
భక్తుల భద్రత.. గాలిలో దీపమే!
● బాసరలో ప్రధాన రోడ్లపై చీకట్లు ● రైల్వే స్టేషన్ బయట కానరాని సెక్యూరిటీ ● జిల్లాలోని ప్రధాన ఆలయాల వద్ద ఇదే పరిస్థితి
భైంసా/బాసర: అక్షర జ్ఞానం అందించాలని.. ఆపదలను తొలగించాలని బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు వ,చ్చే భక్తుల భద్రత గాలిలో దీపంలాగే మారింది. తెలంగాణతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి నిత్యం భక్తులు బాసరకు వస్తారు. అయితే దైవ దర్శనం కోసం వచ్చిన వారి రక్షణ బాధ్యత అధికారులపై ఉంది. వందలాది మంది భక్తులు రాత్రి సమయంలో ఆలయ ప్రాంగణంలోనే నిద్రపోతుంటారు. ఇటీవల నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండపేటలో ఓ మహిళపై సామూహిక అత్యాచార ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో నిందితులైన ఆలయ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి, ఆటో డ్రైవర్, వంటవాళ్లు, ఎలక్ట్రీషియన్ తదిరులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ప్రముఖ ఆలయమైన బాసరకు వచ్చే భక్తుల భద్రత తెలుసుకునేందుకు ‘సాక్షి’ బాసర పట్టణాన్ని అర్ధరాత్రి సమయంలో విజిట్ చేసింది. ఈ సందర్భంగా భద్రతాలోపాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. పోలీసులు, విద్యుత్, ఆలయ అధికారుల మధ్య సమన్వయం లోపం భక్తులకు షాపంగా మారింది. వేసవి సెలవుల్లో ఆలయాల్లో భక్తుల సందడి పెరుగుతుంది. ఈ సమయంలో దొంగతనాలు, అఘాయిత్యాలు జరగకుండా జిల్లా పోలీసులు, దేవాదాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి.
జిల్లాలోని ఆలయాల పరిస్థితి..
నిర్మల్ జిల్లాలో బాసర సరస్వతి ఆలయం, లోకేశ్వ రం బ్రహ్మేశ్వర ఆలయం, కుంటాల గజ్జలమ్మ ఆలయం, కల్లూరు సాయిబాబా ఆలయం, కదిలి పాపహరేశ్వరాలయం, బీరవెల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయం, సారంగాపూర్ అడెల్లి పోచమ్మ ఆల యం, నిర్మల్ వెంకటేశ్వర ఆలయం, గండి రామన్న ఆలయం వంటి అనేక ఆలయాలు ఉన్నాయి.
భక్తులకు సౌకర్యాల కొరత..
ప్రముఖ ఆలయాల వద్ద వసతి, మూత్రశాలలు ఉన్నప్పటికీ, నిర్వహణ సరిగా లేదు. చిన్న ఆలయాల్లో కనీస సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. జాతరలు, ఉత్సవాల సమయంలో రాత్రిళ్లు ఆలయాలకు వెళ్లేవారు ఎక్కువ. ఖర్మకాండల కో సం కూడా ఆలయాల్లో నిద్రపోతుంటారు. గ్రామాలు, పట్టణాలకు దూరంగా ఉన్న ఆలయాల వద్ద సౌకర్యాలు, భద్రత లోపిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో చీకటి పడితే మద్యం ప్రియులు సంచరి స్తూ సీసాలు పగలగొడుతున్నారు. రాత్రి సమయంలో పోలీసు గస్తీ ఉంటే ఇలాంటి పరిస్థితులను నియంత్రించవచ్చని భక్తులు అభిప్రాయపడుతున్నారు.
బాసర రైల్వేస్టేషన్ వద్ద రాత్రివేళలో
వీధి దీపాలు ఏర్పాటు చేస్తాం
బాసరలోని ప్రధాన కాలనీతోపాటు రహదారుల్లో అక్కడక్కడ సెంట్రల్ లైటింగ్ వెలగడం లేదు. వీధి దీపాలు ఏర్పాటు చేసి రాత్రి సమయంలో వెలిగేలా చూస్తాం. పంచాయతీ సిబ్బంది ప్రధాన వీధుల్లో ఎప్పటికప్పుడు డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తున్నారు. గ్రామపంచాయతీ పరిధిలో ప్రజలకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా చూస్తాం.
– పంచాయతీ కార్యదర్శి ప్రసాద్‌గౌడ్, బాసర
భద్రతా లోపాలు..
నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో రాత్రి సమయంలో భద్రత సరిగా కనిపించ డం లేదు. రైల్వే స్టేషన్ సమీపంలో ప్రయాణికులు దిగే ప్రధాన రోడ్డుపై బస్టాండ్ లేదు, విద్యుత్ దీపాలు వెలగడం లేదు. గోదావరి నది ప్రాంతంలో చీకట్లు కమ్ముకున్నాయి. బాసర గ్రామంలో బస్టాండ్ వద్ద సెక్యూరిటీ లేదు, ఆలయానికి వెళ్లే ఏటీఎం వద్ద ప్రైవేట్ గార్డు కూడా కనిపించడం లేదు. పోలీసులు గస్తీ తిరుగుతున్నామని చెప్పినా ఆలయ ప్రాంగణంలో పికెటింగ్ కనిపించలేదు. ఆలయానికి వెళ్లే ప్రధాన మార్గాల్లో సెంట్రల్ లైటింగ్ అలంకారప్రాయంగానే మారింది. రైల్వే స్టేషన్ ప్రాంతంలో రాత్రిళ్లు మందుబాబులు సంచరిస్తున్నారు. రాత్రి రైళ్లలో వచ్చే యాత్రికులు ప్రైవేట్ ఆటోలపై ఆధారపడాల్సి వస్తోంది. బాసర ఆలయానికి బస్సు సౌకర్యం ఉన్నప్పటికీ, రాత్రి సమయంలో అది అందుబాటులో ఉండడం లేదు. రైలు మార్గంలో వచ్చే భక్తులు, ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు, స్థానికులు ప్రధాన రోడ్డుపై గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. వందలాది ప్రయాణికులు ఉండే ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు కూడా లేవు.

భక్తుల భద్రత.. గాలిలో దీపమే!

భక్తుల భద్రత.. గాలిలో దీపమే!