Chiranjeevi Waltair Veerayya Completes Censor Certification, Movie Makers Announced - Sakshi
Sakshi News home page

Waltair Veerayya: చిరు ‘వాల్తేరు వీరయ్య’ మూవీ చూసి సెన్సార్‌ సభ్యులు ఏమన్నారంటే..!

Published Tue, Jan 3 2023 5:57 PM | Last Updated on Tue, Jan 3 2023 6:50 PM

Chiranjeevi Waltair Veerayya Completes Censor Makers Announce - Sakshi

ఈ సంక్రాంతికి మెగాస్టార్‌ చిరంజీవి బాక్సాఫీసు వద్ద సందడి చేయబోతున్నాడు. ఆయన నటించి లేటెస్ట్‌ మూవీ వాల్తేరు వీరయ్య జవవరి 13న థియేటర్లోకి రానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, ప్రచార పోస్టర్లకు విపరీతమైన రెస్పాన్స్‌ వచ్చింది. దీంతో ఎక్కడ చూసిన వాల్తేరు వీరయ్య హావానే కనిపిస్తుంది. దీంతో ఈ పండగా చిరు ఫ్యాన్స్‌కి ఫీస్ట్‌ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇక రీసెంట్‌గా విడుదలైన పూనకాలు లోడింగ్‌ సాంగ్‌ చూస్తుంటే థియేటర్లో ఆడియన్స్‌కి పూనకాలు తెప్పించడం కాయం అనిపిస్తోంది. 

చదవండి: కొత్త సంవత్సరంలో బ్యాడ్‌ న్యూస్‌ చెప్పిన పునర్నవి

మాస్ మసాలా మూవీగా రాబోతున్న ఈ చిత్రంపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో తాజాగా ఈ మూవీ సెన్సార్‌ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ వెల్లడించారు. ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు.. యూ/ఏసర్టిఫికెట్ ఇచ్చారు. ఆ పోస్టర్ ని కూడా మూవీ టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సినిమా చూసిన సెన్సార్‌ బోర్డు చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈ తాజా బజ్‌ ప్రకారం.. ఈసారి చిరు వాల్తేరు వీరయ్యతో థియేటర్లో రచ్చ చేయబోతున్నాడంటూ కొనియాడారని తెలుస్తోంది.

చదవండి: వ్యాపారవేత్తతో శ్రీముఖి పెళ్లి? త్వరలోనే అధికారిక ప్రకటన!

‘బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం రికార్డు బ్రేక్‌ చేయడం ఖాయం. రీఎంట్రీ తర్వాత చిరంజీవిని అభిమానులు ఎలా చూడాలనుకున్నారో ఈ మూవీ అలా ఉండబోతోంది. ఎమోషనల్‌, యాక్షన్స్‌ సీన్స్‌ ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తాయి. చిరంజీవి-రవితేజ కాంబినేషన్‌లో ఉండే సన్నివేశాలు అయితే ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించేలా డైరెక్టర్‌ డిజైన్‌ చేశారు’ అంటూ బోర్డు సభ్యులు ప్రశంసలు కురిపించారట. ఇక చిరంజీవి మాస్‌ స్టెప్పులకు వారు ఫిదా అయినట్లు తెలుస్తోంది. కాగా డైరెక్టర్‌ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్నారు. ఇందులో శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా నటించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement