Kapil Sharma Reveals Reaosn Behind Gatecrashing A Party At Shah Rukh Khan House - Sakshi
Sakshi News home page

Kapil Sharma: అర్ధరాత్రి షారుక్‌ ఇంటికి తాగి వెళ్లాను, నిక్కర్‌లో కారు దిగి..

Published Sat, Jan 29 2022 4:55 PM | Last Updated on Sat, Jan 29 2022 7:24 PM

Kapil Sharma Reveals Reaosn Behind Gatecrashing A Party At Shah Rukh Khan House - Sakshi

నా కజిన్‌ మన్నాత్‌లోని షారుక్‌ ఖాన్‌ ఇంటిని చూడాలని ఉందని చెప్పింది. అప్పుడు నేను తాగి ఉన్నాను. అయినా సరే అదేం పట్టించుకోకుండా చలో అంటూ కారు తీసుకుని వెళ్లాం...

నటుడు, కమెడియన్‌ కపిల్‌ శర్మ ఓసారి పిలవని పార్టీకి వెళ్లాడట. అది కూడా బాలీవుడ్‌ హీరో షారుక్‌ ఖాన్‌ ఇంట్లో జరుగుతున్న పార్టీకి! తాజాగా ఈ విషయాన్ని ఆయన నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న 'కపిల్‌ శర్మ: ఐయామ్‌ నాట్‌ డన్‌ ఎట్‌' అనే షోలో వెల్లడించాడు. 'కపిల్‌ శర్మ షోతో నాకు మంచి పాపులారిటీ వచ్చింది. కానీ ఇది నాలో కొన్ని తప్పుడు ఆలోచనలకు సైతం బీజం పోసింది. నా కజిన్‌ మన్నాత్‌లోని షారుక్‌ ఖాన్‌ ఇంటిని చూడాలని ఉందని చెప్పింది. అప్పుడు నేను తాగి ఉన్నాను. అయినా సరే అదేం పట్టించుకోకుండా చలో అంటూ కారు తీసుకుని వెళ్లాం.

అక్కడ పార్టీ జరుగుతోంది. సెక్యూరిటీ గార్డులు నన్ను చూసి పార్టీకి ఆహ్వానించారేమోననుకుని గేట్లు తెరిచారు. లోపలకు ఎంటర్‌ అయ్యాం కానీ మేము చేస్తోంది తప్పనిపించింది. ఉన్నపళంగా బయటకు వెళ్లిపోదాం అనుకున్నాం. అంతలోనే షారుక్‌ మేనేజర్‌ మమ్మల్ని చూసి లోనికి ఆహ్వానించాడు. అప్పుడు సమయం తెల్లవారుజామున 3 అవుతోంది. నేను నిక్కర్‌ వేసుకుని ఉన్నాను. అలాగే ఇంట్లో అడుగు పెట్టగా ఎదురుగా షారుక్‌ భార్య గౌరీ మేడమ్‌ తన ఫ్రెండ్స్‌తో ఉన్నారు. ఆమె కూడా నాకు ఇన్విటేషన్‌ అందిందేమోననుకుని పలకరించింది. షారుక్‌ లోపల ఉన్నాడంటూ ఓ గదివైపు వెళ్లమని సూచించింది.

అలా గదిలోకి వెళ్లగానే ఆయన ఎప్పటిలాగే డ్యాన్స్‌ చేస్తున్నారు. కొంత కంగారుపడుతూనే తన దగ్గరకు వెళ్లి.. భాయ్‌ సారీ.. నా కజిన్‌ మీ ఇల్లు చూడాలనుందంటే తీసుకువచ్చాను అని చెప్పాను. అప్పుడతను నువ్వు ఇంట్లోకేంటి.. నా బెడ్‌రూమ్‌లోకి కూడా రావచ్చన్నాడు. ఆ తర్వాత ఇద్దరం డ్యాన్స్‌ చేశాం. తిరిగి వెళ్లేటప్పుడు అక్కడి స్టాఫ్‌ నాతో ఫొటోలు తీసుకున్నారు. వాటిని షారుక్‌ స్వయంగా తీశాడు' అని చెప్పుకొచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement