
ఖలీల్‌వాడి(నిజామాబాద్ అర్బన్): నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీఎల్‌ఎఫ్ కు చెందిన ఇండిపెండెంట్ అభ్యర్థి మేత్రి రాజశేఖర్ అరగుండు, అరమీసం, అరగడ్డంతో పాటు బిచ్చగాడి వేషధారణతో శనివారం వినూత్న ప్రచారం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనల తీరు ప్రతిబింబించేలా తనీ వేషధారణతో ప్రచారం నిర్వహిస్తున్నట్లు రాజశేఖర్ తెలిపారు. ఆ పార్టీల పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
నిరుద్యోగ యువతీ యువకులు మేలుకోవాలని, ప్రజలు కండ్లు తెరవాలని అన్నారు. ప్రధాన పార్టీల మేనిఫెస్టోలోని అంశాలను ప్లకార్డుల ద్వారా ప్రదర్శిస్తూ భిక్షాటన చేశారు. కొల్లాపూర్‌లో బర్రెలక్క శిరీషపై దాడికి పాల్పడం సరైంది కాదన్నారు. ఆమెకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా మద్దతు తెల్పుతున్నట్లు చెప్పారు. యువతీ, యువకులు చట్టసభలకు రావాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment