వివాహ బంధంపై నమ్మకముంది, రెండో పెళ్లి చేసుకుంటా: రేణు దేశాయ్‌ | Renu Desai Interesting Comments On Second Marriage | Sakshi
Sakshi News home page

Renu Desai: ఎంగేజ్‌మెంట్‌ ఆగిపోవడానికి కారణమిదే! పెళ్లి చేసుకోవాలనుంది.. త్వరలోనే జరుగుతుంది

Published Wed, Oct 18 2023 10:37 AM | Last Updated on Wed, Oct 18 2023 10:57 AM

Renu Desai Interesting Comments On Second Marriage - Sakshi

సినీనటి రేణుదేశాయ్‌ ఆ మధ్య రెండో పెళ్లికి సిద్ధమైంది. ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకోగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరలయ్యాయి. ఇక మూడు ముళ్లు మెడలో పడటమే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో పెళ్లి రద్దు చేసుకుని షాకిచ్చింది. తాజాగా ఆమె తను రెండో పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడానికి గల కారణాలను వెల్లడించింది.

వారి అంగీకారంతోనే ఎంగేజ్‌మెంట్‌
'నా వ్యక్తిగత విషయాల గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్నాను. నా గురించి తప్పు పట్టకూడదు కాబట్టి క్లారిటీ ఇస్తున్నాను. కుటుంబీకులు, స్నేహితుల అంగీకారంతోనే నిశ్చితార్థం జరిగింది. కానీ పిల్లలున్నారు, వాళ్లకు తోడుగా ఉండాలి.. నువ్వెలా ఉంటావు? అదీ ఇదీ అని ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ అన్నారు. అప్పటికే ఎంగేజ్‌మెంట్‌ అయింది. ఆ ఫోటో కూడా సోషల్‌ మీడియాలో నేనే షేర్‌ చేశాను. అయితే అప్పుడు నా కూతురి వయసు ఏడేళ్లు.

కూతురి కోసమే పెళ్లి రద్దు చేసుకున్నా
నేను ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే అతడికి సమయం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ నా కూతురు చాలా చిన్నపిల్ల కదా! తనను చూసుకోవడానికి తండ్రి కూడా లేడు. తల్లినైన నేను కూడా వేరొకరితో వెళ్లిపోతే తనేం కావాలి? అని ఆలోచించాను. అది తప్పా? ఒప్పా? అని ఆలోచించలేదు. నా బుద్ధితోనే ఆ పని చేశాను.​ ఇప్పుడే పెళ్లి వద్దులే అని వివాహం రద్దు చేసుకున్నాను. ఇప్పుడు తన వయసు 13 ఏళ్లు. నాకు పెళ్లి అనే కాన్సెప్ట్‌ చాలా ఇష్టం. పెళ్లిపై చాలా నమ్మకం ఉంది. పరిచయమే లేని ఇద్దరు వ్యక్తులు కలిసి జీవితాన్ని పంచుకోవడం.. ఆ బంధం చాలా బలమైనది.

రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటా
ఇప్పటికీ వివాహం చేసుకోవాలని ఉంది. కాకపోతే రెండేళ్లు ఆగాలనుకుంటున్నాను. ఆద్య కాలేజీకి వెళ్లాక నా గురించి నేను ఆలోచిస్తాను. నేను రెండో పెళ్లి చేసుకోవడం నా పిల్లలకు ఇష్టమే! వారు సంతోషంగానే ఉన్నారు. ఒక వ్యక్తి వల్ల నువ్వు సంతోషంగా ఉంటావంటే మళ్లీ పెళ్లి చేసుకో అని అకీరా చెప్పాడు. ఆద్య కూడా పెళ్లి చేసుకోమనే చెప్తుంది. రెండేళ్ల తర్వాత కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను' అని చెప్పుకొచ్చింది రేణు దేశాయ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement