మళ్లీ వస్తున్నా, ఆశీర్వదించండి: రేణూ దేశాయ్‌ | Renu Desai Back To Acting Signed For A Web Series | Sakshi
Sakshi News home page

బ్యూటిఫుల్‌ వెబ్‌ సిరీస్‌లో రేణూ దేశాయ్‌

Published Sun, Sep 20 2020 5:41 PM | Last Updated on Sun, Sep 20 2020 5:51 PM

Renu Desai Back To Acting Signed For A Web Series - Sakshi

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్య రేణూదేశాయ్ సినిమాలకు దూరమై చాలా ఏళ్లవుతోంది. ఆమె రీఎంట్రీపై ఇప్ప‌టికే చాలా వార్త‌లొచ్చాయి. అయితే, తన రీఎంట్రీపై స్వయంగా ఆమే స్పందించింది. త్వరలో ఓ వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు కెమెరా ముందుకొస్తున్నట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. కృష్ణ‌మామిడాల డైరెక్ష‌న్‌ వస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌ వచ్చే నెలలో షూటింగ్‌ జరుపుకోనుందని తెలిపారు. డీఎస్‌.రావు, ఎస్‌.రజనీకాంత్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు.‌ ‘చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకొస్తున్నాను. ఓ అంద‌మైన వెబ్ సిరీస్‌లో నటించేందుకు సంత‌కం చేశాన‌ని ప్ర‌క‌టిస్తున్నందుకు ఎక్జైయిటింగ్‌గా ఉంది. వ‌చ్చే నెలలో షూటింగ్ మొద‌ల‌వుతుంది.

త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు చెప్తాను. స‌త్యాన్వేష‌ణ‌లో ఉన్న ఓ మ‌హిళ ప్ర‌యాణానికి మీ ఆశీస్సులు, ప్రేమ‌ను అందించాల‌ని కోరుకుంటున్నా’అని రేణూ ఇన్‌స్టా పోస్టులో వెల్లడించారు. కాగా, తన కుమారుడు అకీరా నందన్‌ సినీరంగ ప్రవేశంపై కూడా ఆమె ఇటీవల క్లారిటీ ఇచ్చారు. సినిమాల్లోకి రావడం అనేది పూర్తిగా తన ఇష్టమేనని స్పష్టం చేశారు. రేణూ ప్రస్తుతం దర్శకురాలిగా బిజీగా ఉన్నారు. ఇదిలాఉండగా.. మహేష్‌బాబు సినిమాలో రేణుదేశాయ్‌ నటించబోతున్నారన్న వార్తలపై ఆమె క్లారిటీ ఇటీవల ఇచ్చారు. వాటిల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement