సాక్షి, నిజామాబాద్: ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లిన ప్రవాసులకు ఓటు హక్కు వినియోగించుకునే వీలు లేకుండా పోతోంది. వయోవృద్ధులు, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్, పోలింగ్ సిబ్బందికి, దేశ భద్రతను కాపాడుతున్న సైనికులకు సర్వీస్ ఓటింగ్ విధానం అమలు చేస్తున్న ఎన్నికల కమిషన్ ప్రవాసుల విషయంలో ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేకపోయింది.
ఫలితంగా జిల్లాలో దాదాపు 2.90 లక్షల మంది గల్ఫ్ వలస కార్మికులతో పాటు ఇతర దేశాల్లో ఉంటున్న వారు ఓటు హక్కుకు దూరమవుతున్నారు. విదేశాల్లో ఆన్‌లైన్ ఓటింగ్ విధానం అమలులో ఉంది. పోలింగ్ బూత్‌కు స్వయంగా వెళ్లి ఓటు వేయని వారు ఆన్‌లైన్‌లో ఓటింగ్‌కు పాల్గొనడానికి దరఖాస్తు చేసుకుంటే ఆయా దేశాల్లో ఓటింగ్ సౌకర్యం కల్పిస్తోంది. మన దేశంలో వలస కార్మికుల కోసం ప్రాక్సీ ఓటింగ్ విధానం అమలు చేయడానికి గతంలో కసరత్తు చేశారు.
సాంకేతిక కారణాలతో ఈ విధానం అమలులోకి రాకముందే స్వస్తి పలికారు. ప్రాక్సీ ఓటింగ్ విధానం అమలులోకి వచ్చి ఉంటే గల్ఫ్ దేశాల్లో ఉన్న వలస కార్మికులతో పాటు ఇతర దేశాల్లో ఉపాధి పొందుతున్న ప్రవాసులకు ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలు ఉండేది. కనీసం రానున్న స్థానిక సంస్థల, పార్లమెంట్ ఎన్నికల సమయంలోనైనా వలస కార్మికులకు ఓటు హక్కు వినియోగించుకునే వీలు కల్పించేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి: మూడోసారీ విజయం నాదే.. : వేముల ప్రశాంత్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment