
సినీ నటి రేణు దేశాయ్ గణపతి, చండీ హోమం నిర్వహించింది. ఈ పూజలో అకీరా నందన్ కూడా పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. శరద్ పూర్ణిమ సందర్భంగా గణపతి, చండీ హోమం చేశాను. మన పూర్వీకులు అనుసరించిన సాంప్రదాయాలు, ఆచారాలను పిల్లలకు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మనపై ఉంది.
అందుకని డెకరేషన్‌పైనే ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదు. ఆర్భాటంగా పూజలు చేసుకోవడానికి బదులుగా ఆ హోమం, పూజలపైనే ఫోకస్ చేస్తే సరిపోతుంది అని రాసుకొచ్చింది. కాగా రేణు దేశాయ్.. గతేడాది టైగర్ నాగేశ్వరరావు సినిమాతో వెండితెరపై రీఎంట్రీ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment