తాళానికి సీల్ లేకుండా ఉన్న బ్యాలెట్ బాక్స్
శాలిగౌరారం: 80 సంవత్సరాలు పైబడిన వారితో పాటు అంగవైకల్యం కలిగిన వారివద్ద నుంచి ఓట్లను స్వీకరించేందుకు మండలానికి వచ్చిన ఎన్నికల అధికారులతో నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని తుడిమిడి గ్రామంలో రాజకీయ పార్టీల నాయకులు వాగ్వాదానికి దిగారు. ఇంటి వద్ద నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు దరఖాస్తు చేసుకున్న వారివద్ద నుంచి ఓట్లను స్వీకరించేందుకు సంబంధిత ఎన్నికల అధికారులు గురువారం తుడిమిడి గ్రామానికి వచ్చారు.
ఈ క్రమంలో సంబంధిత దరఖాస్తుదారులైన వారి నుంచి ఓట్లను స్వీరించేందుకు వెళ్లగా.. బ్యాలెట్‌బాక్స్‌కు ఉన్న తాళంకు సీల్ వేయకపోవడాన్ని అక్కడి నాయకులు గమనించి ఆందోళన వ్యక్తం చేశారు. సీల్ వేయకపోవడం వల్ల ఓటింగ్ ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకునే అవకాశం ఉందంటూ వారు సంబంధిత ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు.
దీంతో సుమారు రెండు గంటలపాటు ఓటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో సంబంధిత ఎన్నికల సిబ్బంది ఆయా రాజకీయ పార్టీలకు చెందిన నేతలకు ‘ఇంటి వద్దనే ఓటింగ్’ విధానం గురించి వివరించారు. ఈ ఓటింగ్ ప్రక్రియ ఎన్నికల పరిశీలన అధికారి సమక్షంలో వీడియో, వెబ్‌కాస్టింగ్ రికార్డింగ్‌తో పూర్తి పారదర్శకంగా జరుగుతుందని వారికి వివరించారు. అనంతరం బ్యాలెట్‌బాక్స్ తాళానికి సీల్ చేయడంతో ఓట్ల స్వీకరణ కొనసాగింది.
ఇది చదవండి: చీటీ లేదని ఆగం కావొద్దు.. ఇంకా వేరే మార్గాలు కూడా ఉన్నాయి..!
Comments
Please login to add a commentAdd a comment