
రేణు దేశాయ్ నట్టింట్లో మూడు విశేషాలు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ శుక్రవారం మూడు పండుగలను సెలబ్రేట్ చేసుకోనున్నారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ (శుక్రవారం) ఉగాది సందర్భంగా మూడు పండుగలను సెలబ్రేట్ చేసుకోనున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ''ఏప్రిల్ 8వ తేదీన మా అందరికీ నిజమైన పండుగ రోజు'' అంటూ రేణుదేశాయ్ ట్విట్టర్‌లో సంతోషాన్ని వ్యక్తం చేశారు.
మూడు విశేషాల్లో మొదటిది ఆమె ముద్దుల కొడుకు అకీరా నందన్ పుట్టిన రోజు. మరో ముఖ్యమైనది పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ విడుదల. దీంతోపాటు తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాది.. ఇంకేముంది ఈ మూడు పండుగల సమ్మేళనంతో ఆమె ఇంట్లో సందడే సందడన్న మాట. ఏప్రిల్ 8న ఈ మూడు పండుగలు కలిసి రావడం యాదృచ్చికమే అయినా పుణె లోని రేణు ఇంట్లో పండగ సందడి నెలకొనడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.
8th April #HappyBirthdayAkira & #SardaarGabbarSingh
— renu (@renuudesai) 7 April 2016
And #Ugadi pandugaa
— renu (@renuudesai) 7 April 2016
A real festival day for all of us tomorrow