ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఎల్‌ఓలు ఓటర్ చీటీలను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేస్తున్నారు. ఒకవేళ ఓటరు చీటీలు అందకుంటే ఆగం కావాల్సిన పని లేదు. ఓటరు చీటీ లేకపోయినా ఓటేసే అవకాశం ఉంది. ఎన్నికల రోజు బీఎల్‌ఓలు పోలింగ్ బూత్‌ల వద్ద అందుబాటులో ఉంటారు. వారి వద్దకు వెళ్లి చీటీ లేని వారు ఆ రోజు కూడా ఓటరు చీటీ రాయించుకునే అవకాశం ఉంది.
లేకపోతే ఓటరు జాబితాలో క్రమ సంఖ్య తెలుసుకుని పోలింగ్ ఏజెంట్లకు చెప్పి వారికి తానే సంబంధిత ఓటరునని నిరూపించుకునే గుర్తింపు కార్డును చూపి ఓటేయొచ్చు. లేదంటే పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసే ఓటరు జాబితాను పరిశీలించి పేరు, క్రమ సంఖ్యను కాగితంపై రాసుకుని వెళ్లవచ్చు. ఆ సమయంలో ఓటరు వద్ద తగిన గుర్తింపు కార్డును తప్పకుండా వెంటతీసుకెళ్లి పోలింగ్ కేంద్రంలో ఉండే అధికారులకు చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.
ఇది చదవండి: కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది.. ఓసారి అందరూ వెళ్లి కర్ణాటకలో చూడండి ఎలావుందో..!
Comments
Please login to add a commentAdd a comment