అల్లు అర్జున్‌ పుష్ప-2.. ఏ ఓటీటీకి రానుందంటే? | Allu Arjun Pushpa 2 Ott Platform Deal for Huge Price For This Ott | Sakshi
Sakshi News home page

Pushpa 2 Ott: అల్లు అర్జున్‌ పుష్ప-2.. భారీ ధరకు ఓటీటీ డీల్!

Published Thu, Dec 5 2024 11:29 AM | Last Updated on Thu, Dec 5 2024 12:51 PM

Allu Arjun Pushpa 2 Ott Platform Deal for Huge Price For This Ott

వైల్డ్ ఫైర్ అంటూ థియేటర్లలోకి వచ్చిన పుష్ప-2 బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు. బుధవారం రాత్రి నుంచే ప్రీమియర్ షోలతో పుష్పరాజ్‌ హవా మొదలైంది. ఈ రోజు నుంచే ప్రపంచవ్యాప్తంగా పుష్ప-2  థియేటర్లలో సందడి చేస్తోంది. ఇప్పటికే మూవీకి సూపర్ హిట్‌ టాక్ రావడంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

పుష్ప-2 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఓటీటీ రిలీజ్‌పై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఏ ఓటీటీకి రానుందనే చర్చ అప్పుడే మొదలైంది. అయితే ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తాజా సమాచారం. భారీ ధరకు పుష్ప-2ను సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే మూవీ రిలీజైన నెల రోజుల తర్వాతే ఓటీటీకి వచ్చేలా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

(ఇది చదవండి: Pushpa 2 Review: ‘పుష్ప 2’ మూవీ రివ్యూ)

సుకుమార్- అల్లు అర్జున్‌ కాంబోలో 2021లో వచ్చిన పుష్ప బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ మూవీకి సీక్వెల్‌గా పుష్ప-2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రం రష్మిక మందన్నా శ్రీవల్లిగా మరోసారి మెప్పించింది. అంతేకాకుండా కిస్సిక్‌ అనే ఐటమ్‌సాంగ్‌లో శ్రీలీల మెరిసింది. మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ మరోసారి కీలక పాత్ర పోషించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement