నల్లగొండ, త్రిపురారం: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గురువారం ఓటేసేందుకు ఓటరు గుర్తింపు కార్డు(ఎపిక్ కార్డు) తప్పనిసరని లేదా ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 కార్డుల్లో ఏదేని ఒక గుర్తింపు కార్డు ఉండాలని నల్లగొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కర్ణన్ తెలిపారు.
1. ఆధార్ కార్డు
2. ఉపాధి హామీ జాబ్ కార్డు
3. బ్యాంకు/తపాలా కార్యాలయం జారీ చేసిన ఫొటో పాస్‌బుక్
4. కేంద్ర కార్మికశాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు
5. డ్రైవింగ్ లైసెన్స్
6.పాన్ కార్డు
7. రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ ఇండియా(ఆర్జీఐ) జారీ చేసిన స్మార్ట్ కార్డు
8. భారతీయ పాస్‌పోర్ట్
9. ఫొటో గల పెన్షన్ పత్రాలు
10. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డు
11.ఎంపీలు/ ఎమ్మెల్యేలు/ ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు
12. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్ డిజెబిలిటీ గుర్తింపు కార్డుల్లో ఏదేని ఒకటి ఉండాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment