పీకే కూతురు బర్త్‌డే | Pawan Kalyan celebrates daughter Aadya's birthday | Sakshi
Sakshi News home page

పీకే కూతురు బర్త్‌డే

Published Sat, Mar 25 2017 12:58 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పీకే కూతురు బర్త్‌డే - Sakshi

పీకే కూతురు బర్త్‌డే

పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘కాటమరాయుడు’ శుక్రవారం రిలీజైన విషయం తెలిసిందే. గురువారమే ఆయన సెలబ్రేట్‌ చేసుకున్నారు. అయితే ఇది సినిమా సెలబ్రేషన్‌ కాదు. పీకే కూతురు ఆద్య బర్త్‌డే ఆ రోజు. ఈ సందర్భంగా పుణేలో ఉంటున్న తన రెండో భార్య రేణూ దేశాయ్‌ ఇంటికి వెళ్లారు పవన్‌. కుమార్తె ఆద్య బర్త్‌డేని పీకే, రేణూ సెలబ్రేట్‌ చేశారు.

కుమార్తెకు కేక్‌ తినిపించడంతో పాటు, తను చదువుతున్న స్కూల్‌కి కూడా పీకే వెళ్లారు. ఆ ఫొటోలను రేణూ దేశాయ్‌ ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేశారు. ‘‘బిడ్డలకు తల్లిదండ్రులు ఇచ్చే నిజమైన బహుమతి.. వాళ్ల బర్త్‌డే రోజు వాళ్ల కోసం టైమ్‌ కేటాయించడమే’’ అని కూడా రేణు పేర్కొన్నారు.
http://img.sakshi.net/images/cms/2017-03/81490385713_Unknown.jpg

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement