Renu Desai Shares Emotional Post On Instagram: I Can't Thank Her Enough - Sakshi
Sakshi News home page

Renu Desai: ఆవిడ ఎవరో తెలియదు, కానీ తన మాటలతో ఏడ్చేశాను

Published Mon, Apr 10 2023 11:09 AM | Last Updated on Mon, Apr 10 2023 12:27 PM

Renu Desai Shares Emotional Post: I Can not Thank Her Enough - Sakshi

బద్రి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్‌. జేమ్స్‌ పండు, జానీ సినిమాల్లో కథానాయికగా మెరిసిన ఆమె ఆ సమయంలో హీరో పవన్‌ కల్యాణ్‌తో ప్రేమలో పడింది. ఈ క్రమంలో 2009లో వీరు పెళ్లి చేసుకున్నారు. కానీ ఎంతోకాలం ఆ ప్రేమ కొనసాగలేదు. పెళ్లి చేసుకున్న రెండేళ్లకే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత యాక్టింగ్‌కు దూరమైపోయింది రేణు దేశాయ్‌. సుదీర్ఘ విరామం తర్వాత టైగర్‌ నాగేశ్వరరావుతో తిరిగి సినిమాల్లో కమ్‌బ్యాక్‌ ఇచ్చేందుకు రెడీ అయింది.

ఇకపోతే తననకు పవన్‌ మాజీ భార్యగా పిలవడం ఆమెకు అస్సలు ఇష్టం ఉండదు. అలాంటిది తన కొడుకు అకీరాను మా అన్న కొడుకు అని ఓ పవన్‌ కల్యాణ్‌ అభిమాని సంబోధించడంతో అగ్గి మీద గుగ్గిలమైంది నటి. మీ అన్న కొడుకా? అకీరా నా కొడుకు. మీరు ఒక తల్లికి పుట్టలేదా? మాట్లాడే పద్ధతి నేర్చుకోండి అని గట్టిగానే కౌంటరిచ్చింది.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో మరో పోస్ట్‌ పెట్టింది రేణు దేశాయ్‌. తనకు సపోర్ట్‌ చేస్తూ మాట్లాడిన ఓ సామాజికవేత్త వీడియోను షేర్‌ చేస్తూ.. 'ఒకరు నాకు ఈ వీడియో పంపారు. ఆవిడ ఎవరో నిజంగా నాకు తెలియదు. నా గురించి ఎందుకు మాట్లాడారో తెలియదు. కానీ మొదటిసారి పబ్లిక్‌లో ఒకరు నా తరపున మాట్లాడటం విని నేను చాలా ఏడ్చాను. నేను ఏదైనా చెప్తే ఏదో ఒక పొలిటికల్‌ పార్టీకి అమ్ముడుపోయానంటూరు, ఎలక్షన్స్‌ వస్తున్నాయంటారు. కానీ ఈ వీడియో చూశాక నా బాధ అర్థం చేసుకునే వ్యక్తులు ఉన్నారని ధైర్యం వచ్చింది. ఆమెకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతుంది' అని రాసుకొచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement