Renu Desai Interesting Comments On Soulmate Viral On Social Media - Sakshi
Sakshi News home page

Renu Desai : 'జీవితంలో తోడు కావాలి'.. రేణుదేశాయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Published Mon, Sep 5 2022 12:00 PM | Last Updated on Mon, Sep 5 2022 12:33 PM

Renu Desai Intresting Comments About Soulmate Goes Viral On Social Media - Sakshi

నటి, దర్శకురాలు రేణు దేశాయ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆమె ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 2012లో పవన్‌ కల్యాణ్‌తో విడాకులు తీసుకున్న రేణు దేశాయ్‌ అప్పటి నుంచి సింగిల్‌గా ఉంటుంది. అయితే గతంలో రేణు దేశాయ్‌ రెండో పెళ్లిపై వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.

జీవితంలో ఒక తోడు అవసరం అని స్వయంగా రేణు దేశాయ్‌ కొన్ని ఇంటర్వ్యూలో పేర్కొంది. ఈ క్రమంలోనే రెండో పెళ్లికి సిద్ధమైన రేణు దేశాయ్‌కి 2018లో ఓ వ్యక్తితో నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత అతనితో పెళ్లిపై ఇంతవరకు క్లారిటీ లేదు. అయితే తాజాగా రేణు దేశాయ్‌ చేసిన పోస్ట్‌తో ఆమె రెండోపెళ్లిపై మరోసారి చర్చకు దారితీసింది. 'జీవితంలో అవసరం ఉన్నప్పుడు మనచేయి పట్టుకుని నడిపించే ఒక తోడు కావాలి'.. అంటూ ఇన్‌స్టాలో ఓ పోస్టును షేర్‌చేసింది.

అనంతరం మరో పోస్ట్‌లో.. 'మీ సోల్‌మేట్‌ని వెతకడానికి ముందు మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోండి'.. అంటూ ఓ వీడియోను షేర్‌ చేసింది. ప్రస్తుతం రేణు దేశాయ్‌ చేసిన ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.  చదవండి: పొలిటికల్‌ లీడర్‌ కుమార్తెతో మంచు మనోజ్‌ రెండో పెళ్లి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement