renu desai
-
హెచ్‌సీయూ వివాదం.. రేణూ దేశాయ్ విన్నపం.. ప్రభుత్వానికి ఉపాసన సూటి ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల అడవిని మాయం చేసి పరిశ్రమలు స్థాపించి ఉద్యోగాలు కల్పిస్తామంటోంది తెలంగాణ ప్రభుత్వం.. ఆ భూములు మావంటూ వాటిని కాపాడుకోవడానికి పోరుబాట పట్టారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు (#HCU Protest). వందలాది జేసీబీలు అర్ధరాత్రి అడవిని ధ్వంసం చేయడానికి వెళ్తే నెమళ్ల ఆర్తనాదాలు, భయంతో పరుగులు తీస్తున్న దుప్పిల వీడియోలు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి మనసును కదిలిస్తున్నాయి. అడవిని కాపాడుకుందాంఅవి చూసిన సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాలుష్యంతో నిండిపోతున్న నగరానికి ఆక్సిజన్ అందిస్తున్న భూముల్ని అమ్మడం అన్యాయమని మండిపడుతున్నారు. అడవి నరికివేత ఆపేయాలని, పర్యావరణాన్ని కాపాడుకుందాం అని నినదిస్తున్నారు. హీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన (Upasana Konidela) ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మీరు ఇదే గనక చేయాలనుకుంటే అక్కడున్న మూగజీవాలు, పక్షులకు ఎక్కడ పునరావాసం కల్పిస్తారు? నరికివేసిన చెట్లను తిరిగి ఎక్కడ పెంచుతారు? వీటన్నింటికీ సమాధానం చెప్పండి అని కోరింది.దయచేసి వేడుకుంటున్నా..పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ (Renu Desai) స్పందిస్తూ.. రెండు రోజుల క్రితమే నాకు విషయం తెలిసింది. అన్ని విషయాలు కనుక్కున్నాకే వీడియో చేస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డిగారూ.. ఒక తల్లిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా.. నాకు 44 ఏళ్లు. రేపోమాపో ఎలాగైనా పోతాను. కానీ పిల్లలు.. మన రేపటితరానికి ఆక్సిజన్, నీళ్లు అవసరం. వదిలేయండి..అభివృద్ధి అవసరం.. కాదనను. ఐటీ పార్కులు, బహుళ అంతస్తుల భవనాలు.. అన్నీ అవసరమే! కానీ ఈ 400 ఎకరాలను మాత్రం వదిలేయండి. నిర్మానుష్యంగా ఉన్న భూముల్ని వెతకండి. దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఏదో ఒకటి చేయండి. మీరు చాలా సీనియర్. ఒక తల్లిగా అడుక్కుంటున్నాను. ఒక్కసారి ఆలోచించండి అని వీడియో రిలీజ్ చేసింది. మూగజీవాల్ని అడవి నుంచి తరిమేయకండి అంటూ యాంకర్ రష్మీ గౌతమ్ సైతం వీడియో షేర్ చేసింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam)చదవండి: లాల్ సింగ్ చద్దా.. ఆ స్టార్ హీరోకంటే అతడి కొడుకే బెటర్: దర్శకుడు -
ఒక్క ఫోటో మీద ఇంత మంచి కథ.. కన్నీళ్లు వచ్చాయి: రేణూ దేశాయ్
‘1000 వర్డ్స్’ సినిమా చూసి కన్నీళ్లు వచ్చాయి అని అన్నారు నటి రేణూ దేశాయి. అరవింద్ కృష్ణ, బిగ్ బాస్ ఫేమ్ దివి, మేఘన శ్రీనివాస్, వినయ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘1000 వర్డ్స్’(1000 Words movie). ఈ సినిమాకు రమణ విల్లర్ట్ నిర్మాతగా వ్యవహరిస్తూనే డైరెక్షన్ చేశారు. కే రవి కృష్ణా రెడ్డి కో- ప్రొడ్యూసర్ గా పని చేశారు. ఈ సినిమాకు డా.సంకల్ప్ కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించగా.. శివ కృష్ణ సంగీతం అందించారు. తాజాగా చిత్రబృందం ఏర్పాటు చేసిన ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనకి రేణూ దేశాయ్, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చి రెడ్డి, మధుర శ్రీధర్, జ్యోతి పూర్వాజ్, సుకు పూర్వాజ్ము ముఖ్య అతిథులుగా విచ్చేశారు. షో అనంతరం రేణూ దేశాయ్(Renu Desai) మీడియాతో మాట్లాడుతూ.. ‘రమణ గారు ఫోటోగ్రాఫర్‌గా నాకు తెలుసు. ఆయన ఓ కథ చెప్పాడు. బాగానే అనిపించింది. కానీ ఎలా తీసి ఉంటారా? అని అనుకున్నాను. ఈ మూవీ చూశాక అద్భుతంగా అనిపించింది. ఇది అందరికీ రీచ్ అవ్వాలి. అందరూ చూడాల్సిన, అందరికీ తెలియాల్సిన సినిమా. ఒక్క ఫోటో మీద ఇంత మంచి కథను రాసుకుని తీశారు. సినిమా చూశాక నాకు కూడా కన్నీళ్లు వచ్చాయి. ఇంత మంచి సినిమా తీసిన టీమ్‌కు ఆల్ ది బెస్ట్. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘1000 వర్డ్స్’ అద్భుతమైన చిత్రం. అందరినీ కంటతడి పెట్టించారు. ఈ చిత్రానికి కచ్చితంగా అవార్డులు వస్తాయి. ప్రతీ ఒక్కరి హృదయాల్ని కుదిపేస్తుంది. చాలా రోజులకు ఓ చక్కటి సినిమాను చూశానని అనిపిస్తుంది’ అని అన్నారు.హీరో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ.. ‘‘1000 వర్డ్స్’ ప్రాజెక్టులో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రమణ గారితో ఓ సారి ఫోటో షూట్ చేశాను. మీరు ఎప్పుడైనా సినిమా చేస్తే నాకు చెప్పండి సర్ అని అన్నాను. నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని, పాత్రను చక్కగానే పోషించానని అనుకుంటున్నాను. సూపర్ హీరో ఏ మాస్టర్ పీస్ సినిమా షూటింగ్లో నాకు గాయమైంది. దాదాపు ఎనిమిది నెలలు పని లేకుండా అలా బెడ్డు మీదే ఉండిపోయాను. ఆ టైంలోనే ఈ ప్రాజెక్ట్ వచ్చింది. ఆ దేవుడే రమణ గారిని నా దగ్గరకు పంపాడనిపిస్తుంది. సంకల్ప్, శివ కృష్ణ, శివ రామ్ చరణ్‌లు ఈ ప్రాజెక్ట్‌కు చాలా కష్టపడ్డారు. వాళ్లు చాలా ఎత్తుకు ఎదుగుతారనిపిస్తుంది. మేఘన గారు, దివి గారు అద్భుతంగా నటించారు. నూరీ ఈ చిత్రానికి హీరో. నా మూడేళ్ల కొడుకు అధ్విక్ కృష్ణ మొదటి సారిగా నా సినిమాను స్క్రీన్ మీద చూశాడు. ఈ మూవీ నాకెంతో ప్రత్యేకం. నాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.డైరెక్టర్, నిర్మాత రమణ విల్లర్ట్ మాట్లాడుతూ.. ‘గత 20 ఏళ్లుగా నేను ఓ మంచి సినిమాను చేయాలని తపిస్తూనే ఉన్నాను. నాకు కథలు రాయడం రాదు. నేను చాలా కథలు వింటూ వచ్చాను. అప్పుడే సంకల్ప్ ఈ కథతో వచ్చారు. ఓ తల్లి బిడ్డను కనేప్పుడు పడే బాధను చెప్పాలని, చూపించాలనే ఈ సినిమాను తీశాం. రేణూ దేశాయ్ గారు నాకు సోదరి వంటి వారు. ఆమెకు ఈ కథ చెప్పగానే ఎమోషనల్ అయ్యారు. ఎలాంటి సపోర్ట్ కావాలన్నా చేస్తానని ఆమె ముందుకు రావడం ఆనందంగా ఉంది’ అన్నారు. -
సినిమాల్లోకి అకీరా నందన్.. రేణు దేశాయ్ ఏమన్నారంటే?
రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్గా పలు సినిమాలు చేసింది. 2023లో చివరిసారిగా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో కనిపించింది. అయితే ఇటీవల కుటుంబంతో కలిసి ఆధ్యాత్రిక యాత్రలో బిజీగా ఉంది. కొద్ది రోజుల క్రితమే కాశీ పర్యటనకు వెళ్లిన రేణు దేశాయ్ అక్కడ దిగిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.తాజాగా విజయవాడలో జరిగిన ఓ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైంది రేణు దేశాయ్. సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొంది. ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో ఓ ప్రైవేట్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీ కుమారుడు అకీరా నందన్ సినిమాల్లో ఎంట్రీ ఎప్పుడు ఇస్తున్నారని ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందించింది.రేణు దేశాయ్ మాట్లాడుతూ..' ఈ సమయం కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఒక మదర్‌గా మీ అందరికంటే నాకే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అతను ఎప్పుడు ఓకే అంటే అప్పుడే. అకిరా నందన్ ఇష్టంతోనే సినిమాల్లోకి రావాలి. అంతవరకు వెయిట్ చేయండి' అని అన్నారు.గోదావరి జిల్లాల గురించి మాట్లాడుతూ..'గోదావరి జిల్లాల్లో ఉండే అందమైన లొకేషన్స్ నేను ఎప్పుడూ చూడలేదు. విజయవాడ నుంచి రాజమండ్రి మధ్య పచ్చని అందాలు అద్భుతంగా ఉన్నాయి. తెలుగు సినిమా పరిశ్రమ ఏపీకి రావాలని పెద్దలు నిర్ణయించడం సంతోషం. ఏపీలో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందితే నాకు సంతోషమే. నాకు చిన్నప్పటి నుంచి మూగజీవాల సంరక్షణ పట్ల ఆసక్తి ఉంది. సామాజిక సేవా కార్యక్రమాల కోసం నా కుమార్తె ఆద్య పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేశా' అని అన్నారు. -
విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న రేణూ దేశాయ్, యాంకర్ రవి (ఫోటోలు)
-
బ్లూ డ్రెస్‌లో సీతారామం బ్యూటీ మృణాల్.. ప్రణీత అలాంటి పోజులు
బ్లూ డ్రెస్‌లో సీతారామం బ్యూటీ మృణాల్..బ్లాక్ డ్రెస్‌లో అత్తారింటికి దారేది హీరోయిన్ ప్రణీత..అనన్య నాగళ్ల గ్లామరస్ లుక్స్..2024 జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న తమన్నా..కాశీ యాత్రలో నటి రేణు దేశాయ్.. View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
రాజస్థాన్‌లో మెహరీన్ చిల్.. గోవాలో పూనమ్ బజ్వా వెకేషన్
రాజస్థాన్‌లో చిల్ అవుతోన్న మెహరీన్..గోవాలో ఎంజాయ్ చేస్తోన్న పూనమ్ బజ్వా..ఒర్రీలో జాన్వీ కపూర్ సిస్టర్ పోజులు..వారణాసిలో ఛాయ్ తాగుతూ రేణు దేశాయ్..అందాలు ఒలకబోస్తోన్న అరియానా గ్లోరీ..అలాంటి డ్రెస్‌లో సోనాలి బింద్రే హోయలు.. View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by renu desai (@renuudesai) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి?: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
హీరోయిన్, నటి రేణుక దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న రేణు గతేడాది రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది. అయితే రేణు ప్రస్తుతం ఎలాంటి సినిమాల్లో నటించడం లేదు.ఇక సినిమాల విషయం పక్కనపెడితే రేణు దేశాయ్ జంతు ప్రేమికురాలని అందరికీ తెలిసిందే. పర్యావరణం, మూగ జంతువుల సంరక్షణకు సంబంధించి ఏదో ఒక పోస్ట్ పెడుతూ అవగాహన కల్పిస్తూనే ఉంటుంది. అంతేకాదు.. క్యాట్స్, డాగ్స్ కోసం ప్రత్యేకంగా షెల్టర్ హోమ్‌ను కూడా ఏర్పాటు చేసింది. వాటికోసం ప్రత్యేకంగా ఒక ఎన్జీవోను స్థాపించింది. తన పిల్లల పేరు మీదే షెల్టర్ హోమ్ ఏర్పాటు చేసిన రేణు దేశాయ్ ఆంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతలా మూగజీవాల కోసం తనవంతు కృషి చేస్తోంది.మూగజీవాలంటే తన ప్రాణంగా భావించే రేణు దేశాయ్‌కి ఓ వ్యక్తి చేసిన పని విపరీతమైన కోపం తెప్పించింది. ఓ చిన్న కుక్క పిల్లను కాలితో తన్నుతో ఆ వ్యక్తి కనిపించాడు. అక్కడే దూరంగా ఉన్న కుక్క పిల్ల తల్లి వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చిన తన బిడ్డను రక్షించుకుంది. ఈ వీడియోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసిన రేణు.. ఇలాంటి వాళ్లను ఏం చేయాలి ఫ్రెండ్స్? అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఈ పోస్ట్ చూస్తుంటే తనకు మూగజీవాలపై ఉన్న ప్రేమ ఏంటో ఎవరికైనా అర్థమవుతుంది. -
రేణు దేశాయ్ తల్లి కన్నుమూత
సినీ నటి రేణు దేశాయ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని రేణు దేశాయ్ గురువారం నాడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అమ్మ ఆత్మకు శాంతి చేకూరాలి, ఓం శాంతి అంటూ తల్లి పాత ఫోటోను షేర్ చేసిన రేణు దేశాయ్ కింది శ్లోకాన్ని కూడా పోస్టు కింద జత చేసింది.పునరపి జననం పునరపి మరణంపునరపి జననీ జఠరే శయనం|ఇహ సంసారే బహుదుస్తారేకృపయాపారే పాహి మురారే||మళ్లీ మళ్లీ పుడుతుంటారు.. మళ్లీ మళ్లీ చనిపోతుంటారు. మళ్లీ ఓ తల్లి గర్భంలో జన్మించక తప్పదంటూ ఆది శంకరాచార్యుల మాటల్ని సైతం ఆ పోస్టులో పొందుపరిచింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) చదవండి: ఒక కూతురి తండ్రిగా ఆ బాధేంటో నాకు తెలుసు: అభిషేక్ -
నా చిరకాల స్వప్నం, గుడ్ న్యూస్ : రేణూ దేశాయ్ పోస్ట్ వైరల్
నటి రేణుకా దేశాయ్ శుభవార్తను ఫ్యాన్స్‌తో పంచుకుంది. చిన్న నాటి కల నెలవేరింది అంటూ ఇంటూ ఇన్‌స్టాలో ఒకపోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఇది నెట్టింట సందడి చేస్తోంది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ, వ్యక్తిగత విషయాలతో పాటు , ఆసక్తికరమైన విషయాలను పంచుకోవడం, పలు సామాజిక అంశాలపై స్పందించడం అలవాటు. అలాగే అభిమానుల సాయంతో తోచిన సహాయం చేస్తూ ఉంటుంది. పర్యావరణం, మూగ జంతువుల సంరక్షణకు సంబంధించి ఏదో ఒక పోస్ట్ పెడుతూ అవగాహన కల్పిస్తూ ఉంటుంది. తాజాగాలో ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో చెప్పుకొచ్చింది. క్తికరమైన విషయాన్ని తన ఫ్యాన్స్‌తో షేర్ చేసింది. తనకు చిన్నప్పటినుంచి జంతువులు ముఖ్యంగా కుక్కలు, పిల్లులు మీద ఇష్టం ఎక్కువ అనీ, పెద్దాయ్యక వాటి కోసంఏదైనా చేయాలని కోరిక ఉండేదని, కోవిడ్ సమయంలో దీని ప్రాధాన్యతను తాను మరింత గుర్తించానని తెలిపింది. ఎట్టకేలకు ఇన్నాళ్లకు ఒక ఎన్జీవోను రిజిస్టర్ చేసినట్టు వెల్లడించింది. గతంలో ప్రమాదాలకు గురైన కుక్కలు లాంటివాటిని రక్షించడంలో తనకు చాలామంది గొప్పవాళ్లు సాయం చేశారని తెలిపింది. ఇపుడిక తానే స్వయంగా ఒక సంస్థను, ఆంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పింది. అలాగే ఈ ప్రయాణంలో మరింత ముందుకు పోవాలంటే దాతల సాయం కూడా చాలా అవసరం అంటూ, సాయం చేసి, మూగజీవాల రక్షణలో తనకు తోడుగా నిలవాలని విజ్ఞప్తి చేసింది.‘‘ఈ రోజు నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు, చిన్ననాటి కల నెరవేరింది, అందుకే క్షణాన్ని మీ అందరితో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ తన సంస్థకు సంబంధించిన వివరాలను, తన ఆశయాలను ఈ వీడియోలో చెప్పుకొచ్చింది. దీనిపై నెటిజన్లు ఆమెను ఆభినందిస్తున్నారు. జంతువుల సంరక్షణ, వైద్య సాయం అందించే క్రమంలో విజయం సాధించాలి అంటూ విషెస్ అందించారు. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
రేణూ దేశాయ్ ఇంట గణపతి, చండీ హోమం.. పాల్గొన్న అకీరా (ఫోటోలు)
-
చండీ హోమం చేసిన రేణు దేశాయ్
సినీ నటి రేణు దేశాయ్ గణపతి, చండీ హోమం నిర్వహించింది. ఈ పూజలో అకీరా నందన్ కూడా పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. శరద్ పూర్ణిమ సందర్భంగా గణపతి, చండీ హోమం చేశాను. మన పూర్వీకులు అనుసరించిన సాంప్రదాయాలు, ఆచారాలను పిల్లలకు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మనపై ఉంది.అందుకని డెకరేషన్పైనే ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదు. ఆర్భాటంగా పూజలు చేసుకోవడానికి బదులుగా ఆ హోమం, పూజలపైనే ఫోకస్ చేస్తే సరిపోతుంది అని రాసుకొచ్చింది. కాగా రేణు దేశాయ్.. గతేడాది టైగర్ నాగేశ్వరరావు సినిమాతో వెండితెరపై రీఎంట్రీ ఇచ్చింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
ఇండియన్ 2 ఫ్లాప్ అయినందుకు సంతోషం: రేణు దేశాయ్
భారతీయుడు సినిమా ఎంత హిట్టో దానికి సీక్వెల్‌గా తెరకెక్కిన భారతీయుడు 2 అంత ఫ్లాప్‌గా నిలిచింది. కమల్ హాసన్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 12న థియేటర్లలో విడుదలవగా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఈ మూవీ వీక్షించిన నటి రేణు దేశాయ్ సినిమా టీమ్‌పై ఫైర్ అయింది. ఇటువంటి సినిమాలు ఫ్లాప్ అయినందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. చాలా సంతోషంఆమె ఇలా మాట్లాడటానికి అందుకు కారణం లేకపోలేదు. ఈ సినిమాలో వీధికుక్కలను హీనంగా చూసే డైలాగ్ ఉంటుంది. ఆ క్లిప్పింగ్‌ను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన రేణు దేశాయ్.. తెలివితక్కువ రచయితలు ఇలాంటి డైలాగ్స్ ఎలా రాస్తారు? అసలు వాళ్లకు ఏమైంది? అని మండిపడింది. ఇకపోతే ఇండియన్ 2తో ట్రోలింగ్ బారిన పడ్డ శంకర్ తర్వాతి పార్ట్ విషయంలో అయినా జాగ్రత్త వహిస్తే బెటర్ అని నెటిజన్లు సూచిస్తున్నారు!బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రేణు దేశాయ్‌కు సారె పెట్టి సత్కరించిన మంత్రి (ఫోటోలు)
-
మంత్రిని కలిసిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
తెలంగాణ మంత్రి కొండా సురేఖను కలిసిన ప్రముఖ నటి రేణు దేశాయ్ కలిశారు. భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ తరపున మంత్రిని కలిసినట్లు తెలుస్తోంది. ఆ సంస్థకు రేణు దేశాయ్ చీఫ్ అడ్వైజర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇవాళ జూబ్లీహిల్స్‌లోని మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో నెలకొల్పనున్న గీత యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను మంత్రికి రేణు దేశాయ్ సమర్పించారు.ఈ సందర్భంగా తమ ఇంటికి అతిథిగా వచ్చిన రేణుదేశాయ్‌ను మంత్రి సురేఖ నూతన వస్త్రాలు, పండ్లు, పసుపు కుంకుమలతో సత్కరించారు. మంత్రి సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ ప్రత్యేకంగా తెప్పించిన గొలుసుని రేణు దేశాయ్‌కి మంత్రి అలంకరించారు. కొండా కుటుంబం తనను ఆదరించిన తీరు పట్ల రేణు దేశాయ్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. -
కల్కి మూవీ.. ఇంతలా అరిచి ఎన్నాళ్లయిందో: రేణు దేశాయ్
ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన భారీ బడ్జెట్ చిత్రం కల్కి 2898 ఏడీ. భారీ అంచనాల మధ్య నేడు (జూన్ 27న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ సినిమాను నటి రేణు దేశాయ్ వీక్షించింది. కుమారుడు అకీరా నందన్‌తో కలిసి ప్రసాద్ ఐమ్యాక్స్‌లో మూవీ చూసింది. ఈమేరకు ఓ ఫోటో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. చాలారోజుల తర్వాత ఓ సినిమా చూసి ఇంతలా ఎంజాయ్ చేశాం. నా గొంతు పోయేంతలా అరిచాను. మేము కల్కి మార్నింగ్ షోకి వెళ్లాం.. మీరు కూడా ఫ్యామిలీతో కలిసి వెళ్లండి.. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు అని రాసుకొచ్చింది. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది.(కల్కి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)కాగా కల్కి సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశాపటానీ, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సుమారు రూ.600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి! View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
కర్మ ఎవరినీ వదిలిపెట్టదంటూ వారిపై 'రేణూ దేశాయ్' ఫైర్
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ అభిమానులతో రేణూ దేశాయ్ పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయాన్ని కొన్ని వందల సార్లు వారి చేష్టల గురించి ఆమె బహిరంగంగానే చెప్పారు. అయినా వారిలో ఎలాంటి మార్పులు రాలేదు. కొద్దిరోజుల క్రితం వచ్చిన ఎన్నికల ఫలితాల్లో పవన్ గెలుపొందటంతో ఆయన అభిమానులు రేణూ ఇన్‌స్టా కామెంట్ బాక్స్‌లో అనేక మెసేజ్‌లు చేశారు. తనని దురదృష్టవంతురాలని వారు కామెంట్ చేయడంతో ఆమె చాలా బాధ పడ్డారు. అలాంటి మెసేజ్‌లు తనకు చాలా బాధ కలిగిస్తున్నాయని, అలా పిలవొద్దని చెప్పి చెప్పి అలసిపోతున్నానంటూ రేణు దేశాయ్ అన్నారు. పవన్ కల్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న దగ్గరి నుంచి ఆయన అభిమానులతో ఆమె పెద్ద యుద్ధమే చేస్తున్నారు. గతంలో ఓ దశలో ఈ వ్యవహారం తారస్థాయికి చేరడంతో ఆమె కామెంట్ సెక్షన్ కూడా హైడ్ చేశారు. వారి తాకిడికి తట్టుకోలేకనే ఇలాంటి పనిచేసినట్లు కూడా ఆమె తెలిపారు. ఇంత జరుగుతున్నా కూడా పవన్ కల్యాణ్ తన అభిమానులకు అడ్డుకట్ట వేసేందుకు ఒక సూచన అయినా ఇవ్వకపోవడం బాధాకరం. తాజాగా మరోసారి తన ఇన్స్టాగ్రామ్ కామెంట్ల సెక్షన్‌ను క్లోజ్ చేస్తున్నట్లు రేణూ దేశాయ్ తెలిపారు. ఈ క్రమంలో ఆమె ఇలా చెప్పుకొచ్చారు.కర్మ ఎవరినీ వదలదు.. కామెంట్ సెక్షన్‌కు గుడ్‌బై'ఇప్పటి నుంచి నా ఇన్స్టాగ్రామ్ కామెంట్ సెక్షన్‌ను ఆఫ్ చేస్తున్నాను. ఎందుకంటే నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లలో చెత్త కామెంట్లు పెట్టే మూర్ఖులు, వెధవలకు తిరిగి సమాధానం ఇచ్చే అంత ఓపిక నాకు లేదు. అంతేకాకుండా వాటిని ఎదుర్కొనే అంత భావోద్వేగం నాలో లేదు. అయితే, నేను బాధలో ఉన్నప్పుడు కొన్నేళ్లుగా నాకు తోడుగా ఉన్న వారందరికీ నా ధన్యవాదాలు. నన్ను ద్వేషించేవారు గుర్తుపెట్టుకోండి నేను మీకు ఒకటే చెబుతున్నా.. కర్మ అనేది ఒకటి ఉంది అనే విషయాన్ని మరిచిపోకండి. అది ఎప్పటికీ కామ్‌గా ఉండదు. ఖచ్చితంగా మీ కోసం తిరిగి వస్తుంది.' అని రేణూ దేశాయ్ ఎమోషనల్ పోస్ట్ చేశారు.రేణూ దేశాయ్ ఒక కొటేషన్‌ను కూడా పంచుకున్నారు. 'మీరు చూస్తున్నది అంతా సమస్య కాదని ఏదో ఒకరోజు తెలుసుకుంటారు. అవును, మీరు తప్పు చేస్తున్నారు. ఎందుకంటే మీరు కూడా మనుషులే కదా..! ఆ తప్పుల నుంచి ఎదుగుతాం కదా.. ప్రేమతో మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మీ మనసుల్ని గాయపరిచే అవకాశం ఈ ప్రపంచానికి ఇవ్వకండి.' అంటూ రేణు తెలిపారు.ఆయన వేరే పెళ్లి చేసుకుంటే నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు..?పవన్ కల్యాణ్ కూటమి ద్వారా ఎన్నికల్లో గెలిచారు. ఆపై ఆయనకు డిప్యూటీ సీఎం పదవిని చంద్రబాబు కట్టబెట్టడం కూడా జరిగిపోయింది. దీంతో ఫుల్ జోష్‌లో ఉన్న పవన్ అభిమానులు రేణూ దేశాయ్ మీద మెసేజ్‌లతో ఇలా విరుచుకపడ్డారు. 'మీరు దురదృష్టవంతురాలు మేడమ్' అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. దీనికి రేణూ దేశాయ్ స్పందిస్తూ 'నేను ఎలా దురదృష్టవంతురాలినో చెప్పండి అంటూనే.. నేను ఆయన్ను (పవన్) వదిలేయలేదు.. ఆయనే నన్ను వదిలేశారంటూ' కౌంటర్ ఇచ్చారు. కొన్నేళ్లుగా దురదృష్టవంతురాలు అనే మాట తనను ఎంతగానో బాధపెడుతుందని ఆమె ఇలా చెప్పుకొచ్చారు. 'నా భర్త నన్ను వదిలేసి, వేరే పెళ్లి చేసుకుంటే.. నా తప్పు ఎందుకు అవుతుంది..? కొన్నేళ్లుగా ఇలాంటి కామెంట్లతో యుద్ధమే చేస్తున్నాను. అలాంటి మాటలు విని నాకు విసిగొస్తుంది. నా అదృష్టాన్ని కేవలం ఒక వ్యక్తితో మీరందరూ ఎందుకు ముడిపెడుతున్నారు..? విడాకులు తీసుకున్న వారు ఎవరూ (స్త్రీ, పురుషులు) దురదృష్టవంతులు కాదని తెలుసుకుంటే చాలు.' అని రేణూ దేశాయ్ అన్నారు. ఆస్క్రీన్ షాట్లను కూడా ఆమె పంచుకున్నారు. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
పవన్ ఫ్యాన్ కి చెంప చెళ్లుమనిపించిన రేణు
-
వవన్ కల్యాణ్ అభిమానిపై రేణు దేశాయ్ ఫైర్
పవన్ కల్యాణ్‌కు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది అభిమానులున్నారు. కానీ వారిలో ఎక్కువమంది శాడిస్టుల్లా ప్రవర్తిస్తుంటారని సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుందని చాలామంది అంటారు. పవనిజం ముసుగులో ఇతరులపై భూతులతో దండయాత్ర చేస్తారని కూడా తెలుపుతుంటారు. బ్రో సినిమా విడుదల సమయంలో మదనపల్లిలో ఒక సంఘటన గురించి చూస్తే.. బ్రో మూవీ ఎలా ఉందని కొందరు మీడియా వారు పవన్ అభిమానని అడిగిన పాపానికి అతడు బ్లేడ్‌తో చేయి కోసుకున్నాడు. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు చెబుతూ.. పవన్ అభిమానుల్లో కొందరు శాడిస్టులు నిజంగానే ఉన్నారని బహిరంగంగానే నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.సోషల్ మీడియాలో రేణు దేశాయ్, పూనమ్ కౌర్ ఇద్దరూ ఏ పోస్టు పెట్టినా సరే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అందులోకి దూరిపోతుంటారు. వాళ్లు ఎలాంటి పోస్ట్ పెట్టినా సరే తమ నాయకుడి గురించే అంటూ భుజాలు తడుముకుంటారు. ఆపై వెంటనే ట్రోలింగ్‌కు దిగిపోతుంటారు. ఒకవేళ పవన్‌కు పాజిటివ్‌గా పోస్ట్ పెడితే ఆ క్రెడిట్ అంతా పవన్‌కు ఇచ్చేస్తారు. తాజాగా ఇలాంటి సంఘటన గురించే రేణు దేశాయ్ ఒక పోస్ట్ పెట్టింది.ఇటీవల రేణు దేశాయ్ పలు యానిమల్స్ ఎన్జీవోలకు సహకారం అందిస్తుంది. కుక్కలు,పిల్లుల వంటి జంతువుల రక్షణ కోసం ప్రతి నెల తను కొంత డబ్బు సాయం చేస్తుంది. అందుకు సంబంధించి ఆమె తన ఇన్‌స్టాలో ఒక మెసేజ్ చేసింది. రేణు చేస్తున్న సాయాన్ని గుర్తించలేని పవన్ అభిమాని ఇలా కామెంట్ చేశాడు. పవన్ కల్యాణ్ అన్నలా గోల్డెన్ హార్ట్ అని అన్నాడు. దీంతో రేణూ దేశాయ్‌కి కోపం వచ్చినట్లు ఉంది. అతనికి కరెక్ట్ సమాధానంతో ఇచ్చిపడేసింది.ప్రతిసారి నేను పెట్టే పోస్టుల కింద నా ఎక్స్ హస్బెండ్తో నన్ను ఎందుకు పోలుస్తున్నారు. ఇలాంటి వాళ్లను చాలామందిని నేను ఇప్పటికే బ్లాక్ చేశాను. పదేళ్ల వయస్సు నుంచి నేను జంతు సంరక్షణ కోసం నా వంతు సాయం చేస్తున్నాను. జంతువులపై నేను చూపించే ప్రేమ, వాత్సల్యం ఆయనకు లేవు. నా మాజీ భర్త ప్రస్తావన తీసుకొస్తూ కామెంట్ చేయకండి. వ్యక్తిగతంగా నా మాజీ భర్తతో ఎలాంటి సమస్య లేదు. నన్ను నన్నుగా చూడండి. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక నుంచి నా పోస్టుల్లో, నేను చేసే పనుల్లో ఆయన్ను పోల్చకండి. జంతువుల మీద నాకున్నంత కేర్ గానీ, ప్రేమ గానీ ఆయనకు ఉండదు. అతను నాలాగా యానిమల్స్ పై కేరింగ్ చూపించడు.' అని రేణు చెప్పింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
గతేడాది రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన నటి రేణు దేశాయ్. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించి అభిమానులను మెప్పించారు. గుంటూరులోని స్టువర్టుపురం గజదొంగ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా రేణు దేశాయ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. అసలేం జరిగిందో తెలుసుకుందాం.రేణు దేశాయ్ తన ఇన్‌స్టాలో క్యూఆర్ కోడ్‌ను షేర్ చేస్తూ విరాళాలు కావాలంటూ అభ్యర్థించింది. అయితే ఇంత త్వరగా స్పందించి విరాళం అందించి.. మానవత్వం చూపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది. నా వంతుగా నేను కూడా సాయం చేస్తున్నప్పటికీ.. మిగిలిన అమౌంట్ కోసం నా ఫాలోవర్స్‌ను అడుగున్నానని రాసుకొచ్చింది. ప్రతిసారీ నా డబ్బును ఇవ్వలేను.. ఎందుకంటే నా దగ్గర కూడా కొంత మాత్రమే డబ్బులు మిగిలి ఉన్నాయని పేర్కొంది. అయితే ఎవరైనా ఆమె అకౌంట్‌ను హ్యాక్ చేసి డబ్బులు డిమాండ్ చేశారా? అని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై రేణుదేశాయ్ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఓ వీడియోను పంచుకుంది.రేణు దేశాయ్ మాట్లాడుతూ.. 'ఫుడ్ పాయిజన్ తో కొద్ది రోజులుగా నా ఆరోగ్యం బాగాలేదు. అందుకే వీడియో చేయలేదు. అయితే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టింది నేనే. నా అకౌంట్‌ను ఎవరూ హ్యాక్ చేయలేదు. నేను కూడా రెగ్యులర్‌గా డొనేట్ చేస్తూనే ఉంటాను. కానీ అప్పుడప్పుడు నాకు కూడా లిమిట్ ఉంటుంది. డొనేషన్స్‌కి నా డబ్బులంతా ఇచ్చేస్తే నాకోసం.. నా పిల్లల కోసం కావాలి కదా. నా వరకు సాయం చేశాక.. ఏదైనా బ్యాలెన్స్ కావాలంటే ఫాలోవర్స్‌ను అడుగుతున్నా. యానిమల్స్, చిన్నపిల్లల కోసం కూడా నేను విరాళాలు ఇస్తున్నా. అదే నా ఫైనల్ టార్గెట్ కూడా. త్వరలోనే వాటికోసం ఓ షెల్టర్ కూడా నిర్మిస్తాను. అప్పుడు నేనే మిమ్మల్ని అధికారికంగా విరాళాలు సేకరిస్తా. నా రిక్సెస్ట్‌కు స్పందించి రూ.3500 పంపించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ' అంటూ పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
KSR Live Show: పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై రేణు దేశాయ్ కామెంట్స్..
-
అంకుల్.. నా పేరెందుకు స్మరిస్తున్నారంటూ రేణు దేశాయ్ ఫైర్
సినీ నటి రేణు దేశాయ్ సుదీర్ఘ విరామం తర్వాత 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రం ద్వారా ఇటీవలే వెండితెరపై కనిపించారు. ఈ సినిమాలో ఒక కీలక పాత్రతో ఆమె మెప్పించారు. చాలాకాలం తర్వాత మళ్లీ మేకప్ వేసుకుని ప్రేక్షకులను పలకరించారు. ఆమె రీ ఎంట్రీతో పాటు మరో పెళ్లి అంశంపై ఓ సీనియర్ జర్నలిస్ట్ ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ మధ్య వైరల్ అయ్యాయి. ఆమె వ్యక్తిగత విషయాలపైనా ఆయన చేసిన కామెంట్స్ క్లిప్పింగ్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఆయనపై వ్యంగ్యాస్త్రాలు సందించారు రేణు. సమాజంలో మహిళలను తక్కువగా చూడడం తగదని ఆమె సూచించారు. ఇదే వీడియోను షేర్ చేస్తూ, ఆ జర్నలిస్టును ఉద్దేశించి రేణు దేశాయ్ ఇలా అన్నారు. 'నా పేరు పదే పదే స్మరించి యూట్యూబ్‌లో కొన్ని వ్యూస్ సంపాదిస్తున్నారు. ఇలా నా పేరు ద్వారా మీరు డబ్బులు సంపాదించుకుంటున్నందుకు నాకు కూడా సంతోషమే.. కానీ ఇలా కుర్చీలో కూర్చొని సినీ నటులపై నాలుగు గాసిప్స్ చెప్పడం కంటే మీ టాలెంట్‌తో డబ్బు సంపాదిస్తే బాగుండేది. మీకు ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా మహిళల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు. మీ జీవిత అనుభం నేర్పింది ఇదేనా.. ఇలా మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తోంది. నా పేరును వదిలేసి దైవ నామస్మరణ చేయండి. నేను మిమ్మల్ని ఎక్కడా కలవలేదు. కాబట్టి నా గురించి నీకు ఏం తెలుసు..? మహిళలను దుర్గాదేవిగా, కాళీమాతగా చూడటం మన సాంస్కృతిక ప్రాముఖ్యత అని మరిచిపోవద్దు. మగవారి పేరు, ప్రోత్సాహం లేకుండా మహిళలు ఏం చేయలేరని మీలాంటి వారు మాట్లాడుతుంటారు.' అని రేణు తెలిపింది. ఈ వ్యాఖ్యలు కేవలం తన గురించి మాత్రమే కాదని, సమాజంలో మహిళలపై కొందరు మగవారికి ఎలాంటి అభిప్రాయం ఉందో తెలిపేందుకే ఈ పోస్ట్ చేశానని రేణు దేశాయ్ తెలిపారు. చివరిగా రేణు ఈ వ్యాఖ్యలను కూడా జోడించింది. 'ఈ పోస్ట్‌కి నా మాజీ భర్తకు ఎలాంటి సంబంధం లేదు. ఇది మా కుమార్తెలు, మనవరాలు మంచి భవిష్యత్తు కోసం చర్చను సృష్టించడం కోసం మాత్రమే.' అని తెలిపారు. రేణు దేశాయ్ మరో పెళ్లి అంశాన్ని సదరు జర్నలిస్ట్ తప్పుబడుతూ వ్యాఖ్యలు చేయడమే కాకుండా మగవారు అయితే మరో పెళ్లి చేసుకోవచ్చని తెలిపాడు. అదే సమయంలో స్త్రీల గురించి తక్కువగా చేసి మాట్లాడటం ఆమె తప్పుబట్టింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
'అనుకోకుండా ప్రేమలో పడిపోయా'.. రేణు దేశాయ్ పోస్ట్ వైరల్!
టాలీవు డ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రం యానిమల్. డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ షేక్ చేస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువగా వసూళ్లు సాధించింది. దేశవ్యాప్తంగా ఈ చిత్రంపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా నటించిన ఈ సినిమా మొదటి రోజే హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ చిత్రంపై రాం గోపాల్ వర్మ ఏకంగా నాలుగు పేజీల రివ్యూను రిలీజ్ చేశారు. దీంతో ఈ మూవీ వీకెండ్ తర్వాత వసూళ్ల పరంగా ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ మూవీ చూసిన రేణ్ దేశాయ్ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇంతకీ ఆమె ఏమన్నారో తెలుసుకుందాం. రేణ్ దేశాయ్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఎట్టకేలకు సందీప్ రెడ్డి యానిమల్ సినిమా చూడాల్సి వచ్చింది. సినిమా చూశా నిస్సందేహంగా ప్రేమలో పడ్డాను. ఈ చిత్రంలో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. మీరు ఏదైనా ప్రత్యేకమైన అనుభూతిని పొందాలనుకుంటే ఈ సినిమాను కచ్చితంగా థియేటర్లో చూడటం మిస్ అవ్వకండి. ' అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. చాలా ఏళ్ల తర్వాత రేణు దేశాయ్ రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
నాకు పుట్టుకతోనే సమస్య ఉంది.. కానీ తెలియలేదు: రేణు దేశాయ్
రేణు దేశాయ్ ఇటీవలే టైగర్ నాగేశ్వరరావు చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు. హేమలత లవణం పాత్రలో సినీ ప్రేక్షకులను అలరించారు. చాలా ఏళ్ల తర్వాత సినిమాల్లో కనిపించడంతో ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. రవితేజ, నుపుర్ సనన్ జంటగా ఈ చిత్రాన్ని వంశీకృష్ణ నాయుడు తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 20న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే ఈ సినిమాతో రీ ఎంట్రీ రేణు దేశాయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. తన కెరీర్, ఆరోగ్యం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. (ఇది చదవండి: రన్ టైమ్ తగ్గించినా కలిసిరాలేదు.. టైగర్ నాగేశ్వరరావు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?) రేణు దేశాయ్ మాట్లాడుతూ.. 'లాక్ డౌన్ సమయంలో నాకు హెల్త్ సమస్యలు వచ్చాయి. నాకు గుండెకు సంబంధించి ప్రాబ్లమ్ ఉంది. ఈ సమస్య నాకు పుట్టినప్పటి నుంచే ఉంది. కాబట్టి దాన్ని మనం మార్చలేం. ఈ సమస్య ఉందని నాకు ముందే తెలియదు. కానీ చిన్న చిన్న టెస్టులు, సిటీ స్కాన్ చేశాక తెలిసింది. ఈ సమస్య మా నానమ్మకు ఉండేది. అందువల్లే 47 ఏళ్లకే ఆమె చనిపోయారు. నాకు డయాగ్నోసిస్ కూడా అయింది.' అని అన్నారు. తన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ.. 'నేను ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటా. డైలీ యోగా చేస్తా. బైపాస్ సర్జరీ అలాంటిదేం జరగలేదు. నాకు హార్ట్ రేట్ కాస్తా ఎక్కువగానే ఉంటుంది. అందుకే మందులు వాడుతున్నా. వాటివల్లే కాస్తా లావు కూడా అయ్యా. రెగ్యులర్‌గా మెడిసిన్ తీసుకోవాల్సిందే తప్పనిసరి. రన్నింగ్ చేయడం, స్టెప్స్ ఎక్కడం లాంటివి చేయకూడదు. మా నానమ్మ 1974లో నాన్న పెళ్లికి ముందే చనిపోయారు. నాన్న కూడా చిన్న వయసులో హార్ట్ ఎటాక్తోనే చనిపోయారు. చాలా మందికి ఇలాంటి సమస్య ఉంటుంది. నాకైతే సీరియస్ సమస్య అయితే లేదు కానీ.. కొంత అయితే ఉంది.' అని చెప్పుకొచ్చింది. టైగర్ నాగేశ్వరరావు సినిమాతో మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. కాగా.. ఇటీవలే రెండేళ్ల తర్వాత రెండో పెళ్లి చేసుకునే ఆలోచన ఉందని తెలిపింది రేణు దేశాయ్. (ఇది చదవండి: కనీసం రూ.100 అయినా ఇవ్వండి.. రేణు దేశాయ్ పోస్ట్ వైరల్) -
కనీసం రూ.100 అయినా ఇవ్వండి.. రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
‘బద్రి’చిత్రంతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం అయింది నటి రేణూ దేశాయ్. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత జానీ(2003) చిత్రంలో నటించి, పవన్‌తో ప్రేమలో పడింది. కొన్నాళ్లు డేటింగ్ చేసిన తర్వాత 2009లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. 2012లో ఇద్దరు విడిపోయారు. ప్రస్తుతం కొడుకు అకీరా, కూతురు ఆద్యతో కలిసి ఉంటుంది రేణూ. పిల్లల కోసం సినిమాలను దూరం పెట్టింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ‘టైగర్ నాగేశ్వరరావు’తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆమె సంఘ సంస్కర్త హేమలత లవణం పాత్రను పోషించి, తనదైన నటనతో మెప్పించింది. మంచి పాత్రలు లభిస్తే..ఇకపై సినిమాల్లో నటిస్తానని కూడా చెప్పింది. దీంతో టాలీవుడ్‌కు చెందిన పలువురు దర్శకులు రేణూ దేశాయ్‌కి కథలు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా సినిమాల పరంగా కాస్త దూరమైనా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఎప్పుడు అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది రేణూ దేశాయ్. మంచి పనులను చేయడానికే సోషల్ మీడియాను వాడుతుంటారు. తాజాగా రేణూ తన ఇన్‌స్టాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. నా వంతుగా రూ.30 వేలు ఇచ్చా రేణూ దేశాయ్‌కి పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టం. తను పెట్స్‌తో పాటు పిల్లులను కూడా పెంచుకుంటుంది. వాటికి ఆరోగ్య సమస్యలు వస్తే.. తట్టుకోలేదు. అంతేకాదు పెంపుడు జంతువుల కోసం విరాళాలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ మూడు కుక్కలకు ఆపరేషన్ చేయించేందుకు ఓ సంస్థ విరాళాలు అడుగుతోంది. ఆపరేషన్‌కి మొత్తం రూ.55 వేల వరకు ఖర్చు అవుతుందట. ఈ విషయం రేణూ దేశాయ్ దృష్టికి వెళ్లింది. దీంతో తన వంతుగా రూ.30 వేలు విరాళం ఇచ్చి.. మిగతా డబ్బును ఎవరైనా పంపించగలరంటూ.. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ పెట్టింది. ‘నేను రూ.30 వేలు సర్దాను. దయచేసిన మిగతా డబ్బును ఎవరైనా పంపించగలరు. కనీసం ఒక్కొక్కరు రూ. 100 పంపించినా చాలు’ అని రేణూ దేశాయ్ తన ఫాలోవర్స్‌కి విజ్ఞప్తి చేసింది. -
వరుణ్-లావణ్య పెళ్లి.. రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మెగా ఫ్యామిలీ పెళ్లి బాజాలు మోగే టైమ్ వచ్చేసింది. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్.. లావణ్య త్రిపాఠితో ఏడడుగులు వేయనున్నాడు. ఇప్పటికే కుటుంబమంతా ఇటలీకి వెళ్లిపోయారు. ఆల్రెడీ సందడి కూడా మొదలైపోయింది. ఇప్పుడు ఈ పెళ్లిపై పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ వేడుకకు వెళ్లట్లేదని చెబుతూనే, దానికి కారణాన్ని కూడా బయటపెట్టింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 32 సినిమాలు రిలీజ్) పెళ్లి సంగతేంటి? దాదాపు ఆరేళ్ల పాటు ప్రేమించుకున్న వరుణ్-లావణ్య.. పెద్దల్ని ఒప్పించి ఈ జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆగస్టులో పెళ్లి ఉంటుందన్నారు. కానీ అది నవంబరుకి వాయిదా పడింది. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా ఈ వేడుక జరగనుంది. ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులు ఇటలీ వెళ్లిపోయారు. అక్కడి ఫొటోలు పోస్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. నవంబరు 1న వరుణ్-లావణ్య పెళ్లి జరగనుంది. రేణు దేశాయ్ కామెంట్స్ ఈ పెళ్లికి హాజరయ్యేందుకు పవన్.. తన భార్య అన్నా లెజనోవాతో కలిసి ఇటలీ వెళ్లిపోయాడు. అదే టైంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో వరుణ్ పెళ్లి గురించి రేణు దేశాయ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'నిహారిక పెళ్లికి కూడా నేను వెళ్లలేదు. పిల్లల్ని పంపించాను. వరుణ్ తేజ్ నా కళ్ల ముందే పెరిగాడు. అతడికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అయితే వరుణ్ పెళ్లికి వెళ్తే అక్కడ అందరూ అన్‌కంఫర్టబుల్‌గా ఫీలవుతారు. అకీరా, ఆద్య కూడా వరుణ్ పెళ్లికి వెళ్లట్లేదు' అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: Bigg Boss 7: బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య గొడవ.. ఈసారి నామినేషన్స్‌లో ఉన్నదెవరంటే?) -
పవన్ కల్యాణ్ సీఎం కావాలని నేను ఎప్పటికీ కోరుకోను ఎందుకంటే: రేణు దేశాయ్
రవితేజ్ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హేమలతా లవణం పాత్రలో రేణూ దేశాయ్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. ఆ పాత్రలో ఎంతో హుందాగా ఆమె కనిపించారు. సినిమాలో ఆమె కొద్దిసేపు మాత్రమే కనిపించినా టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి ప్లస్ అయ్యారనే చెప్పవచ్చు. ఆ పాత్రకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఆమె పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. పవన్ సీఎం కావాలని కోరుకుంటున్నారా..? అనే ప్రశ్నకు రేణు ఇలా చెప్పారు. 'ఆయన గురించి ఈ క్వశ్చనే వద్దు (నవ్వుతూ) అన్నారు. ఒక పొలిటీషియన్‌గా ఈ సొసైటికి అవసరం అని మాత్రమే గతంలో ఒక వీడియో ద్వారా నేను చెప్పాను. అది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఆయన సీఎం అవుతారా లేదా అనేది నేను కోరుకోను.. దేవుడు ఉన్నాడు.. ఆ విషయం ఆయనే డిసైడ్ చేస్తాడు. కనీసం ఒక కామన్ వ్యక్తిగా కూడా ఆయనవైపు స్టాండ్ తీసుకోను. (ఇదీ చదవండి: ఓటీటీలో 'స్కంద' స్ట్రీమింగ్.. ఎందులో అంటే) పలాన వ్యక్తిని సపోర్ట్ చేయండి అని నేను ఎలాంటి ఎన్నికల ప్రచారం కూడా చేయను. అది నాకు అవసరం లేని విషయం. పవన్ గురించి నేను ప్రతిసారి నిజాలే చెప్పాను. నా విడాకుల సమయంలో నేను ఏమైతే చెప్పానో అవన్నీ నిజాలే.. కొద్దిరోజుల క్రితం పవన్ గురించి చెప్పిన మాటల్లో కూడా నిజమే ఉంది. కావాలంటే లైవ్ డిటెక్టర్ పెట్టి చెక్ చేసుకోవచ్చు. అని రేణు చెప్పారు. నేను మళ్లీ పెళ్లి చేసుకుంటా కానీ.. జీవితంలో సింగిల్ మదర్‌గా కొనసాగడం చాలా కష్టం అంటూ రేణు దేశాయ్ ఇలా చెప్పారు. 'నాకు పెద్దవాళ్ల సపోర్టు కూడా లేదు. నేను సింగిల్‌గానే నా పిల్లలను పోషిస్తున్నాను. ప్రస్తుతం నా ఆరోగ్యం కూడా అంతగా సహకరించడం లేదు. త్వరలో నేను కచ్చితంగా మరో పెళ్లి చేసుకుంటాను. అందులో ఎలాంటి సందేహం లేదు. అది వంద శాతం జరుగుతుంది. కానీ నేను ఎక్కువగా ఆధ్యా గురించే ఆలోచిస్తున్నాను. అందుకే ఆ విషయంలో కొంత టైమ్ తీసుకుంటున్నాను. ముందుగా నా బిడ్డలను సరైన క్రమంలో పెంచాలి.. ఆ విధంగానే వారిని తయారు చేస్తున్నాను. (ఇదీ చదవండి: వశిష్ట సినిమా విషయంలో షాకింగ్ న్యూస్ చెప్పిన చిరంజీవి) నా బిడ్డలు ఎప్పటికీ తప్పు చేయరు. ఒకవేళ వాళ్లు తప్పు చేస్తే నన్నే తప్పుపట్టండి. ఆ అవకాశం వాళ్లు కూడా ఎవరికీ ఇవ్వరు. ఒక అబ్బాయి సమాజంలో ఎలా ఉండాలో అకీరాకు నేర్పించాను. అలాగే ఆధ్యాకు కూడా పలు విషయాలు ఎప్పుడూ చెబుతూనే పెంచాను. భవిష్యత్‌లో ఆధ్యా ఒకరికి భార్య అవుతుంది, మరోకరికి తల్లి అవుతుంది. మరోక కుటుంబంలో కోడలిగా అడుగుపెడుతుంది. వారందరికీ మంచి పేరు తీసుకురావాలి. అలాంటి దారిలోనే నా పిల్లలను పెంచాను.' అని చెప్పారు. ఫ్యాన్స్ ఇస్తున్న వార్నింగ్స్ టైగర్ నాగేశ్వరరావు చిత్రం వల్ల నేను ఈ మధ్య పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నాను. దీంతో పవన్ గారి ఫ్యాన్స్ నా ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చి నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు. పవన్ గురించి మాట్లాడకండి అంటూ వార్న్ చేస్తున్నారు. కొంతమంది పనికట్టుకుని మరీ ఇలాంటి పనులు చేస్తున్నారు. నాకు నచ్చినట్లు ఉంటాను వాళ్లు ఎవరు నన్ను ప్రశ్నించడానికి. పవన్ గురించి నాకు ఇష్టం ఉంటేనే మాట్లాడుతాను లేదంటే లేదు. వాళ్లు ఎవరు నన్ను కమాండ్ చేయడానికి. అని పవన్ ఫ్యాన్స్‌పై ఆమె ఫైర్ అయ్యారు. గతంలో కూడా రేణు రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించిన సమయంలో ఆయన ఫ్యాన్స్ చేసిన రచ్చ ఎలాంటిదో రేణూనే చెప్పింది. రెండో పెళ్లి ఎందుకని బూతులతో ఆమెపై తెగబడ్డారు. ఆమె పెళ్లి చేసుకుంటే పవన్ పరువు ఏం కావాలని ఫ్యాన్స్ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. -
Tiger Nageswara Rao Review: ‘టైగర్ నాగేశ్వరరావు’మూవీ రివ్యూ
టైటిల్: టైగర్ నాగేశ్వరరావు నటీనటులు: రవితేజ,నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు నిర్మాణసంస్థ:అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాత: అభిషేక్ అగర్వాల్ దర్శకత్వం: వంశీ సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్ సినిమాటోగ్రఫీ: ఆర్ మదీ విడుదల తేది: అక్టోబర్ 20, 2023 ప్రముఖ రాజకీయ నాయకులు లేదా క్రీడ, సినీ రంగాలకు చెందిన వారి బయోపిక్‌ని తెరకెక్కించడం సాధారణం. కానీ ఓ దొంగ జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను తెరకెక్కించడం ఇంతవరకు చూడలేదు. దర్శకుడు వంశీ ఆ పని చేశాడు. అదే ‘టైగర్ నాగేశ్వరరావు’. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం నేడు(అక్టోబర్ 20) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా చేయడంతో ‘టైగర్ నాగేశ్వరరావు’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ఈ చిత్రం ఏ మేరకు అందుకుందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. స్టువర్టుపురానికి చెందిన టైగర్ నాగేశ్వరరావు అలియాస్ నాగి(రవితేజ) ఓ గజదొంగ. పోలీసులకు ముందుగా సమాచారం అందించి దొంగతనం చేయడం అతని స్పెషాలిటి. తన గ్యాంగ్‌తో కలిసి బ్యాంకు దోపిడీలకు పాల్పడతుంటాడు. స్థానిక ఎమ్మెల్యే ఎలమంద(హరీష్ పేరడి), అతని తమ్ముడు కాశీ స్టువర్టుపురం దొంగలపై పెత్తనం చెలాయిస్తుంటారు. ఆ ప్రాంతం ఏం దొంగతనం జరిగినా.. ఎలమందకు కమీషన్ వెళ్లాల్సిందే. నాగి మాత్రం వారిని పట్టించుకోకుండా..తన గ్యాంగ్‌తో కలిసి దొంగతనాలకు పాల్పడుతుంటాడు. ఒకనొక దశలో ఏకంగా దేశ ప్రధానమంత్రి ఇంట్లో దోపిడికి ప్లాన్ చేస్తాడు. ఆ విషయాన్ని ముందే ప్రధాని భద్రతా సిబ్బంది తెలియజేస్తాడు. అసలు టైగర్ నాగేశ్వరరావు ప్రధాని ఇంట్లో దొంగతనం చేయడానికి గల కారణం ఏంటి? ప్రధాని ఇంటి నుంచి ఏం దొంగతనం చేశాడు? ఆ దొంగతనం తర్వాత నాగి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది. ఎనిమిదేళ్ల వయసులోనే నాగేశ్వరరావు దొంగగా ఎందుకు మారాల్సి వచ్చింది? దొంతగతం చేసి సంపాదించిన డబ్బంతా ఏం చేశాడు? నాగేశ్వరరావు కాస్త టైగర్ నాగేశ్వరరావుగా ఎలా మారాడు? సీఐ మౌళి(జిషు సేన్ గుప్తా)తో నాగికి ఉన్న వైర్యం ఏంటి? ఎమ్మెల్యే ఎలమంద, అతని తమ్ముడు కాశీ చేసే అరచకాలను నాగి ఎలా తిప్పికొట్టాడు. ప్రేమించిన అమ్మాయి సారా(నూపుర్ సనన్)ఎలా చనిపోయింది? నాగి జీవితంపై సంఘ సంస్కర్త హేమలతా లవణం ప్రభావం ఎలా ఉంది? చివరకు నాగేశ్వరరావు ఎలా చనిపోయాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ‘కొన్ని చరిత్రలు నెత్తుటి సిరాతో రాస్తారు..మరికొన్ని చరిత్రలు కన్నీటి సిరాతో రాస్తారు.. నెత్తురు, కన్నీటి సిరాతో రాసిన చరిత్రే ‘టైగర్ నాగేశ్వరరావు’’అని సినిమా ప్రారంభానికి ముందు ఓ కార్డు వేశారు. సినిమా మొత్తం చూశాక మనకు అదే ఫిలింగ్ కలుగుతుంది. టైగర్ నాగేశ్వరరావు ఓ దొంగ అని.. పోలీసులకు ముందే సమాచారం ఇచ్చి దొంగతనం చేసేవాడు అని కొంతమంది తెలుసు. అసలు అతను దొంగగా ఎందుకు మారాల్సి వచ్చింది? దోచిన డబ్బంతా ఏం చేశాడు? ఎలా చనిపోయాడు అనేది చాలా మందికి తెలియదు. ఈ చిత్రంలో అదే చూపించారు. వాస్తవానికి ఇది బయోపిక్ అయినా.. చాలా చోట్ల సినిమాటిక్ లిబర్టీనీ తీసుకున్నాడు దర్శకుడు. అలాగే అందరిలాగే నాగేశ్వరరావులో కూడా చెడు, మంచి రెండూ ఉన్నాయి. కానీ దర్శకుడు వంశి మాత్రం రెండో కోణాన్నే తెరపై చూపించాడు. టైగర్ చేసే ప్రతీ దొంగతనం వెనుక ఓ మంచి కారణం ఉందనేది చూపించాడు. ఇది ఓ గజదొంగ బయోపిక్ కాబట్టి దొంగతనాలు తప్పా ఇంకేం చూసిస్తాడులే అనుకోవచ్చు. కానీ స్టువర్టుపురం ప్రజలు ఎందుకు దొంగలుగా మారాల్సి వచ్చింది? రాజకీయ నాయకులు,పోలీసులు అధికారుల చేతుల్లో వారి జీవితాలు ఎలా నలిగిపోయాయి అనేది చాలా ఎమోషనల్‌గా చూపించారు. ఐబీ ఆఫీసర్ రాఘవేంద్ర రాజ్‌పుత్(అనుపమ్ ఖేర్)కు స్టువర్టుపురం ఏరియాలో పని చేసిన పోలీసు అధికారి విశ్వనాథ్ శాస్త్రీ(మురళీ శర్మ).. టైగర్ నాగేశ్వరరావు గురించి చెప్పే సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. రాజమండ్రి బ్రిడ్జ్‌పై ట్రైన్ దోపిడీ సీన్‌తో హీరో ఎంట్రీ ఉంటుంది. ఆ దొంగతనం సీన్ అయితే అదిరిపోతుంది. ఆ తర్వాత టైగర్ నాగేశ్వరావు బాల్యం, స్టువర్ట్పురం దొంగల గురించి తెలుపుతూ సన్నివేశాలు అల్లారు. సారాతో ప్రేమాయణం ఎపిసోడ్ అంతగా ఆకట్టుకోదు కానీ ఆమె చనిపోయే సన్నివేశం అయితే ఎమోషనల్‌గా ఉంటుంది. ఇంటర్వెల్ సీన్ అదిరిపోతుంది. హీరో జైలు నుంచి తప్పించుకొని వచ్చిన తర్వాత వచ్చే యాక్షన్ సీన్స్ గూస్బంప్స్ తెప్పిస్తాయి. సెకండాఫ్‌లో టైగర్ మరదలు మణితో వచ్చే సీన్స్ కూడా సాగదీతగా అనిపిస్తాయి. హేమలత లవణం ఎంట్రీ తర్వాత కథ ఫాస్ట్‌గా ముందుకు సాగుతుంది. క్లైమాక్స్‌కి ముందు రివీల్ చేసే కొన్ని ట్విస్టులు టైగర్‌పై మరింత ప్రేమను కలిగించేలా చేస్తాయి. ఈ విషయంలో స్క్రీన్‌ప్లేతో మాయ చేశాడు దర్శకుడు. కొన్ని సీన్లు పుష్ప సినిమాను గుర్తు చేస్తాయి. సినిమా నిడివి కూడా కొంచెం ఇబ్బందికి గురి చేస్తుంది. ఎవరెలా చేశారంటే... టైగర్ నాగేశ్వరరావు పాత్రలో రవితేజ ఒదిగిపోయాడు.యాక్షన్ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ అద్భుతంగా నటించాడు. తెరపై కొత్త రవితేజను చూస్తాం. అయితే అతన్ని యంగ్‌గా చూపించేందుకు వాడిన గ్రాఫిక్స్ ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. టైగర్ ప్రేమించిన అమ్మాయి సారా పాత్రకి నూపుర్ సనన్, మరదలు మణి పాత్రకి గాయత్రి భరద్వాజ్ న్యాయం చేశారు. తెరపై వీరిద్దరి నిడివి తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించారు. ఇక ఎమ్మెల్యే ఎలమంద పాత్రలో హరీష్ పేరడ ఒదిగిపోయాడు. ఒక సంఘ సంస్కర్త హేమలత లవణం పాత్రకి రేణూ దేశాయ్ న్యాయం చేసింది. ఆమె పాత్ర సెకండాఫ్‌లో వస్తుంది. నిడివి తక్కువే అయినా.. గుర్తిండిపోయే పాత్రలో నటించింది. స్టువర్ట్పురం గ్రామ వాసి, దొంగలకు కోచింగ్ ఇచ్చే వ్యక్తి గజ్జల ప్రసాద్‌గా నాజర్ మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించాడు. ఐబీ ఆఫీసర్ రాఘవేంద్ర రాజ్‌పుత్, సీఐ మౌళిగా జిషు సేన్ గుప్తాతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. జీవీ ప్రకాశ్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. అయితే పాటలు మాత్రం సాఫీగా సాగుతున్న కథకి అడ్డంకిగా అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
రేణు దేశాయ్ కూతురు ఆధ్యాని చూశారా (ఫొటోలు)
-
మహేశ్ బాబు సినిమా వదులుకున్నా.. ఆ నిజం చెప్తే గొడవలే: రేణు దేశాయ్
మాస్ మహరాజా రవితేజ నటించిన చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు' అక్టోబర్ 20న విడుదల అయ్యేందుకు రెడీగా ఉంది. 1970 ప్రాంతంలో స్టూవర్టుపురంలో పేరు మోసిన గజదొంగ అయన ‘టైగర్ నాగేశ్వరరావు’ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సుమారు 18 ఏళ్ల విరామం తర్వాత వెండితెరపై రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఆమె గుర్రం జాషువా కుమార్తె, సామాజికవేత్త ‘హేమలత లవణం’గా కనిపించనున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మహేశ్ బాబు సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు ఆమె పంచుకున్నారు. (ఇదీ చదవండి: ఆ ఆత్మహత్యతో పెళ్లికి దూరంగా నిత్యా మేనన్.. నటుడి కామెంట్లు) మహేశ్‌బాబు- పరుశురామ్ కాంబోలో వచ్చిన 'సర్కారు వారి పాట' సినిమాలో తనకు నటించే ఛాన్స్ వచ్చిందని రేణు దేశాయ్ తెలిపారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయానని ఆమె తెలిపారు. కాంట్రవర్సీని దృష్టిలో ఉంచుకుని ఆ విషయాలను ఇప్పుడు చెప్పలేకపోతున్నానని ఆమె ఇలా తెలిపారు. 'మహేశ్ బాబు సూపర్ హిట్ సినిమా 'సర్కారు వారి పాట' సినిమాలో నాకు అవకాశం వచ్చింది. అందులో నదియా పోసించిన బ్యాంక్ ఆఫీసర్ పాత్ర కోసం మొదట నన్ను సంప్రదించారు. అందులో నటించాలని నాకు కూడా ఆసక్తి ఉంది. అందుకు నేను కూడా ఓకే చెప్పాను. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఎందుకు సెట్ కాలేదో అనే కారణాలను మాత్రం నేను ఇప్పుడు చెప్పలేను. ఇప్పుడు చెప్పడం వల్ల అనవసరంగా కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది. నిజం ఏమిటో చెప్పాలని నాకు కూడా అనిపిస్తుంది.. కానీ మళ్లీ ఎన్ని కాంట్రవర్సీలు ఎదుర్కొవాల్సి వస్తుందోనని కామ్‌గా ఉండటమే బెటర్.' అని రేణు తెలిపారు. -
పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ని అందుకే పెళ్లి చేసుకున్నాడు..!
-
వివాహ బంధంపై నమ్మకముంది, రెండో పెళ్లి చేసుకుంటా: రేణు దేశాయ్
సినీనటి రేణుదేశాయ్ ఆ మధ్య రెండో పెళ్లికి సిద్ధమైంది. ఎంగేజ్మెంట్ కూడా చేసుకోగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరలయ్యాయి. ఇక మూడు ముళ్లు మెడలో పడటమే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో పెళ్లి రద్దు చేసుకుని షాకిచ్చింది. తాజాగా ఆమె తను రెండో పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడానికి గల కారణాలను వెల్లడించింది. వారి అంగీకారంతోనే ఎంగేజ్మెంట్ 'నా వ్యక్తిగత విషయాల గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్నాను. నా గురించి తప్పు పట్టకూడదు కాబట్టి క్లారిటీ ఇస్తున్నాను. కుటుంబీకులు, స్నేహితుల అంగీకారంతోనే నిశ్చితార్థం జరిగింది. కానీ పిల్లలున్నారు, వాళ్లకు తోడుగా ఉండాలి.. నువ్వెలా ఉంటావు? అదీ ఇదీ అని ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అన్నారు. అప్పటికే ఎంగేజ్మెంట్ అయింది. ఆ ఫోటో కూడా సోషల్ మీడియాలో నేనే షేర్ చేశాను. అయితే అప్పుడు నా కూతురి వయసు ఏడేళ్లు. కూతురి కోసమే పెళ్లి రద్దు చేసుకున్నా నేను ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే అతడికి సమయం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ నా కూతురు చాలా చిన్నపిల్ల కదా! తనను చూసుకోవడానికి తండ్రి కూడా లేడు. తల్లినైన నేను కూడా వేరొకరితో వెళ్లిపోతే తనేం కావాలి? అని ఆలోచించాను. అది తప్పా? ఒప్పా? అని ఆలోచించలేదు. నా బుద్ధితోనే ఆ పని చేశాను. ఇప్పుడే పెళ్లి వద్దులే అని వివాహం రద్దు చేసుకున్నాను. ఇప్పుడు తన వయసు 13 ఏళ్లు. నాకు పెళ్లి అనే కాన్సెప్ట్ చాలా ఇష్టం. పెళ్లిపై చాలా నమ్మకం ఉంది. పరిచయమే లేని ఇద్దరు వ్యక్తులు కలిసి జీవితాన్ని పంచుకోవడం.. ఆ బంధం చాలా బలమైనది. రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటా ఇప్పటికీ వివాహం చేసుకోవాలని ఉంది. కాకపోతే రెండేళ్లు ఆగాలనుకుంటున్నాను. ఆద్య కాలేజీకి వెళ్లాక నా గురించి నేను ఆలోచిస్తాను. నేను రెండో పెళ్లి చేసుకోవడం నా పిల్లలకు ఇష్టమే! వారు సంతోషంగానే ఉన్నారు. ఒక వ్యక్తి వల్ల నువ్వు సంతోషంగా ఉంటావంటే మళ్లీ పెళ్లి చేసుకో అని అకీరా చెప్పాడు. ఆద్య కూడా పెళ్లి చేసుకోమనే చెప్తుంది. రెండేళ్ల తర్వాత కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను' అని చెప్పుకొచ్చింది రేణు దేశాయ్. -
మీ అందరి అభిమానం వల్లే నేను మళ్ళీ సినిమాల్లోకి..!
-
మీ అబ్బాయిని హీరో చేయండి.. రేణు దేశాయ్‌కు రిక్వెస్ట్!
మాస్ మహారాజా రవితేజ, నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు. దసరా కానుకగా ఈ మూవీ ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని వంశీకృష్ణనాయుడు దర్శకత్వంలో.. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. 1970లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని స్టువర్టుపురానికి చెందిన ఒకనాటి గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఇప్పటికే ట్రైలర్, టీజర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రవితేజతో పాటు రేణుదేశాయ్‌పై ప్రశంసలు కురిపించారు. (ఇది చదవండి: ఇంద్రజ హీరోయిన్గా కొత్త సినిమా.. ఆసక్తిగా టైటిల్!) విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ' టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ చూశా. మణిరత్నం తీసిన నాయకన్ సినిమా తెలుగులో ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశా. ఆ కోరిక పుష్ప చిత్రంతో తీరిపోయింది. టైగర్ నాగశ్వరరావు మూవీలో ఒక్కొక్క ఫ్రేమ్‌ను అద్బుతంగా తీశారు. ఈ చిత్ర డైరెక్టర్‌కు చాలా మంచి భవిష్యత్తు ఉంది. దర్శకుడు వంశీ ఫోన్ నంబరు తీసుకుని ఆయనతో మాట్లాడేంత వరకు నా మనసు ఆగలేదు. రవితేజ చేసిన విక్రమార్కుడు సినిమా కన్నడ, తమిళం, హిందీలో చేశారు. నీకున్న టాలెంట్‌ను ఎవరూ అందుకోలేరు. మన తెలుగు కీర్తిని దేశమంతట విస్తరింపచేయండి. నాకు అంతకు మించిన సంతోషం ఇంకొకటి లేదు.'అని అన్నారు. అనంతరం రేణు దేశాయ్ గురించి చెబుతూ.. ' మీరు సినిమా ఫీల్డ్‌కు దూరంగా ఉన్నప్పటికీ.. మాకు ఎప్పటికీ దగ్గరే. మీ అబ్బాయిని త్వరలోనే హీరోను చేయాలి. అందులో మీరే తల్లిగా నటించాలి' అంటూ నవ్వుతూ మాట్లాడారు. ఆయన మాటలు విన్నా రేణు దేశాయ్ చాలా సంతోషంగా కనిపించింది. రేణు దేశాయ్ ఆనందం చూస్తుంటే తప్పకుండా చేస్తానంటూ చెబుతున్నట్లే కనిపించింది. కాగా.. పవన్ కల్యాణ్‌తో రేణు దేశాయ్‌కి పెళ్లి కాగా.. అకీరా నందన్ అనే కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: నాలాంటి బాధ ఎవరికీ రాకూడదని కోరుకున్నా: నయని పావని) -
బద్రి సినిమా ఇప్పుడే రిలీజైనట్లు ఉంది: రేణు దేశాయ్ కామెంట్స్ వైరల్!
మాస్ మహారాజా రవితేజ టైగర్ నాగేశ్వరరావుగా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని వంశీకృష్ణనాయుడు దర్శకత్వంలో.. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. 1970లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని స్టువర్టుపురానికి చెందిన ఒకనాటి గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితాన్నే ఈ చిత్రంలో చూపించనున్నారు. ఇప్పటికే ట్రైలర్, టీజర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈవెంట్‌కు హాజరైన నటి రేణు దేశాయ్ పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది. హీరో రవితేజపై ప్రశంసల వర్షం కురిపించింది. (ఇది చదవండి: రిలీజ్‌కు ముందు హైకోర్టుకు లియో మేకర్స్.. ఎందుకంటే?) రేణు దేశాయ్ మాట్లాడుతూ.. '23 ఏళ్లయినా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. మిమ్మల్ని చూస్తుంటే బద్రి సినిమా ఇప్పుడే రిలీజ్ అయినట్లు అనిపిస్తోంది. మీ ప్రేమకు నా దగ్గర పదాలు లేవు. ఇన్నేళ్లు నేను సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో నాకు సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు చిత్రబృందానికి థ్యాంక్స్. రవితేజకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ సినిమా 2019లోనే మొదలైంది. రవితేజ హీరో అని చెప్పారు. నేను వంశీని ఒక్కటే అడిగా. నేను ఈ సినిమాలో ఉన్నానా? అని. ఎందుకంటే రవితేజ పెద్ద హీరో కదా. ఈ చిత్రంలో అవకాశం రావడం నా జీవితంలో ఎంత ముఖ్యమో మీకు తెలియదు. ఈ క్షణం కోసం చాలా రోజులుగా వెయిట్ చేశా. దయచేసి మీరంతా ఈ సినిమాకు థియేటర్‌కు వెళ్లి చూడండి అంటూ అభిమానులకు రెక్వెస్ట్' చేసింది. అనంతరం ఇకపైనా కేవలం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న పాత్రలే చేస్తారని వార్తలొస్తున్నాయి నిజమేనా? కాదా? అని యాంకర్ ప్రశ్నించగా.. అలాంటిదేమి లేదని.. అవన్నీ రూమర్స్ మాత్రమేనని రేణు దేశాయ్ కొట్టిపారేసింది. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. (ఇది చదవండి: సినిమా వాళ్లపై ప్రజల్లో అలాంటి అభిప్రాయం: రాధేశ్యామ్ నటి కామెంట్స్!) -
Tiger Nageswara Rao: రవితేజ ‘టైగర్ నాగేశ్వర రావు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నాకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయి..
-
పెళ్లికి ముందు కూడా నరకం చూశా.. రేణు దేశాయ్ సెన్సేషనల్ కామెంట్స్
టైగర్ నాగేశ్వరరావు... 1970 ప్రాంతంలో స్టూవర్టుపురంలో పేరు మోసిన గజదొంగ. జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రంలో రవితేజ కథానాయకుడిగా వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దాదాపు 18 ఏళ్ల విరామం తర్వాత నటి రేణూదేశాయ్ ఈ సినిమాతో వెండితెరకు రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఆమె గుర్రం జాషువా కుమార్తె, సామాజికవేత్త ‘హేమలత లవణం’గా కనిపించనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) రేణు దేశాయ్ పేరు వినిపించగానే పవన్ కల్యాణ్‌తో ప్రేమ, పెళ్లి, విడాకులు ఆపై కష్టాలు అని చెప్పుకుంటారు. ఇవన్నీ గత 20 ఏళ్లుగా ఆమె గురించి తెలిసినవే.. అయితే ఈ కష్టాలు తన జీవితంలోకి పవన్ కళ్యాణ్ రాక ముందు నుంచే ఉన్నాయని ఆమె తాజా ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. 'మా అమ్మ నాన్నలు అబ్బాయి పుట్టాలని కోరుకున్నారు. కానీ నేను అమ్మాయిగా పుట్టాను. అలా నా ఇంట్లోనే లింగ వివక్షకు గురి కావడం జరిగింది. చాలా మందికి నేనంటే.. నా పెళ్లి ఆపై విడాకులు గురించే చర్చిస్తారు. కానీ చిన్నప్పటి నుంచే నేను ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మా నాన్న కోరిక ప్రకారం అబ్బాయి పుట్టలేదని.. నేను పుట్టిన తరువాత మూడు రోజుల పాటు నా తండ్రి నా ముఖం కూడా చూడలేదు. నాకు ఊహ తెలిసొచ్చాక ఈ విషయం మా అమ్మ నాకు చెప్పేసరికి చాలా బాధ వేసింది. ఆ బాధ నాలో ఇప్పటికీ ఉండిపోయింది. తర్వాతి ఏడాదిలో మా తమ్ముడు పుట్టేశాడు. అప్పుడు వాడ్ని రాజాబాబులా పెంచారు. దాన్ని బట్టి మీరు అర్ధం చేసుకోవచ్చు. నేను ఎలాంటి పరిస్థితుల్లో పెరిగానో.. ఎలా పెంచారో. ఆ వివక్ష అనేది కంటిన్యూ అవుతూనే ఉంది.' అని రేణు ఎమోషనల్ అయ్యారు. అంతేకాకుండా తన కుటుంబంలో ఆడబిడ్డని ఒకలా.. మగ బిడ్డని మరోలా చూశారని ఆమె చెప్పుకొచ్చారు. తన జీవితంలో తల్లి ఉండి కూడా తల్లి ప్రేమను పొందలేకపోయానని ఎంతో బాధతో చెప్పారు. జీవితంలో తన విడాకుల ఇష్యూ కంటే అదే ఎక్కువ బాధపెట్టిందని రేణు దేశాయ్ చెప్పారు. ఇలాంటి పేరెంట్స్ చాలా రేర్‌గా ఉంటారని ఈ జన్మలో అది తన దురదృష్టం అని ఆమె తెలిపారు. అంతేకాకుండా తను 18 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఇంట్లో ఆ తేడా చూశానని చెప్పారు. తన బాగోగులు ఇంట్లోని పనివాళ్లే చూసుకున్నారని ఆమె వాపోయారు. తల్లిదండ్రుల ప్రేమను పొందాలని స్కూల్ల్లో బాగా చదివేదాన్ని.. అమ్మకు నచ్చేలా నడుచుకునేదానిని.. వారు నన్ను మెచ్చుకోవాలని కోరుకునేదానిని.. అలా ఎన్ని ప్రయత్నాలు చేసినా తల్లి ప్రేమ తనకు దొరకలేదని రేణు దేశాయ్ పేర్కొన్నారు. 'ఆ బాధ పట్టలేక, నాకు 19 ఏళ్లు వచ్చిన తర్వాత ఒకరోజు అమ్మని అడిగాను. అమ్మా.. నీ ప్రేమ నాకు ఎందుకు ఇవ్వడం లేదు. నీ ప్రేమ నాకూ కావాలమ్మా.. ఆ ప్రేమా ఇవ్వు అమ్మా అని అడిగాను. వాటికి అమ్మ నుంచి సమాధానం లేదు. అందుకే నేను జీవితంలో ఏమైతే కోల్పోయానో నా బిడ్డలు అది కోల్పోకూడదు. అందుకే నా బిడ్డలకు రెట్టింపు ప్రేమను పంచుతున్నాను. శక్తికి మించి నా బిడ్డలకు ఎక్కువ ప్రేమను పంచాను. అకీరా,ఆద్యా ఇద్దరూ నాకు సమానమే. వారిలో ఎవరినీ ఎక్కువ, తక్కువగా చూడలేదు. వారిద్దరీ కోసం నేను ఎన్ని కష్టాలు అయినా భరిస్తాను.' అని రేణు దేశాయ్ కొంతమేరకు ఎమోషనల్ అయ్యారు. -
Renu Desai: గుండె సంబంధిత సమస్యలున్నాయి..
‘‘నటనకు కావాలని విరామం ఇవ్వలేదు. నాకు నటించాలనే ఉంది. అయితే ఓ సినిమా ఒప్పుకునే ముందు కథ, అందులోని నా పాత్ర, ఆ చిత్ర దర్శక–నిర్మాతలు... ఈ మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటాను. ఇలా ఈ మూడు అంశాలతో నేను ఏకీభవించి నటించిన చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు’’ అన్నారు నటి, దర్శక–నిర్మాత రేణూ దేశాయ్. రవితేజ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు’. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో మయాంక్ సింఘానియా సహనిర్మాతగా అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో రేణూ దేశాయ్ చెప్పిన విశేషాలు. ► ‘టైగర్ నాగేశ్వర రావు’లో హేమలత లవణంగారి పాత్ర చేశాను. లవణంగారి మేనకోడలు కీర్తిగారిని కలిసి ఆవిడ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. 1970 కాలంలోనే జోగిని వ్యవస్థ, అంటరానితనంపై పోరాటాలు చేశారామె. దొంగలు, బందిపోట్లలో మంచి మార్పు కోసం కృషి చేశారు. ఇలాంటి సామాజిక కార్యక్రమాలతో స్ఫూర్తిగా నిలిచిన హేమలతగారి పాత్ర చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఆమె బాడీ లాంగ్వేజ్‌ను వెండితెరపై ప్రతిబింబించడం సవాల్‌గా అనిపించింది. నా కెరీర్లో ఇప్పటివరకూ నాకు ఏ పశ్చాత్తాపం లేదు. అయితే హేమలత లవణంగారి గురించి తెలుసుకుని, ఆమె పాత్రలో నటించిన తర్వాత ఆమెను కలవలేకపోయానని పశ్చాత్తాపపడుతున్నాను. హేమలతగారి స్ఫూర్తితో చిన్నారుల ఆకలి తీరేలా నా వంతుగా ఓ స్వచ్ఛంద సేవా సంస్థను మొదలు పెట్టాలనుకుంటున్నాను. ‘టైగర్ నాగేశ్వర రావు’ సినిమా ట్రైలర్ చూసి, నా వయసుకి తగ్గ పాత్రలో నటించినందుకు మా అమ్మాయి ఆద్య తనకు గర్వంగా ఉన్నట్లు చెప్పింది. నాకు బెస్ట్ కాంప్లిమెంట్ అది. నా గురించి నా పిల్లలు ఏమనుకుంటున్నారన్నదే నాకు ముఖ్యం. భవిష్యత్‌లో నా వయసుకు తగ్గ పాత్రలే చేయాలనుకుంటున్నాను. ∙మా నాన్నమ్మ 47 ఏళ్లకే హార్ట్ ఎటాక్‌తో చనిపోయారు. మా నాన్నా హార్ట్ ఎటాక్తోనే చనిపోయారు. ఇలా జన్యుపరంగా నాకు గుండె సంబంధిత సమస్యలున్నాయి. అయితే ప్రమాదం లేదు. అలాగని అజాగ్రత్త వహించకూడదు. చికిత్స తీసుకుంటున్నాను. -
అకీరా హీరోగా ఎంట్రీ? రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా 'టైగర్ నాగేశ్వరరావు'. అక్టోబర్ 20న ఈ చిత్రం వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ మూవీతో రీఎంట్రీ ఇస్తున్న నటి రేణు దేశాయ్.. తన గురించి, సినిమా గురించి ఆసక్తికర విషయాల్ని పంచుకుంది. (ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమా) హేమలత లవణం పాత్ర గురించి? హేమలత లవణం.. ఆ రోజుల్లోనే చంబల్, బుందేల్ ఖండ్ వెళ్ళి అక్కడ బందీపోట్లని కలిశారు. జోగిని వ్యవస్థ, అంటరానితనంపై పోరాటం చేశారు. ఇలాంటి గొప్ప పాత్ర చేయడం నా పూర్వజన్మ సుకృతం. రవితేజతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఓ మంచి అనుభవం. హీరోయిన్, డిజైనర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఈ జర్నీ ఎలా ఉంది? నేను డిజైనర్ కాదు. ఒరిజినల్ స్టయిలిస్ట్‌ని. కలర్స్‌పై మంచి అవగాహన వుంది. ఏ కలర్‌కి ఏది మ్యాచ్ అవుతుందో నాకు తెలుసు. ఖుషి సినిమాకు అనుకోకుండా స్టైలిష్ట్‌గా మారాను. అలాగే సామాజిక కార్యక్రమాలు, కవిత్వం రాయడం.. వీటిలో ఏది ప్లాన్ చేసి చేసినవి కాదు. (ఇదీ చదవండి: టైగర్ నాగేశ్వరరావు షూటింగ్లో ప్రమాదం.. రవితేజ మోకాలికి తీవ్ర గాయం..) అకీరా హీరోగా ఎప్పుడు? హీరోగా చేయాలనే ఆసక్తి అకీరాకి ఈ క్షణం వరకూ లేదు. అకీరాది చాలా భిన్నమైన వ్యక్తిత్వం. పియానో నేర్చుకున్నాడు. అలాగే ఫిల్మ్ ప్రొడక్షన్ గురించి కూడా నేర్చుకున్నాడు. యోగా, మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ నేర్చుకున్నాడు. తనకి రైటింగ్ ఇష్టం. ఒక స్క్రిప్ట్ కూడా రాశాడు. అయితే ఇప్పటి వరకు నటుడిని అవుతానని మాత్రం చెప్పలేదు. తను హీరో అవ్వాలని డిసైడ్ అయితే అందరికంటే ముందు నేనే ప్రకటిస్తా. నటన కొనసాగిస్తారా? నాకు నటన ఎప్పుడూ కొనసాగించాలనే వుంటుంది. నా వయసుకు తగ్గ మంచి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తాను. (ఇదీ చదవండి: 'వ్యూహం' ట్రైలర్: కల్యాణ్‌కు తెలివి లేదు.. ఎన్నికల తర్వాత గ్లాస్ పగిలిపోతుంది) -
టైగర్ నాగేశ్వరరావులో రేణుదేశాయ్.. ఆ పాత్ర వెనక ఇంత కథ ఉందా?
పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ దాదాపు 20 ఏళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయబోతోంది. మాస్ మహారాజా మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావులో కీలక పాత్రలో నటిస్తోంది. 1970లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. గుంటూరులోని స్టువర్టుపురానికి చెందిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. వంశీకృష్ణనాయుడు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి నటి రేణు దేశాయ్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌కు ఆడియన్స్ నుంచి భారీ క్రేజ్ వస్తోంది. ఈ మూవీలో ఆమె హేమలత లవణం అనే పాత్రను పోషిస్తోంది. హేమలత లవణం ఎవరంటే? ఈ చిత్రంలో రేణు దేశాయ్ పోషిస్తున్న పాత్ర పట్ల ఆడియన్స్‌లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వడంపై ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆమె క్యారెక్టర్ వెనక ఉన్న అసలు సంగతేంటో తెలుసుకుందాం. అసలు ఆ పేరు ఎవరిదీ? అంత ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్‌ను రేణుదేశాయ్ పోషించడంతో అభిమానులు సైతం నెట్టంట ఆరా తీస్తున్నారు. ఈ చిత్రంలోని హేమలత లవణం ఎవరు? అసలు ఆమె ఎవరో వివరాలు తెలుసుకుందాం. హేమలత లవణం జీవితం హేమలత గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన తెలుగు కవి గుర్రం జాషువా, మరియమ్మ దంపతులకు 1932 ఫిబ్రవరి 26న జన్మించింది. ఆమె తన విద్యనంతా గుంటూరులో సాగింది. మద్రాసు క్వీన్స్ కళాశాలలో బీఏ చదివి బంగారు పతకాన్ని పొందింది. ఆ తర్వాత గోపరాజు రామచంద్రరావు కుమారుడు గోపరాజు లవణంతో ఆమెకు వివాహం జరిగింది. అయితే అప్పట్లో వర్ణ వివక్షను ఎదురించి చేసుకున్న ఆమె వివాహం అప్పట్లో సంచలనం కలిగించింది. ఆ తర్వాత ఆమె వినోబా భావే భూదాన యాత్రలో చంబల్ లోయలో పర్యటించి బందిపోటు దొంగల్లో మానసికంగా పరివర్తన తెచ్చేందుకు కృషిచేసింది. శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లో ఆర్థిక సమతా మండలి అనే సేవా సంస్థను స్థాపించి వెనుకబడిన, దిగువ కులాల చైతన్యం కోసం పలు కార్యక్రమాలు చేపట్టింది. 1981లో కావలిలో నవవికాస్ అనే సంస్థను స్థాపించి అణగారినవర్గాలను ఆదుకుంది. (ఇది చదవండి: బెంగళూరులో విషాదం.. మహిళ ప్రాణాలు తీసిన నటుడు!) జోగిని వ్యవస్థపై పోరాటం అప్పట్లో మహిళల జోగిని వ్యవస్థపై పోరాటం చేసింది. జోగినులను, వారి పిల్లలను కాపాడేందుకు 'సంస్కార్' చెల్లి నిలయం అనే సంస్థలు ఏర్పాటు చేసింది. 'బాణామతి' లాంటి గుడ్డి నమ్మకాలతో మహిళల జీవితాలను ధ్వంసం చేస్తోన్న వాటికి వ్యతిరేకంగా పోరాడింది. రెండు వేలకు పైగా జోగినులను సంస్కరించడమేకాక.. ప్రభుత్వం చేత వారికి పొలాలు ఇప్పించింది. అంతే కాకుండా జోగినులకు వివాహాలు కూడా చేసింది. సంస్కార్ సంస్థను స్థాపించి.. నిజామాబాదు జిల్లాలోని జోగినీ వ్యవస్థ నిర్మూలనకు హేమలత లవణం చేసిన కృషి ఫలితంగానే.. అప్పటి ఎన్టీ రామారావు ప్రభుత్వం జోగినీ వ్యవస్థ నిర్మూలణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత వర్ణ, మతాంతర వివాహాలను ప్రోత్సహించింది. బాలికల కోసం నిజామాబాద్ జిల్లా గాంధారి గ్రామంలో ప్రత్యేక పాఠశాల నిర్మించింది. చైల్డ్ ఎట్ రిస్క్ పేరుతో వ్యభిచార వృత్తిలో కూరుకుపోయిన వారి పిల్లల కోసం సంస్కరణ కేంద్రం స్థాపించింది. ప్రస్తుతం తెరకెక్కుతోన్న టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో రేణుదేశాయ్ ఆమె పాత్రనే పోషిస్తోంది. ఈ సినిమాలో జోగినిల సంక్షేమం కోసి కృషి చేసిన హేమలత లవణం చరిత్రనే తెరపై చూపించనున్నారు. కాగా.. రేణు దేశాయ్ నటిస్తోన్న ఈ చిత్రం అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వరరావు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 3న ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతమందిస్తున్నారు. -
టైగర్ నాగేశ్వరరావు: హేమలతగా రేణు దేశాయ్, పోస్టర్ అవుట్
మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. 1970లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. గుంటూరులోని స్టువర్టుపురానికి చెందిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు చుట్టూ ఈ కథ సాగుతుంది. వంశీకృష్ణనాయుడు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఆ మధ్య రవితేజ సిగరెట్ తాగుతున్నట్లుగా పోస్టర్ రిలీజ్ చేయగా విశేష స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి నటి రేణు దేశాయ్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో ఆమె హేమలత లవణం అనే పాత్రను పోషిస్తోంది. చేతిలో చంటిబాబును ఎత్తుకుని అతడిని చూసి మురిసిపోతున్నట్లుగా ఉంది రేణు దేశాయ్ లుక్. క్షణాల్లో ఈ పోస్టర్ వైరల్‌గా మారగా.. ఇన్నాళ్ల తర్వాత రేణు దేశాయ్ వెండితెరపై కనిపించనుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తన నిర్మలమైన నవ్వు, ప్రశాంతతను కురిపించే కళ్లు.. ఏవీ మారలేదని కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈ నెల 3న ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, సహనిర్మాత: మయాంక్ సింఘానియా. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) చదవండి: హౌస్‌లో ఎంట్రీ ఇవ్వనున్న ఐదుగురు కంటెస్టెంట్లు.. ఎవరెవరంటే? -
'చంద్రా’లు దిద్దిన కాపురం.. స్కెచ్ మాములుగా లేదు!
ఓ భర్త తన భార్యని మోసం చేశాడు. చెప్పాలంటే అలాంటి ఇలాంటి మోసం కాదు. పెళ్లి, ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఉన్నప్పటికీ మరో మహిళతో ప్రేమలో పడ్డాడు. ఈ భార్యకి విడాకులు ఇచ్చేశాడు. దీంతో చాలా కుమిలిపోయింది. ఇప్పటికీ బాధపడుతూనే ఉంది. సందర్భం వచ్చిన ప్రతిసారి తన ఆవేదన బయటపెడుతూనే ఉంది. అలాంటిది ఇప్పుడు సడన్‌గా మాజీ భర్తకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. అందరికీ కొత్త డౌట్స్ మొదలయ్యాయి. అవును పైన చెప్పినది పవన్-రేణు దేశాయ్ గురించే.. పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అందరికీ తెలుసు. ఈ విషయంలో తనని తాను ఎంత సమర్ధించుకున్నా.. ముగ్గుర్ని(వేర్వేరుగా) పెళ్లి చేసుకోవడం తప్పే కదా! కానీ ఈ మహానుభావుడు ఒప్పుకోడు. అప్పట్లో అలా జరిగింది, ఇలా చేశాను అని ఏదో కవర్ చేసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తుంటాడు. మొదటి భార్య గురించి ఎవరికీ పెద్దగా తెలీదు. మూడో భార్య మన దేశస్థురాలే కాదు. పవన్ పుణ్యామా అని రెండో భార్య రేణు దేశాయ్ మాత్రం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. రీసెంట్గా తన యూట్యూబ్ ఛానెల్లో రేణు దేశాయ్ ఓ వీడియో పోస్ట్ చేసింది. తన విషయంలో పవన్ చేసింది ముమ్మాటికీ తప్పే అని చెబుతూనే.. పొలిటికల్‌గా ఆయన(పవన్) సమాజానికి ఉపయోగపడతారని, నమ్ముతున్నానని కామెంట్స్ చేసింది. పిల్లల్ని, కుటుంబాన్ని వదులుకుని ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారని చెప్పింది. అయితే ఇవన్నీ పెద్దగా నమ్మేలా అనిపించట్లేదు. ఎందుకంటే ఇలా సడన్ యూటర్న్ కొత్త కొత్త డౌట్స్ క్రియేట్ చేస్తోంది. ఈమె ఇలా మాట్లాడటం వెనుక దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఉన్నారనే టాక్ వినిపిస్తుంది. (చదవండి: చంద్రయాన్-3 పై సినిమా.. ఫస్ట్ ఛాయిస్ ఆ హీరోనే) కె.రాఘవేంద్రరావు మనవడు, పవన్-రేణుల కొడుకు అకీరా.. ఇద్దరు కూడా ఈ మధ్యే అమెరికాలోని ఓ యాక్టింగ్ స్కూల్లో చేరారు. ఈ విషయమై ట్వీట్ చేసిన కాసేపటికే రాఘవేంద్రరావు ఎందుకో ఆ పోస్ట్ డిలీట్ చేశారు. అయితే కొడుకు భవిష్యత్‌ని చూపించి రేణు దేశాయ్‌తో తన భర్త(పవన్) మంచోడు అని సర్టిఫికెట్ ఇప్పించి, ఎలక్షన్‌లోపు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా చంద్రన్న-పవన్ కలిసి ఇదంతా ప్లాన్ చేస్తున్నారేమో అనే సందేహం వస్తుంది. రేణు దేశాయ్ లేటెస్ట్ వీడియో వెనక చంద్రబాబు హస్తం ఉండటం గ్యారంటీ అనిపిస్తుంది. (చదవండి: పోలీస్ ఆఫీసర్లుగా ఆన్ డ్యూటీలో ఉన్న హీరోయిన్లు) ఎందుకంటే చంద్రబాబుకి కె.రాఘవేంద్రరావుతో మంచి సంబంధాలు ఉన్నాయి. వీళ్లిద్దరూ కలిసి పవన్-రేణు దేశాయ్‌ల వ్యవహారాన్ని వెనక వైపు నుంచి నరుక్కొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే చంద్రబాబు.. ఇలా తన దత్తపుత్రుడి ఇమేజ్ కాపాడటానికి చేసే ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయనేది కాలమే నిర్ణయిస్తుందిలే! -
ఫోటోపై రియాక్ట్ అయిన రేణు దేశాయ్.. వెంటనే తొలగించేసిన రాఘవేంద్ర రావు
టాలీవుడ్ దర్శకుడు కే రాఘవేంద్ర రావు ఒక ఫోటో షేర్ చేశారు. అందులో రేణుదేశాయ్- పవన్ కల్యాణ్ కుమారుడు అకిరా నందన్ ఉన్నారు. దీంతో ఆ ఫోటో ఒక్కసారిగా వైర్లా కావడం పలు కామెంట్లు వస్తుండటంతో కొంత సమయం తర్వాత రాఘవేంద్ర రావు తన సోషల్‌మీడియా ఖాతా నుంచి తొలగించారు. ఫోటో సంగతేంటి .. రాఘవేంద్ర రావు, అతని అల్లుడు శోభు యార్లగడ్డ, దర్శకుడు రాజమౌళి అందరూ 'బాహుబలి' మ్యూజిక్ సింఫనీ ఉంటే నార్వే వెళ్లారు. అక్కడ శోభు కుమారుడు, రాఘవేంద్ర రావు మనవుడు అయిన కార్తికేయ , అకిరా నందన్‌తో ఫోటో దిగారు. ఆ ఫోటోను షేర్ చేస్తూ.. ఫోర్త్ జనరేషన్ అఫ్ బాయ్స్ అమెరికాలోని ఫిలిం స్కూల్లో జాయిన్ అయ్యారని క్యాప్షన్ పెట్టారు. ఇంకేముంది అకిరా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు నెట్టింట వైరల్ అయింది. ఫోటోపై స్పందించిన రేణుదేశాయ్ సోషల్ మీడియాలో అకిరా నందన్ ఫోటోను షేర్ చేస్తూ రేణు దేశాయ్ మీద ప్రశ్నల వర్షం కురిపించారు నెటిజన్లు. ఈ రూమర్లకు ఆమె ఫుల్స్టాప్ పెట్టేసింది. అకిరా ఏ ఫిల్మ్ స్కూల్లో జాయిన్ అవ్వలేదని క్లారటీ ఇచ్చింది. ప్రస్తుతం అకిరాకు యాక్టింగ్ మీద అంతగా ఆసక్తి లేదని తెలిపింది. ఇప్పట్లో అతనికి సినిమాల్లో నటించాలనే కోరిక లేదు. ఒక వేళ అకిరాకు సినిమా ఇండస్ట్రీపై ఆసక్తి ఉండి నటించాలనే ఆసక్తి కలిగితే ఆ విషయాన్ని ముందుగా తానే చెప్తానని రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) (ఇదీ చదవండి: రాజకీయాల్లో చిరు ఓడిపోవచ్చేమో కానీ సినిమాల్లో ఎప్పటికీ 'మగధీరుడే') -
రాజమౌళిపై రేణు దేశాయ్ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?
పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ఆమె పేరు ఎక్కువగా వార్తల్లో వినిపిస్తోంది. ఆమె చేసిన కామెంట్స్‌తో మరోసారి చర్చల్లో నిలిచారు. ఎందుకంటే కొద్దిరోజుల క్రితమే తన విడాకుల విషయం, పవన్ గురించి ఆమె పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె దర్శకధీరుడు రాజమౌళిపై చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇంతకీ ఆ పోస్ట్ ఏంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: నా విషయంలో పవన్‌ది 100% తప్పే: రేణుదేశాయ్) అయితే తాజాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన బాహుబలి ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రాన్ని నార్వోలోని స్టావెంజర్ నగరంలోని ఓ థియేటర్లో ప్రదర్శించారు. అక్కడ సినిమా చూసేందుకు రేణ్ దేశాయ్, తన కుమారుడు అకీరా నందన్‌తో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె థియేటర్లో సినిమా చూసి సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేసిన లయ.. దర్శకుడు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. రేణు తన ఇన్‌స్టాలో రాస్తూ.. ' ఒక భారతీయ సినిమా అంతర్జాతీయంగా గుర్తింపు పొందడం చాలా అద్భుతంగా ఉంది. రాజమౌళి సార్.. మీరు ప్రేక్షకుల కోసం సృష్టించిన అనుభూతిని వర్ణించడానికి నా దగ్గర పదాలు లేవు. స్టావెంజర్లోని థియేటర్లో బాహుబలి చూసిన అనుభవం మరిచిపోలేనిది. ఈ కార్యక్రమానికి నన్ను, అకీరాను ఆహ్వానించినందుకు శోబు సార్‌కు ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేసింది. అద్భుతమైన లైవ్ ఆర్కెస్ట్రాతో మనం అత్యంత ఇష్టపడే చిత్రాన్ని చూడటం అద్భుతంగా ఉందంటూ రేణుదేశాయ్ ఎమోషనలయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: పవన్‌తో విడాకుల టైమ్‌లో జరిగింది ఇదే.. రేణుదేశాయ్ వైరల్ కామెంట్స్ ) View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
పవన్‌తో విడాకుల టైమ్‌లో జరిగింది ఇదే.. రేణుదేశాయ్ వైరల్ కామెంట్స్
సినీ హీరో పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ ప్రస్థుతం సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నారు. కొద్దిరోజుల క్రితం తన విడాకుల విషయం, పవన్ గురించి ఆమె పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమె టార్గెట్‌గా కొందరు సోషల్ మీడియా ద్వారా కామెంట్లు పెడుతున్నారని రేణుదేశాయ్ తెలుపుతుంది. తాజాగ ఇదే వివాదంపై ఆమె ఇలా స్పందించారు 'నా విడాకుల విషయంలో నా మాజీ భర్త ఎలా మోసం చేశాడనే వాస్తవాన్ని గతంలో చెప్పినప్పుడు ఆయన అభిమానులు చాలా దారుణంగా అబ్యూస్ పదాలతో తిట్టారు. ఇప్పుడు, దేశ పౌరురాలిగా నేను అతనికి (పవన్) అనుకూలంగా కొన్ని మాటలు మాట్లాడినప్పుడు, అతన్ని ద్వేషించేవారు ఇప్పుడు నన్ను దుర్భాషలాడుతున్నారు. (ఇదీ చదవండి: విలన్‌గా ధోని.. కాంబినేషన్ సెట్ చేసిన స్టార్ డైరెక్టర్) విడాకుల విషయంలో నా మాజీ భర్త గురించి అప్పట్లో నేను మాట్లాడింది నిజం. ఆరోజు అలా మాట్లాడినందుకు కొందరి నుంచి డబ్బు తీసుకున్నానని పవన్ అభిమానులు ఆరోపించారు. అంతేకాకుండా సోషల్‌మీడియా ద్వారా నన్ను దూషించారు కూడా... ఇప్పుడు కూడా మళ్లీ అలాంటిదే నా విషయంలో జరుగుతుంది. నా మాజీ భర్తకు అనుకూలంగా ఉండే వ్యక్తులు నాకు డబ్బు ఇచ్చారని కొందరు ఆరోపిస్తున్నారు. అందులో నిజం లేదు. నా మాజీ భర్త గురించి నేను అప్పుడు,ఇప్పుడు రెండు సందర్భాల్లోనూ నిజాన్నే తెలిపాను. అతనితో ప్రేమలో పడి నిజం మాట్లాడినందుకు నేను చెల్లించాల్సిన మూల్యం ఇదేనని అనుకుంటున్నా. ఇది నా విధి అయితే, అలాగే ఉండనీయండి. దయచేసి నాపై దుర్భాషలాడకండి.' అని ఆమె కోరారు. దీంతో ఆమె చేసిని ఈ కామెంట్లు ఒక్కసారిగా వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
మరో పెళ్లి గురించి కాదనుకుంటా!?
మరో పెళ్లి గురించి కాదనుకుంటా!? -
నా విషయంలో పవన్ తీరు తప్పే : రేణు దేశాయ్
-
నా విషయంలో పవన్‌ది 100% తప్పే: రేణుదేశాయ్
సాక్షి, అమరావతి: తన విషయంలో పవన్ కళ్యాణ్ చేసింది 100 శాతం తప్పేనని పవన్ కళ్యాణ్ మాజీ భార్య సినీ నటి రేణుదేశాయ్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన తప్పులకు ఆయన మాజీ భార్యలు, పిల్లలకు ఎటువంటి బాధ్యత లేదు కాబట్టి రాజకీయ, వృత్తిపరమైన విభేదాల్లోకి వారిని లాగవద్దంటూ విజ్ఞప్తి చేస్తూ గురువారం ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ మధ్య విడుదలైన పవన్‌కళ్యాణ్ సినిమా వివాదాలు సృష్టించిందని, ఆ సమయంలో తాను విదేశాల్లో ఉండటంతో ఏమి జరిగిందన్న విషయం తెలియలేదని చెప్పారు. ఆ సినిమా తర్వాత కొంతమంది పవన్ మాజీ భార్యలు, పిల్లలు మీద సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేయనున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందని, పవన్‌తో రాజకీయ, వృత్తిపరమైన విభేదాలు ఏమైనా ఉంటే మీరు మీరు చూసుకోండి కానీ ఇందులోకి మహిళలను, పిల్లలను లాగవద్దని పేర్కొన్నారు. -
ఆక్వా పార్క్ వివాదం.. హైకోర్ట్‌లో విచారణ
సామాజిక ప్రయోజనాలు కాపాడుకోవడం, పర్యావరణ పరిరక్షణ పోరాటం అనేది అందరి బాధ్యత. దాన్ని స్వచ్ఛందంగా చేపట్టి కొందరు సినీ ప్రముఖులు పోరాడుతున్నారు. కొత్వాల్ గూడలో దేశంలోనే భారీ ఆక్వా మెరైన్ పార్క్‌కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆహ్లాదం కోసం నిర్మిస్తున్న ఈ పార్క్.. పర్యావరణానికి పెద్ద ముప్పు కానుందని రేణూదేశాయ్, శ్రీదివ్య , దర్శకుడు శశికిరణ్ తిక్కా తో పాటు మరికొందరు ప్రముఖులు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. (ఇదీ చదవండి: 'జైలర్'.. ఆ హాలీవుడ్ సినిమాకు కాపీనా?) ఎలాంటి పర్యావరణ అధ్యయనం లేకుండా చేపట్టిన ఈ ఆక్వా మెరైన్ పార్క్ నిర్మాణం నిలిపేయాలని కోర్ట్‌ను ప్రముఖులు ఆశ్రయించారు. ఇలాంటి పార్కుల నిర్మాణం సింగపూర్, మలేసియా తదితర దేశాల్లో జరిగాయి మన దేశంలో ఎందుకు సాధ్యం కాదని కోర్ట్ ప్రశ్నించింది. వీటికి సమాధానంగా పిటీషనర్ తరపున న్యాయవాది శ్రీరమ్య వాదనలు వినిపిస్తూ ఎలాంటి పర్యావరణ అధ్యయనం లేకుండా ఏర్పాటుచేసే ఈ పార్కులతో జలచరాలకు, వన్య ప్రాణులకు నష్టం వాటిల్లుతుందనే వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ప్రభుత్వానికి, హెచ్ ఎమ్ డీ ఏ లకు నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ , జస్టిస్ తుకారంజీలు ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ జరుగుతుంది. పర్యావరణానికి చేటు చేసేలా ఉన్న ఈ ప్రాజెక్టుపై తమ పోరాటానికి మద్దతు కావాలని పిటీషనర్లలో ఒకరైన శశికిరణ్ తిక్కా చెప్పుకొచ్చారు. ఇప్పటికే హైదరాబాద్ లో నీటి సమస్య ఉందని, ఆక్వా మెరైన్ వల్ల అది మరింత ఎక్కువవుతుందని సదా అన్నారు. (ఇదీ చదవండి: ఓటీటీల్లోకి ఈ శుక్రవారం 18 మూవీస్) -
నిజంగా భయంకరమే..! రేణూ దేశాయ్ అద్భుతమైన పిక్స్ వైరల్!
ఇపుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) హవా నడుస్తోంది. ఏఐ వల్ల చాలా ఉద్యోగాలకు ముప్పు వస్తుందన్న ఆందోళనకు తోడు చాలామంది ఔత్సాహిక ఆర్టిస్టులు ఏఐ పిక్స్‌తో సందడి చేస్తున్నారు. అద్భుతంగా ఉంటున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. (టొమాటో రైతుకు జాక్‌పాట్: నెల రోజుల్లో కోటిన్నర) దీనికితోడు ఏఐ వీడియోలు ప్రముఖంగా నిలస్తున్నాయి. ముఖ్యంగా ఏఐ యాంకర్ లేటెస్ట్ సోషల్‌మీడియా సెన్సేషన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కోవలో నటి రేణూ దేశాయ్ నిలిచారు. అయితే ఇవి సొంతంగా తను సృష్టించు కున్నవి మాత్రం కాదు. రేణూ కుమారుడు అకీరానందన్ క్రియేట్ చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఏఐ నిజంగానే భయపెడుతోంది అంటూ ఈ పిక్స్‌ను పోస్ట్ చేశారు. (Koushik Chatterjee: కంపెనీ సీఈవో కాదు, అయినా రోజుకు నాలుగు లక్షల జీతం) దీంతో లేదు.. లేదు.. ఏఐ అద్భుతం..! మీరు చాలా అందంగా ఉన్నారు. సూపర్ రేణూగారు..నిజానికి థ్రో బ్యాక్ పిక్స్ అంటే సరిపోతుందేమో. 20 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో అచ్చం అలాగే ఉన్నాయంటూ కమెంట్స్ చేశారు. (వెకేషన్లో ఉన్న ఈ నటి ఎవరు, ఆ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?) View this post on Instagram A post shared by renu desai (@renuudesai) View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
పెళ్లికి ముందే అమ్మతనం కోసం ఆరాటపడ్డ హీరోయిన్స్ వీళ్లే
అమ్మ.. ఆ పిలుపు కోసం తపించని వారుంటారా? ఆ స్పర్శ కోరుకోని వారుంటారా? అమ్మ అంటే వేయి ఏనుగుల బలం. అమ్మ అంటే కదిలొచ్చే దేవత. అమ్మ అంటే మమతల కోవెల. ఎంత వర్ణించినా అమ్మ గొప్పతనాన్ని మాటల్లో బందీ చేయలేము. అమ్మ కోసం ఆరాటపడేవారు కొందరైతే అమ్మగా మారాలని తపించేవాళ్లు కొందరు! పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాకే మాతృత్వపు మమకార మాధుర్యం చూడాలని కోరుకోవడం లేదు కొందరు. అలాంటివారి జాబితాలో చాలామంది సెలబ్రిటీలు ఉన్నారు. ప్రేమించినవాడితో పెళ్లి వాయిదా వేశారే కానీ సంతానాన్ని వద్దనుకోలేదు. ఫలితంగా పెళ్లి కాకముందే గర్భం దాల్చినవాళ్లు ఉన్నారు. ఏడడుగులు వేయడానికి ముందే బుడిబుడి అడుగులు వేసే పాపాయితో పందిట్లోకి అడుగుపెట్టినవాళ్లు ఉన్నారు. మదర్స్ డే సందర్భంగా ఓసారి ఆ తల్లులను గుర్తు చేసుకుందాం.. నీనా గుప్తా నీనా గుప్తా పెళ్లి చేసుకోకుండానే వెస్ట్ ఇండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్‌తో బిడ్డను కన్నది. అయితే అతడు తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీంతో నీనా సింగిల్ పేరెంట్‌గా మసాబా గుప్తాను పెంచింది. కల్కి కొచ్లిన్ బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్.. డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌తో మూడేళ్లు ప్రేమాయణం సాగించి 2011లో పెళ్లి చేసుకుంది. కానీ వీరి వైవాహిక బంధం సజావుగా సాగలేదు. 2013లో విడిపోగా 2015లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత హర్ష్‌బెర్గ్‌తో డేటింగ్ చేయగా వీరికి కూతురు పుట్టింది. ఇప్పటికీ వీరు పెళ్లి చేసుకోలేదు. రేణు దేశాయ్.. బద్రి చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్. ఆ సినిమా సమయంలోనే పవన్ కల్యాణ్‌తో ప్రేమలో పడింది. అతడితో ఏడుగులు వేయడానికే ముందే అకీరా జన్మించాడు. అతడికి ఐదేళ్ల వయసొచ్చాక పెళ్లి చేసుకున్నారు. 12 ఏళ్లు కలిసి మెలిసి ఉన్నా తర్వాత విడిపోయారు. సెలీనా జైట్లీ నటి సెలీనా జైట్లీ దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త పీటర్ హగ్‌తో సహజీవనం చేసిన ఆమె పెళ్లికి ముందే గర్భం దాల్చింది. దీంతో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ఆమె ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. సారిక స్టార్ హీరోయిన్గా కొన్నాళ్లు చక్రం తిప్పిన సారిక స్టార్ నటుడు కమల్ హాసన్‌తో ప్రేమాయణం నడిపింది. కొంతకాలం వీరిద్దరూ సహజీవనం చేశారు. ఆ సమయంలో వీరికి శృతి హాసన్ జన్మించింది. తర్వాత రెండేళ్లకు వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. గాబ్రియెల్లా మోడల్, నటి గాబ్రియెల్లా డెమట్రేడ్స్ నటుడు అర్జున్ రాంపాల్‌తో డేటింగ్లో ఉంది. త్వరలో ఆమె రెండోసారి తల్లి కాబోతోంది. కానీ ఇప్పటివరకు వీరు పెళ్లి చేసుకోలేదు. మహిహ చౌదరి నటి మహిమ చౌదరి పెళ్లి చేసుకునే సమయానికి ఐదు నెలల గర్భవతి అని అప్పట్లో వార్తలు వచ్చాయి. 2006 మార్చిలో ఆమె బాబీ ముఖర్జీని పెళ్లాడింది. అమృత అరోరా అమృత అరోరా.. షేకలా లడక్‌తో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించిన కొద్ది రోజులకే గర్భం దాల్చింది. బిడ్డ పుట్టాక ప్రియుడిని పెళ్లాడింది. శ్రీదేవి దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చింది. జాన్వీ కపూర్ కడుపులోకి వచ్చాకే ఆమె బోనీకపూర్‌ను పెళ్లాడింది. అప్పటికి ఆమె ఏడు నెలల గర్భిణి. కొంకణ్ సేన్ శర్మ నటుడు రణ్వీర్ షోరేతో ఎంతోకాలం రిలేషన్షిప్ కొనసాగించిన ఈ నటి ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. కానీ అప్పటికే తను గర్భవతి. పెళ్లైన తర్వాత ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు. అమీ జాక్సన్ ఐ సినిమాతో దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ అమీ జాక్సన్. ప్రియుడు జార్జ్‌తో ఎంగేజ్మెంట్ జరిగిన మరుక్షణమే తను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని వెల్లడించింది. తర్వాత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది కానీ ఆ ప్రేమ పెళ్లి దాకా రాకుండానే ఆగిపోయింది. నేహా ధూపియా బాలీవుడ్ నటి నేహా ధూపియా కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చింది. ఈ విషయాన్ని నేహా ధూపియా ఆమె ప్రియుడు అంగద్ బేడీ ఇంట్లో చెప్పి ఒప్పించాకే పెళ్లి చేసుకున్నారు. నేహాతో అంగద్ షాదీ జరిగే సమయానికి ఆమె మూడు నెలల గర్భిణి. దియా మీర్జా బాలీవుడ్ నటి దియా మీర్జా వ్యాపారవేత్త వైభవ్ రేఖీని పెళ్లాడింది. అతడిని పెళ్లాడే సమయానికే ఆమె గర్భం దాల్చింది. నటి నటాషా స్టాంకోవిచ్ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి ముందే గర్భం దాల్చింది. క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో కొంతకాలం పాటు రిలేషన్లో ఉన్న ఆమె ప్రెగ్నెన్సీ వచ్చాక పెళ్లి చేసుకుంది. అలియా భట్ అలియా భట్ కూడా పెళ్లికి ముందే గర్భవతి అయిందంటారు. 2022 ఏప్రిల్ 14న రణ్‌బీర్ కపూర్‌ను పెళ్లాడింది. జూన్‌లో ప్రెగ్నెన్సీ విషయాన్ని వెల్లడించారు. నవంబర్‌లో రాహాకు జన్మనిచ్చింది ఆలియా. చదవండి: మదర్స్ డే స్పెషల్...కమ్మనైన ఈ అమ్మ పాటలు విన్నారా? మదర్ సెంటిమెంట్‌తో బ్లాక్‌బస్టర్ కొట్టిన చిత్రాలివే -
నేను చేసిన తప్పేంటి?.. రేణు దేశాయ్ మరో సంచలన పోస్ట్
సినీ నటి రేణు దేశాయ్, పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య మాటల యుద్దం నడుస్తూనే ఉంది. పవన్ కల్యాణ్ మాజీ భార్య అని పిలిపించుకోవడానికి కూడా రేణు దేశాయ్ ఇష్టపడరు. పవన్ తనతో కలిసి ఉన్న సమయంలోనే మరొ మహిళతో సన్నిహితంగా ఉన్నాడని పలు సందర్భాల్లో విమర్శించారు. ఇక రీసెంట్గా తన కొడుకు అకీరాని ‘మా అన్న కొడుకు’అని ఫ్యాన్స్ సంబోధించడంపై దేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అకీరా నా కొడుకు... మీ అన్న కొడుకు ఏంటి?. ఒక తల్లికే పుట్టావా? సరిగా మాట్లాడటం నేర్చుకో’ అని రేణు ఫైర్ అయ్యారు. నాలుగు రోజుల క్రితం మొదలైన ఈ సోషల్ మీడియా వార్ ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కొంతమంది రేణుని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సెట్టింగ్స్ మార్చుకోండి.. కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకోండి అంటూ రేణు దేశాయ్‌కి ఉచిత సలహాలు ఇస్తున్నారు. పవన్ అభిమానుల సలహాలను రేణు దేశాయ్ తప్పుబట్టారు. ‘సమాజంతో ఇదే ప్రాబ్లమ్. ఎవరి కోసమో నేను మారాలా?. మీరు చెప్పినట్లు జీవించడానికి నేను ఏమి తప్పు చేశాను. సలహా ఇవ్వడం చాలా ఈజీ. బాధ అనుభవించే వాళ్లకు తెలుస్తుంది’అని ఇన్‌స్టా స్టోరీలో రేణు దేశాయ్ పోస్ట్ పెట్టారు. -
'మాజీ భార్యనే పట్టించుకోని పవన్.. రాష్ట్ర ప్రజలను ఏం చూసుకుంటాడు'?
సినీ నటి రేణు దేశాయ్ పేరు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. పవన్ కల్యాణ్ మాజీ భార్యగా పిలిపించుకోవడానికి ఏమాత్రం ఇష్టపడని రేణు దేశాయ్ తన కొడుకు అకీరాను మా అన్న(పవన్ కల్యాణ్)కొడుకు అని ఫ్యాన్స్ సంబోధించడంతో ఫైర్ అయ్యింది. 'మీ అన్న కొడుకా? అకీరా నా కొడుకు. మీరు ఒక తల్లికి పుట్టలేదా? మాట్లాడే పద్ధతి నేర్చుకోండి' అని గట్టిగానే కౌంటరిచ్చింది. 11 ఏళ్లుగా ఈ సమాజం తనను చెడ్డదానిలా, విలన్‌గా చూస్తున్నారంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ అభిమానులు కొందరు ఆమెపై ఇంకా విషం చిమ్ముతున్నారు. ఎలక్షన్స్ దగ్గర పడుతుండటంతో పవన్ మాజీ భార్య డ్రామాలు ఆడుతుందంటూ నీతి హీనంగా మాట్లాడుతుండగా, ''వి స్టాండ్ విత్ రేణు దేశాయ్'' అంటూ కొందరు ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ పవన్ కల్యాణ్, అతని అభిమానులకు ఓ సూటి ప్రశ్న సంధించారు. చదవండి: 'మీ అన్న కొడుకా? అకీరా నా కొడుకు'.. పవన్ ఫ్యాన్స్‌పై రేణు దేశాయ్ ఫైర్' ''పవన్ కల్యాణ్‌తో మీరు విడిపోయి ఇప్పటికే చాలా సంవత్సరాలు అయినా జనాలు ఇంకా చెత్త వాగుడు మాట్లాడుతున్నారు. అయినా ఇన్నేళ్లు వాళ్లందరి మాటలు భరిస్తూ, స్ట్రాంగ్‌గా ముందుకు వెళుతున్నా మళ్లీ మళ్లీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే చూస్తున్నారు. అయినా నాకు ఒకటి అర్థం కాదు..పవన్ అభిమానులుగా చెప్పుకునే ఈ పిచ్చి ఫ్యాన్స్ మిమ్మల్ని ఇంత బాధపెడుతుంటే వాళ్ల నోళ్లు మూయించడానికి పవన్ కల్యాణ్ ఒక్క స్టేట్మెంట్ అయినా ఎందుకు ఇవ్వరు? రాష్ట్ర ప్రజలందరి బాధలు పట్టించుకుంటా, ఆడవాళ్లంటే గౌరవం అని చెప్పుకొని తిరిగే పవన్ తన మాజీ భార్య విషయంలో ఇలా ఎలా ఉండగలుగుతున్నాడు? ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయి ఇంత మానసిక సంఘర్షణకు గురవుతుంటేనే పట్టించుకోని పీకే(పవన్ కల్యాణ్) రాష్ట్ర ప్రజలందరి గురించి ఎలా చూసుకుంటాడు? మీకోసం ఒక్క స్టేట్మెంట్ ఇచ్చి ఫ్యాన్స్‌ను ఆపడానికి ఆయనకు ఏం అడ్డు వస్తుందో అర్థం కావడం లేదు. ఈ చెత్త, నాన్సెన్స్ నుంచి మీకు మానసిక ప్రశాంతత దక్కాలని కోరుకుంటున్నా'' అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. దీనికి రేణు దేశాయ్ స్పందిస్తూ.. మీలాగే ఇలాంటి ప్రశ్నలు నన్ను చాలామంది అడుగుతారు. కానీ వాటికి నా దగ్గర సమాధానం లేదు. నా పరిధిలో లేని విషయాల గురించి నేనేం చెప్పను? అంటూ నిట్టూర్పుతో బదులిచ్చారు. చదవండి: ఆమె మాటలు విని చాలా ఏడ్చాను: రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్ -
ఆమె మాటలు విని చాలా ఏడ్చాను: రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్
బద్రి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్. జేమ్స్ పండు, జానీ సినిమాల్లో కథానాయికగా మెరిసిన ఆమె ఆ సమయంలో హీరో పవన్ కల్యాణ్‌తో ప్రేమలో పడింది. ఈ క్రమంలో 2009లో వీరు పెళ్లి చేసుకున్నారు. కానీ ఎంతోకాలం ఆ ప్రేమ కొనసాగలేదు. పెళ్లి చేసుకున్న రెండేళ్లకే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత యాక్టింగ్‌కు దూరమైపోయింది రేణు దేశాయ్. సుదీర్ఘ విరామం తర్వాత టైగర్ నాగేశ్వరరావుతో తిరిగి సినిమాల్లో కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. ఇకపోతే తననకు పవన్ మాజీ భార్యగా పిలవడం ఆమెకు అస్సలు ఇష్టం ఉండదు. అలాంటిది తన కొడుకు అకీరాను మా అన్న కొడుకు అని ఓ పవన్ కల్యాణ్ అభిమాని సంబోధించడంతో అగ్గి మీద గుగ్గిలమైంది నటి. మీ అన్న కొడుకా? అకీరా నా కొడుకు. మీరు ఒక తల్లికి పుట్టలేదా? మాట్లాడే పద్ధతి నేర్చుకోండి అని గట్టిగానే కౌంటరిచ్చింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో మరో పోస్ట్ పెట్టింది రేణు దేశాయ్. తనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడిన ఓ సామాజికవేత్త వీడియోను షేర్ చేస్తూ.. 'ఒకరు నాకు ఈ వీడియో పంపారు. ఆవిడ ఎవరో నిజంగా నాకు తెలియదు. నా గురించి ఎందుకు మాట్లాడారో తెలియదు. కానీ మొదటిసారి పబ్లిక్‌లో ఒకరు నా తరపున మాట్లాడటం విని నేను చాలా ఏడ్చాను. నేను ఏదైనా చెప్తే ఏదో ఒక పొలిటికల్ పార్టీకి అమ్ముడుపోయానంటూరు, ఎలక్షన్స్ వస్తున్నాయంటారు. కానీ ఈ వీడియో చూశాక నా బాధ అర్థం చేసుకునే వ్యక్తులు ఉన్నారని ధైర్యం వచ్చింది. ఆమెకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతుంది' అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
'మీ అన్న కొడుకా? అకీరా నా కొడుకు'.. పవన్ ఫ్యాన్స్‌పై రేణు దేశాయ్ ఫైర్'
పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ గురించి ప్రత్యకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 'బద్రి' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఆమె దర్శకురాలిగా అలరిస్తున్నారు. 2012లో పవన్‌కల్యాణ్-రేణు దేశాయ్ విడాకులు తీసుకోగా, అప్పట్నుంచి ఆమె సింగిల్‌గానే ఉంటున్నారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రేణు దేశాయ్ తాజాగా పవన్‌కల్యాణ్ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ ఏమైందంటే.. నిన్న(ఏప్రిల్8)న కొడుకు అకీరా నందన్ పుట్టినరోజు సందర్భంగా మెగా హీరోలు సహా పలువురు అభిమానులు అకీరాకు బర్త్‌డే విషెస్‌ను తెలియజేశారు. అయితే కొందరు ఫ్యాన్స్ మాత్రం హద్దు దాటి ప్రవర్తించడంతో రేణు దేశాయ్ తన స్టైల్లో కౌంటర్ ఇచ్చింది. "మేడమ్. ఇది చాలా అన్యాయం. మా అకీరాను ఒక్కసారి అయినా చూపించండి. మా అన్న(పవన్ కల్యాణ్)కొడుకును చూడాలని మాకు ఉంటుంది. మీరు హైడ్ చేయకండి. అప్పుడప్పుడు అయినా వీడియోస్‌లలో అకీరా బాబును చూపించండి'' అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీనికి రేణు దేశాయ్ బదులిస్తూ..'మీ అన్న కొడుకా? అకీరా నా కొడుకు.మీరు ఒక తల్లికి పుట్టలేదా. మీరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అని నేను అర్థం చేసుకోగలను. కానీ, కొంచెం మాట్లాడే పద్ధతి నేర్చుకోండి. చాలావరకు ఇలాంటి కామెంట్స్‌ను డిలీట్ చేస్తూ వస్తున్నాను. కానీ కొందరు హద్దుదాటి చాలా కఠినంగా మాట్లాడుతున్నారు. నా కొడుకు బర్త్‌డే రోజున ఇలాంటి కామెంట్స్ చదవడం బాధేస్తోంది. 11 ఏళ్లుగా నన్ను ఒక చెడ్డదానిలా, విలన్‌గా చూస్తున్నారు. ఇదంతా చూసిచూసి నేను విసిగిపోయాను' అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
రేణు దేశాయ్ పోస్ట్‌కి అర్ధం ఏంటి? రెండో పెళ్లికి రెడీనా..?
-
కొందరు అనుకోకుండా మన జీవితంలోకి వస్తారు: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
నటి, దర్శకురాలు రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆమె ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 2012లో పవన్ కల్యాణ్‌తో విడాకులు తీసుకున్న రేణు దేశాయ్ అప్పటి నుంచి తన కుమారుడు అకీరా నందన్‌తో పాటే ఉంటోంది. రేణూ దేశాయ్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన భావాలను వ్యక్తం చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓ వీడియోను షేర్ చేస్తూ తన మనసులోని భావాలను వ్యక్తం చేసింది. రేణు తన ఇన్‌స్టాలో రాస్తూ..' కొంతమంది మీ జీవితంలోకి అనుకోకుండా వస్తారు. వేసవి రోజుల్లో చల్లని వసంత గాలిలా.. వారి చూపులతోనే నేరుగా మీ హృదయంతో మాట్లాడతారు. అదోక రహస్యమైన భాష. మీరు వారితో కొన్ని గంటలు గడిపినప్పటికీ.. వారి ప్రభావం మీపై శాశ్వతంగా ఉంటుంది.. కానీ వాటిలో చాలా వరకు బాధాకరమైనవి కూడా ఉండొచ్చు. కానీ కొందరు మాత్రమే మీ జీవితాన్ని పరిపూర్ణం చేస్తారు. మీ కన్నీళ్లను తుడిచి.. కాంతిని పంచుతారు. అలాగే మిమ్మల్ని నవ్విస్తారు కూడా.' అంటూ పోస్ట్ చేసింది. అయితే ప్రస్తుతం రేణు దేశాయ్ తన కుమారుడు అకీరా నందన్ కోసం ఫారిన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఫ్లైట్‌లో తన కుమారుడితో ఉన్న వీడియోను అభిమానులతో పంచుకున్నారు. కాగా.. గతంలో ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
తొలి సినిమాతో హిట్.. ఆ తర్వాత అవుట్..!
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా స్టార్డమ్ సంపాదించడం అంతా ఈజీ కాదు. అలాగే వచ్చిన పేరును నిలబెట్టుకోవడం మరింత సవాలుతో కూడుకున్నది. అలా కొందరు సూపర్ హిట్ మూవీస్‌లో నటించినా ఆ తర్వాత ఇండస్ట్రీలో నిలబడలేకపోయారు. కొందరు హీరోయిన్లు పెళ్లిబంధంతో జీవితంలో సెటిలైతే.. మరికొందరు అసలుకే కనుమరుగైపోయారు. అలా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి.. ఇలా కనిపించకుండా హీరోయిన్ల గురించి తెలుసుకుందాం. నువ్వే కావాలి హీరోయిన్ రిచా హీరోయిన్ రిచా పల్లాడ్ అంటే తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ నువ్వే కావాలి హీరోయిన్ అంటే టక్కున గుర్తుపడతారు. విజయభాస్కర్ దర్శకత్వంలో తరుణ్, రిచా జంటగా నటించిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ప్రేమకథాచిత్రం వచ్చి దాదాపుగా 22 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఈ సినిమాకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ ఇంతవరకు తెలుగులో ఎక్కడా కనిపించలేదు. ప్రస్తుతం భర్తకు సాయంగా ఉంటూ కుటుంబ బాధ్యతలు పోషిస్తున్న రిచా సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ రిచా నిత్యం ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. నువ్వు నేను హీరోయిన్ అనిత బుల్లితెర సెలబ్రిటీ, 'నువ్వు నేను' హీరోయిన్ అనిత.. ఉదయ్ కిరణ్‌తో కలసి నటించింది. శ్రీరామ్', 'నేనున్నాను' వంటి చిత్రాలతో ఆకట్టుకున్న అనితా టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పేసింది. ఆ తర్వాత బాలీవుడ్లో ''తాళ్, కుచ్ తో హై, యే దిల్, కృష్ణా కాటేజ్, రాగిణి ఎంఎంఎస్, హీరో'' లాంటి చిత్రాల్లో నటించింది. ఆమె ఆ తర్వాత యే హై మొహబ్బతే, నాగిన్ సీరియల్స్‌తో బుల్లితెర బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. 2013లో రోహిత్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న అనిత.. ఈ ఏడాది ఫిబ్రవరి 9న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. చిత్రం మూవీ హీరోయిన్ రీమా సేన్ ఉదయ్‌కిరణ్, రీమా సేన్ 'చిత్రం' మూవీలో జంటగా నటించారు. ఈ సినిమా అప్పట్లోనే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో వేరే చెప్పక్కర్లేదు. తొలి సినిమాతోనే రీమాసేన్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు దక్కించుకొని ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. బావనచ్చాడు, మనసంతా నువ్వే, సీమ సింహం, అంజి బంగారం వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆ తర్వాత సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆమె కెరీర్ లో ది బెస్ట్ సినిమా ఏది అంటే యుగానికొక్కడు అని ఆమె చెప్పుకొచ్చారు. సినిమాలకు దూరమైన తరువాత ఆమె 2012లో ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన శివకరణ్ సింగ్‌ను పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నారు బద్రిలో నటించిన రేణు దేశాయ్ పవన్ కల్యాణ్, రేణు దేశాయ్, అమీషా పటేల్ జంటగా నటించిన ‘బద్రి’. ఆ తర్వాత రేణు దేశాయ్ ప్రేమలో పడి పవన్ కల్యాణ్‌ను వివాహం చేసుకుంది. కొంతకాలం ఇద్దరు కలిసి ఉన్నారు. వీరికి ఓ బాబు, పాప జన్మించారు. ఆ తర్వాత కొన్ని కారణాలతో పవన్, రేణు విడిపోయారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకునే రేణు దేశాయ్.. ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. వంశీ మూవీ హీరోయిన్ నమ్రత వంశీ మూవీ సమయంలో మహేశ్ బాబుతో ప్రేమ, ఆ తర్వాత పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇక వీరి పిల్లలు గౌతమ్, సితార గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. అయితే పెళ్లి తర్వాత సినిమా అవకాశాలు వచ్చినా ఆమె నటించలేదు. వివాహం అనంతరం సినిమాలకు దూరంగా ఉన్నారు. అదే విధంగా స్టూడెంట్ నంబర్- 1లో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించిన గజాలా ఆ తర్వాత కొన్ని సినిమాల్లోనే కనిపించింది. అలాగే ఇడియట్ సినిమాలో రవితేజ సరసన కనిపించిన రక్షిత కొద్ది సినిమాలు మాత్రమే చేసింది. 6 టీన్స్ మూవీలో నటించిన రుతిక, సంతోషం మూవీలో చేసిన గ్రేసీ సింగ్, మన్మథుడు మూవీలో నటించిన అన్షు, టక్కరి దొంగ నటించిన లిసా రే, బన్నీ మూవీలో అల్లు అర్జున్‌తో జోడిగా కనిపించిన గౌరీ ముంజల్, దిల్ మూవీలో చేసిన నేహా, ఆర్య మూవీలో అను మెహతా, ఒకటి రెండు సినిమాలతోనే హిట్ సాధించినా ఆ తర్వాత కనుమరుగైపోయారు. -
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రేణూ దేశాయ్
కొన్నేళ్లుగా గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వెల్లడించారు నటి–దర్శకురాలు రేణూ దేశాయ్. తన అనారోగ్యం గురించి రేణు ఓ పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘నా అనారోగ్య సమస్యల గురించి నా సన్నిహితులకు తెలుసు. కానీ ఇప్పుడు నేనే అందరికీ చెప్పాలనుకున్నాను. ఎందుకంటే నాలాగే వివిధ రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న వారు ధైర్యంగా ఉండాలని చెప్పడం కోసం... వారిలో జీవితం పట్ల సానుకూలమైన ఆలోచనలను రేకెత్తించడం కోసం. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనలోని ధైర్యాన్ని, జీవితం పట్ల ఆశను కోల్పోకూడదు. ఎందుకంటే మన కోసం ఎన్నో స్వీట్ సర్ప్రైజెస్ను కాలంప్లా న్ చేసి ఉండొచ్చు’’ అన్నారు రేణు. ప్రస్తుతం చికిత్స చేయించుకుంటున్నానని, త్వరలోనే కోలుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతూ, సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటాననే నమ్మకం ఉందని రేణుదేశాయ్ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
షాకింగ్ విషయం బయటపెట్టిన పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్
తెరపై అందంగా కనిపించి అందరిని అలరించే హీరోయిన్లు ఈమధ్య కాలంలో అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు. ఇటీవలె సమంత మయోసైటిస్ బారిన పడగా, మమతామోహన్ దాస్ విటిలిగో అనే చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. తాజాగా మరో నటి, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోషల్ మీడియా వేదికగా గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని వెల్లడించింది. ''నన్ను దగ్గర్నుంచి చూస్తున్న వాళ్లకి తెలుసు గత కొన్నాళ్లుగా నేను గుండె, ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్నాను. వాటిని ఎదుర్కొనేందుకు శక్తిని కూడగట్టుకుంటున్నాను. నాలాగే ఎవరైనా బాధపడుతుంటే వారిలో ధైర్యాన్ని, పాజిటివ్ ఎనర్జీని నింపేందుకు ఈ పోస్ట్ చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోవద్దు. బలంగా నిలబడాలి. ఏదో ఒక రోజు మన కృషికి తగ్గ ఫలితం లభిస్తుంది. జీవితం మీద మనకు నమ్మకం ఉండాలి. ఈ ప్రపంచం మనకోసం ఎన్నో సర్ప్రైజ్లను ప్లాన్ చేసింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నవ్వుతూ వాటిని ఎదుర్కోవాలి. నాకు ఇప్పుడు చికిత్స జరుగుతోంది. మందులు వాడుతున్నాను. యోగా చేస్తున్నాను. మంచి పోషకాహారాన్ని తీసుకుంటున్నా. త్వరలోనే దీన్నుంచి కోలుకుని షూటింగ్లో పాల్గొంటాను'' అంటూ రేణూ దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. కానీ తనకున్న అనారోగ్యం ఏంటన్నది మాత్రం ఆమె పూర్తిగా రివీల్ చేయలేదు. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
రవితేజ సినిమాతో రేణూ దేశాయ్ రీఎంట్రీ.. ఫస్ట్‌లుక్ రిలీజ్
పూరి జగన్నాథ్ తెరకెక్కించిన బద్రీ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు రేణూ దేశాయ్. ఆ చిత్రం ద్వారానే పవన్ కల్యాణ్‌తో ప్రేమలో పడిపోయారు. వీరిద్దరూ ప్రేమలో ఉండగానే 2003లో పవన్ కల్యాణ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన జానీ చిత్రంలో హీరోయిన్గా నటించారు. అదే రేణూ దేశాయ్ చివరి చిత్రం. ఆ తర్వాత పెళ్లి.. పిల్లలు.. విడాకులు ఇలా రేణూ దేశాయ్ జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. దీంతో ఆమె మళ్లీ తిరిగి సినిమాల వైపు చూడలేదు. దాదాపు 18 ఏళ్ల తర్వాత రవితేజ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు రేణూ దేశాయ్. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రాలలో టైగర్ నాగేశ్వరరావు ఒకటి. 1970లో స్టూవర్టుపురంలోని టైగర్ నాగేశ్వరరావు అనే ఒక దొంగ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు వంశీ.ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను రేణు దేశాయ్ పోషిస్తున్నారు. తాజాగా ఆమె పాత్రకి సంబంధించిన లుక్ ను .. వీడియో క్లిప్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆమె 'హేమలత లవణం' పాత్రలో కనిపిస్తారనీ .. ఆమె పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని చెప్పారు. -
రెండోపెళ్లిపై చర్చకు దారితీసిన రేణు దేశాయ్ కామెంట్స్
నటి, దర్శకురాలు రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆమె ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 2012లో పవన్ కల్యాణ్‌తో విడాకులు తీసుకున్న రేణు దేశాయ్ అప్పటి నుంచి సింగిల్‌గా ఉంటుంది. అయితే గతంలో రేణు దేశాయ్ రెండో పెళ్లిపై వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. జీవితంలో ఒక తోడు అవసరం అని స్వయంగా రేణు దేశాయ్ కొన్ని ఇంటర్వ్యూలో పేర్కొంది. ఈ క్రమంలోనే రెండో పెళ్లికి సిద్ధమైన రేణు దేశాయ్‌కి 2018లో ఓ వ్యక్తితో నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత అతనితో పెళ్లిపై ఇంతవరకు క్లారిటీ లేదు. అయితే తాజాగా రేణు దేశాయ్ చేసిన పోస్ట్‌తో ఆమె రెండోపెళ్లిపై మరోసారి చర్చకు దారితీసింది. 'జీవితంలో అవసరం ఉన్నప్పుడు మనచేయి పట్టుకుని నడిపించే ఒక తోడు కావాలి'.. అంటూ ఇన్‌స్టాలో ఓ పోస్టును షేర్చేసింది. అనంతరం మరో పోస్ట్‌లో.. 'మీ సోల్‌మేట్‌ని వెతకడానికి ముందు మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోండి'.. అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: పొలిటికల్ లీడర్ కుమార్తెతో మంచు మనోజ్ రెండో పెళ్లి! View this post on Instagram A post shared by renu desai (@renuudesai) View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
బ్రేక్‌కి బ్రేక్.. రీ ఎంట్రీ ఇస్తున్న అలనాటి తారలు
సిల్వర్ స్క్రీన్ ఎప్పుడు ఆనందపడుతుంది? తన అభిమాన తార సినిమా తెరకు వచ్చినప్పుడు. సిల్వర్ స్క్రీన్ ఎప్పుడు బాధపడుతుంది... తన అభిమాన తార సినిమాలకు బ్రేక్ ఇచ్చినప్పుడు. ఆ బ్రేక్‌కి బ్రేక్ ఇచ్చి ఆ తారలు మళ్లీ సినిమాలు చేస్తే.. రండి.. రండి.. రండి.. మీ రాక ఎంతో ఆనందమండి అని వెండితెర ఆహ్వానించకుండా ఉంటుందా. ఇక కొందరు తారలు బ్రేక్ తర్వాత చేస్తున్న సినిమాల గురించి తెలుసుకుందాం. 28 ఏళ్ల తర్వాత... బ్యాక్ టు బ్యాక్ జాతీయ ఉత్తమ నటిగా (తమిళ చిత్రం ‘వీడు’– 1987, తెలుగు చిత్రం ‘దాసి’– 1988 చిత్రాల్లోని నటనకు) అవార్డులు సాధించిన అర్చన ప్రేక్షకులకు గుర్తుండే ఉంటారు. ‘నిరీక్షణ’, ‘లేడీస్ టైలర్’, ‘భారత్ బంద్’ వంటి తెలుగు చిత్రాల్లో అర్చన యాక్టింగ్ అదుర్స్ అని అప్పట్లో తెలుగు ప్రేక్షకులు కితాబులిచ్చారు. అర్చన కేవలం తెలుగులోనే కాదు.. తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ భాషల్లోనూ సినిమాలు చేశారు. అయితే మిగతా భాషల్లో అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నా తెలుగు తెరపై నల్లపూస అయిపోయారు అర్చన. 1994లో వచ్చిన ‘పచ్చతోరణం’ తర్వాత మరో తెలుగు మూవీలో ఆమె కనిపించలేదు. ఇప్పుడు అర్చన మళ్లీ తెలుగు డైలాగ్స్ చెబుతున్నారు. ఈ డైలాగ్స్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా నటిస్తున్న ‘చోర్ బజార్’ చిత్రం కోసమే. జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆకాశ్ తల్లిగా కనిపిస్తారు అర్చన. ఈ ఏడాదే ‘చోర్ బజార్’ చిత్రం థియేటర్స్‌కు రానున్నట్లుగా తెలిసింది. అంటే.. దాదాపు 28 సంవత్సరాల తర్వాత అర్చన మళ్లీ తెలుగు తెరపై కనిపించనున్నారన్నమాట. తమిళంలో ఇరవై.. తెలుగులో పది తెలుగులో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ‘శివ’లో హీరోయిన్గా చేసిన అమలను అంత ఈజీగా మర్చిపోలేరు తెలుగు ప్రేక్షకులు. అయితే 1993లో ‘ఆగ్రహం’ తర్వాత అమల తెలుగు సినిమాకు గ్యాప్ ఇచ్చారు. తిరిగి 2012లో ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ చిత్రం ద్వారా తెలుగు తెరపై కనిపించారు. అయితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. ఆ తర్వాత ‘మనం’ (2014) చిత్రంలో అతిథిగా కనిపించినప్పటికీ ఫుల్ లెంగ్త్ రోల్ చేసింది మాత్రం తాజా చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’) లోనే అని చెప్పాలి. శ్రీ కార్తీక్ దర్శకత్వంలో రూపొందిన ఈ ద్విభాషా (తెలుగు, తమిళ) చిత్రంలో శర్వానంద్, రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇందులో శర్వా తల్లి పాత్రలో కనిపిస్తారు అమల. దాదాపు పదేళ్ల తర్వాత తెలుగులో ఫుల్ లెంగ్త్ రోల్లో అమల కనిపించనున్న చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఇక తమిళంలో 1991లో వచ్చిన ‘కర్పూర ముల్లై’ తర్వాత అమల మరో సినిమా చేయలేదు. ఇరవైసంవత్సరాల తర్వాత ‘కణం’ సినిమాతో తమిళ తెరపై ఆమె మళ్లీ కనిపించనున్నారు. రెండు దశాబ్దాలకు మళ్లీ... ‘బద్రి, జానీ’ సినిమాల్లో హీరోయిన్గా నటించిన రేణూ దేశాయ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే. 2003లో వచ్చిన ‘జానీ’ తర్వాత తెలుగులో ఆమె మరో చిత్రం చేయలేదు. 2014లో మరాఠీ చిత్రం ‘ఇష్క్ వాలా లవ్’కి దర్శకత్వం వహించారు కానీ నటిగా వెండితెరపై మాత్రం మెరవలేదు. ఇప్పుడు కనిపించనున్నారు. రవితేజ హీరోగా నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’లో ఓ కీ రోల్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారామె. ఈ సినిమాకు వంశీ దర్శకుడు. ఆల్రెడీ షూటింగ్ మొదలైంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజయ్యే చాన్స్ ఉంది. పదేళ్ల తర్వాత.. ‘వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ’... ఈ డైలాగ్ విన్న వెంటనే జెనీలియా గుర్తు రాకుండా ఉండరు. 2012లో వచ్చిన ‘నా ఇష్టం’ సినిమా తర్వాత జెనీలియా మరో తెలుగు సినిమా సైన్ చేయలేదు. ఇటీవలే ఆమె ఒక తెలుగు చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కిరీటి (వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు) హీరోగా పరిచయం అవుతున్న చిత్రంలో జెనీలియా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత జెనీలియా తెలుగు సినిమావైపు చూశారు. రాధాకృష్ణ దర్శకత్వంలో ద్విభాషా (తెలుగు, కన్నడం) చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల మొదలైంది. డబుల్ ధమాకా ‘గోల్కొండ హైస్కూల్’, ‘స్వామి రా రా’, ‘కార్తికేయ’ వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ‘కలర్స్’ స్వాతి ప్రేక్షకులకు సుపరిచితురాలే. 2017లో వచి్చన ‘లండన్ బాబులు’ తర్వాత ఈ బ్యూటీ తెలుగులో మరో సినిమా చేయలేదు. దాదాపు ఐదేళ్ల తర్వాత తెలుగులో ఆంథాలజీ ఫిల్మ్ ‘పంచతంత్రం’ అంగీకరించారు. అలాగే ఈ సినిమాతో పాటు స్వాతి ‘ఇడియట్స్’ అనే ఫిల్మ్ కూడా చేశారు. స్వాతి, నిఖిల్ దేవాదుల, సిద్ధార్థ్ శర్మ, శ్రీ హర్ష ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న ఈ సినిమాకు ఆదిత్యా హాసన్ దర్శకుడు. అభిõÙక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి నవీన్ మేడారం షో రన్నర్. ఇలా కమ్బ్యాక్లోనే ఒకేసారి రెండు సినిమాలు చేస్తూ డబుల్ ధమాకా ఇస్తున్నారు స్వాతి. వీరే కాదండోయ్... ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో సోనాలీ బింద్రే, రామ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో మీరా జాస్మిన్ కీ రోల్స్ చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఇంకా తెలుగు సినిమాల పరంగా బ్రేక్‌లో ఉన్న మరికొందరు తారలు కూడా రీ ఎంట్రీ లిస్ట్‌లో చేరే అవకాశం ఉంది. -
అకీరా నందన్ సినిమాలు చేయడా? రేణు దేశాయ్ ఏమందంటే?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ నేడు(ఏప్రిల్ 8న) 18వ వడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అతడి తల్లి, నటి రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పెషల్ వీడియో షేర్ చేసింది. ఇందులో అకీరా బాక్సింగ్ నేర్చుకుంటున్నాడు. పంచ్ మీద పంచ్ కొడుతూ బాక్సింగ్ సాధన చేస్తున్నట్లు కనిపిస్తోంది. అభిమానులతో అకీరా వీడియో పంచుకున్న రేణు దేశాయ్ 'అకీరా నాకు మంచి తనయుడు మాత్రమే కాదు ఆద్యకు గొప్ప సోదరుడు కూడా! అలాగే అతడి ఫ్రెండ్స్‌కు మంచి మిత్రుడు కూడా! అతడు ఎంతో మంచి మనసున్న జెంటిల్మెన్. ఈరోజు 18వ పుట్టినరోజు జరుపుకుంటున్న అతడికి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. అకీరాకు బర్త్‌డే విషెస్ పంపుతున్న అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు' అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా తండ్రికి తగ్గ తనయుడు అంటూ అకీరాను ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అయితే ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు అకీరా త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడంటూ ప్రచారం చేయగా దాన్ని రేణు దేశాయ్ తప్పుపట్టింది. అతడికి యాక్టర్ అవ్వాలని లేదని కుండ బద్ధలు కొట్టింది. అంతేకాకుండా అతడు ఇప్పటివరకు ఏ సినిమాకు సంతకం చేయలేదని, దయచేసి పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. View this post on Instagram A post shared by renu (@renuudesai) చదవండి: శంకర్ ఆఫర్‌ను తిరస్కరించిన అగ్ర నటుడు, అసలేం జరిగిందంటే -
రేణూ దేశాయ్ ని ఆప్యాయంగా పలకరించిన చిరంజీవి
-
రీఎంట్రీ ఇస్తున్న రేణు దేశాయ్? ఏకంగా పాన్ ఇండియా మూవీలో
నటి, దర్శకురాలు రేణు దేశాయ్ తెలుగు సినిమాల్లో కనిపించిన చాలా కాలమే అయ్యింది. జానీ సినిమా అనంతరం ఇప్పటివరకు ఆమె సినిమాల్లో నటించలేదు. అయితే తాజాగా ఆమె వెండితెరపై సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నారనే టాక్ వినిపిస్తుంది. రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరావు అనే చిత్రంలో కీలక పాత్ర కోసం రేణు దేశాయ్‌ని సంప్రదించారట. దీనికి ఆమె సైతం పాజిటివ్‌గా రెస్పాండ్ అయినట్లు తెలుస్తుంది. ఇందులో రవితేజ సిస్టర్‌గా రేణు దేశాయ్ కనిపించనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. వంశీ కృష్ణ ఆకెళ్ల డైరెక్ట్ చేస్తున్న ఈ బయోపిక్ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. -
పవన్ కల్యాణ్ కొడుకు అకీరాకి కరోనా పాజిటివ్
Renu Desai And Son Akira Nandan Test Covid19 Positive: దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ సినీ పరిశ్రమలోనూ కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే మహేశ్‌బాబు, మంచు లక్ష్మీ, సత్యరాజ్, రాజేంద్రప్రసాద్, త్రిష సహా పలువురు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా నటి, దర్శకురాలు రేణుదేశాయ్, కొడుకు అకీరా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా రేణు దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. 'అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇంట్లోనే ఉన్నప్పటికీ నేను, అకీరా కరోనా బారిన పడ్డాం. కొన్ని రోజుల క్రితం లక్షణాలు కనిపించగా పరీక్షలు చేస్తే కోవిడ్ పాజిటివ్ అని వచ్చింది. ప్రస్తుతం మేం కోలుకుంటున్నాం. నేను ఇది వరకే రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నా నాకు కరోనా సోకింది. అకీరాకి వ్యాక్సిన్ వేయిద్దాం అనుకునే లోపే అతడికి కూడా కరోనా వచ్చింది. ఈ థర్డ్ వేవ్‌ను చాలా సీరియస్‌గా తీసుకోండి. మాస్కులు ధరించండి. జాగ్రత్తగా ఉండండి' అంటూ రేణు దేశాయ్ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by renu (@renuudesai) -
పెళ్లి కాకుండానే తల్లైన స్టార్ హీరోయిన్స్ వీళ్లే..
List Of 10 Popular Actresses Who Got Pregnant Before Marriage: సినిమా ఇండస్ట్రీలో రిలేషన్‌షిప్‌లు కామనే. కొందరు ఈ రిలేషన్‌ను పెళ్లి దాకా కొనసాగిస్తే.. కొన్ని జంటలు మధ్యలోనే బ్రేకప్ చెప్పేసుకొని ఎవరిదారి వారు చూసుకుంటారు. అయితే మరికొంత మంది మాత్రం మాత్రం పెళ్లికి ముందే గర్భం దాల్చి పిల్లలను కన్నారు. ఈ లిస్ట్‌లో ఉన్న టాప్ హీరోయిన్స్ ఎవరో చూసేయండి.. శ్రీదేవి అతిలోక సుందరి శ్రీదేవి పెళ్లి కాకుండానే తల్లైంది. నిర్మాత బోనీ కపూర్‌తో కొన్నాళ్ల పాటు సహజీవనం చేసిన ఆమె కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే గర్భం దాల్చింది. పెళ్లి జరిగే సమయానికి శ్రీదేవి ఏడు నెలల గర్భవతిగా ఉండటం అప్పట్లో పెద్ద చర్చకే దారి తీసింది. పెళ్లి తర్వాత కొన్నాళ్లుపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. సారిక బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా కొన్నాళ్ల పాటు చక్రం తిప్పన సారిక విలక్షణ నటుడు కమల్‌హాసన్‌తో ప్రేమలో పడింది. ఇద్దరూ కొన్నాళ్ల పాటు లివింగ్ రిలేషన్లో ఉన్నారు. అలా పెళ్లి కాకుండానే వీరికి శ్రుతిహాసన్ జన్మించింది. ఆ తర్వాత రెండేళ్లకు వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. రేణు దేశాయ్ బద్రీ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రేణుదేశాయ్ ఆ సినిమా సమయంలోనే పవన్‌కల్యాణ్‌తో ప్రేమలో పడింది. జానీ సినిమా సమయంలో మరింత దగ్గరైన ఈ జంట కొన్నాళ్ల పాటు సహాజీవనం చేశారు. వీరిద్దరికీ 2004 లో అకీరా పుట్టాడు. అకీరా పుట్టిన ఐదేళ్లకు అంటే 2009 లో వీరిద్దరూ పెళ్లి చేసుకుని భార్య భర్తలయ్యారు. దాదాపు 12 ఏళ్ల అనంతరం వీరు విడిపోయారు. అమీ జాక్సన్ ఐ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి అమీ జాక్సన్. బాయ్‌ఫ్రెండ్ జార్జ్‌తో ఎంగేజ్మెంట్ అనంతరం తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించిన అమీ జాక్సన్ పెళ్లకి ముందే తల్లైంది. అయితే ఇప్పటివరకు ఈ జంట ఇంకా పెళ్లి చేసుకోకపోవడం గమనార్హం. నీనా గుప్తా బాలీవుడ్ నటి నీనా గుప్తా వెస్టిండీస్ క్రికెటర్ వివ్ రిచర్డ్స్‌తో డేటింగ్ చేసింది. ఇక ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో అతడి నుంచి విడిపోయింది. రిచర్డ్స్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చేందుకు ఒప్పుకోకపోవడంతో ఈ జంట విడిపోయారు. సింగిల్ మథర్గానే మసాబాను పెంచింది నానా గుప్తా. కల్కి కొచ్లిన్ బాలీవుడ్ నటి కల్కి కొక్లెయిన్ తొలుత దర్శకుడు అనురాగ్ కశ్యప్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే.. ఆ తర్వాత అతనితో చెడిపోవడంతో విడాకులు తీసుకుంది. తర్వాత హర్ష్ బెర్గ్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. అతన్ని పెళ్లి చేసుకోకుండానే గర్భవతి అయ్యింది. దియా మీర్జా బాలీవుడ్ భామ దియా మీర్జా వైభవ్ రేఖీ అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందే గర్భం దాల్చింది. అయితే గర్భవతి కాబట్టే పెళ్లి చేసుకుంది అని అప్పట్లో దియా మీర్జాపై నెటిజన్లు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. నటాషా బాలీవుడ్ నటి నటాషా క్రికెటర్ హార్దిక్ ప్యాండాతో కొన్నాళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్నారు. పెళ్లికి ముందే నటాషా గర్భం దాల్చింది. -
అకీరా కర్రసాము వీడియో షేర్ చేసిన రేణూ దేశాయ్
-
అకీరా నందన్ అద్భుత విన్యాసం: నెటిజనుల సందడి, వైరల్
సాక్షి, హైదరాబాద్: నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ తనయుడు అకిరా నందన్ తన టాలెంట్‌తో మరో సారి వార్తల్లో నిలిచారు. మార్టల్ ఆర్ట్స్‌లో ఇప్పటికే తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నాడు. అకీరా కర్రసాము చేస్తున్న వీడియోను రేణూ ఇన్‌స్టాలో షేర్ చేశారు. తండ్రి పవన్ కళ్యాణ్ జానీ సినిమాలో లాగా కర్ర సాము ఇరగదీస్తున్నాడంటూ అభిమానులు కామెంట్ చేశారు. తండ్రికి తగ్గ తనయుడంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అకీరా ఒడుపుగా కర్రసాము చేస్తున్న వీడియోకి రేణూ పాప్ స్టార్ మైకేల్ జాన్స్ బిల్లీ జీన్ సాంగ్‌ను యాడ్ చేశారు. ఈ అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అంతేకాదు జానీ-2 పేరుతో అకీరాని పరిచయం చేయమంటూ ఫ్యాన్స్ సలహా ఇస్తున్నారు. కాగా కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో అకీరా ఎంట్రీపై ఇపుడు తానేమీ చెప్పలేనని, సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెబుతానంటూ ఇటీవల వ్యాఖ్యానించిన రేణూ దేశాయ్ అకీరా తెరంగేట్రం ఊహాగానాలకు మరింత ఉత్సాహాన్నిచ్చారు. కరాటే, కుంగ్ ఫూ వంటి మార్షల్ ఆర్ట్స్ లో అకీరా పాపులర్ అవుతున్న సంగతి తెలిసిందే. @PawanKalyan ❤️🙏 దేవర తండ్రికి తగ్గ 🔥 తనయుడు #AkiraNandan 😍🥰@ganeshbandla #PawanKalyan #HariHaraVeeraMallu #BheemlaNayak #PSPKRanaMovie #ProductionNo12 #PSPK28 pic.twitter.com/5IpG7bNDJV — SHOBAN NAIDU (@pagadalapavan00) August 3, 2021 -
హల్చల్ : కత్రినా క్యూట్ లుక్స్.. ఊర్వశి మెరుపులు
♦ గోల్డెన్ డ్రెస్‌లో మెరిసిపోతున్న ఊర్వశి ♦ ట్రెడిషనల్ అవుట్‌ఫిట్‌లో శిల్పారెడ్డి ♦ ఆ హుక్ స్టెప్ నా ఫేవరేట్ అంటున్న శిల్పా శెట్టి ♦ సంతోషంగా ఉన్నప్పుడు సెల్ఫీ తీసుకోవాలంటున్న హరితేజ ♦ రీల్స్‌తో అదరగొడుతున్న టిక్‌టాక్ స్టార్స్ ♦ రీల్స్ పోస్ట్ చేసిన ప్రగ్యా జైస్వాల్ ♦ అకీరాతో ఫోటో షేర్ చేసిన రేణు దేశాయ్ ♦ సినిమా షూటింగ్లో పాల్గొన్న ఝాన్సీ ♦ ఈ వారం అద్భుతంగా ఉండబోతుందన్న ఉపాసన ♦ నో మేకప్లుక్ ఫోటో షేర్ చేసిన నటి షెఫాలి View this post on Instagram A post shared by SHILPA REDDY (@shilpareddy.official) View this post on Instagram A post shared by syamala Anchor (@syamalaofficial) View this post on Instagram A post shared by Jhansi (@anchor_jhansi) View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) View this post on Instagram A post shared by Sai Pavani Raju 🇮🇳 (@nayani_pavani) View this post on Instagram A post shared by renu (@renuudesai) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) View this post on Instagram A post shared by Shefali Jariwala 🧿 (@shefalijariwala) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) -
అకీరా గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన రేణూ దేశాయ్
నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. సినిమా అప్డేట్స్తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. అలాగే కొడుకు అకీరా, కూతురు ఆధ్యకు సంబంధించిన విషయాలను కూడా ఎప్పుకప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇంటికే పరిమితమైన రేణూ.. ఆపదకాలంలో ప్రజలకు తోడుగా తనవంతు సాయం చేస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా తన ఫాలోవర్స్‌తో మాట్లాడుతూ ధైర్యాన్ని అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది నెటిజన్లు అకీరా ఎంట్రీ గురించి పదేపదే అడుగుతున్నారు. నెటిజన్ల పోరు భరించలేక.. సింపుల్‌గా ఒక పోస్ట్పెట్టి తప్పించుకున్నారు రేణూ దేశాయ్. అకీరా ఎంట్రీ గురించి చెప్పే సమయం ఇది కాదని, కోవిడ్ గురించి అందరూ భయపడుతున్న పరిస్థితుల్లో తానేమీ చెప్పలేనని, కాకపోతే సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెబుతానని రేణు అన్నారు. దీంతో త్వరలోనే అకీరా ఎంట్రీ ఉంటుందిని అంతా భావిస్తున్నారు. మరోవైపు రేణూ దేశాయ్ అకీరాతో దిగిన ఫొటోని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘ఈ ప్రపంచంలో నన్ను చెప్పలేనంత ఆనందంలో ముంచెత్తగల ఒకే ఒక్కడు అకీరా. అతని జోకులు వింటుంటే నా జోకులే నన్ను నవ్విస్తున్నట్టు ఉంటుంది’అని రేణు చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by renu (@renuudesai) చదవండి: ఈ బ్యాంకులో ఖాతా ఉందా? రేణూ దేశాయ్ షాకింగ్ పోస్ట్ అలాంటి మెసేజ్‌లు చేస్తే పోలీసులకు చెప్తా: రేణు దేశాయ్ -
ఈ బ్యాంకులో ఖాతా ఉందా? రేణూ దేశాయ్ షాకింగ్ పోస్ట్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నటి రేణూ దేశాయ్‌కు చేదు అనుభవం ఎదురైంది. సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటూ, ఇటీవల కరోనా బాధితులకు అండగా నిలుస్తున్న రేణూ బ్యాంకింగ్ వ్యవహారాలపై ఒక షాకింగ్ విషయాన్ని ఇన్‌స్టాలో షేర్ చేశారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను కూడా పోస్ట్ చేశారు. దీంతో సదరు బ్యాంకు ఖాతాదారులతో ఇతరులు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇది చాలా తీవ్రమైన తప్పు. మన ఖాతాలో వేరొకరు లాగిన్ అయ్యి నగదు బదిలీ చేసే అవకాశా లున్నాయంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వక్తం చేశారు. రేణూ దేశాయ్ పంచుకున్న విషయాల ప్రకారం... ఆమె ఇండస్ఇండ్ బ్యాంకు మొబైల్ యాప్‌లోకి లాగిన్ అయినప్పుడు, అది వేరొకరి ఖాతాలోకి లాగిన్ అయింది. అంతేకాదు సదరు ఖాతాలోని పూర్తి వివరాలను కూడా చూడగలిగారు. దీంతో తాను షాక్ అయ్యాను అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రేణూ వివరాలను షేర్ చేశారు. హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసినా వారు సీరియస్‌గా తీసుకోలేదంటూ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ తీసుకున్న వెంటనే ఈ ఖాతా నుండి లాగ్ అవుట్ అయ్యానంటూ వివరించారు. కస్టమర్లకు ఆ బ్యాంకు ఇస్తున్న భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ఆమె తన అకౌంట్‌ను సోమవారం క్లోజ్ చేయబోతున్నట్టు కూడా వెల్లడించారు. బ్యాంకింగ్ లావాదేవీలు, భద్రతాలోపాలపై విమర్శలు గుప్పిస్తూ కొంతమంది నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరికొంతమంది ‘డిజిటల్ ఇండియా’ అంటూ వ్యంగ్యోక్తులు విసురుతున్నారు. మరి ఈ మొత్తం వ్యవహారంపై ఇండస్ ఇండ్ బ్యాంకు ఎలా స్పందిస్తుందో చూడాలి. చదవండి: Digital Rules: ట్విటర్‌కు ఫైనల్ వార్నింగ్ View this post on Instagram A post shared by renu (@renuudesai) -
'డబ్బులివ్వకపోతే చస్తాం', రేణు దేశాయ్ ఆగ్రహం
'పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు' అన్న చందంగా సాయం చేసే మనుషులకే అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతాయి. మంచి మనసుతో సాయం చేద్దామని సంకల్పించినవారికి తోడుగా నిలబడతారో లేదో కానీ వారు చేసే పనిని మాత్రం ప్రశ్నించేందుకు, అందులో తప్పులు వెతికేందుకు రెడీగా ఉంటారు. టాలీవుడ్ నటి, నిర్మాత రేణు దేశాయ్ సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని కరోనా పేషెంట్లకు బెడ్లు, ఆక్సిజన్, మందులు వంటి వాటిని అందించేందుకు ఎంతగానో కృషి చేస్తోంది. అయితే ఆమె చేస్తున్న పనిని ప్రశంసించాల్సింది పోయి కొందరు నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఉన్నవారికే సాయం చేస్తున్నావంటూ నిష్టూరంగా మాట్లాడారు. దీంతో తను అందరికీ సమానంగా సహాయం చేస్తున్నానని రేణు దేశాయ్ గతంలోనే క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఇప్పుడు తనకు మరో సమస్య ఎదురైంది. డబ్బు సాయం చేయకపోతే చచ్చిపోతామంటూ బెదిరింపులు వస్తున్నాయని ఆమె వాపోయింది. ఇలాంటి మెసేజ్‌లు చేస్తే పోలీసులను ఆశ్రయించాల్సి వస్తుందని హెచ్చరించింది. తను ఎవరికీ ఆర్థిక సాయం చేయలేనని మరోమారు స్పష్టం చేసింది. ఆక్సిజన్ సిలిండర్లు, ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్లు, కరోనా రోగులకు ఆహారం, మందులు, నిత్యావసరాలు మాత్రమే అందించగలనని తెలిపింది. View this post on Instagram A post shared by renu (@renuudesai) View this post on Instagram A post shared by renu (@renuudesai) చదవండి: Manchu Lakshmi: పోలీసులకు ‘మంచు’ లంచ్ ‘బంగార్రాజు’లో చైతన్యకు జోడిగా సమంత కాదు ఆ హీరోయిన్ అట! -
Manchu Lakshmi: పోలీసులకు ‘మంచు’ లంచ్
బంజారాహిల్స్ (హైదరాబాద్): లాక్డౌన్ సమయంలో రాత్రింబవళ్లు కష్టపడుతున్న పోలీసులకు తనవంతు సాయం చేసేందుకు ప్రముఖ సినీనటి మంచు లక్ష్మి ముందుకు వచ్చారు. ఫిలింనగర్‌లోని సీవీఆర్ న్యూస్ చౌరస్తా చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులు మధ్యాహ్న భోజనానికి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మంచు లక్ష్మి వారంరోజుల నుంచి లాక్డౌన్ విధులు నిర్వహిస్తున్న 50 మంది పోలీసులకు లంచ్ పంపిస్తున్నారు. ఇంట్లో వంట మనిషితో 50 మందికి సరిపడా భోజనాన్ని తయారు చేసించి తన సిబ్బంది ద్వారా పంపిస్తూ పెద్ద మనసును చాటుకుంటున్నారు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ పోలీసులతోపాటు, ట్రాఫిక్ పోలీసులు మంచు లక్ష్మి పంపించిన భోజనాన్ని తింటున్నారు. డ్యాన్సర్ల కోసం కదిలిన దంపతులు.. సినిమా, ఈవెంట్, ఇతర షోలలో పనిచేసే సుమారు వందమంది డ్యాన్సర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు డ్యాన్స్ మాస్టర్ ఆట సందీప్‌తో పాటు ఆయన భార్య జ్యోతిరాజ్ ముందుకు వచ్చారు. వీరిద్దరు కలసి నిధుల సేకరణకు నడుం బిగించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ ప్రయత్నంలో తమకు సాయం చేయడమేకాక సంపూర్ణ మద్దతు ఇచ్చారని ఈ సందర్భంగా వారు తెలిపారు. కరోనా రోగుల కోసం రేణుదేశాయ్.. సినీనటి రేణుదేశాయ్ కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలసి కరోనా రోగులకు తనవంతు సాయం చేస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్లు, ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్లు, కరోనా రోగులకు ఆహారం, మందులు తదితర అవసరాల కోసం ఆమెకు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో వివరాలు పంపిస్తే సహాయం చేస్తున్నారు. రోగి పేరు, ఆస్పత్రి పేరు, ఏ నగరం, ఎలాంటి సాయం కావాలో తెలుపుతూ ఫోన్ నంబర్లు పంపిస్తే చాలు.. ఆమె హైదరాబాద్, బెంగళూరు, చెన్నైనగరాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో తనవంతు సాయం అందిస్తున్నారు. గురువారం ఒక్కరోజే ఆమెకు 200 వినతులు వచ్చాయి. వాటన్నింటినీ పరిశీలించి ఎవరికి ఏం అవసరమో వాటిని జాబితా రూపొందించి సంబంధిత ఎన్జీవోలకు పంపిస్తుంటానని.. ఆయా సంస్థలవారు బాధితులకు సాయం అందజేస్తారని ఆమె తెలిపారు. -
డబ్బున్నోడికే సాయం: కౌంటరిచ్చిన రేణు దేశాయ్
సరదా కోసం, సినిమా ప్రమోషన్ల కోసం వాడుకునే సోషల్ మీడియాను కోవిడ్ కాలంలో పేషెంట్ల కోసం, ఆపదలో ఉన్నవారి కోసం సమర్థవంతంగా వినియోగిస్తున్నారు. బెడ్లు దొరక్క, ఆక్సిజన్ అందక, మందులు లేక సతమతమవుతున్న ఎంతోమందికి సోషల్ మీడియా పరిష్కార మార్గాన్ని చూపిస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకున్న పలువురు సెలబ్రిటీలు ఆపత్కాలంలో ఉన్నవారిని ఆదుకునేందుకు తమవంతు సాయం చేస్తున్నారు. నటి, దర్శకురాలు రేణు దేశాయ్ కూడా ఈ కోవలోకే చెందుతుంది. అయితే ఆమె చేస్తున్న ఈ మంచిపనిని ఓ నెటిజన్ తప్పు పట్టాడు. సాయం చేస్తున్నా అంటూ కేవలం ధనవంతులనే పట్టించుకుంటున్నారని విమర్శించాడు. మధ్య తరగతి వాళ్లకు సాయం చేయడం లేదని నిందించాడు. డబ్బులు ఉన్నవాళ్లవే ప్రాణాలు కానీ మధ్య తరగతి మనుషులవి ప్రాణాలు కాదా? అని నిలదీశాడు. దీంతో రేణు దేశాయ్ ఈ మెసేజ్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ వివరణ ఇచ్చుకుంది. "10, 12 రోజులుగా నాకు తోచినంత సాయం చేస్తూ వస్తున్నాను. మీరు నన్ను ప్రశ్నించడానికి నేనేమీ రాజకీయ నాయకురాలిని కాదు, మీరు ఎన్నుకున్న లీడర్‌ను అసలే కాదు. ఇలాంటివి మీరు ఓటేసిన వ్యక్తి దగ్గరకు వెళ్లి ప్రశ్నించండి. కొందరు హెల్ప్ చేస్తారా? లేదా? అంటూ దురుసుగా మాట్లాడుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటివి చూస్తుంటే మంచి చేయాలన్న నా లక్ష్యం దెబ్బతింటుంది. ఒకవేళ పొరపాటున మీ మెసేజ్‌ను వదిలేసుంటే మరొకసారి గుర్తు చేయండి. ఎందుకంటే ఓవైపు సాయాన్ని అర్థిస్తూ, మరోవైపు పనికిరాని చెత్త మెసేజ్‌లతో నా ఇన్‌బాక్స్ నిండిపోయింది. కాబట్టి ప్లీజ్, దయచేసి అర్థం చేసుకోండి' అని రేణు దేశాయ్ అభ్యర్థించింది. View this post on Instagram A post shared by renu (@renuudesai) చదవండి: నెటిజన్లపై రేణూ దేశాయ్ ఫైర్.. ప్రాణాలు పోతున్నాయంటూ.. -
ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి.. సాయం చేస్తా: రేణు దేశాయ్
కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి రోజురోజుకూ ఉధృతం అవుతోంది. హాస్పిటల్లో బెడ్స్ దొరక్క పోవడం, ఆక్సిజన్ సిలిండర్ల కొరతతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇలాంటి ఇబ్బందులు ఉన్నవారికి నా వంతు సాయం చేస్తానంటున్నారు నటి, దర్శకురాలు రేణూ దేశాయ్. ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో అభిమానులతో మాట్లాడుతూ– ‘‘సోషల్ మీడియాను సినిమా ప్రమోషన్స్ కోసం వాడుకునే వాళ్లు కూడా గత పదిహేను రోజులుగా కోవిడ్ సమాచారాన్ని చేరవేస్తూ ప్రజల ప్రాణాలను కాపాడుతుండటం సంతోషం. నా ఇన్స్టాగ్రామ్ మెసేజ్ ఇన్ బాక్స్ ఇప్పటి నుంచి ఓపెన్‌లో పెడతా. ప్లాస్మా లేదా ఆక్సిజన్ సిలిండర్లు లేదా హాస్పిటల్స్‌లో బెడ్స్ లేదా మందులు.. వంటివి అవసరం ఉంటే నాకు మెసేజ్ చేస్తే, వారికి సహాయం చేయడానికి నా వంతు కృషి చేస్తాను. నిజంగా అవసరం ఉన్నవారే మెసేజ్ ద్వారా కాంటాక్ట్ అవ్వాలి. గతంలో జరిగిన కొన్ని చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక సహాయం మాత్రం చేయలేను’’ అన్నారు. చదవండి: (అబ్బురపరిచే అమ్మాయి... అవ్నీత్ కౌర్!) View this post on Instagram A post shared by renu (@renuudesai) -
మన శరీరం కేవలం అందుకోసమే కాదు కదా : రేణు దేశాయ్
రేణు దేశాయ్.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. సమాజంలోని సమస్యలపై మాట్లాడటంలో, తన అభిప్రాయాలు పంచుకోవడంలో ముందుంటారామె. తాజాగా కరోనా పరిస్థితిపై ఇన్స్టాగ్రామ్ వేదికగా తన స్టైల్లో స్పందించారు. 'బాధలు, ద్వేషం వంటి వాటిని లెక్కలేనంతగా మోసి మోసి మనం గాడిదల్లా తయారవుతున్నాం. కానీ కేవలం భాధ పడటానికి ఈ శరీరం లేదు కదా.. బాధల్లో కూడా చిన్న చిన్న సంతోషాలను వెతుక్కొని ఆనందంగా ఉండాలి. మనమంతా ఇప్పుడు చావు, బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాం. అయితే సంతోషంగా ఉండటానికి ఏది అవసరమో అది చేయండి. స్టాండప్ కామెడీ వీడియోలు కానీ, క్యూట్ పప్పీ(కుక్కపిల్ల)ల వీడియోలు చూడండి. ఈ కష్టకాలం కూడా ఎక్కువ రోజులు ఉండదు అది వెళ్లిపోవాల్సిందే. అదే కాలానికి ఉన్న గొప్పదనం. అదే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. జాగ్రత్తలు పాటించండి. సురక్షితంగా ఉండండి' అంటూ ఎంతో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం రేణు దేశాయ్ బుల్లితెరపై ఓ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. View this post on Instagram A post shared by renu (@renuudesai) చదవండి : వైరల్ : పవన్ కల్యాణ్‌తో ఫోటో షేర్ చేసిన రేణు దేశాయ్ హాట్ టాపిక్‌గా మారిన పవన్ కల్యాణ్ రెమ్యూనరేషన్ -
వైరల్ : పవన్ కల్యాణ్‌తో ఫోటో షేర్ చేసిన రేణు దేశాయ్
రేణు దేశాయ్, పవన్‌కల్యాణ్ జంటగా నటించిన చిత్రం బద్రీ. ఈ సినిమా వచ్చి నేటికి (మంగళవారం) 21 ఏళ్లు పూర్తవుతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన నిలిచిన ఈ మూవీలో డైలాగ్స్ యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో అమీషా పటేల్ మరో హీరోయిన్గా నటించగా, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాతో పూరీ జగన్నాథ్ డెబ్యూ డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. బద్రీ విడుదలై నేటికి 21 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రేణు దేశాయ్ సైతం తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'ఏ చికితా'.. పాటకు సంబంధించిన ఫోటోను షేర్ చేసుకుంది. ఇందులో పవన్‌కల్యాణ్ తుపాకీ పట్టుకొని ఉండగా, రేణు దేశాయ్ తన ముఖాన్ని చున్నీతో కప్పుకుంది. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు దీన్నే సన్‌స్క్రీన్‌గా ఉపయోగించినట్లు ఫన్నీగా కామెంట్ చేసింది. ఇక ఈ సినిమాతో రేణు దేశాయ్ హీరోయిన్గా పరిచయం అయ్యింది. బద్రీ సినిమా షూటింగ్ సమయంలోనే పవన్, రేణుల మధ్య ప్రేమ చిగురించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొంతకాలం సహజీవనం అనంతరం ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నా ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. ఆ తర్వాత పవన్ అన్నా లెజ్నోవాని పెళ్లి చేసుకోగా, రేణు దేశాయ్ సైతం ఓ బిజినెస్‌మెన్‌తో నిశ్చితార్థం అయినట్లు ప్రకటించింది. అయితే పెళ్లి గురించి ఇప్పటివరకు రేణు దేశాయ్ ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. View this post on Instagram A post shared by renu (@renuudesai) చదవండి : హీరోయిన్ అంజలా జవేరీ భర్త 'విలన్' అని మీకు తెలుసా? పెళ్లికి రెడీ అయిన కమెడియన్లు, ఎప్పుడంటే? -
గ్లామర్ డోసు పెంచిన సమంత.. పనిపై ఫోకస్ పెట్టిన అఖిల్
శారీ బట్ నాట్ సారీ అంటూ చీరకట్టులో కనిపించి ఆకట్టుకుంటోంది లావణ్య త్రిపాఠి ఫ్యామిలీతో కలిసి కేరళలో ఎంజాయ్ చేస్తుందిన యాంకర్ అనసూయ హాట్ ఫోటోతో కుర్రకారు మతులు పోగొడుతోన్న సమంత బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్‌లో దర్శనం ఇచ్చి ఆదరగొట్టాడు యంగ్ హీరో అఖిల్ View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Vaani Kapoor (@_vaanikapoor_) View this post on Instagram A post shared by Akhil Akkineni (@akkineniakhil) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Dhanya Balakrishna (@dhanyabalakrishna) View this post on Instagram A post shared by renu (@renuudesai) View this post on Instagram A post shared by RGV (@rgvzoomin) -
మూగజీవాన్ని రక్షించిన హీరో, రేణూ ప్రశంస
‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’ వంటి విలక్షణమైన హిట్ చిత్రాల్లో నటించి, హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు అడివి శేష్. అయితే అతడు చేసిన ఓ మంచిపనికి నటి రేణు దేశాయ్ మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఇంతకీ అడివి శేష్ ఏం చేశాడో తెలుసుకునేందుకు ఇది చదివేయండి.. హీరో అడివిశేష్ ఆదివారం రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఓ వీధిలో పిల్లికూన కనబడింది. తీవ్రమైన ట్రాఫిక్‌తో అది బెంబేలిత్తిపోయి ఉంది. సుమారు నాలుగైదు వారాల వయసున్న దానికి సమీపంలో తల్లి కూడా తారసపడలేదు. దీంతో అడివి శేష్ దాని తల్లిని వెతికి చూశారు, కానీ అదెక్కడా కనిపించలేదు. వెంటనే భయంతో బిగుసుకుపోయిన దానిని చేతుల్లోకి తీసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. సినిమాటోగ్రాఫర్ షనైల్‌డియో ఇందుకు సహకరించాడు. అయితే దాన్ని ఎవరికి అప్పజెప్పితే బాగుంటుందా? అని ఆలోచించగానే వెంటనే రేణు దేశాయ్ గుర్తొచ్చింది. ఇంకేముందీ దీన్ని పెంచుకోమని అతడు రేణూకు చెప్పడం, పిల్లులని ప్రేమగా చూసుకునే ఆమె అతడు చేసిన మంచిపనిని మెచ్చుకుంటూనే పెంచుకునేందుకు ఓకే చెప్పేయడం చకాచకా జరిగిపోయాయి. ఈ స్టోరీనంతా హీరో అడివి శేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. ముద్దొస్తున్న పిల్లికూన ఫొటోను సైతం షేర్ చేశాడు. (చదవండి: ఆ రోజు ‘మేజర్’ డే అంటున్న మహేష్) ఇదిలా వుంటే ప్రస్తుతం అడివి శేష్ మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా చిత్రం మేజర్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికష్ణన్ జర్నీని, ఆయన జీవన శైలిని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శశికిరణ్ తిక్క. ఈ చిత్రాన్ని మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఇండియా నిర్మిస్తోంది. శోభితా దూళిపాళ్ల, ప్రకాశ్ రాజ్, సయీ మంజ్రేకర్, రేవతి, మురళీ శర్మ తదితరులు నటిస్తున్నారు. (చదవండి: సర్కారు వారి పాటలో మోనాల్ గజ్జర్!) View this post on Instagram A post shared by Sesh Adivi (@adivisesh) -
సింగర్ సునీత వెడ్డింగ్.. సుమ డాన్స్ అదరహో
టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత ఇటీవల రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. జనవరి 9న హిందూ సంప్రదాయాల ప్రకారం జరిగిన ఈ వివాహ వేడుకకు శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లి శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయం వేదికగా నిలిచింది. ఈ వివాహ వేడుకలో పలువురు ప్రముఖులు కూడా పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఇక పెళ్లి తర్వాత సింగర్ సునీత మరింత బిజీ అయ్యారు. సినీ ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉంటూ బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఎక్కువ సమయాన్ని భర్త రామ్ వీరపనేని, కుటుంబ సభ్యులతో గడపడానికే కేటాయించింది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సునీత.. తన పెళ్లికి సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంది. అలాగే ప్రీ వెడ్డింగ్, మెహందీ ఫంక్షన్‌కు సంబంధించిన వీడియోలను షేర్ చేసి తన ఆనందాన్ని ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఆ సమయంలో ఈ వీడియోలో ఎంత వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా సునీత మరో వీడియోను రిలీజ్ చేశారు. సునీత రామ్ వీరపనేని వెడ్డింగ్ ఫిల్మ్ టీజర్ పేరుతో వచ్చిన ఈ వీడియోలో పెళ్లి రోజు ఆమె ఇంట్లో జరిగిన హడావిడి ఉంది. తన ఇద్దరి పిల్లలతో సునీత ఆడుకోవడం, రింగులు మార్చుకోవడం, మెహందీ ఫంక్షన్, హల్దీ ఫంక్షన్లో జరిగిన సందడిని చూపించారు. రేణు దేశాయ్‌తో పాటు ఆమె కుమార్తె ఆధ్య కూడా ఈ వీడియోలో కనిపించారు. ప్రముఖ యాంకర్ సుమ అయితే మెహందీ పెట్టుకొని మరీ డాన్స్ చేసింది. ఇక సునీత నవ్వులు ఈ వీడియోకి హైలెట్‌గా నిలిచిందని చెప్పొచ్చు. సునీత తన అఫీషియల్ యూ ట్యూబ్ ఛానెల్లోనే ఈ వీడియోను విడుదల చేసింది. -
‘సర్కారు వారి పాట’పై స్పందించిన రేణు దేశాయ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్‌కు కరోనా పాజిటివ్ అంటూ ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన రేణు ఇదంతా ఉట్టి పుకార్లేనని, తనపై ఎలాంటి వార్తలు వచ్చిన నమ్మద్దోని సూచించారు అభిమానులకు సూచించారు. ఒకవేళ ఏదైనా ఉంటే తానే స్పష్టం చేస్తానన్నారు. ఈ క్రమంలో ఆమె మహేష్ బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’లో నటిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఆమె మహేష్‌కు వదినగా నటిస్తున్నట్లు కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల లైవ్ చాట్‌లో పాల్గొన్న రేణు ‘సర్కారు వారి పాట’ సినిమాలో తను నటించడం లేదని స్పష్టం చేశారు. ‘ఈ వార్తలో ఏమాత్రం నిజం లేదు. ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి పుట్టిస్తారో అర్థం కావడం లేదు. ఇంతకు ముందు కూడా నేను 'మేజర్' సినిమాలో నటించనున్నట్లు ప్రచారం చేశారు. ఇప్పడు మహేష్‌కు వదినగా నటిస్తున్నానని ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ నేను నటిస్తే ఆ విషయాన్ని స్వయంగా ప్రకటిస్తాను’ అంటూ ఆమె చెప్పకొచ్చారు. (చదవండి: అడవి శేష్ ‘మేజర్’ ఫస్ట్ లుక్ పోస్టర్..!) ఇక తెలుగులో సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించినా రేణు ఇప్పటికే ఓ చిత్రాన్ని పూర్తి చేసినట్లు చెప్పారు. అంతేగాక మరో రెండు సినిమాల కథలు విన్నానని, వాటిని ఫైనలైజ్ చేయాల్సి ఉందని ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు. దీనితో పాటు రైతుల సమస్యలపై ఓ సినిమాను నిర్మించేందుకు కూడా అన్నీ సిద్ధం చేసుకుంటున్నట్లు వివరించారు. కాగా ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘సర్కారు వారి పాట’ను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు నిర్మించనున్నాయి. ఇందులో కీర్తీ సురేశ్ తొలిసారిగా మహేష్‌కు ఈ సినిమాతో జోడికట్టారు. బ్యాంక్ స్కామ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ బ్యాంక్ ఉద్యోగిగా కనిపించనున్నారు. (చదవండి: రేణూ దేశాయ్‌కు కరోనా?: నటి స్పందన) View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
రేణూ దేశాయ్‌కు కరోనా?: నటి స్పందన
నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరు చుట్టొస్తుందట. ఊరేంటి ఈ విశ్వాన్నే చుట్టేస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చాక నిజానికి, అబద్ధానికి మధ్య ఉన్న సన్న గీత చెరిగిపోయినట్లైంది. అంతే కాదు సత్యాల కన్నా అసత్యాలనే ఎక్కువగా నమ్ముతున్నారు. నిజానిజాలు తెలీకుండానే అపోహలను నమ్మేస్తూ అదే నిజమని తెగ షేరింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో హీరో పపన్ కల్యాణ్ మాజీ భార్య, నటి, దర్శకురాలు రేణు దేశాయ్‌కు కరోనా సోకిందంటూ ఓ వార్త తెగ వైరల్ అయింది. దీంతో కలవరపడ్డ కొందరు పవన్ అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేశారు. దీంతో ఈ విషయంపై స్పందించిన రేణూ దేశాయ్ తనకు కరోనా సోకలేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన కరోనా రిపోర్టును కూడా షేర్ చేశారు. "నాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. నిన్న ఓ ఫంక్షన్‌కు వెళ్తే అందరూ నన్ను అదోలా చూశారు. నాకసలు బాధ్యత లేని మనిషిని అన్నట్లుగా చూపులతో గుచ్చారు. అందుకే ఈ పోస్టు పెడుతున్నా. నాకు కరోనా వస్తే ఆ విషయాన్ని స్వయంగా నేనే వెల్లడిస్తాను, అంతేకాదు బాధ్యత గల వ్యక్తిగా ఎటువంటి కార్యక్రమాలకు కూడా హాజరవను" అని తేల్చి చెప్పారు. తనకు కరోనా అంటూ తప్పుడు వార్తలను రాసినవారిపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది నిజం? ఏది అబద్ధమో తెలుసుకుని రాయండని అసహనానికి లోనయ్యారు. ఇలా అడ్డదిడ్డంగా రాసే వార్తలను నమ్మకండని అభిమానులకు సూచించారు. వాళ్లు కేవలం సెలబ్రిటీల మీద తప్పుడు వార్తలు రాస్తూ బతుకుతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అబద్ధాల పుట్టలు సృష్టించే అకౌంట్లను అస్సలు ఫాలో అవకండని మరీ మరీ చెప్పారు. 'చాలామంది ఈ విషయం గురించి పట్టించుకోకండని చెప్పారు. కానీ కరోనా జోక్ చేసుకునేంత చిన్న విషయం కాదు. ఇది చాలా సీరియస్ విషయం. అందుకే నేను మౌనంగా ఉండలేకపోయాను. ఇలాంటి ఫేక్ న్యూస్‌ను దయచేసి నమ్మకండి అని కోరారు. ఇదిలా వుంటే బద్రి, జానీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన రేణూ దేశాయ్ 'ఆద్య' అనే పవర్ఫుల్ లేడీ ఓరియెంటెడ్ ప్యాన్ ఇండియా చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుడుతున్నారు. ఈ సినిమాతో ఎం.ఆర్ కృష్ణ మామిడాల దర్శకుడిగా పరిచయం అవుతుండగా డీఎస్ రజనీకాంత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. (చదవండి: అకిరా, ఆధ్యతో పవన్.. మురిసిపోతున్న రేణు) -
పవన్ ఫొటో షేర్ చేసిన రేణు దేశాయ్
ముంబై: రేణు దేశాయ్.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ‘బద్రి’ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు జోడిగా నటించిన ఆమె పవన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వార్దిదరూ విడిపోయి వేరుగా ఉంటున్నారు. వీరికి కుమారుడు అకిరా నందన్, కూతురు ఆధ్యలు ఉన్న విషయం తెలిసిందే. అయితే పవన్, రేణులు విడిపోయినప్పటికి తామీద్దరం స్నేహితులమేనని, తాము ఎప్పుటికి మంచి శ్రేయోభిలాషులుగా ఉంటామంటూ రేణు పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంతేగాక పవన్ కూడా అప్పడప్పుడు వారి దగ్గరికి వెళుతుంటారని పిల్లలతో సరదాగా సమాయాన్ని గుడుపుతుంటారని ఆమె చెప్పేవారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ కొడుకు అకిరా, కూతురు ఆధ్యలను ఒళ్లో కూర్చోపెట్టుకున్న బ్లాక్ అండ్ వైట్ ఫొటోను రేణు దేశాయ్ బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. (చదవండి: లగ్జరీ కార్లను అమ్మేసిన రేణు దేశాయ్..) View this post on Instagram A post shared by renu desai (@renuudesai) ఈ ఫొటోకు రేణు.. ‘కొన్ని మధురమైన జ్ఞాపకాలకు సంబంధించిన ఫొటోలను పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అరుదైన ఫొటోను నా కెమెరాలో బంధించాను. ఇలాంటి అందమైన ఫొటోలు కేవలం నా ఫోన్ గ్యాలరీకే పరిమితం కాకుడదని షేర్ చేశాను’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కూతురు, కొడుకును ఇరువైపుల కూర్చొపెట్టుకుని వారిని ముద్దాడుతున్న పవన్ ఫొటో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. అయితే పవన్‌తో విడిపోయిన అనంతరం రేణు దేశాయ్ తన పిల్లలిద్దరితో కలిసి పుణేలో సెటిల్ అయిపోయారు. తల్లిగా పిల్లల బాధ్యతను ఆమె చూసుకుంటున్నారు. రేణు ప్రస్తుతం మరాఠి సినిమాలను నిర్మిస్తూ.. ఇటూ తెలుగు టీవీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు. అంతేగాక సినిమాల్లో తిరిగి నటించనున్నట్లు ఇటీవల ఆమె వెల్లడించారు. (చదవండి: మళ్లీ వస్తున్నా, ఆశీర్వదించండి: రేణూ దేశాయ్) -
రేణూ రీ ఎంట్రీ
‘బద్రి, జానీ’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన రేణూ దేశాయ్ ‘ఆద్య’ అనే ఒక పవర్ఫుల్ లేడీ ఓరియంటెడ్ ప్యాన్ ఇండియా చిత్రంతో తన సెకండ్ ఇన్నింగ్స్‌కి శ్రీకారం చుడుతున్నారు. ఈ సినిమాతో ఎం.ఆర్. కృష్ణ మామిడాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. డి.ఎస్.కె. స్క్రీన్–సాయికృష్ణ ప్రొడక్ష¯Œ ్స బ్యానర్స్‌పై రావ్. డి.ఎస్–రజనీకాంత్. ఎస్ నిర్మించనున్నారు. ‘హుషారు’ ఫేమ్ తేజ కురపాటì,, గీతికా రతన్ జంటగా నటించనున్న ఈ చిత్రంలో ‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక, నందినీ రాయ్ ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్ .ఎస్ మాట్లాడుతూ– ‘‘విజయదశమి రోజున మా ‘ఆద్య’ సినిమా ప్రారంభిస్తాం. రేణూ దేశాయ్ రీ ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రం జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం’’ అన్నారు. బాలీవుడ్ హీరో వైభవ్ తత్వవాడి ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రానికి కెమెరా: శివేంద్ర దాశరధి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ చైతన్యరెడ్డి .ఎస్. -
మళ్లీ వస్తున్నా, ఆశీర్వదించండి: రేణూ దేశాయ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్ సినిమాలకు దూరమై చాలా ఏళ్లవుతోంది. ఆమె రీఎంట్రీపై ఇప్పటికే చాలా వార్తలొచ్చాయి. అయితే, తన రీఎంట్రీపై స్వయంగా ఆమే స్పందించింది. త్వరలో ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు కెమెరా ముందుకొస్తున్నట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. కృష్ణమామిడాల డైరెక్షన్ వస్తున్న ఈ వెబ్ సిరీస్ వచ్చే నెలలో షూటింగ్ జరుపుకోనుందని తెలిపారు. డీఎస్.రావు, ఎస్.రజనీకాంత్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ‘చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకొస్తున్నాను. ఓ అందమైన వెబ్ సిరీస్‌లో నటించేందుకు సంతకం చేశానని ప్రకటిస్తున్నందుకు ఎక్జైయిటింగ్గా ఉంది. వచ్చే నెలలో షూటింగ్ మొదలవుతుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు చెప్తాను. సత్యాన్వేషణలో ఉన్న ఓ మహిళ ప్రయాణానికి మీ ఆశీస్సులు, ప్రేమను అందించాలని కోరుకుంటున్నా’అని రేణూ ఇన్‌స్టా పోస్టులో వెల్లడించారు. కాగా, తన కుమారుడు అకీరా నందన్ సినీరంగ ప్రవేశంపై కూడా ఆమె ఇటీవల క్లారిటీ ఇచ్చారు. సినిమాల్లోకి రావడం అనేది పూర్తిగా తన ఇష్టమేనని స్పష్టం చేశారు. రేణూ ప్రస్తుతం దర్శకురాలిగా బిజీగా ఉన్నారు. ఇదిలాఉండగా.. మహేష్‌బాబు సినిమాలో రేణుదేశాయ్ నటించబోతున్నారన్న వార్తలపై ఆమె క్లారిటీ ఇటీవల ఇచ్చారు. వాటిల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. View this post on Instagram . And back to being in front of the camera... Super happy and excited to announce that I have signed a beautiful web series to act in and we will begin shooting next month. I will post more details about it in a few days🎉 Please do join me with your blessings and love on this journey of a determined woman and her search for the truth. It’s Produced by D.S Rao and Rajinikanth.S, under Sai Krishna Productions Directed By M.R.Krishna Mamidala DOP Dasaradhi Sivendra. A post shared by renu desai (@renuudesai) on Sep 19, 2020 at 9:12pm PDT -
లగ్జరీ కార్లను అమ్మేసిన రేణు దేశాయ్..
సినీ నటి రేణు దేశాయ్ నటనకు గుడ్‌బై చెప్పి చాలా కాలం అయ్యింది. అయినా ఆమె సినిమాలను డైరెక్ట్ చేస్తూనో, ప్రొడక్షన్ చేస్తూ అదేవిధంగా సామాజిక కార్యకలాపాలను చేపడుతూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తాజాగా ఆమె చేసిన ఒక పని అందరికి ఆదర్శంగా నిలుస్తోంది. రేణు దేశాయ్ తన రెండు లగ్జరీ కార్లు ఆడీ ఏ6, పోర్షే బాక్సర్లను అమ్మేశారు. దీనికి గల కారణాన్ని రేణు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా డిజీల్, పెట్రల్‌తో నడిచే వాహనాల వినియోగాన్ని తగ్గించాలనే ఉద్దేశ్యంతో తన రెండు లగ్జరీ కార్లను అమ్మేసినట్టు పేర్కొన్నారు. రేణుదేశాయ్ దీనికి సంబంధించి ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని రేణు విజ్ఞప్తి చేశారు. అందరూ ఎలక్ట్రిక్ కార్లు, బైకులను కొనాలని పిలుపునిచ్చారు. తన కార్లను అమ్మేసి ఆ స్థానంలో ఈ-ఎలక్ట్రిక్ హ్యుండాయ్ కారును కొన్నానని రేణు వెల్లడించారు. మారిష్‌లో జరిగిన చమురు లీకేజీ గురించి చదివిన తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని పేర్కొన్నారు. ఇంధనాలతో నడిచే వాహనాలను వినియోగించడం వల్ల భూమి మీద ఉండే జీవులకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: మహేష్ సినిమాలో నటించడంపై రేణు స్పందన -
ఛాలెంజ్‌ను స్వీకరించిన రేణు దేశాయ్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటారు సినీ నటి, రచయిత రేణూ దేశాయ్. ‘పుడమి పచ్చగుండాలే–మన బతుకులు చల్లగుండాలే’అనే నినాదంతో ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ చాలెంజ్ మూడో దశలో భాగంగా మొక్కలు నాటిన యాంకర్ ఉదయభాను.. బ్రహ్మానందం, రేణూ దేశాయ్‌లకు ఛాలెంజ్ విసిరారు. ఉదయ భాను విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి రేణూ శుక్రవారం ఉదయం తన కూతురు ఆద్యతో కలిసి మొక్కలు నాటారు. (ఉదయభాను ఛాలెంజ్ స్వీకరించిన బ్రహ్మీ) హరితహారంలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పూర్తితో ప్రతి ఒక్కరు తమకి తాము ఛాలెంజ్ విసురుకొని మొక్కలు నాటాలని రేణూ విజ్ఞప్తి చేశారు. ఇక ఆద్యతో కలిసి రేణూ మొక్కలు నాటిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పటికే గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను మంత్రి కేటీఆర్, కవిత, చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, సచిన్, వీవీఎస్ లక్ష్మణ్, పీవీ సింధు, సైనా నెహ్వాల్, గోపీచంద్, ప్రభాస్, యాంకర్ సుమ, అనసూయ, రష్మి లాంటి ఎందరో సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్ స్వీకరించి మరి కొందరికి సవాల్ విసిరారు. సవాలును స్వీకరించిన అనేక మంది ప్రముఖులు, సామాన్యులు సైతం మొక్కలు నాటుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగమవుతున్నారు. (రిజర్వ్ ఫారెస్ట్ దత్తత తీసుకుంటా..) View this post on Instagram We all need to do it 😊 A post shared by renu desai (@renuudesai) on Jul 2, 2020 at 11:24pm PDT -
మహేష్ సినిమాలో నటించడంపై రేణు స్పందన
సాక్షి, హైదరాబాద్ : తన కుమారుడు అకీరా నందన్ సినీరంగ ప్రవేశంపై నటి, దర్శకురాలు రేణుదేశాయ్ క్లారిటీ ఇచ్చారు. సినిమాల్లోకి రావడం అనేది పూర్తిగా తన ఇష్టమేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం దర్శకురాలిగా బిజీగా ఉన్న రేణు.. ఆదివారం ‘జూమ్’ ద్వారా సాక్షి టీవీతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆద్య వయస్సు చాలా చిన్నది. తనకు మ్యూజిక్ అంటే ఇష్టం. అకీరా వయసు కూడా ఇప్పుడు 16 ఏళ్ల మాత్రమే. మనకు ఒకటే జీవితం ఉంది.. ఒక మంచి మనిషి ఉండటం చాలా ముఖ్యమని నేను అకీరాకు చెప్తాను. అకీరా ఏ వృత్తి ఎంచుకున్న నేను పూర్తిగా సపోర్ట్ చేస్తాను. హీరో కావడం అనేది పూర్తిగా తన ఇష్టం. వాళ్ల నాన్న, పెద్దనాన్న, అన్న హీరోలు అనే ఆలోచనతో తాను కూడా హీరో అయిపోవాలనే ఒత్తిడి తీసుకోవద్దని చెప్తాను. తనకు ఇష్టమైనది చెయ్యమని చెప్పాను. హీరో కావాలని అనుకుంటే అందుకు నా సపోర్ట్ ఉంటుంది. ఫ్యామిలీ సినీ ఫీల్డ్‌లో ఉందని కాకుండా.. అతని లోపలి నుంచి ఆ నిర్ణయం రావాలి’ అని తెలిపారు. సినీ ఇండస్ట్రీలో బంధుప్రీతిపై రేణు స్పందిస్తూ.. బంధుప్రీతి అనేది చాలా సున్నితమైన అంశమని తెలిపారు. ప్రతి చోట బంధుప్రీతి అనేది ఉందని.. అది లేదని చెబితే మనం అబద్ధం చెప్పినట్టేనని అన్నారు. తొలి ఒకటి రెండు చిత్రాల వరకే నెపోటిజమ్ పనిచేస్తుందని.. ఆ తర్వాత అంతా ట్యాలెంట్ మీదే ఆధారపడి ఉంటుందని చెప్పారు. మరోవైపు మహేష్‌బాబు సినిమాలో రేణుదేశాయ్ నటించబోతున్నారని వస్తున్న వార్తలపై కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు. అందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. ‘నేను విన్న అతి పెద్ద బేస్‌లేస్ రుమార్ ఇది. రెండు మూడు రోజుల నుంచి చాలా మంది నాకు కాల్స్ చేసి విష్ చేస్తున్నారు. ఇలాంటి వార్తలు ప్రచారం చేసినవారికి హ్యాట్సాఫ్. కానీ ఈ సినిమాతో నాకు పూర్తిగా సంబంధం లేదు. ఇంత పెద్ద సినిమా ఒప్పకున్నప్పుడు తప్పనిసరిగా నేను ప్రకటన చేస్తాను. నాకు నటించాలనే ఉంది. గతంలో ఓ సందర్భంలో మదర్ రోల్ గురించి అడిగినప్పుడు.. హీరో చిన్నప్పటి క్యారెక్టర్లకు తల్లిగా చేసేందకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాను. దాన్ని బేస్ చేసుకుని ఎవరో ఇలాంటి వార్తలు సృష్టించారు’ అని రేణు వెల్లడించారు. -
రేణూస్ డేస్
-
పునః ప్రారంభ సంబరం..
సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితి కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా తమ సీరియల్స్, ప్రోగ్రామ్స్ చిత్రీకరిస్తున్నట్లు ప్రముఖ వినోద చానెల్ జీ తెలుగు ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. గత కొంత కాలంగా నిలిచిపోయిన తమ కార్యక్రమాల ప్రసారం సోమవారం నుంచి పునః ప్రారంభం అవుతుందన్నారు. ఈ పునః ప్రారంభ సంబరంలో రేణూదేశాయ్, ప్రియదర్శి తదితర సినీ రంగ ప్రముఖులు పాల్గొంటున్నారన్నారు. -
సినిమాల్లోకి రీఎంట్రీ.. రేణు దేశాయ్ గ్రీన్‌సిగ్నల్
మోడలింగ్ నుంచి సినీ రంగంలోకి ప్రవేశించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు నటి, రచయిత, దర్శకురాలు రేణు దేశాయ్. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె పుణెలో స్థిరపడ్డారు. లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితం కావడంతో అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటిస్తున్నారు. అయితే ఓ అభిమాని నుంచి రేణుకు ఊహించని ప్రశ్న ఎదురైంది. సినిమాల్లో రీఎంట్రీ గురించి అడుగుతూనే ప్రభాస్, మహేశ్‌లకు తల్లిగా నటించే అవకాశం వస్తే చేస్తారా అని అడిగాడు. దీనికి రేణు దేశాయ్ చాలా కూల్‌గా సమాధానమిచ్చారు. హీరోల చిన్నతనంలోని పాత్రలకు తల్లి పాత్ర చేయడానికి సిద్ధమేనని స్పష్టం చేశారు. ఇక ఏ దర్శకుడైన తనను వృద్దాప్య ఛాయలున్న పాత్రలో చూపించగలరనుకుంటే మహేశ్ లాంటి స్టార్లకు తల్లిగా నటిస్తానని చెప్పారు. తామంతా నటులమని ఎలాంటి పాత్రలు చేయడానికైనా సిద్దంగా ఉంటమాని కుండబద్దలు కొట్టి చెప్పారు. ఇక టాలీవుడ్లో ఏదైనా మంచి పాత్ర వస్తే తప్పకుండా చేస్తానని తేల్చిచెప్పారు. ప్రస్తుతం రేణుదేశాయ్‌కు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ‘నాని’ చిత్రంలో దేవయాని మహేశ్‌కు తల్లిగా నటించిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి పాత్రలు చేయడానికి రేణు ఆసక్తి చూపిస్తున్నారని సినీ వర్గాల టాక్. సినిమాల్లోకి రేణు రీఎంట్రీ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆమె రీఎంట్రీ సినిమా ఏది కాబోతుందో, ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారో వేచి చూడాలి. ఇక దాదాపు దశాబ్ద కాలం తర్వాత లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి ‘సరిలేరు నీకెవ్వరు’తో సినిమాల్లోకి ఘనమైన రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. చదవండి: ‘గతంలో ఎప్పుడూ చూడని విధంగా..’ మళ్లీ ట్రెండింగ్‌లోకి ‘మున్నా’.. 13 ఏళ్లైంది కదా! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_931254882.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆ రోజులను గుర్తుచేసుకున్న రేణు దేశాయ్..
పవన్ కల్యాణ్, రేణు దేశాయ్, అమీషా పటేల్ జంటగా నటించిన ‘బద్రి’ చిత్రం విడుదలై నేటికి 20 ఏళ్లు. ఈ చిత్రంతో పూరి జగన్నాథ్.. దర్శకుడిగా పరిచమయ్యారు. అప్పట్లో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీలో డైలాగ్స్ యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. బద్రితో హీరోయిన్గా పరిచయమైన రేణు దేశాయ్.. తనకు ఈ చిత్రంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అప్పుడు జరిగిన సంభాషణలు తనకు స్పష్టంగా గుర్తున్నాయని చెప్పారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పలు ఫొటోలు షేర్ చేసిన రేణు దేశాయ్.. అప్పుడు జరిగిన సంభాషణలను, ఘటనలను గుర్తుచేసుకున్నారు. కాగా, ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే పవన్, రేణుల మధ్య ప్రేమ చిగురించిన సంగతి తెలిసిందే. ‘మేము మారుమూల ప్రాంతంలో షూట్ చేస్తున్నప్పుడు.. షూటింగ్ మధ్యలో కూర్చొవడానికి కనీసం కుర్చీలు కూడా లేవు. అప్పుడు నేను షార్ట్ స్కర్ట్ ధరించి ఉండటం వల్ల రాయిపై కూర్చోలేకపోయాను. అప్పుడు నేను ఒక అమ్మాయి మీ పక్కన నిలబడి ఉండగా.. మీరు కూర్చోవడం మంచి ప్రవర్తన కాదని కల్యాణ్ గారితో సరదాగా మాట్లాడుతున్నాను. ఆ ప్రాంతం షూటింగ్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉండింది. బలమైన గాలులు వీచడంతో నేను నిలబడటానికి, డ్యాన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను.’-రేణు ‘మేము ఒక రోజు షూటింగ్ ముగించుకుంటున్న సమయంలో తీసిన ఫొటో ఇది. కల్యాణ్ గారు ఏ చికితా సాంగ్‌కు సంబంధించి తన పార్ట్ పూర్తిచేశారు. నేను ‘వరమంటే’ సాంగ్ పూర్తిచేశాను. ఆరోజు ఎండగా ఉండటం, లోకేషన్ చాలా దూరం నడవాల్సి ఉండటంతో మేము చాలా అలసిపోయాం. ఆకలి, నీరసంతో మేమిద్దరం ప్రపంచాన్ని మరచిపోయాం.’-రేణు ‘మళ్లీ అదే లోకేషన్.. కానీ మరో రోజు షూటింగ్ సందర్భంగా తీసిన ఫొటో. ఇది జరిగి 20 ఏళ్లు అవుతుంది. కానీ అప్పుడు మేము మాట్లాడుకున్న సంభాషణ నాకు ఇప్పటికి స్పష్టంగా గుర్తుంది. ఇది నాకు చాలా ఇష్టమైన ఫొటో. నాకు చాలా హ్యీపీగా ఉంటుంది.. ఎందుకంటే మాకు ప్రైవసీ ఇస్తూ.. దూరం నుంచి మా ఫొటోగ్రాఫర్ ఈ ఫొటోను తీశారు.’-రేణు అన్నా అంతా ద్వేషం ఎందుకు? రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో బద్రి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటున్న సమయంలో ఓ నెటిజన్ ఆమెను ఉద్దేశించి ఓ కామెంట్ చేశాడు. దీనిపై రేణు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ‘నాకు ఇప్పుడే ఈ మెసేజ్ వచ్చింది. అవసరమా?.. అవును.. అవసరం. మీకు తెలియకపోతే చెప్తున్నా.. బద్రీ వచ్చి ఇప్పటికి 20 ఏళ్లు. చాలా మంది మరచిపోతారు.. కావున ఈ మూవీ నాకు చాలా స్పెషల్. అంతా ద్వేషం ఎందుకు అన్నా?. ఈ వైరస్ వల్ల మనం ఒక సంక్షోంభంలో ఉన్నాం.అందరి కోసం మనం మంచి ఆలోచనలు పెట్టుకోండి. ఇంత కోపం మీ ఆరోగ్యానికి మంచిది కాదు’ అని పేర్కొన్నారు. మరోవైపు దర్శకుడిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్‌కు కూడా పలువురు సినీ ప్రముఖులు విషెస్ తెలుపుతున్నారు. -
శేష జీవితాన్ని ఇలా గడిపేస్తా: రేణుదేశాయ్
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్‌లోని ఓ గ్రామంలో చిన్నపిల్లలతో సరదాగా గడిపిన ఓ వీడియోను నటి రేణుదేశాయ్ తన ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. చిన్న పిల్లలతో బాబా ఫోజ్ పెట్టిస్తూ ఆనందంగా గడిపారు. ఆవులు, మేకలు, కాకులు, కొంగల వీడియోలను తన ఇన్స్ట్రా గ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసి పల్లె జీవితాన్ని మిస్సవుతున్నానని పేర్కొన్నారు. తన పిల్లలు కాలేజీలో చేరిన తర్వాత మిగిలిన శేష జీవితాన్ని కూరగాయలు పండిస్తూ మారుమూల గ్రామంలో గడపాలని బలంగా కోరుకుంటున్నానని తెలిపారు. ఓ పది పిల్లులు, 10 శునకాలు, భారీ మొత్తంలో మూగజీవాలు, లెక్కలేనన్ని పుస్తకాలు, ఇవి ఉంటే నాకు స్వర్గంలో ఉన్నట్టే ఉంటుంది అంటూ పోస్ట్ పెట్టారు. ఆరోజు త్వరలోనే వస్తుందని ఆకాంక్షించారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో బయట తిరగొద్దు అంటూ ఓ అభిమాని చేసిన కామెంట్‌కి బదులిస్తూ... ఇవి ఇంతకు ముందు తీసిన వీడియోలని క్యాప్షన్ చూసి కామెంట్లు పెట్టాలని రేణుదేశాయ్ చురకలంటించారు. View this post on Instagram . Missing the village life... simple uncomplicated living... I have a sincere strong desire to settle on a farm in a remote village once my kids go to college. Do a little bit of vegetable farming and have 10 cats and 10 dogs and lots of rescue animals and unlimited supply of books. That will truly be heaven for me! One day...one day soon🧡 A post shared by renu desai (@renuudesai) on Mar 27, 2020 at 11:22pm PDT -
నా జీవితం ఏ మగాడి సాయం లేకుండా సాగుతోంది: రేణు
తనపై వస్తున్న రూమర్స్ మీద నటి రేణు దేశాయ్ ఘాటుగా స్పందించారు. మాజీ భర్త పవన్ కల్యాణ్ ఖరీదైన ఇంటిని రేణు దేశాయ్‌కు బహుమతిగా ఇచ్చారని గత కొన్ని రోజులుగా వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. ఆద్య, అకీరాల కోసం హైదరాబాద్‌లో పవన్ ఇల్లు కొనిచ్చినట్టు వార్తలు షికార్లు చేశాయి. అంతేకాకుండా ప్రస్తుతం పుణేలో ఉంటున్న రేణు దేశాయ్.. పవన్ కొనిచ్చిన ఇంటికి మారుతున్నట్లు ఆ వార్తల్లో సారాంశం. అయితే.. ఆ వదంతులను రేణు దేశాయ్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి తప్పడు వార్తలు తనపై ఎందుకు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో తన కష్టార్జితంతో ఇల్లు కొనుక్కున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ రూమర్స్‌పై రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రేణు మునుపెన్నడూ లేనంతగా ఎమోషనల్ కామెంట్స్ చేశారు. (రేణూ దేశాయ్ హార్ట్ టచింగ్ మెసేజ్) రేణు దేశాయ్ ఫేస్బుక్ పోస్ట్ నేను ఇప్పుడు మీ అందరికీ ఈ విషయం గురించి వివరణ ఇవ్వడానికి ఒకే ఒక్క కారణం, నిన్నటి నుండి నాకు మీడియా వాళ్ళ నుండి, స్నేహితుల నుండి వస్తున్న ఎన్నో మెసేజెస్, ఫోన్ కాల్స్ ఆధారంగా నాకు ఈ విషయం చాలా సీరియస్ అయింది అని అర్థమయ్యింది. వాళ్ళు చెప్పింది విని నాకు చాలా బాధ వేసింది అందుకే ఈ వివరణ... ఒక వ్యక్తి నిజమైన ఆస్తి తన ఆత్మగౌరవం ఒక వ్యక్తి నిజమైన ఆస్తి తన నిజాయితీ ఒక వ్యక్తి నిజమైన ఆస్తి తన అస్తిత్వం ఇది మీకు తెలియనిదా..? నేను, నా జీవిత మనుగడ కోసం ఒంటరిగా, తీవ్రంగా, నిబద్దతతో ఎంతగానో శ్రమిస్తున్నాను… శ్రమిస్తూనే పోరాడుతున్నాను. ఇప్పటి వరకూ కనీసం మా తండ్రి గారి దగ్గర్నుంచి కూడా ఏ రకమైన ఆర్థిక సహాయం ఆశించలేదు, పొందలేదు. అలాగే, నేనిప్పటివరకూ నా మాజీ భర్త దగ్గర్నుంచి కూడా ఎలాంటి అన్యాయ పూరితమైన భరణాన్నీ ఆశించలేదు, పొందలేదు. అది నా వ్యక్తిత్వం!!! అయినప్పటికీ మీరు నా గురించి అన్యాయంగా, అసంబద్దమైన అబద్దపు వార్తలను ప్రచారం చేస్తూనే ఉన్నారు! మీరందరూ అనుకుంటున్నట్టు, ప్రచారం చేస్తున్నట్టు ఇప్పుడు హైదరాబాద్‌లో నేను కొన్న ఫ్లాట్ నిజంగా మాకెవరూ కొనివ్వలేదు. అది నా కష్టార్జితంతో ఒక్కో రూపాయి కూడబెట్టుకుని కొనుక్కున్న నా సొంత ఇల్లు. అది నా మాజీ భర్త మాకు కొనిచ్చారన్న ఇలాంటి అసత్య ప్రచారాల వల్ల నా నిజాయితీకీ, ఆత్మగౌరవానికీ, నా అస్థిత్వానికీ, చివరగా నా ఉనికికే ప్రమాదం సంభవిస్తుందనే చిన్న ఆలోచన మీకెవ్వరికీ రాలేదా? నాకు తెలిసినంతవరకూ, ఈ వార్తకూ నా మాజీ భర్తకూ ఎలాంటి సంబంధం ఉండి ఉండదు. కనీసం ఈ ప్రచారం ఆయన దృష్టికి కూడా వెళ్ళి ఉండదు. అలాంటిది, ఒక వార్తను రాసేటప్పుడు, అది నిజమో కాదో నిర్ధారించుకోకుండానే, అత్యుత్సాహంతోనో, తొందరపాటుతోనో, లేక మీ సంస్థల మనుగడ కోసమో, ఒక ఒంటరి స్త్రీ మనుగడను ప్రమాదంలో నెట్టడం ఎంతవరకూ సమంజసం? ఇలాంటి వార్తలు ఎంత వేగంగా ప్రజల్లోకి వెళ్తాయో మీకు తెలియదా? ప్రజలు ఈ అబద్దపు వార్తను నిజమని నమ్మితే, సంఘంలో నాకున్న గౌరవం మసకబారదా? ఏది జరిగినా చెక్కు చెదరని నా అస్థిత్వం, వ్యక్తిత్వం, నా ఆత్మగౌరవం, నేను అనే ఒక నిజం అసత్యం అయిపోదా? నా ఆత్మ ఎంత ఘోషిస్తుంది! ఎంతలా చితికిపోతుంది!? దయచేసి ఆలోచించండి.. నా ఈ జీవితంలో ఇప్పటివరకూ ఏ మగవాడి సాయం లేకుండా సాగుతున్న నాలాంటి ఒంటరి తల్లి జీవన గమనానికీ, పోరాటానికి గౌరవం ఇవ్వకపోయినా సరే… దయచేసి, ఇలా కించపరచకండి. నేను మీతో పంచుకుంటున్న ఈ బాధను సరిగ్గా అర్థం చేసుకోకుండా మళ్ళీ నాకూ, నా మాజీ భర్త అభిమానులకూ మధ్య, దయచేసి ఎలాంటి గొడవలూ సృష్టించకండి అంటూ రేణు దేశాయ్ సుదీర్ఘమైన పోస్ట్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. వారిది నా రక్తం.. పవన్ రక్తం కాదు: రేణూదేశాయ్ -
రేణూ దేశాయ్ హార్ట్ టచింగ్ మెసేజ్
రేణూ దేశాయ్‌కి సినిమాల్లో ఎంత పాపులారిటి వచ్చిందో తెలియదు గాని సోషల్ మీడియాలో ఆమె చేసే హడావిడితో విపరీతమైన పాపులారిటి సంపాదించుకుంది. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అనుభవాలను అభిమానులతో పంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. పట్టణాల్లో ఉండేవారికి పల్లెలకు వెళ్లాలనీ, అక్కడ కొన్ని రోజులు సరదాగా గడపాలని అనిపిస్తుంది. పట్టణాల్లో ఉండే ట్రాఫిక్ జామ్‌లు, కాలుష్యం కంటే… గ్రామాల పచ్చదనంలో తిరుగుతుంటే ఎంతో ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉంటుంది. నటి రేణూ దేశాయ్‌కి కూడా అలాంటి కోరిక ఎప్పటి నుంచో అలా ఉండిపోయిందట. అది ఇటీవల తీరిందని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ హార్ట్ టచింగ్ మెసేజ్ ఇచ్చారు. చదవండి: వారిది నా రక్తం.. పవన్ రక్తం కాదు: రేణూదేశాయ్ వివరాల్లోకి వెళ్తే.. తన సినిమా షూటింగ్ ముగించుకొని ప్రొడక్షన్ డిజైనర్‌తో కలిసి కారులో ఓ మారుమూల గ్రామం మీదుగా హైదరాబాద్‌కు ప్రయాణిస్తుండగా.. డిజైనర్‌తో తనకు అప్పుడే హైదరాబాద్ వెళ్లిపోవాలని లేదని చెప్పిందట రేణూ దేశాయ్. ఆమె అలా చెప్పిందో లేదో సరిగ్గా అదే సమయానికి కారు టైర్ పంక్చర్ అయ్యింది. వెంటనే కారు దిగేసి ఆమె ఆ గ్రామస్తులను కలిసింది. రేణూ రాగానే సంబరపడిన గ్రామస్తులు వాళ్లకు తినడానికి లేకపోయినా సరే ఆమెకు ఉప్మా, టీ ఇచ్చారు. చలిగా ఉండటంతో మంట కూడా వేశారు. ఆ రాత్రి ఆమె వారితోనే అలా నిద్రపోయింది. ఈ విషయాలను రేణూ దేశాయ్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. View this post on Instagram . Last night was a wish that just came true because I wished for it from the honest depths of my heart! This was the last village we were checking out for our film and the minute our car turned into the village, I, with lot of longing and love expressed to my production designer that I don’t want to leave immediately for Hyderabad and stay in this village longer. The next sound we heard was our tyre getting punctured and my wish came true. We had such an amazing time with the village people. They barely had food themselves to eat but they offered us upma and tea. We have so much money yet we think twice before giving and they have barely anything and they were sharing with us. So much to learn from them! I know for a fact and I know it’s already started, this film is going to change me at my soul level. #annadatasukhibhava 🙏🏼 A post shared by renu desai (@renuudesai) on Jan 17, 2020 at 9:32pm PST మన దగ్గర ఎంత డబ్బుండీ ఏం లాభం దాన్ని దానం చెయ్యడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం. కానీ వాళ్లు తమ దగ్గర ఏమీ లేకపోయినా మనకు ఎన్నో ఇచ్చారు. వాళ్ల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఆ పేద కుటుంబాల గొప్పదనాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రేణు దేశాయ్. ప్రస్తుతం దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్రామాలు ఎప్పుడు మంచివే అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. చదవండి: వాళ్లు కేవలం కొంగు కప్పుకొనే తిరుగుతారు -
పవన్,ఆద్య ఫొటో షేర్ చేసిన రేణూ
పవన్ నుంచి విడిపోయాక రేణూదేశాయ్ పిల్లలతో కలిసి పూణెలో నివాసం ఉంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రేణూ.. తన పిల్లలకు సంబంధించిన పలు విషయాలను అభిమానులతో పంచుకుంటారనే సంగతి తెలిసిందే. తాజాగా ఆద్య తన తండ్రి పవన్ కల్యాణ్‌తో కలిసి దిగిన ఫొటోను రేణూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దానికి ఫాదర్ అండ్ డాటర్, డాటర్స్ లవ్ అని కాప్షన్స్ కూడా జత చేశారు. ‘అద్భుతంగా, చాలా అందంగా పిల్లలు తల్లిదండ్రుల నుంచి పోలికలు పొందుతారు. ఆద్య కొన్నిసార్లు నాలానే కనిపిస్తుంది.. కానీ చాలాసార్లు వాళ్ల నాన్న, నాన్నమ్మకు కాపీలా కనపిస్తోంది. ఆధ్య నా కెమెరాకి ఇష్టమైన వ్యక్తి’ అని పేర్కొన్నారు. ఇటీవల ఓ నెటిజన్ కామెంట్‌పై రేణూదేశాయ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఆద్య, అకీరాలు కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసి క్రేజీ ఫెలోస్.. వాళిద్దరు నా సొంతం అని పేర్కొన్నారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ ఎంతైనా పవన్ రక్తం కదా అని కామెంట్ చేశాడు. దీంతో రేణూ గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘సైన్స్ పరంగా చెప్పాలంటే వారిద్దరిలో ప్రవహించేది నా రక్తం. మీకు సైన్స్ తెలిస్తే ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు’ అని సమాధానం ఇచ్చారు. కాగా, ఇటీవలకాలంలో పవన్ పేరు అంతగా ప్రస్తావించని రేణూ.. ఇప్పుడు ఆయన ఫొటోను షేర్ చేయడం అభిమానుల్లో చర్చకు దారితీసింది. -
వారిది నా రక్తం.. పవన్ రక్తం కాదు: రేణూదేశాయ్
పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయాక తన ఇద్దరి పిల్లలతో కలిసి జీవిస్తున్నారు రేణుదేశాయ్. ఒంటరిగా పిల్లల్ని పెంచుతూ.. వాళ్లు చేసే అల్లరిని, వారి సరదా సంగతుల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకుంటారు రేణూ దేశాయ్. బుల్లితెరపై హోస్ట్‌గా వ్యవహరిస్తూ అభిమానులకు దగ్గరగానే ఉన్న రేణూ తన ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్యలతో కలిసి పూణేలో ఉంటున్నారు. తాజాగా కొడుకు అకీరా తన చెల్లెలు ఆద్యని ఎత్తుకొని ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. '1 2 3 అని లెక్కపెట్టేలోపు నేను మీ ముందు ఉంటా.. ఆద్య, అకీరా క్రేజీ ఫెల్లోస్.. వారిద్దరూ నా సొంతం' అంటూ క్యాప్షన్ పెట్టారు. చదవండి: దర్శకుడిపై దినపత్రిక సీఈఓ అత్యాచారం చదవండి: నెలకు ఇంటి అద్దె రూ.15 లక్షలా ..? మీరు వెంటనే వెనక్కి రండి! చదవండి: '5 కి.మీ ప్రయాణానికి హెలికాప్టర్ బుక్ చేసిన మంత్రి' అయితే రేణూ క్యాప్షన్‌కి నెటిజన్ స్పందిస్తూ.. ఎంతైనా పవన్ రక్తం కదా అని కామెంట్ చేశాడు. అలా కామెంట్ చేయడం రేణూ దేశాయ్‌కి ఎంత మాత్రం నచ్చలేదు. దీంతో టెక్నికల్‌గా సైన్స్ పరంగా చెప్పాలంటే వారిద్దరిలో ప్రవహించేది నా రక్తం. మీకు సైన్స్ తెలిస్తే ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అంటూ సమాధానం ఇచ్చారు. రేణూ దేశాయ్ కామెంట్‌కు మరో అభిమాని స్పందిస్తూ అభిమానులు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. వాటిని మీరు ఎందుకు పట్టించుకుంటారు అంటూ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా అమ్మతనం గురించి వారు మాట్లాడుతూ ఉంటే నేను ఎలా మౌనంగా ఉంటాను అని కొంచెం ఎమోషనల్‌గా సమాధానం చెప్పారు. View this post on Instagram . “You can count on me...like 1 2 3...and I’ll be there...”😁🎉🕺 Aadya&Akira crazy fellows but mine🧡 . . . #brotherandsister #brothersisterlove #sisteristhebest #mylove #crazybutmine #littleboyisgrowingup #doesanyonereadthese #coulditbeanybetter #familyfun #whereiswinterthough A post shared by renu desai (@renuudesai) on Dec 28, 2019 at 1:51am PST -
వాళ్లు కేవలం కొంగు కప్పుకొనే తిరుగుతారు
సాక్షి, హైదరాబాద్ : మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారికి ఉరిశిక్ష విధించాలని నటి, సామాజిక వేత్త రేణూ దేశాయ్ అన్నారు. చట్టాలను పటిష్టంగా అమలు చేయాల్సిందేనని వ్యాఖ్యానించారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌తో మహిళలకు ధైర్యం వచ్చిందని పేర్కొన్నారు. ఏదేమైనా వ్యవస్థ, సమాజంలో మార్పు వచ్చినపుడే నిర్భయ, దిశ వంటి ఘటనలు జరగవని అభిప్రాయపడ్డారు. అదే విధంగా అత్యాచార ఘటనలకు మహిళల వస్త్రధారణను కారణంగా చూపడం దారుణమన్నారు. దేశ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దిశ నిందితుల ఎన్కౌంటర్ నేపథ్యంలో శనివారం ఆమె సాక్షితో తన మనోభావాలు పంచుకున్నారు. ‘ఇంట్లో లక్ష్మీదేవి, సరస్వతిని పూజిస్తారు కానీ చాలా మంది మగవాళ్లు తమ ఇంటి లక్ష్మిని మాత్రం సరిగ్గా చూసుకోరు. ఇందుకు ఎవరూ అతీతం కాదు. దేవుడిపై ఉన్న భయం, భక్తి చట్టాలపై కూడా ఉండాలి. అప్పుడే నేరాలు కాస్తైనా తగ్గుతాయి. ఇక బట్టల వల్లే బలత్కారం అనే వాళ్లని అస్సలు క్షమించకూడదు. వారన్నట్లుగా మరి మూడు నెలల పసివాళ్లు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు. దిశ కూడా సల్వార్, దుపట్టా వేసుకునే బయటికి వచ్చారు కదా. చాలా వరకు ట్రైబల్ ఏరియాల్లో కొంగు కప్పుకొని మాత్రమే తిరుగుతారు. మరి వాళ్లందరి పట్ల మగవాళ్లు అలా ప్రవర్తించడం లేదు కదా. మహిళల స్వేచ్ఛను హరించవద్దు. బట్టల కారణంగా.. రాత్రి వేళల్లో బయట ఉన్నందు వల్లే అత్యాచారం చేశానంటే కుదరదు. మనకు స్వీయ నియంత్రణ ఉండాలి. ఓ మహిళ మీ ముందు నగ్నంగా ఉన్నా సరే అమ్మలా భావించి ఏమైందమ్మా అని అడిగి మరీ తనకు సాయం చేసే మానసిక పరిపక్వత రావాలి’ అని రేణూ దేశాయ్ పేర్కొన్నారు. ‘ఇక దిశ ఘటనతో ఆడపిల్లలున్న ప్రతీ తల్లిదండ్రులకు భయం కలిగింది. నిందితుల పట్ల ఎన్‌హెచ్చార్సీ స్పందించిన తీరు సరైందే. అయితే దిశ మానవ హక్కులకు కూడా భంగం కలిగిన విషయాన్ని గుర్తించాలి కదా. పథకం ప్రకారం ఆమె స్కూటీని పంక్చర్ చేసి అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపేయడం ఎంత వరకు సమంజసం. కేవలం రూపాన్ని బట్టి మనిషి అనటం సరికాదు. మనిషి రాక్షసుడిగా ప్రవర్తించినపుడు అతడిని జంతువుగానే గుర్తించాలి. రాక్షసుడే అవుతాడు అలాంటి వాళ్లకు మానవ హక్కులు ఎలా వర్తిస్తాయి. పేద, ధనిక, కుల, వర్గ, మతాలకు అతీతంగా ప్రతీ ఒక్కరికీ ఒకే న్యాయం ఉండాలి. తప్పు చేసింది ఎవరైనా అందరికీ సమానంగా శిక్షలు పడాలి. అయితే ఆ క్రమంలో నిజమైన దోషులెవరో గుర్తించగలగాలి. అంతేకాదు విద్యావిధానంలోనూ మార్పులు రావాలి. సైకాలాజీని పాఠ్యాంశంగా బోధించాలి. ఇక చదువుకునే అవకాశం లేని వాళ్లకు విద్యను అందించుటకై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. మనిషి స్వభావంలో మార్పు వచ్చినపుడు, చట్టాల పట్ల భయం కలిగి ఉన్నపుడే మార్పు సాధ్యమవుతుంది. దిశ ఘటన జరిగిన రోజు దేశవ్యాప్తంగా ఎన్నో అత్యాచారాలు జరిగాయి. అయితే ఘటన తీవ్రతను బట్టి శిక్షలు ఉంటాయి. నిన్నటి ఎన్‌కౌంటర్‌ను నేను పూర్తిగా అంగీకరించను. అలాగని వ్యతిరేకించను. అయితే తెలంగాణ పోలీసుల చర్యకు జనామోదం లభించడం చూస్తుంటే అత్యాచార ఘటన పట్ల వారు స్పందించిన తీరు స్పష్టమవుతోంది. నిజానికి దిశ ఘటనలో ఆ నలుగురే కాదు. ఘటన జరుగుతున్నా ఆ వైపుగా దృష్టి సారించని వాళ్లతో సహా ఈ సమాజం మొత్తం ఆ నేరంలో భాగస్వామ్యమే. ఇక్కడ నేను ఓ ఆడపిల్లకు తల్లిగా మాట్లాడుతున్నాను’ అని చెప్పుకొచ్చారు. -
ఊరికే కామెంట్ చేస్తే ఊరుకోం
‘మీరు బాగుండరు. మీకు సినిమా అవకాశాలు ఎలా వస్తున్నాయి. తాప్సీని సూటిగా అడిగాడో నెటిజన్.‘ప్యాంట్ వేసుకోవడం మరచిపోయావా’ రకుల్ ప్రీత్‌సింగ్‌ని కామెంట్ చేశాడో ఆకతాయి.‘గ్లామరస్ రోల్స్‌కి నువ్వు సూట్ కావు’ లావణ్యా త్రిపాఠీని హేళన చేశాడో వ్యక్తి...సోషల్ మీడియాలో సినిమా స్టార్స్‌ని ఉద్దేశించి ఇలా నెగటివ్ పోస్టులు పెట్టడానికి చాలామంది రెడీ అయిపోతుంటారు. వాటికి తారలు దీటైన సమాధానాలు ఇస్తుంటారు. తాజాగా సమీరా రెడ్డి, రేణూ దేశాయ్, రష్మీ గౌతమ్‌లు తమపై విసిరిన విమర్శలకు‘ఊరికే కామెంట్ చేస్తే ఊరుకోం’ అంటూ ఘాటుగా సమాధానాలు విసిరారు. అవేంటోతెలుసుకుందాం. ఏది పడితే అది అనొచ్చా? ‘‘నేను ఒక రైతు కొడుకుని. రెండు దశాబ్దాలుగా వ్యవసాయం చేస్తున్నాను. మీరందరూ (యాక్టర్స్‌ను ఉద్దేశిస్తూ) రైతుల కోసం ఏం చేస్తున్నారు? ఏమీ లేదు. కొన్ని డబ్బుల కోసం మేకప్ వేసుకుని కెమెరా ముందు డ్రామా చేస్తున్నారు’’ అంటూ ఓ అసభ్య పదజాలంతో ఒక నెటిజన్ చేసిన కామెంట్‌ను స్క్రీన్‌షాట్ తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు రేణూ దేశాయ్. ఈ పోస్ట్ పై ఆమె ఇలా స్పందించారు. ఈ పోస్ట్ కచ్చితంగా చదువుతారని అనుకుంటున్నాను. ఒక సెలబ్రిటీ ఎప్పుడైనా ‘ఎఫ్’ (నెటిజన్ వాడిన అసభ్య పదజాలం) అనే పదాన్ని సోషల్ మీడియాలో ఒక అభిమాని మీద వాడితే ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. అది ఓ బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. నిర్దయగా చాలా దారుణంగా ఆ సెలబ్రిటీని ట్రోల్ చేస్తూ దూషిస్తారు. కానీ అదే పదం... ఒక మామూలు మనిషి ఒక సెలబ్రిటీ మీద వాడితే వాళ్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు. ఏంటి ఇది? అంటే ఒక సెలబ్రిటీని ఎవరు పడితే వాళ్లు ఏది పడితే అది అనొచ్చు. దూషించొచ్చు. వాటిని ఆ సెలబ్రిటీ భరించాలి. ఎలాంటి భావోద్వేగాలకు గురి కాకూడదు. అంటే మామూలు మనుషులకు మాత్రమే భావాలు, భావోద్వేగాలు ఉంటాయి. సెలబ్రిటీలకు ఉండకూడదా? ప్రతి రోజు మీ సోషల్ మీడియాలో ఎవరో ఒకరు ఏదో రకంగా మిమ్మల్ని దూషిస్తూ, ఏవేవో పోస్టులు పెడుతూ ఉంటే వాటిని చదువుతున్నప్పుడల్లా మీకు ఎలా ఉంటుందో ఊహించుకోండి. అది కూడా రైతులకు ఏదో రకంగా సాయపడాలని నేను చేస్తున్న ప్రయత్నాన్ని విమర్శిస్తూ నన్ను దూషించడం మరీ దారుణం. నేను డబ్బు కోసం చేస్తున్నానా? పేరు కోసం చేస్తున్నానా లేదా ఇంకేదైనా కారణం కోసం చేస్తున్నానా? అనేది ముఖ్యం కాదు. దాని వల్ల మన రైతుల సమస్యలను ఎంత వరకు బయటకు తీసుకొచ్చి ప్రజల ముందు పెడుతున్నాను అన్నది ముఖ్యం. ఏదో ఒక రోజు ఈ ఊరు పేరు బయట పెట్టకుండా ఈ ట్రోల్స్ చేసేవారంతా తప్పు తెలుసుకుని, వారి శక్తి సామర్థ్యాలను ఇలా అనవసరంగా సెలబ్రిటీలను దూషించడం కోసం కాకుండా ఏదైనా మంచి పనికోసం వాడితే మంచిది. ఆలోచనా ధోరణి మారాలి ఇటీవల సమీరా రెడ్డి రెండోసారి ఓ బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలియజేస్తూ తాను ప్రెగ్నెంట్‌గా ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. చాలామంది ఆమెకు అభినందనలు కూడా తెలిపారు. అయితే ఎవరూ ఊహించని విధంగా కొందరు విమర్శించారు ‘‘సమీరా.. బాగా లావైపోయావు. బిడ్డకు జన్మనిచ్చినప్పటికీ కూడా కరీనా కపూర్ ఇంకా బాగానే ఉంది’’ అన్నది ఆ విమర్శల సారాంశం. అంటే.. మొదటి బిడ్డ పుట్టాక సమీరా బరువు తగ్గకుండా అలానే ఉందన్నది వారి ఉద్దేశం కావొచ్చు. ఈ విషయం గురించి సమీరా స్పందించారు. ‘‘ఒకరికి జన్మనిచ్చిన తర్వాత కూడా కరీనా కపూర్‌లా హాట్‌గా ఉండేవారు ఉన్నారు. జన్మనిచ్చిన తర్వాత శరీరాకృతిని మామూలుగా మార్చుకోవడానికి సమయం తీసుకునే నాలాంటి వారు ఉన్నారు. నువ్వు (కామెంట్ చేసినవారిని ఉద్దేశించి) పుట్టినప్పుడు కూడా మీ అమ్మ హాట్‌గా ఉందా? అని అడగాలనుకుంటున్నాను. ప్రెగ్నెన్సీ అనేది ఒక సహజమైన ప్రక్రియ. ఒక అందమైన అనుభూతి. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత బరువు తగ్గడానికి కాస్త టైమ్ పట్టొచ్చు. ఇప్పుడు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నాను. రెండో డెలివరీ తర్వాత నా శరీరాకృతి మారడానికి మరింత టైమ్ పట్టొచ్చు. అంతమాత్రాన విమర్శిండమేనా? చేస్తున్న పని సరైనదేనా? అనిట్రోల్స్ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు మీకు ఏం కావాలి? ఒక మహిళగా ఒక బిడ్డకి జన్మనివ్వగల సూపర్ పవర్ నా దగ్గర ఉంది. తొలిసారి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు చాలా సిగ్గుగా ఫీల్ అయ్యేదాన్ని. చాలా ఆలోచనలు నా మైండ్‌లో ఉండేవి. కానీ ఇప్పుడు కష్టంగా అనిపిస్తోంది. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా కవర్ చేసుకునేదాన్ని. ఇప్పుడు అలా చేయడం లేదు. నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కూడా హాట్‌గానే ఉన్నాను. ఇక్కడ గమనించాల్సింది ఒక్కటే. మన ఆలోచనాధోరణి, ఒక విషయాన్ని నెగటివ్‌గా చూసే దృష్టి కోణం మారాలి. ఆ ప్రయత్నాన్ని మానుకో! పీఆర్ మేనేజ్మెంట్ ట్వీటర్ యూజర్‌నేమ్‌తో నటి, యాంకర్ రష్మీ గౌతమ్‌ను ఒక ఆకతాయి ట్రోల్ చేశాడు. ‘‘మీతో ఓ యాడ్ ప్లాన్ చేశాం. మీ నాన్నగారి నంబర్ మిస్సయ్యాను. ఇస్తారా?’’ అని ఆ నెటిజన్ ట్వీట్ చేశాడు. దీన్ని రష్మీ గౌతమ్ ట్యాగ్ చేస్తూ– ‘‘నా 12ఏళ్ల వయసులో మా నాన్నగారు మరణించారు. మా నాన్నగారి నంబర్ నీ దగ్గర ఉండదు. పీఆర్ మేనేజ్మెంట్ అనే పేరుతో నన్ను ఫూల్‌ని చేయాలనుకునే నీ ప్రయత్నాన్ని ముందు మానుకో. అమ్మాయిలను ఇబ్బందిపెట్టడానికి ఇదొక కొత్తదారిలా అనిపిస్తోంది. మీలాంటి వారు ఇండస్ట్రీకి చెడ్డపేరు తీసుకొస్తున్నారు’’ అని పేర్కొన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. రష్మి తండ్రి నంబర్‌ను అడిగిన ట్వీట్‌ను సదరు నెటిజన్ ఆ తర్వాత డిలీట్ చేశారు. నెటిజన్లు ట్రోల్ చేసినప్పుడు సైలెంట్‌గా ఉండకుండా ఇలా ధైర్యంగా దీటైన బదులు చెప్పారు అంటూ కొందరు నెటిజన్లు అభినందించారు. -
కంటతడి పెట్టిన రేణూదేశాయ్
ఆలూరు/పెద్దకడబూరు: అప్పుల బాధ తాళలేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అన్నదాతల ఉసురు తప్పకుండా తగులుతుందని సామాజిక వేత్త, సినీనటి రేణు దేశాయ్ అన్నారు. రాష్ట్రంలో ‘కరువు నేపథ్యంలో రైతుల కష్టాలు.. ఆత్మహత్యలకు దారి తీస్తున్న పరిస్థితుల’పై అధ్యయనం చేయడంలో భాగంగా ఆమె సోమవారం కర్నూలు జిల్లా ఆలూరు మండలం తుంబళబీడు, మండల కేంద్రమైన పెద్దకడబూరులో పర్యటించారు. తంబళబీడు గ్రామంలో గత ఏడాది ఆగస్టు 25న అప్పుల బాధ తాళలేక రైతు దంపతులు నెరణికి బోయరామయ్య, వండ్రమ్మ పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకోగా..వారి కుటుంబ సభ్యులను రేణుదేశాయ్ పరామర్శించారు. అలాగే పెద్దకడబూరులో ఆత్మహత్య చేసుకున్న రైతు పెద్దరంగన్న కుటుంబ సభ్యులతోనూ ఆమె మాట్లాడారు. వారు చెప్పింది విని ఆమె కంట తడిపెట్టారు. ఆయా గ్రామాల్లో రచ్చబండపై రైతులతో ‘సాక్షి టీవీ’ ఆధ్వర్యంలో ముఖాముఖి నిర్వహించారు. తుంబళబీడు గ్రామస్తులు మాట్లాడుతూ పక్కా గృహాలు లేవని, తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని, రోడ్లు బాగోలేవని, పంటలకు జింకల బెడద అధికంగా ఉందని, పంటలు పండక బ్యాంకుల్లో తెచ్చుకున్న రుణాలను చెల్లించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దకడబూరులో రైతులు మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో కరువే దిక్కయ్యిందని, పంటలు పండడం లేదని, ఒకవేళ పండినా గిట్టుబాటు ధరలు లేవని వాపోయారు. పత్తి క్వింటాల్ రూ.3,500, మిరప క్వింటాల్ రూ.6 వేలకు మించి పలకడం లేదన్నారు. కాగా తాను ప్రజాప్రతినిధిని కానని, ప్రభుత్వ అధికారిణిని కాదని, అయినప్పటికీ ప్రభుత్వం, కలెక్టర్ దృష్టికి రైతుల సమస్యలు తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తానని రేణుదేశాయ్ చెప్పారు. -
రైతు కుటుంబాలకు రేణుదేశాయ్ పరామర్శ
మంత్రాలయం/ఆలూరు: రైతాంగ సమస్యలపై అధ్యయనం కోసం సినీనటి రేణుదేశాయ్ సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఆదివారం రాత్రే ఆమె మంత్రాలయం చేరుకున్నారు. స్థానిక ఎస్వీబీ అతిథిగృహంలో బస చేసిన ఆమె ఉదయాన్నే.. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఆత్మహత్యకు కారణాలు, బాధిత కుటుంబాల పరిస్థితులు తెలుసుకుంటారు. ఆలూరు మండలం తుంబళబీడుకు చెందిన నెరణికి రామయ్య దంపతులు గతేడాది ఆగస్టులో, అదే ఏడాది డిసెంబర్ 25న పెద్దకడబూరుకు చెందిన పెద్దరంగన్న ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రేణు దేశాయ్ ఇవాళ ఉదయం తుంబళబీడు, మధ్యాహ్నం పెద్దకడబూరులో పర్యటించనున్నారు. ఆమె పర్యటనపై సాక్షి టీవీలో లైవ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కాగా రైతు సమస్యలను ఇతివృత్తంగా ఓ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు గతంలో రేణు దేశాయ్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులను అలరించిన ఆమె తాజాగా దర్శకురాలుగా రీ–ఎంట్రీ ఇస్తున్నారు. అందుకోసం రేణు దేశాయ్ స్వయంగా రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. ఈ సినిమాకు సంబంధించి స్క్రీన్‌ప్లే వర్క్ కూడా పూర్తి అయింది. ఇక 2014లో డైరెక్టర్‌గా ’ఇష్క్ వాలా లవ్’ అనే మరాఠీ చిత్రాన్ని తెరకెక్కించిన రేణు దేశాయ్.... ఆ తర్వాత ఆ సినిమాను తెలుగులోనూ డబ్ చేశారు. -
హేమలతా లవణం
‘‘హేమలతా లవణంగారంటే నాకు చాలా గౌరవం. తెరపై ఆమె పాత్ర చేయడం నాకు దక్కిన మంచి అవకాశంగా భావిస్తున్నా’’ అన్నారు రేణూ దేశాయ్. ‘బద్రి’తో తెలుగు తెరపై కనిపించి, ఆ తర్వాత ‘జానీ’లో చేసిన రేణు నటనకి బ్రేక్ ఇచ్చి, నిర్మాతగా, క్యాస్టూమ్ డిజైనర్‌గా, ఎడిటర్‌గా, డైరెక్టర్‌గా, చేశారు. దాదాపు 15ఏళ్ల తర్వాత ఆమె తెలుగు పరిశ్రమకు రీ–ఎంట్రీ ఇవ్వనున్నారు. ‘‘వంశీకృష్ణ దర్శకత్వం వహించనున్న ఓ సినిమాలో ప్రత్యేక పాత్ర చేస్తున్నా. ఇందులో నేను హేమలతా లవణంగారి పాత్రలో కనిపిస్తాను’’ అని రేణు తెలిపారు. హేమలతా లవణం గురించి చెప్పాలంటే.. ఆమె సామాజిక కార్యకర్త, నాస్తికురాలు, అంటరానితనం, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారామె. ‘‘ఇలాంటి శక్తిమంతమైన పాత్ర ద్వారా తెలుగుకి రీ–ఎంట్రీ ఇవ్వడం చాలా చాలా ఆనందంగా ఉందని, త్వరలో మరిన్ని విశేషాలు చెబుతాను’’ అని రేణు అన్నారు. -
త్వరలో రేణూ దేశాయ్ రీ ఎంట్రీ!
పవర్ స్టార్ పవన్ కల్యాన్ సరసన బద్రి సినిమాతో టాలీవుడ్ పరిచయం అయిన భామ రేణూ దేశాయ్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న రేణూ తరువాత పవన్‌తోనే జానీ సినిమాలో కలిసి నటించారు. పవన్‌ను వివాహం చేసుకున్న తరువాత సినిమాలకు పూర్తిగా దూరమైన రేణూ దేశాయ్ తరువాత పవన్ నుంచి విడిపోయిన తెలుగు ప్రేక్షకులకు పూర్తిగా దూరమయ్యారు. ఇటీవల ఓ టీవీ షోతో తెలుగు ప్రజలను పలకరించిన రేణూ, త్వరలో సిల్వర్ స్క్రీన్‌పై కూడా రీ ఎంట్రి ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కనున్న బయోగ్రాఫికల్ మూవీ తో రేణూ రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దొంగాట ఫేం వంశీ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా స్టూవర్ట్‌పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితకథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. -
కవితారేణువులు
-
టాలీవుడ్లో రేణు దేశాయ్ రీ-ఎంట్రీ
‘బద్రి, జానీ’ సినిమాలతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులను అలరించిన రేణు దేశాయ్ మళ్లీ తెలుగులోకి రీ–ఎంట్రీ ఇవ్వనున్నారు. కానీ ఈసారి మేకప్ వేసుకొని కాదు. మెగాఫోన్ పట్టుకొని! 2014లో డైరెక్టర్‌గా ’ఇష్క్ వాలా లవ్’ అనే మరాఠీ చిత్రాన్ని తెరకెక్కించారు రేణు దేశాయ్. ఆ తర్వాత ఆ సినిమాను తెలుగులోనూ డబ్ చేశారు. ఇప్పుడు స్ట్రెయిట్ తెలుగు సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం అవ్వడానికి సిద్ధమయ్యారు. కథ, స్క్రీన్‌ప్లే రెడీ. ఈ విషయమై రేణు దేశాయ్‌ని ‘సాక్షి’ సంప్రదించగా– ‘‘అవును.. డైరెక్టర్‌గా నా ఫస్ట్ తెలుగు సినిమా కోసం కథ రెడీ చేశాను. రైతులకు సంబంధించిన సమస్యల మీద ఈ సినిమా ఉంటుంది. స్క్రీన్‌ప్లే వర్క్ కూడా కంప్లీట్ అయింది. ప్రస్తుతం డైలాగ్స్ రాస్తున్నాను. ఈ సినిమా షూటింగ్ వచ్చే సంక్రాంతి నుంచి స్టార్ట్ చేస్తాను. ఇందులో నేను నటించను, కేవలం డైరెక్టర్‌ను మాత్రమే’’ అని అన్నారు. ఆ సంగతలా ఉంచితే.. ఓ ప్రముఖ హీరో నటించనున్న చిత్రంలో రేణు ‘వదిన’ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్త ప్రచారంలో ఉంది. ‘‘ఇలాంటివి ఎవరు కల్పిస్తారో అర్థం కావడం లేదు. నేను ఏ తెలుగు సినిమాకీ ఓకే చెప్పలేదు’’ అని రేణు స్పష్టం చేశారు. -
మనసు వెయ్యి ముక్కలైందంటోన్న రేణూ
సోషల్ మీడియాలో నెగెటివిటి ఎక్కువగా ఉందని, కొందరు పనిగట్టుకుని ట్రోల్ చేస్తున్నారని రేణూ దేశాయ్ ట్విటర్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. అయితే రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో తన వ్యక్తిగత విషయాల గురించి పోస్ట్ చేస్తున్నారు. కానీ, తనకు కాబోయే భర్త పేరు, వివరాలు బయట పెట్టడం లేదు. తాజాగా రేణూ చేసిన పోస్ట్ హృదయాన్నిహత్తుకునేలా ఉంది. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగానే కాకుండా రేణూ దేశాయ్ కవితలు కూడా రాస్తుంటారు. ‘వెయ్యి ముక్కలైన నా మనసును ఓపికగా.. ఒక్కటిగా చేర్చావు. ఒక్కో ముక్క నేను పడిన బాధకు సాక్ష్యం. నీ సున్నితమైన వైఖరి, సుతిమెత్తని మాటలతో.. నా బాధలను పోగొట్టావు. నా ఆత్మకు ప్రశాంతతను కలిగించావు. ఇక ఇప్పుడు నాకు ఎలాంటి బాధ లేదు.. ఎందుకంటే నువ్వు నాకు ఉన్నావు’ అంటూ సంతోషంగా ఉన్న ఫోటోను షేర్ చేశారు. -
‘గందరగోళాన్ని సృష్టిస్తున్నారు’
నటి రేణూ దేశాయ్.. నటుడు పవన్ కల్యాణ్‌తో విడాకుల వ్యవహారంపై మరోసారి స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ‘పవనే విడాకులు కావాలని కోరారంటూ’ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఇంటర్వ్యూతో హర్ట్ అయిన పవన్ ఫ్యాన్స్ కొందరు ఆమెను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేయటం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే పవన్-అన్నాలెజ్నెవా కూతురు పొలెనా ప్రస్తావన తెస్తూ రేణూ దేశాయ్ పీఆర్ టీమ్ ఆవిడ ఫేస్బుక్ పేజీలో వరుస పోస్టులు చేసింది. ‘బేబీ పొలెనా పుట్టింది 13 మార్చి 2012. [9 నెలలు అంటే గర్భధారణ అయ్యింది జులై 2011]. విడాకులు ఖరారు అయినది పాప పుట్టిన తర్వాత అంటే 16 మార్చి 2012. ఈ వివరణ ఎందుకంటే గత కొన్నిరోజులుగా మాకు ఎన్నో మెసేజెస్ వస్తున్నాయి. ఓ ఇంటర్వ్యూని ఆధారంగా చేసుకుని పాప పుట్టిన తేదీ, విడాకుల వ్యవహారం మీద కొంతమంది గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. అన్నాలెజ్నెవా గర్భం దాల్చిన విషయం రేణూ మేడమ్‌కు తెలియదు. పాప పుట్టిన విషయం తెలిసిన తర్వాత పవన్‌కు రేణూ మేడమ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్నే ఆవిడ మరో ఇంటర్వ్యూలో చెప్పారు’ అని పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ట్రోల్ టెంప్లేట్లను పోస్టు చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించటం గమనార్హం. -
స్త్రీలోక సంచారం
♦ ఇండియా, అమెరికాల మధ్య ఇక్కడొక అడుగు, అక్కడొక అడుగు వేస్తున్న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్ నిక్ జోనాస్‌ను ముంబై తీసుకొచ్చి వీధులన్నీ తిప్పి చూపించి, చుట్టాలిళ్లలో విందు భోజనాలు చేయించాక, ఇక్కడి నుంచీ మళ్లీ ఆ బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి యు.ఎస్. వెళ్లిపోయి అక్కడ జూలై 4న అమెరికా స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొని అక్కడ మళ్లీ నిక్ జోనాస్ కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను కలుసుకున్నారు. అయితే ఇప్పటిక్కూడా ప్రియాంక గానీ, నిక్ గానీ తమ ప్రేమ గురించి గానీ, పెళ్లి గురించి గానీ ఎక్కడా మనసు విప్పి మాట్లాడకపోవడం చూస్తుంటే.. వాళ్లిద్దరైనా ఒకరిముందొకరు మనసు విప్పుకున్నారా అనే సందేహాలు వస్తున్నాయి ♦ ప్రకృతి అందాలు, పర్వతాల నడుమ మనాలీలో ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేశాక కంగనా రనౌత్ ఇంత వరకు మళ్లీ ఆ ఇంట్లోకి వెళ్లలేదు! ‘మెంటల్ హై క్యా’ చిత్రం షూటింగ్ కోసం ప్రస్తుతం లండన్‌లో ఉన్న కంగనా, ఆ షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి వచ్చాకైనా తన డ్రీమ్ హౌస్‌లో సేద తీరే తీరిక లేకుండా.. ఆమె కోసం కబ్బాడీ థీమ్‌తో అశ్వనీ అయ్యర్ తివారీ నిర్మిస్తున్న సినిమా సిద్ధంగా ఉంది! ♦ ఇరవై ఎనిమిదేళ్ల వయసులోనే మరణానికి చేరువైన భారత సంతతి హంగేరీ చిత్రకారిణి అమృతా షేర్గిల్ జీవిత కథను సినిమాగా తీయాలనుకుంటున్నట్లు బాలీవుడ్ నటి దియా మీర్జా ప్రకటించారు. ఇరవయ్యవ శతాబ్దపు అత్యంత ప్రతిభాశీలురలో ఒకరైన అమృత తన పందొమ్మిదవ యేట తెచ్చిన చిత్రలేఖనాల సంకలనం ‘యంగ్ గర్ల్స్’ (1932).. చరిత్రలో ఆమెను చిరస్మరణీయురాలిని చేసిందనీ, అందుకే ఆమె బయోపిక్‌ను నిర్మించబోతున్నానని నిర్మాత కూడా అయిన దియా వెల్లడించారు ♦ పవన్ కల్యాణ్ అభిమానుల నుండి తన ట్విట్టర్‌కు వస్తున్న అసభ్యకరమైన కామెంట్లను తట్టుకోలేక రేణు దేశాయ్ తన ట్విట్టర్ అకౌంట్‌ను క్లోజ్ చేసేశారు. రేణు దేశాయ్ రెండో పెళ్లి ఖరారు అయిన విషయం తెలుసుకున్న క్షణం నుంచీ ఆమె మొదటి భర్త పవన్ కల్యాణ్ అభిమానులు ఆమెపై సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా పెడుతున్న వేధింపుల పోస్టులకు తాళలేక ట్విట్టర్ నుంచి బయటికి వచ్చేసిన రేణు.. ఎప్పుడైనా తన అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి వీలుగా ఫేస్బుక్ అకౌంట్ మాత్రం ఉంచుకున్నారు ♦ ఇరవై ఐదేళ్ల అమెరికన్ గాయని అరియానా గ్రాండే తను వివాహమాడబోతున్న ఇరవై నాలుగేళ్ల అమెరికన్ నటుడు, కామెడియన్ పీట్ డేవిడ్సన్ తనపై విసిరిన క్రూరమైన జోక్‌కు అభ్యంతరం తెలియజేయడంతో పెళ్లికి ముందే వీరి ప్రేమ పెటాకులు అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. గత ఏడాది మే 22న యు.కె.లోని మాంచెస్టర్‌లో జరిగిన ఆత్మాహుతి ఉగ్రదాడి కారణంగా ఇరవై మూడు మంది చనిపోవడంతో, ఆ రోజు అక్కడ కచేరీ ఇస్తున్న అరియానా పేరు అందరికీ తెలిసిందని పీట్ జోక్ చేయడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు ♦ ఆగస్టు 18 నుంచి ఇండోనేషియాలో జరగబోతున్న ఏషియన్ గేమ్స్‌లో భారతదేశం నుండి పాల్గొంటున్న 18 మంది సభ్యులు గల మహిళా హాకీ టీమ్‌కు రాణీ రాంపాల్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. గత ఏడాది తొమ్మిదవ ఉమెన్స్ ఏషియా కప్‌ను గెలిచిన రాణీకి, గోల్ కీపర్‌గా అనుభవం ఉన్న సవిత వైస్ కెప్టెన్‌గా నిర్ణయించారు ♦ ఇటీవల విడుదలైన అపర్ణా జైన్ పుస్తకం ‘లైక్ ఎ గర్ల్ : రియల్ స్టోరీస్ ఫర్ టఫ్ కిడ్స్’.. విశేష ఆదరణ పొందుతోంది. స్ఫూర్తిప్రదాతలైన యాభై మంది భారతీయ మహిళల జీవిత చరిత్రలు ఉన్న ఈ పుస్తకం.. ఆడపిల్లలు ఉన్న ప్రతి ఇంటి లైబ్రరీలోనూ తప్పక ఉండాలని ప్రచురణకర్తలు అంటున్నారు ♦ తెలుగులో రంగస్థలం, మహానటి, తమిళంలో ఇరుంబు తెరై (ఇనుపతెర) చిత్రాలతో ఈ ఏడాది హిట్స్ సాధించిన సమంతా.. ఇప్పటికే ఒప్పుకుని ఉన్న చిత్రాలన్నిటినీ వచ్చే ఏడాది మార్చి నాటికి త్వరత్వరగా ముగించుకుని నటనకు గుడ్‌బై చెప్పాలనుకుంటున్నారని వినికిడి! 2017లో నాగ చైతన్యను వివాహం చేసుకున్న సమంత.. ‘తల్లయ్యాక సినిమాలు మానేస్తాను’ అని ఓ ఇంటర్వ్యూలో అన్నారని, 2019లో రిలాక్స్ కావాలని అనుకుంటున్నారు కనుక ఇక ఆమె తల్లి అయ్యే ప్రయత్నాలు చెయ్యవచ్చుననీ మీడియా ఊహిస్తోంది -
పవన్కో రూల్ నాకో రూలా?: రేణూ
సాక్షి, హైదరాబాద్: గత ఐదేళ్లుగా నాపై వస్తున్న విమర్శలపై ఎందుకు స్పందించలేదని నటి రేణూ దేశాయ్, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ను ప్రశ్నించారు. ఈ విషయంలో పవన్కో రూల్.. నాకో రూలా? అని తన ఫేస్బుక్ పేజీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లుగా తనని అనరాని మాటలు అనడంతో పాటు విమర్శలు చేసిన వారిని పట్టించుకోవద్దని కొందరు సలహా ఇచ్చారని, అయితే మరికొందరు మాత్రం పాపులారిటీ కోసమే రేణు ఇలా చేస్తున్నారని కామెంట్లు చేశారని తెలిపారు. ఇప్పుడేమో పవన్‌కు వ్యతిరేకంగా తాను మాట్లాడినట్లు ఓ వ్యక్తి కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాడు. దీంతో కొందరు అభిమానులు పవన్‌కు మద్దతివ్వాలని మర్యాదపూర్వకంగా అడుగుతుంటే.. మరికొందరు తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని రేణు ఆవేదన వ్యక్తం చేశారు. ‘గత ఐదేళ్లుగా కొందరు నన్ను నోటికొచ్చినట్లు తిడుతున్నప్పుడు నా ఆత్మాభిమానం మీకు ముఖ్యం అనిపించలేదా. ఇప్పుడు పవన్ పేరుకు మచ్చ వస్తుందన్న భయంతో తనని స్పందించమనడం ఎంత వరకు సబమని’ పవర్‌స్టార్ అభిమానులను ఉద్దేశించి ఆమె కామెంట్ చేశారు. తానెప్పుడూ పవన్ గురించి తప్పుగా మాట్లాడలేదని, అలా మాట్లాడమని తనని కానీ, తన పిల్లలను కానీ ఏ రాజకీయ పార్టీ ప్రేరేపించలేదని రేణూ దేశాయ్ స్పష్టం చేశారు. -
నేను నోరు విప్పితే బాగోదు: రేణూ దేశాయ్
నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ మరోమారు పవన్ ఫ్యాన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో వివాహం నేపథ్యంలో ఆమెను ఉద్దేశిస్తూ పలువురు పవన్ ఫ్యాన్స్ ట్రోల్ చేయటంపై ఆమె మండిపడ్డారు. విడాకుల వ్యవహారంపై ఇన్నాళ్లు తాను మౌనంగా ఉన్నానని, అలా ఉన్నందుకు పవన్ అభిమానులు కృతజ్ఞతగా ఉండాలని ఆమె సూచించారు. మర్యాదగా ప్రవర్తించాలని, అలా కాకుండా విడాకుల వ్యవహారంపై తాను నోరు విప్పితే అభిమానుల పొగరు మురికి కాలువలో పడి కొట్టుకుపోతుందని ఆమె హెచ్చరించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె వరుస స్టోరీలు పోస్టు చేశారు. ‘విడాకుల వెనక ఉన్న వాస్తవాలను చెబితే అవివేకులైన ఫ్యాన్స్‌కు గర్వభంగం అవుతుంది’ అంటూ తీవ్రస్థాయిలో ఆమె వ్యాఖ్యానించారు. ‘పవన్ అభిమానుల్లో చాలా మంది మర్యాదస్తులు, మంచివాళ్లు ఉన్నప్పటికీ, కొందరు(ఓ 10 శాతం) మాత్రం అవివేకులే. నెగిటివిటీని భరించాల్సిన అవసరం నాకు లేదు. అసలు నేనేం చేశానని వాటిని భరించాలి?’ అని రేణూ ప్రశ్నించారు. దయచేసి సలహాలు ఇవ్వడం మానుకోవాలని.. ఇక నుంచైనా తనను టార్గెట్ చేయకపోవటమే మంచిందని ఆమె హెచ్చరించారు. ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తనతో ఏడుపుగొట్టు కథలు చెప్పుకోవడం మానుకుంటే మంచిదన్నారు. అభిమానుల మూర్ఖత్వానికి తెరపడి, తన గురించి, తన పని గురించి వచ్చే కామెంట్లను స్వేచ్ఛగా చదువుకునే రోజు రావాలని ప్రార్థిస్తున్నట్టు రేణు దేశాయ్ పేర్కొన్నారు. -
పవన్ అభిమానులపై శ్రీరెడ్డి ఫైర్
సాక్షి, హైదరాబాద్ : నిశ్చితార్ధంతో కొత్త జీవితానికి శ్రీకారం చుడుతున్నట్టు ప్రకటించిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌ను వేధిస్తూ ట్రోలింగ్ చేసిన పవన్ అభిమానులపై శ్రీరెడ్డి విరుచుకుపడ్డారు. రేణూకు బాసటగా నిలుస్తూ పవన్ అభిమానులపై ధ్వజమెత్తారు. ‘ఆమె (రేణూ దేశాయ్) చాలా చిన్న వయసులో విడాకులు తీసుకున్నారు.. దానికి కారణాలేంటనే దానిపై మనం మాట్లాడాల్సిన అవసరం లేదు..ఆమె వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే హక్కు మనకు లేద’న్నారు. కొందరు ట్విటర్లో కనీసం తమ పేరు, ఫోటో లేకుండా నకిలీ అకౌంట్లతో ఆమెను వేధిస్తున్నారని మండిపడ్డారు. ఆమెను వేధింపులకు గురిచేసేందుకు మీరెవరని ప్రశ్నించారు. పూణేలో ఆమె ఒంటరిగా పిల్లల్ని పెంచుతున్నారని, ఆమె ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో ఎవరికైనా తెలుసా అని నిలదీశారు. ఆమె బాధల్లో ఉన్నప్పుడు ఎవరైనా మద్దతుగా నిలిచారా అని ప్రశ్నించారు. ఆమెకు సాయం చేయనప్పుడు ఆమె వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడానికి మీరెవరని మండిపడ్డారు. పవన్ అభిమానులు వారి స్టార్‌ను అభిమానించుకోవచ్చని, అయితే వ్యక్తిగత విషయాల్లో ఇతరులను ఇబ్బంది పెట్టడం తగదని సూచించారు. కాగా సినీ పరిశ్రమలో తాను ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై పోలీస్ స్టేషన్, న్యాయస్ధానాలను ఆశ్రయించాలని పవన్ కళ్యాణ్ గతంలో శ్రీరెడ్డికి సూచించిన క్రమంలో ఆమె పవర్‌స్టార్‌పై విరుచుకుపడిన విషయం తెలిసిందే. -
నెగిటివిటీకి దూరంగా...
రేణూ దేశాయ్ ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కాబోయే భర్త వివరాలు ఆమె బయటపెట్టలేదు. ఇప్పుడు ట్వీటర్లో తన అకౌంట్‌ని కూడా డిలిట్ చేసుకున్నారామె. అకౌంట్ డిలిట్ చేసుకోడానికి గల కారణాన్ని వివరిస్తూ – ‘‘ట్వీటర్ నిండా విపరీతమైన నెగిటివిటీ నిండి ఉందని నాకు అనిపిస్తోంది. ఇక్కడ (ట్వీటర్ ఫాలోయర్స్) ఉన్నవాళ్లు ఎక్కువగా అజ్ఞాత వ్యక్తులు. వ్యక్తిగతంగా, వృతిరీత్యా చిరాకుతో ఉన్నవాళ్లు సినిమా గురించి, రాజకీయ వ్యక్తుల గురించి నెగిటీవ్‌గా రాయడానికి ఇష్టపడతారు. కొత్త జీవితం స్టార్ట్ చేయాలనుకున్న ఈ సమయంలో ట్వీటర్ నుంచి దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చాను. ప్రతికూల పరిస్థితిలో నాకు తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. రేణూ దేశాయ్ ఎంగేజ్మెంట్ గురించి పవన్ కల్యాణ్ స్పందిస్తూ – ‘‘కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తోన్న రేణుగారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆమె సంతోషంగా, మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు. -
అక్కడ అందరూ అజ్ఞాతవాసులే.. రేణు దేశాయ్
సాక్షి, హైదరాబాద్ : నటి, దర్శకురాలు, రచయిత రేణు దేశాయ్ ఎప్పుడూ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులందరికీ అందుబాటులో ఉంటారు. అయితే రేణు ఇకపై తన ట్విటర్‌కి టాటా చెబుతున్నారు. పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి వస్తున్న నెగటీవ్ కామెంట్ల వలనే ట్విట్టర్ ఖాతా నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె ఎందుకు వైదొలుగుతున్నారో అన్నది తన ట్విటర్లో పేర్కొన్నారు. రేణు దేశాయ్ ‘ట్విటర్ నిండా విపరీతమైన ప్రతికూలత ఉందని నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న వ్యక్తులు అధికంగా అజ్ఞాత వాసులు. వ్యక్తిగతంగా, వృత్తి పరంగా చిరాకు కూడిన వాళ్లు. ఒక సినిమా గురించి కానీ రాజకీయ వ్యక్తుల గురించి కానీ నెగెటివ్‌గా రాయడానికే ఇష్టపడతారు. ఇప్పుడు నేను నూతన జీవితం ప్రారంభిస్తున్నాను. ఈ సమయంలో ఒక నిర్ణయానికి వచ్చాను. నేనే నా ట్విటర్ నుంచి వైదొలగి ఈ నెగెటివిటికి దూరంగా ఉండదలుచుకుంటున్నాను. అదే సమయంలో నా మంచి కోరుతూ నన్ను అర్థం చేసుకుని ప్రతికూల పరిస్థితిలో నాకు తోడుగా వెంట ఉన్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు’ అని ట్విటర్లో పేర్కొన్నారు. ఆ మధ్య రెండో వివాహం గురించి మాట్లాడిన రేణూ.. తాజాగా ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో తెలిపిన విషయం తెలిసిందే. అయితే తన జీవిత భాగస్వామి ఎవరు, ఏంటి అన్న వివరాలపై స్పష్టత లేదు. దీనికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు కూడా తెలిపారు. రేణు ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
రేణూ ఎంగేజ్మెంట్పై స్పందించిన పవన్
-
రేణూ ఎంగేజ్మెంట్పై పవన్ స్పందన
నటి రేణూ దేశాయ్‌కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. పవన్ నుంచి దూరం అయ్యాక ఆమె రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ మధ్యే రేణూ నిశ్చితార్థం ఘనంగా జరిగింది కూడా. అయితే జీవిత భాగస్వామి ఎవరు, ఏంటి అన్న వివరాలపై స్పష్టత ఇవ్వకపోయినా.. ఎంగేజ్ మెంట్ జరిగిన విషయాన్ని మాత్రం తన పోస్ట్‌లతో ధృవీకరించారు. ఈ క్రమంలో పవన్ ఈ ఉదయం ఓ ట్వీట్ చేశారు. ‘మిస్ రేణూగారు.. కొత్త జీవితంలోని అడుగుపెడుతున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు. మీరు ఆరోగ్యంగా ఉండాలని, మీకు శాంతి, శ్రేయస్సు కలగాలని కోరుకుంటున్నాను’ అని పవన్ ట్వీటేశారు. అయితే రేణూ దేశాయ్‌ను ఉద్దేశించి ‘మిస్’ అని పవన్ కల్యాణ్ సంబోధించడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ట్వీట్ చక్కర్లు కొడుతోంది. -
స్క్రీన్ ప్లే 25th June 2018
-
కొత్త లైఫ్ స్టార్ట్
నటి, దర్శకురాలు, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ నిశ్చితార్థం ఆదివారం జరిగింది. పవన్ కల్యాణ్‌తో కొన్ని సంవత్సరాలు సహజీవనం చేశాక 2009లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత దాదాపు మూడేళ్లకు 2012లో విడాకులు తీసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు అకీరా నందన్, ఆద్యా ఉన్న విషయం తెలిసిందే. విడిపోయిన తర్వాత కూడా ఫంక్షన్లు, బర్త్‌డేలకు కలుస్తూనే ఉండేవారు పవన్ కల్యాణ్, రేణు దేశాయ్. అయితే అవి ప్యూర్లీ పిల్లలకు సంబంధించిన ఫంక్షన్స్ అనే వార్తలు ఉండేవి. పవన్ కల్యాణ్ నుంచి విడాకులు తీసుకున్నాక ఒంటరిగా ఉంటున్న రేణు ఇటీవలే మళ్లీ ప్రేమలో పడ్డానంటూ ట్వీటర్లో పోస్ట్‌లు పెట్టారు. ఆ లవ్‌ని మ్యారేజ్ వరకూ తీసుకెళ్లారు. అయితే తాను ఎవర్ని ప్రేమిస్తున్నానో బయటపెట్టని రేణు ఆదివారం నిశ్చితార్థం జరిగాక కూడా కాబోయే భర్త పేరు, ఇతర వివరాలు బయటపెట్టలేదు. నిశ్చితార్థ వేడుకకు సంబంధించి రెండు ఫొటోలు షేర్ చేశారు. ‘‘నా పిల్లలు లేనిదే నా సంతోషం పరిపూర్ణం కాదు. నా లైఫ్‌లో ఓ కొత్త ఫేజ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు వాళ్లిద్దరూ నా పక్కన ఉండటం చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు రేణు దేశాయ్. -
రేణూ దేశాయ్ ఎంగేజ్మెంట్.. వైరల్!
సినీనటి, దర్శకురాలు రేణూ దేశాయ్ తన జీవితానికి సంబంధించిన ఫొటోను షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఆ మధ్య రెండో వివాహం గురించి మాట్లాడిన రేణూ.. తాజాగా ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో తెలిపారు. తనకు కాబోయే జీవిత భాగస్వామి చేతిపై రేణూ చెయ్యేసిన ఫొటోలో నిశ్చితార్థపు ఉంగరాలు గమనించవచ్చు. జీవిత భాగస్వామి ఎవరు, ఏంటి అన్న వివరాలపై స్పష్టత ఇవ్వకపోయినా.. ఎంగేజ్ మెంట్ జరిగిన విషయాన్ని మాత్రం తన పోస్ట్‌తో వెల్లడించేశారు. ‘జీవిత భాగస్వామి కోసం వెతికితే తప్పేంటి. పిల్లల్ని చూసుకోవడానికి నాకు ఓ తోడు అవసరం’ అని పేర్కొన్న రేణూ దేశాయ్.. ఇటీవల తన రెండో వివాహ ఆలోచనలను షేర్ చేసుకున్నారు. ఓ వ్యక్తి చేయిపట్టుకున్న ఫొటోను ఓ కవితతో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేశారు. కాగా, విడాకుల అనంతరం పవన్ కల్యాణ్ మరో వివాహం చేసుకోగా, రేణు మాత్రం పిల్లలు అకీరా నందన్, ఆద్యలతో కలిసి పూణేలో నివసిస్తున్నారు. కొన్ని రోజులుగా అకీరా తండ్రి పవన్‌తో కలిసి విజయవాడలో ఉంటున్నాడని ఇటీవల రేణు తెలిపారు. పవన్ మేల్ ఫ్యాన్స్ నుంచి తనకు ఎక్కువగా అభినందనలతో పాటు సహకారం అందడంపై రేణు హర్షం వ్యక్తం చేశారు. అందమైన, మనసున్న మిమ్మల్ని పవన్ ఎందుకు వదులుకున్నారో అర్థం కావడం లేదని అభిమానులు ఆమెకు మెస్సేజ్‌లు చేశారు. తనకు మద్దతు తెలిపిన అందరికీ నటి ధన్యవాదాలు తెలుపుతూ మరో పోస్ట్ చేశారు. (ప్రేమ కోసం వెతికా.. చివరికి...) (నా పెళ్లికి మిమ్మల్ని పిలుస్తా: రేణుదేశాయ్) -
పవన్‌తో అకీరా, లెజినోవా: రేణు ట్వీట్
సాక్షి, సినిమా: జనసేన అధ్యక్షుడు, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో ఆయన కుమారుడు అకీరా నందన్ ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పవన్ కళ్యాణ్ విజయవాడలోని పడమట ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని శుక్రవారం ఉదయం గృహ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. అయితే పవన్ ముందు రోజు రాత్రి విజయవాడలోని ఓ హోటల్లో కొడుకు అకీరానంద్, భార్య అన్నాలెజినోవాతో కలిసి రావడం కొంతమంది కంట పడింది. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అకీరా విజయవాడకు రావడాన్ని ప్రశ్నిస్తూ కొంత మంది రేణుకి మెసేజ్ చేశారట. దీనికి రేణు తన ట్విటర్ ద్వారా స్పందించారు. ‘అకీరా తన సెలవుల్లో కొన్ని రోజులు పవన్(నాన్న)తో కలిసి గడపాలనుకున్నాడు. అతడు హైదరాబాద్‌కు రాలేదు. ప్రస్తుతం అకీరా కల్యాణ్ గారితో కలిసి విజయవాడలో ఉన్నాడు. అప్పటి నుంచి నాకు విరామం లేకుండా మెసేజ్‌లు వస్తున్నాయి. అందుకే ఈ ట్వీట్ చేస్తున్నా’ అని రేణు దేశాయ్ పేర్కొన్నారు. నటి, దర్శకురాలు, రచయిత రేణు దేశాయ్ తన పిల్లల గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్‌లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల రేణుదేశాయ్ తన కొడుకు అకీరాను జూనియర్ పవర్ స్టార్ అని కొంతమంది సోషల్ మీడియాలో అంటే ఫైర్ అయ్యింది. అకీరాను అలా పిలవద్దంటూ సీరియస్ అయ్యింది. తన కొడుకు సొంతంగా ఎదిగేందుకు తాను భరోసానిస్తున్నానని.. అకీరాను తనలాగే గుర్తించాలని అభిమానులను కోరింది. Akira is just spending few days of school holidays with his father. He has not shifted to Hyderabad. This tweet is because of the constant msgs I am getting since yesterday about Akira being in Vijaywada with Kalyan garu. 😊 — renu (@renuudesai) June 23, 2018 -
‘జూనియర్ పవర్ స్టార్ అనొద్దు’
నటి, దర్శకురాలు, రచయిత రేణు దేశాయ్ తన పిల్లల గురించి సోషల్ మీడియాలో తరుచూ పోస్టింగ్స్ చేస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే. తాజాగా రేణు తన కుమారుడు అకీరాను జూనియర్ పవర్‌స్టార్ అనకూడదని తెలిపారు. అలా పిలవడం అకీరాకు గానీ, తల్లినైనా నాకు గానీ, అతని నాన్నకు గానీ ఇష్టం లేదన్నారు. ఇకనైనా అలా పిలువడం ఆపాలని కోరారు. ఏవరైనా అలాంటి కామెంట్లు చేస్తే తన పీఆర్ టీమ్ వాటిని తొలగిస్తుందని చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అకీరా ల్యాప్ టాప్‌లో గేమ్ కోసం వెతుకుతున్న ఫొటోను ఉంచిన రేణు.. తను యూరోపియన్ సినిమాలో సీరియస్ క్యారెక్టర్ని తలపిస్తున్నాడని పేర్కొన్నారు. అంతే కాకుండా ఇకపై అకీరాను అలా అనవద్దని సూచన కూడా చేశారు. కాగా రేణు పోస్ట్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. -
స్క్రీన్ ప్లే 18th June 2018
-
ప్రేమ కోసం వెతికా.. చివరికి...
సినీ నటి రేణూ దేశాయ్ ఆ మధ్య రెండో వివాహం గురించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పవన్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు రావటంతో.. ఆమె అదే స్థాయిలో సమాధానమిచ్చారు. ‘ జీవిత భాగస్వామి కోసం వెతికితే తప్పేంటి. పిల్లల్ని చూసుకోవడానికి నాకూ ఓ తోడు అవసరం’ అంటూ స్పష్టం చేశారు. అయితే ఆ విషయంలో ఆమె ఓ ఫోటోతో హింట్ ఇచ్చారన్న చర్చ మొదలైంది. ఓ వ్యక్తి చేయిపట్టుకున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేశారు. పైగా దానికింద ఆమె ఓ కవిత కూడా రాశారు... ‘నా ప్రేమ కోసం ఎక్కడెక్కడో వెతికా. ఆ ప్రయాణంలో ప్రేమ అనేది ఓ అనుభూతి అన్న సంగతినే మర్చిపోయా. ‘నీలో నా ప్రేమ దొరికింది’ అంటూ ఓ వ్యక్తి వ్యక్తిత్వాన్ని వర్ణించారు. ‘నీతో ఉంటే చాలా సంతోషంగా, శాంతంగా ఉంటాను. నా చెయ్యి పట్టుకో.. ఎప్పటికీ విడువకు. అవును.. ఆ నమ్మకాన్ని నువ్వు నాకు కల్పించావు’ అంటూ ఆమె కవితలో తన భావాల్ని రాశారు. దీంతో ఆమెకు కావాల్సిన తోడు దొరికిందా? ఆమె కాబోయే భర్తే అతనేనా? అన్న చర్చ మొదలైంది. మరోవైపు చాలా మంది ఈ కోణంలోనే కామెంట్లు చేస్తున్నారు. అయితే దీనిపై రేణూ దేశాయ్ మాత్రం స్పందించలేదు. -
చంపడానికైనా.. చావడానికైనా సిద్ధం..
సాక్షి, హైదరాబాద్ : నటి, దర్శకురాలు, రచయిత రేణు దేశాయ్ తన పిల్లల గురించి సోషల్‌మీడియా తరచూ పోస్టింగ్స్ చేస్తూ ఉంటారు. ఎప్పటిలానే సోమవారం కూడా ఆమె ఓ పోస్టు చేశారు. ‘ఒక హృదయం, ఒక ఆత్మ.. మీ కోసం నేను ప్రాణాలు ఇస్తాను, మీ కోసం అవసరమైతే ప్రాణాలు తీస్తాను. ఓ తల్లి తన పిల్లల కోసం రాసిన చిన్న కవిత.. నిర్విరామంగా ఈ క్యూటీల ఫొటోలను తీస్తూనే ఉండగలను’ అంటూ అకీరా, ఆద్యలతో కలిసి ఉన్న ఫొటోను ట్వీట్ చేశారామె. రేణు దర్శకురాలిగా ‘ఇష్క్ వాలా లవ్’ సినిమాను తెరకెక్కించారు. 2014లో విడుదలైన ఈ సినిమాలో అకీరా కూడా తళుక్కుమని మెరిశాడు. -
మంచు లక్ష్మిపై రేణూ దేశాయ్ పోస్ట్.. వైరల్
సాక్షి, హైదరాబాద్: సేవా కార్యక్రమాలు చేసే నటి మంచు లక్ష్మిని మరోనటి, దర్శకురాలు రేణూ దేశాయ్ ప్రశంసించారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి లక్ష్మి చాలా కృషి చేస్తున్నారని రేణు కొనియాడారు. ఆమెతో కలిసి ఓ మంచి పనిలో భాగస్వామిని అయినందుకు ఎంతో సంతోషంగా ఉందంటూ సోషల్ మీడియా సైట్ ఫేస్బుక్లో రేణు ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా ‘మేము సైతం’ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ షోలో రేణు పాల్గొన్నారు. ఎలాంటి నగదు తీసుకోకుండా అవసరాల్లో ఉన్న వారి కోసం పనిచేయడం తృప్తి నిచ్చిందన్నారు. ‘బొమ్మలు అమ్మి 30 వేల రూపాయాలు సంపాదించా. వాటికి మరో 20 వేల రూపాయలు కలిపి ఇచ్చాను. ఆ నగదుకు మంచు లక్ష్మి మరో లక్ష రూపాయలు జత చేశారు. 35 మంది విద్యార్థుల చదువు కోసం 1.5 లక్షల రూపాయలు లక్ష్మి విరాళంగా ఇచ్చేశారు. అవసరాల్లో ఉన్న వారికి మీకు తోచినంతలో సాయం చేయండి. మహిళల చదువు, ఆహారం, వైద్య సదుపాయాల కోసం సాయం అందించాలి. మీరు ఇచ్చే చిన్నమొత్తం అయినా వేరొకరి జీవితాల్లో అది ఎంతో పెద్ద విషయమంటూ’ నటి రేణూ తన పోస్టులో పేర్కొన్నారు. హ్యుమానిటీ, రెస్పాన్సిబిలిటీ, రెస్పాన్సిబుల్ సిటిజన్, బీయింగ్ హ్యుమన్ అనే హ్యాష్‌ట్యాగ్స్‌తో రేణు చేసిన పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. -
పవన్ అభిమానిపై రేణు ఫైర్
సోషల్ మీడియాలో తనపై వస్తున్న కామెంట్స్‌పై రేణుదేశాయ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ నుంచి విడిపోయిన తరువాత చాలా సందర్భాల్లో రేణు అభిమానుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా మరోసారి ఓ కవిత కారణంగా ఆమె విమర్శలు ఎదుర్కొన్నారు. తన గతానికి సంబంధించిన ఆవేదనను కవిత రూపంలో రాసుకున్న రేణు.. ఆ కవితను తానే స్వయంగా చదివి వీడియో రూపంలో యూట్యూబ్‌లో ఉంచారు. దీంతో ఈ వీడియోపై పవన్ అభిమాని స్పందిస్తూ ‘మీ కారణంగా పవన్ రాజకీయ పార్టీలకు టార్గెట్ అవుతున్నారు. మీరు పూర్తి అవగాహన లేకుండా కామెంట్ చేయటం. మీడియా ఆ విషయాన్ని హైలెట్ చేయటం. మీరు మీ పనిచేసుకుంటూ సంతోషంగా ఉండండి. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన విషయాలను షేర్ చేయకండి’ అంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్ పై రేణు దేశాయ్ సీరియస్ అయ్యారు. ‘నా కవిత కారణంగా అతను(పవన్ కళ్యాణ్) ఎలా టార్గెట్ అవుతాడు..? మీరు మీ పని చేసుకోండి. నేను సోషల్ మీడియాలో ఏదైన పోస్ట్ చేసినప్పుడు వాటిపై సంస్కారంలేకుండా స్పందించకండి’ అంటూ ఘాటుగా సమాధానమిచ్చారు. గతంలోనూ పలు సందర్భాల్లో పవన్ అభిమానుల వల్ల తనకు ఎదురవుతున్న ఇబ్బందులను రేణు బయటపెట్టారు. -
ముక్కలైన నా హృదయం -రేణూ
సాక్షి, హైదరాబాద్: నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ గొప్ప కవయిత్రి కూడా అని మరోసారి నిరూపించుకున్నారు. మల్టీ టాలెంటెడ్ రేణూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఇటీవలి కాలంలో తన అభిప్రాయాలను పంచుకోవడంతోపాటు ఆంగ్లంలో రాసిన కవితలను ట్విటర్లో పోస్ట్ చేయడం తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘డాలర్- ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్’ అనే టైటిల్‌తో కవితను, వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేశారు. దీన్ని అభిమానుల కోసం ట్విటర్లో షేర్ చేశారు. జ్ఞాపకాల సమాధులను తవ్వితీస్తూ..ముక్కలైన హృదయాన్ని విషాద సాహిత్యంగా అవిష్కరించిన వైనం అద్భుతంగా నిలిచింది. ఆ జ్ఞాపకాలను ఇప్పుడు తిరిగి చూసుకుంటే తుప్పు పట్టిన కలం, దానిపై రాసుకున్న పేరు తుడిచిపెట్టుకుపోయానడం ఆమె ప్రస్తుత పరిస్థితికి అద్ధం పట్టింది. ముక్కలైన హృదయం, రాసుకున్న లేఖల కాగితపు ముక్కలు మాత్రమే మిగిలాయంటూ తన జ్ఞాపకాలతో బాధాతప్త హృదయాన్ని ప్రస్తావించారు. కమ్ముకున్న మంచు కరిగిపోయి మళ్ళీ ఆ జ్ఞాపకాలు కళ్ళెదుట నిలిచాయి. మనసు లోతుల్లో పాతుకుపోయిన జ్ఞాపకాలని మళ్ళీ తట్టి లేపుతుంది. తిరిగి చూసుకుంటే..తుప్పు పట్టిన కలం, తుడిచిపెట్టుకుపోయిన పేరు. విధి ఎంత బలీయమైనది . ముక్కలైన హృదయం విషాద సాహత్యంగా అంటూ తన కవితను ముగించారు. ఎంతో బాధతో, ఆవేదనతో కూడిన ఈ కవిత అభిమానులను ఆలోచింపచేస్తోంది. కాగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఫీనిక్స్ పక్షిలా తిరిగి జీవితాన్నిసాగిస్తున్న రేణూ దేశాయ్ ప్రస్తుతం ఒక టీవీ షోకు జడ్జిగా తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటున్న సంగతి తెలిసిందే. రేణూ దేశాయ్ ఆంగ్ల కవిత: Went digging in the graveyard of my memories Had buried my metaphors with his words, some letters too and a pen with his name inscribed Spring, forced the cherry trees to blossom The ice melted, leaving the grave bare Scavengers of destiny dug open the buried moments and metaphors Found the remains of the pen,rusted parts,name faded Pieces of my heart, in the torn letters Jagged edges of buried reminiscences And the metaphors had ironically become literal tragedies Uploaded a new poem on YouTube. Do share with your friends too 🌸https://t.co/0duBjs3taU — renu (@renuudesai) February 22, 2018 -
తెలుగులోనూ రేణు దేశాయ్ కవితలు
ఇటీవల మీడియాలో తరుచూ కనిపిస్తున్న రేణుదేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యం పవన్ తో తన రిలేషన్, విడాకులకు దారితీసిన పరిస్థితులు, రెండో పెళ్లి లాంటి విషయాలతో పలు వివాదాలకు కేంద్రబిందువయ్యారు. తరుచూ మీడియాతో మాట్లాడుతున్న రేణు హాబీగా తాను రాసుకున్న కవితలకు పుస్తక రూపం ఇవ్వనున్నట్టుగా తెలిపారు. తాజాగా ఈ కవితలను తెలుగులోకి అనువదిస్తున్నట్టుగా తన సోషల్ మీడియా పేజ్ లో తెలిపారు. తన ఫేస్ బుక్ పేజ్ లో తన కవితను ఇంగ్లీష్ తో పాటు తెలుగులోనూ పోస్ట్ చేసిన రేణు, ప్రముఖ కవి ప్రసాదమూర్తి గారు తన కవితలను తెలుగులోకి అనువదిస్తున్నట్టుగా తెలిపారు. ఇప్పటికే తెలుగు అనువాదం పూర్తయిన ఈ పుస్తకానికి ఇంకా పేరు ఖరారు చేయలేదు. త్వరలోనే పూర్తి వివరాలతో పాటు బుక్ రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు. Coming very soon 😊 Prasadmurthy garu has done the Telugu translation so beautifully 🙃💕 pic.twitter.com/lyb0nJ4iOg — renu (@renuudesai) 15 November 2017 -
నా పెళ్లికి మిమ్మల్ని పిలుస్తా: రేణుదేశాయ్
సాక్షి, హైదరాబాద్: రేణు దేశాయ్ టాలీవుడ్లో పరిచయం అవసరం లేని పేరు. పవన్ కల్యాణ్ సతీమణిగా సుపరిచయం. వివాహం అనంతరం ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే పవన్, రేణు దేశాయ్‌లు విడాకులు తీసుకుని గత కొంత కాలంగా వేరుగా ఉంటున్నారు. విడాకుల అనంతరం పవన్ కళ్యాణ్ మరో వివాహం చేసుకోగా రేణు దేశాయ్ మాత్రం పిల్లలు అకీరా నందన్, ఆద్యలతో కలిసి పూణే లో నివసిస్తున్నారు. అనంతరం రేణు సినిమాలకు దర్శకత్వం వహించారు. అనంతరం తన అదృష్టాన్ని పరిక్షించకోవడానికి తెలుగు బుల్లి తెరపై అడుగు పెట్టారు. ఇందులో భాగంగా ప్రముఖ తెలుగు టీవీ ఛానల్లో ప్రసారమవుతున్న డ్యాన్స్ షోకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. తనదైన శైలిలో అలరిస్తున్నారు. తాజాగా ఈ షోలో ఓ జంట చేసిన డాన్స్‌కు రేణు ఫిదా అయ్యారు. వారిపై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు ప్రేమ మీద నమ్మకం పోయిందన్నారు. 'భవిష్యత్తులో మరో పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని పిలుస్తా' అంటూ కంటిస్టెంట్లను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. రేణుదేశాయ్ అంటే పవన్‌కల్యాణ్ అభిమానులకు ప్రత్యేక అభిమానం కనపరుస్తారు. పవన్ కల్యాణ్‌ను అభిమానించినట్లే ఆమెను అభిమానిస్తారు. ఆప్యాయంగా వదినమ్మా అంటూ పిలుచుకుంటారు. గతంలో రేణుదేశాయ్ సైతం ఈ విషయాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. -
ఆద్య.. డాటర్ ఆఫ్ రేణూ
సాక్షి, సినిమా : పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ కాస్త గ్యాప్ తర్వాత ఈ మధ్య మళ్లీ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ఓ రియాల్టీ షోకు న్యాయ నిర్ణేతగా ఆమె వ్యవహరిస్తుండటం.. దీంతో పలు ఛానెళ్లు ఆమెను ఇంటర్వ్యూ చేయటం... వాటిల్లో ఆమె తన వైవాహిక జీవితం గురించి కామెంట్లు చేయటం... అవి వివాదాస్పదం కావటం... పవన్ ఫ్యాన్స్‌పై రేణు ఫైర్ కావటం ఇలా ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆమె కొన్ని యూట్యూబ్ చానెల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అందులో ఒకదాంట్లో తనకు తన పిల్లలకు మధ్య బాండింగ్ గురించి ఆమె చెప్పిన కొన్ని విషయాలు ఆకట్టుకుంటున్నాయి. కొన్నాళ్ల క్రితం రేణు ‘ఆర్తో ఇమ్యూన్ కండిషన్’తో బాధపడింది. దీనికి తోడు గుండెకు సంబంధించి ఓ సమస్య తలెత్తటంతో తరచూ ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఆ సమయంలో తనకి-కూతురు ఆద్యకి మధ్య జరిగిన ఓ భావోద్వేగ ఘటన గురించి ఆమె వివరించారు. ‘ఒకరోజు మెడిసిన్ ప్రభావం ఎక్కువగా పని చేయటంతో నేను గాఢ నిద్రలోకి వెళ్లిపోయా. స్కూలు నుంచి వచ్చిన ఆద్య నన్ను లేపేందుకు ప్రయత్నించింది. అయితే నాలో చలనం లేకపోవటంతో చనిపోతున్నానేమోనంటూ ఏడ్చేసింది. నాకు మెలకువ వచ్చే సరికి ఎదురుగా ప్లీజ్ మమ్మీ, నువ్వు చచ్చిపోవద్దు ప్లీజ్ అంటూ ఒకటే ఏడుపు. ఆ సమయంలో నా కళ్లలో నీళ్లు తిరిగాయి. కానీ, ఏడిస్తే ఆద్య భయపడుతుందని భావించి నవ్వుతూనే.. నేనేం చనిపోనులే, నీతోనే ఉంటాను. ప్రామిస్. అసలు నేను చనిపోతానని ఎందుకు అనుకుంటున్నావ్? నేను పోతే నీకు పెళ్లి ఎవరు చేస్తారు? నీ పిల్లలను ఎవరు చూస్తారు?" అంటూ చెప్పి ఓదార్చాను అని ఆమె వివరించారు. తన ఆరోగ్యం మెరుగుపడాలని దేవుడి ముందు తన కూతురు ఎంత సేపు కూర్చుని ప్రార్థించిందో కూడా తనకు తెలీదని చెప్పిన రేణూ ఈ లోకంలో తన పిల్లలే తనకు సర్వస్వం అని ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. -
పవన్ అజ్ఞానపు అభిమానులు ఏమన్నారు!
ఆలోచనం రేణూ దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవాలని ఉందన్నపుడు పవన్ కళ్యాణ్ అభిమానులు ఏమన్నారన్నది పక్కన పెడదాం. నిజానికి, ఇద్దరు పిల్లల భారాన్ని తన భుజాలపై మోస్తున్న ఆమెకు వరుడు దొరకడం అంత సులభమేనా? మహాభారతంలో దీర్ఘతమ మహర్షి అంధుడు. అతని భార్య ప్రద్వేషి. ఆమె ఒకానొకరోజు అతని అంధత్వాన్ని భరించలేనని భావించి ‘‘పతియు భరియించు గావున భర్తయయ్యె! భామ భరియింపబడుగాన భార్య యయ్యె బరగనవి మనయందు వీడ్వడియె నిన్ను ! నేన ఎల్లకాలం భరియింతు గాన (మహాభారతం 1–4–228)’’ అంటూ భర్తను వదిలిపెట్టేస్తున్నానని ప్రకటిస్తుంది. అప్పుడు దీర్ఘతముడు భార్య కాళ్లావేళ్లా పడలేదు. చక్కగా ‘‘భర్తలను కోల్పోయిన భార్యలు అతి ధనవంతులైనా, ఉత్తమ కులాలలో పుట్టినవారైనా ఇప్పటినుంచి, అలంకారాలు లేనివారుగా, తాళిహీనులవుదురుగాక’’ అని శాపం పెట్టేశాడు. ఆపై ఉశిజను పెళ్లాడి 11 మందికి జన్మనిచ్చాడు, సుదేష్ణకు 5 మంది పుత్రులను అనుగ్రహించాడు. కానీ ప్రద్వేషి ‘ఒక మగవాడిని నేను భరించలేను బాబో విడిచిపెట్టేస్తాను’ అన్నందుకు ఇవాళ స్త్రీ జాతంతా ఆ శాపాన్ని అనుభవిస్తున్నట్లుందని నాకు రేణూదేశాయ్ మాటలు విన్నాక తోచింది. దీర్ఘతమ మహర్షి నుంచి నేటివరకు పురుషులు భార్యలను వదిలేశాక మళ్లీ పెళ్లాడుతూ, ఆ స్త్రీలకు సంతానాన్ని ప్రసాదిస్తూ, పెళ్లాడలేని స్త్రీలకు సంతానాన్ని అనుగ్రహిస్తూ సంతోషంగానే ఉన్నారని పవన్ కళ్యాణ్ మనకు సోదాహరణంగా తెలియపరుస్తున్నారు. భవయ్యా అనేది ఒక బెంగాలీల జానపద పాయ. అందులో ఒక పాట పల్లవి ‘‘నారీ హోవార్ కీ జె భేతా, ఏ పృథ్వి భూజేన తాహా’’ అంటే.. స్త్రీగా జన్మనెత్తడం ఎంత బాధాకరమైన విషయమో ఈ ప్రపం చం దానిని అర్థం చేసుకోవడం లేదు అని అర్థం. నా జీవితంలో నాకు తారసపడిన అనేకమంది స్త్రీలు, స్త్రీగా పుట్టడంలో ఉన్న బాధను అనేక సార్లు నాకు పరిచయం చేశారు. నా ఇంట్లోకి కొత్తగా వచ్చిచేరిన వంటమ్మాయి కోటమ్మ. ఒక బిడ్డ పుట్టీ పుట్టగానే అకారణంగా భర్త ఆమెను విడిచి పెట్టేశాడు. బిడ్డకు పందొమ్మిదేళ్లు. పద్దెనిమిదేళ్ల క్రితపు తన జీవితాన్ని నాకు చెబుతూ ఇవాళంతా ధారాపాతంగా ఏడ్చింది. ఈ మధ్యనే పరిచయమైన భ్రమరాంబ దిగువ మధ్యతరగతి స్త్రీ. భర్త గుండెపోటుతో పోయాడు. ఇద్దరు పిల్లలు. మళ్లీ పెళ్లి చేసుకోవాలంటే బోలెడు సందేహం.. నా పిల్లల్ని చూస్తాడా ఆ వచ్చేవాడు అని. ఆ నలభయ్యేళ్ల స్త్రీ రెండు చేతులతో కళ్లనుంచి జారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ ఉంటే నాకు చాలా నిస్సహాయంగా అనిపించింది. ఎందుకని వీళ్లందరికీ పవన్ కల్యాణ్‌కి అయినంత సులభంగా పెళ్లిళ్లు కావడం లేదు? సౌందర్యమూ, సంస్కారమూ ఉన్న రేణూ దేశాయ్ రెండోపెళ్లి చేసుకోవాలని ఉందన్నపుడు పవన్ అజ్ఞానపు అభిమానులు ఏమన్నారు అన్న విషయాన్ని పక్కన పెడితే, నిజానికి, ఇద్దరు పిల్లల భారాన్ని కావడిని మోస్తున్నట్లు తన భుజాలపై మోస్తున్న ఆమెకు వరుడు దొరకడం అంత సులభమేనా? కాదని చెబుతుంది యునైటెడ్ నేషన్స్ వారి వరల్డ్ విమెన్ 2015 రిపోర్ట్. ఈ నివేదిక ప్రకారం ‘‘తల్లిదండ్రులలో ఒకరే ఉన్న కుటుంబాలలో నాలుగింట మూడొంతులు.. పిల్లలతో కూడిన ఒంటరి మహిళలతోనే ఉంటున్నాయి. 40 నుంచి 49 ఏళ్ల వయస్సు కలిగివుండి విడాకులు తీసుకున్న లేక విడిపోయిన మహిళల నిష్పత్తి అదే వయస్సు ఉన్న పురుషుల గ్రూప్ నిష్పత్తి కంటే 25 శాతం అధికంగా ఉంటోంది’’. ఒకప్పుడు అంటే వితంతు పునర్వివాహ ఉద్యమం జరుగుతున్నపుడు సంఘసంస్కర్తలు అదే పనిగా ఆ విషయంపై దృష్టి కేంద్రీకరించారు కనుక ఆనాటి ఉద్యమావేశంలో కొంతమంది స్త్రీలకు పునర్వివాహాలు అయిఉండొచ్చు కానీ ఇప్పుడు గ్రామాలవారీగా పరిశీ లిస్తూ వెళితే నిండు యవ్వనంలో ఉండీ పునర్వివాహం కానీ స్త్రీలు మీకు ఎంతోమంది కనిపిస్తారు కానీ పురుషులు ఆ స్థాయిలో కనిపించరు. సెలెబ్రిటీ అయినా రేణూ దేశాయ్ పునర్వివాహం గురించి చర్చ పెట్టడం బాగానే ఉంది కానీ ఆమె స్టేట్మెంట్లో నన్ను చాలా ఆశ్చర్యపరిచిన అంశం ‘‘శరీరం బాగాలేనప్పుడు చూసుకునేందుకు ఎవరైనా ఉంటే బాగుంటుంది కదా అందుకని పునర్వివాహం గురించి ఆలోచిస్తున్నాను’’ అని చెప్పడం. కొన్నేళ్ల క్రితం, అప్పటికే ఉద్యోగం నుంచి రిటైరయి ఉన్న నా స్నేహితురాలి తండ్రి ఏళ్లకు ఏళ్లు కాపురం చేసిన తన భార్య చనిపోయిన కొద్ది నెలల్లోనే ‘‘కాసిన్ని ఉడుకు నీళ్లు కాచి ఇచ్చే వాళ్లుంటే బాగుంటుంది’’ అని భావించి పిల్లల్తో ఘర్షణపడి ద్వితీయ వివాహం చేసుకున్నాడు. అలా చేసుకునేందుకు ఆయన చెప్పిన ‘‘ఉడుకు నీళ్ల’’ కారణమే, బాగా పుస్తకాలు చదువుతాను అని చెప్పుకునే రేణూ దేశాయ్ కూడా చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. చలం ‘స్త్రీకి శరీరం ఉంది దానికి వ్యాయామం కావాలి’ అన్నాడు. ఆ వ్యాయామం భౌతిక సుఖావసరాలు కూడా కదా. అందుకని బాగా చదివే రేణూ దేశాయ్‌కి ‘‘గాన్ విత్ ది విండ్’’ రాసిన మార్గరెట్ మిషెల్ మాటలు గుర్తు చేయాలని నాకనిపిస్తోంది. మార్గరెట్ మిషెల్ 1930లలోనే ‘‘మగవాడితో నిమిత్తం లేకుండా ఆడది ఈ ప్రపంచంలో ఏ పనైనా చేయగలదు; పిల్లల్ని కనడం తప్ప, మరే పనైనా చేయగలదు’’ అని తన నవలా పాత్ర ద్వారా ప్రకటించింది. పోతే, రేణూ దేశాయ్ విషయంలో నాకు, పవన్ అభిమానులను ఒక ప్రశ్న అడగాలని ఉంది. ఈ ప్రశ్న తనను బిడ్డ తల్లిని చేసి వదిలేసిన దుష్యంతుడిని శకుంతల అడుగుతుంది.. ‘బుద్ధితో బాగా పరిశీలిస్తే – పతి వ్రత, గుణవంతురాలు, సంతానవతి, అనుకూలవతి అయిన భార్యను తిరస్కారభావంతో చూసే కడు దుర్బుద్ధికి ఇహపరసుఖాలు రెండూ ఉంటాయా? సామాన్య కిరణ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ‘ 91635 69966 -
మగాళ్లు ఎన్ని పెళ్లిళ్లైనా చేసుకోవచ్చు.. కానీ: రేణు
సాక్షి, హైదరాబాద్ : నటి, దర్శకురాలు రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ జరిగిన ప్రచారంపై ఆమె సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తన పిల్లల్ని చూసుకోవడానికి ఓ వ్యక్తి తోడుంటే బాగుంటుందని ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. రెండో పెళ్లికి సిద్ధమయ్యే ఆమె ఆ వ్యాఖ్యలు చేశారని భావించిన పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తూ కామెంట్లు చేశారు. మరో పెళ్లి చేసుకుంటే మీ గౌరవం తగ్గుతుందని కొందరు, మిమ్మల్ని అసహ్యించుకుంటామని మరికొందరు కామెంట్లు చేయడంపై రేణు వాటిని స్క్రీన్ షాట్లు తీసి తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ పోస్ట్ వైరల్‌గా మారింది. 'ఈ పోస్ట్ కేవలం నన్ను మాత్రమే ఉద్దేశించింది కాదు. మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం. ఇలాంటి ఆలోచన తీరున్న మగవాళ్ల మధ్య ఉన్నామని ఆందోళన చెందాల్సి వస్తుంది. సమాజంలో ఓ వైపు మహిళా సమానత, ఆడపిల్లలు శక్తి స్వరూపం, అత్యాచారాల నుంచి మహిళలను కాపాడాలి. వారి భద్రతకు చర్యలు తీసుకోవాలి అంటుంటాం. మరో వైపు ఏడేళ్లు ఒంటరిగా ఉన్న నేను ఇప్పుడు ఒకరి తోడు అవసరమని మాట్లాడితే అసహ్యించుకుంటున్నట్లు సందేశాలు పంపుతున్నారు. మన దేశంలో ఓ మగాడు ఏమైనా చేయొచ్చు. ఎన్నిసార్లయినా పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఓ అమ్మాయి మరో బంధం గురించి ఆలోచించడం కూడా తప్పా? జీవితాంతం తప్పు చేశానన్న భావనతో ఏ తోడు లేకుండా బతకాలా? ఇవాళ నేను దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. మన దేశంలో అమ్మాయిల భవిష్యత్తు మెరుగ్గా ఉండాలంటే, తల్లులు వాళ్ల కొడుకులను పద్ధతిగా పెంచాలి. అప్పుడైనా మగవాళ్ల ఆలోచనా విధానంలో మార్పు వస్తుందేమో' అంటూ రేణు దేశాయ్ తన పోస్ట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. -
రేణు దేశాయ్‌తో స్టార్ మా రియాలిటీ షో
సాక్షి, హైదరాబాద్: రేణు దేశాయ్ పరిచయం అక్కర్లేని పేరు. హీరోయిన్గా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా సుపరిచయం. భర్త పవన్ కల్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత పిల్లలతో పూణేలో ఉంటున్నారు. సినిమాల పై ఉన్న ఫ్యాషన్‌తో రేణు దేశాయ్ ఓ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. కొడుకు అకీరా నందన్ ఆచిత్రంలో ప్రత్యేకపాత్రలో కనిపించారు. ఇప్పుడు తాజాగా రేణు దేశాయ్ కూడా తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమచారం. ఇప్పటికే తారక్ బిగ్‌బాస్ షో, రానా నెం.1 యారీ ప్రోగ్రాంలతో చిన్న స్క్రీన్‌పై మెప్పిస్తున్నారు. తాజాగా రేణు కూడా ఓ రియాలిటీ షోకి హోస్ట్ గా సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించే పనిలో ప్రముఖ తెలుగు చానెల్ స్టార్‌మా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ హోస్ట్ గా బిగ్ బాస్ షో సాగుతోంది. ఈ సీజన్ అనంతరం ‘స్టార్ మా’ రేణుదేశాయ్‌తో రియాలిటీ డాన్స్ షో ప్లాన్ చేస్తోంది. రేణు హోస్ట్ గా వ్యవహరించనున్న ఈ డాన్స్ షో పై అంతా ఆసక్తిగా ఉన్నారు. -
పవన్.. రేణు.. ఇంట్రస్టింగ్ న్యూస్
హైదరాబాద్: చిన్నప్పటి నుంచీ తనకు కవితలు రాసే అలవాటు ఉందని, అయితే గత కొంతకాలం నుంచి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నానని నటి రేణు దేశాయ్ చెప్పారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. తాను రాసిన షార్ట్ స్టోరీస్, కవితలకు మాజీ భర్త పవన్ కల్యాణ్ ఫస్ట్ రీడర్ అని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రతి రైటర్‌కు తొలి పాఠకుడు అంటూ ఎవరూ ఉండరు. అయితే పవన్ మాత్రం నా పనిని ఇష్టపడటంతో పాటు ఎంతగానే ప్రొత్సహించేవారని తెలిపారు. తాను షార్ట్ స్టోరీస్ గానీ, కవితలు లాంటివి ఏది రాసినా పవన్ వాటిని చదివి తన అభిప్రాయాన్ని చెప్పేవారని రేణు గుర్తుచేసుకున్నారు. ఫ్రెండ్స్, సన్నిహితులు కూడా వారి విలువైన సలహాలు, సూచనలతో తాను మరింత ముందుకు వెళ్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.'స్కూలు రోజుల నుంచి కలానికి పని పెట్టడం అలవాటు. కానీ నేను రాసిన కవితలు, లఘు కథలను 2014 నుంచి బహిర్గం చేస్తున్నాను. మొదట్లో నాకు సోషల్ మీడియా ఖాతాలు లేకపోవడంతో వాటిని పోస్ట్ చేయలేకపోయా. మూవీ బిజినెస్ స్టార్ట్ చేశాక మా పీఆర్ టీమ్ సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేశారు. 2015లో తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడైతే నాలుగైదు డైరీలు నింపేశాను. కొంతకాలానికి ఆ డైరీల్లో రాసుకున్న కవితలను ట్విట్టర్లో పోస్ట్ చేయడం ప్రారంభించాను. కొన్నింటికి చాలా మంచి కాంప్లిమెంట్స్ రావడంతో నాలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసిందని' రేణు దేశాయ్ వివరించారు. మోడల్‌గా కెరీర్ ఆరంభించిన రేణు దేశాయ్ తర్వాత టాలీవుడ్లో పవన్ సరసన నటించి రంగుల ప్రపంచానికి పరిచయమైన విషయం తెలిసిందే. అయితే తన మూవీలలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఆమె పని చేశారు. కొన్నేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె.. ప్రస్తుతం మరాఠీ మూవీలతో బిజీగా ఉన్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో రేణుదేశాయ్ దర్శకురాలిగా, నిర్మాతగానూ రాణించేందుకు కృషి చేస్తున్నారు. కవయిత్రిగా కంటే తనను తాను సినీ రచయిత్రిగా పరిచయం చేసుకునేందుకు ఇష్టపడతానని రేణు పేర్కొన్నారు. -
కల్యాణ్‌గారి భార్య ఆనా... నేను కాదు!
అందరికీ నమస్కారం... నాలుగేళ్లుగా ఫేస్బుక్, ట్విటర్ లాంటి సోషల్ మీడియాలో నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి వరుసగా అభ్యర్థనలు, విన్నపాలు ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉన్నాయి. నేను నా ఇంటర్వ్యూల్లో, సోషల్ మీడియాలో ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా ఇవి ఆగడం లేదు. అందుకే మరోసారి చాలా స్పష్టంగా నా అభిప్రాయాన్ని చెప్పడానికి క్రింది పోస్ట్ పెడుతున్నాను. ‘‘మిత్రులకు, నా శ్రేయోభిలాషులందరికీ నమస్కారం... మీరు నిరంతరం నా పట్ల చూపిస్తున్న ప్రేమాభిమానాలకు, నాకు అందిస్తున్న సహాయ సహకారాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా వ్యక్తిగత జీవితం గురించి మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. కల్యాణ్‌గారు నాలుగు సంవత్సరాల క్రితం ‘ఆనా’ను పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక చక్కటి కూతురు కూడా ఉంది. ఆయన వివాహ బంధాన్ని, ఆయన కుమార్తెకు జన్మనిచ్చిన తల్లిని గౌరవిస్తూ నేను మీకు చేసుకునే విన్నపం ఒక్కటే. నేను, కల్యాణ్‌గారు తిరిగి ఏకం కావాలని మీరు పదేపదే కోరుకోవద్దు. దయచేసి మీరు ఒక విషయం అర్థం చేసుకుని ఆమోదించాలి. అదేంటంటే కల్యాణ్‌గారి భార్య ‘ఆనా’... నేను కాదు.ఒకటి మాత్రం నిజం. ఆయన నా పిల్లలకు తండ్రి. నేనూ ఆయన మంచి స్నేహితులం మాత్రమే. కానీ మేమెప్పటికీ తిరిగి భార్యాభర్తలం కాలేము. ఈ సత్యాన్ని నేను మనసా, వాచా, కర్మణా అంగీకరిస్తున్నాను. మీరు కూడా ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నన్ను తిరిగి కల్యాణ్‌గారి దగ్గరకు వెళ్లమని మాటిమాటికీ మీరు కోరడం సబబు కాదని గుర్తించాల్సిందిగా మనవి చేస్తున్నాను. మరో వైవాహిక బంధంలో ఉన్న ఆయన దగ్గరకు తిరిగి వెళ్ళడం అసమంజసం, అసాధ్యం, అర్థరహితం అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. భవిష్యత్‌లో ఈ విషయమై ఎలాంటి ఇబ్బందులు కలిగించే ఒత్తిడితో కూడిన కోరికలేవీ మీ వద్ద నుంచి ఎదురు కావని ఆశిస్తున్నాను. ఎంతో నిజాయితీగా, మనస్ఫూర్తిగా మీకు నేను చేసిన ఈ విన్నపాన్ని సహృదయంతో అర్థం చేసుకుంటారని, ఎప్పటిలా మీ నిర్మలమైన స్నేహ వాత్సల్యాలను అందిస్తారని కోరుకుంటూ... ‘ఫేస్బుక్’లో రేణూ దేశాయ్ ఇది పోస్ట్ చేసిన తర్వాత ‘మీరెంతైనా మా అన్న వైఫ్ కాబట్టి, మీ ఇద్దరూ కలవాలని కోరుకుంటాం. మిమ్మల్ని ఎప్పటికీ మా ‘వదిన’లానే భావిస్తాం’ అంటూ కొందరు కామెంట్స్ పోస్ట్ చేయడం విశేషం. అలాగే, ‘మీ పోస్ట్‌లో మీ బాధ తెలుస్తోంది’ అని మరికొందరు, ‘మీ నిర్ణయాన్ని గౌరవిస్తాం’ అని ఇంకొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. -
నా కొడుకు జూనియర్ పవర్ స్టార్ కావొద్దు!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ తన కుమారుడు అకీరా నందన్ బర్త్ డే సందర్భంగా ట్విట్టర్లో ఆసక్తికర విషయాలను ప్రస్తావించారు. గతేడాది అకీరా పుట్టినరోజు సందర్భంగా మా ఇంట్లో మూడు పండుగలంటూ ట్వీట్ చేసిన రేణు.. ఈ ఏడాది అందుకు భిన్నంగా స్పందించారు. ప్రపంచంలో తనకంటూ అకీరా పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఆపై తన కొడుకు ఎప్పటికీ జూనియర్ పవర్ స్టార్ గా ఉండకూడదని.. అకీరా నందన్ గా సొంతంగా పేరు తెచ్చుకుంటే బాగుంటుందని ఆకాంక్షించారు. తన కొడుకుపై ఆ నమ్మకం ఉందని, హ్యాపీ బర్త్ డే మై లిటిల్ స్వీట్ హార్ట్ అకీరా అని రాసుకొచ్చారు. 'అకీరాకు ఇప్పుడు 13 ఏళ్లు. అయితే ఈ వయసులోనే అకీరా ఆరడుగుల టీనేజర్ కావడంతో నమ్మలేకపోతున్నాను. అకీరా ఎప్పటికీ తల్లిదండ్రుల పేరుతో కాదు.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. ముఖ్యంగా జూనియర్ పవర్ స్టార్ అనే ముద్ర కంటే అకీరా నందన్ పేరుతోనే పాపులర్ అవ్వాలి' అని తల్లిగా నటి రేణు దేశాయ్ కోరుకుంటున్నారు. 13!!!!! Still can't believe my little one is a 6foot tall teenager!!! I am truly at loss of… https://t.co/wkHwK6Xhkn — renu (@renuudesai) 8 April 2017 ❤️ pic.twitter.com/ICzFmmNdfl — renu (@renuudesai) 8 April 2017 -
పీకే కూతురు బర్త్‌డే
పవన్ కల్యాణ్ నటించిన ‘కాటమరాయుడు’ శుక్రవారం రిలీజైన విషయం తెలిసిందే. గురువారమే ఆయన సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఇది సినిమా సెలబ్రేషన్ కాదు. పీకే కూతురు ఆద్య బర్త్‌డే ఆ రోజు. ఈ సందర్భంగా పుణేలో ఉంటున్న తన రెండో భార్య రేణూ దేశాయ్ ఇంటికి వెళ్లారు పవన్. కుమార్తె ఆద్య బర్త్‌డేని పీకే, రేణూ సెలబ్రేట్ చేశారు. కుమార్తెకు కేక్ తినిపించడంతో పాటు, తను చదువుతున్న స్కూల్‌కి కూడా పీకే వెళ్లారు. ఆ ఫొటోలను రేణూ దేశాయ్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ‘‘బిడ్డలకు తల్లిదండ్రులు ఇచ్చే నిజమైన బహుమతి.. వాళ్ల బర్త్‌డే రోజు వాళ్ల కోసం టైమ్ కేటాయించడమే’’ అని కూడా రేణు పేర్కొన్నారు. -
కూతురి పుట్టిన రోజుకి పవన్
సినిమా రాజకీయాలతో ఎప్పుడు బిజీగా ఉండే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పిల్లలకు కేటాయించే సమయం విషయంలో మాత్రం ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటాడు. అందుకే కాటమరాయుడు సినిమా రిలీజ్ బిజీలో ఉండి కూడా కూతురు ఆద్య బర్త్‌డే సందర్భంగా ఆమెతో సమయం గడిపి వచ్చాడు. గురువారం ఆద్య పుట్టిన రోజు సందర్భంగా రేణుదేశాయ్‌తో కలిసి కూతురి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నాడు. ఆద్య స్కూల్ ఓ జరిగిన బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న పవన్ చిన్నారులతో కలిసి ఫోటోలు దిగాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ లో వెల్లడించిన రేణు, ' పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వగలిగే నిజమైన బహుమతి. వారి పుట్టిన రోజున కాస్త సమయమే' అంటూ ట్వీట్ చేసింది. రేణుతో విడాకులు తీసుకున్న తరువాత కూడా పవన్ పిల్లల కోసం రెగ్యులర్ గా వారిని కలుస్తూ, వారి బాగోగులు చూసుకుంటున్నాడు. True gift parents can give their kids is, their time, on their birthday ❤ pic.twitter.com/n6G6c5V7oR — renu (@renuudesai) 24 March 2017 -
పవన్ కళ్లల్లోని తీవ్రత ఇష్టం- రేణు దేశాయ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. స్వయంగా తను క్లిక్‌మనిపించిన పవన్ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసి ఆసక్తికర వ్యాఖ్యలు జోడించారు. తాను తీసిన పవన్ ఫొటోను పోస్ట్ చేసి.. 'అతని కళ్లల్లోని తీవ్రత అంటే నాకిష్టం. ఈ ఫొటో నా ఫేవరెట్. ఫొటోలో కనిపిస్తున్న స్కిన్ టోన్ కూడా ఒరిజినల్, నేను ఎడిట్ చేయలేదు. ఈ ఫొటో 2010లో నేనే క్లిక్ చేశాను. 5డి కెమెరా కొనుక్కున్నాను. పవన్ ఓ రోజు మౌనంగా కూర్చుని అస్తమిస్తున్న సూర్యుడి వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తుండగా ఫొటో తీశాను' .. అంటూ అప్పటి విషయాలను వివరించారు. కల్యాణ్ గారి పుట్టినరోజున ఈ ఫొటోని కామన్ డీపీగా వాడుకోవచ్చంటూ తెలిపారు. అలాగే ఆమె తీసిన ఫొటోలను గత ఏడాది కూడా ట్విట్టర్ ద్వారా అభిమానులకు షేర్ చేసిన రేణు, ఈ ఏడాది కూడా ఈ స్పెషల్ ఫొటోను పోస్ట్ చేశారు. Do you want me to share one of my fav pic of Kalyangaru, clicked by me, to use as a common dp for his bday? — renu (@renuudesai) 29 August 2016 I had posted two pics in yellow tshirt last year of his clicked by me, hence got the idea of sharing one more for a common bday dp :) — renu (@renuudesai) 29 August 2016 This was clicked by me in 2010. I had just bought my #5d #Canon & caught him sitting quietly, thinking, staring into the setting sun rays :) — renu (@renuudesai) 29 August 2016 I love d intensity of his eyes/look in this,hence it's my fav! Also d skin tone is original &not edited by me -
అకీరా గురించి రేణు దేశాయ్ టెన్షన్..
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్.. తల్లి రేణు దేశాయ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఇష్క్ వాలా లవ్'లో ఓ చిన్న పాత్రలో నటించిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం మరాఠీలో రూపొందించిన ఈ సినిమాను ప్రస్తుతం తెలుగులో డబ్ చేశారు. త్వరలో ఈ చిత్రాన్ని టెలివిజన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 'ఇష్క్ వాలా లవ్'తో అకీరా మినీ స్క్రీన్ డెబ్యూ ఇవ్వబోతున్నాడు. అకీరాను పవన్ ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారోనని రేణు ఆందోళన పడుతోంది. 'అకీరా తొలి పరిచయం గురించి ఓ చిన్నమాట.. ఈ సినిమాలో నటించినప్పుడు మా అకీరాకి 9ఏళ్లు. ఈ చిన్న డెబ్యూ రోల్‌కి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దని నా విన్నపం' అంటూ అభిమానులను ఉద్దేశించి ట్విట్టర్లో ఇటీవలే ఓ చిన్న నోట్ పోస్ట్ చేసింది రేణు. కాగా మరాఠీలో తనకు తానే డబ్బింగ్ చెప్పుకున్న అకీరా.. ఇప్పుడు తెలుగులో కూడా తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకున్నాడట. అదే సంబరంగా చెప్పుకుంటుంది రేణు. తనయుడిని డైరెక్ట్ చేయడం అనేది తల్లిగా తనకు సెంటిమెంటల్ మొమెంట్ అంటోంది. Akira himself had dubbed both the Marathi and Telugu lines ☺️ https://t.co/PXqiqt3oq6 — renu (@renuudesai) 23 August 2016 -
అమెరికా అధ్యక్ష ఎన్నికలపై రేణుదేశాయ్
ప్రస్తుత పరిస్థితుల్లో సినీ ప్రముఖులు తమ రంగంతో పాటు సమకాలీన పరిస్థితులపై కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న చాలా మంది ప్రముఖులు తమ అభిమానులకు చేరువయ్యేందుకు సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. అదే సమయంలో రాజకీయ, సామాజిక అంశాలపై తమ అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. అదే బాటలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయి అమెరికా అధ్యక్ష ఎన్నికలపై స్పందించారు. హిల్లరీ క్లింటన్ ప్రస్తుతం జరుగుతున్న ప్రైమరీల్లో గెలిచి అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు అర్హత సాధించిన నేపథ్యంలో రేణు తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. 'ఈ రోజు వరకు ఒక్క మహిళ అధ్యక్షురాలు కూడా లేని దేశం అమెరికాయే. దాదాపు అన్ని అభివృద్ధి చెందిన దేశాలను ఏదో ఒక సమయంలో మహిళలు పాలించారు, పాలిస్తున్నారు. అందుకే హిల్లరీ ఎంపిక నాకు ఆశ్యర్యం కలిగించలేదు'. అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. USA,being the "first country" of d world,has surprisingly,no female president till date!Just talk abt equality in job opportunities!Archaic? — renu (@renuudesai) 9 June 2016 Almost, all the developed countries of the world have had female Presidents or Prime ministers, hence the fact USA doesn't, surprises me! — renu (@renuudesai) 9 June 2016 -
పవన్ రెండో సారి రిపీట్ చేస్తున్నాడు
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తి కావస్తొంది. ఈ 20 ఏళ్ల కెరీర్లో 20 సినిమాల్లో సోలో హీరోగా నటించాడు. అయితే ఇంత లాంగ్ కెరీర్లో పవన్ తన హీరోయిన్లను రిపీట్ చేసింది మాత్రం ఒకే ఒక్కసారి. తన మాజీ భార్య రేణుదేశాయ్‌తో కలిసి రెండు సినిమాల్లో నటించాడు పవన్. బద్రి సినిమాలో తొలిసారిగా కలిసి నటించిన ఈ జంట తరువాత జానీ సినిమాలో మరోసారి జంటగా కనిపించారు. అయితే ఇప్పుడు రెండో తన హీరోయిన్ రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నాడు పవర్ స్టార్. తనతో గబ్బర్‌సింగ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్లో కలిసి నటించిన శృతిహాసన్‌తో కలిసి మరోసారి తెరను పంచుకోనున్నాడు. ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కునున్న సినిమా కోసం హీరోయిన్గా శృతిహాసన్‌ను ఫైనల్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈసినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
ప్రమాదంలో గాయపడ్డ పవన్ కొడుకు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొడుకు అకీరా నందన్ ప్రమాదంలో గాయపడ్డాడు. అకీరా సైకిల్‌పై నుంచి పడటంతో గాయాలయ్యాయి. రేణు దేశాయ్ వెంటనే అకీరాను ఓ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అది పేరున్న ఆస్పత్రి అయినా అకీరాకు చికిత్స చేయడంలో డాక్టర్లు నిర్లక్ష్యం చూపారు. అతనికి ఆలస్యంగా చికిత్స చేశారు. సోమవారం రేణు ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్లో తెలియజేసింది. వైద్యుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 'అకీరా సైకిల్ ప్రమాదంలో గాయపడ్డాడు. వెంటనే అతడ్ని పేరున్న ఆస్పత్రికి తీసుకెళ్లాను. గాయపడిన చిన్న పిల్లాడికి వైద్యం చేయకుండా వైద్యులు ఆలస్యం చేశారు. బాధతో ఎదురు చూడాల్సివచ్చింది. చికిత్స కోసం పెద్ద ఆస్పత్రులకు వెళ్లడం కంటే చనిపోవడం నయం. డాక్టర్ల నుంచి నర్సుల వరకు మొత్తం వ్యవస్థ నిర్లక్ష్యం మానవత్వాన్ని చంపేస్తోంది' అని రేణు ట్వీట్ చేసింది. కాగా అకీరాకు ప్రమాదం ఎప్పుడు జరిగింది, తీసుకెళ్లిన ఆస్పత్రి పేరు, ఊరు వంటి విషయాలను రేణు వెల్లడించలేదు. ప్రస్తుతం అకీరా కోలుకుంటున్నాడు. అకీరా చేతికి ఫ్రాక్చర్ అయినట్టు రేణు కాసేపటి తర్వాత మరో ట్వీట్ చేసింది. అకీరా ముఖం, భుజం, మోకాలు, మేచేతిపై గాయాలయినట్టు వెల్లడించింది. అకీరా ప్రస్తుతం క్షేమంగా ఉన్నాడని, అతను కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసింది. సామాన్యులకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఆస్పత్రికి వెళితే బిల్లు తడిసి మోపెడవుతుంది. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు భారీగా ఫీజులు వసూలు చేస్తాయి కానీ సర్వీసు ఆ స్థాయిలో ఉండదన్న విమర్శలు ఉన్నాయి. ఒక్కోసారి సెలెబ్రెటీలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. రేణు దేశాయ్ కూడా బాధితురాలే. పవన్‌తో విడిపోయాక రేణు తన ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్యలతో కలసి పుణెలో ఉంటోంది. Akira had bad cycle accident,got him to one of d best hospitals&inspite of seeing an injuredchild d delay in treatmnt&waiting&insensitivity — renu (@renuudesai) May 9, 2016 He has a hand fracture, lots of face, knee, shoulder and elbow wounds. But he is okay now. Thank you sincerely for all the wishes for him :) — renu (@renuudesai) May 9, 2016 -
రేణు దేశాయ్ నట్టింట్లో మూడు విశేషాలు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ (శుక్రవారం) ఉగాది సందర్భంగా మూడు పండుగలను సెలబ్రేట్ చేసుకోనున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ''ఏప్రిల్ 8వ తేదీన మా అందరికీ నిజమైన పండుగ రోజు'' అంటూ రేణుదేశాయ్ ట్విట్టర్లో సంతోషాన్ని వ్యక్తం చేశారు. మూడు విశేషాల్లో మొదటిది ఆమె ముద్దుల కొడుకు అకీరా నందన్ పుట్టిన రోజు. మరో ముఖ్యమైనది పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ విడుదల. దీంతోపాటు తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాది.. ఇంకేముంది ఈ మూడు పండుగల సమ్మేళనంతో ఆమె ఇంట్లో సందడే సందడన్న మాట. ఏప్రిల్ 8న ఈ మూడు పండుగలు కలిసి రావడం యాదృచ్చికమే అయినా పుణె లోని రేణు ఇంట్లో పండగ సందడి నెలకొనడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. 8th April #HappyBirthdayAkira & #SardaarGabbarSingh — renu (@renuudesai) 7 April 2016 And #Ugadi pandugaa A real festival day for all of us tomorrow — renu (@renuudesai) 7 April 2016 -
ఉపవాసం ఎందుకో ఎందరికి తెలుసు: రేణు దేశాయ్
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నటి, దర్శకురాలు రేణు దేశాయ్ ట్విట్టర్ జనులకు కొన్ని ప్రశ్నలు సంధించారు. ఉదయాన్నే శుభోదయం చెప్పి.. మీలో ఎంతమంది ఉపవాసం ఉంటున్నారని ముందు ప్రశ్నించారు. ఒకవేళ ఉంటే.. మంగళవారం ఉదయం వరకు కేవలం నీళ్లు మాత్రమే తీసుకోవాలని, ఘనపదార్థాలు ఏమీ తీసుకోకూడదని చెప్పారు. ఆ తర్వాత... అసలు శివరాత్రి రోజు ఎందుకు ఉపవాసం ఉండాలో మీలో ఎంతమందికి తెలుసని మరో ప్రశ్న వేశారు. దాని వెనుక ఉన్న ధార్మిక, ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు ఏంటో చెప్పాలని అడిగారు. And how many of know why we should be fasting today? The spiritual, religious and scientific reason? :) — renu (@renuudesai) March 7, 2016 -
మగాడి చూపులు అంతే!
మహిళలు అసభ్యంగా దుస్తులు వేసుకుంటేనే వాళ్లను మగాళ్లు ఏడిపిస్తుంటారని, తేరిపార చూస్తారని ఇన్నాళ్లూ అందరూ చెబుతూ వచ్చారు. కానీ, అదంతా తప్పని ప్రముఖ నటి, దర్శకురాలు రేణు దేశాయ్ తేల్చిపారేసింది. ఆడవాళ్లు వేసుకునే దుస్తులతో ఏమాత్రం సంబంధం లేదని, మగాడి చూపులు ఎప్పుడూ అలాగే ఉంటాయని స్పష్టం చేసింది. ఇందుకోసం ఆమె ఒక ఫొటోను కూడా ట్వీట్ చేసింది. బురఖాలు వేసుకుని వెళ్తున్న ఇద్దరు అమ్మాయిలను.. ఆ పక్కనే బైకు మీద ఉన్న ఇద్దరు అబ్బాయిలు కళ్లు పెద్దవి చేసుకుని చూడటం ఆ ఫొటోలో స్పష్టంగా ఉంది. దాన్ని బట్టి చూస్తే.. అమ్మాయిల వస్త్రధారణకు, అబ్బాయిల ప్రవర్తనకు ఏమాత్రం సంబధం లేదని, వాళ్లు తమ బుద్ధిని ప్రదర్శిస్తూనే ఉంటారని అన్నట్లుగా రేణు దేశాయ్ చెప్పింది. It's never about her clothes!It's always the eyes of the man! Always! pic.twitter.com/GPPhVmThzp — renu (@renuudesai) December 26, 2015 -
'ఐ లవ్ యూ మమ్మీ..'
ప్రముఖ సినీనటి, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు అభిమానులు ట్విట్టర్ ద్వారా రేణుకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అన్నింటికన్నా మిన్నగా పవన్ వారసులు అకిరా, ఆద్యలు అమ్మ పుట్టినరోజును తమ స్టైల్లో సెలబ్రేట్ చేశారు. 'హ్యాపీ బర్త్ డే మామ్' అంటూ అమ్మ చేత ఓ కలర్‌ఫుల్ కేక్ కట్ చేయించారు. అకిరా అయితే అమ్మ మీదున్న ప్రేమనంతా తన చిట్టి చిట్టి రాతలతో పేపర్ మీద పెట్టేశాడు. ఆ లెటర్ చదివిన రేణు ఉబ్బితబ్బిబ్బయ్యారు. తన సంతోషాన్నంతా ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. అలాగే సోషల్ మీడియా ద్వారా తనకు విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా రేణు దేశాయ్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా పవన్ కల్యాణ్, రేణులు విడిపోయిన తర్వాత.. ప్రస్తుతం చిన్నారులు అకిరా నందన్, ఆద్యలు పూణెలో తల్లి వద్దే ఉంటున్నారు. And can it get any better than this? 🎉🎉🎉🎉 pic.twitter.com/ZkLRCZUCag — renu (@renuudesai) December 3, 2015 And some words render me speechless...Akira has gifted me the most beautiful and perfect words for my bday ❤️ pic.twitter.com/1KXSqId89D — renu (@renuudesai) December 4, 2015 -
తృటిలో తప్పించుకున్న రేణుదేశాయ్
ముంబై: పారిస్ ఉగ్రదాడి నుంచి ప్రముఖ నటి రేణుదేశాయ్ తృటిలో తప్పించుకున్నారు. ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి సమీపంలోనే గత కొన్ని రోజుల వరకు రేణుదేశాయ్ పర్యటించారు. పారిస్ ట్రిప్ ముగించుకొని శనివారం ఉదయం ముంబైలో దిగారు. 'ఇప్పుడే ప్యారిస్ నుంచి ముంబైలో ల్యాండ్ అయ్యాను. దిగగానే పారిస్‌పై ఉగ్రదాడి విషయం తెలిసింది. నా క్షేమం కోసం మెసేజ్‌లు చేసిన వారికి కృతజ్జతలు' అంటూ రేణుదేశాయి ట్విట్ చేశారు. I just landed in Mumbai. Heard about the Paris attack right now! I am safe. A heartfelt thank you for the msgs of concern for my safety! — renu (@renuudesai) November 14, 2015 -
'అవి గూగుల్ లో దొరకవు..'
ఈ రోజుల్లో ఏం కావాలన్నా, ఏ విషయం మీద అనుమానం వచ్చినా చేసే మొదటిపని.. గూగుల్ తల్లిని అడగడం. అమ్మను, స్కూల్లో టీచర్లను అడగడం ఎప్పుడో మానేసిన పిల్లలు.. ప్రతి చిన్న విషయానికీ గూగులమ్మ మీదే ఆధారపడుతున్నారు. అయితే గూగుల్‌లో కొన్నే దొరుకుతాయి.. మిగిలినవి మాత్రం స్కూల్లోనే నేర్పించాలి అంటున్నారు రేణు దేశాయ్. ఇంతకీ అవేంటి.. ఇవేంటి? అనేగా మీ సందేహం. అవి పాఠాలు.. ఇవేమో సుగుణాలు. పిల్లలకు జువాలజీ, జామెట్రీ లాంటి సబ్జెక్టుల బదులు జాలి, కరుణ, సహనం వంటి సుగుణాలను స్కూల్లో బోధించాలని ఆమె చెప్పారు. ఎందుకంటే పుస్తకాల్లోని పాఠాలు నేర్చుకోవాలంటే మనం గూగుల్ చేయొచ్చు అంటూ ట్వీట్ చేశారు రేణు దేశాయ్. Kindness,compassion, tolerance should be taught to young kids as subjects in school rather than biology,geometry,etc...(these we can Google) — renu (@renuudesai) October 8, 2015