బిగ్‌బాస్‌: నామినేషన్స్‌లో ఏడుగురు, ఆ కంటెస్టెంట్‌ మాత్రం నయా రికార్డు! | Bigg Boss Telugu 7: List Of 8th Week Nominated Contestants - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 7: నన్ను నెగెటివ్‌గా చూపించాలనుకుంటున్నారా? శివాజీ కుట్రను పసిగట్టిన శోభ

Published Mon, Oct 23 2023 4:55 PM | Last Updated on Mon, Oct 23 2023 5:59 PM

Bigg Boss Telugu 7: 8th Week Nominations List - Sakshi

నన్ను నెగెటివ్‌గా చూపించేందుకు ఇదే మంచి అవకాశం అనుకున్నారంటూ శివాజీ కుట్రను బయటపెడుతూ అతడి మీద ఫైర్‌ అయింది. ఈ ఇంట్లో ఉండే అర్హత నాకు లే

బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి ఒక్కొక్కరూ వెళ్లేకొద్దీ నామినేషన్స్‌ మరింత రసవత్తరంగా మారుతున్నాయి. అయితే ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఈ సీజన్‌లో వరుసగా ఏడుగురు అమ్మాయిలను హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ చేశారు. అయితే రతికను మాత్రం తిరిగి హౌస్‌లోకి పంపించారు. ఇకపోతే గతవారం భోలె షావళి బూతులు మాట్లాడుతూ అందరికీ బీపీ తెప్పించాడు. వీకెండ్‌ ఎపిసోడ్‌లోనూ నాగ్‌ క్లాస్‌ పీకాడు. ఇప్పుడదే వ్యవహారాన్ని నామినేషన్‌ అస్త్రంగా మార్చుకున్నాడు శివాజీ. భోలె తప్పులు మాట్లాడాడు. కానీ అతడు సారీ చెప్పినా క్షమించకపోవడం తప్పంటూ శోభా శెట్టిని నామినేట్‌ చేశాడు.

అర్హత లేదు, బయటకు వెళ్లు
మాటలు పడింది తాను.. క్షమించడం, క్షమించకపోవడం తన ఇష్టమని శోభా అభిప్రాయపడింది. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. నన్ను నెగెటివ్‌గా చూపించేందుకు ఇదే మంచి అవకాశం అనుకున్నారంటూ శివాజీ కుట్రను బయటపెడుతూ అతడి మీద ఫైర్‌ అయింది. ఈ ఇంట్లో ఉండే అర్హత నాకు లేదు, బయటకు వెళ్లు అని చెప్తున్నారు.. అంతే కదా అని నిలదీసింది. దానికి శివాజీ.. నాతో సహా ఇక్కడున్న ఎవరికీ ఇంట్లో ఉండే అర్హత లేదు అంటూ తలతిక్క సమాధానం ఇచ్చాడు.

ఏడుగురు నామినేట్‌
ఇక రోజు కూడా భోలె షావళి- ప్రియాంకల మధ్య వాగ్వాదం జరిగేట్లు కనిపిస్తోంది. కాగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ఈ వారం శివాజీ, భోలె షావళి, అమర్‌దీప్‌, ప్రశాంత్‌, ప్రిన్స్‌ యావర్‌, గౌతమ్‌.. మొత్తంగా ఏడుగురు నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈసారి కూడా సందీప్‌ నామినేషన్స్‌లోకి రాకపోవడం గమనార్హం. వరుసగా ఎనిమిది వారాలుగా సందీప్‌ నామినేషన్స్‌ దరిదాపుల్లోకి కూడా రావడం లేదు. ఈ లెక్కన ఎక్కువ వారాలు నామినేట్‌ అవని కంటెస్టెంట్‌గా సందీప్‌ రికార్డు సృష్టిస్తున్నాడు.

చదవండి: వారిని ఎలిమినేట్‌ చేయాల్సిందన్న పూజా మూర్తి... గీతూ కౌంటర్లకు దండం పెట్టేసిందిగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement