Telangana News: Telangana Assembly Elections: ఓటర్లూ.. ఇవి తెలుసుకోండి
Sakshi News home page

Telangana Assembly Elections: ఓటర్లూ.. ఇవి తెలుసుకోండి

Published Wed, Nov 29 2023 12:44 AM | Last Updated on Wed, Nov 29 2023 7:51 AM

- - Sakshi

కల్వకుర్తి టౌన్‌: అసెంబ్లీ ఎన్నికలు గురువారం నిర్వహించనున్నారు. ఇప్పటికే ఓటరు జాబితాను సిద్ధం చేశారు. పోలింగ్‌కు ముందు ఓటర్లు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
►ఓటరు జాబితాలో పేరు ఉందా అనే విషయాన్ని పరిశీలించుకోవాలి. సీఈఓ తెలంగాణ వెబ్‌సైట్‌లో లేదా స్థానికంగా ఓటరు నమోదు కేంద్రంలో పరిశీలించుకోవచ్చు.
►ఓటరు గుర్తింపు కార్డు, ఇతర ఫొటో గుర్తింపు కార్డు, ఓటరు చీటి మీ వద్ద ఉంచుకోవాలి.
► మీ ఇంటి వద్దకే బూత్‌స్థాయి అధికారి వచ్చి ఓటరు చీటి ఇచ్చి వెళ్తారు.
► ఒకవేళ ఓటరు చీటి ఇవ్వకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉండే రాజకీయ పార్టీల ఏజెంట్ల వద్ద పొందవచ్చు.
►పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటరు చీటి, గుర్తింపు కార్డును చూపించాలి.
► పోలింగ్‌ అధికారుల్లో ఒకరు ఓటరు జాబితాలో గుర్తింపుకార్డుతో పాటు మీ పేరును పరిశీలిస్తారు. మరో అధికారి మీ వేలికి సిరా చుక్క అంటిస్తారు. ఆ తర్వాత ఒక చీటి ఇస్తారు.
► మూడో అధికారి ఆ చీటిని పరిశీలిస్తారు.
► ఆ తర్వాత ఈవీఎంపై మీరు ఎన్నుకోవాల్సిన అభ్యర్థికి కేటాయించిన బటన్‌పై నొక్కాలి.
►మీరు ఓటు వేసిన తర్వాత వీవీ ప్యాట్‌లో నిర్దారణ చేసుకోవచ్చు.
►సీల్డ్‌ బాక్స్‌లోని గ్లాస్‌ కేసులో అది మనకు ఏడు సెకన్ల పాటు కనిపిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement