
మహబూబ్‌నగర్ న్యూటౌన్: మహబూబ్‌నగర్‌కు చెందిన సాయిరాఘవ కెనడాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఈనెల 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఎలాగైనా తన ఓటు హక్కు వినియోగించుకోవాలని కెనడా నుంచి స్వదేశానికి చేరుకున్నారు.
మహబూబ్‌నగర్‌లో జరిగిన అభివృద్ధిని చూసి ఆశ్చర్యపడిన అతడు.. శుక్రవారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసి సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో మరింత అభివృద్ధి చేయాలని కాంక్షించారు.
కెనడా నుంచి ఓటు వేసేందుకు వచ్చిన యువకుడిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని అభివృద్ధికి అండగా నిలవాలని మంత్రి కోరారు.
ఇది చదవండి: TS Elections 2023: బడా నేతల ఆగమనం.. దగ్గర పడుతున్న ప్రచార గడువు