నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2009, 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీఆర్‌ఎస్ అధికార పగ్గాలు చేపట్టింది. అప్పటివరకు టీడీపీలో కొనసాగిన కిషన్‌రెడ్డి 2015లో బీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో టీడీపీ పరిస్థితి నావికుడు లేని పడవలా తయారైంది. 2018 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, టీడీపీ నాయకులు మహాకూటమిగా ఏర్పడ్డారు.
పొత్తులో భాగంగా ఈ ఎన్నికల్లో సామ రంగారెడ్డిని టీడీపీ బరిలోకి దింపింది. అయితే కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన మల్‌రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ నుంచి పోటీ చేశారు. కిషన్‌రెడ్డి, రంగారెడ్డి నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. కేవలం 356 ఓట్ల మెజార్టీతో కిషన్‌రెడ్డి గెలుపొందారు. మహాకూటమి అభ్యర్థి రంగారెడ్డి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment