాష్ట్రాలు పంజాబ్, హర్యానాలో రైతులకు రూ.3 లక్షల చెక్కులు అందించి తెలంగాణ వ్యవసాయంలో ఆదర్శం అని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు విత్తనాలు, ట్రాక్టర్లు, పనిముట్లు తదితర వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తామని తెలిపారు. అలాగే ప్రతీ ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరికీ పెన్షన్లు అందించడంతోపాటు రైతులు సాగు చేసిన ధాన్యానికి క్వింటాల్‌కు రూ.3,500 చెల్లిస్తామని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందు జిల్లాలోని బీజేపీ అభ్యర్థులు మురళీయాదవ్(నర్సాపూర్), నందీశ్వర్‌గౌడ్(పటాన్చెరు), రాజు (సంగారెడ్డి), శ్రీకాంత్‌రెడ్డి (సిద్దిపేట), విజయ్‌కుమార్ (మెదక్) మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, నాయకులు తాళ్లపల్లి రాజశేఖర్, నందారెడ్డి, ప్రసాద్ పాల్గొన్నారు. ఇవి కూడా చదవండి: ఇదీ సెక్షన్.. తప్పదు యాక్షన్! -
TS Elections 2023: ఈసారైనా ‘కమలం’ వికసిస్తుందా.. సీపీఎంకు అవకాశం వస్తుందా?
ఉమ్మడి జిల్లా నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికీ బీజేపీ బోణీ కొట్టలేదు. ప్రతి ఎన్నికల్లో పోటీచేస్తున్నా గెలుపు దరికి చేరుకోవడం లేదు. పీడీఎఫ్ నుంచి గెలిచిన అభ్యర్థులను పక్కన పెడితే.. సీపీఐకి మూడు నియోజకవర్గాల్లోనే ప్రాతినిధ్యం దక్కింది(1962 ఎన్నికల వరకు సీపీఐ, సీపీఎం కలిసే ఉన్నాయి). సీపీఎం ఇప్పటివరకు ఏడు నియోజకవర్గాల్లో ఒక్కసారి కూడా గెలుపొంద లేదు. ఈ ఎన్నికల్లోనైనా బీజేపీ బోణీ కొడుతుందా?, సీపీఎం ఏ మేరకు పట్టు సాధిస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది. ఈసారి కాంగ్రెస్‌తో పొత్తు కారణంగా ఉమ్మడి జిల్లాలో సీపీఐ పోటీలో లేదు. – సాక్షి ప్రతినిధి, నల్లగొండ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 నియోజక వర్గాలున్నాయి. అయితే ఎన్నికలు ప్రారంభమైన నాటి నుంచి జిల్లాలో ఒక్కసారి కూడా ఏ ఒక్క నియోజకవర్గం నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం దక్కలేదు. 2004 ఎన్నికల్లో రామన్నపేట నియోజకవర్గంలో బీజేపీ నుంచి పోటీలో ఉన్నడి. మల్లేశం, 2022లో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో ఆ పార్టీ తరఫున బరిలో నిలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాత్రమే రెండో స్థానంలో నిలిచారు. మిగతా ఎవ్వరూ రెండో స్థానంలో కూడా నిలవలేదు. ఈసారి బీజేపీ అభ్యర్థులు 11 నియోజకవర్గాల్లో పోటీలో ఉన్నా గెలుస్తామా లేదా? అన్న ఆందోళన ఆ పార్టీలో నెలకొంది. ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇందులో బీజేపీ కూడా తమ అభ్యర్థులను ఎలాగైనా గెలిపించుకోవాలన్న లక్ష్యంతో జాతీయ నాయకులను రంగంలోకి దింపింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జిల్లాలో ప్రచార సభలు, సమావేశాలు, రోడ్‌షోలలో పాల్గొంటున్నారు. ఈసారైనా ఉమ్మడి జిల్లాలో బీజేపీ బోణీ చేస్తుందా.. గెలుపు కలగానే మిగులుతుందా? అన్నది త్వరలోనే తేలనుంది. ఐదు చోట్ల గెలిచిన సీపీఎం.. జిల్లాలోని 12 నియోజకవర్గాలకు గాను ఏడు చోట్ల సీపీఎం అభ్యర్థులు ఒక్కసారి కూడా గెలువలేదు. మిగతా ఐదు నియోజకర్గాల్లో మాత్రమే సీపీఎం అభ్యర్థులు పలుమార్లు గెలుపొందారు. వాటిల్లో కొన్నిసార్లు పొత్తుల్లో భాగంగా, మరికొన్నిసార్లు ఒంటరిగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల్లో ఆపార్టీ అభ్యర్థులు ఒంటరిగా బరిలో నిలిచారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీగా.. ఇక సీపీఐ(ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీగా ఉన్నప్పుడు)కి మూడు నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం దక్కలేదు. 1962 ఎన్నికల వరకు సీపీఐ, సీపీఎంలు (సీపీఐగా) కలిసే ఉన్నాయి. సీపీఐగానే ఎన్నికల బరిలో నిలిచాయి. ఉమ్మడిగా ఉన్న సమయంలో తొమ్మిది నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. కమ్యూనిస్టు పార్టీలు (సీపీఐ, సీపీఎంగా) విడిపోయాక 1967 నుంచి జరిగిన ఎన్నికల్లో సీపీఐకి మూడు చోట్ల ప్రాతినిధ్యం దక్కింది. తొమ్మిది చోట్ల ఆ పార్టీ గెలుపొందలేదు. నియోజకవర్గాల వారీగా ఇదీ పరిస్థితి.. నల్లగొండ నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన 16 ఎన్నికల్లో బీజేపీ ఒక్కసారి కూడా గెలువలేదు. నకిరేకల్ నియోజక వర్గంలో 14 సార్లు జరిగిన ఎన్నికల్లో ఒక్కసారి కూడా బీజేపీ, టీడీపీకి ప్రాతినిధ్యం లభించలేదు. మునుగోడులో బీజేపీ, టీడీపీ, సీపీఎం ఒక్కసారి కూడా గెలువలేదు. దేవరకొండ నుంచి బీజేపీ, సీపీఎం, టీడీపీకి ఒక్కసారి కూడా విజయం దరిచేరలేదు. నాగార్జునసాగర్ (పాత చలకుర్తి)లో సీపీఎం, బీజేపీలకు ఒక్కసారి కూడా ప్రాతినిధ్యం దక్కలేదు. మిర్యాలగూడలో బీజేపీ, టీడీపీ గెలువలేదు. సూర్యాపేట నియోజకవర్గంలో 15సార్లు ఎన్నికలు జరిగినా బీజేపీకి ఒక్కసారి కూడా విజయం వరించలేదు. తుంగతుర్తి నియోజకవర్గంలోనూ 13 సార్లు ఎన్నికలు జరగ్గా సీపీఐ, బీజేపీకి గెలిచే అవకాశం రాలేదు. హుజూర్‌నగర్‌లో పదిసార్లు జరిగిన ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ, బీజేపీ, టీడీపీ ఒక్కసారి కూడా గెలుపొందలేదు. కోదాడలో పది సార్లు ఎన్నికలు జరగగా.. బీజేపీ, సీపీఎం, సీపీఐ ఒక్కసారి కూడా గెలుపొందలేదు. ఆలేరులో 16 సార్లు ఎన్నికలు జరగగా.. సీపీఎం, బీజేపీలకు ప్రాతినిధ్యం లభించలేదు. భువనగిరి నియోజకవర్గంలో ఉప ఎన్నికలు సహా 17 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో సీపీఎం, బీజేపీ ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయాయి. ఇది చదవండి: Telangana Assembly Elections: ఓటరు పరిశీలనలో ఏజెంట్లే కీలకం -
Telangana Assembly Elections: ఓటరు పరిశీలనలో ఏజెంట్లే కీలకం
మిర్యాలగూడ టౌన్: పోలింగ్ కేంద్రంలో అభ్యర్థుల తరఫున ఓటరు పరిశీలనలో పోలింగ్ ఏజెంట్ల పాత్ర ఎంతో కీలకం అని చెప్పవచ్చు. పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చే ఓటర్లు బోగస్ వారా..? లేక నిజమైనా ఓటరా..? అని నిశితంగా పరిశీలిస్తారు. ఆయా పార్టీల అభ్యర్థు లు అత్యంత విశ్వాస పాత్రులుగా ఉన్నవారిని మాత్రమే ఏజెంట్లుగా నియమించుకుంటారు. నిబంధనలు ఇవే.. ► పోలింగ్ కేంద్రాల్లో గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులకు సంబధించిన పోలింగ్ ఏజెంట్లకు ప్రాధాన్య క్రమంలో కుర్చీలను వేస్తారు. ► ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రతి అభ్యర్థి తరఫున ఒక పోలింగ్ ఏజెంట్, ఇద్దరు రిలీఫ్ ఏజెంట్లను నియమించుకోవచ్చు. ► పోలింగ్ ఏజెంట్ల ఫారంలో పోటీ చేస్తున్న అభ్యర్థి లేదా అతని ఎన్నికల ఏజెంట్‌గా నియమితులైన వారికి ఏజెంట్ల పాసును జారీ చేస్తారు. ► ఒక్కో పోలింగ్ కేంద్రానికి మూడు పాసులను జారీ చేసినా ఒక్కరు మాత్రమే బూత్‌లో కూర్చోవటానికి అనుమతి ఇస్తారు. ఓటరు జాబితాను బయటకు తీసుకెళ్లేందుకు వీలు ఉండదు. ► పోలింగ్ ఏజెంట్లు ఓటరుగా నమోదై ఉండి, ఎన్నికల సంఘం ఫొటో గుర్తింపు కార్డు కూడా కలిగి ఉండాలి. ► పోలింగ్ ఏజెంట్లుగా నియమితులైన వారు ఓటింగ్ సమయానికి గంట ముందుగానే పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలి. ఆలస్యంగా వెళ్లినా అధికారులు వారి పనులను వారు కొనసాగిస్తారు. ఆలస్యం అయితే ఓటింగ్ యంత్రాల సీల్లో ఏజెంటు సంతకం చేయడం, పరిశీలన చేయలేకపోతారు. ఓటింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఈవీఎంల సీలింగ్ ప్రక్రియను పర్యవేక్షించిన తరువాతనే సంతకం చేయాలి. ► పోలింగ్ ఏజంట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్‌ఫోన్, వైర్లెస్, కార్డ్‌లెస్ పరికరాలను తీసుకెళ్లరాదు. పార్టీ కండువాలు, గుర్తులను ధరించవద్దు. ఓట్లు వేయని ఓటర్ల సంఖ్యను సూచించి వెలుపలికి పంపడం వంటివి చేయవద్దు. ► పోలింగ్ కేంద్రాల్లో జరిగే ప్రతి కదలిక, తతంగాన్ని పోలింగ్ ఏజెంట్లు నిశితంగా పరిశీలించి ఏ మాత్రం అనుమానం కలిగిన అధి కారులకు ఫిర్యాదు చేయవచ్చు. ఇది చదవండి: దాడులు, ప్రతిదాడులతో అట్టుడుకుతున్న కోస్గి.. దీనికి కారకులు ఎవరు? -
‘పేట’కు టెక్స్టైల్ పార్కు! : అమిత్ షా
సాక్షి, మహబూబ్‌నగర్/నారాయణపేట: ఈ ప్రాంతంలో అత్యధికంగా ఉన్న చేనేత కార్మికుల ఉపాధి అవకాశాలు పెంచి.. జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు నారాయణపేట జిల్లాకేంద్రంలో చేనేత కార్మికుల కోసం టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం మక్తల్‌లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి జలంధర్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకువస్తే బీసీ సీఎం అవుతారని.. రాబోయే రోజుల్లో కేంద్రంలో నరేంద్రమోదీని మరోసారి పీఎం చేద్దామంటూ ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చాక దేశంలోని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా నిధి ఏర్పాటు చేస్తామన్నారు. కార్మికులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు వారి జీవన పరిిస్థితులపై నరేంద్రమోదీ అధ్యయనం చేస్తున్నారని పేర్కొన్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతం ఏమాత్రం అభివృద్ధి చెందలేదని విమర్శించారు. మక్తల్‌లో వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రి, డిగ్రీ కళాశాలకు నోచుకోలేదని, నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారని ఎద్దేవా చేశారు. అధికార పార్టీ నాయకులు మక్తల్‌లో భూ కబ్జాలు, దాందాలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే భీమా ప్రాజెక్టును పూర్తి చేస్తామని, ఊట్కూర్ చెరువుతోపాటు జాయమ్మ చెరువుకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీలు నెరవేరాలంటే జిల్లాలోని బీజేపీ అభ్యర్థులు మక్తల్‌లో మాదిరెడ్డి జలంధర్‌రెడ్డి, నారాయణపేటలో రతంగ్ పాండురెడ్డి, కొడంగల్‌లో బంటు రమేష్‌లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీజేపీతోనే సంక్షేమ పాలన! బీజేపీతోనే ప్రజలకు సంక్షేమ పాలన అందుతుందని పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జలంధర్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ప్రజలను మోసం చేసేందుకే ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు, మక్తల్ ప్రజలు బీజేపీకి పట్టం కట్టడం ఖాయమని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచినా.. ఓడినా.. పేదలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానని, తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కోలార్ ఎంపీ మునిస్వామి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ పావని, వైస్ చైర్మన్ అఖిలారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు బాల్‌రాంరెడ్డి, తిమ్మప్ప, జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు విద్యాసాగర్, కనకరాజు, మండలాధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, మలికార్జున్, అసెంబ్లీ కన్వీనర్ కర్నిస్వామి, ఉపాధ్యక్షుడు సోంశేఖర్‌గౌడ్, నాగప్ప, కౌన్సిలర్లు కౌసల్య, సత్యనారాయణ, అర్చన, కొండయ్య, నాయకులు లక్ష్మణ్, ప్రతాప్‌రెడ్డి, శ్రీకాంత్, రాములు తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: సమయం.. సరిపోవట్లే! రోజుకు 28గంటలు ఉంటే బాగుండు! -
TS Elections 2023: ఇందిరమ్మ రాజ్యం రావాలి.. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/స్టేషన్ మహబూబ్‌నగర్/దేవరకద్ర/నారాయణపేట: ‘జిల్లా అభివృద్ధి బాట పట్టాలన్నా.. సాగునీటి ప్రాజెక్టులతోపాటు జిల్లాలోని వేలాదిమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాలన్నా ఇందిరమ్మ రాజ్యం రావాలి’ అని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఉమ్మడి జిల్లా పరిధిలోని నారాయణపేట, దేవరకద్ర విజయభేరి సభలు, మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలో క్లాక్‌టవర్ సెంటర్లో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి పాలమూరువ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని, ఆదర్శ జిల్లాగా మార్చే బాధ్యత తనదేనన్నారు. పాలమూరును పసిడి పంటలతో కళకళలాడేలా చేస్తామని, నిరుద్యోగ సమస్యను నిర్మూలించి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ వస్తే డీడీలు కట్టిన యాదవులకు గొర్రెలు ఇవ్వదని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ కన్నా మరిన్ని మంచి పథకాలు అమలు చేస్తామన్నారు. హామీలు విస్మరించి మోసం.. కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని రేవంత్ ధ్వజమెత్తారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, నియోజకవర్గానికి సుమారు లక్ష ఎకరాలకు సాగు నీరు, వంద పడకల ఆస్పత్రి ఇచ్చిండా.. మైనార్టీలు, గిరిజనులకు 12 శాతం చొప్పున రిజర్వేషన్, వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాడా, మొదటి ఎమ్మెల్సీ ఇచ్చాడా.. నారాయణపేట– కొడంగల్ పథకం పని మొదలు పెడతానని పెట్టిండా.. కృష్ణా– వికారాబాద్ రైల్వే లేన్ తెచ్చిండా అని ప్రశ్నించాడు. ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్ ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. పక్కాగా 6 గ్యారంటీల అమలు.. దేశం నుంచి నరేంద్రమోదీని పారదోలేందుకు రాహుల్‌గాంధీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర నిర్వహించారని రేవంత్ గుర్తు చేశారు. తాను పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గానికి రాహుల్‌గాంధీ ఇప్పటికే చేరుకున్నారని.. అయినా ఇక్కడున్న అరాచక శక్తులను వంద మీటర్ల గోతి తీసి పాతిపెడతానని చెప్పడానికి పాలమూరు గడియారం చౌరస్తాకు వచ్చానన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అధికారం మన చేతిలో ఉండాలని.. నిధుల కేటాయింపు మన చేతిలో ఉండాలని.. మనం సంతకం చేస్తే మన జిల్లాకు వేల కోట్లు వరదలై పారాలని.. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ పూర్తి కావాలన్నారు. వడ్డించే వాడు మన వాడు అయితే ఏ పార్టీ ఉన్నా మనకు ఇంత బువ్వ దొరుకుతుందన్నారు. ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేసి, అన్ని వర్గాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలను పట్టించుకోని బీఆర్ఎస్: మధుసూదన్‌రెడ్డి దేవరకద్ర ప్రజల సమస్యల గురించి బీఆర్ఎస్ వాళ్లు పట్టించుకోవడం లేదని నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యరి్థ, డీసీసీ అధ్యక్షుడు జి.మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. మండల కేంద్రాల్లో మెరుగైన ఆస్పత్రులు, కళాశాలలు లేవన్నారు. నియోజకవర్గ కేంద్రంలో సోయి లేకుండా ఆర్వోబీ నిర్మాణం చేసి పట్టణాన్ని రెండుగా విడగొట్టారని ధ్వజమెత్తారు. దీంతో పెద్ద వ్యాపార కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతం రూపురేఖలు కోల్పోయిందన్నారు. కనీసం అండర్‌పాస్ బ్రిడ్జి కట్టించాలనే ఆలోచన కూడా వారికి లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి మండలంలో 30 పడకలు, నియోజకవర్గ కేంద్రంలో వంద పడకల ఆస్పత్రితో పాటు డిగ్రీ కళాశాల, అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కోయిల్‌సాగర్ నీటిని మండలంలోని అన్ని గ్రామాలకు అందిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి, అరవింద్‌రెడ్డి, విజయసారథిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, నాగిరెడ్డి, శెట్టిశేఖర్, యుగంధర్‌గౌడ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ విగ్యారంటీ మాటలు.. యెన్నం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని ఆ పార్టీ మహబూబ్‌నగర్ నియోజకవర్గ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ చెప్పేవి గ్యారంటీ మాటలని, సంక్షేమ పథకాల అమలు తమతోనే సాధ్యమన్నారు. ఉమ్మడి పాలమూరులో 14 స్థానాల్లో పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మాజీ మున్సిపల్ చైర్మన్ రాధా అమర్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు వినోద్‌కుమార్, సంజీవ్ ముదిరాజ్, నాయకులు ఎన్పీ వెంకటే ష్, సురేందర్‌రెడ్డి, ఆనంద్‌గౌడ్, రాఘవేందర్‌రాజు, మధుసూదన్‌రెడ్డి, సీజే బెనహర్ తదితరులు పాల్గొన్నారు. ఇది చదవండి: TS Elections 2023: ఈసారైనా ‘కమలం’ వికసిస్తుందా.. సీపీఎంకు అవకాశం వస్తుందా? -
దాడులు, ప్రతిదాడులతో అట్టుడుకుతున్న కోస్గి.. దీనికి కారకులు ఎవరు?
కోస్గి: ఓటింగ్‌కు సమయం దగ్గర పడుతున్న కొద్ది కొడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోరు ముదురుతుంది. ముఖ్యంగా కోస్గి మండలంలో ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తలు నువ్వా నేనా అన్నట్లు కయ్యానికి కాలు దువ్వుకుంటున్నారు. ప్రచార హోరు పక్కన పెడితే ఏకంగా దాడులు, ప్రతిదాడులతో మండలంలో భయంకరమైన వాతావరణం సృష్టించడంతో ప్రజలు తీవ్ర భయందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డితో పాటు అతని కుమారుడు, అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే కుమారుడు హితీష్రెడ్డి ఎన్నికల ప్రచారం కోసం ముదిరెడ్డిపల్లి, అమ్లికుంట్లకు వెళ్లాడు. అక్కడ కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు డబ్బులు పంచడానికి వచ్చారంటూ వాహనాన్ని అడ్డుకోవడంతో వెనుదిరిగినప్పటికి అమ్లికుంట్ల, బోగారంలో రోడ్డుకు అడ్డంగా రాళ్లు వేసి వాహనాన్ని ఆపి దాడి చేశారు. వాహనం ధ్వంసమైంది. ఈ క్రమంలో అదేరోజు అర్ధరాత్రి కాంగ్రెస్ కార్యకర్త కూర నరేష్ ఓ ఫంక్షన్హాల్లో పెళ్లి డెకరేషన్ పనులు ముగించుకొని వెళ్తున్న క్రమంలో కొందరు బీఆర్ఎస్ నాయకులు అతన్ని ఆపి మూకుమ్మడిగా దాడి చేసి కారులో బలవంతంగా ఎత్తుకెళ్లి తీవ్రంగా కొట్టారు. తలపగిలి తీవ్ర గాయాలతో ఉన్న నరేష్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంలో ఇరు పార్టీల నాయకులు పెద్ద ఎత్తన ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ కార్యకర్తలు మున్సిపల్ చైర్ పర్సన్ శిరీష ఇంటికి, ఇతర నాయకుల ఇళ్లకు వెళ్లి వాగ్వా దానికి దిగారు. రేవంత్‌రెడ్డి సోదరుడు బాధితుని ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, అతని కుమారుడు హితీష్రెడ్డితోపాటు మున్సిపల్ చైర్ పర్సన్ భర్త మ్యాకల రాజేష్, కౌన్సిలర్ బాలేష్, బోరబండ కార్పొరేషన్ బాబా ఫసీయోద్దీన్, వెంకట్‌నర్సింహులు, మీర్జాపూర్ రాజేందర్‌రెడ్డి, కోనెరు సాయప్ప, అమీర్ షేక్‌పై హత్యాయత్నంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా శనివారం అర్ధరాత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి తన అనుచరులతో వచ్చి ప్రతాప్‌రెడ్డి ఫాంహౌస్‌లో నుంచి వస్తున్న క్రమంలో తనపై, తన అనుచరులపై దాడి చేసి గాయపరచడంతోపాటు తన వాహనాన్ని వెంబడించి హత్యాయత్నం చేశారని బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియోద్దీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతవారం ఏకంగా పోలీసు స్టేషన్లోనే ఇరుపార్టీల నేతలు గొడవ పడి రాళ్లతో దాడులు చేసుకోవడం, ఇరువర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తాజా దాడులు, ప్రతిదాడులతో కోస్గిలో గతంలో ఎన్నడూ లేని విధంగా కొనసాగుతున్న ఎన్నికల రణరంగంతో ప్రజలు తీవ్ర భయందోళకు గురవుతున్నారు. -
సమయం.. సరిపోవట్లే! రోజుకు 28గంటలు ఉంటే బాగుండు!
సాక్షి, మహబూబ్‌నగర్: ‘ప్రచారంలో అటు తిరిగి ఇటు వచ్చే లోగా రోజు గడిచిపోతుంది. ఏ రోజు అనుకున్న పనులు ఆ రోజు అవట్లేదు. సమయం సరిపోవడం లేదు. పోలింగ్ సమయమేమో దగ్గరపడుతోంది. రోజుకు 28గంటలు ఉంటే బాగుండు.’ ఇటీవల ఓ నాయకుడు తన అనుచరుల వద్ద చేసిన వ్యాఖ్య ఇది. ఈ ఒకట్రెండు రోజులు చెమటోడ్చి కష్టపడితే ఐదేళ్ల పాటు హాయిగా వీఐపీ హోదాలో దర్జాగా ఉండవచ్చు. శాసనసభలో ప్రధాన ప్రాత వహిస్తూ అధికార దర్పంతో హాయిగా బతకవచ్చు. కాలం కలిసి వస్తే మంత్రి పదవి రావొచ్చు. అలాంటి రాజకీయ జీవితం కోసం అభ్యర్థులు ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఓవైపు ఉష్ణోగ్రతలు పడిపోయి గ్రామాలన్నీ మంచుదప్పటి పరచుకుని ఉంటే.. అభ్యర్థులు చలిని సైతం లెక్క చేయకుండా తెల్లవారుజామునే ప్రచారం మొదలుపెడుతున్నారు. ఉదయం ఇంటి నుంచి బయల్దేరి రాత్రికి ఎప్పుడో తిరిగొస్తున్నారు. అభ్యర్థుల దినచర్య అత్యంత బిజీ షెడ్యూల్‌తో ప్రారంభమవుతోంది. అలసట, విశ్రాంతి అనే పదాలకు చోటులేకుండా ముందుకు సాగుతున్నారు. సహాయకుల పరిస్థితి అంతే.. ఒక్క నిమిషం కూడా వృథా కాకుండా అభ్యర్థులు తమ షెడ్యూల్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. కేవలం నిద్రించే సమయం తప్ప మిగతా సమయాన్ని మొత్తం ప్రచార పర్వానికే అంకితం చేస్తున్నారు. కాలంతో పరుగెడుతూ ఎన్నికల కుస్తీ పడుతున్నారు. బిజీ షెడ్యూల్‌తో అభ్యర్థులకు నెలరోజుల నుంచి కంటినిండ నిద్ర కరువైంది. గ్రామీణ ప్రజలు ఉదయమే వ్యవసాయ పనులకు వెళ్తుండటంతో వారిని కలిసేందుకు వీలైనంత త్వరగా ఇంటి నుంచి బయల్దేరుతున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వేలాది మందిని ప్రత్యక్షంగా పలకరిస్తున్నారు. ఈ సమయంలో వారి వ్యక్తిగత సహాయకుల పాత్ర కీలకమవుతుంది. నిర్దేశించుకున్న పనులను నిర్ణీత సమయానికి గుర్తు చేయడం, అందరినీ సయన్వయం చేయడం వంటి బాధ్యతలు వీరు నిర్వరిస్తున్నారు. అలా అభ్యర్థులకు సహకారం అందిస్తూ సమయాభావ సమస్యను ఎదుర్కొంటున్నారు. నెలరోజులుగా జనంలోనే.. అభ్యర్థుల ఇళ్ల వద్ద నిత్యం జనంతో కోలహలం కనిపిస్తోంది. ఉదయం నుంచే వందలాది మంది నాయకులు, కార్యకర్తలు ఆయా పార్టీల అభ్యర్థులతో మాట్లాడేందుకు క్యూ కడుతున్నారు. దీంతో నిద్రలేచింది మొదలు ప్రచారతంతు ప్రారంభమవుతోంది. కిందిస్థాయి నేతలతో మాట్లాడుతూ గ్రామాలు, మండలాల్లో పరిస్థితిపై ఆరా తీసేందుకు కొంత సయమం కేటాయించాల్సి వస్తోంది. రోజు ఏదో ఒక చోటకు వెళ్లడం దిన చర్యలో తప్పనిసరిగా మారింది. నియోజకవర్గం మొత్తం చుట్టి రావడమే లక్ష్యంగా రోజువారీ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాలకు రాకపోకల సమయంలోనూ ముఖ్యనేతలతో ఎప్పటికప్పుడు పరిస్థితులపై చర్చిస్తున్నారు. అలాగే ప్రత్యర్థి పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించేందుకు స్థానిక లీడర్ల సాయంతో కొంత సమయం కేటాయిస్తున్నారు. నియోజకవర్గానికి ఎవరైనా ముఖ్యనేతలు వస్తే జనసమీకరణ తదితర ఏర్పాట్లు చూసుకోవాల్సి వస్తోంది. ఇందుకోసం రోజులో ఎంతో కొంత సమయం కేటాయిస్తున్నారు. దిన చర్య ఇలా.. ► ఉదయం 5గంటలకు మేల్కొనడం ► 5నుంచి 6గంటల వరకు కాలకృత్యాలు తీర్చుకోవడం ► 6నుంచి 7లోగా స్నానం, టిఫిన్ చేయడం ► 7నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు గ్రామాల్లో ప్రచారం, రోడ్ షోలు, చేరికలు, సభలు, ప్రెస్మీట్లు నిర్వహించడం ► 2నుంచి 4గంటల మధ్య మధ్నాహ్న భోజనం చేయడం ► సాయంత్రం 4నుంచి రాత్రి 10గంటల వరకు సభలు, సమావేశాలు, ర్యాలీల్లో పాల్గొనడం ► రాత్రి 10గంటలకు రాత్రి భోజనం తర్వాత ముఖ్యులతో మాటామంతి ► రేపటి దిన చర్య కోసం ప్లాన్ వేసుకోవడం ఆ రోజు అన్ని పనులు పూర్తయితే నిద్రకు ఉపక్రమించడం. ఈ తతంగం ముగిసే వరకు రాత్రి 12నుంచి 2గంటలు దాటుతోంది. ఒక్కోసారి ముఖ్యనేతల బహిరంగ సభలు ఉంటే తెల్లవారుజాము వరకు మేల్కొనే ఉంటున్నారు. -
రహస్య స్నేహితులు! ‘కోవర్టు’ల కలకలం..!
సాక్షిప్రతినిధి, వరంగల్: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు సరిగ్గా మరో మూడు రోజులే ఉంది. సమయం దగ్గర పడుతున్నా కొద్దీ ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ రంగులు మారుతున్నాయి. ఉదయానికున్న సమీకరణాలు.. సాయంత్రానికి తలకిందులవుతున్నాయి. పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి నేతలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రత్యర్థి వ్యూహాలను పసిగట్టడం, ప్రచారాలు, కార్యక్రమాలపై నిఘా పెట్టడం.. ఉల్లంఘనలుంటే వాటిపై అధికారులకు ఫిర్యాదు చేయడం వంటివి ముమ్మరంగా సాగుతున్నాయి. వీటితోపాటు ప్రత్యర్థి పార్టీలో కొందరిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వారు చేసిన తప్పులను వీరికి తెలియజేసే పనిని వారికి అప్పజెబుతున్నారు. ఇందుకోసం రూ.లక్షలు ఖర్చు పెట్టడానికై నా సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఫలానా పార్టీ అనే తేడా లేకుండా అన్నింటిలోనూ ఇలాంటి పోకడలు కనిపిస్తున్నాయి. సోమవారం నుంచి ఇవి మరింత తీవ్రరూపం దాల్చనున్నాయి. కోవర్టుల కలకలం.. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడనే నానుడి ఉన్నదే. కొంతమంది నాయకుడి వెన్నంటే ఉండి.. నమ్మకంగా నటించి ఇక్కడి విషయాలను ప్రత్యర్థులకు చేరవేస్తున్నారు. సంపాదనే పరమావధిగా ఈ పని చేస్తున్నారు. నాయకులు తనవెనుక ఉండే వారిలో ఇలాంటి వారు ఉన్నారని తెలిసినా వారెవరో గుర్తించలేకపోతున్నారు. ప్రత్యర్థుల చెంత నమ్మకంగా పని చేస్తున్నవారిని నాయకులు బుట్టలోకి లాగుతున్నారు. వారి ద్వారా అక్కడ జరిగే విషయాలను తెలుసుకుంటూ ఎదుటివారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నేతల వివరాలు, సభలు, సమావేశాల్లో జరిగే ఉల్లంఘనలు, ఎన్నికల్లో ధన, మధ్య ప్రలోభాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వివరాలు తెలుసుకునేందుకు ఈ కోవర్టులు ఉపయోగపడుతున్నారు. మరికొన్ని చోట్ల ఒక్కడుగు ముందేసిన కోవర్టులు.. ఓ పార్టీకి చెందిన అభ్యర్థి ఇచ్చిన డబ్బులు పంచుతూ మరో పార్టీ అభ్యర్థికి ఓటేయమని చెబుతున్నారన్న చర్చ ఉంది. ఇందుకోసం ప్రత్యర్థులు భారీగానే ముట్టచెబుతున్నారని సమాచారం. ఏం చేశారు.. ఎవరికి పంచారు? బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు ఆయా పార్టీల అధిష్టానం పంపిన పార్టీ ఫండ్‌పై పలు నియోజకవర్గాల్లో రచ్చ జరుగుతోంది. ‘ఎవరికి ఇచ్చారు.. ఎక్కడ పంచారు?’ అంటూ బహిరంగంగానే నిలదీతల ఘటనలు వెలుగుచూస్తున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థులకు రూ.10 కోట్ల నుంచి 25 కోట్ల వరకు అందినట్లు ఆపార్టీ ముఖ్యనేతలే చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు రెండు విడతల్లో ఐదు రోజుల తేడాతో రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు అందినట్లు ఆ పార్టీవర్గాల్లో జరుగతున్న చర్చ. అలాగే బీజేపీ అధిష్టానం అభ్యర్థులను బట్టి రూ.50 లక్షల నుంచి రూ. 3 కోట్ల వరకు అందించినట్లు ఆ పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది. అర్బన్ స్థానాల్లో పోటీ చేస్తున్న కొందరికి అంతకుమించే అందించినట్లు ప్రచారం. అయితే పార్టీ కార్యకర్తలు, ఓటర్ల కోసం పంపిణీ చేయాల్సి ఉండగా.. చాలా చోట్ల వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమను పట్టించుకోవడం లేదంటూ కేడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. కొన్నిచోట్ల డబ్బుల వ్యవహారంలో అభ్యర్థుల కుటుంబాల్లో ముదిరిన ఆధిపత్యం ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయికి చేరింది. ఓవైపు అన్ని పార్టీల అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా పడరాని పాట్లు పడుతుంటే... మరోవైపు కోవర్టులు, పార్టీఫండ్, డబ్బుల పంపిణీ వివాదాలతో తలలు పట్టుకుంటున్నారు. కోవర్టులకు భారీ నజరానాలు! రహస్య స్నేహితులు(కోవర్టులు) అందించిన స మాచారాన్ని బట్టి వారికి నజరానాలు అందించేందుకు అన్ని పార్టీల ముఖ్యనేతలు, అభ్యర్థులు సిద్ధమయ్యారు. ప్రతిఫలాన్ని ఆశిస్తున్నారు. ఎన్నికల సంఘం విధించిన వ్యయ పరిమితి, ప్రచార సమయంలో అభ్యర్థి వెంట తప్పనిసరిగా వీడియో బృందం ఉంటోంది. వీటి బారి నుంచి తప్పించుకునేందుకు అభ్యర్థులంతా రహస్య పద్ధతులు అవలంబిస్తున్నారు. ఎన్నికల నిబంధనల్లో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని వివిధ వర్గాలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమయాల్లో జరిగిన ఉల్లంఘనలకు సంబంధించిన ఆధారాలతో సహా ప్రత్యర్థులకు చేరవేస్తే అందుకు తగ్గట్లుగా ప్రతిఫలం అందజేస్తున్నారు. కోవర్టుల స మాచారంతోనే ఎన్నికల సంఘాల వరకు ఫిర్యాదులు వెళ్తున్నాయి. భూపాలపల్లి, మహబూ బాబాద్, ములుగు, జనగామ, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట తదితర నియోజకవర్గాల్లో ఈ తరహా ఫిర్యాదులందాయి. పలుచోట్ల డబ్బులు తరలి స్తున్న వాహనాలు కూడా పోలీసులకు చిక్కాయి. ఇవి చదవండి: 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే.. తప్పుకుంటా: కేసీఆర్‌కు ఈటల సవాల్ -
'ఆకాంక్షలు నెరవేరుస్తాం!' : రాహుల్ గాంధీ
సాక్షి, నిజామాబాద్/కామారెడ్డి: తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న ‘ప్రజల తెలంగాణ’ కలను నిజం చేయడానికి కామారెడ్డి ప్రజలు రేవంత్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఆదివారం కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన విజయభేరి సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. రేవంత్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించడం ద్వారా తెలంగాణ ప్రజల కలలను సాకారం చేసుకుందామన్నారు. మోదీకి వ్యతిరేకంగా పోరాడితే తనపై 24 కేసులు పెట్టారని, లో క్‌సభ సభ్యత్వం రద్దు చేసి, తన ఇంటిని లాగేసుకున్నారన్నారు. రాహుల్ గాంధీ తన ప్రసంగంలో సీఎం కేసీఆర్ కుటుంబం అవినీతిపై ఫోకస్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పేపర్ లీకేజీల వరకు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంల మధ్యనున్న అనుబంధం తదితర అంశాలపై మాట్లాడారు. కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ అన్నారు. సభలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, ఏఐసీసీ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్, అర్బన్, బాన్సువాడ, ఎల్లారెడ్డి అభ్యర్థులు షబ్బీర్‌అలీ, ఏనుగు రవీందర్‌రెడ్డి, మదన్మోహన్రావు, మాజీ ఎమ్మెల్యేలు ఈరవత్రి అనిల్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి తదితరులున్నారు. ఇవి కూడా చదవండి: సమయం లేదు మిత్రమా! అభ్యర్థుల హైరానా.. -
'కారు పార్టీ' స్టీరింగ్ ఓవైసీల చేతుల్లోనే.. : రాజా సింగ్
సాక్షి, నిజామాబాద్/హైదరాబాద్: హైదరాబాద్ ఓల్డ్‌సిటీలో ఓవైసీలు టెర్రరిస్టులను పెంచి పోషిస్తూ పాతబస్తీని మినీ పాకిస్థాన్‌గా మార్చారని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిజామాబాద్ అర్బన్ బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తరఫున రోడ్‌షోలో పాల్గొని మాట్లాడారు. అంతకుముందు దుబ్బ చౌరస్తా నుంచి గంజ్ కమాన్, రైల్వే ఓవర్ బ్రిడ్జి, దేవీరోడ్, పూసలగల్లి మీదుగా గోల్ హనుమాన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గోల్ హనుమాన్ ఆలయం వద్ద ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్‌లో మాట్లాడుతూ అర్బన్‌లో సూర్య నారాయణను గెలిపించుకుంటే కేంద్రం, రాష్ట్రం నుంచి కొట్లాడి నిధులు తీసుకొస్తాడని తెలిపారు. గణేశ్ గుప్తా కమీషన్లు తీసుకుంటాడని ఆరోపించారు. దేశంలో ఉగ్ర కార్యకలాపాలు ఎక్కడ జరిగినా వాటి మూలాలు, అరెస్టులు హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడినా హైదరాబాద్‌లో అల్లర్లు కాకుండా ఓవైసీ కాళ్లు పట్టుకుంటున్నారని, వాళ్లని అడుక్కునే అవసరమేముందని ప్రశ్నించారు. ఇటీవల మధ్యప్రదేశ్ నుంచి ఎన్ఐఏ అధికారులు వచ్చి ఆరుగురు టెర్రరిస్టులను పట్టుకున్నారని, అందులో ఒకరు ఓవైసీకి చెందిన కళాశాల ప్రొఫెసర్ అని పేర్కొన్నారు. విద్యార్థులకు ఒక టెర్రరిస్టు ఏం పాఠాలు చెబుతాడని, కేవ లం టెర్రరిజం నూరిపోస్తున్నారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉగ్రవాదులకు మద్దతు తెలిపితే బుల్డోజర్లు వస్తాయన్నారు. హైదరాబాద్ తర్వాత ఎంఐఎం లక్ష్యం నిజామాబాద్ అని, ఇందూరు ప్రజలు ఆలోచించి ఓటే యాలన్నారు. కారు పార్టీ స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందన్నారు. బీఆర్ఎస్ను కాస్త బార్ అండ్ రెస్టారెంట్ సమితి (బీఆర్ఎస్)గా మార్చారన్నారు. మైనారిటీ మహిళల ఆత్మగౌరవం కోసం పీఎం నరేంద్రమోదీ ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయించారన్నారు. నగరాభివృద్ధి ఎక్కడ..? సీఎం కేసీఆర్ పెద్ద మోసగాడని, 2014లో దళితుడి ని సీఎం చేస్తానని చెప్పి చేయలేదన్నారు. గణేశ్ గు ప్తా అర్బన్‌ను రూ.1500 కోట్లతో అభివృద్ధి చేశానని చెప్తున్నాడని, ఎక్కడ ఖర్చు పెట్టావో చెప్పాలని డి మాండ్ చేశారు. కవిత లిక్కర్ స్కాంలో ఇరుక్కుందన్నారు. బీసీని సీఎం చేస్తానని ప్రకటించిందని బీజే పీ మాట నిలబెట్టుకుంటుందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, జిల్లా ఇన్‌ఛార్జి క ళ్లెం బాల్‌రెడ్డి, నాయకులు, కార్పొరేటర్లు న్యాలం రా జు, స్రవంతిరెడ్డి, పంచరెడ్డి లింగం, వనిత, నాగోళ్ల లక్ష్మీనారాయణ, శివప్రసాద్ తదితరులున్నారు. నేను గెలిస్తే హిందువులు గెలిచినట్లే.. అర్బన్‌లో తాను గెలిస్తే హిందువులందరూ గెలిచినట్లేనని బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్య నారాయణ పేర్కొన్నారు. ఓవైసీ 15 నిమిషాలు సమయమిస్తే హిందువులు లేకుండా చేస్తానని గతంలో ప్రసంగించారని గుర్తుచేశారు. దమ్ముంటే అర్బన్‌లో బీఆర్ఎస్ తరపున ప్రచారం చేయాల ని సవాల్ విసిరానని, భయపడి రాలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీకి హిందూ వ్యతిరేక శక్తులతో సత్సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక వర్గం కోసం పని చేస్తున్నాయన్నారు. ఇవి చదవండి: ఓటుకు వారు దూరమే.. -
మూడోసారీ విజయం నాదే.. : వేముల ప్రశాంత్‌రెడ్డి
సాక్షి, నిజామాబాద్: 'రెండుమార్లు బాల్కొండ నియోజకవర్గం ప్రజలు చూపిన ఆదరణతో, సీఎం కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో రూ.వేల కోట్ల నిధులు బాల్కొండ నియోజకవర్గం అభివృద్ధికి తెచ్చాను. ఆ అభివృద్ధి పనులే నా హ్యాట్రిక్ విజయానికి బాటలు వేస్తాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి, బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు. సాధారణ ఎన్నికల్లో మూడోసారి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయనతో "సాక్షి" ఇంటర్వ్యూ.' – మోర్తాడ్(బాల్కొండ) ఇంకా చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా? ► నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు చేయాల్సిన పనులు లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేశాం. 2018 ముందస్తు ఎన్నికల్లో హామీ ఇవ్వని పనులు కూడా సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో పూర్తి చేశాం. ప్రజలకు ఎలాంటి సమస్య లేకుండా చేశాం. వారు ఆశించిన దానికంటే మరెన్నో పనులు పూర్తి చేసి సమస్యలే లేని నియోజకవర్గంగా బాల్కొండను తీర్చిదిద్దాం. బాల్కొండ నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి ఏమిటి..? ► తెలంగాణ ఆవిర్భావానికి ముందు నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏ విధమైన మార్పు వచ్చిందో ప్రజలకు స్పష్టంగా తెలుసు. నియోజకవర్గంలో సాగునీటి కష్టాలు లేకుండా పెద్దవాగు, కప్పలవాగులో చెక్‌డ్యాంలను నిర్మించాం. తద్వారా భూగర్భ జలాలు వృద్ధి చెంది సాగునీటి కష్టాలు లేకుండా పోయాయి. చౌట్పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకం రెండో దశ పనులు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే పూర్తయ్యాయి. చెరువులు, కుంటల్లో పూడిక తీయించి వర్షం నీరు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. రైతులకు సాగునీటి కష్టాలు, విద్యుత్ కష్టాలు అంటూ ఏమి లేకుండా చేశాం. వ్యవసాయ పంపుసెట్లు ఎక్కువగా ఉన్న చోట గ్రామానికి ఒక విద్యుత్ సబ్‌స్టేషన్‌ను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటు చేశాం. మళ్లీ గెలిస్తే ఏం చేయాలనుకుంటున్నారు..? ► నియోజకవర్గం ప్రజలకు వారు ఆశించినదానికంటే ఎక్కువ చేశాం. మూడోసారి ఎన్నికై తే వారి జీవన ప్రమాణాలు అభివృద్ధి చెందేలా చేస్తాం. ఎవరికై నా పింఛన్లు రాకపోయినా, ఇంకా ఏదైనా సంక్షేమ పథకాలు అందకపోయినా వాటిని పక్కాగా ఇప్పించి ప్రజలకు సమస్యలు లేకుండా చూస్తాం. మిషన్ భగీరథ వైస్ చైర్మన్, మంత్రిగా ఎలాంటి అనుభూతి పొందారు? ► బాల్కొండ ప్రజలకు కృతజ్ఞతలు. వారు ఆదరించడం వల్ల అసెంబ్లీలో అడుగుపెట్టాను. నా పనిత నం మెచ్చి సీఎం కేసీఆర్ మొదటిసారి ఎమ్మెల్యేగా ఎంపికై న నాకు మిషన్ భగీరథ వైస్ చైర్మన్‌గా పెద్ద బాధ్యతలను అప్పగించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి నీరందించే పథకం బాధ్యతలను నెరవేర్చినందుకు ఎంతో తృప్తిగా ఉంది. రెండోసారి ఎమ్మెల్యేగా ఎంపిక కాగానే రోడ్లు, భవనాలు, అసెంబ్లీ వ్యవహారాలు, గృహనిర్మాణ శాఖలతో మంత్రిని చేశారు. రెండు పర్యాయాలు ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించిన సీఎంకు, అందుకు ఆదరించిన బాల్కొండ ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ► నాకు గెలుపుపై పూర్తి ధీమా ఉంది. ఎందుకంటే ఏ నియోజకవర్గంలో జరుగని అభివృద్ధి బాల్కొండ నియోజకవర్గంలో చేసి చూపించాం. గెలుపు విషయంలో బీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరు. మెజార్టీ పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో 32 వేల మెజార్టీ లభించింది. ఈసారి చేసిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలతో మరింత మెజార్టీ వస్తుందనే నమ్మకం ఉంది. బాల్కొండ ప్రజల ఆశీర్వాదంతో తప్పక మూడోసారి విజయం మాదే. ఇవి కూడా చదవండి: 'ఆకాంక్షలు నెరవేరుస్తాం!' : రాహుల్ గాంధీ -
సమయం లేదు మిత్రమా! అభ్యర్థుల హైరానా..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: 'శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు మరో రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండడంతో అభ్యర్థులు మరింత హడావుడి పడుతున్నారు.' రేపు సాయంత్రం 5 గంటలకు ప్రచారం సమాప్తం కానుండడంతో భారీ ర్యాలీలతో ప్రధాన పార్టీలు హోరెత్తిస్తున్నాయి. స్టార్ క్యాంపెయినర్లతో అభ్యర్థులు గట్టి ప్రచారం చేయించుకుంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో జాతీయస్థాయి నేతలు పలుసార్లు రావడం గమనార్హం. బీజేపీ అగ్రనేతలు పీఎం మోదీ, అమిత్‌షా, జేపీ నడ్డాలు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఉమ్మడి జిల్లా లో మూడు సార్లు ప్రచారానికి రావడం విశేషం. సీఎం కేసీఆర్ సైతం అన్ని నియోజకవర్గాల్లో స భలు పూర్తి చేశారు. దీన్ని బట్టి జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య త్రిముఖ పోరు ఏ స్థాయి లో ఉందో తెలుస్తోంది. ఇప్పటికే ప్రచారం తారాస్థాయిలో నడుస్తోంది. ఇక ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంతో పాటు కులసంఘాలతో పలుసార్లు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ వచ్చారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఇంటింటి ప్రచారం సైతం నిర్వహిస్తూ వచ్చారు. మరోవైపు సోషల్ మీడియా ద్వారా భారీ ప్రచారం నిర్వహిస్తూ వచ్చారు. సోషల్ మీడియా ప్రచారం నేపథ్యంలో ఎక్కడ చూసినా సీ నియర్ సిటిజన్ల నుంచి ప్రతిఒక్కరూ ఎవరి విశ్లేషణ వారు చేస్తున్నారు. దీంతో ఓటరు నాడి అంతుపట్టని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పార్టీలు సోషల్ ఇంజినీరింగ్ పకడ్బందీగా చేస్తూ వస్తున్నారు. సవాళ్లు.. ప్రతి సవాళ్లు.. జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు ఇందూరు గడ్డ మీ ద నుంచి సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. మరోవైపు జిల్లాలోని నియోజకవర్గాల అభ్యర్థు లు సైతం సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటూ వచ్చారు. ఒకరిద్దరు నేతలైతే పరుష పదజాలం సైతం ఉపయోగంచడంతో రాజకీయ వాతావరణం మరింత వాడివేడిగా తయారైంది. ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్ మీద ప్రత్యేంగా దృష్టి పెట్టారు. సమయం తరిగిపోతుండడంతో అ భ్యర్థులు, నాయకులు ప్రతి నిమిషాన్ని పూర్తి స్థా యిలో సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళిక తో ముందుకు వెళ్తున్నారు. ఇవి కూడా చదవండి: ‘పేట’కు టెక్స్టైల్ పార్కు! : అమిత్ షా -
ఓటుకు వారు దూరమే..
సాక్షి, నిజామాబాద్: ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లిన ప్రవాసులకు ఓటు హక్కు వినియోగించుకునే వీలు లేకుండా పోతోంది. వయోవృద్ధులు, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్, పోలింగ్ సిబ్బందికి, దేశ భద్రతను కాపాడుతున్న సైనికులకు సర్వీస్ ఓటింగ్ విధానం అమలు చేస్తున్న ఎన్నికల కమిషన్ ప్రవాసుల విషయంలో ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేకపోయింది. ఫలితంగా జిల్లాలో దాదాపు 2.90 లక్షల మంది గల్ఫ్ వలస కార్మికులతో పాటు ఇతర దేశాల్లో ఉంటున్న వారు ఓటు హక్కుకు దూరమవుతున్నారు. విదేశాల్లో ఆన్లైన్ ఓటింగ్ విధానం అమలులో ఉంది. పోలింగ్ బూత్‌కు స్వయంగా వెళ్లి ఓటు వేయని వారు ఆన్లైన్లో ఓటింగ్‌కు పాల్గొనడానికి దరఖాస్తు చేసుకుంటే ఆయా దేశాల్లో ఓటింగ్ సౌకర్యం కల్పిస్తోంది. మన దేశంలో వలస కార్మికుల కోసం ప్రాక్సీ ఓటింగ్ విధానం అమలు చేయడానికి గతంలో కసరత్తు చేశారు. సాంకేతిక కారణాలతో ఈ విధానం అమలులోకి రాకముందే స్వస్తి పలికారు. ప్రాక్సీ ఓటింగ్ విధానం అమలులోకి వచ్చి ఉంటే గల్ఫ్ దేశాల్లో ఉన్న వలస కార్మికులతో పాటు ఇతర దేశాల్లో ఉపాధి పొందుతున్న ప్రవాసులకు ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలు ఉండేది. కనీసం రానున్న స్థానిక సంస్థల, పార్లమెంట్ ఎన్నికల సమయంలోనైనా వలస కార్మికులకు ఓటు హక్కు వినియోగించుకునే వీలు కల్పించేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఇవి కూడా చదవండి: మూడోసారీ విజయం నాదే.. : వేముల ప్రశాంత్‌రెడ్డి -
జనమే మా బలం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా నేను నామినేషన్ వేసిన రోజే ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి నన్ను ఆశీర్వదించారు. ప్రియాంకాగాంధీ రోడ్డు షోకు సునామీలా వచ్చారు. దీంతో జనమే కాంగ్రెస్ బలమని నిరూపితమైంది. ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్, మరో స్థానంలో సీపీఐ గెలుస్తుంది. ఒక్క పాలేరు, ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్న నేపథ్యాన వచ్చేనెల 9న కాంగ్రెస్ పార్టీ సీఎం ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. పాలేరు ప్రజలకు భవిష్యత్‌లో ఏం కావాలో శ్రీనివాసరెడ్డికి తెలుసు, ఉపేందర్‌రెడ్డిని చూసో.. వారి బాస్‌ను చూసో నేనేం భయపడటం లేదు. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలని ప్రజలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు’ అని మాజీ ఎంపీ, కాంగ్రెస్ ప్రచార కమిటీ కోచైర్మన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పాలేరు అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొంగులేటి ఆదివారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే.. పాలేరు అక్కున చేర్చుకుంటోంది.. ప్రచారంతో పాలేరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పలుమార్లు తిరిగా. వారి కళ్లల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంతో పడిన ఇబ్బందులు కనిపించాయి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమ బాధలు తీరుతాయనే ఆనందాన్నీ చూశాను. ఏ గ్రామానికి వెళ్లినా రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాల ప్రజలు తమ బాధలను చెబుతున్నారు. తెలంగాణ తెచ్చుకుంది వీరిని బాధల్లోకి నెట్టడానికా? తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చేందుకే సోనియమ్మ రాష్ట్రాన్ని ఇచ్చింది. కానీ ప్రజల కలలను బీఆర్ఎస్ ప్రభుత్వం కల్లలు చేసింది. మేం అధికారంలోకి రాగానే పాలేరులోనే కాదు.. రాష్ట్ర ప్రజలందరి ఆకాంక్షలు నెరవేరుతాయి. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే... తెలంగాణలో ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమే. అందుకే కాంగ్రెస్ నేతల సంస్థలపై ఈడీ, ఐటీ దాడులతో భయపెట్టాలని చూస్తున్నారు. ఎవరేం చేసినా రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 75 నుంచి 78 సీట్లు తప్పకుండా వస్తాయి. డిసెంబర్ 9న ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత ఆరు గ్యారంటీలను అమలుచేస్తాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్, మా పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన సీపీఐ గెలుస్తుంది. ఉమ్మడి జిల్లాలో రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, సీపీఐ నేతల పర్యటనతో ప్రజలు ఎటువైపు ఉన్నారో తేలిపోయింది. ఈ జనసంద్రం రాష్టమంతా ఉంది. ప్రతీ కార్యకర్త కష్టపడాలి.. కార్యకర్తలు కాంగ్రెస్ జెండాను భుజాన వేసుకుని అహర్నిశలు కష్టపడి, అవమానాలను, కేసులను ఎదుర్కొన్నారు. ఎన్నికల ప్రచారానికి రెండు రోజులే సమయం ఉంది. ఆతర్వాత ఈ ప్రభుత్వాన్ని సాగనంపడమే. కార్యకర్తలు, అభిమానులు .. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు గెలుపు కోసం కృషి చేయాలి. బంధువులు, శ్రేయోభిలాషులంతా కాంగ్రెస్‌కు ఓటు వేసేలా చూడండి. వచ్చే ఐదేళ్లలో ఏ ఎమ్మెల్యేతోనూ అభద్రతాభావం ఎదురుకాదు. పార్టీ శ్రేణులను కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటాం. తాగేందుకు నీరు లేని గ్రామాలు మినరల్ వాటర్ మాదిరి తాగునీరు ఇచ్చామని బీఆర్ఎస్ నేతలు గొప్పగా చెబుతున్నారు. కానీ ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రంలో 34 నుంచి 35 శాతం పైగా గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. పాలేరు నియోకజకవర్గంలో కొన్ని గ్రామాలకు వెళ్తే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కావాలని కోరుతున్నారు. ప్రస్తుత పాలకులు ఇవన్నీ చేస్తే ఎందుకు అడుగుతారు? ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితేంటి. డ్యామ్ నెర్రెలిచ్చింది. కేంద్ర అధికారులే నివేదికలు ఇచ్చారు. ఇలా ఏ పనినీ కేసీఆర్ ప్రభుత్వం సక్రమంగా చేయలేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈ ఇబ్బందులు తీరుతాయనే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. -
'30వ తేదీన ఏముంది?' అందరికీ గుర్తుండేలా ‘స్వీప్’ హోర్డింగ్‌లు!
సాక్షి, ఆదిలాబాద్: ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేసే దిశగా ప్రజలను సన్నద్ధం చేసేందు కోసం స్వీప్ ఆధ్వర్యంలో జిల్లా అధికార యంత్రాంగం చేపట్టిన వినూత్న ప్రచారం అందరిని ఆలోచింపజేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగే తేదీని ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో పట్టణంలోని ప్రధాన కూడళ్లలో 30వ తేదీన ఏముంది.. అనే శీర్షికన స్థానిక కలెక్టర్‌చౌక్, ఎన్టీఆర్‌చౌక్, రిమ్స్ వంటి ప్రధాన కూడళ్లలో అధికార యంత్రాంగం భారీ హోర్డింగ్‌లను ఏర్పాటు చేసింది. వీటిని చూసిన ప్రతి ఒక్కరూ ఆ తేదీన ఏముందని చర్చించుకుంటూ పోలింగ్ తేదీని గుర్తు చేసుకుంటున్నారు. ఆ రోజున తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని భావిస్తుండటంతో ఈ ప్రచారానికి స్పందన లభిస్తోంది. ఇవి కూడా చదవండి: 'కారు పార్టీ' స్టీరింగ్ ఓవైసీల చేతుల్లోనే.. : రాజా సింగ్ -
కొయ్యబొమ్మకు ‘మోదీ గ్యారంటీ’
సాక్షి, ఆదిలాబాద్/నిర్మల్: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను చిత్తుగా ఓడించా లని, బీజేపీని గెలిపించాలని బీజేపీ ఆది లాబాద్ అభ్యర్థి పాయల్ శంకర్ కోరారు. వారం రోజులుగా ఆదిలాబాద్‌లో బీజేపీ పుంజుకుంటోందన్నారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల్లో వణుకు మొదలైందని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగు రోజులే సమయం ఉందని, బీసీని ముఖ్యమంత్రి చేసే బీజేపీని గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండే తోడుదొంగలన్నారు. నిజాయతీపాలన కావాలంటే బీజేపీకి ఓటు వేయాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఇస్తున్న ప్రతి రూపాయి ప్రజలకు చేరాలంటే రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలవాలన్నారు. "నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ శుభాభినందనాలు. బాసర సరస్వతీమాత చరణాలకు నా ప్రణామం. ఈ గడ్డపై పుట్టిన ఆదివాసీయోధులు కుమురంభీమ్, రాంజీగోండుకు నా నివాళులు. తన పోరాటంతో రాంజీ గోండు యువతకు ప్రేరణగా నిలిచారు.." అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ రోడ్డులో పాతక్రషర్ ఎదురుగా ఆదివారం నిర్వహించిన సకల జనుల విజయసంకల్ప సభలో ప్రధాని పాల్గొన్నారు. నిర్మల్, ముధోల్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్ అభ్యర్థులు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, రామారావుపటేల్, రమేశ్‌రాథోడ్, పాయల్ శంకర్, సోయం బాపూరావు తరఫున నిర్వహించిన ఈ ఎన్నికలసభకు భారీగా జనం తరలివచ్చారు. సభాప్రాంగణం నుంచి కనుచూపు మేరంతా జనసంద్రమే కనిపిస్తోందని, కాంగ్రెస్ సుల్తానులు, బీఆర్ఎస్ నిజాంలు ఒక్కసారి వచ్చి చూస్తే.. రాంజీగోండు ప్రేరణ, బీజేపీ గెలుపు ఖాయమన్న విషయం తెలుస్తుందని మోదీ అన్నారు. తమకు తాము రాజకీయ తీస్మార్ఖాన్ అనుకుంటున్నారో, రాజనీతి జ్ఞానిగా భావిస్తున్నారో ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూడాలని సూచించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. కేసీఆర్ ఎప్పుడో కారు స్టీరింగ్ వేరేవాళ్లకు అప్పగించి ఫామ్‌హౌస్‌కు వెళ్లి పడుకుంటున్నాడన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి అవసరమా అని ప్రశ్నించారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ కోసం ప్రజలంతా బీజేపీ వైపు నిలిచారని మోదీ చెప్పారు. కొయ్యబొమ్మకు గ్యారంటీ.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు మేడిన్ ఇండియా అన్న, మేకిన్ ఇండియా అన్న ఇష్టం ఉండదని ప్రధాని ఆరోపించారు. ఈ కారణంగానే ఘనమైన చరిత్ర కలిగిన నిర్మల్ కొయ్యబొమ్మల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిర్మల్ కొయ్యబొమ్మలకు పూర్వవైభవం తీసుకువస్తామని, ఇది మోదీ గ్యారంటీ అని స్పష్టం చేశారు. నిజామాబాద్‌లో ఏర్పాటు చేయనున్న జాతీయ పసుపుబోర్డుతో నిర్మల్ జిల్లా రైతులకూ మేలు కలుగుతుందన్నారు. ఇక్కడి పసుపురైతులు పండించే పసుపు కోసం ప్రపంచం ఎదురుచూస్తోందని తెలిపారు. కోవిడ్ తర్వాత పసుపు విలువ ప్రపంచానికి తెలిసి వచ్చిందన్నారు. వరి రైతులకు మద్దతుగా ధాన్యం క్వింటాల్‌కు రూ.3,100 చెల్లిస్తామని ప్రకటించామన్నారు. తెలుగులో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించడంతోపాటు మధ్యమధ్యలో తెలుగులో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకున్నారు. అసలు ప్రధానమంత్రి ఇంతా బాగా తెలుగు మాట్లాడగలరా.. అనేలా భాషను ఉచ్చరించారు. ‘మొదటిసారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది..’ అని అనడంతో సభలో విశేష స్పందన వచ్చింది. ‘ప్రజలను కలవని, సచివాలయానికి వెళ్లని సీఎం అవసరమా..’ అంటూ తెలుగులోనే ప్రశ్నించారు. ‘మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తి అయ్యేది..’ అని చెప్పడం, ప్రతీసారి ‘నా కుటుంబసభ్యులారా..’ అని సంబోధించడం సభికులను ఆకట్టుకుంది. సభ ఆద్యంతం ‘మోదీ.. మోదీ..’ అన్న నినాదాలతో సభాప్రాంగణం మార్మోగింది. ఎంపీ సోయం గైర్హాజరు.. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభకు ఆదిలా బాద్ ఎంపీ, బీజేపీ బోథ్ నియోజకవర్గ అభ్యర్థి సోయం బాపురావు గైర్హాజరవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆయన ఏ కారణాల వల్ల రాలేదనేది తెలియరాలేదు. ఇది చర్చనీ యాంశమైంది. మరోవైపు పార్లమెంట్ పరిధిలో ని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు, ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. నిర్మల్, ముధోల్, ఖా నాపూర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, రామారావుపటేల్, రమేశ్ రాథోడ్, పాయ ల్ శంకర్, అజ్మీరా ఆత్మారాంనాయక్ హాజరయ్యారు. అలాగే బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఉమ్మడి ఆదిలాబా ద్ జెడ్పీ మాజీ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, మాజీ మంత్రి అమర్‌సింగ్‌తిలావత్, మాజీ ఎమ్మెల్యే సుమన్‌రాథోడ్, తదితరులంతా పాల్గొన్నారు. ఇవి కూడా చదవండి: '30వ తేదీన ఏముంది?' అందరికీ గుర్తుండేలా ‘స్వీప్’ హోర్డింగ్‌లు! -
ఇదీ సెక్షన్.. తప్పదు యాక్షన్!
సాక్షి, కరీంనగర్: 'ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులను ఎన్నుకోవడానికి చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎన్నికల సమయంలో ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం ఎక్కువ కేసులు నమోదు చేస్తుంటారు. ప్రచారంలో పార్టీల అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు అదుపుతప్పి వ్యవహరిస్తే దండన తప్పదు. సామాన్య పౌరులు సైతం ఫిర్యాదు చేసినా.. పోలీసులు కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటారు. పలువురు విద్యార్థులు, యువత ఇంటర్నెట్లో ఎన్నికల చట్టాలు– నిబంధనల గురించి సెర్చ్ చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కొన్ని ఎన్నికల చట్టాలను వివరించే కథనం.' సెక్షన్ 123: జాతి, మతం, కులం, సంఘం, భాషను రెచ్చగొట్టేలా వ్యవహరించడం, ఒత్తిడికి లోను చేస్తే.. ఈ సెక్షన్ కింద ఫిర్యాదు చేయొచ్చు. 125: ఎన్నికల సందర్భంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందిస్తే మూడేళ్ల పాటు జైలు శిక్ష లేదా జరిమానా రెండింటినీ విధించే అవకాశం ఉంటుంది. 126: ఎన్నికల సమయానికి 48 గంటల ముందు బహిరంగ సభలు నిర్వహిస్తే శిక్షార్హులు. దీనికి రెండేళ్ల జైలు లేదా జరిమానా విధిస్తారు. 127: ఎన్నికల సమావేశం సందర్భంగా ఎటువంటి అల్లర్లకు పాల్పడినా.. పోలీస్ అధికారి అయినా ఆ వ్యక్తులను అరెస్టు చేయొచ్చు. ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ.2 వేల జరిమానా. 128: బహిరంగంగా ఓటేస్తే మూడు నెలల జైలు లేదా జరిమానా. 129: ఎన్నికలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది, పోలీసులు పోటీచేసే అభ్యర్థికి సహకరించినా, ప్రభావం కలిగించినా శిక్షార్హులు. దీనికిగాను 3 నెలల జైలుశిక్ష లేదా జరిమానా విధిస్తారు. 130: పోలింగ్ స్టేషన్‌కు 100 మీటర్ల లోపల ప్రచారం చేయొద్దు. ఒకవేళ చేస్తే రూ.250 జరిమానా పడుతుంది. 131: పోలింగ్ కేంద్రానికి సమీపంలో నిబంధనలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే.. ఏ పోలీస్ అధికారి అయినా ఆ సామగ్రిని స్వాధీనం చేసుకోవచ్చు. 3 నెలల జైలుశిక్ష లేదా జరిమానా, రెండూ అమలుచేయొచ్చు. 132: ఓటేసే సమయంలో నియమ నిబంధనలు పాటించనివారికి 3 నెలల జైలు శిక్ష లేదా జరిమానా. 134: అధికార దుర్వినియోగానికి పాల్పడితే శిక్షార్హులే. ఇందుకు రూ.500 జరిమానా విధిస్తారు. 134(అ): ఠాణా పరిసర ప్రాంతాలకు మారణాయుధాలతో వెళ్లడం నిషేధం. అలా వెళ్లినవారికి 2 నెలల జైలుశిక్ష, జరిమానా వేస్తారు. 135: పోలింగ్ కేంద్రం నుంచి బ్యాలెట్ పత్రం, ఈవీఎం అపహరిస్తే శిక్షార్హులు. ఏడాది పాటు జైలుశిక్ష, రూ.500 జరిమానా. 135(ఇ): పోలింగ్, కౌంటింగ్ రోజున మద్యం విక్రయించడం, మద్యం, డబ్బు ఇవ్వడానికి ఆశచూపడం నేరం. అందుకు 6 నెలల జైలుశిక్ష, రూ.2 వేల వరకు జరిమానా. 133: ఎన్నికల సందర్భంగా ఓటర్లను పోలింగ్ బూత్ వద్దకు చేరవేసేందుకు వాహనాలు సమకూర్చినా, అద్దెకు తీసుకున్నా శిక్షార్హులు. అందుకు 3 నెలల జైలుశిక్ష, జరిమానా. 135(ఆ): ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల రోజు వేతన సెలవుగా మంజూరు చేసినా శిక్ష, అందుకు రూ. 5వేల జరిమానా విధించొచ్చు. 49వీ: ఒక వ్యక్తి ఓటు మరొకరు వేస్తే పోలింగ్ ఆఫీసర్‌కు సదరు ఓటరు 49–వీ సెక్షన్ ప్రకారం తన ఆధారాలు చూపాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ సదరు ఓటరుకు ఓటు వేసే అధికారం కల్పిస్తారు. 134(అ): ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికల ఏజెంటుగా గానీ పోలింగ్ ఏజెంటుగా గానీ, ఓట్ల లెక్కింపు సందర్భంగా గానీ ఏజెంటుగా వ్యవహరిస్తే శిక్షార్హులు. అందుకు 3 నెలల జైలుశిక్ష లేదా జరిమానా. ఇవి కూడా చదవండి: కొయ్యబొమ్మకు ‘మోదీ గ్యారంటీ’ -
అరగుండు.. అరమీసం..
ఖలీల్‌వాడి(నిజామాబాద్ అర్బన్): నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీఎల్ఎఫ్ కు చెందిన ఇండిపెండెంట్ అభ్యర్థి మేత్రి రాజశేఖర్ అరగుండు, అరమీసం, అరగడ్డంతో పాటు బిచ్చగాడి వేషధారణతో శనివారం వినూత్న ప్రచారం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనల తీరు ప్రతిబింబించేలా తనీ వేషధారణతో ప్రచారం నిర్వహిస్తున్నట్లు రాజశేఖర్ తెలిపారు. ఆ పార్టీల పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు మేలుకోవాలని, ప్రజలు కండ్లు తెరవాలని అన్నారు. ప్రధాన పార్టీల మేనిఫెస్టోలోని అంశాలను ప్లకార్డుల ద్వారా ప్రదర్శిస్తూ భిక్షాటన చేశారు. కొల్లాపూర్‌లో బర్రెలక్క శిరీషపై దాడికి పాల్పడం సరైంది కాదన్నారు. ఆమెకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా మద్దతు తెల్పుతున్నట్లు చెప్పారు. యువతీ, యువకులు చట్టసభలకు రావాలన్నారు. -
ఇంతింతై.. రూ.40లక్షలై!
భద్రాచలం అర్బన్: శాసనసభ ఎన్నికల సమరంలో డబ్బు కీలకపాత్ర పాత్ర పోషిస్తుందన్నది ఎవరూ కాదనలేని అంశం! అయితే, ఎన్నికల నియమావళి ప్రకారం బరిలో నిలిచిన అభ్యర్థులు ఇష్టారీతిన డబ్బు ఖర్చు పెట్టడానికి వీలులేదు. ప్రస్తుత నిబంధనలు అనుసరించి వ్యయపరిమితి గరిష్టంగా రూ. 40 లక్షలుగా నిర్ణయించారు. అయితే ఈ వ్యయ పరిమితి తొలినాళ్లలో రూ.లక్ష మాత్రమే ఉండగా ఇంతింతై వటుడింతై అన్నట్లు ఇప్పుడు రూ.40క్షలకు చేరింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల నుంచి చూస్తే నలభై రెట్లు పెరిగినట్లయింది. నామినేషన్ రోజు నుంచే లెక్క 2014 అసెంబ్లీ ఎన్నికల సమయాన అభ్యర్థుల వ్యయ పరిమితి రూ.28 లక్షలుగా ఉండేది. ఇక లోక్‌సభ ఎన్నికల వ్యయ పరిమితిని రూ.95 లక్షలుగా నిర్ణయించారు. నామినేషన్ వేసిన రోజు నుంచి పోలింగ్ జరిగే వరకు అభ్యర్థి చేసే ప్రతీ ఖర్చును ఎన్నికల వ్యయంగానే పరిగణిస్తారు. అయితే, పార్టీ తరఫున జరిగే సభల ఖర్చును అభ్యర్థి ఖాతాలోకి తీసుకోరు. ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులు చేసే ఖర్చులన్నీ ప్రత్యేక బ్యాంకు ఖాతా ద్వారానే నిర్వహించాలి. అందుకోసం నామినేషన్ దాఖలు చేసే నాటికి కొత్త అకౌంట్ ప్రారంభించాలి. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు లేదా ప్రభావితం చేసేందుకు అభ్యర్థులు ఎలాంటి ఖర్చు చేయరాదని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. తనిఖీల్లో పట్టుబడిన నగదు, ఇతర సామగ్రి ఎవరైనా అభ్యర్థిదని తేలితే ఆ అభ్యర్థుల వ్యయంలో చేరుస్తారు. రోజువారీగా అభ్యర్థులు చేసే వ్యయంతో పాటు పార్టీ జెండాలు, బ్యానర్లు, కరపత్రాలు, పోస్టర్లు, టోపీలు, కండువాలు, భోజనాలు, వాహనాల అద్దె, ఇంధన ఖర్చులు, సభా వేదికలు, మైకులు, పత్రికలు, టీవీ, సోషల్ మీడియా ప్రకటనలకు చేసే ఖర్చులను కలిపి అభ్యర్థి ఎన్నికల వ్యయంగా లెక్కిస్తారు. వీటిలో ప్రతీదానికి బిల్లు సమర్పించాలి. అంతేకాక ఎన్నికల సంఘం నిర్దేశించిన ధరల ఆధారంగా లెక్కలు పరిగణనలోకి తీసుకుంటారు. పెరుగుతున్న వ్యయపరిమితి 1952 సాధారణ ఎన్నికల సమయాన అభ్యర్థుల వ్యయపరిమితి రూ.లక్షగా ఉండేది. ఇది 1962 నాటికి రూ.3లక్షలకు, 1971 ఎన్నికల్లోరూ.4లక్షలకు, 1975 నాటికి రూ.5 లక్షలు చేరింది. 1984లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా రూ.10 లక్షలకు చేరగా... 1991 నాటికి రూ.12లక్షలకు పెంచారు. ఆతర్వాత 1999లో రూ.15 లక్షలు, 2004 నాటికి రూ.17 లక్షలు, 2009లో రూ.26 లక్షలు, 2014లో రూ.28 లక్షల వ్యయపరిమితిని నిర్ణయించారు. ఇది ప్రస్తుత ఎన్నికల్లో రూ.40 లక్షలకు చేరుకుంది. కాగా, ఎన్నికల సంఘం అభ్యర్థుల ఖర్చును రూ.40లక్షలుగా నిర్దేశించిన అంతకు మించి ఎన్నో రెట్లు ఖర్చవుతోందని ప్రస్తుత ప్రచారం తీరును చూస్తే అర్థమవుతోందని పలువురు చెబుతున్నారు. -
కాంగ్రెస్ ముఖ్యమంత్రి తొలిసంతకం దీనిపైనే..
సాక్షి, ఆదిలాబాద్: ‘బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే.. ఈ రెండు పార్టీలకు మూడో దోస్తు ఎంఐఎం.. ఈ ఎన్ని కల్లో ఆ పార్టీలను ఓడించాలని..’ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీల స్కీంలపైనే తొలిసంతకం పెట్టడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్‌లో శనివా రం నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభకు ఆయన హాజరై మాట్లాడారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి ఎందుకు తీసుకురావాలో వివరించారు. ఆరు గ్యారంటీ పథకాలను ప్రధానంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏ ఆశయాలతో తెలంగాణ ఏర్పడిందో ఆ స్వప్నాన్ని నాశనం చేశారంటూ బీఆర్ఎస్పై ధ్వజమెత్తారు. దొరల తెలంగాణను పారదోలి ప్రజల తెలంగాణను ఏర్పా టు చేసుకుందామని పిలుపునిచ్చారు. అలాగే కేంద్రంలోని మోదీప్రభుత్వం సైతం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ప్రజల ఆశయాలను కాంగ్రెస్ నెరవేరుస్తుందని భరోసా ఇచ్చారు. పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనంతరం రాహుల్‌ను పలువురు సన్మానించారు. భారీగా జన సమీకరణ.. ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో కాంగ్రెస్ విజయభేరి సభ శనివారం నిర్వహించారు. మధ్యాహ్నం 1.40 గంటల సమయంలో రాహుల్ గాంధీ ఆదిలాబాద్ చేరుకున్నారు. నియోజకవర్గం నుంచి భారీగా జనంతరలివచ్చారు. హెలీ ప్యాడ్ నుంచి నేరుగా బహిరంగ సభస్థలికి వాహనంలో చేరుకున్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు ఎమ్మెల్సీ రాథోడ్ ప్రకాశ్, ఆదిలా బాద్ అభ్యర్థి కంది శ్రీనివాస్‌రెడ్డి, బోథ్ అభ్యర్థి ఆడె గజేందర్, సీనియర్ నేతలు గోవర్ధన్‌రెడ్డి, నరేశ్ జాదవ్, భరత్‌వాఘ్మారే, సైద్కాన్, శ్రీధర్ భూపెల్లి, సంతోశ్‌రావు, రూపేశ్‌రెడ్డి, జెడ్పీటీసీ గణేశ్ రెడ్డి, ఎస్టీ సెల్ పార్లమెంట్ కార్యదర్శి శాంతకుమారి, డేర కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సుమారు గంట పాటు సభలో ఉన్న రాహుల్ ప్రసంగం తర్వాత బయల్దేరి వెళ్లారు. మహిళ, చిన్నారిని వేదికపైకి పిలిచి.. రాహుల్ తన ప్రసంగం మధ్యలో ఆరు గ్యారంటీ ల స్కీంలపై ప్రస్తావిస్తూ సభలో ఉన్న ఓ మహిళ, చిన్నారిని వేదికపైకి రావాలనిఆహ్వానించారు. ఆ చిన్నారితో కార్డులోని ఆరు గ్యారంటీ స్కీంలను చదివిస్తూ వాటి అమలు ద్వారా తెలంగాణ ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని వివరించా రు. గృహజ్యోతి, రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, యువవికాసం పథకాల ప్రాధాన్యతను వివరించారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఈ పథకాలను తీసుకొస్తున్నామన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి తొలిసంతకం దీనిపైనే ఉంటుందని వివరించారు. రాహుల్ సభ సక్సెస్‌తో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది. -
ఎల్లలు దాటిన రాజకీయ చైతన్యం! ఎన్నారై వాయిస్..
సాక్షి, కరీంనగర్: 'ఏ దేశమేగినా ఎక్కడున్నా ఓటే తమ అభిమతమని చాటుతున్నారీ యువత. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగమే తమ నినాదమని ధీమాగా చెబుతున్నారు. బాల్య వయసులో పాఠ్యాంశంలోని అంశాలు, యువ వయసులో జిల్లా, రాష్ట్ర, జాతీయ రాజకీయాలను గమనిస్తున్న సదరు యువత ఓటెత్తుతామని అంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కో దేశంలో ఉపాధి పొందుతున్నారు. ఏళ్లుగా అక్కడే స్థిరపడగా.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలొచ్చాయంటే స్వదేశీబాట పడుతున్నారు. జిల్లా నుంచి వేల సంఖ్యలో అమెరికా, స్విట్జర్లాండ్, లండన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, రష్యా తదితర దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. సదరు దేశాల్లో ఓటు ప్రాధాన్యమెక్కు వ. ఓటేయకుంటే శిక్షలున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల క్రమంలో వందల మంది కరీంనగర్‌కు చేరుకోగా.. ఓటేసేందుకు మేమొచ్చాం.. మీరు ఓటేసేందుకు వస్తారుగా అంటూ సహచర స్నేహితులను చైతన్యపరుస్తున్నారు. ఈ సందర్భంగా వారి వాయిస్ వినిపించారు.' రాజకీయాలంటే ఆసక్తి! అమెరికాలోని పెన్సుల్‌వెనియా ప్రాంతంలో స్థిరపడిన ఉనుకొండ రాజీవ్‌కుమార్‌ది నగరంలోని విద్యానగర్. సాఫ్ట్వేర్ రంగంలో రాణిస్తున్నాడు. కంపెనీ అమెరికాలో అవకాశం కల్పించగా.. తన ప్రతిభతో అక్కడే స్థిరపడ్డాడు. ఎన్నికలొచ్చాయంటే రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి చూపుతుంటాడు. ఆయా పార్టీల మేనిఫెస్టోలు, అభ్యర్థుల నేర చరిత్ర తదితర వివరాలను ఆరా తీస్తూనే ప్రచార సరళిని పరిశీలిస్తుంటాడు. తీరా పోలింగ్ సమయానికి భారత్ రావడం.. ఓటేయడం ప్రతీసారి చేస్తుంటానని, ఇటీవలే మన దేశానికి వచ్చానని చెబుతున్నారు రాజీవ్. -
'ఈ లొల్లి మనకొద్దు బిడ్డో..' జర ఆలోచించు!
సాక్షి, రాజన్న సిరిసిల్ల/వేములవాడ: 'అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గర పడుతోంది. గ్రామాల్లో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. అభ్యర్థుల గెలుపు కోసం ఆయా పార్టీల నాయకులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. రెండు వేర్వేరు పార్టీల నాయకులు ఎదురుపడితే దాదాపు గొడవకు దిగే పరిస్థితులు ఉంటున్నాయి. పల్లెల్లో వీటన్నింటిని గమనిస్తున్న ఓ తల్లి తన ఆవేదనను కొడుకుతో ఇలా పంచుకుంటుంది.' తల్లి : ఏరా బిడ్డ పొద్దున్నే తయారయ్యావు ఎక్కడికి పోతున్నావు? కొడుకు : ఇంకెక్కడికి అమ్మా ఎన్నికల ప్రచారానికి. ఈసారి అన్న గెలవాలి. తల్లి : మనకెందుకు రాజకీయాలు బిడ్డా. కష్టం చేస్తే కానీ ఇల్లు గడువదు. కొడుకు : అన్న గెలిస్తే మన కష్టాలన్నీ తీరుతాయమ్మా. తల్లి : చేండ్ల పత్తికి నీళ్లు పెట్టాలని, కల్లంలో వడ్లు ఉన్నాయని.. అయ్యా రోజు లొల్లి పెడుతుండ్రా. కొడుకు : పని ఎప్పుడూ ఉండేదేనే అవ్వ. ఓట్లు ఐదోళ్లకోసారి వస్తాయి. మనను నమ్ముకున్నోళ్ల కోసం మనం పనిచేయకపోతే అన్న ఎట్లా గెలుస్తాడే. తల్లి : యాబై ఏళ్లుగా చూస్తున్నాం. మన బతుకుల కన్న వారి బాగోగులే చూసుకుంటున్నారు. నీకు ఇంట్లో చెల్లె ఉంది. బాగా చదివించి పెళ్లి చేయాలే. ఒక్కగానొక్క కొడుకువి. నీకేమైన అయితే మా బతుకులు ఏమి కావాలి బిడ్డా. కొడుకు : ఏ.. ఎందుకు భయపడుతావు అవ్వా. తల్లి : బాగా ఆలోచించు కొడుకా.. మనవి చిన్న బతుకులు. ఆవేశంలో పోయి గొడవల్లో తలదూర్చితే మనకే నష్టం. నీవు గొడవలు పెట్టుకునేది కూడా ఎవరితోనే కాదు మన ఊరోళ్లతోనే. వారం రోజుల్లో ఎన్నికలు అయిపోతాయి. ఆ తర్వాత మనం చచ్చే వరకు ఊళ్లోనే ఉండాలే బిడ్డా..! మనకు ఏమైనా అవసరం ఉన్న ఈల్లే ముందుండాలే కదరా.. ఈ లొల్లి మనకెందుకు బిడ్డా. కొడుకు : అమ్మా.. నువ్వు చేప్పేది నిజమే. నేను ఎందుకు గొడవకు పోతానే. ఊళ్లో ఎవరూ కనిసించిన అత్తా.. మామ.. బాబాయ్.. పిన్ని.. అన్న.. అని పలకరిస్తా. వాళ్లతో నాకెందుకు గొడవ. తల్లి : నువ్వు చిన్నపిల్లగాడివి బిడ్డా. ఎవరు మంచోళ్లో.. ఎవరు చెడ్డోళ్లో.. గుర్తించి ఓట్లేద్దాం. డబ్బుకు, మద్యానికి లొంగకు, ఒక్కరోజు బిర్యానీ పెడితే ఐదేళ్లు కడుపు నిండదు. ఐదేళ్లపాటు మనకు కష్టాలు రాకుండా చూసుకుంటూ, మన కష్టసుఖాల్లో పాలుపంచుకునే నాయకున్ని గెలిపించుకుందాం బిడ్డా. కొడుకు : అలాగే అమ్మా.. ఈ గొడవలు నాకొద్దు. మంచి చేసే వారికే ఓటేస్తాను. ఏ పార్టీ నాకొద్దు. ఇవ్వాల్లి నుంచి ఏ పార్టీ వాళ్లతోని తిరుగను. చేండ్లకు పోతున్న. నువ్వు చెప్పిట్లే మంచి నాయకునికే ఓటేద్దాం. ఇవి చదవండి: అన్నీ పార్టీలకు ప్రధాన అస్త్రం ఇదే.. -
కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్‌లకు చెమటలు పట్టిస్తున్న బీజేపీ అభ్యర్థి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతుండగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాత్రం త్రిముఖ పోరు నడుస్తోంది. మూడు పార్టీలు తగ్గేదేలే అన్నట్లుగా బరిలో సమరోత్సాహం ప్రదర్శిస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఆసక్తి రేకెత్తిస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బరిలోకి దిగగా వారిద్దరికీ దీటుగా బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి గెలుపు తనదేనంటూ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. దీంతో గెలుపు ఎవరిదన్నది అంతుపట్టని విధంగా తయారైంది. మూడు పార్టీల ఎత్తులు, పై ఎత్తులు, జాతీ య అగ్రనేతల పర్యటనలతో కామారెడ్డిలో రాజకీయం రసవత్తరంగా మారింది. ► నిజామాబాద్ అర్బన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ మధ్య పోటాపోటీ నెలకొంది. ► బాల్కొండలో బీఆర్ఎస్ నుంచి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, బీజేపీ తరఫున మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ, కాంగ్రెస్ నుంచి ముత్యాల సునీల్‌రెడ్డి హోరాహోరీగా తలపడుతున్నారు. ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ► ఆర్మూర్ నియోజకవర్గంలో మొదట్లో కాంగ్రెస్‌కు మంచి సానుకూలత ఉన్నప్పటికీ అభ్యర్థి వినయ్‌రె డ్డి స్పీడ్ తగ్గడంతో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి రా కేశ్‌రెడ్డి ముందుకు వచ్చారు. బీఆర్ఎస్ సిట్టింగ్ అ భ్యర్థి జీవన్‌రెడ్డి సైతం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ► బోధన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, సిట్టింగ్ బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్, బీజేపీ అభ్యర్థి మోహన్‌రెడ్డి మధ్య త్రిముఖ పోటీ నడుస్తోంది. ► నిజామాబాద్ రూరల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, కాంగ్రెస్ అభ్యర్థి భూపతిరెడ్డి మధ్య నువ్వా నేనా అనేలా పోటీ నడుస్తోంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కులాచారి దినేశ్ నామమాత్రంగా పోటీలో ఉన్నారు. ఆయన డిచ్పల్లి మండలంలో మాత్రమే ప్రభావం చూపిస్తున్నారు. ► బాన్సువాడలో బీఆర్ఎస్ అభ్యరి్థ, స్పీకర్ పోచా రం శ్రీనివాసరెడ్డి మంచి జోష్‌మీద ఉన్నారు. బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ మున్నూరుకాపు కావడంతో కలిసి వస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డికి సెటిలర్స్ మద్దతుతో బలం పెరిగినప్పటికీ, ఆయనపై దళితుల భూముల కబ్జా ఆరోపణలు ఉండడంతో ప్రభావం చూపిస్తోంది. ► ఎల్లారెడ్డిలో సిట్టింగ్, బీఆర్ఎస్ అభ్యర్థి సురేందర్, కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్, బీజేపీ అభ్యర్థి సుభాష్‌రెడ్డి మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ► జుక్కల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి హ న్మంత్‌సింధే, కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీకాంతరావు, బీజే పీ అభ్యర్థి అరుణతార మధ్య పోటాపోటి నెలకొంది. -
వస్తారా.. రారా..?
సాక్షి, మెదక్: టికెట్లు ఆశించి భంగపడిన నేతలు కొందరు, పార్టీలో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని మరికొందరు, ఇలా చాలా మంది వివిధ పార్టీల కండువాలు మార్చారు. అయితే, వారికి సంబంధించిన కేడర్ మాత్రం తమతోపాటు రాకపోవడంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు. తమ వెంట వస్తే పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీలు సైతం ఇస్తున్నారు. అది కూడా కుదరకపోతే బెదిరింపులకు పాల్పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల్లో కండువాలు మార్చిన నేతలు చాలా మందే ఉన్నారు. వీరితోపాటు వెళ్లడానికి కార్యకర్తలు మాత్రం వెనుకడుగు వేశారు. దీంతో ‘‘నిన్న, మొన్నటి వరకు నా వెంట ఉండి, పార్టీ మారాక నాతో రావా, నీ సంగతి చూస్తా’’అంటూ పార్టీ మారిన నాయకులు ధమ్కీ ఇస్తున్నారని పలువురు వాపోతున్నారు. ఇటీవల నర్సాపూర్‌లో ఓ పార్టీనేత ఎమ్మెల్యే టికెట్ ఆశించగా అతడికి టికెట్ లభించలేదు. వెంటనే మరో పార్టీలోకి జంప్ అయ్యాడు. కానీ, ఆ నాయకుడి వెంట కేడర్ మాత్రం వెళ్లలేదు. పార్టీ సిద్ధాంతం నచ్చి వారు ఆ పార్టీతోనే కొనసాగుతున్నారు. దీంతో ఆ నాయకుడు ‘‘నా వెంట మీరు రావాల్సిందే’’అని పలు వురు కార్యకర్తలను బెదిరించగా వారు వాగ్వాదానికి దిగారు. మర్యాద కరువు.. పార్టీలు మారిన నేతల వెంట కేడర్ వెళ్లకపోవడంతో కొత్తపార్టీలో ఆ నేతకు మర్యాద కరువైందని, ఎవరూ తమకు విలువ ఇవ్వడంలేదని జంప్‌జిలానీలు తలలు పట్టుకుంటున్నారు. నిన్న, మొన్నటి వరకు ప్రత్యర్థులుగా తిట్టుకున్న నేతలు ఒకేపార్టీలో చేరడంతో బలాలు, బలగాల లెక్కలపై పంచాయితీలు పెట్టుకుంటూ, జంప్ జిలానీలను సీనియర్ నాయకులు సూటిపోటీ మాటలతో అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలు మారిన నేతలు కొత్త పార్టీలో ఇమడలేక నామూ షీగా ఫీలవుతున్నట్లు సమాచారం. ఇవి చదవండి: కరీంనగర్‌కు రూ.9వేల కోట్లు తెచ్చా! : బండి సంజయ్ -
చిట్టా విప్పాల్సిందే..! లేదంటే న్యాయపరమైన చిక్కులు!
సాక్షి, మెదక్: ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమపై ఉన్న కేసుల చిట్టాను బయట పెట్టాల్సిందే.. ఎవరిపై ఎలాంటి కేసులు ఉన్నాయి? ఎన్ని కేసులు ఉన్నాయి? అనే విషయాలు ప్రజలకు తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న విషయం తెలిసిందే. దాని కోసం అభ్యర్థులు కూడా సిద్ధమయ్యారు. నామినేషన్లు వేసిన సమయంలో తమ కేసుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇప్పుడు వాటిని ప్రముఖ దినపత్రికల్లో ప్రకటిస్తున్నారు. పారదర్శకంగా వ్యవహరించాలి.. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు పారదర్శకంగా వ్యవహరించాలని, ఎలాంటి నేరచరిత్ర ఉన్నా బయట పెట్టాలన్న సుప్రీంకోర్టు నిబంధనల మేరకు అభ్యర్థులు తమపై ఉన్న కేసులను బయట పెడుతున్నారు. జిల్లాలో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలు ఉన్నాయి. మెదక్ నియోజకవర్గం బరిలో 13 మంది అభ్యర్థులు ఉండగా, నర్సాపూర్ బరిలో 11 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థులు తమపై ఉన్న కేసుల వివరాలను పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించాలి. రాజకీయంగా పారదర్శకత పాటించే ఏ నాయకుడికీ ఈ ప్రకటనలు ఇచ్చేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవు. రాజకీయ నాయకుడు అన్నాక కేసులు ఉండడం సర్వసాధారణమే. ప్రజా సమస్యల పోరాటంలో భాగంగా.. ఏదో ఒక సమయంలో ధర్నాలు, రాస్తారోకోలు చేసే సమయంలో కేసులు నమోదవుతుంటాయి. తెలంగాణ ఉద్యమంలో దాదాపు అన్ని పార్టీల నాయకులపైనా కేసులు నమోదయ్యాయి. అందులో చాలా వరకు కొట్టివేయగా.. ఇంకొన్ని విచారణ దశలో ఉన్నాయి. రాజకీయ జీవితం మొదలు కాకముందు, రాజకీయాల్లోకి వచ్చాక వ్యక్తిగత కారణాలతో నమోదైన క్రిమినల్ కేసులు కొందరిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ముగ్గురు అందజేత.. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో మొత్తం 24 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండగా ఇప్పటి వరకు ముగ్గురు అభ్యర్థులు పత్రికా ప్రకటనల ద్వారా కేసుల వివరాలు వెల్లడించారు. తర్వాత ఆ పేపర్ కటింగ్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. ఒకవేళ సదరు అభ్యర్థులపై కేసులు ఉండి పత్రికల ద్వారా వెల్లడించకపోతే న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ కేసుల్లో ప్రజాసమస్యలపై పోరాటాలు చేసిన వారికి ఇది కలిసొచ్చే అంశం కాగా, ఉద్దేశపూర్వక నేరచరిత్రులకు మాత్రం ఇబ్బంది కలిగే అంశమని అధికారులు చెబుతున్నారు. ఇవి కూడా చదవండి: వస్తారా.. రారా..? -
అన్నీ పార్టీలకు ప్రధాన అస్త్రం ఇదే..
సాక్షి, సిద్ధిపేట/దుబ్బాక: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అస్త్రం దుబ్బాక రెవెన్యూ డివిజనే. 2020 ఉపఎన్నికల సమయంలోనే డివిజన్‌గా ఏర్పాటవుతుందని ఆశించినా ప్రజలకు నిరాశే ఎదురైంది. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేయాలంటూ అన్నివర్గాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. రాష్ట్రం ఆవిర్భావం తర్వాత జిల్లాల పునర్విభజన సమయంలో సిద్దిపేట జిల్లాగా, దుబ్బాకను రెవెన్యూ డివిజన్‌గా చేస్తారని ఈ ప్రాంతం వారు ఎదురుచూశారు. కానీ అలా జరగలేదు. పాత సమితి కేంద్రంగా, తాలుకాగా, నియోజకవర్గ కేంద్రంగా మున్సిపాలిటీగా ఉన్న దుబ్బాకకు రెవెన్యూ డివిజన్‌కు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. 2016లో రెవెన్యూ డివిజన్ చేయాలంటూ దుబ్బాక పట్టణంలో 45 రోజుల పాటు ఉద్యమం జరిగింది. అప్పటి నుంచి నిరంతరం ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రజల ఆకాంక్ష దుబ్బాక రెవెన్యూ డివిజన్ చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట జిల్లా కేంద్రంగా ఉండడంతో పాటు నియోజకవర్గ కేంద్రాలైన గజ్వేల్, హుస్నాబాద్‌లను రెవెన్యూ డివిజన్లుగా చేసి నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకను డివిజన్ చేయకపోవడం శోచనీయం. ఆరు మండలాలతో దుబ్బాక డివిజన్! దుబ్బాక నియోజక వర్గంలో ప్రస్తుతం 8 మండలాలు ఉండగా చేగుంట, నార్సింగ్ మండలాలు తూప్రాన్ డివిజన్లో ఉన్నాయి. దుబ్బాక, మిరుదొడ్డి, తోగుట, దౌల్తాబాద్, రాయపోల్, భూంపల్లి–అక్భర్పేట మండలాలతో డివిజన్ చేస్తే ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. 26న ప్రకటిస్తారని ప్రచారం.. దుబ్బాక రెవెన్యూ డివిజన్ డిమాండ్‌ను సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు దృష్టికి ఇప్పటికే ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తీసుకెళ్లాడని, ఈ నెల 26 న దుబ్బాకలో జరిగే బహిరంగ సభలో డివిజన్‌గా చేస్తున్నట్లు ప్రకటిస్తారని బీఆర్ఎస్ వర్గాలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. హరీశ్ సైతం కొత్త ప్రభాకర్‌రెడ్డిని గెలిపించండి దుబ్బాక డివిజన్ చేస్తామని రోడ్ షోల్లో హామీలు ఇస్తున్నారు. రేవంత్ నోటా దుబ్బాక డివిజన్.. దుబ్బాకలో గురువారం జరిగిన బహిరంగ సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సైతం కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డిని గెలిపించండి దుబ్బాక రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది దుబ్బాక డివిజన్‌ను చేస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. బీజేపీ సైతం దీనిపైనే ఫోకస్! దుబ్బాకలో మళ్లీ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావును గెలిపిస్తే తప్పకుండా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అవుతుందని ఆ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే రఘునందన్‌రావు సైతం భూంపల్లి–అక్భర్పేట కొత్త మండలం ఏర్పాటు చేశానని, దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేస్తానంటూ ప్రచారంలో ప్రజలకు వివరిస్తున్నారు. ఇవి కూడా చదవండి: బడా నేతల ఆగమనం! -
interview: నా లక్ష్యం ఒక్కటే ప్రజాసేవ.. కారులోనే భోజనం చేసిన మంత్రి
‘ప్రజల సంక్షేమం, అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యం. పదేళ్ల పాలనా కాలంలో అన్నిరంగాలను అభివృద్ధి చేసి చూపించాం. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ చేసిందేమీ లేదు. వారి మాయమాటలు నమ్మి మోసపోతే గోసపడతాం. ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ గెలుపు ఖాయం’ అని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సూర్యాపేట అభ్యర్థి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రతి ఒక్కరికీ రాజ్యాంగ ఫలాలు అందాలన్న ధ్యేయంతో పని చేస్తున్నాం. ఈ పదేళ్ల కాలంలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగింది. ఈ కాలంలో ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల తీసుకొచ్చా. ఉమ్మడి జిల్లాకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను అందించి బీడు భూములను సస్యశ్యామలం చేశాం. ఒక్క సూర్యాపేట జిల్లాలోనే రూ.7500 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించాం. సూర్యాపేటకు మూసీ మురికినీళ్ల నుంచి విముక్తి కల్పించి మిషన్ భగీరథతో కడుపు నింపుతున్నాం. మునుగోడు, దేవరకొండలో ఇప్పుడు ఫ్లోరోసిస్ సమస్య లేదు. రూ.30 వేల కోట్ల విద్యుత్ థర్మల్ ప్లాంట్ తీసుకొచ్చాం. అన్ని నియోజకవర్గాల్లో మినీట్యాంక్ బండ్లు, సమీకృత మార్కెట్లు ఏర్పాటు చేశాం. యాదాద్రి ఆలయ పునః నిర్మాణం చేసుకున్నాం. బీఆర్ఎస్ పాలనలో గ్రామాల రూపురేఖలు మారాయి. కాంగ్రెస్ నాయ కులు నోట్ల కట్టలతో వస్తున్నారు. ఆ పార్టీకి ఉమ్మడి జిల్లాలోనే ముగ్గురు సీఎం అభ్యర్థులు ఉన్నారు. వారిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. సూర్యాపేట రూపురేఖలు మారాయి సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ వచ్చాకే అభివృద్ధి జరిగింది. నా హయాంలో రూ.వేల కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి చేశా. సూర్యాపేట గతంలో ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఎంత అభివృద్ధి జరిగిందో తెలుస్తుంది. పట్టణంలో హిందూ శ్మశాన వాటిక ఒకప్పుడు ఎలా ఉంది.. ఇప్పుడు మహాప్రస్థానంగా ప్రక్షాళన చేశాం. సద్దుల చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చి బోటింగ్ సౌకర్యం తీసుకొచ్చాం. పుల్లారెడ్డి చెరువును కూడా మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దుతున్నాం. మెడికల్ కళాశాల, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్, లింకురోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాం. ఐటీహబ్, బస్తీ దవాఖానాలు ఏర్పాటయ్యాయి. సూర్యాపేట పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. కళాభారతి, స్పోర్ట్స్ స్కూల్ నిర్మాణానికి రూ.25 కోట్ల చొప్పున నిధులు మంజూరయ్యాయి. 2014 ముందు సూర్యాపేట పట్టణ ప్రజలు మూసీ మురికి నీటిని తాగారు. ప్రపంచంలో ఒక నగరంలో వదిలిన నీటిని.. మరో పట్టణంలో ప్రజలు తాగడం ఎంత దురదృష్టకరమైన విషయమో జలసాధన సమితి నేత దుశ్చర్ల సత్యనారాయణే వెల్లడించారు. ప్రస్తుతం మిషన్ భగీరథతో కృష్ణా జలాలు ఆస్వాదిస్తున్నారు. ఇలా చెబుతూ పోతే లెక్కలేనంత అభివృద్ధి జరిగింది. నన్ను మరోమారు ఆశీర్వదించి గెలిపిస్తే సూర్యాపేట ఆర్థిక ముఖచిత్రమే మారుస్తా. వచ్చే ప్రభుత్వంలోనూ.. రాష్ట్రంలో మూడవసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. సూర్యాపేట మున్సిపాలిటీలో కూడా మా పాలకవర్గమే ఉంది. మధ్యలో కీలకమైన ఇరుసులాంటి శాసనసభ్యుడు లేకపోతే పైనుంచి కిందకు నిధులు ఏవిధంగా వస్తాయి..? నిధులు రావాలంటే ప్రభుత్వంలో కీలకంగా ఉండాలి. వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మళ్లీ ఉన్నత స్థానంలో ఉంటా. ఇప్పుడు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశా.. రేపు రూ.10 వేల కోట్లపైనే తీసుకురాగలుగుతా. పేట అభివృద్ధికి మరిన్ని ప్రణాళికలు దేశంలోనే ఆదర్శ పట్టణంగా సూర్యాపేటను అభివృద్ధి చేస్తా. మరో రూ.10 వేల కోట్లతో అభివృద్ధి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. ఐటీ హబ్ ఏర్పాటుతో వేలాది మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి దొరుకుతుంది. యువత ఇంట్లోనే ఉండి ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. డ్రైపోర్టు, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పా టు చేసి పట్టణంలో వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పనే ధ్యేయంగా ముందుకు సాగుతా. లింగమంతుల స్వామి, ఉర్లుగొండ గుట్టల మధ్య రోప్‌వే ఏర్పాటుతో వల్లభాపురం, గుంపుల తిరుమలగిరి, గుంజలూరు గ్రామాలు నూతన శోభ సంతరించుకోనున్నాయి. ఫణిగిరి, పిల్లలమర్రి శివాలయాలు, ఉర్లుగొండను టూరిస్ట్ హబ్‌గా తీర్చిదిద్దుతా. నల్లచెరువును నక్లెస్ రోడ్డుగా ఏర్పాటు చేసుకుందాం. చైనాలోని చాంజింగ్.. కెనడాలోని వాంకోవర్ సరసన సూర్యాపేట పట్టణాన్ని నిలబెట్టాలన్నదే నా కల. నాకు జన్మనిచ్చింది మా అమ్మ. జనం కోసమే నా జన్మ.. జనం కోసం బతకాలనుకున్నప్పుడు నేను తినే ఆ నాలుగు మెతుకులు ఇంట్లో కుటుంబ సభ్యులతోనే కలిసి తినాలనేమీ లేదు. అది గుడిలో కావచ్చు.. బడిలో కావచ్చు.. నన్ను గమ్యస్థానానికి చేర్చే నా ప్రచార వాహనమే కావచ్చు.. నా లక్ష్యం ఒక్కటే ప్రజా సేవ. నా ఆశయం ఒక్కటే.. అదే జన హితం. – బీఆర్ఎస్ సూర్యాపేట అభ్యర్థి, మంత్రి జగదీష్‌రెడ్డి ఇది చదవండి: TS Elections 2023: ఖర్చులకు ఇస్తాం.. ఓటేసిపోండి -
TS Elections 2023: ఖర్చులకు ఇస్తాం.. ఓటేసిపోండి
నల్లగొండ టౌన్: పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. అందివచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదలకుండా ఓట్ల వేటలో పడ్డారు. ఈ నేపథ్యంలో బతుకుదెరువు కోసం వలసపోయిన వారి ఓట్లపై దృష్టి సారించారు. నల్లగొండ నియోజకవర్గ పరిధిలోని నల్లగొండ, తిప్పర్తి, కనగల్ ప్రాంతాలకు చెందిన వేలాది మంది ఓటర్లు హైదరాబాద్, ముంబయి, ఇతర పట్టణాలకు పోయి అక్కడ వివిధ రకాల ఉద్యోగాలు చేస్తున్నారు. వారితోపాటుగా ఉన్నత చదువుల కోసం వెళ్లిన వారు కూడా ఉన్నారు. వారందరూ అక్కడ ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ ఓట్లు మాత్రం వారివారి స్వగ్రామాల్లోనే ఉన్నాయి. దీంతో వారందరినీ పోలింగ్ రోజు రప్పించేందుకు కొందరు నేతలకు బాధ్యతలు అప్పగించారు. కొనసాగుతున్న సంప్రదింపులు వివిధ పార్టీల నాయకులు వలస ఓటర్ల అడ్రస్‌లను సేకరించి తమ పార్టీకే ఓటు వేయాలని సంప్రదింపులు జరుపుతున్నారు. అన్ని పార్టీల నాయకులు వారితో ఫోన్లో మాట్లాడుతూ తమ పార్టీకే ఓటు వేయాలని కోరుతున్నారు. నల్లగొండ పట్టణం, అర్బన్ ప్రాంతాలతోపాటు తిప్పర్తి, కనగల్ మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన సుమారు ఐదు వేల మంది ఓటర్లు ఆయా ప్రాంతాలకు ఉపాధి కోసం వలస వెళ్లినట్లు సమాచారం. ఓటుకు భలే డిమాండ్ పోటాపోటీగా ప్రచారాలు, ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటున్న అభ్యర్థులు వలస ఓటర్లపై దృష్టి పెట్టడంతో ఓటుకు మరింత డిమాండ్ పెరిగిపోయింది. ఒక్కో ఓటుకు రూ.2 వేల నుంచి రూ.5 వేలు ఆఫర్ చేస్తున్నట్లు తెలిసింది. రవాణా ఖర్చులు అదనంగా ఇస్తామని చెబుతున్నట్లు సమాచారం. మరికొందరు అభ్యర్థులు తాము గెలిస్తే డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇంటి స్థలాలు, బీసీ , దళిత బంధు వంటివి ఇప్పిస్తామని ఆశ పెటుతున్నారని తెలిసింది. ఇది చదవండి: ఓటర్లకు గాలం.. అయినా గెలుస్తామ్మన్న ధీమా తక్కువే -
TS Elections 2023: బడా నేతల ఆగమనం.. దగ్గర పడుతున్న ప్రచార గడువు
నాగర్‌కర్నూల్: ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ప్రధాన పార్టీల ముఖ్యనేతలతో అభ్యర్థుల ప్రచారం హోరెత్తింది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బహిరంగసభలను నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కించారు. శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కొల్లాపూర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో బీజేపీ అభ్యర్థి ఎల్లేని సుధాకర్‌రావుకు మద్దతుగా నిర్వ హించనున్న బహిరంగసభలో పాల్గొననున్నారు. ఈనెల 27న నారాయణపేట జిల్లా కోస్గిలో నిర్వహించనున్న కాంగ్రెస్ బహిరంగసభలో ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకగాంధీ హాజరుకానున్నారు. ఎన్నికల ప్రచారానికి మరో నాలుగు రోజులు మాత్రమే గడువు మిగిలి ఉన్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఆయాపార్టీల అగ్రనేతల పర్యటనలతో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకోనుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఉమ్మడి జిల్లాలోని కొల్లాపూర్, కల్వకుర్తి, జడ్చర్ల, షాద్‌నగర్ నియోజకవర్గ కేంద్రాల్లో పర్యటించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇప్పటికే అలంపూర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొడంగల్ బహిరంగసభల్లో పాల్గొన్నారు. అలాగే కర్ణాటక రాష్ట్ర మంత్రులు, ఏఐసీసీ కార్యదర్శులు, పార్టీ పరిశీలకులతో ప్రచా రం ఊపందుకుంది. ఈ నెల 27న కోస్గి పట్టణ శివారులో నిర్వహించే సభలో ప్రియాంకగాంధీ పాల్గొననున్నారు. ఆదివారం మక్తల్‌లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రచారం చేయనున్నారు. బీజేపీ జనాకర్షణ మంత్రం.. ఉమ్మడి జిల్లాలో బాగా కలిసొచ్చే నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున బహిరంగసభ ల నిర్వహణకు బీజేపీ సిద్ధ మైంది. ఇందుకోసం కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను రంగంలోకి దింపుతోంది. గత నెలలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహబూబ్‌నగర్ లో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొ ని ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నారాయణపేటలో పర్యటించగా, కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ ఇటీవల కొల్లాపూర్‌లో ప్రచారం చేపట్టారు. ఇటీవల గద్వాలలో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మరోసారి రానున్నారు. శనివా రం కొల్లాపూర్‌లో, ఆదివారం మక్తల్ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ నెల 26న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మహబూబ్‌నగర్‌తో పాటు కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లులో నిర్వహించే బహిరంగసభలో పాల్గొననున్నారు. పాలమూరునుచుట్టేసిన సీఎం కేసీఆర్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టిసారించారు. షాద్‌నగర్ మినహా అన్ని నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించి పాలమూరును చూట్టేశారు. ఈ నెల 27న షాద్‌నగర్‌లో సభ జరగనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మక్తల్‌లో రోడ్‌షో నిర్వహించగా.. పలువురు మంత్రలు అడపాదడపా జిల్లాలో పర్యటిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులకు ఈనెల 28 వరకే గడువు ఉంది. సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. మిగిలిన కాస్త సమయంలోనే ఎక్కువ మంది ఓటర్లను ప్రసన్నం చేసుకునేలా అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఇంటి నుంచి బయలుదేరుతున్న అభ్యర్థులు రాత్రి 10 గంటల వరకు నిరాటంకంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత ముఖ్యమైన నేతలు, కార్యకర్తలతో తదుపరి కార్యాచరణపై మంతనాలు సాగిస్తున్నారు. మిగిలిన నాలుగు రోజుల్లోనూ ప్రధాన పార్టీల సభలు, సమావేశాలతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఇది చదవండి: ఓటర్లకు గాలం.. అయినా గెలుస్తామ్మన్న ధీమా తక్కువే -
ఓటర్లకు గాలం.. అయినా గెలుస్తామ్మన్న ధీమా తక్కువే
మహబూబ్‌నగర్ క్రైం: అసెంబ్లీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకుంటున్న నేపథ్యంలో ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి ఆయా పార్టీ అభ్యర్థులు ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే ముఖ్య పార్టీల అభ్యర్థులు పంపకాల పర్వానికి తెరతీశారు. ప్రలోభాలే ఓటు బలంగా భావిస్తూ.. ఓటుకు నోటు సూత్రాన్ని అమలు చేస్తున్నారు. ఓటు బలాన్ని.. నోటు బలహీనతతో సొమ్ము చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 30న ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కంటే ముందే అభ్యర్థుల దృష్టి అంతా ఓటర్ల చెంతకు నోట్లను చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ముందస్తుగానే నగదును ఆయా గ్రామాలు, వార్డులకు తరలిస్తున్నారు. ఇప్పటికే కొందరు నాయకులు కొన్ని ప్రాంతాల్లో సాఫీగా ఈ ప్రక్రియ సాగించారు. కొన్నిచోట్ల పార్టీల పంపకాలు పేచీలకు ఆజ్యం పోస్తున్నాయి. నువ్వా.. నేనా అంటూ సాగే ఎన్నికల పోరులో దండిగా డబ్బులు వస్తాయని ఆశించామని, పరిస్థితి వేరేలా ఉందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటుకు ఎంత ఇస్తారంటూ బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు. కనీసం ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు ఇవ్వాలనే చర్చ జోరుగా సాగుతుంది. ఇంకొన్ని చోట్ల పక్కా హామీలతో డబ్బు వ్యక్తిగత ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల ఓటు నజరానాలు అందజేశారు. అయితే ఈ పంపకాలను కొందరు ఓటర్లు సహించడం లేదు. మేమేంటో చూపిస్తామంటూ కొన్ని ప్రాంతాల్లో బహిరంగ శపథాలు చేస్తున్నారు. పైకి ధీమా.. లోలోపల దిగులు ఉమ్మడి జిల్లాలో కొందరు నాయకులు ఓటర్ల నాడిని పట్టుకోవడంలో విఫలమవుతున్నారు. పోలింగ్ బూత్‌లపై ఆధారపడి ఓటర్లకు డబ్బు పంపిణీ చేసేందుకు సిద్ధమైన నాయక గణంలో ఇప్పుడు కలవరపాటు మొదలైంది. ఓటు బాసలు చేయించుకుంటూ.. నోటు ఊసులు చెప్పుకొంటున్నారు. కానీ, ఓటరు నాడి పట్టుకోవడంలో ఊగిసలాట కొనసాగుతోంది. పంపకాల పేచీలు ఏమైనా కలవరపాటు గురి చేస్తాయా అంటూ ఆందోళనలో ఉన్నారు. ఒక్క ఓటుకు రూ.వెయ్యి, రూ.2వేలు ఇచ్చినా.. చివరికి మాకే వేస్తారా? అనే సంశయం వ్యక్తమవుతోంది. పైకి గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నా లోలోపల దిగులు గుబులు పుట్టిస్తోంది. ఇదిలా ఉంటే ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం ఇది ఒక దఫా మాత్రమే.. ఇంకా 4రోజుల సమయం ఉంది కదా.. కంగారు పడకండి అంటూ ఓటర్లను సముదాయించే పనిలో నిమగ్నమవుతున్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లేలోపు మీకు నజరానాలు అందుతాయంటూ ఆశ పెడుతున్నారు. భారీగా మద్యం నిల్వలు ఈ ఎన్నికల్లో ఓటర్లను వశం చేసుకోవడానికి రాజకీయ నేతలు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఒక్కో మద్యం దుకాణంలో రూ.10 లక్షల వరకు స్టాక్ చేసినట్లు తెలుస్తోంది. ఒకవైపు మద్యం అమ్మకాలు, తరలింపుపై భారీస్థాయిలో నిఘా కొనసాగుతున్నా ఓటర్లకు మాత్రం మద్యం చేర్చుతున్నారు. కొందరు నాయకులు కార్యక్తలకు చీటీలు ఇస్తే.. మరికొందరు టోకెన్లు, మరి కొందరు నేరుగా ఇంటింటికి తిరిగి మద్యం బాటిళ్లు అందిస్తున్నారు. దీంట్లో యువత కీలకపాత్ర పోషిస్తున్నారు. బృందాలుగా ఏర్పడి ఆయా గ్రామాలకు ద్విచక్రవాహనాల సహాయంతో మద్యం తరలిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చీప్ లిక్కర్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. కేవలం కూలీలు, రైతులు, మధ్యతరగతి వారికి చీప్ లిక్కర్, క్వాటర్స్, కొంత రిచ్‌నెస్ ఉన్న వ్యక్తులకు బ్రాండెడ్ బాటిళ్లు ముట్టజెప్పుతున్నారు. ఇక పల్లెల్లో ఓటర్లకు ఇవ్వడానికి రూ.500, 200 నోట్లు భారీస్థాయిలో సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. పార్టీల వారీగా.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లను ప్రత్యక్ష దైవంగా భావించడం పరిపాటి. ఏ పుట్టలో ఏ పాముందో అదే మనకు బలంగా మారుతుందో అంటూ అందరినీ ప్రసన్నం చేసుకోవడం సహజం. కానీ, ఈ ఎన్నికల్లో మాత్రం అభ్యర్థులు బలంగా పడే ఓట్లను మాత్రమే కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగానే తమ ఓటు వీళ్లని నమ్మిన వాళ్లకే డబ్బు చెల్లిస్తున్నారు. సర్వేలతో మూడు పార్టీల నాయకుల ఆయా బూత్‌ల వారీగా నిర్ధారించుకున్నారు. ఆ మేరకు మాత్రమే డబ్బు అందజేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇది చదవండి: నియోజకవర్గ అభివృద్ధిని చూసి.. ఓటు వేసేందుకు కెనడా నుంచి స్వదేశానికి..! -
నియోజకవర్గ అభివృద్ధిని చూసి.. ఓటు వేసేందుకు కెనడా నుంచి స్వదేశానికి..!
మహబూబ్‌నగర్ న్యూటౌన్: మహబూబ్‌నగర్‌కు చెందిన సాయిరాఘవ కెనడాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఈనెల 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఎలాగైనా తన ఓటు హక్కు వినియోగించుకోవాలని కెనడా నుంచి స్వదేశానికి చేరుకున్నారు. మహబూబ్‌నగర్‌లో జరిగిన అభివృద్ధిని చూసి ఆశ్చర్యపడిన అతడు.. శుక్రవారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసి సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో మరింత అభివృద్ధి చేయాలని కాంక్షించారు. కెనడా నుంచి ఓటు వేసేందుకు వచ్చిన యువకుడిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని అభివృద్ధికి అండగా నిలవాలని మంత్రి కోరారు. ఇది చదవండి: TS Elections 2023: బడా నేతల ఆగమనం.. దగ్గర పడుతున్న ప్రచార గడువు -
బడా నేతల ఆగమనం!
సాక్షి, నాగర్‌కర్నూల్: 'ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ప్రధాన పార్టీల ముఖ్యనేతలతో అభ్యర్థుల ప్రచారం హోరెత్తింది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బహిరంగసభలను నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కించారు. శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కొల్లాపూర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో బీజేపీ అభ్యర్థి ఎల్లేని సుధాకర్‌రావుకు మద్దతుగా నిర్వ హించనున్న బహిరంగసభలో పాల్గొననున్నారు. ఈనెల 27న నారాయణపేట జిల్లా కోస్గిలో నిర్వహించనున్న కాంగ్రెస్ బహిరంగసభలో ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకగాంధీ హాజరుకానున్నారు. ఎన్నికల ప్రచారానికి మరో నాలుగు రోజులు మాత్రమే గడువు మిగిలి ఉన్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఆయాపార్టీల అగ్రనేతల పర్యటనలతో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకోనుంది.' ► కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఉమ్మడి జిల్లాలోని కొల్లాపూర్, కల్వకుర్తి, జడ్చర్ల, షాద్‌నగర్ నియోజకవర్గ కేంద్రాల్లో పర్యటించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇప్పటికే అలంపూర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొడంగల్ బహిరంగసభల్లో పాల్గొన్నారు. అలాగే కర్ణాటక రాష్ట్ర మంత్రులు, ఏఐసీసీ కార్యదర్శులు, పార్టీ పరిశీలకులతో ప్రచా రం ఊపందుకుంది. ఈ నెల 27న కోస్గి పట్టణ శివారులో నిర్వహించే సభలో ప్రియాంకగాంధీ పాల్గొననున్నారు. ఆదివారం మక్తల్‌లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రచారం చేయనున్నారు. బీజేపీ జనాకర్షణ మంత్రం.. ఉమ్మడి జిల్లాలో బాగా కలిసొచ్చే నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున బహిరంగసభ ల నిర్వహణకు బీజేపీ సిద్ధ మైంది. ఇందుకోసం కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను రంగంలోకి దింపుతోంది. గత నెలలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహబూబ్‌నగర్ లో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొ ని ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నారాయణపేటలో పర్యటించగా, కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ ఇటీవల కొల్లాపూర్‌లో ప్రచారం చేపట్టారు. ఇటీవల గద్వాలలో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మరోసారి రానున్నారు. శనివా రం కొల్లాపూర్‌లో, ఆదివారం మక్తల్ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ నెల 26న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మహబూబ్‌నగర్‌తో పాటు కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లులో నిర్వహించే బహిరంగసభలో పాల్గొననున్నారు. పాలమూరునుచుట్టేసిన సీఎం కేసీఆర్.. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టిసారించారు. షాద్‌నగర్ మినహా అన్ని నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించి పాలమూరును చూట్టేశారు. ఈ నెల 27న షాద్‌నగర్‌లో సభ జరగనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మక్తల్‌లో రోడ్‌షో నిర్వహించగా.. పలువురు మంత్రలు అడపాదడపా జిల్లాలో పర్యటిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులకు ఈనెల 28 వరకే గడువు ఉంది. సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. మిగిలిన కాస్త సమయంలోనే ఎక్కువ మంది ఓటర్లను ప్రసన్నం చేసుకునేలా అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఇంటి నుంచి బయలుదేరుతున్న అభ్యర్థులు రాత్రి 10 గంటల వరకు నిరాటంకంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత ముఖ్యమైన నేతలు, కార్యకర్తలతో తదుపరి కార్యాచరణపై మంతనాలు సాగిస్తున్నారు. మిగిలిన నాలుగు రోజుల్లోనూ ప్రధాన పార్టీల సభలు, సమావేశాలతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఇవి చదవండి: త్రిముఖ పోరు! ఆర్మూర్‌లో అనూహ్యంగా దూసుకొచ్చిన బీజేపీ.. -
త్రిముఖ పోరు! ఆర్మూర్‌లో అనూహ్యంగా దూసుకొచ్చిన బీజేపీ..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతుండగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాత్రం త్రిముఖ పోరు నడుస్తోంది. మూడు పార్టీలు తగ్గేదేలే అన్నట్లుగా బరిలో సమరోత్సాహం ప్రదర్శిస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఆసక్తి రేకెత్తిస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బరిలోకి దిగగా వారిద్దరికీ దీటుగా బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి గెలుపు తనదేనంటూ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. దీంతో గెలుపు ఎవరిదన్నది అంతుపట్టని విధంగా తయారైంది. మూడు పార్టీల ఎత్తులు, పై ఎత్తులు, జాతీ య అగ్రనేతల పర్యటనలతో కామారెడ్డిలో రాజకీయం రసవత్తరంగా మారింది. ► నిజామాబాద్ అర్బన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ మధ్య పోటాపోటీ నెలకొంది. ► బాల్కొండలో బీఆర్ఎస్ నుంచి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, బీజేపీ తరఫున మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ, కాంగ్రెస్ నుంచి ముత్యాల సునీల్‌రెడ్డి హోరాహోరీగా తలపడుతున్నారు. ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ► ఆర్మూర్ నియోజకవర్గంలో మొదట్లో కాంగ్రెస్‌కు మంచి సానుకూలత ఉన్నప్పటికీ అభ్యర్థి వినయ్‌రె డ్డి స్పీడ్ తగ్గడంతో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి రా కేశ్‌రెడ్డి ముందుకు వచ్చారు. బీఆర్ఎస్ సిట్టింగ్ అ భ్యర్థి జీవన్‌రెడ్డి సైతం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ► బోధన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, సిట్టింగ్ బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్, బీజేపీ అభ్యర్థి మోహన్‌రెడ్డి మధ్య త్రిముఖ పోటీ నడుస్తోంది. ► నిజామాబాద్ రూరల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, కాంగ్రెస్ అభ్యర్థి భూపతిరెడ్డి మధ్య నువ్వా నేనా అనేలా పోటీ నడుస్తోంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కులాచారి దినేశ్ నామమాత్రంగా పోటీలో ఉన్నారు. ఆయన డిచ్పల్లి మండలంలో మాత్రమే ప్రభావం చూపిస్తున్నారు. ► బాన్సువాడలో బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచా రం శ్రీనివాసరెడ్డి మంచి జోష్‌మీద ఉన్నారు. బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ మున్నూరుకాపు కావడంతో కలిసి వస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డికి సెటిలర్స్ మద్దతుతో బలం పెరిగినప్పటికీ, ఆయనపై దళితుల భూముల కబ్జా ఆరోపణలు ఉండడంతో ప్రభావం చూపిస్తోంది. ► ఎల్లారెడ్డిలో సిట్టింగ్, బీఆర్ఎస్ అభ్యర్థి సురేందర్, కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్, బీజేపీ అభ్యర్థి సుభాష్‌రెడ్డి మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ► జుక్కల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి హ న్మంత్‌సింధే, కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీకాంతరావు, బీజే పీ అభ్యర్థి అరుణతార మధ్య పోటాపోటి నెలకొంది. ఇవి చదవండి: చిట్టా విప్పాల్సిందే..! లేదంటే న్యాయపరమైన చిక్కులు! -
ప్రజలే నా ధైర్యం.. నమ్మకం! : బిగాల గణేశ్‌గుప్తా
సాక్షి, నిజామాబాద్: 'ప్రజలే తన ధైర్యం.. నమ్మకమని నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. తెలంగాణ రాకముందు ఇందూర్ నగరం ఏ విధంగా ఉందో.. ఇప్పుడు ఎలా ఉందో అందరికి తెలుసని పేర్కొన్నారు. తనకన్న ముందు ఉన్నవారు నగరాన్ని అభివృద్ధి చేయలేదన్నారు. పక్కా ప్రణాళికతో నగరాన్ని అభివృద్ధి చేశానని చెప్పారు. మళ్లీ అవకాశం ఇస్తే ఇందూరును దేశంలో మొదటి స్థానంలో ఉంచడానికి అనుక్షణం శ్రమిస్తానని హామీ ఇచ్చారు.' ఎన్నికల నేపథ్యంలో గణేశ్‌గుప్తాతో సాక్షి ఇంటర్వ్యూ.. – నిజామాబాద్ నాగారం నగర అభివృద్ధికి ఎన్ని నిధులు ఖర్చు చేశారు? ► నిజామాబాద్ నగరాన్ని ఇప్పటి వరకు రూ.వేయి కోట్లతో అభివృద్ధి చేశాను. విశాలమైన రోడ్లు, డివై డర్లు, పార్కులు, ఓపెన్‌జిమ్‌లు, మినీ ట్యాంక్‌బండ్, సమీకృత మార్కెట్ సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే అండర్ బ్రిడ్జి, ఐటీ హబ్, వైకుంఠధామాలు తదితర పనులు పూర్తి చేశాను. 2018 ఎన్నికల సమయంలో ప్రజలకు నును చేయబోయే అభివృద్ధి పనులకు సంబంధించి మోడల్ బుక్లెట్ పంపిణీ చేశా. దానిని ఐదేళ్లలో పూర్తి చేసి ప్రజల కళ్ల ముందు ఉంచాను. యూజీడీ పనులు పూర్తయ్యాయా? ► ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నేను ఎమ్మెల్యే కాకముందు నుంచే జరిగా యి. రోడ్లను మధ్యలో తవ్వేయడంతో రాకపోకలు నానా ఇబ్బందులు పడ్డారు. దీంతో సీఎం కేసీఆర్ ను అడిగి నిధులు తెచ్చి 2019లో యూజీడీ పనులు పూర్తి చేయించాను. ప్రతి ఇంటి నుంచి యూజీడీకి కనెక్షన్ ఇవ్వాలి. దీనికి ఒక్కొక్కరికి రూ.8 వేలకు పై గా ఖర్చు అవుతుంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా కేసీఆర్‌ను ఒప్పించి రూ.45కోట్ల నిధులు తెచ్చి టెండర్ ప్రక్రియ పూర్తి చేయించాను. ఎన్నికలు పూ ర్తి కాగానే ఈ పనులు ప్రారంభం అవుతాయి. ప్రస్తుతం నగరంలో తాగునీటి సమస్య ఉందా? ► నగరంలో ఇంటింటికి తాగునీరు సరఫరా అవుతోంది. ట్యాంకర్ల ద్వారా సరఫరాకు చెక్ పెట్టడానికే మిషన్ భగీరథ ద్వారా పైపులైన్లు వేశాం. 24గంటల పాటు మంచినీరు సరఫరా చేయడానికి కార్యాచరణ రూపొందించాం. ప్రచారంలో ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ► నేను అనుక్షణం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నా. నగరంలో ఉన్న పరిస్థితులు, సమస్యలు పరిశీలించి పరిష్కరించా. నేను చేసిన అభివృద్ధిపై బుక్లెట్ ప్రింట్ చేసి ఇంటింటికి పంచుతూ ఓట్లు అడుగుతున్నా. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ప్రజలే నా ధైర్యం, నమ్మకం.. మూడోసారి గెలిపిస్తారని నమ్ముతున్నా. ఆత్మీయ సమ్మేళనాలతో ప్రచారం చేపట్టారు. అన్ని కులాలకు దగ్గరయ్యారా? ► నేను ఎల్లవేళలా ప్రజలతో ఉన్నా. నగరంలోని అ న్ని డివిజన్లలో పర్యటించాను. కులమతాలకు అతీతంగా కుల సంఘాలకు, ఆలయాలు, మసీదులు, చర్చిలకు నిధులు ఇచ్చి భవనాలు పూర్తి చేయించాను. ఆత్మీయ సమ్మేళనాలతో నేను ఏం చేశానో ప్రజలకు వివరించాను. ఎన్నికల మేనిఫెస్టో ఏ విధంగా ఉంది? ► సీఎం కేసీఆర్ ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. మరోసారి అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి రూ.5లక్షల కేసీఆర్ భీమా, సన్నబియ్యం, ఆసరా పెన్షన్ రూ.5వేలు, దివ్యాంగులకు రూ. 6వేలు, రైతు బంధు రూ.16వేలు, మహిళలకు రూ. 3 వేలు అందిస్తాం. చేసిన అభివృద్ధి, సంక్షేమంతో పాటు మేనిఫెస్టోను వివరిస్తూ ప్రచారం చేస్తున్నాం. ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ► ఎన్నికలు వస్తాయి, పోతాయి. రకరకాల పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తారు. ఒక్కసారి గుండె మీద చె య్యి వేసి మనస్ఫూర్తిగా ఆలోచన చేయండి. నేను తొమ్మిదిన్నర ఏళ్లలో నగరాన్ని ఎవరూ చేయని వి ధంగా అభివృద్ధి చేశా. నా కన్న ముందు పెద్ద పెద్ద నాయకులు పోటీ చేసినా అభివృద్ధి చేయలేదు. అ నుక్షణం ప్రజల్లో ఉండి ప్రభుత్వం ద్వారా సంక్షేమ ఫలాలు అందిస్తూ, సదుపాయాలు కల్పించా. నగరాన్ని రాష్ట్రంలో, దేశంలో నంబర్ వన్‌గా ఉంచడాని కి కష్టపడుతునే ఉన్నాను. ఏ కష్టం వచ్చినా ప్రజల కు అండగా ఉంటున్నా. అందుకే ఈ నెల 30న కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నా. ఇవి కూడా చదవండి: త్రిముఖ పోరు! ఆర్మూర్‌లో అనూహ్యంగా దూసుకొచ్చిన బీజేపీ.. -
అవకాశం ఇవ్వండి నేనేంటో చూపిస్తా..! : వడ్డి మోహన్‌రెడ్డి
సాక్షి, నిజామాబాద్: 'అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి అంటే ఏంటో, తానేంటో చూపిస్తానని బోధన్ బీజేపీ అభ్యర్థి వడ్డి మోహన్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం బీజేపీతోనే సాధ్యమవుతుందని గ్రహించిన ప్రజలు గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బోధన్‌లో అవినీతి పేరుకు పోయిందని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగలని అన్నారు. ఎమ్మెల్యేగా తొలిసారిగా పోటీచేస్తున్నానని ప్రజలు ఆదరించి బీజేపీని గెలిపించాలని కోరారు.' అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వడ్డి మోహన్‌రెడ్డితో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ.. – బోధన్ ఎన్నికల ప్రచారం ఎలా సాగుతోంది? ► నియోజకవర్గంలో నేను ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. యువగర్జన సభకు ఎంపీ అర్వింద్ హాజరయ్యారు. నియోజకవర్గంలో రెండో రోజుల్లో నిర్వహించే ఎన్నికల ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు అమిత్‌షా, జేపీ నడ్డా రానున్నారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. ప్రజా సమస్యలపై మీ సమాధానం? ► బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో అంతా అవినీతే జరిగింది. నియోజక వర్గంలో అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట రుణమాఫీ, భూసమస్యలు, రేషన్‌కార్డులు, పింఛన్లు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, నిరుద్యోగ సమస్యతో నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస సౌకర్యాలపై ఎమ్మెల్యే షకీల్ దృష్టి సారించలేదు. బీజేపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి తప్పకుండా సాధ్యమవుతుంది. పదేళ్లలో అభివృద్ధి ఎలా ఉంది? ► బోధన్ గత వైభవాన్ని కోల్పోయింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడిపోయింది. దీంతో చెరుకు రైతులు, వ్యాపార వర్గాలు, కార్మికులకు ఎంతో నష్టం కలిగింది. ప్రభుత్వ వివిధ శాఖల కార్యాలయాలు ఇతర ప్రాంతాలకు తరలిపోయాయి. చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏం జరగలేదు. ఎన్నికల పోటీ బీఆర్ఎస్, బీజేపీ మధ్యేనా..? ► ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి గెలిచే అవకాశం లేదు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్‌ను ఓడించాలంటే బీజేపీతోనే సాధ్యమనే అభిప్రాయంతో ప్రజలు ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీతో విజయం. నిజాంషుగర్స్ పునరుద్ధరణపై మీరిచ్చే హామీ..? ► ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా నిజాంషుగర్స్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తాం. ఇచ్చిన హామీని బీజేపీ ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ఫ్యాక్టరీ ప్రారంభమైతే ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది. బీజేపీ, బీఆర్ఎస్లు ఒక్కటే అన్న ఆరోపణపై..? ► బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగలు. ఆ పార్టీలే లోపాయి కారి ఒప్పందాలతో రాజకీయాలు చేస్తున్నాయి. 2006లో నవీపేట జెడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేసినప్పుడు తనను ఓడించేందుకు ఆ రెండు పార్టీలు ఏకమయ్యాయి. ప్రజలకు మీరిచ్చే హామీలు? ► బీజేపీ మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా అన్ని హామీలను నెరవేరుస్తాం. మూతపడిన నిజాంషుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం. యువతకు ఉద్యోగ అవకాశాలు, రైతులకు మద్దతు ధర కల్పిస్తాం. తెల్లరేషన్‌కార్డు ఉన్న వారికి ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. రూ. పది లక్షల వరకు ఆరోగ్య బీమా, ఆడపిల్లల వివాహాలకు రూ.2 లక్షలు అందిస్తాం. ప్రజల నుంచి ఏమైనా ఆశిస్తున్నారా..? ► నేను 25 ఏళ్ల నుంచి రాజకీయ ప్రజా జీవితంలో కొనసాగుతున్నా.. నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడిని. తొలిసారిగా బోధన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా గెలిపించాలని ప్రజలను వేడుకుంటున్నా. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లను గెలిపించిన ప్రజలు ఈ సారి బీజేపీకి అవకాశం కల్పించాలని కోరుకుంటన్నారు. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమ స్యల పరిష్కారానికి కృషి చేస్తా. ఇవి చదవండి: ప్రజలే నా ధైర్యం.. నమ్మకం! : బిగాల గణేశ్‌గుప్తా -
కరీంనగర్‌కు రూ.9వేల కోట్లు తెచ్చా! : బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: ‘కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.9వేల కోట్లు తెచ్చిన. మీ ఆశీర్వాదంతో రాష్ట్రమంతా తిరిగి ప్రజల కోసం పోరాడిన. 74 కేసులు పెట్టిండ్రు. మరి కమలాకర్ ఏం సాధించిండు? ఐటీ టవర్‌లో తొండలు గుడ్లు పెడుతున్నయి. బీసీ స్టడీసర్కిల్ శిక్షణా తరగతులు, విద్యార్థుల్లేక వెక్కరిస్తోంది. తీగల వంతెన వాహనాలు వెళ్లడానికి పనికి రాకుండా వీక్లీడాన్స్ క్లబ్‌లా తయారైంది. ఇదేనా మీరు చేసిన అభివృద్ధి’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్‌ను ప్రశ్నించారు. కరీంనగర్‌లోని అశోక్‌నగర్, గోపాల్‌పూర్‌లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేషన్ మంత్రిగా ఉంటూ ఒక్క రేషన్‌కార్డు ఇవ్వలేని వ్యక్తికి ఓట్లేలా వేస్తారని ప్రశ్నించారు. కేంద్రం 2.4 లక్షల ఇళ్లు మంజూరు చేసినా కేసీఆర్, గంగుల కమలాకర్ కరీంనగర్ ప్రజలకు ఒక్కఇల్లు కట్టివ్వకుండా ఆ నిధులు దారి మళ్లించారని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులది భూ కబ్జాల చరిత్ర అన్నారు. వాళ్లపై ఉన్న కేసులన్నీ కబ్జాలు, ఫోర్జరీలు, అక్రమ సంపాదన, ఐటీ కేసులే అని, ఎన్నికలైపోగానే వాళ్లద్దరూ ఒక్కటై రాజీ చేసుకుంటారని అన్నారు. అశోక్‌నగర్‌లో గుడిని కూల్చేసేందుకు గంగుల కమలాకర్ సిద్ధమైతే అడ్డుకుంది తానేనని అన్నారు. అనంతరం జ్యోతినగర్, చైతన్యపురి, విద్యానగర్‌కు చెందిన సుమారు 500మంది యువత బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. బండి వెంటే కురుమ సంఘం.. బండి సంజయ్ కుమార్‌కు గోపాల్పూర్ ప్రజలు నీరాజనం పట్టారు. ఊరంతా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. బండి సంజయ్వారితో కలిసి దాదాపు అరగంటకుపైగా ముచ్చటించారు. కురుమ సంఘం కమ్యూనిటీ హాల్‌ను సందర్శించారు. బండి సంజయ్ వెంటే ఉంటామని కురుమ సంఘంవాళ్లు హామీ ఇచ్చారు. 27న లక్ష మందితో మోదీ సభ ఈనెల 27న కరీంనగర్‌లోని ఎస్సారార్ మైదానంలో జరిగే బహిరంగసభకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హాజరు కానున్న నేపథ్యంలో విజయవంతం చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ అన్నారు. ప్రధానంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అత్యధికంగా హాజరుకావాలని పిలు పునిచ్చారు. శుక్రవారం పార్టీ ముఖ్య నాయకులు, శక్తికేంద్ర ఇన్చార్జిలతో సమావేశమయ్యారు. మోదీసభ ఏర్పాట్లు, జన సమీకరణపై చర్చించారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధి నుంచి లక్షమంది తరలి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, సుమారు 50వేల మంది కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే అవకా శం ఉందన్నారు. సభకు హాజరయ్యే ప్రజల కు నీళ్లు, ఇతర సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యంవద్దని, ఆ బాధ్యత సంబంధిత మండల నాయకులపైనే ఉందని తెలిపారు. రాష్ట్ర అధికార ప్రతినిధి సీహెచ్.విఠల్, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఇన్చార్జి మీసాల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
'నారీ.. ప్రాధాన్యమేది?' ఓట్లున్నా.. సీట్లు లేవు!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఆకాశంలో సగం.. అవనిలో సగం.. అని మహిళల గురించి చెప్పే మాటలు బాగానే ఉన్నా.. ఆచరణలోకి వచ్చే సరికి ఎవరూ పాటించడం లేదు. రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి ఉన్నా.. అవకాశాలు లేక మహిళలు అట్టడుగునే ఉంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో చూసుకుంటే.. మొత్తం ఓటర్లలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఆ మేరకు రాజకీయంగా మాత్రం వారికి ప్రధాన రాజకీయ పార్టీలు ప్రాధాన్యం ఇవ్వలేదు. శాసనకర్తలు మహిళలు ఉంటే ఆ వర్గానికి మరింత న్యాయం జరుగుతుందనేది అందరూ ఏకీభవించాల్సిన వాస్తవం. మహిళలు అంతరిక్షంలో అడుగుపెడుతున్న ప్రస్తుత ఆధునిక యుగంలో రాజకీయాల్లో మాత్రం వారికి అంతగా ప్రాధాన్యం లభించడం లేదనే చెప్పవచ్చు. ఇందుకు ప్రస్తుత శాసనసభ ఎన్నికలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో ప్రధానపార్టీల నుంచి 36 మంది బరిలో నిలిస్తే అందులో మహిళలు కేవలం ఐదుగురు మాత్రమే ఉండడం ఆయా పార్టీల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఇందులో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నుంచి మహిళలకు అసలే ప్రాధాన్యం దక్కకపోగా, బీజేపీ నుంచి రామగుండం, సిరిసిల్ల, చొప్పదండి, జగిత్యాల సీట్లు అతివలకు కేటాయించారు. పెద్దపల్లి నుంచి బీఎస్పీ మహిళను బరిలో నిలపింది. బీజేపీ నాలుగు స్థానాలు కేటాయించి అగ్రస్థానంలో నిలిచింది. మహిళలు సైతం స్వతంత్రంగానైనా బరిలో నిలిచే సాహసం చేయకపోవడం సమాజంలో మహిళలంటే వివక్ష దూరం కాలేదన్న వాదనకు తెరలేపుతోంది. అన్ని జిల్లాల్లో ఎక్కువే.. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములు మహిళలే శాసించనున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. రాజకీయ పార్టీలు మహిళల జనాభా, ఓటర్లకు అనుగుణంగా రాజకీయ అవకాశాలు కల్పించడం లేదన్న అసంతృప్తి ఉంది. 50 శాతం రిజర్వేషన్ల పుణ్యమాని స్థానిక సంస్థల్లో సగానికిపైగా ప్రజాప్రతినిధులు మహిళలకు అవకాశం దక్కుతోంది. కానీ.. అసెంబ్లీకి వచ్చేసరికి మాత్రం మహిళలకు ప్రాధాన్యం దక్కడం లేదు. రాజకీయ పార్టీలు.. వారికి పోటీ చేసేందుకు ఇస్తున్న సీట్లు, అందులో వారు గెలిచే స్థానాలు.. పురుషులతో పోల్చితే చాలా తక్కువగా ఉంటున్నాయనే విమర్శ ఉంది. దేశంలో ఇలా.. 1998–2023 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 21,161 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాగా.. వారిలో మహిళల సంఖ్య 1,584 మాత్రమే. ఏపీ, తెలంగాణ సహా దేశంలో 19 రాష్ట్రాల్లో మహిళా శాసనసభ్యులు 10 శాతానికి మించి లేరు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 1,821 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. అందులో బరిలో నిలిచిన మహిళల సంఖ్య 140 మాత్రమే. కానీ.. అందులో గెలిచిన మహిళల సంఖ్య కేవలం ఆరుమాత్రమే. రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో... 2018 ఎన్నికల్లో తెలంగాణలో ఖానాపూర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి అజ్మీరా రేఖానాయక్, మెదక్ నుంచి పద్మాదేవేందర్ రెడ్డి, మహేశ్వరం నుంచి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి, ఆలేరు నుంచి గొంగిడి సునీతామహేందర్ రెడ్డి, ములుగు నుంచి సీతక్క, ఇల్లందు నుంచి బానోతు హరిప్రియ ఎన్నికయ్యారు. ఈ లెక్కన 119 నియోజకవర్గాల్లో ఎన్నికైన మహిళా శాసనసభ్యుల సంఖ్య కేవలం ఐదు శాతం మాత్రమే. 33 శాతం రిజర్వేషన్ అమలైతే.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందింది. అది చట్టంగా మార్చితే మహిళలకు ఆ మేరకు సీట్లు కేటాయించడం తప్పనిసరి. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2027 తర్వాతే ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకు వస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. చట్టం అమల్లోకి వస్తే 12 నియోజకవర్గాలకు గాను ప్రతీ పార్టీ సుమారు నాలుగేసి స్థానాలు విధిగా కేటాయించాల్సి ఉంటుంది. -
చీటీ లేదని ఆగం కావొద్దు.. ఇంకా వేరే మార్గాలు కూడా ఉన్నాయి..!
ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఎల్ఓలు ఓటర్ చీటీలను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేస్తున్నారు. ఒకవేళ ఓటరు చీటీలు అందకుంటే ఆగం కావాల్సిన పని లేదు. ఓటరు చీటీ లేకపోయినా ఓటేసే అవకాశం ఉంది. ఎన్నికల రోజు బీఎల్ఓలు పోలింగ్ బూత్‌ల వద్ద అందుబాటులో ఉంటారు. వారి వద్దకు వెళ్లి చీటీ లేని వారు ఆ రోజు కూడా ఓటరు చీటీ రాయించుకునే అవకాశం ఉంది. లేకపోతే ఓటరు జాబితాలో క్రమ సంఖ్య తెలుసుకుని పోలింగ్ ఏజెంట్లకు చెప్పి వారికి తానే సంబంధిత ఓటరునని నిరూపించుకునే గుర్తింపు కార్డును చూపి ఓటేయొచ్చు. లేదంటే పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసే ఓటరు జాబితాను పరిశీలించి పేరు, క్రమ సంఖ్యను కాగితంపై రాసుకుని వెళ్లవచ్చు. ఆ సమయంలో ఓటరు వద్ద తగిన గుర్తింపు కార్డును తప్పకుండా వెంటతీసుకెళ్లి పోలింగ్ కేంద్రంలో ఉండే అధికారులకు చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఇది చదవండి: కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది.. ఓసారి అందరూ వెళ్లి కర్ణాటకలో చూడండి ఎలావుందో..! -
బీసీలకు రాజ్యాధికారం బీజేపీతోనే సాధ్యం..! పవన్ కల్యాణ్
మెదక్/తూప్రాన్: బీసీలకు రాజ్యాధికారం బీజేపీతోనే సాధ్యమని, అందుకే బీసీ ముఖ్యమంత్రి నినాదంతో బీజేపీ ముందుకు సాగుతోందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పిలుపునిచ్చారు. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా గురువారం సాయంత్రం ఆయన చేగుంటలో రోడ్‌షో నిర్వహించారు. దుబ్బాక అభివృద్ధి కోసం వకీల్‌సాబ్ రఘునందన్‌రావు ఆరాటపడుతున్నారని ఆయనను గెలిపించాలని పవన్ విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాట్లాడుతూ ఎంపీగా గెలిచిన ప్రభాకర్‌రెడ్డి పదేళ్లుగా చేగుంటకు ఒక డిగ్రీ కళాశాల మంజూరు చేయించలేక పోయారని ఆరోపించారు. తనను గెలిపిస్తే గ్రామాలలోని సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు భూపాల్, వైస్ ఎంపీపీ రాంచంద్రం, మాజీ ఎంపీపీ పాండు, సీనియర్ నాయకులు వెంగళరావు, గణేశ్ రవికుమార్, సంతో ష్‌రెడ్డి, నర్సింలు, ఎన్.చారి, బాలచందర్, రఘువీర్‌రావుతో పాటు పలు గ్రామాల బీజేపీ నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి చదవండి: ‘సారూ.. మంచిగ చెప్పిండ్రు..' అందరు మూడు తోవల పోతున్నరు! -
‘సారూ.. మంచిగ చెప్పిండ్రు..' అందరు మూడు తోవల పోతున్నరు!
సాక్షి, ఆదిలాబాద్: ‘రాం రామే.. రాజన్న. ఏం సంగతే. ఇయ్యల్ల పొద్దెక్కుతున్న ఓళ్లస్తలేరు.. సలిగూడ రెండొద్దుల సంది జరంత ఎక్కనే ఉన్నదే. గిలాసాల గింత గరం గరం చాయ్ వొయ్యే..’ అంటూ భోజన్న పక్క టేబుల్ మీద ఉన్న న్యూస్‌పేపర్‌ను తీసుకుని బెంచీ మీద కూసున్నడు. ‘ఏం జెప్పుమంటవే.. మొన్న రెండ్రోజులుగ రెండు పార్టీలోళ్లు దావత్ ఇచ్చి పోయిండ్రు గదనే.. నిన్న రాతిరి ఇగ ఈ పార్టోళ్లు గూడ మందు పంపినుండే. అది తాగుడు ఒడిసే సరికి రాతిరి బారా ఏక్ బజే అయ్యిందే. ఇంటికోయి బుక్కెడుబువ్వ గూడ తినలేదే. పండేసరికి రెండైంది. ఇగ నాకంటే హోటలు తీసుడు ఉంటదని పొద్దుగల్లనే లేసిన. మనోళ్లకు ఇంక రాతిరిది దిగనట్లున్నదే..’ అని హోటల్ రాజన్న రాతిరి జరిగిన ముచ్చట చెప్పిండు. ‘ఆవే భోజన్న.. నాకు తెల్వక అడుగుతున్న. ఏ పార్టోళ్లచ్చినా మనూళ్లే మస్తు పబ్లికు అస్తున్నరు.. అందరికీ జై గొడుతున్నరు.. ఆడోళ్లు మంగళారతులు పడుతున్నరు. ఆఖిరికి యాడికోతదో.. ఓళ్లను గెలిపిస్తరోనే..!’ అని పాలు మరగవెట్టుకుంట మల్ల రాజన్ననే అన్నడు. ‘అరె.. నువ్వు గమ్మతు మాట్లాడుతవేందే రాజన్న.. ఇగ ఊళ్లేకు పెద్దమనిషి అచ్చినంక సూడతందుకై న ఊరోళ్లు రారాయే.. అందరితోని మంచిగుండాల్నె బాపు. రేపు ఓళ్లు గెలుస్తరో తెల్వది.. ఓళ్లతోని పనివడతదో తెలుస్త దాయే..’ అని భోజన్న చెప్పుకచ్చిండు. ఇంతల.. నిర్మలక్కడికెళ్లి బైకు మీద గంగాధర్ సార్ అచ్చిండు. రాజన్న హోటల్ కాడ బండి ఆపి.. ‘ఏం భోజన్న నమస్తే.. ఏమంటుండు మన రాజన్న. మనూళ్లే గాలి ఎటున్నదే మరి..?’ అనుకుంట అచ్చి బెంచీ మీద కూసున్నడు. ‘ఏమో సార్.. ఈసారి ఓట్లల ఎటూ చెప్పస్త లేదు. మనూరోళ్లు ఓళ్లకు ఓట్లు గుద్దతరో తెలుస్తలేదు. అన్ని పార్టీలకు తిరుగుతున్నరు. అందరికాడికి పోతున్నరు. ఏమిచ్చినా తీసుకుంటున్నరు..’ అని భోజన్న చెప్పిండు. ‘సార్.. మనూళ్లే గాలి ఎటుంటదో చెప్పలేం గన్ని.. గ కేసీయారు, రేవంతంరెడ్డి, ప్రియాంకగాంధీ, మోదీ సారు.. గీళ్లంతా గాలి మోటర్లల మస్తు అస్తున్నరు. మనక్కడ బాగ దిరుగుతున్నరు. దినాం టీవీలల్ల కనవడే పెద్ద పెద్దోళ్లు మన కండ్లముంగట కనిపించే సరికి గమ్మతనిపిస్తుంది. గిట్ల ఎప్పుడు రాలే సారు. పార్టీల ముచ్చటేందో గన్ని.. గ పెద్దోళ్లను సూడతందుకే మస్తుమంది పోతున్నరు.’ అని రాజన్న ఉడుకుతున్న చాయ్‌ను కలుపుకుంట ముచ్చట పెట్టిండు. ‘ఆ.. ఏమున్నది రాజన్న ఎన్నికలన్నంక ఓళ్ల పార్టీని గెలిపించుకునేతందుకు ఆళ్లు అస్తనే ఉంటరు. యాడనో ఢిల్లీల ఉండేటోళ్లు.. మన గల్లీ కాడిదాకా ఏంటికస్తరంటవ్..? ఓట్ల కోసమే గదా. ఈసారి మన రాష్ట్రంల ఎన్నికలు ఓళ్లకో ఒక్కళ్లకు అన్నట్లు లేవు. అందుకు గ పెద్దలీడర్లు అస్తున్నరు..’ అని గంగాధర్ సార్ చెప్పిండు. ‘సార్.. మనూరి సంగతి ఇడిసిపెట్టుండ్రి.. మన జిల్లల గాలి ఎటుంటది.. ఓళ్లు గెలిసేటట్టున్నరు..’ అని అప్పుడే చేసిన గోల్డన్ చాయ్ సార్ చేతికందిస్తూ రాజన్న అడిగిండు. ‘ఏమో.. రాజన్న మనూళ్లే ఉన్నట్లనే జిల్లాల గూడ గదే ముచ్చటున్నది. ఓళ్లకేం చెప్పస్తలేదు. అన్ని పార్టీలోళ్లు మస్తు తిరుగుతున్నరు. మస్తు కర్సువెడుతున్నరు. అన్ని నియోజకవర్గాలల్ల ఓట్లు ఎటువడుతయో ఇప్పుడైతే చెప్పుడు కష్టంగనే ఉన్నది. ఏ పార్టీకాపార్టీ గట్టిగనే కష్టపడుతున్నయ్. సగం, సగం చెబుదామంటే.. మూడో పార్టీ గూడ నేనేం తక్కువనా.. అన్నట్టున్నది. ఓళ్లు గెల్సినా గొన్ని ఓట్లతోనే గెలుస్తరనైతే అంటున్నరు..’ అని గంగాధర్ సార్ వివరించిండు. ఇంతలో.. రాజన్న హోటల్ కాడికి నర్సయ్య అచ్చిండు. ‘సార్.. మీరన్ని తెల్సినోళ్లు. దినాం నిర్మల్ల సార్లతోని తిరుగుతరు గదా.. మరి ఏ పార్టీవోల్లకు ఓటేస్తే మంచిదంటరు..’ అని నర్సయ్య అడిగిండు. ‘సూడు నర్సన్న.. ఓటనేది ఒకళ్లు చెప్తే ఏసేది గాదు. మనమే మంచిగ ఆలోచించుకుని ఏయాలే. ఇయ్యల్ల ఏ పార్టీ ఏమంటున్నది.. ఏ అభ్యర్థి ఏం జెపుతున్నడు.. అన్నది సూడాలె. గాలి ఎటుంటే అటు పోవుడు గాదు. మన మంచిచెడ్డలకు, మన పిల్లగాండ్ల కోసం పనికొచ్చెటోళ్లకు ఓటేయ్యాలె. సూడు.. ఇప్పుడు నిల్సున్నోళ్లల నీకు సై అనిపించినోళ్లకు ఓటేయ్. నేను జెప్పినోళ్లకో.. ఇంకొక్కళ్లు చెప్పినోళ్లకో ఓటేసుడు కరెక్టు గాదు. నీది నువ్వే ఆలోచించాలె. అసలైన పనిమంతుడికి ఓటెయ్యాలె..’ అని గంగాదర్ సార్ వివరించిండు. ఆయన మాట్లాడినంత సేపూ.. రాజన్న హోటల్ కాడ ఉన్నోళ్లందరూ మంచిగ ఇన్నరు. ‘సారు.. మంచిగ చెప్పిండ్రు. ఇయ్యళ్ల పైసలిస్తుండ్రని, మందు పోస్తున్నరని ఆశ పడితే.. ఐదేండ్ల ముచ్చట ఉత్తదే అయితది..’ అని నర్సన్న రెండు చేతులు జోడించిండు. ఇంతలనే బడికి టైం అయితుందని.. గంగాధర్ సార్ బండి తీసుకుని వాళ్లందరికీ రాంరాం చెప్పి బడికి పోయిండు. ఇగ అక్కడునోళ్లందరు మల్ల రోజటి లెక్కనే ఊరి కాడికెళ్లి మొదలువెడితే.. పట్నం దాకా రాజకీయాల ముచ్చట్ల పడ్డరు. -
'పోస్టల్ బ్యాలెట్' మిస్సింగ్.. ఉద్యోగుల్లో కలవరం..!
సాక్షి, ఆదిలాబాద్: ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, సిబ్బందికి అందించే పోస్టల్ బ్యాలెట్ మిస్సింగ్ అవ్వడం ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గంలో ఎన్నికల విధులు నిర్వహించే ఎన్నికల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం ఫామ్ 12 ద్వారా ఇదివరకే దరఖాస్తు చేసుకున్నారు. దీని దరఖాస్తు గడువు ఈ నెల 8వ తేదీన ముగిసింది. అయితే పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకునేందుకు ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు 15 మంది కార్యాలయాలకు వెళ్లగా మీ దరఖాస్తులు అందలేదని సిబ్బంది చెప్పడంతో విస్తుపోయారు. తాము ఇదివరకే దరఖాస్తు చేసుకున్నా ఎందుకు అందలేదని అధికారులను ప్రశ్నించగా, వారినుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో ఏం చేయాలో తెలియక వారు నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమని చెప్పే అధికారులు ఇలా తాము చేసుకున్న దరఖాస్తులను ఇంత నిర్లక్ష్యంగా పట్టించుకోకపోవడం ఏమిటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే జిల్లాలో ఎన్ని ఓట్లు నమోదయ్యాయి. ఎన్ని గల్లంతయ్యాయనే సమాచారం కోసం కలెక్టరేట్ పర్యవేక్షకురాలు జాడి స్వాతిని సంప్రదించగా.. ఎలాంటి పోస్టల్ బ్యాలెట్ మిస్ అవ్వలేదని పేర్కొన్నారు. అయితే ఇంకా దరఖాస్తులు అందాల్సి ఉందని, అవి పూర్తిస్థాయిలో వస్తే తప్పా ఎన్ని వచ్చా యి.. ఎన్ని రాలేదనే సమాచారం చెబుతామని పేర్కొనడం గమనార్హం. ఇవి చదవండి: ‘సారూ.. మంచిగ చెప్పిండ్రు..' అందరు మూడు తోవల పోతున్నరు! -
అవినీతి సర్కార్‌ను గద్దె దింపాలి.. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి
తుర్కపల్లి: అవినీతి బీఆర్ఎస్ సర్కార్‌ను గద్దె దింపాలని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి అన్నారు. గురువారం తుర్కపల్లి మండలంలోని మాధాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మళ్లీ ఇప్పుడు ఎన్నికల ముందు కొత్త హామీలతో ప్రజల ముందుకు వస్తున్నారని విమర్శించారు. సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే ఈ రాష్ట్రంలో బాగుపడిందని అన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇంటికో ఉద్యోగం, కేజీ టూ పీజీ ఉచిత విద్య అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో సీఎం కేసీఆర్ కమీషన్లు నొక్కేస్తే, ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కాంకు పాల్పడిందని ఆరోపించారు. మరోసారి కేసీఆర్‌కు అవకాశం ఇస్తే నిరుపేదల జీవితం మరింత దుర్భరంగా మారుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, మహిళలకు పావలా వడ్డీకే రుణాలు, రైతులు, కౌలు రైతులకు రూ.15వేలు పెట్టుబడి సాయం, వరి క్వింటాల్‌కు రూ.500 బోనస్, వ్యవసాయ కూలీకి ఏడాదికి రూ.12వేలు, విద్యార్థులకు రూ.5లక్షల భరోసా కార్డు, మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు రూ.2500 బ్యాంకు ఖాతాల్లో వేయడంతో పాటు ప్రతి పేద కుటుంబానికి సన్న బియ్యం, రూ.500కే గ్యాస్ సిలిండర్, కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తుందని తెలిపారు. ఆలేరు కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల అయిలయ్యకు భారీ మెజార్టీతో గెలిపిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్ర ఇన్చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుసుమకుమార్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శంకర్‌నాయక్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు భాస్కర్‌నాయక్, ప్రధాన కార్యదర్శి నర్సింహులు, వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు శ్రీనివాస్‌యాదవ్, మోహన్‌బాబునాయక్ తదితరులు పాల్గొన్నారు. -
తాళానికి సీల్ లేదని ఆందోళన.. రెండు గంటలపాటు నిలిచిన ఓటింగ్ ప్రక్రియ..!
శాలిగౌరారం: 80 సంవత్సరాలు పైబడిన వారితో పాటు అంగవైకల్యం కలిగిన వారివద్ద నుంచి ఓట్లను స్వీకరించేందుకు మండలానికి వచ్చిన ఎన్నికల అధికారులతో నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని తుడిమిడి గ్రామంలో రాజకీయ పార్టీల నాయకులు వాగ్వాదానికి దిగారు. ఇంటి వద్ద నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు దరఖాస్తు చేసుకున్న వారివద్ద నుంచి ఓట్లను స్వీకరించేందుకు సంబంధిత ఎన్నికల అధికారులు గురువారం తుడిమిడి గ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో సంబంధిత దరఖాస్తుదారులైన వారి నుంచి ఓట్లను స్వీరించేందుకు వెళ్లగా.. బ్యాలెట్బాక్స్కు ఉన్న తాళంకు సీల్ వేయకపోవడాన్ని అక్కడి నాయకులు గమనించి ఆందోళన వ్యక్తం చేశారు. సీల్ వేయకపోవడం వల్ల ఓటింగ్ ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకునే అవకాశం ఉందంటూ వారు సంబంధిత ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో సుమారు రెండు గంటలపాటు ఓటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో సంబంధిత ఎన్నికల సిబ్బంది ఆయా రాజకీయ పార్టీలకు చెందిన నేతలకు ‘ఇంటి వద్దనే ఓటింగ్’ విధానం గురించి వివరించారు. ఈ ఓటింగ్ ప్రక్రియ ఎన్నికల పరిశీలన అధికారి సమక్షంలో వీడియో, వెబ్‌కాస్టింగ్ రికార్డింగ్‌తో పూర్తి పారదర్శకంగా జరుగుతుందని వారికి వివరించారు. అనంతరం బ్యాలెట్బాక్స్ తాళానికి సీల్ చేయడంతో ఓట్ల స్వీకరణ కొనసాగింది. ఇది చదవండి: చీటీ లేదని ఆగం కావొద్దు.. ఇంకా వేరే మార్గాలు కూడా ఉన్నాయి..! -
కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది.. ఓసారి అందరూ వెళ్లి కర్ణాటకలో చూడండి ఎలావుందో..!
మహబూబ్‌నగర్: ఇక్కడి నుంచి కర్ణాటక ఐదు కిలో మీటర్ల దూరమే.. ఎమ్మెల్యే రామన్న నాలుగు బస్సులు ఏర్పాటు చేస్తాడు.. అందరూ వెళ్లి కర్ణాటకలో చూడండి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంట్ పోయిందా లేదా అనేది తెలుసుకోండి.. తెలంగాణలో కాంగ్రెస్ వస్తే కరెంట్ పోవడం ఖాయమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అసలు కాంగ్రెసోళ్లు కరెంట్ గురించి మాట్లాడొచ్చా? వాళ్ల హయాంలో కరెంట్ ఎట్లా ఉండే తెలవదా? ఎవరైనా గ్రామాల్లో చనిపోతే ఇదే ఎమ్మెల్యేకు ఫోన్ చేసి అన్నా అంత్యక్రియలు అయిపోయినయ్.. కరెంట్ లేదు.. బోర్లు, బాయికాడ స్నానాలు చేయాలి. ఒక్క 15 నిమిషాలు కరెంటివ్వన్నా అని అడిగలేదా? అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మక్తల్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన రోడ్‌షోలో మంత్రి పాల్గొని మాట్లాడారు. నాకై తే మీ జోష్ చూస్తుంటే.. రామన్న గెలిచిపోయినట్లే ఉంది.. గెలిచిపోయిండా.. పక్కానా.. హండ్రెడ్ పర్సెంటా.. టిక్ పెట్టుకోవచ్చా.. కేసీఆర్‌కు చెప్పొచ్చా.. అంటూ మంత్రి కేటీఆర్ అనడంతో జనమంతా కేరింతలు కొట్టారు. మక్తల్‌కు రాగానే ఎమ్మెల్యే రామన్న నన్ను నాలుగు విషయాలు అడిగిండు.. అన్నా ఇది వరకు మున్సిపాలిటీలు చేసినవ్.. ఇప్పుడు మా మక్తల్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలని, ఆత్మకూర్‌లో వంద పడకల ఆస్పత్రి నిర్మించాలని, భూత్పూర్ రిజర్వాయర్ కాల్వలు బాగు చేయాలని, నియోజకవర్గంలోని అన్ని మున్సిపాలిటీల్లో స్టేడియాలు, ఊట్కూర్‌లో నూతన బస్టాండ్, మక్తల్– నారాయణపేట ఫోర్‌లైన్ రోడ్డు, చంద్రగఢ్ కోటను పర్యాటక కేంద్రం చేయాలని, గిరిజన తండాలకు కొత్త పంచాయతీ భవనాలు నిర్మించాలని కోరారని మంత్రి వివరించారు. టైం ఎక్కువ లేదు.. మా తమ్ముళ్లను కోరుతున్నా రామన్నను భారీ మెజార్టీతో గెలిపించాలి. సోషల్ మీడియాను నమ్మకండి.. అందులో వచ్చేవి అంతా గాలి కబుర్లు.. వచ్చేది బీఆర్ఎస్ సర్కారే అంటూ కార్యకర్తలు, నాయకులకు భరోసానిచ్చారు. నందిమల్ల నుంచి ధర్మాపూర్‌కు రోడ్డు, ఆర్ఎస్ఎస్ సెంటర్లు.. ఇవన్నీ చిన్న చిన్న పనులని, రామ్మోహన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటే ఆ పనులన్నీ చేద్దామని చెప్పారు. మక్తల్ గులాబీమయంగా మారిందని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి ఉమ్మడి జిల్లా సభ్యులు చిట్టెం సుచరితరెడ్డి, మక్తల్ ఎన్నికల ఇన్చార్జ్ ఆంజనేయులుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇది చదవండి: తాళానికి సీల్ లేదని ఆందోళన.. రెండు గంటలపాటు నిలిచిన ఓటింగ్ ప్రక్రియ..! -
తొలిసారి ఉమ్మడి జిల్లాకు రానున్న ప్రియాంకగాంధీ..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంకగాంధీ శుక్ర, శనివారాల్లో రెండు రోజుల పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. అసెంబ్లీఎన్నికల బరిలో నిలిచిన పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఆమె ప్రచారం చేస్తారు. తొలిసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రియాంకాగాంధీ రానుండడంతో రోడ్‌షోలను విజయవంతం చేసేందుకు గాను నాయకులు భారీ జనసమీకరణలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే రాహుల్‌గాంధీ పినపాక నియోజకవర్గానికి సంబంధించి మణుగూరులో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌కు హాజరయ్యారు. ప్రస్తుతం ప్రియాంకాగాంధీ వస్తుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం ఆమె ప్రచా రం చేయనుండగా, శనివారం ఖమ్మం జిల్లాలోని పాలేరు, ఖమ్మం, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో ప్రచారానికి హాజరవుతారు. రెండు రోజులు ఉమ్మడి జిల్లాలోనే.. కొత్తగూడెంలో శుక్రవారం సాయంత్రం 3.25గంటల నుంచి 4.20 గంటల వరకు జరిగే సభలో ప్రియాంక పాల్గొంటారు. ఆ తర్వాత హెలీకాప్టర్‌లో ఖమ్మం చేరుకుని ఇక్కడే బస చేస్తారు. శనివారం ఉదయం 11.30 గంటలకు జెడ్పీ సెంటర్ నుంచి వైరా రోడ్, మయూరిసెంటర్, కాల్వొడ్డు, పెదతండా మీదుగా నాయుడుపేట వరకు జరిగే రోడ్డు షోలో పాల్గొంటారు. దీంతో ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల అభ్యర్థులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఆమె ప్రచారం చేసినట్లవుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 1.05 గంటలకు హెలీకాప్టర్‌లో బయలుదేరి సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరుకు చేరుకుంటారు. అక్కడ 1.30నుంచి 2.30 గంటల వరకు జరిగే కార్నర్ మీటింగ్‌లో పార్టీ అభ్యర్థి మట్టా రాగమయితో కలిసి ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం 3నుంచి 4గంటల వరకు మధిరలో భట్టి విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటుచేసే సభలో ప్రియాంకాగాంధీ ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇవి కూడా చదవండి: బీసీలకు రాజ్యాధికారం బీజేపీతోనే సాధ్యం..! పవన్ కల్యాణ్ -
ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు..!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయకుండా అలంపూర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి నామినేషన్ తిరస్కృతికి ఆదేశాలివ్వాలని దాఖలైన పిటిషన్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. నోటిఫికేషన్ వచ్చి ఎన్నికల ప్రక్రియ సాగుతున్న దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేస్తూ పిటిషన్‌పై వాదనలను ముగించింది. జోగుళాంబ గద్వాల్ జిల్లా ఉండవల్లి మండలం పుల్లూర్ పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ విజయుడు రాజీనామా చేయకుండానే అలంపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థీగా నామినేషన్ దాఖలు చేశారని, దాన్ని తిరస్కరించేలా రిటర్నింగ్ అధికారికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ప్రసన్నకుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టి.. జోక్యం చేసుకోలేమని వాదనలు ముగించింది. -
'సమయంలేదు మిత్రమా..' ఇంకా కొన్ని రోజులే!
సాక్షి, మెదక్: రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా ఏడు రోజులే గడువు ఉంది. అయితే 48 గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేయాలి దీంతో ఇంకా మిగిలింది ఐదు రోజులు మాత్రమే. అంటే బరిలో ఉన్న అభ్యర్థుల ప్రచారానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇప్పటి వరకూ ఒక ఎత్తు కాగా ఈ ఐదు రోజుల మరో ఎత్తుగా అభ్యర్థులు భావిస్తున్నారు. అందులో భాగంగా వారు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ప్రతిరోజూ ప్రణాళికాబద్ధంగా విజయం కోసం ఇంటింటికీ వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఎక్కడెక్కడ బలహీనత ఉంది దానిని ఎలా పరిష్కరించుకోవాలి, ఎక్కడ ఎవరిని తమ పార్టీలో చేర్చుకోవాలి అనే పథకాలు రచించి అమలు చేస్తున్నారు. ప్రత్యర్థుల వ్యూహాలను దెబ్బతీస్తూ విజయాన్ని సాధించేలా ప్రతి వ్యూహాలు కూడా రూపొందిస్తున్నారు. ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా దూసుకెళ్తున్నాయి. ఈ చివరి వారంలో భారీ సభల నిర్వహణకు కూడా ప్లాన్ చేసుకుంటున్నాయి. ఈ ఐదురోజులు చాలా కీలకం! ఎన్నికల పర్వంలో కీలకమైన ప్రచార ఘట్టానికి కేవలం ఐదు రోజులు మాత్రమే మిగిలింది. ప్రచారానికి 28 సాయంత్రం 5 గంటలకు గడువు పూర్తవుతుంది. ఈ క్రమంలో జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజక వర్గాల్లో మూడు ప్రధాన పార్టీలు తమ జోరును పెంచాయి. కొంత మంది అభ్యర్థులు ఈ ఐదు రోజులు చాలా కీలకంగా వ్యవహరించాలని పథకం రచించారు. ఏరోజు ఏం చేయాలి. ఎవరు ఏ బాధ్యత చేపట్టాలనే కార్యక్రమాల గురించి పక్కాగా నిర్ణయించుకున్నారు. ఆయా రోజుల్లో చేయాల్సిన పనులను వాట్సప్ ద్వారా తమ అనుచరులకు పంపిస్తున్నారు. ప్రధానంగా బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారాన్ని పదునెక్కించే దిశగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ తాము బలహీనంగా ఉన్నామనే సమాచారాన్ని ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న బృందాల ద్వారా తెలుసుకున్న అభ్యర్థులు వాటిపై దృష్టిపెట్టారు. ఈ ఐదురోజుల్లో ఎంతగా ప్రజల్లోకి వెళ్తే.. ఏ మేరకు ఓటర్లను ఆకట్టుకోగలిగితే అంతగా విజయావకాశాలు పెరుగుతాయని అభ్యర్థులు భావిస్తున్నారు. ప్రతిక్షణం జనంతోనే ఉంటున్నారు. గంపగుత్త ఓట్ల కోసం.. మెదక్ జిల్లాలోని నర్సాపూర్, మెదక్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రచారానికి ఐదు రోజులు మిగలడంతో ఒకేసారి గంపగుత్తగా వందల మంది ఓటర్లను తమవైపు ఎలా తిప్పుకోవాలనే వ్యూహాలను రచిస్తున్నారు. అందులో భాగంగా ఉపాధ్యాయ, ఉద్యోగ, వైద్యులు, యువజన సంఘాలు, వివిధ కమిటీలతో చర్చలు నిర్వహిస్తున్నారు. గ్రామాలు, వార్డుల వారీగా కులసంఘాలకు ఆలయాలు, కమ్యూనిటీ భవనాలకు నిధులు సమకూరుస్తామనే హామీలు గుప్పిస్తున్నట్టు సమాచారం. అభ్యర్థులు ప్రచారంలో పాల్గొంటుండగా, వారి అనుచరులు, నాయకులు గంపగుత్త ఓటర్ల కోసం జోరుగా చర్చలు సాగిస్తున్నారని, వారికి కావాల్సినవి సమకూర్చుతూ తమవైపు తిప్పుకునేందుకు శ్రమిస్తున్నట్టు పలువురు చెప్పుకుంటున్నారు. పోటా పోటీ.. మీటింగ్‌లు! రెండు నియోజకవర్గాల్లో పధ్రాన పార్టీలు గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే మెదక్, నర్సాపూర్ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే మెదక్‌లో ఏర్పాటు చేసిన రోడ్‌షోలో పాల్గొని తమ మెదక్, నర్సాపూర్ అభ్యర్థులు డాక్టర్ మైనంపల్లి రోహిత్‌రావు, రాజిరెడ్డిని గెలిపించాలని కోరారు. అలాగే నర్సాపూర్‌లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. అనంతరం మెదక్ ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎంపీ విజయశాంతి, మైనంపల్లి హన్మంతరావు తమ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. అలాగే బీజేపీ తరపున ఎన్నికల ప్రచారంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధాని మోదీ పాల్గొంటారని ఆ పార్టీ శ్రేణులు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ, లేదా ప్రియాంక గాంధీలు సైతం మెదక్, నర్సాపూర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్లు కాంగ్రెస్ నాయకులు కూడా చెబుతున్నారు. ఇవి చదవండి: కాలినడక నుంచి.. హెలీకాప్టర్ల వరకు.. ఎన్నికల ప్రచారంలో మార్పులు! -
ప్రజల కోసం పోరాడుతున్నాం.. మద్దతివ్వండి
కరీంనగర్ టౌన్: నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇంటికో ఉద్యోగం ఇస్తానని రెండుసార్లు ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ మండిపడ్డారు. ప్రజల కోసం పోరాడుతున్న బీజేపీకి మద్దతివ్వాలని కోరారు. బుధవారం కరీంనగర్‌లోని రేకుర్తి, మంకమ్మతోటలో నిర్వహించిన కార్నర్ మీటింగుల్లో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ 2,40,000 ఇళ్లు ఇస్తే కేసీఆర్ ఒక్కఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వకుండా కేసీఆర్ మాత్రం 100 గదులతో ప్రగతి భవన్ కట్టుకున్నారని దుయ్యబట్టారు. పదేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా 30 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారన్నారు. కేసీఆర్ ఇంట్లో మాత్రం ఐదుగురికి ఉద్యోగాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులు ప్రశ్నించిన పాపానికి కేసీఆర్ కొడుకు కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇటీవల అన్ని పరీక్షల ప్రశ్నపత్రాలను లీక్ చేశారని, పేపర్ లీకేజీలపై తాను కొట్లాడితే... తన ఇంటిపై వందల మంది పోలీసులతో దాడి చేయించి అరెస్ట్ చేయించారని మండిపడ్డారు. -
'యుద్ధానికి సిద్ధంగా ఉండాలి' : విజయశాంతి
సాక్షి, మహబూబ్‌నగర్: ప్రజలు అసెంబ్లీ ఎన్నికల యుద్ధానికి సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి అన్నారు. రాష్ట్రంలో దొరను దింపుతామని చాలెంట్ చేయాలన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో అభివృద్ధి జరగలేదన్నారు. నాలుగు కోట్ల మంది ప్రజలు నలుగురుగా ఉన్న కేసీఆర్‌పై దండయాత్ర చేయాలన్నారు. బీజేపీ 420 పార్టీతో కుమ్మక్కైందన్నారు. ఈసారి సామ ధాన బేధ దండోపయాలు ప్రయోగించి బీజేపీ కేసీఆర్‌ను మరోసారి గద్దెమీద ఎక్కించడానికి కుట్ర పన్నుతుందని, ప్రజలు వీటిని తిప్పికొట్టాలన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇస్తే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని గ్యారెంటీ ఇవ్వాలని కోరారు. ఇవి చదవండి: కోడ్ ఉల్లంఘనులపై కఠిన చర్యలు.. : రాహుల్‌రాజ్ -
'బర్రెలక్క' తమ్ముడిపై దాడి..! ఓట్లు చీల్చుతుందనే భయంతోనే ఇలా..
సాక్షి, మహబూబ్‌నగర్: నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన కర్నె శిరీష అలియాస్ బర్రెలక్కకు ప్రముఖుల నుంచి మద్దతు పెరుగుతుంది. ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆమె తమ్ముడు భరత్‌పై పెద్దకొత్తపలి మండలం వెన్నచెర్లలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గానికి చెందిన కొందరు నాయకులు తాను ఓట్లు చీల్చుతాననే భయంతో దాడులకు తెగబడుతున్నారని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది సరికాదని శిరీష వాపోయింది. ఆమె తమ్ముడిపై దాడిని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్. ప్రవీణ్‌కుమార్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా తప్పుబట్టారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా నిర్వహించాలని, పోటీలో ఉన్న వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందిస్తూ ఈ దాడి అత్యంత బాధాకరమన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆమెకు, కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆయన డీజీపీ, ఎన్నికల ప్రధాన కార్యదర్శిని కోరారు. సీపీఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు, పలు ప్రజా సంఘాల నాయకులు దాడిని ఖండించారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి బీరం హర్షవర్దన్‌రెడ్డి కూడా దాడి హేయనీయమన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించాలని, మహిళా అభ్యర్థిపై దాడికి ప్రయత్నించడం, ఆమె సోదరునిపై దాడికి పాల్పడడం దారుణమన్నారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం కాదన్నారు. ఈ దాడి ఘటనపై కొల్లాపూర్‌లో సోషల్‌మీడియాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇవి చదవండి: 'యుద్ధానికి సిద్ధంగా ఉండాలి' : విజయశాంతి -
కాలినడక నుంచి.. హెలీకాప్టర్ల వరకు.. ఎన్నికల ప్రచారంలో మార్పులు!
సాక్షి, మహబూబ్‌నగర్: ఎన్నికల ప్రచారంలో ప్రతిసారి వినూత్న మార్పులు కనిపిస్తున్నాయి. నాడు అభ్యర్థులు కాలినడకన గ్రామాలను చుట్టేసేవారు. ఆ తర్వాత ఎడ్లబండ్లు, సైకిళ్లు, మహా అయితే జీపుల్లో గ్రామాలు, పట్టణాల్లో అభ్యర్థులు తిరిగి ఎన్నికల ప్రచారం చేపట్టేవారు. రానురాను జీపుల వినియోగం పెరిగింది. అనంతరం అంబాసిడర్ కార్లు వచ్చాయి. ప్రస్తుతం ఖరీదైన కార్లు, ఇతర వాహనాలను ప్రచారాలకు ఉపయోగిస్తున్నారు. పల్లెల్లో వాహనాల బారులు.. జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి అధునాతన వాహనాలనే వినియోగిస్తున్నారు. పల్లెల్లో ఖరీదైన కార్లు బారులు తీరుతున్నాయి. ఏ గ్రామానికి వెళ్లినా అభ్యర్థి వెంట పదుల సంఖ్యలో కార్లు కనిపిస్తున్నాయి. ప్రతి దాంట్లో ముఖ్య అనుచరులు వెళ్లి బలగాన్ని చూపుతూ ప్రజలకు చేరువవుతున్నారు. ప్రముఖులు ఆకాశమార్గాన.. పార్టీ అధ్యక్షులు, ప్రముఖులైతే సభలకు హెకలికాప్టర్ను వినియోగిస్తున్నారు. వంద కిలోమీటర్ల దూరంలో సభలు ఉంటే కార్లలో వెళ్తే సమయానికి చేరుకునే అవకాశం ఉండదు. తక్కువ సమయంలో ఎక్కువ సభలను చుట్టేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల అధ్యక్షులు, ప్రముఖులు హెలికాప్టర్లను వాడుతున్నారు. రోజూ మూడు, నాలుగు సభల్లో పాల్గొంటున్నారు. నాడు ఎంత పెద్ద సభ అయినా వాహనాల్లో వెళ్లేవారు. నేడు క్షణాల్లో ఆకాశమార్గాన సభల ముందు వాలిపోతున్నారు. చెట్లనీడ పోయి.. షామియానాలొచ్చే! తొలినాళ్లలో చెట్లకింద, రచ్చబండల వద్ద పగలు సభలు, సమావేశాలు నిర్వహించేవారు. విశాలమైన మైదానాల్లో సభలు, సమావేశాలు నిర్వహించేవారు కాదు. నియోజకవర్గానికి సంబంధించిన సభలు, సమావేశాలను గ్రామశివారులోని మర్రిచెట్లు, ఇతర వృక్షాల కిందనే ఏర్పాట్లు చేసుకునేవారు. నేలపైనే కూర్చొని ప్రజలు నేతల ప్రసంగాలు వినేవారు. టెంట్లు ఉండేవి కావు. నాటి పరిస్థితులకు భిన్నంగా ప్రస్తుతం సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. పెద్ద మైదానాల్లో షామియనాలు(టెంట్లు) ప్రజలు కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. సభ సమయంలోనూ మార్పులు వచ్చాయి. ప్రస్తుతం సాయంత్రం 4గంటలకు సభలు నిర్వహిస్తున్నారు. రాత్రి వెలుగులు పంచడానికి ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. కొత్తగా ప్రచార పాటలు, ఎల్ఈడీ స్క్రీన్లు ప్రచార పాటల్లోనూ మార్పులు వచ్చాయి. గతంలో కళాకారులు అప్పటికప్పుడు డప్పు చపుళ్లతో పాటలు పాడేవారు. ప్రతి పార్టీకి కళాకారుల బృందం ఉండేది. అభ్యర్థులు గ్రామానికి చేరుకునే గంట, రెండు గంటల ముందు కళాకారులు వచ్చి తమ పాటలో ఉత్సాహపరిచేవారు. నేడు అలాంటి పరిస్థితి ఏమీ లేదు. కానీ రికార్డింగ్ పాటలతో ప్రత్యేక రథాలను గ్రామాలు, పట్టణాల్లోని వీధుల్లో తిప్పుతున్నారు. అభ్యర్థి సేవలు, చేపట్టిన అభివృద్ధిపై రికార్డు చేసిన పాటలతో హోరెత్తిస్తున్నారు. కొందరు నాయకులు ఎల్ఈడీ స్క్రీన్ వాహనాల ద్వారా నేతల ప్రసంగాలను వినిపిస్తున్నారు. ఇవి కూడా చదవండి: 'బర్రెలక్క' తమ్ముడిపై దాడి..! ఓట్లు చీల్చుతుందనే భయంతోనే ఇలా.. -
ఎన్నికల వరుసలు.. మీ జిమ్మిక్కులు మాకు తెలుసు..!
మహబూబ్‌నగర్: చిచ్చా బాగున్నావా.. మావా ఎక్కడ పోతున్నావ్.. ఓ అక్కా నీ బిడ్డ మంచిగ చదువుతుండా.. మొన్న వడ్లు ఎన్ని పండినాయి... తాతా పాణం బాగుందా.. ఇలా రకరకాల పలకరింపులతో గ్రామాలు పులకరిస్తున్నాయి. ఎప్పుడు కోడి కూతతో లేచే ఊరు కాస్తా ఈ మధ్య కొత్త కొత్త నాయకుల పలకరింపులతోనే నిద్ర లేస్తుండటం విశేషం. ఉదయం లేవగానే కొత్త కొత్త మనుషులు. కొత్త వరుసలతో పలకరించటంతో జనం ఉబ్బి తబ్బిపోతున్నారు. కొందరు ఇదేంరా బాబు ఎన్నడూ లేని వీడు వరుస కలుపుతున్నాడంటూ లోలోనే గొనుగుతున్నారు. ఓటర్లకు దగ్గరయ్యేందుకు వివిధ పార్టీల నాయకులు వరుసలు కలిపేస్తూ జనాలను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా కొందరు వీరి జిమ్మికులు మాకు తెలుసులే అని అంటున్నారు. -
కోడ్ ఉల్లంఘనులపై కఠిన చర్యలు.. : రాహుల్‌రాజ్
సాక్షి, ఆదిలాబాద్: 'జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. ఈవీఎంలు, ఎన్నికల అధికారుల ర్యాండమైజేషన్ను పూర్తి చేసి నియోజకవర్గాల వారీగా కేటాయించాం. పీవోలు, ఏపీవోలకు శిక్షణ కొనసాగుతోంది. గురువారం నుంచి బ్యాలెట్ యూనిట్ల కమిషనింగ్ ప్రక్రియ చేపడుతాం. సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగేలా వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతీ ఓటరు మొబైల్లో సీ–విజిల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రలోభాలకు గురిచేసినట్లు తెలిస్తే ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. అలాగే ఓటర్లంతా స్వేచ్ఛగా ఓటు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. పోలింగ్ శాతం పెంపు కోసం ిస్వీప్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈమేరకు బుధవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు వివరాలు వెల్లడించారు.' సాక్షి: జిల్లాలో పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల సంఖ్య ఎంత..? ఎన్నికల నిర్వహణకు ఎంతమంది సిబ్బందిని నియమించారు? కలెక్టర్: జిల్లాలో 4,48,374 మంది ఓటర్లున్నారు. వీరి కోసం 592 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 290, బోథ్ నియోజకవర్గంలో 302 ఉన్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం 4వేల మంది సిబ్బందిని నియమించాం. సాక్షి: ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఏర్పాట్లు చేపడుతున్నారు..? కలెక్టర్: ఈవీఎంలు, పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ను పూర్తి చేసి నియోజకవర్గాల వారీగా కేటా యించాం. పీవో ఏపీవోలకు రెండు రోజులుగా శిక్షణ ఇస్తున్నాం. ఓపీవోలకు గురువారం నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది. రూట్, సెక్టోరల్ అధికారులను నియమించాం. పోలింగ్‌కు అవసరమైన సా మగ్రి అంతా ఇప్పటికే జిల్లాకు చేరుకుంది. దాని డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాన్ని స్థానిక టీటీడీసీలో ఏర్పాటు చేస్తున్నాం. స్ట్రాంగ్ రూంలతో పాటు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను కూడా అక్కడే చేపడుతాం. సాక్షి: జిల్లాలో ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉ న్నారు.బ్యాలెట్యూనిట్ల వినియోగంఎలాఉంది..? కలెక్టర్: 15 మంది కంటే ఎక్కువ అభ్యర్థులు పోటీలో ఉంటే 2 బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 25 మంది అభ్యర్థులు ఉన్నందున రెండు ఏర్పాటు చేస్తున్నాం. బోథ్ నియోజకవర్గంలో 10 మంది అభ్యర్థులున్నారు. వారి గుర్తులు, వీవీ ప్యాట్స్ కమిషనింగ్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన ఆరుగురు ఇంజనీర్లు నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున ఈ ప్రక్రియను చేపడుతారు. సాక్షి: పోస్టల్ బ్యాలెట్‌కు ఎంత మంది సిబ్బందిని వినియోగించనున్నారు. వారి కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు.? కలెక్టర్: జిల్లాలో 4వేల మంది సిబ్బందిని పోస్టల్ బ్యాలెట్‌కు వినియోగించనున్నాం. ట్రైనింగ్ సెంట ర్లో ఫెసిలిటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. అక్క డ ఎంత మంది ఓటర్లు ఓటు వేశారనే వివరాలు రావాల్సి ఉన్నాయి. ఎవరైన ఆలస్యంగా వచ్చి ఉంటే ఓటేసేందుకు వీలుగా రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఫెసిలిటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. పోలీసు ఉద్యోగుల కోసం ఇక్కడే ప్రత్యేకంగా మరో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. సాక్షి: జిల్లా వ్యాప్తంగా ఎన్ని సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. వాటిలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు..? కలెక్టర్: జిల్లాలో 301 సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహించనున్నాం. మరో 78 పోలింగ్ కేంద్రాల్లో బయట సీసీకెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు వీలుగా ప్రత్యేక బలగాలను మోహరించనున్నాం. సాక్షి: ఓటింగ్ శాతం పెంచడం కోసం ఎలాంటి చర్యలు చేపట్టారు..? కలెక్టర్: ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా స్విప్ ద్వారా బైక్, ఆటోలతో ప్రచారంతో పాటు కలెక్టరేట్లో సెల్ఫీ పాయింట్ ద్వారా అవగాహన కల్పించాం. వృద్ధులు, యువత, దివ్యాంగులతో ర్యాలీలు చేపట్టాం. యువత కోసం రంగోలి పోటీలు ఏర్పాటు చేశాం. గతంలో పోలింగ్ శాతం తక్కువగా నమోదైన కేంద్రాల్లో ఈ సారి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు గాను పాఠశాలల విద్యార్థుల ద్వారా వారి తల్లిదండ్రులకు ఓటు సంకల్ప పత్రాలను పంపించాం. సాక్షి: ప్రలోభాల కట్టడికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు..? కలెక్టర్: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి మద్యం, డబ్బు ప్రవాహం జరగకుండా కట్టడి చేస్తున్నాం. జిల్లాలోని ఏడు ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచుతున్నాం. ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిస్టికల్ సర్వైలెన్స్ టీమ్, వీడియోగ్రఫీ బృందాల ద్వారా ప్రత్యేక నిఘా ఉంచాం. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా, కోడ్‌ను ఉల్లంఘించినా ప్రజలు నిర్భయంగా సీ–విజిల్ యాప్ ద్వారా ఫి ర్యాదు చేయాలి. ఫిర్యాదు అందిన వంద నిమిషా ల్లోపు వారిపై చర్యలు తీసుకుంటాం. సాక్షి: ఇప్పటివరకు మోడల్ కోడ్ ఉల్లంఘన కేసులేమైనా నమోదయ్యాయా. వాటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..? కలెక్టర్: జిల్లాలో 17 మోడల్ కోడ్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఇందులో 16 కేసుల్లో బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. ఒక కేసు తప్పని తేలడంతో దాన్ని తిరస్కరించాం. సాక్షి: పోల్ చీటీల పంపిణీ ఎంత వరకు జరిగింది. ఎప్పటివరకు పూర్తవుతుంది..? కలెక్టర్: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి ఓటరుకు పోల్ చీటీలను అందించేలా గత శుక్రవారం నుంచి పంపిణీని షురూ చేశాం. 95 శాతం వరకు పూర్తయింది. ప్రస్తుతం షిఫ్టెడ్, డెలిటెడ్ వంటి వివరాలను బీఎల్వోల నుంచి సేకరిస్తున్నాం. సాక్షి: పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు..? కలెక్టర్: ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి పోలింగ్ కేంద్రంలో షామియానాలు, కుర్చీ లు, బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నాం. దివ్యాంగులు, వృద్ధుల కోసం వీల్చైర్లతో పాటు ఒక సహాయకుడిని అందుబాటులో ఉంచుతాం. -
కర్ణాటక రాజకీయం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా ఎన్నికలపై కర్ణాటక రాజకీయలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. మూడు ప్రధాన పార్టీలు ఆ రాష్ట్ర అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తు న్నాయి. అక్కడ జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమవుతోందనే అంశాన్ని బీఆర్ఎస్ ఓటర్లలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ఓటేస్తే.. ఇచ్చిన హామీలను గాలికొదిలేస్తుందనే ప్రచారం చేస్తోంది. ఇటీవల జహీరాబాద్‌లో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. ఎన్నికల ప్రచార ంలో భాగంగా కర్ణాటక వాసులతో బంధుత్వం ఉన్న మల్లేశంతో ప్రత్యేకంగా ముచ్చటించారు. అక్కడ వ్యవసాయానికి విద్యుత్ సరఫరా బాగా లేదని, పింఛన్లు నామమాత్రంగా ఇస్తున్నారనే అంశాన్ని ఆయనతో చెప్పించి ఓటర్లకు వివరించే ప్రయత్నం చేశారు. అక్కడి ఓటర్లు కాంగ్రెస్‌ను ఎందుకు ఎన్నుకున్నామా? అని ఆ రాష్ట్రంలోని తమ బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన చెప్పిన మాటలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. హస్తం నేతల ప్రచారం ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం విదితమే. ఆ ప్రభావం ఎక్కువగా జహీరాబాద్ నియోజకవర్గంపై ఉంటుందని పార్టీ భావిస్తోంది. ఈ మేరకు జహీరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారానికి ఆరాష్ట్ర మంత్రులు హాజరవుతున్నారు. ఇటీవల పట్టణంలో ఉన్న షెట్కార్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సమావేశానికి మంత్రులు రహీం, ఈశ్వర్ఖాండ్రే హాజరయ్యారు. తమ రాష్ట్రంలో ఎన్నికల హామీలు విజయవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ సైతం.. బీజేపీ సైతం కర్ణాటక పార్టీ నేతలతో జహీరాబాద్‌లో ప్రచారం చేయిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పతో పట్టణంలో బహిరంగ సభను నాయకులు ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో వెనుకబడిన పార్టీ ఆ రాష్ట్ర నేతలతోనైనా కొంతమేరకు ఊపు వస్తుందనే భావిస్తోంది. ప్రచారానికి వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలో వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. ఆ రాష్ట్రంతో సత్సంబంధాలు కర్ణాటకతో జిల్లాలో ప్రధానంగా జహీరాబాద్, నారాయణఖేడ్ రెండు నియోజకవర్గాలకు సరిహ ద్దులు ఉన్నాయి. అందోల్ నియోజకవర్గంలోని రాయ్‌కోడ్ వంటి మండలాలు కూడా సమీపంలో ఉన్నాయి. దీంతో ఈ మూడు నియోజకవర్గాల ప్రజలు ఆరాష్ట్రంతో బంధుత్వాలు, స్నేహ సంబంధాలు కలిగి ఉంటారు. వ్యాపార లావాదేవీల కోసం కూడా సంబంధాలుంటాయి. ఈ నేపథ్యంలో అక్క డి రాజకీయాలు ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావాన్ని చూపుతాయో లేదో తెలియాలంటే వేచిచూడాలి. నేడు కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప రాక జహీరాబాద్: బుధవారం పట్టణానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఎన్నికల ప్రచారానికి వస్తున్నట్లు బీజేపీ అభ్యర్థి రాంచందర్ రాజనర్సింహ మంగళవారం తెలిపారు. ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న సభలో ఆయన ప్రసంగిస్తారన్నారు. సభకు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు. -
ఖైదీలకు ఓటు హక్కు ఉంటుందా..? ఉండదా..?
నల్గొండ: భారత రాజ్యాంగం ప్రకారం 18 ఏళ్లు నిండిన భారత పౌరులందరికీ ఓటు హక్కు ఉంటుంది. జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కూడా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. వివిధ నేరాల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ప్రివెంట్యూ డిటర్మినేషన్ పద్ధతిలో ఓటు వేయవచ్చు. నియోజకవర్గం పేరును సూచిస్తూ తాము ఓటర్లమని పోలింగ్ బూత్, ఓటరు క్రమసంఖ్యతో ఓటేసే అవకాశం కల్పించాలని రాతపూర్వకంగా జైలర్‌ను కోరాలి. ఖైదీలు సూచించిన ప్రాంతాల నుంచి పోస్టల్ బ్యాలెట్లను తెప్పించి జైలు నుంచే ఓటేసే అవకాశం కల్పిస్తారు. పోలింగ్ బూత్‌లో ప్రత్యేక నిబంధనలు ► పోలింగ్ రోజున ఓటరు గోప్యత పాటించకుండా తాను ఎవరికి ఓటు వేసే విషయాన్ని బహిర్గతం చేస్తే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లుగా అధికారులు భావించి సదరు వ్యక్తిని ఓటు వేయడానికి అనుమతించరు. ► అంధులు ఓటు వేసేందుకు వీలుగా అతడికి సహాయకుడిగా 18 ఏళ్లు నిండిన వ్యక్తిని అధికారులు పోలింగ్ కేంద్రానికి అనుమతిస్తారు. సహాయకుడిగా వచ్చే వ్యక్తి ఏదైనా గుర్తింపు కార్డు తీసుకొస్తేనే అనుమతిస్తారు. ► ఓటరు ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌కు వచ్చినప్పుడు అప్పటికే అతడి ఓటు ఎవరైనా వేస్తే పోలింగ్ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. అప్పడు అది టెండర్ ఓటుగా పరిగణించి పోలింగ్ అధికారుల వద్ద ఉండే ప్రత్యేక బ్యాలెట్ పేపర్ ద్వారా పాత పద్ధతిలో ఓటు వేయవచ్చు. ► ఎవరైనా ఓటు వేయడానికి వచ్చినప్పుడు అది బోగస్ ఓటు అని, తక్కువ వయస్సు అని పోలింగ్ ఏజెంట్లు చాలెంజ్ చేస్తే పోలింగ్ అధికారి ఏజెంట్ నుంచి విషయాలను సేకరిస్తారు. ప్రాథమిక విచారణ జరిపి ఆరోపణ నిజమైతే సదరు ఓటరును పోలీస్ సిబ్బందికి అప్పగిస్తారు. ► ఒక ఓటరు తాను నచ్చిన పార్టీకి ఓటు వేస్తే.. అది వేరే పార్టీకి పడ్డట్లు ఆరోపణలు చేస్తే అధికారులు టెస్టు ఓటును అనుమతిస్తారు. అయితే ఆ ఆరోపణలు రుజువు కాకుంటే చర్యలు తీసుకుంటామని కూడా సదరు ఓటరుకు ముందే హెచ్చరిస్తారు. – తిరుమలగిరి (తుంగతుర్తి) -
TS: అత్తా, అల్లుళ్ల మధ్య యుద్ధం
నిజామాబాద్: రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పనిచేశారు ప్రశాంత్‌రెడ్డి. ఈసారి మేనల్లుడు అయిన ప్రశాంత్‌రెడ్డిపై ఎలాగైన విజయం సాధించాలని మేనత్త అన్నపూర్ణమ్మ పంతం. బీజేపీ అభ్యర్థిగా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ పోటీ చేస్తుండగా ఆమె సోదరుని కుమారుడు మేనల్లుడైన వేముల ప్రశాంత్‌రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన వేముల సురేందర్‌రెడ్డికి స్వయానా చెల్లెలు అన్నపూర్ణమ్మ. ఆమె పుట్టినిల్లు వేల్పూర్ కాగా మెట్టినిల్లు కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి. మేనత్త, అల్లుడు రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులుగా బరిలోకి దిగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 2014 ఎన్నికల్లో ప్రశాంత్‌రెడ్డి మేనత్త కొడుకైన మల్లికార్జున్‌రెడ్డితో పోటీ పడి విజయం సాధించారు. ఇప్పుడు మేనత్తతో పోటీలో నిలువడం విశేషం. వీరి మధ్య పోరు రసవత్తరంగా కొనసాగుతోంది. -
ఆ అభ్యర్థి మార్పు.. కాంగ్రెస్ కొంప ముంచనుందా?
సాక్షి,ఆదిలాబాద్: బోథ్ కాంగ్రెస్ అభ్యర్థి మార్పు ప్రయోజనమెంతా అనే చర్చ ప్రస్తుతం ఆ పార్టీలో సాగుతోంది. బీఆర్ఎస్, బీజేపీల ప్రచారం ముందు నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచారం దిగదుడుపేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పట్టుబట్టి మరీ టికెట్ తెచ్చుకున్న తర్వాత అభ్యర్థి తీరుపై పార్టీలోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్య నేతలు కలిసిరాకపోవడం, మండల శ్రేణుల్లో ఉత్సాహం కొరవడడంతో ఇక్కడ హస్తం గెలుపుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రచారం నామమాత్రమే.. బోథ్ కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ రెండో జాబితాలో వన్నెల అశోక్‌ను మొదట ప్రకటించింది. దీంతో నియోజకవర్గంలో టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ఆడె గజేందర్, నరేశ్ జాదవ్‌లు కలిసి కార్యకర్తలతో సమావేశం నిర్వహించి అభ్యర్థిని మార్చాలనే డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధిష్టానం అశోక్ అభ్యర్థిత్వాన్ని మార్చింది. ఆడె గజేందర్‌కు టికెట్ కేటాయిస్తూ మరో జాబితాలో పార్టీ స్పష్టం చేసింది. ఈ పరిణామాలతో ఆయన కాంగ్రెస్ రెబల్‌గా నామినేషన్ కూడా వేశారు. ఆ తర్వాత అశోక్ నామినేషన్ ఉపసంహరించుకోవడంతో పాటు బీఆర్ఎస్లో చేరారు. ఇదిలా ఉంటే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌తో సఖ్యత ఉన్న ఓ నేత ద్వారా పైరవీ చేసి మరీ టికెట్ మార్చడంలో ఆడె గజేందర్ సక్సెస్ అయ్యాడనే ప్రచారం జరిగింది. అందులో చూపెట్టిన ఉత్సాహం ప్రస్తుతం ప్రచారంలో కనిపించడం లేదని నియోజకవర్గంలో ఆ పార్టీ నాయకులే చర్చించుకోవడం గమనార్హం. ఈ క్రమంలో టికెట్ ఎందుకోసం తెచ్చుకున్నాడో అని వారు అనుమానాలు వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తోంది. కలిసిరాని నేతలు.. బోథ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పరంగా 18 మంది టికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా, అందులో ఆడె గజేందర్ మినహాయిస్తే వన్నెల అశోక్ బీఆర్ఎస్లో చేరారు. తొడసం ధనలక్ష్మి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇక అసమ్మతి వర్గంగా ఇద్దరు ఒక్కటై సమావేశం నిర్వహించిన ఆడె గజేందర్‌కు ప్రస్తుతం ప్రచారంలో నరేశ్ జాదవ్ కలిసిరాకపోవడం గమనార్హం. మిగతా దరఖాస్తుదారులు కూడా అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తుండటం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. రేవంత్ సభ జరిగినప్పుడు పాల్గొన్న కుమ్ర కోటేష్ ఆ తర్వాత ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు. దీనికి కారణం లేకపోలేదు.. గజేందర్ మిగతా నేతలను కలుపుకపోవడం లేదని పార్టీలో చర్చించుకుంటున్నారు. మండలాల్లో ప్రచారానికి వెళ్లినప్పుడు ఆయన వెంట పార్టీ ముఖ్య నేతలు కనిపించడం లేదన్న అపవాదు కూడా వ్యక్తమవుతుంది. రేవంత్ వివరణ ఇచ్చినప్పటికీ.. బోథ్ కాంగ్రెస్ అభ్యర్థి మార్పు విషయంలో బోథ్ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చినప్పటికీ శ్రేణుల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీలను ఢీకొనే స్థాయిలో ప్రచారం చేయనప్పుడు గజేందర్ టికెట్ తెచ్చుకోవడం ద్వారా ఏం సాధించారన్న అభిప్రాయం వారిలోనే ఉత్పన్నమవుతుంది. రాష్ట్రంలో 12 స్థానాల్లో ఆదివాసీలకు 6, లంబాడాలకు 6 చొప్పున సీట్లు కేటాయించాలని పార్టీ నిర్ణయించిందని, అయితే ఇల్లందులో లంబాడా నేత, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ టికెట్ ఆశించగా, అక్కడ ఆదివాసీ నేత కోరం కనకయ్యకు కేటాయించినట్లు రేవంత్ చెప్పారు. దీంతో సామాజిక సమీకరణాల్లో భాగంగా బోథ్‌లో మొదట అశోక్‌కు టికెట్ ప్రకటించినా మార్చాల్సి వచ్చిందన్నారు. ఈ క్రమంలోనే గజేందర్‌కు కేటాయించినట్లు చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం నియోజకవర్గంలో ఓ చర్చ సాగుతోంది. మొదటి నుంచి సర్వేలో ముందున్న వారికి టికెట్ కేటాయిస్తామని చెప్పి ఇలా సమీకరణాల పేరుతో అభ్యర్థిని మార్చడం, ప్రస్తుతం బరిలో నిలిచిన గజేందర్ ప్రచారంలో దూకుడు చూపెట్టకపోవడంతో రేవంత్ వ్యాఖ్యలతో శ్రేణులు విభేదిస్తున్నట్లుగా కనిపిస్తోంది. -
నలభై రెట్లు పెరిగిన అసెంబ్లీ ఎన్నికల వ్యయం
నిర్మల్ ఖిల్లా: ప్రస్తుతం శాసనసభ ఎన్నికల సమరం కొనసాగుతోంది. మరోవారం రోజుల్లో పోలింగ్ ఉండడంతో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నియమావళి ప్రకారం బరిలో నిలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఇష్టారీతిన డబ్బు ఖర్చు చేయడానికి వీలులేదు. ప్రస్తుత ఎన్నికల నిబంధనలు అనుసరించి వ్యయపరిమితి గరిష్టంగా రూ.40 లక్షలు మాత్రమే విధించబడినది. అయితే ఈ వ్యయ పరిమితి గతంలో ఉన్నదానికంటే క్రమంగా శ్రీఇంతింతై వటుడింతై...శ్రీఅన్న చందంగా పెరుగుతూ వస్తోంది. భారతదేశంలో స్వాతంత్య్రానంతరం 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో అప్పటి అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల్లో పోటీ చేసిన ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ఖర్చు గరిష్టంగా రూ.లక్షగా నిర్దేశించబడింది. అప్పటి నుంచి ప్రతీసారి పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థికి గరిష్టంగా రూ.40 లక్షలు ఖర్చు చేయడానికి వ్యయపరిమితి విధించబడింది. అంటే ఎన్నికలు ప్రారంభమైన ఏడు దశాబ్దాల కాలంలో దాదాపు 40 రెట్లు పెరుగుతూ వచ్చింది. నామినేషన్ వేసిన రోజు నుంచే లెక్క షురూ.. 2014 అసెంబ్లీ ఎన్నికలకు రూ.28 లక్షలుగా ఉన్న అభ్యర్థుల వ్యయ పరిమితిని కేంద్ర ఎన్నికల కమిషన్ ఏకంగా రూ.40 లక్షలకు పెంచింది. లోక్‌సభ ఎన్నికల వ్యయ పరిమితిని రూ.95 లక్షలుగా నిర్ణయించింది. నామినేషన్ వేసిన రోజు నుంచి పోలింగ్ జరిగే వరకు అభ్యర్థి చేసే ఖర్చును ఎన్నికల ఖర్చుగా పరిగణిస్తారు. పార్టీ చేసే ఖర్చు మాత్రం అభ్యర్థి వ్యయంలోకి రాదు. ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులు చేసే ఖర్చులను బ్యాంకు ఖాతా ద్వారానే నిర్వహించాలి. అందుకోసం నామినేషన్ దాఖలు చేసే నాటికే పోటీలో ఉన్న అభ్యర్థులంతా కొత్తగా బ్యాంకు అకౌంట్ ప్రారంభించుకున్నారు.. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు లేదా ప్రభావితం చేసేందుకు అభ్యర్థులు ఎలాంటి ఖర్చు చేయరాదని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల తనిఖీల్లో పట్టుబడిన తాయిలాలను అభ్యర్థుల వ్యయంలో చేర్చాలని ఎన్నికల కమిషన్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. రోజువారీగా అభ్యర్థులు చేసే వ్యయంతో పాటు పార్టీ జెండాలు, బ్యానర్లు, కరపత్రాలు, పోస్టర్లు, టోపీలు, కండువాలు, భోజనాలు, వాహనాల అద్దె, ఇంధన ఖర్చులు, సభా వేదికలు, మైకులు, పత్రికలు, టీవీ, సోషల్ మీడియా ప్రకటనలకు చేసే ఖర్చులను కలిపి అభ్యర్థి ఎన్నికల వ్యయంగా లెక్కిస్తారు. వీటిలో ప్రతి దానికీ బిల్లులు చూపించాల్సి ఉంటుంది. వీటన్నింటికి ఎన్నికల సంఘం ధరలు నిర్ణయిస్తుంది. వాటి ప్రకారమే లెక్కలు చూపించాల్సి ఉంటుంది. ఇవి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వేర్వేరుగా ఉన్నాయి. పెరుగుతున్న వ్యయపరిమితి.. 1952 సాధారణ ఎన్నికల్లో రూ.లక్షతో ప్రారంభమైన ఎన్నికల వ్యయ పరిమితి 1962 నాటికి రూ.3 లక్షలు 1971 ఎన్నికల నాటికి రూ.4 లక్షలు, 1975 నాటికి రూ.5 లక్షలు పెరుగుతూ వచ్చింది. 1984లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా రూ.10 లక్షలకు చేరువైంది. 1991 నాటికి మరో రెండు లక్షలు పెరిగి రూ.12 లక్షలకు చేరుకుంది. 1999లో రూ.15 లక్షలు, 2004 నాటికి రూ.17 లక్షలు, 2009లో రూ.26 లక్షలు, 2014లో రూ.28 లక్షల వ్యయపరిమితిని విధించారు. ప్రస్తుతం జరుగుతున్న 2023 ఎన్నికల్లో ఈ గరిష్ట వ్యయపరిమితి రూ.40 లక్షలకు చేరుకుంది. వ్యయపరిమితి పెరుగుదల ఇలా.. సంవత్సరం వ్యయపరిమితి (రూ.లక్షలలో) 1952 1 1962 3 1971 4 1975 5 1984 10 1991 12 1999 15 2004 17 2009 26 2014 28 2023 40 -
'నేతలు మారినా.. ఓటరు మారేనా?' ఇంతకీ.. జంప్‌జిలానీల బలమెంత?
సాక్షి, మెదక్: శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్నా ఆయా రాజకీయ పార్టీల్లో నేతల వలసలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ఆయా పార్టీల నుంచి ఇతర పార్టీలకు నేతల వలసలు జోరుగా సాగుతున్నాయి. పార్టీలు మారిన నేతలతో ఓటర్లుకూడా మారుతారా? అనేది సందేహం. జంప్‌జిలానీల బలమెంత? అయితే ఈ నేపథ్యంలో జంప్‌జిలానీల బలమెంత? వాళ్లకున్న ఓటు శాతం ఎంత? అనే ప్రశ్నలు అభ్యర్థులను వెంటాడుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల షెడ్యూల్‌కన్నా ముందే సిట్టింగ్‌లకు టికెట్లు కేటాయించారు. దీంతో బీఆర్ఎస్లో టికెట్ ఆశించి భంగపడిన నేతలు కాంగ్రెస్‌లోచేరి టికెట్టు తెచ్చుకోగా కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన ఆశావహులు సైతం బీఆర్ఎస్లోకి వలసలు వెళ్లారు. అలాగే అధికార పార్టీకి చెందిన ద్వితీయశ్రేణి నేతలు కాంగ్రెస్‌లో చేరారు. అలాంటి పరిస్థితుల్లో అసలు పార్టీ మారిన వారితోపాటు ఓటర్లు బదిలీ ఏ మేరకు జరుగుతుందన్నది ఇప్పుడు అధినేతల ముందు ప్రశ్న. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి జిల్లాలో రాజకీయ పార్టీల్లో ఒక పార్టీ నుంచి మరో పార్టీలకు జంప్ జిలానీల సంఖ్య అధికసంఖ్యలో పెరిగింది. ఆయా పార్టీల్లో నేతలపై వ్యతిరేకతతో కొందరు, టికెట్ ఆశించి రాకపోవడంతో మరికొందరు ఆయా పార్టీల కండువాలు మార్చేశారు. అయితే, వలస పోతున్న నేతల వెంట ఓటు బదిలీ జరిగేనా అన్న సందిగ్ధత ఆయా పార్టీల అభ్యర్థుల్లో నెలకొంది. మెదక్‌లో.. మెదక్‌లో బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్కు రాజీనామాచేసి కాంగ్రెస్ నుంచి తన కుమారుడు మైనంపల్లి రోహిత్‌రావుకు, మల్కాజ్గిరి నుంచి ఆయన టికెట్లు తెచ్చుకున్నారు. దీంతో మెదక్ కాంగ్రెస్ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, మామిళ్ల ఆంజనేయులు, మ్యాడం బాలకృష్ణ ఒకరి తరువాత ఒకరు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కాగా బీఆర్ఎస్లో తమకు ప్రధాన్యత దక్కడం లేదని ద్వితీయ శ్రేణినాయకులు కాంగ్రెస్‌లో చేరారు. పంజావిజయ్ కుమార్ సైతం ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో విబేధించి ఆయన బీజేపీలోచేరి టికెట్ తెచ్చుకున్నారు. నర్సాపూర్‌లో.. నర్సాపూర్‌లో అధికార పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి కాకుండా సునితాలక్ష్మారెడ్డికి టికెట్ దక్కింది. దీంతో మదన్‌రెడ్డికి మెదక్ ఎంపీ టికెట్ ఇస్తామని ఆ పార్టీ అధినేత కేసీఆర్ బుజ్జగించడంతో మదన్‌రెడ్డి సునితారెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ టికెట్ రాజిరెడ్డికి దక్కడంతో ఆ టికెట్‌ను ఆశించి భంగపడిన గాలిఅనిల్ వెంటనే అధికార బీఆర్ఎస్లో చేరారు. దీంతో నర్సాపూర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ద్వితీయశ్రేణి నాయకులైన వెల్దూర్తి ఎంపీపీ స్వరూప నరేందర్‌రెడ్డి, చిలిపిచెడ్ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, ఆయన తల్లి సుహాసిని రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన విషయం విధితమే.. వారితోపాటు ఆ నేతల వెంట కింది స్థాయి నాయకులు కూడా కండువాలు మార్చారు. దొరకని ఓటరు నాడి.. ఒకపార్టీ నుంచి మరో పార్టీమారిన నాయకుడి బలం ప్రజల్లో ఏమేరకు ఉంది. ఆ నేత చెబితే ఓట్లు పడతాయా? కండువా మార్చిన నాయకుడికి తన గ్రామం, మండలం, పట్టణం, జిల్లాలో ఏమేరకు పేరుంది? అన్న అనుమానాలు అభ్యర్థుల్లో నెల కొన్నాయి. స్థానిక నేతలు తమ వైపు రావడంతో ఆయా ప్రాంతాల్లో అప్పటి వరకు వారిని నమ్మిన ఓటర్లు ఇప్పుడు వారు మారిన పార్టీకి వేస్తారా? లేదా? అన్న ఆందోళన పలువురు అభ్యర్థుల్లో కనబడుతోంది. ప్రస్తుతం జిల్లాలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఏ పార్టీ మీటింగ్ పెట్టినా జనాలు తండోపతండాలుగా సభలకు వెళుత్తున్నారు. ఈ పరిస్థితులలో ఓటర్ల నాడి తెలియని పరిస్థితి. ఎవరికి వారు తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ ఈ వలస నేతలతో ఓటరు మనవైపు వస్తాడా.. అని అభ్యర్థులు మథనపడుతున్నారు. -
'పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు' : రేవంత్‌రెడ్డి
సాక్షి, మెదక్: తమ ప్రభుత్వం రాగానే పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు, గిరిజన తండాల అభివృద్ధికి వంద కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం నర్సాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయభేరి సభలో ఆయన ముఖ్య అథితిగా పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గం గిరిజనుల అడ్డా, గడ్డ అని అభివర్ణించారు. బీఆర్ఎస్ హయాంలో గిరిజన తండాలలో అభివృద్ధి జరగలేదని, అనేక సమస్యలతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం రాగానే గిరిజనుల పోడు భూములకు పట్టాలు ఇచ్చి, ఇతర పథకాలు అందించి గిరిజనుల అభివృద్ధికి కృషిచేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి మోసంచేసి పలువురు నాయకులు పార్టీని వీడి పదవులకు అమ్ముడు పోవడంతో సభ ఎలా ఉంటుందోనని అనుమానంతో వచ్చానని, కాని సభాస్థలిని చూడగానే జనం చీమల మాదిరిగా హాజరవడం చూసి ఆనందించానని చెప్పారు. కార్యకర్తలు కార్యాచరణతో కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డిని గెలిపించేందుకు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ను మర్చి పోయేలా చేద్దాం! ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు భూదందాలకు, అవినీతికి పాల్పడడంతో పేదలు చాలా ఇబ్బందుల పాలయ్యారని ఆరోపించారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ను మర్చి పోయేలా చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. దళితులు, గిరిజనుల పోడు భూములకు పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని, కాళేశ్వరం, త్రిబుల్ ఆర్ రోడ్డు విషయంలో భూములు కోల్పోయిన వారికి ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని ఆయన రేవంత్‌రెడ్డిని కోరారు. నిరుద్యోగులకు బీఆర్ఎస్ ధోకా.. మెదక్ జిల్లాను రాజన్నసిరిసిల్ల జోన్లో కలిపి జిల్లాలోని నిరుద్యోగులను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆవుల రాజిరెడ్డి ఆరోపించారు. జిల్లాను రాజన్న సిరిసిల్లజోన్ నుంచి మార్పుచేసి చార్మినార్ జోన్లో కలపాలని ఆయన కోరారు. పేదల గుండె చప్పుడు విఠల్‌రెడ్డి నర్సాపూర్ నియోజకవర్గం నుంచి సీపీఐ ఎమ్మెల్యేగా దివంగత చిలుముల విఠల్‌రెడ్డి ఐదుసార్లు గెలిచి పేద ప్రజల గుండె చప్పుడై అసెంబ్లీలో గళం వినిపించి నర్సాపూర్ గౌరవాన్ని పెంచారని గుర్తు చేశారు. ప్రస్తుత ఎన్నికలలో సీపీఐతో తమ పార్టీకి పొత్తు ఉందని చెప్పారు. కాంగ్రెస్‌లో పదవులు అనుభవించి ఎన్నికలలో ఓడిపోగానే పార్టీ కార్యకర్తలకు వెన్నుపోటు పొడిచి శత్రువు పంచన చేరడం తగునా అని సునీతారెడ్డిని ప్రశ్నించారు. అలాంటి వారిని ఎలా గెలిపిస్తారని ప్రజలను ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బాధితులకు న్యాయం చేస్తాం! తమ పార్టీ అధికారంలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు, త్రిబుల్ ఆర్ రోడ్డు కోసం భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాకుండా బాధితులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డిని గజమాల, శాలువాలతో ఘనంగా సన్మానించారు. రామంతాపూర్ సర్పంచ్ గోపి, కొల్చారం మాజీ సర్పంచ్ శేఖర్ తదితరులు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. సభలో పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, సీపీఐ జిల్లా కార్యదర్శి టీఎం కాలేక్, కాంగ్రెస్ నాయకులు ఆంజనేయులుగౌడ్, శేషసాయిరెడ్డి, సుహాసినీరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, సుజాత, లక్ష్మీకాంతారావు, రవీందర్‌రెడ్డి, మల్లేశ్, సుధీర్‌రెడ్డి, శ్రీనివాస్‌గుప్తా, చిన్న అంజిగౌడ్, హకీం, రిజ్వాన్, కమల, నరేందర్‌రెడ్డి, పల్లె జయశ్రీ, మణిదీప్, ఉదయ్, రషీద్ పాల్గొన్నారు. తడబడిన నాయకులు.. సభలో పలువురు పార్టీ నాయకులు తమ ప్రసంగాలలో తడబడ్డారు. ఆ పార్టీ నాయకురాలు చిలు ముల సుహాసినీరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని విమర్శించి కాంగ్రెస్‌కు ఓటెయ్యాలని ప్రజలను కోరేక్రమంలో ‘కారు’ గుర్తు అని పొరపాటుగా మాట్లాడి హస్తం గుర్తుకు ఓటెయ్యాలని తిరిగి సరిదిద్దుకున్నారు. అలాగే మరో నాయకుడు సుధీర్‌రెడ్డి కూడా తన ప్రసంగంలో ‘‘18 సంవత్సరాలు అధికారంలో ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారు’’ అని తడబడడం గమనార్హం. కేసీఆర్ మిత్ర ద్రోహి నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ల మధ్య సుమారు 50 ఏళ్ల స్నేహం ఉందన్నారు. కలిసి తిరిగినం, కలిసి తాగినం, కలిసి తిన్నమని వారిద్దరి స్నేహం గురించి కేసీఆర్ చెప్పే వారని, అలాంటి మంచి మిత్రుడు మదన్‌రెడ్డికి పార్టీ టికెట్ ఇవ్వకుండా కేసీఆర్ మోసం చేయడంతో పాటు మిత్ర ద్రోహానికి పాల్పడ్డాడని మండిపడ్డారు. ఇవి చదవండి: 'నేతలు మారినా.. ఓటరు మారేనా?' ఇంతకీ.. జంప్‌జిలానీల బలమెంత? -
'పెన్షన్లు కాదు.. నౌకర్లు కావాలి' : ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు
సాక్షి, మెదక్: చదువుకున్న బిడ్డలకు నౌకర్లు కావాలే గాని.. పెన్షన్లు కాదని .. ఇంట్లో పిల్లలకు కొలువులు వస్తే పెన్షన్లకు ఆశపడే అవసరం ఎందుకు ఉంటుందో తల్లిదండ్రులు ఆలోచించాలని దుబ్బాక బీజేపీ అభ్యర్థి, ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు కోరారు. సోమవారం నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి పార్టీ కండువాలు కప్పారు. అలాగే దౌల్తాబాద్, తొగుట మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందన్‌రావు మాట్లాడారు. ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాక యువత తీవ్ర నిరాశలో ఉన్నా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 10 ఏళ్లుగా ఎంత మందికి ఉద్యోగాలిచ్చిందో ప్రజలు ఆలోచించాలన్నారు. ఉద్యోగాలు వస్తే కుటుంబాలు ఆర్థికంగా బాగుపడుతాయి తప్పా ప్రభుత్వాలు ఇచ్చే స్వార్థపూరిత కానుకలతో కాదన్నారు. నిరుద్యోగులు కేసీఆర్ ప్రభుత్వాన్ని తప్పకుండా సాగనంపుతారన్నారు. కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దు! రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్ కల్లబొల్లి మాటలు, కథలు చెబుతున్నాడని.. వాటిని ప్రజలు నమ్మి మళ్లీ మోసపోవద్దని రఘునందన్‌రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తుందని.. అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. బీజేపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోతో రైతులు, నిరుద్యోగులు, అన్ని వర్గాలకు ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. మరోసారి ఆశీర్వదించండి.. పేదలు, నిరుద్యోగులు, ఉద్యోగ, కార్మిక, కర్షక వర్గాల తరఫున పోరాడుతున్న తనను మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని రఘునందన్‌రావు కోరారు. నిరుద్యోగులు, అంగన్వాడీలు, వీఆర్ఏ, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు న్యాయపరంగా దక్కాల్సిన హక్కుల కోసం అనేక పోరాటాల్లో పాల్గొన్నానని, వారితో కలిసి ధర్నాలు, ఆందోళనలు ప్రత్యక్షంగా చేసినట్లు చెప్పారు. అసెంబ్లీలో సైతం పేదలు, నిరుద్యోగులతో పాటు చాలా సమస్యలపై గళం ఎత్తి ప్రభుత్వాన్ని నిలదీశానన్నారు. ప్రశ్నించే గొంతుకను.. కమలం పువ్వు గుర్తుకు ఓట్లేసి మళ్లీ అసెంబ్లీకి పంపిస్తే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తానన్నారు. దుబ్బాక అభివృద్ధి కోసమే నా తపన.. ‘దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే నా తపన, ఆవేదన, ఆకాంక్ష’ అని రఘునందన్‌రావు అన్నారు. నియోజకవర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదురొడ్డి న్యాయపరంగా దక్కాల్సిన నిధులు వచ్చేలా పోరాడుతున్న విషయం ప్రజలకు తెలిసిందేనన్నారు. తాను గెలిచిన 3 ఏళ్లలో నియోజకవర్గంలో ఎంతో మార్పు వచ్చిందో.. అభివృద్ధి ఎలా పరుగెత్తింతో గమనించి మళ్లీ గెలిపించాలని కోరారు. ఈ సారి దుబ్బాకను రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతానన్నారు. బీఆర్ఎస్కు అవకాశం ఇస్తే ఆగమవుతాం! దుబ్బాక ప్రజలు బీఆర్ఎస్కు ఓట్లు వేసి ఆగం కావద్దని మాధవనేని రఘునందన్‌రావు కోరారు. సోమవారం మాచిన్పల్లి, చెట్లనర్సంపల్లి, అప్పాయిపల్లి గ్రామాలతో పాటు తొగుట మండలంలోని వర్ధరాజుపల్లి, కాన్గల్, గుడికందుల గ్రామాల్లో రఘునందన్‌రావు ఎన్నికల ప్రచారం చేపట్టారు. అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌గా మారిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే వృథా అవుతుందన్నారు. ఇంటింటి ప్రచారం! చేగుంటతో పాటు రుక్మాపూర్ గ్రామంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా ఉపసర్పంచ్ రాంచంద్రం సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మ్యాకల రమేశ్, బాలరాజు, నవీన్, స్వామి, ముత్యం, సిద్దిరాములు, శ్రీరాం సిద్దిరాంలు, గణేష్, లావణ్య పాల్గొన్నారు. ఇవి కూడా చదవండి: 'పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు' : రేవంత్‌రెడ్డి -
‘ధరణి’ చుట్టే రాజకీయం
సాక్షి, కామారెడ్డి: వీఐపీలు బరిలో నిలిచిన కామారెడ్డి నియోజకవర్గంలో భూమి చుట్టూ ఓట్ల రాజకీయం నడుస్తోంది. బీఆర్ఎస్ను గెలిపిస్తే భూములను గుంజుకుంటారని ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు, నేతలు ఆరోపణలు చేస్తుండగా.. అవి మతిలేని మాటలంటూ అధికార పక్షం తిప్పికొడుతోంది. దీంతో నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఇదే అంశం మీద జోరుగా చర్చలు నడుస్తున్నాయి. కామారెడ్డి నియోజకవర్గం తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన గడ్డగా కీర్తికెక్కింది. ఇక్కడ జరిగినన్ని ఉద్యమాలు మరెక్కడా జరగలేదు. హైవేల దిగ్భందనం నుంచి రైల్‌రోకోలు, ఆత్మబలిదానాల దాకా కామారెడ్డి నియోజకవర్గం ఉద్యమాలకు కేరాఫ్‌గా ఉండింది. కామారెడ్డి బీఆర్ఎస్కు పెట్టనికోటగా నిలిచింది. స్వరాష్ట్ర కల సాకారమైన తర్వాత 2014, 2018 ఎన్నికల్లో గులాబీ జెండానే రెపరెపలాడింది. స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీకి చెందినవారే ఎక్కువగా విజయం సాధించారు. ఇతర పార్టీల్లో చేరిన వారు కూడా అభివృద్ధి పేరుతో గులాబీ కండువా కప్పుకున్నారు. అయితే నియోజకవర్గంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలతో ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చింది. దాన్ని సరిదిద్దుకుని విజయతీరాలకు చేరడానికి గులాబీ పార్టీ నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. వివాదానికి ఆజ్యం పోసిన మాస్టర్ ప్లాన్ ... కామారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి రూపొందించిన కొత్త మాస్టర్ ప్లాన్ నియోజకవర్గంలోని ప్రజల్లో ప్రకంపనలు సృష్టించింది. కొందరికి లాభం జరిగేలా ప్లాన్ రూపొందించారని, దాని మూలంగా ఐదారు గ్రామాలకు చెందిన వందలాది మంది రోడ్డున పడతారని ఆందోళన చెందిన రైతులు పోరుబాట పట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం వంద ఫీట్ల రోడ్లు తీయడం, వందలాది ఎకరాల భూములను గ్రీన్‌జోన్, ఇండస్ట్రియల్ జోన్లలో చేర్చడంతో రైతులు ఆందోళనకు గురై రోడ్డెక్కారు. బీజేపీ నాయకుడు, ప్రస్తుతం ఆ పార్టీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి రైతుల పక్షాన ఉద్యమానికి నాయకత్వం వహించారు. కామారెడ్డి పట్టణంలో జరిగిన ఆందోళనలు సంచలనం సృష్టించాయి. సర్కారు తీరును నిరసిస్తూ బాధిత రైతులు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి విధ్వంసానికి కూడా దారితీసింది. ఓ రైతు ఆత్మహత్య సంఘటన రైతుల్లో మరింత ఆగ్రహానికి కారణమైంది. మున్సిపల్ పాలకవర్గంపై ఒత్తిడి పెరగడంతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కొత్త మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేస్తూ తీర్మానించి ప్రభుత్వానికి పంపించారు. కామారెడ్డిలో మొదలైన గొడవ జగిత్యాల, నిర్మల్ మున్సిపాలిటీలకూ విస్తరించింది. రైతులు కోర్టుకెక్కడం, రాష్ట్ర వ్యాప్త సమస్యగా తయారవడంతో ప్రభుత్వం స్పందించి, మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆకాశాన్నంటిన భూముల ధరలు కామారెడ్డి నియోజకవర్గంలో జాతీయ రహదారి, రైల్వే లైన్ వంటివి ఉండడం, దానికి తోడు హైదరాబాద్‌కు సమీపంలో ఉండడంతో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. మారుమూల గ్రామానికి వెళ్లినా రూ. 30 లక్షలు పెడితే కూడా ఎకరం భూమి దొరకడం లేదు. ప్రధాన రోడ్ల వెంట అయితే ఎకరం భూమి ధర రూ.కోట్లకు చేరింది. ఇంతటి విలువైన భూములను బీఆర్ఎస్ నేతలు గుంజుకుంటారంటూ ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దీంతో ఇక్కడి ప్రజల్లో ఒకరకమైన ఆందోళన నెలకొంది. భూములను కాపాడేందుకే ప్రభుత్వం ధరణి తీసుకువచ్చిందని, ఎవరి భూమి ఎటూ పోదని మంత్రి కేటీఆర్ ఆయా సభల్లో జనానికి వివరించే ప్రయత్నం చేశారు. తిప్పికొడుతున్న కేటీఆర్... ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, ఒక్కో సమస్యకు పరిష్కారం చూపుతూ దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దిన నాయకుడిపై కాంగ్రెస్, బీజేపీ నేతలు మతిలేని ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. భూములను కాపాడేందుకే ధరణి తీసుకువచ్చారని, భూ యజమాని తన వేలిముద్ర వేస్తేనే భూమి ఇతరుల చేతుల్లోకి వెళ్తుందని వివరిస్తున్నారు. కేసీఆర్‌కు భూములను గుంజుకునే అవసరం కూడా లేదని, ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొంటున్నారు. ప్రతిపక్షాల ఆరోపణలు, అధికార పక్షం వివరణలతో నియోజకవర్గంలో అందరి దృష్టి భూమి పైనే కేంద్రీకృతమైంది. అంతటా ఇదే అంశంపై చర్చలు నడుస్తున్నాయి. కేసీఆర్ కుటుంబం టార్గెట్‌గా.. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తుండడంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు మరోసారి భూముల సమస్యను తెరపైకి తీసుకువచ్చారు. ఇక్కడి భూముల కోసమే కేసీఆర్ పోటీ చేస్తున్నారంటూ పీసీసీ అధ్యక్షుడు, కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి ఆరోపణలు గుప్పిస్తున్నారు. కామారెడ్డి చుట్టుపక్కల భూములను లాక్కుంటారని, దాన్ని అడ్డుకునేందుకే తాను ఇక్కడ పోటీ చేస్తున్నానని ప్రకటించారు. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి కూడా చాలాకాలంగా కామారెడ్డి భూములకు ప్రమాదం పొంచి ఉందని ఆరోపిస్తున్నారు. మాస్టర్ ప్లాన్ ముప్పు పోలేదని, ఎన్నికల తర్వాత తిరిగి ముందుకు వస్తుందని పేర్కొంటున్నారు. నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో అసైన్డ్ భూములు ఉన్నాయని, బీఆర్ఎస్ నేతలు వాటిపై కన్నేశారని ఆరోపిస్తున్నారు. -
ప్రచారానికి కొద్ది రోజులే సమయం.. జోరు పెంచిన పార్టీలు.. హోరెత్తిన ప్రచారం..!
సాక్షి ప్రతినిధి మహబూబ్‌నగర్ / సాక్షి, నాగర్‌కర్నూల్: ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటి వరకు ఇంటింటి ప్రచారంలో నిమగ్నమై పని చేయగా, కొన్ని రోజులుగా పార్టీల ముఖ్య నేతలతో బహిరంగసభలను నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల అగ్రనేతల సుడిగాలి పర్యటనలతో ఎన్నికల వాతావరణం రణరంగంలా మారింది. ఇప్పటికే ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఆదివారం ఒక్కరోజునే ఉమ్మడి పాలమూరులోని నాలుగు నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగ సభలను నిర్వహించారు. అలంపూర్, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో సీఎం పర్యటన ఆ పార్టీలో జోష్ నింపగా, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సైతం జాతీయ, రాష్ట్రస్థాయి ముఖ్య నేతలతో సభల నిర్వహణకు సిద్ధమయ్యాయి. ప్రచారానికి దగ్గరపడుతున్న సమయం అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సమయం దగ్గరపడుతున్న వేళ ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సైతం ఇటీవల ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించి బహిరంగసభల్లో పాల్గొన్నారు. అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి కేవలం వారం రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ప్రధాన పార్టీల ప్రచారం మరింత ఊపందుకుంది. సీఎం కేసీఆర్ సభలతో బీఆర్ఎస్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, ఏఐసీసీ కార్యదర్శులు, కర్ణాటక మంత్రులు, స్టార్ క్యాంపెయినర్లతో కాంగ్రెస్ అగ్రనేతలు, బీజేపీ తరఫున కేంద్రమంత్రులు, జాతీయస్థాయి నాయకులు జిల్లాకు వస్తుండడంతో ఎన్నికల వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతోంది. పాలమూరుపై ప్రత్యేక నజర్.. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాలపై ప్రధాన పార్టీలన్నీ ప్రత్యేకంగా దృష్టిని సారించాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు పర్యటించారు. నెలరోజుల వ్యవధిలో జడ్చర్ల, అచ్చంపేట, నారాయణపేట, మక్తల్, దేవరకద్ర, గద్వాల నియోజకవర్గాల్లో పర్యటించగా.. ఆదివారం అలంపూర్, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో బహిరంగసభల్లో పాల్గొని మాట్లాడారు. అలాగే ఈనెల 22న మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంతో పాటు కోస్గికి కేసీఆర్ రానున్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి మొదటి మోటారు ప్రారంభం, మార్కండేయ ఎత్తిపోతల నీటి పంపింగ్‌ను ప్రారంభించిన అనంతరం సాగునీటి అంశాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ దిశగా భారీ బహిరంగసభల నిర్వహణతో పాటు గ్రామస్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇతర జిల్లాల్లో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుల పర్యటనలు ఎక్కువగా కొనసాగుతుండగా, ఉమ్మడి పాలమూరులో గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించి.. స్వయంగా ఆయనే పలు నియోజకవర్గాల్లో విస్త్రృతంగా పర్యటిస్తున్నారు. నేడు నాగర్‌కర్నూల్,అచ్చంపేటకు రేవంత్.. కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారం ఇప్పటికే హోరెత్తగా, పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో గప్పగుత్తగా ఓటర్లను ఆకర్షించేందుకు భారీ బహిరంగసభలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉమ్మడి జిల్లాలోని కొల్లాపూర్, కల్వకుర్తి, జడ్చర్ల, షాద్‌నగర్‌లో పర్యటించారు. ప్రచారానికి మిగిలిన కొద్ది రోజుల్లోనూ పెద్ద సంఖ్యలో పార్టీ స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దింపేందుకు కసరత్తు చేస్తోంది. మంగళవారం నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని బిజినేపల్లితో పాటు అచ్చంపేట నియోజకవర్గంలో నిర్వహించనున్న బహిరంగసభల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన రేవంత్‌రెడ్డి పాలమూరుపై గంపెడాశలు పెట్టుకున్నారు. కేంద్ర మంత్రులు, సీఎంలతో బీజేపీ.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భారీ బహిరంగ సభలను నిర్వహించి పెద్ద ఎత్తున ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ సన్నద్ధమవుతోంది. గత నెలలో ప్రధాని నరేంద్రమోదీ మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొని.. ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు, జాతీయస్థాయి నేతలతో సభలను నిర్వహించగా, మిగిలిన రోజుల్లోనూ ముఖ్య నేతలతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వనించి ప్రచారం చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఇటీవల గద్వాల నియోజకవర్గంలో కేంద్రమంత్రి అమిత్‌షా, ఆదివారం నారాయణపేట నియోజకవర్గంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా బహిరంగసభల్లో పాల్గొన్నారు. సోమవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కొల్లాపూర్‌లో, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కల్వకుర్తి, జడ్చర్ల, మహబూబ్‌నగర్ నియోజకవర్గాల్లో పర్యటించారు. అయితే వచ్చే వారం కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలో నిర్వహించే బహిరంగసభలో ప్రధాని నరేంద్రమోదీ లేదా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరవుతారని తెలుస్తోంది. -
ఒటరు సమాచార చీటీల పంపీణీ విషయంలో జాగ్రత్త.. రాష్ట్రస్థాయి ప్రత్యేక సాధారణ పరిశీలకులు
మహబూబ్‌నగర్: శాసనసభ ఎన్నికలలో భాగంగా పంపిణీ చేసే ఓటరు సమాచార చీటీలను జాగ్రత్తగా పంపిణీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా నియమించిన రాష్ట్రస్థాయి ప్రత్యేక సాధారణ పరిశీలకులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజయ్ వి.నాయక్ తెలిపారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన ఓటరు సమాచారంతో పాటు మిగతా వాటిని కూడా సక్రమంగా పంపిణీ చేసేలా చూడాలన్నారు. సోమవారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలో జిల్లాలో ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్న శాసనసభ ఎన్నికల పోలింగ్ సంసిద్ధతపై సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా 1950 టోల్ ఫ్రీ నంబర్‌కు, అదేవిధంగా ఫిర్యాదుల సెల్‌కు వచ్చే అన్ని ఫిర్యా దులను ప్రత్యేకంగా రిజిస్టర్ ఏర్పాటు చేసి నిర్వహించాలని సూచించారు. సాధారణ పరిశీలకులు పోలింగ్ రోజున కంట్రోల్‌రూమ్‌కి వెళ్లి సమస్యాత్మక పోలింగ్స్టేషన్ల జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. రాష్ట్రస్థాయి ప్రత్యేక పోలీస్ పరిశీలకులు దీపక్ మిశ్రా మాట్లాడుతూ అదనపు బలగాలను రిజర్వ్‌లో ఉంచుకోవాలని, ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైనప్పు డు అత్యవసర సమయంలో వినియోగించుకునేలా పోలీస్ సిబ్బంది ఉండాలని సూచించారు. అన్ని పోలింగ్ బూతులు మ్యాపింగ్ చేయాలని, పోలింగ్ రోజు 144 సెక్షన్ విధించాలని, పోలింగ్ కేంద్రంలోకి ఎవరెవరిని అనుమతిస్తారో ప్రతి పోలింగ్ అధికారి ముందే తెలుసుకొని ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే ప్రతి ఒక్కరినీ తనిఖీ చేసి పంపించాలని, ఎవరైనా ఎన్నికలకు సంబంధించి తప్పుడు సమాచారం అందించినప్పుడు తక్షణమే సోషల్ మీడియా ద్వారా సరైన సమాచారం ఇచ్చే విధంగా సోషల్ మీడియా టీమ్‌ను అప్రమత్తం చేయాలని తెలిపారు. ♦ కలెక్టర్ జి.రవినాయక్ శాసనసభ ఎన్నికల నిర్వహణకు మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాలలో చేసిన వివరాలను సమర్పించారు. జిల్లాలో 42మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, 838 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కొత్తగా ఓటర్లకు ఓటర్ గుర్తింపు కార్డుల పంపిణీ, పోలింగ్ కేంద్రాలలో సౌకర్యాలు, ఈవీఎంల ర్యాండమైజేషన్ ఫామ్ 12–డీ పంపి ణీ, హోం ఓటింగ్ అంశాలపై పవర్ పా యింట్ ప్రజంటేషన్ లో వివరించారు. ♦ ఎస్పీ హర్షవర్ధన్ మాట్లాడుతూ పోలీసుపరంగా మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల పరిధిలోని కొన్ని పోలింగ్ కేంద్రాలను కలుపుకొని మొత్తం 881 కేంద్రాలకు సంబంధించి బందోబస్తును పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలలో భాగంగా అంతర్ జిల్లా చెక్‌పోస్టుల ఏర్పాటు, అక్రమంగా తరలించే మద్యం, నగదు సీజ్ చేయడం, బైండోవర్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు సంజయ్‌కుమార్ మిశ్రా, పోలీస్ పరిశీలకురాలు ఇళక్కి యా కరునాగరన్, అధికారులు పాల్గొన్నారు. -
TS Elections 2023: ఆ స్థానంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిచినా.. ఓ రికార్డే..!
జడ్చర్ల టౌన్: ప్రస్తుత సాధారణ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరు గెలిచినా రికార్డు నమోదవుతుంది. 1962లో జడ్చర్ల నియోజకవర్గం ఏర్పడగా.. మొత్తం 15సార్లు ఎన్నికలు జరిగాయి. 1996, 2008లో రెండు ఉపఎన్నికలు వచ్చాయి. ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా వరుసగా మూడు సార్లు గెలవలేదు. 1972, 1978 ఎన్నికల్లో నర్సప్ప వరుసగా రెండు పర్యాయాలు విజయం సాధించగా, మూడవ సారి ఓటమిపాలయ్యారు. 1983, 1985 ఎన్నికల్లో కృష్ణారెడ్డి వరుసగా గెలిచి మూడవ పర్యాయం ఓడిపోయారు. ఆ తర్వాత 1996, 1999 ఎన్నికల్లో ఎర్రశేఖర్ వరుసగా విజయం సాధించి, 2004లో మూడవసారి ఓటమిపాలయ్యారు. 2014, 2018 ఎన్నికల్లో లక్ష్మారెడ్డి వరుసగా గెలుపొందగా.. ప్రస్తుతం ఆయన ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ పర్యాయం గెలిస్తే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు నెలకొల్పడంతో పాటు నియోజకవర్గంలో నాలుగో సారి ఎమ్మెల్యే అయిన ఘనత దక్కుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జనంపల్లి అనిరుధ్‌రెడ్డి విషయానికొస్తే.. ఎన్నికల బరిలో తొలిసారిగా నిలిచారు. ఆయన విజయం సాధిస్తే పోటీ చేసిన తొలిసారే విజయం సాధించినట్లవుతుంది. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి చిత్తరంజన్‌దాస్ పోటీలో ఉన్నారు. ఆయన కల్వకుర్తి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఓ పర్యాయం మంత్రిగా పనిచేశారు. 1985 ఎన్నికల్లో దివంగత ఎన్టీ రామారావును ఓడించి రాష్ట్రంలోనే పేరుగాంచారు. అదే స్ఫూర్తితో జడ్చర్లలోనూ విజయం సాధిస్తానన్న ధీమాలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆయన విజయం సాధిస్తే బీజేపీకి తొలి విజయంగా నిలుస్తుంది. ఆయన సుదీర్ఘకాలం తర్వాత గెలుపొందినట్లు అవుతుంది. జడ్చర్ల అసెంబ్లీ స్థానానికి 16వ సారి నిర్వహిస్తున్న సాధారణ ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి గెలిచినా ఓ రికార్డుగానే చెప్పవచ్చు. -
మంథనిలో కాంగ్రెస్ ఒంటరి పోరాటం
సాక్షి, పెద్దపల్లి: మంథని అసెంబ్లీకి ప్రధాన పార్టీల తరపున నలుగురు అభ్యర్థులు పోటీపడుతున్నా.. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్యే పోటీ నెలకొంది. పోలింగ్ గడువు సమీపిస్తున్న వేళ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత సభల సక్సెస్‌తో గులాబీ శ్రేణుల్లో ఉత్సహం నెలకొంది. పల్లె, ప ట్టణాల్లో బీఆర్ఎస్ ప్రచారం హోరెత్తిస్తుండటంతో కారు పార్టీలో జోష్ కనిపిస్తోంది. కాంగ్రెస్ తరఫున రాహుల్‌గాంధీ పర్యటనతో హస్తం పార్టీలో జోష్ నె లకొన్నా.. ఆ తర్వాత మరే ఇతర అగ్రనేతలు ప్రచా రానికి రాకపోవడం, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఒంట రిగా ప్రచారం చేస్తుండడంతో వెనకబడినట్లు కనిపిస్తోంది. రాహుల్ పర్యటనతో కాంగ్రెస్‌లో ఊపు వ చ్చినా, ఆ సభ తర్వాత కేసీఆర్, కవిత సభలు నిర్వహించి సక్సెస్ చేయడంతోపాటు, కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ, కాంగ్రెస్ హయాంలో జరగని అభివృద్ధిని తొమ్మిదేళ్లలోనే చేశామంటూ చేసిన వి మర్శలకు సరైన కౌంటర్ కాంగ్రెస్ నుంచి లేకపోవడంతో సొంత క్యాడర్లో ఆయోమయం నెలకొంది. బలపడుతున్న బహుజనవాదం మంథనిలో ఇటీవల పర్యటించిన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బీసీ బిడ్డను గెలిపించుకోవాలని, పుట్ట మధు గెలుపు కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, ఉద్యోగులు, యువకులు కలిసి పనిచేయాలని అభ్యర్థించారు. బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధు సైతం బహుజన వాదంతో బీసీ బిడ్డను గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తుండగా, సీఎం కేసీఆర్ వ్యాఖ్యలతో బీసీ వాదానికి బలాన్ని ఇచ్చినట్లయింది. పుట్ట మధును గెలిపిస్తే రూ.1,000కోట్లతో అభివృద్ధి చేస్తానని ప్రకటించటం చర్చనీయాంశంగా మారింది. అలాగే ఎమ్మెల్సీ కవిత పర్యటన సందర్భంగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీధర్‌బాబు హయాంలో చేసిన అభివృద్ధి, ఒకసారి ఎమ్మెల్యేగా, జెడ్పీ చైర్మన్‌గా పుట్ట మధు చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. సింగరేణిని అప్పులపాలు చేసి, 49శాతం వాటాను కేంద్రానికి కట్టబెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని విమర్శలు గుప్పించారు. కొన్నిరోజులుగా బీఆర్ఎస్ విమర్శలకు కాంగ్రెస్ నుంచి ధీటైన స్పందన కరువైందని ఆ పార్టీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకేకుటుంబానికి ఏడుసార్లు అవకాశం కల్పించిన మంథనిలో ఆశించినమేర అభివృద్ధి సాధించలేదనే విమర్శలు వినిపిస్తున్న వేళ.. నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకుంటారో, మరోసారి శ్రీధర్‌బాబుకు అవకాశం కల్పిస్తారో డిసెంబర్ 3న తేలనుంది. -
కోట్లు కుమ్మరిస్తున్న వినోద్.. ఈసారైనా గెలుపుతీరం చేరుతారా?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి గడ్డం వినోద్‌కు సొంత పార్టీలో కొందరి నాయకుల అత్యుత్సాహం పక్కలో బల్లెంల మారిందా? మనమే గెలుస్తామనే భ్రమ ఆయనకు మరోసారి చేటు చేస్తుందా? అనే ప్రశ్నలకు జవాబులు వెతకాల్సిన పరిస్థితి ఏర్పిడింది. ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకుంటూ ఊపు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి బెల్లంపల్లిలో మాత్రం ఆ గాలి ఎటు వైపు వీస్తు్ందోనని సందేహాలు వస్తున్నాయి. వినోద్ ఆర్థికంగా ఉన్న నాయకుడిగా జనంతోపాటు నాయకులు, కార్యకర్తల్లో ముద్రపడ్డారు. ఎన్నికల వేళ పార్టీలో చేరుతున్న వారిలో ఎక్కువగా ఏదో ఆశించి చేరుతున్నారని ఆ పార్టీ లీడర్లే అంటున్నారు. కొందరు అభిమానంతో ఉన్నారు. ఇంకొందరు ఆయన ప్రత్యర్థితో వైరంతో ఇటు వైపు చేరారు. మరోవైపు ఇన్నాళ్లు టికెట్ ఆశించి భంగపడిన గ్రూప్‌లో పనిచేసిన వారంతా ఇప్పటికిప్పుడు వినోద్ గెలుపు కోసం మనస్ఫూర్తిగా పని చేస్తున్నారా? అంటే చెప్పలేని పరిస్థితి ఉంది. వినోద్ గెలిస్తే తమ రాజకీయ భవిష్యత్‌కు ఇబ్బంది కలుగుతుందని భావించేవారు ఆయన వెనకాలే ఉండి ఏం చేస్తారనే సందేహాలు ఉన్నాయి. నమ్మకం ఎంతవరకు? నియోజకవర్గంలో కొందరు నాయకులు ఎవరు ఎటు వైపు పని చేస్తున్నారో ప్రశ్నార్థకంగా మారింది. పైకి జై కొడుతూనే అటు, ఇటు అన్నట్లు వ్యవహారిస్తున్నారు. పూటకో పార్టీ మార్చుతూ అనుమానాస్పదంగా మారారు. ధనవంతుడనే ఆశతో ఎన్నికల వేళ లబ్ధి కోరి చేరి, తీరా అనుకున్నది దక్కకపోతే మేలు కంటే కీడు చేసే వారు లేకపోలేదు. ఈ క్రమంలో గత ఎన్నికల్లో లాగే ఆయన్ని మళ్లీ ముంచేస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2018ఎన్నికల్లో వినోద్ చెన్నూరు నుంచి టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించారు. టికెట్ దక్కక ఆ పార్టీ వీడి కాంగ్రెస్ నుంచి పోటీకి ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. చివరకు బీఎస్పీ నుంచి తొలిసారిగా బెల్లంపల్లి బరిలో నిలిచారు. నాడు, నేడు ప్రధాన ప్రత్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేతిలో వినోద్ ఓటమి పాలయ్యారు. చిత్రంగా ఆ సమయంలో వినోద్ పక్కాగా గెలుస్తారని ప్రచారం జరిగింది. సర్వేలు అదే విషయం వెల్లడించాయి. ముఖ్యంగా ఏపీకి చెందిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పోలింగ్‌కు ముందు చేసిన ప్రీపోల్ సర్వేలో తెలంగాణ ఫలితాలు అంచనా వేస్తూ, బెల్లంపల్లిలో వినోద్ గెలుపు పక్కా అని చెప్పడంతో అంతా అదే భ్రమలో ఉండిపోయారు. కానీ ఫలితాల్లో బోల్తా పడ్డారు. సొంత నాయకులే డబ్బులు తీసుకుని తనను ఓడగొట్టారని వినోద్ ఆవేశంగా మాట్లాడిన ఘటనలు ఉన్నాయి. తాజాగా నాటి పరిస్థితులకు భిన్నంగా ఇప్పుడేమి లేవనే విశ్లేషకులు భావిస్తున్నారు. అదే ఎన్నికల్లో మహాకూటమి తరఫున పోటీ చేసిన సీపీఐ సీనియర్ నాయకుడు గుండా మల్లేశ్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినా ఘోరంగా ఓడిపోయారు. ప్రస్తుతం సీపీఐ మద్దతు ఇస్తున్న, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ఆసక్తికరమైన అంశంగా మారింది. చల్లారని లోకల్ ‘చిచ్చు’ వినోద్ నియోజకవర్గంలో ఉండరనే పెద్ద అపవాదు మూటగట్టుకున్నారు. ఈసారి ప్రచారంలో నేను ఇక్కడే ఉంటానని పదే పదే చెబుతూ ప్రమాణాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇదే తీరుగా ఇక్కడే ఉంటాననే హామీలు ఇచ్చి కనిపించకుండాపోయి, ఎన్నికల సమయానికే వచ్చారని నాయకులే అంటున్నారు. ఇప్పటికీ బెల్లంపల్లిలో కాకుండా మంచిర్యాల నుంచే ప్రచారానికి వస్తూ వెళ్తున్నారు. మరోవైపు ఇ క్కడే ఉంటామని వినోద్ సతీమణి రమాదేవి, కూతురు వర్షతో ప్రచారం చేయిస్తున్నారు. ఈ ప్రమాణాలను ఓటర్లు ఎంతవరకు నమ్ముతున్నారనేది వచ్చే ఫలితాలే చెప్పనున్నాయి. స్థా నికంగా ఉన్నవారికే గెలిపించాలనే ప్రత్యర్థి వర్గం ప్రచారం చేస్తున్న తరుణంలో ఓట్లు ఎటు మల్లుతాయో వేచి చూడాలి. రూ.కోట్లు కుమ్మరిస్తున్న వినోద్ ఈసారైనా గెలుపు తీరం చేరుతారా? అని నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది. -
మేడ్చల్.. ఇక్కడ గెలిస్తే మంత్రి అయ్యినట్టే!
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో మేడ్చల్ నియోజకవర్గం ఎంతో మంది ఉద్దండులను రాష్ట్రానికి అందించింది. మర్రి చెన్నారెడ్డి, దేవేందర్‌గౌడ్ వంటి రాజకీయ ప్రముఖులకు రాజకీయంలో నిలదొక్కుకునేలా మేడ్చల్ నిలిచింది. పునరి్వభజనకు ముందు మేడ్చల్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరూ రాష్ట్రంలో మంత్రి పదవులు పొందినవారే. పునరి్వభజనకు ముందు జీహెచ్ఎంసీతో కలిసి ఉండే నియోజకవర్గం ఉమ్మడి రాష్ట్రంలో ఖైరతాబాద్ తర్వాత అతి పెద్దదిగా మేడ్చల్ ఉండేది. మేడ్చల్, కూకట్పల్లి(కొంతభాగం) కుత్బుల్లాపూర్, ఉప్పల్, ఎల్బీనగర్(కొంతభాగం) నియోజకవర్గాలు కలిపి మేడ్చల్ నియోజకవర్గంగా ఉండేది. పునరి్వభజన తర్వాత మూడు ముక్కలైంది. ► 1962లో ఏర్పడ్డ మేడ్చల్ నియోజకవర్గం మొదటి ఎన్నికల్లో స్వాతంత్య్ర సమరయోధుడు వందేమాతరం రాంచందర్‌రావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నాటి కాంగ్రెస్ యోధుడు కేవీ రంగారెడ్డిపై విజయం సాధించారు. ► 1967 నుంచి 72 వరకు ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో కాంగ్రెస్ అగ్రనేత సుమిత్రాదేవి రెండుసార్లు కాంగ్రెస్ నుంచి గెలిచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ► 1978లో మర్రి చెన్నారెడ్డి మేడ్చల్ నుంచి బరిలోకి దిగి ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. 1983లో దివంగత తెలంగాణ పోరాట యోధుడు గౌడవెల్లికి చెందిన సింగిరెడ్డి వెంకట్రాంరెడ్డి సతీమణి ఉమాదేవి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎనీ్టఆర్ హవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ► 1983లో జరిగిన ఉప ఎన్నికల్లో ఘట్కేసర్ మండలం కొర్రెములకు చెందిన కొమ్మురెడ్డి సురేందర్‌రెడ్డి టీడీపీ నుంచి బరిలో నిలబడి ఎమ్మెల్యేగా విజయం సాధించి ఎనీ్టఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ► 1989లో జరిగిన ఎన్నికల్లో తిరిగి ఉమాదేవి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో నాటి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఉన్న తూళ్ల దేవేందర్‌గౌడ్‌కు ఎన్నికల ఆరు నెలల ముందే ఎనీ్టఆర్ మేడ్చల్ టికెట్ ప్రకటించడంతో 1994, 1999, 2004లలో కాంగ్రెస్‌కు చెందిన సింగిరెడ్డి ఉమాదేవిపై, సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డిపై, టీఆర్ఎస్కు చెందిన సురేందర్‌రెడ్డిపై దేవేందర్‌గౌడ్ వరుసగా గెలిచారు. ఎనీ్టఆర్, చంద్రబాబు కేబినెట్లలో రెవెన్యూ, బీసీ సంక్షేమం, హోంమంత్రిగా పనిచేసి, రాజశేఖర్‌రెడ్డి హయాంలో టీడీఎల్పీ ఉపనేతగా పని చేశారు. ► 2004లో పునరి్వభజన తర్వాత కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి టీడీపీకి చెందిన నక్క ప్రభాకర్‌గౌడ్‌పై గెలుపొందారు. 2014లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన మలిపెద్ది సు«దీర్‌రెడ్డి టీడీపీకి చెందిన తోటకూర జంగయ్యపై ఎమ్మెల్యేగా గెలిచారు. అందరికీ ఆశ్రయం ఇచ్చిన మేడ్చల్.. మేడ్చల్ ఓటర్లు ఏనాడూ స్థానిక స్థానికేతర భేదం లేకుండా అందరినీ రాజకీయంగా ఆదరించారు. మేడ్చల్ నుంచి 12 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో ఉమాదేవి, సురేందర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డిలు మాత్రమే నియోజకవర్గానికి చెందిన వారు కాగా మిగతా వారు నియోజకవర్గంలో ఓటు హక్కు లేని నేతలే. ఇలా మేడ్చల్ రాష్ట్రానికి ఉద్దండ నాయకులను అందించడంతో పాటు చాలామంది నాయకులకు రాజకీయ భవిష్యత్‌ను అందించింది. ఆరుసార్లు ఓడిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డిని మొదటిసారి చట్టసభలకు పంపిన ఘనత మేడ్చల్ ఓటర్లదే.. పోటీలో తొలిసారి నిలిచిన దేవేందర్‌గౌడ్, సురేందర్‌రెడ్డి, సు«దీర్‌రెడ్డి, ఉమాదేవి, మల్లారెడ్డి వంటి నాయకులకు రాజకీయ భవిష్యత్‌ను కల్పించిన ఘనత మేడ్చల్ ఓటర్లదే.. -
మన పార్టీలోకొస్తే పామైనా ఫ్రెండే!
బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ..ఇలా పార్టీ ఏదైనా కావొచ్చు. అభ్యర్థులు ఒక పార్టీ నుంచి మరోపార్టీలోకి జంప్ చేయడం మామూలే. ఏ ఎన్నికల్లోనైనా అంతే..ఈ ఎన్నికల్లోనూ ఇంతే. అయితే. ఓ వ్యక్తి ప్రత్యర్థి పార్టీలో ఉన్నప్పుడు ఆ నేత పాములాంటివాడు. అదే వ్యక్తి పార్టీ మారి మనపార్టీలోకి వచ్చాక..అదే పాము మన ఫ్రెండైపోతాడు. మన పార్టీలోంచి ఒకడు అవతలి పార్టీలోకి వెళ్లినప్పుడు ఎడాపెడా చేసే విమర్శలిలా ఉంటాయి. 1.వాడి కోరల నిండా విషం. పాములాగే బెదిరిస్తూ ఉంటాడు నిత్యం బుస కొడుతూ. 2. పాము కాబట్టే వాడి నడకా, నడతా మెలికలు మెలికలు. స్ట్రెయిట్‌గా ఏనాడైనా నడుస్తాడా వాడు? ముక్కుసూటిగా నిజాయతీగా ఉండలేడు కాబట్టే ఎప్పుడూ ఆ మెలికల నడకలు. 3. డబ్బులెక్కడుండే వాడూ అక్కడే. అచ్చం నిధులకు కాపలా ఉండే పాముల్లాగే! 4. పాములా వాడో కబ్జాకోరు. తన పడగకావరంతో చలిచీమలపై రౌడీయిజం చేసి, బలహీనులైన చీమల పుట్టల్ని కబ్జా చేసే ఆక్రమణదారువాడు. ఇంతకాలం మనం పాము అన్నవాడే..పొరబాట్న కొన్ని కారణాలతో మళ్లీ మన పార్టీలోకి వచ్చేస్తాడనుకోండి. అప్పుడు ఇంతకాలం మని తిట్టినవాణ్ణే మంచివాడంటూ పొగడాల్సి వస్తుంది. ‘మరి మీరే అప్పుడలా అన్నారుకదా’ అని విలేకరులు అడిగితే వారిచ్చే వివరణలు ఇలా ఉంటాయి. విలేకరి: మరప్పుడు కోరలనిండా విషం..బుసతో బెదిరింపన్నారు? నేత: మీకో విషయం తెలుసా? అది బెదిరింపు కాదండి. పిల్లలు రాళ్లతో కొట్టి బాధిస్తున్నప్పుడు ‘బుస కొడుతూ ఆత్మరక్షణ చేసుకో..తప్పులేదం’టూ అప్పట్లో ఓ మహాముని..పాముకు ఉద్బోధ చేసిన కథ మీకు తెలియనిదా? ఇక కోరలనిండా విషమంటారా. మనికి ఉండదానండీ నిలువెల్లా విషం? పైగా పాముది విషం కాదండి. తన ఆహారాన్ని జీర్ణం చేసుకునేందుకు తోడ్పడే ఎంజైమండీ. అన్నింట్నీ అలా అపార్థం చేసుకోకూడదండీ. అన్నం తిని, అరిగించుకోవలి కదండీ పాపం... అదికూడా! విలేకరి: స్ట్రెయిట్‌గా నడవడూ..వాడిదంతా వంకర నడకా, నడతా అన్నారుగా? నేత: ఎవరైనా మెలికలెప్పుడు తిరుగుతారో మీకు తెలియనిదా? సిగ్గుతో, బిడియంతోనే కదా మెలికలు తిరిగేదీ!? మనవాడు సిగ్గూ, శెరం, మానం, మర్యాదా..అన్నీ ఉన్నవాడు. తప్పు చెయ్యమని ఎవరైనా అడిగితే, చెయ్యలేక..సిగ్గుతో, బిడియంతో తిరిగేవేనండీ ఆ మెలికలు! విలేకరి: డబ్బులెక్కడుంటే పాములా వాడూ అక్కడే అన్నారు? నేత:మాటమార్చే మనిషిని కాదండీ నేను. ఎక్కడ నిధులున్నప్పటికీ..వాటికి కాపలాగా ఉన్నప్పటికీ... అన్ని వజ్రాలూ, రత్నాలూ, మణిమాణిక్యాలూ కుప్పపోసి ఉన్నప్పటికీ..పాము వాటినేమైనా తింటుందా, తాగుతుందానండీ? ఎవరి డబ్బువారికి చేరాలనే ఉద్దేశంతో కాపలాకాస్తుందది. అలాగే రేపు మనం గెలిచాక కూడా..అటు ప్రభుత్వ ఖజానాకైనా, ఇటు అతడికి అప్పగించిన బాధ్యతల తాలూకు నిధులకు అంతే నిస్వార్థంగా కాపలా కాసే చెక్కూర్టీ గార్డులాంటి వాడండీ మనవాడు. విలేకరి: బలహీనుల ఇళ్లూ, స్థలాలు, పుట్టలు ఆక్రమించే కబ్జాకోరన్నారు? నేత: అన్ని ఫీల్డుల్లోనూ ఉన్నట్టే..కొందరు కబ్జాదారులు మన రాజకీయాల్లోనూ ఉండవచ్చు. కానీ మనవాడు అలాంటివాడు కాదు. మీకీ సంగతి తెల్సా? పాము అనేది డవిరెట్టుగా ఎవరికైనా పట్టుబడేలా నేరుగా పుట్టల్లో ఉండేవాటికంటే..గుట్టుగా తమ బతుకు తాము బతుకుతూ..ఎవరిజోలికీ వెళ్లకుండా... కొండగుట్టల్లోనా, బండరాళ్ల మధ్యన చీలికల్లోనా బతికేవే ఎక్కువ. మనవాడూ అలాంటి మంచివారిలో ఒకడండీ. విలేకరి: ఓటరూ..ఓ ఓటరూ. నాడు పామన్నవాడినే నేడు ఫ్రెండంటున్నాడు? మరి నువ్వేమంటావ్? ఓటరు : అన్నాడా? మన పార్టీవాడయ్యాడా? మన సామెత ప్రకారం చేసేదేముందిక... మెడకు పడ్డ పాము కరవకమానుతుందా? ఫ్రెండయ్యాక ఓటేయక తప్పుతుందా? -
ముచ్చటగా మూడోసారి పోటీ చేస్తున్న కేసీఆర్.. హ్యాట్రిక్ దక్కేనా
గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రచార పర్వం కీలక దశకు చేరుకున్నది. పోలింగ్ సమీపిస్తుండటంతో అన్ని వర్గాలను ఆకర్షించడానికి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తూ మద్దతు కోరుతున్నాయి. ప్రధానంగా అధికార పార్టీ బీఆర్ఎస్ దూకుడుగా ముందుకువెళ్తోంది. బీజేపీ, కాంగ్రెస్ సైతం ఓటర్లను ఆకర్శిస్తూనే అన్ని వర్గాలను తమవైపు తిప్పుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. గజ్వేల్: నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి పోటీ చేస్తున్న కేసీఆర్‌కు భారీ మెజారిటీని అందించడానికి బీఆర్ఎస్ శ్రేణులు ప్రయ త్నిస్తున్నాయి. కేసీఆర్ రాష్ట్రమంతటా పర్యటిస్తున్న క్రమంలో ఆయన గెలుపు బాధ్యతను నియోజకవర్గంలోని పార్టీ యంత్రాంగం భుజస్కందాలపై వేసుకున్నది. ఎలాగైనా కేసీఆర్‌కు హ్యాట్రిక్ విజయాన్ని అందించడానికి శ్రేణులు పనిచేస్తున్నాయి. పని విభజన చేసుకుంటూ నేతలు ముందుకు సాగుతున్నారు. ఈ నియోజకవర్గానికి మంత్రి హరీశ్‌రావు ఎన్నికల ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఆదేశాల మేరకు రాష్ట్ర అటవీ అటవీ అభివృద్ధి సంస్థ(టీఎస్ఎఫ్డీసీ) చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయనతోపాటు ఇతర ముఖ్య నేతలు సైతం నియోజకవర్గంలోని గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక, కుకునూర్‌పల్లి, మర్కూక్, ములుగు, తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. అతి తక్కువ వ్యవధిలో ఎక్కువ మంది ఓటర్లను కలిసేందుకు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణకు ప్రాధాన్యతనిస్తోంది. ఇప్పటికే సుమారుగా 40వర్గాలతో అధికార పార్టీ నేతలు సమ్మేళనాలను నిర్వహించారు. ఈ క్రమంలోనే భూనిర్వాసితులు, దివ్యాంగులు, ఫంక్షన్‌హాళ్ల నిర్వాహకులు, వైశ్యులు, కెమిస్ట్, డ్రగ్గిస్ట్ తదితర సమ్మేళనాలకు మంత్రి హరీశ్‌రావు హజరై వారి మద్దతును కోరారు. సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం తర్వాత గజ్వేల్‌లో వచ్చిన మార్పును వివరిస్తూ... ఈ అభివృద్ధి ప్రక్రియ నిరంతరంగా కొసాగాలంటే కేసీఆర్‌కు భారీ మెజారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. మరికొన్ని ముఖ్యమైన వర్గాల ఆత్మీయ సమ్మేళనాలను సైతం నిర్వహించడానికి అధికార పార్టీ సిద్ధమవుతోంది. ఈటల సైతం.. బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ సైతం ఇక్కడ వివిధ వర్గాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్లో అసంతృప్తిగా ద్వితీయశ్రేణి నాయకులను తనవైపు తిప్పుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో బలంగా ఉన్న వర్గాలను గుర్తించి ప్రత్యేక సమావేశాలను నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కొన్ని వర్గాలను కలిశారు. గతంలో టీఆర్ఎస్లో క్రీయాశీలకంగా ఉండి ప్రస్తుతం స్తబ్దుగా ఉన్న నేతలను కలిసి వారి మద్దతును కోరుతున్నారు. అంతేకాకుండా బీసీ నినాదాన్ని ప్రచారంలో బలంగా వాడుతున్నారు. స్థానిక సమస్యల పరిష్కారంలో అధికార పార్టీ నేతలు చూపుతున్న నిర్లక్ష్యాన్ని తనదైన శైలిలో ఎండ గడుతున్నారు. స్థానిక నినాదాన్ని నమ్ముకుని.. కాంగ్రెస్ అభ్యర్థి, తూంకుంట నర్సారెడ్డి మాత్రం స్థానిక నినాదాన్ని నమ్ముకొని ఎన్నికల రంగంలోకి దిగారు. తన ప్రచారంలో ప్రతి చోట ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. పార్టీల ప్రయత్నాలు నడుమ గజ్వేల్ ఎన్నికల ప్రచార పర్వం ఆసక్తికరంగా మారింది. -
దుబ్బాకలో నా గెలుపు ఎప్పుడో ఖాయమైంది..!
దుబ్బాకటౌన్: సీఎం కేసీఆర్‌కు వైన్స్ టెండర్లపై ఉన్న ప్రేమ కొలువుల నోటిఫికేషన్లపై ఎందుకు లేదని.. ఇంతటి దుర్మార్గమైన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు నామరూపాలు లేకుండా చేయాలని బీజేపీ దుబ్బాక అభ్యర్థి, ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. ఆదివారం దుబ్బాకలోని ఆయన నివాసంలో నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన వారు బీజేపీలో చేరారు. అలాగే నియోజకవర్గంలోని భూంపల్లి–అక్భర్పేట, రాయపోల్ మండలాల్లో ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబపాలనకు తెలంగాణ ప్రజలు ఈ ఎన్నికల్లో చరమగీతం పాడటం ఖాయమైందన్నారు. రాష్ట్రంలో ఏం మిగులకుండా దోచుకుతిన్నారని ఆరోపించారు. ఇప్పటికే తాగుబోతుల రాష్ట్రంగా మర్చారని, మళ్లీ గెలిస్తే పేదల భూములు సైతం ఏం మిగుల్చరన్నారు. ఒక్క నోటిఫికేషన్ కూడ వేయలేదని, పెట్టిన పరీక్షలను కూడా సక్రమంగా నిర్వహించకుండా పేపర్లు లీకేజీ చేసి నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క శాతం ఉన్న సీఎం కులానికి ఐదు మంత్రి పదవులా..? కేసీఆర్ కేబినెట్లో కేవలం ఒక్క శాతం ఉన్న తన కులానికి ఐదు మంత్రి పదవులు ఇచ్చి.. 23 శాతం ఉన్న ఎస్సీలకు ఒక్క మంత్రి పదవి ఇచ్చాడని.. ఇది ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. దళిత, బీసీ, మైనార్టీ బంధు పథకాలు బీఆర్ఎస్ కార్యకర్తలకే పంపిణీ చేసుకున్నారని ఆరోపించారు. ప్రజల బాగు కోసమే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ తో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. నా గెలుపు ఎప్పుడో ఖాయమైంది మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. 2020 ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌తో సహా మొత్తం కేబినెట్, ఎమ్మెల్యేలు, పోలీసు అధికారులందరూ కలిసి నన్ను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డారని.. కానీ చైతన్యవంతమైన దుబ్బాక గడ్డ మీద పుట్టిన ప్రజలు నన్ను గెలిపించి తమ పౌరుషాన్ని చూపారన్నారు. మూడేళ్లు తనకు అధికారం ఇస్తే దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి పైన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసి నిధులు తెచ్చానని తెలిపారు. రాష్ట్ర ఖజానా అంతా సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లలకే ఖర్చుపెట్టి మిగతా నియోజకవర్గాలకు చాలా అన్యాయం చేశారన్నారు. హరీశ్‌ను దుబ్బాక ప్రజలు నమ్మరు హరీశ్‌రావును దుబ్బాక ప్రజలు నమ్మరని.. ట్రబుల్ షూటర్ అని గొప్పలు చెప్పుకునే ఆయనకు ఉప ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టారని.. మళ్లీ ఓటమి రుచి చూపుతామని రఘునందన్‌రావు అన్నారు. ఉన్న నిధులన్నీ సిద్దిపేటకే తీసుకుపోయి దుబ్బాక నియోజకవర్గానికి తీరని అన్యాయం చేస్తుంది హరీశ్‌రావే అన్నారు. నన్ను ఓడగొట్టేందుకు ఆయన చేస్తున్న కుట్రలు చాలా ఉన్నాయని, ఎన్ని చేసినా ప్రజల మద్దతుతో తిప్పిగొట్టి భారీ మెజార్టీతో గెలుపొందుతానన్నారు. ఎంపీగా ఉండి దుబ్బాకకు ఏం చేసిండు రెండు పర్యాయాలు ఎంపీగా ఉన్న ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేసిండో ప్రజలు గమనించాలని రఘునందన్‌రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో అభివృద్ధి జరిగితే తామే చేశామంటూ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రభాకర్‌రెడ్డికి ఓట్లేస్తే పరాయి పెత్తనం సాగుతుందని, దుబ్బాక కోసం బరిగీసి కొట్లాడే నన్ను గెలిపించుకుంటే అభివృద్ధితో పాటు ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. ఆశీర్వదించండి..అభివృద్ధి చేస్తా.. దుబ్బాకరూరల్: ఆశీర్వదించి మళ్లీ గెలిపిస్తే దుబ్బాకను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని రఘునందన్‌రావు అన్నారు. ఆదివారం భూంపల్లి–అక్భర్పేట మండలంలోని చౌదర్పల్లి, ఎనగుర్తి, బొప్పాపూర్ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు కానీ.. విచ్చలవిడిగా బెల్ట్‌షాపులు ఏర్పాటు చేయడం చూస్తేనే బీఆర్ఎస్ వైఖరి స్పష్టం అవుతుందన్నారు. ఈ ఎన్నికల్లో దుబ్బాకలో బీఆర్ఎస్ను చిత్తుగా ఓడించాలన్నారు. రాయపోల్ మండలంలో..| రాయపోల్ః తన స్వగ్రామం బోప్పాపూర్, రాయపోల్ మండలం టెంకంపేట, బేగంపేట, ఎల్కల్ గ్రామాల్లో రఘునందన్‌రావు ఎన్నికల ప్రచారం చేపట్టారు.ఈ సందర్భంగా గ్రామాల్లో బోనాలు, బతుకమ్మలు, మంగళహారతులతో మహిళలు తరలివచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హరీశ్ దుబ్బాకపై పూర్తిగా కక్షపూరితంగా వ్యవహరిస్తూ నిధులన్నీ సిద్దిపేటకే తరలించుకుపోయి తీరని అన్యాయం చేశాడన్నారు. పొలంపల్లిలో ఇంటింటి ప్రచారం చేగుంట(తూప్రాన్): మండలంలోని పొలంపల్లి గ్రామంలో బీజేపీ నాయకులు రఘునందన్‌రావును గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా బీజేవైఎం మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే డిగ్రీ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, వరి క్వింటాలుకు రూ.3100 మద్దతు ధర అందిస్తుందని తెలిపారు. రైతులకు ఉపయోగపడే విధంగా మాభూమి పోర్టల్ వస్తుందని ప్రచారంలో వివరించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రమేశ్, వేణు, శ్రీకాంత్, రమశ్, ఎల్లం, గణేష్, భూపాల్, కుమ్మరి నర్సింలు, బాలకృష్ణ, స్వామి పాల్గొన్నారు. అనంతరం చేగుంట, మాసాయిపేట మండలాలకు చెందిన 200మంది కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరారు. ఏరులై పారుతున్న మద్యం మిరుదొడ్డి(దుబ్బాక): అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పాలనలో వేసిన శిలాఫలకాలకే దిక్కుమొక్కు లేదని రఘునందన్‌రావు విమర్శించారు. అక్బర్పేట–భూంపల్లి మండలం రుద్రారంలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో మద్యం ఏరులై పారితే తప్ప పాలన ముందుకు సాగని పరిస్థితి నెలకొందన్నారు. దుబ్బాకలో ఎక్కడ కూడా దళిత బంధు అమలు కాని పరిస్థితి ఉందన్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్న బీఆర్ఎస్ కుటుంబ పాలనకు చరమ గీతం పాడాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లన్నగారి శాంతవ్వ, భిక్షపతి పాల్గొన్నారు. -
గెలిచిన ఆరుగురిలో ముగ్గురు అమాత్యులే
జహీరాబాద్: గతంలో నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆరుగురిలో ముగ్గురికి మాత్రం మంత్రివర్గలో చోటు లభించింది. కాంగ్రెస్ హయాంలోనే ఎం.బాగారెడ్డి, ఎండీ ఫరీదుద్దీన్, జె.గీతారెడ్డిలకు మంత్రి పదవులు దక్కాయి. అప్పుడు కాంగ్రెస్ తరఫున గెలిచిన పి.నర్సింహారెడ్డి, టీడీపీ తరఫున గెలిచిన సి.బాగన్న, బీఆర్ఎస్ తరఫున గెలుపొందిన కె.మాణిక్రావులకు మంత్రి పదవులు దక్కలేదు. అప్పుడు వారి ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. 1957 నుంచి 1985 వరకు జరిగిన ఏడు పర్యాయాలు వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం.బాగారెడ్డి గెలుపొందారు. పలువురి మంత్రి వర్గంలో బాగారెడ్డికి చోటు లభించింది. చక్కెర పరిశ్రమలు, భారీ పరిశ్రమలు, పంచాయతీరాజ్ తదితర శాఖలను ఆయన నిర్వహించారు. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎండీ ఫరీదుద్దీన్ మొదటి సారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో ఆయన తిరిగి గెలుపొందడంతో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో చోటు లభించింది. వక్ఫ్, మైనార్టీ సంక్షేమం, మత్యశాఖలను నిర్వహించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో జహీరాబాద్ అసెంబ్లీ ఎస్సీలకు రిజర్వు కావడంతో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి గీతారెడ్డికి గజ్వేల్ నుంచి జహీరాబాద్‌కు మార్చారు. ఆ ఎన్నికల్లో ఆమె గెలుపొందడంతో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా అవకాశం దక్కింది. 2014 ఎన్నికల్లో తాను ఓటమి పాలవ్వగా బీఆర్ఎస్ అభ్యర్థి కె.మాణిక్‌రావు గెలుపొందారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా ఆయనకు మాత్రం మంత్రివర్గంలో అవకాశంలభించలేదు. పదవులు దక్కలేదు.. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన పి.నర్సింహారెడ్డి గెలుపొందారు. రాష్ట్రంలో అప్పట్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఆయనకు మంత్రి యోగం కలుగలేదు. 1994 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన సి.బాగన్న ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పట్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న నందమూరి తారకరామారావు ఆయనకు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామని సీఎం పేషీ నుంచి ఆహ్వానం అందింది. మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి సైతం బాగన్న తన అనుచర గణంతో హాజరయ్యారు. చివరి వరకు వేచి చూసినా ఆయనకు పిలుపు రాలేదు. మంత్రి వర్గంలో చోటు లభించలేదు. దీంతో ఆయన అసంతృప్తితో వెనుదిరగడం అప్పట్లో చర్చనీయాంశమైంది. -
మూడోస్థానానికి పరిమితమైన ‘సైకిల్’
నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2009, 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ అధికార పగ్గాలు చేపట్టింది. అప్పటివరకు టీడీపీలో కొనసాగిన కిషన్‌రెడ్డి 2015లో బీఆర్ఎస్లో చేరారు. దీంతో టీడీపీ పరిస్థితి నావికుడు లేని పడవలా తయారైంది. 2018 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, టీడీపీ నాయకులు మహాకూటమిగా ఏర్పడ్డారు. పొత్తులో భాగంగా ఈ ఎన్నికల్లో సామ రంగారెడ్డిని టీడీపీ బరిలోకి దింపింది. అయితే కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన మల్రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ నుంచి పోటీ చేశారు. కిషన్‌రెడ్డి, రంగారెడ్డి నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. కేవలం 356 ఓట్ల మెజార్టీతో కిషన్‌రెడ్డి గెలుపొందారు. మహాకూటమి అభ్యర్థి రంగారెడ్డి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. -
కాంగ్రెస్‌ను గెలిపిస్తే.. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తాం..!
నిర్మల్/ఖానాపూర్/సాక్షి, ఆసిఫాబాద్: ‘కుమురంభీమ్, రాంజీగోండు, సమ్మక్క–సారలమ్మ లాంటి వీరుల భూమి ఇది. జల్ జంగల్ జమీన్ కోసం పోరాడిన గడ్డ ఇది. ఆదివాసులది ప్రపంచంలోనే గొప్ప సంస్కృతి. గిరిజన బిడ్డల కోసం ఇందిరమ్మ ఎన్నో చేసింది. అందుకే 40 ఏళ్లయినా దేశంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా తనను గుర్తుచేస్తుంటారు.. కాంగ్రెస్‌ను గెలిపిస్తే.. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తాం’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం వేర్వేరుగా ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు. ఖానాపూర్‌లో పార్టీ అభ్యర్థి వెడ్మ బొజ్జుపటేల్ తరఫున, ఆసిఫాబాద్‌లో అభ్యర్థి శ్యాంనాయక్ తరఫున ప్రచారం చేశారు. ఆదివాసీ నేతలైన బొజ్జుపటేల్, శ్యాం నాయక్‌ను గెలిపించాలని కోరారు. రెండు సభలు సక్సెస్ కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ కనిపించింది. భూమి పట్టాలు, ఐటీడీఏలు.. ఆదివాసీలు, గిరిజన బిడ్డల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో చేసిందని, ఇక ముందూ సంక్షేమ ఫలాలు అందిస్తుందని ప్రియాంకాగాంధీ తెలిపారు. తన నానమ్మకు ఆదివాసీలంటే చాలా ఇష్టమని, వారికోసం చాలా కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. భూములపై హక్కులు, పట్టాలు, పక్కా ఇళ్లు ఇచ్చారన్నారు. గిరిజనుల సంపూర్ణ వికాసం, అభివృద్ధి కోసం ఐటీడీఏలను ఏర్పాటు చేశారని చెప్పారు. ఇందిరమ్మ పుట్టినరోజునే ఇలా ఆదివాసీలను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. విజన్‌తో అభివృద్ధి చేస్తాం పదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ ప్రజల కలలను ఒక్కొక్కటిగా నాశనం చేస్తూ వచ్చారని ప్రియాంకాగాంధీ ఆరోపించారు. యువతకు ఉద్యోగాలు, రైతులకు రుణమాఫీ, మహిళలకు సంక్షేమ ఫలాలు ఇవ్వలేదని విమర్శించారు. పథకాలు, అభివృద్ధి పేరిట చేపట్టిన పనుల్లో రూ.కోట్లు దోచుకున్నారని, అన్నింట్లో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే ముందుచూపుతో ప్రజల అభివృద్ధికి కృషిచేస్తామని తెలిపారు. ఇందులో భాగంగానే ఆరు గ్యారంటీలను తీసుకువచ్చామని చెప్పారు. ఓటు కోసం వచ్చే బీఆర్ఎస్, బీజేపీ ఏం చేశాయో నిలదీయాలని పిలుపునిచ్చారు. ఖానాపూర్ అభ్యర్థి వెడ్మ బొజ్జుపటేల్, నిర్మల్ అభ్యర్థి శ్రీహరిరావు, బోథ్ అభ్యర్థి ఆడె గజేందర్, ఆదిలాబాద్ అభ్యర్థి కంది శ్రీనివాస్‌రెడ్డిని వేదికపై చూపిస్తూ వారిని గెలిపించాలని కోరారు. ఆకట్టుకున్న ప్రసంగం ఆసిఫాబాద్ సభలో ప్రియాంకాగాంధీ ప్రపంచ కప్ క్రికెట్ గురించి మాట్లాడటంతో సభలో హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. ఇండియా కచ్చితంగా గెలుస్తుందని.. 1983లో ఇండియా ప్రపంచ కప్ గెలుచుకున్న సందర్భంలో తన నానమ్మ ఇందిరాగాంధీ టీం సభ్యులకు ఇచ్చిన విందు గురించి తనకు గుర్తుందని అప్పటి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. ఆమె ప్రసంగాన్ని తెలుగులో అనువాదం చేయడానికి కాంగ్రెస్ నేత ఒకరు సిద్ధమవుతుండగా.. ప్రియాంక ‘అనువాదం కావాలా.. హిందీలో ప్రసంగం కొనసాగించనా..’ అని అడగ్గా.. ప్రజలు తెలుగులో అనువాదం కావాలని కోరారు. దీంతో ఆమె తెలుగు అనువాదానికి అంగీకరించి ప్రసంగం కొనసాగించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక యువత, అక్కచెల్లెమ్మలు పడుతున్న కష్టాల గురించి చెబుతూ.. ‘కేసీఆర్ హయాంలో యువతకు ఉపాధి దొరికిందా? అక్కచెల్లెమ్మల పురోగతికి ప్రభుత్వం పనిచేసిందా?’ అని ప్రియాంక సభికులను ప్రశ్నించగా.. అందరూ ముక్తకంఠంతో లేదు.. లేదు.. అని సమాధానం ఇవ్వడం కనిపించింది. దాదాపు 50 నిమిషాల పాటు ఆమె ప్రసంగం కొనసాగింది. ఆయా సభల్లో మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్రావుచవాన్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ జోనల్ ఇన్చార్జి విష్ణునాథ్, ఖానాపూర్ పరిశీలకుడు ప్రజ్ఞానంద్ ఖర్సె, ఏఐసీసీ సెక్రటరీ రోహిత్‌చౌదరి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, రాజురా ఎమ్మెల్యే సుభాష్ దోబే, కర్ణాటక ఎమ్మెల్సీ ప్రకాశ్‌రాథోడ్, మాజీ ఎమ్మెల్సీ రాజయ్య, సిర్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి రావి శ్రీనివాస్, నిర్మల్ బోథ్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థులు కూచాడి శ్రీహరిరావు, ఆడె గజేందర్, కంది శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు గుండా శ్యాం, మంగ, గణేశ్, అనిల్‌గౌడ్, మునీర్, ఆసిఫ్, సత్తు మల్లేశ్, పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, దయానంద్, చిన్నం సత్యం, షబ్బీర్‌పాషా, నిమ్మల రమేశ్, సతీశ్‌రెడ్డి, దుర్గాభవాని, జహీర్ హైమద్, మజీద్, గుగ్లావత్ రాజు, జంగిలి శంకర్, గంగనర్సయ్య, సలీంఖాన్, సీపీఐ నాయకులు బద్రి సత్యనారాయణ, భోగే ఉపేందర్, అల్లూరి లోకేశ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గెలిపిస్తారనే నమ్మకంతో ఉన్నం.. ‘ఎకరం 38 గుంటల భూమి మాత్రమే ఉన్న పేదోడిని.. ఇప్పటికీ ఇందిరమ్మ ఇంట్లోనే ఉంటున్న. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ బిడ్డ నాకోసం ఖానాపూర్ గడ్డకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్న. ఈ పేదోడికి ఒక్క అవకాశమిచ్చి గెలిపించండి. ఖానాపూర్ నియోజకవర్గంలో 33 ఏళ్లుగా కాంగ్రెస్ గెలుపు కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలపై నమ్మకంతో ఉన్నారు. మా నమ్మకాన్ని నిలబెట్టాలని కోరుతున్న..’ అంటూ ఖానాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జుపటేల్ అభ్యర్థించారు. వైఎస్సార్ హయాంలో ఖానాపూర్, కడెం మండలాల రైతుల చిరకాల స్వప్నం సదర్మాట్ బ్యారేజీని మంజూరు చేస్తే, బీఆర్ఎస్ పాలనలో నిర్మల్ ప్రాంతానికి తరలించినా నేటికీ పూర్తి చేయలేదన్నారు. కడెం ప్రాజెక్ట్‌కు కనీసం మరమ్మతు చేయించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. స్థానికేతరుడిని, తన బినామీతో కేటీఆర్ పోటీ చేయిస్తున్నారని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఆసిఫాబాద్ గడ్డ.. కాంగ్రెస్ అడ్డా ఆసిఫాబాద్ అభ్యర్థి శ్యాంనాయక్ మాట్లాడుతూ.. జిల్లాలో ఆదివాసీలు ఎన్నో కష్టాలు పడుతున్నారని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. వట్టివాగు, అడ ప్రాజెక్టుల్లో నీరున్నా పంటలకు అందించే లేని దుస్థితి ఉందని తెలిపారు. స్థానికంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లున్నా అభివృద్ధి శూన్యమన్నారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్యలైన గుండి బ్రిడ్జి, అప్పపల్లి రహదారి, తుంపల్లి వాగుపై హైలెవెల్ బ్రిడ్జి అనార్పల్లి బిడ్జిలతోపాటు ఇతర ప్రజాసమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని, అంబేద్కర్ ఆశయాల మేరకు పని చేస్తానని తెలిపారు. ఆసిఫాబాద్ గడ్డపై మరోసారి కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కోరారు. -
TS Elections 2023: నేతల వలసలు సరే.. మరి ఓటు బదిలీ సంగతేంటి..!?
రాజకీయ పార్టీల్లో వలసల పరంపర కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి జిల్లాలో రాజకీయ పార్టీల్లో ఒక పార్టీ నుంచి ఇతర పార్టీలకు జంప్ జిలానీల సంఖ్య భారీగా పెరిగింది. ఆయా పార్టీల్లో నేతలపై వ్యతిరేకతతో కొందరు, టికెట్ ఆశించి రాకపోవడంతో మరికొందరు పార్టీ కండువాలు మార్చేశారు. అయితే, వలస పోతున్న నేతల వెంట ఓటు బదిలీ జరిగేనా అన్న సందిగ్ధత ఆయా పార్టీల అభ్యర్థుల్లో నెలకొంది. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల షెడ్యూల్‌కంటే ముందే సిట్టింగ్‌లకే మళ్లీ టికెట్లు కేటాయించారు. దీంతో చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులపై వ్యతిరేకతతో నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వలస వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఖరారు తర్వాత అధికార పార్టీ నుంచి కూడా కాంగ్రెస్‌లోకి వలసలు కొనసాగాయి. ఇదే క్రమంలో కాంగ్రెస్‌లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతల తరఫు వారంతా అధికార పార్టీలో చేరారు. అదే విధంగా అనుకున్న వారికి టికెట్ రాకపోవడంతో మరో పార్టీలో చేరి టికెట్ పొందారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బీఆర్ఎస్లోకి వలసల పరంపర కొనసాగింది. మరోవైపు మొదట్లో వలస వెళ్లిన నేతలు కొంతమంది మళ్లీ తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు పార్టీ మారిన వారితోపాటు ఓటు బదిలీ ఎంత మేరకు జరుగుతుందన్నది ఇప్పుడు అభ్యర్థుల ముందు పెద్ద ప్రశ్నగా మారింది. పార్టీలు మారిన నేతలు ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నేతలు కూడా పార్టీలు మారారు. తద్వారానే టికెట్లను దక్కించుకున్నారు. వారితోపాటు ఆ నేతల వెంట కింది స్థాయి నాయకులు కూడా కండువాలు మార్చారు. నకిరేకల్‌లో బీఆర్ఎస్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం టిక్కెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్‌లో చేరి టికెట్ తెచ్చుకున్నారు. ఇన్నాళ్లు బీఆర్ఎస్లోనే ఉన్న వీరేశం అనుచరులు, ప్రజాప్రతినిధులు, ఇతర నేతలు పలువురు కాంగ్రెస్‌లో చేరారు. ♦భువనగిరి నియోజకవర్గంలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన వెంట కొంతమంది కూడా గులాబీ కండువా వేసుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అంతేకాకుండా భువనగిరి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు. ఆయన వెంట బీఆర్ఎస్లోకి వెళ్లినవారంతా తిరిగి ‘హస్తం’ గూటికి చేరారు. ఇదే నియోజకవర్గంలో బీజేపీలో ఉన్న జిట్టా బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. అయితే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మళ్లీ కాంగ్రెస్‌లోకి రావడంతో.. జిట్టా బీఆర్ఎస్లో చేరారు. కొన్ని రోజుల వ్యవధిలోనే వీరిద్దరు అటుఇటు మారడం చర్చనీయాంశమైంది. ♦ నల్లగొండ నియోజకవర్గంలో మొన్నటి వరకు బీఆర్ఎస్లో ఉన్న..బీఆర్ఎస్ పార్టీ జెడ్పీ ఫ్లోర్ లీడర్, తిప్పర్తి జెడ్పీటీసీ పాశం రాంరెడ్డి వంటి నేతలు కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో ఉన్న మాజీ జెడ్పీటీసీ తండు సైదులు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. నల్లగొండ పట్టణంలోనూ 8మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌కు చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్లో చేరారు. ♦ తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్లో ఉన్న మందుల సామేలు కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ తెచ్చుకున్నారు. ♦హుజూర్నగర్ నియోజకవర్గం నేరేడుచర్లలో కౌన్సిలర్‌గా ఉన్న చల్లా శ్రీలతారెడ్డి బీజేపీలో చేరి హుజూర్నగర్ టికెట్ తెచ్చుకున్నారు. కోదాడ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, సూర్యాపేట, దేవరకొండ నియోజకవర్గాల్లోనూ ఒక పార్టీ నుంచి మరో పార్టీకి భారీ ఎత్తున నేతలు, ప్రజా ప్రతినిధుల వలసల పరంపర కొనసాగింది. ♦ మునుగోడులోనూ చివరి వరకు కాంగ్రెస్ టికెట్ ఆశించిన చలమల్ల కృష్ణారెడ్డి బీజేపీలో చేరడంతో ఆయన వర్గం కూడా బీజేపీలోకి పోయింది. దీంతో పాటు కృష్ణారెడ్డి బీజేపీ టికెట్ తెచ్చుకున్నారు. అక్కడ గత ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరి, టికెట్ దక్కించుకున్నారు. దాంతోపాటు గతంలో కాంగ్రెస్‌లో ఉండి, ఆ తరువాత బీఆర్ఎస్లో చేరిన నేతలు, ప్రజా ప్రతినిధులు కొందరు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతుచిక్కని ఓటరు నాడి పార్టీలు మారిన నాయకుల బలం ఎంత? పార్టీలు మారిన వారు చెబితే పడే ఓట్ల శాతం ఎంత? అన్న అనుమానాలు అభ్యర్థుల్లో నెలకొన్నాయి. స్థానికంగా మండలాలు, గ్రామాలు, పట్టణాల్లో వారికి ఉన్న బలం ఎంత? అనే అంచనాల్లో అభ్యర్థులు పడ్డారు. స్థానిక నేతలు తమ వైపు రావడంతో ఆయా ప్రాంతాల్లో అప్పటివరకు వారిని నమ్మిన ఓటర్లు ఇప్పుడు వారు మారిన పార్టీకి వేస్తారా? లేదా? అన్న ఆందోళన పలువురు అభ్యర్థుల్లో నెలకొంది. ప్రస్తుతం అన్ని పార్టీలు ప్రచారాలు ముమ్మరం చేశాయి. ఏ పార్టీ మీటింగ్ పెట్టినా జనాలు తండోపతండాలుగా సభలకు వస్తున్నారు. ఈ పరిస్థితులలో ఓటర్ల నాడి తెలియని పరిస్థితి ఉంది. ఎవరికి వారు తామే గెలుస్తామని బహిరంగంగా చెబుతున్నా లోలోపల ఆందోళనతోనే ఉన్నారు. -
రాజన్న మీ దగ్గర ఎట్టున్నదే
పెగడపల్లి(ధర్మపురి): పొద్దంతా చేనులో కట్టం చేసి వచ్చిన మల్లన్న పక్క ఊర్లో ఉంటున్న తన సోపతి రాజన్నకు ఫోన్ చేసి ఎలచ్చన్ల గురించి మాట్లాడుతున్న మాటమంతి ఇలా ఉంది. మల్లన్న: ఏం రాజన్న ఎట్లున్నవ్ అంతా మంచిదేనా..? రాజన్న: ఆ మల్లన్న మంచిగున్నానే...నువ్వు ఎట్లున్నవ్.. మల్లన్న: ఆ మంచిగనే ఉన్నా..బాగా రోజులైంది నీతో మాట్లాడక. ఎం జేస్తున్నవు ఏందీ? రాజన్న: ఇప్పుడే చేన్లకు పోయి ఇంటికచ్చిన. ఎల్లచ్చన్లు అచ్చినయ్ కదా. రాత్రికి ఒక నలుగురం కలిసి మంచి చెడూ మాట్లాడుకునుడే ఇంకేముంది. మల్లన్న: ఎలచ్చన్లు ఏంటో రాజన్న..ఎప్పుడూ సూడని సిత్రాలు సూస్తున్నాం. గీ నాయకులు కాళ్లు కడుగుతుండ్రు. బజ్జీలు జేత్తుండ్రు. ఇంటికొచ్చి ఇసీ్త్ర చేస్తుండ్రు, బీడీలాకు కత్తిరిస్తుండ్రు, పొయ్యికాడికచ్చి రొట్టెలు జేత్తుండ్రు. పోరగండ్లకు తానం పోత్తుండ్రు. పచారంలా దప్పులు కొడుతుండ్రు.. అబ్బబ్బ ఎన్నడూ సూడని సిత్రాలు ఎలచ్చన్ల పుణ్యమాని సూస్తున్నాం. రాజన్న: ఔనూ మల్లన్నా.. గీ నాయకులు ఓట్ల కోసం ఏమైన సేసేటట్లు ఉన్నరు. నమ్మబుద్ధవ్వట్లేదు కదా.. మల్లన్న: అవు రాజన్న..గెలిసేదాక ఒక్కటే..గెలిపించాక ఇంకొక్కటి వీల్ల తరికా.. సూడనోల్లమా మనం.. సిన్నగున్నప్పటి నుంచి సూస్తున్నవే కదా. రాజన్న: అవు మల్లన్న..గిసుంటి పనులు సేయడంలో నాయకులను మించినోళ్లు లేరు గదా. మల్లన్న: సరే గానీ రాజన్న..మీ దగ్గర ఎట్టున్నదే.. (ఏ పార్టీ హవా నడుస్తున్నది). రాజన్న: ఏం చెప్పస్తలేదు మల్లన్న. అందరూ వస్తుండ్రు, పోతుండ్రు. ఎవ్వల్లస్తరో(గెలుస్తరో) సమజయితలేదు. మల్లన్న: అవునా..(నవ్వతూ) ఎవరైన రానీ..ఎవరిని నారాజ్ చేయొద్దు మనం. సూద్దాం ఇంకో వారం ఆగితే అంతా కుల్లావుతది గదా. రాజన్న: సరే మల్లన్న. రాత్రి అయింది. బుక్కెడు బువ్వ తిని పడుకుంటా.. మల్లన్న: సరే రాజన్న ఉంటా మరి. -
డిపాజిట్ గల్లంతు అంటే..
సాక్షి, పెద్దపల్లి: ఎన్నికల్లో అభ్యర్థులు తమ ప్రత్యర్థులకు డిపాజిట్ కూడా రాదంటూ విమర్శిస్తుండం నిత్యం వింటూ ఉంటాం. మరి డిపాజిట్ గల్లంతు అంటే ఏమిటో.. మనలో చాలామందికి తెలియదు.. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ నామినేషన్ ఫారంతోపాటు నిర్ణీత డిపాజిట్ (ధరావతు) చెల్లించాల్సి ఉంటుంది. నామినేషన్ దాఖలు చేసే జనరల్ అభ్యర్థులు రూ.10వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5,000 డిపాజిట్ చెల్లించాలి. సాధారణంగా ఎన్నికల్లో పోలైన చెల్లిన ఓట్లలో ఆరోవంతుకు మించిన ఓట్లు పోటీచేసిన అభ్యర్థులకు వస్తేనే సదరు అభ్యర్థికి చెల్లించిన డిపాజిట్ తిరిగి చెల్లిస్తారు. లేదంటే ఆ డిపాజిట్‌ను ప్రభుత్వమే జప్తు చేసుకుంటుంది. ఎన్నికల ఫలితాలు కేంద్ర ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురితమయ్యాకే అర్హులైన అభ్యర్థులకు డిపాజిట్ తిరిగి ఇచ్చేస్తారు. -
Narayanpet: తెలంగాణ కాదు.. దేశం రూపురేఖలు మార్చే ఎన్నికలివి..!
రూపురేఖలు మార్చే ఎన్నికలివి.. ‘మిత్రులారా.. మొట్టమొదటగా ఈ ప్రాంత మాతా మాణికేశ్వరి అమ్మవారికి నమస్కరిస్తున్నా.. అభ్యర్థుల పేర్లు ఏదైతే చెప్పినప్పుడు హర్షధ్వానాలతో స్వాగతించారో.. అప్పుడే పూర్తిగా నాకు నమ్మకం ఏర్పడింది. కచ్చితంగా బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తారని.. ఎమ్మెల్యేలను గెలిపించి తెలంగాణ శాసనసభకు పంపించడమే కాకుండా.. ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్‌తో పాటు దేశం రూపురేఖలు మార్చే ఎన్నికలివి’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనను సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రజలందరూ ఒక్కసారి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. నారాయణపేట: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీజేపీ అగ్రనేతలు వరుసగా ఉమ్మడి పాలమూరు జిల్లా బాట పట్టారు. జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ నారాయణపేట, మహబూబ్‌నగర్ కు వచ్చి బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా గద్వాలలో జరిగిన సభలో శనివారం పాల్గొనడంతో కార్యకర్తల్లో కదనోత్సవం కనిపిస్తోంది. ఆదివారం నారాయణపేటలో జరిగిన సకల జనుల విజయ సంకల్ప సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొని ప్రసంగించడంతో బీజేపీ శ్రేణులకు మరింత ఉత్సాహం వచ్చినట్లయింది. జాయమ్మ చెరువుకు నీళ్లేవీ? పాలమూరు– రంగారెడ్డి ద్వారా నీళ్లు తెచ్చి జాయమ్మ చెరువు నింపుతామన్న పాలకులు ఇప్పటివరకు ఎందుకు తీసుకురాలేదో చెప్పాలని మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత జితేందర్‌రెడ్డి అన్నారు. నారాయణపేట ఎప్పటికై నా బీజేపీ గడ్డ అని.. ఓడినా.. గెలిచినా రతంగ్ పాండురెడ్డి ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటారన్నారు. కొత్తగా కాంగ్రెస్ నాయకులు వస్తున్నారు.. పెద్ద పెద్ద మాటలు చెబుతుండ్రు.. కర్ణాటకలో కాంగ్రెస్ ఐదు గ్యారంటీలు చూడండి.. ఏమైనా అమలవుతున్నాయా.. అన్నీ అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే ఐదారు లక్షల కోట్లు అప్పు చేశారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు గ్యారంటీలు ఎక్కడ అమలు చేస్తారో ఒక్కసారి ఆలోచించాలన్నారు. గతంలో ఎంపీగా సైనిక్ స్కూల్‌ను నారాయణపేటకు తీసుకువచ్చా.. 50 ఎకరాల ప్రభుత్వ భూమిని చూయించినా ఇప్పటి వరకు ఆ స్కూల్ ఏమైందో ఎమ్మెల్యే చెప్పాలన్నారు. ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉండే రతంగ్పాండురెడ్డితోపాటు బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వస్తే బూడిదే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పారీ్టలు ఒకరిని మించి ఒకరు మేనిఫెస్టోలను ప్రకటిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఆ రెండు పారీ్టలు ఏకమై డ్రామాలు చేస్తున్నాయని, కేసీఆర్ పాలనతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మనకు బూడిదే మిగులుతుందని ధ్వజ మెత్తారు. సీఎం కేసీఆర్‌తోపాటు ఇక్కడ పోటీ చేసే నాయకులకు ఓటు అడిగే హక్కు లేదన్నా రు. నారాయణపేటకు జూరాల బ్యాక్‌వాటర్ ద్వారా పాలమూరు – రంగారెడ్డి నీళ్లు ఇవ్వాలని మొదటగా డిజైన్ చేసి తర్వాత డిజైన్ మార్చి నారాపూర్ దగ్గరకు తీసుకువెళ్లినా.. ఇప్పటి వరకు సాగునీరు అందలేదన్నారు. ఫలితంగా స్థానికులు బతుకుదెరువు కోసం సోలాపూర్, బొంబాయి ప్రాంతాలకు వలస పోతున్నారని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తి సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. నారాయణపేటలో రతంగ్‌పాండురెడ్డి, మక్తల్‌లో జలంధర్‌రెడ్డి, కొడంగల్‌లో బంటు రమేశ్, దేవరకద్రలో కొండా ప్రశాంత్‌రెడ్డిలను గెలిపించాలని ఓటర్లను కోరారు. ♦సాధారణ కార్యకర్త అయిన నాకు టికెట్ ఇవ్వడం అంటే అది బీజేపీ గొప్పతనం అని, కొడంగల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు స్థానికేతరులు అయితే.. నేను లోకల్ అని కొడంగల్ బీజేపీ అభ్యర్థి బంటు రమేశ్ అన్నారు.ఈ ప్రాంతానికి సాగునీరు అందించడమే తన లక్ష్యమని, ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ♦రాష్ట్రంలో బీఆర్ఎస్ నియంత పాలనకు చరమగీతం పాడి రాష్ట్రంలో బీజేపీని ఆదరించి అధికారంలోకి తీసుకురావాలని దేవరకద్ర అభ్యర్థి కొండా ప్రశాంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రం ఇప్పటికే రూ.5 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని, మరోదిక్కు ఆరు గ్యారంటీల పేరుతో వస్తున్న కాంగ్రెస్ పార్టీ పట్ల సకలజనులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ♦ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలందరికీ ఉచిత వైద్యం, విద్యార్థులకు ఉచిత విద్యను అందించడమే అమలు చేస్తుందని మక్తల్ ఎమ్మెల్యే అభ్యర్థి మాదిరెడ్డి జలంధర్‌రెడ్డి అన్నారు. రైతులకు వరి ధాన్యానికి క్వింటాకు మద్దతు ధర రూ.3,120 గొప్ప విషయమన్నారు. ♦ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయా.. గెలిచిన అభ్యర్థి పాలన ఏ విధంగా ఉందో చూశారు.. ఈసారి తనకు ఒక్క చాన్స్ ఇచ్చి ఆశీర్వదించాలని నారాయణపేట అభ్యర్థి రతంగ్‌పాండురెడ్డి ప్రజలను కోరారు. కేసీఆర్ ప్రభుత్వం ఇంటింటికో ఉద్యోగం, సాగునీరు, దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర నేత నాగూరావు నామాజీ, పార్లమెంట్ కనీ్వనర్ పవన్‌కుమార్, జిల్లా పార్టీ అధ్యక్షులు పడాకుల శ్రీనివాసులు, నాయకులు చంద్రశేఖర్, సత్యయాదవ్, రఘురామయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కామారెడ్డి బరిలో కొత్త ప్రత్యర్థులు!
సాక్షి, కామారెడ్డి: దశాబ్దాలుగా ఆయా నియోజకవర్గాల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా పాతముఖాలే కనిపించేవి. గెలిచినా, ఓడినా వాళ్లే బరిలో ఉండేవారు. నువ్వా, నేనా అన్న రీతిలో తలపడేవారు. ఈసారి అందుకు భిన్నంగా పాత ప్రత్యర్థులు లేని ఎన్నికలు జరుగుతుండడం ప్రత్యేకతను సంతరించుకుంది. జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు మారారు. దీంతో కొత్త వారు ప్రత్యర్థులయ్యారు. కామారెడ్డి సీటు మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తుండడం, ఆయనపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పోటీకి దిగడంతో అందరి దృష్టి ఈ నియోజకవర్గంపైనే ఉంది. ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్లలోనూ కొత్త ప్రత్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కామారెడ్డిలో చిరకాల ప్రత్యర్థులు లేకుండా.. కామారెడ్డి నియోజకవర్గంలో షబ్బీర్‌అలీ, గంప గోవర్ధన్ మూడు దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు. 1994లో తొలిసారి వీరిద్దరూ ప్రత్యర్థులుగా తలపడ్డారు. ఆ ఎన్నికల్లో గంప గోవర్ధన్ గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1999లో గంపకు టికెట్టు దక్కలేదు. 2004 లో బీజేపీతో పొత్తు తో గంప పోటీ చేసే అవకాశం కోల్పోయారు. 2009లో గంప, షబ్బీర్ పోటీ చేశారు. 2014, 2018 ఎన్నికల్లోనూ వీరిద్దరే ప్రధాన ప్రత్యర్థులు.. మూడు ఎన్నికలలోనూ గంపదే పైచేయి అయ్యింది. ఈసారీ వారే ప్రత్యర్థులుగా ఉంటారని మొదట భావించినా.. అనూహ్యంగా సీఎం కేసీఆర్ బరిలోకి రావడంతో గంప పోటీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇదే సమయంలో సీఎం మీద పోటీకి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ముందుకు రావడంతో షబ్బీర్ అలీ సైతం సీటును త్యాగం చేసి, నిజామాబాద్ అర్బన్‌కు వలస వెళ్లాల్సి వచ్చింది. దీంతో మూడు దశాబ్దాల చరిత్రలో షబ్బీర్, గంప లేకుండా తొలిసారి కామారెడ్డి నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతున్నాయి. బాన్సువాడలో పోచారం ఒక్కరే పాతకాపు... బాన్సువాడ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. నియోజకవర్గంలో తిరుగులే ని నాయకుడిగా ఎదిగిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఈసారి కూడా బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థి బాజిరెడ్డి చేతిలో ఓటమి చెందిన పోచారం 2009, 2011(ఉప ఎన్నిక), 2014, 2018 ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధించారు. 2014, 2018 ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థిగా కాసుల బాల్‌రాజు కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. ఈసారి ఆయనకు కాంగ్రెస్ టికెట్టు కేటాయించలేదు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిని ఇక్కడినుంచి బరిలో దింపింది. అలాగే బీజేపీ అభ్యర్థిగా నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పోటీలో ఉన్నారు. ఇక్కడ పోచారం ఒక్కరే పాత కాపు కాగా మిగతా ఇద్దరూ కొత్త వారే.. ఎల్లారెడ్డిలో జాజాల.. కామారెడ్డికి పొరుగునే ఉన్న ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఈసారి రాజకీయాల్లో అనేక మార్పులు సంభవించాయి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన జాజాల సురేందర్ కొంత కాలానికే గులాబీ కండువా కప్పుకున్నారు. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన ఏనుగు రవీందర్‌రెడ్డి 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీలో ప్రాధాన్యత తగ్గడంతో బీజేపీలో చేరారు. అక్కడ ఇమడలేకపోయిన ఏనుగు ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకుని ఎల్లారెడ్డి టికెట్టు కోసం ప్రయత్నించారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో జహీ రాబాద్ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందిన మదన్మోహన్రావు ఎల్లారెడ్డి టికెట్టు సాధించారు. దీంతో ఏనుగు రవీందర్‌రెడ్డికి ప్రత్యామ్నాయంగా బాన్సువాడ టికెట్టు ఇచ్చారు. గడచిన రెండు దశాబ్దాల కాలంలో ఎల్లారెడ్డి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ ఏనుగు పోటీ చేస్తూ వచ్చారు. నాలు గు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈసారి ఎల్లారెడ్డిలో ఆయన లేని ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ బీజేపీ నుంచి వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి బరిలో నిలిచారు. జుక్కల్‌లో గంగారాం స్థానంలో తోట లక్ష్మీకాంతరావ్ జుక్కల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే హన్మంత్‌సింధే బీఆర్ఎస్ అభ్యర్థిగా తిరిగి పోటీ చేస్తున్నారు. 2009, 2014, 2018 ఎన్నికల్లో వరుస విజయాలను సొంతం చేసుకున్న ఆయన ఈసారి కూడా విజయం సాధించాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా అరుణతార మళ్లీ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ మాత్రం అభ్యర్థిని మార్చింది. ఇక్కడినుంచి దశాబ్దాలుగా పోటీ చేస్తూ వస్తున్న మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారామ్‌కు బదు లు తోట లక్ష్మీకాంతరావ్ను బరిలో నిలిపింది. -
కాంగ్రెస్ చేసేదే చెబుతుంది! : షామ మహమ్మద్
సాక్షి, రంగారెడ్డి/వికారాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏది చెప్పిందో అది కచ్చితంగా చేసి తీరుతుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ షమా మహమ్మద్ స్పష్టం చేశారు. శనివారం మండలంలోని బూర్గుపల్లి ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం పార్టీ అభ్యర్థి గడ్డం ప్రసాద్‌కుమార్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే కర్ణాటకలో ఐదు గ్యారంటీలను అమలు చేశామని గుర్తు చేశారు. ప్రతి నెలా మహిళలకు రూ.2500, ఉచిత బస్సు ప్రయాణం, వృద్ధులకు రూ.4వేల పింఛన్, రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు. రూ. 40వేల కోట్లతో పూర్తి కావాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టును రూ. 150కోట్లకు పెంచి భారీగా కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. అవినీతి వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రూ.2లక్షల రుణమాఫీ, రూ.3లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తుందని తెలిపారు. ప్రతి ఇంటికీ 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం హామీని నిలుపుకోలేపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటి స్థలంతోపాటు నిర్మాణానికి రూ. 5లక్షలు ఇస్తుందని తెలిపారు. ఆమె వెంట నాయకుడు లలిత్ తదితరులు ఉన్నారు. -
'ఈవీఎం' విశేషాల గురించి.. మీకు పూర్తిగా తెలుసా..!?
సాక్షి, ఆదిలాబాద్: సమర్థవంత ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనేక సంస్కరణలు చేపట్టింది. ఇందులో భాగంగా బ్యాలెట్ బాక్స్ మొదలు ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్) వరకు ఓటింగ్ విధానంలో మార్పులు తెచ్చింది. ఈవీఎం, వీవీప్యాట్, నోటా లాంటి నూతన విధానాలతో పారదర్శక ఓటింగ్‌కు భరోసానిస్తోంది. 1999 ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాల ముద్రణకు 7,700 టన్నుల కాగితం వాడారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ కోసం ఈవీఎం వాడడంతో 10 వేల టన్నుల కాగితం మిగిలింది. ఈవీఎంలను మొదటిసారిగా 1982లో కేరళ రాష్ట్రంలోని పర్వూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించారు. ఈవీఎంలపై నెలకొన్న సందేహాలకు నివృత్తిగా పలు సమాధానాలను ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో పొందుపర్చింది. నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎం విశేషాలపై కథనం.. ఈవీఎం అంటే? ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్. ఇది ఎన్నికల్లో పోలైన ఓట్లను ఎలక్ట్రానిక్ పద్ధతిలో రికార్డు చేయడంతో పాటు లెక్కించే పరికరం. ఈవీఎంలో బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్‌తో పాటు జతగా వీవీప్యాట్ (ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్) ఉంటుంది. రవాణా సులభం.. బ్యాలెట్ బాక్సులతో పోలిస్తే ఈవీఎంల రవాణ చాలా సులభం. తేలికంగా, పోర్టబుల్‌గా ఉండడంతో దూరంగా, రోడ్డు సౌకర్యం లేనిప్రాంతాలకు సైతం వీటిని సులభంగా తరలించవచ్చు. గరిష్టంగా అభ్యర్థుల సంఖ్య, వేసే ఓట్లు.. ఈవీఎం బ్యాలెట్ యూనిట్లో నోటాతో పాటు 15 మంది అభ్యర్థుల పేర్లు మాత్రమే ఉంటాయి. ఒకవే ళ అంతకంటే ఎక్కువ అభ్యర్థులు బరిలో ఉంటే మ రో బ్యాలెట్ యూనిట్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ఇలా ఒక ఈవీఎంకు 24 బ్యాలెట్ యూని ట్లు అనుసంధానించవచ్చు. తద్వారా 384 మంది అభ్యర్థుల వరకు సేవలు అందిస్తుంది. ఇక ఓట్ల విషయానికి వస్తే గరిష్టంగా 2 వేల ఓట్లను రికార్డు చేస్తుంది. కానీ ఎన్నికల్లో సాధారణంగా 1500 ఓట్లను నమోదు చేయడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. విద్యుత్ లేని ప్రాంతాల్లో.. ఈవీఎంలకు విద్యుత్ సరఫరా అవసరం లేదు. ఈవీఎం, వీవీప్యాట్లకు సొంతంగా బ్యాటరీ/పవర్–ప్యాక్ సౌకర్యం ఉండడంతో విద్యుత్ సరఫరా లేని ప్రాంతాల్లో సైతం వీటిని వినియోగించవచ్చు. నిర్ధారించుకున్న తర్వాతే పోలింగ్.. పోలింగ్ ప్రారంభానికి ముందు కంట్రోల్ యూనిట్లో రిజల్ట్ బటన్‌ను నొక్కి ఇప్పటికే ‘దాచిన’ ఓట్లేవీ నమోదు కాలేదని ప్రిసైడింగ్ అధికారి హాజరైన పో లింగ్ ఏజెంట్లకు ప్రదర్శిస్తారు. వీవీప్యాట్ డ్రాప్బా క్స్ తెరిచి ఖాళీగా ఉందని చూపుతారు. వారి సమక్షంలో కనీసం 50 ఓట్లతో మాక్ పోల్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆ ఫలితాన్ని క్లియర్ చేసి అసలు పోల్ ప్రారంభించే ముందు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్‌కు సీలు వేస్తారు. పోలైన ఓట్ల సంఖ్య ఇలా తెలుసుకోవచ్చు.. ఈవీఎం కంట్రోల్ యూనిట్లో ఫలితం బటన్‌తో పాటు, టోటల్ బటన్ ఉంటుంది. పోల్ సమయంలో ఎప్పుడైనా ఈ బటన్ నొక్కితే అప్పటి వరకు పోలైన మొత్తం ఓట్ల సంఖ్య తెలుస్తుంది. పోలింగ్ ముగియగానే క్లోజ్ బటన్ నొక్కితే మెషిన్ ఇకపై ఓట్లను అంగీకరించదు. ఈవీఎంల భద్రత.. పోలింగ్ తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లో సె క్యూరిటీ బలగాల పహారాలో భద్రపరుస్తారు. అభ్యర్థులు నియమించిన ఏజెంట్లు కౌంటింగ్ వరకు ఈవీఎంలను 24 గంటలూ చూసేందుకు అనుమతిస్తారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌లకు తాళాలు వేసి ఎన్నికల అధికారులతో పాటు అభ్యర్థులు లేదా వారి ప్రతినిధుల సంతకాలతో సీలు వేస్తారు. కౌంటింగ్ డే.. కౌంటింగ్ రోజున అభ్యర్థులు/వారి ప్రతినిధులు, రిటర్నింగ్ అధికారి, ఎన్నికల సంఘం పరిశీలకుల సమక్షంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ తెరుస్తారు. అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. లెక్కింపు పూర్తయిన తర్వాత, వీవీప్యాట్ స్లిప్‌లను బయటకు తీసి, అభ్యర్థులు/వారి ప్రతినిధుల సమక్షంలో నల్లటి కవరులో భద్రపరుస్తారు. ఓటరు ఫిర్యాదు చేయవచ్చు.. ఓటరు ఓటును నమోదు చేసిన తర్వాత వీవీప్యాట్‌లో కనిపించే పేపర్ స్లిప్‌లో ఓటు వేసిన అభ్యర్థి కాకుండా వేరే అభ్యర్థి పేరు, గుర్తు వచ్చినట్లయితే రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. నిజమని తేలితే ఆ ఓటింగ్ యంత్రంలో తరువాతి ఓట్ల నమోదును నిలిపివేసి రిటర్నింగ్ అధికారి ఇచ్చిన ఆదేశాల ప్రకారం నడుచుకుంటారు. ఓటు ఎలా వేయవచ్చు? ఈవీఎం ఓటింగ్ విధానంలో కంట్రోల్ యూ నిట్ ప్రిసైడింగ్ అధికారి వద్ద, బ్యాలెట్ యూ నిట్, వీవీప్యాట్ ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఉంటుంది. బ్యాలెట్ యూనిట్‌పై ఓటరు తన కు నచ్చిన అభ్యర్థి గుర్తుకు ఎదురుగా ఉన్న బ్లూబటన్ నొక్కగానే ఎరుపురంగు లైట్ మె రుస్తుంది. ఎంపిక చేసుకున్న అభ్యర్థి సీరియ ల్ నంబర్, పేరు, గుర్తు చూపించే పేపర్ స్లిప్ వీవీప్యాట్ విండో ద్వారా సుమారు 7 సెకన్ల పాటు కనిపించి డ్రాప్‌బాక్స్‌లో పడగానే కొద్దిసేపు బీప్ అనే శబ్దం వస్తుంది. దీంతో ఓటు నమోదైందని తెలుసుకోవచ్చు. ఈవీఎం మొరాయిస్తే.. పోలింగ్ సమయంలో బ్యాలెట్, కంట్రోల్ యూనిట్ క్రమం తప్పితే బ్యాలట్, కంట్రోల్ యూనిట్‌తో పాటు వీవీప్యాట్‌తో కూడిన కొత్త సెట్ ఏర్పాటు చేస్తారు. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో రిజర్వ్ దశ నుంచి పనిచేయని దశ వరకు నమోదైన ఓట్లు, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ బ్యాలెట్ స్లిప్‌లు కంపార్ట్మెంట్ మెమరీలో భద్రంగా ఉంటాయి. వీవీప్యాట్ మాత్రమే పనిచేయకపోతే కంట్రోల్ యూనిట్లో నమోదైన ఓట్లు దాని మెమరీలో భద్రంగా ఉంటాయి. దీంతో రిజర్వ్ మెషిన్ల నుంచి పనిచేయని వీవీప్యాట్ తొలగించి మరొకటి ఏర్పాటు చేసిన తర్వాత పోలింగ్ తిరిగి ప్రారంభిస్తారు. ఏదైనా సాంకేతిక కారణాలతో కంట్రోల్ యూనిట్లలో నమోదైన ఓట్లను నిర్ధారించకపోతే కంట్రోల్ యూనిట్ వీవీప్యాట్ స్లిప్‌లను లెక్కిస్తారు. -
'సంక్షేమ' మంత్రాన్ని జపిస్తూ..
సాక్షి, ఆదిలాబాద్: మూడు ప్రధాన పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలు ప్రజల ముందుకు వచ్చాయి. ఈ ఎన్నికల్లో గెలిపిస్తే ఆ హామీలను అమలు చేస్తామని చెబుతున్నాయి. నెల క్రితమే బీఆర్ఎస్ కేసీఆ ర్ భరోసా అంటూ ప్రకటించగా.. శుక్రవారం కాంగ్రెస్ అభయహస్తం పేరిట, శనివారం బీజేపీ సకల జనుల సౌభాగ్య తెలంగాణ గ్యారంటీ పేరిట మేని ఫెస్టోలను విడుదల చేశాయి. ఇప్పటి వరకు ఒక విధంగా సాగిన ప్రచారం ఈ మిగిలిన రోజుల్లో హా మీలను వివరిస్తూ జోరుగా సాగే అవకాశం ఉంది. హామీ పత్రాలు ఇలా..! పార్టీ అభ్యర్థులను ముందుగా ఖరారు చేయడంతో పాటు బీఆర్ఎస్ నెల క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా హైదరాబాద్‌లో మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారంలో కేసీఆర్ భరోసా పేరిట వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లారు. సామాజిక పింఛన్లను విడతల వారీగా రూ.5 వేలకు పెంచడం, కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా, దళితబంధును కొసాగించడం, రైతుబంధు రూ.10 వేల నుంచి విడుతల వారీగా రూ.16 వేల వరకు పెంచడం వంటి పథకాలను ఇందులో ప్రకటించారు. ఇక కాంగ్రెస్ మేనిఫెస్టోను శుక్రవారం హైదరాబాద్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో విడుదల చే సిన విషయం తెలిసిందే. ఆరు గ్యారంటీలు, రైతు, యూత్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ డిక్లరేషన్లతో పాటు అదనంగా వివిధ సంక్షేమ పథకాలను ఇందులో ప్రకటించారు. ధరిణికి బదులు భూమాత పో ర్టల్ తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్, ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణపై హా మీ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ పథకం పరిమితి రూ.10 ల క్షల వరకు పెంపు, మహిళలకు, ఆడ పిల్లలకు ఆర్థిక సాయం, కులాలు–రిజర్వేషన్లు వంటి అంశాలను ప్రస్తావించారు. ఇక శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హైదరాబాద్‌లో బీజేపీ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ధరణి స్థానంలో మీ భూమి వ్యవస్థ, కేంద్ర పథకాల అమలుకు ప్రత్యేక మంత్రిత్వశాఖ, మత ప్రతిపాదికన రిజర్వేషన్ల తొలగింపు, బీసీ, ఎస్టీ, ఎస్సీలకు రిజర్వేషన్లు, తెలంగాణ ముఖ్యమంత్రిగా బీసీ, వివిధ చట్టాలను ఏకీకృతం చేస్తూ ఉమ్మడి పౌరస్మృతి, ఎస్సీల వర్గీకరణకు సహకారం, బీఆర్ఎస్ అవినీతిపై విచారణ కమిటీ, అర్హులైన పేదలందరికీ ఇళ్లు వంటివి ప్రకటించారు. మిగిలింది కొద్ది రోజులే.. ప్రచారానికి మరికొద్ది రోజుల సమయం మాత్రమే మిగిలింది. ఈ నెల 30న పోలింగ్ ఉండగా దానికి 48 గంటల ముందుగానే ప్రచారం పరిసమాప్తం అవుతుంది. బీఆర్ఎస్ ఇప్పటికే తమ మేనిఫెస్టోపై విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇక కాంగ్రెస్, బీజేపీలు తమ హామీ పత్రాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలుపై ప్రచారంలో ముందుకు తీసుకెళ్లారు. ఇక బీజేపీ పరంగా ప్రధానమంత్రి మోదీ రాష్ట్ర పర్యటనలో భాగంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై హమీలు ఇచ్చారు. అలాగే ఎస్సీ వర్గీకరణపై హైదరాబాద్ సభ ద్వారా ఆయా వర్గాల ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తాజాగా కాంగ్రెస్, బీజేపీలకు సంబంధించి హామీ పత్రాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయా పార్టీలు సిద్ధం అవుతున్నాయి. -
ఏ గుర్తు.. ఎంతిస్తరు..? కండువా వేసుకుని సిద్ధం..
సాక్షి, కరీంనగర్/పెద్దపల్లి: శాసనసభ సాధారణ ఎన్నికల్లో పోటీపడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఏర్పాటు చేసే ఎన్నికల ప్రచారసభ, ఇంటింటిప్రచారం.. ఏదైనా కార్యకర్తలు మాత్రం వాళ్లేనని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. పెద్దపల్లి సెగ్మెంట్లో ఇటీవల నిర్వహించిన సభలకు నేతలు మినహా హాజరైన వారిలో అధికశాతం పెయిడ్ కార్యకర్తలే అనడంలో అతిశయోక్తి లేదు. ఊళ్లలోనే ప్రచారం.. ► గ్రామాల్లో స్థానికంగానే ఇంటింటి ప్రచారం నిర్వహించే రాజకీయపార్టీల తరఫున ప్రచారం చేసేందుకు ముందుకొస్తున్న వారు ఏ గుర్తుకు ప్రచారం చేయాలి, ఇలా చేస్తే తమకు ఎంత ఇస్తారని అడిగి మరీ వసూలు చేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. ► అయితే ఆయా ఊళ్లలో ఉండే కొందరు చోటామోటా నాయకులు, గ్రామ పెద్దలు జనసమూహాన్ని తరలించేందుకు కొంతమొత్తాన్ని మాట్లాడుకుని అందులో కొంత నొక్కేస్తున్నారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ► ఇంటింటి ప్రచారాన్ని స్థానికంగా ఉండేవాళ్లతో గంట, గంటన్నర సమయం పాటు నిర్వహిస్తూ రూ.100నుంచి రూ.150 దాకా చెల్లిస్తున్నట్లు సమాచారం. అలాగే మండల, జిల్లా కేంద్రాల్లో నిర్వహించే అగ్రనేతల సభలకు వాహనాల్లో తరలించిన సమయాల్లో రూ.300 నుంచి రూ.500దాకా చెల్లిస్తే సదరు పార్టీ కండువా వేసుకుని సిద్ధంగా ఉంటున్నారని అంటున్నారు. ► కొద్దిసేపటికోసమే కావడంతో మహిళలు, వృద్ధులు సభలకు వచ్చేందుకు పోటీపడుతున్నారు. మగ వారినికి తీసుకొస్తే వారిని తీసుకొచ్చిన నాయకుడు తిరుగు ప్రయాణంలో మందుతో విందు ఏర్పాటు చేయాల్సి వస్తోందని ఎక్కువ మంది నేతలు మహిళలనే పిలి పించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ► ఇటీవల పెద్దపల్లిలో జరిగిన ఓ సభకు 30వేల మందికిపైగా మహిళలు హాజరుకావడం గమనార్హం. ఊపందుకోనున్న ప్రచారం.. నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో గుర్తులు పొందిన అభ్యర్థులు ప్రచా రంలో మునిగి తేలుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు అగ్రనేతలతో బహిరంగ సభలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుని జనసమీకరణలో తలమునకలయ్యారు. దీంతో పెయిడ్ కార్యకర్తలకు డిమాండ్ పెరుగుతోంది. వరి కోతలు కూడా ఇప్పుడే.. వరి కోతలు ఇప్పుడే రావడం.. ఎన్నికల ప్రచారసభలు జరగనుండడంతో వ్యవసాయ పనులకు కూలీ ల కొరత ఏర్పడుతోంది. వలసకూలీలతో కొన్ని ప్రాంతాల్లో కోతలు కోస్తుండగా.. యంత్రాలతో ఇంకొన్ని ఏరియాల్లో వరికోతలు ముమ్మరం చేస్తున్నా రు. ఏదైతేనేం.. సాధారణ ఎన్నికల ప్రచారపర్వం గడువు చివరి దవలో వస్తుండడంతో జోరు పెంచేందుకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇవి కూడా చదవండి: చేరి.. చేజారి..! ‘హస్తం’లో తారుమారు రాజకీయం.. -
నామినేషన్ వేసి.. ప్రచారం మరిచే.. చోటా పార్టీల పరిస్థితి..???
సాక్షి,పెద్దపల్లి: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గడువు మరోవారం రోజుల్లో ముగియనుంది. అయినా జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల బరిలో నిలిచిన వారిలో చాలామంది తమ ప్రచారం ఇంకా మొదలుపెట్టని పరిస్థితి నెలకొంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల నాటినుంచే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీల అభ్యర్థులు మండలాల వారీగా ప్రచార సభలు, సమావేశాలతో దూసుకపోతున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల ప్రచార వాహనాలు గ్రామాల్లో పర్యటిస్తూ ఓటర్లును ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ స్వతంత్రులుగా, ఇతర చిన్న పార్టీల నుంచి ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో కొంతమంది ప్రచారంలో ఎక్కడా కానరావటం లేదు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోరు నెలకొంది. బరిలో 61 మంది ► పెద్దపల్లి అసెంబ్లీ బరిలో 17మంది అభ్యర్థులు పోటీపడుతుండగా, అందులో ప్రధాన పార్టీలతోపాటు న్యూ ఇండియా, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, భారతీయ స్వదేశీ కాంగ్రెస్ చిన్నపార్టీలతోపాటు, 9మంది స్వతంత్ర అభ్యర్ధులు ఉన్నారు. ► రామగుండంలో 23మంది బరిలో ఉండగా వీరిలో తెలంగాణ లేబర్, విద్యార్థుల రాజకీయ, జనశంఖారావం, పిరమిడ్, ధర్మసమాజ్, న్యూండియా, భారతీయ స్వదేశ్ కాంగ్రెస్, ఆలిండియా డెమొక్రటిక్ రిఫారమ్స్ పార్టీలతో పాటు 11మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీపడుతున్నారు. ► మంథని అసెంబ్లీ బరిలో 21మంది పోటీలో ఉండగా చిన్నపార్టీలను కలుపుకుని 17మంది స్వంత్రులు పోటీచేస్తున్నారు. సైలెంట్ చేశారా! ఈవీఎంలో నోటాతో కలుపుకుని 16మంది అభ్యర్థులు దాటితే మరో ఈవీఎం అమర్చాల్సి ఉంటుంది. మూడు నియోజకవర్గాల్లో రెండు ఈవీఎంలూ వాడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో స్వంతంత్రులకు పొలయ్యే ఓట్లు ఎవరికి నష్టం చేకూరుస్తాయోనన్న భయం అభ్యర్థులకు ఆందోళన కలిగిస్తోంది. స్వతంత్ర అభ్యర్థులు గెలవకపోయినా, గెలుపోటములను ప్రభావితం చేసిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి. దీంతో ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓట్లలో చీలిక రాకుండా స్వతంత్రులు, ఇతర చిన్నపార్టీల అభ్యర్థులను ప్రచారం చేయకుండా తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. మరో పక్క.. ఎన్నికల ఖర్చుకు భయపడి ఆయా పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ప్రచారంలో దూకుడు పెంచడం లేదని తెలుస్తోంది. గుర్తులతో ఇబ్బందే.. ► స్వతంత్రులు ఎన్నికల ప్రచారం చేయకున్నా వారికి పోలైన ఓట్లు ఏ పార్టీ అభ్యర్థికి నష్టం చేకూరుస్తాయనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ► ఎందుకుంటే ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు, ప్రధాన పార్టీల అభ్యర్థులకు కేటాయించిన గుర్తులను పోలిఉన్న సందర్భంలో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుంది. ► దీంతో ఈసారి ఎన్నికల్లో వీరి ప్రభావం ఎంత అనేది ఫలితాలు వస్తే కానీ తెలియని పరిస్థితి నెలకొంది. ఇవి చదవండి: ఏ గుర్తు.. ఎంతిస్తరు..? కండువా వేసుకుని సిద్ధం.. -
బ్యాలెట్ పేపర్ నుంచి.. ఎం–2 ఈవీఎంల దాకా..!
సాక్షి, కామారెడ్డి: దొంగ ఓట్లను నియంత్రించడానికి నాటి కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ టీఎన్ శేషణ్ విశేషంగా కృషి చేశారు. ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణల్లో బ్యాలెట్ పేపర్‌కు బదులు ఈవీఎంల వినియోగం ప్రధానమైనది. ఎన్నికల సమయంలో పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు, పార్టీ గుర్తులతో ముద్రించిన బ్యాలెట్ పేపర్‌ను మొదట్లో ఉపయోగించే వారు. ఓటరు తాను ఓటు వేయాలనుకునే అభ్యర్థి పార్టీ గుర్తుపై స్టాంప్ వేసి బ్యాలెట్ పేపర్‌ను బాక్సులో వేసే వారు. అనంతరం ఎన్నికల అధికారులు బ్యాలెట్ పేపర్లను లెక్కించి విజేతలను ప్రకటించేవారు. దీంతో ఓట్ల లెక్కింపు కష్టంగా మారేది. ఈ సమస్యను అధిగమించేందుకు టీఎన్ శేషణ్ హయాంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎ)తో ఓటు వేసే పద్ధతిని ప్రవేశపెట్టారు. మొదట్లో ఎం–1 టైప్ ఈవీఎంలు రాగా, 2006 తర్వాత ఎం–2 ఈవీఎంలు వచ్చాయి. 2013 తర్వాత ఎం–3 ఈవీఎంలు వాడకంలోకి వచ్చాయి. ఇప్పుడు ఓటరు తాను వేసిన గుర్తుకే ఓటు పడిందా లేదా అన్నది తెలుసుకోడానికి ఓటర్ వెరిఫికేబుల్ ప్యాట్‌ను ప్రవేశపెట్టారు. 16 మందికి మించితే బ్యాలెట్.. ఈవీఎంలను ఉపయోగించే మొదటి రోజుల్లో 16 మంది అభ్యర్థులకు మించితే బ్యాలెట్ పేపర్‌ను వాడేవారు. నూతనంగా ఈవీఎంలు ప్రవేశపెట్టినప్పుడు ఎం–1 టైప్ ఈవీఎంలు కావడంతో ఓ కంట్రోల్ యూనిట్ ద్వారా ఒక బ్యాలెట్ యూనిట్‌కే కనెక్షన్ ఇవ్వగలిగేవారు. ఒక ఈవీఎంలో 16 మంది అభ్యర్థుల పేర్లు, గుర్తులే వచ్చేవి. అంతకన్నా ఎక్కువ అభ్యర్థులు బరిలో ఉంటే బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించేవారు. 2006 తర్వాత ఎం–2 టైప్ ఈవీఎంలు వచ్చాయి. వీటికి ఒక కంట్రోల్ యూనిట్‌కు నాలుగు ఈవీఎంలు కనెక్షన్ ఇవ్వవచ్చు. దీంతో ఒక నియోజకవర్గంలో 64 మంది పోటీ చేసినా ఈవీఎంల ద్వారా ఓటింగ్ నిర్వహణకు వెసులుబాటు కలిగింది. 2013 తర్వాత ఎం–3 ఈవీఎంలు అందుబాటులోకి రావడంతో ఒక కంట్రోల్ యూనిట్‌కు 24 బ్యాలెట్ యూనిట్ల కనెక్షన్లు ఇవ్వొచ్చు. దీంతో 384 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నా ఈవీఎంలతోనే ఓటింగ్ సాధ్యమవడానికి అవకాశం కలిగింది. ఈవీఎంల సామర్థ్యం, పనితీరును ఎంత మెరుగుపరిచినా తాను వేసిన గుర్తుకు ఓటు పడిందో లేదోనన్న అనుమానం ఇటు ఓటర్లలో అటు రాజకీయ పార్టీల నాయకుల్లోనూ ఉండేది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తేవి. అలాంటి ఆరోపణలు, అనుమానాలకు ఆస్కారం లేకుండా నూతనంగా వీవా ప్యాట్లను ప్రవేశపెట్టారు. దీంతో ఓటరు తాను వేసిన గుర్తుకు ఓటు పడిందా లేదా అన్నది వీవీ ప్యాట్‌లో చూసి నిర్ధారించుకొనే అవకాశం కలిగింది. ఓటరు ఓటు వేసిన వెంటనే వీవీ ప్యాట్‌లో ఏడు సెకండ్ల పాటు అతను ఓటు వేసిన పార్టీ గుర్తు కనిపిస్తుంది. ఇవి కూడా చదవండి: 'ఈవీఎం' విశేషాల గురించి.. మీకు పూర్తిగా తెలుసా..!? -
చేరి.. చేజారి..! ‘హస్తం’లో తారుమారు రాజకీయం..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు వ్యాప్తంగా ‘హస్తంశ్రీలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. తారుమారు రాజకీయాల పరంపర ప్రధాన పార్టీలన్నింటిలోనూ కొనసాగుతున్నప్పటికీ.. కాంగ్రెస్‌లో చేరినవారు పెద్దమొత్తంలో జారుకుంటుండడం ఆ పార్టీ పెద్దలతో పాటు కేడర్‌ను అయోమయానికి గురిచేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కాంగ్రెస్ ఉనికే ప్రశ్నార్థకంగా మారిన క్రమంలో పక్క రాష్ట్రం కర్ణాటకలో ఆ పార్టీ అధికారంలోకి రావడం.. సుమారు నెల క్రితం పెద్ద ఎత్తున ముఖ్య నేతల చేరికలు జరగడం ఊపిరి పోశాయి. ఆ తర్వాత ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పట్టణ, మండల, గ్రామస్థాయిలో నాయకులు, కార్యకర్తలు వివిధ పార్టీల నుంచి అధిక సంఖ్యలో ‘చేయి’ అందుకోగా.. అభ్యర్థులు రేసులోకి వచ్చారు. కానీ ఆ చేరికల ముఖచిత్రం ఉదయం, సాయంత్రానికి లేదంటే నాలుగైదు రోజుల్లోనే మారుతుండడం ఆ పార్టీలో కల్లోలం రేపుతోంది. ప్రధానంగా గద్వాలకు సంబంధించి కాంగ్రెస్‌లో చేరినట్లే చేరి చేజారుతుండడంతో పాటు ఇతర నియోజకవర్గాల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఉండడడం ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ అభ్యర్థులు ఏ ఒక్క చిన్న అవకాశాన్ని సైతం వదులుకోకుండా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్‌లోని అసంతృప్తి నాయకులు బీఆర్ఎస్ చెంతకు చేరుతుండడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్‌ను లుకలుకలు పీడిస్తున్నాయి. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీలో చేరిన క్రమంలోనే చింతలపల్లి జగదీశ్వర్‌రావు, ఆయన అనుచరులు వ్యతిరేకగళం వినిపించారు. జూపల్లికి అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత జగదీశ్వర్‌రావు పార్టీని వీడి ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగి బుజ్జగించగా మళ్లీ హస్తం గూటికి చేరారు. కానీ.. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన జగదీశ్వర్‌రావు ఆయన తరఫున నామమాత్రంగానే ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు ఒకటి, రెండు రోజులు మాత్రమే నియోజకవర్గంలో ఉన్నారు. ఈ క్రమంలో చింతలపల్లి అనుచరులు పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి సమక్షంలో కారెక్కడం హస్తానికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. మరోవైపు కాంగ్రెస్ ఊపులో వివిధ పార్టీల నుంచి చేయి అందుకున్న వారు సైతం తిరిగి సొంత గూటికో, ఇతర పార్టీ లోకి చేరుతున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోందోననే ఆందోళన పార్టీ శ్రేణల్లో నెలకొంది. ముఖ్యనాయకుల జంప్‌తో తొలి షాక్.. గద్వాలలో జెడ్పీ చైర్పర్సన్ సరిత గులాబీని వీడి చేయి అందుకున్న తర్వాత వివిధ మండలాలు, గ్రామాల్లో అధికార పార్టీ బీఆర్ఎస్తో పాటు బీజేపీ నుంచి పెద్ద ఎత్తున చేరికలకు తెరలేపారు. డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్‌రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కుర్వ విజయ్‌కుమార్ తదితర నేతలు సరితతో పాటు ఆమె భర్త తిరుపతయ్య రాకను వ్యతిరేకించారు. పార్టీ అధిష్టానం కూడా ఆమె వైపే మొగ్గు చూపి.. అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ పటేల్ ప్రభాకర్‌రెడ్డి, కుర్వ విజయ్ తదితరులు బీఆర్ఎస్లో చేరగా.. హస్తానికి షాక్ తగిలినట్లయింది. మరోవైపు ఇటీవల పార్టీలో చేరిన వారు సైతం అధిక సంఖ్యలో ఘర్‌వాపసీ పడుతుండడం పార్టీకి మైనస్‌గా మారుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్య నేతలు వారి బంధువులు, తమ వర్గానికి మాత్రమే పెద్దపీట వేయడం, సీనియర్లు, పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో వారు చేజారిపోతున్నట్లు సమాచారం. ఇది గెలుపోటములపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. నియోజకవర్గానికి చెందిన పలువురు సీనియర్ నేతలు ఈ అంశాన్ని పార్టీ పరిశీలకులతో పాటు కర్ణాటకలో ఉన్న ముఖ్యనేతల దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు సమాచారం. ఇవి చదవండి: బ్యాలెట్ పేపర్ నుంచి.. ఎం–2 ఈవీఎంల దాకా..! -
ఏరుదాటాక.. తెప్ప తగలేస్తారు! : మంత్రి హరీశ్‌రావు
సాక్షి, నిజామాబాద్: ఆరు హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ కుయుక్తులు పన్నుతోందని, ఏరు దాటాక తెప్ప తగలేస్తుందని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హరీశ్‌రావు శనివారం బోధన్ నియోజకవర్గంలోని సాటాపూర్, నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండలం మాణిక్‌భండార్, నందిపేటల్లో నిర్వహించిన సభల్లో మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల్లో రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ ఆరుగ్యారంటీలు ప్రచారం చేశారని, తీరా గెలిచాక పథకాలను మరిచారన్నారు. అక్కడి ప్రజలు ఓటు వేసినందుకు లబోదిబో మంటున్నారన్నారు. ఈసారీ బీజేపీ డకౌట్ అవుతుందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్రం, బీఆర్ఎస్ పార్టీ సెక్యులర్ గానే ఉంటుందన్నారు. నీళ్ల మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి, బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి నియోజకవర్గ ప్రజలు, రైతులకు కనీసం తాగు నీరు, సాగు నీరు అందించలేదని విమర్శించా రు. మాజీ మంత్రి చేయలేని పనులను గులాబీ జండా చేసిందన్నారు. నిజామాబాద్ నగరంలో గతానికి ఇప్పటీకి ఎంత మార్పు వచ్చిందో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి నిధులు తెచ్చి కార్పొరేట్ ఆస్పత్రిగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. గణేష్ గుప్తను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రత్యర్థులు చేసుకుంటున్న సర్వేలన్నీ ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి విజయాన్ని చూపిస్తున్నాయని మంత్రి తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. ఆర్మూర్‌లో జీవన్‌రెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి మాట్లాడుతూ తనను మూడోసారి గెలిపిస్తే మీలో ఒకడిగా ఉండి ఆదుకుంటానని ప్రజల నుద్దేశించి అన్నారు. నిజామాబాద్ అర్బన్ ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు మీతో ఎమ్మెల్యే బిగాల గణేశ్ ఉన్నాడని హరీశ్‌రావు అన్నారు. కరోనా సమయంలో గల్లిగల్లీ తిరిగి నగర ప్రజలకు ధైర్యం చెప్పి ఆదుకున్నారని అన్నారు. ఇవి చదవండి: 'ఈవీఎం' విశేషాల గురించి.. మీకు పూర్తిగా తెలుసా..!? -
మునుగోడు ఓట్ల వివరాలు ఇవే.. అలాగే మెజారిటీ ఓట్లు వీరివే..
మునుగోడు నియోజకవర్గం జిల్లా: నల్గొండ లోక్ సభ పరిధి: భువనగిరి రాష్ట్రం: తెలంగాణ మొత్తం ఓటర్ల సంఖ్య: 248,524 పురుషులు: 124,473 మహిళలు: 123,996 ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం ఏడు మండలాలు ఉన్నాయి: నల్గొండ జిల్లా మునుగోడు చందూర్ మర్రిగూడ నాంపల్లి ఘాటుప్పల్ యాదాద్రి భువనగిరి జిల్లా సమస్థాన్ నారాయణపూర్ చౌటుప్పల్ నియోజకవర్గం ముఖచిత్రం సీపీఐ సిట్టింగ్ స్థానమైన మునుగోడులో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్థన్ రెడ్డి ఇక్కడి నుంచి ఐదుసార్లు విజయం సాధించారు. ఇప్పటి వరకు మునుగోడులో పదకొండుసార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ ఐదుసార్లు, సీపీఐ ఐదుసార్లు విజయం సాధించాయి. 1967 వరకు ఈ స్థానం చిన్నకొండూరుగా ఉంది. తెలంగాణ ప్రముఖ పోరాటయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గతంలో ఇక్కడ నుంచి రెండు సార్లు విజయం సాధించారు. మునుగోడులో కాంగ్రెస్ ఐ పార్టీ అభ్యర్దిగా పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాదించారు. 2009లో ఆయన ఎంపిగా గెలిచారు. 2014లో ఓటమి చెందినా, ఆ తర్వాత ఎమ్మెల్సీగా గెలుపొందారు. తిరిగి ఈసారి మునుగోడు నుంచి అసెంబ్లీకి పోటీచేసి విజయం సాదించారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్ది కె. ప్రభాకరరెడ్డిపై 22,552 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి 97239 ఓట్లు రాగా, ప్రభా కరరెడ్డికి 74687 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన జి.మనోహర్‌రెడ్డికి 12700 ఓట్లు వచ్చాయి. రాజగోపాలరెడ్డి సామాజిక పరంగా రెడ్డి వర్గానికి చెందినవారు. 2014లో మునుగోడు నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ధి కె.ప్రబాకరరెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధనరెడ్డి కుమార్తె స్రవంతిని 38055 ఓట్ల తేడాతో ఓడిరచారు. స్రవంతి కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయారు. 2009లో పాల్వాయి గోవర్దనరెడ్డి పోటీచేసి ఓటమి పాలైతే, 2014లో ఆయన కుమార్తె ఓడిపోవలసి వచ్చింది. అయితే పాల్వాయి 2009లో ఓటమి తర్వాత కాంగ్రెస్ ఐ పార్టీ ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చింది. 2014లో కాంగ్రెస్ పార్టీ ,సిపిఐతో పొత్తు పెట్టుకోవడాన్ని ఆయన వ్యతిరేకించారు. సిపిఐ పోటీచేసినా సమీప ప్రత్యర్ధిగా కూడా ఉండలేకపోయింది.సిపిఐ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డికి 20952 ఓట్లు వచ్చాయి. సీనియర్ సిపిఐ నాయకుడు ఉజ్జిని నారాయణరావు మూడు సార్లు గెలుపొందితే, ఆయన కుమారుడు యాదగిరిరావు ఒకసారి గెలుపొందారు. పాల్వాయి గోవర్ధనరెడ్డి మునుగోడులో ఐదుసార్లు గెలిచారు. ఒకసారి ఎమ్మెల్సీ అయ్యారు. ఒకసారి రాజ్యసభ సభ్యుడయ్యారు. ఈయన గతంలోమంత్రి పదవి నిర్వహించారు. మునుగోడులో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఆరుసార్లు, సిపిఐ ఐదుసార్లు గెలిచాయి. టిఆర్ఎస్ ఒకసారి గెలిచింది. స్వయంగా టిడిపి ఇక్కడ నుంచి గెలవలేదు.సిపిఐ మిత్ర పక్షంగా ఉన్నప్పుడు బలపరిచింది. మునుగోడులో తొమ్మిది సార్లు రెడ్లు, రెండుసార్లు బిసి(పద్మశాలి)నాలుగుసార్లు వెలమ, ఒకసారి ఇతరులు గెలుపొందారు. -
నల్గొండ నియోజకవర్గంలో అభ్యర్థుల పూర్తి వివరాలు ఇవే..
నల్గొండ నియోజకవర్గం జిల్లా: నల్గొండ లోక్ సభ పరిధి: నల్గొండ రాష్ట్రం: తెలంగాణ మొత్తం ఓటర్ల సంఖ్య: 2,37,951 పురుషులు: 1,16,487 మహిళలు: 1,21,326 ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం నాలుగు మండలాలు ఉన్నాయి: నల్గొండ తిప్పర్తి కనగల్ మాడుగులపల్లి నియోజకవర్గం ముఖచిత్రం కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వరుసగా నాలుగోసారి నల్గొండ నుంచి విజయం సాధించారు. గతంలో ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన సమీప అభ్యర్థి భూపాల్ రెడ్డిపై విజయం సాధించారు. భూపాల్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి బరిలో నిలవడంతో రాష్ట్ర స్థాయిలో ఈ నియోజకవర్గంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వెంకట్‌రెడ్డి గెలుపుపై ధీమాతో ఉండగా.. నల్గొండలో జెండా పాతాలని గులాబీ దళం విశ్వప్రయత్నాలు చేస్తోంది. మొత్తం 15 సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ ఏడుసార్లు, టీడీపీ మూడుసార్లు విజయం సాధించాయి. 2018లో నల్గొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన కంచర్ల భూపాల్ రెడ్డి సంచలన విజయం సాధించారు. నల్గొండలో స్ట్రాంగ్ మాన్‌గా పేరొందిన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై ఆయన 23,698 ఓట్ల ఆదిక్యతతో విజయం సాధించారు. 1999 నుంచి ఇక్కడ నుంచి వరసగా గెలుస్తున్న కోమటిరెడ్డి 2018లో ఓటమి చెందారు. భూపాల్ రెడ్డి 2014లో ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఓడిపోయి, 2018లో టిఆర్ఎస్లో చేరి గెలుపొందారు. భూపాల్ రెడ్డికి 98,792 ఓట్లు రాగా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి 75,094 ఓట్లు వచ్చాయి. ఇక్కడ మూడోస్థానం స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేసిన వెంకటేశ్వర్లుకు వచ్చింది. ఆయనకు సుమారు మూడువేల ఓట్లు వచ్చాయి. భూపాల్ రెడ్డి సామాజికంగా రెడ్డి వర్గం నేత. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2019లో లోక్ సభ ఎన్నికలలో భువనగిరి నుంచి పోటీ చేసి గెలుపొందడం విశేషం. నల్గొండ పట్టణంలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాలుగు సార్లు గెలిచారు. 2014లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాసనసభకు ఎన్నికైనా ఆయన సోదరుడు రాజగోపాలరెడ్డి భువనగిరి నుంచి లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయారు. 2018లో వెంకటరెడ్డి అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయి, తదుపరి 2019లో ఎమ్.పిగా గెలిస్తే, రాజగోపాలరెడ్డి మునుగోడు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాజగోపాలరెడ్డి ఒకసారి ఎమ్మెల్సీగా, ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా కూడా గెలిచారు. ఇద్దరు సీనియర్లు జానారెడ్డి, దామోదరరెడ్డిలను కాదని వై.ఎస్. రాజశేఖరరెడ్డి 2009లో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం విశేషం. వైఎస్ మరణం తర్వాత రోశయ్య క్యాబినెట్లో ఉన్నారు. అనంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో కొనసాగిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేశారు. నల్గొండలో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఏడు సార్లు, టిడిపి మూడుసార్లు, పిడిఎఫ్ రెండుసార్లు, బీఆర్ఎస్ ఒకసారి, అవిభక్త సిపిఐ ఒకసారి సిపిఎం ఒకసారి గెలుపొందగా, ఇండిపెండెంటు ఒకరు గెలిచారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు 1985లో ఉమ్మడి రాష్ట్రంలో మూడు ప్రాంతాల నుంచి పోటీ చేశారు. హిందుపూర్, గుడివాడలతో పాటు, నల్గొండ నుంచి పోటీచేసి విజయం సాధించారు. మూడుచోట్ల ఒకేసారి గెలవడం ఒక రికార్డు. కాంగ్రెస్ నాయకుడు చకిలం శ్రీనివాస్‌రావు నల్గొండలో రెండుసార్లు, మిర్యాలగూడలో ఒకసారి గెలిచారు. ఒకసారి ఆయన లోక్‌సభకు కూడా ఎన్నికయ్యారు. 1962లో ఇక్కడ గెలిచిన సిపిఐ నేత ధర్మభిక్షం 1952లో సూర్యాపేటలో, 1957లో నకిరేకల్‌లో గెలిచారు. ఈయన నల్గొండ నుంచి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఒకసారి ఇక్కడ గెలిచిన రఘుమారెడ్డి ఒకసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కాగా 2004లో టిడిపి పక్షాన ఇక్కడ శాసనసభకు పోటీచేసి ఓడిపోయిన గుత్తా సుఖేందర్‌రెడ్డి, 1999లో టిడిపి పక్షాన, 2009, 2014లలో కాంగ్రెస్ ఐ పక్షాన లోక్‌సభకు ఎన్నికయ్యారు. తదుపరి కాలంలో ఆయన బీఆర్ఎస్లో చేరిపోయి ఎమ్మెల్సీ అయి కౌన్సిల్ చైర్మన్ అయ్యారు. రైతు సమన్వయ సమితి అద్యక్షుడుగా కూడా వ్యవహరించారు. నల్గొండలో 12 సార్లు రెడ్లు, రెండుసార్లు బ్రాహ్మణ, ఒకసారి గౌడ్, ఒకసారి ఎస్.సి, ఒకసారి కమ్మ సామాజికవర్గాలు ఎన్నికయ్యాయి. -
కాంగ్రెస్‌కు ఓటేస్తే 3 గంటల కరంటే..!
సంగారెడ్డి(గజ్వేల్): కాంగ్రెస్‌కు ఓటేస్తే 3 గంటల కరంటే ఉంటుందని వైద్యారోగ్య శాఖా మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. కుకునూరుపల్లి మండల కేంద్రంలో శుక్రవారం ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన రోడ్ షో సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి మూడు గంటల కరెంటు సరిపోతుందంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎరువుల కోసం దుకాణాల వద్ద చెప్పులను క్యూలో పెట్టిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. బిందెడు తాగునీళ్ల కోసం దూరం వెళ్లి తెచ్చుకున్నప్పుడు భుజాలు కాయలు కాసిన విషయం వాస్తవం కాదా అని అన్నారు. తెలంగాణలో మహా అయితే ఒకటి రెండు చోట్ల గెలిచే బీజేపీ నేత గజ్వేల్‌లో ఓట్లు దండుకునేందుకు బీసీని సీఎం చేస్తామంటూ చెబుతున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ను తిప్పలు పెట్టేందుకు ఢిల్లీ నుంచి డబ్బుల సంచులతో బీజేపీ నాయకులు బయలు దేరారన్నారు. అవసరం కోసం దగ్గరికి వచ్చే కాంగ్రెస్, బీజేపీలు కావాలో.. ప్రజల ఆపద, సంపదల్లో పాలుపంచుకుంటున్న సీఎం కేసీఆర్ కావాలో ఆలోచించాలన్నారు. కరోనా కష్ట కాలంలో ఎక్కడ పోయారో ఓట్లు అడుగడానికి వచ్చే ప్రతిపక్ష పార్టీలను అడుగాలన్నారు. రూ.14 వేల కోట్లతో రైతు రుణాలు మాఫీ చేశామని, ఎన్నికల కోడ్ నేఫథ్యంలో పెండింగ్‌లో ఉన్న రూ.4వేల కోట్ల రుణమాఫీ ప్రక్రియను ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రాగానే పూర్తి చేసి తిరిగి రుణాలు అందేలా చూస్తామన్నారు. రాష్ట్రంలో 13లక్షల2వేల 53 మంది కల్యాణ లక్ష్మి పథకంలో లబ్ధిపొందారన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లు లేని పేదలందరికీ ఇంటి స్థలంతో పాటు డబుల్ బెడ్ రూంలను కట్టించి ఇచ్చే బాధ్యత తనదేనన్నారు. తెలంగాణ సంపదను పెంచి పథకాల రూపాల్లో పేదలకు పంచుతామన్నారు. 24 గంటల పాటు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామన్నారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవిందర్, నాయకులు పొల్కంపల్లి నరేందర్, కోల సద్గుణ, పిస్క అమరేందర్, మల్లం ఐలయ్య, లక్ష్మన్‌రాజు, భూములుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇవి కూడా చదవండి: ఈటలకు రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆరే.. : మంత్రి హరీశ్‌రావు -
మైనంపల్లి రోహిత్ మాటలకు అర్థాలే వేరులే..!
మెదక్: కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్‌రావు మాటలకు అర్థాలే వేరులే.. అనే విధంగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. తాను గెలిస్తే రోజుకు 48 గంటల కరెంటు ఇస్తాననడంతో ఇదేం చోద్యం రోజుకు 24 గంటలే కదా ఉన్నది.. అని ప్రజలు నవ్వుకుంటున్నారు. అలాగే, మెదక్ నియోజకవర్గంపై కనీస అవగాహన కూడా లేకుండా ఆయన మాట్లాడుతుండడంతో సొంత పార్టీ నేతలే తలలు పట్టుకుంటున్నారు. గడిచిన పదేళ్లలో జరిగిన అభివృద్ధి, తక్షణం నియోజకవర్గ ప్రజలకు ఏమి అవసరమో తెలుసుకొని ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ, రోహిత్‌రావు ఇష్టానుసారంగా మాట్లాడడం ఏమిటని పలువురు వాపోతున్నారు. ప్రచారంలోనూ ప్రజలపై మండిపడుతూ నేను చెప్పిందే వినాలని అనే విధంగా అసహనం వ్యక్తం చేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఎమ్మెల్యేగా ఎన్నికై తే ఇంకెలా మాట్లాడుతారో అని ప్రజలు విమర్శిస్తున్నారు. జింకలు తరలించారంటూ గగ్గోలు హవేళిఘణాపూర్ మండలం పోచారం అభయారణ్యంలో 120 ఎకరాల్లో జింకల ప్రత్యుత్పత్తి కేంద్రం విస్తరించి ఉంది. ఇందులో జింకల సంఖ్య ఒక పరిమితి వరకు మాత్రమే ఉంచుతారు. ఆ పరిమితి దాటితే వాటిని ఇక్కడి నుంచి వివిధ అటవీ ప్రాంతాలకు తరలిస్తారు. ఒకవేళ తరలించకుంటే వాటి సంఖ్య పెరిగి ఆహారం దొరక్క చనిపోతాయి. ఇటీవల ఈ ప్రత్యుత్పత్తి కేంద్రం నుంచి కొన్ని సిద్దిపేట జిల్లాలోని ఆక్సిజన్ పార్కుకు తరలించినట్లు తెల్సింది. దీనిపై రోహిత్‌రావు మాట్లాడుతూ.. మంత్రి హరీశ్‌రావు జింకలను సైతం వదలకుండా ఇక్కడి నుంచి తరలించాడంటూ వ్యాఖ్యలు చేశాడు. పార్కులపై కనీస అవగాహన లేకుండా మాట్లాడడం ఏంటని, ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే నియోజకవర్గంపై ఎలా పట్టు సాధిస్తాడని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు. -
ఈటలకు రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆరే.. : మంత్రి హరీశ్‌రావు
మెదక్/గజ్వేల్: బీజేపీ నేత ఈటలకు రాజకీయ భిక్ష పెట్టింది సీఎం కేసీఆరేనని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎన్నికల కోసం ఆపద మొక్కులతో ప్రజల్లోకి వస్తున్న నేతలకు బుద్ధి చెప్పాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం గజ్వేల్‌లోని ప్రజ్ఞా గార్డెన్స్‌లో నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ భిక్ష పెట్టిన కేసీఆర్‌పై ఈటల పోటీ చేయడం చూస్తుంటే ఆయన నియత్తు లేదనేది అర్థం అవుతోందన్నారు. హుజురాబాద్, గజ్వేల్‌కు పొంతన లేదని, రాష్ట్రంలో బీజేపీకి చోటు లేదన్నారు. ఝూటా మాటలు చెబుతున్న కాంగ్రెస్, బీజేపీలను తరిమికొట్టాలన్నారు. రాష్ట్రం ప్రభుత్వం పింఛన్ పెంపు నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 5.35లక్షల మంది దివ్యాంగులకు మేలు చేకూరిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (టీఎస్ఎఫ్డీసీ) చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ భూంరెడ్డి, ఎలక్షన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీఎం మాటలను ప్రజలు నమ్మరు! : ఆవుల రాజిరెడ్డి
సాక్షి, మెదక్: సీఎం కేసీఆర్ మోసపూరిత హామీలను నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు నమ్మరని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2014లో నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరందిస్తానని, 2018లో నర్సాపూర్‌ను దత్తత తీసుకుని బంగారు తునక చేస్తానని సీఎం హామీ ఇచ్చి నేటికీ నెరవేర్చలేదని, ప్రస్తుతం ఇచ్చేవాటిని ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన చెప్పారు. ధరణి.. పేద రైతుల పాలిట శాపంగా మారిందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేసి భూమాత పోర్టల్ ద్వారా న్యాయం చేస్తామని చెప్పారు. ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ఇచ్చిన హామీలన్నీ గతంలో మాదిరిగానే తుంగలో తొక్కుతారని ఎద్దేవా చేశారు. దేవులపల్లి, వెల్మకన్నె, ముండ్రాయి, శివ్వంపేట తదితర గ్రామాలకు చెందిన రైతుల భూములను ధరణిలో పార్ట్ బీలో పెట్టి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారని, అనంతరం వాటి రికార్డులు సరి చేయించుకుని అధిక ధరలకు అమ్ముతూ కోటీశ్వరులయ్యారని విచారం వ్యక్తం చేశారు. కాగా బీఆర్ఎస్ అభ్యర్థి సునీతారెడ్డి స్వగ్రామమైన గోమారంను మండల కేంద్రం చేయాలని కోరుతున్నా పట్టించుకోకపోవడం విచారకరమని అన్నారు. సమావేశంలో చిలిపిచెడ్ మాజీ జెడ్పీటీసీ చిలుముల శేషాసాయిరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఖాలేక్, నాయకులు ఆంజనేయులుగౌడ్, రిజ్వాన్, మల్లేష్, శ్రీనివాస్‌గుప్తా, రవీందర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, రాజాగౌడ్, మల్లేష్‌గౌడ్, అశోక్, రామాగౌడ్, ఉదయ్‌కుమార్ పాల్గొన్నారు. నర్సాపూర్‌లో ప్రచారం! ఆవుల రాజిరెడ్డికి మద్దతుగా నర్సాపూర్‌లోని రెండో వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో చిన్న అంజిగౌడ్, సుధీర్‌గౌడ్, రషీద్ పాల్గొన్నారు. అప్పుల్లో తెలంగాణ.. నర్సాపూర్ మండలంలోని తుజాల్పూర్, తిరుమలాపూర్, బ్రాహ్మణపల్లి ఆయా పంచాయతీల పరిధిలోని గిరిజన తండాల్లో ఆవుల రాజిరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ మిగులు బడ్జెట్‌గా ఉన్న తెలంగాణను బీఆర్ఎస్ నాయకులు అప్పుల పాలుచేశారని ఆరోపించారు. కాంగ్రెస్ తీసుకువచ్చిన 6 గ్యారంటీ పథకాలను గుర్తించి చేతి గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రచారంలో ఆంజనేయులు గౌడ్, శ్రీనివాస్ గుప్తా, రవీందర్ రెడ్డి, మల్లేష్, అశోక్, ఆకుల నర్సింలు, సుధీర్ గౌడ్, నందు, అశోక్ గౌడ్, ఉదయ్ పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని బ్రాహ్మణపల్లి పంచాయతీ పరిధిలోని విఠల్ తండా సమీపంలో ధాన్యం నూర్పిడి పడుతూ ఓటు వేయాలని రాజిరెడ్డి కోరారు. ఆరు గ్యారంటీలు అమలు.. శివ్వంపేట: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజల సంక్షేమం కోసం 6 గ్యారంటీలు అమలు చేయనున్నట్లు కాంగ్రెస్ అభ్యర్థి రాజిరెడ్డి భార్య శైలజారెడ్డి, సుహాసినిరెడ్డి, కమల, సుదర్శన్‌గౌడ్, నవీన్గుప్తాలు అన్నారు. శుక్రవారం దంతన్‌పల్లి, రత్నపూర్ తండాతో పాటు పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సంఘటితంగా కృషిచేయాలి! వెల్దుర్తి: నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి గెలుపుకోసం కార్యకర్తలు సంఘటితంగా కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా నాయకులు నరేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఉప్పులింగాపూర్ గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మహేశ్‌రెడ్డి, సంజీవరెడ్డి, కిషన్, సత్యనారాయణ, మహేందర్‌గౌడ్ పాల్గొన్నారు. కాంగ్రెస్‌లో చేరిక.. ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సుభాష్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకట్‌రెడ్డి, సర్వర్మీర్జా కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు నారాయణ రెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, భూమయ్య, నరేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. హత్నూర: నర్సాపూర్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం రేండ్లగూడ గ్రామా నికి చెందిన పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆవుల కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో దౌల్తాబాద్ సర్పంచ్ కొన్యాల వెంకటేశం, కాంగ్రెస్ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి హకీం పాల్గొన్నారు. -
వారంతా విద్యాధికులే..! ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి..
సాక్షి, ఆదిలాబాద్/మంచిర్యాల: వారంతా విద్యాధికులే.. ఉన్నత లక్ష్యంతో డిగ్రీ, పీజీ, ఎల్ఎల్బీ పూర్తి చేసినవారే. వివిధ వృత్తులు, వ్యాపారాలు చేస్తూనే ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారు. ఆయా పార్టీలో చేరి ప్రస్తుతం అసెంబ్లీ బరిలో నిలిచారు. పార్టీ అభ్యర్థులుగా, స్వతంత్రులుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో.. మంచిర్యాల నియోజకవర్గంలో పోటీ చేస్తున్న వివిధ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు 17 మంది బరిలో నిలువగా ఇందులో సగానికి పైగా ఉన్నత విద్యను అభ్యసించినవారే. ప్రధాన పార్టీల అభ్యర్థులు డిగ్రీ, ఆపైన చదివిన వారుండగా, ఉన్నత చదువు చదివి, మంచి ఉద్యోగాలు, వృత్తుల్లో ఉన్నవారు ప్రజాసేవ చేసేందుకు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 25 నుంచి 71 ఏళ్లవారున్నారు. వయస్సు, చదువుతో నిమిత్తం లేకుండా రాజకీయాల్లో రాణిస్తున్న వారెందరో ఉండగా, మంచిర్యాల నియోజకవర్గంలో మాత్రం ఉన్నత చదువులతో పాటు, మంచి వృత్తిలో ఉన్నవారు కూడా ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి, ప్రజాసేవ చేసేందుకు సిద్ధమవుతున్నారు. 51 ఏళ్లున్న బీజేపీ అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి అమెరికా యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి పలు కంపెనీలను నెలకొల్పారు. ప్రస్తుతం ప్రజాసేవ చేసేందుకు ఎన్నికల బరిలో నిలిచారు. 63 ఏళ్లున్న కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు బీఎస్సీ చదివి వ్యాపారం చేస్తున్నారు. 71 ఏళ్లున్న బీఆర్ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావు బీఏ చదివారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజాసేవ చేస్తున్నారు. 41 ఏళ్లున్న బీఎస్పీ అభ్యర్థి తోట శ్రీనివాస్ బీఎస్సీ చదివి ఆర్ఎంపీగా, నస్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. 48 ఏళ్లున్న బహుజన రిపబ్లికన్ సోషలిస్ట్ పార్టీ అభ్యర్థి చెరుకూరి శాంతశ్రీ ఎమ్మెస్సీ ఎల్ఎల్బీ చదివి సోషల్ వర్క్ చేస్తున్నారు. 39 ఏళ్లున్న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి దొమ్మటి రవికుమార్ ఎమ్మెస్సీ చదివి వ్యవసాయం చేస్తూ బరిలో నిలిచారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో.. బెల్లంపల్లి బరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు నలుగురు తలపడుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థులుగా దుర్గం చిన్నయ్య, గడ్డం వినోద్, అమురాజుల శ్రీదేవి, జాడి నర్సయ్య పోటీలో ఉన్నారు. చిన్నయ్య, గడ్డం వినోద్, శ్రీదేవి ఇదివరకే ఎమ్మెల్యేలుగా గెలిచి చట్టసభలో అడుగు పెట్టారు. 52 ఏళ్లున్న బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్యది వ్యవసాయ కుటుంబం. ఐటీఐ చదివి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. భార్య, ఇద్దరు కుమార్తెలు కలిగిన చిన్నయ్య మూడోసారి బరిలో ఉన్నారు. 67 ఏళ్లున్న కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ రాజకీయ, పారిశ్రామిక కుటుంబంలో జన్మించారు. డిగ్రీ చదివిన వినోద్‌కు భార్య, కుమార్తె ఉన్నారు. చెన్నూర్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు పోటీ ఓసారి విజయం సాధించారు. ప్రస్తుతం బెల్లంపల్లి నుంచి రెండోసారి పోటీ చేస్తున్నారు. 51 ఏళ్లున్న బీజేపీ అభ్యర్థి అమురాజుల శ్రీదేవి సాధారణ కుటు ంబంలో జన్మించారు. డిగ్రీ వరకు చదివారు. ఆమె భర్త రాజేశ్వర్ సింగరేణిలో అధికారిగా పని చేస్తున్నారు. ఆమెకు నలుగురు సంతానం. మూడుసార్లు ఎన్నికల్లో పోటీ చేసిన శ్రీదేవి పాత ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం నాలుగోసారి బరిలో ఉన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో.. 74 ఏళ్లున్న నిర్మల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఎల్ఎల్బీ పూర్తిచేసి న్యాయవాద వృత్తి స్వీకరించిన తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. 54 ఏళ్లున్న బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిగ్రీ పూర్తి చేశారు. 62 ఏళ్లున్న కాంగ్రెస్ అభ్యర్థి కూచాడి శ్రీహరిరావు ఎల్ఎల్బీ పూర్తి చేసి కొంతకాలం న్యాయవాద వృత్తిలో ఉండి రాజకీయాల్లోకి వచ్చారు. అ లాగే బీఎస్పీ అభ్యర్థి డీ జగన్మోహన్ ఎల్ఎల్బీ, ఆ లిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి స్వదేశ్ పరికిపండ్ల, యుగ తులసి, ధర్మ సమాజ్, అలయన్స్ ఆఫ్ డెమొక్రటిక్ రీఫామ్స్ అభ్యర్థులు, స్వతంత్రులుగా బరిలో నిలిచిన వారంతా డిగ్రీ, పీజీ పూర్తి చేసినవారే. ముధోల్ నియోజకవర్గంలో.. 69 ఏళ్లున్న బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డిగారి విఠల్‌రెడ్డి ఎల్ఎల్బీ పూర్తి చేసి దాదాపు 20 ఏళ్ల పాటు భైంసాలో న్యాయవాదిగా పనిచేశారు. భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా చేశారు. 2009లో పీఆర్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన విఠల్‌రెడ్డి, 2014లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి గెలుపొందారు. తర్వాత బీఆర్ఎస్లో చేరి, 2018లో గెలిచారు. 64 ఏళ్లున్న కాంగ్రెస్ అభ్యర్థి భోస్లే నారాయణరావుపటేల్ ఇంటర్ పూర్తి చేశారు. ముధోల్ ఎమ్మెల్యేగా రెండుసా ర్లు పని చేశారు. 69 ఏళ్లున్న బీజేపీ అభ్యర్థి పవార్ రామారావుపటేల్ డిగ్రీ పూర్తి చేశారు. 2018లో కాంగ్రెస్‌లో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అదే ఏడాది ముధోల్ బరిలో నిలిచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తదనంతరం డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతూ గతేడాది బీజేపీలో చేరారు. సిర్పూర్ నియోజకవర్గంలో.. 68 ఏళ్లున్న సిర్పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప ఇంటర్ వరకు కాగజ్‌నగర్‌లో చదివారు. 48 ఏళ్లున్న కాంగ్రెస్ అభ్యర్థి రావి శ్రీనివాస్ 1 నుంచి 10వ తరగతి వరకు కాగజ్‌నగర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించారు. హైదరాబాద్‌లో ఇంటర్, డిగ్రీ బీఏ చదివారు. 44 ఏళ్లున్న బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్‌బాబు కాగజ్‌నగర్‌లోని ఫాతిమా కాన్వెంట్లో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. 2004లో ఎంబీబీఎస్, 2010లో ఎంఎస్(ఆర్ధోసిడిక్స్) పూర్తి చేశారు. 2011లో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నుంచి డీఎన్బీ పట్టా పొందారు. 56 ఏళ్లున్న బీఎస్పీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ 1 నుంచి 10వ తరగతి వరకు ఆలంపూర్లోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో పూర్తి చేశారు. వెటర్నరీ వైద్య వృత్తి కోర్సును హైదరాబాద్ ఎన్టీరంగ యూనివర్సిటీలో చదివారు. 1995లో ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. హార్వర్డ్ యూనివర్సిటీ ఇన్ పబ్లిక్‌లో ఉన్నత చదువు పూర్తిచేశారు. 2020 ఆగస్ట్ 8న తన ఉద్యోగానికి రాజీనామా చేసి బీఎస్పీలో చేరి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో.. 54 ఏళ్లున్న ఆసిఫాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మి పదో తరగతి చదివారు. 36 ఏళ్లున్న బీజేపీ అభ్యర్థి అజ్మీరా ఆత్మారాంనాయక్ బీఎస్సీ(బీజెడ్సీ), మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్స్ విద్యనభ్యసించారు. 53 ఏళ్లున్న కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యాంనాయక్ బీఈ, బ్యాచ్‌లర్ ఆఫ్ జర్నలిజం (ఉస్మానియా), ఎల్ఎల్బీ శాతవాహన యూనివర్సిటీలో పూర్తిచేశారు. ఎంవీఐగా పనిచేసి ప్రజాసేవ చేసేందుకు కాంగ్రెస్‌లో చేరారు. ఆయన భార్య రేఖానాయక్ ఖానాపూర్ ఎమ్మెల్యే. -
'నా తమ్ముడు జాన్సన్‌నాయక్‌ను' గెలిపిస్తే.. ఖానాపూర్ దత్తత తీసుకుంటా : కేటీఆర్
సాక్షి, ఆదిలాబాద్: ‘నా తమ్ముడు జాన్సన్‌నాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఖానాపూర్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తా’నని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖానాపూర్ నియోజకవర్గం జన్నారం మండల కేంద్రంలోని మనోహర్‌రావు మైదానంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. అంతకుముందు హెలిప్యాడ్ వద్ద ఎమ్మెల్సీ దండె విఠల్, ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి భుక్య జాన్సన్‌నాయక్, జెడ్పీ చైర్మన్ జనార్దన్‌రాథోడ్, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఏపీపీఎస్సీ సభ్యుడు రవీందర్రావు కేటీఆర్‌కు స్వాగతం పలికారు. సభలో కేటీఆర్ మాట్లాడుతూ ఖానాపూర్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ బలపర్చిన జాన్సన్‌నాయక్‌ను గెలిపించాలని కోరారు. అధికారంలోకి వచ్చాక జాన్సన్‌నాయక్ సూచించిన విధంగా జన్నారం ప్రభుత్వ ఆస్పత్రిని 50 పడకల ఆస్పత్రి స్థాయికి పెంచుతామని, డివైడర్లతో సెంట్రల్ లైటింగ్సిస్టం ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. టైగర్‌జోన్ నిబంధనలు సడలించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రత్యర్థులపై విసుర్లు.. ఓ వైపు హామీలు ఇస్తూనే కేటీఆర్ ప్రత్యర్థులపై వి సుర్లు కురిపించారు. రాష్ట్రంలో ఎవ్వరేమి చేసుకు న్నా బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. బీజేపీ అభ్యర్థి రాథోడ్ ఏమో చేస్తానని హా మీలు ఇస్తున్నా వారితో ఏమీ జరగదని విమర్శించారు. ‘కన్నతల్లికి అన్నం పెట్టనోడు, చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా’ అన్నట్లు బీజేపీ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. మతతత్వ పార్టీలను దగ్గర కు రానీయొద్దని, కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే ప్రతీ విషయానికి ఢిల్లీకి వెళాల్సి ఉంటుందని అన్నా రు. టికెట్ల కేటాయింపులో, బీఫాం ఇవ్వడంలో ఢిల్లీ కి వెళ్లినట్లు రేపు హామీలు అమలు చేయాలంటే కూ డా ఢిల్లీ పెద్దలు చెప్పినట్లు వింటారని అన్నారు. సమస్యలు చూడన్న: భుక్యా జాన్సన్ నాయక్ ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి భుక్య జాన్సన్ నాయ క్ మాట్లాడుతూ నియోజకవర్గ సమస్యలను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సదర్మాట్ అభివృద్ధి, కడెం ప్రాజెక్టు పటిష్టత, టైగర్‌జోన్ నిబంధనల సడలింపు, ప్రభుత్వ ఆస్పత్రి స్థాయి పెంపుపై విన్నవించారు. జన్నారం మండలానికి డిగ్రీ కళాశాల, ఐటీఐ కళాశాలకు పక్కా భవనం ఏర్పాటు చేయాలని కోరారు. పోటెత్తిన జనం! సభకు బీఆర్ఎస్ నాయకుల అంచనా కంటే అధికంగా పోటెత్తారు. నియోజకవర్గంలో 40వేల మంది హాజరవుతారని అంచనా వేయగా 60వేలకు పైగా వచ్చారు. సభలో స్థలం లేకపోవడంతో కొందరు బయట నిల్చోవడం కనిపించింది. సభ విజయవంతంతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. పార్టీలో చేరికలు.. మంత్రి కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్టీపీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. ఉట్నూర్ జెడ్పీటీసీ చారులత రాథోడ్, వైఎస్సార్టీపీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు సిరికొండ లక్ష్మీ, బీజేవైఎం మంచిర్యాల జిల్లా నాయకుడు కొండపల్లి మహేశ్, మాజీ జెడ్పీటీసీ గణేశ్ రాథోడ్, ఎస్సీసెల్ కన్వీనర్ వీరేందర్, తోటి సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేశ్, ఎంపీటీసీ శ్రీదేవి, సిరికొండ కాంగ్రెస్ అధ్యక్షుడు గంగాధర్, కవ్వాల్ ఎంపీటీసీ సౌజన్య, మహ్మద్ సాబీర్, ఆయా పార్టీ నాయకులు పార్టీలో చేరగా కేటీఆర్ కండువా కప్పి ఆహ్వానించారు. ఎంపీ వెంకటేశ్ నేత, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి, ఎంపీపీ సరోజన, జెడ్పీటీసీలు చంద్రశేఖర్, జానుబాయి, పార్టీ మండల అధ్యక్షుడు గుర్రం రాజరాంరెడ్డి, పొనకల్ సర్పంచ్ జక్కు భూమేశ్, ఉప సర్పంచ్ శ్రీనివాసగౌడ్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు రియాజొద్దీన్, కోఆప్షన్ సభ్యుడు మున్వర్ అలీఖాన్, పొనకల్ పీఏసీఎస్ చైర్మన్ రమేశ్ వివిధ మండలాల పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇవి చదవండి: వారంతా విద్యాధికులే..! ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి.. -
'భూకబ్జాలు చేశానా? గుట్టలను మాయం చేశానా?' : బండి సంజయ్‌కుమార్
సాక్షి, కరీంనగర్: నేను అవినీతిపరుడినట.. నా దగ్గర డబ్బు సంచులున్నయట.. అందుకే అధ్యక్ష పదవి నుంచి నన్ను తీసేశారట.. నేనేమన్నా ఆయన లెక్క మంత్రినా? అధికారంలో ఉన్నామా? నీ లెక్క భూకబ్జాలు చేశానా? గుట్టలను మాయం చేశానా? భూములు కబ్జా చేసి కమీషన్లు తీసుకున్నానా? నేనెట్లా అవినీతికి పాల్పడుతానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ అన్నారు. తెలంగాణలోనే అత్యంత అవినీతిపరుడైన మంత్రి గంగుల కమలాకర్‌కు తనను విమర్శించే నైతికహక్కు లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 22, 23, 24 డివిజన్లతో పాటు కరీంనగర్ మండలం చామనపల్లిలో ప్రచారం నిర్వహించారు. చామనపల్లికి వచ్చిన సంజయ్‌కు యువకులు, మహిళలు ఘనస్వాగతం పలికారు. పలువురు యువకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ.. నన్ను ఎంపీగా గెలిపిస్తే ప్రజల కోసం కొట్లాడితే సీఎం కేసీఆర్ 74 కేసులు పెట్టించి జైలుకు పంపించాడన్నారు. పదేళ్ల నుంచి తీగలగుట్టపల్లి ఆర్వోబీని పట్టించుకోని మంత్రి గంగుల కమలాకర్, నిధులు తీసుకొచ్చిన తనకు తెలియకుండానే కొబ్బరికాయ కొట్టి తానే తెచ్చినట్లు ప్రచారం చేసుకున్నాడని విమర్శించారు. నేను చామనపల్లికి రాలేదంటున్న కమలాకర్‌కు అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఓదార్చి ప్రభుత్వంతో కొట్లాడిన విషయం గుర్తు లేదా? అని ప్రశ్నించారు. పంటలకు నష్టపరిహారం సీఎం కేసీఆర్ నుంచి రైతులకు ఎందుకు ఇప్పించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రిగా ఉండి కొత్తగా ఒక్క రేషన్‌కార్డు ఇవ్వలేదని, గంగుల ఓడిపోవడం ఖాయమని అన్నారు. తెలంగాణలోనే అత్యంత అవినీతిపరుడైన గంగుల కమలాకర్‌కు సీఎం కేసీఆర్ బీఫామ్ ఇవ్వకుండా సతాయించి, కరీంనగర్‌కే పరిమితం చేసిండని అన్నారు. నేను అవినీతికి పాల్పడితే ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వరని, హెలిక్యాప్టర్ ఇచ్చి రాష్ట్రమంతా ప్రచారం చేయాలని పంపారని తెలిపారు. ఓటమి భయంతో కమలాకర్ కార్యకర్తలకు లక్ష సెల్ఫోన్లు, ఓటుకు రూ.10వేలు ఇచ్చి గెలవాలని చూస్తున్నాడని ఆరోపించారు. ప్రజలు వాస్తవాలను పరిశీలించి మీ కోసం కొట్లాడి జైలుకెళ్లిన తనకు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గండ్ర నళిని, ఎం.సంతోశ్‌కుమార్, ఎం.కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నాగులమల్యాలలో బీజేపీ ఇంటింటి ప్రచారం! కొత్తపల్లి మండలం నాగులమల్యాల గ్రామంలో బీజేపీ నాయకులు శుక్రవారం ఇంటింటి ప్రచారం చేపట్టి ఓట్లు అభ్యర్థించారు. కొత్తపల్లి మండల ఇన్చార్జి జాడి బాల్‌రెడ్డి, శక్తి కేంద్రం ఇన్చార్జి రంజిత్, నాయకులు రమేశ్, అంజన్‌కుమార్, కరుణాకర్, రవీందర్, గంగారాజు, అనిల్, శ్రీనివాస్, ప్రసాదరావు తదితరులు ఇంటింటికీ తిరుగుతూ బీజేపీకి ఓటేసి మచ్చలేని అభ్యర్థి, ఎంపీ బండి సంజయ్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. బీజేపీలో చేరిన మాజీ కార్పొరేటర్ పెంట సత్యనారాయణ కరీంనగర్ కార్పొరేషన్‌లోని 15వ డివిజన్ మాజీ కార్పొరేటర్, బీఆర్ఎస్ నాయకుడు పెంట సత్యనారాయణ శుక్రవారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సమక్షంలో కాషాయ తీర్ధం పుచ్చుకున్నారు. తన అనుచరులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎంపీ కార్యాలయానికి వచ్చిన పెంట సత్యనారాయణను బండి సంజయ్ సాదరంగా ఆహ్వానించారు. ఆయనతోపాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మరోవైపు మంచిర్యాల జిల్లాకు చెందిన వివిధ పార్టీలకు నాయకులు పలువురు కరీంనగర్‌కు వచ్చి బండి సంజయ్ సమక్షంలో పార్టీలో చేరారు. బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుదు రఘు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఇవి చదవండి: నేతలకు కోవర్టుల టెన్షన్..! అన్ని పార్టీల్లో భయం భయం! -
'కర్రుకాల్చి వాతపెట్టున్రి' : కేసీఆర్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ శుక్రవారం కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల ప్రజాఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. పదేళ్లలో తాము చేసిన అభివృద్ధిని వివరిస్తూ.. విపక్షాలపై విమర్శల వర్షం కురిపించారు. కరీంనగర్‌లోని ఎస్సారార్ కళాశాల మైదానంలో జరిగిన ప్రజా ఆశీర్వాదసభలో సీఎం ప్రసంగం బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఓ వైపు జిల్లా కేంద్రంలో చేపట్టిన అభివృద్ధి పనులు వివరిస్తూనే మరోవైపు ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో, పదునైన మాటలతో ధ్వజమెత్తారు. 60 ఏళ్లు పరిపాలించిన ప్రతిపక్షాలు చేసిందేమీ లేదని, తాము పదేళ్లల్లో చేపట్టిన అభివృద్ధి కళ్లముందు పరుగులు పెడుతోందని అన్నారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని, అలాంటి పార్టీని జిల్లా ప్రజలు 2001లో జరిగిన సింహగర్జన సభ నుంచి అక్కున చేర్చుకున్నారని గుర్తు చేశారు. రాయేదో.. రత్నమేదో ఆలోచించి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కర్రుకాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు. మంత్రి గంగుల కమలాకర్ మొండి మనిషి అని ఆయన హయాంలో తీగలవంతెన, మానేరు రివర్ ఫ్రంట్, స్మార్ట్‌సిటీ పనులతో కరీంనగర్ సుందరీకరణ, కూడళ్ల అభివృద్ధి పరుగులు పెడుతోందని కితాబిచ్చారు. హుజూరాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్‌లను భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. 34 నిమిషాలు ప్రసంగం.. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కరీంనగర్ ఎస్సారార్ కళాశాల మైదానంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో 34 నిమిషాలు ప్రసంగించారు. హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి సభాప్రాంగణానికి 1.38 నిమిషాలకు చేరుకున్నారు. తెలంగాణ ప్రగతి రథంలో మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్‌కుమార్, మేయర్ వై.సునీల్‌రావు తదితరనేతలతో కలిసి 1.50నిమిషాలకు వేదికపైకి చేరుకున్నారు. మొదటగా కరీంనగర్ బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. సీఎం కేసీఆర్ సరిగ్గా 2.02 నిమిషాల నుంచి 2.36 నిమిషాల వరకు మాట్లాడారు. 2001లో సింహగర్జన సభను ఇదే వేదికగా నిర్వహించామని అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక విజయాలు సాధించామని, 50 ఏళ్ల కాంగ్రెస్ దరిద్రపు పాలనకు పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు బేరీజు వేసుకుని బాగా ఆలోచించి ఓటు వేయాలని కోరారు. కరీంనగర్లో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఎమ్మెల్సీ మధుసూధనచారి, కార్పొరేషన్ చైర్మన్లు సర్దార్ రవీందర్‌సింగ్, కుర్మాచలం అనిల్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్‌కుమార్, మాజీ మంత్రి రాజేశంగౌడ్ బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. రూ.వెయ్యి కోట్ల నిధులు తెస్తా! ఎమ్మెల్యేగా ఒక్కసారి అవకాశం ఇవ్వండి. కేసీఆర్ కాళ్లు పట్టుకోనైనా హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.వెయ్యి కోట్ల నిధులు తెస్తా. ఉప్పల్, చల్లూరు, వావిలాల మండలాల ఏర్పాటుకు కృషి చేస్తా. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే ప్రజలకు వెన్నుపోటు పొడిచి గజ్వేల్‌లో పోటీ చేస్తుండు. 15 ఏళ్లుగా ప్రజాసేవలోనే ఉన్నా. ఒక్కసారి అవకాశం ఇవ్వండి . అభివృద్ధి చేసి చూపిస్తా. – పాడి కౌశిక్‌రెడ్డి, హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి కుక్కలు చింపిన విస్తరి అవుతుంది.. తెలంగాణ తెచ్చాం. 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. గోదావరి జలాలతో కోటి ఎకరాలకు సాగునీరు అందించి చూపిస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో ఉంది. వందేళ్ల వరకు ప్రగతి పరుగులు పెట్టే విధంగా ప్రణాళికలున్నాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నమ్మితే తెలంగాణను కుక్కలు చింపిన విస్తరిలా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్‌కు అండగా గులాబీ జెండా ఉంది. మంత్రి గంగులను భారీ మెజార్టీతో గెలిపించాలి. – బోయిన్పల్లి వినోద్‌కుమార్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాడీకి ఒక్క చాన్స్ ఇవ్వండి.. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని హైదరాబాద్‌లా అభివృద్ధి చేయాలన్నదే మా డాడీ కళ. మీ అందరికీ దండంపెట్టి కోరుతున్నా. డాడీకి ఎమ్మెల్యేగా ఒక్కసారి అవకాశం ఇవ్వండి. డాడీ వెంట పడి హుజూరాబాద్ అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు నిధులు తెచ్చేలా చేస్తా. – శ్రీనిక, కౌశిక్‌రెడ్డి కూతురు కొంగుపట్టి కోరుతున్నా! హుజూరాబాద్ నియోజకవర్గంలో 15 ఏళ్ల నుంచి ప్రజా సేవలోనే ఉన్నాం. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని గడప గడపకు చేరవేస్తున్నాం.కొంగు పట్టి కోరుతున్నా కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్యేగా ఒక్కసారి అవకాశం ఇవ్వండి. హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన వెంటే నేను ఉంటా. – శాలిని, పాడి కౌశిక్‌రెడ్డి భార్ ఇవి చదవండి: 'నా తమ్ముడు జాన్సన్‌నాయక్‌ను' గెలిపిస్తే.. ఖానాపూర్ దత్తత తీసుకుంటా : కేటీఆర్