నర్సాపూర్‌లో మాట్లాడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి ఇతర నాయకులు
సాక్షి, మెదక్: సీఎం కేసీఆర్ మోసపూరిత హామీలను నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు నమ్మరని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2014లో నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరందిస్తానని, 2018లో నర్సాపూర్‌ను దత్తత తీసుకుని బంగారు తునక చేస్తానని సీఎం హామీ ఇచ్చి నేటికీ నెరవేర్చలేదని, ప్రస్తుతం ఇచ్చేవాటిని ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన చెప్పారు.
ధరణి.. పేద రైతుల పాలిట శాపంగా మారిందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేసి భూమాత పోర్టల్ ద్వారా న్యాయం చేస్తామని చెప్పారు. ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ఇచ్చిన హామీలన్నీ గతంలో మాదిరిగానే తుంగలో తొక్కుతారని ఎద్దేవా చేశారు. దేవులపల్లి, వెల్మకన్నె, ముండ్రాయి, శివ్వంపేట తదితర గ్రామాలకు చెందిన రైతుల భూములను ధరణిలో పార్ట్ బీలో పెట్టి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారని, అనంతరం వాటి రికార్డులు సరి చేయించుకుని అధిక ధరలకు అమ్ముతూ కోటీశ్వరులయ్యారని విచారం వ్యక్తం చేశారు.
కాగా బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీతారెడ్డి స్వగ్రామమైన గోమారంను మండల కేంద్రం చేయాలని కోరుతున్నా పట్టించుకోకపోవడం విచారకరమని అన్నారు. సమావేశంలో చిలిపిచెడ్ మాజీ జెడ్పీటీసీ చిలుముల శేషాసాయిరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఖాలేక్, నాయకులు ఆంజనేయులుగౌడ్, రిజ్వాన్, మల్లేష్, శ్రీనివాస్‌గుప్తా, రవీందర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, రాజాగౌడ్, మల్లేష్‌గౌడ్, అశోక్, రామాగౌడ్, ఉదయ్‌కుమార్ పాల్గొన్నారు.
నర్సాపూర్‌లో ప్రచారం!
ఆవుల రాజిరెడ్డికి మద్దతుగా నర్సాపూర్‌లోని రెండో వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో చిన్న అంజిగౌడ్, సుధీర్‌గౌడ్, రషీద్ పాల్గొన్నారు.
అప్పుల్లో తెలంగాణ..
నర్సాపూర్ మండలంలోని తుజాల్‌పూర్, తిరుమలాపూర్, బ్రాహ్మణపల్లి ఆయా పంచాయతీల పరిధిలోని గిరిజన తండాల్లో ఆవుల రాజిరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ మిగులు బడ్జెట్‌గా ఉన్న తెలంగాణను బీఆర్‌ఎస్ నాయకులు అప్పుల పాలుచేశారని ఆరోపించారు.
కాంగ్రెస్ తీసుకువచ్చిన 6 గ్యారంటీ పథకాలను గుర్తించి చేతి గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రచారంలో ఆంజనేయులు గౌడ్, శ్రీనివాస్ గుప్తా, రవీందర్ రెడ్డి, మల్లేష్, అశోక్, ఆకుల నర్సింలు, సుధీర్ గౌడ్, నందు, అశోక్ గౌడ్, ఉదయ్ పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని బ్రాహ్మణపల్లి పంచాయతీ పరిధిలోని విఠల్ తండా సమీపంలో ధాన్యం నూర్పిడి పడుతూ ఓటు వేయాలని రాజిరెడ్డి కోరారు.
ఆరు గ్యారంటీలు అమలు..
శివ్వంపేట: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజల సంక్షేమం కోసం 6 గ్యారంటీలు అమలు చేయనున్నట్లు కాంగ్రెస్ అభ్యర్థి రాజిరెడ్డి భార్య శైలజారెడ్డి, సుహాసినిరెడ్డి, కమల, సుదర్శన్‌గౌడ్, నవీన్‌గుప్తాలు అన్నారు. శుక్రవారం దంతన్‌పల్లి, రత్నపూర్ తండాతో పాటు పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
సంఘటితంగా కృషిచేయాలి!
వెల్దుర్తి: నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి గెలుపుకోసం కార్యకర్తలు సంఘటితంగా కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా నాయకులు నరేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఉప్పులింగాపూర్ గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మహేశ్‌రెడ్డి, సంజీవరెడ్డి, కిషన్, సత్యనారాయణ, మహేందర్‌గౌడ్ పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లో చేరిక..
ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సుభాష్ రెడ్డి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు వెంకట్‌రెడ్డి, సర్వర్‌మీర్జా కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు నారాయణ రెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, భూమయ్య, నరేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
హత్నూర: నర్సాపూర్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం రేండ్లగూడ గ్రామా నికి చెందిన పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆవుల కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో దౌల్తాబాద్ సర్పంచ్ కొన్యాల వెంకటేశం, కాంగ్రెస్ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి హకీం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment