Renu Desai Sensational Comments On Pawan Kalyan - Sakshi
Sakshi News home page

నా విషయంలో పవన్‌ది 100% తప్పే: రేణుదేశాయ్‌

Published Fri, Aug 11 2023 5:29 AM | Last Updated on Fri, Aug 11 2023 8:45 AM

Renudesai Comments On Pawan Kalyan - Sakshi

సాక్షి, అమరావతి: తన విషయంలో పవన్‌ కళ్యాణ్‌ చేసింది 100 శాతం తప్పేనని పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య సినీ నటి రేణుదేశాయ్‌ స్పష్టం చేశారు. పవన్‌ కళ్యాణ్‌ చేసిన తప్పులకు ఆయన మాజీ భార్యలు, పిల్లలకు ఎటువంటి బాధ్యత లేదు కాబట్టి రాజకీయ, వృత్తిపరమైన విభేదాల్లోకి వారిని లాగవద్దంటూ విజ్ఞప్తి చేస్తూ గురువారం ఓ వీడియోను రిలీజ్‌ చేశారు.

ఈ మధ్య విడుదలైన పవన్‌కళ్యాణ్‌ సినిమా వివాదాలు సృష్టించిందని, ఆ సమయంలో తాను విదేశాల్లో ఉండటంతో ఏమి జరిగిందన్న విషయం తెలియలేదని చెప్పారు. ఆ సినిమా తర్వాత కొంతమంది పవన్‌ మాజీ భార్యలు, పిల్లలు మీద సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేయను­న్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందని, పవన్‌తో రాజకీయ, వృత్తిపరమైన విభేదాలు ఏమైనా ఉంటే మీరు మీరు చూసుకోండి కానీ ఇందులోకి మహిళలను, పిల్లలను లాగవద్దని పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement